
కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ హీరోగా నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. ఈ మూవీలో త్రిష హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ సినిమాను మార్క్ ఆంటోని ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీమూవీమేకర్స్ బ్యానర్‌లో నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ వేసవిలో థియేటర్లలో సందడి చేయనుంది.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా తెలుగు టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే తమిళ టీజర్‌ను విడుదల చేసిన మేకర్స్ ఇవాళ తెలుగుతో పాటు హిందీలోనూ గుడ్ బ్యాడ్ అగ్లీ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ మూవీ టీజర్‌లో అజిత్ యాక్షన్ సన్నివేశాలు ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి. కాగా.. ఈ చిత్రంలో సునీల్, ప్రసన్న కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతం అందించారు.
అజిత్ కుమార్ ఇటీవల విదాముయార్చి మూవీతో ప్రేక్షకులను పలకరించారు. తెలుగులో పట్టుదల పేరుతో ఈ సినిమా విడుదలైంది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊహించినంత స్థాయిలో రాణించలేకపోయింది. దీంతో అజిత్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఏప్రిల్ 10న విడుదల కానున్న గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతోనైనా బ్లాక్ బస్టర్ కొట్టాలని అజిత్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.
This summer, it is going to be a crazy entertaining ride 💥💥#GoodBadUglyTeaser out now!
Telugu ▶️ https://t.co/Ynl6esv1jh
Hindi ▶️ https://t.co/Y5QRRG1E67#GoodBadUgly Grand release on 10th April, 2025 with VERA LEVEL entertainment 🤩
A @gvprakash Musical ❤️🔥… pic.twitter.com/5BxIRxZ1sz— Mythri Movie Makers (@MythriOfficial) March 1, 2025
Comments
Please login to add a commentAdd a comment