సాక్షి,హైదరాబాద్:పీజీ మెడికల్ సీట్ల అవకతవకలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తు ముమ్మరమైంది. ఇందులో భాగంగా తెలంగాణలో పలు మెడికల్ కాలేజీల ఆస్తులను ఈడీ తాజాగా అటాచ్ చేసింది. మల్లారెడ్డి మెడికల్ కాలేజ్,చల్మెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, ఎంఎన్‌ఆర్ మెడికల్ కాలేజీల ఆస్తులు అటాచ్ చేసింది.
కాలేజీలకు చెందిన రూ.5.34కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఇప్పటివరకు మొత్తం రూ.9.71కోట్ల మెడికల్ కాలేజీల ఆస్తులు ఈడీ అటాచ్‌లోకి వెళ్లాయి. కాళోజీ నారాయణరావు హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఫిర్యాదుపై ఈడీ దర్యాప్తు మొదలుపెట్టింది.
వరంగల్ జిల్లా మట్వాడ పోలీస్‌స్టేషేన్‌లో నమోదైన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. ప్రైవేటు మెడికల్ కాలేజీలు, కన్సల్టెంట్లు,మధ్యవర్తులతో కలిసి పీజీ సీట్లు బ్లాక్ చేసినట్లు గుర్తించారు. సాదారణ సీట్లకంటే మూడు రెట్లు అధికంగా ఫీజులు వసూలు చేసినట్లు ఈడీ ప్రాథమికంగా తేల్చింది.
Comments
Please login to add a commentAdd a comment