Hyderabad: ఇంట్లోకి చొరబడి మహిళపై లైంగిక దాడి యత్నం..! | Shocking Incident In Warasiguda | Sakshi
Sakshi News home page

Hyderabad: ఇంట్లోకి చొరబడి మహిళపై లైంగిక దాడి యత్నం..!

Apr 4 2026 7:28 AM | Updated on Apr 4 2026 9:17 AM

Shocking Incident In Warasiguda

భార్య ప్రోత్సాహంతో లైంగికదాడికి యత్నం 

హైదరాబాద్‌: ఇంట్లోకి చొరబడిన భార్యభర్తలు  ఓ మహిళపై విచక్షణారహితంగా దాడి చేశారు. అంతే కాకుండా సదరు వ్యక్తి ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. ఈ సంఘటన వారాసిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన మేరకు .. గంగపుత్ర కాలనీకి చెందిన ఓ మహిళ(29) భర్తతో కలిసి నివాసముంటోంది. భర్త రాంనగర్‌కు చెందిన  రాజు అనే వ్యక్తితో కలిసి జులాయిగా తిరుగుతుంటాడు. ఇటీవల బాధిత మహిళ తల్లి రాజుకు ఫోన్‌ చేసి మందలించింది.

 దీంతో రాజు, అతని భార్య సింధు  కలిసి గురువారం మధ్యాహ్నం బాధితురాలి ఇంటికి వెళ్లి దాడిచేశారు. అంతేకాక రాజు లైంగికదాడికి యత్నించాడు. ఇందుకు అతని భార్య కూడా ప్రోత్సహించింది. దీంతో బాధితురాలు బయటకు పరుగులు తీయడంతో దంపతులిద్దరూ పరారయ్యారు. ఈ మేరకు గురువారం రాత్రి బాధితురాలు వారాసిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  ఇదిలా ఉండగా భార్యాభర్తలిద్దరూ  బాధితురాలిపై కూడా ఫిర్యాదు చేశారని, కులం పేరుతో దూషించిందని  అట్రాసిటీ కేసు పెట్టారని ఎస్‌ఐ రామచంద్రారెడ్డి తెలిపారు.   

Advertisement
 
Advertisement
Advertisement