breaking news
Medical College
-
కేవలం పులివెందుల అనే... మానవత్వం ఉన్నోడెవడైనా అలా చేస్తాడా?
-
చంద్రబాబు ఎంత దుర్మార్గుడు అంటే.. వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ ఆసుప్రతులు లేకుంటే ప్రైవేటు దోపిడీని ఆపేది ఎవరు? అని చంద్రబాబు సర్కార్‌ను ప్రశ్నించారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. చంద్రబాబు మూడుసార్లు సీఎం అయ్యారు. కనీసం ఒక్క ప్రభుత్వ ఆసుపత్రి అయినా తీసుకొచ్చారా?. మెడికల్ సీట్లు వద్దని లేఖ రాసిన ఏకైక ముఖ్యమంత్రి, దుర్మార్గుడు అయిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. 26 జిల్లాల్లో ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉండాలని ప్రయత్నించిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానిది అని చెప్పుకొచ్చారు.ఏపీలో మెడికల్ కాలేజీల అంశంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘ప్రభుత్వ ఆసుపత్రులను నడపడం ప్రభుత్వం బాధ్యత. ప్రైవేటు దోపిడీకి చెక్ పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. వ్యవస్థలను ప్రభుత్వం పట్టించుకోకపోతే ప్రైవేట్ దోపిడీ విచ్చలవిడిగా జరుగుతుంది. ఆ దోపిడీని సామాన్యుడు భరించలేడు. అందుకే ప్రభుత్వం కొన్ని వ్యవస్థలను బాధ్యతగా తీసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రులు, కళాశాలలు లేకపోతే పేదలు దోపిడీకి బలవుతారు. ఆర్టీసీ బస్సులను ప్రైవేట్ సంస్థలు నడిపిస్తే.. సామాన్యుడు బస్సు ఎక్కగలడా?.ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు లేకపోతే పేదలు దోపిడీకి బలవుతారు. 2019కి ముందు చంద్రబాబు మూడుసార్లు సీఎం అయ్యారు. కనీసం ఒక్క ప్రభుత్వ ఆసుపత్రి అయినా తీసుకొచ్చారా?. 1923 నుంచి 2019 వరకు రాష్ట్రంలో మొత్తం 12 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. మేం వచ్చాక ప్రతీ జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ తేవాలని ప్రయత్నించాం. 26 జిల్లాల్లో ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉండాలని ప్రయత్నించాం. ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో.. ఉచితంగా ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుంది. ప్రైవేట్ దోపిడీకి చెక్ పడుతుంది అని అన్నారు. చంద్రబాబు ఎంత దుర్మార్గుడు అంటే.. పులివెందుల మెడికల్ కాలేజీ 50 ఎంబీబీఎస్ సీట్లతో భర్తీకి అనుమతులు మంజూరయ్యాయి. చంద్రబాబు మాకు ఆ సీట్లు వద్దని లేఖ రాశారు. కేవలం పులివెందుల మెడికల్ కాలేజ్ అనే ఉద్దేశంతోనే అలా చేశారు. ఇలాంటి ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడైనా ఉంటాడా?. పేదవాళ్లకు, మధ్యతరగతి మంచి జరుగుతుందటే అడ్డుకుంటారా?. మానవత్వం ఉన్నోడెవడైనా ఇలా చేస్తాడా?. చంద్రబాబు సక్రమంగా పని చేసి ఉంటే.. ఈ ఏడాదిన్నర పాలనలో మరో నాలుగు మెడికల్ కాలేజీలు కూడా పూర్తి అయ్యేవి. రాబోయే విద్యా సంవత్సరానికి మరో నాలుగు కాలేజీలకు చెందిన పనులు దగ్గర పడి ఉండేవివైఎస్సార్సీపీ హయాంలో 17 మెడికల్ కాలేజీలు..వైఎస్సార్సీపీ హయాంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం. పేదలకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సేవలు అందించాలనుకున్నాం. ఇవి ప్రారంభమైతే.. పేద ప్రజలకు ఉచితంగా అత్యాధునిక వైద్యం అందుతుంది. మా హయాంలో ఒక్కొక్కటిగా తరగతులు ప్రారంభించాయి. ఎన్నికల నాటికే పాడేరు, పులివెందుల మెడికల్ కాలేజీలు ప్రారంభం అయ్యాయి. మా హయాంలో 17లో ఏడు మెడికల్ కాలేజీలను క్లాస్‌లతో సహా అందుబాటులోకి తెచ్చాం. ఏడు కాలేజీల్లో క్లాసులు ప్రారంభమయ్యాయి. 800 సీట్లు అప్పటికే భర్తీ కూడా అయ్యాయి అని చెప్పుకొచ్చారు.చంద్రబాబుకి సిగ్గుండాలి.. ఆలోచన మాది.. ఆచరణ మాది.. భూముల, నిధుల సమీకరణ మాది.. అన్నీ రెడీ అయ్యాయి. మరి చంద్రబాబు ఎందుకు ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారు?. మిగిలిన రూ.5 వేల కోట్ల పనులకు ఆర్థిక సాయం కూడా వచ్చింది. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రితో కొన్ని లక్షల మందికి మేలు జరిగేది కదా. వైద్య విద్య కోసం జార్జియా, ఉక్రెయిన్ లాంటి దేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేది. సిగ్గుండాలి.. ప్రభుత్వ ఆస్తులను అమ్ముకోవడానికి!. మేం అధికారంలోకి వచ్చేనాటికి 2,360 సీట్లు ఉండేవి. కొత్త మెడికల్ సీట్ల ద్వారా 2550కు మెడికల్ సీట్లు పెంచే ప్రయత్నం చేశాం. మా హయాంలో 800 సీట్లు కొత్తగా తీసుకొచ్చాం. ఎక్కడ జగన్‌కు క్రెడిట్ దక్కుతుందో అని.. మెడికల్ కాలేజీల నిర్మాణాలను చంద్రబాబు ఇలా దెబ్బ తీస్తున్నారు’ అని చెప్పుకొచ్చారు. -
ఎకరం రూ.వంద.. పక్కా దందా!
సాక్షి, అమరావతి: డాక్టర్ కావాలని కోటి ఆశలు పెట్టుకున్న రాష్ట్ర విద్యార్థులను టీడీపీ కూటమి ప్రభుత్వం నమ్మించి గొంతు కోసింది. ప్రతిపక్షంలో ఉండగా కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లన్నీ ప్రభుత్వ కోటాలోకి తెస్తామని హామీలిచి్చ, గద్దెనెక్కాక నిలువునా వంచించింది. సీట్లను ప్రభుత్వ కోటాలోకి తేవడం అటుంచి.. ఏకంగా కళాశాలలనే కారు చౌకగా ప్రైవేట్‌పరం చేయడానికి పూనుకుని విద్యార్థులతో పాటు, రాష్ట్ర ప్రజలకూ సీఎం చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన 10 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానం ద్వారా ప్రైవేట్‌పరం చేయడానికి ఇటీవల రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో వైద్య కళాశాలలను పీపీపీలో నిర్వహణకు అధికారుల కమిటీ సూచించిన ప్రతిపాదనలకు మంగళవారం వైద్య శాఖ ఆమోదం తెలిపింది. రెండు విడతల్లో 10 కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెట్టడానికి అనుమతిస్తూ ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. టెండర్ల ద్వారా వైద్య కళాశాలలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టే బాధ్యతను ఏపీ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థకు అప్పజెప్పారు. తొలి దశలో పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లె.. రెండో విడతలో నర్సీపట్నం, అమలాపురం, పాలకొల్లు, బాపట్ల, పెనుకొండ, పార్వతీపురం వైద్య కళాశాలలు ప్రైవేట్‌కు ధారాదత్తం చేయనున్నారు. ఏకంగా 66 ఏళ్లపాటు హక్కులు ⇒ సంపద సృష్టించి సంక్షేమం అమలు చేస్తానని ఎన్నికలకు ముందు చంద్రబాబు ఉత్తర కుమారుడి ప్రగల్భాలు పలికారు. తీరా అధికారంలోకి వచ్చాక సంక్షేమానికి కత్తెర వేసి పేదలను నిలువునా దగా చేశారు. ప్రభుత్వాస్తులను అస్మదీయులకు దోచి పెట్టడం కోసం పీపీపీ ముసుగులో కుట్రలకు తెరలేపారు. ఈ కుట్రలో రాష్ట్ర విద్యార్థుల వైద్య విద్య కల, నిరుపేదల ఉన్నత వైద్యం ఆశలు నెరవేర్చే ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాస్పత్రులకూ మినహాయింపు ఇవ్వలేదు. ⇒ తద్వారా తాను నడుపుతోంది ప్రభుత్వం కాదని.. నారా వారి మాయాబజార్ అని బాబు మరోసారి నిరూపించుకున్నారు. రూ.వేల కోట్ల ప్రజాధనం వెచి్చంచి, వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న వైద్య కళాశాలలు, బోధనాస్పత్రులు, వాటి భూములను తేరగా పప్పు బెల్లాలుగా అస్మదీయులకు పంచిపెడుతున్నారు. పీపీపీ నిర్వహణ పేరిట ఏకంగా 66 ఏళ్ల పాటు వాటిపై హక్కులు కల్పించబోతున్నారు. ⇒ విశాఖలో రూ.కోట్ల విలువైన భూమి ఉర్సాకు ఎకరం రూ.99 పైసలకే కట్టబెట్టడానికి యత్నించిన విధంగానే వైద్య కళాశాలలకు సంబంధించిన విలువైన భూమిని ఎకరానికి కేవలం రూ.100గా నిర్ణయించారు. ఒక్కో వైద్య కళాశాల 50 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉంటుంది. ఈ లెక్కన రూ.వందల కోట్ల విలువ చేసే భూములను కారు చౌకగా పెట్టుబడిదారులకు తేరగా అప్పగించేస్తుండటం విస్తుగొలుపుతోంది. ⇒ ప్రైవేట్ వ్యక్తుల అజమాయిïÙలో నడిచే వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉండే బోధనాస్పత్రుల్లో పేదలకు ఉచిత వైద్య సేవలు ఉండవు. ఈ కళాశాలలు ప్రభుత్వం ఆధ్వర్యంలో పని చేస్తే ఓపీ, ఐపీ, రోగ నిర్ధారణ, అవయవాల మార్పిడి వంటి పెద్ద శస్త్ర చికిత్సలు సైతం పేదలకు పూర్తి ఉచితంగా అందుతాయి. పీపీపీలో ప్రైవేట్‌కు ఇచ్చేస్తున్న నేపథ్యంలో 30 శాతం పడకల్లో ఇన్ పేషంట్, రోగ నిర్ధారణ, మందు బిళ్లలకు ప్రజల నుంచి యాజమాన్యానికి డబ్బు వసూళ్లు చేసుకునే వీలు కలి్పంచారు. సగం మెడికల్ సీట్లను ప్రైవేట్ వైద్య కళాశాలల్లో మాదిరిగానే అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చారు. 2,450 మంది జీవితాలు తలకిందులు ⇒ ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల ద్వారా మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలు పెంపు, బోధనాస్పత్రి రూపంలో పేదలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువ చేసే లక్ష్యంతో వైఎస్ జగన్ ప్రభుత్వం 17 కొత్త కళాశాలలకు శ్రీకారం చుట్టింది. వీటిలో ఐదు కళాశాలలు 2023–24లోనే అందుబాటులోకి రావడంతో రాష్ట్రానికి 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా సమకూరాయి. ⇒ 2024–25 విద్యా సంవత్సరంలో మదనపల్లె, మార్కాపురం, ఆదోని, పులివెందుల కళాశాలలు ప్రారంభం అవ్వకుండా చంద్రబాబు ప్రభుత్వం అడ్డుçపడింది. పులివెందులలో 50 సీట్లతో తరగతుల ప్రారంభానికి ఎన్ఎంసీ అనుమతులు ఇవ్వగా, ప్రభుత్వమే కుట్ర పూరితంగా లేఖ రాసి అనుమతులు రద్దు చేయించింది. ⇒ గత ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా పాడేరులో 50 సీట్లతో తరగతులు ప్రారంభం అయ్యాయి. వాస్తవానికి గతేడాదే 750 ఎంబీబీఎస్ సీట్లు సమకూరాల్సి ఉండగా బాబు ప్రభుత్వ దిక్కుమాలిన చర్యలతో ఏకంగా 700 సీట్లు రాష్ట్ర విద్యార్థులు కోల్పోయారు. మరోవైపు ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈ విద్యా సంవత్సరం ప్రారంభం అవ్వాల్సిన పిడుగురాళ్ల, బాపట్ల, పార్వతీపురం, నర్సీపట్నం, పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం కళాశాలలు ఆగిపోయాయి. ఈ కళాశాలలు ఈ ఏడాది ప్రారంభమై ఉంటే 1,050 సీట్లు సమకూరేవి. ⇒ ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం కోసం కళాశాలలు రాకుండా బాబు ప్రభుత్వం అడ్డుపడటంతో 2024–25లో 700 సీట్లు, 2025–26లో 1,750 చొప్పున మొత్తంగా రెండేళ్లలో 2,450 సీట్లను మన విద్యార్థులు కోల్పోయారు. దీంతో డాక్టర్ కావాలని ఆశలు పెట్టుకున్న 2,450 మంది విద్యార్థుల జీవితాలు ఇప్పటికే తలకిందులు అయ్యాయి. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
-
ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు ఉత్తర్వులు జారీ
సాక్షి,విజయవాడ: రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో పది మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటుకు అప్పగించేందుకు ఆదేశించింది. ఇందులో భాగంగా తొలి విడతలో నాలుగు మెడికల్ కాలేజీలు పీపీపీ కింద ప్రైవేటుకు అప్పగిస్తున్నట్లు జారీ చేసిన ఉత్తర్వులు పేర్కొంది.ఫేజ్-1కింద పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. నాలుగు కాలేజీలను డెవలపర్‌కు అప్పగించేందుకు చర్యలు చేపట్టాలని సూచించింది. ఫేజ్-2లో పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం,నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం కాలేజీలు ప్రైవేటుకు అప్పగించేయాలని కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. -
మొత్తం దోచేద్దాం..! రూ.8,500 కోట్లకు బాబు మాస్టర్ స్కెచ్
-
లోకేష్ నువ్వొక విద్యాశాఖ మంత్రివా..? తండ్రి కొడుకులకు ఇచ్చిపడేసిన AISF లీడర్
-
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై అంజాద్ బాషా సంచలన వ్యాఖ్యలు
-
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక పెద్ద స్కాం: విడదల రజిని
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలను చంద్రబాబు చంపేశారంటూ మాజీ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. ఒక్కో మెడికల్ కాలేజీని తీసుకు రావటానికి ఎంత కష్టమో చంద్రబాబుకు తెలియదు.. ప్రతి జిల్లాలోనూ మెడికల్ కాలేజీ, ఆస్పత్రి ఉంటే ప్రజలకు మంచి వైద్యం అందుతుందని వైఎస్ జగన్ ఊహించారు. వైద్యం, టెస్టులు అన్నీ ఫ్రీగా అందించాలన్నదే వైఎస్ జగన్ ఆలోచన. చంద్రబాబు మెడికల్ కాలేజీలను అమ్మకానికి పెడితే ఇక పేదోడి పరిస్థితి ఏంటి?’’ అంటూ విడుదల రజిని ప్రశ్నించారు.శనివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులకు వైద్యవిద్యను దూరం చేశారని.. కోట్లు ఖర్చు చేసి ఆ కుటుంబాలు వైద్య విద్య చదవగలరా? అంటూ నిలదీశారు. మెడికల్ కాలేజీల కోసం సేకరించిన భూమిని కూడా ప్రైవేటుపరం అవుతోంది. దీని వెనుక పెద్ద స్కాం ఉంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాం. మేము అధికారంలోకి రాగానే మెడికల్ కాలేజీలను తిరిగి ప్రభుత్వ పరం చేస్తాం. ఈ స్కాం వెనుక ఎవరున్నారో విచారణ చేస్తాం’’ అని విడదల రజిని పేర్కొన్నారు.‘‘ఆరోగ్యశ్రీని దివంగత మహానేత వైఎస్సార్ తీసుకు వచ్చారు. కొన్ని లక్షలమందికి ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందించారు. అలాంటి సంజీవిని లాంటి ఆరోగ్యశ్రీని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. నెట్ వర్క్ ఆస్పత్రులకు రూ.4 వేల కోట్లకు పైగా బకాయిలు పడ్డారు. ప్రజల ప్రాణాలతో చంద్రబాబు ఆడుకుంటున్నారు. ఆరోగ్యశ్రీని కూడా ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీల చేతిలో పెట్టడం వెనుక స్కాం ఉంది. వైఎస్సార్, జగన్ పేరును ప్రజల్లో లేకుండా చేసే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలను 120 సంవత్సరాలు బతికిస్తానని చంద్రబాబు డబ్బా కొడుతున్నారు. ముందుగా తురకపాలెంలో జరుగుతున్న మరణాలను ఆపండి. మాటలు ఆపి ప్రజల ప్రాణాలను కాపాడాలి’’ అంటూ విడదల రజిని డిమాండ్ చేశారు. -
పేదల కోసం జగన్ మెడికల్ కాలేజీలను తీసుకువస్తే..!
-
మెడికల్ కాలేజీల్ని అమ్మేస్తా..! ప్రజల ప్రాణాలు తీసేస్తా..!
-
వైద్యకళాశాలల ప్రైవేటీకరణపై ఆగ్రహజ్వాలలు
సాక్షి, అమరావతి : ఒంటిపై తెల్లటి ఆప్రాన్.. మెడలో స్టెతస్కోప్.. డాక్టర్ అనే పిలుపు.. ఈ గౌరవం తమ పిల్లలకు దక్కాలని నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల తల్లిదండ్రులు కలలుగంటారు. ఇలాంటి ఎందరో తల్లిదండ్రులు, విద్యార్థుల తెల్లకోటు కలలకు చంద్రబాబు ఉరితాడు బిగించారు. తాను సీఎంగా ఉండగా ఎన్నడూ ప్రభుత్వరంగంలో వైద్యకళాశాలల ఏర్పాటుకు కృషిచేయని చంద్రబాబు గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేపట్టిన వైద్యకళాశాలలపై ఏకంగా పెద్ద కుట్రకు తెరతీశారు. పీపీపీ పేరిట ఈ కళాశాలలను అస్మదీయులకు పప్పుబెల్లాల్లా కట్టబెట్టటానికి సిద్ధమయ్యారు. ఇందుకోసం బడుగు, బలహీనవర్గాల ప్రజల ఆరోగ్యానికి భరోసా లేకుండా చేయడంతో పాటు, విద్యార్థుల బంగారు భవిష్యత్‌ను చిదిమేస్తున్నారని సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. పది ప్రభుత్వ వైద్యకళాశాలలను పీపీపీలో నిర్వహించేందుకు గురువారం కేబినేట్ ఆమోదం తెలిపిన క్రమంలో విమర్శలు హోరెత్తుతున్నాయి. ప్రజల సంపద దోపిడీ సంపద సృష్టించి సంక్షేమం అమలు చేస్తానని ఎన్నికలకు ముందు చంద్రబాబు ఉత్తర కుమారుడి ప్రగల్బాలు పలికారు. గద్దెనెక్కాక సంక్షేమానికి కత్తెరవేసి పేదలను నిలువునా దగాచేయడమే కాకుండా ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) ముసుగులో ఏకంగా ప్రజల సంపదనే దోపిడీచేసే కార్యక్రమాలకు తెరతీశారు. ప్రభుత్వం రూ.వేలకోట్లు ఖర్చు చేసి ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న మార్కాపురం, మదనపల్లె, ఆదోని, పులివెందుల కళాశాలలు, బోధనాస్పత్రులను ఏకంగా 60 ఏళ్లకు పైగా లీజుకు ఇవ్వడానికి బరితెగించారు. కళాశాలలను దక్కించుకున్న పెట్టుబడిదారులు వైద్యసేవలకు పేదల నుంచి ముక్కుపిండి డబ్బు వసూలు చేసుకునే హక్కు కల్పిస్తున్నారు. గత ప్రభుత్వం ఒక్కో కళాశాలను 50 ఎకరాలకుపైగా భూమిలో నిరి్మంచేందుకు శ్రీకారం చుట్టింది. ఇప్పుడు నిర్వహణ బాధ్యతలు దక్కించుకునేవారికి ఎకరం భూమిని కేవలం రూ.100కే ప్రభుత్వం లీజుకు ఇవ్వబోతోంది. ఈ లెక్కన పరిశీలిస్తే రూ.వందల కోట్ల విలువ చేసే భూములను పెట్టుబడిదారులకు ఎంత చవకగా అప్పగిస్తోందో అర్థమవుతుంది. డబ్బుంటేనే వైద్యం ప్రైవేట్ వ్యక్తుల అజమాయిషీలో నడిచే వైద్యకళాశాలలకు అనుబంధంగా ఉండే బోధనాస్పత్రుల్లో పేదలకు పూర్తిస్థాయిలో ఉచిత వైద్యసేవలు అందవు. ఈ కళాశాలలు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిస్తే ఓపీ, ఐపీ, రోగనిర్ధారణ, అవయవాల మార్పిడి వంటి పెద్ద శస్త్ర చికిత్సలు సైతం పేదలకు పూర్తి ఉచితంగా అందేవి. పీపీపీలో ప్రైవేట్‌కు ఇచ్చేస్తున్న నేపథ్యంలో ఇన్‌పేషంట్, రోగనిర్ధారణ, మందు బిళ్లలకు ప్రజల నుంచి యాజమాన్యం డబ్బు వసూలు చేసుకునే వీలు కల్పిoచారు. సగం మెడిసిన్ సీట్లను కూడా ప్రైవేట్ వైద్యకళాశాలల్లో మాదిరిగానే అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చారు. వాస్తవానికి ప్రతిపక్షంలో ఉండగా కొత్త వైద్యకళాశాలల్లో సెల్ఫ్‌ఫైనాన్స్ మెడిసిన్ సీట్ల విధానాన్నే రద్దుచేస్తామని ఎన్నికలకు ముందు టీడీపీ హామీలిచ్చింది. అధికారం చేపట్టిన వందరోజుల్లో సెల్ఫ్‌ఫైనాన్స్ సీట్ల జీవోలను రద్దుచేస్తామని ప్రస్తుత విద్యాశాఖ మంత్రి లోకేశ్ అప్పట్లో ప్రకటించారు. గద్దెనెక్కాక విద్యార్థులను వంచించారు. సెల్ఫ్‌ఫైనాన్స్ కోటా ఎత్తేయకపోగా.. ఏకంగా ప్రభుత్వ కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెడుతున్నారు. బాబు ప్రైవేటీకరణ మోడల్‌తో రాష్ట్రం గతేడాది 700 ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయింది. మరోవైపు ముందస్తు ప్రణాళిక ప్రకారం వచ్చే 2025–26 విద్యా సంవత్సరంలో పిడుగురాళ్ల, బాపట్ల, పార్వతీపురం, నర్సీపట్నం, పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం కళాశాలలు ప్రారంభమై వీటి ద్వారా 1,050 సీట్లు సమకూరాల్సి ఉంది. ఇప్పుడు ఈ కళాశాలల్ని ప్రైవేట్‌కు ఇచ్చేస్తున్నారు. దీంతో 2024–25లో 700 సీట్లు, 2025–26లో 1,750 సీట్లు.. మొత్తం రెండేళ్లలో 2,450 సీట్లను మన విద్యార్థులు కోల్పోతున్నారు. చంద్రబాబు విధానమే ప్రభుత్వ వైద్యకళాశాలలకు వ్యతిరేకం చంద్రబాబు విధానమే ప్రభుత్వ వైద్యకళాశాలలకు వ్యతిరేకం. ఆయన పాలనలో ప్రభుత్వ వైద్యకళాశాలలు ఏర్పాటు చేసిన దాఖలాలే లేవు. కార్పొరేట్ వైద్యకళాశాలలకే ఎప్పుడూ మొగ్గు చూపారు. ఎంబీబీఎస్, పీజీ ఫీజులు అమాంతం పెంచి ప్రైవేట్ కాలేజీలకు మేలుచేశారు. వైద్యవిద్య వ్యాపారాన్ని ప్రోత్సహించారు. ఆయన పాలనలో ప్రభుత్వ వైద్యకళాశాలలు ఏర్పాటవుతాయని ఆశించడం ప్రజల తప్పే అవుతుంది. – డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, ఏపీ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెనుకబడిన వర్గాలకు అన్యాయం చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న వైద్యకళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయం వెనుకబడిన బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు తీవ్రనష్టం చేకూరుస్తుంది. ఈ వర్గాల పిల్లలకు వైద్యవిద్యను దూరం చేయడంతోపాటు, ఉచిత వైద్య చికిత్సలను దూరం చేస్తుంది. కరోనా అనంతరం ప్రతి జిల్లాలో ఉచితంగా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వరంగంలో కొత్త వైద్యకళాశాలల ఏర్పాటుకు ప్రోత్సాహం ఇస్తోంది. అయితే రాష్ట్రంలో మాత్రం సీఎం చంద్రబాబు ప్రభుత్వరంగంలోని కళాశాలలను ప్రైవేట్‌కు అప్పగిస్తుండటం విడ్డూరంగా ఉంది. – శిఖరం నరహరి, ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ అధ్యక్షుడు -
చంద్రబాబు అనుకున్నంత పనీ చేశారు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు సర్కార్ నిర్ణయాన్ని ఆయన తప్పుపట్టారు. తాము అధికారంలోకి రాగానే మెడికల్ కాలేజీలను మళ్ళీ ప్రభుత్వ పరం చేస్తామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.‘‘చంద్రబాబు అనుకున్నంత పనీచేశారు. సంపద సృష్టిస్తానని ఎన్నికలకు ముందు కల్లబొల్లి కబుర్లు చెప్పి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆస్తులను పప్పుబెల్లాల మాదిరిగా మీవాళ్లకు కమీషన్ల కొరకు దోచిపెడుతున్నారు. మేం పెట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిన్న కేబినెట్లో స్కాంల కోసం ప్రైవేటు పరం చేయడం అవినీతిలో మీ బరితెగింపునకు నిదర్శనం. రాష్ట్రానికి శాశ్వతంగా చేస్తున్న అన్యాయం.’’ అంటూ వైఎస్ జగన్ దుయ్యబట్టారు.‘‘ప్రజల ఆస్తులను దోచుకున్న వ్యక్తిగా ఇదివరకే మీకు పేరు ఉంది. దీనితో చరిత్రహీనుడిగా మీరు నిలిచిపోతారు చంద్రబాబు. ప్రజలకోసం కాకుండా దోపిడీకోసం నిర్ణయాలు తీసుకోవడానికే మీరు మంత్రివర్గ సమావేశాలు పెట్టుకుంటున్నట్టుగా మీ తీరు ఉంది. 1923 నుంచి 2019 వరకూ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 11. పద్మావతి అటానమస్ కాలేజీతో కలుపుకుంటే మొత్తం 12. 2019కి ముందు 3 దఫాలుగా ఉన్న సీఎంగా ఉన్న మీరు, ప్రభుత్వ రంగంలో ఒక్క మెడికల్ కాలేజీ అయినా పెట్టారా?’’ అంటూ వైఎస్ జగన్ నిలదీశారు.‘‘కనీసం ఆ ఆలోచన చేశారా? మీరెలాగూ చేయలేదు. కనీసం మా 5 ఏళ్ల అతికొద్ది కాలంలో మేము పెట్టిన 17 కాలేజీల్లో 5 చోట్ల కాలేజీలు పూర్తై, క్లాసులు కూడా ప్రారంభం అయ్యాయి. ఎన్నికలు ముగిశాక మరోచోట అడ్మిషన్లు కూడా జరిగాయి. మిగిలిన పనులు మీరు బాధ్యతగా ముందుకు తీసుకెళ్లి ఉంటే, గత ఏడాది మరో 5, ఈ ఏడాది మరో 7 కాలేజీల్లో కూడా క్లాసులు స్టార్ట్ అయ్యేవి కదా?. మరి వాటిని ముందుకు తీసుకెళ్లకుండా ఈ రాష్ట్రానికి ఎందుకు ద్రోహం చేస్తున్నారు?. ప్రస్తుతం ఈ కాలేజీలు అక్కడ రావడంతో అమాంతంగా విలువ పెరిగిన ఆ కాలేజీల భవనాలు, భూములు కొట్టేయడానికి మీరు వేసిన ప్లానే కదా ఇది?. అవినీతికోసం ఇంతగా తెగిస్తారా?’’ అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.1.@ncbn గారూ అనుకున్నంత పనీచేశారు. సంపద సృష్టిస్తానని ఎన్నికలకు ముందు కల్లబొల్లి కబుర్లు చెప్పి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆస్తులను పప్పుబెల్లాల మాదిరిగా మీవాళ్లకు కమీషన్ల కొరకు దోచిపెడుతున్నారు. మేం పెట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిన్న కేబినెట్లో స్కాంలకోసం… pic.twitter.com/oBXj40vmOP— YS Jagan Mohan Reddy (@ysjagan) September 5, 2025‘‘మా ప్రభుత్వం వచ్చేనాటికి రాష్ట్రంలో ఉన్న ఎంబీబీఎస్ సీట్లు 2,360. ఈ కొత్త మెడికల్ కాలేజీల ద్వారా సీట్లు మరో 2,550 పెరిగి, 4,910కి చేరుకుంటాయి. మేం పూర్తిచేసి, క్లాసులు ప్రారంభించడంతో కొత్తగా సుమారు 800 సీట్లు భర్తీ కూడా అయ్యాయి. వైద్య విద్యలో ఇదొక అద్భతమైన కార్యక్రమం అయినప్పుడు దీన్ని దెబ్బతీయడం ఎంతవరకు సమంజసం?. రాష్ట్రంలో అభివృద్ధికి, అత్యాధునిక వైద్యానికి చిరునామాగా నిలిచిన కాలేజీల్లో సగం సీట్లు ఉచితంగానూ, మరో సగం సీట్లు ప్రైవేటు వాళ్లతో పోలిస్తే తక్కువ ఫీజుతోనూ విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి కదా?. కళ్లముందే ఫలితాలు కనిపిస్తున్నా, ఈ కాలేజీలను ఎందుకు నాశనం చేస్తున్నారు?’’ అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.‘‘ఇక్కడ సరిపడా మెడికల్ సీట్ల లేకపోవడంతో తమ పిల్లలను డాక్టర్లుగా చూడాలనుకుంటున్న తల్లిదండ్రులు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి, ఇక్కడ ప్రయివేటు మెడికల్ సీట్లు కొనే స్తోమత లేక, ఉన్న కొద్దిపాటి ఆస్తులు అమ్మి ఇతర రాష్ట్రాలకు, జార్జియా, ఉక్రెయిన్, రష్యా, పిలిప్ఫైన్స్ లాంటి ఇతర దేశాలకూ పంపిస్తున్న మాట వాస్తవం కాదా?. ఇలాంటి పరిస్థితుల్లో కూడా పులివెందుల కాలేజీకి NMC మెడికల్ సీట్లు ఇస్తే, వద్దంటూ మీరు లేఖ రాసినప్పుడే మీ కుట్ర ఏంటో బయటపడింది చంద్రబాబూ?. పేదలకు ఆ జిల్లాలోనే ఉచితంగా సూపర్ స్పెషాల్టీ సేవలు అందాలన్న గొప్ప ఉద్దేశాన్ని నిలువునా దెబ్బకొడుతున్నారు కదా చంద్రబాబూ?..ప్రతి జిల్లాలోనూ వైద్య ఆరోగ్య రంగంలో, ప్రైవేటు ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వరంగం కూడా ఉండాలని, అప్పుడే, అక్కడే ఈ కొత్త కాలేజీల వల్ల అందుబాటులోకి వచ్చే ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పీజీ స్టూడెంట్లు, వివిధ రంగాల్లో ఫ్యాకల్టీలు, సూపర్ స్పెషాల్టీ సేవల కారణంగా మంచి మెడికల్ విద్యతోపాటు, ప్రజలకు కూడా వైద్యం ఉచితంగా అందుబాటులో ఉంటుందని, అంతేకాకుండా ప్రభుత్వ రంగం, ప్రైవేటు ఆస్పత్రులు, ఈ రెండూ సమతుల్యతతో, స్వయం సమృద్ధితో పనిచేస్తాయన్న కనీస జ్ఞానం లేకుండా, లంచాలకోసం, కమీషన్ల కోసం కక్కుర్తితో ప్రజల ఆస్తులను ఇలా మీ వాళ్లకు పందేరం చేస్తారా?ఈ రాష్ట్రం మీ జాగీరు అనుకుంటున్నారా? ఎప్పటికీ మీరే కుర్చీలో ఉంటారని కలలు కంటున్నారా?. రాష్ట్ర ప్రజలకు సంజీవని లాంటి ఆరోగ్యశ్రీని కూడా మీరు బతకనివ్వలేదు కదా చంద్రబాబూ?. ఈ 15 నెలల కాలంలో నెట్వర్క్ ఆస్పత్రులకు ఇవ్వాల్సిన, దాదాపు రూ. 300 కోట్లు, అంటే 15 నెలల్లో రూ.4,500 కోట్లకు గాను, కేవలం రూ.600 కోట్లు మాత్రమే ఇచ్చి, దాదాపు రూ.4,000 కోట్లు ఎగ్గొట్టి, పేదవాడి ఆరోగ్య భద్రతను భ్రష్టు పట్టించారు. వైద్యం ఖర్చు రూ.వేయి దాటితే, 3,257 ప్రొసీజర్లకు ఉచిత వైద్యం అందించేలా, రూ.25 లక్షల వరకూ ప్రభుత్వమే ఉచితంగా భరించేలా ప్రజలకోసం తీసుకు వచ్చిన గొప్ప ఆరోగ్యశ్రీని నాశనం చేశారు...చివరకు ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తికి ఆ విశ్రాంతి సమయంలో నెలకు రూ.5వేలు అందించే “ఆరోగ్య ఆసరా’’ను కూడా సమాధిచేశారు. దీనికి సంవత్సరానికి ఇవ్వాల్సిన రూ.450 కోట్లు, ఈ 15 నెలలకుగానూ దాదాపుగా రూ.600 కోట్లు పూర్తిగా ఎగ్గొట్టేశారు. ఆరోగ్యశ్రీ బాధ్యత నుంచి మీరు తప్పుకుని ప్రైవేటుకు ఇవ్వడం, అదో ఘనకార్యంగా ప్రచారం చేయించుకోవడం సిగ్గుగా లేదా?. మా ప్రభుత్వ హయాంలోనే సంవత్సరాదాయం రూ.5లక్షల లోపు ఉన్నవారందరికీ వర్తింపు చేయడం ద్వారా మొత్తంగా రాష్ట్రంలో 95% కుటుంబాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. ఇది వాస్తవం కాదా?...ఇక మీరు కొత్తగా చేసేది ఏముంది? మీ ఎల్లో మీడియాలో మోసం చేయడానికి డబ్బా కొట్టుకోవడం ఏంటి?. ఒక్కోచోట, ఒక్కోమాదిరిగా మోసం చేసేందుకు ప్రచారం చేస్తున్నారు. అసలు మీ ఇన్సూరెన్స్ పథకం పరిధి రూ.2.5 లక్షలకేనా లేక రూ.25 లక్షలకా?. అసలు ఈ 3257 ప్రొసీజర్లు అంటే, ఆపరేషన్ల ఖర్చు రూ.25 లక్షలదాకా ఉచితం అంటే అప్పుడు ప్రభుత్వం కట్టాల్సిన ప్రీమియం ఏ రూ.5వేల కోట్లో దాటుతుంది. ఇక్కడ ఆరోగ్యశ్రీ కింద రూ.3,600 కోట్లు ఖర్చు చేయడానికే మనసు లేనివారు, ఇక రూ.5వేల కోట్లు ప్రీమియంగా ఖర్చు చేస్తారా?. ఇది నమ్మదగ్గ విషయమేనా? అంటే దీని అర్థం మళ్లీ మోసం...ఒక బాధ్యతగా ప్రభుత్వం చేసే పనికీ, ప్రైవేటు కంపెనీలు చేసే పనికీ తేడా ఉంటుంది కదా చంద్రబాబూ. దేశంలో అనేక ఆరోగ్య బీమా సంస్థల నుంచి క్లెయిముల పరిష్కారంలో వస్తున్న ఇబ్బందులు తెలియనివా?. లాభాలు లేకుండా వారు ఇన్సూరెన్స్ వ్యాపారం చేస్తారా?. కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చినప్పుడు అన్ని ఆరోగ్య బీమా కంపెనీలు, ప్రైవేటు ఆస్పత్రులు చేతులెత్తేస్తే, రాష్ట్ర ప్రభుత్వమే ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స అందించింది. ఇప్పుడు అలాంటి వెసులుబాటు ఉంటుందా?. చికిత్సల జాబితాలో లేకపోయినా, ఏ కొత్త వ్యాధి అయినా ప్రభుత్వం తన విచక్షణాధికారాన్ని వినియోగించుకుని వెంటనే ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు అందించే అవకాశాన్ని ప్రజలు ఇప్పుడు కోల్పోతారు కదా?..కేవలం ప్రీమియం పేరిట మీ మనుషులకు చెందిన కంపెనీలకు దోచిపెట్టడానికి మీ ఈ నిర్ణయాలంటున్న ఆరోపణలకు, మీ సమాధానం ఏంటి? ఇన్ని పాపాలు చేస్తున్న మిమ్మల్ని ప్రజలు క్షమించరు చంద్రబాబూ. ఇప్పటికే మీ పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. మేం అధికారంలోకి రాగానే ఈ నిర్ణయాలను రద్దుచేస్తాం. ఈ కాలేజీలను తిరిగి ప్రభుత్వ రంగంలోకి తెచ్చుకుంటాం’’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. -
‘మెడికల్ కాలేజీలు ప్రయివేటు పరం చేయడం దుర్మార్గం’
తాడేపల్లి : ఏపీలో పలు మెడికల్ కాలేజీలను ప్రయివేటు పరం చేస్తూ చంద్రబాబు కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. మెడికల్ కాలేజీలను ప్రయివేటు పరం చేసి తన తాబేదారులుకు దోచి పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మెడికల్ కాలేజీ లను ప్రయివేటు పరం చేయటం దుర్మార్గమైన చర్య అంటూ విమర్శించారు.తాను అవినీతి చేసినట్లు ఎల్లో మీడియా వార్తలు రాసిందని, ఆంబోతులకు ఆవులను సరఫరా చేసే బ్యాచ్ బీఆర్ నాయుడు, రాధాకృష్ణ, ఈనాడు కిరణ్ అని ఆరోపించారు. ఈరోజు(శుక్రవారం, సెప్టెంబర్ 5వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన అంబటి.. తన మీద విజిలెన్స్ అంటూ నానా హడావుడి చేస్తున్నారని, ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదన్నారు అంబటి. ఒకవేళ అరెస్టు చేసినా భయపడేది లేదన్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా విచారణ చేస్తున్నారని, తనపై మరో కేసు పెట్టడానికి రెడీ చేస్తున్నారన్నారు. ఏదైనా న్యాయస్థానాల్లోనే తేల్చుకుంటానన్నారు. లోకేష్ బెదిరింపులకు భయపడే మనిషిని కాదని, యుద్ధానికి తాను సిద్ధమని అంబటి స్పష్టం చేశారు. తన కంఠం పెద్దదరి అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారని, కిరణ్, బీఆర్ నాయుడు, రాధాకృష్ణ అవినీతి తిమింగళాలని విమర్శించారు. -
Vidadala Rajini: మెడికల్ కాలేజీలు ప్రైవేట్ చేస్తే.. మేం వచ్చాక వెనక్కి లాగుతాం
-
మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌పరం చేసే దౌర్భాపు చరిత్ర చంద్రబాబుది
-
మెడికల్ కాలేజీలు ప్రైవేట్‌కు అప్పగిస్తే పేదలు ఎలా చదుకోవాలి
-
‘ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌పరం చేసే నీచ చరిత్ర చంద్రబాబుది’
సాక్షి,శ్రీకాకుళం: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసేందుకు సిద్ధమైన కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలో సీదిరి అప్పలరాజు మీడియాతో మాట్లాడారు.మెడికల్ కాలేజీను ప్రైవేట్‌పరం చేసే దౌర్భాగ్యపు చరిత్ర చంద్రబాబుది. చంద్రబాబుకు తోడు ఎల్లోమీడియా తప్పుడు కథనాలు రాస్తున్నాయి. ప్రజారోగ్యాన్ని చంద్రబాబు అమ్మకానికి పెట్టారు. వైఎస్ జగన్ తీసుకొచ్చిన సంస్కరణలను చంద్రబాబు అమ్మేస్తున్నారు. మెడికల్ కాలేజీను చంద్రబాబు ప్రైవేట్‌పరం చేస్తున్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసే దరిద్రపు చరిత్ర చంద్రబాబుది. ప్రభుత్వ రంగ సంస్థల్ని మీ చేతిలో ఉంచుకుంటున్నారా? లేదంటే అమ్ముకుంటున్నారో చెప్పండి’అని ప్రశ్నించారు. -
వాళ్ళు ప్రమాణ స్వీకారం దగ్గర నుండి.. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణపై పేర్ని కిట్టు
-
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై గోపిరెడ్డి సంచలన విషయాలు
-
జగన్ వస్తారు.. వాటిని వెనక్కి తీసుకుంటాం.. మెడికల్ కాలేజీలు కొనేవారికి వార్నింగ్
-
Gopireddy Srinivasa Reddy: సంపద సృష్టిస్తానని అమ్మేస్తావా.. నువ్వేం ముఖ్యమంత్రివి..!
-
మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్.. కూటమిలో 97 శాతం క్రిమినల్స్
-
బాబు బినామీల కోసం అమ్మకానికి మెడికల్ కాలేజీలు
-
బాబు మరో కుట్ర.. అమ్మకానికి మెడికల్ కాలేజీలు
-
వైద్య కాలేజీలు ఇక ప్రైవేట్ చేతుల్లోకే !
-
ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ పథకానికి తూట్లు పొడుస్తూ 10 కొత్త మెడికల్ కాలేజీలు ప్రైవేట్‌పరం... రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం
-
ఆరోగ్యశ్రీకి తూట్లు.. 10 కొత్త మెడికల్ కాలేజీలు ‘పీపీపీ’
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆరోగ్యశ్రీ పథకానికి తూట్లు పొడుస్తూ.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తూ సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. ఒకవైపు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రభుత్వ ఆధ్వర్యం నుంచి తప్పించి ఇన్సూరెన్స్ కంపెనీల పరిధిలోకి తెస్తూ నిర్ణయం తీసుకోగా, మరోవైపు 2019–24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన 17 కొత్త మెడికల్ కాలేజీల్లో పది వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తూ మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది.అనధికార భవనాల రెగ్యులరైజేషన్, తాగునీటి ప్రాజెక్టులు, పథకాల నిర్వహణపై కొత్త విధివిధానాలకు ఆమోదం తెలిపింది. సాగునీటి వినియోగదారుల సంఘాలకు నామినేషన్‌పై పనులను రూ.10 లక్షల వరకు పెంచుతూ మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గం నిర్ణయాలను సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కె.పార్థసారథి మీడియాకు వెల్లడించారు. ⇒ ఆయుష్మాన్ భారత్–పీఎంజెఏవై–ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద హైబ్రీడ్ విధానంలో యూనివర్సల్ హెల్త్ పాలసీ రూపకల్పనకు బీమా కంపెనీల నుంచి టెండర్లు ఆహ్వానించేందుకు ఆర్ఎఫ్పీకి ఆమోదం. ఏడాదికి కుటుంబానికి రూ.2.5 లక్షల వరకు వైద్య చికిత్సలు ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారానే అందిస్తారు. రూ.2.5 లక్షలకుపైబడి రూ.25 లక్షల వరకు వైద్య చికిత్సలను ఇన్సూరెన్స్ కంపెనీలు క్లెయిమ్స్ చేస్తే ఆ మొత్తాన్ని ఆ కంపెనీలకు ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ రీయింబర్స్మెంట్ చేస్తుంది.ఎంప్లాయి హెల్త్ స్కీమ్‌దారులకు మినహా రాష్ట్రంలో మిగతా అన్ని కుటుంబాలకు ఇది వర్తిస్తుంది. పేషెంట్ చేరిన ఆరు గంటల్లోగా ఆమోదం లభించడంతోపాటు క్లెయిమ్‌లను 15 రోజుల్లోగా ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించాలి. పథకం ద్వారా 3,257 రకాల వైద్య సేవలు అందజేస్తారు. అమలు తీరును పర్యవేక్షించేందుకు ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో కంట్రోల్ రూమును ఏర్పాటు చేస్తారు. ⇒ పది ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో రెండు దశల్లో చేపట్టేందుకు రూపొందించిన ఆర్ఎఫ్పీకి ఆమోదం. రాయితీ ఒప్పందాలు ఖరారు చేసిన వెంటనే ప్రీ–బిడ్ సంప్రదింపులు ఆధారంగా ఆర్ఎఫ్పీలో మార్పులు చేయడానికి టెండర్ కమిటీని అనుమతించేందుకు ఆమోదం. ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురంలలో 10 వైద్య కళాశాలలను పీపీపీలో చేపడతారు.ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల మెడికల్ కాలేజీలను తొలి దశలో చేపడతారు. మిగతా ఆరు మెడికల్ కాలేజీలను రెండో దశలో చేపడతారు. 2027–28 విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు జరిగే విధంగా ఈ కళాశాలల నిర్మాణాలను పూర్తి చేస్తారు. ⇒ పట్టణాలు, నగరాల్లో 31–08–2025 నాటికి ఉన్న అనధికార భవన నిర్మాణాలను రెగ్యులరైజ్ చేసేందుకు ఆమోదం. ఇక నుంచి అనధికార భవనాలను ప్రారంభ దశలోనే కూల్చివేయాలని నిర్ణయం. ఎత్తయిన నివాస భవనాల గరిష్ట ఎత్తు పరిమితిని 18 మీటర్ల నుంచి 24 మీటర్లకు పెంచేందుకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు ఆమోదం.⇒ కృష్ణా నది వివిధ రీచ్‌లు, ప్రకాశం బ్యారేజీ ముందు నుంచి ఇసుక తీసుకోవడానికి ఎన్జీటీ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఇసుక అనే పదానికి బదులు డీసిల్టింగ్ అనే పదం చేర్చేందుకు ఆమోదం. ⇒ సాగునీటి వినియోగ సంఘాలకు గుర్రపుడెక్క, కలుపు తొలగింపు పనులను రూ.5 లక్షల వరకు నామినేషన్‌పై ఇస్తుండగా, ఇప్పుడు రూ.10 లక్షల వరకు నామినేషన్‌పై ఇచ్చేందుకు ఆమోదం.⇒ రాష్ట్రంలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను ప్రోత్సహించేందుకు వీలుగా 2016 చట్ట సవరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం. ⇒ మూడో పార్టీ ఆక్రమణల్లో ఉన్న 347 వ్యక్తులకు సంబంధించిన అదనపు భూముల క్రమబద్ధీకరణ, కేటాయింపులకు ఆమోదం. ⇒ దీపం–2 పథకం కింద అర్హత కలిగిన 5 కిలోల ఎల్పీజీ సిలిండర్లను 14.2 కిలోల దేశీయ ఎల్పీజీ సిలిండర్లుగా మార్చేందుకు ఆమోదం. -
‘ఆరోగ్యం’ హరీ!
ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కొత్త కాలేజీల్లో మెరుగైన నిర్వహణ కోసం గత ప్రభుత్వంలో సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు నాడు నారా లోకేశ్ తీవ్ర ఆరోపణలు చేశారు. వారికి వంత పాడే ‘ఈనాడు’.. వైద్య విద్యనూ అమ్మేశారు.. వైద్య విద్య వ్యాపారానికి నయా పెత్తందారు జగన్.. అంటూ కట్టుకథలు రాసుకొచ్చింది. అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లో సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. తీరా గద్దెనెక్కాక ఆ హామీని తుంగలో తొక్కి ఇప్పుడు ఏకంగా వైద్య కళాశాలలనే అమ్మకానికి పెట్టేశారు!!సాక్షి, అమరావతి: దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న 10 కొత్త వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయానికి ఏపీ కేబినెట్ ఇప్పుడు వేదికైంది! ఏ ప్రభుత్వమైనా పోరాడి మరీ మెడికల్ కాలేజీలను సాధించుకుంటుంది. అలాంటిది అన్ని హంగులతో సిద్ధమైన వాటిని చంద్రబాబు సర్కారు ప్రైవేట్‌పరం చేస్తుండటంపై సర్వత్రా తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. మాజీ సీఎం వైఎస్ జగన్ కృషితో సాకారమైన మెడికల్ కాలేజీలను కక్షపూరితంగా అడ్డుకుని పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తుండటాన్ని తప్పుబడుతున్నారు. కూటమి సర్కారు అనాలోచిత చర్యలతో మన రాష్ట్రం మెడికల్ సీట్లను కోల్పోవడంతోపాటు నాణ్యమైన వైద్యం పేదలకు దూరమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉంటే టీచింగ్ ఆస్పత్రి ద్వారా ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, పీజీ విద్యార్థుల సేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రిలా నిర్వహించడం ద్వారా ప్రైవేట్ ఆస్పత్రుల్లో పోటీతత్వం పెరిగి రేట్లు తగ్గుతాయి. నాణ్యమైన వైద్యం దొరుకుతుంది. ప్రజలకు వైద్యం భారం కాకుండా ఉంటుంది. ఇప్పుడు మెడికల్ సీట్లు కోల్పోవడమంటే పేదలకు నాణ్యమైన వైద్యం దూరమైనట్లే! ఇక ప్రజల ఆరోగ్యంతోనూ చంద్రబాబు సర్కారు ఆటలాడుతోంది. ఇప్పటికే ఆరోగ్యశ్రీని భ్రష్టు పట్టించిన కూటమి ప్రభుత్వం నెలకు రూ.300 కోట్లు చొప్పున 15 నెలల్లో నెట్వర్క్ ఆస్పత్రులకు దాదాపు రూ.4,500 కోట్లు బిల్లులు బకాయిలు పెట్టడం, ఆరోగ్య ఆసరాను ఎగరగొట్టడంతో వైద్య సేవలు నిలిచిపోతున్న పరిస్థితి నెలకొంది. బిల్లులు రాకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రులు రోగులను చేర్చుకోవడం లేదు. ఇక 108, 104 వాహనాల పరిస్థితి దారుణంగా ఉంది. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించి ప్రజారోగ్యానికి భరోసా కల్పించగా కూటమి సర్కారు మోసపూరితంగా వ్యవహరిస్తూ తిరోగమన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటు కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌పరం చేస్తూ.. అటు ఆరోగ్యశ్రీని బీమా కంపెనీ చేతుల్లో పెట్టి వైద్య రంగాన్ని స్కామ్‌ల మయంగా మారుస్తోంది. సంపద సృష్టి అంటే.. స్కామ్‌లు చేయడం.. ప్రభుత్వ ఆస్తులను అప్పనంగా ప్రైవేట్‌కి దోచిపెట్టి కమీషన్ల రూపంలో డబ్బులు వసూలు చేసుకోవటమా? అని వైద్య రంగ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 1992 నేదురుమల్లి జనార్దనరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలకు అనుమతించడంలో అవకతవకలు జరిగినట్లు వెలుగులోకి రావడంతో న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో పదవికి రాజీనామా చేయటాన్ని గుర్తు చేస్తున్నారు. అలాంటిది ఇప్పుడు ప్రభుత్వ రంగంలో అన్ని సదుపాయాలతో సిద్ధంగా ఉన్న వాటిని ప్రైవేట్ చేతుల్లో పెడుతూ స్కామ్‌లకు తెర తీస్తున్నారని పేర్కొంటున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో వైద్య కళాశాలలు, బోధనాస్పత్రులు అన్నీ ప్రభుత్వ పరిధిలో నడిచేలా ఏకంగా 17 కొత్త మెడికల్ కళాశాలల నిర్మాణాన్ని చేపట్టారు. అదే ప్రణాళిక ప్రకారం అవన్నీ అందుబాటులోకి వస్తే అన్ని జిల్లాల్లో చేతి నుంచి రూపాయి ఖర్చు చేసే పని లేకుండా పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువ అయ్యేవి. అలాంటిది పీపీపీ పేరిట చంద్రబాబు సర్కారు 10 కళాశాలలను ప్రైవేటుకు కట్టబెడుతోంది. దీంతో ఆయా కళాశాలలపై 63 ఏళ్ల పాటు ప్రైవేటు వ్యక్తులకు హక్కులు ఉంటాయి. వారి ఆధీనంలోనే బోధనాస్పత్రులు నడుస్తాయి. ఆ ఆసుపత్రుల్లో పూర్తి స్థాయిలో వైద్య సేవలు, మందులు, రోగ నిర్ధారణ పరీక్షలు ఉచితం కాదు. డబ్బులు చెల్లించి ప్రజలు సేవలు పొందాల్సి ఉంటుంది. ఓవైపు ఆరోగ్యశ్రీ సేవలు బీమా రూపంలో ఎండమావిగా మారుస్తున్నారు. మరోవైపు వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు అప్పగిస్తున్నారు. దీంతో దురదృష్టవశాత్తూ జబ్బుల బారిన పడితే పేదల పరిస్థితి దయనీయంగా మారే ప్రమాదం నెలకొంది. పేదలకు ఉచిత వైద్యం కలే! ప్రభుత్వ నూతన వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెట్టడంతో పాటు ఆరోగ్యశ్రీలో బీమా విధానం అమలుకు పచ్చజెండా ఊపడం ద్వారా 1.40 కోట్లకుపైగా కుటుంబాలకు ఉచిత వైద్యాన్ని అందిస్తూ భరోసా కల్పించిన దేశంలోనే అత్యుత్తమ పథకానికి కూటమి సర్కారు ఉరి బిగించింది. బీమా కంపెనీలు చెల్లించిన ప్రీమియంలో వీలైనంత ఎక్కువ లాభం పొందేలా లెక్కలేనన్ని కొర్రీలు వేసి చికిత్సలకు అనుమతులు, క్లెయిమ్‌లను తిరస్కరిస్తుంటాయి. ఇన్సూరెన్స్ బ్రోకర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐబీఏఐ) ప్రకారం దేశంలో 20 ప్రముఖ ఆరోగ్య బీమా కంపెనీలు నమోదైన క్లెయిమ్‌ల మొత్తంలో 55 నుంచి 80 శాతం మేర మాత్రమే చెల్లిస్తున్నాయి. దీన్నిబట్టే ఆరోగ్య శ్రీలో బీమా విధానం ప్రవేశపెడితే ఏం జరుగుతుందో ఊహించవచ్చు. ఇలాంటి వ్యవస్థలను ప్రభుత్వ ఆరోగ్య రంగంలోకి చొప్పిస్తే పేదలకు ఉచిత వైద్యం కలేనని నిపుణులు పేర్కొంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం రూ.2.5 లక్షల వరకు చికిత్సలను మాత్రమే బీమా రూపంలో అందించనుంది. అంతకంటే ఎక్కువ ఖర్చయితే ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుందని చెబుతున్నారు. అంటే బీమా కంపెనీ దయాదాక్షిణ్యాల ఆధారంగానే ప్రజలకు చికిత్సలు అందుతాయన్నమాట. ‘ఆసరా’ ఎగరగొట్టి... ఆరోగ్యశ్రీ అంటేనే ప్రజలకు గుర్తుకొచ్చేది మాజీ సీఎంలు వైఎస్సార్, వైఎస్ జగన్. వారి ముద్రను చెరిపేయాలనే కక్షతో ప్రజారోగ్యాన్ని చంద్రబాబు బలి పీఠం ఎక్కిస్తుండటం నివ్వెరపరుస్తోంది. గత ఏడాది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసే కుట్రలకు దిగింది. నెట్వర్క్ ఆస్పత్రులకు బకాయిలు చెల్లించకుండా వాటి యాజమాన్యాలు సేవలు నిలిపేసి సమ్మెకు దిగేలా చేసింది. శస్త్ర చికిత్సల అనంతరం విశ్రాంతి సమయంలో రోగులకు ఇచ్చే ‘వైఎస్సార్ ఆరోగ్య ఆసరా’ సాయాన్ని నిలిపేశారు. బీ‘మాయ’ వద్దంటూ... దేశంలో బీమా విధానం అమలు చేస్తున్న రాష్ట్రాలు సైతం కంపెనీల సేవలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. వాటి పనితీరుపై విసుగు చెంది ట్రస్ట్ విధానంలోకి మారుతున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం బీమా విధానం నుంచి ఇప్పటికే బయటకు వచ్చేసింది. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా మహాత్మా జ్యోతిబా పూలే జన్ ఆరోగ్య యోజన (ఎంజేపీజేఏవై)ను తొలుత అమలు చేసింది. దీనికింద 95.47 లక్షల కుటుంబాలకు రూ.లక్షన్నర బీమా కవరేజీ ఉండేది. కానీ, ఆస్పత్రులకు క్లెయిమ్‌ల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం, వైద్య సేవల్లోనూ ప్రజల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు, పలుసార్లు మందలించినా మార్పు రాకపోవడంతో రూ.3 వేల కోట్ల కాంట్రాక్టును రద్దు చేసింది. అనంతరం నేరుగా ప్రభుత్వమే స్టేట్ హెల్త్ అష్యూరెన్స్ సొసైటీ ఆధ్వర్యంలో అమలు చేస్తోంది. మహారాష్ట్రలాగే బీమా నుంచి ట్రస్ట్విధానంలోకి మారాలని రాజస్థాన్ ప్రభుత్వం యోచిస్తోంది. చికిత్సల్లో జాప్యం.. ప్రజల ప్రయోజనాలను కాలరాస్తూ బీమా వైపే చంద్రబాబు ప్రభుత్వం మొగ్గు చూపింది. ప్రస్తుతం హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ఆరోగ్యశ్రీ అమలు చేస్తుండగా కొత్త విధానంలో రాష్ట్రంలోని జిల్లాలను రెండు భాగాలుగా చేసి రెండు క్లస్టర్లుగా కుటుంబాలు/లబ్ధిదారుల వారీగా ప్రీమియం చెల్లించనుంది. అంటే ప్రభుత్వ నిధులను మళ్లీ మధ్యవర్తి చేతిలో పెడుతున్నారు. ఇవన్నీ చెల్లించిన ప్రీమియంలో ఎక్కువ మిగుల్చుకుని తక్కువ ఖర్చు చేయడమే పరమావధిగా కార్యకలాపాలు నిర్వహిస్తాయి. ఆస్పత్రుల నుంచి చికిత్సల అభ్యర్థనలను రకరకాల కారణాలు చూపి తిరస్కరిస్తాయి. రోగులకు వైద్యం అందడంలో తీవ్ర జాప్యం నెలకొంటుంది. ప్రస్తుత విధానంలో ట్రస్ట్ పర్యవేక్షణలో ఉన్న నెట్వర్క్ ఆస్పత్రులపై పూర్తి అజమాయిషీ ప్రభుత్వానికి ఉంటుంది. జిల్లా స్థాయిలో కలెక్టర్, రాష్ట్ర స్థాయిలో ట్రస్ట్ సీఈవోకు ఆస్పత్రులపై వచ్చిన ఫిర్యాదులను విచారించి చర్యలు తీసుకునే అధికారం ఉంది. బీమా పద్ధతిలో నెట్వర్క్ ఆస్పత్రులపై ప్రభుత్వానికి అజమాయిషీ ఉండదు. బీమా కంపెనీ చెప్పుచేతల్లోకి ఆస్పత్రులు వెళతాయి. ఆ కంపెనీ నియమ నిబంధనల ప్రకారమే వైద్యం అందిస్తాయి. ఆరోగ్యశ్రీతో వైఎస్ జగన్ ఆపన్నహస్తంపేద, మధ్య తరగతి ప్రజలు గుండె, మెదడు, కాలేయ, కేన్సర్ వంటి ఎంత పెద్ద జబ్బు బారినపడినా చేతి నుంచి చిల్లిగవ్వ ఖర్చు పెట్టనివ్వకుండా కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచిత చికిత్సలు పొందేలా వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. చంద్రబాబు పాలనలో నిర్వీర్యమైన ఈ పథకం బలోపేతానికి విప్లవాత్మక సంస్కరణలు చేపట్టింది. 2019 ఎన్నికల హామీ మేరకు అధికారంలోకి రాగానే రూ.5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలను పథకం పరిధిలోకి తెచ్చారు వైఎస్ జగన్. 2019కి ముందు వెయ్యి లోపు మాత్రమే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు ఉండగా ఏకంగా 2,371 ఆస్పత్రులకు విస్తరించారు. చికిత్స వ్యయ పరిమితిని రూ.5 లక్షలు నుంచి దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.25 లక్షలకు పెంచారు. ⇒ టీడీపీ హయాంలో కేవలం 1,059 ప్రొసీజర్లతో అస్తవ్యస్థంగా ఉన్న ఆరోగ్యశ్రీకి ప్రాణం పోసి ప్రొసీజర్లను వైఎస్ జగన్ ఏకంగా 3,257కి పెంచారు. ఐదేళ్లలో 45.10 లక్షల మందికి ఉచితంగా చికిత్సలు అందించారు. రూ.13 వేల కోట్లకు పైగా వెచ్చించారు. శస్త్రచికిత్సలు జరిగిన 24.59 లక్షల మందికి కోలుకునే సమయంలో జీవన భృతికి ఇబ్బంది లేకుండా వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద రూ.1,465 కోట్లకు పైగా సాయం చేశారు. ఇక దేశంలోనే తొలిసారిగా కోవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చి మహమ్మారి విజృంభణ వేళ ప్రజలకు కొండంత భరోసా కల్పించారు. వైఎస్ జగన్ హయాంలో రూ.25 లక్షల వరకూ చికిత్సలను ప్రజలు పూర్తి ఉచితంగా పొందే వీలు కల్పించారు. ఆరోగ్యశ్రీ ద్వారా వైఎస్ జగన్ రాష్ట్రంలోని మధ్య తరగతి కుటుంబాలకు సైతం ఆరోగ్య భద్రత కల్పించారని నీతి ఆయోగ్ సైతం ప్రశంసించింది.వైద్య విద్య ‘ప్రైవేట్’ పరంవాస్తవానికి గత విద్యా సంవత్సరమే పులివెందుల, మార్కాపురం, మదనపల్లె, ఆదోని మెడికల్ కళాశాలలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ప్రైవేట్‌కు కట్టబెట్టడం కోసం కుట్రపూరితంగా పులివెందులకు మంజూరైన అనుమతులను చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేయించింది. గతేడాది నిలిచిన నాలుగు కళాశాలలకు అనుమతులు ఈ దఫా అయినా వస్తాయని, ఒక్కో చోట 150 చొప్పున ఎంబీబీఎస్ సీట్లు సమకూరతాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆశించారు. విద్యార్థుల భవిష్యత్, పేదల ఆరోగ్యం ఏమైపోతే మాకేంటన్నట్టుగా ‘పీపీపీ విధానంపై ముందుకే వెళ్లాలి’ అని నిర్ణయించిన ప్రభుత్వం కళాశాలలకు అనుమతుల దరఖాస్తు సమర్పించనేలేదు. గత విద్యా సంవత్సరం ఐదు కళాశాలలు ప్రారంభించాల్సి ఉండగా, కూటమి ప్రభుత్వం కక్షపూరిత విధానాలతో కేవలం 50 సీట్లతో పాడేరు వైద్య కళాశాలకు మాత్రమే అనుమతులు దక్కాయి. దీంతో 700 ఎంబీబీఎస్ సీట్లు గతేడాది మన విద్యార్థులు నష్టపోయారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం 2025–26 విద్యా సంవత్సరంలో పిడుగురాళ్ల, బాపట్ల, పార్వతీపురం, నర్సీపట్నం, పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం కళాశాలలు ప్రారంభమై వీటి ద్వారా 1,050 సీట్లు సమకూరాల్సి ఉంది. అయితే, వైద్య కళాశాలల నిర్మాణాలన్నింటినీ గద్దెనెక్కిన రోజు నుంచే చంద్రబాబు నిలిపివేయించారు. గతేడాది ప్రారంభానికి నోచుకోని 4 కళాశాలలతోపాటు, ఈ ఏడాది ప్రారంభించాల్సిన ఏడింటిలో ఏ ఒక్క కళాశాలకు అనుమతుల కోసం ఎన్ఎంసీకి దరఖాస్తు చేయలేదు. దీంతో 2024–25లో 700 సీట్లు, 2025–26లో 1,750 చొప్పున మొత్తంగా రెండేళ్లలో 2,450 సీట్లను మన విద్యార్థులు కోల్పోవాల్సి వచ్చిది. -
ఏపీలో మెడికల్ కాలేజీల అమ్మకానికి గ్రీన్‌సిగ్నల్!
విజయవాడ: ఏపీలో మెడికల్ కాలేజీలు అమ్మకానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది చంద్రబాబు కేబినెట్. రాష్ట్రంలోని పలు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలని కేబినెట్ నిర్ణయించింది. 10 మెడికల్ కాలేజీలను పీపీపీలో ప్రైవేటుపరం చేయాలని నిర్ణయించింది. గత వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన మెడికల్ కాలేజీలపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపుల్లో భాగంగా ప్రభుత్వ రంగంలోని నిర్మాణాలను ప్రైవేటుకు అప్పగించేయడానికి సిద్ధమైంది. తొలి దశలో మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని కాలేజీలను, రెండో దశలో అమలాపురం, బాపట్ల, పెనుకొండ, నర్సీపట్నం, పాలకొల్లు, కళాశాలల ప్రైవేటీకరణ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వైఎస్ జగన్ హయాంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టగా, వైఎస్ జగన్ ప్రభుత్వం హయాంలోనే 5 మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి.. నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం మెడికల్ కాలేజీల్లో 2023–24లో ప్రారంభం కాగా, గతేడాది పాడేరు వైద్య కళాశాలల్లో తరగతులు ప్రారంభమైంది. గత వైఎస్ జగన్ సర్కారు రూ. 8,450 కోట్లతో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టగా, అన్నింటినీ ప్రైవేటుకు అప్పగించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయంతో పేదలకు విద్యను ఎలా దూరం చేస్తున్నారనడాకి నిదర్శనంగా నిలుస్తుంది. -
AP: మెడికల్ కాలేజీని ప్రైవేటు వ్యాపారులకు తెగనమ్మేందుకు కుట్ర
-
ఆగని ర్యాగింగ్!
సాక్షి, అమరావతి: దేశంలోని మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ నిరోధానికి కఠిన చట్టం అమల్లో ఉన్నప్పటికీ... ర్యాగింగ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని వైద్యకళాశాలల్లో గత ఏడాది (2024)లో 165 ర్యాగింగ్ కేసులు నమోదైనట్లు తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 33 కేసులు నమోదైనట్లు తెలిపింది. ఆ తర్వాత బిహార్‌లో 17, అత్యల్పంగా కేరళలో ఒక కేసు నమోదైనట్లు వివరించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఆరు కేసులు నమోదయ్యాయి. ర్యాగింగ్ నిరోధంపై వైద్య విద్యాసంస్థల డీన్లు, ప్రిన్సిపాల్స్‌తో వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా క్రమం తప్పకుండా మాట్లాడుతూ పర్యవేక్షిస్తున్నామని, అవసరమైన తదుపరి చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. ర్యాగింగ్ నిరోధక చర్యలు పాటించకపోతే గుర్తింపు రద్దు వైద్య విద్యాసంస్థలు ర్యాగింగ్ నిరోధక ప్రొటోకాల్‌ను పాటిస్తున్నాయా.. లేదా.. అని నిర్ధారించేందుకు వార్షిక ర్యాగింగ్ నిరోధక నివేదికను సమర్పించాలని ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. ప్రొటోకాల్ పాటించకపోతే జరిమానాలు విధించడంతోపాటు విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. విద్యార్థులకు సురక్షిత వాతావరణం ఉండేలా ర్యాగింగ్ నివారణ, నిషేధం నిబంధనలు–2021ను అమలు చేస్తున్నట్లు వివరించింది. అడ్మిషన్ బ్రోచర్లు, బుక్లెట్లలో ర్యాగింగ్ నిరోధక చర్యల గురించి నిర్దిష్ట సమాచారం అందిస్తున్నట్లు తెలిపింది. కళాశాలలు, ఆస్పత్రులు, హాస్టళ్లతోసహా క్యాంపస్‌లోని వివిధ ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతోపాటు ర్యాగింగ్ నిరోధక పోస్టర్లు, హోర్డింగ్‌లను ప్రదర్శిస్తున్నట్లు పేర్కొంది. విద్యార్థులు ర్యాగింగ్‌కు సంబంధించిన ఫిర్యాదులను దాఖలు చేసేందుకు జాతీయ వైద్య కమిషన్ ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేసిందని, ఫిర్యాదులను యాంటీ ర్యాగింగ్ సెల్ పర్యవేక్షిస్తుందని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలియజేసింది. -
మెడికోల గంజాయి కేసులో కొత్త కోణం
-
సౌకర్యాలు లేకున్నా.. అడ్మిషన్లకు సరే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు తెర లేస్తోంది. శనివారం నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే పలు ప్రైవేటు కళాశాలల్లో నిబంధనల ప్రకారం మౌలిక వసతులు లేకపోయినా, అడ్మిషన్ల కోసం అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలిసినా.. జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ)తో పాటు కాళోజీ ఆరోగ్య విశ్వ విద్యాలయం చూసీ చూడనట్టుగా వ్యవహరించి అడ్మిషన్లకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.నిబంధనలను పాటించని కళాశాలలకు ఎంబీబీఎస్ సీట్లలో కోత పెట్టడంతో పాటు కళాశాలల అనుమతి కూడా రద్దు చేసే అవకాశమున్నా ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 80 శాతం ప్రైవేటు కళాశాలలు రాజకీయ నేతలవి కావడం వల్లే తనిఖీలు చేసినా, ఏం చర్యలు తీసుకోలేకపోయాయని అంటున్నారు. తనిఖీలు చేసినా.. రాష్ట్రంలో 34 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఉండగా, ప్రైవేటు రంగంలో 26 ఉన్నాయి. అందులో ఒక కళాశాలలో ప్రవేశాలను ఈసారి అనుమతించలేదు. మిగిలిన 25 కళాశాలలకు గాను దాదాపు 20 కళాశాలల్లో ఎన్ఎంసీతో పాటు కాళోజీ వర్సిటీ వేర్వేరుగా తనిఖీలు నిర్వహించాయి. వర్సిటీ తనిఖీల్లో కేవలం 20 శాతం కళాశాలల్లో మాత్రమే నిబంధనలను పాటిస్తూ వైద్య విద్య బోధన సాగుతున్నట్లు అధికారులు గుర్తించారు. 80 శాతం ప్రైవేటు కళాశాలలు నిబంధనలను పాటించడం లేదని, విద్యార్థుల నుంచి ఫీజులు దండుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని తేలినా..వర్సిటీ కేవలం 4 కళాశాలలకు మాత్రమే జరిమానా విధించి సరిపుచ్చుకోవడం గమనార్హం.మరోవైపు ఎన్ఎంసీ అధికారులు ప్రైవేటు కళాశాలల్లో జరిపిన తనిఖీల్లోనూ ఇదే పరిస్థితి కని్పంచింది. ఈ నేపథ్యంలో ఎన్ఎంసీ కూడా 8 ప్రైవేటు కళాశాలలపై జరిమానాలు విధించింది. ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రులను తనిఖీ చేసి, 26 కళాశాలలు నిబంధనలు పాటించడం లేదని తేల్చిన ఎన్ఎంసీ అధికారులు.. ప్రైవే టు కాలేజీలపై మెతకవైఖరి అవలంబించారనే ఆరోపణలున్నాయి. కొన్ని కళాశాలల యాజమాన్యాలు, డమ్మీ పేషెంట్లు, డాక్టర్లను సమకూర్చుకొనేందుకు అవకాశం కల్పించి ఎన్ఎంసీ తనిఖీలు జరిపిందనే ఫిర్యాదులు రావడం గమనార్హం. లెక్కల్లోనే రోగులు, బెడ్లు.. కాళోజీ యూనివర్సిటీ నిర్వహించిన తనిఖీల్లో ప్రైవేటు కళాశాలలకు సంబంధించి న ఏ బోధనాసుపత్రిలోనూ ఎంబీబీఎస్, పీజీ సీట్లకు అనుగుణంగా బెడ్ల సామర్థ్యం, రోగుల సంఖ్య లేదని తేలింది. 80 శాతం కాలేజీలు కేవలం లెక్కల కోసమే బెడ్లు, రోగులు, ఫ్యాకల్టీని కాగితాలపై చూపించినట్లు స్పష్టమైంది. జాతీయ వైద్య కమిషన్ నిబంధనల ప్రకారం.. 100 ఎంబీబీఎస్ సీట్లు ఉన్న కళాశాలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రిలో ప్రతీరోజు 600 మంది ఔట్ పేషెంట్లు, 400 మంది ఇన్‌పేషెంట్లు ఉండాలి. అదే 150 మంది విద్యార్థులు ఉంటే 610 ఇన్ పేషెంట్ పడకలు, ఓపీ కింద కనీసం 900 మంది రోగులు ప్రతీరోజు రికార్డు కావాలి. కానీ 20 కళాశాలల్లో త నిఖీలు జరిపితే అన్ని చోట్లా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పరిస్థితులే కనిపించినట్టు సమాచారం. జరిమానాలు ఇలా.. రికార్డుల్లో 1,000 బెడ్లు ఉన్నట్లు చూపుతున్న కరీంనగర్‌కు చెందిన ఓ ఆసుపత్రిలో.. పది శాతం బెడ్లపై కూడా రోగులు లేనివైనంపై ఫొటోలతో సహా ఎన్ఎంసీకి నివేదిక పంపారు. ఈ కాలేజీకి వర్సిటీ అధికారులు రూ.20 లక్షల జరిమానా విధించారు. అయితే దీనిపై కళాశాల కోర్టుకు వెళ్లినట్లు తెలిసింది.– 720 పడకలు కలిగిన సంగారెడ్డి ఎంఎన్ఆర్ కళాశాలకు, 850 పడకలు ఉన్న మహేశ్వర కళాశాలకు కూడా రూ.10 లక్షల చొప్పున జరిమానా విధించారు. అలాగే 150 ఎంబీబీఎస్ సీట్లు, 202 పీజీ సీట్లు 1,300 బెడ్లు కలిగిన అతిపెద్ద రాజరాజేశ్వరి వైద్య కళాశాలకు రూ.15 లక్షల జరిమానా విధించారు.ఈ మూడు కాలేజీలు తమకు విధించిన జరిమానాను చెల్లించాయి. ఇలావుండగా అరుంధతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ‘ఆయాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’, ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీకి రూ.15 లక్షల చొప్పున ఎన్ఎంసీ జరిమానా విధించింది. అలాగే డాక్టర్ వీఆర్కే ఉమెన్స్ మెడికల్ కాలేజీ, ‘నోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’, ‘ఆర్వీఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’కు రూ.10 లక్షల చొప్పున, ఎస్వీఎస్ మెడికల్ కాలేజీ, టీఆర్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు రూ.20 లక్షల చొప్పున ఎన్ఎంసీ జరిమానా విధించింది. నిబంధనల ఉల్లంఘనలు.. ⇒ అన్ని ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో నాలుగున్నరేళ్ల ఎంబీబీఎస్ కోర్సు కోసం ఐదేళ్ల కాలానికి ఫీజు వసూలు చేస్తున్నారు.⇒ ఏ ప్రైవేటు కాలేజీలోనూ ఇంటర్న్‌షిప్ చేసే విద్యార్థులకు స్టైపెండ్ ఇవ్వడం లేదు. కొన్ని కాలేజీల్లో నామమాత్రంగా రూ.3 వేల నుంచి రూ. 5 వేలు మాత్రమే ఇస్తున్నారు.⇒ చాలా మెడికల్ కాలేజీల అనుబంధ ఆ సుపత్రులు వార్డు రూమ్‌లు తాళాలు వేసి ఉన్నా యి. బెడ్లు, పరికరాలు ఉన్నాయే తప్ప సిబ్బంది లేరు. ⇒ ప్రైవేటు కాలేజీల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఏ ఒక్క కాలేజీలో కూడా కనీసంఫ్యాకల్టీ, కింది స్థాయి సిబ్బంది కూడా లేరు. -
మెడిసిటీ మెడికల్ కాలేజ్ మెడికోల గంజాయి కేసులో కొత్తకోణం
-
లోకలెవరు? కానిదెవరు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో రాష్ట్ర కోటా కింద సీట్ల భర్తీలో నెలకొన్న ‘స్థానికత’వివాదంపై ఉత్కంఠ వీడటం లేదు. ఈ అంశంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో మంగళవారం వాదనలు ముగిసినప్పటికీ, తీర్పును రిజర్వు చేసింది. దీంతో ఉత్కంఠ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో దేశంలో ఎక్కడా లేని స్థానికత వివాదం తెలంగాణలోనే ఎందుకు వచ్చిందనే చర్చ మొదలైంది. ఉమ్మడి ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా బీఆర్ఎస్ ప్రభుత్వం 2017 తీసుకొచ్చిన జీఓ 114లో మార్పులు చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 33తో వివాదం మొదలైంది. ఈ జీవో వల్ల తెలంగాణకు ఉన్న సానుకూలత ప్రతికూల తలు ఇప్పుడు చర్చనీయంగా మారాయి. జీవో 33తో మొదలు..ఏపీ పునర్విభజన చట్టంలో భాగంగా ఏపీ విద్యార్థులకు పదేళ్లపాటు తెలంగాణలోని విద్యా సంస్థల్లో కల్పించిన 15 శాతం రిజర్వే షన్ 2023 విద్యా సంవత్సరంతో ముగిసింది. దీంతో రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 85%, ప్రైవేటు కళాశాలల్లో 50%సీట్లను తెలంగాణ విద్యార్థులతోనే భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, మెడికల్ కాలేజీల్లో లోకల్, నాన్ లోకల్ కోటాను నిర్ణయించే నిబంధనలతో 2017లోనే బీఆర్ఎస్ ప్రభుత్వం జీఓ 114ను జారీచేసింది. ఆ జీఓను సవరిస్తూ గతేడాది కాంగ్రెస్ ప్రభుత్వం జీఓ 33ను తీసుకొచ్చింది. జీఓ 114 ఏముంది? ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపులో స్థానికతను నిర్ధారిస్తూ 2017 జూలై 5న బీఆర్ఎస్ప్రభుత్వం ఈ జీఓను తీసుకొచ్చింది. దీనిలో స్థానికత నిర్ధారణకు రెండు క్లాజ్‌లను పొందుపరిచారు. మొదటి క్లాజ్ ప్రకారం 6వ తరగతి నుంచి 12 వరకు కనీసం 4 ఏళ్లపాటు ఎక్కడ చదివితే అక్కడే స్థానికులుగా పరిగణిస్తారు. రెండో క్లాజ్ ప్రకారం 9వ తరగతి నుంచి 12వ తరగతి (ఇంటర్) వరకు ఒకే దగ్గర చదివిన విద్యార్థులను స్థానికులుగా గుర్తిస్తారు. ఈ రెంటిలో ఏది ఉన్నా స్థానికులే. జీఓ 33లో ఏముంది? రేవంత్‌రెడ్డి ప్రభుత్వం జీఓ 114ను సవరిస్తూ 2024 జూలై 19న ఈ జీఓను తీసుకొచ్చింది. 114 జీఓలోని మొదటి క్లాజ్ (6 నుంచి 12 తరగతి వరకు ఎక్కడ నాలుగేళ్లు చదివితే అక్కడే స్థానికులు అనే నిబంధన) జీఓ 33 ద్వారా తొలగించారు. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలంగాణలో చదివిన వారే స్థానికులు అని స్పష్టం చేశారు. జీఓ 114 దుర్వినియోగం జీఓ 33 ఆధారంగానే గత సంవత్సరం కాళోజీ ఆరోగ్య విశ్వ విద్యాలయం మెడికల్ సీట్ల కౌన్సెలింగ్ కోసం దరఖాస్తులు ఆహ్వానించగా పలువురు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో వారందరికీ తహసీల్దార్ ఇచ్చే నివాస ధ్రువీకరణ పత్రం ఆధారంగా సీట్లు కేటాయించాలని కోర్టు ఆదేశించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. అక్కడ వాదనలు జరుగుతుంగానే ఈ ఏడాది కూడా కాళోజీ వర్సిటీ జీఓ 33 ప్రకారమే ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానించడంతో గత నెల 24న సుప్రీంకోర్టు కేసును విచారించి, స్థానికత అంశం తేలే వరకు పాత నిబంధనల ప్రకారమే రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని వర్సిటీని ఆదేశించింది. కాగా, 6 నుంచి 12వ తరగతి వరకు నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడే స్థానికత అనే నిబంధనతో మెడికల్ సీట్లలో భారీగా అక్రమాలు జరిగినట్లు కాళోజీ యూనివర్సిటీ 2023లో గుర్తించింది. ఏపీకి చెందిన పలువురు విద్యార్థులు 6 నుంచి 9 వరకు (నాలుగేళ్లు) తెలంగాణలో చదివినట్లు ప్రైవేటు స్కూళ్ల నుంచి నకిలీ స్టడీ, బోనఫైడ్ సర్టిఫికేట్లు తెచ్చి ఎంబీబీఎస్ సీట్లు పొందినట్లు తేల్చి ఏడుగురి సీట్లను రద్దు చేసింది. ఈ అక్రమాలను నివారించేందుకు బోర్డు పరీక్షలు ఉన్న 10వ తరగతిని తప్పనిసరి చూస్తూ 9 నుంచి 12 (ఇంటరీ్మడియట్) తరగతులు తెలంగాణలో చదివితేనే స్థానికులుగా పేర్కొంటూ ప్రభుత్వం జీఓ 33ను తెచ్చింది. జీఓ 33తో తెలంగాణవారూ నాన్ లోకల్ జీవో 33 వల్ల కొందరు తెలంగాణ విద్యార్థులు కూడా లోకల్ స్టేటస్ కోల్పోవటంతో వివాదం ముదిరింది. నల్లగొండ, ఖమ్మం, గద్వాల జిల్లాలకు చెందిన తెలంగాణ విద్యార్థులు 10వ తరగతి వరకు స్థానికంగా చదివి, ఇంటర్మీడియట్ ఏపీలో చదివారు. వారు జీఓ 33 ప్రకారం స్థానికులు కాదు. -
150 ఎంబీబీఎస్ సీట్లు గోవిందా!
సాక్షి, హైదరాబాద్: రెన్యువల్ కోసం లంచం ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వరంగల్‌లోని ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజీ (ఎఫ్‌సీఐఎంఎస్)కి ఈ సంవత్సరం ఎంబీబీఎస్ అడ్మిషన్లలో షాక్ తగిలింది. త్వరలో ప్రారంభం కానున్న ఎంబీబీఎస్ అడ్మిషన్ల జాబితా నుంచి ఈ కళాశాలను జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) తొలగించింది.ఈ కాలేజీలో ఉన్న 150 ఎంబీబీఎస్ సీట్లను రెన్యువల్ చేయలేదు. దీంతో రాష్ట్రంలో ఈసారి 150 ఎంబీబీఎస్ సీట్లు తగ్గనున్నాయి. వైద్య కళాశాల రెన్యువల్ కోసం రూ.66 లక్షలు లంచంగా ఇచ్చినట్లు సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగాసీబీఐ నమోదుచేసిన కేసుల ఆధారంగా మొత్తం 3,000 మెడికల్ సీట్లను ఎన్ఎంసీ ఈసారి రెన్యువల్ చేయలేదు. అందులో తెలంగాణ నుంచి ఎఫ్‌సీఐఎంఎస్ ఒక్కటే ఉంది. రెన్యూవల్ కోసం అడ్డదారులు: ఎఫ్‌సీఐఎంఎస్ 2023లోనే ప్రారంభమైంది. ఈ కళాశాలకు ట్రస్టీగా ఉన్న ఫాదర్ జోసఫ్ కొమ్మారెడ్డి.. కళాశాల రెన్యువల్ కోసం అక్రమాలకు పాల్పడినట్లు సీబీఐ గుర్తించింది. నకిలీ బోధకులు, అద్దె రోగులతో కళాశాల పరిధిలోని బోధనాసుపత్రిని నింపి అప్పటి అధికారులను మేనేజ్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. డాక్టర్ బి.హరిప్రసాద్ (కదిరి, ఏపీ), డాక్టర్ అంకం రాంబాబు (హైదరాబాద్), డాక్టర్ కృష్ణ కిషోర్ (విశాఖపట్నం) ద్వారా రెండు విడతల్లో రూ.66 లక్షలను ఎంసీఐ అధికారులకు లంచంగా ఇచ్చినట్లు సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో పేర్కొంది. -
రేపో ఎల్లుండో నీట్ స్టేట్ ర్యాంకులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించేందుకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వ విద్యాలయం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా వీలైనంత త్వరలో నీట్ స్టేట్ ర్యాంకులను విడుదల చేసేందుకు కసరత్తు జరుగుతోంది. వర్సిటీ వీసీ డాక్టర్ నందకుమార్‌రెడ్డి బుధవారం ఢిల్లీకి వెళ్లి నీట్ ర్యాంకర్లకు సంబంధించిన సీడీని తీసుకువచ్చారు. సీడీలో ఉన్న.. రాష్ట్రం నుంచి నీట్ రాసిన విద్యార్థులు, వారికి వచ్చిన మార్కులు, జాతీయ స్థాయిలో ర్యాంకులకు సంబంధించిన పూర్తి వివరాలు పరిశీలించిన తర్వాత, రెండు మూడురోజుల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులను యూనివర్సిటీ వెబ్సైట్లో అప్లోడ్ చేయనున్నారు. అనంతరం ర్యాంకర్లు యూనివర్సిటీలో రిజి్రస్టేషన్ చేసుకోవలసి ఉంటుంది. రాష్ట్ర స్థాయి ర్యాంకులను విడుదల చేసిన వెంటనే జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నేతృత్వంలోని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) షెడ్యూల్ ప్రకారం కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఆలిండియా కోటా కింద ఎన్ఎంసీ కౌన్సెలింగ్ నిర్వహించనుండగా, రాష్ట్ర ర్యాంకర్లకు కాళోజీ వర్సిటీ ఆధ్వర్యంలో మెరిట్ లిస్ట్ ప్రకారం కౌన్సెలింగ్ జరుగుతుంది. పూర్తయిన ప్రభుత్వ కళాశాలల రెన్యువల్ రాష్ట్రంలో మెడికల్ కళాశాలల్లో సీట్ల కేటాయింపునకు సంబంధించి రెన్యువల్ ప్రక్రియ పూర్తి కావస్తోంది. 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ఎన్ఎంసీ ఆమోదం తెలిపింది. మే నెలలో జరిపిన తనిఖీల సందర్భంగా 26 కాలేజీల నిర్వహణపై కౌన్సిల్ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కనీస మౌలిక సదుపాయాలు లేకుండా కళాశాలలను నిర్వహిస్తున్నారని, అనుబంధ ఆసుపత్రులలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బెడ్లు, రోగులు లేరని, విద్యార్థుల ప్రాక్టికల్స్‌కు అవసరమైన మౌలిక వసతులు లేవని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులను ఢిల్లీకి పిలిపించి క్లాస్ తీసుకుంది. ఈ నేపథ్యంలో 26 కళాశాలల్లోని సీట్ల రెన్యువల్ విషయంలో అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే రాష్ట్రంలో 2022 నుంచి 2024 మధ్యలో ఒకేసారి 25 కాలేజీలు ఏర్పాటైన తీరును, వెంటనే సౌకర్యాలు కల్పించలేని పరిస్థితిని ఎన్ఎంసీకి అధికారులు వివరించారు. తర్వాత ఎన్ఎంసీ సూచనల మేరకు ఫ్యాకల్టీ పెంపు, కొత్త నియామకాలు, సౌకర్యాల మెరుగు వంటి చర్యలను ప్రభుత్వం చేపట్టింది. ఈ నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరానికి ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్లకు సంబంధించి ఎన్ఎంసీ ఎలాంటి కోత విధించలేదు. అలాగే ఎలాంటి జరిమానాలూ విధించలేదు. ఈ నేపథ్యంలో 4,090 ఎంబీబీఎస్ సీట్లు యథావిధిగా వచ్చే సంవత్సరం కూడా కొనసాగనున్నాయి. ఎన్ఎంసీ గ్రీన్‌సిగ్నల్ నేపథ్యంలో ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ ప్రక్రియలో వేగం పెరిగిందని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి.ప్రైవేటు మెడికల్ కళాశాలల తీరే వేరు..! ప్రభుత్వ కళాశాలలను ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు సర్కారు కృషి చేస్తుంటే, ప్రైవేటు కళాశాలలు నానాటికీ తీసికట్టుగా తయారవుతుండడం విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తోంది. వచ్చే విద్యాసంవత్సరానికి రెన్యువల్ కోసం కాళోజీ వర్సిటీ గత వారం రోజులుగా తనిఖీలు నిర్వహిస్తుండగా, పలు కళాశాలల్లో ఎన్ఎంసీ నిబంధనల జాడే లేదని, ఇష్టానుసారంగా నిర్వహణ సాగుతోందని తేలింది. ఎంబీబీఎస్ చదివే విద్యార్థులకు తాత్కాలిక ఫ్యాకల్టీలతో పాఠాలు చెప్పడం తప్ప ప్రాక్టికల్స్ అంటే ఏంటో తెలియని పరిస్థితి మెజారిటీ కళాశాలల్లో ఉన్నట్లు తనిఖీల్లో తేలింది. తనిఖీలు మరో వారం రోజుల్లో పూర్తి చేయాలని విశ్వవిద్యాలయం భావిస్తోంది. అనంతరం నివేదికను ఎన్ఎంసీకి పంపిస్తే, ఎన్ని కళాశాలల్లో సీట్ల రెన్యువల్‌కు అనుమ తి వస్తుందో తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రైవేటు కళాశాలల తనిఖీలతో సంబంధం లేకుండా స్టేట్ ర్యాంకులను నిర్ణయించి, అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించాలని వర్సిటీ భావిస్తున్నట్లు సమాచారం. -
నేషనల్ మెడికల్ కౌన్సిల్ స్కాం.. వెలుగులోకి సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: నేషనల్ మెడికల్ కౌన్సిల్ స్కామ్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కుంభకోణంలో వరంగల్‌లోని ఫాదర్ కొలంబో మెడికల్ హాస్పిటల్ పాత్ర ఉన్నట్లు తేలింది. వరంగలకు చెందిన ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజీ చైర్మన్ కొమిరెడ్డి జోసఫ్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. మెడికల్ కాలేజీల తనిఖీ కోసం పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మెడికల్ కాలేజీలను తనిఖీలు చేసి అనుకూలంగా నివేదికలు ఇచ్చేందుకు లంచాల తీసుకున్నట్లు సమాచారం.ఈ స్కాంలో 36 మందిపై కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన డాక్టర్ల పాత్రపై కూడా కేసులు నమోదు చేశారు. కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ మెడికల్ కాలేజీ తనిఖీలలో అక్రమాలు బయటపడ్డాయి. చత్తీస్‌గఢ్‌కు చెందిన రావత్పూర్ సర్కార్ మెడికల్ కాలేజీ డాక్టర్లు, బ్రోకర్లు మధ్యవర్తులుగా ఉన్నట్లు గుర్తించారు. మెడికల్ కాలేజీలో తనిఖీలు చేసి డబ్బులు తీసుకున్నట్లుగా కొమిరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి.రెండు దఫాలుగా మెడికల్ కాలేజీ మధ్యవర్తి నుంచి ఫాదర్ కొమ్మిరెడ్డికి డబ్బులు ఇచ్చినట్లు సమాచారం. విశాఖ గాయత్రి మెడికల్ కాలేజ్ డైరెక్టర్ నుంచి 50 లక్షల వసూలు చేసినట్లు తేలింది. డాక్టర్ కృష్ణ కిషోర్ ద్వారా ఢిల్లీకి హవాలా రూపంలో డబ్బులు తరలించినట్లు సీబీఐ గుర్తించింది. మెడికల్ కాలేజీలో క్లియరెన్స్ కోసం ఫాదర్ కొలంబో కాలేజీకి రెండు విడతలగా డబ్బులు ఇచ్చినట్లు సమాచారం. హైదరాబాద్ చెందిన డాక్టర్ అంకం రాంబాబు, విశాఖపట్నం చెందిన డాక్టర్ కృష్ణ కిషోర్‌లను మధ్యవర్తులుగా సీబిఐ గుర్తించింది. కొలంబో మెడికల్ కాలేజ్ చైర్మన్ జోసఫ్ కొమిరెడ్డికి బ్రోకర్లు రూ.60 లక్షలు ముట్టజెప్పినట్లు సీబీఐ గుర్తించింది. -
25 నుంచి 29 వరకు వైద్య కళాశాలల్లో తనిఖీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, విద్యార్థులకు ప్రాక్టికల్స్‌కు అవసరమైన ఏర్పాట్లలో ఉన్న లోపాలను గుర్తించి, సౌకర్యాలు కల్పించేందుకు ఈ నెల 25 నుంచి 29వ తేదీ వరకు తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించారు. 26 వైద్య కళాశాలల్లో లోపాలపై జాతీయ వైద్య కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా, డీఎంఈ నరేంద్ర కుమార్ ఢిల్లీకి వెళ్లి వివరణ ఇచ్చారు. అంతకుముందే సీఎం రేవంత్‌రెడ్డి ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశమై ఆదేశాలు జారీ చేశా రు.ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేసి వైద్య కళాశాలల్లో తనిఖీలు నిర్వహించి నివే దిక అందజేయాలని ఆదేశించారు. దీంతో 10 కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు 25 నుంచి 29 వరకు 34 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సౌకర్యాలను పరిశీలించి క్షేత్రస్థాయి పరిస్థితులు, చేపట్టాల్సిన చర్యలపై 30న ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాయి. తదనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇదే విషయాన్ని ఢిల్లీలో ఎన్ఎంసీ అధికారులకు సైతం రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు తెలియజేశారు. -
భయంతో కేకలు.. ప్రమాదం వేళ యువతులు ఎలా తప్పించుకున్నారంటే..
అహ్మదాబాద్: అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం కూలిన అనంతరం బీజే మెడికల్ కాలేజీ(బీజేఎంసీ)క్యాంపస్‌లో భీతిల్లిన విద్యార్థులకు సంబంధించిన వీడియోలు వెలుగులోకి వస్తున్నాయి. భవనంలో మంటలు చెలరేగడం చూసిన రెండు, మూడు అంతస్తుల్లో ఉన్న విద్యార్థులు ప్రాణభయంతో వణుకుతూ కేకలు వేయగా, కొందరు దుప్పట్లు, ఇతర దుస్తులను ఒకదానికొకటి ముడివేసి వాటి సాయంతో కిందికి దిగడం, మరికొందరు దూకేందుకు ప్రయత్నిస్తున్నట్లు అందులో ఉంది.విమానం కూలిన ప్రాంతంలో కొన్ని మీటర్ల దూరంలోనే మంటలు వ్యాపిస్తుండటం చూసిన ఓ యువతి కేవలం రెయిలింగ్ సాయంతోనే కిందికి దిగేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఉన్న మరో ఓ వీడియోలో రికార్డయింది. క్యాంపస్ వెలుపలి గోడపై నుంచి ఈ వీడియో తీస్తున్న వారు.. కింద పడిపోతే గాయాలవుతాయని ఆమెను హెచ్చరిస్తూ వేస్తున్న కేకలు సైతం వినిపించాయి. మరో వ్యక్తి కూడా అదే రెయిలింగ్ ద్వారా కిందికి దిగేందుకు ప్రయత్నించారు. #Watch | A horrifying plane crash struck the BJ Medical College UG hostel mess in Meghani Nagar, claiming the lives of several MBBS students. Heart-wrenching videos have surfaced from the moment of the crash, showing hostel students desperately trying to escape through the… pic.twitter.com/tmDxB3XfdJ— The Daily Jagran (@TheDailyJagran) June 17, 2025 Shocking video from #AhmedabadCrash: As the plane hit the medical college hostel, students jumped from windows to save their lives. Video shot moments after impact. pic.twitter.com/1CvGMV7iZ8— Neha Bhan🇮🇳 (@neha_journo) June 17, 2025మెడికల్ కాలేజీ హాస్టల్ మూడో అంతస్తు వరకు నిచ్చెనలు వేసుకుని ఫైర్ సిబ్బంది మంటల్లో చిక్కుకున్న విద్యార్థులను రక్షించినట్లుగా మరో వీడియోలో ఉంది. విమానం కూలిన మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంలో ఉన్న ఐదుగురు ఎంబీబీఎస్ విద్యార్థులు సహా 29 మంది ప్రాణాలు కోల్పోవడం తెల్సిందే. విమాన ప్రమాదంతో మెడికల్ కాలేజీకి సంబంధించిన నాలుగు భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.Removal of the aft fuselage section of the Air India Boeing 787-8(VT-ANB) from the BJ Medical College, Ahmedabad.#AirIndiaCrash #Ahmedabad #AirindiaPlane #BreakingNews pic.twitter.com/kGkxtK0WFt— The Metropolitan Times (@times66982) June 17, 2025 Black day for India 💔Visuals from inside of the BJ Medical College UG Boys hostel mess in Meghani Nagar, Amdavad, Gujarat where Air India London bound flight crashedEngine tore the walls of the hostel. Many students are feared to be dead as it was lunch time #PlaneCrash https://t.co/zJyrnyJAVB pic.twitter.com/nRps7cXAbM— Karnataka Weather (@BengaluruRains_) June 12, 2025 -
Plane Crash: విమాన ప్రమాద ఘటనలో బయటపడ్డ షాకింగ్ వీడియో
-
వైద్య కళాశాలల్లో ఏ వసతులు కల్పించాలి?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 34 వైద్య కళాశాలలు పూర్తిస్థాయి వసతులతో పనిచేయాలని, ఇందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను వెంటనే తయారు చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 26 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కనీస వసతులు లేవని జాతీయ వైద్యమండలి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, 2025–26 సంవత్సరానికి ఈ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లు రెన్యూవల్ చేయాలంటే.. ఈనెల 18న వైద్యశాఖ కార్యదర్శి స్వయంగా హాజరుకావాలని ఆదేశించిన నేపథ్యంలోనే కళాశాలల్లోని వసతులు, జాతీయ వైద్యమండలి పేర్కొంటున్న నియమ, నిబంధనలు వెంటనే పూర్తి చేయాలన్న ఉద్దేశంతోనే వైద్యారోగ్యశాఖపై ఐసీసీసీలో సోమవారం సీఎం సమీక్షించారు.ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ వైద్య కళాశాలల్లో తక్షణమే పూర్తి చేయాల్సిన పనులు, ప్రభుత్వపరంగా అందించాల్సిన సహాయం తదితర వివరాలతో నివేదికను సమరి్పంచాలని అధికారులను ఆదేశించారు. అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని, ఆ కమిటీ ప్రతి కళాశాలను సందర్శించి అక్కడ ఏం అవసరాలు ఉన్నాయి. ఎంతమేర నిధులు కావాలనే దానిపై నివేదిక ఇవ్వాలన్నారు. జాతీయ వైద్యమండలి (ఎన్ఎంసీ) రాష్ట్రంలోని వైద్య కళాశాలలకు సంబంధించి లేవనెత్తిన పలు అంశాలపై చర్చించారు.ప్రభుత్వ వైద్య కళాశాలల్లో నియామకాలు, బోధన సిబ్బందికి పదోన్నతులు, వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న ఆస్పత్రుల్లో పడకల పెంపు, ఆయా కళాశాలలకు అవసరమైన వైద్య పరికరాలు, ఖాళీల భర్తీపై సమగ్ర నివేదిక రూపొందించి అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల చేయాల్సిన నిధులను వెంటనే విడుదల చేస్తామన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి నిధులు, అనుమతులకు సంబంధించిన అంశాలుంటే వెంటనే తెలియజేయాలని, కేంద్ర మంత్రి నడ్డా, ఆ శాఖ అధికారులను సంప్రదించి వాటిని పరిష్కరిస్తామని సీఎం పేర్కొన్నారు. నర్సింగ్ కళాశాలల్లో ఆప్షనల్‌గా జపనీస్ సబ్టెక్ట్ ఉండాలి నర్సింగ్ కళాశాలల్లో జపనీస్ (జపాన్ భాష)ను ఒక ఆప్ష నల్గా నేర్పించాలని, జపాన్‌లో మన నర్సింగ్ సిబ్బందికి డిమాండ్ ఉందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ విషయంలో మనకు మద్దతు ఇచ్చేందుకు జపాన్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆస్పత్రులకు వచ్చే రోగులు, వారిని పరీక్షించే వైద్యులు, ఆస్పత్రుల సమయాల పర్యవేక్షణకు ఒక యాప్‌ను వినియోగించే అంశంపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు.విద్య, వైద్య రంగాలు ఎంతో కీలకమని, ప్రతినెలా మూడోవారంలో ఈ రెండు శాఖలపై సమీక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం ఆదేశించారు. ఈ సమీక్షలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, సీఎస్ రామకృష్ణారావు, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి వి.శేషాద్రి, ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్ రాజ్, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తూ, వైద్యారోగ్య శాఖ డైరెక్టరేట్ డాక్టర్ నరేందర్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ర్యాగింగ్ నంబరు 165 @ 2024
సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా వైద్యకళాశాలల్లో గతేడాది నమోదైన ర్యాగింగ్ ఫిర్యాదుల గణాంకాలను కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నివేదించింది. దేశ వ్యాప్తంగా 2024లో మొత్తం 165 కేసులు నమోదైనట్లు వెల్లడించింది, ఈ నివేదిక ప్రకారం అత్యధిక ఫిర్యాదులు నమోదైన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ మొదటిస్థానంలో నిలవగా, రెండోస్థానంలో బిహార్ ఉంది. ఉత్తర ప్రదేశ్‌లో 33, బిహార్‌లో 17 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉంది. ఏపీతో పాటు హరియాణా, ఉత్తరాఖండ్‌లో గతేడాదిలో చెరో ఆరు ర్యాగింగ్ ఘటనలు చోటు చేసుకున్నాయని నివేదిక వెల్లడించింది. తెలంగాణ, గుజరాత్, ఢిల్లీ, జమ్మూ కశ్మీర్లో చెరో మూడు కేసులు నమోదై 12వ స్థానంలో నిలిచాయి. ర్యాగింగ్ నివారణలో కేరళ ఆదర్శనీయంగా నిలిచింది. కేవలం ఒకే ఒక్క ఫిర్యాదుకు మాత్రమే పరిమితమైందని కేంద్రం తెలిపింది. కళాశాలలు, ఆసుపత్రులు, హాస్టళ్లు సహా క్యాంపస్‌లోని పలు ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుతో పాటు సంస్థలలోని వివిధ ప్రదేశాల్లో ర్యాగింగ్ నిరోధక పోస్టర్లు హోర్డింగ్‌లను ప్రదర్శిస్తున్నట్లు పేర్కొంది. ర్యాగింగ్‌పై విద్యార్థులు ఫిర్యాదు చేసేందుకు జాతీయ వైద్య కమిషన్ ప్రత్యేక పోర్టల్‌ని ఏర్పాటు చేసిందని స్పష్టం చేసింది. -
AI 171 plane crash : కన్నీరుమున్నీరవుతున్న వైద్యుడి వీడియో వైరల్
అహ్మదాబాద్ (గుజరాత్): సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో జరిగిన విధ్వంసకర AI 171 విమాన ప్రమాదం తర్వాత, ప్రాణాలతో బయటపడిన విద్యార్థులు, ప్రొఫెసర్లు, సిబ్బంది , కుటుంబ సభ్యులులను శుక్రవారం BJమెడికల్ కాలేజీ వైద్యుల హాస్టల్ ప్రాంగణం నుండి ఖాళీ చేయిస్తున్నారు. ఈ దృశ్యాలు ఆన్లైన్లో వైరల్‌గా మారాయి ఈ సందర్భంగా ముఖ్యంగా డా. అనిల్ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. తమను ఇప్పటికిపుడు ఇళ్లు ఖాళీ చేయాల్సిందిగా మాండేటరీ ఆదేశాలిచ్చారు, రెండు మూడు రోజులు సమయం ఇవ్వండి, మానవత్వం చూపండిఅంటూ భావోద్వేగానికి గురి అవుతున్న వీడియో సంచలనంగా మారింది. మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రదేశాన్ని ఖాళీ చేసేందుకు తమకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. తన కుమార్తె, తన ఇంట్లో సహాయకురాలు ఈ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నారని, వారికి తనసాయం అవసరం అంటూ కంటతడి పెట్టారు. తన భార్య లేదని, చాలా నిస్సహాయంగా ఉన్నానంటూ భోరున విలపించారు. ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా కోరుతూ కన్నీంటి పర్యంత మయ్యారు. ఇదీ చదవండి: Air India Plane Crash బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌పై ఆరోపణలు: ఇంత విషాదం ఇపుడే! View this post on Instagram A post shared by Vinay Sharma (@vinayshaarma)> కాగా 242 మంది ప్రయాణికులతో అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్‌కు వెళ్లే ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన కొద్దిసేపటికే మేఘనినగర్ ప్రాంతంలో బీజే మెడికల్ కాలేజీపై కూలిపోయింది. ఈ సందర్బంగా మధ్యాహ్నం లంచ్‌కోసం వచ్చిన విద్యార్థులు కూడా కొంతమంది మరణించిన సంగతి తెలిసిందే. -
నేనే రెండు కోట్లిస్తా.. నా తండ్రిని ప్రాణాలతో తెస్తారా?
న్యూఢిల్లీ: ఎయిరిండియా విమాన ప్రమాద బాధితులకు టాటా గ్రూప్ సంస్థ భారీగా పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడో మహిళ టాటా గ్రూప్ వాళ్లకే రెండు కోట్ల రూపాయలు ఎదురిస్తానంటోంది. బదులుగా.. చనిపోయిన తన తండ్రిని ప్రాణాలతో తీసుకురావాలని డిమాండ్ చేస్తోంది. నవ్వుతూ నిత్యం తమ మధ్య తిరిగిన తండ్రి.. తాజా ఘటనలో దుర్మరణం పాలై మృతదేహాం జాడ కూడా లేని స్థితిలో ఉన్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.‘‘నా తండ్రే పోయాక మీ పరిహారం ఎవరికి కావాలి. నేను వాళ్లకు రెండు కోట్ల రూపాయిలిస్తా. బదులుగా చనిపోయిన నా తండ్రిని బతికించి తీసుకురండి. వాళ్లు ఇచ్చే పరిహారం నా తండ్రిని వెనక్కి తెస్తుందా?.. నాకు నా తండ్రి, ఆప్యాయతలు కావాలి. వాటి కోసం వాళ్లలా ఎంతైనా నేను ప్రకటిస్తా’’ అంటూ ఫాల్గూని అనే మహిళ కన్నీరు పెట్టుకుంది. ఫాల్గునితో పాటు బాధిత కుటుంబాలు అహ్మదాబాద్ బీజే మెడికల్ కాలేజీ వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఘటనలో మృతదేహాలు గుర్తుపట్టలేనంత స్థితిలో కాలిపోయిన సంగతి తెలిసిందే. దీంతో రెండోరోజూ డీఎన్ఏ పరీక్షలు కొనసాగుతున్నాయి. అధికారులు బంధువుల నుంచి శాంపిల్స్ సేకరిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోందంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. శాంపిల్స్ సేకరణ కోసం గంటల తరబడి ఎదురు చూస్తున్నాం. ఫలితాలు రావడానికి ఇంకాస్త సమయం పడుతుందని చెబుతున్నారు. ఎప్పుడు ఆ ఫలితాలు వచ్చేది?. . ఎప్పుడు మా వాళ్లను అప్పగించేది? అని ఫాల్గునితోపాటు మరికొందరు అధికారులను నిలదీశారు.మరోవైపు.. అధికారులు మాత్రం తమ బృందాలు అహర్నిశలు పని చేస్తున్నాయని చెబుతున్నారు. ‘‘దాదాపుగా బంధువుల నుంచి శాంపిల్స్ సేకరించాం. ఇప్పటికే 240 మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాం. డీఎన్ఏ మ్యాచింగ్ ప్రక్రియ పూర్తి కాగానే.. వీలైనంత త్వరగా మృతదేహాలు అప్పగిస్తాం’’ అని ఓ అధికారి వెల్లడించారు. -
మెడికల్ కాలేజీ మృతులెందరు?
అహ్మదాబాద్: ఎయిరిండియా విమానానికి సంభవించిన ఘోర ప్రమాదంలో మరణించిన వారి సంఖ్యపై గురువారం అర్ధరాత్రికే స్పష్టత వచ్చింది. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందికి గాను ఒక్కరు మినహా అందరూ దుర్మరణం పాలయ్యారు. 241 మంది మరణించినట్టు ఎయిరిండియా అధికారికంగా ప్రకటించింది. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి బయల్దేరిన విమానం టేకాఫైన 33 సెకన్లకే రన్‌వే సమీపంలోని బీజే మెడికల్ కాలేజీ మెస్, హాస్టల్‌పై పడి పేలిపోవడం తెలిసిందే. ఆ సమయంలో విమానంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం ఉండటంతో అత్యంత భారీ పేలుడు సంభవించింది. దాంతో మెస్, హాస్టల్ ధ్వంసమవడమే గాక పరిసర భవనాలకూ నిప్పంటుకుని కాలిపోయాయి. కానీ అక్కడి వారిలో ఎందరు చనిపోయారన్న దానిపై మాత్రం ఇప్పటికీ స్పష్టత లేదు. దీనిపై గుజరాత్ ప్రభుత్వం గానీ, కేంద్రం గానీ అధికారికంగా స్పందించలేదు. కనీసం 24 మంది మరణించినట్టు గురువారమే వార్తలొచ్చాయి. గురువారం అర్ధరాత్రికే ఆస్పత్రికి 265 మృతదేహాలు వచ్చినట్టు డీఎస్పీ కనన్ దేశాయ్ చేసిన ప్రకటన వాటికి బలం చేకూర్చింది. నలుగురు ఎంబీబీఎస్ విద్యార్థులు, ఒక వైద్యుడు, మరో వైద్యుడి భార్య మృతిని కాలేజీ వర్గాలు గురువారం రాత్రి ధ్రువీకరించాయి. మరో 60 మందికి పైగా వైద్యులు, వైద్య విద్యార్థులు గాయపడ్డట్టు ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా మెడికల్ అసోసియేషన్ పేర్కొంది. వారిలో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయని, ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని కూడా వెల్లడించింది. అంతేగాక ఇద్దరు ఎంబీబీఎస్ మూడో సంవత్సరం విద్యార్థులు, ఒక వైద్యుని తాలూకు ముగ్గురు బంధువుల ఆచూకీ తెలియడం లేదని కాలేజీ డీన్ డాక్టర్ మీనాక్షీ పారిఖ్ తెలిపారు. వీరి పరిస్థితి ఏమిటన్నది మాత్రం శుక్రవారం అర్ధరాత్రి దాకా తెలియరాలేదు. ప్రమాదస్థలి వద్ద భవనాల శిథిలాలు తదితరాలను తొలగించేందుకు ఆరు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శ్రమిస్తున్నట్టు సంస్థ డీజీ హరి ఓం గాంధీ శుక్రవారం తెలిపారు. మృతులపై మాత్రం ఎలాంటి వివరాలూ వెల్లడించలేదు. దాంతో మొత్తం మృతుల సంఖ్యపై రకరకాల ఊహాగానాలు విన్పించాయి. శుక్రవారం మరో నలుగురు ఎంబీబీఎస్ విద్యార్థుల మృతదేహాలు లభించాయని, మొత్తం మృతుల సంఖ్య 325కి చేరిందని వార్తలొచ్చాయి. గుజరాత్ పోలీసులు కూడా మృతుల సంఖ్య 294కు చేరినట్టు శుక్రవారం మధ్యాహ్నం చెప్పారు. కానీ, ‘240 మందికి పైగా మరణించార’ంటూ సాయంత్రానికల్లా సవరణ ప్రకటన చేశారు! మెడికల్ కాలేజీ మృతుల సంఖ్యను ప్రభుత్వం ఎందుకు గుట్టుగా ఉంచుతున్నదీ అంతుబట్టడంలేదు. -
Plane Crash: బీజే మెడికల్ కాలేజీలో CCTV విజువల్స్
-
Plane Crash: మెడికల్ కాలేజీపై కూలడంతో 20 మంది వైద్యుల మృతి
-
సోనియా గాంధీకి అస్వస్థత
-
విషాదం.. ఇంజెక్షన్ వికటించి ఆరుగురు మృతి..
కొరాపుట్: కొరాపుట్ జిల్లా కేంద్రంలోని సాహిద్ లక్ష్మణ్ నాయక్ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి 11 నుంచి బుధవారం వేకువజాము వరకు ఆరుగురు రోగులు మృత్యువాతపడ్డారు. వైద్యం వికటించడం వల్లే ఈ మరణాలు సంభవించాయని బాధిత కుటుంబాలు ఆరోపణలు చేస్తుండగా.. అవన్నీ సహజ మరణాలు అయి ఉండవచ్చని ప్రభుత్వం చెబుతోంది. ఈ విషాద ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. మృతుల్లో నలుగురు ఐసీయూలో ప్రాణాలు వదలడం వివాదాస్పదంగా మారింది. మృతుల్లో భగవాన్ పరజా (68), శుక్ర మజ్జి (45), జగన్నాథ్ పూజారి (54), రుకుని పెంటియా (47), బాటి ఖురా(36), పుల్మతి మజ్జి (29)లుగా ప్రభుత్వం ప్రకటించింది. వీరందరూ అత్యవసర చికిత్స కోసం వచ్చారు. కేవలం గంటన్నర వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయారు. దర్యాప్తుకు ఆదేశం.. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు రుపక్ తురుక్, మాజీ ఎమ్మెల్యే నిమయ్ సర్కార్ తదితరులు ఆస్పత్రికి చేరుకొని ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వెంటనే పోలీసు బలగాలను మోహరించారు. కొరాపుట్ జిల్లా కలెక్టర్ వీ.కీర్తివాసన్ కళాశాలకు చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మరణాలపై పూర్తిస్థాయి విచారణ చేస్తామన్నారు. ఇవి సహజ మరణాలుగానే అనుమానం వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఉన్నత స్థాయి దర్యాప్తు జరుగుతుందన్నారు. తనకు వైద్య పరిజ్ఞానం లేదని, అందుకే ఇప్పుడే ఏం చెప్పలేనన్నారు. కళాశాల సూపరింటెండెంట్ సుశాంత్ మాట్లాడుతూ మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తామన్నారు.10 మంది వైద్య నిపుణులతో ప్రత్యేక కమిటీతో దర్యాప్తు చేస్తామన్నారు. మరోవైపు రోగుల బంధువులు మీడియాతో మాట్లాడుతూ ముగ్గురు నర్సులు వచ్చి ఇంజక్షన్లు చేశారని, ఇంజక్షన్లు ఇచ్చిన తర్వాత ప్రతి ఐదు నిమిషాలకు ఒక్కొక్కరూ మృతి చెందారని చెప్పారు. కాగా, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ సహాయం కింద రూ.10 వేలు చొప్పున అందజేసింది. -
ప్రజల్ని పట్టి పీడిస్తున్న చంద్రబాబు: విడదల రజిని
సాక్షి, గుంటూరు: ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలను పట్టి పీడిస్తున్నారని, ఆయన చెప్పేదానికి చేసే దానికి ఏమాత్రం సంబంధం ఉండదని మాజీ మంత్రి విడదల రజిని(Vidadala Rajini) అన్నారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రయత్నాలు, వైద్యారోగ్య రంగాల నిర్వీర్యంపై గురువారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు(Chandrababu) చేప్పేవన్నీ అబద్ధాలే. చెప్పే ఏ మాట మీద ఆయన నిలబడరు. ఎంతో దూరదృష్టితో వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. ఐదు కాలేజీలను మా ప్రభుత్వ హయాంలో నిర్మించాం. మెడికల్ కాలేజీల ద్వారా ఆరోగ్య సేవలను జగన్ విస్తృత పరిచారు. వైద్య విద్య చదివేవారి ఆశలను నిజం చేయాలని జగన్ చూశారు. కార్పొరేట్ స్థాయిలో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని ఆయన భావించారు. నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించటానికి జగన్ అడుగులేశారు.. .. అలాంటి మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రయివేటీకరణ(AP Medical Colleges Privatization) చేస్తున్నారు. ఒక సంస్థతో సర్వే చేయించినట్టుగా కథ నడిపి వారితో ఫీజుబులిటీ రిపోర్టును తెప్పించారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో వారికి అనుగుణంగా రిపోర్టు ఇచ్చారు. ఒక్కో కాలేజీని సంవత్సరానికి రూ.5 వేల చొప్పున లీజుకు ఇస్తున్నారు. రూ.500 కోట్ల విలువైన ఆస్తిని రూ.5 వేలకు ఇవ్వటం ఏంటి?. పేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్యాన్ని ఏం చేయదల్చుకున్నారు?. చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డెక్కారు. పరిశ్రమల ఊసే లేదు. అర్ధిక అభివృద్ధి పేరుతో చంద్రబాబు తన మనుషులకే మేలు చేస్తున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు సంక్షేమం అనేది చంద్రబాబుకు ఇష్టం లేదు. కరోనా సమయంలో జగన్ అన్ని వర్గాలకూ మేలు చేశారు. కానీ చంద్రబాబు పాలనలో ప్రజలకు అలాంటి ఆశలన్నీ నీరు గారి పోయాయి. ఇప్పుడు పీపీపీ పద్దతి అంటున్నారు. ఇప్పటికే ఆరోగ్య శ్రీ బిల్లులు అందక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలను ఎందుకు ఇలా పట్టి పీడిస్తున్నారు?. ప్రజల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవటం ప్రభుత్వ బాధ్యత. ఆ బాధ్యత నుండి చంద్రబాబు ప్రభుత్వం తప్పుకోవడం సరికాదు. గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్యం కోసం జగన్ అనేక ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు వాటిని కూడా ఈ ప్రభుత్వం నాశనం చేసింది. గిరిజనులకు మళ్ళీ డోలీల బాధ తప్పటం లేదు. మేము అధికారంలోకి వచ్చాక మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణపై రివ్యూ చేస్తాం అని రజిని అన్నారు. ఇదీ చదవండి: కడిగిన ముత్యంలా మా నాన్న బయటకు వస్తారు -
బాబు సర్కార్ మరో బంపర్ స్కామ్
-
ఆంధ్రప్రదేశ్‌లో ఎకరం వంద రూపాయలకే మెడికల్ కాలేజీ లీజు... నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలను బేరం పెట్టిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం
-
పప్పు బెల్లాల్లా మెడికల్ కాలేజీలు 'అమ్మబడును'!
ఈ ఫొటోలో కనిపిస్తున్నది వైఎస్సార్ జిల్లా పులివెందులలోని ప్రభుత్వ నూతన వైద్య కళాశాల. వైఎస్ జగన్ ప్రభుత్వం 47.58 ఎకరాల్లో రూ.500 కోట్లతో కళాశాల, బోధనాస్పత్రి నిర్మాణం చేపట్టింది. వైఎస్సార్సీపీ హయాంలోనే దాదాపుగా పనులన్నీ పూర్తయ్యాయి. 2024–25 విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభించేందుకు గత ప్రభుత్వంలోనే ఎన్ఎంసీకి దరఖాస్తు చేశారు. తొలి ఏడాది 50 ఎంబీబీఎస్ సీట్లతో ప్రారంభించేందుకు ఎన్ఎంసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా చంద్రబాబు సర్కారు దీన్ని ప్రైవేట్ పరం చేసేందుకు కుట్రపూరితంగా లేఖ రాసి సీట్లను రద్దు చేయించింది. ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. కారుచౌకగా ఎకరం ఏడాదికి రూ.100 చొప్పున లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది. ఇక్కడ ఎకరం మార్కెట్ రేటు రూ.2 కోట్లు పలుకుతోంది. ఈ లెక్కన సుమారు రూ.100 కోట్ల విలువైన భూమిని ఏడాదికి కేవలం రూ.4,700 చొప్పున ప్రభుత్వం లీజుకు ఇచ్చేస్తోంది. అంతేకాకుండా ప్లగ్ అండ్ ప్లే తరహాలో ఎంబీబీఎస్ తరగతులు నిర్వహించేందుకు సకల సౌకర్యాలతో తీర్చిదిద్దిన కాలేజీని ప్రైవేట్‌కు కట్టబెట్టి ఏకంగా 66 ఏళ్ల పాటు హక్కులు కల్పించబోతోంది. ఇదే తరహాలో గత ప్రభుత్వంలో దాదాపుగా పూర్తయిన 10 మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తోంది. సాక్షి, అమరావతి: ప్రభుత్వానికి విలువైన సంపద సమకూరుస్తూ రూ.వందల కోట్లతో దాదాపుగా పూర్తి చేసిన మెడికల్ కాలేజీలను ఏ ప్రభుత్వమైనా సద్వినియోగం చేసుకుంటుంది! ప్రజలకు ఆరోగ్యం, విద్యార్థులకు వైద్య సీట్లు చేరువలో అందుబాటులో వచ్చేలా చర్యలు తీసుకుంటుంది! కానీ కేవలం రూ.ఐదు వేలు.. పది వేల కోసం ఓ మెడికల్ కాలేజీని ఎవరైనా ఇచ్చేస్తారా? అన్ని వసతులతో సిద్ధమైన ప్రభుత్వ వైద్య కళాశాలను భవనాలతో సహా అప్పగించేస్తారా? అవి కూడా ఒకటి రెండు కాదు.. ఏకంగా పది కాలేజీలు!! చంద్రబాబు సర్కారు మాత్రం సరిగ్గా ఇదే చేస్తోంది. అన్ని వసతులతో రూపుదిద్దుకున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఎకరం రూ.వందకే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతోంది. మరికొద్దిగా వ్యయం చేస్తే ఇవన్నీ అందుబాటులోకి వచ్చి పేదలకు ఉచితంగా సూపర్ స్పెషాల్టీ వైద్యం.. మన విద్యార్థులకు మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే టీడీపీ పెద్దలు ప్రజారోగ్య పరిరక్షణ బాధ్యతను గాలికి వదిలేసి పప్పు బెల్లాల మాదిరిగా ప్రభుత్వ వైద్య కళాశాలలను తన సన్నిహితులకు కట్టబెడుతున్నారు. ఈ స్కామ్‌కు ఆమోద ముద్ర వేయించుకునేందుకు ఓ కన్సల్టెన్సీని తెరపైకి తెచ్చి కథ నడిపిస్తున్నారు. తనకు ఆది నుంచి అలవాటైన రీతిలో సీఎం చంద్రబాబు తెర చాటున పావులు కదుపుతున్నారు. ఓ వైద్య కళాశాలను సాధించాలంటే ప్రభుత్వం ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. అలాంటిది ఈ ప్రభుత్వం ఒక్క కాలేజీ కూడా తీసుకురాకపోగా ఇప్పటికే మంజూరై దాదాపుగా పూరై్తన ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌కి అప్పగించి చేతులు దులుపుకోవడం వల్ల వైద్య సేవల కోసం అటు పేదలు.. వైద్య సీట్లు కోల్పోయి ఇటు విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. పేదలకు వైద్యం, పిల్లలకు చదువులు సమకూర్చడం ప్రభుత్వాల కనీస బాధ్యత. ఈ రెండింటినీ నెరవేరుస్తూ గత ప్రభుత్వం ఒకేసారి భారీగా మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టింది. అయితే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టుదలతో సాకారమైన ప్రభుత్వ నూతన వైద్య కళాశాలలను పీపీపీ పేరుతో ప్రైవేట్ విద్యా సంస్థలకు కట్టబెట్టే యత్నాలను టీడీపీ కూటమి సర్కారు ముమ్మరం చేసింది. ప్రభుత్వ కళాశాలలు, బోధనాస్పత్రులను ప్రైవేట్‌కు ఏకంగా 66 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వడంతో పాటు వైద్య సేవలకు పేదల నుంచి ముక్కుపిండి డబ్బు వసూలు చేసే హక్కు కల్పిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌కు ధారాదత్తం చేయడంపై కేపీఎంజీ సంస్థ వైద్య శాఖకు ఫీజిబిలిటీ నివేదిక అందజేసినట్లు తెలుస్తోంది. వైద్య శాఖ అధికారుల కమిటీ దీనికి ఆమోదం తెలిపాక టెండర్లు పిలవనున్నారు.ఒకేసారి 17 కాలేజీలకు వైఎస్ జగన్ శ్రీకారం..రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్యం, మన విద్యార్థుల వైద్య విద్య అవకాశాలను పెంపొందించేలా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏకంగా 17 నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. వీటిలో నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం మెడికల్ కాలేజీల్లో 2023–24లో, గతేడాది పాడేరు వైద్య కళాశాలల్లో తరగతులు ప్రారంభం అయ్యాయి. పిడుగురాళ్ల వైద్య కళాశాలకు కేంద్ర ప్రభుత్వం సాయం అందిస్తోంది. ఇవి కాకుండా మిగిలిన 10 కళాశాలలను కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంలో అప్పగించనుంది. తొలి దశలో మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని కాలేజీలను, రెండో దశలో అమలాపురం, బాపట్ల, పెనుకొండ, నర్సీపట్నం, పాలకొల్లు, పార్వతీపురం కళాశాలలను పీపీపీలో ఇవ్వాలని కూటమి సర్కారు నిర్ణయించింది. తొలి దశలో నాలుగు కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నిర్వహణ బాధ్యతలు దక్కించుకున్న వారికి ఎకరం భూమిని కేవలం రూ.100కే ప్రభుత్వం లీజుకు ఇవ్వనుంది. ఒక్కో వైద్య కళాశాల 50 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉంటుంది. ఈ లెక్కన రూ.వందల కోట్ల విలువ చేసే భూములను ప్రైవేట్ వ్యక్తులకు గతేడాది వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికే వీటిలో తొలి ఏడాది ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభించేలా చాలా వరకూ పనులు పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం మిగిలిన అరకొర పనులూ పూర్తి చేసి ప్రైవేట్ వ్యక్తులే 66 ఏళ్ల పాటు నిర్వహించుకునేలా హక్కులు కల్పించనుంది. తొలుత 33 ఏళ్లు తర్వాత 33 ఏళ్ల పాటుఆటో రెన్యువల్ అయ్యేలా నిబంధనలు రూపొందించినట్టు సమాచారం.సేవలకు డబ్బులు వసూలు..ప్రైవేట్ వ్యక్తుల అజమాయిషీలో నడిచే వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉండే బోధనాస్పత్రుల్లో పేదలకు పూర్తి స్థాయిలో ఉచిత వైద్య సేవలు అందవు. అదే ఈ కళాశాలలు ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తే ఓపీ, ఐపీ, రోగ నిర్ధారణ, అవయవాల మార్పిడి లాంటి పెద్ద శస్త్ర చికిత్సలు సైతం పేదలకు పూర్తి ఉచితంగా అందేవి. వైద్య కళాశాలలను పీపీపీలో ప్రైవేట్‌కు అప్పగిస్తున్న నేపథ్యంలో ఇన్–పేషెంట్, రోగ నిర్ధారణ, మందు బిళ్లల కోసం ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసుకునే వీలు కల్పించారు. సగం మెడిసిన్ సీట్లను కూడా ప్రైవేట్ వైద్య కళాశాలల్లో మాదిరిగా అమ్ముకునేందుకు అవకాశం ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ మెడిసిన్ సీట్ల విధానాన్ని రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు టీడీపీ హామీలిచి్చంది. అధికారం చేపట్టిన వంద రోజుల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల జీవోలను రద్దు చేస్తామని నాడు నారా లోకేశ్ నమ్మబలికారు. గద్దెనెక్కాక సెల్ఫ్ ఫైనాన్స్ కోటాను ఎత్తివేయకపోగా ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏకంగా ప్రైవేట్‌కు కట్టబెడుతున్నారు.తెల్ల కోటు కల ఛిద్రం..!ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీలో ప్రైవేట్‌కు కట్టబెడుతూ మన విద్యార్థుల తెల్లకోటు కలను చంద్రబాబు చిదిమేశారు. 2024–25 విద్యా సంవత్సరంలో మదనపల్లె, మార్కాపురం, ఆదోని, పులివెందుల వైద్య కళాశాలలు ప్రారంభం కాకుండా అడ్డుçపడ్డారు. 50 సీట్లతో పులివెందుల కాలేజీలో తరగతులు ప్రారంభించేందుకు ఎన్ఎంసీ అనుమతులు ఇవ్వగా టీడీపీ కూటమి సర్కారు కుట్రపూరితంగా లేఖలు రాసి అనుమతులు రద్దు చేయించింది. అయితే గత ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల పాడేరులో 50 సీట్లతో తరగతులు ప్రారంభం అయ్యాయి. వాస్తవానికి గతేడాది 750 ఎంబీబీఎస్ సీట్లు సమకూరాల్సి ఉండగా చంద్రబాబు సర్కారు కక్షపూరిత విధానాలతో ఏకంగా 700 సీట్లను కోల్పోవాల్సి వచ్చింది. మరోవైపు ముందస్తు ప్రణాళిక ప్రకారం 2025–26 విద్యా సంవత్సరంలో పిడుగురాళ్ల, బాపట్ల, పార్వతీపురం, నర్సీపట్నం, పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం మెడికల్ కాలేజీలు ప్రారంభమై వీటి ద్వారా 1,050 సీట్లు సమకూరాల్సి ఉంది. అయితే ఒక్క కళాశాలకు కూడా ప్రభుత్వం దరఖాస్తు చేసిన దాఖలాలు లేవు. దీంతో 2024–25లో 700 సీట్లు, 2025–26లో 1,750 చొప్పున మొత్తంగా రెండేళ్లలో 2,450 సీట్లను మన విద్యార్థులు కోల్పోనున్నారు. -
AP: పేదలకు అందని ద్రాక్షగా వైద్య విద్య!
అధికారం అంటే కేవలం రాజకీయ ఆట కాదు – ఇది పేదల జీవితాలను మార్చే, వారి కలలకు ఊపిరి పోసే బాధ్యత. వై.ఎస్. జగన్ మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ, ‘నవ రత్నాలు’ అనే తొమ్మిది స్తంభాల ద్వారా విద్య, ఆరోగ్యం, సంక్షేమాన్ని ప్రతి ఇంటి గడప వద్దకు చేర్చింది. ఈ పథకాలు పేదలకు సమాజంలో గౌరవం పెంచడమే కాదు... కొత్తగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాయి. కానీ, టీడీపీ కూటమి ప్రభుత్వం ‘సూపర్ సిక్స్’ వాగ్దానాలను నిధుల కేటాయింపు లేకుండా చేసి వాటిని నీటి మీద రాతలుగా మార్చింది. ముఖ్యంగా వైద్యరంగాన్ని కార్పొరేట్లకు తాకట్టు పెట్టి వైద్యాన్ని పేదలకు దూరం చేస్తోంది. ఇందుకు మంచి ఉదాహరణ మెడికల్ కాలేజీలను ‘పబ్లిక్ – ప్రైవేట్ పార్ట్నర్షిప్’ (పీపీపీ) పేరుతో 66 ఏళ్లు ప్రైవేటు సంస్థలకు ఇవ్వాలనుకోవడం!వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019–2024 మధ్య నవరత్నాలను నూటికి నూరుశాతం అమలు పరచి ఏపీలో సుస్థిర సమగ్ర అభివృద్ధిని సాధించింది. ముఖ్యంగా ఆరోగ్య రంగంలో వైఎస్సార్సీపీ 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 2,485 ఎంబీబీఎస్ సీట్లను కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చింది. 2023–24 నాటికి 5 కాలేజీలు ప్రారంభం కాగా, 750 సీట్లు అందు బాటులోకి వచ్చాయి. ‘ప్రతి పార్లమెంటరీ నియో జకవర్గంలో ఒక మెడికల్ కాలేజీ’ అనే లక్ష్యం స్థాని కంగా నాణ్యమైన వైద్య శిక్షణను నిర్ధారించింది. ‘ఆరోగ్యశ్రీ’ పథకం పేదలకు ఉచిత వైద్య సేవలను అందించి, ఆర్థిక భారం లేకుండా చికిత్సలు అందేలా చేసింది.అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటైజేషన్ విధానం ఏపీలో పేదల ఆశలకు పెను ముప్పుగా మారింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్మించిన 17 మెడికల్ కాలేజీల్లో 10 కాలేజీలను పీపీపీ మోడల్ కింద ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని నిర్ణయించడం పేదలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ కాలేజీలు ఏటా తక్కువ ఫీజుతో ఎంబీబీఎస్ సీట్లను అందించాయి. పేదలకు వైద్య విద్యను సరసమైనదిగా చేశాయి. కానీ, ప్రైవేటైజేషన్ తర్వాత ఫీజులు కేటగిరీ ఏ (కన్వీనర్ కోటా) సీటు రూ. 5–10 లక్షలు, కేటగిరీ బీ (మేనేజ్మెంట్ కోటా) సీటు రూ. 15–20 లక్షలకు చేరవచ్చని అంచనా. ఒక ఎంబీబీఎస్ కోర్సుకు రూ. 27.5–110 లక్షల వరకు ఖర్చు అవ్వచ్చు. ఇంత అధిక ఫీజులు పేదలకు వైద్య విద్యను అందని ద్రాక్షగా మారుస్తాయి.ప్రజా ఆరోగ్య వేదిక (పీఏవీ) ఈ ప్రైవేటైజేషన్ 1,500 ఎంబీబీఎస్ సీట్లను ప్రభావితం చేస్తుందనీ, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ విద్యార్థుల రిజర్వేషన్ కోటాను 50% వరకు తగ్గి స్తుందనీ హెచ్చరిస్తోంది. ప్రైవేటు యాజమాన్యాల నిర్వహణలో 50% సీట్లను మార్కెట్ రేట్లతో విక్ర యించుకోవచ్చు, పైగా ప్రభుత్వ కాలేజీల కంటే 10–20 రెట్లు ఎక్కువగా ఫీజులు ఉంటాయి. ఈ చర్య పేదలకు వైద్యవిద్యను పూర్తిగా దూరం చేస్తుందనడంలో సందేహం లేదు. సేవా– ఆధారిత వైద్యుల సంఖ్యను తగ్గిస్తుంది. ఉదాహరణకు, చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిని అపోలో హాస్పిటల్స్‌కు అప్పగించిన తర్వాత సేవల ఖర్చులు గణనీయంగా పెరిగాయి. ఇదే ధోరణి మెడికల్ కాలేజీల్లోనూ కనిపిస్తే, పేదలకు వైద్య సేవలు అత్యంత ఖరీదైనవిగా మారతాయి.ఈ ప్రైవేటైజేషన్ విధానాన్ని విజయవాడలో 2025 ఏప్రిల్‌లో జరిగిన పీఏవీ సదస్సు ‘క్రూరం’ అని విమర్శించింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతీ నలుగురిలో ఒకరు సరసమైన, నాణ్యమైన వైద్యం అందక ఆర్థిక ఒత్తిడిలో ఉన్నారనీ, ప్రభుత్వ ప్రైవేటైజేషన్ పాలసీ ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుందనీ హెచ్చరించింది. మధ్యప్రదేశ్‌లో 10 ట్రామా సెంటర్లను ప్రైవేటీకరణ చేసిన తర్వాత ఖర్చులు 10–20 రెట్లు పెరిగాయి. ఇదే ఆంధ్రలో జరిగితే పేదలు ఉచితంగా పొందాల్సిన వైద్య సేవలను కోల్పోతారు. అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో సూపర్–స్పెషాలిటీ ఆసుపత్రులను పీపీపీ మోడ్‌లో నిర్మించాలనే కూటమి ప్రభుత్వ మరో ప్రణాళిక కూడా ఆరోగ్య రంగాన్ని వాణిజ్యీకరణ వైపు నడిపించనుంది. ఇది ఆరోగ్యశ్రీ వంటి పథకాలను బలహీనపరుస్తుంది. ఈ విధానం ప్రజల ఆరోగ్యం, ఆశల కంటే కార్పొరేట్ లాభా లకు ప్రాధాన్యం ఇస్తుంది.చదవండి: ఎవరి కోసం ఈ ఒప్పందం?ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన తరుణమిది. సొంత లాభాల కోసం ప్రజల హక్కులను తాకట్టు పెట్టే విధానాలను మేధావులు, ప్రజాస్వామ్య వాదులు తిరస్కరించాలి.- తలకోల రాహుల్ రెడ్డిసామాజిక ఆర్థిక రంగాల విశ్లేషకుడు -
విశాఖలో మెడికో ఆత్మహత్య
సాక్షి, విశాఖపట్నం: నగరంలో మెడికో శ్రీరామ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీధర్‌రెడ్డి వేధింపులు తాళలేక విద్యార్థి ఆత్మహత్యకి పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న భీమిలి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.మెడికల్ కళాశాల వద్ద మెడికోలు ఆందోళన చేపట్టారు. కళాశాల డీన్ సుధాకర్, వైస్ ప్రిన్సిపాల్ శ్రీధర్ రెడ్డి వేధింపులు తాళలేకే శ్రీరామ్ ఆత్మహత్య చేసుకున్నాడని నిరసనకు దిగారు. చాలా మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అంటున్న శ్రీరామ్ బంధువులు ఆరోపిస్తున్నారు.బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యమరో ఘటనలో తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా చిలుకూరులోని గేట్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థిని ఇవాళ తెల్లవారుజామున భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మంచిర్యాల జిల్లాకు చెందిన బీటెక్ విద్యార్థిని కృష్ణవేణిగా గుర్తించారు. ఉగాది పండగకు ఇంటికి వెళ్లి నిన్న(శుక్రవారం) సాయంత్రం తల్లితో కలిసి కళాశాలకు విద్యార్థిని వచ్చింది.తల్లితో కలిసి రాత్రి హాస్టల్లో ఉన్న మృతురాలు కృష్ణవేణి.. తెల్లవారుజామున కాలేజీ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ర్యాగింగ్ భూతం చంపేస్తోంది!
సాక్షి, అమరావతి: దేశ విద్యా వ్యవస్థను ర్యాగింగ్ భూతం వెంటాడుతోంది. బంగారు భవిష్యత్తు కోసం కలలు కనే ఎందరో విద్యార్థుల ప్రాణాలను బలి కోరుతోంది. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ర్యాగింగ్ మాటున మితిమీరిన చేష్టలు చావు కేకలు పెట్టిస్తున్నాయి. ఇవి ఎంతగా ఉన్నాయంటే కోటాలో విద్యార్థుల బలవన్మరణాలతో దాదాపు సమానంగా ర్యాగింగ్ మరణాలు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా వైద్య విద్యా సంస్థల్లో ర్యాగింగ్ ఎమర్జెన్సీ వాతావరణాన్ని తలపిస్తోంది. సొసైటీ అగైనెస్ట్ వయొలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ (సేవ్) సంస్థ ‘స్టేట్ ఆఫ్ ర్యాగింగ్ ఇన్ ఇండియా 2022–24’ నివేదిక ప్రకారం.. వర్సిటీలు, కళాశాలల్లో 2022 – 24 మధ్య కాలంలో 51 ర్యాగింగ్ మరణాలు నమోదైనట్టు తేలింది. ఇందులో వైద్య కళాశాలలను ర్యాగింగ్ ఫిర్యాదులకు ‘హాట్‌స్పాట్’లుగా గుర్తించింది. దేశంలోని విద్యార్థుల సంఖ్యలో వైద్య విద్యార్థుల సంఖ్య 1.1 శాతమే. కానీ, మొత్తం ఫిర్యాదుల్లో వైద్య కళాశాలల నుంచి వచ్చినవి 38.6 శాతం.అందని ఫిర్యాదులు ఎన్నో..దేశంలోని 1,946 కళాశాలల నుంచి నేషనల్ యాంటీ ర్యాగింగ్ హెల్ప్‌లైన్‌లో నమోదైన 3,156 ఫిర్యాదుల ఆధారంగా ఈ నివేదిక కీలక ధోరణులను అంచనా వేసింది. ఇందులో అధిక ప్రమాదకర సంస్థలు, ర్యాగింగ్ సంబంధిత కేసుల తీవ్రతను గుర్తించింది. వాస్తవానికి నివేదికలో ఇచ్చిన ఫిర్యాదులు మూడేళ్లలో కేవలం జాతీయ యాంటీ ర్యాగింగ్ హెల్ప్‌లైన్‌లో నమోదు చేసినవి మాత్రమేనని విశ్లేషకులు తెలిపారు. ఇందులో నమోదవని ఫిర్యాదులు ఇంకా చాలా పెద్ద సంఖ్యలో ఉంటాయని చెబుతున్నారు. కళాశాలలకు నేరుగా నమోదయ్యే ఫిర్యాదులు భారీ సంఖ్యలో ఉన్నాయని, కేసు తీవ్రతను బట్టి నేరుగా పోలీసులకు కూడా అందుతాయని వివరించారు. సాధారణంగా తక్కువ సంఖ్యలోని బాధితులు దైర్యంగా ముందుకొచ్చి సమస్యను నివేదిస్తారని, అందుకే చాలా కేసులు బయటకు రావడంలేదని అభిప్రాయపడ్డారు. బాధితుల వ్యక్తిగత గోప్యతను కాపాడటానికి పేరు లేకుండా ఫిర్యాదులను స్వీకరించాలని జాతీయ ర్యాగింగ్ వ్యతిరేక హెల్ప్‌లైన్‌కు ఈ నివేదిక సిఫారసు చేసింది.వైద్య కళాశాలల్లో ర్యాగింగ్ ఎమర్జెన్సీ..తాజా నివేదికలో నమోదైన 51 ర్యాగింగ్ మరణాల్లో సుమారు 45.1 శాతం వైద్య కళాశాలల్లో జరిగినవే. వైద్య కళాశాలల్లో 23 మంది ర్యాగింగ్ భూతానికి బలైపోయారు. ఇతర విద్యా సంస్థలతో పోలిస్తే వైద్య కళాశాలలు, వర్సిటీల్లో 30 శాతం అధికంగా ర్యాగింగ్ మరణాలు నమోదవుతున్నాయని సేవ్ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. వైద్య కళాశాలల్లో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఎమర్జెన్సీని ప్రకటించాల్సిన సమయం వచ్చిందని హెచ్చరించింది.ర్యాగింగ్ నియంత్రణ బృందాలు పర్యవేక్షించాలిర్యాగింగ్ నియంత్రణకు సేవ్ సంస్థ చేసిన ప్రధాన సూచనల్లో కొన్ని..» కళాశాలలు అంకితభావంతో కూడిన వ్యక్తులతో యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేయాలి» కొత్తగా కళాశాలల్లో చేరే విద్యార్థులకు సుహృద్భావ వాతావరణంలో విద్యను అందించాలి» యూజీసీ, ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం కొత్తగా చేరే విద్యార్థులకు ప్రత్యేక హాస్టళ్లలో వసతి కల్పించాలి» హాస్టళ్లలోని సీసీ కెమెరాల నిఘాను భద్రతా సిబ్బంది, యాంటీ ర్యాగింగ్ కమిటీలు, తల్లిదండ్రులు పర్యవేక్షించాలి» తీవ్రమైన ర్యాగింగ్ కేసుల్లో సంబంధిత సంస్థలు 24 గంటల్లోగా పోలీసులకు ఫిర్యాదు చేయాలిమూడేళ్లలో కోటా ఆత్మహత్యలతో పోలిస్తే..కోటాలో బలవన్మరణాలసంఖ్య 57విద్యా సంస్థల్లో ర్యాగింగ్ మరణాల సంఖ్య 51 2022 – 24 మధ్య ర్యాగింగ్ మరణాలు..2022 142023 172024 20 -
‘ప్రైవేట్’ నోట.. ‘డీమ్డ్’ పాట!
సాక్షి, అమరావతి: ప్రతిభ ఆధారంగా నిరుపేద, మధ్యతరగతి విద్యార్థులకు దక్కే ఎంబీబీఎస్, బీడీఎస్, మెడికల్ పీజీ, ఎండీఎస్ సీట్లకు గండికొడుతూ ప్రైవేట్ వైద్య కళాశాలల యాజమాన్యాలు డీమ్డ్ (స్వయం ప్రతిపత్తి) బాట పట్టడానికి పోటీపడుతున్నాయి. ప్రైవేట్ యాజమాన్యాలకు అనుకూలమైన పార్టీ టీడీపీ అధికారంలో ఉండటంతో ఇదే అనువైన సమయంగా భావించిన యాజమాన్యాలు స్వయం ప్రతిపత్తి సాధించుకోవడానికి తెగ ఆరాటపడుతున్నాయి. గడిచిన ఐదేళ్లలో ఎప్పుడూ లేనివిధంగా చంద్రబాబు సీఎం అయ్యాక యూజీసీ నుంచి డీమ్డ్ వర్సిటీ హోదా పొందడానికి ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్’ (ఎన్ఓసీ) మంజూరు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తుల తాకిడి పెరిగింది. అపోలో, కిమ్స్, జీఎస్ఎల్, జెమ్స్, మరికొన్ని వైద్య కళాశాలల యజమానులు ఎన్ఓసీ కోరినట్లు తెలుస్తోంది. విశాఖలోని హోమి బాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో మెడికల్ పీజీ సీట్లున్నాయి. ఈ సంస్థ సైతం ఆరోగ్య విశ్వవిద్యాలయం అఫిలియేషన్ నుంచి బయటపడి, వేరే రాష్ట్రంలోని మాతృ సంస్థ అఫిలియేషన్ కింద పనిచేయడానికి ఎన్ఓసీ కోరింది.ఎంబీబీఎస్, పీజీ కోర్సుల ఫీజుల్లో వ్యత్యాసం ఇలా..ప్రస్తుతం ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ ఫీజులు కన్వీనర్ 16,500బీ కేటగిరి 13,20,000ప్రస్తుతం ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మెడికల్ పీజీ ఫీజులుకన్వీనర్4,96,800బీ కేటగిరి 9,93,600ఎన్ఓసీ ఇవ్వాలంటే చట్ట సవరణ చేయాల్సిందేడీమ్డ్ బాట పట్టేందుకు కళాశాలలు పెట్టుకున్న ఎన్ఓసీ దరఖాస్తులపై సీఎం చంద్రబాబు స్థాయిలో కొద్ది రోజుల క్రితం చర్చలు నడిచినట్టు తెలిసింది. ఎన్ఓసీ ఇవ్వడానికి సా«ధ్యాసాధ్యాలపై చర్చించినట్టు సమాచారం. అయితే, ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం చట్టం 1986లోని సెక్షన్6 ప్రకారం రాష్ట్రంలోని వైద్య కళాశాలలు ఇతర యూనివర్సిటీల కింద పనిచేయడానికి వీల్లేదు. రాష్ట్రంలోని వైద్య విద్య కళాశాలలన్నీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోనే కార్యకలాపాలు నిర్వహించాలని చట్టం చెబుతోంది. ఎన్ఓసీ మంజూరు అంశంపై ప్రభుత్వం న్యాయ శాఖ అభిప్రాయాన్ని కోరగా.. ఏ ఒక్కరికి ఎన్ఓసీ ఇవ్వాలన్నా వర్సిటీ చట్టానికి సవరణ తప్పనిసరని సూచించినట్టు తెలిసింది. కాగా, 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో ఎమ్మెల్యే బాలకృష్ణ చిన్నల్లుడు, మంత్రి లోకేశ్ తోడల్లుడైన విశాఖ ఎంపీ భరత్ కుటుంబానికి చెందిన ‘గీతం’ సంస్థ డీమ్డ్ హోదా దక్కించుకుంది. అధికారం అండతో అడ్డదారుల్లో వైద్య కళాశాలలకు డీమ్డ్ హోదా సాధించుకున్నారన్న ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి. అదే తరహాలోనే ఇప్పుడు కూడా సొంత సామ్రాజ్యాన్ని స్థాపించుకోవడం కోసం ప్రభుత్వ పెద్దల అస్మదీయ ప్రైవేట్ మెడికల్ కాలేజీ యాజమాన్యాలు ప్రయత్నిస్తున్నాయి.చెప్పిందే ఫీజు.. పెట్టిందే నిబంధనరాష్ట్రంలోని గీతం మినహా మిగిలిన ప్రైవేట్ వైద్య కళాశాలలన్నీ హెల్త్ వర్సిటీ చట్టం ప్రకారం కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 18 ప్రైవేట్ వైద్య కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో 50 శాతం ఎంబీబీఎస్ సీట్లు కన్వీనర్, 35 శాతం బీ కేటగిరీ, 15 శాతం ఎన్ఆర్ఐ కోటా కింద భర్తీ చేస్తున్నారు. సీట్లన్నింటినీ ఆరోగ్య విశ్వవిద్యాలయమే భర్తీ చేస్తోంది. మొత్తం సీట్లలో 50 శాతానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వంటి రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తింపజేస్తున్నారు. అదేవిధంగా కన్వీనర్ కోటా సీట్లలో 85 శాతం సీట్లను స్థానిక విద్యార్థులకే అవకాశం ఉంటోంది. ప్రభుత్వం నిర్ణయించిన మేరకే ఈ కళాశాలల్లో ఫీజులు ఉంటున్నాయి. అడ్మిషన్లతో పాటు, పరీక్షలను వర్సిటీయే నిర్వహిస్తోంది. అదే డీమ్డ్ హోదా వస్తే ఆయా కళాశాలలపై హెల్త్ వర్సిటీ అజమాయిషీ ఉండదు. వారు చెప్పిందే ఫీజు, పెట్టిందే నిబంధనగా మారిపోతుంది. ఎంబీబీఎస్, పీజీ సీట్లన్నీ యాజమాన్య కోటాగా మారిపోతాయి. ఎంబీబీఎస్, బీడీఎస్, ఎండీఎస్, మెడికల్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలన్నింటినీ జాతీయ ర్యాంకుల ఆధారంగా మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ, డీజీహెచ్ఎస్, కేంద్ర ప్రభుత్వం భర్తీ చేస్తాయి. స్థానిక, ఎస్సీ, ఎస్టీ, బీసీ వంటి రిజర్వేషన్లు ఉండవు. దీంతో మన విద్యార్థులు పెద్దఎత్తున సీట్లను నష్టపోతారు. మన విద్యార్థులకు తీరని నష్టం..నిజానికి.. కొత్త వైద్య కళాశాలలు ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయంతో డాక్టర్ కావాలన్న మన విద్యార్థుల కలలను చంద్రబాబు ప్రభుత్వం చిదిమేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నిర్మించ తలపెట్టిన కొత్త వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. 17 కళాశాలల్లో ఐదింటిని 2023–24 విద్యా సంవత్సరంలోనే ప్రారంభించి 750 ఎంబీబీఎస్ సీట్లను వైఎస్ జగన్ ప్రభుత్వం సమకూర్చింది. మిగిలిన కళాశాలలను పీపీపీలో ప్రైవేట్‌కు కట్టబెట్టాలన్న పక్కా వ్యూహంతో రెండు, మూడు దశల్లోని పులివెందుల, మదనపల్లె, మార్కాపురం, ఆదోని, పిడుగురాళ్ల, బాపట్ల, పార్వతీపురం, నర్సీపట్నం, పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం మెడికల్ కళాశాలల నిర్మాణ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. వాస్తవానికి.. పులివెందుల వైద్య కళాశాలకు 50 ఎంబీబీఎస్ సీట్లతో తరగతుల ప్రారంభానికి ఎన్ఎంసీ అనుమతులిచ్చినా ప్రభుత్వం వద్దని లేఖ రాసి విద్యార్థులకు తీరని ద్రోహం తలపెట్టింది. ఇలా కూటమి ప్రభుత్వ దుర్మార్గపు నిర్ణయాలతో రెండేళ్లలో 2,450 సీట్లను మన విద్యార్థులు నష్టపోతున్నారు. దీనికితోడు.. ప్రస్తుతమున్న ప్రైవేట్ వైద్య కళాశాలలు డీమ్డ్ హోదా సాధించుకునే ప్రయత్నాలు చేస్తుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. -
మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ భూతం.. డంబెల్స్ వేలాడదీసి
తిరువనంతపురం : ‘అరె తమ్ముళ్లు మందేయాలి. డబ్బులు ఇవ్వండ్రా అని సీనియర్ విద్యార్థులు.. తమ జూనియర్ విద్యార్థులకు హుకుం జారీ చేశారు. దీంతో జూనియర్లు చేసేది లేక కొన్ని వారాల పాటు ప్రతి ఆదివారం సీనియర్లకు డబ్బులు ఇచ్చే వారు. ఈ తరుణంలో ఓ ఆదివారం ఎప్పటిలాగే జూనియర్ల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు సీనియర్లు ప్రయత్నించారు. దీంతో జూనియర్లు మీకు ఇచ్చేందుకు మా దగ్గర డబ్బులు లేవు అన్నా’అని సమాధానం ఇచ్చారు. అంతే కోపోద్రికులైన సీనియర్ విద్యార్థులు.. జూనియర్లను అత్యంత కిరాతంగా ర్యాగింగ్ (Ragging) చేశారు. చివరికి..కేరళ పోలీసులు వివరాల మేరకు.. కేరళ (kerala) రాజధాని తిరువనంతపురంకు చెందిన ముగ్గురు విద్యార్థులు కొట్టాయంలో ప్రభుత్వ కాలేజీలో (kottayam government narsing college) నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. అయితే, గతేడాది నవంబర్‌లో మూడో సంవత్సరం నర్సింగ్ చదువుతున్న ఐదుగురు విద్యార్థులు ఈ ముగ్గురు విద్యార్థుల్ని ర్యాగింగ్ పేరుతో వేధింపులకు గురి చేశారు.ఆ ర్యాగింగ్ ఎలా ఉందంటే? బాధితుల్ని నగ్నంగా నిలబెట్టి గాయపరచడం. వాటిపై కారం పూయడం. మంటకు విలవిల్లాడుతుంటే వీడియోలు తీసి పైశాచికానందం పొందడం. గాయాల్ని కంపాస్‌తో కొలవడం. అంతర్గత అవయవాలకు డంబెల్స్‌ను వేలాడదీయడం వంటి వికృత చేష్టలకు దిగారు. తాము ర్యాగింగ్ చేస్తున్నామని ఫిర్యాదు చేస్తే మీకు చదువును దూరం చేస్తామని బాధిత విద్యార్థుల్ని బెదిరింపులకు దిగారు. అలా నాలుగు నెలల పాటు సీనియర్ల వేధింపులను మౌనంగా భరించారు.ఈ నేపథ్యంలో ఓ బాధిత విద్యార్థి ధైర్యం చేసి కాలేజీలో జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీనియర్ విద్యార్థుల్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు కస్టడీలో విద్యార్థుల్ని పోలీసులు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.👉చదవండి : నేను లీవ్ అడిగితే ఇవ్వరా? ప్రభుత్వ ఉద్యోగి ఏం చేశాడో చూడండి! -
5 ఏళ్లలో 75 వేల సీట్లు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు ఈసారి బడ్జెట్లో రూ.99,858.56 కోట్లను కేటాయించారు. గత బడ్జెట్లో రూ.89,974.12 కోట్లు కేటాయించగా, ఈసారి 11 శాతం మేర పెంచినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అలాగే దేశంలో వచ్చే ఏడాది నుంచి మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల్లో అదనంగా పదివేల సీట్లను పెంచనున్నట్లు తెలిపారు. ఈ పెంచిన సీట్ల ద్వారా వైద్య విద్యను అభ్యసించాలనుకునే వారి కల సాకారమైనట్లేనన్నారు. కాలేజీల్లో మెడికల్ సీట్ల కొరతను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏటా వేలాది మంది విద్యార్థులు మెడికల్ సీటు రాక.. మరో ఏడాదిపాటు వేచి ఉండాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు ఏడాదికి 10 వేల సీట్ల చొప్పున ఐదేళ్లలో 75 వేల సీట్లు పెంచుతున్నట్లు శనివారం నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2025–26 వార్షిక బడ్జెట్లో ప్రకటించారు. తమ ప్రభుత్వం గత పదేళ్లలో 1.1 లక్షల అండర్ గ్రాడ్యుయేట్, పీజీ మెడికల్ సీట్లను అందుబాటులోకి తెచ్చిందన్నారు.జిల్లా ఆసుపత్రుల్లో డే కేర్ కేన్సర్ సెంటర్లుఇటీవల కాలంలో కేన్సర్ బారిన పడుతూ ఎంతోమంది రోగులు ఆసుపత్రుల్లో బారులుతీరుతున్నారు. ఈ సమస్యను గుర్తించిన కేంద్రం.. ఆ రోగులకు ఉపశమనం కలిగించేందుకు మరో అడుగు ముందుకేసింది. ఇందులోభాగంగా దేశవ్యాప్తంగా డే కేర్ కేన్సర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వచ్చే మూడేళ్లలో దేశంలోని అన్ని జిల్లా ఆసుపత్రుల్లో డే కేర్ కేన్సర్ సెంటర్లను అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. 2025–26లో సుమారు 200 సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.కేటాయింపులు ఇలా...» వైద్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు మొత్తం రూ.99,858.56 కోట్లను కేటాయించగా, ఇందులో వైద్య, కుటుంబ సంక్షేమ విభాగానికి రూ.95,957 కోట్లు, ఆరోగ్య పరిశోధనల విభాగానికి రూ.3,900.69 కోట్లు కేటాయించారు.» ఆయుష్ మంత్రిత్వ శాఖకు రూ.3,992.90 కోట్ల కేటాయింపు. గత బడ్జెట్లో రూ.3,497 కోట్లను కేటాయించారు.. ఇప్పుడు 14.15 శాతం పెంపు.» జాతీయ ఆరోగ్య మిషన్‌కు రూ.37,226.92 కోట్ల కేటాయింపు. గత బడ్జెట్లో రూ.36,000 కోట్లు.» ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజనకు (ఏబీపీఎం–జేఏవై) రూ.9,406 కోట్లు.» స్వయంప్రతిపత్తి గల సంస్థలకు రూ.20,046.07 కోట్లు కేటాయించారు. 2024–25లో రూ.18,978.72 కోట్లు కేటాయించారు.36 మందులకు సుంకం మినహాయింపు» కేన్సర్, అరుదైన వ్యాధులు, ఇతర దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారికి ఉపశమనం అందించేందుకు వారు వాడే మందులపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (బీసీడీ)ని పూర్తిగా మినహాయించను న్నారు. వారు చికిత్సకు వినియోగించే 36 రకాల జీవ ఔషధాలపై ఈ మినహాయింపు వర్తిస్తుందని బడ్జెట్లో ప్రతిపాదించారు. అలాగే, ఫార్మాకంపెనీలు పేషెంట్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్స్ కింద రోగులకు అందించే మరో 37 రకాల మందులతోపాటు 13 కొత్త ఔషధాలకు బీసీడీని మినహాయించనున్నారు. దీంతో ఆయా మందులను రోగులను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. » ప్రైవేట్ రంగం భాగస్వామ్యంతో దేశంలో మెడికల్ టూరిజం, ‘హీల్ ఇన్ ఇండియా’ను ప్రోత్సహించడంతోపాటు, సులభతర వీసా విధానాన్ని తెస్తామని చెప్పారు. » ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, ప్రభుత్వ మాధ్యమిక స్కూళ్లకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని అందుబాటులోకి తెస్తామని బడ్జెట్లో ప్రతిపాదించారు.మెరుగైన ఆరోగ్య జీవితం కోసం...ఈ బడ్జెట్ మెరుగైన ఆరోగ్య జీవితాన్ని అందించేందుకు దోహదపడుతుంది. దేశంలో 200 డేకేర్ కేన్సర్ సెంటర్ల ఏర్పాటు, కేన్సర్, దీర్ఘకాల వ్యాధుల చికిత్సకు ఉపయోగించే మందులపై కస్టమ్స్ డ్యూటీని మినహాయించడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ చర్యలు సంక్రమణేతర వ్యాధులపై పోరాటానికి, రోగుల జేబులపై భారం తగ్గించేందుకు దోహదపడతాయి. కొత్త విద్యావకాశాలతోపాటు ఉపాధి కల్పనకు కూడా ఈ బడ్జెట్ ఊతమిస్తుంది.– ప్రతాప్ సి.రెడ్డిఅపోలో హాస్పిటల్స్ ఫౌండర్, చైర్మన్ -
మెడికల్ పీజీలో లోకల్ కోటా రాజ్యాంగ విరుద్ధం... సుప్రీంకోర్టు స్పష్టీకరణ
-
17 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేశారు వైఎస్ జగన్
-
బాబూ.. ఒక్క మెడికల్ కాలేజైనా తెచ్చావా?: సీదిరి అప్పలరాజు
సాక్షి, తాడేపల్లి: ప్రైవేటు మీద ఉన్న ఆసక్తి చంద్రబాబుకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలపైన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీమంత్రి సీదిరి అప్పలరాజు. కేంద్రంతో భాగస్వామ్యంతో ఉండి కూడా చంద్రబాబు మెడికల్ కాలేజీలు తీసుకురాలేదని మండిపడ్డారు. అలాగే, మాకు మెడికల్ సీట్లు వద్దని లేఖ రాసిన ఏకైక ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వమే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.మాజీమంత్రి సీదిరి అప్పలరాజు మీడియాతో మాట్లాడుతూ.. ‘ఏపీలో ఒకే టర్మ్‌లో 17 మెడికల్ కాలేజీలు తీసుకువచ్చిన ఘనత వైఎస్ జగన్‌ది. పద్నాలుగేన్నరేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు.. ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేదు. ప్రైవేటు మీద ఉన్న ఆసక్తి చంద్రబాబుకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలపైన లేదు. కేంద్రంతో భాగస్వామ్యంతో ఉండి కూడా చంద్రబాబు మెడికల్ కాలేజీలు తీసుకురాలేదు.వైఎస్ జగన్ తీసుకువచ్చిన విధానాలను చూసి కేంద్రం, ఇతర రాష్ట్రాలు ముందుకెళ్లాయి. పులివెందులలో మెడికల్ సీట్లు వద్దని కూటమి ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. మాకు మెడికల్ సీట్లు వద్దని లేఖ రాసిన ఏకైక ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వమే. 750 మెడికల్ సీట్లు రాకుండా కూటమి ప్రభుత్వం అడ్డుపడింది’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
మెడికల్ కలపై కత్తి!
-
క్లాస్‌మేట్‌పై జూనియర్ డాక్టర్ అత్యాచారం
గ్వాలియర్: ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆవరణలోని ఉపయోగంలో లేని హాస్టల్లో ఓ జూనియర్ డాక్టర్(25) తోటి వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ నగరంలోని గజరాజా మెడికల్ కాలేజీలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడు, బాధితురాలు వేర్వేరు హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్నారు. ఆదివారం నిందితుడు కాలేజీ ఆవరణలోనే ఉన్న ఉపయోగంలో లేని బాయ్స్ హాస్టల్లోకి రావాలని బాధితురాల్ని కోరాడు. అంగీకరించి అక్కడికి వెళ్లిన ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటనపై బాధితురాలు కాంపు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, నిందితుడిని సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు నగర ఎస్పీ అశోక్ జడొన్ చెప్పారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు. -
మెడిసిన్ సీటు దక్కలేదని...
రాయదుర్గం టౌన్: రాయదుర్గం టౌన్: వైద్య కళాశాలలో సీటు దక్కకపోవడంతో మనస్తాపం చెంది ఓ యువతి వేగంగా వెళుతున్న రైలు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు... కర్ణాటకలోని కలబురిగి (గుల్బర్గా) జిల్లా సేడం పట్టణానికి చెందిన కిషోర్‌కుమార్ కుమార్తె తనూజ (20) మంగళవారం ఉదయం చిత్రదుర్గం చేరుకుని అక్కడి వైద్య కళాశాలలో సీటు కోసం ప్రయత్నించింది. అయితే ఆమెకు సీటు దక్కకపోవడంతో అదే రోజు మధ్యాహ్నం బెంగళూరు నుంచి రాయదుర్గం మీదుగా హోస్పేట్‌కు వెళ్లే రైలులో తిరుగు ప్రయాణమైంది. ప్రయాణిస్తూనే తల్లిదండ్రులకు ఫోన్ చేసి తనకు మెడికల్ సీటు దక్కలేదని, జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా తెలిపింది. అప్పటికే మధ్యాహ్నం 1 గంట. రాయదుర్గం శివారులోని పైతోట సమీపంలో వేగంగా వెళుతున్న రైలు నుంచి కిందకు దూకింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అయితే కుమార్తె ఫోన్ కాల్‌తో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పలుమార్లు కాల్ చేసినా ఆమె లిఫ్ట్ చేయకపోవడంతో విషయాన్ని వెంటనే కర్ణాటక పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తనూజ సెల్‌ఫోన్ నంబర్ ఆధారంగా ఆమె ఆచూకీ కోసం కర్ణాటక పోలీసులు గాలింపు చేపట్టారు.ఈ క్రమంలో బుధవారం ఉదయం పైతోట వద్ద గ్యాంగ్‌మెన్ నగేష్... పట్టాలు పక్కనే పడి ఉన్న యువతి మృతదేహాన్ని గుర్తించి సమాచారం ఇవ్వడంతో గుంతకల్లు జీఆర్పీ ఎస్ఐ మహేంద్ర, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతురాలి వద్ద లభించిన ఆధారాలను పరిశీలించి తనూజగా నిర్ధారించారు. అక్కడే పడి ఉన్న ఫోన్లోని నంబర్‌కు కాల్ చేసి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కుమార్తె మృతి విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు రాయదుర్గానికి ప్రయాణమైనట్లు సమాచారం. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
మల్లారెడ్డి మెడికల్ కాలేజీకి ఈడీ బిగ్ షాక్
-
TG: మెడికల్ కాలేజీలపై ‘ఈడీ’ కొరడా.. భారీగా ఆస్తులు అటాచ్
సాక్షి,హైదరాబాద్:పీజీ మెడికల్ సీట్ల అవకతవకలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తు ముమ్మరమైంది. ఇందులో భాగంగా తెలంగాణలో పలు మెడికల్ కాలేజీల ఆస్తులను ఈడీ తాజాగా అటాచ్ చేసింది. మల్లారెడ్డి మెడికల్ కాలేజ్,చల్మెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీల ఆస్తులు అటాచ్ చేసింది.కాలేజీలకు చెందిన రూ.5.34కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఇప్పటివరకు మొత్తం రూ.9.71కోట్ల మెడికల్ కాలేజీల ఆస్తులు ఈడీ అటాచ్లోకి వెళ్లాయి. కాళోజీ నారాయణరావు హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఫిర్యాదుపై ఈడీ దర్యాప్తు మొదలుపెట్టింది.వరంగల్ జిల్లా మట్వాడ పోలీస్స్టేషేన్లో నమోదైన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. ప్రైవేటు మెడికల్ కాలేజీలు, కన్సల్టెంట్లు,మధ్యవర్తులతో కలిసి పీజీ సీట్లు బ్లాక్ చేసినట్లు గుర్తించారు. సాదారణ సీట్లకంటే మూడు రెట్లు అధికంగా ఫీజులు వసూలు చేసినట్లు ఈడీ ప్రాథమికంగా తేల్చింది. -
తెలంగాణలో పలు మెడికల్ కళాశాలల ఆస్తులు జప్తుచేసిన ఈడీ
-
ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు 'చంద్ర' గ్రహణం
-
ధనవంతులే డాక్టర్లు కావాలా ?.. ఇదేం దిక్కుమాలిన పాలసీ..!
-
పులివెందుల అంటే ఎందుకంత కక్ష...
-
‘పులివెందుల మెడికల్ కాలేజీపైనే ఎందుకీ కక్ష?’
గుంటూరు, సాక్షి: ప్రైవేటీకరణ అనేది కూటమి సర్కార్ ఫిలాసఫీ అని, అందుకే రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయాలని ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. ఏపీ మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మంగళవారం గుంటూరు ఆమె మీడియాతో మాట్లాడారు.ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ గొప్ప ఆలోచన. గ్రామాల్లోకి సూపర్ స్పెషాలిటీ డాక్టర్లను పంపి పేదలకు వైద్యం అందించాం. మా హయాంలో ఎలాంటి సౌకర్యాలు అందించామో ప్రజలకు తెలుసు. ఏపీని మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో వైఎస్ జగన్ పని చేశారు. కానీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురద జల్లాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.కూటమి ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖను నిర్వీర్యం చేస్తోంది. ఆరోగ్యశ్రీని ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా అనారోగ్యశ్రీగా మార్చేశారు. ప్రజలకు అసౌకర్యాలు కలగకూడదని 104, 108 సర్వీసులు తీసుకొచ్చాం. ఆ సేవలను కూడా అటకెక్కించారు. ఏపీకి 17 మెడికల్‌కాలేజీలు తీసుకొచ్చాం. మెడికల్ కాలేజీల కోసం రూ.8,500 కోట్లు ఖర్చు చేశాం. మిగిలిన మెడికల్ కాలేజీలను పూర్తి చేయలేక మాపై బురద జల్లాలని చూస్తున్నారు. కాలేజీలకు పర్మిషన్ రాలేదని సంబంధిత మంత్రి మాట్లాడుతున్నారు. ఆయన తెలిసి మాట్లాడుతున్నారో.. తెలీక మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. మొత్తం 17 కాలేజీల్లో పులివెందుల కాలేజీ కూడా ఉంది. కానీ, ఆ ఒక్క కాలేజీ మీద అంత కక్ష ఎందుకు?. పులివెందుల కాలేజీకి మెడికల్ సీట్లు వద్దని లేఖ రాయడం దేనికి?. అని నిలదీశారామె...పులివెందుల మెడికల్ కాలేజ్‌కు హాస్టల్స్ లేవని ఇప్పుడున్న మంత్రి చెప్తున్నారు. కానీ, ప్రభుత్వం దృష్టి పెట్టి ఉంటే ఈపాటికి పనులన్నీ పూర్తి అయ్యేవి. (ఈ ఏడాది జనవరి లో హాస్టల్ నిర్మాణానికి సంబంధించిన ఫోటోలను మీడియా ముందు రజిని ప్రదర్శించారు)కూటమి ప్రభుత్వం ఒక పథకం ప్రకారం సోషల్ మీడియా పై కేసులు పెట్టి ఇబ్బంది పెడుతోంది. కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అని విడదల రజిని అన్నారు. -
అశ్లీల కథలు బిగ్గరగా చదవాలంటూ.. మెడికల్ కాలేజీల్లో హద్దులు దాటిన ర్యాగింగ్
న్యూఢిల్లీ: కొద్ది రోజుల క్రితం కోల్‌కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో మహిళా డాక్టర్‌పై జరిగిన హత్యాచారం యావత్ దేశాన్ని కుదిపేసింది. ఈ ఘటనపై దేశంలోని వైద్యులంతా నిరసనలు చేపట్టారు. ఆస్పత్రుల్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేయాలని వారు డిమాండ్ చేశారు.ఇటువంటి ఘటనలు కొనసాగున్న తరుణంలో.. మెడికల్ కాలేజీల్లో కొత్తగా అడ్మిషన్ తీసుకుని, కాలేజీల్లో చేరిన జూనియర్ విద్యార్థులను సీనియర్లు పరిధులు దాటి ర్యాంగింగ్ చేస్తున్న వైనాలు వెలుగు చూస్తున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా అందించిన వివరాల ప్రకారం మెడికల్ కాలేజీల్లో కొత్తగా చేరిన విద్యార్థులను సీనియర్లు ర్యాగింగ్ పేరిట వేధిస్తున్నారు. వారి చేత అశ్లీల పుస్తకాలలోని కథలను బిగ్గరగా చదివిస్తూ, వాటిని గుర్తుపెట్టుకోవాలని బలవంతం చేస్తున్నారు.స్త్రీలపై లైంగిక హింసకు పాల్పడే కథలను జూనియర్ల చేత సీనియర్లు చదివిస్తున్నారు. నిజానికి సీనియర్ వైద్యు విద్యార్థులు కొత్తగా చేరిన విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాలను అందజేయాల్సి ఉంటుంది. అయితే దీనికి భిన్నంగా సీనియర్ విద్యార్థులు ప్రవర్తిన్నున్న తీరు కనిపిస్తోంది. అలాగే బోర్డుపై అశ్లీల పదాలను రాసి, వాటిని బిగ్గరగా చదవమంటున్నారని జూనియర్లు ఆరోపిస్తున్నారు.ఇటువంటి సందర్భాల్లో జూనియర్లు వెనుకాడితే సీనియర్లు నవ్వుతూ వారిని ఎగతాళి చేస్తుంటారని తెలుస్తోంది. బ్లాంక్ నాయిస్ వ్యవస్థాపకురాలు జాస్మిన్ పతేజా మీడియాతో మాట్లాడుతూ సీనియర్ విద్యార్థులు జూనియర్లతో ర్యాగింగ్ చేసే అంశాలు అత్యాచారాలను ప్రోత్సహించేవిగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆపరేషన్ టేబుల్‌పై అపస్మారక స్థితిలో పడి ఉన్న రోగులను చూసి కొందరు అనస్థీషియాలజిస్టులు, సర్జన్లు నీచంగా మాట్లాడటాన్ని చూశానని ఓ సీనియర్ మహిళా డాక్టర్ మీడియా ముందు వాపోయారు.ఇది కూడా చదవండి: ఖమ్మం: అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్వాకం.. విద్యార్థికి గుండు కొట్టించి... -
మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ ఓవరాక్షన్..
-
ఖమ్మం: అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్వాకం.. విద్యార్థికి గుండు కొట్టించి...
సాక్షి, ఖమ్మం: ఖమ్మం మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. మెడికల్ విద్యార్థి హెయిర్ స్టయిల్‌పై వివాదం తలెత్తింది. ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కళాశాలలో ఓ విద్యార్థి భిన్నంగా హెయిర్ కట్ చేయించుకున్నాడని ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఏకంగా విద్యార్థికి గుండు కొట్టించాడు. దీనిపై విద్యార్థి ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశాడు.సదరు అసిస్టెంట్ ప్రొఫెసర్ బాయ్స్ హాస్టల్ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఆఫీసర్ కావడం గమనార్హం. ఖమ్మం మెడికల్ కళాశాలలో ఈ ఏడాది చేరిన ములుగుకు చెందిన విద్యార్థి ఒకరు చైనా దేశస్తుల మాదిరి కటింగ్ చేయించుకున్నాడు. దీన్ని గమనించిన సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసిస్తూ ఇలా వ్యవహరించొద్దని సూచిచడంతో ఆ విద్యార్థి సెలూన్‌కి వెళ్లి జుట్టు ట్రిమ్ చేయించుకున్నాడు.కాగా, ఈ విషయం బాయ్స్ హాస్టల్ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఆఫీసర్‌గా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ (సర్జన్)కు తెలియడంతో ఆగ్రహించిన ఆయన విద్యార్థిని సెలూను తీసుకెళ్లి ఏకంగా గుండు గీయించాడు. దీంతో మనస్తాపం చెందిన సదరు విద్యార్థి కళాశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరరావుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను హాస్టల్ విధుల నుంచి తప్పించారు. కాగా, ఈ విషయమై ప్రిన్సిపాల్‌ను వివరణ కోరగా ఘటనను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ దృష్టికి తీసుకెళ్లడమే కాక విచారణకు ఫోర్‌మెన్ కమిటీని నియమించామని తెలిపారు. -
మళ్లీ ర్యాగింగ్ కలకలం
సాక్షి, హైదరాబాద్: మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ భూతం మళ్లీ పంజా విసురుతోంది. సుప్రీంకోర్టు తీర్పు (2009), 1956 యూజీసీ చట్టం సెక్షన్ 36, సబ్‌సెక్షన్ (1) ప్రకారం విద్యాసంస్థల్లో ర్యాగింగ్ నిషేధం. అయినా ఆకతాయిలైన సీనియర్ విద్యార్థులు అక్కడక్కడా శ్రుతి మించి ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా మెడికల్ కాలేజీల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. గత ఏడాది రాష్ట్రంలోని గాందీ, కాకతీయ, మహబూబాబాద్ వైద్య కళాశాలల్లో ర్యాగింగ్ చోటు చేసుకుంది. తాజాగా పాలమూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ వ్యవహారం వెలుగులోకి రావడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. మరోవైపు గాంధీ మెడికల్ కాలేజీలోనూ ర్యాగింగ్ జరుగుతోందని, అయితే బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది.అలాగే మరికొన్ని ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోనూ ర్యాగింగ్ ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు. కొత్తగా ఎంబీబీఎస్‌లో చేరిన విద్యార్థులను సీనియర్లు ర్యాగింగ్ పేరిట వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. అధికారులు కఠినచర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా, ర్యాగింగ్ ఘటనలు ఆగడం లేదనే చర్చ జరుగుతోంది. ర్యాగింగ్ పేరిట వికృత చేష్టలు రాష్ట్రవ్యాప్తంగా గత నెల నుంచి ఎంబీబీఎస్ మొదటి ఏడాది తరగతులు ప్రారంభమయ్యాయి. కొత్త విద్యార్థులను రెండు, మూడో ఏడాది చదివే కొందరు ఎంబీబీఎస్ విద్యార్థులు ర్యాగింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ర్యాగింగ్‌కు పాల్పడితే కాలేజీ నుంచి తొలగించాలన్న నిబంధనలు ఉన్నాయని, కానీ విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని సస్పెన్షన్లకే పరిమితం అవుతున్నామని వైద్య విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది గాంధీ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ సందర్భంగా కొందరు సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులను అర్ధరాత్రి 2 గంటల సమయంలో తమ హాస్టల్ గదులకు రప్పించి వారితో బలవంతంగా మద్యం, సిగరెట్లు తాగించినట్లు తేలింది. కొందరితో బట్టలు విప్పించి డ్యాన్స్‌లు చేయించారనే ప్రచారం కూడా జరిగింది. వారు బూతులు తిడుతూ, బాధితులతో కూడా బూతులు మాట్లాడించారని తేలింది. కొందరు విద్యార్థినిలను కూడా ర్యాగింగ్ చేసినట్లు ప్రచారం జరిగింది. ‘పాలమూరు’లో విద్యార్థులతో గోడకుర్చీ వేయించడం లాంటి దారుణ చర్యలకు పాల్పడినట్లు తెలిసింది. ఇలా రాష్ట్రంలోని పలు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కూడా ర్యాగింగ్ సంఘటనలు జరుగుతున్నా అవి బయటకు పొక్కకుండా యాజమాన్యాలు జాగ్రత్త వహిస్తున్నాయని అంటున్నారు. అయితే కళాశాలలపై నిఘా వేసి ర్యాగింగ్‌ను అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం ఈ విషయంలో నిర్లిప్తంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. కొన్ని కాలేజీలు డీఎంఈ కార్యాలయానికి సమాచారం ఇవ్వడంలేదని తెలిసింది. కళాశాలల్లో యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఉన్నా అవి నామమాత్రంగా మారాయని అంటున్నారు. ర్యాగింగ్ ఘటనలపై వైద్యవిద్య డైరెక్టర్ (డీఎంఈ) డాక్టర్ వాణి వివరణ కోసం ఫోన్ ద్వారా ప్రయత్నించగా ఆమె స్పందించలేదు. క్రిమినల్ చర్య అన్న యూజీసీర్యాగింగ్ను నేరపూరిత (క్రిమినల్) చర్యగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పేర్కొంది. దీనిపై ఫిర్యాదులకు ప్రత్యేకంగా మానిటరింగ్ సెల్ నంబర్‌ను కూడా ఏర్పాటు చేసింది. ర్యాగింగ్‌ను నిరోధించాలంటూ ఉన్నత విద్యా సంస్థల ప్రిన్సిపాళ్లకు, వర్సిటీల వీసీలకు స్పష్టమైన ఆదేశాలున్నాయి. యూజీసీ నిబంధనలు.. » విద్యాసంస్థల్లో యాంటీ ర్యాగింగ్ కమిటీని, యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్‌ను, యాంటీ ర్యాగింగ్ సెల్‌ను ఏర్పాటు చేయాలి. » ర్యాగింగ్ శ్రుతిమించి విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన పక్షంలో సంబంధిత కాలేజీ ప్రిన్సిపాల్, వర్సిటీ రిజిస్ట్రార్లను విచారణకు పిలుస్తారు. వీరు నేషనల్ యాంటీ ర్యాగింగ్ మానిటరింగ్ కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. » విద్యాసంస్థలు, విద్యార్థుల హాస్టళ్లు, కీలక ప్రాంతాల్లో సీసీ టీవీలు ఏర్పాటు చేయాలి. » విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు వర్క్‌షాప్‌లు, సెమినార్లు నిర్వహించాలి. » యాంటీ ర్యాగింగ్ మానిటరింగ్ కమిటీ ఆదేశాల ప్రకారం జూనియర్లు, సీనియర్ల మధ్య అంతరాన్ని పూడ్చేందుకు మెంటార్íÙప్ను ప్రోత్సహించాలి. » లీగల్ కౌన్సెలింగ్ ద్వారా ర్యాగింగ్ నిరోధక చట్టాలు, శిక్షలపై అవగాహన కల్పించాలి. -
విద్యార్థికి గుండు కొట్టించిన అసిస్టెంట్ ప్రొఫెసర్
ఖమ్మం వైద్యవిభాగం/ నల్లగొండ టౌన్: ఖమ్మం మెడికల్ కళాశాలలో ఓ విద్యార్థి భిన్నంగా హెయిర్ కట్ చేయించుకున్నాడని ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఏకంగా విద్యార్థికి గుండు కొట్టించాడు. దీనిపై విద్యార్థి ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశాడు. ఇక నల్లగొండ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జరిగిన ర్యాగింగ్ ఘటనలో విద్యార్థులతో పాటు జూనియర్ డాక్టర్‌ను సైతం సస్పెండ్ చేశారు. వివరాలు.. ఖమ్మంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ విద్యార్థికి ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ గుండు కొట్టించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సదరు అసిస్టెంట్ ప్రొఫెసర్ బాయ్స్ హాస్టల్ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఆఫీసర్ కావడం గమనార్హం. ఖమ్మం మెడికల్ కళాశాలలో ఈ ఏడాది చేరిన ములుగుకు చెందిన విద్యార్థి ఒకరు చైనా దేశస్తుల మాదిరి కటింగ్ చేయించుకున్నాడు. దీన్ని గమనించిన సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసిస్తూ ఇలా వ్యవహరించొద్దని సూచించడంతో ఆ విద్యార్థి సెలూన్‌కు వెళ్లి జుట్టు ట్రిమ్ చేయించుకున్నాడు. కాగా, ఈ విషయం బాయ్స్ హాస్టల్ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఆఫీసర్‌గా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ (సర్జన్)కు తెలియడంతో ఆగ్రహించిన ఆయన విద్యార్థిని సెలూన్‌కు తీసుకెళ్లి ఏకంగా గుండు గీయించాడు. దీంతో మనస్తాపం చెందిన సదరు విద్యార్థి కళాశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరరావుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను హాస్టల్ విధుల నుంచి తప్పించారు. కాగా, ఈ విషయమై ప్రిన్సిపాల్‌ను వివరణ కోరగా ఘటనను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ దృష్టికి తీసుకెళ్లడమే కాక విచారణకు ఫోర్‌మెన్ కమిటీని నియమించామని తెలిపారు. నల్లగొండ కాలేజీలో ర్యాగింగ్ కలకలం!నల్లగొండ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జూనియర్ విద్యార్థినులను ర్యాగింగ్ చేశారనే ఆరోపణలతో ముగ్గురు సీనియర్ విద్యార్థులను, ఒక జూనియర్ డాక్టర్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిసింది. సీనియర్ మెడికోలతో పాటు జూనియర్ డాక్టర్ కూడా విద్యార్థినులను ర్యాగింగ్ పేరుతో ఇబ్బందులకు గురిచేశారన్న ఫిర్యాదుతో ఎంబీబీఎస్ రెండవ సంవత్సరం విద్యార్థిని నెల రోజులు, ఇద్దరు నాలుగో సంవత్సరం విద్యార్థులను ఆరు నెలలు, ఒక జూనియర్ డాక్టర్‌ను మూడు నెలలపాటు సస్పెండ్ చేసినట్లు కాలేజీ వర్గాల ద్వారా తెలిసింది. అయితే మొదటిసారి ర్యాగింగ్ విషయం బహిర్గతం కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ర్యాగింగ్ విషయంపై కళాశాల ప్రిన్సిపల్‌ను వివరణ కోరడానికి ‘సాక్షి’ప్రయత్నించగా స్పందించలేదు. -
ఘోరాతి ఘోరంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
ఝాన్సీ: యూపీలోని ఝాన్సీ మెడికల్ కాలేజీలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో 10 మంది నవజాత శిశువులు మృతి చెందారు. ఈ ఉదంతంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. చిన్నారుల మృతి హృదయ విదారకమన్నారు. ఈ ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా విచారం వ్యక్తం చేశారు.పీఎం మోదీ ఎక్స్‌లో ఒక పోస్ట్ చేస్తూ.. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ మెడికల్ కాలేజీలో జరిగిన అగ్ని ప్రమాదం హృదయ విదారకం. పిల్లలను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి. ఈ దుఃఖాన్ని భరించే శక్తి భగవంతుడు వారికి ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో స్థానిక యంత్రాంగం బాధితులను ఆదుకునేందుకు అన్ని విధాలా కృషి చేస్తోంది’ అని దానిలో పేర్కొన్నారు.రాష్ట్రపతి ముర్ము సోషల్ మీడియా వేదికగా.. ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని ఆ భగవంతుడు బాధిత తల్లితండ్రులకు, కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. గాయపడిన చిన్నారులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. हृदयविदारक! उत्तर प्रदेश में झांसी के मेडिकल कॉलेज में आग लगने से हुआ हादसा मन को व्यथित करने वाला है। इसमें जिन्होंने अपने मासूम बच्चों को खो दिया है, उनके प्रति मेरी गहरी शोक-संवेदनाएं। ईश्वर से प्रार्थना है कि उन्हें इस अपार दुख को सहने की शक्ति प्रदान करे। राज्य सरकार की…— PMO India (@PMOIndia) November 16, 2024తక్షణ పరిహారం రూ. 5 లక్షలుఈ ఘటనపై యూసీ సీఎం యోగి విచారం వ్యక్తం చేస్తూ, మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం మృతుల కుటుంబాలకు తక్షణం రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన చిన్నారులకు రూ.50 వేలు చొప్పున సాయం అందించాలని సీఎం యోగి ఆదేశించారు. ఈ దుర్ఘటనపై సమాచారం అందిన వెంటనే డిప్యూటీ సీఎం బ్రిజేష్ పాఠక్, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ అగ్ని ప్రమాదం జరిగిన మెడికల్ కాలేజీకి చేరుకున్నారు. అక్కడి పరిస్థితులను సమీక్షించారు. ఈ ఘటనపై 12 గంటల్లోగా నివేదిక అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.ఇది కూడా చదవండి: యూపీలో ఘోరం.. 10 మంది పసికందుల సజీవ దహనం -
యూపీ విషాదం.. మంటలు చెలరేగినా మోగని అలారం!
ఝాన్సీ: ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలోగల లక్ష్మీ బాయి మెడికల్ కాలేజీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుని 10 మంది చిన్నారులు సజీవదహనమయ్యారు. ఈ ఘటన అనంతరం ఆస్పత్రికి సంబంధించిన పలు లోపాలు బయటపడ్డాయి. లక్ష్మీ బాయి మెడికల్ కాలేజీలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అందరినీ అప్రమత్తం చేసేందుకు సేఫ్టీ అలారం అమర్చారు. అయితే మంటలు చెలరేగిన సమయంలో ఆ సేఫ్టీ అలారం మోగలేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వార్డులో పొగలు వ్యాపించడాన్ని గమనించినవారు కేకలు వేయడంతో ప్రమాదాన్ని ఆస్పత్రి సిబ్బంది గుర్తించారు. సేఫ్టీ అలారం మోగి ఉంటే రెస్క్యూ ఆపరేషన్ త్వరగా జరిగేదని స్థానికులు అంటున్నారు.నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చెలరేగిన మంటలు నిమిషాల వ్యవధిలోనే చుట్టుపక్కలకు వ్యాపించాయి. దీంతో ఎవరూ లోపలికి వెళ్లేందుకు మార్గం లేకుండా పోయింది. అగ్నిమాపక సిబ్బంది కూడా లోనికి వెళ్లేందుకు ఇబ్బంది పడ్డారు. వారు వార్డు కిటికీ అద్దాలను పగులగొట్టి, లోపలికి చేరుకుని మంటలను అదుపు చేస్తూనే, శిశువులను బయటకు తీసుకువచ్చే ప్రయత్నాలు చేశారు.ఆస్పత్రిలోని చిన్నారుల వార్డులో రెండు యూనిట్లు ఉన్నాయి. ఒక యూనిట్ లోపల, మరొకటి వెలుపల ఉంది. ముందుగా అగ్నిమాపక సిబ్బంది బయట ఉన్న వార్డులోని నవజాత శిశువులను వెలుపలికి తీసుకువచ్చారు. ఇంతలోనే మంటలు లోపలి వార్డులోకి ప్రవేశించడంతో అక్కడున్న పిల్లలు తీవ్రంగా కాలిపోయారు. వీరిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకురాలేకపోయారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. గాయపడిన చిన్నారులకు తగిన చికిత్స అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై ఝాన్సీ లోక్‌సభ ఎంపీ అనురాగ్ శర్మ మాట్లాడుతూ, ఈ ఘటన తనను ఎంతగానో కలచివేసిందన్నారు. ఆయన ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కాగా ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన 16 మంది చిన్నారులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారని ఎస్ఎస్పీ సుధా సింగ్ తెలిపారు.ఇది కూడా చదవండి: యూపీలో ఘోరం.. 10 మంది పసికందుల సజీవ దహనం -
యూపీలో ఘోరం.. 10 మంది పసికందుల సజీవ దహనం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఝాన్సీలోని మహారాణి లక్ష్మీ బాయి మెడికల్ కాలేజీలోని పిల్లల వార్డులో అగ్నిప్రమాదం చోటుచేసుకుని, 10మంది చిన్నారులు సజీవ దహనమయ్యారు. మృతులలో రోజుల వయసు కలిగిన నవజాత శిశువులు కూడా ఉన్నారు.ఘటన జరిగిన సమయంలో ఎన్ఐసీయూలో మొత్తం 54 మంది పిల్లలు చికిత్స పొందుతున్నారు. శుక్రవారం రాత్రి 10.45 గంటల సమయంలో ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్‌లో విద్యుత్ షార్ట్ జరిగింది. వెంటనే మంటలు చెలరేగాయి. మంటల ధాటికి వార్డులోని పిల్లల బెడ్లు, ఇతరత్రా సామాగ్రి అగ్నికి ఆహుతయ్యింది. చిన్నారుల మృతితో ఆస్పత్రి ప్రాంగణంలో తీవ్ర విషాదం నెలకొంది. #WATCH | Uttar Pradesh: A massive fire broke out at the Neonatal intensive care unit (NICU) of Jhansi Medical College. Many children feared dead. Rescue operations underway. More details awaited.(Visuals from outside Jhansi Medical College) pic.twitter.com/e8uiivyPk3— ANI (@ANI) November 15, 2024సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపకదళం రంగంలోకి దిగి మంటలను ఆపేందుకు ప్రయత్నించింది. ఈ దుర్ఘటనపై యూపీ సీఎం యోగి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన చిన్నారులకు మెరుగైన చికిత్స అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆయన ఆదేశించారు. ప్రమాదంపై 12 గంటల్లోగా నివేదిక అందించాలని ఝాన్సీ డివిజనల్ కమిషనర్ పోలీస్ రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్‌కు ఆదేశాలు జారీచేశారు.जनपद झांसी स्थित मेडिकल कॉलेज के NICU में घटित एक दुर्घटना में हुई बच्चों की मृत्यु अत्यंत दुःखद एवं हृदयविदारक है।जिला प्रशासन तथा संबंधित अधिकारियों को युद्ध स्तर पर राहत एवं बचाव कार्यों को संचालित कराने के निर्देश दिए हैं।प्रभु श्री राम से प्रार्थना है कि दिवंगत आत्माओं…— Yogi Adityanath (@myogiadityanath) November 15, 2024ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్, ఆరోగ్య మంత్రి అర్ధరాత్రి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఉదంతంపై విచారణ నివేదిక వచ్చిన తర్వాతే ప్రమాదానికి కారణమేమిటనేది తెలుస్తుందన్నారు. నవజాత శిశువులు మరణం దురదృష్టకరమని, ఈ ఘటనపై వెంటనే విచారణకు ఆదేశించామన్నారు. ఘటనకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. VIDEO | Uttar Pradesh: Rescue operation continues at Jhansi Medical College where a fire broke out on Friday. #Fire #Jhansifire(Source: Third Party)(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/TFras9L3jz— Press Trust of India (@PTI_News) November 15, 2024చిన్నారుల మృతదేహాలను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామని, ఏడుగురి చిన్నారుల మృతదేహాలను గుర్తించామని తెలిపారు. నవజాత శిశువులను కోల్పోయిన కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని బ్రజేష్ పాఠక్ హామీనిచ్చారు. ఈ ఆసుపత్రిలో గత ఫిబ్రవరిలో ఫైర్ సేఫ్టీ ఆడిట్ జరిగిందని, జూన్‌లో మాక్ డ్రిల్ కూడా నిర్వహించారన్నారు. అయినా ఈ దుర్ఘటన జరగడం విచారకరమన్నారు. ఇది కూడా చదవండి: HYD: అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదం.. -
పాలమూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పాలమూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. ఇటీవల కొత్తగా కళాశాలలో చేరిన వైద్య విద్యార్థులను సీనియర్లు ర్యాగింగ్ పేరిట ఇబ్బందులకు గురిచేశారని, గోడ కురీ్చలు వేయించడం వంటి చర్యలతో వేధించారని కళాశాల డైరెక్టర్‌కు రాత పూర్వక ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు పదిమంది సీనియర్ వైద్య విద్యార్థులపై సస్పెన్షన్ విధించారు.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా ఏర్పడిన ఈ వైద్య కళాశాలకు 2016 జనవరిలో భారత వైద్యమండలి (ఎంసీఐ) నుంచి అనుమతులు లభించాయి. అదే సంవత్సరం జూన్‌లో తరగతులు ప్రారంభం కాగా.. ఇప్పటివరకు ర్యాగింగ్ ఘటనలు చోటుచేసుకోలేదు. తాజాగా ర్యాగింగ్ కారణంగా 10 మంది విద్యార్థుల సస్పెన్షన్ చర్చనీయాంశంగా మారింది. సదరు విద్యార్థులపై డిసెంబర్ ఒకటి వరకు సస్పెన్షన్ అమల్లో ఉంటుందని.. ర్యాగింగ్‌ను ఉపేక్షించేది లేదని కళాశాల డైరెక్టర్ రమేశ్ తెలిపారు. -
పీజీ వైద్య విద్య అవకాశాలకు గండి
సాక్షి, అమరావతి: తమ పీజీ వైద్య విద్య అవకాశాలకు రాష్ట్ర ప్రభుత్వం గండి కొడుతోందని ఎంబీబీఎస్ పూర్తయిన విద్యార్థులు మండిపడుతున్నారు. ఏపీలోని మెడికల్ కళాశాలల్లో ఎంబీబీఎస్ చదివిన వారంతా రాష్ట్రంలో స్థానికులుగా గుర్తించి పీజీ మెడికల్ అడ్మిషన్లు చేపడుతుండటం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో ఎంబీబీఎస్ చదివిన ఉత్తరాది సహా పక్కనున్న తెలంగాణా, కర్ణాటక, తమిళనాడు, కేరళకు చెందిన మెడికోలకు స్థానికత కల్పించడం ఏంటని, ఒకటి నుంచి ఎంబీబీఎస్ వరకు మన రాష్ట్రంలో చదివిన మెడికోలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే అడ్మిషన్ల ప్రక్రియ మొదలైందని, నిబంధనలు సవరించ డం కుదరదని ప్రభుత్వం చేతులు ఎత్తేయడం పట్ల మండి పడుతున్నారు. జీవో 646ను అనుసరించి ఇలా చేయాల్సి వస్తోందని ఎన్టీఆర్ వర్సిటీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఏడాది జూన్ నెలతో రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయింది. ఈ మేరకు విభజన చట్టం ప్రకారం సిద్ధార్థ వైద్య కళా శాలలో తెలంగాణాకు ఎంబీబీఎస్, పీజీ సీట్ల కేటాయింపును రద్దు చేశారు. అయినప్పటికీ పీజీ తెలంగాణ వారికి పీజీ సీట్లు కేటాయించడం ఏ లెక్కన సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. 646 జీవోకు ఎందుకు సవరణ చేయలేదని నిలదీస్తున్నారు. రాష్ట్రంలో ఇంకా మెరిట్ లిస్ట్ కూడా ఇవ్వలేదని, ఈ నేపథ్యంలో ఈ జీవోకు సవరణ చేయా ల్సిందేనని మెడికోలు, వారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తు న్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం జోక్యం చేసుకో వాలని కోరుతున్నారు. కాగా, ఈ ఏడాది కొత్త కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు మంజూరైనా.. వద్దంటూ లేఖ రాసి గండికొట్టిన ప్రభుత్వం.. తాజాగా పీజీ విద్య విషయంలోనూ క్షమార్షం కాని తప్పిదం చేసిందంటున్నారు. మెడికోల వాదన ఇలా..రాష్ట్రంలో ఎంబీబీఎస్ చదివిన ఏ రాష్ట్రానికి చెందిన వారినైనా పీజీ మెడికల్ ప్రవేశాల్లో ఆరోగ్య విశ్వవిద్యాలయం స్థానికులుగా పరిగణిస్తోంది. రాష్ట్ర కోటా సీట్లలో వారికి రిజర్వేషన్ కల్పిస్తోంది. ఉదాహరణకు రాష్ట్రంలో 460కి పైగా ఆల్ ఇండియా, 600 మేర సీ కేటగిరి, బీ కేటగిరిలోనే బీ1 కింద 150 ఎంబీబీఎస్ సీట్లు భర్తీ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఈ సీట్లలో పెద్ద ఎత్తున అడ్మి షన్లు పొంది ఎంబీబీఎస్ చదువుతుంటారు. అలాగే కన్వీనర్ కోటా కింద గత ఏడాది వరకు సిద్ధార్థ మెడికల్ కాలేజీలో తెలంగాణ విద్యార్థులు 40 శాతం మంది ఎంబీబీఎస్ చదివారు. ఇలా ఇక్కడ ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఇతర రాష్ట్రాల వారందరికీ స్థానికత కల్పించడంతో వందల సంఖ్యలో పీజీ సీట్లు రాష్ట్ర విద్యార్థులు నష్టపోతున్నారు. మరోవైపు పక్కనున్న తెలంగాణా రాష్ట్రం పీజీ అడ్మిషన్ల నిబంధనలను సవరించింది. మన వాళ్లు ఎక్కడ చదివినా స్థానికత కల్పించాలిఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మన దగ్గర ఎంబీబీఎస్ చది విన వారికి స్థానికత కల్పించే విధానాన్ని రద్దు చేయాలి. ఏపీ విద్యార్థులు ఆల్ ఇండియా కోటా కింద ఏ రాష్ట్రంలో ఎంబీబీఎస్ చదివినా పీజీలో మన దగ్గరే స్థానికత కల్పించాలి.మన విద్యార్థులకు పక్క రాష్ట్రాలు స్థానికత ఇవ్వ నప్పుడు, ఇతర రాష్ట్రాల వారికి మనం స్థానికత ఇవ్వడం సరికాదు. ఆ మేరకు నిబంధనలు సవరించాలి. లేదంటే మన విద్యార్థులకే తీవ్ర నష్టం వాటిల్లుతుంది. – డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, ప్రెసిడెంట్, ఏపీ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ -
మెడికల్ పీజీ సీట్ల బ్లాకింగ్ స్కాంలో ఈడీ దూకుడు
సాక్షి, హైదరాబాద్: మెడికల్ పీజీ సీట్ల కేటాయింపులో గతంలో జరిగిన అవకతవకలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీట్ల కేటాయింపులో కుంభకోణానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాలేజీల సిబ్బందిని విచారణకు పిలుస్తున్నారు. గురువారం మల్లారెడ్డి మెడికల్ కాలేజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సురేందర్ రెడ్డి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. శుక్రవారం బీఆర్ఎస్ నాయకుడు, చల్మెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చైర్మన్ చల్మెడ లక్ష్మీనరసింహారావు విచారణకు హాజరైనట్టు అధికారవర్గాల సమాచారం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నుంచి 2023లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన లక్ష్మీనర్సింహారావును మెడికల్ సీట్ల బ్లాక్ దందాపై వివిధ కోణాల్లో ప్రశ్నించినట్టు తెలిసింది. ఏమిటీ కుంభకోణం? కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌కి అనుబంధంగా ఉన్న 12 మెడికల్ కాలేజీల్లో పలు సీట్లను బ్లాక్ చేసి, అధిక ఫీజులకు అమ్ముకున్నారన్న ఆరోపణలపై ఈడీ అధికారులు గతేడాది (2023) జూన్‌లో సోదాలు జరిపారు. నీట్ పీజీ మెరిట్ ఆధారంగా కనీ్వనర్ కోటా లేదా ఫ్రీ సీట్ల కింద దాదాపు 45 సీట్లను ఉత్తరాది రాష్ట్రాల విద్యార్థుల పేర్లతో బ్లాక్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విద్యార్థులు ఎవరూ వర్సిటీలో అడ్మిషన్ కోసం ఎన్నడూ దరఖాస్తు చేసుకోలేదని విశ్వవిద్యాలయ అధికారులు గుర్తించారు. దీనిపై వర్సిటీ రిజిస్ట్రార్ ప్రవీణ్‌కుమార్ 2022 ఏప్రిల్‌లో వరంగల్‌లోని మటా్వడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. సీట్లను బ్లాక్ చేసి పెద్దమొత్తంలో ఆర్థిక లావాదేవీలకు పాల్పడినట్టు ఉన్న ఆరోపణలపై మనీలాండరింగ్ కోణంలో ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. కేసు దర్యాప్తులో భాగంగా 2023 జూన్ 22న బొమ్మకల్‌లోని చల్మెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, కరీంనగర్ జిల్లా నగునూర్‌లోని ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లిలోని కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఖమ్మంలోని మమత మెడికల్ కాలేజీ, సంగారెడ్డిలోని ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీ, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని భాస్కర్ మెడికల్ కాలేజీ, మేడ్చల్‌లోని మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మహబూబ్‌నగర్‌లోని ఎస్వీఎస్ మెడికల్ కాలేజీ, సూరారంలోని మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, పటాన్‌చెరులోని మహేశ్వర మెడికల్ కాలేజీ, చేవెళ్లలోని పట్నం మహేందర్‌రెడ్డి మెడికల్ కాలేజీ, డెక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రాంగణాల్లో ఈడీ సోదాలు జరిపింది. అందులో భాగంగా దర్యాప్తు కొనసాగిస్తున్న అధికారులు.. 12 కాలేజీలతో పాటు మరికొన్ని కాలేజీల యాజమాన్యాలకు కూడా సమన్లు జారీ చేసినట్టు తెలిసింది. అన్ని కాలేజీల ప్రతినిధుల నుంచి వివరాలు సేకరించడంతో పాటు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంటున్నారు. మొత్తం కాలేజీల నుంచి వివరాలు సేకరించిన తర్వాత కేసులో మరికొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయనే చర్చ జరుగుతోంది. -
నాకెలాంటి ఈడీ నోటీసులు రాలేదు: మల్లారెడ్డి
సాక్షి,హైదరాబాద్ : మెడికల్ కళాశాల పీజీ సీట్ల కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) నోటీసులు అందాయంటూ వస్తున్న మీడియా కథనాలపై మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే సీహెచ్ మల్లారెడ్డి స్పందించారు. తనకు ఎలాంటి నోటీసులు రాలేదని స్పష్టత ఇచ్చారాయననాకు ఎలాంటి నోటీసులు రాలేదు. నోటీసులు నా కొడుక్కి ఇచ్చారు. గతంలో ఈడీ రైడ్స్ జరిగాయి. విచారణకు రమ్మంటారు.. అది రెగ్యులర్ ప్రాసెస్ అని అన్నారాయన. కాగా, మెడికల్ పీజీ సీట్ల స్కాం కేసులో.. ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే.. మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డికి ఈడీ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. ఇక నోటీసుల్లో.. అక్రమంగా సీట్లను బ్లాక్ చేశారన్న అభియోగంపై వివరణ కోరినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారంలో కిందటి ఏడాది మల్లారెడ్డి కాలేజీల్లో ఈడీ సోదాలు జరిపింది. అంతేకాదు మెడికల్ కళాశాలల అడ్మినిస్ట్రేషన్ అధికారి సురేందర్‌రెడ్డి ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు కూడా. -
పులివెందుల మెడికల్ కాలేజీ దగ్గర వైఎస్ జగన్ సెల్ఫీ
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందుల మెడికల్ కాలేజీ వద్ద వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సెల్ఫీ తీసుకున్నారు. మెడికల్ కాలేజీకి వచ్చిన సీట్లను కూటమి సర్కార్ వెనక్కి పంపగా, కాలేజీని నిర్వీర్యం చేస్తున్నారంటూ ఆయన సెల్ఫీ తీసుకున్నారు.రాష్ట్రానికి ఎంబీబీఎస్ సీట్లు వస్తుంటే సంతోషించాల్సింది పోయి.. అవసరం లేదంటూ ఇటీవల చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. విద్యార్థుల కలలను చిదిమేసే విధంగా కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేయాలని చంద్రబాబు సర్కారు తీసుకున్న నిర్ణయం పెనుశాపంగా మారింది. పాడేరు కాలేజీని 50 సీట్లకే పరిమితం చేయడమేమిటి?. పులివెందుల కాలేజీకి 50 సీట్లు మంజూరు చేస్తే వద్దనడం ఏంటి? తక్షణమే ఎన్ఎంసీకి రాసిన లేఖను వెనక్కి తీసుకోవాలి’’ అంటూ సీఎం చంద్రబాబును గతంలో వైఎస్ జగన్ హెచ్చరించారు కూడా.కాగా, వైఎస్సార్ జిల్లా పులివెందులలో వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. ఇవాళ ఉదయం ఆయన ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వేంపల్లిలో వైఎస్సార్సీపీ నేత రుద్ర భాస్కర్ రెడ్డి నివాసానికి వెళ్లి ఇటీవల వివాహం జరిగిన ఆయన కుమారుడు భరతసింహారెడ్డి, వధువు సుశాంతికలకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. అనంతరం మాజీ జెడ్పీటీసీ షేక్ షబ్బీర్ వలి నూతన గృహానికి చేరుకుని కుటుంబ సభ్యుల యోగక్షేమాలను వైఎస్ జగన్ తెలుసుకున్నారు. -
వైద్య కళాశాలల్లో ప్రిన్సిపల్స్, సూపరింటెండెంట్ల బదిలీ
రాష్ట్రంలో పలు ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల ప్రిన్సిపల్స్, సూపరింటెండెంట్లను బదిలీ చేస్తూ సోమవారం వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు ఉత్తర్వులు జారీచేశారు. – సాక్షి, అమరావతి: -
కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ భూతం ..
-
‘సాయిబాబా భౌతికకాయాన్ని మెడికల్ కాలేజీకి అప్పగిస్తాం’
హైదరాబాద్: ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్, పౌర హక్కుల ఉద్యమకారుడు జీఎన్ సాయిబాబా (54) శనివారం రాత్రి హైదరాబాద్ నిమ్స్‌లో కన్నుమూశారు. సాయిబాబా మృతదేహాన్ని ఆయన కోరుకున్న విధంగా మెడికల్ కాలేజీకి దానం చేయనున్నట్లు కుటుంబ సభ్యులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.మావోయిస్టు సంబంధాలు ఉన్నాయన్న అభియోగాల కేసులో హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడంతో మార్చి నెలలో ఆయన విడుదలయ్యారు. సాయిబాబా భౌతికకాయాన్ని ఆయన బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల నివాళులర్పించేందుకు సోమవారం హైదరాబాద్‌లోని జవహర్‌నగర్‌లో ఉంచనున్నట్లు తెలిపారు. ఆయన కళ్లను ఇప్పటికే ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి దానం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సాయిబాబా మృతిపట్ల ‘ఎక్స్’ వేదికగా ప్రముఖలు సంతాపం తెలిపారు. ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబా మృతి పట్ల తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సంతాపం తెలిపారు. ‘‘ మానవ హక్కుల ఉద్యమకారుల సంఘానికి సాయిబాబా మరణం తీరని లోటు. అణగారిన ప్రజలకు జరిగిన అన్యాయాలకు వ్యతిరేకంగా, స్వేచ్ఛకు ముప్పు ఏర్పడినప్పుడు ఆయన అవిశ్రాంతంగా పోరాడారు. అనేక సవాళ్లను ఎదుర్కొంటూ పౌర హక్కులను కాపాడటంలో ఆయన చూపిన ధైర్యం చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబానికి నా సానుభూతి తెలియజేస్తున్నా’’అని ఎక్స్‌లో తెలిపారు.Prof. G.N. Saibaba’s passing away is a profound loss for the human rights community. A tireless advocate for the oppressed, he fearlessly fought against injustice, even when his own freedom and health were at risk. His courage in defending civil liberties, despite many… pic.twitter.com/eLbXOmGGyK— M.K.Stalin (@mkstalin) October 13, 2024మాజీ ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబా మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం తెలిపారు. ‘‘ హక్కుల ఉద్యమకారుడు మాజీ ప్రొఫెసర్ జీ.ఎన్. సాయిబాబా అకాల మరణం బాధాకరం. వారి కుటుంబసభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. దేశంలోని ప్రజా ఉద్యమాలకు మాజీ ప్రొఫెసర్ సాయిబాబా మరణం తీరని లోటు’’ అని ‘ఎక్స్’ తెలిపారు.హక్కుల ఉద్యమకారుడు ప్రొఫెసర్ జీ. ఎన్. సాయిబాబా అకాల మరణం బాధాకరం. వారి కుటుంబసభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. దేశంలోని ప్రజా ఉద్యమాలకు ప్రొఫెసర్ సాయిబాబా మరణం తీరని లోటు. pic.twitter.com/48NO87H1cV— KTR (@KTRBRS) October 13, 2024చదవండి: డీయూ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత -
CBI: నిందితుడి డీఎన్ఏ, రక్తనమూనాలు సరిపోలాయి
కోల్‌కతా: దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలకు కారణమైన ఆర్.జి.కర్ మెడికల్ కాలేజీ వైద్యురాలిపై హత్యాచారం ఘటన ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ ఒక్కడి పనేనని సీబీఐ తెలిపింది. వైద్యురాలి మృతదేహంపై ఉన్న డీఎన్ఏ, రక్తనమూనాలు నిందితుని నమూనాలతో సరిపోలాయని సీబీఐ చార్జిషీటులో పేర్కొంది. సంజయ్ రాయ్‌కు వ్యతిరేకంగా 11 సాంకేతిక ఆధారాలను చార్జిషీటులో పొందుపర్చింది. బాధితురాలి మృతదేహం నుంచి సేకరించిన డీఎన్ఏ సంజయ్ రాయ్ డీఎన్ఏతో సరిపోలిందని తెలిపింది. అలాగే కురచ వెంట్రుకలు, పెనుగులాటలో సంజయ్ రాయ్ ఒంటిపై అయిన గాయాలు, అతని శరీరంపై, ప్యాంటుపై బాధితురాలి రక్తపు మరకలు, సీసీటీవీ ఫుటేజీ, అతని మొబైల్ ఫోన్ లొకేషన్, ఫోన్‌కాల్ వివరాలు.. ఇవన్నీ సంజయ్ రాయ్ పాత్రను నిర్ధారిస్తున్నాయని పేర్కొంది. సంజయ్ రాయ్ ఒంటిపై బలమైన గాయాలున్నాయని, వైద్యురాలు తీవ్రంగా ప్రతిఘటించినపుడు ఇవి జరిగాయని వివరించింది. పాశవిక హత్యాచారం జరిగిన ఆగస్టు 9న సంజయ్ రాయ్ ఆర్.జి.కర్ మెడికల్ కాలేజిలో మూడో అంతస్తులోని సెమినార్ హాల్ వద్ద ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజి, అతని కాల్ డేటా ధ్రువీకరిస్తోందని తెలిపింది. సంజయ్ రాయ్‌ను కోల్‌కతా పోలీసులు ఆగస్టు 10న అరెస్టు చేయగా.. తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సీబీఐ చేపట్టిన విషయం తెలిసిందే. సెమినార్ హాల్ వైపు వెళుతున్నపుడు సంజయ్ రాయ్ మెడపై ఉన్న బ్లూటూత్ ఇయర్‌ఫోన్ నెక్‌బ్యాండ్ తర్వాత అతను తిరిగి వెళుతున్నపుడు లేదని, సంజయ్ రాయ్ ఫోన్‌తో ఇది అనుసంధానమైనట్లు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లా»ొరేటరీ నివేదిక ఇచి్చందని స్థానిక కోర్టుకు సీబీఐ తెలిపింది. -
కోల్‌కతా ఘటన: మరో 60 మంది సీనియర్ డాక్టర్లు రాజీనామా!
కోల్‌కతా: ఇటీవల కోల్‌కతా హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆర్జీ ఆర్ ఆస్పత్రిలో డాక్టర్‌పై హత్యాచారం కేసులో వైద్యుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. హాస్పిటల్లో హత్యకు గురైన ట్రైనీ డాక్టర్‌కున్యాయం చేయాలని, ఆస్పత్రిలో డాక్టర్ల భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ పలువురు జూనియర్ డాక్టర్లు గత శనివారం సాయంత్రం నుంచి ‘ఆమరణ నిరాహార దీక్ష’ చేపట్టారు. మరోవైపు.. రోజురోజుకీ జూనియర్ డాక్టర్ల నిరసనలకు సీనియర్ డాక్టర్ల నుంచి మద్దతు పెరుగుతోంది. ఈ ఘటనపై ఆందోళన చేపడుతున్న జూనియర్ డాక్టర్లకు మద్దతుగా తాజాగా ఆర్జీ కర్ ఆస్పత్రికి చెందిన మరో 60 మంది సీనియర్ వైద్యులు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వారికి మద్దతుగా 50 మంది డాక్టర్లు మంగళవారం మూకుమ్మడిగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. చదవండి: RG Kar Hospital: 50 మంది డాక్టర్ల మూకుమ్మడి రాజీనామా -
మన విద్యార్థుల కష్టం బూడిదలో పోసిన పన్నీరు
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్ సీట్ సాధించాలన్న లక్ష్యంతో ఏపీలో వేలాది విద్యార్థులు పడిన కష్టం బూడిదలో పోసిన పన్నీరైంది. కంటి మీద కునుకు లేకుండా రాత్రింబవళ్లు కష్టపడి 500 నుంచి 600 మార్కులు తెచ్చుకున్నా చంద్రబాబు ప్రభుత్వ వైఖరితో విద్యార్థులకు నిరాశే ఎదురైంది. రాష్ట్రానికి కొత్త కళాశాలలు రాకుండా, సీట్లు పెరగకుండా అడ్డుపడి విద్యార్థులకు కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసింది.దీంతో పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకంటే మన పిల్లలు 150 మార్కులు ఎక్కువ తెచ్చుకున్నా ఎంబీబీఎస్ సీటు దక్కక మనోవేదనకు గురవుతున్నారు. తెలంగాణలో పోటీకి తగ్గట్టుగా ఎంబీబీఎస్ సీట్లను అక్కడి ప్రభుత్వం పెంచడంతో బీసీ–ఏ విభాగంలో రెండో దశ కౌన్సెలింగ్ ముగిసే సమయానికి 420 స్కోర్ చేసిన వారికి కూడా ఎంబీబీఎస్ ప్రభుత్వ కోటా సీట్ దక్కింది. అదే ఏపీలో 568 మార్కుల వద్దే ఆగిపోయింది. అంటే అక్కడితో పోలిస్తే ఏపీలో కటాఫ్ 148 మార్కులు ఎక్కువ. బీసీ–సీ విభాగంలో 142, బీసీ–డీలో 103, ఓసీల్లో 101 చొప్పున తెలంగాణకంటే ఏపీలో కటాఫ్ ఎక్కువగా ఉంది. కొత్త వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయడం కోసం ఈ విద్యా సంవత్సరం ప్రారంభించాల్సిన ఐదు మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రభుత్వం కుట్రపూరితంగా అడ్డుకుంది. పులివెందుల కళాశాలకు అనుమతులు వచ్చి సీట్లు మంజూరైనా.. ఆ సీట్లు వద్దంటూ ప్రభుత్వమే ఎన్ఎంసీకి లేఖ రాసింది. ప్రభుత్వ చర్యలతో ఈ ఒక్క ఏడాదే 700 ఎంబీబీఎస్ సీట్లను రాష్ట్ర విద్యార్థులు నష్టపోయారు. బాబు ప్రభుత్వం చేసిన ఆ పాపం విద్యార్థులకు శాపంగా మారింది.14 వరకూ ఫ్రీ ఎగ్జిట్‌కు అవకాశం ఎంబీబీఎస్ కన్వినర్ కోటా సీట్లలో 2024–25 విద్యా సంవత్సరానికి మొదటి, రెండో విడత కౌన్సెలింగ్‌లో సీట్ పొందిన విద్యార్థులకు ఈ నెల 14న మధ్యాహ్నం 3 గంటల వరకూ ఫ్రీ ఎగ్జిట్‌కు అవకాశం కల్పించారు. తొలి 2 కౌన్సెలింగ్‌ల్లో సీట్ పొంది, కళాశాలల్లో రిపోర్ట్ చేసిన విద్యార్థులు గడువు లోగా ఎగ్జిట్ అవ్వవచ్చని హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి సోమవారం ఉత్తర్వులిచ్చారు. ఎగ్జిట్ అయిన వారిని తదుపరి కన్వినర్ కోటా కౌన్సెలింగ్‌లో అనుమతించబోమని స్పష్టం చేశారు. కేవలం యాజమాన్య కోటా సీట్లలో ప్రవేశాలకు అనుమతిస్తామని తెలిపారు. -
డాక్టర్ కల.. విలవిల!
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పూరితంగా కొత్తగా ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటవ్వకుండా అడ్డుకోవడంతో ఈ ఒక్క ఏడాదే ఏకంగా 700 ఎంబీబీఎస్ సీట్లను మన విద్యార్థులు కోల్పోవాల్సి వచ్చింది. ఫలితంగా మన విద్యార్థుల వైద్య విద్య కలలు ఛిద్రమయ్యాయి. పక్కనున్న తెలంగాణా రాష్ట్రంలో ఈ ఏడాది ఎనిమిది ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభమై, 400 ఎంబీబీఎస్ సీట్లు పెరగడంతో అక్కడి విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలు పెరిగాయి. ఇటు ఏపీలో మాత్రం పోటీకి అనుగుణంగా సీట్లలో వృద్ధి లేకపోవడంతో మన విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. తెలంగాణాలో తొలి దశ కౌన్సెలింగ్‌లో భాగంగా సోమవారం ఎంబీబీఎస్ ప్రభుత్వ కోటా (కన్వినర్) సీట్లను కేటాయించారు. ఈ క్రమంలో ఏపీలో తొలి దశ ప్రభుత్వ కోటా కౌన్సెలింగ్ కటాఫ్‌లను ఓసారి పరిశీలిస్తే మన విద్యార్థులకు ప్రభుత్వం చేసిన ద్రోహం కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. రిజర్వేషన్ విద్యార్థులకు తీవ్ర అన్యాయం వాస్తవానికి ఈ విద్యా సంవత్సరం పులివెందుల, మదనపల్లె, మార్కాపురం, ఆదోని, పాడేరు వైద్య కళాశాలల్లో ఒక్కో చోట 150 సీట్లతో తరగతులు ప్రారంభం కావ్వాల్సి ఉంది. ఇందుకు అనుగుణంగా గత ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పటికీ, వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేయడం కోసం బాబు ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా అనుమతులు రాకుండా మోకాలడ్డింది. దీంతో కేవలం పాడేరులో 50 సీట్లు రాగా, మిగిలిన 700 సీట్లు విద్యార్థులు నష్టపోయారు. దీంతో నీట్ యూజీలో 600 పైబడి స్కోర్ చేసిన ఓసీ, 500 పైబడి స్కోర్ చేసిన ఎస్సీ, బీసీ విద్యార్థులకు ఏపీలో ప్రభుత్వ కోటా సీట్లు తొలి దశలో లభించలేదు. అదే తెలంగాణాతో పోలిస్తే ఏపీలో సీట్లు లభించిన చివరి కటాఫ్‌ల మధ్య వ్యత్యాసం రిజర్వేషన్ వర్గాల్లోనే 130 మార్కులకు పైగా ఉంటోంది. తొలి దశ కౌన్సెలింగ్‌లో తెలంగాణలో బీసీ–ఏ విభాగంలో 437 మార్కులకు చివరి సీట్ లభించగా, అదే ఏపీలో 568 వద్ద ఆగిపోయింది. తెలంగాణలో చివరి సీట్ దక్కించుకున్న విద్యార్థులకంటే ఏకంగా 131 మార్కులు అదనంగా సాధించినా ఏపీ విద్యార్థులకు నిరాశే మిగిలింది. ఓసీ విభాగంలో తొలి దశలో మన రాష్ట్రంలో 615 మార్కుల వద్ద నిలిచిపోయింది. ఈ విభాగంలో తెలంగాణ విద్యార్థులకు 528 మార్కుల వరకు సీట్ దక్కింది. ఎస్సీ విభాగంలో తెలంగాణతో పోలిస్తే ఏపీలో 74 మార్కుల వ్యత్యాసం ఉంది. అక్కడ ఎస్సీ విభాగంలో 446 మార్కుల వరకు సీట్ వస్తే.. ఏపీలో 520 మార్కుల వద్దే ఆగిపోయింది.సన్నగిల్లిన ఆశలు గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలు పెంచడంతో పాటు, పేదలకు ఉచిత సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని చేరువ చేసే లక్ష్యంతో 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2023–24 విద్యా సంవత్సరం ఐదు వైద్య కళాశాలలు ప్రారంభించి 750 సీట్లను అందుబాటులోకి తెచ్చారు. 2024–25లో ఐదు, 2025–26లో మిగిలిన ఏడు కళాశాలలు ప్రారంభించాలని ప్రణాళిక రచించారు. కాగా, చంద్రబాబు ప్రభుత్వం కొత్త కళాశాలలను ప్రైవేట్‌పరం చేయాలని నిర్ణయించి, ఈ ఏడాది ఐదుకు గాను నాలుగు కళాశాలలు ప్రారంభం అవ్వకుండా అడ్డుకుంది. పక్క రాష్ట్రంలో కనీసం భవనాలు, ఆస్పత్రులు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోయినా తాత్కాలిక ఏర్పాట్లతో కొత్త కళాశాలలు ప్రారంభిస్తుంటే.. గత ప్రభుత్వంలో 80 శాతం మేర భవన నిర్మాణాలు పూర్తై, పూర్తి స్థాయిలో బోధనాస్పత్రులు అందుబాటులో ఉన్నప్పటికీ.. ఏపీ ప్రభుత్వం కళాశాలలను అడ్డుకోవడంపై విద్యార్థులు మండిపడుతున్నారు. బాబు ప్రభుత్వం ప్రైవేట్ మోజు వల్ల ఇప్పటికే 700 సీట్లు రాష్ట్రం నష్టపోగా, వచ్చే ఏడాది ఏడు కళాశాలలు ప్రారంభం అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. తద్వారా మరో 1050 సీట్లు రాష్ట్రం నష్టపోనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పిల్లలకు లాంగ్‌టర్మ్ కోచింగ్‌ల కోసం రూ.3 లక్షలకు పైగా ఖర్చు చేసిన పేద, మధ్య తరగతి కుటుంబాలు మరో ఏడాది కోచింగ్‌కు పంపేందుకు సాహసం చేయడం లేదు. వారిలో వైద్య విద్యపై ఆశలు సన్నగిల్లి ప్రత్యామ్నాయ కోర్సులు చూసుకుంటున్నారు. -
త్వరలో 612 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మెడికల్ అడ్మిషన్ల ప్రక్రియ మొదలైంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచే తరగతులు ప్రారంభం కానున్నాయి. అందులో భాగంగా ఈ ఏడాది నుంచి కొత్తగా 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) మార్గదర్శకాలకు అనుగుణంగా అధ్యాపకుల పోస్టులను భర్తీ చేసేందుకు వైద్య, ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 643 మంది అధ్యాపకులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించారు. ఇవిగాక మరో 612 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను రెగ్యులర్ పద్ధతిలో భర్తీ చేసేందుకు వైద్య, ఆరోగ్యశాఖ సన్నాహాలు మొదలుపెట్టింది. ఆ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశంతో త్వరలో ఆయా పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ మేరకు మెడికల్ అండ్ హెల్త్ సర్విసెస్ రిక్రూట్మెంట్ బోర్డుకు మంత్రి అనుమతి ఇచ్చారు. అవసరమైతే మరో విడతలోనూ అధ్యాపక పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. మరోవైపు ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తామని వైద్య,ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. 2 వారాల్లో 3,967 పోస్టులకు నోటిఫికేషన్లు కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు, ఆస్పత్రుల ఆధునీకరణ తదితర కారణాలతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి. నర్సింగ్ ఆఫీసర్ నియామకాలకు సంబంధించిన ఫలితాలను విడుదల చేయించి, ఒకేసారి 6,956 మందిని భర్తీ చేశారు. 285 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, 48 మంది ఫిజియోథెరపిస్టులు, 18 మంది డ్రగ్ ఇన్స్పెక్టర్లను నియమించారు. మొత్తంగా ఇప్పటివరకూ 7,308 పోస్టులు భర్తీ చేశారు. గత రెండు వారాల్లో 4 వేల పోస్టులకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ నెల 11వ తేదీన 1,284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు, ఈ నెల 17వ తేదీన మరో 2,050 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు, రెండ్రోజుల క్రితం 633 ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. వీటితోపాటు 1,666 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫీమేల్), 156 ఆయుష్ మెడికల్ ఆఫీసర్, 435 సివిల్ సర్జన్, 24 ఫుడ్ ఇన్స్పెక్టర్, 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు వైద్య విధాన పరిషత్ పరిధిలోని జిల్లా, ఏరియా ఆస్పత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో సుమారు 1,600 స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం కోరుతూ వైద్య, ఆరోగ్యశాఖ ఫైల్ పంపింది. ఆర్థికశాఖ నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే ఈ పోస్టులకు కూడా నోటిఫికేషన్లు ఇస్తా మని మంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. -
ప్రైవేట్ వైద్య‘మిథ్య’
తనిఖీల్లో ఏం తేలింది..? పలు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 50% వరకు అధ్యాపకులు లేరు. ఓ కాలేజీలో 50.47%, మరో కాలేజీలో 59.3% మేరకు కొరత ఉంది. ఒక కాలేజీలో రెసిడెంట్లు, ట్యూటర్ల కొరత 66.31% వరకు ఉంది. 150 మంది విద్యార్థులుండే కాలేజీ అనుబంధ ఆసు పత్రిలో రోజూ 1,200 మంది ఓపీ ఉండాలి. ఒక చోట 849, మరో చోట 650 మందే వస్తున్నారు. ఓ కాలేజీ ఆసుపత్రిలో 650కి 542 పడకలే ఉన్నాయి. రెండు కాలేజీల ఆసుపత్రుల్లో బెడ్ ఆక్యుపెన్సీ 9.38%, 11.97% చొప్పునే ఉంది. పలుచోట్ల లెక్చర్ హాళ్లు, పరీక్షా కేంద్రాలు సరిపడా లేవు. ఒకే ప్రొఫెసర్‌ను రెండు కాలేజీల్లో చూపించారు.సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో అధ్యాపకుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. కొన్ని కళాశాలల్లో ఉండాల్సిన సంఖ్యలో సగం మంది కూడా లేరు. మరోవైపు విద్యార్థులకు అవసరమైన స్థాయిలో మౌలిక సదుపాయాలు కూడా లేవు. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఇటీవలి తనిఖీల్లో ఈ అంశాలు బహిర్గతమయ్యాయి. ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫె సర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు తగిన సంఖ్యలో లేకపోవడం, ల్యాబ్‌ల వంటి మౌలిక వసతుల కొరతతో అనేక ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో వైద్య విద్య అత్యంత నాసిరకంగా తయారవుతోందనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఆయా కాలేజీల్లో వైద్య విద్య పూర్తి చేసుకున్న చాలామంది తగిన సామర్థ్యం, నైపుణ్యం లేక వృత్తిలో రాణించలేకపోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండేళ్ల క్రితం మూడు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో అధ్యాపకులు, మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో లేనందుకు విద్యార్థుల అడ్మిషన్లను కమిషన్ రద్దు చేసింది. తర్వాత వారిని ఇతర కాలేజీల్లో సర్దుబాటు చేసింది. ఎన్ఎంసీ కఠిన చర్యలు తీసుకుంటున్నా, చాలా మెడికల్ కాలేజీలు ఇప్పటికీ అధ్యాపకులను నియమించుకోవడంలో, మౌలిక సదుపాయాల కల్పనలో వెనుకబడే ఉంటున్నాయని, వైద్య విద్యపై విద్యార్థులు, తల్లిదండ్రుల ఆసక్తిని సొమ్ము చేసుకుంటున్న కాలేజీలు నాణ్యమైన విద్య అందించడంలో మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఏ కాలేజీ..ఎలా ఉండాలి: ఎంబీబీఎస్ సీట్లు 150 ఉన్న మెడికల్ కాలేజీలో 600 పడకలు ఉండాలి. 116 మంది ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 76 మంది రెసిడెంట్లు ఉండాలి. ఐదు పడకల ఐసీయూ, పీఐసీయూ వేర్వేరుగా ఉండాలి. ఫిజికల్ మెడికల్ రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలి. స్కిల్ లేబొరేటరీ ఉండాలి. ఇలా ఉన్న సీట్లను బట్టి బోధనా సిబ్బంది, వసతులు ఉండాలి. అన్ని మెడికల్ కాలేజీల్లో తప్పనిసరిగా ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు చేసే లేబొరేటరీ ఉండాలి. లైబ్రరీలో 4,500 పుస్తకాలుండాలి. అదే 100 సీట్లున్న మెడికల్ కాలేజీ అయితే 3 వేల పుస్తకాలు, 200 సీట్లుంటే 6 వేలు, 250 సీట్లయితే 7 వేల పుస్తకాలు ఉండాలి. లైబ్రరీ వైశాల్యం కూడా సీట్ల సంఖ్యకు అనుగుణంగా ఉండాలి. 150 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు చదివే మెడికల్ కాలేజీ అనుబంధ ఆసుపత్రికి రోజుకు 1,200 మంది ఔట్ పేషెంట్లు అవసరం. ఆ మేరకు తప్పనిసరిగా రోగులు వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలి. కానీ చాలా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఇలాంటి అనేక వసతులు సరిగ్గా లేకుండానే, బోధనా సిబ్బంది తగిన సంఖ్యలో లేకుండానే నడుస్తున్నట్లు తేలింది. తనిఖీల సమయంలో ‘సర్దుబాట్లు’ రాష్ట్రంలో మొత్తం 64 మెడికల్ కాలేజీలున్నాయి. అందులో 29 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కాగా, 35 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మొత్తం 4,700 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. కాగా ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మౌలిక వసతులు, అధ్యాపకులు, రోగుల వివరాలన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. వసతులు లేవని విద్యార్థులు బయటకు చెప్పలేని పరిస్థితి ఉందని, ఒకవేళ అలా చెబితే, నిరసన వ్యక్తం చేస్తే ప్రాక్టికల్స్‌లో తక్కువ మార్కులు వేస్తారన్న భయం వారిలో ఉంటోందని చెబుతున్నారు. కాగా ఎన్ఎంసీ తనిఖీలకు వచ్చే సమయానికి కాలేజీలు సర్దుబాట్లు చేస్తున్నాయి. నకిలీ బోధనా సిబ్బందితో ప్రైవేటు యాజమాన్యాలు నెట్టుకొస్తున్నాయి. అనేక కాలేజీలు సింథటిక్ బయోమెట్రిక్ ద్వారా ఒకరికి బదులు మరొకరితో హాజరు నమోదు చేయిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. -
‘పంతం’పై కేసు నమోదుకు మీనమేషాలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రంగరాయ వైద్య కళాశాల దళిత ప్రొఫెసర్‌పై కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దాడికి తెగబడి చంపుతానని బెదిరించిన ఘటనపై 24 గంటలు దాటినా కేసు నమోదు చేయకుండా కూటమి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా వైద్యవర్గాల నుంచి తీవ్ర ఆగ్రహాం వ్యక్తమవుతోంది. దశలవారీ ఉద్యమాలకు ప్రభుత్వ వైద్యుల సంఘం సమాయత్తమవుతోంది. కాకినాడ రంగరాయ వైద్యకళాశాల గ్రౌండ్స్‌లో వైద్య విద్యార్థులకు కేటాయించిన వాలీబాల్ కోర్టులో అనుమతి లేకుండా ఎమ్మెల్యే అనుచరులు దౌర్జన్యంగా ఆటలాడటంపై అభ్యంతరం చెప్పినందుకు ఆర్ఎంసీ స్పోర్ట్స్ వైస్ చైర్మన్, ఫోరెన్సిక్ హెచ్‌వోడీ డాక్టర్ ఉమామహేశ్వరరావును శనివారం ఎమ్మెల్యే నానాజీ బండబూతులు తిడుతూ పిడిగుద్దులు కురిపించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం విదితమే.పవన్‌కళ్యాణ్‌కు బాధ్యత లేదా?కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాల ఆవరణలోని వాలీబాల్ కోర్టుకు వైద్య విద్యార్థినులు సైతం ఆడుకోవడానికి వస్తుంటారు. ఇందులో కొంతకాలంగా ఎమ్మెల్యే అనుచరులు వాలీబాల్ ఆడుతూ బహిరంగంగా బెట్టింగ్‌లు వేస్తున్నారని, వైద్య విద్యార్థినులతోపాటు వాకింగ్ కోసం వస్తున్న మహిళలను వేధిస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని మెడికోలు ఆర్ఎంసీ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావుకు గతంలోనే తెలియచేశారు. ఇదే విషయాన్ని వైద్య విద్యార్థులు రంగరాయ కళాశాల యాజమాన్యంతోపాటు నేషనల్ మెడికల్ కౌన్సిల్(ఎన్ఎంసీ)కి కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అనుచరులతో మాట్లాడేందుకు గ్రౌండ్‌కు వచ్చిన డాక్టర్ ఉమామహేశ్వరరావుపై ఎమ్మెల్యే నానాజీ బెట్టింగ్‌రాయుళ్లను వెనకేసుకువస్తూ దాడికి తెగబడ్డారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఇద్దరిలో ఏ ఒక్కరూ స్పందించకపోవడాన్ని ఏమనుకోవాలని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. వైద్యుడిపై దాడికి పాల్పడిన ఎమ్మెల్యేపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. అస్వస్థతకు గురైన బాధిత ప్రొఫెసర్ఎమ్మెల్యే, అతని అనుచరులు బెదిరింపులు, దాడితో ఫోరెన్సిక్ హెచ్‌వోడీ ఉమామహేశ్వరరావు మానసిక ఆందోళనతో ఆదివారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయన తన ఇంటివద్దే చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు, వైద్యసంఘాల ప్రతినిధులు, దళిత సంఘాల ప్రతినిధులు ఉమామహేశ్వరరావును కలిసి సంఘీభావం తెలిపారు. కాగా, ఎమ్మెల్యే నానాజీ తీరును గర్హిస్తూ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌కు ఆదివారం ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం లేఖ రాసింది. వైద్యుడు ఉమామహేశ్వరరావుపై దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యే నానాజీ, అతని అనుచరులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సంఘ అధ్యక్షుడు డాక్టర్ జయధీర్‌బాబు ఆ లేఖలో డిమాండ్ చేశారు. లేదంటే దశల వారీ ఆందోళనకు ఉపక్రమించాల్సి వస్తుందని హెచ్చరించారు. మరోవైపు ఎమ్మెల్యే పంతం నానాజీ, అతని అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని సామాజిక న్యాయ సాధన సమితి డిమాండ్ చేసింది. సంస్థ అధ్యక్షులు డాక్టర్ భానుమతి, ప్రధాన కార్యదర్శి నవీన్‌రాజ్, అసోసియేట్ ప్రెసిడెంట్ డాక్టర్ మోకా పవన్‌కుమార్, ముఖ్య సలహాదారులు అడ్వకేట్ జవహర్ అలీ, అయితాబత్తుల రామేశ్వరరావు ప్రకటన విడుదల చేశారు. మరోవైపు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల రాష్ట్ర కార్యదర్శి జి.ఆస్కార్‌రావు, జిల్లా అధ్యక్షుడు రంగనాయకులు డాక్టర్ ఉమామహేశ్వరరావును పరామర్శించారు. ఈ ఘటనపై వైద్య, ఆరోగ్యశాఖమంత్రి సత్య కుమార్ యాదవ్ మొక్కుబడిగా స్పందించారు. వైద్యులకు, విద్యార్థులకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. నేనూ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తా‘ప్రజాప్రతినిధి ఎలా ఉండకూడదో అలా ప్రవర్తించాను. నేనేదో తగువు సెటిల్ చేద్దామని ఆర్ఎంసీ హాస్టల్‌కు వెళ్లాను. అక్కడ నేనే తగువులో పడిపోయాను. దానికి ఇప్పుడు సభాముఖంగా డాక్టర్‌కు సారీ చెబుతున్నాను. ఒక ప్రజాప్రతినిధి ఎలా ఉండకూడదో నిన్న అలా ఉన్నాను. తిరుపతి లడ్డూ విషయంలో ఎవరో చేసిన తప్పునకు డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. ఆయనే దీక్ష చేపడుతున్నప్పుడు ఆయన పార్టీలో ఉండి, నేను తప్పు చేసి నేను ఎందుకు ప్రాయశ్చిత్త దీక్ష చేయకూడదని భావించి సోమవారం కాకినాడ గొడారిగుంట ఇంటి వద్ద దీక్ష చేపడుతున్నాను’ అని ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. అయితే ఈ ప్రకటనపై పార్టీనేతలు విస్తుపోతున్నారు. నవ్విపోదురుగాక నాకేటిసిగ్గు అన్నట్టుగా ఉందని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి.చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి: కురసాల కన్నబాబుజనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ అనుచిత ప్రవర్తనపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందేనని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్ష్యుడు కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. వైద్యుడిపై ఎమ్మెల్యే, అతని అనుచరుల దురుసు ప్రవర్తన, వ్యవహారశైలి, దాడి జనమంతా వీడియోల్లో చూశారు. బాధ్యులపై కేసు నమోదు చేయాల్సిందే. చేసిందంతా చేసి ఇప్పుడు ప్రాయశ్చితం అంటూ దీక్షలు చేసినంత మాత్రాన తప్పు ఒప్పు అయిపోదన్నారు.ఫిర్యాదు చేసి 24 గంటలు గడిచినా..ఈ ఘటనపై శనివారం రాత్రి 8 గంటల సమయంలో ఆర్ఎంసీ ప్రిన్సిపాల్, అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్ డీఎస్‌వీఎల్ నరసింహం జిల్లా ఎస్పీ విక్రాంతపాటిల్కు లిఖిత పూర్వక ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా.. వారు అందుబాటులో లేదు. దీంతో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీరామకోటేశ్వరరావు, సర్పవరం సీఐ బొక్కా పెద్దిరాజుకు ఫిర్యాదు చేశారు. రెండుచోట్లా ఫిర్యాదు చేసి 24 గంటలు గడిచినా ఆదివారం రాత్రి వరకు పోలీసులు కేసు నమోదు చేయలేదు.మరోవైపు కేసు విషయంలో వితండ వాదన జరుగుతోంది. వైద్యుడు స్వయంగా ఫిర్యాదు చేయలేదు, ఆయన ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి కేసు నమోదు చేస్తామని కాకినాడ డీఎస్పీ రఘువీర్ పృథ్వీ చెబుతున్నారు. వైద్యుడిని చంపుతానని బెదిరింపులకు దిగిన ఎమ్మెల్యే పై ఫిర్యాదు చేస్తే చట్ట ప్రకారం ఎందుకు కేసు నమోదు చేయలేదని వైద్యులు, దళిత సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.నేటి నుంచి నల్ల బ్యాడ్జీలతో నిరసనప్రభుత్వ వైద్యుల సంఘంసాక్షి, అమరావతి: ప్రొఫెసర్ డాక్టర్ ఉమామహేశ్వరరావుపై దాడి చేసిన ఎమ్మెల్యే పంతం నానాజీని జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిప్యూటీ సీఎం పవన్‌ను ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం (ఏపీ జీడీఏ) డిమాండ్ చేసింది. ఆదివారం జరిగిన సంఘ కార్యవర్గ సమావేశం వివరాలను అధ్యక్షుడు డాక్టర్ జయ«దీర్ మీడియాకు విడుదల చేశారు. సోమవారం నుంచి నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతామని ప్రకటించారు.ప్రొఫెసర్‌పై దాడి హేయందాడికి పాల్పడ్డ జనసేన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి: మాజీ ఎమ్మెల్యే సుధాకర్బాబుసాక్షి, అమరావతి: మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ హామీలు అమలు చేయలేక దాడులతో బెదిరింపులకు దిగుతున్నారని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు ఆక్షేపించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సుధాకర్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. కూటమి నాయకులను దాడులకు ప్రేరేపించడం, ఆ తర్వాత వారే క్షమాపణలు చెబుతున్నట్టు డ్రామా చేయడం నిత్యకృత్యమైందన్నారు. కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల ప్రొఫెసర్, కాలేజీ స్పోర్ట్స్ అధికారి డాక్టర్ ఉమామహేశ్వరరావును కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అసభ్య పదజాలంతో దూషించి చెంప దెబ్బకొట్టడం, జనసేన కార్యకర్తలు దాడి చేయడం ఇందుకు తార్కాణమన్నారు. దళిత అధికారుల పట్ల కూటమి ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులకు వైఎస్సార్ïÜపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దళిత అధికారిని అసభ్యంగా దూషించి దాడి చేసిన జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.క్షమాపణ చెబితే చాలా!ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘాధ్యక్షుడు సురేష్చల్లపల్లి (అవనిగడ్డ): విధి నిర్వహణలో ఉన్న దళిత ప్రొఫెసర్‌పై అందరూ చూస్తుండగా దాడి చేసి క్షమాపణలు చెబితే సరిపోతుందా అని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు దేవరపల్లి సురేష్‌బాబు ప్రశ్నించారు. ఉద్యోగులు, అధికారులపై దాడులు చేసే ప్రజాప్రతినిధులు, వ్యక్తులపై తిరగబడాలని ఆయన పిలుపునిచ్చారు. దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఉద్యోగులు అధికారులపై దాడులు పరిపాటిగా మారాయని చర్యకు ప్రతిచర్య ఉండాలన్నారు. దాడిని ఖండించిన జూడాలుసాక్షి, అమరావతి: కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఆయన అనుచరులు రంగరాయ వైద్య కళాశాల ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ ఉమామహేశ్వరరావుపై దాడికి పాల్పడటాన్ని ఏపీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (ఏపీ జూడా) తీవ్రంగా ఖండించింది. ఉమామహేశ్వరరావుపై దాడికి పాల్పడి, దుర్భాషలాడిన ఘటన ఆరోగ్య సంరక్షకులను అగౌరవపరచడమేనని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ ఘటన భద్రతా వైఫల్యానికి నిదర్శనమని తెలిపింది. ఈ ఘటనకు బాధ్యులైనవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.ప్రొఫెసర్‌పై దాడి హేయం ఏపీ ఏఎఫ్‌ఎంటీ అధ్యక్షుడు సాయిసుదీర్కర్నూలు (హాస్పిటల్): ప్రొఫెసర్ డాక్టర్ ఉమామహేశ్వరరావుపై జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దాడి హేయమైన చర్య అని ఏపీ అకాడమీ ఆఫ్ ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ (ఏపీ ఏఎఫ్‌ఎంటీ) అధ్యక్షుడు డాక్టర్ టి.సాయిసుధీర్ ఖండించారు. ఏపీ ఏఎఫ్‌ఎంటీ, ఏపీ జీడీఏ, ఏపీ జేయూడీఏ, ఐఎంఏ సంస్థలను సంప్రదించి తదనంతర కార్యక్రమాలకు ప్రణాళిక రూపొందిస్తామన్నారు. ఎమ్మెల్యే పంతం నానాజీపై డిప్యూటీ సీఎం పవన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.దాడి సిగ్గుచేటువైఎస్సార్సీపీ వైద్య విభాగం ఉపాధ్యక్షుడు మెహబూబ్లబ్బీపేట (విజయవాడ తూర్పు): విధుల్లో ఉన్న మెడికల్ కళాశాల ప్రొఫెసర్‌పై కూటమి ఎమ్మెల్యే పంతం నానాజీ బండబూతులు తిడుతూ దాడికి పాల్పడటం దుర్మార్గమని, సిగ్గుపడాల్సిన అంశమని వైఎస్సార్సీపీ వైద్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ మెహబూబ్ షేక్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అరాచకాలకు ఇదే నిదర్శనమని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అతని అనుచరులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. -
పీజీ మెడికల్ సీట్లపై కత్తి!
సాక్షి, హైదరాబాద్: కొత్త మెడికల్ కాలేజీలు తేవాలన్న తాపత్రయంతో ఉన్న కాలేజీల్లోని ప్రొఫెసర్లను, అసోసియేట్ ప్రొఫెసర్లను బదిలీ చేయడంతో కథ అడ్డం తిరిగింది. వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ) కార్యాలయం నిర్వాకంతో రాష్ట్రంలో పీజీ మెడికల్ సీట్లకు గండిపడే ప్రమాదం నెలకొంది. సాధారణ బదిలీల్లో భాగంగా ఇష్టారాజ్యంగా ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల బదిలీలు చేపట్టడంతో ఈ పరిస్థితి నెలకొంది. గాందీ, ఉస్మానియా, కాకతీయ వంటి అనేక ప్రముఖ మెడికల్ కాలేజీల నుంచి అత్యంత సీనియర్లను బదిలీ చేశారు. కానీ వారి స్థానాలను భర్తీ చేయకపోవడంతో పెద్ద ఎత్తున పీజీ సీట్లకు కోత పడే ప్రమాదం నెలకొంది. వెనుకా ముందు చూడకుండా బదిలీలు చేపట్టారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఖాళీలు భర్తీ చేసే చాన్సూ లేదు ఉస్మానియా, గాందీ, కాకతీయ వంటి ఎంబీబీఎస్, పీజీ సీట్లతో కూడిన వైద్య కళాశాలలకు ఎలాంటి నష్టం వాటిల్లుతుందో అంచనా వేయకుండానే, ఈ ఏడాది 40 శాతం సాధారణ బదిలీల నెపంతో 8 కొత్త మెడికల్ కాలేజీలను సాధించేందుకు ప్రొఫె సర్లను, అసోసియేట్ ప్రొఫెసర్లను బదిలీ చేశారు. ఉస్మానియా, గాంధీ వంటి కాలేజీల్లో ప్రస్తుతం అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్లు లేరు. కాకతీయ మెడికల్ కాలేజీలోనూ అదే పరిస్థితి నెలకొంది. దీంతో ఉస్మానియా, గాం«దీ, కాకతీయ లోని ఓబీజీ, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్, జన రల్ సర్జరీ, అనస్థీషియా, రేడియాలజీ వంటి విభాగాల్లో పీజీ సీట్లు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. పదోన్నతులకు అర్హులైన అభ్యర్థులు అందుబాటులో లేకపోవడంతో ఈ ఖాళీలను భర్తీ చేసే అవకాశం కూడా లేదని వైద్య నిపుణులు అంటున్నారు. బోధనా సిబ్బందిపై ఎప్పటికప్పుడు ఎన్ఎంసీ సమీక్ష రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో మొత్తం 1,148 పీజీ సీట్లు ఉన్నాయి. ఒక ప్రొఫెసర్‌కు మూడు పీజీ మెడికల్ సీట్లు కేటాయిస్తారు. ఐదేళ్లు బోధనానుభవం ఉన్న అసోసియేట్ ప్రొఫెసర్‌కు ఒక పీజీ సీటు కేటాయిస్తారు. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు తగ్గితే ఆ ప్రకారం జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) పీజీ సీట్లకు కోత పెడుతుంది. ప్రతి నెలా, రెండు నెలలకోసారి ఫ్యాకల్టీని ఎన్ఎంసీ సమీక్షిస్తుంది. అంతేకాదు బయోమెట్రిక్ హాజరు విధానంతో ఎప్పటికప్పుడు ఆన్లైన్లోనే టీచింగ్ ఫ్యాకల్టీ సంఖ్యపై అంచనా వేస్తుంది. కాబట్టి పీజీ సీట్లకు గండం తప్పేలా లేదు. ఉదాహరణకు.. ప్రస్తుతం ఉస్మానియా మెడికల్ కాలేజీలో 481 పీజీ మెడికల్ సీట్లు ఉన్నాయి. ఇక్కడ 188 ప్రొఫెసర్ పోస్టుల మంజూరు ఉండగా, ఇటీవల బదిలీల కారణంగా ప్రస్తుతం కేవలం 86 మంది ప్రొఫెసర్లే పనిచేస్తున్నారు. అంటే 102 ప్రొ ఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక 178 మంది అసోసియేట్ ప్రొఫెసర్లకుగాను కేవలం 26 మంది మాత్రమే ఉన్నారు. అంటే అసోసియేట్ ప్రొఫెసర్ల పోస్టులు 152 ఖాళీగా ఉన్నాయి. అంటే ప్రస్తుతం ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు 284 పీజీ సీట్లకు సరిపోను మాత్రమే ఉన్నారు. కాగా బదిలీల కారణంగా ఉస్మానియాలోని 197 పీజీ సీట్లకు కత్తెర పడే ప్రమాదం నెలకొంది. ఇక గాంధీ మెడికల్ కాలేజీలో 213 పీజీ మెడికల్ సీట్లు ఉన్నాయి. అయితే బదిలీల కారణంగా అక్కడ 60 మంది ప్రొఫెసర్లకు గాను 35 మందే మిగిలారు. 73 మందిఅసోసియేట్ ప్రొఫెసర్లకుగాను 40 మందే ఉన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్లు 145 పీజీ సీట్లకు మాత్రమే సరిపోతారు. అంటే మిగిలిన 68 పీజీ సీట్లపై కత్తి వేలాడుతోందన్న మాట. ఇలా ఒక్క ఉస్మానియా, గాంధీ మెడికల్ కాలేజీల్లోనే ఏకంగా 265 పీజీ సీట్లకు కోత పడే ప్రమాదం నెలకొంది. ఇలాగే కాకతీయ, మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీలు, ఆదిలాబాద్‌లోని రిమ్స్ వంటి చోట్ల కూడా పీజీ సీట్లు కోల్పోయే ప్రమాదం నెలకొంది.సీట్లు కోల్పోయే అవకాశం లేదు పీజీ సీట్లు కోల్పోయే అవకాశం లేదు. ప్రస్తుతం ఉన్న సీట్లు అలాగే ఉంటాయి. అవసరమైన ఫ్యాకల్టీని కాంట్రాక్ట్ ప్రాతిపదికన, పదోన్నతులపై నియమించాం. – డాక్టర్ వాణి, డీఎంఈ -
అనంతపురం వైద్య కళాశాలలో వేధింపుల కలకలం
సాక్షి ప్రతినిధి, అనంతపురం :వైద్య విద్యార్థులను వేధించారన్న వార్తలు అనంతపురం మెడికల్ కాలేజీలో కలకలం రేపుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ కాలేజీలోని మూడు విభాగాల్లోని కొందరు అధ్యాపకులు మెడికోలను వేధించినట్లు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా.. గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, జనరల్ సర్జరీ విభాగాలకు సంబంధించిన అధ్యాపకులు ఈ వేధింపులకు గురిచేసినట్లు వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు హల్చల్ చేస్తున్నాయి.వాస్తవానికి ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చదివే విద్యార్థులు రాష్ట్రంలోని ఇతర కాలేజీలు, ఇతర రాష్ట్రాల్లోని కాలేజీల విద్యార్థులతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటుచేసుకుంటారు. ఇప్పుడు ఈ గ్రూపుల్లో అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలలో వేధింపుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే వైద్యవిద్య పూర్తి చేసుకున్న ఓ విద్యార్థిని ఏకంగా జనరల్ సర్జరీ విభాగంలో లైంగిక వేధింపులు జరిగాయంటూ తన ఇన్‌స్ట్రాగాంలో వెల్లడించినట్లు మెడికోలు చెబుతున్నారు. ఈ అమ్మాయి చేసిన పోస్టే ఇప్పుడు కలకలం రేపుతోంది.పలు అనుమానాలకు తావిస్తున్న వైనం..ప్రస్తుతం అనంతపురం మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ విద్యార్థులు (నాలుగేళ్లకు కలిపి) 600 మంది, పీజీ వైద్య విద్యార్థులు 200 మంది ఉన్నారు. కాలేజీలో జరిగే వ్యవహారాలు బయటకు చెబితే ప్రాక్టికల్స్‌లో ఫెయిల్ చేస్తారన్న భయంతో విద్యార్థినులు మౌనం వహించినట్లు తెలుస్తోంది. ఎంబీబీఎస్ అడ్మిషన్లు జరుగుతున్న వేళ వేధింపుల కలకలం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.సైబర్ క్రైంకు ఫిర్యాదు చేస్తాం..మాకు కూడా ఈ విషయాలు వారం రోజుల కిందటే తెలిశాయి. కొంతమంది కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేస్తున్న వారిపై సైబర్ క్రైంకు ఫిర్యాదు చేస్తున్నాం. – డాక్టర్ మాణిక్యాలరావు, ప్రిన్సిపాల్, అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలవాళ్లనే అడగండి చెబుతారు..లైంగిక వేధింపుల విషయం నా దృష్టికి రాలేదు. కొంతమంది పాస్డ్‌ఔట్ విద్యార్థులు పోస్ట్ చేశారని మీరే అంటున్నారు. వాళ్లనే అడగండి.. వాళ్లే మీకు ఏం జరిగిందో చెబుతారు. – డాక్టర్ రామస్వామి నాయక్, హెచ్ఓడీ, జనరల్ సర్జరీ విభాగం, అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాల -
తొలి నుంచీ అదే విముఖత
‘‘ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయాలంటే రూ. 350 కోట్లు ఖర్చవుతుంది. దాని నిర్వహణ కోసం ఏటా రూ. 30 కోట్లు కావాలి. అన్ని ప్రభుత్వమే చేయాలంటే సాధ్యం కాదు. ప్రైవేట్ వైద్య కళాశాలలఏర్పాటుకు అనుమతులిస్తాం.’’– వెనుకబడిన విజయనగరం జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని 2019కు ముందు టీడీపీ ప్రభుత్వాన్ని కోరగా అసెంబ్లీలో నాటి వైద్య, ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు‘‘పులివెందుల కళాశాలకు అనుమతులు రావడం విస్మయం కలిగించింది. ప్రభుత్వం అండర్ టేకింగ్ ఇవ్వలేదు. అయినా అనుమతులు వచ్చాయి. కొత్త వైద్య కళాశాలలను ప్రభుత్వ పరిధిలో కొనసాగించడానికి నిధుల్లేవు. అందుకే పీపీపీ విధానంలో వైద్య కళాశాలలను నిర్వహించాలని నిర్ణయించాం. – ప్రస్తుతం చంద్రబాబు కేబినెట్లోని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యలుఅవకాశాలను కాలరాసిన బాబువైద్య విద్యకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాలలు ఏర్పాటవుతున్నాయి. 2004కు ముందు ఉమ్మడి రాష్ట్రంలో, 2014–19 మధ్య విభజిత రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు చంద్రబాబు చొరవ చూపలేదు. 2019కు ముందు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క వైద్య కళాశాలని రాబట్టలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బూచిగా చూపి అసెంబ్లీ సాక్షిగా కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేయలేమని ప్రకటించారు.విభజన చట్టం కింద కేంద్రం మంజూరు చేసిన ఎయిమ్స్‌ను తన ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నించి నవ్వులపాలయ్యారు. గతంలో ప్రైవేట్‌లో వైద్య కళాశాలలను ప్రోత్సహించిన బాబు.. ఈ దఫా ఏకంగా ప్రభుత్వ వైద్య కళాశాలలకు ప్రైవేట్‌కు కట్టబెట్టడం కోసం వైద్య విద్య అవకాశాలను కాలరాశారని నీట్ యూజీ ర్యాంకర్లు ధ్వజమెత్తుతున్నారు. ఈ విద్యా సంవత్సరం ఐదు వైద్య కళాశాలలను ప్రారంభించేలా గత ప్రభుత్వంలో అన్ని ఏర్పాట్లు చేపట్టగా.. ఆ కళాశాలలకు అడ్డుపడి ఏకంగా 700 ఎంబీబీఎస్ సీట్లను పోగొట్టి కూటమి ప్రభుత్వం గొంతు కోసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వైఎస్ కుటుంబం చెరగని ముద్రఆరోగ్యశ్రీ, 108, 104 అంబులెన్స్ వంటి వ్యవస్థలను ప్రారంభించి వైద్య రంగంలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెరగని ముద్ర వేశారు. ఆయన హయాంలోనే కడప, శ్రీకాకుళం, ఒంగోలు రిమ్స్‌లు రూపుదిద్దుకున్నాయి. అదే విధంగా తెలంగాణలోని ఆదిలాబాద్ రిమ్స్ కూడా వైఎస్సార్ ఏర్పాటు చేశారు. పేదలకు ప్రభుత్వ రంగంలోనే మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్న తండ్రి ఆశయాన్ని వైఎస్ జగన్ పుణికిపుచ్చుకున్నారు.ఈ క్రమంలో ఆరోగ్యశ్రీ, 104, 108 వ్యవస్థలతో పాటు, నాడు–నేడు కింద ప్రభుత్వాస్పత్రులను బలోపేతం చేశారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పరిధిలో 17 వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వీటిలో గత ఏడాది 5 కళాశాలలు ప్రారంభించి 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి తెచ్చారు. మరో ఐదు ఈ విద్యా సంవత్సరం ప్రారంభించాల్సి ఉండగా కుట్రపూరితంగా బాబు ప్రభుత్వం అడ్డుపడింది. -
ఎంబీబీఎస్ యాజమాన్య కోటా సీట్ల కేటాయింపు
సాక్షి, అమరావతి: కొత్త వైద్య కళాశాలల్లో 2024–25 విద్యా సంవత్సరానికి సెల్ఫ్‌ఫైనాన్స్, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపు జాబితాను శుక్రవారం ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది. విద్యార్థులు ఆయా క ళాశాలల్లో ఈనెల 24వ తేదీ మధ్యాహ్నం మూ డు గంటల్లోగా రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. క్యాప్ కోటా జాబితా విడుదలచిల్ర్డన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ (క్యాప్) విభాగంలో ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ప్రయారిటీ జాబితాను ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం విడుదల చేసింది. ఎండీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం తగ్గించిన నీట్ ఎండీఎస్–2024 కటాఫ్ స్కోర్ ఆధారంగా అర్హులైన అభ్యర్థులు ఎండీఎస్ కన్వీనర్, యాజమాన్య కోటా సీట్లలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 24వ తేదీ సాయంత్రం వరకు గడువు విధించారు. -
మెడికల్ కాలేజీల పరిస్థితేంటి?: విడదల రజిని
సాక్షి,గుంటూరు: వైఎస్జగన్ తన హయంలో ప్రజారోగ్యంపై ఎక్కువ దృష్టిపెట్టారని మాజీ మంత్రి విడదల రజిని చెప్పారు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన 17 మెడికల్ కాలేజీల ఏర్పాటు బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనన్నారు.ఈ విషయమై రజిని బుధవారం (సెప్టెంబర్18) మీడియాతో మాట్లాడారు. ‘మెడికల్ కాలేజీల బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది. మెడికల్ కాలేజీలపై ప్రభుత్వానికి క్లారిటీ లేదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులన్నీ హైదరాబాద్‌లోనే ఉండిపోయాయి. దీంతో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులు ఏపీలోనూ ఉండాలనే ఆలోచనలతో వైఎస్జగన్ మెడికల్ 17 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. రెండో దశలో ప్రారంభించాల్సిన అయిదు మెడికల్ కాలేజీల పరిస్థితేంటి’అని విడదల రజని ప్రశ్నించారు.విడదల రజిని ప్రెస్‌మీట్ ముఖ్యాంశాలు..కొత్త మెడికల్ కాలేజీలపై కూటమి ప్రభుత్వం కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుందిఏపిలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందాలన్న ఉద్దేశంతోనే వైఎస్ జగన్ ప్రభుత్వం మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. కాలేజీ ఆస్పత్రులతో పేదలకు మెరుగైన, ఉచిత వైద్యసేవలు అందించవచ్చని వైఎస్జగన్ భావించారుమెడికల్ కాలేజ్ ఒక్క రాత్రిలో నిర్మాణం కాదువందేళ్ళలో కేవలం 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయికేవలం ఐదేళ్ళలో వైఎస్జగన్ ఐదు మెడికల్ కాలేజ్ ప్రారంభించి మరో ఐదు కాలేజీల నిర్మాణం ప్రారంభించారుఈ ఏడాది ఐదు మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రావాల్సి ఉంది.కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలి.దేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా చేయని దుస్సాహాసం కూటమి ప్రభుత్వం చేసిందిపులివెందుల కాలేజీకి సీట్ల కేటాయింపు వద్దని ప్రభుత్వం లేఖ రాసిందిపులివెందుల మీద ద్వేషం, రాజకీయ కక్షతోనే ప్రభుత్వం లేఖ రాసింది.వైఎస్జగన్ మీద కక్షతోనే విద్యార్థుల జీవితాలను బలి చేస్తున్నారుమూడో ఫేజ్‌లో రావాల్సిన ఏడు మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం ఎటువంటి స్పష్టత ఇవ్వడం లేదుప్రయివేట్--పబ్లిక్ పార్టనర్ షిప్ లో నిర్వహించేందుకు సిద్దమయ్యారు.ప్రయివేటు వ్యక్తులకు బదలాయిస్తూ స్కామ్‌కు తెర తీస్తున్నారు.ఫీజుల జీవోలను రద్దు చేస్తామని ఎన్నికల ముందు చెప్పి ఈ రోజు అదే జీవో పేరుతో ఫీజులు కొనసాగిస్తున్నారు]ఇదీ చదవండి.. బాబూ అమరావతి మాత్రమే సెంటిమెంటా..? -
డీమ్డ్ మెడికల్ కాలేజీల్లో సగం సీట్లపై సర్కారు పట్టు
సాక్షి, హైదరాబాద్: డీమ్డ్ మెడికల్ కాలేజీలకు ఎలాగైనా అడ్డుకట్ట వేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కృత నిశ్చయంతో ఉంది. ఇతర ప్రైవేట్ మెడికల్ కాలేజీల మాదిరిగానే జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధనల ప్రకారం డీమ్డ్ మెడికల్ కాలేజీలు కూడా సగం సీట్లను కనీ్వనర్ కోటా కిందే రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయాల్సి ఉంటుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఆయా కాలేజీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఇతర వర్గాలకు కూడా రిజర్వేషన్ అమలు చేయాల్సి ఉంటుందని అంటున్నాయి. డీమ్డ్ వర్సిటీలైనా, ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుబంధంగా ఉన్న మెడికల్ కాలేజీలైనా సగం సీట్లను కనీ్వనర్ కోటాకు ఇచ్చేలా కొత్త నిబంధనలు తీసుకురావాలని యోచిస్తోంది.ఒకవేళ ఈ నిబంధనలను అమలు చేసేందుకు డీమ్డ్ మెడికల్ కాలేజీలు సహా ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుబంధంగా ఉన్న మెడికల్ కాలేజీలు ఒప్పుకోకపోతే, మరో రూపంలో ఆయా కాలేజీలను కట్టడి చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల డీమ్డ్ హోదా పొందిన రెండు మల్లారెడ్డి మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్ సీట్లపై ప్రభుత్వం పట్టుదలతో ఉంది. దీనిపై బుధవారం వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్షించనున్నారు.డీమ్డ్ హోదా పొందిన కాలేజీలు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అనేక సదుపాయాలు పొందుతున్నాయని, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల పేరిట ప్రభుత్వ బిల్లులు పొందుతున్నాయని అంటున్నారు. అవసరమైతే కోర్టుకు వెళ్లైనా దీనిపై తేల్చుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. అంతేకాదు నీట్ ఫలితాలు వెలువడి కౌన్సెలింగ్ తేదీలు ప్రకటించిన తర్వాత, డీమ్డ్ హోదా పొందటం న్యాయపరంగా ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.డీమ్డ్‌లో సొంత నిబంధనలపై గరంగరం..రాష్ట్రంలో రెండు మల్లారెడ్డి మెడికల్ కాలేజీలు డీమ్డ్ హోదా దక్కించుకున్నాయి. మరో నాలుగు మెడికల్ కాలేజీలు డీమ్డ్ హోదాకు దరఖాస్తు చేసుకున్నాయి. కనీ్వనర్ కోటా సీట్లను మేనేజ్మెంట్ సీట్లుగా మార్చుకోవడం, ఫీజులు తమకు అవసరమైన రీతిలో వసూలు చేసుకోవడం, రిజర్వేషన్లు ఎత్తేయడం, సొంతంగానే పరీక్షలు పెట్టుకోవడం.. వంటివి ఉంటాయని ఆయా కాలేజీలు చెబుతున్నాయి. నీట్లో ర్యాంకు సాధించిన ప్రతిభ గల, పేద, మధ్య తరగతి విద్యార్థులు డాక్టర్ కావాలన్న ఆశను దెబ్బ కొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న విమర్శలున్నాయి. డీమ్డ్ వర్సిటీలుగా మారా లంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదన్న వాదననను ప్రైవేట్ యాజమాన్యాలు తెరపైకి తెస్తున్నాయి.ఇదే జరిగితే మున్ముందు మరిన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు డీమ్డ్ హోదా సాధించుకునే అవకాశం ఉంది. అలాగైతే రాష్ట్రంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని కనీ్వనర్ కోటా సీట్లు మొత్తం మేనేజ్మెంట్ సీట్లుగా మారిపోతాయని అంటున్నారు. దీనివల్ల కన్వీనర్ కోటా ఫీజు ఎత్తేసి మేనేజ్మెంట్ ఫీజులు అమలవుతాయి. డీమ్డ్ హోదా కోసం కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నుంచి ఎన్ఓసీ తీసుకోవాల్సిందేనని అంటున్నారు.ఎన్ఎంసీ నుంచి ఎంబీబీఎస్ సీట్లకు అనుమతి పొందుతున్నందున ప్రభుత్వ అజమాయిషీ లేకుండా ఎలా ఉంటుందంటున్నారు. ఫీజును కూడా ఆయా కాలేజీలు సొంతంగా నిర్ణయించుకునే అధికారం లేదని అంటున్నారు. దీనిపై సీరియస్‌గా ఉన్న మంత్రి రిజర్వేషన్లు రాజ్యాంగం కలి్పంచిన హక్కు అని... దానిని డీమ్డ్ పేరుతో ఎలా కాలరాస్తారని ప్రశి్నస్తున్నారు. -
మెడికల్ కాలేజీలపై చంద్రబాబు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు
-
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక భారీ స్కామ్..
-
ప్రభుత్వ మెడికల్ కళాశాలలతో ప్రభుత్వానికి నష్టమా?
నరసరావుపేట/నగరి/రాజంపేట/ప్రొద్దుటూరు క్రైం/పిడుగురాళ్ల: వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పేద, మధ్య తరగతి విద్యార్థుల వైద్య విద్య కల సాకారం చేయడం కోసం.. సామాన్యులకు ఉచితంగా అత్యుత్తమ వైద్యం అందించేందుకు పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కళాశాల ఏర్పాటుకు శ్రీకారం చుడితే ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం అందుకు మోకాలొడ్డుతోంది. తమది పెత్తందారుల ప్రభుత్వమని చెప్పకనే చెప్పింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వైద్య రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చింది.ఏకంగా రూ.8,480 కోట్లతో 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలను ప్రారంభించింది. 2023–24లో 5 కాలేజీల్లో తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది మరో ఐదు కాలేజీలు.. మదనపల్లె, పులివెందుల, ఆదోని, మార్కాపురం, పాడేరు కళాశాలలు ప్రారంభం కావాల్సి ఉండింది. దాదాపుగా పూర్తయిన ఈ కళాశాలల్లో ఎన్ఎంసీ తనిఖీలకు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది. పులివెందుల, పాడేరు కళాశాలలకు సీట్లు మంజూరు చేస్తూ ఎన్ఎంసీ ఆదేశాలు ఇచ్చింది.దీనికి సంతోషించాల్సింది పోయి పులివెందుల కళాశాలకు సీట్లు కేటాయించొద్దంటూ ఆగమేఘాలపై గుట్టు చప్పుడు కాకుండా లేఖ రాసింది. జగన్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందోనని చంద్రబాబు ప్రభుత్వం ఇలా పేద విద్యార్థులకు, పేద రోగులకు అన్యాయం చేయడం పట్ల నిరసన వ్యక్తమవుతోంది. ఈ విషయమై ఆదివారం పలువురు వైఎస్సార్సీపీ నేతలు విలేకరుల సమావేశాలు నిర్వహించి బాబు వైఖరిని కడిగిపారేశారు.మీకు నష్టమేంటి బాబూ?ప్రభుత్వ మెడికల్ కళాశాలలు వస్తే సీఎం చంద్రబాబుకు వచ్చిన నష్టమేమిటో చెప్పాలి. వైఎస్ జగన్ తీసుకొచ్చాడనే దుగ్ధతో, కోపంతో, పగతో మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయాలనుకోవడం దారుణం. మీ హయాంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ అయినా కట్టావా చంద్రబాబూ? మీకు ప్రైవేట్‌పైనే మోజు. ఒక పేద విద్యార్థి ప్రైవేటు మెడికల్ కళాశాలలో చదవాలంటే సుమారుగా రూ.1.5 కోట్ల డొనేషన్ చెల్లించాలి. ఇది సాధ్యమయ్యే పనేనా? ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించలేరన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. గతేడాది 5 కళాశాలలు ప్రారంభించింది. ఈ ఏడాది మరో ఐదు ప్రారంభం కావాల్సి ఉండింది. బాబు పుణ్యమా అని వాటికి మోక్షం లభించలేదు. – డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే క్షమించరాని నేరంజగనన్నపై ఉన్న ఈర్ష, ద్వేషాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెడికల్ కళాశాలలపై చూపుతున్నారు. కేటాయించిన సీట్లను ప్రభుత్వం రద్దు చేయమని కోరడం దుర్మార్గం. తన రాజకీయ చరిత్రలో చంద్రబాబు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీని తేకపోగా, ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలను పీపీపీ విధానం పేరుతో ప్రైవేటుపరం చేయాలనుకోవడం క్షమించరాని నేరం. ఎంబీబీఎస్ సీట్లు ఇస్తామంటే ఎవరైనా వద్దంటారా? నీట్ పరీక్షలు రాసి మెడిసిన్ సీటు కోసం ఎంతో మంది వేచి చూస్తున్నారు. కొత్తగా ఐదు కాలేజీలు వస్తున్నాయంటే కొంచెం ర్యాంకు తక్కువగా వచ్చినా, సీటు వస్తుందనే ఆశతో ఉన్నారు. వారి ఆశలపై చంద్రబాబు ప్రభుత్వం నీళ్లు చల్లింది. – ఆర్కే రోజా, మాజీ మంత్రి సీట్లు అమ్ముకోవడమే లక్ష్యంవైద్య విద్యను పేద విద్యార్థులకు దూరం చేసి పెత్తందారులకు అమ్ముకోవటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోంది. మెడికల్ కాలేజీలు పూర్తి కాకుండా ప్రారంభించారని.. వసతులు, సిబ్బంది లేరని సాక్షాత్తు రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రచారం చేయటం సిగ్గుచేటు. వైద్య కళాశాలలు ప్రారంభించటం అనేది మెడికల్ కౌన్సిల్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. మెడికల్ కౌన్సిల్ సభ్యులు పరిశీలించాకే కాలేజీల ప్రారంభానికి అనుమతి ఇస్తారు. ఇది కూడా మంత్రికి తెలియదా? – డాక్టర్ ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి -
చంద్రబాబూ.. ప్రభుత్వ సంస్థలంటే అంత అసహ్యమెందుకు?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం అత్యంత దుర్మార్గమైన పాలన చేస్తోందన్నారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పక్క రాష్ట్రాలు కొత్త మెడికల్ కాలేజీలు, ఎంబీబీఎస్ సీట్ల కోసం ప్రదక్షిణాలు చేస్తున్న పరిస్థితుల్లో మన రాష్ట్రానికి వచ్చిన సీట్లను తిప్పిపంపడం ఏ తరహా పరిపాలనకు నిదర్శనం చంద్రబాబు అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి వస్తే మొత్తం సీట్లన్నీ ఫ్రీ అన్నారు. సీట్ల సంగతి దేవుడెరుగు.. ఇప్పుడు ఏకంగా కాలేజీలనే అమ్మేస్తున్నారు. ఇది ఏరుదాటాక తెప్పతగలేయడం కాదంటారా? మోసం చేయడమే మీ నైజమని మరోసారి బయటపడింది అని ఘాటు విమర్శలు చేశారు.కాగా, వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా చంద్రబాబు ప్రభుత్వానికి ఎనిమిది ప్రశ్నలు సంధించారు..1.రాష్ట్రానికి ఎంబీబీఎస్ సీట్లు వస్తుంటే సంతోషించాల్సింది పోయి, అవసరం లేదంటూ చంద్రబాబు గారి ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం చాలా దారుణం. ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేసే బృహత్తర యజ్ఞానికి రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా తన చేతులతో తానే భంగం కలిగించడం అత్యంత హేయం, దుర్మార్గం. పక్క రాష్ట్రాలు కొత్త మెడికల్ కాలేజీలు, ఎంబీబీఎస్ సీట్లకోసం ప్రదక్షిణాలు చేస్తున్న పరిస్థితుల్లో మన రాష్ట్రానికి వచ్చిన సీట్లను తిప్పి పంపడం ఏ తరహా పరిపాలనకు నిదర్శనం చంద్రబాబు?2.నాణ్యమైన విద్య, వైద్యాన్ని ప్రజలకు ఒక హక్కుగా అందించడం అన్నది ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత. తమ పిల్లలకు మంచి విద్యను అందించడానికి, మంచి వైద్యం అందుకోవడానికి ఏ కుటుంబం కూడా ఆస్తులు అమ్ముకునే పరిస్థితి రాకూడదు. ఈ బాధ్యతల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా తప్పించుకుంటుంది చంద్రబాబు? అలా తప్పించుకుంటే, దాన్ని ప్రభుత్వం అని అంటారా?3.దీన్ని గుర్తించే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చాం. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీ ఉండాలన్న లక్ష్యంతో రూ.8,480కోట్లతో 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలను ప్రారంభించాం. దీనివల్ల ప్రభుత్వానికి ఏ రకంగా నష్టం వస్తుంది? 2023-24 సంవత్సరాల్లో 5 కాలేజీల్లో తరగతులు ప్రారంభం కావడం నిజం కాదంటారా? తద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా రాష్ట్రానికి రాలేదంటారా? చాలామంది పేద పిల్లలు సీట్లు సాధించి డాక్టర్ చదువులు చదవడం లేదా?4.నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం వెళ్తే ఈ ఏడాదిలోనే మరో 5 కాలేజీలు మదనపల్లె, పులివెందుల, ఆదోని, మార్కాపురం, పాడేరుల్లో మరో 750 సీట్లు అందుబాటులోకి వచ్చేవి. విద్యార్థులు డాక్టర్లయ్యే అవకాశం ఉండేది. ఇప్పుడు పాడేరు కాలేజీని 50 సీట్లకే పరిమితం చేయడం ఏంటి? పులివెందుల కాలేజీకి ఎన్ఎంసీ 50 సీట్లు మంజూరు చేస్తే, వద్దంటూ లేఖ రాయడం ఏంటి? మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరంచేసే స్కామ్‌లకు ఆలోచన చేయడం ఏంటి?5.కోవిడ్‌లాంటి సంక్షోభం ఉన్నా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మెడికల్ కాలేజీల నిర్మాణాల కోసం రూ.2403 కోట్లు ఖర్చుచేసి, ఐదు కాలేజీల్లో క్లాసులు మొదలుపెట్టి, మరో ఐదు కాలేజీలను ఈ ఏడాది నుంచే బోధనకు సిద్ధం చేశాం. మీ ప్రభుత్వం కూడా క్రమంగా ఖర్చు చేసుకుంటూ వెళ్తే మిగిలిన కాలేజీలు కూడా అందుబాటులోకి వస్తాయన్నది వాస్తవం కాదా? ఇది చేయకుండా భారం అంటూ చేతులు దులిపేసుకుని ప్రజారోగ్య సంస్థలను అమ్మేస్తారా?. ప్రైవేటు మీద మీకు అంతమోజు ఎందుకు? ప్రభుత్వ సంస్థలంటే అంత అసహ్యం ఎందుకు?6.కొత్త మెడికల్ కాలేజీల నిర్వహణలో ఇబ్బందులు రాకూడదు, అదే సమయంలో పేద విద్యార్థులకు నష్టం రాకూడదన్న విధానంలో మేం సీట్లను భర్తీ చేస్తే, ఎన్నికల్లో ఓట్ల కోసం నానా రాద్ధాంతం చేశారు. అధికారంలోకి వస్తే మొత్తం సీట్లన్నీ ఫ్రీ అన్నారు. సీట్ల సంగతి దేవుడెరుగు.. ఇప్పుడు ఏకంగా కాలేజీలనే అమ్మేస్తున్నారు. ఇది ఏరుదాటాక తెప్పతగలేయడం కాదంటారా? మోసం చేయడమే మీ నైజమని మరోసారి బయటపడింది చంద్రబాబు.7.పార్లమెంటు నియోజకవర్గానికో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉంటే, అది ఆ నియోజకవర్గంలో ఉన్న ఏరియా ఆస్పత్రులకు, సీహెచ్‌సీలకు, పీహెచ్‌సీలకు, విలేజ్ క్లినిక్స్‌కు మార్గదర్శిగా ఉంటుంది. సూపర్ స్పెషాలిటీ సేవలు కూడా పేదలకు ఉచితంగా ఆ జిల్లాస్థాయిలోనే అక్కడే లభిస్తాయి. అలాంటి కాలేజీలను ప్రైవేటు పరం చేస్తే ముందుగా నష్టపోయేది పేద విద్యార్థులే కాదు, అక్కడి ప్రజలకు కూడా. వారికి నాణ్యమైన వైద్యం అందదు సరికదా, ప్రైవేటు ఆస్పత్రులకు పోటీ లోపించి వైద్యంకోసం వసూలుచేసే ఫీజులు ఆకాశాన్ని అంటుతాయి. ఎప్పుడైనా ప్రైవేటుకు గవర్నమెంటు పోటీగా ఉంటేనే, రేట్లు రీజనబుల్‌గా ఉంటాయి. కాలేజీలను ప్రైవేటీకరించాలన్న మీ విధానం అందరినీ దెబ్బతీస్తుందన్న మాట వాస్తవం కాదా? అటు ప్రజలను, ఇటు పిల్లలను కోవిడ్ లాంటి మహమ్మారి సమయంలో ఆదుకున్నది ప్రజారోగ్య రంగమే అని గుర్తించకపోతే ఎలా చంద్రబాబు.8.ఇకనైనా కళ్లుతెరవండి చంద్రబాబుగారూ. వెంటనే ఎన్ఎంసీకి రాసిన లేఖను వెనక్కి తీసుకోవడంతోపాటు, ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోండి. మెడికల్ కాలేజీల్లో మిగిలిన పనులను పూర్తిచేసి, పేదపిల్లలకు వైద్యవిద్యను, పేదలకు నాణ్యమైన ఉచిత వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురండి. మీకు చేతనైనంత మీరు ఖర్చుచేస్తూ వెళ్లండి. మీకు చేతకాకపోతే మళ్లీ మేం వచ్చిన తర్వాత అయినా పూర్తిచేస్తాం. అంతేకానీ ఇలా మెడికల్ కాలేజీల ప్రైవేటు పరం మాటున స్కామ్‌లు చేయడం మానుకో చంద్రబాబూ! లేదంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని గుర్తించుకోండి’ అంటూ కామెంట్స్ చేశారు. 1.రాష్ట్రానికి ఎంబీబీఎస్ సీట్లు వస్తుంటే సంతోషించాల్సింది పోయి, అవసరం లేదంటూ చంద్రబాబు గారి ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం చాలా దారుణం. ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేసే బృహత్తర యజ్ఞానికి రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా తన చేతులతో తానే భంగం కలిగించడం అత్యంత హేయం, దుర్మార్గం. పక్క…— YS Jagan Mohan Reddy (@ysjagan) September 15, 2024ఇది కూడా చదవండి: విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికుల ధర్నా -
ఏపీలోనే ఇలాంటి పరిస్థితి.. సిగ్గుచేటు: సీదిరి
శ్రీకాకుళం, సాక్షి: వైద్య విద్య చదవాలనుకునే విద్యార్ధులు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం ద్రోహం చేసిందన్నారు మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు. పులివెందుల మెడికల్ కాలేజీ విషయంలో మంత్రి సత్య కుమార్ యాదవ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ.. మెడికల్ సీట్లు వదులుకోవడం అత్యంత హేయనీయమని వ్యాఖ్యానించారు. . పలాసలో శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆమోదం విస్మయం కలిగించిందన్న మంత్రి సత్య కుమార్ యాదవ్ మాటలు బాధాకరం. మెడికల్ కాలేజీకి అదనంగా సీట్లు ఇస్తే వద్దు అని మంత్రి సత్య కుమార్ యాదవ్ వ్యాఖ్యానించడం సిగ్గుచేటు.. .. ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అదనంగా సీట్లు వస్తే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా వద్దంటుందా?. కానీ, చంద్రబాబు ప్రభుత్వం సీట్లు వద్దు అని లెటర్ రాసింది. మెడికల్ సీట్లు పెంచాల్సిన ప్రభుత్వమే.. తగ్గించేందుకు కుట్ర చేస్తోంది. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం తమకు మెడికల్ సీట్లు వద్దు అని చెప్పదు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో అలాంటి మొట్టమొదటి సారి పరిస్థితి ఏర్పడింది... పద్నాలుగేళ్లు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా స్థాపించలేదు. అయినా కూడా రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలకు మౌలిక సదుపాయాలు మెరుగుపరుచుకోండి అని ఎన్ఎంసీ నిధులు ఇస్తుంటే.... మాకు వద్దు అన్న ఘనత చంద్రబాబు నాయుడుకు మాత్రమే దక్కింది. రాష్ట్రంలోని వైద్య విద్యను ఎంచుకోవాలనుకున్న అనేక లక్షల మంది భవిష్యత్తును చంద్రబాబు నాశనం చేస్తున్నారు. ఈ చర్యలను విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, మేధావులు గమనించాలి అని సీదిరి అప్పలరాజు కోరారు.ఇదీ చదవండి: పవన్ అయినా స్పందించడేం? -
‘‘మెడికల్ కాలేజీ సీట్లు వదులుకోవడం ఆంధ్రకు దోహం చేయడమే’’
‘‘ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌లో ప్రజారోగ్యానికి ఉరితాడు వేస్తున్నారు’’ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్య ఇది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తే చంద్రబాబు ప్రభుత్వం కచ్చితంగా ఇదే పనిలో ఉన్నట్లు స్పష్టమవుతుంది. దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత ఘోరంగా వ్యవహరించి ఉండదు. జగన్ ప్రాతినిథ్యం వహిస్తున్నందుకు పులివెందులపై కక్షా? లేక రాయలసీమపై వ్యతిరేకతో తెలియదు కానీ.. బాబు ప్రభుత్వం బంగారం లాంటి మెడికల్ కాలేజీ సీట్లను వదులుకుంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బాబు చేసిన ద్రోహమే అవుతుంది.జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తెచ్చారు నాలుగు ఓడరేవులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు కూడా ఆయన హయాంలోనే వచ్చాయి. విజయవాడ వద్ద కృష్ణా నదికి రీటెయినింగ్ వాల్ కట్టడం వల్ల ఇటీవలి వరదల్లో వేలాది మంది ముంపునకు గురయ్యే ప్రమాదం తప్పింది కూడా. ఇన్ని చేసినా చంద్రబాబు నాయుడు ఎల్లోమీడియా సాయంతో ఆంధ్రలో అభివృద్ధి లేకుండా పోయిందని నిత్యం దుష్ప్రచారం చేసేవారు. విధ్వంసం తప్ప మరేమీ లేదని అభాండాలు మోపేవారు.జనం ఓట్లు వేశారో, లేక ఈవీఎంల మహిమో గానీ.. ఇటీవలి ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి రావడం, బాబు ముఖ్యమంత్రి అవడం అయిపోయింది. అంతే! ఏపీలో హింస, విధ్వంసం చెలరేగిపోయింది. కరోనా మహమ్మారి పెచ్చరిల్లిన సమయంలోనూ చక్కగా పనిచేసిన వలంటీర్ల వ్యవస్థతో మొదలుపెట్టి అనేక ఇతర వ్యవస్థలను నిర్వీర్యం చేసే పనికీ దిగజారారు. జగన్ మొదలుపెట్టిన అనేక ప్రజోపయోగ పథకాలను నీరుగార్చేందుకే ప్రభుత్వం తన శక్తియుక్తులన్నింటినీ ఖర్చు పెట్టడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే... ప్రజారోగ్యం కూడా చేరింది!వైఎస్ జగన్ పాలనలో ప్రజలందరికీ వైద్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంటింటికీ వైద్యుడిని పంపే ఆలోచన చేశారు. ప్రస్తుతం బాబు ప్రభుత్వం ఏం చేసిందో తెలియదు. విద్యార్థులకు ఇంట్లోనే కంటి పరీక్షలు చేసి కళ్ల జోళ్లు పంపిణీ చేయడాన్ని నిలిపివేయమని ఆదేశించినట్లు సమాచారం. ఇక తాజాగా బాబు గారి దృష్టి జగన్ సృష్టించిన వైద్య విద్య వ్యవస్థపై పడింది. వైద్యాన్ని సామాన్యుడికి కూడా చేరువ చేసే లక్ష్యంతో జగన్ ప్రభుత్వ రంగంలోనే వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈ సంకల్పానికి బాబు ప్రభుత్వం తన తప్పుడు నిర్ణయాలతో తూట్లు పొడుస్తోంది.ఇదీ చదవండి: కాలేజీలపై 'చంద్రబాబు' కత్తి!తెలంగాణలో అదనంగా నాలుగు మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్రం పచ్చ జెండా ఊపింది. ఫలితంగా ఈ ఏడాది కొత్తగా 8 కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. ఇవన్నీ ప్రభుత్వ కాలేజీలే. వీటన్నింటితో తెలంగాణలో మొత్తం వైద్యవిద్య సీట్ల సంఖ్య 4090కి చేరబోతుంది. అయితే తెలంగాణతో పోటీపడి ప్రభుత్వ కాలేజీలు ఏర్పాటు చేయాల్సిన ఆంధ్రప్రదేశ్ గతంలో జగన్ హయాంలోనే తీసుకొచ్చిన కాలేజీలను వదులుకునేందుకు లేదా ప్రైవేట్ వారికి అప్పగించే దిశగా సాగుతూండటం దురదృష్టకరం.జగన్ ప్రభుత్వ హయాంలోనే 2023-24లో విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలల్లో కొత్త మెడికల్ కాలేజీల్లో క్లాసులు ప్రారంభమయ్యాయి. మొత్తం 750 సీట్లు అందుబాటులోకి రావడంతో మెరిట్ కలిగిన పేద విద్యార్థులకు మేలు జరిగింది. 2024-25లో పాడేరు, మార్కాపురం, మదనపల్లి, పులివెందుల, ఆదోనిలల్లో కొత్త కాలేజీలు ప్రారంభం కావాలి. వీటికి భవనాల నిర్మాణం కూడా జరిగింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం వీటన్నిటినీ ప్రైవేటు పరం చేయాలన్న ఉద్దేశంతో ఆరంభించడంలేదన్న విమర్శలు వస్తున్నాయి. లితంగా మరో 750 సీట్లు అందుబాటులోకి రాకుండా పోయాయి. మరో వైపు కేంద్రం పులివెందుల వైద్య కళాశాలకు ఇస్తానన్న యాభై సీట్లను కూడా తమకు వద్దంటూ చంద్రబాబు సర్కార్ లేఖ రాయడం రాయలసీమకు అన్యాయం చేయడమే. మౌలిక వసతులు సిద్దంగా లేవని ప్రభుత్వం చెప్పడం అంటే విధ్వంసానికి పాల్పడుతున్నట్లే.జగన్ ప్రభుత్వ రంగంలోకి తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలని చంద్రబాబు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. మంత్రివర్గ సమావేశంలో కూడా ఈ అంశాన్ని చర్చించి గుజరాత్ మోడల్ లో ప్రైవేటు రంగానికి అప్పగించాలన్న ఆలోచనలో ప్రభుత్వముంది. దీనివల్ల సామాన్య విద్యార్థులు సైతం అధిక ఫీజుల్ని చెల్లించాల్సి వస్తుంది. మెరిట్ ఉన్నా పేదలు వైద్య విద్యను అభ్యసించలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇక వచ్చే ఏడాది ప్రారంభించాల్సిన ఏడు మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు కూడా అటకెక్కినట్లు వార్తలు వచ్చాయి. కొన్ని కాలేజీల నిర్మాణం నత్తనడక సాగుతుండడంతో అందులోని వస్తువులు చోరీకి గురవుతున్నాయి.ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి ఈ కాలేజీలకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించడం కోసం సెల్ఫ ఫైనాన్స్ స్కీమ్ కింద యాభై శాతం సీట్లను అధిక ఫీజుకు కేటాయించాలని జగన్ నిర్ణయిస్తే ఇదే చంద్రబాబు, పవన్, లోకేష్‌లు నానా గగ్గోలు చేశారు. సంబంధిత 107, 108 జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వస్తే మొత్తం సీట్లు కన్వీనర్ కోటాలోనే అంటే ప్రభుత్వపరంగానే కేటాయిస్తామని బడాయి మాటలు చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక సెల్ఫ్ ఫైనాన్స్ విధానం మార్చుకోవడంలేదని హైకోర్టులో వేసిన అఫిడవిట్లో తేల్చేశారు. ఈ నేపథ్యంలో కొత్త మెడికల్ కాలేజీల్లో అన్ని సీట్లను కన్వీనర్ కోటాలోనే భర్తీ చేస్తామని చంద్రబాబు, పవన్, లోకేష్‌లు ఇచ్చిన హామీని గాలి కొదిలేశారని జగన్ విమర్శించడం ఎంతైనా సహేతుకం. బీజేపీతో పొత్తులో ఉన్నా, ఐదు కాలేజీలకు అనుమతులు తెచ్చుకోలేకపోవడం చంద్రబాబు వైఫల్యమని కూడా జగన్ సరైన వ్యాఖ్యే చేశారు.గతంలో నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి హయాంలో ప్రైవేటు రంగంలో 12 మెడికల్ కాలేజీలను మంజూరు చేస్తే విద్యను వ్యాపారం చేస్తారా అంటూ తెలుగుదేశం నానా యాగీ చేసిన విషయం ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే అన్ని ప్రైవేటు వారే చేయాలని అప్పట్లోనూ చెప్పారు. ఈ ఒక్కరంగంలోనే కాదు అన్నిటిలో ఆయన ధోరణి ఇలాగే ఉంటుంది. తన రాజకీయ ప్రత్యర్థులు ప్రభుత్వంలో ఉండి ప్రజలకు ఉపయోగపడే పనులు ఏవైనా చేపడితే వంకలు పెట్టి ఎలా పాడు చేయాలనే దృష్టితో చంద్రబాబు, తెలుగుదేశంసర్వదా కృషి చేస్తుంది.దానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి ఎల్లో మీడియా వంతపాడతాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ఒక విధంగా చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం అభివృద్ధి నిరోధకంగా మారింది. తానే అభివృద్ధి చేస్తున్నట్టు ముసుగు వేసుకోవడంలో మాత్రం గొప్ప ప్రావీణ్యం సంపాదించుకున్నారు. ఇప్పుడు చేజేతులా ప్రభుత్వ రంగంలో రావాల్సిన మెడికల్ కాలేజీలను వదులుకుంటున్న వైనం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై ఆయా రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు స్పందిస్తున్నట్టు కనపడడం లేదు. చంద్రబాబు ఎవరినైనా మేనేజ్ చేయగలరనడానికి ఇదొక ఉదాహరణ.ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వచ్చిన తర్వాత జరిగిన హింసాకాండ, విధ్వంసం గతంలో ఎన్నడూ జరగలేదు. ఇప్పుడు జగన్ తెచ్చిన వ్యవస్థలను, అభివృద్ధిని, విధ్వంసం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. ఆ విధ్వంసంలో పవన్ కల్యాణ్ కూడా భాగస్వాములవుతున్నారు. ప్రతిపక్షంలో వున్నప్పుడు సూపర్ సిక్స్ అంటూ ఎక్కడలేని హామీలను ఇచ్చి ఇప్పుడు మాట తప్పుతున్నారు. అందులో మెడికల్ కాలేజీలు కూడా సమిధలవుతున్నాయి.ఇది ఆంధ్ర ప్రజలు చేసుకున్న ఖర్మ అనుకోవాలా! - కొమ్మినేని శ్రీనివాస రావు,సీనియర్ జర్నలిస్టు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
విద్యార్థులకు ఇంత ద్రోహమా?
సాక్షి, అమరావతి: వైద్య విద్య చదవాలని ఆశించే రాష్ట్రంలోని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు, ఉచిత వైద్యం అందకుండా పేదవర్గాలకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేస్తున్న ద్రోహం మరే రాష్ట్ర ప్రభుత్వమూ చేయదని ఏపీ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు అన్నారు. రాష్ట్రంలో సామాన్యులకు వైద్య విద్య, ఉచిత వైద్యం అందకుండా చేయాలన్న లక్ష్యంతోనే సీఎం చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందని అభిప్రాయపడ్డారు. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న 5 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతులు తెచ్చుకోవాల్సింది పోయి, నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) పులివెందుల కళాశాలకు 50 సీట్లు ఇస్తామన్న సీట్లను కూడా వద్దని లేఖ రాయడమేంటని ప్రశ్నించారు. ఇలా ఏ ప్రభుత్వమైనా చేస్తుందా అని నిలదీశారు. పక్క రాష్ట్రం తెలంగాణలో నాలుగు కొత్త వైద్య కళాశాలలకు కేంద్రం అనుమతించి, సీట్లు కేటాయించగా, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏపీపై ఆధారపడిన పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు కేంద్రంతో కొట్లాడి కొత్త కళాశాలలు, సీట్లు రాబట్టాల్సింది పోయి.. ఇలా చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరంలో ఐదు వైద్య కళాశాలలను ప్రారంభించలేకపోవడం వల్ల విద్యార్థులు 700 ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయారని తెలిపారు. రాష్ట్రంలో వైద్య విద్య ఆశావహులకు తీరని అన్యాయం జరిగిందని డాక్టర్ వెంకటేశ్వర్లు ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్వ్యూలో వెల్లడించిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.. చంద్రబాబు ప్రభుత్వం నమ్మక ద్రోహం గత ప్రభుత్వంలో కొత్త వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని ప్రవేశపెట్టారు. రిజర్వేషన్ వర్గాల్లోని మెరిట్ విద్యార్థులపై ప్రభావం చూపుతున్న ఈ విధానాన్ని తమ ప్రభుత్వం ఏర్పాటైన వంద రోజుల్లో రద్దు చేస్తామని టీడీపీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి0ది. దీంతో వైద్య విద్య ఆశావహులు, మెడికోలు టీడీపీపై నమ్మకం పెట్టుకున్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేసి ఉంటే ఈ విద్యా సంవత్సరంలోనే 300 ఎంబీబీఎస్ సీట్లు కన్వినర్ కోటాలోకి కొత్తగా వచ్చేవి. అయితే సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేయకుండా టీడీపీ నమ్మక ద్రోహం చేసింది. మరోవైపు ఐదు కొత్త వైద్య కళాశాలలు ప్రారంభిస్తే కన్వినర్ కోటాలో మరిన్ని సీట్లు వస్తాయని పేద, మధ్యతరగతి కుటుంబాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. అయితే, చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆ కళాశాలలకు అనుమతులు రాబట్టకుండా తీరని నష్టం కలిగించింది. పులివెందుల కళాశాలకు 50 సీట్లు మంజూరు చేసినా, కళాశాల నిర్వహించలేమని ప్రభుత్వమే ఎన్ఎంసీకి లేఖ రాసి రద్దు చేయించింది. ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఇలా చేయదు. కేవలం ఏయూ రీజియన్‌లో పాడేరుకు 50 సీట్లు మాత్రమే వచ్చాయి. అందులో 22 సీట్లు మాత్రమే కన్వినర్ కోటాకు, 11 ఓపెన్ కాంపిటీషన్‌కు పోగా 11 సీట్లే రిజర్వేషన్ వర్గాలకు లభిస్తున్నాయి. ఎస్వీ రీజియన్‌లో ఒక్క సీటు కూడా పెరగలేదు. పులివెందులకు 50 సీట్లు తిరస్కరించకపోయి ఉంటే కన్వినర్ కోటాలో రిజర్వేషన్ వర్గాలకు 11, ఓపెన్ కాంపిటీషన్లో 11 సీట్లు అయినా దక్కేవి. వాస్తవానికి కొత్త కళాశాలలు ప్రారంభమై సీట్లు పెరుగుతాయని చాలా మంది మెరిట్ విద్యార్థులు యాజమాన్య కోటా ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోలేదు. ఇప్పుడేమో కటాఫ్‌లు అమాంతంగా పెరుగుతున్నాయి. దీంతో వారంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అలాంటి విద్యార్థులకు అన్యాయం జరుగకుండా కనీసం యాజమాన్య కోటాలో దరఖాస్తుకు మరోసారి అవకాశం కల్పించాలి. ఇలాగైతే సామాన్యులకు వైద్య విద్య దూరమవుతుంది కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తామని చెబుతున్నారు. ఇదే జరిగితే సామాన్య, మధ్య తరగతి కుటుంబాల పిల్లలు వైద్య విద్యను అభ్యసించలేని పరిస్థితి వస్తుంది. పేదలు సైతం బోధనాస్పత్రుల్లో వైద్యం చేయించుకోవాలంటే డబ్బు చెల్లించాల్సి వస్తుంది. ప్రైవేటు వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉండే బోధనాస్పత్రుల్లో రోగులకంటే వైద్య విద్యార్థులే ఎక్కువగా ఉంటారు. సరిపడా ఫ్యాకల్టీ, రోగులు ఉండరు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెబితే వాటిలోనూ ఇవే పరిస్థితులు ఉంటాయి. ఈరోజు మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి వంటి ప్రాంతాల్లో కొత్త వైద్య కళాశాలలు, బోధనాస్పత్రులు అందుబాటులోకి వచ్చాయి. దీంతో అక్కడ రోగులు కిటకిటలాడుతున్నారు. ఎందుకంటే వాటిలో ఉచితంగా వైద్య సేవలు అందుతున్నాయి కాబట్టే. అదే ప్రైవేట్‌కు కట్టబెడితే డబ్బు పెట్టి పేదలు వైద్యం పొందే అవకాశం ఉంటుందా? ప్రైవేట్ వైద్య విద్యకు పట్టం రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రైవేట్ వైద్య విద్యకు పట్టం కడుతోంది. ఇంత దారుణం మరే రాష్ట్రంలోనూ ఉండదు. సీఎం చంద్రబాబు గత చరిత్రను పరిశీలిస్తే ప్రైవేట్ వైద్య విద్యకు పట్టం కట్టి, పేద, మధ్య తరగతి వర్గాలకు వైద్య విద్యను దూరం చేయాలన్నదే ఆయన లక్ష్యమని స్పష్టమవుతుంది. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రైవేట్ కళాశాలల్లో ఎంబీబీఎస్, పీజీ వైద్య విద్య కోర్సుల్లో ఫీజులను విచ్చలవిడిగా పెంచారు. డబ్బున్న వారికే వైద్య పట్టా అన్నట్టుగా తయారు చేశారు. 2014–19 మధ్య ప్రైవేట్‌లో యాజమాన్య కోటాలో మెడికల్ పీజీ ఫీజును రూ.5.25 లక్షల నుంచి ఏకంగా రూ.24.20 లక్షలకు పెంచారు. రూ.5.25 లక్షల ఫీజు అంటే బ్యాంక్ లోన్ తీసుకొనో, బయట అప్పులు చేసో పేద, మధ్య తరగతి వైద్యులు పీజీ చేయడానికి సాహసిస్తారు. పీజీలో చేరాక వారికి వచ్చే స్టైఫండ్‌తో అప్పు తీర్చుకోవచ్చనే నమ్మకం ఉంటుంది. ఐదింతలు పెంచే సరికి ఆ అవకాశం కూడా లేక, అంత ఫీజు కట్టలేక చాలా మంది పీజీ చదవలేకపోయారు. అంతే కాదు టీడీపీ అధికారంలో ఉండగా రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు చేసి, మెడిసిన్ సీట్లు తెచ్చిన దాఖలాలూ లేవు.ఈడబ్ల్యూఎస్ కోటాపైనా ఇదే తీరు ఈడబ్ల్యూఎస్ కోటా పైనా చంద్రబాబు ప్రభుత్వం తీరు ఇలానే ఉంది. ఎంబీబీఎస్ సీట్లను పెంచి ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేయాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ సీట్లు పెంచకుండా కోటా అమలుకు జీవో ఇచ్చి ప్రభుత్వం చేతులు దులిపేసుకుంది. కోర్టులో కేసులు వేస్తే జీవో రద్దు చేస్తామని ప్రభుత్వం వెల్లడించిందే గానీ సీట్లు పెంచడానికి కృషి చేస్తామని మాత్రం చెప్పలేదు. అంటే రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల కొరత సృష్టించి, ప్రైవేట్ వైద్య కళాశాలలకు డిమాండ్ పెరిగేలా చేస్తున్నారు. -
వైద్య విద్య కల ఛిద్రం.. ఇక ప్రైవేట్ ‘మెడిసిన్’!
సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యార్థుల వైద్య విద్య కలలను సీఎం చంద్రబాబు ప్రభుత్వం చిధ్రం చేసింది. ‘పీ 4’ జపం చేస్తూ ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెట్టే కుట్రకు తెర తీసింది. అందులో భాగంగానే ఐదు ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నుంచి అనుమతులు రాకుండా తాజాగా అడ్డుపడింది. ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ కొత్త మెడికల్ కళాశాలలు ప్రారంభమైతే తమకు వైద్య విద్య చదివే అవకాశం లభిస్తుందని కోటి ఆశలు పెట్టుకున్న విద్యార్థులు, తల్లిదండ్రులకు కూటమి సర్కారు వెన్నుపోటు పొడిచింది. దీంతో ఈ ఒక్క ఏడాదే ఏకంగా 700 ఎంబీబీఎస్ సీట్లను రాష్ట్రం కోల్పోయింది. సాధారణంగా ముఖ్యమంత్రులంతా కొత్తగా వైద్య కళాశాలలకు అనుమతులు రాబట్టి విద్యార్థులకు అదనంగా ఎంబీబీఎస్ సీట్లు సమకూర్చడం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తుంటారు. ఇందుకు భిన్నంగా దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనట్లుగా.. ఎన్ఎంసీ సీట్లు ఇస్తామన్నప్పటికీ మాకు వద్దని రాష్ట్ర ప్రభుత్వమే లేఖ రాసిన దుస్థితి చంద్రబాబు పాలనలో ఏపీలో నెలకొంది. గత ప్రభుత్వం తలపెట్టిన 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను గుజరాత్ పీపీపీ మోడల్లో ప్రైవేట్‌కు కట్టబెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఈ ఏడాది ప్రారంభించాల్సిన ఐదు వైద్య కళాశాలలకు కుట్రపూరితంగా ప్రభుత్వమే పొగ పెట్టింది. మరోవైపు వచ్చే ఏడాది ప్రారంభించాల్సిన ఏడు వైద్య కళాశాలల నిర్మాణ పనులను ఇప్పటికే ప్రభుత్వం అటకెక్కించింది. వీటి ద్వారా వచ్చే ఏడాది అందుబాటులోకి రావాల్సిన వెయ్యికి పైగా ఎంబీబీఎస్ సీట్లపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటైతే మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలు మెరుగుపడటంతోపాటు పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువలో అందుతాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే ప్రతి పార్లమెంట్ నియోజక వర్గానికి ఒక మెడికల్ కాలేజీని నెలకొల్పాలని గత ప్రభుత్వం భావించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటైతే మరింత మంది డాక్టర్లు, వైద్య సిబ్బంది సేవలు అందుబాటులోకి వస్తాయి. బోధనాస్పత్రులకు వచ్చే రోగులకు సులభంగా నాణ్యమైన వైద్య సేవలు అందుతాయి. తద్వారా పోటీతత్వం పెరిగి ప్రైవేట్ రంగంలో కూడా వైద్య చికిత్స వ్యయం తగ్గుతుంది. అయితే ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసిన కూటమి సర్కారు ప్రైవేట్ పాట పాడుతోంది.సర్వం సిద్ధం చేసినా ససేమిరా..2024–25 విద్యా సంవత్సరం నుంచి మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, ఆదోని, పాడేరు నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 150 చొప్పున మొత్తం 750 ఎంబీబీఎస్ సీట్లతో అడ్మిషన్లు ప్రారంభించేలా వైఎస్సార్ సీపీ హయాంలో వైఎస్ జగన్ కృషి చేశారు. జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధనలకు అనుగుణంగా ఐదు చోట్ల బోధనాస్పత్రులను అభివృద్ధి చేశారు. కళాశాల, బోధనాస్పత్రుల్లో అవసరమైన పోస్టులను మంజూరు చేసి ఎన్నికలు ముగిసే నాటికి 70–80 శాతం పోస్టుల భర్తీ చేపట్టారు. తొలి ఏడాది తరగతులు ప్రారంభించడానికి వీలుగా కళాశాలలో సెమినార్ హాల్, ల్యాబొరేటరీ, లైబ్రరీ, హాస్టళ్ల నిర్మాణాలు 80 శాతం పూర్తి అయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీటిని ప్రైవేట్‌పరం చేయాలన్న నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతులు సాధించకుండా పొగ పెట్టింది.వద్దని ప్రభుత్వమే లేఖ..కొత్త కాలేజీల్లో తొలి విడత తనిఖీల అనంతరం ఐదు చోట్ల స్వల్పంగా వనరుల కొరత ఉందని పేర్కొంటూ ఎన్ఎంసీ అనుమతులు నిరాకరించింది. ఎన్ఎంసీ గుర్తించిన అంశాలను మెరుగు పరచడానికి ఏమాత్రం చర్యలు తీసుకోకుండానే మొక్కుబడిగా చంద్రబాబు ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లింది. అయినప్పటికీ గత ప్రభుత్వం కల్పించిన వసతుల ఆధారంగానే పులివెందుల వైద్య కళాశాలకు 50 సీట్లను మంజూరు చేస్తూ ఈ నెల 6వ తేదీన ఎన్ఎంసీ లెటర్ ఆఫ్ పర్మిషన్ (ఎల్ఓపీ) ఇచ్చింది. అయితే ఈ కళాశాలను ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశంతో ఉన్న చంద్రబాబు ప్రభుత్వానికి ఆ 50 సీట్లతో కళాశాలలను ప్రారంభించేందుకు మనస్కరించలేదు. దీంతో 50 సీట్లు మంజూరు చేసినప్పటికీ కళాశాలలో మేం వసతులు కల్పించలేమని సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వమే ఎన్ఎంసీకి లేఖ రాసింది. ఫలితంగా చేసేదేమీ లేక 50 సీట్లతో ఇచ్చిన ఎల్‌ఓపీని విత్‌డ్రా చేసినట్టు ఎన్ఎంసీ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు అనుమతులు రద్దు చేసినట్టు స్పష్టం చేసింది.ఉసూరుమన్న విద్యార్థులు, తల్లిదండ్రులుపులివెందుల కాలేజీకి 50 సీట్లు మంజూరు చేసినట్లు ఎన్ఎంసీ ప్రకటించిన అనంతరం ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం కన్వీనర్ కోటా ఆప్షన్ల నమోదు గడువును పొడిగించింది. బుధవారం (11వ తేదీ) రాత్రితో గడువు ముగిసింది. దీంతో కొత్తగా మంజూరైన పులివెందుల కాలేజీలో ప్రవేశాలు పొందవచ్చని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆశ పడ్డారు. అయితే ఆ కళాశాల ఆప్షన్లలో కనిపించకపోవడంతో ఉసూరుమన్నారు.అండర్ టేకింగ్ ఇచ్చి ఉంటే..సాధారణంగా వైద్య కళాశాలల్లో ఎన్ఎంసీ తొలి విడత తనిఖీల అనంతరం వసతుల కొరత ఉంటే అనుమతులివ్వదు. ఆ లోపాలను సవరించుకుని అప్పీల్‌కు వెళితే రెండో విడత తనిఖీలు చేసి అనుమతులిస్తారు. అదే ప్రభుత్వ కళాశాలలైతే తరగతులు ప్రారంభం అయ్యే నాటికి వసతుల కల్పన చేపడతామని ప్రభుత్వం అండర్ టేకింగ్ ఇస్తే ఎన్ఎంసీ ఎల్ఓపీ ఇచ్చేస్తుంది. గతేడాది నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం వైద్య కళాశాలలకు అండర్ టేకింగ్ ఇచ్చి వంద శాతం సీట్లను వైఎస్ జగన్ ప్రభుత్వం రాబట్టింది. అదే తరహాలో ప్రస్తుతం కూటమి సర్కారు కూడా అండర్ టేకింగ్ ఇచ్చి ఉంటే వంద శాతం సీట్లకు అనుమతులు లభించి ఉండేవన్న అభిప్రాయం వైద్య వర్గాల్లో వ్యక్తం అవుతోంది. నిర్మాణాల నిలుపుదలప్రై వేట్‌పరం చేయడంలో భాగంగా నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణాలను సైతం కూటమి సర్కారు నిలిపివేసింది. ఈ ఏడాది ప్రారంభించాల్సిన ఐదు కళాశాలలతో పాటు వచ్చే ఏడాది ప్రారంభించాల్సిన ఏడు కళాశాలల నిర్మాణం కూటమి ప్రభుత్వం వచ్చాక పూర్తిగా నిలిచిపోయింది. ప్రభుత్వం పీపీపీ విధానంలో ముందుకు వెళ్లనుందని, అందువల్ల నిర్మాణాలు చేపట్టకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో ఆదోని, పెనుకొండ కళాశాలల నిర్మాణం ఎక్కడికక్కడే నిలిపివేయాలని కర్నూలు సర్కిల్ ఏపీఎంఎస్ఐడీసీ ఎస్ఈ లిఖితపూర్వకంగా ఉత్తర్వులు ఇచ్చారు. వందేళ్ల చరిత్రలో తొలిసారిగా..2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.8 వేల కోట్లకుపైగా నిధులతో ఒకేసారి 17 వైద్య కళాశాలలు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలలను గతేడాది ప్రారంభించి అదనంగా 750 ఎంబీబీఎస్ సీట్లలో ప్రవేశాలు కల్పించింది. 1923లో ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా మెడికల్ కాలేజీ ఏర్పాటైంది. అప్పటి నుంచి 2023 వరకు రాష్ట్రంలో పూర్తిగా ప్రభుత్వ రంగంలో కేవలం 11 వైద్య కళాశాలలు మాత్రమే ఉండగా వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వైఎస్ జగన్ చేపట్టారు.మోసం చేశారు..నీట్ యూజీలో నేను 593, నా సోదరి 555 స్కోర్ చేశాం. గతేడాదితో పోలిస్తే కటాఫ్‌లు ఎక్కువగా ఉన్నాయి. రెండేళ్లు లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకున్నా సీట్ రావడం కష్టంగా ఉంది. గతేడాది ఏపీకి అదనంగా 750 ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయి. ఈసారి కూడా 750 సీట్లు అదనంగా వస్తే వైద్య విద్య అవకాశాలు పెరిగి మా కల నెరవేరుతుందని భావించాం. కానీ కొత్త వైద్య కళాశాలలకు అనుమతులు రాలేదు. పులివెందుల కాలేజీకి 50 సీట్లతో అనుమతులు వచ్చాయని ఎన్ఎంసీ ప్రకటించినా కౌన్సెలింగ్‌లో చూపించడం లేదు. దీనివల్ల నాలాంటి ఎందరో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొత్త కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ విధానం రద్దు చేస్తామని హామీ ఇచ్చిన టీడీపీ మాట నిలబెట్టుకోకుండా మమ్మల్ని మోసం చేసింది.– నల్లగట్ల సుధీష్ రెడ్డి, రాజంపేట, అన్నమయ్య జిల్లా -
బాబు పాలనలో అమ్మకానికి మెడికల్ కాలేజీలు: వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, గుంటూరు : డబ్బుల కోసం చంద్రబాబునాయుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను స్కాముల కింద మార్చేసి తనకు కావాల్సిన వాళ్ల కోసం అమ్మేసే కార్యక్రమం చేస్తున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. జీరో వేకెన్సీ పాలసీ తీసుకొచ్చి ప్రతి మెడికల్ కాలేజీ, ప్రతి గవర్నమెంట్ ఆస్పత్రిలో ఉండాల్సిన సంఖ్యలో డాక్టర్లు, నర్సులు ఉండేట్టుగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే.. ఈ రోజు మళ్లీ పరిస్థితి మొదటి కొచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. మందుల కొరత వేధిస్తోందని, నాడు–నేడు ఆగిపోయిందని చెప్పారు.గుంటూరు జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్, విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త అవుతు శ్రీనివాసరెడ్డిలను బుధవారం ఆయన ములాఖత్‌లో కలుసుకున్న అనంతరం జైలు బయట ఆయన మీడియాతో మాట్లాడారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒకేసారి 17 కొత్త మెడికల్ కాలేజీలు కట్టడం మొదలు పెట్టి, అందులో ఐదు అప్పటికే పూర్తి చేసిందని తెలిపారు. ఆ ఐదు కాలేజీల్లో సీట్లు తెచ్చుకుని, ఇంకో ఐదు కాలేజీల్లో ఇప్పుడు సీట్లు తెచ్చుకునేందుకు అన్ని పనులు చేసి పెడితే, చంద్రబాబు ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేశారని ధ్వజమెత్తారు. మరోవైపు ఆరోగ్య శ్రీ పథకాన్ని కూడా ఈ ప్రభుత్వం నీరుగారుస్తోందని వివరించారు. ‘మామూలుగా జనవరిలో ఏదైనా ఆస్పత్రి బిల్స్ వస్తే ఫిబ్రవరిలో ఆరోగ్యశ్రీ ట్రస్టు ప్రాసెస్ చేసి మార్చిలో బిల్స్ ఇస్తారు. మార్చి 16న కోడ్ వచ్చింది. ఇక అంతే. జనవరి నుంచి ఇప్పటి దాకా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల బిల్లులు రూ.2 వేల కోట్ల పైచిలుకు దాటాయి. ఇంత వరకు ఇచ్చిన పాపాన పోలేదు. ఆరోగ్య ఆసరానూ అటకెక్కించారు. 104, 108 ఎంప్లాయీస్ జీతాలు ఇవ్వడం లేదంటున్నారు’ అని చెప్పారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..‘సూపర్ సిక్స్’ హామీలు ఏమయ్యాయి? టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి మూడున్నర నెలలు దాటుతున్నా.. టీడీపీ ఆర్భాటంగా ప్రకటించిన సూపర్ సిక్స్, సూపర్ సెవె¯Œన్ హమీలు ఏమయ్యాయో తెలియడం లేదు. సూపర్ సిక్సా.. అంటే ఏమిటి? నాకు గుర్తు లేదే? అని సీఎం చంద్రబాబు అంటున్నాడు. ఎన్నికలప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు పిల్లలను చూపిస్తూ నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు అన్నారు. అమ్మ, చిన్నమ్మ, పెద్దమ్మలకు రూ.18 వేలు ఇస్తామని చెప్పారు. 50 ఏళ్ల పైన వయసున్న మహిళలకు జగనన్న చేయూత కింద ఇచ్చింది కేవలం రూ.18 వేలేనని.. చంద్రన్న మీకు ఏటా రూ.48 వేలు ఇస్తాడు.. సంతోషమేనా? అన్నారు. 20 ఏళ్ల పిల్లలకు నెలకు రూ.3 వేలు అని చెప్పారు. ప్రతి రైతుకు రూ.20 వేలు అని ఊరించారు. ఇప్పటికైనా చంద్రబాబు తాను చేసిన తప్పులు ఒప్పుకుని, ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. ఇకనైనా ప్రజలకు మేలు చేయాలి. లేకపోతే పుట్టగతులు ఉండవు. వచ్చే ఎన్నికల్లో వారికి సింగిల్ డిజిట్ కూడా రాని పరిస్థితి ఖాయం. అదే ఈరోజు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉంటే.. రైతులందరికీ ఈపాటికే రైతు భరోసా సొమ్ము పడి ఉండేది. రైతులందరికీ ఉచితంగా ఇన్సూరెన్స్ అంది ఉండేది. విపత్తులతో ఇంత ఆస్తి, పంట నష్టం జరుగుతున్నా, ఎక్కడా ఆదుకునే కార్యక్రమం జరగడం లేదు. గ్రామ, వార్డు సచివాలయాల్లో జాబితాలు ప్రదర్శించి, వాటిపై సోషల్ ఆడిట్ చేసి.. ఎవరైనా ఇంకా మిగిలిపోయి ఉన్నారా? అందరికీ వచ్చిందా? అన్ని ఊర్లూ నమోదయ్యాయా? అని చూసే కార్యక్రమం జరగడం లేదు. సోషల్ ఆడిట్లు గాలికి ఎగిరిపోయాయి. గ్రామ సచివాలయంలో పారదర్శకంగా లిస్టులు పెట్టే కార్యక్రమం కూడా పోయింది. అర్హత ఉన్నా రాని వాళ్లు ఎవరైనా ఉంటే మళ్లీ నమోదు చేసుకోవాలన్న విధానం కూడా గాలికి ఎగిరిపోయింది. రైతులకు పెట్టుబడి సహాయం లేదు. ఉచిత ఇన్సూరెన్స్ లేదు. ఈ–క్రాప్ లేదు. ఇలాంటి విపత్తు వస్తే కనీసం రైతులను పారదర్శకంగా ఆదుకునే కార్యక్రమం కూడా లేకుండా పోయింది.విద్యా దీవెన పెండింగ్.. డోర్ డెలివరీ బంద్జనవరి, ఫిబ్రవరి, మార్చి త్రైమాసికం.. ఏప్రిల్, మే, జూన్ త్రైమాసికం.. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించిన విద్యా దీవెన సొమ్ము పెండింగ్ పెట్టారు. అదే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి మూడు నెలలకోసారి విద్యా దీవెన సొమ్ము ప్రతి అమ్మ, పిల్లాడు/పాప ఉమ్మడి ఖాతాలో నేరుగా పడిపోయేది. వసతి దీవెన ఎగరగొట్టేశారు. అమ్మ ఒడి అన్నది గాలికి వదిలేశారు. గోరుముద్ద చంద్రబాబు ప్రభుత్వంలో తినలేక ధర్నాలు చేస్తూ ఆస్పత్రులకు చేరుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంగ్లిష్ మీడియం గాలికొదిలేశారు. మూడో తరగతి నుంచి పీరియడ్‌గా పిల్లలకు నిర్వహించిన టోఫెల్ క్లాసులనూ ఎత్తేశారు. మా ప్రభుత్వంలో ప్రతి పథకం డోర్ డెలివరీ జరిగేది. పెన్షన్, రేషన్న్ఇంటికే వచ్చేది. అదే ఈ రోజు పెన్ష¯Œ రావాలంటే జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సి వస్తోంది. రేషన్ ఇంటికి రావడం దేవుడెరుగు.. వస్తే చాలు అన్నట్టు తయారైంది. ఇంటి వద్దే సేవలందించే వలంటీర్ల వ్యవస్థ కుప్పకూలింది. సచివాలయ వ్యవస్థను కూడా నాశనం చేస్తున్నారు.ఇదీ చదవండి: చంద్రబాబుపై క్రిమినల్ నెగ్లిజెన్స్ కేసు పెట్టాలి! -
మెడికల్ కాలేజీలు మాకొద్దు
సాక్షి, అమరావతి: ప్రైవేట్‌పై మోజులో పేద, మధ్య తరగతి విద్యార్థుల వైద్య విద్య కలకు చంద్రబాబు ప్రభుత్వం గండి కొట్టింది. మెడికల్ సీట్లు ఇస్తామంటే ఎగిరి గంతేసి తీసుకోవాల్సింది పోయి.. రాష్ట్ర ప్రభుత్వమే వద్దంటూ రాత పూర్వకంగా లేఖ ఇచ్చింది. దేశంలో ఎక్కడా లేని ఈ దుర్మార్గ పొకడపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. తద్వారా తమ ప్రభుత్వం ఏం చేసినా ప్రైవేట్ వ్యక్తులను అందలం ఎక్కించడం కోసమేనని మరోమారు నిరూపించుకుంది. ఈ ప్రభుత్వం ఏమీ చేయనప్పటికీ గత ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా ఈ విద్యా సంవత్సరం వైఎస్సార్ జిల్లా పులివెందుల వైద్య కళాశాలలో 50 ఎంబీబీఎస్ సీట్లతో అడ్మిషన్లకు నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) అనుమతులు ఇస్తే.. కళాశాల నిర్వహణ తమ వల్ల కాదని చేతులెత్తేసింది. అనుమతులు వెనక్కు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వమే ఒత్తిడి చేసింది. సీట్లు మంజూరు చేసినప్పటికీ విద్యార్థులకు వసతులు కలి్పంచలేమని ఎన్ఎంసీకి లేఖ రాసినట్టు తెలిసింది.రాష్ట్రంలో పేద ప్రజలకు ప్రభుత్వ రంగంలో ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేయడంతో పాటు, మన విద్యార్థుల ఎంబీబీఎస్ కలను సాకారం చేయడం కోసం 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి గత వైఎస్ జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 2023–24 విద్యా సంవత్సరంలో మచిలీపట్నం, విజయనగరం, ఏలూరు, నంద్యాల, రాజమండ్రిల్లో ఒక్కో చోట 150 ఎంబీబీఎస్ సీట్లతో కళాశాలలను ప్రారంభించారు. ఈ విద్యా సంవత్సరం 150 చొప్పున ఎంబీబీఎస్ సీట్లతో పాడేరు, మార్కాపురం, ఆదోని, మదనపల్లె, పులివెందుల కళాశాలలు ప్రారంభించడానికి గత ఏడాది నుంచే చర్యలు ప్రారంభించారు. ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా ఫ్యాకల్టీని సమకూర్చడం, అక్కడి సెకండరీ హెల్త్ ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా అభివృద్ధి చేయడం, వేగంగా వైద్య కళాశాలలను నిరి్మంచడంలో చొరవ చూపింది. దీంతో తొలి ఏడాది ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభించడానికి వీలుగా కళాశాలల్లో 80 శాతం మేర సివిల్ పనులు పూర్తయ్యాయి. పులివెందులకు మాత్రం నో.. ప్రభుత్వ అండర్ టేకింగ్‌తో సంబంధం లేకుండా ఈ నెల 6వ తేదీన పులివెందుల కళాశాలకు 50 సీట్లతో అనుమతులు ఇస్తున్నామని ఎన్ఎంసీ.. రాష్ట్ర వైద్య శాఖకు సమాచారం ఇచ్చింది. అయితే తాము వసతులు కలి్పంచలేమని చెప్పినా ఎలా అనుమతులు ఇస్తారని రాష్ట్ర ప్రభుత్వం వాదించినట్టు సమాచారం. అయినప్పటికీ అనుమతులు మంజూరు చేస్తూ అదే రోజు ఎన్ఎంసీ ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిసింది. దీంతో ఇదే తరహాలో మిగిలిన మూడు కళాశాలలకు అనుమతులు వస్తాయని భావించిన ప్రభుత్వం.. కొత్త వైద్య కళాశాలలకు తాము వసతులు కలి్పంచలేమని ఏకంగా ఎన్ఎంసీకే గోప్యంగా లేఖ రాసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వమే విముఖత వ్యక్తం చేస్తుండటంతో చేసేదేమీ లేక ఆల్ ఇండియా రెండో విడత కౌన్సెలింగ్‌కు పులివెందుల కళాశాల సీట్లను మినహాయించి, పాడేరు కళాశాల సీట్లను మాత్రమే మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ సీట్ మ్యాట్రిక్స్లో ప్రకటించింది. ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కొత్త వైద్య కళాశాలలను గుజరాత్ పీపీపీ మోడల్లో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలో కావాలనే ఈ విద్యా సంవత్సరం ప్రారంభించాల్సిన కళాశాలలను నిర్లక్ష్యం చేసింది. జూన్ నెలలో తొలి విడత కళాశాలల్లో తనిఖీలు నిర్వహించిన ఎన్ఎంసీ స్వల్ప స్థాయిలో వసతుల కొరత ఉందని అనుమతులు నిరాకరించింది. ఈ కొరతను అధిగమిస్తే ఐదు చోట్ల వంద శాతం సీట్లతో ఈ కళాశాలలు ప్రారంభం అయ్యేవి. కాగా, ప్రైవేట్‌పరం చేయాలన్న లక్ష్యంతో మొక్కుబడిగా అప్పీల్‌కు వెళ్లి కళాశాలల్లో వసతుల కల్పన మాత్రం బాబు ప్రభుత్వం చేపట్టలేదు. దీంతో వర్చువల్ ఇన్స్పెక్షన్ అనంతరం తొలి విడత తనిఖీల్లో ఉన్న పరిస్థితులే ఉన్నప్పటికీ పులివెందుల కళాశాలకు 50 ఎంబీబీఎస్ సీట్ల మంజూరుకు ఎన్ఎంసీ అనుమతి ఇస్తామని వెల్లడించింది. ఇందుకోసం ప్రభుత్వం అండర్ టేకింగ్ ఇస్తే చాలని స్పష్టం చేసింది. అనంతరం అదే షరతులతో పాడేరు కళాశాలకు కూడా ఇదే తరహాలో 50 సీట్లతో అడ్మిషన్లతో లెటర్ ఆఫ్ పరి్మషన్ (ఎల్ఓపీ) మంజూరు చేసింది. పాడేరు కళాశాల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉండటంతో అనుమతులు నిరాకరిస్తే ఆ నిధులు ఆగిపోతాయని భావించి అండర్ టేకింగ్‌కు ఒప్పేసుకుంది. -
సుప్రీం డెడ్‌లైన్ బేఖాతరు.. సమ్మె ఆపని బెంగాల్ డాక్ట్టర్లు
కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో ఘటనపై బెంగాల్ వ్యాప్తంగా వైద్యుల సమ్మె కొనసాగుతోంది. వైద్యురాలి మృతికి కారకులపై చర్యలతో పాటు బాధ్యులైన కోల్‌కతా పోలీస్ కమిషనర్, రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి, ఆరోగ్య సేవల డైరెక్టర్, వైద్యవిద్య విభాగం డైరెక్టర్ రాజీనామా కోసం వారు డిమాండ్ చేస్తుండటం తెలిసిందే. వారిపై సుప్రీంకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేయడం, మంగళవారం సాయంత్రంలోగా విధుల్లో చేరాలని ఆదేశించడం తెలిసిందే. దాన్ని వైద్యులు బేఖాతరు చేశారు. తమ డిమాండ్లు నెరవేరేదాకా విధుల్లో చేరేది లేదన్నారు.నేటి విచారణకు హాజరు కండిబుధవారం ఎంక్వైరీ కమిటీ ముందు హాజరై నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని సమ్మెలో పాల్గొంటున్న 51 మంది వైద్యులకు ఆర్జీ కర్ ఆస్పత్రి యాజమాన్యం నోటీసులిచ్చింది. హాజరు కాని వారిని సంస్థ ఆవరణలోకి అనుమతించబోమని, కళాశాల కార్యక్రమాల నుంచి కూడా దూరంగా ఉంచుతామని స్పష్టం చేసింది.చర్చల ఆహా్వనాన్ని తిరస్కరించిన జుడాలు సమ్మె విరణమ కోసం చర్చలకు రావాలని పశి్చమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పంపిన ఆహా్వనాన్ని జూనియర్ డాక్టర్లు మంగళవారం తిరస్కరించారు. ఆహా్వనంలో వాడిన భాష అభ్యంతరకమని పేర్కొన్నారు. ‘‘10 మందికి మించకుండా మీ చిన్న ప్రతినిధి బృందం ప్రభుత్వ ప్రతినిధులను కలవడానికి సచివాలయానికి రావొచ్చు’ అంటూ ఆరోగ్యశాఖ కార్యదర్శి వారికి మెయిల్ పంపారు. ‘‘ఈ భాష డాక్టర్లకు అవమానకరం. పైగా పరుషంగానూ ఉంది. అంతేగాక మేం రాజీనామా కోరుతున్న ఆరోగ్యశాఖ కార్యదర్శి ద్వారా పంపారు. ఇది మాకు అవమానమే. అందుకే దానికి స్పందించలేదు’’ అని జుడాల నేత డాక్టర్ దేబాశిష్ హల్దార్ అన్నారు. చర్చల నిమిత్తం జూడాల ప్రతినిధుల కోసం సీఎం మమత రాత్రి 7.30 దాకా సచివాలయంలో వేచిచూశారని మంత్రి చంద్రిమా భట్టాచార్య తెలిపారు.సందీప్ ఘోష్ కస్టడీ పొడిగింపుఆర్జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ జ్యుడీషియల్ కస్టడీని కోర్టు ఈ నెల 23వరకు పొడిగించింది. ఆయన భద్రతాధికారి అఫ్సర్ అలీ, సన్నిహితులు బిప్లవ్ సిన్హా, సుమన్ హజ్రా కస్టడీని కూడా 23 వరకు పొడిగించింది.వైద్యురాలి మృతి ఉదంతంలో నిర్లక్ష్యంతో పాటు ఆస్పత్రిలో ఆర్థిక అవకతవకల ఆరోపణలతో ఆయన్ను సీబీఐ అరెస్టు చేయడం తెలిసిందే. -
మహిళా జూనియర్ డాక్టర్‌కు వేధింపులు
రాంచీ: కోల్‌కతా మహిళా డాక్టర్ హత్యాచారంపై ఆందోళనలు కొనసాగుతుండగానే అలాంటి తరహా ఘటన మరొకటి జార్ఖండ్‌లో జరిగింది. రాంచీలోని రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్) మెడికల్ కాలేజీ ఆస్పత్రి లిఫ్టులో మహిళా జూనియర్ డాక్టర్ లైంగిక వేధింపులకు గురయ్యారు. వేధింపులకు పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. వేధింపులకు గురైన డాక్టర్ ఆంకాలజీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు.జూనియర్ డాక్టర్‌కు వేధింపుల ఘటనను నిరసిస్తూ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. డాక్టర్లకు భద్రత పెంచుతామని ఆస్పత్రి యాజమాన్యం హామీ ఇవ్వడంతో డాక్టర్లు సమ్మె విరమించారు. ప్రతి లిఫ్టులో లిఫ్ట్ ఆపరేటర్‌ను నియమించడంతో పాటు ఆస్పత్రి క్యాంపస్లోఎ 100 మంది సాయుధులైన భద్రతా సిబ్బందిని మోహరించేందుకు యాజమాన్యం ఒప్పుకుంది. ఇదీ చదవండి.. మమత అబద్దం చెబుతున్నారు: కోల్‌కతా వైద్యురాలి తల్లి -
పులివెందుల, పాడేరు మెడికల్ కాలేజీలకు అనుమతులు
సాక్షి, అమరావతి : వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో కొత్త వైద్య కళాశాలకు అనుమతులు రాకుండా సీఎం చంద్రబాబు ప్రభుత్వం మోకాలడ్డినప్పటికీ అనుమతులు రాక మానలేదు. 2024–25 విద్యా సంవత్సరానికి 50 ఎంబీబీఎస్ సీట్లతో అడ్మిషన్లు చేపట్టడానికి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అనుమతులు మంజూరు చేసింది. దీంతోపాటు పాడేరు వైద్య కళాశాలకు కూడా 50 సీట్లను మంజూరు చేశారు. వాస్తవానికి ఈ రెండు కళాశాలలతో పాటు, ఆదోని, మార్కాపురం, మదనపల్లె వైద్య కళాశాలల్లో ఒక్కోచోట 150 సీట్లతో తరగతులు ప్రారంభించాలని గత ప్రభుత్వంలోనే చర్యలు ప్రారంభించారు.అయితే, కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేసే ఉద్దేశ్యంతో చంద్రబాబు ప్రభుత్వం కావాలని అనుమతులు రాబట్టేలా చర్యలు తీసుకోలేదు. దీంతో తొలివిడత తనిఖీల అనంతరం ఐదుచోట్ల కొంతమేర వసతుల కొరత ఉన్నాయని ఎన్ఎంసీ అనుమతులు నిరాకరించింది. తొలివిడత తనిఖీల్లో తీసుకున్న నిర్ణయంపై అప్పీల్‌కు వెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం చివరి నిమిషంలో అధికారులకు అనుమతులిచ్చిప్పటికీ వసతుల కల్పన మాత్రం చేపట్టలేదు.దీంతో గత ప్రభుత్వంలో కల్పించిన వసతుల ఆ«ధారంగా వర్చువల్ ఇన్స్పెక్షన్ అనంతరం ప్రభుత్వం అండర్ టేకింగ్ ఇస్తే పులివెందులకు 50 సీట్లు మంజూరు చేస్తామని ఎన్ఎంసీ ప్రకటించింది. అయినప్పటికీ ప్రభుత్వం అండర్‌టేకింగ్ ఇవ్వలేదు. అండర్‌టేకింగ్ ఇవ్వకపోయినప్పటికీ ఎన్ఎంసీ అనుమతులు మంజూరుచేయడంతో వైద్యశాఖ అధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. -
సుప్రీంకోర్టులో సందీప్ ఘోష్‌కు ఎదురుదెబ్బ.. పిటిషన్ కొట్టివేత
కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గత నెలలో ఆసుపత్రిలో వైద్యురాలిపై హత్యాచారం జరిగిన సమయంలో.. నిందితుడు సంజయ్ రాయ్‌తోపాటు ఇనిస్టిట్యూట్ ప్రిన్సిపాల్‌గా ఉన్న సందీప్ ఘోష్‌పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే.అయితే వైద్యురాలి కేసు విచారణను సీబీఐకి బదిలీ చేసిన కోల్కత్తా హైకోర్టు.. ఘోష్‌పై అవినీతి ఆరోపణల కేసు దర్యాప్తును సైతం సీబీఐకే అప్పజెప్పింది. ఈ క్రమంలో హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సందీప్ ఘోష్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. నేడు(శుక్రవారం) ఆయన అభ్యర్ధనను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్థివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య దర్శాసనం.. తన పదవీకాలంలో ఆర్జీకర్ ఇన్స్టిట్యూట్లో ఆర్థిక అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లో భాగస్వామిగా చేర్చుకోవాలన్న సందీప్ ఘోష్ విజ్ఞప్తిని తిరస్కరించింది.‘ఒక కేసులో నిందితుడిగా ఉన్న మీరు.. కలకత్తా హైకోర్టు విచారిస్తున్న పిటిషన్లో జోక్యం చేసుకునే హక్కు లేదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాగా ఆగస్టు 9న ట్రైనీ డాక్టర్‌పై జరిగిన హత్యాచారంతో.. అవినీతి ఆరోపణలను అనుసంధానిస్తూ హైకోర్టు చేసిన కొన్ని వ్యాఖ్యలను తొలగించేందుకు కూడా అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.ఇదిలా ఉండగా.. 2021 నుంచి సందీప్ ఘోష్ ఆర్జీ ఆసుపత్రి ప్రిన్సిపాల్‌గా ఉన్నారు. ఆయన హయాంలో ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఆర్థిక అవకతవకలపై దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం నుంచి సీబీఐకి బదిలీ చేయాలని కలకత్తా హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే..ఇక వైద్యురాలి కేసులో సందీప్ ఘోష్‌ను రెండు వారాలుగా విచారించిన అనంతరం సోమవారం సీబీఐ అతన్ని అరెస్టు చేసింది. వైద్య కళాశాలలో ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసులో కోర్టు ఎనిమిది రోజుల కస్టడీకి అప్పగించింది. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఘోష్ నివాసంపై శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులు చేసింది. ఘోష్, అతడి సహచరులకు సంబంధించిన వివిధ ప్రదేశాలలో దర్యాప్తు సంస్థ అధికారులు దాడులు చేశారు. ఆస్పత్రి డేటా ఎంట్రీ ఆపరేటర్ ప్రసూన్ ఛటర్జీ ఇంట్లో కూడా సోదాలు చేసినట్లుగా అధికారులు పేర్కొన్నారు. -
పాడేరు మెడికల్ కాలేజీకి 50 ఎంబీబీఎస్ సీట్లు
సాక్షి, అమరావతి: 2024–25 విద్యా సంవత్సరానికి పాడేరు వైద్య కళాశాలలో 50 ఎంబీబీఎస్ సీట్లలో ప్రవేశాలకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కళాశాలకు మంగళవారం లెటర్ ఆఫ్ పర్మిషన్ (ఎల్ఓపీ) ఇస్తూ ఎన్ఎంసీ నుంచి సమాచారం అందింది. వాస్తవానికి ఈ విద్యా సంవత్సరంలో పాడేరుతో పాటు మదనపల్లె, మార్కాపురం, పులివెందుల ఆదోని కాలేజీల్లో ఒక్కో దానిలో 150 ఎంబీబీఎస్ సీట్లతో ప్రవేశాలు చేపట్టడానికి వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే చర్యలు ప్రారంభించారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడేవరకు ఆ కళాశాలల బోధనాస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది నియామకం, వనరుల కల్పనకు చర్యలు తీసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వం కొత్త వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో ఐదు కళాశాలలకు ఎన్ఎంసీ నుంచి అనుమతులు తెచ్చేందుకు ఏమాత్రం ప్రయత్నించలేదు. ఈ ఏడాది జూన్ నెల 24న కళాశాలలను ఎన్ఎంసీ బృందాలు తనిఖీ చేశాయి. కొంత మేర వనరుల కొరత ఉన్నందున తొలి విడతలో అనుమతులు నిరాకరించారు. కొరతను అధిగమిస్తే రెండో విడత తనిఖీలు చేసి అనుమతించే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకుండానే చివరి నిమిషంలో అప్పీల్‌కు వెళ్లారు. ఈ నేపథ్యంలో పులివెందుల, పాడేరు వైద్య కళాశాలల్లో ఎన్ఎంసీ వర్చువల్ ఇన్స్పెక్షన్ చేపట్టి, తొలి విడత తనిఖీల్లో ఉన్న పరిస్థితులే ఉన్నట్టు గుర్తించింది. ఉన్న వసతులతో ప్రభుత్వం అండర్‌టేకింగ్ ఇస్తే 50 సీట్లకు పులివెందుల కళాశాలకు అనుమతిస్తామని తెలిపింది. అయినా ప్రభుత్వం అండర్‌టేకింగ్ ఇవ్వలేదు. పాడేరు కళాశాల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం కూడా ఉండటంతో ఎన్ఎంసీ ఇక్కడ అండర్‌టేకింగ్ లేకుండానే ఎల్ఓపీ మంజూరు చేసినట్టు తెలిసింది. అయినా, 150 సీట్లు రావాల్సిన చోట అందులో మూడో వంతు సీట్లే మంజూరు అయ్యాయి. మిగిలిన నాలుగు వైద్య కళాశాలలకు అనుమతులపై ఇంకా సస్పెన్షన్ కొనసాగుతోంది. 2019–24 మధ్య రాష్ట్రంలో 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన వైఎస్ జగన్ ప్రభుత్వం 2023–24లో ఐదు కళాశాలలను ప్రారంభించి 750 ఎంబీబీఎస్ సీట్లను సమకూర్చింది. ఈ ఏడాది మరో ఐదు కళాశాలలకు అనుమతులు వచ్చి 750 సీట్లు సమకూరితే తమకు వైద్య విద్య అవకాశం లభిస్తుందని ఎందరో విద్యార్థులు, తల్లిదండ్రులు కోటి ఆశలు పెట్టుకున్నారు. అయినా కేంద్రంలో భాగస్వామిగా ఉండి కూడా ఈ విద్యా సంవత్సరం ఐదు కళాశాలల్లో వంద శాతం సీట్లను చంద్రబాబు ప్రభుత్వం రాబట్టలేక విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
పని ప్రదేశమే ప్రాణాంతకమైతే?
ఒకే వారంలో మహిళలపై అత్యాచారం, దాడి, హింసకు సంబంధించిన అనేక కథనాలతో దేశం అట్టుడికిపోయింది. ప్రతి కథనం మునుపటి కథనం కంటే మరింతగా కలవరపెడుతోంది. మహిళలపై హింస నేడు చీకటి సందుల్లోనే కాకుండా పని స్థలాలు, బహిరంగ ప్రదేశాలు, ఆన్లైన్ లో కూడా జరుగుతోంది. ఈ హింసాత్మక చర్యలు ఆకస్మికంగా సంభవిస్తున్నవి కావు. జీవితంలోని ప్రతి అంశంలోనూ స్త్రీలు ఎదుర్కొంటున్న తీవ్రమైన అసమానతలను ఇవి ప్రతిబింబిస్తున్నాయి. ఈ పరిస్థితులు కాగితంపై ఉన్న చట్టాలకూ, ఆచరణలో వాటి అమలుకూ మధ్య కలవరపెడుతున్న అనుసంధాన లేమిని వెల్లడిస్తున్నాయి. ఈ గాథలు చీకట్లోనే మగ్గిపోవడానికి ఎంతమాత్రమూ వీలు లేదు. మార్పు ఇప్పటికే మొదలు కావాల్సింది!ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్లో ఇటీవలి కేసు... మహిళల భద్రత విషయంలో ఉన్న సమస్యల తీవ్రతనూ, అత్యంత సురక్షితంగా భావించే పరిస రాలలో కూడా వారు ఎదుర్కొంటున్న సర్వవ్యాప్త హింసనూ గుర్తు చేస్తోంది.శిక్షణలో ఉన్న ఒక యువ వైద్యురాలు అనేక గంటలపాటు విధి నిర్వహణను పూర్తి చేసి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో, తగిన భద్రత ఉంటుందని భావించిన ఆసుపత్రి ఆవరణలోనే ఆమెపై లైంగికదాడి జరిపి హత్య చేశారు. ఈ భయానక నేరం ఒక విడి సంఘటన కాదు. మన సమాజంలోని ప్రతి అంశంలోనూ విస్తరిస్తున్న, మహిళ లపై హింసకు సంబంధించిన విస్తృతమైన అంటువ్యాధిలో ఇదొక భాగం. ఒకే వారంలో మహిళలపై అత్యాచారం, దాడి, హింసకు సంబంధించిన వార్తలతో దేశం అట్టుడికిపోయింది. ప్రతి కథనం అంతకుమునుపటి కథనం కంటే మరింతగా కలవరపెడుతోంది. ఇవి వార్తలలోని కేవలం పాదసూచికలు కాదు. సగం జనాభా భద్రత విషయంలో విఫలమైన సమాజంపై ఇవి స్పష్టమైన నేరారోపణలు. మహిళలపై హింస నేడు చీకటి సందుల్లోనే కాకుండా పని స్థలాలు, బహిరంగ ప్రదేశాలు, ఆన్లైన్లో కూడా జరుగుతోంది.మహిళలపై నేరాలు దారుణంగా పెరుగుతున్నాయని ‘నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’(ఎన్సీఆర్బీ) వార్షిక నివేదిక వెల్లడించింది. ఒక్క 2022లోనే 4,45,256 కేసులు నమోదయ్యాయి. ఇది ప్రతి గంటకు దాదాపు 51 ఎఫ్ఐఆర్లకు సమానం. 2020, 2021 సంవత్సరాల నుంచి భయంకరమైన పెరుగుదలను ఈ డేటా వెల్లడిస్తోంది. ప్రతి లక్ష జనాభాకు మహిళలపై నేరాల రేటు 66.4గా ఉంది. అయితే ‘క్రైమ్ ఇన్ ఇండియా 2022’ నివేదిక ప్రకారం, అలాంటి కేసులలో ఛార్జ్‌షీట్ రేటు 75.8గా నమోదైంది. నమోదైన మొత్తం కేసులలో, 18.7 శాతం వరకు మహిళలపై దౌర్జన్యానికి పాల్పడే ఉద్దేశ్యంతో దాడికి పాల్పడినవే. కాగా 7.1 శాతం అత్యాచారం కేసులుగా నమోదయ్యాయి. ఈ భయంకరమైన గణాంకాలు వాస్తవ ఘటనల్లో అతి చిన్న భాగాన్ని మాత్రమే సూచిస్తున్నాయి. భయం, అవమానం లేదా సామాజిక ఒత్తిడి కారణంగా అసంఖ్యాకమైన కేసులు వెలుగులోకే రావు.మరింత ఇబ్బందికరమైన విషయం ఏమిటంటే, ఈ హింసాత్మక చర్యలు ఆకస్మికంగా సంభవిస్తున్నవి కావు. జీవితంలోని ప్రతి అంశంలోనూ స్త్రీలు ఎదుర్కొంటున్న తీవ్రమైన అసమానతలను ఇవి ప్రతిబింబిస్తాయి. స్త్రీలు సరుకులుగా కుదించబడినప్పుడు, హింస అనేది రోజు వారీ సంఘటనగా మారుతుంది. ఈ హింస భౌతిక దాడికి మాత్రమే పరిమితమైనది కాదు; ఇది ఆర్థికపరమైన, భావోద్వేగపరమైన వేధింపు వరకు విస్తరించింది. ముఖ్యంగా పని స్థలాల్లో అధికార చలన సూత్రాలు తరచూ మహిళలకు వ్యతిరేకంగా ఉంటాయి.సాధారణంగా లైంగిక వేధింపుల నిరోధక చట్టంగా పిలుస్తున్న, ‘‘పనిస్థలంలో మహిళలపై లైంగిక వేధింపుల (నివారణ, నిషేధం, పరిహారం) చట్టం, 2013’ వంటి చట్టాలను మహిళల రక్షణ కోసం రూపొందించారు. కానీ వాస్తవికత దానికి భిన్నమైన చిత్రాన్ని చూపు తోంది. లైంగిక వేధింపుల ఫిర్యాదులను పరిష్కరించడానికి ప్రతి కార్యాలయంలో అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాలని చట్టం ఆదేశించినప్పటికీ, ఈ కమిటీల నిర్మాణం సహజంగానే లోప భూయిష్టంగా ఉంది.అదే సంస్థకు చెందిన సీనియర్ ఉద్యోగులతోపాటు ఒక ఎన్జీవో లేదా అలాంటి సంస్థకు చెందిన బయటి సభ్యులతో కూడిన ఈ కమిటీలు, బాధితురాలికి న్యాయం చేయడం కంటే కూడా కంపెనీ ప్రయోజనాలను పరిరక్షించడానికే తరచుగా ప్రాధాన్యత ఇస్తాయి. అధికారిక చలనసూత్రాలు (కమిటీ సభ్యులు కంపెనీలో స్వార్థ ప్రయో జనాలను కలిగి ఉండవచ్చు) నిజమైన విచారణను, జవాబుదారీ తనాన్ని నిరుత్సాహపరిచే వాతావరణాన్ని సృష్టిస్తాయి.అయితే ఈ సవాళ్లు నేడు పని స్థలాలను దాటి విస్తరించాయి. ప్రారంభంలో అవకాశాలు, అనుసంధానం కోసం ఉద్దేశించిన ఇంట ర్నెట్, ఇప్పుడు మహిళలకు సంబంధించిన కొత్త యుద్ధభూమిగా మారింది. ‘నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2021లో సైబర్ క్రైమ్ సంఘటనల సంఖ్య 2019తో పోలిస్తే 18.4 శాతం పెరిగింది. మహిళలను లక్ష్యంగా చేసుకున్న సంఘటనలు గణనీయంగా 28 శాతానికి పెరిగాయి. 2021లో నమోదైన 52,974 సైబర్ నేరాల్లో 10,730 అంటే 20.2 శాతం మహిళలపై నేరాల కేసులు. వ్యక్తిగత సమాచారం బయటపెట్టడం వంటి వాటి నుండి ప్రతీకారం తీర్చుకునే పోర్న్, ఆన్ లైన్ వేధింపుల వరకు, పాత రకాల హింసలను కొనసాగించడానికి డిజిటల్ రంగం కొత్త మార్గాలను అందిస్తోంది.ఇంటర్నెట్లో అజ్ఞాతంగా ఉండటం అనేది నేరస్థులకు ధైర్యాన్నిస్తుంది. కాగా, కఠినమైన సైబర్ చట్టాలు లేకపోవడం, చట్టపరమైన సహాయం నెమ్మదిగా ఉండటం బాధితులకు హాని చేస్తున్నాయి.మనం ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్తాము? ప్రస్తుత పరిస్థితులు కాగితంపై ఉన్న చట్టాలకూ, ఆచరణలో వాటి అమలుకూ మధ్య కల వరపెడుతున్న అనుసంధాన లేమిని వెల్లడిస్తున్నాయి. లైంగికదాడి కేసులలో 95 శాతం అపరిష్కృతంగా ఉంటున్నాయని ‘ఎన్ సీఆర్బీ’ 2021 నివేదిక నొక్కి చెబుతోంది. ఈ గణాంకాలు స్త్రీల దుఃస్థితి పట్ల వ్యవస్థ అలసత్వంతో పాటు, తరచుగా ఉదాసీనతను కూడా సూచిస్తు న్నాయి. న్యాయ విచారణలో జాప్యం, సానుభూతి లేని పరిపాలనా వ్యవస్థ అనేవి బాధితులు ముందుకు రాకుండా వారిని మరింత నిరుత్సాహపరుస్తాయి.లైంగిక వేధింపుల నిరోధక చట్టం, దానిని పోలి ఉండే ఇతర చట్టాలు అవసరమైనప్పటికీ, అవి సరిపోవు. హాని సంభవించిన తర్వాత మాత్రమే సమస్యను పరిష్కరిస్తాయి. పైగా పనికి సంబంధించిన దైహిక, లింగ స్వభావాన్ని సవాలు చేయడంలో విఫలమవు తాయి. ఇది మహిళలకు మొదటి దశలోనే హాని చేస్తుంది. కాబట్టి నిష్పాక్షికత, న్యాయబద్ధతను నిర్ధారించడానికి అంతర్గత ఫిర్యాదుల కమిటీ కూర్పు విషయంలో పునః మూల్యాంకనంతో ప్రారంభించి, తక్షణ సంస్కరణలు అవసరం. సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించి, అది కొనసాగేలా చూడడం యజమానుల బాధ్యత. అలా చేయడంలో విఫలమైతే వారిపై కఠినమైన జరిమానాలు విధించాలి.ఇది చట్టపరమైన వైఫల్యం మాత్రమే కాదు, సామాజిక వైఫల్యం కూడా! సమానత్వం కోసం మాత్రమే కాకుండా ప్రాథమిక గౌరవం కోసం పోరాడుతుండే మహిళలు తరచుగా బాధామయ జీవితాల్లో నిశ్శబ్ద శృంఖలాల పాలవుతుంటారు. ప్రతీకారం, ఉద్యోగ నష్టం, వ్యక్తిత్వ హననాల భయం చాలామందిని నోరు విప్పకుండా చేస్తుంది. ఇది శిక్ష పడుతుందనే భయం లేని సంస్కృతి వృద్ధి చెందడానికి వీలు కలిగిస్తుంది. అధికార శక్తులు దోపిడీకి పాల్పడుతూనే ఉండటం, బాధితులు తరచుగా ఎటువంటి సహాయం లేకుండా మిగిలిపోవడం అనేది ఒక విష వలయం.చట్టపరమైన రక్షణలు, పెరుగుతున్న అవగాహన పురోగతిని సూచిస్తున్నప్పటికీ, సంఖ్యలు మాత్రం మరో కథను చెబుతున్నాయి. అది ఆచరణలో కంటే సిద్ధాంతంలోనే ఎక్కువగా ఉనికిలో ఉంటున్న చట్టాలతోపాటు, ప్రతి మలుపులోనూ మహిళల విలువను తగ్గించే సామాజిక వ్యవస్థ వైఫల్య గాథ. ఈ గాథలు చీకట్లోనే మగ్గిపోవడానికి వీలు లేదు. అవి మన శ్రద్ధను, మన ఆగ్రహాన్ని, మరీ ముఖ్యంగా మన చర్యను డిమాండ్ చేస్తున్నాయి. మార్పు ఎప్పుడో మొదలు కావాల్సింది!వి. విజయ సాయి రెడ్డి వ్యాసకర్త రాజ్యసభ సభ్యులు;వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి -
మన డాక్టరమ్మకు భద్రత కావాలి
సాక్షి, అమరావతి: వైద్య విద్యార్థినిపై కోల్‌కతా ఆర్జీ కార్ ఆస్పత్రిలో హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసింది. ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది భద్రతలో లొసుగులను తేటతెల్లం చేసింది. ప్రస్తుతమున్న చట్టాలు వైద్యులు, వైద్య సిబ్బందికి భద్రతా వాతావరణాన్ని కల్పించడం లేదని ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మన డాక్టరమ్మల భద్రత ఏ విధంగా ఉంది? సురక్షిత వాతావరణంలో మహిళా వైద్యులు, సిబ్బంది సేవలు అందించాలంటే ఏ చర్యలు తీసుకోవాలి? అనే అంశాలపై ‘సాక్షి’ పలువురు వైద్య నిపుణులతో చర్చించింది. వైద్య శాఖలో 30 ఏళ్లకుపైగా సేవలు అందించిన సీనియర్ వైద్యులు, మాజీ ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లను కలిసి వారి అభిప్రాయాలను సేకరించింది.గళం విప్పే వ్యవస్థ రావాలిఅన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, కళాశాలల్లో ఉద్యోగులు, విద్యార్థుల సమస్యలపై ఫిర్యాదులు చేయడానికి, పరిష్కరించడానికి అంతర్గత కమిటీలు ఉంటాయి. అయితే వీటిల్లో ఆయా కళాశాల, ఆస్పత్రిలో పని చేసే ఫ్యాకల్టీ, వైద్యులు, ఇతర అధికారులే సభ్యులుగా ఉంటారు. దీంతో ఏదైనా సమస్య తలెత్తితే విద్యార్థినులు ఫిర్యాదు చేయడానికి సంకోచించే పరిస్థితులు న్నాయి. తమ వివరాలు బహిర్గతమై కొత్త చిక్కులు తలెత్తుతాయని ఆందోళన చెందుతున్నారు. కమిటీల్లో పోలీస్, న్యాయ, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులకు స్థానం కల్పిస్తే నిష్పాక్షిక విచారణకు వీలుంటుంది. బాధితులు నిర్భయంగా గళం విప్పడానికి ఆస్కారం లభిస్తుంది. ముఖ్యంగా లైంగిక వేధింపులు, ర్యాగింగ్ ఘటనల్లో బాధితులు వెనుకడుగు వేయడానికి ప్రధాన కారణం ఆయా కమిటీల్లో సభ్యులంతా అక్కడి వారు కావడమేనని పేర్కొంటున్నారు. హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులు 36 గంటలు, రెండు, మూడు రోజులు నిరంతరాయంగా విధులు నిర్వహిస్తున్న దుస్థితి నెలకొంది. గతంతో పోలిస్తే ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, పీజీ సీట్లు పెరిగాయి. అందువల్ల విద్యార్థుల పని వేళలపై వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించాలి. ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం 24 గంటల పాటు విధులు నిర్వహించిన విద్యార్థికి డే ఆఫ్ తప్పకుండా ఇవ్వాలి.సహాయకుల రాకపోకలపై షరతులుప్రైవేట్ ఆస్పత్రుల్లో రోగికి సహాయకుడిగా ఒకరినే అనుమతిస్తారు. కొన్ని సందర్భాల్లో అసలు సహాయకుడినే అనుమతించరు. పరామర్శలకు వచ్చే వారిని పరిమిత వేళల్లోనే అనుమతిస్తారు. ప్రతి వ్యక్తిని స్క్రీనింగ్ చేస్తారు. మద్యం, ఇతర మత్తు పదార్థాలు సేవించిన వ్యక్తులను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించరు. ఇలాంటి నిబంధనలే ప్రభుత్వాస్పత్రుల్లోనూ విధించాలని సూచిస్తున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో రోగుల సహాయకులు, బంధువులు, స్నేహితుల రాకపోకలపై నియంత్రణ లేకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. చికిత్స అందించడంలో ప్రొటోకాల్ కారణంగా ఆలస్యం / దురదృష్టవశాత్తూ రోగి మృతి చెందిన సందర్భాల్లో వైద్య సిబ్బందిపై ఒక్కోసారి దాడులు జరుగుతున్నాయి. గత రెండు నెలల్లో కర్నూలు, విజయవాడ జీజీహెచ్‌లలో ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. ఇలాంటివి పునరావృతం కాకుండా సహాయకులను నియంత్రించాలి. ఎమర్జెన్సీ, ఇతర వార్డుల్లోకి ప్రవేశించేప్పుడే సహాయకులను స్క్రీనింగ్ చేయాలి. ఎమర్జెన్సీ వార్డుల్లో అదనపు భద్రత సిబ్బందిని నియమించాలి.భద్రతపై వైద్య వర్గాల ప్రధాన డిమాండ్లు⇒ రక్షణ చర్యలపై కనీస అవగాహన లేని వారు, వయసు మళ్లిన వారు ఆస్పత్రులు, కళాశాలల వద్ద సెక్యూరిటీ గార్డులుగా విధులు నిర్వహిస్తున్నారు. సుశిక్షితులైన భద్రతా సిబ్బందిని నియమించాలి. ⇒ సాంకేతిక పరిజ్ఞానం వినియోగం పెరగాలి. ఆస్పత్రులు, కళాశాలల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణను బలోపేతం చేయాలి. హై రిజల్యూషన్ కెమెరాలను అమర్చి 24/7 పర్యవేక్షించేందుకు కమాండ్ కంట్రోల్ వ్యవస్థ ఉండాలి. ఏ చిన్న అవాంఛనీయ ఘటన చోటు చేసుకున్నా వెంటనే అప్రమత్తం కావాలి.⇒ విధుల్లో ఉండే వైద్య సిబ్బందికి సరిపడా వాష్, రెస్ట్, డ్యూటీ రూమ్స్ ఉండాలి. మహిళా వైద్యులు, విద్యార్థినుల కోసం కేటాయించిన గదుల వద్ద పటిష్ట భద్రత కల్పించాలి. ⇒ ప్రస్తుతం రాష్ట్రంలోని బోధనాస్పత్రులు చాలా వరకూ కొన్ని దశాబ్ధాల క్రితం నిర్వహించినవే. గత ప్రభుత్వంలో నాడు–నేడు కింద పీహెచ్‌సీలు, సెకండరీ కేర్ పరిధిలో చాలా వరకూ కొత్తగా ఆస్పత్రుల్లో వైద్యుల అవసరాలకు అనుగుణంగా వసతులు కల్పించారు. కొత్తగా నిర్మించే వైద్య కళాశాలల్లో అదే తరహాలో వసతులు ఉంటున్నాయి. ఇక పాత బోధనాస్పత్రులతో పాటు, మరికొన్ని పాత ఆస్పత్రుల్లో పెరిగిన వైద్యులు, విద్యార్థుల సంఖ్యకు వసతులు లేవు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం వసతులు కల్పించాలి. ⇒ సాధారణంగా ఊరికి దూరంగా ఉండే ప్రభుత్వ ఆస్పత్రులు, కళాశాలల వద్ద పోలీసు నిఘా నిరంతరం ఉండాలి. పరిసరాల్లో ముళ్లు, చెట్ల పొదలు స్థానిక సంస్థలు చర్యలు చేపట్టాలి.⇒ వైద్య సిబ్బంది సంచరించే ప్రాంతాల్లో రాత్రి వేళ లైట్లు ఉండాలి. సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాళ్లు దీన్ని పర్యవేక్షించాలి. వైద్య సిబ్బందితో నిర్వహించే సమావేశాల్లో రోగులకు సేవల కల్పనతోపాటు భద్రతాపరమైన అంశాలపైనా చర్చించాలి. ఇబ్బందులను తెలుసుకుని పరిష్కరించాలి.కమిటీల్లో పోలీసులు, లాయర్లు ఉండాలివైద్య విద్యార్థుల్లో 70 శాతం వరకు యువతులే ఉన్నందున వారి భద్రత పట్ల ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అన్ని కళాశాలల్లో సమస్యలను నివేదించేందుకు కమిటీలున్నా చురుగ్గా పనిచేసేలా చూడాలి. కేవలం టీచింగ్ ఫ్యాకల్టీ మాత్రమే కాకుండా పోలీస్ శాఖ నుంచి సీఐ స్థాయి అధికారి, న్యాయ శాఖ నుంచి ఒకరితోపాటు వివిధ ప్రభుత్వ శాఖల నుంచి కమిటీలో సభ్యులుగా ఉండాలి. సభ్యుల పేర్లు, ఫోన్ నెంబర్లను కళాశాలలో ప్రదర్శించాలి. – డాక్టర్ విఠల్‌రావు, సిద్ధార్థ వైద్య కళాశాల పూర్వ ప్రిన్సిపల్ సీసీ కెమెరాలు పెంచాలివిశాలమైన ప్రభుత్వ ఆసుపత్రులు, కళాశాలల ప్రాంగణాల్లో భద్రత కల్పించడం సవాళ్లతో కూడుకున్నదే. తరగతి గదులు, ల్యాబ్‌లు, కారిడార్లు, విద్యార్థులు, వైద్యులు సంచరించే అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాల సర్వే లెన్స్ ఉండేలా చూడాలి. వీటి పర్యవేక్షణకు కమాండ్ కంట్రోల్ రూమ్‌లో 24/7 సిబ్బంది ఉండాలి. ఆస్పత్రులు, కళాశాలల పరిసర ప్రాంతాల్లో పోలీసు నిఘా ఏర్పాటు చేయాలి. దీనివల్ల భద్రతతోపాటు ఆస్పత్రుల్లో శిశువుల అపహరణలు అరికట్టవచ్చు. మహిళా వైద్య సిబ్బంది శారీరక, మానసిక దృఢత్వంపై దృష్టి సారించాలి. – డాక్టర్ వెంగమ్మ, రిటైర్డ్ డైరెక్టర్, వీసీ, స్విమ్స్ యూనివర్సిటీ, తిరుపతివసతులు మెరుగుపడాలిఆస్పత్రులు, కళాశాలల్లో వసతులను అభివృద్ధి చేయాలి. కోల్‌కతాలో హత్యాచారానికి గురైన విద్యార్థిని 36 గంటలు విధులు నిర్వర్తించింది. మన దగ్గర కూడా ఈ పరిస్థితులు న్నాయి. వైద్య విద్యార్థుల పని వేళల మీద దృష్టి పెట్టాలి. తగినన్ని వాష్ రూమ్స్, రెస్ట్ రూమ్స్, డ్యూటీ రూమ్స్ ఏర్పాటు చేసి పరిశుభ్రంగా నిర్వహించాలి. ముఖ్యంగా మహిళా వైద్య సిబ్బందికి ఆస్పత్రుల్లో సురక్షిత వాతావరణం కల్పించాలి. ఫ్యాకల్టీ సైతం విద్యార్థులను తమ పిల్లల్లాగా భావించాలి. – డాక్టర్ శశిప్రభ, మాజీ డీఎంఈ, ఉమ్మడి ఏపీ వ్యవస్థ మారాలి..దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తిరుపతి స్విమ్స్ ఆస్పత్రి వద్ద జూనియర్ వైద్యులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. తెల్లటి వస్త్రంపై ఎర్రటి సిరాతో చేతి ముద్రలు వేస్తూ.. మహిళలపై దాడులను అరికట్టాలంటూ నినదించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, తిరుపతి రాత్రి భద్రత పెంచాలిబోధనాస్పత్రుల్లో టీబీ, ఇన్ఫెక్షన్ వైద్య సేవలు, బ్లడ్ బ్యాంక్‌లు, ల్యాబ్‌లు, కొన్ని రకాల విభాగాలు ఐపీ, ఓపీ భవనాలకు దూరంగా ఉన్నందున జన సంచారం తక్కువగా ఉంటుంది. అలాంటి విభాగాల్లోనూ మహిళా వైద్యులు, సిబ్బంది నైట్ డ్యూటీలు చేస్తుంటారు. అక్కడ సెక్యూరిటీ పెంచాలి. అనుమా నాస్పద వ్యక్తులు చొరబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. డబ్బులు కట్టి చికిత్స పొందే ప్రైవేట్ ఆస్పత్రుల్లో సైతం క్షుణ్నంగా పరిశీలించాకే పరిమిత వేళల్లో రోగుల సహాయకులను అనుమతిస్తారు. ప్రభుత్వాస్పత్రుల్లోనూ అలాగే వ్యవహ రించాలి. సహాయకులను గుంపులుగా అనుమతించకూడదు. – డాక్టర్ చాగంటి పద్మావతి, పూర్వ ప్రిన్సిపల్, గుంటూరు వైద్య కళాశాల -
సుప్రీమ్ ‘అభయ’మ్!
హేయమైన కోల్‌కతా హత్యాచార ఘటనపై సర్వోన్నత న్యాయస్థానం స్వచ్ఛందంగా జోక్యం చేసుకోవడం వ్యవస్థలపై సడలుతున్న నమ్మకాన్ని కాస్త నిలబెట్టింది. విధినిర్వహణలోని వైద్యశిక్షణార్థి జీవితాన్ని చిదిమేసిన ఆగస్ట్ 9 నాటి ఉదంతంతో వైద్యసేవకుల భద్రత, ఇతర అంశాలకు సంబంధించి సిఫార్సులు చేసేందుకు నేషనల్ టాస్క్‌ఫోర్స్ (ఎన్టీఎఫ్)ను సుప్రీమ్ కోర్టు మంగళవారం ఏర్పాటు చేసింది. సంతృప్తి చెందక జాతీయస్థాయిలో జూనియర్ డాక్టర్లు నిరసనలు కొనసాగిస్తున్నా అసలంటూ రోగాన్ని గుర్తించి, మందు కనుగొనే ప్రయత్నమైనా జరుగుతున్నందుకు సంతోషించాలి. ప్రముఖ డాక్టర్ల సారథ్యంలోని ఈ టాస్క్‌ఫోర్స్ మహిళలు సురక్షితంగా పని చేసేందుకు చేపట్టాల్సిన సమూల సంస్కరణలపై సిఫార్సులు చేయనుంది. కోర్ట్ ఆదేశించినట్టు మూడు వారాల్లో మధ్యంతర నివేదిక, రెండు నెలల్లో తుది నివేదిక సమర్పించాల్సి ఉంది. దేశంలో నూటికి 80 ప్రజారోగ్య వసతుల్లో నిర్ణీత ప్రమాణాలైనా లేవని జాతీయ హెల్త్ మిషనే చెబుతోంది. ఈ పరిస్థితుల్లో పనిప్రదేశంలో సురక్షిత వాతావరణ కల్పనకు ఒక విధాన ఏర్పాటుకు జాతీయ వైద్యసంఘం గత వారమే వైద్యకళాశాలలకూ, ఆస్పత్రులకూ నోటీసిచ్చింది. వైద్యులకు విశ్రాంతి గదులు, నిఘాకు సీసీ టీవీలు కరవైన మన ఆరోగ్య వ్యవస్థకు ఇప్పుడు టాస్క్‌ఫోర్స్ సిఫా ర్సుల చికిత్స చేయాల్సి ఉంది. ఇదిలా ఉండగానే ఆడవాళ్ళు నైట్‌డ్యూటీలలో లేకుండా చూడాలని బెంగాల్ సర్కార్, ఒకవేళ డ్యూటీలో ఆడవాళ్ళుంటే వారికి తోడుండేలా చూడాలని కేంద్ర సర్కార్ సూచనలివ్వడం విడ్డూరం. శ్రామిక శక్తిలో మహిళా భాగస్వామ్యం తక్కువున్న దేశంలో దాన్ని మరింత తగ్గించే ఇలాంటి ఆదేశాలు తిరోగమన «ఆలోచనా ధోరణికి అద్దం పడుతున్నాయి.కోల్‌కతా ‘అభయ’ ఘటన, చర్యల్లో ప్రభుత్వ యంత్రాంగం చేతగానితనంపై దేశమంతటా ప్రజాగ్రహం పెల్లుబుకుతుంటే... పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ యంత్రాంగం దృష్టి అంతా విమర్శకుల నోళ్ళు మూయించడంపై ఉండడం విషాదం. నిరసనకారులపై ‘రాజ్యాధికారం’ ప్రయోగించే కన్నా దేశవ్యాప్తంగా లోలోపలి భావోద్వేగాలు బయటపడుతున్న వేళ వారితో మరింత సున్నితంగా వ్యవహరించాలని సాక్షాత్తూ సుప్రీమ్ కోర్ట్ హితవు చెప్పాల్సి వచ్చింది. అదే సమయంలో – ఘటన జరిగిన ఆర్జీ కార్ ఆస్పత్రికి అప్పట్లో ప్రిన్సిపాల్‌గా వ్యవహరించిన వ్యక్తిపై తీవ్రమైన ఆరోపణలున్నా ప్రభుత్వ పెద్దలు ఆయనను కాపాడాలని చూడడం నీచం. సదరు వ్యక్తి మానవ అక్రమ రవాణాకూ, బలవంతపు వసూళ్ళకూ పాల్పడినట్టు ఆయన మాజీ సహచరులే ఆరోపిస్తున్నారు. ఇక, ఆస్పత్రిలో సాగిన అవినీతి, అక్రమాలపై కథనాలైతే కొల్లలు. అటు సీబీఐ దర్యాప్తు, ఇటు సుప్రీమ్ సొంత చొరవతో కేసులో ఇంకెన్ని లోతైన అంశాలు బయటపెడతాయో తెలీదు. ఇక, తాజాగా ఆసుపత్రికి భద్రతగా సీఐఎస్ఎఫ్ దళాల పహారా పెట్టాల్సి రావడం పోగొట్టుకున్న నమ్మకానికి పరాకాష్ఠ.అసలు మన దేశంలో ప్రతి వంద మంది డాక్టర్లలో 75 మంది సాధారణంగా రోగులు, వారి బంధువుల నుంచి ఏదో ఒక విధమైన హింస, దాడులను ఎదుర్కొన్నవారే. అమెరికాలో ఆ సంఖ్య 47 శాతమే. ఇలాంటి అనేక కారణాల రీత్యానే రెండేళ్ళ క్రితం 2022లో ప్రవేశపెట్టిన ‘ఆరోగ్య వృత్తి నిపుణులు, సంస్థలపై హింసా నిరోధక బిల్లు’ను తక్షణం ఆమోదించి, అమలు చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. నిజానికి, 2007 నుంచి మన దేశంలో మెడికల్ ప్రొటెక్షన్ యాక్ట్ (ఎంపీఏ) ఉంది. 23 రాష్ట్రాలు దాన్ని తమదైన రూపంలో అమలు చేస్తున్నాయి. ఆరోగ్య సేవకుల భద్రత నిమిత్తం అలా ఇప్పటికే చట్టాలున్నా ఎంత సమర్థంగా పనిచేస్తున్నాయన్నది వేరే కథ. పైగా, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకం శిక్ష. అంతటా ఒకే విధమైన నమూనా చట్టం అమలయ్యేలా చూడాల్సి ఉంది. అయితే, కేవలం చట్టాలతో పరిస్థితి చక్కబడుతుందనీ, దాడుల నుంచి వైద్యులను కాపాడగల మనీ అనుకోవడం కూడా పొరపాటే. ప్రజారోగ్య సేవకుల భద్రత అనేది దీర్ఘకాలిక ప్రణాళికతో సాగాల్సిన ప్రభుత్వ విధానం. మున్ముందుగా ఉన్నతమైన వైద్యవృత్తికీ, వైద్యులకూ సమాజంలో గౌరవం ఇనుమడించే వాతావరణం పెంపొందించాలి. రోగులకు ప్రాణదాతలై రాత్రీ పగలూ లేకుండా శ్రమించే వైద్యులకు జీతభత్యాలే కాదు... మెరుగైన పని పరిస్థితులు కల్పించడం కనీస బాధ్యత. ఆరోగ్య రంగానికి నిధుల పెంపుతో పాటు ‘అభయ’ లాంటివారు 36 గంటలు ఆపకుండా పని చేయాల్సిన అవస్థ తప్పించేలా తగినంతమంది వైద్య సిబ్బందిని తీసుకోవాలి. ప్రభుత్వాలు, వైద్య సంస్థలు సమష్టిగా దీని మీద దృష్టి పెట్టాలి. సుప్రీమ్ చెప్పినట్టు ఆస్పత్రుల్లో లైంగిక వేధింపుల నిరో ధక చట్టం (పోష్) వర్తిస్తుందని గుర్తించాలి. ఇవాళ్టికీ జూనియర్ డాక్టర్లు అమానవీయ పరిస్థితుల్లో పనిచేయాల్సి వస్తున్న తీరును గుర్తించి, ముందు అక్కడ నుంచే మార్పు మొదలుపెట్టాలి. కోల్‌కతా ఘటనపై ఆందోళన ఆగక ముందే, మహారాష్ట్రలోని బద్లాపూర్‌లో బడిలో చదువుకుంటున్న ఇద్దరు కిండర్‌గార్టెన్ చిన్నారుల్ని కాపలాదారు రూపంలోని ఓ మానవ మృగం కాటేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కుళ్ళిన వ్యవస్థలోని విలువల పతనాన్ని మరోమారు నగ్నంగా నిలబె ట్టింది. ఈ వరుస ఘటనలు ఆందోళనతో పాటు సత్వర కార్యాచరణ అవసరాన్ని పెంచుతున్నాయి. ‘బాగా చదువుకోవాలి. బంగారు పతకం సాధించాలి. పెద్ద ఆసుపత్రుల్లో పనిచేయాలి. అమ్మా నాన్నల్ని బాగా చూసుకోవాలి’ అంటూ డైరీలో ఆఖరిరోజున సైతం రాసుకున్న ఓ మధ్యతరగతి అమ్మాయి కలల్ని చిదిమేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాల్సిందే. ఈ ఘటనలకు మూలకారణమవుతున్న వ్యవస్థాగత లోపాల్ని సరిదిద్దాల్సిందే! సుప్రీమ్ తీసుకున్న చొరవ, పాలకుల చర్యలు అందుకు దోహదపడితేనే అభం శుభం తెలియని ‘అభయ’లెందరికో ఆత్మశాంతి. -
డాక్టర్ల భద్రతపై కేరళ ప్రభుత్వ కీలక నిర్ణయం
తిరువనంతపురం: కలకత్తాలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటనతో డాక్టర్ల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు చేపడుతున్నాయి. తాజాగా కేరళ ప్రభుత్వం మెడికల్ కాలేజీలకు కీలక ఆదేశాలు జారీచేసింది. కాలేజీల్లో స్పేస్ ఆడిట్ నిర్వహించాలని ఆదేశించింది. ఈ ఆడిట్ ద్వారా మెడికల్ కాలేజీల నిర్వహణ ఎలా ఉందనేది పరిశీలిస్తారు. స్పేస్ ఆడిట్ నిర్వహించాలని రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌ను కేరళ ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ ఆదేశించినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. స్పేస్ఆడిట్తో పాటు మరిన్ని చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. కాలేజీల్లో డాక్టర్ల భద్రతపై మాక్‌డ్రిల్స్ నిర్వహణ, సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, వాకీటాకీల వినియోగం, అనుమతి లేనివారికి రాత్రివేళ ఆస్పత్రిలో ఉండేందుకు నిరాకరించడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించింది. రాత్రివేళ డ్యూటీ ముగించుకొని వెళ్లే మహిళా ఉద్యోగులకు భద్రత కల్పించాలని, వీధి కుక్కల దాడుల నుంచి సిబ్బంది, విజిటర్స్‌ను కాపాడేందుకు తగిన ప్రణాళికలు అమలు చేయాలని ఆదేశించింది. రోగి సహా ఎవరైనా హింసాత్మకంగా లేదా బెదిరింపు ప్రవర్తనను కలిగి ఉన్నప్పుడు కోడ్ గ్రే అమలు చేయాలని ప్రభుత్వం కోరింది. -
వైద్య కళాశాలల ప్రారంభానికి చర్యలు తీసుకోలేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిర్మిస్తున్న కొత్త వైద్య కళాశాలలకు నిధుల లభ్యత, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో దానిని ఎలా అధిగమించాలో ఆలోచించిన తర్వాత పీపీపీ విధానంపై ముందుకు వెళ్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి చర్యలు తీసుకోలేదని చెప్పారు. వైద్య రంగంలో అద్భుతాలు చేయడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని అన్నారు. వైద్య రంగంలో సమస్యల పరిష్కారానికి 30 అంశాలతో స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకున్నామని తెలిపారు. ముందుగా ప్రభుత్వాస్పత్రుల్లో వనరుల ఆవశ్యకతపై ఆడిట్ చేస్తామన్నారు. అనంతరం ఆరు నెలల్లోగా ఆస్పత్రుల్లో వసతులు, సాంకేతిక నిపుణుల కొరతను అధిగమిస్తామని చెప్పారు. ఏడాదిలోగా అవసరాల మేరకు సీటీ, ఎమ్మారై వంటి ఆధునిక యంత్ర పరికరాలు అందుబాటులోకి తెస్తామన్నారు. ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించేలా ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశా)తో చర్చించామన్నారు. ఇప్పటికే రూ.200 కోట్లు విడుదల చేశామని, మరో రూ.300 కోట్లు త్వరలో విడుదల చేస్తామని చెప్పారు. నెలవారీగా బిల్లులు విడుదల చేయాలని ఆశా ప్రతినిధులు కోరినట్టు వెల్లడించారు. గత ప్రభుత్వం అభివృద్ధి చేయలేదంటూనే.. గత ప్రభుత్వంలో వైద్య రంగంలో అభివృద్ధి చెందింది ఏమీ లేదని, ఎక్కడ చూసినా సమస్యలున్నాయని ఆరోపిస్తూనే.. అనంతపురం జీజీహెచ్‌లో పొరుగు రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చి చికిత్స పొందుతున్నారని, గుంటూరు జీజీహెచ్‌లో కిడ్నీ, గుండె, లివర్ వంటి అవయవాల మారి్పడి సర్జరీలు కూడా చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదుతరగతుల ప్రారంభానికి సిద్ధమైన పులివెందుల, మదనపల్లె, మార్కాపురం, పాడేరు, ఆదోని వైద్య కళాశాలల ప్రారంభంపై మంత్రి స్పందించారు. వైద్య శాఖలో స్వల్ప కాలంలో పరిష్కరించదగ్గ సమస్యలపై దృష్టి పెట్టామన్నారు. ఐదు వైద్య కళాశాలల్లో సరిపడా ఫ్యాకల్టీ లేరని, వసతులు పూర్తిస్థాయిలో కల్పించలేకపోవడంతో నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతులు నిరాకరించిందన్నారు. రెండు నెలల్లో పోస్టులేమీ భర్తీ చేయలేదని తెలిపారు. పులివెందుల వైద్య కళాశాలలో 50 సీట్లకు అండర్‌టేకింగ్ ఇస్తామన్నారు. ఐదు వైద్య కళాశాలల్లో ఈ ఏడాది ప్రవేశాలు ఉంటాయని విద్యార్థులు ఎదురు చూస్తున్న మాట వాస్తవమేనన్నారు. అయితే తొలి, మలి, చివరి విడతల కళాశాలల్లో పనులు చేసిన కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించాల్సి ఉందని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని.. స్వల్ప వ్యవధిలో అద్భుతాలు సృష్టించలేమని పేర్కొన్నారు. -
ఆస్పత్రులపై దాడులు.. కేంద్రం కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: బెంగాల్‌లోని కోల్‌కతాలో వైద్యురాలి హత్యచార ఘటనపై ఆందోళనలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం.. అన్నీ అసుపత్రులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆసుపత్రి వైద్యులపై, వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలపై దాడి జరిగితే.. ఆరు గంటల్లోగా పోలీసు కేసు కావాల్సిందేని పేర్కొంటూ.. అన్ని ఆసుపత్రులకు మెమో జారీ చేసింది. ఒకవేళ నిర్ణీత గడువులోగా ఫిర్యాదు అందకపోతే.. సంబంధిత ఆసుపత్రి, ఇన్స్టిట్యూట్ అధిపతి దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ‘ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బందిపై దాడులు ఎక్కువైనట్లు మా దృష్టికి వచ్చింది. అనేక మంది ఆరోగ్య కార్యకర్తలు తమ విధి నిర్వహణలో శారీరక హింసకు గురవుతున్నారు. మరికొందరికి బెదిరింపులు, వస్తున్నాయి.ఇందులో ఎక్కువ శాతం రోగి, వారి వెంట వచ్చిన అటెండర్ల వల్ల ఎదుర్కొన్నవే.. దీనిని పరిగణనలోకి తీసుకొని ఆసుపత్రులకు ఆదేశాలు ఇచ్చాం. విధుల్లో ఉండగా వైద్య సిబ్బంది హింసను ఎదుర్కొంటే.. ఆరు గంటల్లోగా ఆసుపత్రి హెడ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి’ అని కేంద్రం వెల్లడించింది. In the event of any violence against any healthcare worker while on duty, the Head of Institution shall be responsible for filing an Institutional FIR within a maximum of 6 hours of the incident: Ministry of Health and Family Welfare pic.twitter.com/2YGDZVRx8O— ANI (@ANI) August 16, 2024కాగా కోల్‌కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆసుపత్రిలో పనిచేసే వారికి మెరుగైన రక్షణ, సురక్షితమైన పని వాతావరణం కల్పించాలని కోరుతూ దేశవ్యాప్తంగా వైద్యులు, వైద్య విద్యార్ధులు సమ్మెకు దిగారు. ఈ క్రమంలోనే కేంద్రం ఈ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. -
కూటమి సర్కార్.. ‘మెడికల్’ ద్రోహం!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడమే ఏకైక లక్ష్యంగా వ్యవహరిస్తున్న కూటమి సర్కారు కొత్త కళాశాలలకు అనుమతులు రాబట్టకుండా పేద విద్యార్థులకు తీరని ద్రోహం తలపెట్టింది. గత ప్రభుత్వం శ్రీకారం చుట్టిన 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేట్‌కు కట్టబెట్టేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభం కావాల్సిన ఐదు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతులపై తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, ఆదోని, పాడేరు వైద్య కళాశాలల్లో ఒక్కో చోట 100 ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు ప్రారంభించాల్సి ఉంది.ఈమేరకు గత ప్రభుత్వం ఈ ఐదు చోట్ల సెకండరీ కేర్ ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా అభివృద్ధి చేయడంతో పాటు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధనలకు అనుగుణంగా పోస్టులను గతంలోనే మంజూరు చేశారు. పోస్టుల భర్తీ దాదాపుగా పూర్తయిన సమయంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. మొదటి ఏడాది ఎంబీబీఎస్ విద్యార్థుల అకడమిక్ కార్యకలాపాల కోసం లెక్చర్ హాల్, ల్యాబ్, హాస్టల్స్, క్యాంటీన్ల నిర్మాణం లాంటి పనులన్నీ దాదాపుగా పూర్తయ్యాయి.ఈ నేపథ్యంలో గత జూన్ 24న ఎన్ఎంసీ బృందాలు ఈ ఐదు కళాశాలల్లో తనిఖీలు నిర్వహించాయి. మదనపల్లెలో 12 శాతం, పాడేరు, మార్కాపురం, పులివెందుల, ఆదోనిల్లో కొంత మేర ఫ్యాకల్టీ, ఇతర వనరులను కల్పించాల్సి ఉన్నందున అనుమతులను నిరాకరిస్తున్నట్లు జూలై 6న కళాశాలలకు సమాచారం ఇచ్చింది. అయితే వనరుల కల్పనకు ఎటువంటి చర్యలు తీసుకోకుండా నాన్చిన కూటమి సర్కారు చివరి నిమిషంలో మొక్కుబడిగా అప్పీల్‌కు వెళ్లింది.అండర్ టేకింగ్ ఇవ్వకపోవడంతో..కొత్త వైద్య కళాశాలలకు అనుమతులపై అప్పీల్ చేసిన నేపథ్యంలో పులివెందుల కళాశాలలో ఎన్ఎంసీ వర్చువల్ ఇన్స్పెక్షన్ నిర్వహించింది. అయితే తాము జూన్ 24న ఇన్స్పెక్షన్ చేసినప్పటి పరిస్థితులే ఇంకా ఉన్నాయని, అంతకు మించి పెద్దగా పురోగతి లేదని ఎన్ఎంసీ ప్రతినిధులు గుర్తించినట్లు తెలిసింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అండర్ టేకింగ్ ఇస్తే 50 ఎంబీబీఎస్ సీట్లను మంజూరు చేస్తామని గత వారం కళాశాలలకు ఎన్ఎంసీ సమాచారం ఇచ్చింది. అండర్ టేకింగ్ అంటే కళాశాలలో తరగతుల నిర్వహణ, అకడమిక్ కార్యకలాపాలకు అవసరమైన వసతులన్నింటినీ ప్రభుత్వం సమకూరుస్తుందని గ్యారంటీ ఇవ్వడం. అయితే అండర్ టేకింగ్ గడువు కూడా ఈనెల 12వతేదీతో ముగిసింది. దీనిపై వైద్యశాఖ సమాచారం ఇచ్చినా ప్రభుత్వం నుంచి స్పందన లేదని తెలిసింది.పట్టుబట్టి సాధించిన వైఎస్ జగన్గతేడాది ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల కళాశాలలకు తొలి దశ తనిఖీల్లో అనుమతులు రాకపోవడంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లి అండర్ టేకింగ్ ఇచ్చింది. తద్వారా ఆ నాలుగు కళాశాలలకు వైఎస్ జగన్ అప్పట్లో పట్టుబట్టి అనుమతులు రాబట్టారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాత్రం అండర్ టేకింగ్ ఇవ్వలేదు. ఇక మిగిలిన నాలుగు కొత్త కళాశాలల్లో వర్చువల్ ఇన్స్పెక్షన్ కూడా జరగలేదు. కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది. బీజేపీకి చెందిన సత్యకుమార్ రాష్ట్రంలో వైద్య శాఖ మంత్రిగా ఉన్నా కొత్త వైద్య కళాశాలలకు అనుమతుల విషయాన్ని పట్టించుకోకపోవడంపై వైద్య వర్గాల్లో చర్చ జరుగుతోంది.వైద్య కళాశాలలకు అనుమతులపై సందిగ్ధత కొనసాగుతున్న క్రమంలో ఆల్ ఇండియా కోటా, రాష్ట్ర కోటా కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలైంది. గతేడాది వైఎస్సార్ సీపీ హయాంలో ఐదు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఒక్కోచోట 150 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున మొత్తం 750 సీట్లు అదనంగా రాష్ట్రానికి సమకూరాయి. ఇక ఈ ఏడాది ఐదు కొత్త కళాశాలల్లో ఒక్కోచోట 100 చొప్పున 500 సీట్లు సమకూరుతాయని విద్యార్థులు, తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కొత్త కళాశాలలకు అనుమతులు లభిస్తే 75 సీట్లు ఆల్ ఇండియా కోటా కింద పోగా మిగిలిన 425 సీట్లు పూర్తిగా మన రాష్ట్ర విద్యార్థులకే దక్కే పరిస్థితి ఉండేది. తద్వారా పేద, మధ్య తరగతి విద్యార్థుల వైద్య విద్య కల నెరవేరి అందుబాటులోకి వచ్చే వైద్యుల సంఖ్య పెరిగేది.ఆశలు ఆవిరి..నీట్ యూజీ–2024లో 598 మార్కులు సాధించా. కడప రిమ్స్ లేదా పులివెందుల కాలేజీలో సీటు సాధిస్తే అమ్మనాన్నలకు దగ్గరగా ఉండి ఎంబీబీఎస్ చదవచ్చని భావించా. పులివెందుల మెడికల్ కళాశాలలో ప్రవేశాలపై స్పష్టత లేదు. రాష్ట్రంలో ఈ ఏడాది ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కొత్తగా ఏర్పాటైతే అదనంగా 500 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయని ఎంతోమంది విద్యార్థులు ఆశ పెట్టుకున్నారు. గతంలో హామీ ఇచ్చిన ప్రకారం సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేయాలి. – పెద్దిరెడ్డి వెంకట కేదార్‌నాథ్‌రెడ్డి, పోరుమామిళ్ల, వైఎస్సార్ జిల్లా -
అసోం మెడికల్ కాలేజీ వివాదాస్పద అడ్వైజరీ రద్దు
గువాహటి: పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో అసోంలోని సిల్చార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ జారీ చేసిన అడ్వైజరీ(సూచనలు)పై తీవ్రంగా విమర్శలు వ్యక్తం అయ్యారు. దీంతో సదరు ఆస్పత్రి జారీ చేసిన సూచనల అడ్వైజరీని రద్దు చేసినట్లు ప్రకటించింది.ఆస్పత్రి విడుదల చేసిన అడ్వైజరీలో.. ‘మహిళా డాక్టర్లు, విద్యార్థినులు, సిబ్బంది నిర్మానుష్య ప్రాంతాలు, వెలుతురు తక్కువగా, జనాలు లేని ప్రాంతాలకు దూరంగా ఉండాలి. ఒంటరిగా ఉండకుండా చూసుకోవాలి. అత్యంత అవసరమైతే తప్ప రాత్రి సమయాల్లో హాస్టల్స్ విడిచి బయటకు వెళ్లవద్దు. ఒకవేళ వెళ్లాల్సిన పరిస్థితి వస్తే.. అధికారులకు సమాచారం అందించాలి. అనుమానాస్పద వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. మర్యాదపూర్వకంగా మాట్లాడండి. ఏదైనా వేధింపుల సమస్య ఎదురైతే.. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించండి’’ అని పేర్కొంది. ఈ అడ్వైజరీని డాక్టర్లు, విద్యార్థులు తీవ్రగా వ్యతిరేకించారు. అడ్వైజరీలో వాడిన పదజాలం తమను బాధించిదని కాలేజీలోని జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ తెలిపింది.తమను రూంలకే పరిమితం కావాలని చెప్పే బదులు భద్రతా ఏర్పాట్లు మెరుగుపర్చాలని డిమాండ్ చేశారు. క్యాంపస్‌లో లైటింగ్‌తో పాటు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా తమను బాధించిన అడ్వైజరీని సైతం వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. మొదట ఆస్పత్రిలో మహిళా సిబ్బంది ప్రయోజనాలను దృష్టిలో పెట్టకొని ఈ అడ్వైజరీ జారీ చేసినట్లు తెలిపినా.. విద్యార్థుల విమర్శల ఒత్తిడితో వెనక్కి తీసుకున్నట్లు సిల్చార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ప్రకటించింది. మరోవైపు.. కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన నేపథ్యంలో జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ).. దేశవ్యాప్తంగా అన్ని వైద్య కళాశాలలు, హాస్టల్స్‌లో ఉండేవారి భద్రత కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని వైద్య కళాశాలలకు అడ్వయిజరీ జారీ చేసిన విషయం తెలిసిందే. -
మెడికల్ సీట్లలో ఈడబ్ల్యూఎస్ కోటా జీవో నిలిపివేత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మైనారిటీ కాలేజీలు మినహా అన్ని ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద జనరల్ కేటగిరిలో భర్తీ చేసే మొత్తం సీట్లలో 10 శాతం సీట్లను ఆర్థిక బలహీన వర్గాలు (ఈడబ్ల్యూఎస్)కు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 6న జారీ చేసిన జీవో 94 అమలును హైకోర్టు నిలిపేసింది. ఈ జీవో అమలు విషయంలో ఏ రకంగానూ ముందుకెళ్లవద్దంది. ఈ జీవో జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉందని హైకోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడింది.ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే ఉన్న సీట్లలో కాకుండా దామాషా ప్రకారం సీట్ల సంఖ్యను పెంచి, అందులో కేటాయించాల్సి ఉంటుందన్న పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనతో హైకోర్టు ప్రాథమికంగా ఏకీభవించింది. జీవో 94 విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, ఎన్ఎంసీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం తదితరులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అది రాజ్యాంగ విరుద్ధం..సీట్ల సంఖ్య పెంచకుండా ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని, అందువల్ల తాజాగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 94ని రద్దు చేయాలని కోరుతూ విజయనగరం జిల్లాకు చెందిన పోగిరి చరిష్మా, గుంటూరు జిల్లాకు చెందిన అప్పారి సాయి వెంకట ఆదిత్య, యమవరపు మృదులత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది యరగొర్ల ఠాగూర్ యాదవ్ వాదనలు వినిపిస్తూ, ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేయాలనుకుంటే ఎన్ఎంసీ అనుమతి తీసుకుని దామాషా ప్రకారం సీట్ల సంఖ్యను పెంచుకోవచ్చునన్నారు. సీట్ల సంఖ్యను పెంచకుండా, ఉన్న సీట్లలో 10 శాతం సీట్లను ఈడబ్ల్యూఎస్ కింద భర్తీ చేయడానికి వీల్లేదన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కన్వీనర్ కోటా కింద ఉన్న మొత్తం సీట్లలోనే 10 శాతం సీట్లను ఈడబ్ల్యూఎస్‌కు కేటాయిస్తూ జీవో 94 జారీ చేసిందన్నారు. దీనివల్ల జనరల్ కోటా సీట్లలో 10 శాతం సీట్లు తగ్గుతాయన్నారు. దీంతో పిటిషనర్ల వంటి వారు ఎంతో మంది నష్టపోతున్నారని తెలిపారు.జనహిత్ అభియాన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా జీవో 94 ఉందన్నారు. అసలు ఈ జీవో రహస్యంగా ఉందని, ఇప్పటి వరకు ప్రజా బాహుళ్యంలోకి తీసుకురాలేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, ఈ జీవో వల్ల పిటిషనర్లకు నష్టం జరుగుతుందని భావిస్తున్నారా? వారి అవకాశాలను ఈ జీవో దెబ్బతీస్తుందా? అని ప్రశ్నించింది. అవునని, పిటిషనర్లు తీవ్రంగా నష్టపోతున్నారని ఠాగూర్ యాదవ్ తెలిపారు.ఎన్ఎంసీ ఉత్తర్వుల ప్రకారమే జీవో..రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సింగమనేని ప్రణతి వాదనలు వినిపిస్తూ, ప్రైవేటు కాలేజీల్లో సీట్లు పెంచేది లేదని ఎన్ఎంసీ తెలిపిందని, ఎన్ఎంసీ ఉత్తర్వుల ప్రకారమే తాము జీవో ఇచ్చామన్నారు. పిటిషనర్లు కావాలంటే ఎన్ఎంసీ ఉత్తర్వులను సవాలు చేసుకోవాలన్నారు. ఈ సమయంలో ఠాగూర్ యాదవ్ జోక్యం చేసుకుంటూ, నిర్దేశించిన విధంగా మౌలిక సౌకర్యాలు లేకపోవడంతో ప్రైవేటు కాలేజీల అదనపు సీట్ల అభ్యర్థనను ఎన్ఎంసీ అధికారులు తోసిపుచ్చారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తాజా జీవో వల్ల ఓపెన్ కేటగిరిలో సీట్లు తగ్గిపోయాయన్నారు.సౌకర్యాలుంటేనే అదనపు సీట్లు..ఎన్ఎంసీ తరఫు న్యాయవాది సన్నపురెడ్డి వివేక్ చంద్రశేఖర్ స్పందిస్తూ, ఈడబ్ల్యూఎస్‌ను తాము తిరస్కరించడం లేదన్నారు. మౌలిక సౌకర్యాలున్న కాలేజీలకు అదనపు సీట్లు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆ కాలేజీలకు పలుమార్లు చెప్పామన్నారు. సౌకర్యాలు లేకుండా అదనపు సీట్లు ఇవ్వలేమన్నారు. దామాషా ప్రకారం 50 అదనపు సీట్లు ఇచ్చే అధికారం తమకు ఉందన్నారు. కేవలం 10 శాతం సీట్లే పెంచితే మిగిలిన వర్గాలు నష్టపోతాయని, అందువల్ల అదనంగా 50 సీట్లు ఇస్తామన్నారు. అందరి వాదనలు విన్న ధర్మాసనం జీవో 94పై స్టే విధిస్తున్నామని చెప్పింది. కొంత గడువిస్తే పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేస్తామన్న ప్రణతి అభ్యర్థనను తోసిపుచ్చింది. కన్వీనర్ కోటాలోనే 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటా అమలు సరికాదంది. ఈ దశలో జీవో 94 అమలుకు అనుమతినిస్తే గందరగోళ పరిస్థితులు నెలకొంటాయని ధర్మాసనం అభిప్రాయపడింది. అదనపు సీట్లు కావాలంటే సౌకర్యాలన్నీ మెరుగుపరచుకోవాలని ప్రైవేటు కాలేజీలపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని పేర్కొంది.ఈడబ్ల్యూఎస్ కోటా జీవో నిలుపుదలపై హర్షంఏపీ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్గుంటూరు రూరల్: ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ కోటా జీవోను నిలుపుదల చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడంపై ఏపీ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం గుంటూరులో ఆయన మాట్లాడుతూ.. గతంలో జీవో 94ని వ్యతిరేకించామని, హైకోర్టు జీవోను నిలుపుదల చేయటాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. దీని వల్ల ఎంతో మంది ఈబీసీ విద్యార్థులకు మేలు జరుగుతుందన్నారు. హైకోర్టులో కేసు దాఖలు చేసిన విద్యార్థులను అభినందించారు. హైకోర్టు న్యాయవాది ఠాగూర్ యాదవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు ఏపీ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ వ్యతిరేకం కాదన్నారు. -
సీబీఐ దర్యాప్తే సరైంది!
దేశవ్యాప్తంగా వైద్యవర్గాల్లో తీవ్ర ఆగ్రహావేశాలు రగిల్చిన కోల్‌కతా వైద్య కళాశాల అనుబంధ ఆస్పత్రి ఉదంతంపై సీబీఐ దర్యాప్తునకు కోల్‌కతా హైకోర్టు మంగళవారం ఆదేశాలివ్వటం అన్ని విధాలా సబబైనది. జూనియర్ డాక్టర్‌గా పనిచేస్తున్న పీజీ విద్యార్థిని మొన్న శుక్రవారం వేకువ జామున ఒక దుండగుడి అఘాయిత్యానికి బలైంది. ఈ కేసు విషయంలో గత అయిదురోజులుగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ప్రజల్లో సందేహాలు తీర్చకపోగా... మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. దుండగుడిని అరెస్టు చేశామంటున్న పోలీసుల ప్రకటనపై అటు మెడికో కుటుంబ సభ్యులు, ఇటు వైద్య విద్యార్థులు, సిబ్బంది సంతృప్తి చెందలేదు. హత్య, అత్యాచారం ఉదంతంలో కచ్చితంగా ఇతరుల ప్రమేయం ఉందని మొత్తుకున్నారు. కానీ పోలీసులు పట్టనట్టే ఉన్నారు. అసలు ఆస్పత్రి పాలకవర్గం, లేదా ప్రిన్సిపాల్ ఇంతవరకూ ఈ ఉదంతంలో ఫిర్యాదు దాఖలు చేయలేదు. కనీసం వారిని పిలిచి ప్రశ్నించినవారూ లేరు. ఆరు రోజుల్లో... అంటే వచ్చే ఆదివారంలోగా నిగ్గు తేల్చకపోతే కేసును సీబీఐకి అప్పగిస్తానని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చ రించారు. కానీ హైకోర్టు భిన్నంగా ఆలోచించింది. ఇందులో జాప్యం జరిగినకొద్దీ సాక్ష్యాధారాలు మాయమవుతాయని, దోషులు తప్పించుకునే అవకాశం ఉన్నదని భావించింది.కొన్ని నేరాలు సమాజాన్ని తీవ్రంగా కలచివేస్తాయి. మనుషులుగా అసలు మన ఉనికిపైనే సందేహం రేకెత్తిస్తాయి. సరిగ్గా పన్నెండేళ్ల క్రితం దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న నిర్భయ ఉదంతం అటువంటిదే! ప్రజలంతా ఉద్యమించిన పర్యవసానంగా ఆ విషయంలో నాటి కేంద్ర ప్రభుత్వం చురుగ్గా కదిలి కఠినమైన చట్టాన్ని తీసుకొచ్చింది. నేరగాళ్లకు ఉరితో సహా కఠినశిక్షలు అమలుచేసింది. కానీ ఆ తర్వాత కూడా నేరాలు తగ్గలేదు. దీనికి కారణం కేవలం ప్రభుత్వాల అలసత్వం మాత్రమే! నేరగాళ్లను వెనువెంటనే శిక్షించేలా పకడ్బందీ దర్యాప్తు జరగకపోవటం అన్ని చోట్లా కనబడుతోంది. కేవలం చట్టాలు మాత్రమే సరిపోవనీ, వాటిపై అవగాహన కల్పించి, ఆపత్కాలంలో మహిళలు తక్షణం ఆశ్రయించే సదుపాయం అమల్లోకి తేవాలని ప్రభుత్వాలు అను కోలేదు. తెలంగాణలో షీ టీమ్స్ అయినా, ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన దిశ యాప్, దిశ చట్టమైనా మహిళలకు ఎంతో తోడ్పాటుగా నిలిచాయి. ముఖ్యంగా ఏపీలో దిశ యాప్ వల్ల నేరాలను నివారించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కోల్‌కతా ఆస్పత్రిలో ఉన్న అస్తవ్యస్త పరిస్థితి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒకపక్క దేశవ్యాప్తంగా లైంగిక నేరాలు పెరిగాయని తెలుస్తూనే ఉన్నా మహిళా సిబ్బంది భద్రతకూ, రక్షణకూ ఆస్పత్రి ఎలాంటి చర్యలూ తీసుకోలేదని అక్కడి పరిస్థితులు చూస్తే అర్థమవుతోంది. నేరగాడు సంజయ్ రాయ్ పోలీస్ వలంటీర్‌గా ఉంటూ ఆస్పత్రిలో ఎక్కడికైనా యథేచ్ఛగా వెళ్తాడని అందరూ చెబుతున్న మాట. ఆఖరికి మహిళా వైద్య సిబ్బంది విశ్రాంతి తీసుకునే ప్రాంతానికి కూడా నిశిరాత్రి అతగాడు వెళ్లగలిగాడంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ జూనియర్ డాక్టర్ 36 గంటలు అవిశ్రాంతంగా రోగులకు సేవలందించి అలసి నిదిరిస్తున్న వేళ నేరగాడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని తోటి సిబ్బంది అంటున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు జరిగినప్పుడు సేవలందించటానికి నమోదు చేసుకున్న నేరగాడికి ఆస్పత్రిలో సంచరించే స్వేచ్ఛ ఎవరిచ్చారో తేలాల్సివుంది. గర్భిణి అయిన భార్యను హింసించిన ఉదంతంలో వచ్చిన ఫిర్యాదుపై రెండేళ్లుగా పోలీసులు పట్టించుకోలేదంటే అతగాడి పలుకుబడిని అంచనావేయొచ్చు. అప్పుడే చర్య తీసుకుంటే ఈ ఘోరం జరిగేదా? తమ కుటుంబాల్లో వైద్య అవస రాలున్నప్పుడల్లా ఆస్పత్రిలో అన్నీ అందేలా చూస్తున్నాడన్న ఏకైక కారణంతో పోలీసులు అతడిని చూసీచూడనట్టు వదిలేశారని చాలామంది చెబుతున్న మాట. తాము తీసుకున్న వలంటీర్ల నడవడి ఎలావుంటున్నదో, వారిని కొనసాగించాలో లేదో సమీక్షించుకునే సంస్కృతి లేకపోవటం ఎటువంటి ఘోరాలకూ, నేరాలకూ దారితీస్తుందో అంచనా వేయలేనంత స్థితిలో పోలీసులుండటం ఆశ్చర్య కరం. నిజానికి లోతైన దర్యాప్తు జరిగితే తమ లోపాలు కూడా బయటపడతాయన్న ఏకైక కారణంతోనే గత అయిదురోజులుగా కోల్‌కతా పోలీసులు దర్యాప్తు డ్రామా కొనసాగిస్తున్నారనుకోవాలి. చదువు పూర్తయ్యాక ఇతర రంగాల్లో వెనువెంటనే స్థిరపడే అవకాశం ఉన్నా దాన్ని కాదనుకుని పలువురు విద్యార్థులు ఎన్నో సవాళ్లతో కూడిన, దీర్ఘకాలం పట్టే వైద్యవిద్యకు మొగ్గుచూపుతారు. సమాజం పట్లా, మనుషుల పట్లా ఎంతో సేవాభావం, ప్రేమ ఉంటే తప్ప ఇది సాధ్యంకాదు. కానీ అలాంటివారికి ఆ రంగంలో సరైన గౌరవ మర్యాదలు లభిస్తున్నాయా? వారి భద్రతకు సక్రమమైన చర్యలు తీసుకుంటున్నారా? ఈ విషయంలో జూనియర్ డాక్టర్లు తరచు చెప్పే అంశాలు అంత సంతృప్తికరంగా లేవు. వారి శ్రమకు తగ్గ వేతనాలు అందవు. అవి కూడా నిర్దిష్ట సమయానికి రాని దుఃస్థితి చాలాచోట్ల ఉంటున్నది. వేళకాని వేళల్లో సైతం అవిశ్రాంతంగా పనిచేసేవారికి కనీసం కాసే పయినా భద్రంగా నిద్రపోయే సౌకర్యం ఆస్పత్రి పాలకవర్గం కల్పించలేకపోయిందంటే, ఆ విష యంలో సీనియర్లు శ్రద్ధ పెట్టలేదంటే ఏమనుకోవాలి? పెత్తనం చలాయించటానికి ఉబలాటపడే వారు తాము కూడా ఒకప్పుడు జూనియర్లమనీ, వారిని కంటికి రెప్పలా చూసుకోవాలనీ భావించక పోవటం విషాదం. సహ సిబ్బంది పట్లా, వారి దురవస్థలపట్లా సహానుభూతి లేనివారి వల్లే ఇలాంటి దురంతాలు చోటు చేసుకుంటున్నాయి. కోల్‌కతా ఆస్పత్రి ఉదంతమైనా అటువంటి వారి కళ్లు తెరిపించాలి. వైద్యసిబ్బంది రక్షణకూ, భద్రతకూ దేశవ్యాప్తంగా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలి. -
రేపు దేశవ్యాప్తంగా వైద్య సేవలు నిలిపివేత : ఫోర్డా
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలోని ప్రభుత్వ ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో ఓ మహిళా జూనియర్ డాక్టర్ దారుణ హత్యకు గురయ్యారు. ఆమె హత్యకు నిరసనగా వైద్యుల సంఘం ‘ది ఫెడరరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఫోర్డా)’ ఆదివారం కీలక ప్రకటన చేసింది. ఆగస్ట్ 12 (సోమవారం) నుండి దేశంలోని అన్ని ఆసుపత్రులలో పలు రకాల వైద్య సేవల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఆగస్ట్ 9న ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఓ మహిళా పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ (PGT) డాక్టర్ హత్యకు గురయ్యారు. ఆమెకు సంఘీభావంగా వైద్య సేవల్ని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. వైద్యురాలి హత్యని రాజకీయం చేయకుండా నిందితుల్ని గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఫోర్డా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాకు లేఖ రాసింది. 🚨 We shall begin our Nationwide agitation from tomorrow! (Monday 12th August)We stand with our beaten, manhandled, deeply hurt colleagues of R G Kar Medical College, Kolkata. We urge authorities to not make it political and color it bad- It’s humanity which is at stake here.… pic.twitter.com/pPg2ifpBqI— FORDA INDIA (@FordaIndia) August 11, 2024తక్షణ చర్య: ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలి. నిరసనకారులకు రక్షణ: జూనియర్ వైద్యులి మరణంపై న్యాయం చేయాలని కోరుతూ నిరసన చేస్తున్న వైద్యుల పట్ల పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకూదని హామీ ఇవ్వాలి. సత్వర న్యాయం, పరిహారం: హత్యకు గురైన వైద్యుని కుటుంబానికి సత్వర న్యాయం, తగిన పరిహారం అందించాలి. మెరుగైన భద్రతా ప్రోటోకాల్‌లు: అన్ని ఆసుపత్రులలో ఆరోగ్య సంరక్షణ కార్మికులకు కఠినమైన భద్రతా చర్యలను ఏర్పాటు చేసి, అమలు చేయాలని వైద్యుల సంఘం కేంద్రాన్ని డిమాండ్ చేసింది. నిపుణుల కమిటీ ఏర్పాటు: సెంట్రల్ హెల్త్‌కేర్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను వేగవంతం చేయడానికి వైద్య సంఘాల ప్రతినిధులతో సహా నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలి. అని డిమాండ్ చేస్తూ నడ్డాకు రాసిన లేఖలో పేర్కొంది. ఖండిస్తున్న వైద్యులు కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై జరిగిన దారుణాన్ని దేశ వ్యాప్తంగా సేవలందిస్తున్న డాక్టర్లు ఖండిస్తున్నారు. జూనియర్ డాక్టర్ హత్యకు నిరసనగా కేరళలోని వైద్యులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికోలు, మెడికల్ టీచర్లు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో నిరసనలు తెలపనున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ వైద్య కళాశాల అధ్యాపకుల సంఘం కేజీఎంసీటీఏ వైద్యుల్ని హత్యను త్రీవంగా ఖండించింది. ఈ దారుణ ఘటనకు వ్యతిరేకంగా నిరసనలో పాల్గొంటున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా నైట్ డ్యూటీ, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ డ్యూటీ వర్క్‌లో భాగమైన మహిళా వైద్యుల భద్రత ఎప్పుడూ ఆందోళన కలిగిస్తోందని ఓ ప్రకటనలో పేర్కొంది. తమ పనిని నిర్భయంగా నిర్వర్తించగలిగేలా సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించడం ఆయా ప్రభుత్వాల బాధ్యత అని పేర్కొంది. -
పలు సంస్థలకు 125 ఎకరాల ప్రభుత్వ భూములు
సాక్షి, హైదరాబాద్: వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల అవసరాల నిమిత్తం 125 ఎకరాల ప్రభుత్వ భూములను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర భూమి నిర్వహణ అథారిటీ ఆమోదం మేరకు భూ ముల కేటాయింపు చేసినట్లు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నల్లగొండ, యాదాద్రి జిల్లాల్లో ఇండస్ట్రియల్ పార్కులు, ఖమ్మం జిల్లాలో వైద్య కళాశాల, గురుకుల పాఠశాల, పలుచోట్ల ఎస్ఐబీ విభాగం కార్యాలయాలు, నివాస క్వార్టర్ల నిర్మాణం, కామారెడ్డిలో ట్రాఫిక్ శిక్షణా కేంద్రం ఏర్పాటు కోసం ఈ భూములను సర్కార్ కేటాయించింది. టీజీఐఐసీ, స్వామి నారాయణ గురుకుల పాఠశాల, ఎస్ఐబీకి ఇచి్చన భూములను మార్కెట్ విలువ ధర ప్రకారం కేటాయించగా పలు ప్రభుత్వ సంస్థలకు ఇచ్చిన భూములతోపాటు అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు సిరాజ్‌కు ఉచితంగా కేటాయించింది. ఏ సంస్థకు ఎంత భూమి అంటే.. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో తెలంగాణ పారిశ్రామిక మౌలి క సదుపాయాల కల్పనా సంస్థ (టీజీఐఐసీ)కు 61.18 ఎకరాలను కేటాయించింది. ఇందుకోసం ఎకరానికి రూ.6.4 లక్షల చొప్పున మొత్తం రూ. 3.93 కోట్లను ప్రభుత్వానికి టీజీఐఐసీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్థలంలో పారిశ్రామిక పార్కు ఏర్పాటు కానుంది. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపురంలో 6.23 ఎకరాలను కూడా ఈ సంస్థకు పారిశ్రామిక పార్కు కోసం ఇచి్చంది. ఈ స్థలం కోసం ఎకరం రూ. 20 లక్షల చొప్పున మార్కెట్ ధరను రాష్ట్ర ప్రభుత్వానికి టీజీఐఐసీ చెల్లించనుంది.మరోవైపు ఖమ్మం అర్బన్ మండలం బల్లేపల్లితోపాటు రఘునాథపాలెం మండల కేంద్రంలో మొత్తం 35.06 ఎకరాలను ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు కోసం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కు కేటాయించింది. అలాగే రఘునాథపాలెం మండల కేంద్రంలో 13.10 ఎకరాల భూమిని స్వామి నారాయణ గురుకుల అంతర్జాతీయ స్కూల్ ఏర్పాటు కోసం కేటాయించినట్లు ప్రభుత్వం తెలిపింది. అక్కడ ఎకరం మార్కెట్ విలువ సుమారు రూ. కోటి ఉన్నప్పటికీ రూ. 11.25 లక్షలకే ఆ సంస్థకు అప్పగించాలన్న ఖమ్మం జిల్లా కలెక్టర్ ప్రతిపాదన మేరకు ఆ భూమిని కేటాయించింది. ఇందుకుగాను ఈ పాఠశాలలోని 10 శాతం సీట్లను జిల్లా కలెక్టర్ విచక్షణ కోసం (ఉచిత విద్య కోసం) రిజర్వు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉచిత కేటాయింపులు ఇలా.. ⇒ నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని చించోలి (బి) గ్రామంలో సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల నిర్మాణం కోసం టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్కు 6 ఎకరాలు. ⇒ కామారెడ్డి జిల్లా క్యాసంపల్లిలో ట్రాఫిక్ శిక్షణా కేంద్రం ఏర్పాటు కోసం హోంశాఖకు 3 ఎకరాలు. ⇒అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు మహ్మద్ సిరాజ్‌కు హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నం.78 (షేక్‌పేట మండలం)లోని ప్రశాసన్‌నగర్‌లో 600 గజాల ఖాళీ స్థలం. -
బాబూ.. ఏనాడైనా ఒక్క మెడికల్ కాలేజీ తెచ్చావా?: మేరుగ నాగార్జున
సాక్షి, తాడేపల్లి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏనాడైనా ఒక్క మెడికల్ కాలేజీని తెచ్చారా? అని ప్రశ్నించారు మాజీ మంత్రి మేరుగు నాగార్జున. చంద్రబాబు వైఖరి ఏరు దాటాక తెప్ప తగలేసే రకంగా ఉందని సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఏపీలో మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం కరెక్ట్ కాదన్నారు.కాగా, మాజీ మంత్రి మేరుగు నాగార్జున గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నికలకు ముందు మెడికల్ కాలేజీలపై చంద్రబాబు, పవన్, లోకేష్ విషం కక్కారు. వైద్య విద్యను అమ్మేశారంటూ ఎల్లో మీడియాలో అడ్డగోలుగా రాతలు రాశారు, మాట్లాడారు. చంద్రబాబు వైఖరి ఏరు దాటాక తెప్ప తగలేసే రకంగా ఉంది. వైద్య విద్యను ఇప్పుడు ప్రైవేటుపరం చేస్తున్నారు. దీనిపై కేబినెట్లో లోకేష్, పవన్ ఎందుకు మాట్లాడలేదు?. చంద్రబాబు ఏనాడైనా ఒక్క మెడికల్ కాలేజీ తెచ్చారా?.ఏపీలో 12 మాత్రమే మెడికల్ కాలేజీలు ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక మరో 17 కాలేజీలను తెచ్చారు. పేదల గురించి జగన్ ఆలోచిస్తారు కాబట్టే కొత్తగా మెడికల్ కాలేజీలు తెచ్చారు. ఏపీలో అదనంగా 750 సీట్లను వైఎస్ జగన్ పెంచగలిగారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ తెచ్చి పేదలకు వైద్యాన్ని అందించారు. 17 కాలేజీలను పూర్తి చేసి వైద్యాన్ని అందుబాటులోకి తేవాలి. ఈ కాలేజీలను ప్రైవేటుపరం చేయాలనుకోవడం కరెక్టు కాదు. వైద్య విద్య సక్రమంగా పేద విద్యార్థులకు అందాలి. లేకపోతే వైఎస్సార్సీపీ ఉద్యమాలు చేయటానికి రెడీగా ఉంటుంది. రోడ్లను ప్రైవేటీకరణ చేస్తానని చంద్రబాబు అంటున్నారు. టోల్ గేట్లు పెట్టి డబ్బు వసూలు చేయాలనుకుంటున్నారు. ఇలాంటి ప్రైవేటీకరణ గురించి ఎన్నికలకు ముందు ఎందుకు చెప్పలేదు? అని ప్రశ్నించారు. -
ప్రైవేట్‌పరం కానున్న ఏపీ మెడికల్ కాలేజీలు!
అమరావతి, సాక్షి: జగన్ పాలనలో జరిగిన మంచిని నాశనం చేయాలనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో.. ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌పరం చేయాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు తొలి అడుగు పడింది కూడా. ఇవాళ జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో పీపీపీ(Public–private partnership) మోడల్ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది.జగన్ హయాంలో ఏపీలో కొత్తగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు. వీటిలో ఐదు మెడికల్ కాలేజీలను గతేడాది ఆయన ప్రారంభించగా.. తరగతులు కూడా ప్రారంభం అయ్యాయి. అయితే మిగిలిన 12 కాలేజీలపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టిసారించింది. వాటిని ప్రైవేట్ పరం చేసేందుకు పీపీపీ మోడల్‌ను తెరపైకి తెచ్చింది. పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీల నిర్వహణకు అధ్యయనం చేయాలని, ఇందుకుగానూ గుజరాత్ మోడల్‌ను పరిశీలిస్తామని మంత్రి పార్థసారథి ప్రకటించారు కూడా. రూ.8,480 కోట్లతో 17 కళాశాలలు ప్రజలకు ప్రభుత్వ రంగంలో మెరుగైన వైద్య వసతులు సమకూర్చడంపై ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. సుమారు రూ.8,480 కోట్లతో ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఉండేలా 17 కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందించారు. ఈ కాలేజీల ద్వారా ఏకంగా 2,550 ఎంబీబీఎస్ సీట్లు కొత్తగా అందుబాటులోకి తేవాలనున్నారు. గతేడాది ఐదు కాలేజీలు ప్రారంభించగా.. ఈ ఏడాది మరో ఐదు, మిగిలిన ఏడు వైద్య కళాశాలలను 2025-26 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాలనుకున్నారు. విజయనగరం మెడికల్ కాలేజీ ప్రారంభించినప్పటి ఫొటో -
నాలుగు మెడికల్ కాలేజీలకే ఎన్ఎంసీ అనుమతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా నాలుగు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు జాతీయ వైద్యమండలి (ఎన్ఎంసీ) అనుమతి ఇచ్చింది. ఈ మేరకు లెటర్ ఆఫ్ పర్మిషన్ (ఎల్ఓపీ) జారీ చేసింది. ప్రభుత్వం ఈ ఏడాదికి 8 కాలేజీల కోసం దరఖాస్తు చేసిన సంగతి తెలిసిందే. వాటిలో నాలుగింటికే అనుమతులొచ్చాయి. ములుగు, నర్సంపేట, గద్వాల, నారాయణపేట మెడికల్ కాలేజీల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి వైద్యవిద్య ప్రవేశాలకు ఎన్ఎంసీ పచ్చజెండా ఊపింది. యాదాద్రి భువనగిరి, మహేశ్వరం, కుత్బుల్లాపూర్, మెదక్ కాలేజీలకు ఎన్ఎంసీ అనుమతులు ఇవ్వలేదు. వీటి ఎల్ఓపీ కోసం రాష్ట్ర ప్రభుత్వం మరోమారు అప్పీల్‌కు వెళ్లనుంది. కాగా, గత నెల ఈ కాలేజీలన్నింటికీ అనుమతులు ఇవ్వలేమని ఎన్ఎంసీ తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. దీంతో తమకు మరో అవకాశం ఇవ్వాలని, లోపాలను సరిచేసుకుంటామని ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లింది. ఆ తర్వాత అధ్యాపకులను నియమించింది. 245 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పించింది. కొత్త కాలేజీలకు పోస్టు చేసింది.ఇటీవల సాధారణ బదిలీల్లో భాగంగా ఆ కాలేజీలకు రెగ్యులర్ ప్రిన్సిపాల్స్, ఆస్పత్రుల సూపరింటెండెంట్లను పంపింది. ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్‌లో కలిపి 56 మెడికల్ కాలేజీలున్నాయి. వాటిల్లో మొత్తం కలిపి 8,515 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 28 ఉండగా..వాటిలో 3,915 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. వీటికి అదనంగా మరో 200 సీట్లు కలవనున్నాయి. ఒక్కో కొత్త కాలేజీల్లో 50 సీట్ల కోసం అనుమతులు కోరుతూ దరఖాస్తు చేశారు. వాటిలో నాలుగింటికి అనుమతులొచ్చాయి. దీంతో సర్కారీ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 4,115కు చేరనుంది. రాష్ట్రానికి చేరుకున్న నీట్ ర్యాంకులు కాగా నీట్ రాష్ట్రస్థాయి ర్యాంకులు తెలంగాణకు చేరుకున్నాయి. ఈ మేరకు కాళోజీ విశ్వవిద్యాలయవర్గాలు ఢిల్లీకి వెళ్లి ఆ డేటాను తీసుకొచ్చాయి. ఆ డేటాను విశ్లేషించి రాష్ట్రస్థాయి ర్యాంకులు తయారు చేసి శనివారం విడుదల చేసే అవకాశముంది. -
కేరళలో నిఫా వైరస్ కలకలం.. బాలుడు మృతి
కేరళ: కేరళలో నిఫా వైరస్ కలకలం రేపుతోంది. నిఫా ఇన్ఫెక్షన్తో చికిత్స పొందుతున్న 14 ఏళ్ల బాలుడు ఆదివారం మరణించాడు. ఆదివారం ఉదయం బాలుడికి గుండెపోటు వచి్చందని, అతడిని బతికించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని, 11.30 గంటలకు మృతి చెందాడని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. బాలుడు చికిత్స పొందుతున్న కోజికోడ్ మెడికల్ కాలేజీలో ప్రస్తుతం ముగ్గురు వ్యక్తులు ఐసోలేషన్‌లో ఉన్నారని తెలిపారు. అయితే 246 మంది బాలుడితో కాంటాక్ట్ అయ్యారని, వారిలో 63 మంది హై–రిస్క్ కేటగిరీ కింద ఉన్నారని తెలిపింది. నిఫా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేరళకు తమ పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. -
పేద విద్యార్థులకు తీవ్ర నష్టం.. YS జగన్ ఉన్నత లక్ష్యానికి బాబు ఉరి..
-
జగన్ ఉన్నత లక్ష్యానికి బాబు ఉరి
రాష్ట్ర విభజన అనంతరం 2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక జిల్లాకు ఒక వైద్య కళాశాల మంజూరు చేయాలని అసెంబ్లీలో సభ్యులు కోరగా.. ‘రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఏమీ బాగోలేదు.ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు సాధ్యపడదు. ప్రైవేటు వైద్య కళాశాలలకు అనుమతులు ఇస్తున్నాం’ అంటూ అప్పటి వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కరాఖండిగా తేల్చి చెప్పారు. ఒక్క వైద్య కళాశాలకే అప్పట్లో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని బూచీగా చూపి చేతులెత్తేశారు. ప్రైవేటు కళాశాలల ద్వారా దోపిడీకి తెరలేపారు. అలాంటిది కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఆర్ధిక పరిస్థితి కుదేలైనప్పటికీ, ఆ సంక్షోభాన్ని అధిగమించి ఏకంగా 17 కళాశాలల నిర్మాణం ప్రారంభించిన ఘనత ఒక్క వైఎస్ జగన్‌కే దక్కుతుంది. వైఎస్ జగన్ దీక్ష, దక్షతలకు ఈ కళాశాలలు ఓ నిదర్శనం.సాక్షి, అమరావతి: వైద్య విద్యనభ్యసించాలన్న అభిలాష ఉండి, ప్రైవేటు కాలేజీల్లో లక్షల రూపాయల ఫీజులు కట్టలేక తల్లడిల్లే విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ప్రభుత్వ రంగంలోనే వైద్య విద్యనందించి, వారి కలను సాకారం చేయాలన్నది వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్ష. అందుకే 2019లో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా రాష్ట్రవ్యాప్తంగా రూ.8,480 కోట్లతో 17 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణాన్ని చేపట్టారు. వీటి ద్వారా రాష్ట్రంలోని నిరుపేద, మధ్య తరగతి పిల్లల వైద్య విద్య కల నెరవేరుతుంది. అంతేకాదు.. పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు కూడా అందుబాటులోకి వస్తాయి. దేశంలో ఏ ముఖ్యమంత్రీ సాహసం చేయలేని ఈ మహోన్నత లక్ష్యాన్ని సాధించేందుకు వైఎస్ జగన్ ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టారు. మరోపక్క నాడు–నేడు ద్వారా ఇప్పుడున్న ప్రభుత్వాస్పత్రులను బలోపేతం చేయడంతో పాటు, ఆస్పత్రుల్లో వైద్యులు, ఇతర సిబ్బంది కొరతకు తావు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అసూయ, పేద వర్గాలపై ఆయనకున్న ద్వేషానికి రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య విద్య బలవుతోంది.2,550 ఎంబీబీఎస్ సీట్లు సమకూర్చేలా 2019 నాటికి రాష్ట్రంలో ఉన్నవి 11 ప్రభుత్వ వైద్య కళాశాలలే. వీటిలో 2,185 ఎంబీబీఎస్ సీట్లు ఉండేవి. ఇవి పేద, మధ్య తరగతి వర్గాల విద్యార్థులకు సరిపోవు. ఈ వర్గాల తల్లిదండ్రులు ప్రైవేటు కళాశాలల్లో లక్షల రూపాయల ఫీజులు కట్టలేక తమ పిల్లల్ని వేరే కోర్సుల్లో చేరి్పంచేవారు. వారి కలలను నిజం చేయడానికి వైఎస్ జగన్ కొత్తగా 2,550 సీట్లను సమకూర్చే లక్ష్యంతో 17 కొత్త కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నిధులు సమకూర్చారు. నిర్మాణాలూ వేగంగా చేశారు. దీంతో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా 2023–24 విద్యా సంవత్సరంలో ఒకేసారి 5 కళాశాలలను ప్రారంభించారు. విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలల ద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లను అందుబాటులోకి తెచ్చారు. ఉత్తరాంధ్రలో వెనుకబడిన విజయనగరం జిల్లాకూ వైద్య కళాశాల రావడంతో ఆ ప్రాంత విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. 1979లో ఏర్పాటైన ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఇదే తొలి ప్రభుత్వ వైద్య కళాశాల. దీంతో ఈ జిల్లా ప్రజలు మెరుగైన వైద్యం కోసం వ్యయప్రయాసలకోర్చి విశాఖపట్నంకు వెళ్లాల్సిన అవసరం తప్పింది. ఈ విద్యా సంవత్సరంలో పులివెందుల, మదనపల్లె, మార్కాపురం, ఆదోని, పాడేరు కళాశాలలను ప్రారంభించాల్సి ఉంది. ఇందుకోసం గత ఏడాది నుంచే వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అన్ని చోట్లా ఏపీవీవీపీ ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా అభివృద్ధి చేసింది. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధనలకు అనుగుణంగా పోస్టుల భర్తీ చేపట్టింది. మొదటి ఏడాది ఎంబీబీఎస్ విద్యార్థుల అకడమిక్ కార్యకలాపాల కోసం లెక్చర్ హాల్, ల్యాబ్, వసతి కోసం హాస్టల్స్, క్యాంటిన్ ఇలా వివిధ నిర్మాణాలు చేపట్టింది. ఎన్నికల ఫలితాలు వెలువడేనాటికి 80 శాతం మేర నిర్మాణ పనులు పూర్తయ్యాయి. క్రెడిట్ జగన్‌కే దక్కుతుందనిఈ ఏడాది మరో 5 కొత్త కళాశాలలు ప్రారంభమైతే ఆ ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుంది. ఈ విషయాన్ని గ్రహించిన సీఎం చంద్రబాబు అధికారాన్ని చేపట్టగానే వైద్య కళాశాలల ఏర్పాటు అంశాన్నే విస్మరించారు. దీంతో గత నెల 25న ఎన్ఎంసీ ఐదు కళాశాలల్లో తనిఖీలు చేసి, అనుమతులు నిరాకరించింది. దీనివల్ల రాష్ట్ర విద్యార్థులకు అదనంగా రావాల్సిన 500 సీట్లు నిలిచిపోయాయి. రాష్ట్రంలో ఉన్నది కేంద్రంలో అధికారంలోఉన్న బీజేపీ భాగస్వామిగా ఉన్న కూటమి ప్రభుత్వం. పైగా, రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ బీజేపీ నేతే. కేంద్రంలోనూ టీడీపీ అధికారాన్ని పంచుకుంటోంది. ఇలా ఇన్ని అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ కనీసం వైద్య కళాశాలలకు అనుమతులు కూడా రాబట్టలేకపోయింది చంద్రబాబు ప్రభుత్వం. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక ప్రభుత్వం ఏర్పాటు కాక ముందే సీఎస్ మార్పు, ఇతర అధికారులను పక్కన పెట్టడంపై పెట్టిన శ్రద్ధ ప్రజారోగ్యంతో ముడిపడి ఉన్న వైద్య కళాశాలలపై ఇసుమంతైనా చూపలేదు. అన్ని వసతులను, 70 నుంచి 90 శాతం మేర వైద్య, వైద్యేతర సిబ్బందిని అందుబాటులో ఉంచింది. కొత్త ప్రభుత్వం మిగిలిన వైద్యులు, సిబ్బందిని నియమించి ఉంటే కళాశాలలకు తప్పనిసరిగా అనుమతులు లభించి ఉండేవని వైద్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ కాస్త పనినీ చంద్రబాబు సర్కారు ఉద్దేశపూర్వకంగా విస్మరించడం వల్ల రాష్ట్రానికి నష్టమే జరిగింది. ఎన్ఎంసీ అనుమతుల నిరాకరణపై అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఇప్పటికీ ఉంది. ఇందుకు వైద్య శాఖ సిద్ధంగానే ఉంది. అయినా చంద్రబాబు ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో ఆ ప్రక్రియా నిలిచిపోయింది. ప్రభుత్వ తీరు చూస్తే వచ్చే ఏడాది ప్రారంభించాల్సిన మిగిలిన ఏడు కళాశాలలనూ అటకెక్కిస్తారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ప్రభుత్వ కళాశాలలపై చంద్రబాబు అసహనం ఎప్పుడూ ప్రైవేటు వైపే మొగ్గు చూపే సీఎం చంద్రబాబుకు పేద, మధ్య తరగతుల ఊసే పట్టదు. టీడీపీ అధికారంలో ఉండగా రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఒక్క వైద్య కళాశాలా నిర్మించిన దాఖలాలు లేవు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చొరవతో రిమ్స్‌ల రూపంలో కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటయ్యాయి. ఆ తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్ పాలనలోనే ప్రభుత్వ రంగంలో వైద్య విద్యకు అత్యంత ప్రాధాన్యం దక్కింది. ప్రభుత్వమే ఇన్ని వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడాన్ని చంద్రబాబు అప్పుడు, ఇప్పుడు కూడా జీర్ణించుకొలేరు. ఇటీవల వైద్య కళాశాలలపై జరిగిన సమీక్షలో ఆయన తీరు స్పష్టంగా ప్రదర్శితమైనట్లు సమాచారం. వైద్య కళాశాలల కోసం రూ.8 వేల కోట్లకు పైగా బడ్జెట్ ఏమిటంటూ చంద్రబాబు ఈ సమావేశంలో ఉన్నతాధికారులపై అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అన్ని నిధులు ఎక్కడి నుంచి తీసుకుని వస్తారని రివర్స్‌లో సీఎం ప్రశ్నించడంతో అధికారులు విస్తుబోయారని సమాచారం. డబ్బున్నవారికే విద్య సొంతమయ్యేలా పేదలు, మధ్యతరగతి వర్గాలకు ఉన్నత చదువులు దక్కకూడదనే విధంగానే టీడీపీ, చంద్రబాబు తీరు ఉంటుందన్నది అందరికీ తెలిసిన విషయమే. డబ్బున్న వారికే వైద్య విద్య సొంతమయ్యేలా 2019కు ముందు టీడీపీ పాలనలో తీసుకున్న నిర్ణయాలే ఇందుకు నిదర్శనం. అప్పట్లో పేద, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ఎంబీబీఎస్ చదివిన వారు పీజీ కోర్సులు చేయడానికి వీల్లేని పరిస్థితులు సృష్టించారు. పీజీ కోర్సుల ఫీజులను అమాంతంగా పెంచేశారు. యాజమాన్య కోటా అటుంచితే కన్వీనర్ కోటా సీట్లు కూడా పేద, మధ్య తరగతికి దక్కకుండా ఫీజులను పెంచారు. అప్పటివరకూ కన్వీనర్ కోటాలో క్లినికల్ డిగ్రీ/డిప్లొమా కోర్సుల్లో ప్రైవేట్ కళాశాలల్లో రూ. 2.90 లక్షలుగా ఉన్న ఫీజును, 2017–18లో ఏకంగా రూ.6.90 లక్షలకు పెంచారు. యాజమాన్య కోటా ఫీజను రూ.5.25 లక్షల నుంచి రూ.24.20 లక్షలకు పెంచారు. దీంతో పేద విద్యార్థులకు కన్వీనర్ కోటా కూడా దక్కకుండా పోయింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ ప్రైవేట్ కళాశాలల్లో పీజీ మెడికల్ కోర్సుల ఫీజులను 40 నుంచి 50 శాతం వరకు తగ్గించారు. నిరుపేద, మధ్యతరగతి వారికి భారీ ఊరట కల్పించి అండగా నిలిచారు. -
అధికారంలోకి వచ్చాక ప్లేట్ ఫిరాయించిన చంద్రబాబు సర్కార్
-
మెడికోలకు వెన్నుపోటు
సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో ప్రభుత్వమే ఎంబీబీఎస్ సీట్లను అమ్మడం దారుణం. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక నిరుపేదలకు ఆ సీట్లను అందజేస్తాం. అధికారంలోకి వచ్చాక మొదటి వంద రోజుల్లో జీవోలను రద్దు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఈ సీట్లను అందేలా చూస్తాను. – 2023 ఆగస్టు 16న మంగళగిరిలో నారా లోకేశ్ ప్రభుత్వం వైద్య కళాశాలల్లో మెడికల్ సీట్లను అమ్ముకోవడం చాలా దురదృష్టకరం. ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర వర్గాలకు ఇవ్వాల్సిన సీట్లను డబ్బులకు అమ్ముకోవడం అన్యాయం. – 2023 అక్టోబర్ 4వ తేదీన కృష్ణా జిల్లాపెడనలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు తీరు ఏరు దాటాక తెప్ప తగలేసినట్లుంది. హామీలకు తిలోదకాలిచ్చే పరంపరలో భాగంగా తాజాగా యువతకు రాష్ట్ర ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు ఇ చ్చిన హామీకి తూట్లు పొడిచింది. నేటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంబీబీఎస్ సీట్లను అమ్మడం దురదృష్టకరం అని గతంలో చిలక పలుకులు పలికారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లకు సంబంధించిన 107, 108 జీవోలను రద్దు చేస్తామని ప్రస్తుత విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ గతంలో ప్రగల్భాలు పలికారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేయబోమంటూ శుక్రవారం హైకోర్టులో ప్రభుత్వం స్పష్టం చేయడం ద్వారా యువతను దగా చేసింది. దీంతో తమ పిల్లలను డాక్టర్లుగా చూసుకోవాలనే కోరిక ఉండే పేద, మధ్యతరగతి తల్లిదండ్రులు, విద్యార్థులు వీరి మాయమాటలు నమ్మి మోసపోయారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటులో భాగంగా గత విద్యా సంవత్సరం నంద్యాల, మచిలీపట్నం, రాజమండ్రి, ఏలూరు, విజయనగరం కళాశాలలను సీఎం జగన్ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ క్రమంలో ఆయా కళాశాలల్లో 50 శాతం సెల్ఫ్ ఫైనాన్స్ కోటాగా నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని అప్పట్లో టీడీపీ, జనసేన పారీ్టలు తీవ్రంగా వ్యతిరేకించాయి. సెల్ఫ్ ఫైనాన్స్ కోటాను రద్దు చేయాలంటూ టీడీపీ నాయకులు, ఆ పార్టీ శ్రేణులు అప్పట్లో నిరసనలు వ్యక్తం చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఈ జీవోలను రద్దు చేస్తామని నమ్మించి ఓట్లు వేయించుకుని.. తీరా గద్దెనెక్కాక మాట తప్పారు. ఇ చ్చిన హామీ నెరవేర్చాలి సెల్ఫ్ ఫైనాన్స్ ఎంబీబీఎస్ సీట్ల విధానాన్ని టీడీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. నారా లోకేశ్ సహా పలువురు ముఖ్య నాయకులు ఈ విధానాన్ని రద్దు చేస్తామన్నారు. ఈ క్రమంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలి. నీట్ మార్కుల ఆధారంగా ప్రతిభ కలిగిన విద్యార్థులకు కొత్త వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లను కేటాయించాలి. – డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు,రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ -
వైద్య కాలేజీల్లో 607 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ వైద్య విద్యా సంస్థల్లో ఉద్యోగ ఖాళీల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. విద్యాసంవత్సరం ప్రారంభమయ్యేలోపు కీలక కేడర్లలో ఖాళీలను భర్తీ చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖను ఆదేశించింది. ఈ మేరకు 36(8 కొత్త మెడికల్ కాలేజీలతో కలిపి) ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని 607 ఖాళీల భర్తీకి అనుమతి ఇచ్చి0ది. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 34 డిపార్ట్మెంట్లలో ఈ ఖాళీలు ఉన్నాయి. అత్యధికంగా గైనకాలజీ విభాగంలో 90 పోస్టులు ఉండగా, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలో కలిపి 85 పోస్టులకుపైగా ఉన్నాయి. మిగిలిన డిపార్ట్మెంట్లలో పరిమిత సంఖ్యలో పోస్టులున్నాయి. అకాడమిక్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కులు, కాంట్రాక్ట్ సర్వీస్ వెయిటేజీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. 435 ఎంబీబీఎస్ డాక్టర్ పోస్టులకు 2,400 దరఖాస్తులుప్రభుత్వ దవాఖాన్లలోని 435 ఎంబీబీఎస్ (సివిల్ అసిస్టెంట్ సర్జన్) డాక్టర్ పోస్టుల భర్తీకి ఇటీవల మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 11వ తేదీ సాయంత్రానికి అప్లికేషన్ల గడువు ముగియనుంది. బుధవారం నాటికి సుమారు 2400 మంది డాక్టర్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇంకో వెయ్యి దరఖాస్తులు వరకూ వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది ఒక్కో పోస్టుకు ఐదుగురు డాక్టర్లు దరఖాస్తు చేయగా, ఈసారి ఒక్కో పోస్టుకు 7 నుంచి 8 అప్లికేషన్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రైవేటు ప్రాక్టీస్‌పై బ్యాన్ పెట్టినప్పటికీ, ప్రభుత్వ సర్వీసులోకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తుండడం గమనార్హం. -
కొత్త మెడికల్ కాలేజీలకు నో
సాక్షి, హైదరాబాద్: కొత్త మెడికల్ కాలేజీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) ఝలక్ ఇచ్చింది. మొత్తం 8 మెడికల్ కాలేజీలకు అనుమతి లేఖ (లెటర్ ఆఫ్ పర్మిషన్ – ఎల్వోపీ) ఇవ్వడానికి నిరాకరించింది. ఈ మేరకు ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లకు మెయిల్ పంపించింది. మౌలిక సదుపాయాలు లేకపోగా, అనేక లోపాలు ఉన్నట్లు గుర్తించడంతో అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేసింది. సౌకర్యాలు సరిగాలేని కొత్త కాలేజీలకు అనుమతులు ఇవ్వబోమని తేల్చి చెప్పింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో కొత్తగా గద్వాల, నారాయణపేట, ములుగు, మెదక్, యాదాద్రి భువనగిరి, వరంగల్ జిల్లా నర్సంపేట, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కుత్బుల్లాపూర్‌లో వైద్య కళాశాలల కోసం గతేడాది ప్రభుత్వం దరఖాస్తు చేసింది. ఒక్కో కాలేజీలో 50 ఎంబీబీఎస్ సీట్లతో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం తనిఖీలకు వచ్చిన ఎన్ఎంసీ బృందం బోధనా సిబ్బంది లేకపోవడం (జీరో ఫ్యాకల్టీ)పై ఆగ్రహం వ్యక్తం చేసింది. కొత్త మెడికల్ కాలేజీల అనుబంధ ఆస్పత్రుల్లో ఔట్ పేషెంట్ల, ఇన్‌పేషెంట్లు విషయమై కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. కొన్ని బోధనాస్పత్రుల్లో ఓపీ బాగానే ఉన్నప్పటికీ, ఐపీ మాత్రం ఎన్ఎంసీ నిబంధనల మేరకు లేదు. ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం 50 సీట్లతో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలంటే.. 14 మంది ప్రొఫెసర్లు, 20 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 25 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలి. అలా ఒక్కో కాలేజీకి మొత్తం 59 మంది అధ్యాపక సిబ్బంది ఉండాలి. కానీ రాష్ట్ర కాలేజీల్లో ప్రిన్సిపాళ్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్ మినహా మిగతా సిబ్బంది లేరు. అలాగే నిబంధనల ప్రకారం సీనియర్ రెసిడెంట్ వైద్యులు కూడా ఉండాలి. కానీ వాళ్లు లేకుండానే కాలేజీల ఏర్పాటు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లారు. కాగా ఎన్ఎంసీ లేవనెత్తిన లోపాలను రాష్ట్ర ప్రభుత్వం 60 రోజుల్లోగా సవరించుకోవాలి. లేనిపక్షంలో అనుమతులివ్వదు. కాగా ఈ విషయంపై డీఎంఈ డాక్టర్ వాణి ‘సాక్షి’కి వివరణ ఇచ్చారు. లెటర్ల కోసం ఎదురుచూస్తున్నామని, అవి అందిన తర్వాత అప్పీలుకు వెళ్తామని తెలిపారు. బోధనా సిబ్బంది లేరు.. వసతుల్లేవు రాష్ట్రంలో 29 ప్రైవేటు వైద్య కళాశాలలు కలిపి మొత్తం 56 మెడికల్ కాలేజీలున్నాయి. వీటిల్లో 8,490 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ప్రైవేట్ కాలేజీల్లో 3,790 సీట్లు ఉండగా ఎక్కువ కాలేజీల్లో 150 చొప్పున మాత్రమే ఉన్నాయి. వీటిల్లో మౌలిక వసతులు, అధ్యాపకులు, రోగుల వివరాలన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. అనేకచోట్ల పూర్తిస్థాయిలో బోధనా సిబ్బంది లేకపోవడంతో విద్యార్థులు తరగతులు లేక ఖాళీగా ఉంటున్నారు. ఔట్ పేషెంట్లు రాకపోవడంతో పీజీ విద్యార్థులు ప్రాక్టికల్ శిక్షణ పొందలేకపోతున్నారు. కొందరు విద్యార్థులు ఎంబీబీఎస్ విద్యను తూతూ మంత్రంగా పూర్తి చేస్తున్నారు. కొందరు పీజీ మెడికల్ కోసం కోచింగ్‌లకు వెళ్తున్నారు. ఏదో పరీక్ష పాసైతే చాలన్న అభిప్రాయం అటు విద్యార్థులు, ఇటు కాలేజీల యాజమాన్యాల్లోనూ నెలకొందనే విమర్శలు విని్పస్తున్నాయి. వాస్తవానికి వసతులు లేవని విద్యార్థులు కూడా బయటకు చెప్పలేని స్థితిలో ఉన్నారు. చెప్పినా, నిరసన వ్యక్తం చేసినా ప్రాక్టికల్ పరీక్షలో తక్కువ మార్కులు వేస్తారన్న భయం వారిలో ఉంటోంది. గతంలోనే ఎన్ఎంసీ గరం ప్రైవేట్‌తో పాటు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోనూ అనేకచోట్ల ఇటువంటి పరిస్థితి ఉంటోందని ఎన్ఎంసీ గతంలో కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని చాలా ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 50 శాతం వరకు అధ్యాపకుల కొరత ఉందని ఎన్ఎంసీ గతంలోనే తేల్చడం గమనార్హం. 150 ఎంబీబీఎస్ సీట్లున్న మెడికల్ కాలేజీ అనుబంధ ఆసుపత్రికి రోజుకు 1,200 మంది ఔట్పేòÙంట్లు ఉండాలి. కానీ ఒక చాలా కాలేజీల్లో సగం మేరకు కూడా ఔట్ పేషెంట్లు రావడంలేదు. ఇది వైద్య శిక్షణకు ఏమాత్రం సరిపోదని నిపుణులు అంటున్నారు. ఇక మెడికల్ కాలేజీ ఆసుపత్రికి 600 పడకలు అవసరం కాగా, చాలాచోట్ల 500–550తోనే నడిపిస్తున్నారు. కొన్ని ఆసుపత్రుల్లో బెడ్ ఆక్యుపెన్సీ కేవలం 10 శాతం వరకే ఉంటోంది. వైద్య విద్యకు ఇది ఏమాత్రం సరిపోదని చెబుతున్నారు. లెక్చర్ హాళ్లు, పరీక్షా కేంద్రాలు అవసరమైన సంఖ్యలో లేవు. మెడికల్ కాలేజీల్లో బాలికలు, బాలురకు వేర్వేరుగా 450 మందికి సరిపోయేలా హాస్టల్ వసతి ఉండాల్సి ఉండగా, 150 మంది బాలికలు, 190 మంది బాలురకు సంబంధించిన హాస్టల్ వసతి మాత్రమే ఉంది. కొన్ని కాలేజీల్లో ఎంబీబీఎస్, పీజీ విద్యార్థుల శిక్షణ కోసం అవసరమైన అల్ట్రాసౌండ్ యంత్రాలు కూడా లేకపోవడం గమనార్హం. -
విద్యార్థుల ఆశలపై నీళ్లు
సాక్షి, అమరావతి: అనుకున్నంతా అయింది.. రాష్ట్రంలో ఈ ఏడాది ప్రారంభించాల్సి ఉన్న ఐదు కొత్త ప్రభుత్వ కళాశాలల ప్రారంభంపై నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) నీళ్లుజల్లింది. ఈ ఏడు తరగతులు ప్రారంభించుకునేందుకు అనుమతివ్వలేదు. దీంతో వీటిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. వీటికి అనుమతులు సాధించడంలో టీడీపీ–జనసేన–బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపెట్టకపోవడమే కారణమని వైద్యశాఖ వర్గాల్లో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది.ఉద్దేశపూర్వకంగానే ఈ కొత్త కళాశాలల ప్రారంభానికి చంద్రబాబు మోకాలడ్డారన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. నిజానికి.. 2024–25 విద్యా సంవత్సరం నుంచి పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పాడేరులలో ఈ కళాశాలలు ప్రారంభించడానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం బాటలు వేసింది. ఇందులో భాగంగా.. ఈ ఐదుచోట్ల ఏపీ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ) ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా అభివృద్ధి చేయడంతో పాటు, వైద్య కళాశాలలు ప్రారంభించడానికి వీలుగా పోస్టులను మంజూరుచేసి భర్తీ ప్రక్రియ చేపట్టింది. కానీ, ఎన్నికల అనంతరం ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోలేదు. కనీసం చర్చించని బాబు సర్కారు.. గత నెల 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. జూన్ 25న వైద్య కళాశాలల్లో ఎన్ఎంసీ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. సీఎంగా బాధ్యతలు స్వీకరించి ప్రభుత్వం ఏర్పాటుచేయడానికంటే ముందే సీఎస్ నియామకం, ఇతర అధికారుల మార్పు చేపట్టారు. ఈ అంశాలపై ఫోకస్ పెట్టిన బాబు అండ్ కో ప్రజల భవిష్యత్తు వైద్య అవసరాలు, విద్యార్థుల ఆకాంక్షలతో ముడిపడి ఉన్న వైద్య కళాశాలల ప్రారంభంపై మాత్రం దృష్టిపెట్టలేదు. పైగా.. సీఎం హోదాలో ఈనెల 3న వైద్యశాఖపై బాబు తొలి సమీక్ష నిర్వహించారు.ఇందులో కూడా వైద్య కళాశాలల అంశాన్ని చర్చించలేదు. మరోవైపు.. తనిఖీల అనంతరం కళాశాలలతో వర్చువల్‌గా సమావేశం నిర్వహించిన ఎన్ఎంసీ పలు లోపాలపై రాష్ట్ర అధికారుల నుంచి వివరణ కోరింది. అడ్మిషన్లు ప్రారంభించే నాటికి తొలి ఏడాది విద్యార్థులకు తరగతులు నిర్వహించడానికి వీలుగా కళాశాలల్లో ల్యాబ్, లెక్చర్ హాల్, హాస్టళ్లు అందుబాటులో ఉంటే సరిపోతుంది. ఐదుచోట్ల 80 శాతం మేర ఈ సదుపాయాలున్నాయి. ఇంటీరియర్ పనులు, పలు పరికరాలను సమకూరిస్తే సరిపోతుంది. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో తరగతులు ప్రారంభమయ్యే అవకాశమున్నందున ఈలోపు వసతులను కలి్పంచడానికి వీలుంటుంది.కానీ, ఈ అంశాలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో చర్చించి ఒప్పించే ప్రయత్నం చేయలేదు. పైగా.. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అయ్యుండి చంద్రబాబు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. మరోవైపు.. ఈ కళాశాలల్లో పూర్తిస్థాయిలో ఫ్యాకల్టీని నియమించడానికి సీఎం జగన్ ప్రభుత్వం పలు దఫాలుగా నోటిఫికేషన్లు ఇచి్చంది. నగరాలకు దూరంగా ఉన్న క్రమంలో పలు స్పెషాలిటీల్లో వైద్యులు ముందుకు రానందున ప్రత్యేక ప్రోత్సాహకాలిస్తామని కూడా ప్రకటించింది.ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక మూడు వారాలు.. సీఎం ప్రమాణ స్వీకారం అయ్యాక రెండు వారాల పాటు సమయం ఉన్నప్పటికీ ఈ కొత్త వైద్య కళాశాలల ప్రారంభం గురించి పైస్థాయిలో ఏమాత్రం చర్చించలేదు. అలా చర్చించి అనుమతులు రాబట్టడానికి ఫ్యాకల్టీ కొరతను అధిగమించేలా చర్యలు తీసుకుని ఉంటే బాగుండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సూపర్ స్పెషాలిటీ వైద్యం చేరువే లక్ష్యంగా.. రాష్ట్ర ప్రజలందరికీ సూపర్ స్పెషాలిటీ వైద్యం చేరువ చేయడంతో పాటు, విద్యార్థులకు వైద్య విద్యావకాశాలను పెంచడమే లక్ష్యంగా రూ.8 వేల కోట్లకు పైగా నిధులతో 17 కొత్త వైద్య కళాశాలల నిర్మాణానికి గత సీఎం జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఓ వైపు కళాశాలల నిర్మాణం చేపడుతూనే విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల కళాశాలలను గత విద్యా సంవత్సరంలో ప్రారంభించింది. వందేళ్ల చరిత్రలో తొలిసారిగా ఒకే ఏడాది 750 ఎంబీబీఎస్ సీట్లను సమకూర్చింది. ఈ ఏడాది ఐదు కళాశాలలను, మిగిలిన ఏడు కళాశాలలను 2025–26లో ప్రారంభించేలా ప్రణాళిక రచించింది. అనుమతులు వస్తే 500 సీట్లు..ఇదిలా ఉంటే.. ఐదు కళాశాలలకు అనుమతులు లభిస్తే ఒక్కోచోట 100 చొప్పున 500 ఎంబీబీఎస్ సీట్లు కొత్తగా సమకూరేవి. 10 లక్షల జనాభాకు వంద సీట్లు అనే నిబంధనను గత ఏడాది ఎన్ఎంసీ ప్రవేశపెట్టింది. అలాగే, కళాశాలలకు అనుమతులు మంజూరు కోసం కొత్త నిబంధనలను తీసుకొచి్చంది. దీంతో రాష్ట్రం నుంచి ఐదు వైద్య కళాశాలలకు దరఖాస్తు చేయడానికి కూడా వీల్లేని పరిస్థితి నెలకొనడంతో అప్పట్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేంద్రంతో చర్చలు జరిపి, నిబంధనల నుంచి మినహాయింపు తెచ్చుకుని దరఖాస్తు చేసింది.అదే విధంగా.. 2023–24లో విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలల ప్రారంభ సమయంలో కేంద్రంతో సంప్రదింపులు జరిపి, వంద శాతం 750కు గాను 750 ఎంబీబీఎస్ సీట్లను రాబట్టింది. తొలివిడత తనిఖీల్లో విజయనగరం మినహా, మిగిలిన నాలుగు కళాశాలలకు అప్పట్లో అనుమతులు రాలేదు. భవనాలు, హాస్టళ్లు సిద్ధంగా లేకపోవడంతో పాటు, పలు అంశాల్లో కొరత ఉందని నిరాకరించారు. కానీ, అడ్మిషన్లు ప్రారంభమయ్యే నాటికి అన్ని వసతులు కలి్పస్తామని ఎన్ఎంసీకి హామీ ఇవ్వడం ద్వారా రెండో విడత తనిఖీల్లో అనుమతులను రాబట్టారు. ప్రస్తుతం కూడా అనుమతుల నిరాకరణపై అప్పీల్‌కు అవకాశం ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపకపోతే విద్యార్థులకు తీవ్రనష్టం జరిగే అవకాశముంది. -
ఓ వైపు జూడాల సమ్మె.. మరో వైపు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి,హైదరాబాద్ : ఓ వైపు తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సమ్మె నిర్వహిస్తుండగా.. మరో వైపు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు మెడికల్ కాలేజీల అభివృద్ది కోసం భారీ మొత్తంలో నిధుల్ని మంజూరు చేస్తూ అధికారిక ఉత్తర్వుల్ని జారీ చేసింది. తెలంగాణ మెడికల్ కాలేజీలలో సివిల్ వర్క్ కోసం రూ.204కోట్లు నిధులను విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. ఇందులో భాగంగా ఉస్మానియా మెడికల్ కాలేజీ కోసం రూ.121 కోట్లు, గాంధీ మెడికల్ కాలేజీ కోసం రూ. 79 కోట్లు, హనుమకొండ కాకతీయ మెడికల్ కాలేజ్ కోసం రూ. 6 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఆయా మెడికల్ కాలేజీలలో హాస్టల్స్ నిర్మాణల కోసం రూ.204 కోట్ల నిధులను విడుదల చేస్తూ జీవో విడుదల చేసింది. -
నీట్ కౌన్సెలింగ్.. ఇలా!
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్–అండర్ గ్రాడ్యుయేట్.. సంక్షిప్తంగా నీట్–యూజీ! దేశ వ్యాప్తంగా.. ఎంబీబీఎస్, బీడీఎస్‌తోపాటు ఆయుష్ వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పరీక్ష! కొద్దిరోజుల క్రితమే నీట్ యూజీ–2024 ఫలితాలు వెల్లడయ్యాయి. మరోవైపు ఈ పరీక్షపై వివాదం కొనసాగుతున్నా.. నీట్ కౌన్సెలింగ్‌కు సన్నాహాలు మొదలయ్యాయనే వార్తలు! ఈ నేపథ్యంలో నీట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఎలా ఉంటుంది.. ఆల్ ఇండియా కోటా, స్టేట్ కోటా సీట్ల భర్తీ విధానం.. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సీట్ల భర్తీ తీరు, నీట్ ర్యాంకర్లు కౌన్సెలింగ్‌కు సిద్ధం చేసుకోవాల్సిన పత్రాలు తదితర అంశాలపై విశ్లేషణ..‘నీట్ యూజీ–2024 ఫలితాలపై ఆందోళనలు జరుగుతున్నా.. మళ్లీ పరీక్ష నిర్వహించే అవకాశాలు తక్కువే. కాబట్టి నీట్ ఉత్తీర్ణులు ఫలితాలపై వస్తున్న వార్తల జోలికి వెళ్లకుండా.. కౌన్సెలింగ్‌కు సిద్ధమవ్వాలి’ అంటున్నారు నిపుణులు. పెరుగుతున్న సీట్లు⇒ నేషనల్ మెడికల్ కమిషన్ గణాంకాల ప్రకారం–దేశ వ్యాప్తంగా మొత్తం 783 ఎంబీబీఎస్ కళాశాలల్లో 1,61,220 సీట్లు ఉన్నాయి. వీటిలో 331 ప్రైవేట్ కళాశాలలు, డీమ్డ్ యూనివర్సిటీలు ఉండగా.. అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య 74,703. అదేవిధంగా నీట్ స్కోర్‌తోనే భర్తీ చేసే బీడీఎస్ కోర్సులో 28,088 సీట్లు, ఆయుష్ కోర్సుల్లో 52,720 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ⇒ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో.. ప్రస్తుతం 16 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2,935 ఎంబీబీఎస్ సీట్లు; మరో 16 ప్రైవేట్ కళాశాలల్లో 2,850 సీట్లు ఉన్నాయి. రెండు మైనారిటీ కళాశాలల్లో 300 సీట్లు; స్వయం ప్రతిపత్తి కలిగిన శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాలలో 175 సీట్లు ఉన్నాయి. బీడీఎస్‌కు సంబంధించి.. రెండు ప్రభుత్వ డెంటల్ కళాశాలల్లో 140 సీట్లు; 14 ప్రైవేట్ కళాశాలల్లో 1,300 సీట్లు చొప్పున ఉన్నాయి.⇒ తెలంగాణ రాష్ట్రంలో.. ఎంబీబీఎస్‌కు సంబంధించి 27 ప్రభుత్వ కళాశాలల్లో 3,790 సీట్లు; 29 ప్రైవేట్, మైనారిటీ కళాశాల్లో 4,700 సీట్లు ఉన్నాయి. బీడీఎస్‌కు సంబంధించి ఒక ప్రభుత్వ కళాశాలలో 100 సీట్లు; పది ప్రైవేట్ కళాశాలల్లో 1,000 సీట్లు; వీటికి అదనంగా సికింద్రాబాద్ ఆర్మీ డెంటల్ కళాశాలలో ఆరు సీట్లు ఉన్నాయి.పేరున్న కళాశాలలో సీటుప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లను పరిగణనలోకి తీసుకుంటే.. ఆల్ ఇండియా స్థాయిలో రిజర్వ్డ్ కేటగిరీలో రెండు లక్షల వరకు ర్యాంకు వరకూ సీట్లు పొందే అవకాశముందని అంచనా. పేరున్న ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు సొంతం చేసుకోవాలంటే మాత్రం జాతీయ స్థాయిలో 40 వేల లోపు ర్యాంకుతోనే సాధ్యమని చెబుతున్నారు.కౌన్సెలింగ్.. ఏఐక్యూ, స్టేట్ కోటానీట్ యూజీ కౌన్సెలింగ్‌ను రెండు విధానాల్లో నిర్వహించి సీట్ల భర్తీ చేపడతారు. అవి.. ఆల్ ఇండియా కోటా, స్టేట్ కోటా. ఆల్ ఇండియా కోటా సీట్ల భర్తీని డీజీహెచ్ఎస్కు చెందిన మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ నిర్వహిస్తుంది. రాష్ట్ర కోటాకు సంబంధించి.. రాష్ట్రాల వైద్య విశ్వ విద్యాలయాలు కౌన్సెలింగ్ నిర్వహిస్తాయి.ఆల్ ఇండియా కోటాజాతీయ స్థాయిలోని మెడికల్ కళాశాలలను నేషనల్ పూల్‌లోకి తీసుకెళ్లినప్పటì æనుంచి ఆల్ ఇండియా కోటా పేరుతో కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తున్నారు. ఈ విధానం ప్రకారం.. జాతీయ స్థాయిలోని అన్ని మెడికల్, డెంటల్ కళాశాలలు, యూనివర్సిటీల్లోని 15 శాతం సీట్లకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. దీనిని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డీజీహెచ్ఎస్కు చెందిన మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ చేపడుతుంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు తప్పనిసరిగా ఎంసీసీ నిర్వహించే కౌన్సెలింగ్‌కు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. ఆల్ ఇండియా కోటా విధానంలో ఒక రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు ఇతర రాష్ట్రాల్లోని వైద్య కళాశాలలకు కూడా పోటీ పడే అవకాశం లభిస్తుంది.స్టేట్ కోటా కౌన్సెలింగ్జాతీయ స్థాయిలో ఎంసీసీ కేవలం 15 శాతం సీట్లకే కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది. మిగతా 85 సీట్లను ఆయా రాష్ట్రాలు సొంతంగా కౌన్సెలింగ్ నిర్వహించి భర్తీ చేస్తాయి. ప్రభుత్వ కళాశాలల్లోని 85 శాతం సీట్లు(ఆల్ ఇండియా కోటాకు కేటాయించాక మిగిలిన సీట్లు), ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్ కోటా పేరుతో అందుబాటులో ఉండే 50 శాతం సీట్లను.. అదే విధంగా ప్రైవేట్ కళాశాలల్లో ప్రైవేట్–బి పేరిట ఉండే 35 శాతం సీట్లు, ఎన్ఆర్ఐ కోటాగా పిలిచే 15 శాతం సీట్లను కూడా హెల్త్ యూనివర్సిటీలే కౌన్సెలింగ్ విధానంలో భర్తీ చేస్తాయి. ఇందుకోసం ప్రత్యేకంగా నోటిఫికేషన్ విడుదల చేస్తాయి. మైనారిటీ కళాశాలల్లో అందుబాటులో ఉండే సీట్లను కూడా ఆయా వర్గాలకు చెందిన విద్యార్థులతోనే భర్తీ చేస్తారు. ఈ ప్రక్రియను కూడా హెల్త్ యూనివర్సిటీలే చేపడతాయి.ఫీజులు ఇలా⇒ ఏపీలో ప్రభుత్వ కళాశాలలు, ప్రైవేట్ కళాశాలల్లో కేటగిరీ–ఎ పేరిట ఉండే కన్వీనర్ కోటాలో రూ.15 వేలు ఫీజుగా నిర్ధారించారు. ప్రైవేట్ కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటా కేటగిరీ–బి సీటుకు రూ.12 లక్షలు; పైవేట్ కళాశాలల్లో ఎన్ఆర్ఐ కోటా(కేటగిరీ–సి) సీట్లకు: రూ.36 లక్షలుగా పేర్కొన్నారు. బీడీఎస్ కోర్సుకు సంబంధించి ప్రభుత్వ కళాశాలలు, ప్రైవేట్ కళాశాలల్లో కేటగిరీ–ఎ కన్వీనర్ కోటా సీట్లకు ఫీజు రూ.13 వేలు; ప్రైవేట్ కళాశాలల్లోని కేటగిరీ–బి మేనేజ్మెంట్ సీట్లకు రూ.4 లక్షలు, ఎన్ఆర్ఐ కోటా సీట్లకు రూ.12 లక్షలు వార్షిక ఫీజుగా ఉంది. ⇒ తెలంగాణలో ప్రభుత్వ కళాశాలల్లో సీటుకు రూ.10 వేలు; ప్రైవేట్ కళాశాలల్లో కన్వీనర్ కోటా సీటుకు రూ.60 వేలు; ప్రైవేట్ కళాశాలల్లో బి–కేటగిరీ(మేనేజ్మెంట్ కోటా) సీటుకు రూ.11.55 లక్షలు–రూ.13 లక్షలుగా ఫీజు ఉంది. అదే విధంగా.. ప్రైవేట్ కళాశాలల్లో ఎన్ఆర్ఐ కోటా(సి–కేటగిరీ) సీటు ఫీజు బి కేటగిరీ సీటుకు రెండు రెట్లుగా ఉంది. బీడీఎస్ కోర్సులో.. ప్రభుత్వ కళాశాలల్లో రూ.10 వేలు; ప్రైవేట్ కళాశాలల్లో ఎ–కేటగిరీ(కన్వీనర్ కోటా) సీట్లు: రూ.45 వేలు; ప్రైవేట్ కళాశాలల్లో బి–కేటగిరీ(మేనేజ్మెంట్ కోటా) సీట్లు: రూ.4.2 లక్షలు – రూ.5 లక్షలు చొప్పున ఉన్నాయి. ప్రైవేట్ కళాశాలల్లో సి–కేటగిరీ(ఎన్ఆర్ఐ కోటా) సీటుకు బి కేటగిరీ సీటుకు 1.25 రెట్లు సమానమైన మొత్తం ఫీజుగా ఉంది. ⇒ ఈ ఫీజుల వివరాలు 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించినవిగా గుర్తించాలి. కౌన్సెలింగ్ సమయానికి వీటిలో మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంది.ఏఐక్యు.. కౌన్సెలింగ్ విధానమిదే⇒ విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు ఇప్పటి నుంచే సంసిద్ధంగా ఉండాలి. జాతీయ స్థాయిలోని సీట్లకు పోటీ పడాలనుకునే విద్యార్థులు.. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ నిర్వహించే ఆన్లైన్ కౌన్సెలింగ్‌కు హాజరు కావాలి. ఇందుకోసం ఎంసీసీ వెబ్సైట్లో అందుబాటులో ఉండే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్‌ను క్లిక్ చేసి.. ఆన్లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకుని లాగిన్ ఐడీ, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. అనంతరం ఆన్లైన్ అప్లికేషన్లో ఉండే అన్ని వివరాలను నమోదు చేయాలి. ⇒ ఆ తర్వాత అందుబాటులో ఉన్న కళాశాలలు, సీట్ల వివరాలు కనిపిస్తాయి. వాటికి అనుగుణంగా తమ ప్రాథమ్యాలను పేర్కొంటూ.. ఆన్లైన్ ఛాయిస్ ఫిల్లింగ్ పూర్తి చేయాలి. ఆ తర్వాత రౌండ్ల వారీగా సీట్ అలాట్మెంట్ వివరాలను వెల్లడిస్తారు. ⇒ తొలి రౌండ్లో సీట్ అలాట్మెంట్ పొందిన అభ్యర్థులు సదరు కళాశాలలో చేరాలనుకుంటే.. నిర్దేశిత మొత్తాన్ని రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ⇒ తొలి రౌండ్లో సీటు వచ్చిన కళాశాలలో చేరడం ఇష్టం లేకుంటే.. ఫ్రీ ఎగ్జిట్ అవకాశం అందుబాటులో ఉంది. వీరు రెండో రౌండ్ కౌన్సెలింగ్‌కు హాజరవ్వచ్చు. ⇒ తొలి రౌండ్ కౌన్సెలింగ్‌లోనే సీటు లభించి ఫీజు చెల్లించిన అభ్యర్థులు మరింత మెరుగైన సీటు కోసం తదుపరి రౌండ్‌కు హాజరయ్యే అవకాశం కూడా ఉంది.స్టేట్ కోటాకు ప్రత్యేక కౌన్సెలింగ్రాష్ట్రాల స్థాయిలో హెల్త్ యూనివర్సిటీలు నిర్వహించే స్టేట్ కోటా సీట్ల కౌన్సెలింగ్‌కు విద్యార్థులు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. ఎంసీసీ కౌన్సెలింగ్ తొలి రౌండ్ ముగిసిన తర్వాత హెల్త్ యూనివర్సిటీలు ప్రత్యేకంగా నోటిఫికేషన్ విడుదల చేస్తాయి. ఈ కౌన్సెలింగ్ కూడా పలు రౌండ్లలో జరుగుతుంది. స్టేట్ కోటాకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సంబంధించి వారికి వచ్చిన ఆల్ ఇండియా ర్యాంకు ఆధారంగా ముందుగా ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్‌ను ప్రకటిస్తారు. ఈ మెరిట్ లిస్ట్‌లో చోటు సాధించిన అభ్యర్థులు నిర్దేశిత రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించి.. ఆన్లైన్లో జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. తదుపరి రౌండ్ల కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అవకాశం కూడా ఉంటుంది.పూర్తిగా ఆన్లైన్హెల్త్ యూనివర్సిటీలు నిర్వహించే కౌన్సెలింగ్ ప్రక్రియ కూడా ఆన్లైన్ విధానంలోనే ఉంటుంది. అభ్యర్థులు నోటిఫికేషన్ వెలువడిన తర్వాత నిర్దేశించిన వెబ్సైట్లో లాగిన్ ఐడీ, పాస్ట్‌వర్డ్ క్రియేట్ చేసుకోవడం, ఆ తర్వాత నీట్ ర్యాంకు సహా, ఇంటర్మీడియెట్ వరకూ.. అన్ని అర్హతల వివరాలను పేర్కొనడం, ఆన్లైన్ ఛాయిస్ ఫిల్లింగ్ తప్పనిసరి.ప్రభుత్వ కళాశాలలకే ప్రాధాన్యంనీట్లో ఉత్తీర్ణత సాధించి మెరిట్ జాబితాలో నిలిచిన అభ్యర్థులు ప్రభుత్వ కళాశాలలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏఎంసీ–విశాఖపట్నం, జీఎంసీ–గుంటూరు, కాకినాడ మెడికల్ కాలేజ్, కర్నూలు మెడికల్ కళాశాలలు ముందు వరుసలో నిలుస్తున్నాయి. తెలంగాణలో.. ర్యాంకర్ల తొలి ప్రాధాన్యం ఉస్మానియా మెడికల్ కళాశాల కాగా ఆ తర్వాత స్థానంలో గాంధీ మెడికల్ కళాశాల, కాకతీయ మెడికల్ కళాశాల, ఈఎస్ఐ మెడికల్ కళాశాల నిలుస్తున్నాయి.ఈ సర్టిఫికెట్లు సిద్ధంగానీట్ కౌన్సెలింగ్ ప్రక్రియ మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు ఇప్పటి నుంచే కౌన్సెలింగ్‌కు అవసరమైన పత్రాలు, సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోవాలి. అవి.. నీట్ ఎంట్రన్స్ అడ్మిట్ కార్డ్, నీట్ ర్యాంక్ కార్డ్, పుట్టిన తేదీ ధ్రువపత్రం, పదో తరగతి సర్టిఫికెట్, ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సు మార్క్ షీట్, సర్టిఫికెట్, ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వర్టకు స్టడీ సర్టిఫికెట్స్(స్థానికతను నిర్ధారించేందుకు), పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోగ్రాఫ్స్ ఎనిమిది. ఇలా కౌన్సెలింగ్ విధానంతోపాటు అవసరమైన అన్ని సర్టిఫికెట్లను సిద్ధంగా ఉంచుకుంటే.. కౌన్సెలింగ్ ఎప్పుడు జరిగినా తడబాటులేకుండా ముందుకు సాగే అవకాశం ఉంటుంది. -
ఏపీలో వైద్య విప్లవం.. దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయం
-
ప్రభుత్వ ఆసుపత్రిలో స్కాం పై విచారణ వేగవంతం
-
మెడికల్ కాలేజీల పై మంత్రి సత్యకుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు
-
జిల్లాకో మెడికల్ కాలేజీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పడిన తర్వాత వైద్య రంగంలో వచ్చిన మార్పు జిల్లాకో మెడికల్ కాలేజీ సాధనే అని చెప్పవచ్చు. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో 5 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. ఇందులో ఉన్న ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 700. ఉస్మానియా, గాం«దీ, వరంగల్ (కాకతీయ), ఆదిలాబాద్ (రిమ్స్) కాలేజీలు ఉండేవి. ఈ నేపథ్యంలో పేదలకు స్పెషాలిటీ సేవలు అందించడంతోపాటు, డాక్టర్ కావాలనుకునే విద్యార్థుల కలను సాకారం చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని సంకలి్పంచింది.ఇందులో భాగంగా 2016లో 4 మెడికల్ కాలేజీలు సిద్దిపేట, మహబూబ్ నగర్, నల్లగొండ, సూర్యాపేటలో ప్రారంభించారు. దీంతో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 1640కి పెరిగింది. 2021లో సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, రామగుండంలలో 8 మెడికల్ కాలేజీలు ప్రారంభం అయ్యాయి. నాటి సీఎం కేసీఆర్ వీటిని స్వయంగా ప్రారంభించి, ఒకేరోజు తరగతులు ప్రారంభించి రికార్డు సృష్టించారు.దీంతో రాష్ట్రంలో మరో 1200 ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయి. 2022లో నిర్మల్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్‌ల్లో మరో 9 మెడికల్ కాలేజీలు ప్రారంభం అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మెడికల్ కాలేజీల సంఖ్య 26కు పెరిగింది. చివరి దశగా గతేడాది మరో 8 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా... ఈ ఏడాది ఎన్ఎంసీ తనిఖీ ప్రక్రియ జరుగుతోంది. వీటికి కూడా అనుమతులు వస్తే జిల్లాకో మెడికల్ కాలేజీ పూర్తి కానున్నది. ఇక వీటికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి.గుండెపోట్ల చికిత్సకు ‘స్టెమీ’గుండెపోట్లను వెంటనే గుర్తించి చికిత్స అందించేందుకు స్టెమీ కార్యక్రమం ప్రారంభించింది. ఇందులో భాగంగా ఉస్మానియా, గాం«దీ, వరంగల్ ఎంజీఎం, రిమ్స్ ఆదిలాబాద్, ఖమ్మంలో క్యాథ్‌ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు.టీ డయాగ్నొస్టిక్స్ వ్యాధుల నిర్ధారణలో జరుగుతున్న దోపిడీని అరికట్టేందుకు టీ డయాగ్నొస్టిక్స్‌ను ప్రారంభించింది. ఇందులో 135 రకాల రోగనిర్ధారణ పరీక్షలను ఉచితంగా చేస్తారు. ఆటో అనలైజర్లు, డిజిటల్ ఎక్స్–రేలు, ఆ్రల్టాసౌండ్ స్కాన్ మెషీన్లు, 2–డి ఎకో, మామ్రోగామ్, హై ఎండ్ డయాగ్నొస్టిక్ పరికరాలు ఈ హబ్‌లో అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో పీహెచ్‌సీలు మొదలు అన్ని స్థాయిల దవాఖానాలను టీ డయాగ్నొస్టిక్స్‌కు అనుసంధానం చేసింది. దీంతో పేదలు అటు చికిత్సకు, ఇటు వ్యాధి నిర్ధారణకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా పోయింది. గర్భిణులకు చేయూత... 2017లో ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్‌తో బహుళ ప్రయోజనాలు కనిపించాయి. ప్రభుత్వ దవాఖానాల్లో పరీక్షలు, ప్రసవం చేయించుకునే మహిళలకు మూడు విడతలుగా మొత్తం రూ.12 వేలు, ఆడపిల్లల జన్మిస్తే మరో రూ.వెయ్యి అదనంగా నగదును అందించింది. అదనంగా తల్లీబిడ్డకు అవసరమయ్యే వస్తువులతో కూడిన రూ. 2 వేల కిట్‌ను అందించింది. గతేడాది చివరినాటికి దాదాపు 14 లక్షల మంది ఈ పథకంతో లబ్ధి పొందారు. అలాగే గర్భిణుల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపాలను నియంత్రించేందుకు న్యూ్రటిషన్ కిట్ల పథకాన్ని గత ప్రభుత్వం అమలు చేసింది. కొత్తగా స్పెషాలిటీ సేవలు గత ప్రభుత్వం ఏరియా, జిల్లా, సూపర్ స్పెషాలిటీ దవాఖానాలను బలోపేతం చేసింది. ముఖ్యంగా కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రతి జిల్లా కేంద్రంలోనూ జిల్లా దవాఖాన మంజూరైంది. దీంతో ప్రజలకు సమీపంలోనే స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రంలోని 27,500 పడకలకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించే కార్యక్రమం గతేడాది పూర్తయింది. సూపర్ స్పెషాలిటీ వసతుల మెరుగు కోసం హైదరాబాద్ నలువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్) పేరుతో 26 ఏప్రిల్ 2022న అల్వాల్, గడ్డి అన్నారం, ఎర్రగడ్డ ప్రాంతాల్లో టిమ్స్ నిర్మాణానికి అప్పటి సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు.ఇవి ఎయిమ్స్ మాదిరి స్వయం ప్రతిపత్తి గల వైద్య విజ్ఞాన సంస్థలుగా సేవలందించనున్నాయి. అల్వాల్‌లో 28.41 ఎకరాల్లో రూ.897 కోట్ల ఖర్చుతో, గడ్డి అన్నారంలో 21.36 ఎకరాల్లో రూ.900 కోట్ల ఖర్చుతో, ఎర్రగడ్డలో రూ.882 కోట్ల ఖర్చుతో పనులు ప్రారంభం అయ్యాయి. అదనంగా నిమ్స్‌లో 2000 సూపర్ స్పెషాలిటీ పడకల పనులు ప్రారంభం అయ్యాయి. వరంగల్‌లో 24 అంతస్తులతో హెల్త్ సిటీ నిర్మాణం తుది దశలో ఉంది. రూ.1200 కోట్ల వ్యయంతో 2021 జూన్‌లో 59 ఎకరాల్లో పనులు మొదలయ్యాయి. ఇక్కడ 34 విభాగాల్లో సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందిస్తారు. ఇవన్నీ పూర్తయితే 8,200 సూపర్ స్పెషాలిటీ పడకలు అందుబాటులోకి వస్తాయి. -
అన్ని వైద్య కళాశాలల్లోఈడబ్ల్యూఎస్ కోటా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఆర్థికంగా బలహీనమైన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్ అమలు చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఆదేశాల మేరకు ఈ ఏడాది నుంచే రిజర్వేషన్లు అమలు చేయనుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని అన్ని సీట్లలో 10 శాతం, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని (మైనారిటీ కాలేజీలు మినహా) సగం కనీ్వనర్ కోటా సీట్లలో 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం కేటాయించనున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నుంచి ఈ మేరకు అందిన ప్రతిపాదనకు ప్రభుత్వం సూత్రప్రాయ ఆమోదం తెలిపినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు 7 కాలేజీల్లోనే.. రాష్ట్రంలో ప్రస్తుతం కేవలం 7 ప్రభుత్వ వైద్య కళాశాలలు.. హైదరాబాద్‌లోని గాందీ, ఈఎస్ఐ మెడికల్ కాలేజీలు, మహబూబ్‌నగర్, నిజామాబాద్, సిద్దిపేట మెడికల్ కాలేజీలు, వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ, ఆదిలాబాద్‌లోని రాజీవ్‌గాంధీ మెడికల్ కాలేజీల్లోనే ఎన్ఎంసీ అనుమతి మేరకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలవుతున్నాయి. గతేడాది వరకు ఆయా కాలేజీల్లో 103 ఎంబీబీఎస్ సీట్లు ఈ కోటా కింద అగ్రవర్ణాల్లోని పేదలకు ఇచ్చారు. కాగా ఈ ఏడాది నుంచి అన్ని మెడికల్ కాలేజీల్లోని కనీ్వనర్ కోటా సీట్లకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌ను అమలు చేస్తే మరో 350 వరకు ఎంబీబీఎస్ సీట్లు అగ్రవర్ణ పేదలకు దక్కే అవకాశం ఉందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే దీనిపై పూర్తిస్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది. నీట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు వెలువడిన తర్వాత, అడ్మిషన్ నోటిఫికేషన్ కంటే ముందే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌కు సంబంధించిన ఉత్తర్వులు వెలువడుతాయని వైద్యశాఖ వర్గాలు వెల్లడించాయి. జనరల్ కోటా సీట్లకు గండిరాష్ట్రంలో గతేడాది వరకు 56 మెడికల్ కాలేజీల్లో 8,490 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో 27 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 3,790 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. అలాగే 29 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 4,700 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. అయితే ఇప్పటివరకు 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలుకు గాను అంతే మొత్తంలో సీట్లను ఆయా మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసీ మంజూరు చేసింది. దీనివల్ల ఇతర రిజర్వేషన్ కేటగిరీ విద్యార్థులకు కానీ, జనరల్ కేటగిరీ కోటా సీట్లకు కానీ కోత పడేది కాదు. కానీ తాజాగా ఎన్ఎంసీ అదనపు సీట్లు మంజూరు చేయడం కుదరదని, ఉన్న సీట్లలోనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయాలని ఆదేశించింది. అయితే బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఎలాంటి కోత ఉండదని అంటున్నారు. అంటే జనరల్ కేటగిరీ సీట్లకు కోత పెట్టి వాటిని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌కు కేటాయిస్తారు. అలాగైనా తమకు నష్టం జరుగుతుందని ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు అంటున్నారు. జనరల్ కేటగిరీలోనూ తమకు ప్రతిభ ప్రకారం రావాల్సిన సీట్లకు గండి పడుతుందని, దీనివల్ల తమకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ.8 లక్షల ఆదాయ పరిమితి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తించాలంటే ఆదాయం రూ.8 లక్షల లోపు ఉండాలి. ఈ మేరకు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేలా రెవెన్యూ శాఖకు ఆదేశాలున్నాయి. అన్ని మెడికల్ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలయ్యే పక్షంలో ఈ మేరకు విద్యార్థులు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాల్సి ఉంటుంది. -
వైద్య, విద్యా ప్రాప్తిరస్తు
అమలాపురం టౌన్: చేరువలో చదువుల కోవెల ఉంటే.. ఆరోగ్యానికి పూర్తి భరోసా లభిస్తే ఆ ఆనందమే వేరు. అందుకే విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యం ఇస్తోంది. పేదలకు సకల సౌకర్యాలూ కల్పిస్తోంది. ఇందులో భాగంగా జిల్లాకు ప్రభుత్వ వైద్య విద్య, ఉచిత ప్రభుత్వ వైద్య సేవలు త్వరలో మరింత చేరువ కానున్నాయి. అమలాపురం మండలం కామనగరువు, సమనస గ్రామాల సరిహద్దుల్లో రాష్ట్ర ప్రభుత్వం 54 ఎకరాలను సేకరించి రూ.450 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాలను నిర్మిస్తోంది. పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు సైతం ప్రభుత్వపరంగా వైద్య విద్యను అభ్యసించేందుకు మార్గం సుగమమవుతోంది.అమలాపురంలో ఈ వైద్య కళాశాలల నిర్మాణ పనుల వేగం పుంజుకుంది. ఇది అందుబాటులోకి వస్తే ఏటా దాదాపు 150 మెడికల్ సీట్లతో విద్యార్థులు వైద్యను అభ్యసించే అవకాశం ఏర్పడుతుంది. ఇంత వరకూ ప్రభుత్వ వైద్య విద్య కోసం ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలకు విద్యార్థులు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. అమలాపురంలో నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల అందుబాటులోకి వస్తే ఈ పరిస్థితులన్నీ దాదాపు దూరం కానున్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాల్లో ఎవరైనా వైద్య విద్య అభ్యసించాలంటే రూ.లక్షల్లో ఖర్చు అవుతుంది.ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అలాంటి విద్యార్థులకు వైద్య విద్యపరంగా జిల్లాలో ఓ భరోసాగా నిలువనుంది. ఇప్పటికే ఈ కళాశాల నిర్మాణ పనులు దాదాపు 65 శాతం పూర్తయ్యాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థకు చెందిన ఇంజినీర్లు ఈ భవనాలను త్వరితగతిన పూర్తి చేసే దిశగా శ్రమిస్తున్నారు. వచ్చే ఏడాది నాటికి మొత్తం నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉందని ఆ సంస్థ ఇంజినీర్ యోగి తెలిపారు.చకచకా సదుపాయాల కల్పనప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా జిల్లా బోధనా ఆసుపత్రిగా అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 100 పడకలతో ఉన్న ఈ ఆసుపత్రి 650 పడకలుగా జిల్లా స్థాయిలో పెద్దాసుపత్రిగా సేవలు అందించనుంది. ఇప్పటికే ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పన పనులు చకచకా జరుగుతున్నాయి. ఏరియా ఆస్పత్రిలో బోధనా ఆసుపత్రి కోసం అప్పుడే ఆపరేషన్ థియేటర్లు, కన్సల్టింగ్ వార్డులు సిద్ధమవుతున్నాయి.ఆ దిశగా యంత్ర పరికరాలు, ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాటు జరుగుతోంది. ఇక ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా ఈ బోధనా ఆసుపత్రి జిల్లా ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించనుంది. ఇప్పుడు ఆసుపత్రిలో 12 విభాగాలకు వైద్య నిపుణులు ఉంటే, అదే బోధనా ఆసుపత్రి హోదా వచ్చాక 24 విభాగాలు ఏర్పడి ఆయా విభాగాలకు ఒక్కో వైద్య నిపుణుడు అందుబాటులోకి రానున్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో వైద్య విద్యనభ్యసించే విద్యార్థులు బోధనా ఆస్పత్రిలో కూడా సేవలు అందించి తమ వైద్య విద్యను పూర్తి చేయనున్నారు. ఇప్పటికే నాడు–నేడు పథకంలో రూ.570 కోట్లతో ఏరియా ఆసుపత్రిని పూర్తి స్థాయిలో ఆధునీకరించారు. ఈ అభివృద్ధి అంతా బోధనా ఆసుపత్రి అప్‌గ్రేడ్‌కు ఉపయోగపడుతోంది.వచ్చే ఏడాదికి అంతా సిద్ధంఅమలాపురంలో నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల, బోధనా ఆసుపత్రి వచ్చే ఏడాదికి జిల్లా ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని అంచనా వేస్తున్నాం. ఏరియా ఆసుపత్రిలో బోధనా ఆసుపత్రికి అవసరమైన అన్ని సదుపాయాలూ సిద్ధమవుతున్నాయి. దీనివల్ల ప్రజలకు ఉచిత వైద్యం మరింత చేరువవుతోంది. మెడికల్ స్పెషలిస్ట్‌లు, మెడికల్ ఎక్యూప్మెంట్లు వంటి విషయాల్లో అప్‌గ్రేడ్ సదుపాయాలు వస్తాయి. –డాక్టర్ పద్మశ్రీరాణి, సమన్వయకర్త, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులు -
మరో ఐదు వైద్య ప్రభుత్వ కళాశాలల దిశగా సీఎం జగన్ అడుగులు