![Ragging Horror At Kerala Medical College](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/ragging_0.jpg.webp?itok=raX1LATX)
తిరువనంతపురం : ‘అరె తమ్ముళ్లు మందేయాలి. డబ్బులు ఇవ్వండ్రా అని సీనియర్ విద్యార్థులు.. తమ జూనియర్ విద్యార్థులకు హుకుం జారీ చేశారు. దీంతో జూనియర్లు చేసేది లేక కొన్ని వారాల పాటు ప్రతి ఆదివారం సీనియర్లకు డబ్బులు ఇచ్చే వారు. ఈ తరుణంలో ఓ ఆదివారం ఎప్పటిలాగే జూనియర్ల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు సీనియర్లు ప్రయత్నించారు. దీంతో జూనియర్లు మీకు ఇచ్చేందుకు మా దగ్గర డబ్బులు లేవు అన్నా’అని సమాధానం ఇచ్చారు. అంతే కోపోద్రికులైన సీనియర్ విద్యార్థులు.. జూనియర్లను అత్యంత కిరాతంగా ర్యాగింగ్ (Ragging) చేశారు. చివరికి..
కేరళ పోలీసులు వివరాల మేరకు.. కేరళ (kerala) రాజధాని తిరువనంతపురంకు చెందిన ముగ్గురు విద్యార్థులు కొట్టాయంలో ప్రభుత్వ కాలేజీలో (kottayam government narsing college) నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. అయితే, గతేడాది నవంబర్‌లో మూడో సంవత్సరం నర్సింగ్ చదువుతున్న ఐదుగురు విద్యార్థులు ఈ ముగ్గురు విద్యార్థుల్ని ర్యాగింగ్ పేరుతో వేధింపులకు గురి చేశారు.
ఆ ర్యాగింగ్ ఎలా ఉందంటే? బాధితుల్ని నగ్నంగా నిలబెట్టి గాయపరచడం. వాటిపై కారం పూయడం. మంటకు విలవిల్లాడుతుంటే వీడియోలు తీసి పైశాచికానందం పొందడం. గాయాల్ని కంపాస్‌తో కొలవడం. అంతర్గత అవయవాలకు డంబెల్స్‌ను వేలాడదీయడం వంటి వికృత చేష్టలకు దిగారు. తాము ర్యాగింగ్ చేస్తున్నామని ఫిర్యాదు చేస్తే మీకు చదువును దూరం చేస్తామని బాధిత విద్యార్థుల్ని బెదిరింపులకు దిగారు. అలా నాలుగు నెలల పాటు సీనియర్ల వేధింపులను మౌనంగా భరించారు.
ఈ నేపథ్యంలో ఓ బాధిత విద్యార్థి ధైర్యం చేసి కాలేజీలో జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీనియర్ విద్యార్థుల్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు కస్టడీలో విద్యార్థుల్ని పోలీసులు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.
👉చదవండి : నేను లీవ్ అడిగితే ఇవ్వరా? ప్రభుత్వ ఉద్యోగి ఏం చేశాడో చూడండి!
Comments
Please login to add a commentAdd a comment