Mythri Movie Makers
-
‘ప్రేమిస్తావా’ మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
పుష్ప 2 రికార్డు.. సంధ్య థియేటర్లో ఎంత రాబట్టిందంటే?
పుష్ప అంటే బ్రాండ్ అని మరోసారి రుజువైంది. ఇప్పటికే రూ.1800 కోట్లకు పైగా వసూలు చేసిన పుష్పరాజ్ మరో అరుదైన రికార్డు అందుకున్నాడు. సింగిల్ స్క్రీన్‌లో అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా ఘనత సాధించాడు. ఈ విషయాన్ని మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో.. ఒక సింగిల్ స్క్రీన్‌లో అత్యధిక కలెక్షన్స్ (గ్రాస్) రాబట్టిన చిత్రంగా పుష్ప 2 నిలిచిందని ట్వీట్ చేసింది. పుష్ప 2 రికార్డుహైదరాబాద్.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య 70 ఎంఎం స్క్రీన్‌లో 'పుష్ప రూల్' ఆల్‌టైం రికార్డ్ అందుకుందని తెలిపింది. 51 రోజుల్లో ఒక కోటి 89 లక్షల 75 వేల 880 రూపాయలు వసూలు చేసిందని పేర్కొంది. సంధ్య థియేటర్లో 206 షోలకు గానూ 1,04,580 మంది చూశారని తెలిపింది. ఇకపోతే నైజాంలో పుష్ప 2 సినిమాను మైత్రీమూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు.సినిమాపుష్ప 2 సినిమా విషయానికి వస్తే.. అల్లు అర్జున్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటించారు. సుకుమార్ దర్శకత్వం వహించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్ 5న విడుదలైంది. ఈ చిత్రం ఒక్క హిందీలోనే రూ.800 కోట్లకు పైగా వసూలు చేసింది. త్వరలోనే చైనాలోనూ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.Records Breaking Rapa Rapa 🔥 #Pushpa2TheRule creates history with the highest ever gross in a single screen across Telugu states 💥🎥 Sandhya 70MM💪 206 Shows | 👥 1,04,580 Audience💰 Gross: ₹1,89,75,880 in just 51 days#HistoricIndustryHitPUSHPA2Nizam Release by… pic.twitter.com/wFTDzraAdp— Mythri Movie Distributors LLP (@MythriRelease) January 25, 2025 చదవండి: జైలుకు వెళ్లొచ్చిన హీరోయిన్‌కు సన్యాసమా? అంతా పబ్లిసిటీ కోసమే! -
మ్యాడ్ బ్యూటీ '8 వసంతాలు' టీజర్ రిలీజ్
మ్యాడ్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్న అనంతిక సానీల్కుమార్(Ananthika Sanilkumar) కొత్త సినిమా '8 వసంతాలు.' మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. మొదటి విడుదలైన గ్లింప్స్‌లో అద్భుతమైన లొకేషన్స్‌తో పాటు హీరోయిన్ ఎలివేషన్‌తో చూపిస్తే.. ఇప్పుడు టీజర్లో మంచి కంటెంట్ ఉన్న లైన్‌తో ఎమోషనల్‌గా చూపించారు ఈ చిత్రాన్ని ఫణింద్ర(Phanindra Narsetti) తెరకెక్కిస్తున్నారు. తెలుగులో సూపర్ హిట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు.(ఇదీ చదవండి: 'పుష్ప 3' ఐటెమ్ సాంగ్.. ఆ హీరోయిన్ అయితే సూపర్ హిట్టే: దేవిశ్రీ ప్రసాద్)'8 వసంతాలు'(8 Vasantalu) చిత్రం మార్షల్ ఆర్ట్స్ ప్రధానంశంగా ఉండనుంది. అమ్మాయిలు ఈ పోటీకి పనికిరారు అనే వివక్షను తొలగించే బలమైన పాత్రలో అనంతిక నటించింది. టీజర్‌తోనే సినిమాపై మంచి అంచనాలను చిత్ర యూనిట్ కల్పించింది. మ్యాడ్ మూవీలో జెన్నీ పాత్రలో అనంతిక సనీల్‌కుమార్ అదరగొట్టింది. ఇప్పుడు ఆమె మ్యాడ్ సిక్వెల్లో కూడా నటిస్తుంది. ఈ మూవీతో ఆమె చాలామంది యూత్‌కు క్రష్‌గా మారిపోయింది. కేరళకు చెందిన ఈ బ్యూటీ చిత్ర పరిశ్రమకు రాకముందిఅనంతిక సనీల్‌కుమార్ ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్. కేరళకు చెందిన ఈ ముద్దుగుమ్మ వివిధ రకాల కంటెంట్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు షేర్ చేస్తుండేది. అలా గుర్తింపు రావడంతో తెలుగులో మొదట రోజ్ మిల్క్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. అయితే, మ్యాడ్ సినిమాతో ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. అనంతికకు కర్రసాముతో పాటు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంది. ఆమెకు క్లాసికల్ డ్యాన్స్ కూడా వచ్చు. -
టాలీవుడ్ ప్రముఖుల ఇళ్లలో మూడోరోజు ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: సినీప్రముఖుల ఇళ్లలో వరుసగా మూడోరోజు ఐటీ సోదాలు (Income Tax department Raids) కొనసాగుతున్నాయి. నిర్మాతలతో పాటు నిర్మాణ సంస్థలకు ఫైనాన్స్ చేసిన వారి నివాసాలు, ఆఫీసుల్లోనూ అధికారులు తనిఖీ చేస్తున్నారు. దర్శకుడు సుకుమార్, నిర్మాత నెక్కింటి శ్రీదర్, దిల్ రాజు (Dil Raju) ఇళ్లు, కార్యాలయల్లో సోదాలు కొనసాగుతున్నాయి. పుష్ప–2 చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నివాసాల్లో, మైత్రీ మూవీస్ సంస్థ కార్యాలయాల్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి.టాలీవుడ్‌పై టార్గెట్తెలుగు సినీ నిర్మాతల నివాసాలు, కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ మంగళవారం సోదాలు మొదలుపెట్టింది. దాదాపు 55 బృందాలతో ఈ తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) చైర్మన్, నిర్మాత దిల్ రాజు ఇల్లు, కార్యాలయాలతోపాటు.. పుష్ప–2 చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నివాసాల్లో, మైత్రీ మూవీస్ సంస్థ కార్యాలయాల్లో, ప్రముఖ గాయని సునీత భర్త రామ్‌కు చెందిన మ్యాంగో మీడియా ఆఫీస్‌లోనూ సోదాలు చేశారు. పుష్ప 2 సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టిన నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యాంకు లావాదేవీలను పరిశీలించారు. వసూళ్లకు తగ్గట్లుగా ఆదాయపన్ను చెల్లించలేదని గుర్తించారు.బుధవారం నాడు సుకుమార్ ఇంటికీ ఐటీ అధికారులు వెళ్లారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన సుకుమార్‌ను నేరుగా ఇంటికి తీసుకెళ్లిన అధికారులు ఆయన బ్యాంకు లావాదేవీలు, లాకర్ల గురించి ఆరా తీశారు. గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్ ఇంట్లోనూ సోదాలు చేశారు. దిల్ రాజు కూతురు హన్సిత, సోదరుడు నర్సింహ ఇంట్లోనూ తనిఖీలు చేశారు. సంక్రాంతికి వస్తున్నాం మూవీ వారం రోజుల్లో రూ. 203 కోట్లు వసూళ్లు చేసిందని, కానీ లాభాలకు తగ్గట్లు పన్నులు చెల్లించలేదని ఐటీ శాఖ గుర్తించింది.మరోవైపు ఈ వ్యవహారంపై దిల్‌రాజు బుధవారం స్పందిస్తూ.. ఐటీ రైడ్స్ తన ఒక్కడిపైనే0 జరగట్లేదని.. ఇండస్ట్రీ మొత్తం మీద ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నట్లు తెలిపారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులు అధికారులకు సహకరిస్తున్నారని చెప్పారు. -
రెండోరోజూ ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: సినీ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారుల సోదాలు రెండోరోజూ కొనసాగాయి. ప్రముఖ నిర్మాత, తెలంగాణ చలన చిత్ర అభివృద్ధి మండలి చైర్మన్ దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌తోపాటు మైత్రీ మూవీ మేకర్స్, మ్యాంగో సంస్థల కార్యాలయాలు, కొందరు సినీ ఫైనాన్షియర్ల ఇళ్లలో మంగళవారం ఉదయం నుంచి మొదలైన సోదాలు, బుధవారం రాత్రి వరకు కొనసాగాయి. భారీ బడ్జెట్ చిత్రాలు రూపొందించే వారిపై ఐటీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. అధికారులు 55 బృందాలుగా మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో ఈ సోదాలు సాగించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో సోదాలు కొనసాగాయి. దిల్‌రాజు, ఆయన కూతురు హన్సిత, సోదరుడు శిరీష్ నివాసాల్లో సోదాలు చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయం, నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఇళ్లు, మ్యాంగో సంస్థల యజమాని యరపతినేని రామ్ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. సినీ ఫైనాన్షియర్స్ సత్య రంగయ్య, అభిషేక్ అగర్వాల్ ఇళ్లల్లోనూ సోదాలు జరిపారు. ఆయా సంస్థల బ్యాలెన్స్ షీట్స్, బ్యాంకు లావాదేవీలను అధికారులు పరిశీలించినట్లు సమాచారం. తనిఖీలు జరిగిన ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మోహరించారు. ఐటీ దాడులపై దిల్‌రాజు స్పందించారు. తన ఒక్కరి ఇళ్లు, కార్యాలయాల్లోనే సోదాలు జరగడం లేదని.. సినీ ఇండస్ట్రీ మొత్తంపై జరుగుతున్నాయని తెలిపారు. -
ఐటీ రైడ్స్ పై స్పందించిన దిల్ రాజు
తన ఇంటిపై ఐటీ శాఖ అధికారుల జరుపుతున్న సోదాలపై ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు (Dil Raju)స్పందించారు. ఐటీ రైడ్స్ తన ఒక్కడిపైన మాత్రమే జరగట్లేదని.. ఇండస్ట్రీ మొత్తం మీద ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారని ఆయన అన్నారు. వారికి తనతో పాటు తన కుటుంబ సభ్యులు మొత్తం సహకరిస్తున్నామని అని చెప్పారు. బుధవారం ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆయన మీడియాకు అభివాదం చేస్తూ పై వ్యాఖ్యలు చేశారు. కాగా, టాలీవుడ్ ప్రముఖుల ఇళ్లపై ఐటీ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం ఉదయం మొదలైన ఈ సోదాలు.. బుధవారం కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటికే దిల్‌రాజు ఇల్లు, కార్యాలయాలతోపాటు.. పుష్ప–2 చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నివాసాల్లో, మైత్రీ మూవీస్, మ్యాంగో మీడియా కార్యాలయాల్లోనూ తనిఖీలు ముమ్మరంగా చేపట్టారు.సుకుమార్ ఇంటిపై ఐటీ రైడ్స్పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్(sukumar) ఇంటిపై కూడా ఐటీ అధికారులు సోదాలు(IT Rids) నిర్వహించారు. . శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సుకుమార్‌ను ఐటీ అధికారులు నేరుగా ఇంటికి తీసుకెళ్లారు. ఆయనకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలు, లాకర్లు వంటి వివరాల గురించి ఆరా తీస్తున్నారు. పుష్ప2 చిత్రం రూ. 1850 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు ఆదాయ పన్నుశాఖ అధికారులు ఈ లెక్కలపైనే ప్రధానంగా గురి పెట్టారు.వెలుగులోకి కీలక ఆంశాలు..ఐటీ సోదాల్లో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నిర్మాణ సంస్థల ఆదాయం, పన్ను చెల్లింపు మధ్య తేడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పలు సంస్థలకు చెందిన వ్యాపార లావాదేవీల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు లాకర్లను కూడా ఐటీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. పుష్ప 2 మూవీ వసూళ్లకు తగ్గట్లుగా ఐటీ చెల్లింపులు జరగలేదని నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. అలాగే దిల్ రాజు నిర్మించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా కలెక్షన్స్ విషయంలో అవకతవకలు జరిగినట్లు వస్తుంది. ఈ సినిమా వారం రోజుల్లో రూ.203 కోట్లు వసూళ్లు సాధించినట్లు అధికారులు గుర్తించారు. అయితే వచ్చిన లాభాలకు తగ్గట్లుగా ఐటీ చెల్లింపులు జరగలేదని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పలు పత్రాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రాథమిక ఆధారాలతో కేసు నమోదు చేశాకే సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 55 బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. -
చిత్ర పరిశ్రమలో ఐటీ సోదాలు.. కీలక అంశాలు వెలుగులోకి
తెలుగు సినీ నిర్మాతల నివాసాలు, కార్యాలయాల్లో ఆదాయ పన్నుశాఖ (Income Tax Officer) అధికారులు రెండో రోజు కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఎఫ్డీసీ చైర్మన్, నిర్మాత దిల్‌రాజు ఇల్లు, కార్యాలయాలతోపాటు.. పుష్ప–2 చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నివాసాల్లో, మైత్రీ మూవీస్ సంస్థ కార్యాలయాల్లోనూ తనిఖీలు ముమ్మరంగా చేపట్టారు. సంక్రాంతి రేసులో దిల్ రాజు నిర్మించిన గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు విడుదలయ్యాయి. రీసెంట్గా మేత్రీ మేకర్స్ నిర్మించిన పుష్ప2 చిత్రం రూ. 1850 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు ఆదాయ పన్నుశాఖ అధికారులు ఈ లెక్కలపైనే ప్రధానంగా గురి పెట్టారు.ఐటీ సోదాల్లో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్వాహకులు రవిశంకర్, నవీన్‌లను తాజాగా ఐటీ అధికారులు విచారించారు. వారు నిర్మించిన పుష్ప2 మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ లాభాలను రాబట్టినట్లు ఐటీ గుర్తించింది. అయితే, వసూళ్లు తగ్గట్టుగా ఆదాయ పన్ను చెల్లింపులు జరగలేదని అధికారులు కనుగొన్నారు. అందుకోసం మైత్రి మూవీ మేకర్స్ బ్యాంక్ లావాదేవీలను వారు పరిశీలిస్తున్నారు.నిర్మాత దిల్ రాజ్, కూతురు హన్సితా రెడ్డి, సోదరుడు నర్సింహ రెడ్డి , నిర్మాత శిరీష్ ఇంట్లో కూడా రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. వారి నిర్మాణ సంస్థ నుంచి భారీ బడ్జెట్ మూవీ గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం విడుదల అయ్యాయి. రెండు మూవీల ఆదాయ వ్యయాలపై ఐటీ అధికారలు విచారిస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం మూవీ వారం రోజుల్లో రూ. 203 కోట్లు వసూళ్లు చేసినట్లు గుర్తించారు. వచ్చిన లాభాలకు చెల్లించిన పన్నులకు భారీ వ్యత్యాసం ఉన్నట్లు ఐటీ శాఖ గుర్తించింది. -
'పుష్ప2, గేమ్ ఛేంజర్' కలెక్షన్స్ ప్రకటనపై ఐటీ అధికారుల ఫోకస్
తెలుగు సినీ నిర్మాతల నివాసాలు, కార్యాలయాల్లో ఆదాయ పన్నుశాఖ(Income Tax Officer) అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) చైర్మన్, నిర్మాత దిల్‌రాజు ఇల్లు, కార్యాలయాలతోపాటు.. పుష్ప–2 చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నివాసాల్లో, మైత్రీ మూవీస్ సంస్థ కార్యాలయాల్లోనూ తనిఖీలు చేపట్టారు. ప్రముఖ గాయని సునీత భర్త రామ్‌కు చెందిన మ్యాంగో మీడియా సంస్థలోనూ ఐటీ సోదాలు కొనసాగినట్టు తెలిసింది. అంతేకాదు భారీ బడ్జెట్ సినిమాలకు ఫైనాన్స్ చేసే సత్య రంగయ్య, అభిషేక్ అగర్వాల్‌ల ఇళ్లలోనూ సోదాలు చేశారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి సహా నగరంలోని ఎనిమిది చోట్ల 55 బృందాలతో తనిఖీలు నిర్వహించినట్టు సమాచారం.సినిమాల ఆదాయం లెక్కలపై ఫోకస్ ఇటీవల విడుదలైన గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలను దిల్‌రాజు నిర్మించారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాలకు అయిన ఖర్చు, వచ్చిన వసూళ్లు తదితర అంశాలపై ఐటీ అధికారులు ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టు తెలిసింది. దిల్‌రాజు ఇంటితోపాటు ఆయన సోదరుడు శిరీశ్, కుమార్తె హన్సితరెడ్డి నివాసాల్లోనూ ఐటీ సోదాలు కొనసాగాయి. ఈ సందర్భంగా పలు కీలక పత్రాలను, ఐటీ చెల్లింపులకు సంబంధించిన పత్రాలు, బ్యాంకు స్టేట్మెంట్లను ఐటీ అధికారులు స్వాదీనం చేసుకున్నట్టు సమాచారం. (ఇదీ చదవండి: సైఫ్ అలీఖాన్‌కు రక్షణగా 'జై లవకుశ' నటుడి టీమ్)ఇక పుష్ప–2 సినిమా నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థకు చెందిన మైత్రీ నవీన్, యలమంచిలి రవిశంకర్, సీఈఓ చెర్రీ, మైత్రి సంస్థ భాగస్వాముల ఇళ్లలోనూ ఐటీ అధికారుల సోదాలు కొనసాగాయి. పుష్ప–2 సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1,800 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో.. ఐటీ చెల్లింపులకు సంబంధించి అధికారులు పలు ఆధారాలు సేకరించినట్టు తెలిసింది. ముఖ్యంగా పుష్ప2(Pushpa 2) , గేమ్ ఛేంజర్(Game Changer Movie) కలెక్షన్ల ప్రకటనతో అందుకు సంబంధించిన చెల్లింపుల వివరాల గురించి వారు పరిశీలించినట్లు తెలుస్తోంది.సాధారణంగా జరిగే సోదాలే: దిల్‌రాజు భార్య వైగారెడ్డి తనిఖీల్లో భాగంగా ఐటీ అధికారులు దిల్‌రాజు సతీమణి వైగారెడ్డిని తమ కారులో తీసుకెళ్లారు. దిల్‌రాజు, ఇతర కుటుంబ సభ్యులకు చెందిన బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకున్నారు. బ్యాంకు లాకర్లను పరిశీలించిన అనంతరం ఆమెను తిరిగి అదే వాహనంలో ఇంటివద్దకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఐటీ సోదాలపై వైగారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇవి సాధారణంగా జరిగే సోదాలు మాత్రమేనని చెప్పారు. బ్యాంకు ఖాతాల వివరాలు కావాలని అధికారులు అడిగారని, అవి ఇచ్చామని, బ్యాంకు లాకర్లు తెరిచి చూపించామని తెలిపారు. -
సుకుమార్ నేషనల్ అయితే.. కూతురు ఇంటర్నేషనల్
పుష్ప సినిమాతో దర్శకుడు సుకుమార్ పేరు దేశవ్యాప్తంగా వైరల్ అవుతూనే ఉంది. ఇప్పుడు ఆయన కూతురు సుకృతి వేణి బండ్రెడ్డి కూడా ఇంటర్నేషనల్ వేదికలపై సత్తా చాటుతుంది. ఆమె ప్రధాన పాత్రధారిగా నటించిన 'గాంధీ తాత చెట్టు' ఇప్పటికే పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై అవార్డ్స్‌ను అందుకుంది. ఇప్పుడు తెలుగులో జనవరి 24న విడుదల కానుంది.పద్మావతి మల్లాది దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్, గోపీటాకీస్ సంస్థలతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, శేష సింధురావు నిర్మించారు. ఈ చిత్రానికి డైరెక్టర్ సుకుమార్ భార్య, శ్రీమతి తబితా సుకుమార్ సమర్పకురాలుగా వ్యవహరించారు. ఇప్పటికే ఈ 'గాంధీ తాత చెట్టు' సినిమా పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించడమే కాకుండా ఎన్నో అవార్డులను కైవసం చేసుకుంది. ఉత్తమ బాల నటిగా సుకృతి వేణి పురస్కారం కూడా పొందారు. దీంతో పుష్ప అభిమానులు సుకుమార్ కూతురు అనిపించుకున్నావ్ అంటూ ఆమెను ప్రశంసిస్తున్నారు. తండ్రి నేషనల్ అయితే, కూతురు ఇంటర్నేషనల్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు.ఈ సినిమా గురించి దర్శకురాలు మాట్లాడుతూ.. 'గాంధీజీ సిద్ధాంతాల్ని పాటిస్తూ.. ఓ పదమూడేళ్ల అమ్మాయి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. తన గ్రామాన్ని కాపాడుకునేందుకు ఆ అమ్మాయి ఏం చేసిందనేది ఈ చిత్రంలో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నేటి తరం తల్లిదండ్రులు అందరూ తమ పిల్లలకి ఈ చిత్రాన్ని తప్పనిసరిగా చూపించాలని దర్శకురాలు కోరారు. సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో ఆఆనంద్ చక్రపాణి, రఘురామ్, భాను ప్రకాశ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. -
RAPO22: 'మన సాగర్ గాడి లవ్వు... మహా లక్ష్మి'.. భాగ్యశ్రీ లుక్ అదిరింది!
ఉస్తాద్ రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. రామ్ కెరీర్లో ఇది 22వ సినిమా. ఈ చిత్రంలో సాగర్ పాత్రలో రామ్ పోతినేని నటిస్తున్నారు. ఆయన క్యారెక్టర్ లుక్ కొన్ని రోజులు క్రితం విడుదల చేశారు. అలాగే, న్యూ ఇయర్ సందర్భంగా ఈ రోజు హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే ఫస్ట్ లుక్ విడుదల చేశారు.'మన సాగర్ గాడి లవ్వు... మహా లక్ష్మి' అంటూ హీరో హీరోయిన్లు జంటగా ఉన్న పోస్టర్ విడుదల చేశారు. హీరోయిన్ భాగ్య శ్రీ లుక్ చూస్తే... చుడీదార్ ధరించి ట్రెడిషనల్ లుక్కులో బావున్నారు. ఆవిడ కాలేజీ స్టూడెంట్ రోల్ చేస్తున్నారని అర్థం అవుతోంది. రామ్ క్యూట్ ఎక్స్ ప్రెషన్ అయితే ఆడియన్స్ అందరి మనసు దోచుకుంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇటీవల పూర్తయింది.'హైదరాబాద్‌లో మొదలైన ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ఇటీవల పూర్తి అయ్యింది. రామ్, ఇంకా ఇతర ప్రధాన తారాగణం మీద కీలక సన్నివేశాలు తీశాం. సాగర్ పాత్రలో రామ్ ఒదిగిన తీరు, ఆయన నటన ఆడియన్స్ అందరికీ ఒక ట్రీట్ అని చెప్పాలి. ప్రేక్షకులు నోస్టాల్జియాలోకి వెళతారు. ఆ పాత్రలో తమను తాము చూసుకుంటారు. హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే లుక్ సైతం అందర్నీ ఆకట్టుకుంటోంది. రామ్, భాగ్య శ్రీ జోడీ క్యూట్ గా ఉందని అందరూ చెబుతున్నారు. సినిమాలో వీళ్లిద్దరి మధ్య వచ్చే సీన్లు హైలైట్ అవుతాయి'' అని దర్శక నిర్మాతలు తెలిపారు. మన సాగర్ గాడి లవ్వు ❤️Meet @bhagyasriiborse as Mahalakshmi.Let this new year bring a lot of love and joy to all your lives ✨Team #RAPO22 wishes you all a very Happy New Year ❤🔥@filmymahesh @MythriOfficial @iamviveksiva @mervinjsolomon @sreekar_prasad… pic.twitter.com/vAHpfWRvXT— RAm POthineni (@ramsayz) January 1, 2025 -
సీఎంతో సినీ ప్రముఖుల భేటీ.. పుష్ప-2 నిర్మాణ సంస్థ ట్వీట్
తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమకు అండగా నిలుస్తుందని దిల్ రాజుకు చెందిన నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్వీట్ చేసింది. ప్రభుత్వానికి, సినీ ఇండస్ట్రీ పెద్దల మధ్య సమావేశం జరగడం శుభసూచకమని పోస్ట్ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి దూరదృష్టిని, నాయకత్వాన్ని అభినందిస్తున్నామని తెలిపింది. అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి మద్దతుకు ధన్యవాదాలు తెలిపింది. సినిమా షూటింగ్‌లకు హైదరాబాద్‌ను గ్లోబల్ హబ్‌గా మార్చేందుకు కట్టుబడి ఉన్నారని రాసుకొచ్చింది. డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.కాగా.. ఇవాళ హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డితో ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్‌రాజుతో పాటు టాలీవుడ్ ప్రముఖులు కూడా భేటీ అయ్యారు. సంధ్య థియేటర్ ఘటన తర్వాత సీఎంతో భేటీలో పలు అంశాలపై చర్చించారు. బెనిఫిట్ షోలు, టికెట్ల పెంపు ఉండదని ముఖ్యమంత్రి ప్రకటించడంతో ఈ భేటీ ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా సినీ పరిశ్రమలో సమస్యలపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.We are delighted with the fruitful meeting held today between the Telangana Government and representatives of the Telugu Film Industry facilitated by the Film Development Corporation of Telangana.We deeply appreciate the visionary leadership of our Honourable Chief Minister Sri…— Sri Venkateswara Creations (@SVC_official) December 26, 2024మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్..సీఎం రేవంత్ రెడ్డితో భేటీ తర్వాత పుష్ప-2 నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. గ్లోబల్ స్థాయిలో తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుగుదల దిశగా తెలంగాణ ప్రభుత్వం చూపిస్తున్న చొరవ, ప్రోత్సాహానికి ధన్యవాదాలు తెలిపింది. సీఎం, డిప్యూటీ సీఎం, సినిమాటోగ్రఫీ మంత్రి దూరదృష్టికి ఇండస్ట్రీ ఎల్లప్పుడు మద్దతుగా ఉంటుందని పేర్కొంది.అలాగే సామాజిక సమస్యలపై అవగాహన పెంచడంలో ప్రభుత్వానికి మద్దతుగా ఇండస్ట్రీ పని చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలకు మద్దుతుగా ఉంటామని మైత్రి మూవీ మేకర్స్ పోస్ట్ చేసింది. మన సమాజ ఉజ్వల భవిష్యత్తు కోసం, తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్దికి కలిసి పని చేద్దామని పిలుపునిచ్చింది. We sincerely thank the Government of Telangana, Honorable Chief Minister Shri @revanth_anumula Garu, Cinematography Minister @KomatireddyKVR Garu, and Deputy Chief Minister @Bhatti_Mallu Garu for their visionary leadership and steadfast encouragement towards the growth of the…— Mythri Movie Makers (@MythriOfficial) December 26, 2024 -
సంధ్య థియేటర్ ఘటన.. మరో ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు
సంధ్యా థియేటర్ ఘటన కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో అల్లు అర్జున్ను నిందితుడిగా చేర్చిన పోలీసులు.. తాజాగా పుష్ప-2 చిత్ర నిర్మాణ సంస్థను కూడా చేర్చారు. ఈ కేసులో ఏ18గా చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పేరును పోలీసులు ప్రస్తావించారు. ఆ రోజు ఏం జరిగిందంటే..ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. పుష్ప-2 ప్రీమియర్ షో చూసేందుకు అల్లు అర్జున్ థియేటర్‌కు రాగా.. పెద్దఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో అభిమానులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు థియేటర్ యాజమాన్యంతో పాటు పలువురిపై కేసు నమోదు చేశారు. -
సంధ్య థియేటర్ ఘటన.. బాధిత కుటుంబానికి రూ.50 లక్షల సాయం
పుష్ప-2 మూవీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అధినేత నవీన్ యేర్నేని కీలక నిర్ణయం తీసుకున్నారు. సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను ఆయన పరామర్శించారు. అంతేకాకుండా ఆ కుటుంబానికి రూ.50 లక్షల చెక్కును అందజేశారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి బాలుడి చికిత్స గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.రాజకీయం చేయొద్దు: మంత్రి కోమటిరెడ్డిఇక ఈ విషయాన్ని ఇక రాజకీయం చేయవద్దని.. సినీ హీరోల ఇళ్లపై దాడులు చేయవద్దని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. బాబు పరిస్థితి అంతంతమాత్రంగానే ఉందని దేవుడి దయవల్ల త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సినిమా ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్లడం లేదని.. రూమర్స్ ఎవరు నమ్మొద్దని మంత్రి స్పష్టం చేశారు. ఎవరి పైనా దాడులు చేసినా చట్టం ఊరుకోదని కఠిన చర్యలు తప్పవని మంత్రి కోమటిరెడ్డి హెచ్చరించారు. -
ఓటీటీకి పుష్ప-2.. కీలక ప్రకటన చేసిన మైత్రీ మూవీ మేకర్స్
బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ హవా ఓ రేంజ్లో కొనసాగుతోంది. ఇప్పటికే ఆల్ టైమ్ రికార్డ్స్ సృష్టించిన పుష్ప-2 మరో ఘనతను సొంతం చేసుకుంది. అంతే కాకుండా మొదటి రోజు రూ.294 కోట్లతో మొదలైన పుష్ప రాజ్ ప్రభంజనం ప్రపంచవ్యాప్తంగా రూ.1500 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది.అయితే ఇటీవల పుష్ప-2 ఓటీటీకి త్వరగానే వచ్చేస్తోందంటూ పలువురు కథనాలు రాసుకొచ్చారు. దీంతో పుష్ప టీమ్ అప్రమత్తమైంది. ఓటీటీకి వస్తుందన్న వార్తలపై మైత్రి మూవీ మేకర్స్ స్పందించింది. పుష్పరాజ్ ఓటీటీ రిలీజ్‌పై వస్తున్న కథనాలు అవాస్తమమని కొట్టిపారేసింది. ఈ సెలవుల్లో బిగ్ స్క్రీన్‌పైనే ఆస్వాదించాలని ట్వీట్ చేసింది. అంతేకాకుండా రిలీజైన 56 రోజుల వరకు ఏ ఓటీటీలోనూ విడుదల చేయడం లేదని స్పష్టం చేసింది. ఈ ప్రకటనతో పుష్ప-2 ముందుగానే ఓటీటీకి వస్తోందన్న రూమర్స్‌కు చెక్ పెట్టింది మూవీ టీమ్.హిందీలో అరుదైన రికార్డ్బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ మూవీ విడుదలైన 15 రోజుల్లోనే రూ.632 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించింది. దీంతో హిందీ సినిమా చరిత్రలోనే అత్యంత వేగంగా అత్యధిక నెట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. అంతేకాకుండా వసూళ్ల పరంగా గత వందేళ్ల బాలీవుడ్ చరిత్రలోనే నంబర్‌వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ విషయాన్ని పుష్ప టీమ్ అధికారికంగా ప్రకటించింది.There are rumours floating around about the OTT release of #Pushpa2TheRule Enjoy the Biggest Film #Pushpa2 only on the Big Screens in this Biggest Holiday Season ❤️It won't be on any OTT before 56 days!It's #WildFirePushpa only in Theatres Worldwide 🔥— Mythri Movie Makers (@MythriOfficial) December 20, 2024 -
పండుగ రేసు నుంచి తప్పకున్న నితిన్ 'రాబిన్‌హుడ్'
క్రిస్టమస్ రేసు నుంచి 'రాబిన్ హుడ్' సినిమా తప్పుకుంది. ఈమేరకు చిత్ర యూనిట్ నుంచి అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. 'భీష్మ' వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘రాబిన్ హుడ్’. టైటిల్ ప్రకటించిన సమయం నుంచి ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.‘రాబిన్‌హుడ్’ సినిమాను డిసెంబర్ 25న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించారు. అయితే, తాజాగా ఆ సంస్థ మరో ప్రకటన చేసింది. రాబిన్ హుడ్ చిత్రాన్ని అనుకున్న తేదీలో విడుదల చేయడం లేదంటూ తెలిపింది. కానీ, కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. మైత్రీ మూవీస్ నుంచి తెరకెక్కిన పుష్ప2 ఇంకా థియేటర్లో రన్ అవుతూనే ఉంది. మరోవైపు మోహన్‌లాల్ బరోజ్ తెలుగు వర్షన్‌ను ఇదే సంస్థ డిసెంబర్ 25న విడుదల చేస్తుంది. ఆపై ఈ క్రిస్టమస్ రేసులో సుమారు 10కి పైగా చిత్రాలు రేసులో ఉన్నాయి. దీంతో థియేటర్స్ కొరత ఏర్పడే ఛాన్స్ ఉందని రాబిన్ హుడ్ను వాయిదా వేసినట్లు తెలుస్తోంది.రాబిన్ హుడ్‌లో నితిన్ సరసన శ్రీలీల హీరోయిన్గా నటిస్తుంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. సంగీతం జీవీ ప్రకాశ్‌కుమార్ అందిస్తున్నారు. యునిక్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రానుంది. -
పుష్పరాజ్ ఆల్ టైమ్ రికార్డ్.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
'పుష్ప 2' తొలిరోజు నుంచే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఏకంగా రూ.294 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుని.. ఇప్పటివరకు ఉన్న రికార్డులన్ని తుడిచిపెట్టేసింది. అలా దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా నిలిచింది. తొలిరోజు రూ.294 కోట్లు కలెక్షన్స్ సాధించిన 'పుష్ప 2'.. రెండో రోజు కాస్త తగ్గింది. రూ.155 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది. అలా రెండు రోజులకు కలిపి రూ.449 కోట్లు రాబట్టింది. తాజాగా మూడు రోజుల్లోనే ఏకంగా రూ.621 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. ఈ విషయాన్ని నిర్మాణసంస్థ మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా వెల్లడించింది.హిందీలో తొలిరోజు రికార్డ్ బ్రేక్అయితే పుష్ప -2 హిందీలో ఓ రేంజ్లో దూసుకెళ్తోంది. తొలి రోజు రూ.72 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన పుష్ప-2 మరో రికార్డ్ క్రియేట్ చేసింది. మూడో రోజు ఏకంగా రూ.74 కోట్లతో ఆ రికార్డ్‌ను తిరగరాసింది. దీంతో కేవలం హిందీలోనే మూడు రోజుల్లో రూ.205 కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాబట్టింది. ఇక ముందుముందు మరెన్ని రికార్డులు కొల్లగొడుతందో ప్రస్తుత కలెక్షన్స్ చూస్తేనే తెలుస్తోంది. నార్త్‌లోనూ పుష్ప-2 రప్పా రప్పా అంటూ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. The box office is witnessing history with #Pushpa2TheRule ❤🔥The WILDFIRE BLOCKBUSTER collects a gross of 621 CRORES WORLDWIDE in just 3 days, shattering many records 💥💥💥Book your tickets now!🎟️ https://t.co/tHogUVEOs1#Pushpa2#WildFirePushpaIcon Star @alluarjun… pic.twitter.com/CQ1SBTAnV4— Mythri Movie Makers (@MythriOfficial) December 8, 2024 -
'అలాంటివి ఇక వద్దు'.. వారికి పుష్ప టీమ్ స్ట్రాంగ్ వార్నింగ్!
సోషల్ మీడియాలో వైరలవుతోన్న పుష్ప చిత్రంలోని ఫేక్ డైలాగ్స్‌పై చిత్రబృందం స్పందించింది. నెట్టింట వైరలవుతోన్న ఫేక్ డైలాగ్స్ సృష్టించేవారికి పుష్ప టీమ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అలాంటి పైరసీ వీడియోలు, సంబంధిత లింక్స్ కనిపిస్తే తమకు తెలియజేయాలని సూచించింది. ఈ మేరకు మెయిల్‌తో పాటు ఫోన్ నంబర్‌ను ట్విటర్ ద్వారా షేర్ చేసింది. ఇలాంటి వాటిని వ్యాప్తి చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ హెచ్చరించింది.మైత్రి మూవీ మేకర్స్ తన ట్విట్లో ప్రస్తావిస్తూ..' ఊహాజనితమైన, సొంత క్రియేటీవిటితో పుట్టించిన కొన్ని డైలాగులు పుష్ప-2 చిత్రంలోనివి అంటూ కొంత మంది కావాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కొంత మంది కావాలనే సినిమాపై నెగటివ్ ప్రచారం కోసం ఇలాంటివి పోస్ట్ చేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా ఇలాంటి పోస్టులు పోస్ట్ చెయ్యటం మానుకోండి. లేకపోతే అలాంటి వారిపై చట్ట పరమైన యాక్షన్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం.' అని పోస్ట్ చేశారు. దీంతో ఎవరైనా సరే ఫేక్ డైలాగ్స్, వీడియోస్ పోస్ట్ చేసి చిక్కుల్లో పడొద్దు. అలాంటి పైరసీ వీడియోలు కానీ, లింక్స్ కనిపిస్తే వెంటనే వివరాలు పంపితే దాన్ని అడ్డుకుంటామని పేర్కొంది. ఊహాజనితమైన, సొంత క్రియేటీవిటితో పుట్టించిన కొన్ని డైలాగులు పుష్ప-2 చిత్రంలోనివి అంటూ కొంత మంది కావాలని సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్నారు. వాంటెడ్ గా కొంత మంది సినిమాపై నెగటివ్ ప్రచారం కోసం కావాలని ఇలాంటివి పోస్ట్ చేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా ఇలాంటి పోస్టులు పోస్ట్ చెయ్యటం…— Mythri Movie Makers (@MythriOfficial) December 6, 2024 Any unauthorized videos or spoilers of the movie #Pushpa2 can be reported immediately to the Anti Piracy Control Room @AntipiracySWe will bring them down immediately.claims@antipiracysolutions.orgWhatsapp: 8978650014— Mythri Movie Makers (@MythriOfficial) December 6, 2024 -
'పుష్ప2' ఫస్ట్ డే కలెక్షన్స్.. బాలీవుడ్ కింగ్‌గా అల్లు అర్జున్
తెలుగు సినిమాల ఓపెనింగ్ కలెక్షన్స్ ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాయి. హిందీ సినిమాలు కూడా ఆ టార్గెట్‌ను అందుకోవాలంటే కాస్తా కష్టమే అనేలా ఉన్నాయి. బాలీవుడ్లో పుష్ప2 కలెక్షన్స్ రికార్డ్ క్రియేట్ చేశాయి. ఈమేరకు చిత్ర యూనిట్ అధికారికంగా ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. బాలీవుడ్లో షారుఖ్‌ఖాన్, అమీర్‌ఖాన్,సల్మాన్‌ఖాన్ వంటి స్టార్స్‌కు కూడా సాధ్యం కానీ రికార్డ్ అల్లు అర్జున్ క్రియేట్ చేశాడు.బాలీవుడ్లో ఇప్పటి వరకు మొదటిరోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా షారుఖ్‌ఖాన్ 'జవాన్' రూ. 65.5 కోట్లతో మొదటి స్థానంలో ఉంది. అయితే, ఇప్పుడు 'పుష్ప2' ఆ రికార్డ్‌ను దాటేసింది. హిందీలో ఫస్ట్ డే రూ.72 కోట్ల నెట్ రాబట్టి ఫస్ట్ ప్లేస్‌లోకి పుష్ప2 చేరిపోయింది. బన్నీ స్టార్‌డమ్‌తోనే హిందీ 'పుష్ప'కి భారీ ఓపెనింగ్స్ వచ్చాయని అక్కడి ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. బాలీవుడ్ ఫస్ట్ కలెక్షన్స్ టాప్ టెన్ లిస్ట్‌లో పుష్ప2 చిత్రం మాత్రమే ఉండటం విశేషం. ఆ తర్వాతే టాలీవుడ్ నుంచి బాహుబలి2 ( 41 కోట్లు), ఆదిపురుష్ ( రూ 37.25 కోట్లు), సాహో ( రూ.24.4 కోట్లు), కల్కి (రూ. 22.5 కోట్లు) వంటి చిత్రాలు ఉన్నాయి.బాలీవుడ్లో ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్స్ 1. పుష్ప2 ( రూ. 72 కోట్ల నెట్)2. జవాన్ (రూ. 65.5 కోట్ల నెట్)3. స్త్రీ2 ( రూ.55 కోట్లు)4. పఠాన్ ( రూ. 55 కోట్లు)5. యానిమల్ ( రూ.54.75 కోట్లు)6. కేజీఎఫ్2 ( రూ.53.95 కోట్లు)7. వార్ (రూ. 51.60 కోట్లు)8. థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ ( రూ. 50 కోట్లు)9. సింగం ఎగైన్ (రూ. 43.5 కోట్లు)10. టైగర్3 (రూ.43 కోట్లు) View this post on Instagram A post shared by Mythri Movie Makers (@mythriofficial) -
నేడు పుష్ప–2 ప్రీ రిలీజ్ ఈవెంట్.. వెళ్లే వారికి పోలీసుల సూచనలు
అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా చిత్రం 'పుష్ప2'.. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా భారీ ఈవెంట్స్ నిర్వహించిన పుష్ప ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నేడు (డిసెంబర్2) హైదరబాద్‌లో జరపనున్నారు. యూసుఫ్‌గూడ పోలీస్‌లైన్స్‌లో సోమవారం జరగనున్న పుష్ప–2 ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఏర్పాట్లను నగర అదనపు సీపీ విక్రమ్‌సింగ్ మాన్, వెస్ట్‌జోన్ డీసీపీ విజయ్‌కుమార్, వెస్ట్‌జోన్ ట్రాఫిక్ ఏసీపీ హరిప్రసాద్ కట్టా పరిశీలించారు. సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి యూసుఫ్‌గూడ బెటాలియన్‌లో ఈ కార్యక్రమం జరగనుండగా కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లింపు చేపడుతున్నట్లు ప్రజలు ఇతర రహదారుల నుంచి వెళ్లాలని కోరారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వైపు నుంచి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియం వైపు వెళ్లే వాహనదారులు శ్రీకృష్ణానగర్, శ్రీనగర్‌కాలనీ మీదుగా పంజగుట్ట వైపు వెళ్లాల్సి ఉంటుంది. మైత్రివనం జంక్షన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, మాదాపూర్ వైపు వెళ్లే వాహనదారులు యూసుఫ్‌గూడ బస్తీ వద్ద ఆర్బీఐ క్వార్టర్స్ వైపు మళ్లి కృష్ణానగర్ జంక్షన్ మీదుగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్టుకు వెళ్లాలి. బోరబండ బస్టాపు వైపు నుంచి మైత్రివనం జంక్షన్‌కు వెళ్లే వాహనదారులు ప్రైమ్ గార్డెన్, కల్యాణ్‌నగర్, మిడ్‌ల్యాండ్ బేకరీ, జీటీఎస్ కాలనీ, కల్యాణ్ నగర్ జంక్షన్, ఉమేష్ చంద్ర విగ్రహం మీదుగా యూ టర్న్ తీసుకుని, ఐసీఐసీఐ బ్యాంక్ వద్ద యూ టర్న్ తీసుకుని మైత్రివనం వైపు వెళ్లాల్సి ఉంటుందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. పార్కింగ్ ఇలా.. కార్లను సవేరా అండ్ మహమూద్ ఫంక్షన్ హాళ్లలో పార్కు చేయాలి. జానకమ్మ తోటలో కార్లు, బైకులు పార్క్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. -
'పుష్ప 2' వివాదం.. నిర్మాతలపై దేవి శ్రీ ప్రసాద్ సెటైర్లు
'పుష్ప 2' మరో పదిరోజుల్లో థియేటర్లలోకి రానుంది. హైప్ గట్టిగానే ఉంది. కాకపోతే కొన్నిరోజుల క్రితం మ్యూజిక్ విషయంలో చిన్నపాటి గందరగోళం జరిగిందని చెప్పొచ్చు. స్వతహాగా ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. కానీ బ్యాక్ గ్రౌండ్ కోసమని చెప్పి మరో ముగ్గురు సంగీత దర్శకుల్ని అప్పటికప్పుడు తీసుకొచ్చారు. ఇలా జరగడం ఓ రకంగా దేవీకి అవమానం అని చెప్పొచ్చు. తాజాగా చెన్నైలో జరిగిన ఈవెంట్లో ఇతడు ఓపెన్ అయిపోయాడు. 'పుష్ప' నిర్మాతలని పొగుడుతూనే సెటైర్లు వేశాడు. ఇప్పుడు ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది.'పుష్ప మా అందరికీ స్పెషల్. మనకు ఏది కావాలన్నా సరే అడిగి తీసుకోవాలి. నిర్మాతలు ఇచ్చే రెమ్యునరేషన్ అయినా తెరపై మన క్రెడిట్ అయినా.. అడగకపోతే ఎవరూ ఇవ్వరు. కరెక్టే కదా బన్నీ. రవిశంకర్ (నిర్మాత) సర్.. నేను స్టేజీపై ఎక్కువ టైమ్ తీసుకుంటున్నానని అనొద్దు. ఎందుకంటే నేను సమయానికి పాట ఇవ్వలేదు, బ్యాక్ గ్రౌండ్ చేయలేదు, టైంకి ప్రోగ్రామ్‌కి రాలేదు అంటుంటారు (నవ్వుతూ). మీకు నాపై చాలా ప్రేమ ఉంది. కానీ అంతకుమించి కంప్లైంట్స్ కూడా ఉన్నాయి'(ఇదీ చదవండి: అల్లు అర్జున్ పుష్ప-2.. శ్రీలీల కిస్సిక్ ఫుల్ సాంగ్ వచ్చేసింది)'నా విషయంలో మీకు ఫిర్యాదులు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా రాంగ్ టైమింగ్ అన్నారు. ఇవన్నీ వ్యక్తిగతంగా అడిగితే పెద్ద కిక్ ఉండదు. ఇలా ఓపెన్ గా మాట్లాడుకుంటేనే బాగుంటుంది. నేనేప్పుడూ ఆన్ టైమ్ సర్' అని దేవిశ్రీ ప్రసాద్ అన్నాడు.మరి దేవిపై 'పుష్ప' నిర్మాతలైన మైత్రీ మూవీ మేకర్స్‌కి ఏం కంప్లైంట్స్ ఉన్నాయో తెలీదు గానీ అవన్నీ ఇప్పుడు ఈవెంట్లో బయటపెట్టేశాడు. అది కూడా నవ్వూతూనే. పుష్ప 2కి అనుకున్న టైంలో దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదని మరో ముగ్గురుని సంగీత దర్శకుల్ని తీసుకొచ్చారు. బహుశా ఆ విషయమై తన నిరసనని దేవిశ్రీ ఇలా సభాముఖంగా ఇలా తెలియజేశాడేమో?(ఇదీ చదవండి: అన్నపూర్ణ స్టూడియోస్‌లో పెళ్లి.. అసలు కారణం వెల్లడించిన చైతూ!) -
హీరో రామ్ పోతినేని కొత్త సినిమాలో ఛాన్స్ కొట్టేసిన భాగ్యశ్రీ బోర్సే
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ ఫీల్ గుడ్ అండ్ క్రేజీ ఎంటర్టైనర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. RAPO22 పేరుతో ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' విజయం తర్వాత మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. నవంబర్ 21న పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభించనున్నారు. హీరో రామ్‌కు 22వ సినిమా ఇది.రామ్ సరసన హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే ఎంపిక అయ్యింది. 'మిస్టర్ బచ్చన్'తో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే గ్లామర్, యాక్టింగ్ చేయగల నటిగా పేరు తెచ్చుకుంది. అయితే, రామ్, భాగ్యశ్రీ జంటగా రూపొందుతున్న మొదటి చిత్రమిది.'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'లో దర్శకుడు మహేష్ బాబు. పి సున్నితమైన వినోదంతో పాటు చక్కటి సందేశం ఇచ్చారు. భావోద్వేగాలను హృద్యంగా ఆవిష్కరించారు. ఈ సినిమానూ యూత్, ఫ్యామిలీ, ఆడియన్స్ అందరూ మెచ్చే కథతో తెరకెక్కించనున్నారు. నవంబర్ 21న పూజ జరిగిన తర్వాత ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల వెల్లడించనున్నారు. -
'జై హనుమాన్' నుంచి సడన్ సర్ప్రైజ్
సడన్ సర్ప్రైజ్ అన్నట్లు 'జై హనుమాన్' సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. దీపావళి సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఆంజనేయుడు నడిచి వెళ్తుండటాన్ని వెనక వైపు నుంచి చూపించారు. 30న అంటే బుధవారం లుక్ బయటపెడతారు.(ఇదీ చదవండి: ఓటీటీలో మరో క్రేజీ మూవీ.. ఇది 69 ఏళ్ల వృద్ధుడి కథ)ఈ ఏడాది సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన 'హనుమాన్'.. ఊహించని విధంగా బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకుంది. చివర్లో సీక్వెల్ 'జై హనుమాన్' ఉంటుందని ప్రకటించారు. కానీ దానికి సంబంధించిన పనులేం జరిగినట్లు కనిపించలేదు. కానీ ఇప్పుడేమో ఫస్ట్ లుక్ అని చెప్పి షాకిచ్చారు.తొలి భాగంలో హనుమంతుడు పాత్రధారి ఎవరనేది రివీల్ చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం కచ్చితంగా చూపిస్తారు. అయితే 'కాంతార' ఫేమ్ రిషభ్ శెట్టి.. హనుమంతుడిగా కనిపిస్తాడని అంటున్నారు. తొలి భాగాన్ని నిరంజన్ రెడ్డి నిర్మించగా.. 'జై హనుమాన్'ని మాత్రం మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. పూర్తి వివరాలు రేపు తెలుస్తాయేమో?(ఇదీ చదవండి: తెలుగు నిర్మాత.. హైదరాబాద్‌లోని చెరువులో దూకేశాడు: శ్రియ) View this post on Instagram A post shared by Mythri Movie Makers (@mythriofficial) -
బాక్సాఫీస్ కౌంట్‌డౌన్ స్టార్ట్.. సరికొత్త అధ్యాయానికి పుష్ప నాంది
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న పుష్ప2 కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈమేరకు చిత్ర యూనిట్‌తో పాటు బన్నీ ఒక పోస్టర్‌ను పంచుకున్నారు. ‘పుష్ప’ ఫ్రాంచైజీ నుంచి రానున్న ‘పుష్ప: ది రూల్’ షూటింగ్ పనులన్నీ పూర్తి అయ్యాయి. ఈ చిత్రంలో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్, హీరోయిన్ శ్రీ వల్లీ పాత్రలో రష్మికా మందన్నా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు.వాస్తవంగా పుష్ప2 సినిమా ఆగష్టు 15న విడుదల కావాల్సింది. అయితే, నిర్మాణ విలువలు మరింత బలంగా ఉండాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకోవడంతో సినిమా విడుదల విషయంలో కాస్త జాప్యం ఏర్పడింది. ఈ క్రమంలో ఈ చిత్రం డిసెంబరు 6న విడుదల కానుందని గతంలోనే ప్రకటించారు. కానీ, ఒకరోజు ముందే పుష్పగాడి రూల్ ప్రారంభం అవుతుందని కొద్దిరోజులుగా సామాజిక మాధ్యమంలో ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా ఒక పోస్టర్‌ను అల్లు అర్జున్ పంచుకున్నారు. డిసెంబర్ 6న విడుదల చేస్తున్నట్లు ఒక పోస్టర్‌ను షేర్ చేశారు. 50 రోజుల కౌంట్‌డౌన్ ప్రారంభమైందని తెలిపింది.పుష్ప2 ఫస్టాప్ ఇప్పటికే లాక్ చేయబడిందని మైత్రి మూవీ మేకర్స్ పేర్కొంది. అది ఫుల్ ఫైర్‌తో ఉంటుందని టీమ్ తెలిపింది. పుష్ప2 ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తుపాన్ క్రియేట్ చేస్తుంది.. దానిని చూసేందుకు సిద్ధంగా ఉండాలంటూ మేకర్స్ చెప్పారు. భారతీయ చలనచిత్రంలో సరికొత్త అధ్యాయాన్ని పుష్ప2 సినిమాతో అల్లు అర్జున్ లిఖిస్తాడని వారు పేర్కొన్నారు. -
మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో '8 వసంతాలు' టీజర్
మ్యాడ్ సినిమాతో టాలీవుడ్లో హీరోయిన్గా గుర్తింపుపొందిన అనంతిక సానీల్కుమార్ నటిస్తున్న కొత్త సినిమా '8 వసంతాలు.' మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. అద్భుతమైన లొకేషన్స్‌తో పాటు మంచి కంటెంట్ ఉన్న లైన్‌తో ఈ సినిమాను ఫణింద్ర తెరకెక్కిస్తున్నారు. తెలుగులో సూపర్ హిట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు.'8 వసంతాలు' చిత్రం నుంచి 'శుద్ధీ అయోధ్య టీజర్' పేరుతో చిత్ర యూనిట్ ఒక వీడియోను పంచుకుంది. మార్షల్ ఆర్ట్స్ ప్రధానంశంగా ఈ చిత్రం ఉండనుంది. అమ్మాయిలు ఈ పోటీకి పనికిరారు అనే వివక్షను తొలగించే బలమైన పాత్రలో అనంతిక నటించింది. టీజర్‌తోనే సినిమాపై మంచి అంచనాలను చిత్ర యూనిట్ కల్పించింది. -
‘మత్తు వదలరా- 2’ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)