హీరోయిన్‌తో విద్యార్థి అనుచిత ప్రవర్తన, అసహనం వ్యక్తం చేసిన నటి | Student Misbehaves With Actress Aparna Balamurali at Kerala College | Sakshi
Sakshi News home page

Actress Aparna Balamurali: హీరోయిన్‌తో విద్యార్థి అనుచిత ప్రవర్తన, అసహనం వ్యక్తం చేసిన నటి

Published Thu, Jan 19 2023 11:14 AM | Last Updated on Thu, Jan 19 2023 12:46 PM

Student Misbehaves With Actress Aparna Balamurali at Kerala College - Sakshi

‘సూరారై పోట్రు’(తెలుగులో ఆకాశమే హద్దురా) చిత్రంతో జాతీయ నటిగా గుర్తింపు తెచ్చుకున్న యలయాళ భామ అపర్ణా బాలమురళీ. తమిళ స్టార్‌ హీరో​ సూర్య హీరోగా నటించిన ఈ చిత్రంలో అపర్ణా కథానాయికగా చేసింది. ఇందులో ఆమె తన అద్భుతన నటనకు గానూ ఆమెను నేషనల్‌ అవార్డు వరించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఈవెంట్‌లో అపర్ణాకు చేదు అనుభవం ఎదురైంది.

చదవండి: శృతి హాసన్‌తో లవ్‌ ట్రోల్స్‌పై స్పందించిన డైరెక్టర్‌ గోపిచంద్‌ మలినేని

తన కొత్త మూవీ ప్రమోషన్స్‌లో ఓ విద్యార్థి ఆమెతో అనుచితంగా ప్రవర్తించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అసలు ఏం జరిగిందంటే...  అపర్ణ నటించిన లేటెస్ట్‌ మూవీ  తన్కమ్‌ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. ఇందులో భాగంగా కేరళలోని ఓ కాలేజీలో తన్కమ్‌ మూవీ టీం సందడి చేసింది. ఈ కార్యక్రమంలో మూవీ దర్శకుడు, హీరో వినీత్‌ శ్రీనివాసన్‌తో పాటు అపర్ణా పాల్గొంది.

చదవండి: అల్లు వర్సెస్‌ మెగా ఫ్యామిలీ రూమర్స్‌: బన్నీపై చిరు ఆసక్తికర వ్యాఖ్యలు!

స్టేజ్‌పై కూర్చున్ను అపర్ణా దగ్గరి సడెన్‌గా ఓ విద్యార్థి వచ్చి ఆమె చేయి పట్టుకుని విష్‌ చేశాడు. అంతేకాదు ఓ ఫొటో కావాలని, తనని నిలుచోవాలంటే బలవంతం చేశాడు. చేసేది ఏం లేక అపర్ణ నిలబడగానికి ఆ యువకుడు ఆమె భుజంపై చేయి వేశాడు. దాంతో సదరు విద్యార్థి తిరుకు షాక్‌ అయిన అపర్ణా అతడి నుంచి వెంటనే దూరంగా జరిగింది. దీంతో ఆ యువకుడిపై ఆమె అసహనం వ్యక్తం చేసింది. దీంతో సారీ చెప్పి సదరు విద్యార్థి స్టేజ్‌ దిగి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement