తెలుగు కథతో తీసిన హిందీ సినిమా.. Day 1 కలెక్షన్స్ ఎంత? | Jaat Movie Day 1 Collection Worldwide Official | Sakshi
Sakshi News home page

Jaat Collection: మైత్రీ తీసిన 'జాట్'.. తొలిరోజు వసూళ్ల పోస్టర్ రిలీజ్

Published Fri, Apr 11 2025 1:57 PM | Last Updated on Fri, Apr 11 2025 2:59 PM

Jaat Movie Day 1 Collection Worldwide Official

తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థలైన మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా నిర్మాణ సంస్థలు కలిస నిర్మించిన హిందీ సినిమా 'జాట్'(Jaat Movie). సన్నీ డియోల్ హీరోగా నటించిన ఈ చిత్రం.. నిన్న (ఏ‍ప్రిల్ 10) థియేటర్లలోకి వచ్చింది. మరి తొలి రోజు వసూళ్లు ఎంతొచ్చాయి? టాక్ ఏం వినిపిస్తుంది.

తెలుగులో ఎన్నో సినిమాల్లో కనిపించిన ఓ మాస్ కథతో తీసిన మూవీ జాట్. ఓ ఊరు మొత్తాన్ని వేధించే విలన్, అనుకోకుండా అక్కడ ల్యాండ్ అయిన హీరో, అనుకోని పరిస్థితుల్లో వీళ్లిద్దరి మధ్య ఫైటింగ్, చివరకు ఏమైందనేదే స్టోరీ.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు)

హిందీలో ఈ మధ్య సౌత్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో తెలుగు ఫ్లేవర్ కథతో జాట్ తీశారు. టాక్ అయితే పాజిటివ్ వచ్చింది. దీంతో తొలిరోజు రూ.11.6 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు (Day 1 Collection) వచ్చాయి. ఇది తక్కువ కానప్పటికీ.. సన్నీ (Sunny Deol) గత చిత్రం 'గదర్ 2'తో పోలిస్తే చాలా తక్కువ. ఎందుకంటే ఆ మూవీకి తొలిరోజు రూ.40 కోట్లు వచ్చాయి. 

ప్రస్తుతానికి హిందీలో మాత్రమే రిలీజ్ చేశారు. తెలుగులోనూ విడుదల చేస్తారనే టాక్ వచ్చింది. మరి ఈ వీకెండ్ గడిస్తే జాట్.. బాక్సాఫీస్ జాతకం ఏంటనేది బయటపడుతుంది. తెలుగు వెర్షన్ రిలీజ్ గురించి ఓ క్లారిటీ వస్తుందేమో!

(ఇదీ చదవండి: పవన్ సినిమా.. చెప్పిన టైంకి రిలీజ్ అవుతుందా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement