shocking incident
-
అక్క కళ్లలో ఆనందం కోసం అత్తను హత్య చేసిన తమ్ముడు
-
చనిపోయాడనుకున్న వ్యక్తి బతికిరావడంతో బంధువుల షాక్..
-
చనిపోయి.. 24 నిమిషాల తర్వాత మళ్లీ బతికిన మహిళ
వైద్య శాస్త్రంలో ఇదో అద్భుతమని చెప్పాలి. గుండెపోటుతో ఓ మహిళ చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. అయితే ఆశ్చర్యంగా ఆమె 24 నిమిషాల తర్వాత లేచి కూర్చుంది. ఈ వింత ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఈ పరిణామంతో డాక్టర్లు సైతం షాక్‌కి గురయ్యారు. తాను స్పృహలో లేని ఆ 24 నిమిషాల్లో తనకు ఎలాంటి అనుభూతి ఎదురయ్యిందో తాజాగా ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది. సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడో, అనుకోని పరిస్థితుల్లో చచ్చి బతికాం అనే సామెతను వాడుతుంటారు. అంటే చావు అంచుల దాకా వెళ్లి ప్రాణాలతో బయటపడ్డప్పుడు ఇలా అంటుంటారు. కానీ అమెరికాకు చెందిన లారెన్ కెనడే అనే మహిళ మాత్రం చచ్చి బతికింది. తనకు ఎదురైన ఈ విచిత్ర అనుభవం గురించి లారెన్ నెటిజన్లతో ఈ విధంగా పంచుకుంది. ''గత ఫిబ్రవరిలో నాకు గుండెపోటు వచ్చింది. ఆంబులెన్స్‌కి కాల్ చేసి ఆలోగా నాకు సీపీఆర్ చేశాడు. కానీ ఎలాంటి చలనం లేదు. హాస్పిటల్‌కి వెళ్లగానే నన్ను పరిశీలించిన అనంతరం నేను చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. కానీ సరిగ్గా 24 నిమిషాల అనంతరం నా గుండె మళ్లీ కొట్టుకోవడం ప్రారంభించింది. అయితే వెంటనే కోమాలోకి వెళ్లిపోయాను. రెండు రోజులకు గానీ స్పృహలోకి రాలేదు. మెదడుకు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చాక సాధారణ స్థితికి వచ్చాను. దాదాపు 9 రోజుల పాటు ఐసీయూలో వైద్య బృందం నన్ను పరీక్షించింది. మరణం అంచుల వరకు వెళ్లొచ్చాను. ఇప్పుడు నాకు చావు అంటే ఏమాత్రం భయం లేదు.హార్ట్ ఎటాక్‌కి గురైనప్పుడు సరైన సమయంలో నా భర్త సీపీఆర్ చేయడం వల్ల నా ప్రాణాలు దక్కాయి. తను ఎప్పటికీ నా హీరో'' అంటూ ఆమెపేర్కొంది. లారెన్‌కు ఎదురైన ఈ పరిస్థితిని వైద్య శాస్త్రంలో లాజరస్ ఎఫెక్ట్ అని అంటారు.అంటే చనిపోయిన సందర్భంలో చాలా అరుదుగా ఇలా మళ్లీ జీవం పోసుకోవడం జరుగుతుంది. అయితే ఇలాంటి కేసుల్లో మళ్లీ బతికిన వారు ఎక్కువ కాలం జీవించలేరని, అయితే లారెన్ కేసు ఆశ్చర్యంగా ఉందని న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. గతంలో 1982 నుంచి 2018 మధ్య ఇలాంటి కేసులు 65 నమోదయ్యాయని,అందులో 18 మంది మాత్రమే పూర్తిగా కోలుకున్నారని స్పష్టం చేసింది. -
‘ఎన్టీఆర్‌ను ఆ విధంగా నమ్మించారు.. స్వెట్టర్లు అమ్మే వ్యక్తి రాయబారి అయ్యారు’
విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు భారీగా విజయవంతం కావడం తెలుగుదేశం పార్టీకి గానీ, ఎల్లో మీడియాకు గానీ ఏ మాత్రం రుచించడం లేదని తెలుస్తోంది. ఏకంగా దేశంలో ఉన్న టాప్ క్లాస్ బిజినెస్ మాగ్నెట్లు అంతా రావడం, ఆంధ్రప్రదేశ్‌లో అపారమైన అవకాశాలు ఉన్నాయని కొనియాడటం, వేల కోట్ల పెట్టుబడులు పెడతామని నేరుగా ప్రకటించడం.. ఎల్లో బ్యాచ్‌కు మింగుడు పడలేదు. సాధారణంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెట్టుబడిదారుల సదస్సు జరిగితే అందులో రకరకాల వేషాలు, డ్రామాలు పుట్టుకొస్తాయి. అలాంటి ఓ విచిత్రమైన ఘటనను షేర్ చేసుకున్నారు సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు మంత్రిగా ఉండేవారు. ఆ సందర్భంలో జరిగిన సంఘటన, ఆయన చెప్పిన అనుభవం ఇది. "తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి ఫేక్ షోలు చేయడం అలవాటు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాపం.. ఆయనకు పెద్దగా తెలియదు. ఎప్పుడూ చుట్టూ ఉండే చంద్రబాబు, ఆయన మనుష్యులు ఓ రోజు ఒకాయనను తీసుకొచ్చారు. నేరుగా ఎన్టీఆర్ దగ్గరకు తీసుకొచ్చి పరిచయం చేశారు. అయ్యా.. ఈయన భూటాన్ రాయబారి అని పరిచయం చేశారు. ఎన్టీఆర్ దానికి ఎంతో సంతోషించారు.. స్వయంగా వెంట తీసుకెళ్లి బుద్ధుడి విగ్రహాం చూపించారు. ఆ వ్యక్తితో ఫోటోలు దిగి పేపర్లో వేయించారు. టుప్కా అని భూటాన్ నుంచి రాయబారి వచ్చారని, ముఖ్యమంత్రిని కలిశారని పేపర్లలో ప్రచారం చేయించారు. అప్పట్లో నేను ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో పని చేస్తుండే వాడిని. ఈ సంఘటన జరిగిన మూడు రోజుల తర్వాత .. నాతో పని చేస్తోన్న ఓ కొలీగ్ ఓ ఫోటో చూపించారు. అందులో నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర స్వెట్టర్లు అమ్ముకుంటున్న వ్యక్తి ఫోటో ఉంది. ఇతనే కదా మొన్న ఎన్టీఆర్‌ను కలిసిన భూటాన్ రాయబారి అని చెప్పారు. తెలుగుదేశం వాళ్లు ఇలాంటి పనులు చేస్తుంటారు. స్వెట్టర్లు అమ్ముకునే వ్యక్తిని భూటాన్ రాయబారి అని చెప్పించిన ఘనత చంద్రబాబుది.." అని దేవులపల్లి అమర్ అన్నారు. చదవండి: జాకీ యూనిట్‌పై రాప్తాడులో టీడీపీ కాకిగోల.. వాస్తవాలతో సాక్ష్యం ఇదిగో -
అయ్యో బిడ్డా.. మరీ ఇంత అనాగరికమా?
క్రైమ్: దిగ్భ్రాంతికి గురి చేసే ఘటన ఒకటి మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. న్యూమోనియాకు చికిత్స పేరుతో మూడు నెలల పసికందుపై అనాగరిక చర్యకు దిగారు గిరిజన పెద్దలు. దీంతో సకాలంలో చికిత్స అందక.. ఆ చిన్నారి పదిహేను రోజులు పాటు మృత్యువుతో పోరాడి చివరకు ఓడింది. షాహ్‌దోల్ జిల్లా పరిధిలోని ఓ గిరిజన తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. శ్వాస కోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆ చిన్నారికి.. నాటు వైద్యం పేరుతో 51 సార్లు కాల్చిన కడ్డీతో కడుపు మీద వాతలు పెట్టారు తండా పెద్దలు. అయితే అది వికటించి.. బిడ్డ ప్రాణం మీదకు వచ్చింది. దీంతో స్థానికంగా ఓ ఆస్పత్రికి తరలించగా.. 15 రోజులు చికిత్స పొందుతూ ఆ చిన్నారి కన్నుమూసింది. ఇదిలా ఉంటే.. చిన్నారి కన్నుమూసిన తర్వాత గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని బంధువులు ఖననం చేశారు. అయితే విషయం పోలీసుల దాకా వెళ్లడంతో.. చిన్నారి మృతదేహాన్ని బయటకు వెలికి తీసి పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. సకాలంలో న్యూమోనియాకు చికిత్స అందకపోవడం, పైగా కడ్డీ కాల్చిన గాయాల ప్రభావంతో బిడ్డ మృతి చెందిందని వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై స్థానిక అంగన్వాడీ సిబ్బంది స్పందించారు. ఆ బిడ్డ తల్లికి వద్దని చెప్పినా పట్టించుకోకుండా.. ఆ చర్యకు దిగిందని వెల్లడించారు. మధ్యప్రదేశ్ గిరిజన ప్రాంతాల్లో ఇలా జబ్బులకు కడ్డీలను కాల్చి వాతలు పెట్టడం కొందరు ఆచారంగా భావిస్తారు. అయితే ఈ విధానం జబ్బును నయం చేయకపోగా, గాయాలకు కారణం అవుతోందని.. ఒక్కోసారి ఉన్న సమస్యలే ఆరోగ్యాన్ని క్షీణింపజేసి మరణాలకు సైతం దారి తీస్తోందని స్థానిక వైద్య సిబ్బంది చెబుతున్నారు. అవగాహన కల్పించేందుకు ఎంత ప్రయత్నిస్తున్నా.. వాళ్లు మాత్రం ఆచారాలు కొనసాగిస్తున్నారని జిల్లా కలెక్టర్ వందనా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
హీరోయిన్‌తో విద్యార్థి అనుచిత ప్రవర్తన, అసహనం వ్యక్తం చేసిన నటి
‘సూరారై పోట్రు’(తెలుగులో ఆకాశమే హద్దురా) చిత్రంతో జాతీయ నటిగా గుర్తింపు తెచ్చుకున్న యలయాళ భామ అపర్ణా బాలమురళీ. తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా నటించిన ఈ చిత్రంలో అపర్ణా కథానాయికగా చేసింది. ఇందులో ఆమె తన అద్భుతన నటనకు గానూ ఆమెను నేషనల్ అవార్డు వరించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఈవెంట్లో అపర్ణాకు చేదు అనుభవం ఎదురైంది. చదవండి: శృతి హాసన్‌తో లవ్ ట్రోల్స్‌పై స్పందించిన డైరెక్టర్ గోపిచంద్ మలినేని తన కొత్త మూవీ ప్రమోషన్స్‌లో ఓ విద్యార్థి ఆమెతో అనుచితంగా ప్రవర్తించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలు ఏం జరిగిందంటే... అపర్ణ నటించిన లేటెస్ట్ మూవీ తన్కమ్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. ఇందులో భాగంగా కేరళలోని ఓ కాలేజీలో తన్కమ్ మూవీ టీం సందడి చేసింది. ఈ కార్యక్రమంలో మూవీ దర్శకుడు, హీరో వినీత్ శ్రీనివాసన్‌తో పాటు అపర్ణా పాల్గొంది. చదవండి: అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ రూమర్స్: బన్నీపై చిరు ఆసక్తికర వ్యాఖ్యలు! స్టేజ్‌పై కూర్చున్ను అపర్ణా దగ్గరి సడెన్‌గా ఓ విద్యార్థి వచ్చి ఆమె చేయి పట్టుకుని విష్ చేశాడు. అంతేకాదు ఓ ఫొటో కావాలని, తనని నిలుచోవాలంటే బలవంతం చేశాడు. చేసేది ఏం లేక అపర్ణ నిలబడగానికి ఆ యువకుడు ఆమె భుజంపై చేయి వేశాడు. దాంతో సదరు విద్యార్థి తిరుకు షాక్ అయిన అపర్ణా అతడి నుంచి వెంటనే దూరంగా జరిగింది. దీంతో ఆ యువకుడిపై ఆమె అసహనం వ్యక్తం చేసింది. దీంతో సారీ చెప్పి సదరు విద్యార్థి స్టేజ్ దిగి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. A college student misbehaved with actress Aparna Balamurali during the promotion function of Thangam movie. @Vineeth_Sree I'm surprised about your silence 🙏 What the hell #Thankam film crew doing there. @Aparnabala2 #AparnaBalamurali pic.twitter.com/icGvn4wVS8 — Mollywood Exclusive (@Mollywoodfilms) January 18, 2023 -
Nellore: సంతాప సభగా మారిన చంద్రబాబు కందుకూరు రోడ్ షో (ఫొటోలు)
-
సామాన్యులను బలిగొంటున్న బాబు ప్రచార పిచ్చి
-
మొబైల్లో గేమ్ ఆడుతుండగా పేలుడు..తీవ్రంగా గాయపడ్డ చిన్నారి
ఇటీవల మొబైల్ ఫోన్లు పేలుడు గురించి తరుచుగా వింటున్నాం. ఎందుకిలా జరుగుతుందో అంతుపట్టడం లేదు. ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కోవిడ్ మహమ్మారీ నుంచి పిల్లలకు ఆన్లైన్లో క్లాసులకు అలవాటుపడ్డారు. దీంతో పిల్లలు మనకు తెలియకుండానే సెల్ఫోన్లకు బానిసవ్వుతున్నారు. పలువురు తల్లిదండ్రులు కూడా పిల్లలు ఫోన్‌కి బాగా అతుక్కుపోతున్నారంటూ గగ్గోలు పెడుతున్నారు. అలాంటి తరుణంలో ఈ సెల్ఫోన్ల పేలుడు ఘటనలు ప్రజలను కాస్త భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. అచ్చం అలానే ఇక్కడోక చిన్నారి ఫోన్లో గేమ్ ఆడుతుండగా.. హఠాత్తుగా పేలుడు సంభవించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో మధురలోని మేవాటీలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...మధురకు చెందిన మహ్మద్ జావేద్ అనే వ్యక్తి తన 13 ఏళ్ల కొడుకుకి మొబైల్ ఫోన్ ఇచ్చాడు. ఆ చిన్నారి తన చదువు కోసం అని తండ్రి ఫోన్‌ని తరుచుగా ఉపయోగిస్తుంటాడు. అందులో భాగంగానే ఆరోజు కూడా ఫోన్ తీసుకున్నాడు. కాసేపటికి అందులో గేమ్ ఆడుతున్నాడు. ఏమైందో ఏమో అకస్మాత్తుగా ఫోన్ పేలిపోయింది. ఆ పేలుడు శబ్దానికి వేరే గదిలో ఉన్న అతడి తల్లిదండ్రులు ఉలిక్కిపడి...హుటాహుటినా వచ్చి చూడగా...బాలుడు తీవ్రగాయాలపాలై మంచంపై పడి ఉన్నాడు. దీంతో ఒక్కసారిగా తల్లిదండ్రులు షాక్‌కి గురయ్యారు. ఆ చిన్నారి దుస్తులు కాలిపోయి, ఛాతీపై పలు తీవ్రగాయాలయ్యాయి. తొలుత తమకు ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు. ఆ తర్వాత పరిశీలించి చూడగా ఫోన్ ముక్కలై పడి ఉండటంతో..మొబైల్ బ్లాస్ట్ అయ్యిందని తెలిసిందని చిన్నారి తండ్రి చెబుతున్నాడు. 24 గంటలు పిల్లలను మానిటర్ చేస్తూ కూర్చొవడం అసాధ్యం అని అంటున్నాడు. పిల్లలు కూడా కాస్త అసహనంగా ఫీలవుతారు. ప్రస్తుతం అంతా ఆన్లైన్ చదువులు కాబట్టి వారు కాస్త ఒత్తిడికి గురవుతున్నారు. కాసేపు రిలాక్స్ అయ్యేందుకని మొబైల్ ఫోన్లు ఇస్తుంటాం. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలు గేమ్‌లు కూడా ఆన్లైన్లో ఆడుతుంటారు. అందువల్ల ఇలాంటి ఘటనలు ఎదురైతే తాము ఏంచేయాలని చిన్నారి తండ్రి జావేద్ కన్నీటిపర్యంతమయ్యాడు. (చదవండి: వివాహ మండపంలోకి ఎద్దు ఎంట్రీ..పరుగులు తీస్తున్న జనాలు) -
షాకింగ్ ఘటన: కాటేసిన నాగును కొరికి చంపాడు
ఒక బాలుడు పాము కాటేసిందని కోపంతో కసిగా కొరికి చంపేశాడు. ఈ ఘటన చత్తీస్‌గఢ్‌లో రాయ్‌పూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..చత్తీస్‌గఢ్‌లో రాయ్‌పూర్‌లో జష్పూర్ జిల్లాలోని పండర్పాండ్ గ్రామంలో దీపక్ అనే బాలుడు ఇంటి పెరటిలో ఆడుకుంటున్నాడు. ఇంతలో ఒక పాము అతని చేతిని చుట్టుకుని కాటేసింది. దీంతో ఆ బాలుడు నొప్పితో విలవిల లాడాడు. కానీ పాము బాలుడి చేతిని చుట్టుకుని వదలకపోవడంతో దులుపుకని వదిలించుకునేందుకు యత్నించాడు. కానీ ఆ పాము బాలుడి చేతిని వదలలేదు. దీంతో కోపంతో ఆ పాముని కసితీరా రెండుసార్లు గట్టిగా కొరికి చంపేశాడు. ఈ సంఘటన జరిగిన వెంటనే బాలుడు కుటుంబసభ్యులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. వెంటనే డాక్టర్లు యాంటీ స్నేక్ విషాన్ని అందించి ఒక రోజు అంతా అబ్జర్వేషన్లో ఉంచారు. తదనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి వెళ్లిపోయాడు. ఈ మేరకు పాములకు సంబంధించిన నిపుణుడు ఖైజర్ హుస్సేన్ మాట్లాడుతూ.. దీపక్ త్వరగా కోలుకున్నాడని చెప్పారు. ఇది పొడి కాటు అని అందువల్ల విషపూరితమైన పాము కాటు వేసినప్పటకి విషం విడుదల కాదని చెప్పారు. ఇటువంటి పాము కాట్లు చాలా నొప్పిగా అనిపిస్తాయని, అలాగే కాటు వేసిన చోట సాధారణ కాటు వేసిన లక్షణాలే కనిపిస్తాయని అన్నారు. ఐతే ఇలాంటి సంఘటన మాత్రం ఎప్పుడూ చూడలేదని అన్నారు. అంతేగాదు ఆ ప్రాంతాన్ని గిరిజనుల నాగ్లోక్ గ్రామం అని అంటారు. దీన్ని పాముల నివాసంగా చెబుతారు గ్రామస్తులు. (చదవండి: సెకను వ్యవధిలో జింకను మింగేసిన కొండచిలువ : వీడియో వైరల్) -
షాకింగ్ ఘటన: ఉరి సీన్ రిహార్సల్లో విషాదం
సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ఒక నాటకాన్ని రిహర్సల్ చేస్తూ బాలుడు మృతి చెందాడు. ఈ షాకింగ్ ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....కోలార్‌లోని ఎస్ఎల్వీ స్కూల్లో 12 ఏళ్ల సంజయ్ గౌడ ఏడో తరగతి చదువుతున్నాడు. ఆ విద్యార్థి వచ్చేవారం స్కూల్లో జరగనున్న సాంస్కృతిక కార్యక్రమంలో భగత్ సింగ్ బయోగ్రఫీకి సంబంధించిన నాటకాన్ని వేయనున్నాడు. అందులో భాగంగానే ఇంట్లో రిహార్సల్ చేస్తున్నాడు సంజయ్. ఈ మేరకు సంజయ్ భగత్ సింగ్‌ని ఆంగ్లేయులు ఉరితీసే ఘట్టాన్ని రిహర్స్ల్ చేస్తుండగా.. ప్రమాదవశాత్తు ఉరి పడిపోయింది. దీంతో సంజయ్ అక్కడికక్కడే చనిపోయాడు. దురదృష్టవశాత్తు సరిగ్గా ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. అతడి కుటుంబికులు ఇంటికి తిరిగి వచ్చి చూడగా సంజయ్ మృతి చెంది ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్కూల్లో జరగనున్న సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగానే ఈ నాటకాన్ని ప్రతిరోజు సంజయ్ రిహార్సల్ చేస్తున్నాడని కుటుంబికులు చెబుతున్నారు. అందులో భాగంగానే శనివారం రాత్రి కూడా రిహార్సల్ చేసి ఇలా విగత జీవిగా మారాడంటూ కన్నీటి పర్యంతమయ్యారు తల్లిదండ్రులు. ఈ విషయం తెలుసుకున్న స్కూల్ యాజమాన్యం సదరు సాంస్కృతిక కార్యక్రమాన్ని క్యాన్సిల్ చేయడమే గాక సంజయ్ మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. (చదవండి: ఇంట్లోకి మొసలి ఎంట్రీ... బిక్కుబిక్కుమంటూ రాత్రంతా ఆ కుటుంబం....) -
తండ్రే! కన్న కూతురిపై అత్యాచారం.. ఆపై వీడియో బెదిరింపులు!
బీహార్: ముజఫర్‌పూర్ జాసన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో మైనర్ కూతురిపై తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. ఈ కేసులో బాధితురాలు పోలీసులకు పిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు ఎస్ఐ చాందిని కుమారి సవారియా గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. మరోవైపు దర్యాప్తులో బాలిక చేసిన ఆరోపణలు నిజమని తేలింది. ఈ కేసులో తండ్రీకూతుళ్లను పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన పోలీసులు ఘటనపై మహిళా పోలీసులకు సమాచారం అందించారు. మహిళా పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసు అధికారులు అర్థరాత్రి వారిద్దరినీ తమతో తీసుకెళ్లారు. గత శనివారం బాధితురాలు కోర్టులో వాంగ్మూలం దాఖలు చేసిన అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి, బాధితురాలి తండ్రిని కోర్టుకు అప్పగించారు. ఈ కేసులో మైనర్ బాలికపై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలి తల్లి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. డిసెంబర్ 7వ తేదీ సాయంత్రం మైనర్ బాలికపై నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డారని, ఆపై నిందితుడు బాలికకు ఫోన్ చేసి మళ్లీ రావాలని కోరారని ఎఫ్ఐఆర్లో తల్లి పేర్కొంది. లేని పక్షంలో వీడియో అందరికీ పంపుతానని బెదిరించినట్లు తెలిపింది. ఈ ఘటనపై గ్రామంలో మూడు రోజులుగా సెటిల్మెంట్కు ప్రయత్నించారు. ఐతే గ్రామానికి చెందిన 15 మంది నిందితుడిని కర్రలు, రాడ్లతో దేహశుద్ధి చేశారు. దీంతో ఈ సంఘటన వెలుగులోకొచ్చింది. కన్నతండ్రే కూతురిపై అత్యాచారాలకు పాల్పడుతున్న ఉందంతాలు ఈ మధ్యకాలంలో తరచూ చోటుచేసుకుంటున్నాయి. సభ్యసమాజం తలదించుకునే సంఘటనలు జరగటం విచారకరమని పోలీసధికారులు మీడియాకు తెలిపారు. చదవండి: ఐయామ్ వెరీ సారీ..! కత్రినాకైఫ్ పెళ్లి ఫొటోలు ప్రచురించడం కుదరదు..! -
చిన్నప్పుడే అత్యాచారానికి గురయ్యా : రాహుల్
షార్ట్ ఫిల్మ్స్‌తో తన జర్నీ ప్రారంభించిన రాహుల్ రామకృష్ణ.. అర్జున్ రెడ్డి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు. అయితే తాజాగా రాహుల్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. తను చిన్నతనంలో అత్యాచారానికి గురైనట్టు తెలిపారు. ఆ బాధను ఎవరితో పంచుకోవాలో కూడా తెలియడం లేదన్న ఆయన.. ట్విటర్లో షేర్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ విషయాన్ని ఇతరులతో పంచుకోవడంతో ద్వారా.. తనేంటో తెలుసుకోగలనని పేర్కొన్నారు. అన్ని చాలా బాధగానే ఉన్నాయని వ్యాఖ్యానించారు. రాహుల్ వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని తెలుసుకున్న నెటిజన్లు షాక్‌కు గురయ్యారు. రాహుల్‌కి ధైర్యం చెప్తూ పోస్టులు చేస్తున్నారు. తెరపై నవ్వులు పంచే ఓ నటుడి వెనక ఇంతా విషాద గాథ ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. నటుడు ప్రియదర్శి కూడా రాహుల్‌కు ధైర్యం చెబుతూ ట్వీట్ చేశారు. ‘నేను ఎంత ప్రయత్నించినా కూడా నువ్వు అనుభవించిన బాధను ఎప్పటికీ అర్థం చేసుకోలేను. అలాగే నేను ఏమీ చేయలేను కూడా. కానీ నువ్వు ధైర్యంగా ఉండాలని మాత్రం చెప్పగలను. నువ్వు ప్రతి చెడు అంశం నుంచి బయటకు రావాలి.. వాటిని నీ సామర్థానికి తగ్గట్టుగా ధీటుగా ఎదుర్కొవాలి. నువ్వు ఒక ఫైటర్‌వి. లవ్ యూ బ్రదర్’ అని ప్రియదర్శి పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తనకు మద్దుతుగా నిలిచినవారికి రాహుల్ కృతజ్ఞతలు తెలిపారు. ‘అన్నింటికంటే మీ మాటలు నాకు ఎంతో సాయం చేశాయి. మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. వారి ప్రవర్తనలో కలిగే మార్పులను నిశితంగా గమనించాలి. వారు ఎదుర్కొంటున్న భయానక సంఘటనలు గురించి బయటకు చెప్పే అంతా ధైర్యం, నైపుణ్యత వారికి ఉండకపోవచ్చు’అని వెల్లడించారు. కాగా, గతంలో కూడా పలువురు బాలీవుడ్ ప్రముఖులు తము బాల్యంలో ఎదుర్కొన్న వేధింపుల గురించి వెల్లడించిన సంగతి తెలిసిందే. I was raped during childhood. I don’t know what else to say about my grief, except for this, because this is what I seek to know about myself. — Rahul Ramakrishna (@eyrahul) January 20, 2020 -
నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగానే..!
థానే: మహారాష్ట్రలోని థానేలో భగవాన్ అనే వ్యక్తి నడిరోడ్డుమీద అందరూ చూస్తుండగా ఆత్మహత్యాయత్నం చేశాడు. కాల్వా ప్రాంతంలోని ఓ బ్రిడ్జికి తాడుకట్టి మెడలో తాడు వేసుకుని బ్రిడ్జిపై నుంచి దూకేశాడు. ఈ ఘటనను చూసిన స్థానికులు నివ్వెరపోయారు. వెంటనే అతన్ని గమనించిన థానే ట్రాఫిక్ పోలీసులు చురుగ్గా స్పందించి.. అతన్ని కాపాడారు. స్థానికుల సహాయంతో సురక్షితంగా కిందకు దించి దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. నడిరోడ్డు మీద ఉరేసుకొని చనిపోయేందుకు ప్రయత్నించిన వ్యక్తి పేరు భగవాన్ అని, కొడుకు చనిపోయిన దగ్గరి నుంచి అతని మానసిక పరిస్థితి సరిగా లేదని తెలుస్తోంది. -
దారుణం : కొడుకు శవంతో
లక్నో : ప్రభుత్వాలు ఎన్ని మారినా, నాయకులు ఎంతమంది వచ్చినా పేదల బతుకులు మాత్రం మారడం లేదనడానికి ఈ ఘటన ఓ నిదర్శనం. డబ్బుల్లేక, ఆసుపత్రి వర్గాలు అంబులెన్స్ ఇవ్వక ఓ మహిళ తన కుమారుడి శవాన్ని భుజాలపై మోసుకుంటు వెళ్లిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని షాహజాన్‌పూర్‌లో చోటుచేసుకుంది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న తన కుమారుడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. పరీక్షించిన వైద్యులు కండిషన్ సీరియస్‌గా ఉందని ఇతర ఆసుపత్రికి రిఫర్ చేశారని ఆ చిన్నారి తండ్రి తెలిపారు. అయితే తమ దగ్గర చిల్లి గవ్వలేకపోవడంతో అంబులెన్స్ ఇవ్వాలని ఆసుపత్రి సిబ్బందిని కాళ్లవేలా ప్రాధేయపడ్డామని, అయినా వారు కనికరించలేదన్నారు. దీంతో చేసేదేంలేక తన కొడుకును భుజాలపై వేసుకుని నడక సాగించామన్నారు. ‘నా భుజాలపై ఉన్న నా బిడ్డ మార్గ మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు’ అని మృతుడి తల్లి కన్నీటి పర్యంతమైంది. ఆసుపత్రివారు అంబులెన్స్ ఇచ్చి ఉంటే తన కొడుకు బతికేవాడని ఆ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఆసుపత్రి ముందు మూడు అంబులెన్స్‌లు పార్క్ చేసి ఉన్నాయని, అయినా తమకు ఎందుకు ఇవ్వలేదో అర్థం కాలేదన్నారు. ఇక ఆసుపత్రి వర్గాలు మాత్రం ఈ ఆరోపణలు ఖండిస్తున్నాయి. మెడికల్ అధికారి అనురాగ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆ చిన్నారి పేరు అఫ్రోజ్, అతన్ని రాత్రి 8.10 గంటలకు ఆసుపత్రి తీసుకొచ్చారు. అప్పటికే అతన్ని పరిస్థితి చాలా విషమంగా ఉంది. మేం వెంటనే లక్నోకు తీసుకెళ్లి చికిత్స అందించమని చెప్పాం. వారు మా ఇష్టం వచ్చిన చోటికి తీసుకెళ్తామని చెప్పి ఆ పిల్లాడిని తీసుకువెళ్లారు. ఇప్పుడు అనవసర ఆరోపణలు చేస్తున్నారు’ అని తెలిపారు. -
కడుపు నొప్పి అని వెళ్తే..
-
కడుపు నొప్పి అని వెళ్తే.. పిచ్చోడిని చేశారు!
సాక్షి, విజయవాడ : కడుపు నొప్పి అని వెళ్లిన ఓ వ్యక్తికి మతిస్థిమితం కోల్పోయేలా చేశారు ఓ ప్రయివేట్ ఆసుపత్రి వైద్యులు. ఈ ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. విజయవాడకు చెందిన బాజీ.. కడుపు నొప్పితో బాధపడుతూ ఓ ప్రయివేట్ ఆసుపత్రిని ఆశ్రయించాడు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఈ నెల 26న ఆపరేషన్ నిర్వహించారు. అయితే ఈ ఆపరేషన్ అనంతరం బాజీ మతిస్థిమితం కోల్పోయాడు. దీంతో అతన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాజీని పరిశీలించిన గుంటూరు వైద్యులు.. ఆపరేషన్ సమయంలో ఎనస్తీషియా ఎక్కువ కావడంతో అది మెదడు మీద ప్రభావం చూపిందని తెలిపారు. ప్రస్తుతం అతని పరస్థితి విషమించిందని, మరో ఆపరేషన్ చేయడానికి కుదరదని పేర్కొన్నారు. ఎనస్తీషియా డోస్ ఎక్కువ కావడంతోనే ఆపరేషన్ కష్టంగా మారిందన్నారు. దీనికి కారణమైన ఆ ప్రయివేట్ ఆసుపత్రి యాజమాన్యంపై బాధితుడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
గోవా బీచ్‌లో అనూహ్య ఘటన
-
స్టేజీపై డ్యాన్స్ చేస్తుండగానే...
బార్మర్ : జీవితం.. నిజంగా ఎంత అనూహ్యమైనది. ఏ క్షణాన మృత్యువు కాటేస్తుందో చెప్పడం చాలా కష్టంగా మారుతోంది. రాజస్తాన్‌లో జరిగిన ఈ సంఘటన మాత్రం హృదయాల్ని కలచివేస్తోంది. ఒక వ్యక్తి ఎంతో సంతోషంగా స్టేజీపై నవ్వుతూ డ్యాన్స్ చేస్తుండగానే.. అతన్ని మృత్యువు కాటేసింది. డ్యాన్స్ చేస్తూనే స్టేజీపై కుప్పకూలిపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజస్తాన్‌లో బార్మర్‌లో ఓ యంగ్ కపుల్, దిల్ వాలే దుల్హనియా లేజాయింగేలో 'తుజే దేకా తో హే జానా సనం'' అనే పాటకు ఓ ఫంక్షన్లో డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. అలా నర్తిస్తుండగానే.. ఆమె జోడి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆ సంఘటనను కూడా డ్యాన్స్‌లో భాగంగానే చూశారు ఆ అమ్మాయి, ఇతర ప్రేక్షకులు. కొద్దిసేపటి తర్వాత అతన్ని ఆ అమ్మాయి లేపడం ప్రయత్నించింది. కానీ అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయాడు. అతను ప్రాణాలు కోల్పోయినట్టు తెలియగానే ఒక్కసారిగా అక్కడున్న వారందరూ హతాశులయ్యారు. అతనికి కార్డియాక్ అరెస్ట్ రావడం వల్ల చనిపోయాడని ప్రాథమిక రిపోర్టులు చెబుతున్నాయి. -
స్టేజీపై డ్యాన్స్ చేస్తుండగానే...
-
రన్నింగ్ కారులో నుంచి కిందపడినా..
-
‘మొకాళ్లపై కూర్చొని వేడుకోండి.. లేదంటే రేప్!’
బెంగళూరు: ఉత్తర బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. కన్నడ భాష రానందుకు ఓ మహిళపై నలుగురు వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఆమెను ఇష్టమొచ్చినట్లు తిట్టి చేయిచేసుకొని అసభ్యంగా తాకారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. బాధితురాలి వివరాల ప్రకారం.. ఆమె తన స్నేహితురాలు రాత్రి 9.30గంటల ప్రాంతంలో తమ ఇంటికి తిరిగొస్తుండగా వారితో ఓ వీధిలో కొంతమంది గొడవపడ్డారు. వారిలో ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. వారి వద్దకు వచ్చి కన్నడంలో ఏదైనా మాట్లాడాలని అడిగాడు. అనంతరం కన్నడ భాషలోనే వారిని ఏదో అనకూడని మాటలు అన్నాడు. అది వారికి అర్థం కాకపోవడంతో మిగితావారు కూడా వారి వద్దకు వచ్చి కర్ణాటకలో తింటూ కర్ణాటకలో ఉంటూ ఎందుకు కన్నడం మాట్లాడలేకపోతున్నారని తిట్టారు. ‘మీరు స్థానికులు కాదు. మీకు కన్నడ ఎలా మాట్లాడాలో తెలియదు. అందుకే మీరు మొకాళ్లపై కూర్చుని క్షమించాలని ప్రార్థించండి లేదంటే లైంగికదాడి చేసి వేధిస్తాం అని బెదిరించారు. నాకు ఈ నగరంలో ఒక్క క్షణం కూడా ఉండాలని లేదు. నేను మా తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోతాను’ అని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. న్యూ ఇయర్ వేడుకల్లో పెద్ద మొత్తంలో లైంగిక వేధింపుల ఘటన చోటు చేసుకున్న అనంతరం జరిగిన ఈ విద్వేషపూరిత ఘటన కాస్తంత ఆందోళన కలిగిస్తోంది. -
ఓలా క్యాబ్ డ్రైవర్ ఎంత పనిచేశాడు?
నందనం: తమిళనాడులో ఓ ఓలా క్యాబ్ డ్రైవర్ దారుణానికి తెగబడ్డాడు. బతికుండగానే తన భార్యను కారులో పడేసి నిప్పంటించాడు. ఇద్దరు పిల్లలను కూడా అందులోనే నిర్లక్ష్యంగా వదిలేసి వెళ్లిపోయాడు. అయితే, మంటల్లో తగులబడుతున్న ఆ మాతృమూర్తి తన బిడ్డలను కారు అద్దాల నుంచి బయటపడేయడంతో పిల్లలు మాత్రం బ్రతికి బయటపడ్డారు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. నాగరాజు (30) అనే వ్యక్తి తన ఓలా క్యాబ్ లో భార్య పిల్లలతో కలిసి మధ్యాహ్నం బయటకు వెళ్లాడు. అయితే, వారి మధ్య ఏదో అంశంపై మాటల యుద్ధం మొదలైంది. అయితే, భర్తను బెదిరించేందుకు క్యాబ్ లో అత్యవసర పరిస్థితుల్లో అవసరానికోసం ఉంచిన పెట్రోల్ ను పోసుకుంది. ఆమె అలా చేసిందో లేదో వెంటనే కారు ఆపిన ఆ భర్త పిల్లలను కూడా అందులోనే ఉంచి డోర్లు వేసి వెంటనే నిప్పంటించి పారిపోయాడు. మంటలు ప్రారంభంకాగానే ఆమె పిల్లలను బయట పంపించగలిగింది. అయితే, తీవ్ర గాయాల కారణంగా ఆస్పత్రిలోనే ఆమె కన్నుమూసింది. -
కూతురితో నిప్పుల గుండంలో నడుస్తూ..
జలంధర్: చుట్టూ డప్పుమోతలు.. కుప్పలుకుప్పలుగా చేరిన జనం.. చెవులు చిల్లులు పడేలా కొమ్ముబూరల చప్పుళ్లు కూడా. చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రత్యేక వస్త్రాల్లో ప్రతి ఒక్కరు అక్కడికి చేరారు. వారి కళ్ల ఎదుట కొంత బొందలాగా తీసిన నిప్పుల కుప్పను పొడవాటి చాపలాగా పరిచారు. చూస్తుండగానే పదుల సంఖ్యలో ఆ నిప్పుకణికలపై నడుస్తూ ఉండగా ఓ తండ్రి కూతురుమాత్రం అనూహ్యంగా అందులో పడిపోయారు. గట్టిగా గావు కేకలు. ఈలోగా అక్కడ ఉన్నవాళ్లు వారికి సాయం చేసి పైకిలాగి ఆస్పత్రిలోకి చేర్పించగా ప్రస్తుతం తీవ్ర గాయాలతో పోరాడుతున్నారు. ఈ ఘటన పంజాబ్‌లో సోమవారం చోటుచేసుకుంది. జలంధర్‌లో ఓ అమ్మవారి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన నిప్పుల గుండంలో నడుస్తూ తండ్రి కూతుర్లు ప్రమాదవ శాత్తు అందులో పడిపోయారు. తిరిగి పైకి లేవలేకపోయారు. ఈ క్రమంలో వారి ఒళ్లంతా తీవ్ర గాయాలయ్యాయి. కొంతమంది యువకులు వారికి చేయందించి సాయం చేయడంతో ప్రాణగండం తప్పింది. 2013లో కూడా జలంధర్‌లో జరిగిన ఇదే ఉత్సవాల్లో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. అప్పట్లో ఓ తల్లి తన కూతురుని ఎత్తుకొని నడుస్తూ అందులో పడి తీవ్ర గాయాలపాలవ్వగా ఇది మరో ఘటన. హిందూ సంప్రదాయంలో ఇప్పటికీ పలు చోట్ల నిప్పుల గుండాన్ని ఏర్పాటుచేసి తమ పాపాలు పోవాలి అని మొక్కుకుంటూ అందులో నడిచే అలవాటు కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
అందరూ చూస్తుండగా కిడ్నాప్
నోయిడా: దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో పట్టపగలే జరిగిన కిడ్నాప్ సంచలనం రేపింది. గ్రేటర్ నోయిడాలో ఈ నెల 14న ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తిని కొంత మంది దుండగులు పట్టపగలు కిడ్నాప్ చేశారు. అందరూ చూస్తుండగా అతడిని లాక్కెళ్లి కారులో పరారయ్యారు. అక్కడున్న వారిలో ఎవరూ కూడా కిడ్నాపర్లను ప్రతిఘటించలేదు. కళ్లెదుటే ఒక వ్యక్తిని దుండగులు లాక్కెళుతున్నా చూస్తుండి పోయారేగానీ, ఒక్కరూ అడ్డుచెప్పలేదు. కిడ్నాప్ అయిన వ్యక్తి తర్వాత రోజు శవపై కనిపించాడు. అతడిని కిడ్నాప్ చేస్తుండగా తీసిన వీడియోను ఇంటర్నెట్ లో పెట్టడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు ఎటువంటి కేసు నమోదు చేయలేదు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగివుంటుందని అనుమానిస్తున్నారు. మృతుడి వివరాలు వెల్లడి కాలేదు.