మ్యాడ్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్న అనంతిక సానీల్‌కుమార్(Ananthika Sanilkumar) కొత్త సినిమా '8 వసంతాలు.' మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. మొదటి విడుదలైన గ్లింప్స్‌లో అద్భుతమైన లొకేషన్స్‌తో పాటు హీరోయిన్ ఎలివేషన్‌తో చూపిస్తే.. ఇప్పుడు టీజర్‌లో మంచి కంటెంట్ ఉన్న లైన్‌తో ఎమోషనల్‌గా చూపించారు ఈ చిత్రాన్ని ఫణింద్ర(Phanindra Narsetti) తెరకెక్కిస్తున్నారు. తెలుగులో సూపర్ హిట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు.
(ఇదీ చదవండి: 'పుష్ప 3' ఐటెమ్ సాంగ్.. ఆ హీరోయిన్ అయితే సూపర్ హిట్టే: దేవిశ్రీ ప్రసాద్)
'8 వసంతాలు'(8 Vasantalu) చిత్రం మార్షల్ ఆర్ట్స్ ప్రధానంశంగా ఉండనుంది. అమ్మాయిలు ఈ పోటీకి పనికిరారు అనే వివక్షను తొలగించే బలమైన పాత్రలో అనంతిక నటించింది. టీజర్‌తోనే సినిమాపై మంచి అంచనాలను చిత్ర యూనిట్ కల్పించింది. మ్యాడ్ మూవీలో జెన్నీ పాత్రలో అనంతిక సనీల్‌కుమార్ అదరగొట్టింది. ఇప్పుడు ఆమె మ్యాడ్ సిక్వెల్‌లో కూడా నటిస్తుంది. ఈ మూవీతో ఆమె చాలామంది యూత్‌కు క్రష్‌గా మారిపోయింది. కేరళకు చెందిన ఈ బ్యూటీ చిత్ర పరిశ్రమకు రాకముంది
అనంతిక సనీల్‌కుమార్ ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్. కేరళకు చెందిన ఈ ముద్దుగుమ్మ వివిధ రకాల కంటెంట్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు షేర్ చేస్తుండేది. అలా గుర్తింపు రావడంతో తెలుగులో మొదట రోజ్ మిల్క్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. అయితే, మ్యాడ్ సినిమాతో ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. అనంతికకు కర్రసాముతో పాటు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంది. ఆమెకు క్లాసికల్ డ్యాన్స్ కూడా వచ్చు.
Comments
Please login to add a commentAdd a comment