Kollywood Actor
-
డిజాస్టర్ దిశగా అజిత్ పట్టుదల.. వారం రోజుల్లో ఎన్ని కోట్లంటే?
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఇటీవలే విడాముయర్చి (తెలుగులో పట్టుదల) మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మగిజ్ తిరుమేని దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌పై అభిమానుల్లో మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం అంచనాలను అందుకోవడంపై విఫలమైంది. మొదటి రోజు దేశవ్యాప్తంగా రూ.22 కోట్ల నికర వసూళ్లు మాత్రమే సాధించింది. గతేడాది వచ్చిన అజిత్ మూవీ తునివు(తెగింపు) వసూళ్లను మాత్రం విడాముయర్చి అధిగమించలేకపోయింది. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించగా.. అర్జున్ సర్జా కీలక పాత్ర పోషించారు. ఈ మూవీ రిలీజైన వారం రోజులైనా కేవలం రూ.రూ. 71.3 కోట్లకు పైగా నెట్ వసూళ్లు మాత్రమే సాధించింది. ఏడో రోజు కేవలం రూ. 2.50 కోట్ల నికర వసూళ్లను మాత్రమే రాబట్టింది. దీంతో వందకోట్ల నెట్ వసూళ్లు సాధించాలంటే మరిన్ని రోజులు వేచి చూడాల్సిందే. మరి రెండో వారంలోనైనా విడాముయర్చికి కలిసొస్తుందేమో చూడాలి. అయితే ఈనెల 14న లవర్స్ డే రోజున మరిన్ని కొత్త చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. దీంతో ఈ సినిమాకు తీవ్రమైన పోటీ తప్పేలా లేదుకాగా.. ఈ సినిమాను భారీ ప్రాజెక్ట్‌ను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో తెరకెక్కించారు. 1997 అమెరికన్ చిత్రం బ్రేక్‌డౌన్ ఆధారంగా విడాముయర్చిని రూపొందించారు. ఈ మూవీ షూటింగ్ అంతా అజర్ బైజాన్‌లో జరిగింది. ఈ చిత్రంలో రెజీనా కసాండ్రా, ఆరవ్, రమ్య సుబ్రమణియన్ కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. -
వాలెంటైన్స్ డే స్పెషల్.. సూర్య సూపర్ హిట్ మూవీ రీ రిలీజ్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ద్విపాత్రాభినయంలో వచ్చిన చిత్రం 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' సిమ్రాన్, సమీరా రెడ్డి, రమ్య ప్రధాన పాత్రల్లో నటించారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం తమిళంలో వారనమ్ అయిరమ్ పేరుతో విడుదలైంది. ఈ చిత్రాన్ని తెలుగులో సూర్య సన్నాఫ్ కృష్ణన్ గా డబ్ చేసి రిలీజ్ చేశారు. 2008 నవంబర్ 14న విడుదలైన ఈ చిత్రం తమిళం కంటే తెలుగులోనే పెద్ద విజయం సాధించింది. ఆ మధ్య రీ రిలీజ్ చేస్తే అప్పుడూ అద్భుతమైన విజయం అందుకుందీ సినిమా. తాజాగా ఈ ప్రేమికుల రోజు సందర్భంగా మరోసారి తెలుగులో విడుదల కాబోతోంది.ఈ సందర్భంగా సి.ఎల్.ఎన్ మీడియా ప్రొడక్షన్ హౌస్ వారు మాట్లాడుతూ.. 'సూర్య సన్నాఫ్ కృష్ణన్ ప్రేమికుల రోజు సందర్భంగా మళ్లీ విడుదలవుతోంది. ఈ మూవీలో సూర్య అద్భుతమైన నటనతో మెప్పించారు. గౌతమ్ మీనన్ ప్రేమ నేపథ్యంలో ఓ కళాఖండాన్ని సృష్టించారు. హరీస్ జయరాజ్ మ్యూజిక్ ఇప్పటికీ అన్ని వేదికలపైనా పాటలు లేకుండా కనిపించదు. అంతటి ప్రజాదరణ పొందిన పాటలున్న చిత్రం ఇది. పివీఆర్ థియేటర్స్ వాళ్లు ఒక కంటెస్ట్ లవర్స్ డే వీక్ అనే ప్రోగ్రామ్ చేశారు. ఈనెల 14న రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్‌లో విడుదల కాబోతోంది. ఈ రెండు రాష్ట్రాలతో పాటు తెలుగు వర్షన్ కర్ణాటక, ఓవర్శీస్ మొత్తం మేమే విడుదల చేస్తున్నాం. ఇలాంటి చిత్రాన్ని విడుదల చేయడం మా సంస్థకు గర్వకారణం " అని అన్నారు. -
ధనుశ్ డైరెక్షన్లో లవ్ ఎంటర్టైనర్.. ట్రైలర్ చూశారా?
పవిష్, అనిఖా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, మాథ్యూ థామస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం 'జాబిలమ్మ నీకు అంత కోపమా'(Jaabilamma Neeku Antha Kopama Movie). ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ (Dhanush) దర్శకత్వం వహించారు. ఈ మూవీ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాను వండర్‌బార్ ఫిల్మ్స్ బ్యానర్లో స్తూరి రాజా, విజయలక్ష్మి కస్తూరి రాజా నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది.తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ చూస్తే ఇద్దరు ప్రేమజంటల స్టోరీనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు అర్థమవుతోంది. కథ మొత్తం రెండు ప్రేమజంటల చుట్టూ తిరిగే కథాంశంగా రూపొందించారు. ఈ చిత్రంలో వెంకటేష్ మీనన్, రబియా ఖాటూన్, రమ్య రంగనర్హన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. ఈ మూవీ ఫిబ్రవరి 21న థియేటర్లలో సందడి చేయనుంది.It's the season to fall in love ❤️✨ #JaabilammaNeekuAnthaKopama Trailer out now:https://t.co/ZTw9vcjKUkIn cinemas on Feb 21, 2025 💞🎬 Written and directed by @dhanushkraja#JNAK @gvprakash @wunderbarfilms @theSreyas @editor_prasanna @leonbrittodp @asiansureshent pic.twitter.com/SCu6o2G0Fi— Asian Suresh Entertainment (@asiansureshent) February 10, 2025 -
అజిత్ కుమార్ విదాముయార్చి.. ఆ సినిమా కంటే తక్కువగా తొలి రోజు కలెక్షన్స్!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ విదాముయార్చి యాక్షన్-థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. త్రిష హీరోయిన్గా నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి మగిజ్ తిరుమేని దర్శకత్వం వహించారు. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో అజిత్ ఫ్యాన్స్ సంబురాల్లో మునిగిపోయారు. తొలిరోజే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. దేశవ్యాప్తంగా రూ.22 కోట్ల నికర వసూళ్లు మాత్రమే సాధించింది.గతేడాది వచ్చిన అజిత్ మూవీ తునివు(తెగింపు) వసూళ్లను మాత్రం విదాముయార్చి అధిగమించలేకపోయింది. తునివు చిత్రం మొదటి రోజే రూ. 24.4 కోట్ల నికర వసూళ్లను సాధించింది. విదాముయార్చి కేవలం రూ.22 కోట్ల నెట్ కలెక్షన్స్‌కే పరిమితమైంది. అయితే వీకెండ్స్‌లోనైనా ఈ మూవీ వసూళ్లపరంగా రాణిస్తుందేమోనని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ సినిమా థియేటర్లలో ఆక్యుపెన్సీ పరంగా చూస్తే ఉదయం 58.81 శాతం, మధ్యాహ్నం 60.27 శాతం, సాయంత్రం షోలలో 54.79 శాతంగా నమోదైంది. తిరుచ్చి, పాండిచ్చేరిలలో చెన్నై కంటే ఎక్కువగా 92 శాతం, 91.67 శాతం ఆక్యుపెన్సీ నమోదు కాగా.. న్నైలో 88.33 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ నడిచాయి. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా.. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో సుభాస్కరన్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. -
అజిత్ మూవీకి షాక్.. కొన్ని గంటల్లోనే ఆన్లైన్లో ప్రత్యక్షం!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ విదాముయార్చి అనే సరికొత్త యాక్షన్-థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. త్రిష హీరోయిన్గా నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి మగిజ్ తిరుమేని దర్శకత్వం వహించారు. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో అజిత్ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. ఒక పక్కా అభిమానులు ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటుంటే.. మరోపక్క పైరసీ కేటుగాళ్లు చిత్ర బృందానికి షాకిచ్చారు. విడుదలైన కొన్ని గంటల్లోనే నెట్టింట్లో అప్లోడ్ చేసేశారు. దీంతో నిర్మాతలతో పాటు అజిత్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కొద్ది గంటల్లోనే నెట్టింట ప్రత్యక్షం..అయితే ఈ సినిమాను కూడా పైరసీ భూతం వదల్లేదు. విదాముయార్చి థియేటర్లలో రిలీజైన కొన్ని గంటల్లోనే నెట్టింట దర్శనమిచ్చింది. కొన్ని పైరసీ వెబ్ సైట్స్‌లో ఈ సినిమా కనిపించింది. దాదాపు నాలుగైదు వెబ్‌సైట్స్‌లో విదాముయార్తి ఫుల్ మూవీని అప్లోడ్ చేశారు. దీంతో చిత్ర నిర్మాతలు అందోళన వ్యక్తం చేస్తున్నారు. దయచేసి పైరసీని ప్రోత్సహించవద్దని.. టికెట్ కొని సినిమా చూడమని వేడుకుంటున్నారు. సినిమా రిలీజ్‌కు ముందే చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ విజ్ఞప్తి చేసినప్పటికీ పైరసీదారులు అస్సలు పట్టించుకోలేదు.కలెక్షన్లపై తీవ్ర ప్రభావం..విదాముయార్చి పైరసీ బారిన పడడంతో మూవీ కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడనుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన చిత్రం కావడంతో నిర్మాతలు ఆందోళనకు గురవుతున్నారు. నిర్మాణ సంస్థ ముందే విజ్ఞప్తి చేసిన పైరసీకి గురి కావడంతో అజిత్ ఫ్యాన్స్ కూడా తీవ్ర నిరాశలో ఉన్నారు. భారీ అంచనాలతో రికార్డ్ వసూళ్లు సాధిస్తుందనుకున్న విదాముయార్చికి పైరసీ భూతం అడ్డంకిగా మారింది. కాగా.. ఈ చిత్రంలో అర్జున్ సర్జా, రెజీనా కాసాండ్రా కీలక పాత్రల్లో నటించారు. తెలుగులో ఈ మూవీని పట్టుదల అనే పేరుతో విడుదల చేశారు.Every effort counts! 💪 Say NO to piracy and watch VIDAAMUYARCHI only in theatres! 🤩FEB 6th 🗓️ in Cinemas Worldwide 📽️✨#Vidaamuyarchi #Pattudala #EffortsNeverFail#AjithKumar #MagizhThirumeni @LycaProductions #Subaskaran @gkmtamilkumaran @trishtrashers @akarjunofficial… pic.twitter.com/WigarpFJ34— Lyca Productions (@LycaProductions) February 5, 2025 -
హద్దులు మీరిన అభిమానం.. థియేటర్లోనే అరాచకం!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) విదాముయార్చి (Vidaamuyarchi Movie) మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మగిత్ తిరుమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇవాళ థియేటర్లలో విడుదలైంది. అభిమానుల భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తోంది. దీంతో తలా అంటూ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. థియేటర్ల వద్ద బాణాసంచా కాలుస్తూ అభిమాన హీరో సినిమాను సెలబ్రేట్ చేసుకుంటున్నారు.రిలీజ్ మొదటి రోజు కొందరు ఫ్యాన్స్ మాత్రం ఓవరాక్షన్ చేశారు. ఏకంగా థియేటర్ లోపల బాణాసంచా పేల్చి అరాచకం సృష్టించారు. మరికొందరు అభిమానులైతే థియేటర్ వెలుపల పోలీసులతో గొడవపడ్డారు. కొందరు ఫ్యాన్స్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.అగ్నిప్రమాదం జరిగి ఉంటే..అజిత్ కుమార్ ఫ్యాన్స్ చేసిన పనికి నెటిజన్స్ మండిపడుతున్నారు. థియేటర్ వెలుపల బాణాసంచా కాల్చి సినిమాను సెలబ్రేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. అదే సమయంలో అగ్ని ప్రమాదం జరిగి ఉంటే మీ అందరి ప్రాణాలు పోయేవని హెచ్చరిస్తున్నారు. పోలీసుల ఆదేశాలు పాటించకుండా అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా హీరోపై అభిమానం ఉండాలే కానీ.. అది ప్రాణాలు తీసేలా ఉండకూడదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.Sambavam pannitanuga😭😭😭#VidaaMuyarchi #VidaaMuyarchiBookings https://t.co/GI1XfPHbM3 pic.twitter.com/yvQucbNe82— 𝓐𝓻𝓪𝓿𝓲𝓷𝓭❤️ (@_Aravind_15) February 5, 2025 -
నెల రోజుల్లోపే ఓటీటీకి సంక్రాంతి చిత్రం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కోలీవుడ్ స్టార్ జయం రవి, నిత్యామీనన్ జంటగా నటించిన చిత్రం కాదలిక్కా నేరమిల్లై(Kadhalikka Neramillai). ఈ సినిమాను కృతిక ఉదయనిధి తెరకెక్కించారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజైంది. కోలీవుడ్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. జనవరి 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం తాజాగా ఓటీటీకి(OTT) వచ్చేందుకు సిద్ధమైంది.పొంగల్ కానుకగా థియేటర్లలో ఫ్యాన్స్‌ను అలరించిన కాదలిక్కా నేరమిల్లై ఈ నెల 11 నుంచే ఓటీటీలో సందడి చేయనుంది. ఈ మేరకు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించింది. దీంతో నెల రోజుల్లోపే ఓటీటీ ప్రియులను అలరించనుంది కాదలిక్కా నేరమిల్లై మూవీ.(ఇది చదవండి: వారికేమో ముద్దులు, హగ్గులు.. అభిమానితో అలాగేనా?.. హీరోయిన్‌పై నెటిజన్స్ ఫైర్!)కాగా.. ఈ చిత్రానికి తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ నిర్మాతగా వ్యవహరించారు. ఆయన సతీమణి కృతిక ఉదయనిధి దర్శకత్వం వహించారు. దర్శకురాలిగా ఆమెకు ఇది మూడో సినిమా కావడం మరో విశేషం. ఈ చిత్రంలో జయం రవి, నిత్యతో పాటు యోగి బాబు, వినయ్, లాల్, లక్ష్మీ రామకృష్ణన్, వినోదిని, గాయకుడు మనో, టీజే బాను, జాన్ కోగన్ ప్రధాన పాత్రలు పోషించారు. రెడ్ జెయింట్ మూవీస్ నిర్మించనున్న ఈ చిత్రానికి మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రఘుమాన్ సంగీతం అందించారు.తెలుగులో నిత్యా మీనన్ కెరీర్..అలా మొదలైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది నిత్యా మీనన్. అలా మొదటి చిత్రంతోనే జనాలకు బాగా నచ్చేసింది. 180, ఇష్క్, జబర్దస్త్, గుండె జారి గల్లంతయ్యిందే, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, సన్నాఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి, ఒక అమ్మాయి తప్ప, జనతా గ్యారేజ్, అ, నిన్నిలా నిన్నిలా, భీమ్లా నాయక్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తమిళంలో ఇడ్లీ కడాయ్, డియర్ ఎక్సెస్ సహా మరో సినిమా చేస్తోంది. Kadhalargal gavanathirkku 👀💕… kadhalikka neram odhikkirunga, yaena…Kadhalikka Neramillai is coming soon to Netflix on 11 February, in Tamil, Telugu, Malayalam, Kannada and Hindi!#KadhalikkaNeramillaiOnNetflix pic.twitter.com/nuAQsDsjy9— Netflix India South (@Netflix_INSouth) February 6, 2025 -
ఎముకలు కొరికే చలిలో షూటింగ్.. పట్టువదలని విక్రమార్కుడిలా స్టార్ హీరో
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) విదాముయార్చి(Vidaamuyarchi Movie)తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాకు మగిజ్ తిరుమేని దర్శకత్వం వహించగా.. త్రిష హీరోయిన్గా నటించారు. అర్జున్ సర్జా కీలక పాత్ర పోషించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్డెట్‌తో నిర్మించింది. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కాగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్‌లోనూ రికార్డ్ స్థాయి వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఈ చిత్రానికి తెలుగులో పట్టుదల అనే టైటిల్ ఖరారు చేశారు.అయితే ఈ మూవీని అజర్ బైజాన్ అనే దేశంలో చిత్రీకరించారు. ఇందులో కారుతో అజిత్ కుమార్ కొన్ని రియల్ స్టంట్స్ కూడా చేశారు. ఆ సమయంలో ఓసారి అజిత్ నడుపుతున్న కారు అదుపుతప్పి కిందపడిపోయింది. అజిత్ కుమార్‌కు కారు రేసింగ్‌తో రియల్ స్టంట్స్ చేయడమంటే సరదా. అలా సినిమాల్లోనూ డూప్ లేకుండానే రియల్‌గా కొన్ని సీన్స్ చేస్తుంటారు.తాజాగా విదాముయార్చి ఓ వీడియోను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసింది. విదాముయార్చి షూటింగ్ సమయంలో ఎదురైన పరిస్థితులను వీడియో రూపంలో ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఇందులో అజిత్ కుమార్ స్టంట్స్‌తో పాటు.. ఎముకలు కొరికే చలిలోనూ షూటింగ్ చేసిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. వాతావరణం అత్యంత కఠిన పరిస్థితుల్లోనూ ఈ మూవీని షూట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. అదేంటో మీరు కూడా చూసేయండి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.The toughest challenges forge the greatest triumphs! 🔥 Step behind the scenes of VIDAAMUYARCHI 💪 Pushing limits in the harshest terrains. ⛰️🔗 https://t.co/WPFLwCykLRFEB 6th 🗓️ in Cinemas Worldwide 📽️✨#Vidaamuyarchi #Pattudala #EffortsNeverFail#AjithKumar… pic.twitter.com/haDfk8fono— Lyca Productions (@LycaProductions) February 3, 2025 -
విజయ్ సేతుపతిని కాలితో తన్నిన వ్యక్తి.. వీడియో వైరల్!
తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ఇటీవలే విడుదల పార్ట్-2తో (viduthala Part-2) ప్రేక్షకుల ముందుకొచ్చారు. స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ కాంబినేషన్లో వచ్చిన విడుదల పార్ట్- 1 సీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ సినిమాలో ఓటీటీలో సందడి చేస్తోంది. జనవరి 19 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో సూరి, మంజు వారియర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, భవానీ శ్రీ ప్రధాన పాత్రలు పోషించారు.(ఇది చదవండి: ఓటీటీలో విడుదల 2.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)అయితే తాజాగా విజయ్ సేతుపతికి చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఎయిర్‌పోర్ట్‌లో నడుచుకుంటూ వెళ్తున్న విజయ్‌ని వెనక నుంచి దూసుకొచ్చిన ఓ వ్యక్తి కాలితో తన్నాడు. పక్కనే సీఆర్పీఎఫ్ సిబ్బంది వెంటనే అతన్ని అడ్డుకున్నారు. అంతేకాకుండా అక్కడే వారంతా ఆ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అయితే ఈ ఘటన మూడేళ్ల క్రితం జరగ్గా.. తాజాగా ఓ నెటిజన్ ఈ వీడియోను ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. అప్పట్లో బెంగళూరులో ఎయిర్‌పోర్ట్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది.Ithu eppa nadanthathu..🥹🙄..Enna @VijaySethuOffl sollave illa..🤭..But it was a nice Kick 😉..#BiggBossTamil #BiggBossTamil8 #BiggBoss8Tamil #BiggBossTamilSeason8#BiggBossTamil8Season #VijaySethupathi #VJS pic.twitter.com/XRtsMl31yo— BiggBossTamil8 (@BigBossTamilOTT) January 28, 2025 -
మా నాన్న బతికుంటే ఇంకా సంతోషంగా ఉండేది: అజిత్ కుమార్
తనకు పద్మభూషణ్ అవార్డ్(padma Bhushan Award) ప్రకటించడంపై కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌కుమార్ (Ajith Kumar) స్పందించారు. ఈ అవార్డ్ ప్రకటించినందుకు ముందుగా భారత ప్రభుత్వం, సినిమా రంగానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు చూడటానికి మా నాన్న పి సుబ్రమణ్యం బతికుంటే ఇంకా సంతోషపడే వాడినని అన్నారు. అలాగే నా ప్రయాణంలో మద్దతుగా నిలిచిన తల్లి మోహిని, భార్య షాలిని, పిల్లలు అనౌష్క, ఆద్విక్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.కాగా.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 25న భారత ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. సినీ రంగానికి చెందిన వారిలో అజిత్‌కుమార్, నందమూరి బాలకృష్ణ, శోభనతో పాటు మరికొందరికి పద్మభూషణ్ అవార్డులను ప్రకటించారు. ఈ సందర్భంగా తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు."భారత రాష్ట్రపతి నుంచి గౌరవ పద్మ అవార్డును స్వీకరిస్తున్నందుకు నాకు చాలా గౌరవంగా ఉంది. ఈ ప్రతిష్టాత్మక గౌరవానికి ఎంపిక చేసిన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇంత స్థాయిలో గుర్తింపు పొందడం, అలాగే దేశానికి నా కృషిని గుర్తించినందుకు కృతజ్ఞుడను. ఈ గుర్తింపు కేవలం వ్యక్తిగత ప్రశంస మాత్రమే కాదు. చాలా మంది సమిష్టి కృషి, మద్దతు వల్లే ఇది సాధ్యమైంది. ముఖ్యంగా చిత్ర పరిశ్రమ సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రేరణ, సహకారం, మద్దతు నా ప్రయాణంలో కీలక పాత్ర పోషించాయి " అని అజిత్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.కాగా.. ప్రస్తుతం అజిత్ కుమార్ (Ajith Kumar) విదాముయార్చి (Vidaamuyarchi Movie) మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాకు మగిజ్ తిరుమేని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించారు. అర్జున్ సర్జా కీలక పాత్ర పోషించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్డెట్‌తో నిర్మించారు. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి తెలుగులో పట్టుదల అనే టైటిల్ ఖరారు చేశారు. ట్రైలర్ చూస్తుంటే మాఫియా నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.ముందుగా అనుకున్న ప్రకారం ఈ సంక్రాంతికే విదాముయార్చి విడుదల కావాల్సి ఉంది. కానీ అనివార్య కారణాలతో వాయిదా వేయాల్సి వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
తప్పతాగిన నటుడు.. అర్ధనగ్నంగా కేకలు వేస్తూ.. వీడియో వైరల్!
రజినీకాంత్ జైలర్ మూవీ పేరు వినగానే ఆయనే గుర్తుకు వస్తారు. వర్త్ వర్మ వర్త్ అనే డైలాగ్‌తో అభిమానులను అలరించారు. గతేడాది విడుదలైన ఈ చిత్రం రజినీకాంత్ ఖాతాలో సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ మూవీలో తనదైన విలనిజంతో ఎంత ఫేమస్ అయ్యాడో అదే స్థాయిలో వివాదాల్లోనూ నిలిచారు. గతంలో వినాయకన్‌ని కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. జీపులో స్టేషన్ కి కూడా తీసుకెళ్లారు. మద్యం ఫుల్‌గా తాగేసి పబ్లిక్ ప్లేసులో అసభ్యంగా ప్రవర్తించడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఆ విషయం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.వీడియో వైరల్..తాజాగా వినాయకన్కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఫుల్‌గా తాగి గట్టిగా అరుస్తూ ఆ వీడియోలో కనిపించారు. ఈ వీడియోను ఓ నెటిజన్ ట్విటర్లో పోస్ట్ చేయడంతో క్షణాల్లోనే వైరల్‌గా మారింది. ఇందులో వినాయకన్ అర్ధనగ్నంగా కనిపించారు. అయితే ఈ వీడియో ఆయన ఇంట్లో బాల్కనీలో ఉండగా తీసినట్లు తెలుస్తోంది. విజువల్స్ చూస్తే ఎవరితోనో గొడవ పడుతున్నట్లు అర్థమవుతోంది. ఏదేమైనా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వినాయకన్ ప్రవర్తనపై నెటిజన్స్ మండిపడుతున్నారు. సినిమాల నుంచి అతన్ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.హైదరాబాద్‌లోనూ న్యూసెన్స్..గతంలో జైలర్ నటుడు వినాయకన్ మద్యం మత్తులో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌పై దాడి చేయడంతో హైదరాబాద్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత తనను ఎందుకు కస్టడీలోకి తీసుకుంటున్నారో అర్థం కావడం లేదని వాపోయాడు. వినాయకన్.. కొచ్చి నుంచి హైదరాబాద్ మీదుగా గోవా వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.కాగా మలయాళ నటుడైన వినాయకన్.. రజనీకాంత్ జైలర్ సినిమాలో వర్మ పాత్రతో మరింత పాపులర్ అయ్యాడు. పలు మలయాళ సినిమాల్లో నటించాడు. మలయాళ, తమిళ సినిమాల్లో చేస్తున్న వినాయకన్.. తెలుగులో కల్యాణ్ రామ్ 'అసాధ్యుడు'లో సెకండ్ విలన్‌గా నటించాడు. చివరిసారిగా ఇటీవల రిలీజైన ఉన్ని ముకుందన్ చిత్రం మార్కోలో కనిపించారు. #Vinayakan 🥃🔞🙉Actor or Drunker 😡He should be banned from acting.pic.twitter.com/JK3UWJTzop— Tharani ᖇᵗк (@iam_Tharani) January 20, 2025 -
అజిత్ కుమార్ విదాముయార్చి.. రెండో లిరికల్ సాంగ్ వచ్చేసింది!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) నటించిన తాజా చిత్రం విదాముయార్చి(Vidaamuyarchi Movie). ఈ సినిమాకు మగిజ్ తిరుమేని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించారు. అర్జున్ సర్జా కీలక పాత్ర పోషించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్డెట్‌తో నిర్మించారు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కాగా.. రికార్డ్ స్థాయి వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో అభిమానులకు మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. కాగా.. ఈ చిత్రానికి తెలుగులో పట్టుదల అనే టైటిల్ ఖరారు చేశారు.తాజాగా ఈ మూవీ నుంచి రెండో లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. పతికిచ్చు అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు. ఈ సాంగ్ అజిత్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సంక్రాంతికి వాయిదా..ముందుగా అనుకున్న ప్రకారం ఈ సంక్రాంతికే విదాముయార్చి విడుదల కావాల్సి ఉంది. కానీ అనివార్య కారణాలతో వాయిదా వేయాల్సి వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.రేస్ గెలిచిన అజిత్..ఇటీవల దుబాయ్‌లో జరిగిన 24హెచ్ కారు రేసులో అజిత్ టీమ్ మూడోస్థానంలో నిలిచింది. అజిత్ దాదాపు 15 సంవత్సరాల విరామం తర్వాత అజిత్ తిరిగి రేసింగ్‌కు వచ్చాడు. దీంతో అజిత్ టీమ్‌పై సినీ తారలు ప్రశంసలు కురిపించారు. రేస్ గెలిచిన అనంతరం అజిత్ జాతీయజెండా పట్టుకుని సంతోషం వ్యక్తం చేశారు.మైత్రి మూవీ మేకర్స్‌తో సినిమా..అజిత్ కుమార్ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌తో జతకట్టారు. ఆయన హీరోగా తెరకెక్కిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఇందులోనూ త్రిషనే హీరోయిన్గా నటిస్తోంది . ‘మార్క్ ఆంటోని’ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీని వేసవిలో ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. #PATHIKICHU Out Now 💥➡️ https://t.co/BDeqesYfGc#AjithKumar #VidaaMuyarchi pic.twitter.com/9fDtLofv7h— Ajith Kumar (@ThalaFansClub) January 19, 2025 -
అజిత్ కుమార్ 'విదాముయార్చి'.. తెలుగు ట్రైలర్ వచ్చేసింది
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) నటించిన తాజా చిత్రం విదాముయార్చి(Vidaamuyarchi Movie). ఈ సినిమాకు మగిజ్ తిరుమేని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించారు. అర్జున్ సర్జా కీలక పాత్ర పోషించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్డెట్‌తో నిర్మించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. కాగా.. ఈ చిత్రానికి తెలుగులో పట్టుదల అనే టైటిల్ ఖరారు చేశారు. ట్రైలర్ చూస్తే ఈ సినిమా అంతా అజర్ బైజాన్‌లోనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్లో కార్లతో అజిత్ స్టంట్స్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ముఖ్యంగా అర్జున్ సర్జాతో వచ్చే సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్ చూస్తుంటే మాఫియా నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.ముందుగా అనుకున్న ప్రకారం ఈ సంక్రాంతికే విదాముయార్చి విడుదల కావాల్సి ఉంది. కానీ అనివార్య కారణాలతో వాయిదా వేయాల్సి వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.కారు రేస్ గెలిచిన అజిత్..ఇటీవల దుబాయ్‌లో జరిగిన 24హెచ్ కారు రేసులో అజిత్ టీమ్ మూడోస్థానంలో నిలిచింది. అజిత్ దాదాపు 15 సంవత్సరాల విరామం తర్వాత అజిత్ తిరిగి రేసింగ్‌కు వచ్చాడు. దీంతో అజిత్ టీమ్‌పై సినీ తారలు ప్రశంసలు కురిపించారు. రేస్ గెలిచిన అనంతరం అజిత్ జాతీయజెండా పట్టుకుని సంతోషం వ్యక్తం చేశారు.అజిత్ కుమార్‌కు ప్రమాదం..రేసు ప్రారంభానికి ముందే తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్‌కు(Ajith Kumar) పెను ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. దుబాయ్‌లో జరుగుతున్న రేసింగ్‌లో ఆయన నడుపుతున్న కారు పక్కనే ఉన్న ట్రాక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో అజిత్‌కు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారు రేసింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అజిత్ ప్రమాదం నుంచి బయటపడడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.మైత్రి మూవీ మేకర్స్‌తో సినిమా..అజిత్ కుమార్ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌తో జతకట్టారు. ఆయన హీరోగా తెరకెక్కిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఇందులోనూ త్రిషనే హీరోయిన్గా నటిస్తోంది . ‘మార్క్ ఆంటోని’ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీని వేసవిలో ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. Persistence is the path, Victory is the destination. 💥 The VIDAAMUYARCHI & PATTUDALA Trailer is OUT NOW. ▶️🔗 Tamil - https://t.co/zKlPqI9XGE🔗 Telugu - https://t.co/mYt21igQIsFEB 6th 🗓️ in Cinemas Worldwide 📽️✨#Vidaamuyarchi #Pattudala #EffortsNeverFail#AjithKumar… pic.twitter.com/wTL2C1tZHP— Lyca Productions (@LycaProductions) January 16, 2025 -
పక్కవాడితో నీకెందుకు.. ముందు నువ్వు బాగుండాలి కదా?: అజిత్ కుమార్
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముఖ్యంగా అభిమానులను ఉద్దేశించిన ఆయన చేసిన కామెంట్స్ తెగ వైరలవుతున్నాయి. ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడటం వల్ల ఏ మాత్రం ఉపయోగం ఉండదని ఫ్యాన్స్‌కు సూచించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో జరిగే ఫ్యాన్స్ వార్‌పై ఆయన మాట్లాడారు.అజిత్ మాట్లాడుతూ.. 'ఇతరుల విషయాల్లో ఎవరూ జోక్యం చేసుకోవద్దు. మీరు చేయాల్సిన పనిపై ముందు దృష్టి పెట్టండి. ఇతరుల గురించి ఆలోచిస్తూ మీరు టైన్షన్ తెచ్చుకోకండి. అలాంటి వాటితో మీకేలాంటి ఉపయోగం ఉండదు. ముందు మీ లైఫ్ గురించి ఆలోచించండి. నేను నా అభిమానులకు కూడా ఇదే చెబుతా. సినిమాలు చూడటం వరకు ఓకే.. కానీ జై అజిత్.. జై విజయ్ అంటుంటే జై కొడుతూ ఉంటే నువ్వెప్పుడు బాగుపడతావ్. మీ చూపిస్తున్న ప్రేమకు నాకు ఆనందంగానే ఉంటుంది. కానీ మీ జీవితం బాగున్న తర్వాతే కదా ఏదైనా. నా ఫ్యాన్స్ ఆనందంగా ఉన్నారని తెలిసినప్పుడే నాకు సంతోషంగా అనిపిస్తుంది' అని అన్నారు.కాగా.. ఇటీవల దుబాయ్ కారు రేసింగ్‌లో అజిత్ టీమ్ మూడో స్థానంలో నిలిచింది. అజిత్ కారు రేసింగ్ గెలవడంపై సినీ ప్రముఖులు ఆయనపై ప్రశంసలు కురిపించారు. రేస్ గెలిచిన తర్వాత జాతీయ జెండా పట్టుకుని అజిత్ సంతోషం వ్యక్తం చేశారు. విదాముయార్చి వాయిదా..కోలీవుడ్ స్టార్ ప్రస్తుతం అజిత్ కుమార్(ajith Kumar) విదాముయార్చి మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఊహించని కారణాలతో ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కాలేదు. ఈ సినిమాకు మగిళ్ తిరుమేని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించారు. అర్జన్ సర్జా కీలక పాత్ర పోషించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్డెట్లో నిర్మించారు.మైత్రి మూవీ మేకర్స్‌తో సినిమా..అజిత్ కుమార్ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌తో జతకట్టారు. ఆయన హీరోగా తెరకెక్కిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఇందులోనూ త్రిషనే హీరోయిన్గా నటిస్తోంది . ‘మార్క్ ఆంటోని’ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీని వేసవిలో ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. -
ఇండస్ట్రీ సపోర్ట్ చేయలేదు.. వారికోసమే ఇంకా బతికి ఉన్నా: స్టార్ డైరెక్టర్
మలయాళ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి ఎవరూ కూడా కాల్ చేయలేదని అన్నారు. అసలేం జరిగిందో కూడా తెలుసుకోవడానికి ఎవరూ ప్రయత్నం చేయలేదన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన వాసుదేవ్ మీనన్ అవసరమైనప్పుడు ఎవరూ సహకరించలేదని అసహనం వ్యక్తం చేశారు.గౌతమ్ వాసుదేవ్ మీనన్ మాట్లాడుతూ..' ఈ విషయం గురించి మాట్లాడుతున్నందుకు ఎంతో బాధగా ఉంది. 2017లో నా సినిమా ధృవ నచ్చితిరమ్(తెలుగులో ధృవనక్షత్రం) విడుదల కాలేదు. కానీ ఇండస్ట్రీలో నాకు సాయం చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. కనీసం నా సమస్య గురించి ఎవరూ కూడా ఫోన్ చేయలేదు. అసలేం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. కేవలం ధనుశ్ సార్, లింగుసామి లాంటి వ్యక్తులు నా సినిమా చూశారు. విడుదల చేసేందుకు ప్రయత్నిచారు. కానీ వారికి ఉన్న సమస్యల వల్ల వీలుకాలేదు. మరికొందరికి ఈ సినిమా చూపించాను. కానీ కొన్ని సమస్యల వల్ల ఎవరూ ముందుకు రాలేదు. ప్రేక్షకులు ఇప్పటికీ సినిమాని చూడాలని కోరుకుంటున్నందు వల్లే ఇంకా నేను బతికి ఉన్నా.' అని అన్నారు. కాగా.. 2017లో విక్రమ్ హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ ధృవ నచ్చతిరమ్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో రీతూ వర్మ, ఆర్ పార్తిబన్, రాధిక శరత్‌కుమార్, సిమ్రాన్, వినాయకన్ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటించారు. ఏడేళ్ల క్రితమే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆర్థిక సమస్యల కారణంగా విడుదల కాలేదు. దీనిపై ఇప్పటికే పలుమార్లు గౌతమ్ వాసుదేవ్ మేనన్ అసహనం వ్యక్తం చేశారు. గౌతమ్ చాలా సంవత్సరాలుగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్రయత్నించాడు.నటుడిగా రాణిస్తున్న డైరెక్టర్గౌతమ్ వాసుదేవ్ మీనన్ నటనలో దూసుకెళ్తున్నారు. చివరిసారిగా 2024లో రత్నం, హిట్ లిస్ట్, హిట్లర్. విడుతలై పార్ట్- 2 చిత్రాలలో కనిపించాడు. అంతే కాకుండా త్వరలో వరాహం, బజూకా, తలపతి 69 చిత్రాల్లో నటించనున్నాడు. త్వరలోనే మలయాళంలో డొమినిక్ అండ్ లేడీస్ పర్స్ అనే మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 23న విడుదలవుతోంది. అతని చివరిసారిగా దర్శకత్వం వహించిన 2024 చిత్రం జాషువా ఇమై పోల్ కాఖా ఇంకా విడుదల కాలేదు. -
'మీరు అనుకున్నది సాధిస్తే'.. ప్రమాదం తర్వాత అజిత్ వీడియో రిలీజ్!
కోలీవుడ్ స్టార్ ప్రస్తుతం అజిత్ కుమార్(ajith Kumar) విదాముయార్చి మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పొంగల్ బరిలో నిలిచింది. కానీ ఊహించని కారణాలతో ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కాలేదు. ఈ సినిమాకు మగిళ్ తిరుమేని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించారు. అర్జన్ సర్జా కీలక పాత్ర పోషించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్డెట్లో నిర్మించారు.అయితే ఇటీవల తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్‌కు(Ajith Kumar) పెను ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. దుబాయ్‌లో జరుగుతున్న రేసింగ్‌లో ఆయన నడుపుతున్న కారు పక్కనే ఉన్న ట్రాక్‌ను ఢీకొట్టారు. ఈ ఘటనలో అజిత్‌కు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారు రేసింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేసింది. అజిత్ ప్రమాదం నుంచి బయటపడడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.ఈ ప్రమాదం జరిగిన తర్వాత తొలిసారిగా అజిత్ ఓ వీడియో సందేశం రిలీజ్ చేశారు. మోటార్‌స్పోర్ట్స్ పట్ల తనకున్న ఇష్టాన్ని వెల్లడించారు. అలాగే కుటుంబం, హార్ట్ వర్క్, సక్సెస్, ఫెయిల్యూర్‌ను జీవితంలో సమానంగా చూడాలని అభిమానులకు సూచించారు. ప్రస్తుతం దుబాయ్‌లో జరగనున్న 24హెచ్ కారు రేసింగ్‌లో అజిత్ పాల్గొంటున్నారు.ఈ వీడియోలో అజిత్ మాట్లాడుతూ.. 'నేను చాలా సంతోషంగా ఉన్నా. మోటార్ స్పోర్ట్స్ నా జీవితాంతం ఇష్టమైంది. చాలా మంది అభిమానులు ఇక్కడకు వచ్చారు. మీరందరూ సంతోషం, ఆరోగ్యంతో పాటు ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని నేను కోరుకుంటున్నా. ముందు మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి. సమయాన్ని వృథా చేయకండి. బాగా చదవండి. కష్టపడి పనిచేయండి. జీవితంలో మీకు నచ్చినది చేసినప్పుడు విజయం సాధిస్తే దాని ఫలితం అద్భుతంగా ఉంటుంది. అంతే కానీ, విజయం సాధించకలేకపోయామని అక్కడే ఆగిపోవద్దు. ఈ ప్రపంచంలో పోటీ చాలా ముఖ్యం. ఎప్పటికైనా మీ సంకల్పం, అంకితభావాన్ని వదులుకోవద్దు. మీ అందరినీ ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా' అంటూ రిలీజ్ చేశారు.కార్ రేసింగ్ గురించి మాట్లాడుతూ.. ' రేసింగ్ అనేది ఇతర క్రీడల మాదిరిగా వ్యక్తిగత క్రీడ కాదు. మీరు స్ప్రింట్ రేసర్లను చూసి ఉండవచ్చు. కానీ ఇందులో నలుగురు, ఐదుగురు డ్రైవర్లు ఒకే కారు నడుపుతారు. కాబట్టి మనమందరం అందరి పనితీరుకు బాధ్యత వహించాలి. మన కారును జాగ్రత్తగా చూసుకోవాలి. అదే సమయంలో మనం ల్యాప్ టైమింగ్‌లను సాధించాలి. ఇందులో సిబ్బంది, మెకానిక్స్, లాజిస్టికల్ సపోర్ట్‌తో పాటు డ్రైవర్ల సమష్టి కృషి ఉంటుంది. ఇది సినిమా పరిశ్రమ లాంటిది. ప్రతి ఒక్కరూ తమ పాత్రపై దృష్టి పెడితే ఫలితాలు వస్తాయి' అని అన్నారు.కాగా.. అజిత్ దాదాపు 15 సంవత్సరాల విరామం తర్వాత తిరిగి రేసింగ్‌కు వచ్చాడు. అతని జట్టు ఈ కారు రేసింగ్‌లో పోటీపడుతోంది. రేసింగ్ జట్టు యజమానిగా తాను రేసింగ్‌లో పాల్గొంటానని అజిత్ తెలిపారు.మైత్రి మూవీ మేకర్స్‌తో సినిమా..అజిత్ కుమార్ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌తో జతకట్టారు. ఆయన హీరోగా తెరకెక్కిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఇందులోనూ త్రిషనే హీరోయిన్గా నటిస్తోంది . ‘మార్క్ ఆంటోని’ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీని వేసవిలో ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. Ak. My fans Their commitments. pic.twitter.com/5fW17Gghgu— Suresh Chandra (@SureshChandraa) January 11, 2025 -
అజిత్ కుమార్‌కు తప్పిన పెను ప్రమాదం.. వీడియో వైరల్!
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్‌కు(Ajith Kumar) పెను ప్రమాదం తప్పింది. దుబాయ్‌లో జరుగుతున్న రేసింగ్‌లో ఆయన నడుపుతున్న కారు పక్కనే ఉన్న ట్రాక్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అజిత్‌కు స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది. రేసింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా కారు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంక్రాంతి బరిలో అజిత్..కాగా.. అజిత్ కుమార్ హీరోగా ప్రస్తుతం ‘విడాముయర్చి మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మగిళ్ తిరుమేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో అర్జున్ సర్జా ప్రధాన పాత్ర పోషించారు. లైకా ప్రోడక్షన్స్ బ్యానర్‌పై జీకేఎం తమిళ్ కుమరన్ నేతృత్వంలో సుభాస్కరన్ నిర్మించిన ఈ సినిమా ఈ సంక్రాంతికి విడుదల కానుంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన విడాముయార్చి సినిమా టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. దీంతో మా మూవీపై అంచ నాలు మరింతగా పెరిగాయి. ఈ చిత్రంలో ఆరవ్, రెజీనా కసండ్రా, నిఖిల్ నాయర్ కీలక పాత్రల్లో నటించారు.మైత్రి మూవీ మేకర్స్‌తో మరో సినిమా..అజిత్ కుమార్ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌తో జతకట్టారు. ఆయన హీరోగా తెరకెక్కిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఇందులోనూ త్రిషనే హీరోయిన్గా నటిస్తోంది . ‘మార్క్ ఆంటోని’ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.వేసవిలో రిలీజ్..ఈ మూవీని వేసవిలో ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ మేరకు కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. అజిత్‌పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. ఇండియన్ మూవీ చరిత్రలోనే గుడ్ బ్యాడ్ అగ్లీ ఓ మైలురాయిగా నిలుస్తుందిని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతం అందించారు. కాగా ఈ చిత్రాన్ని తొలుత సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ వీలు కాకపోవడంతో ఏప్రిల్‌కు రిలీజ్ కానుంది. Ajith Kumar’s massive crash in practise, but he walks away unscathed.Another day in the office … that’s racing!#ajithkumarracing #ajithkumar pic.twitter.com/dH5rQb18z0— Ajithkumar Racing (@Akracingoffl) January 7, 2025 -
చైనాలో మహారాజా జోరు.. నెల రోజుల్లోనే రికార్డ్!
తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన చిత్రం మహారాజా. గతేడాది థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని నితిలన్ సామినాథన్ తెరకెక్కించారు. విజయ్ సేతుపతి కెరీర్లో 50వ ప్రాజెక్ట్‌గా వచ్చిన మహారాజా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 100 కోట్లు పైగానే రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక్కడి ప్రేక్షకులను మెప్పించిన ఈ చిత్రం ప్రస్తుతం చైనాలోనూ వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది.విజయ్ సేతుపతి లీడ్ రోల్లో నటించిన ఈ తమిళ యాక్షన్ థ్రిల్లర్ చైనాలోనూ విడుదలైంది. రెండు రోజుల్లోనే రూ.20 కోట్లు రాబట్టిన ఈ చిత్రం వంద కోట్ల మార్క్ దిశగా దూసుకెళ్తోంది. అక్కడ విడుదలైన నెల రోజుల్లోనే ఈ చిత్రం రూ. 100 కోట్ల మార్కుకు చేరువైంది. గత ఐదేళ్లలో చైనాలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా అవతరించింది. ఈ విషయాన్ని చైనా రాయబార కార్యాలయ అధికారి సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఇండియాలోని చైనా ఎంబసీ ప్రతినిధి యు జింగ్ ట్వీట్ చేశారు.చైనా అధికారి ట్వీట్.. 2018 తర్వాత చైనాలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచిందని యు జింగ్ పోస్టర్‌ను షేర్ చేసింది. ప్రస్తుతం రూ.91.55 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు వెల్లడించింది. తూర్పు లడఖ్‌లో ఇరుదేశాల మధ్య ప్రతిష్టంభన ముగిసన తర్వాత చైనాలో విడుదలైన మొదటి భారతీయ చిత్రం మహారాజానే కావడం మరో విశేషం. చైనాలో ఈ చిత్రం తొలిరోజే రూ. 15.6 కోట్లు వసూళ్లు సాధించింది. ప్రముఖ చైనీస్ మూవీ రివ్యూ సైట్ డౌబన్‌లో ఈ చిత్రానికి 8.7/10గా అత్యధికంగా రేటింగ్ ఇచ్చింది. చైనాలో మహారాజా రెండు రోజులకు రూ. 20 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇదే విషయాన్ని స్థానిక బాక్సాఫీస్ ట్రాకర్ అయిన ENT గ్రూప్ ప్రకటించింది. రెండు రోజులకు 2.3 లక్షల టికెట్లు అమ్ముడుపోయినట్లు ఆ సంస్థ తెలిపింది. అలాగే ఇటీవల చైనాలో అత్యధిక రేటింగ్ పొందిన భారతీయ చిత్రాలలో ఒకటిగా మహారాజా ఘనతను సొంతం చేసుకుంది. ఇదే జోరు కొనసాగితే మహారాజా త్వరలోనే చైనాలో సుమారు రూ. 300 కోట్లు రాబట్టవచ్చని అక్కడి ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.కాగా.. నితిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన మహారాజాలో అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, నట్టి నటరాజ్ కూడా నటించారు. ఈ కథ చెన్నైలోని మహారాజా అనే వ్యక్తి తన డస్ట్‌బిన్ కోసం పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించడం అనే కథాంశంతో తెరకెక్కించారు. ఇండియాలో జూన్ 14న విడుదలైన మహారాజా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగానే వసూలు చేసింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలోనూ అందుబాటులో ఉంది. కాగా.. గతంలో అమీర్ ఖాన్ దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్, ఆయుష్మాన్ ఖురానా నటించిన అంధాధున్, రాణి ముఖర్జీ చిత్రం హిచ్కీ వంటి భారతీయ చిత్రాలు మాత్రమే చైనాలో మంచి ప్రదర్శన కనబరిచాయి.Maharaja has become the highest-grossing Indian film in China since 2018, reaching Rs 91.55 crore. Well done👍👍 pic.twitter.com/sq9SUY8D5F— Yu Jing (@ChinaSpox_India) January 5, 2025 -
విజయ్ సేతుపతి మూవీ.. తెలుగు ట్రైలర్ వచ్చేసింది!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటిస్తోన్న తాజా చిత్రం విడుదల-2. గతంలో విడుతలై(విడుదల) మూవీకి కొనసాగింపుగా ఈ సినిమాను తీసుకొస్తున్నారు. వెట్రిమారన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పీరియాడికల్ మూవీగా వస్తోన్న ఈ చిత్రంలో సూరి కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పటికే తమిళ ట్రైలర్ విడుదల చేసిన మేకర్స్.. తాజాగా తెలుగు వర్షన్ రిలీజ్ చేశారు. -
అలాంటి వారికే నేనేంటో తెలుస్తుంది: ధనుష్
కోలీవుడ్‌లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ధనుశ్. అంతేకాదు సక్సెస్ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. అయితే ధనుశ్కు ఈ స్థాయి అంత సులభంగా వచ్చింది కాదు. తుళ్లువదో ఇళమై చిత్రంతో కథానాయకుడిగా తన తండ్రి కస్తూరి రాజా దర్శకత్వంలో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత విడుదలకు ముందు ఎన్నో అవమానాలను, అవహేళనలను ఎదుర్కొన్నారు. అయితే ధనుష్‌కు తొలి చిత్రం మంచి విజయాన్ని అందించడంతో పలువురు దర్శక నిర్మాతలు ఆయన వెంట పరుగులు తీశారు.కెరీర్ ప్రారంభంలో ధనుశ్ విజయాలలో ఆయన సోదరుడు, దర్శకుడు సెల్వరాఘవన్ భాగమయ్యాడు. అయితే ధనుశ్‌పై విమర్శలు కూడా చాలానే ఉన్నాయి. ముఖ్యంగా నిర్మాతలకు సరిగా కాల్ షీట్స్ కేటాయించడం లేదనే ఆరోపణలున్నాయి. ఇకపోతే ఇటీవల మరో అగ్రనటి నయనతార కూడా ఆయన వ్యక్తిత్వంపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఐశ్వర్య రజనీకాంత్‌తో ఈయన వివాహ బంధానికి కూడా ఎండ్ కార్డ్ వేశాడు. ఇటీవలే వీరిద్దరికి విడాకులు కూడా మంజూరయ్యాయి. యితే ఇవన్నీ ధనుశ్ కెరియర్‌కు ఎలాంటి ఇబ్బంది తీసుకురాలేదనే చెప్పాలి.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ధనుశ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తనను అర్థం చేసుకోవడం నిజంగానే కొంచెం కష్టమని.. తనతో సన్నిహితంగా ఉండే వారికే తానేంటో తెలుస్తుందన్నారు. అయితే తాను ఎవరికీ అంత సులభంగా దగ్గర అవ్వనని.. అందుకు కొన్ని రోజుల సమయం పడుతుందని అన్నారు. తనతో సుదీర్ఘ పరిచయం ఉన్న వారే తనను అర్థం చేసుకోగలుగుతారని నటుడు ధనుశ్ పేర్కొన్నారు. దీంతో ఈయన ఎవరి గురించి ఇలా మాట్లాడారా అన్న చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది. కాగా ధనుష్ ప్రస్తుతం ఇడ్లీ కడై అనే చిత్రంలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ధనుష్ దర్శకత్వం వహించిన మరో చిత్రం నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడీ కోపం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. -
ఓటీటీకి వచ్చేసిన రూ.300 కోట్ల మూవీ.. ఎక్కడ చూడాలంటే?
శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం అమరన్. దీపావళికి థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. దాదాపు నెల రోజుల పాటు థియేటర్లలో రన్ అయింది. ఈ సినిమాకు రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ మూవీ ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.అమరన్ ఈ రోజు నుంచే ఓటీటీ ప్రేక్షకులను అందుబాటులోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. సూపర్ హిట్ సినిమా కావడంతో ఓటీటీలోనూ అదరగొడుతుందేమో వేచి చూడాల్సిందే. కాగా.. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ మూవీని కమల్ హాసన్, మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు.కథేంటంటే...ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం పొందిన ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ ఇది. ఇందులో ముకుంద్ వరదరాజన్‌గా శివకార్తికేయన్ నటించగా.. అతని భార్య ఇందు రెబక్క వర్గీస్ పాత్రను సాయి పల్లవి పోషించారు. 2014 ఏప్రిల్ 25న మేజర్ ముకుంద్ వరదరాజన్ దక్షిణ కాశ్మీర్‌లోని ఒక గ్రామంలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో వీరమరణం పొందారు. ఇది మాత్రమే బయటి ప్రపంచానికి తెలుసు. తమిళనాడుకు చెందిన ముకుంద్ వరదరాజన్ ఇండియన్ ఆర్మీలోకి ఎలా వచ్చాడు? కేరళ యువతి ఇందు(సాయి పల్లవి) తో ఎలా పరిచయం ఏర్పడింది? వీరిద్దరి పెళ్లికి ఎదురైన సమస్యలు ఏంటి? 44 రాష్ట్రీయ రైఫిల్స్ చీతా విభాగానికి కమాండర్‌గా ఆయన అందించిన సేవలు ఏంటి? ఉగ్రవాద ముఠా లీడర్లు అల్తాఫ్ బాబా, అసిఫ్ వాసీలను ఎలా మట్టుపెట్టాడు? దేశ రక్షణ కోసం తన ప్రాణాలను ఎలా పణంగా పెట్టాడు? అనేదే ఈ సినిమా కథ. -
బాక్సాఫీస్ బరిలో పుష్ప-2.. అలా జరిగితే వాళ్లే భయపడాలన్న హీరో!
కోలీవుడ్ హీరో సిద్ధార్థ్ పెళ్లి తర్వాత తొలి సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. గతేడాది చిన్నాతో సూపర్ హిట్ కొట్టిన సిద్ధార్థ్ మరో హిట్ కోసం రెడీ అయిపోయారు. తాజాగా ఆయన హీరోగా నటించిన చిత్రం మిస్ యూ. ఈ మూవీలో నాసామిరంగ ఫేమ్ ఆషిక రంగనాథ్ హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పోటీకి సిద్ధమైంది. ఈనెల 29న థియేటర్లలో సందడి చేయనుంది.ఈ సందర్భంగా హైదరాబాద్‌లో మిస్ యూ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ మీట్లో బాక్సాఫీస్ వద్ద పోటీపై సిద్ధార్థ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. మీ సినిమా విడుదల తర్వాత వారం రోజుల్లోనే పుష్ప-2 రిలీజవుతోంది.. ఈ ఎఫెక్ట్ మీ చిత్రంపై ఉంటుంది కదా? మీరేందుకు డేర్ చేస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై సిద్ధార్థ్ స్పందించారు.సిద్ధార్థ్ మాట్లాడుతూ..' ఇక్కడ నా కంట్రోల్లో ఉన్నదాని గురించే నేను మాట్లాడతా. ప్రతి సినిమా పెద్ద సినిమానే. ఎంత ఖర్చు పెట్టారనేది సినిమా స్థాయి నిర్ణయించదు. మీరు చెప్పింది కూడా కరెక్టే. రెండోవారం కూడా ఆడాలంటే ముందు నా సినిమా బాగుండాలి..ప్రేక్షకులకు నచ్చాలి. అప్పుడే నా మూవీ థియేటర్లో ఆడుతుంది. తర్వాత వేరే సినిమా గురించి వాళ్లు ఆలోచించాలి. వాళ్లు భయపడాలి. అంతేకానీ ఒక మంచి సినిమాను థియేటర్లో నుంచి ఎవరూ తీయలేరు. ఈ రోజుల్లో చేయడం అస్సలు కుదరదు. ఎందుకంటే ఇది 2006 కాదు.. ఇప్పుడున్నంత సోషల్ మీడియా అవేర్నెస్ అప్పట్లో లేదు. సో మంచి సినిమాను ఎవరూ థియేటర్ నుంచి తీయలేరు కూడా' అని అన్నారు. సిద్ధార్థ్ నటించిన మిస్ యు నవంబర్ 29న విడుదల కానుండగా.. అల్లు అర్జున్ పుష్ప -2 ది రూల్ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.కాగా.. మిస్ యూ చిత్రాన్ని లవ్ అండ్ రొమాంటిక్ కామెడీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు ఎన్ రాజశేఖర్ దర్శకత్వం వహించారు. -
నా జీవితంలోకి ఒక దేవత వచ్చింది: పెళ్లిపై సిద్ధార్థ్ ఆసక్తికర కామెంట్స్
కోలీవుడ్ హీరీ సిద్ధార్థ్ మరోమూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. గతేడాది చిన్నా మూవీతో సూపర్ హిట్ కొట్టిన సిద్ధార్థ్ మిస్ యూ అంటూ వచ్చేస్తున్నారు. ఈ చిత్రంలో నా సామిరంగ ఫేమ్ ఆషిక రంగనాథ్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 29న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించింది చిత్రబృందం. ఈవెంట్లో హాజరైన సిద్ధార్థ్‌కు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఆదితి రావు హైదరీతో పెళ్లి తర్వాత వస్తోన్న మీ మొదటి చిత్రం.. మీ లైఫ్ ఎలా ఉందని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనిపై సిద్ధార్థ్ స్పందించారు.సిద్ధార్థ్ మాట్లాడుతూ..'నా లైఫ్ ఇప్పుడైతే చాలా బాగుంది. ఇలాంటి వరం దొరికినందుకు నేను చాలా గ్రేట్ఫుల్. మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది. అంతేకాదు నా లైఫ్‌లోకి నా దేవత వచ్చింది. 2024లో ఒక మంచి విషయం జరిగితే ఫస్ట్ నా రియాక్షన్ సర్ప్రైజ్. ఏంటి మంచి జరిగిందా? అనేది. సెకండ్ రిలీఫ్. హమ్మయ్య ఆ దేవుడి దయతో అంతా మంచి జరిగిందని.. అలాంటి టైమ్‌లో మనం బతుకుతున్నాం కాబట్టి.. నాకైతే నా జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణాలు' అంటూ తన పెళ్లి తర్వాత చాలా హ్యాపీగా ఉన్నట్లు తెలిపారు.కాగా.. కోలీవుడ్ సిద్ధార్థ్ - అదితిరావు హైదరీ ఈ ఏడాదిలో వివాహా బంధంలోకి అడుగుపెట్టారు. కొన్నేళ్ల పాటు సీక్రెట్ డేటింగ్లో ఉన్న ఈ జంట వనపర్తిలోని ఓ పురాతన ఆలయంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో అదే ఆలయంలోనే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. -
స్టార్ జంటకు ఘోర అవమానం.. 30 నిమిషాలైనా ఎవరూ కూడా!
సినీతారలు రోడ్డు మీద కనపడితే చాలు సెల్ఫీల కోసం ఎగబడతారు. అంతేకాదు పోటీపడి మరీ వారితో ఫోటోలు దిగేందుకు వెనుకాడరు. సినీతారలకు ఉన్న క్రేజ్ అలాంటిది. బయట ఎక్కడైనా సినీ సెలబ్రిటీలు కనిపిస్తే ఇంకేముంది ఎంచక్కా వారితో సెల్ఫీ కోసం ఎగబడతాం. కానీ అందుకు భిన్నంగా ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. అదేంటో మీరు చూసేయండి.దక్షిణాది స్టార్ జంటగా గుర్తింపు ఉన్న సెలబ్రిటీ కపుల్ నయనతార- విఘ్నేశ్ శివన్. ఇటీవల నయన్ తన భర్తతో కలిసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకునేందుకు ఢిల్లీకి వెళ్లారు. ఓ హోటల్‌కు వెళ్లిన నయన్- విఘ్నేశ్ దాదాపు 30 నిమిషాల పాటు లైన్లోనే వెయిట్ చేసిన తర్వాత టేబుల్ దక్కించుకున్నారు. అయితే ఆ సమయంలో వీరిని అక్కడా ఎవరూ కూడా గుర్తు పట్టలేదు. అంతేకాదు వీళ్ల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. అదే మనమైతే పక్కన పెట్టి ఫోటోల కోసం పోటీ పడేవాళ్లేమో. దీనికి సంబంధించిన వీడియోను విఘ్నేశ్ శివన్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.విఘ్నేశ్ శివన్ తన ఇన్‌స్టాలో రాస్తూ..'17 నవంబర్.. చాలా ఏళ్ల తర్వాత సింపుల్‌గా పుట్టినరోజు వేడుక జరుపుకున్నాం. ఇలా డిన్నర్ చేయడం చాలా సంతోషంగా అనిపించింది. దాదాపు 30 నిమిషాలు లైన్లో ఉన్నాం. చివరికీ ఒక మంచి టేబుల్ దొరికింది. ఈ వీడియో తీసిన వ్యక్తికి నా ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతకుముందు విఘ్నేష్, నయనతార తమ కుమారులతో కలిసి ఢిల్లీలోని కుతాబ్ మినార్ను సందర్శించారు. ఆ జంట రాజధానిలోని ఓ ఫేమస్ హోటల్‌కి వెళ్లారు. అక్కడ కూడా వారిని ఎవరూ గుర్తించలేదు.నయనతార ఇటీవల తన నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్ తర్వాత వివాదంలో చిక్కుకున్నారు. ధనుశ్ హీరోగా నటించిన నానుమ్ రౌడీ ధాన్ సెట్స్ ఓ క్లిప్‌ను ఉపయోగించినందుకు ఆమెకు రూ. 10 కోట్ల లీగల్ నోటీసు పంపారు. ఆ తర్వాత దీనిపై నయనతార ఓ బహిరంగ లేఖను కూడా విడుదల చేశారు. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
టాప్ ప్రొడ్యూసర్ పెళ్లిలో హైలైట్‌గా ధనుష్, నయన్, కానీ.. (ఫొటోలు)
-
ధనుశ్- నయనతార వివాదం.. అప్పుడే పెళ్లిలో కలిశారు.. కానీ!
ప్రస్తుతం కోలీవుడ్‌ను కుదిపేస్తోన్న వివాదం ఏదైనా ఉందంటే అది ధనుశ్- నయనతారదే. ఇటీవల నయనతార లైఫ్ స్టోరీగా వచ్చిన డాక్యుమెంటరీ రిలీజైన తర్వాత ఈ వివాదం మొదలైంది. 2015లో ధనుశ్-నయన నటించిన నానుమ్ రౌడీ ధాన్ మూవీలోని మూడు సెకన్ల వీడియోను ఈ డాక్యుమెంటరీలో ఉపయోగించారు. అయితే తన అనుమతి లేకుండా ఇలా చేయడం సరికాదని ధనుష్ రూ. 10 కోట్ల నష్ట పరిహారం కోరుతూ లీగల్ నోటీసులు పంపించారు. దీంతో ఈ వివాదం కాస్తా కోలీవుడ్‌లో మరింత చర్చకు దారితీసింది.ఈ వివాదం మొదలైన తర్వాత కోలీవుడ్‌లో వీరిద్దరు ఒకరంటే ఒకరికీ అస్సలు పడటం లేదు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. అయితే ఈ కాంట్రవర్సీ కొనసాగుతున్న టైమ్‌లో ఊహించని విధంగా ఇద్దరూ ఓకే వేదికపై మెరిశారు. తమిళ నిర్మాతల్లో ఒకరైన ఆకాశ్ భాస్కరన్ పెళ్లికి హాజరయ్యారు. ఈ వేడుకలో పక్కపక్కనే ఉన్నప్పటికీ ఒకరినొకరు పలకరించుకోలేదు సరికదా.. కనీసం చూసుకోలేదు కూడా. ఈ పెళ్లికి నయన్ భర్త విఘ్నేశ్ శివన్ కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.కాగా.. నయనతార నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ బియాండ్ ది ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీలో నాగార్జున, రానా దగ్గుబాటి, తమన్నా భాటియా, ఉపేంద్ర, విజయ్ సేతుపతి, అట్లీ, పార్వతి తిరువోతు లాంటి స్టార్స్ కూడా కనిపించారు. కేవలం మూడు సెకన్ల ఫుటేజీని ఉపయోగించినందుకు ధనుశ్ లీగల్ నోటీసులు పంపడంతో ఈ వివాదం మరింత ముదిరింది.#Dhanush & #Nayanthara together at the recent wedding of Producer AakashBaskaran pic.twitter.com/ulZDckjak8— AmuthaBharathi (@CinemaWithAB) November 21, 2024 #Dhanush & #Nayanthara today at a Marriage Function pic.twitter.com/xHURf15YJ6— Arun Vijay (@AVinthehousee) November 21, 2024 -
ధనుశ్ - ఐశ్వర్య విడాకులు.. ఇక అదొక్కటే మిగిలి ఉంది!
కోలీవుడ్ స్టార్ కపుల్‌గా గుర్తింపు తెచ్చుకున్న జంటల్లో ధనుశ్- ఐశ్వర్య ఒకరు. రెండేళ్ల క్రితమే వీరిద్దరు విడిపోతున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. ప్రస్తుతం ఈ జంట విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది. ఇవాళ కేసు విచారణలో భాగంగా కోర్టుకు ధనుశ్, ఐశ్వర్య కోర్టుకు హాజరయ్యారు. చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులో విచారణకు హాజరైన వీరిద్దరు తమ నిర్ణయాన్ని న్యాయమూర్తి వివరించారు. ఇటీవల వీరిద్దరు త్వరలో కలుసుకోబోతున్నారంటూ కోలీవుడ్‌లో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.తాజాాగా కోర్టులో విచారణకు హాజరైన వీరిద్దరు విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు న్యాయమూర్తికి వివరించారు. విడిపోవడానికి గల కారణాలను కోర్టుకు వివరించినట్లు తెలుస్తోంది. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం త్వరలోనే తీర్పు ఇవ్వనుంది. ఈ కేసు తుది తీర్పును నవంబర్ 27కు వాయిదా వేశారు. దీన్ని బట్టి చూస్తే మరో స్టార్ జంట విడాకులు తీసుకోవడం దాదాపు ఖరారైనట్లే.(ఇది చదవండి: కోర్టు విచారణకు దూరంగా ధనుష్, ఐశ్వర్య... మరోసారి వాయిదా!)అయితే వీరి నిర్ణయంతో కోర్టు విడాకులు మంజూరు చేసే అవకాశముంది. ఇద్దరు కూడా కలిసి ఉండాలనుకోవట్లేదని ఇవాళ కోర్టుకు వివరించారు. దీంతో ఈ జంట తమ వివాహబంధానికి గుడ్ బై చెప్పడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె అయిన ఐశ్వర్యను ధనుశ్ పెళ్లాడారు. పెద్దల అంగీకారంతో 2004 నవంబర్ 18న వీరి వివాహం జరిగింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత వీరి బంధానికి ఎండ్ కార్డ్ పడనుంది. -
అమరన్ సక్సెస్.. స్వయంగా బిర్యానీ వడ్డించిన హీరో!
కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ నటించిన తాజా చిత్రం అమరన్. ఈ దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజైంది. సాయిపల్లవి హీరోయిన్గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. విడుదలై మూడు వారాలైనప్పటికీ కలెక్షన్స్ పరంగా రాణిస్తోంది. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.అయితే ప్రస్తుతం శివ కార్తికేయన్ మరో మూవీతో బిజీగా ఉన్నారు. ఎస్కే23 వర్కింగ్ టైటిల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా అమరన్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. షూటింగ్ సెట్లోనే ఈ వేడుకలు చేసుకున్నారు.అనంతరం మూవీ సిబ్బందికి భోజనాలు ఏర్పాటు చేశారు. హీరో శివ కార్తికేయన్ స్వయంగా అందరికీ బిర్యానీ వడ్డించారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. అమరన్ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రంలో భువన్ అరోరా, రాహుల్ బోస్, లల్లు, శ్రీకుమార్, శ్యామ్ మోహన్, గీతా కైలాసం కీలక పాత్రలు పోషించారు. #Sivakarthikeyan served Biryani to #SK23 crew members on celebrating #Amaran Blockbuster success ❤️🔥❤️🔥pic.twitter.com/uAzB5PbXqh— AmuthaBharathi (@CinemaWithAB) November 19, 2024 -
సూర్య కంగువా.. తగ్గించినా లాభం లేదు.. ఆరు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన భారీ బడ్జెట్ చిత్రం కంగువా. శివ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే మొదటిరోజే మిక్స్డ్ టాక్ రావడంతో ఆ ఎఫెక్ట్ సినిమాపై పడింది. తొలిరోజు సూర్య కెరీర్లోనే ది బెస్ట్ వసూళ్లు రాబట్టినా.. ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. దీంతో రిలీజైన ఆరు రోజుల్లోనే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.60 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించింది.మొదటి రోజు రూ. 24 కోట్లు రాబట్టిన కంగువా ఆ తర్వాత వీకెండ్లోనూ పెద్దగా రాణించలేకపోయింది. నవంబర్ 19న కేవలం రూ.3.15 కోట్ల వసూళ్లు మాత్రమే వచ్చాయి. రెండో వారంలోనైనా పుంజుకుంటుందన్న ఆశతో మేకర్స్ ఉన్నారు. కానీ పరిస్థితి చూస్తే అందుకు పూర్తి భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే ప్రపంచవ్యాప్తంగా చూస్తే రూ.100 కోట్లకు కలెక్షన్స్ రాబట్టింది.12 నిమిషాల తగ్గింపుకంగువా మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోతున్న ఈ మూవీ నిడివిని తగ్గించారు. దాదాపు 12 నిమిషాల సీన్స్ కట్ చేసినట్లు ప్రకటించారు. ట్రిమ్ చేసిన కంగువ వర్షన్ థియేటర్లలో రన్ అవుతోంది. ఇప్పుడైనా ఫ్యాన్స్ నుంచి కంగువాకు ఆదరణ దక్కుతుందేమో వేచి చూడాల్సింది. కాగా.. స్టూడియో గ్రీన్ బ్యానర్లో రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ లెక్కన చూస్తే బిగ్ డిజాస్టర్ ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రంలో బాబీ డియోల్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటించారు. -
ధనుశ్- నయనతార వివాదం.. మంచి ఎంటర్టైనింగ్గా ఉందన్న నటుడు!
ప్రస్తుతం కోలీవుడ్‌లో ధనుశ్-నయనతార వివాదం హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల నయన్ తన నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ రిలీజ్ తర్వాత వీరిద్దర మధ్య వార్ మొదలైంది. ఆ డాక్యుమెంటరీ నానుమ్ రౌడీ ధాన్ మూవీలోని మూడు సెకన్ల వీడియోను ఈ డాక్యుమెంటరీలో ఉపయోగించారు. అయితే తన అనుమతి లేకుండా ఇలా చేయడం తగదంటూ, ధనుష్ రూ. 10 కోట్ల నష్ట పరిహారం కోరుతూ లీగల్ నోటీసు పంపించారు. దీంతో ఈ వివాదం కాస్తా కోలీవుడ్‌లో మరింత చర్చకు దారితీసింది.అయితే తాజాగా ఈ వివాదంపై నానుమ్ రౌడీ ధాన్ నటుడు ఆర్జే బాలాజీ స్పందించారు. ఈ విషయం తనకు సోషల్ మీడియా ద్వారా తెలిసిందన్నారు. అయితే వీరి మధ్య జరుగుతున్న ఫైట్ ప్రేక్షకులకు మంచి ఎంటర్టైనర్గా మారిందని ఆయన అన్నారు. ఈ విషయంలో నేనేం చెప్పలేను.. దీనిపై మాట్లాడానికి నేను ఎవరినీ? అని వెల్లడించారు. ఆదివారం చెన్నైలో ఓ ఈవెంట్లో పాల్గొన్న ఆయన మీడియా అడిగిన ప్రశ్నకు పైవిధంగా స్పందించారు.(ఇది చదవండి: నయనతార- ధనుష్ వీడియో క్లిప్ వివాదం.. హీరో తండ్రి షాకింగ్ కామెంట్స్!)వాళ్లిద్దరూ కూడా సినీరంగంలో అనుభవమున్న వ్యక్తులనీ ఆర్జే బాలాజీ అన్నారు. ఈ వివాదాన్ని ఎలా పరిష్కరించుకోవాలో వారికి తెలుసన్నారు. ప్రస్తుతానికి నా దృష్టంతా సూర్య సర్‌తో చేయాల్సిన సినిమాపైనే ఉందని ఆయన తెలిపారు. -
కంగువా మరో డిజాస్టర్ కానుందా?.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లంటే!
కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన భారీ యాక్షన్ చిత్రం కంగువా. శివ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. అయితే మొదటి రోజే ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ రావడంతో కలెక్షన్లపై ప్రభావం పడింది. భారీ అంచనాల మధ్య రిలీజైన కంగువా తొలి రోజు కేవలం ఇండియావ్యాప్తంగా రూ.22 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది.ఆ తర్వాత రెండో రోజు కంగువా వసూళ్లు మరింత తగ్గిపోయాయి. రెండో రోజు కేవలం రూ. 9.25 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. శనివారం వీకెండ్ కూడా కంగువాకు కలిసిరాలేదు. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 9.50 కోట్ల కలక్షన్స్ మాత్రమే సాధించింది. దీంతో మూడు రోజుల్లో కేవలం రూ. 42.75 కోట్లకే పరిమితమైంది. అయితే ప్రపంచవ్యాప్తంగా చూస్తే రెండో రోజుల్లోనే రూ.89.32 కోట్ల వసూళ్లు సాధించినట్లు మూవీ టీమ్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.కాగా.. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై నిర్మించారు. దాదాపు రూ.350 కోట్లతో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అయితే బాక్సాఫీస్ వద్ద అంచనాలన్నీ తలకిందులయ్యాయి. సూర్య కెరీర్లోనే హైయ్యెస్ట్ బడ్జెట్ చిత్రంగా కంగువా నిలిచింది. ఈ మూవీ విడుదలైన మూడు రోజులైనప్పటికీ ఇంకా రూ.100 కోట్ల మార్క్ చేరుకోకపోవడం ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. -
జయం రవి విడాకుల కేసు.. కోర్టు కీలక ఆదేశాలు!
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే తన భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయంపై ఆయన ఓ లేఖను కూడా విడుదల చేశారు. ఆ తర్వాత జయం రవి సతీమణి ఆర్తి అతనిపై ఆరోపణలు చేసింది. విడాకుల విషయం గురించి తనకు తెలియదని ఆమె ఆరోపించారు. రవి చేసిన ప్రకటనతో తాను ఆశ్చర్యపోయానని అన్నారు. ఆ తర్వాత ఆర్తి రవి పేరుతో ఆమె ఒక లేఖను తన సోషల్ మీడియాలో విడుదల చేశారు.అయితే తనకు విడాకులు కావాలని కోరుతూ జయం రవి ఇటీవలే కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా రవి పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. రాజీ చేసుకునేందుకు ప్రయత్నించాలని సూచించింది. కాగా.. ఈ రోజు జరిగిన విచారణకు రవి కోర్టుకు హాజరు కాగా.. ఆయన భార్య ఆర్తి వర్చువల్‌గా హాజరయ్యారు. ఈ విచారణలో ఇరువురికి రాజీ కేంద్రంతో మాట్లాడి పరిష్కారం చూపాలని న్యాయమూర్తి ఆదేశించారు.(ఇది చదవండి: భార్యతో విడాకులు.. అలాంటివారే రూమర్స్ క్రియేట్ చేస్తారు: జయం రవి)2009లో సినీ నిర్మాత సుజాత విజయకుమార్ కుమార్తె ఆర్తిని జయం రవి పెళ్లాడారు. వీరిద్దరికి ఆరవ్, అయాన్ పిల్లలు సంతానం కూడా ఉన్నారు. గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. అప్పటి నుంచి ఇద్దరూ విడివిడిగా జీవిస్తున్నారు. మొదట జయం రవి సోషల్ మీడియాలో తన భార్య ఫోటోలను తొలగించారు. కాగా.. జయం రవి 1989లో బాలనటుడిగా తెలుగు సినిమాల్లో ఎంట్రీ ఇచ్చారు. తెలుగు సినిమా ద్వారా బాలనటుడిగా అరంగేట్రం చేసి.. ఆ తర్వాత తమిళ చిత్రసీమలో స్టార్‌గా ఎదిగారు. 2003లో విడుదలైన ‘జయం’ సినిమాతో కోలీవుడ్‌లో క్రేజ్ దక్కించుకున్నారు. -
బాక్సాఫీస్ వద్ద కంగువా.. మొదటి రోజు షాకింగ్ కలెక్షన్స్!
కోలీవుడ్ స్టార్స్ సూర్య ఫ్యాన్స్ చాలా రోజుల నిరీక్షణకు తెరపడింది. దసరాకు రావాల్సిన కంగువా నెల రోజుల ఆలస్యమైనప్పటికీ ఎట్టకేలకు బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. అభిమానుల భారీ అంచనాల మధ్య నవంబర్ 14 ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. శివ దర్శకత్వంలో వచ్చిన ఈ భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రం కంగువా తొలిరోజే మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది.అయితే కంగువాపై మొదటి నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే మొదటి రోజే కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందని డిసైడ్ అయిపోయారు. సూర్య కెరీర్లో భారీ బడ్జెట్ చిత్రం కావడంతో వసూళ్ల పరంగా పలు రికార్డులు బద్దలు కొడుతుందని భావించారు. కానీ తొలిరోజు వసూళ్లూ చూస్తే.. ఊహించనిదానికి భిన్నంగా వచ్చినట్లు కనిపిస్తోంది. ఇంతకీ కంగువా అంచనాలను మించి రాణించిందా? లేదా అన్నది కలెక్షన్స్ చూస్తే తెలిసిపోతుంది.తాజా సమాచారం ప్రకారం తొలిరోజు ఇండియా వ్యాప్తంగా రూ.22 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. దీంతో సూర్య కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్స్‌గా కంగువా నిలిచింది. గతంలో ఆయన నటించిన సింగం-2 తొలిరోజు రూ.12 కోట్ల నికర వసూళ్లు రాబట్టింది. తాజాగా కంగువా ఆ రికార్డ్‌ను అధిగమించింది. ఇక దేశవ్యాప్తంగా థియేటర్లన్నీ తొలిరోజు 40శాతం ఆక్సుపెన్సీతో నడిచినట్లు ఓ నివేదిక వెల్లడించింది. ఇటీవల విడుదలైన రజినీకాంత్ వేట్టయాన్, విజయ్ ది గోట్ చిత్రాలు మొదటిరోజు 50 నుంచి 60శాతం ఆక్సుపెన్సీతో నడిచాయి.అయితే వసూళ్ల పరంగా చూస్తే కంగువా కోలీవుడ్‌లో మూడోస్థానంలో నిలిచింది. ఈ ఏడాది అత్యధిక వసూళ్ల జాబితాలో ది గోట్, వెట్టయాన్ చిత్రాలను అధిగమించలేకపోయింది. మొదటి రోజే అంచనాలను అందుకోవడంతో కంగువా విఫలమైందని కోలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. సూర్య అత్యధిక భారీ బడ్జెట్ చిత్రం(రూ.350 కోట్లు) కావడంతో అంచనాలు కూడా అదేస్థాయిలో నెలకొన్నాయి. మరి రాబోయే రోజుల్లో కంగువా కాసుల వర్షం కురిపిస్తుందేమో వేచి చూడాల్సిందే. కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, దిశాపటానీ, యోగిబాబు కీలక పాత్రల్లో నటించారు.కోలీవుడ్‌లో ఓపెనింగ్ డే కలెక్షన్స్-2024ది గోట్- రూ.39.15 కోట్లువేట్టయాన్- రూ.27.75 కోట్లుకంగువా- రూ.22 కోట్లుఅమరన్- రూ.17 కోట్లుఇండియన్2- రూ.16.5 కోట్లుతంగలాన్- రూ.12.4 కోట్లురాయన్- రూ.11.85 కోట్లుకెప్టెన్ మిల్లర్- రూ.8.05 కోట్లుకల్కి 2898 ఏడీ- రూ.4.5 కోట్లుఅరణ్మనై 4- రూ.4.15 కోట్లు -
ఖరీదైన కారు కొనుగోలు చేసిన అమరన్ నటుడు.. సోషల్ మీడియాలో పోస్ట్!
ప్రముఖ మలయాళ నటుడు శ్యామ్ మోహన్ ఖరీదైన కారును కొనుగోలు చేశారు. లగ్జరీ కంపెనీకి చెందిన వోక్స్ వ్యాగన్ కారును సొంతం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. తన భార్య గోపికతో కలిసి కారు ముందు ఫోటోలకు పోజులిచ్చారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా.. ప్రేమలు, అమరన్ చిత్రాలతో మెప్పించిన మలయాళ నటుడు శ్యామ్ మోహన్. ప్రేమలు సినిమాతో తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ చిత్రంలో నెగటివ్ పాత్రలో శ్యామ్ మోహన్ నటించాడు. ఈ సినిమా తర్వాత మలయాళంలోనే నునాకుజి అనే చిత్రంలోనూ కనిపించారు. ఇటీవల విడుదలైన అమరన్ మూవీలో కీలక పాత్ర పోషించాడు. శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన అమరన్ దీపావళి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. View this post on Instagram A post shared by ShyaM Mohan M (@shyammeyyy) -
భార్యకు సర్ప్రైజ్ ఇచ్చిన స్టార్ హీరో.. అదేంటో తెలుసా?
శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం అమరన్. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి మొదటి రోజు అదిరిపోయే వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ పాత్రలో శివ కార్తికేయన్ నటించారు. ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు.అయితే శివ కార్తికేయన్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆర్మీ డ్రెస్‌లోనే తన ఇంటికెళ్లి భార్యకు సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇంటిపనితో ఫుల్ బిజీగా ఉన్న ఆయన భార్య ఆర్తి దగ్గరికి వెళ్లి సైలెంట్‌గా నిల్చున్నారు. ఇదేమీ గమనించని ఆర్తి తనపని చేసుకుంటూ అలా ఒక్కసారిగా వెనక్కి తిరిగింది. తన భర్తను ఆర్మీ డ్రెస్‌లో చూసిన ఆర్తి ఆశ్చర్యానికి గురైంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.అమరన్ గురించి..కాగా.. అమరన్ చిత్రాన్ని 2014లో జరిగిన ఉగ్రవాద దాడి ఆధారంగా తెరకెక్కించారు. ఈ దాడుల్లో మేజర్ ముకుంద్ అమరుడయ్యారు. ఆయన జీవిత చరిత్రనే సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కాగా.. మేజర్ ముకుంద్ వరదరాజన్ 2009లో ఇందును వివాహం చేసుకోగా..2011లో వీరికి కుమార్తె అర్షే ముకుంద్ జన్మించింది. ఈ చిత్రాన్ని శివ్ అరూర్, రాహుల్ సింగ్ రచించిన ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్: ట్రూ స్టోరీస్ ఆఫ్ మోడరన్ మిలిటరీ హీరోస్ పుస్తకం ఆధారంగా రూపొందించారు. Sivakarthikeyan and his wife Aarthi 😍 pic.twitter.com/YcOC9eL5CG— SmartBarani (@SmartBarani) November 13, 2024 -
కార్తీ కొత్త మూవీ టీజర్.. టైటిల్ వింతగా ఉందేంటి?
ఇటీవల సత్యం సుందరం మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన కోలీవుడ్ స్టార్ కార్తీ. గతనెల విడుదలైన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీలో అరవింద్ స్వామి కీలకపాత్ర పోషించారు.అయితే కార్తీ తాజాగా మరో సినిమాకు రెడీ అయిపోయారు.కార్తీ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం వా వాతియార్. ఇందులో ఉప్పెన భామ కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాకు నలన్ కుమారస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.కాగా.. ఈ చిత్రానికి సంతోశ్ నారాయణన్ సంగీతమందిస్తున్నారు. వా వాతియార్ మూవీలో సత్యరాజ్, రాజ్‌కిరణ్, ఆనంద్ రాజ్, శిల్పా మంజునాథ్, కరుణాకరన్, జీఎం సుందర్, రమేష్ తిలక్, పీఎల్ తేనప్పన్, విద్యా బోర్గియా, నివాస్ అద్ధితన్, మధుర్ మిట్టల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
సూర్య భారీ బడ్జెట్ చిత్రం.. ఆ రాష్ట్రంలో ఆలస్యంగా మార్నింగ్ షోలు!
కోలీవుడ్ సూపర్ స్టార్ సూర్య నటించిన భారీ యాక్షన్ చిత్రం కంగువా. శివ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీ మరికొద్ది గంటల్లో బిగ్ స్క్రీన్‌పై సందడి చేయనుంది. దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ మూవీపై సూర్య అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ పాన్ ఇండియా చిత్రం అభిమానుల భారీ అంచనాల మధ్య నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే మొదటి రోజు తమిళనాడు ప్రభుత్వం ఐదు షోలు ప్రదర్శించేందుకు అనుమతులిచ్చింది. అయితే మొదటి షో ఉదయం 9 గంటల నుంచి ప్రారంభించేందుకు ఓకే చెప్పింది. చివరి ఐదో షోను అర్ధరాత్రి 2 గంటలకు ముగించాలని ఆదేశించింది. ప్రేక్షకులకు అవసరమైన భద్రతా చర్యలను పాటించాలని తమిళనాడు ప్రభుత్వం థియేటర్ల యాజమాన్యాలను కోరింది.అయితే తమిళనాడు వ్యాప్తంగా ఉదయం 9 గంటలకు కంగువా షోలు మొదలు కానున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్,కేరళ రాష్ట్రాల్లో అందుకు భిన్నంగా మార్నింగ్ షోలు ప్రదర్శించనున్నారు. ఏపీ, తెలంగాణ, కర్నాటక, కేరళలో మాత్రం తెల్లవారుజామున 4 నుంచే బెనిఫిట్ షోలు ప్రారంభం అవుతాయని మేకర్స్ వెల్లడించారు.కాగా.. సూర్య కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు. అంతేకాదు ఈ సినిమాని దాదాపు ఏడు దేశాల్లో చిత్రీకరించారు. ఈ చిత్రంలో బాబీ డియోల్, దిశా పటాని, నటరాజన్ సుబ్రమణ్యం, జగపతి బాబు, యోగి బాబు, కోవై సరళ, ఆనంద కీలక పాత్రల్లో నటించారు. -
'చీకటి కోన పులులన్నీ ఏకమై ఉరిమితే'.. కంగువా రిలీజ్ ట్రైలర్ చూశారా?
కోలీవుడ్ స్టార్ హీరో నటించిన పీరియాడికల్ యాక్షన్ చిత్రం 'కంగువా'. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. శివ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా నిర్వహించారు మేకర్స్.తాజాగా ఈ మూవీ రిలీజ్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. దుబాయ్‌లో నిర్వహించిన ప్రత్యేక ఈవెంట్లో ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈవెంట్లో సూర్యతో పాటు బాబీ డియోల్ సందడి చేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ ట్రైలర్‌తో కంగువాపై అంచనాలు మరింత పెరిగాయి. కాగా.. ఈ మూవీని భారీస్థాయిలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా దాదాపు పదివేల స్క్రీన్లలో రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. (ఇది చదవండి: సూర్య 'కంగువా' రిలీజ్.. మేకర్స్ బిగ్ ప్లాన్!)కాగా.. ఈ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్‌లో సూర్య రెండు పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, దిశా పటాని, నటరాజన్ సుబ్రమణ్యం, జగపతి బాబు, రెడిన్ కింగ్స్లీ, కోవై సరళ, ఆనందరాజ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. -
నా కంటే మూడు రెట్లు ఎక్కువ సంపాదించేది: సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శివ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్ 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నారు. ఓ తెగకు చెందిన గిరిజన నాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాబీ డియోల్, దిశా పటానీ ముఖ్యమైన పాత్రల్లో నటించారు.అయితే ప్రస్తుతం ముంబయిలో ఉంటున్న సూర్య తన భార్య జ్యోతిక గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. అంతేకాకుండా తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న పరిస్థితులపై కూడా మాట్లాడారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన సూర్య.. తనకంటే జ్యోతికనే పెద్ద స్టార్ అని ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. నేను ఆమెను కలిసే సమయానికి నాకంటే మూడు రెట్లు ఎక్కువ సంపాదించేదని వెల్లడించారు. హిందీలో డోలీ సజా కే రఖ్నా మూవీ తర్వాత జ్యోతిక తన మొదటి తమిళ చిత్రంలో నాతో కలిసి నటించిందని తెలిపారు. తన రెండో చిత్రం కూడా నాతో చేసిందని.. ఆ తర్వాత మేమిద్దరం మంచి స్నేహితులం అయ్యామని సూర్య అన్నారు.సూర్య మాట్లాడుతూ..' నారు తమిళ చిత్ర పరిశ్రమలో మార్కెట్ రావడానికి చాలా సంవత్సరాలు పట్టింది. కానీ అప్పటికే జ్యోతిక సక్సెస్ఫుల్ యాక్టర్‌గా పేరు సంపాదించుకుంది. నేను హీరోగా ఎదిగేందుకు దాదాపు ఐదేళ్లు పట్టింది. అప్పటికే తన జీతం నా కంటే మూడు రెట్లు ఎక్కువ. ఆ సమయంలో నేను ఎక్కడ ఉన్నానో గ్రహించా. కానీ తను నా జీవితంలో భాగం కావడానికి సిద్ధంగా ఉంది. మా ప్రేమను తన తల్లిదండ్రులు కూడా అంగీకరించారు" అని అన్నారు.ముంబైలో జ్యోతిక, సూర్యకాగా.. జ్యోతిక, సూర్య ప్రస్తుతం ముంబయిలో ఉన్నారు. తమ పిల్లల చదువుల కోసమే షిఫ్ట్ అయినట్లు చాలాసార్లు వెల్లడించారు. దాదాపు 27 ఏళ్ల తర్వాత చెన్నై నుంచి ముంబయికి మారినట్లు సూర్య అన్నారు. ప్రస్తుతం జ్యోతిక కుటుంబం ముంబయిలో ఉందని..తన తల్లిదండ్రులకు కూడా సమయం కేటాయించినట్లు ఉంటుందని సూర్య తెలిపారు. -
విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. రజినీకాంత్ సోదరుడు షాకింగ్ కామెంట్స్!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే తమిళగ వెట్రి కజగం పేరిట పార్టీని కూడా స్థాపించారు. ఇటీవల ఆయన నిర్వహించిన తొలి రాజకీయ సభకు దాదాపు పది లక్షలకు పైగా ప్రజలు, అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయనున్నట్లు విజయ్ ప్రకటించారు. అయితే విజయ్ పొలిటికల్ ఎంట్రీపై రజినీకాంత్ సోదరుడు సత్యనారాయణ రావు ఆసక్తికర కామెంట్స్ చేశారు. మధురైలోని మీనాక్షి అమ్మన్ ఆలయాన్ని సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడారు. అతన్ని రానివ్వండి.. గతంలో మక్కల్ నీది మయ్యం పార్టీతో కమల్ హాసన్ కూడా వచ్చాడు. అలాగే విజయ్ కూడా ప్రయత్నించనివ్వండని అన్నారు.విజయ్ గెలుపు అసాధ్యంకానీ తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలవడం అంత సులభం కాదని సత్యనారాయణ రావు అన్నారు. విజయ్ అనేక సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. విజయ్ శతవిధాల ప్రయత్నించినా తమిళనాడులో గెలవలేడని షాకింగ్ కామెంట్స్ చేశారు.సత్యనారాయణ రావు మాట్లాడుతూ.. "ఆయనకు రాజకీయ ఆశయాలు ఉన్నాయి. అందుకే ఈ రంగంలోకి దిగాడు. అయితే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఏం చేస్తాడో నాకైతే కచ్చితంగా తెలియదు. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలవడని నేను గట్టిగా నమ్ముతున్నా. ఎందుకంటే అది చాలా కష్టం' అని అన్నారు. కాగా.. విజయ్ చివరిసారిగా ది గోట్ మూవీతో అభిమానులను అలరించాడు. త్వరలోనే మరో మూవీలో ఆయన నటించనున్నారు. -
'ఇక నుంచి నువ్వు మా తెలుగు హీరో'.. నితిన్ కామెంట్స్
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన తాజా చిత్రం 'అమరన్'. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ చిత్రానికి మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా బెస్ట్ ఓపెనింగ్స్ నమోదు చేసింది. అమరన్ రిలీజైన ఆరు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. మొదటి రోజే రూ.21 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం ఆరు రోజుల్లో రూ.102 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ హీరో నితిన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమరన్ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రానికి హీరోయిన్ సాయిపల్లవి బ్యాక్‌బోన్ అంటూ కొనియాడారు. మీ డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని.. ఏదో ఒకరోజు మీతో డ్యాన్స్ చేయాలని ఉందని అన్నారు. త్వరలోనే ఆ రోజు రావాలని కోరుకుంటున్నానని నితిన్ తెలిపారు.శివ కార్తికేయన్‌తో నాకు ప్రత్యేక అనుబంధముందని హీరో నితిన్ అన్నారు. హైదరాబాద్‌లో ఉన్నప్పటికీ గత నాలుగేళ్లుగా మేము కలవడానికి కుదర్లేదన్నారు. చాలా రోజుల తర్వాత మేమిద్దరం కలిశామని సంతోషం వ్యక్తం చేశారు. అమరన్ సినిమాకు శివ కార్తికేయన్ చాలా కష్టపడ్డారని.. ఇక నుంచి మా తెలుగు హీరో, మా తెలుగబ్బాయి అయిపోయాడని నితిన్ అన్నారు. కాగా.. నితిన్ ప్రస్తుతం రాబిన్‌హుడ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల, రష్మిక మందన్నా హీరోయిన్లుగా కనిపించనున్నారు. -
అమరన్ మూవీ.. ఆరు రోజుల్లోనే ఆ మార్కు దాటేసింది!
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం అమరన్. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ చిత్రానికి మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా బెస్ట్ ఓపెనింగ్స్ నమోదు చేసింది. అమరన్ కేవలం ఆరు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. కాగా.. ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. మొదటి రోజే రూ.21 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం ఆరు రోజుల్లో రూ.102 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.అమరన్‌లో మేజర్ ముకుంద్ పాత్రలో శివ కార్తికేయన్ కనిపించగా.. ఆయన భార్యగా ఇందు పాత్రలో సాయిపల్లవి నటించింది. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న థియేటర్లలోకి వచ్చిన అమరన్.. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటికే గ్రాస్ కలెక్షన్ల పరంగా ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల క్లబ్లో చేరేందుకు సిద్ధంగా ఉంది. ఈ వారంలో ఆ రికార్డ్‌ను అధిగమించే అవకాశముంది.కాగా.. ఈ చిత్రాన్ని మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కించారు. 2014లో కాశ్మీర్‌లోని షోపియాన్‌లో జరిగిన ఉగ్రదాడిలో మేజర్ ముకుంద్ అమరుడయ్యారు. ఆయన జీవితాన్ని అమరన్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమాను రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. -
అమరన్ మూవీ.. మేజర్ కుటుంబ సభ్యుల కోరిక అదే: డైరెక్టర్
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం అమరన్. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ చిత్రానికి మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా బెస్ట్ ఓపెనింగ్స్ నమోదు చేసింది. ఆ విషయంపై వివాదం..అమరన్‌లో మేజర్ ముకుంద్ పాత్రలో శివ కార్తికేయన్ కనిపించగా.. ఆయన భార్యగా ఇందు పాత్రలో సాయిపల్లవి నటించింది. అయితే ఈ చిత్రంలో మేజర్ ముకుంద్ కులాన్ని ఎందుకు ప్రస్తావించలేదని ఓ వర్గం ప్రజలు ప్రశ్నించారు. తాజాగా చెన్నైలో నిర్వహించిన సక్సెస్ మీట్లో డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి ఈ విషయంపై స్పందించారు. ఈ సినిమాలో మేజర్ కులాన్ని ఎందుకు చూపించలేదన్న అంశంపై రాజ్‌కుమార్ క్లారిటీ ఇచ్చారు.మేజర్ కుటుంబం అభ్యర్థన ఇదే..ముకుంద్ భార్య ఇందు, అతని తల్లిదండ్రులు సినిమా తీయడానికి ముందే కొన్ని అభ్యర్థనలు చేశారని డైరెక్టర్ వివరించారు. మేజర్ ముకుంద్ తమిళియన్ కావడంతో.. ఆ పాత్రలో కచ్చితంగా తమిళ మూలాలు ఉన్న వ్యక్తిని నన్ను నటింపజేయాలని ఆమె కోరిందని తెలిపారు. అది నాకు శివకార్తికేయన్‌లో కనిపించిందని దర్శకుడు అన్నారు. ఈ చిత్రానికి తమిళ గుర్తింపు కూడా ఉండాలని ఆమె కోరుకుందని వెల్లడించారు.అదేవిధంగా ముకుంద్ తల్లిదండ్రులు తమ కుమారుడిని భారతీయుడిగానే చూపించాలని కోరినట్లు రాజ్‌కుమార్ తెలిపారు. అంతేకాకుండా తన సర్టిఫికేట్లో కూడా భారతీయుడు, తమిళుడు తప్ప మరేలాంటి గుర్తింపు తమకు వద్దన్నారు. మేజర్ ముకుంద్‌ను ఆర్మీ మ్యాన్‌గా మాత్రమే గుర్తించాలని ఆయన తల్లిదండ్రులు నన్ను అభ్యర్థించారని వెల్లడించారు. అందుకే సినిమాలో ఎక్కడా కూడా ముకుంద్ కులాన్ని ప్రస్తావించలేదన్నారు. అలాగే మేజర్ కుటుంబం తనను ఎప్పుడూ కులం అడగలేదని.. అదే స్ఫూర్తితో అశోకచక్ర అవార్డు గ్రహీతకు బహుమతిగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు డైరెక్టర్ వెల్లడించారు.అమరన్ గురించి..కాగా.. అమరన్ చిత్రాన్ని 2014లో జరిగిన ఉగ్రవాద దాడి ఆధారంగా తెరకెక్కించారు. ఈ దాడుల్లో మేజర్ ముకుంద్ అమరుడయ్యారు. ఆయన జీవిత చరిత్రనే సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కాగా.. మేజర్ ముకుంద్ వరదరాజన్ 2009లో ఇందును వివాహం చేసుకోగా..2011లో వీరికి కుమార్తె అర్షే ముకుంద్ జన్మించింది. ఈ చిత్రాన్ని శివ్ అరూర్, రాహుల్ సింగ్ రచించిన ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్: ట్రూ స్టోరీస్ ఆఫ్ మోడరన్ మిలిటరీ హీరోస్ పుస్తకం ఆధారంగా రూపొందించారు. -
సూర్య 'కంగువా' రిలీజ్.. మేకర్స్ బిగ్ ప్లాన్!
కోలీవుడ్ స్టార్ హీరో నటించిన పీరియాడికల్ యాక్షన్ చిత్రం కంగువా. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. శివ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మించారు. గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోన్న కంగువా చిత్రంపై నిర్మాత ధనంజయన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.కంగువా మూవీని భారీస్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా దాదాపు పదివేల స్క్రీన్లలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. బెంగళూరులో మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న నిర్మాత ఈ విషయాన్ని పంచుకున్నారు. ఈ ప్రకటనతో సూర్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.ధనంజయన్ మాట్లాడుతూ..' కంగువా విడుదల కోసం మేము ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. తమిళనాడులో ఇప్పటికే 700లకు పైగా స్క్రీన్లు సిద్ధం చేశాం. ఒక్క సౌత్‌లోనే 2,500 కంటే ఎక్కువ స్క్రీన్లు ప్లాన్ చేశాం. ఉత్తర భారతదేశంలో దాదాపు 3,000 నుంచి 3,500 వరకు థియేటర్లలో విడుదల చేయనున్నాం. ఈ విషయం పట్ల మేము చాలా గర్వంగా ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 14న పదివేల కంటే ఎక్కువ స్క్రీన్లలో విడుదల కానుంది' అని అన్నారు.కాగా.. ఈ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్‌లో సూర్య రెండు పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, దిశా పటాని, నటరాజన్ సుబ్రమణ్యం, జగపతి బాబు, రెడిన్ కింగ్స్లీ, కోవై సరళ, ఆనందరాజ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. -
నాగార్జున 'కుబేర'.. ఫ్యాన్స్‌కు దీపావళీ అప్డేట్ వచ్చేసింది!
కోలీవుడ్ స్టార్ ధనుశ్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం కుబేర. ఈ సినిమాను శేఖర్ కమ్ముల డైరెక్షన్లో రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అన్నీ కుదిరితే ఈ ఏడాదిలోనే విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. దీపావళి సందర్భంగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈనెల 15న కార్తీక పౌర్ణమి సందర్భంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ విడుదల చేస్తూ అనౌన్స్మెంట్ చేశారు. కాగా.. ఈ చిత్రంలో ఇదివరకెన్నడూ చేయని ఓ సరికొత్తపాత్రలో ధనుష్ కనిపించనున్నరు. ఈ సినిమాలో ఆయన పెర్ఫార్మెన్స్ నెక్ట్స్ లెవల్లో ఉంటుందని ఇప్పటికే చిత్రయూనిట్ పేర్కొంది. బాలీవుడ్ నటుడు జిమ్‌సర్భ్ కీలకపాత్రలో నటిస్తోన్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. Wishing you a sparkling Diwali from #SekharKammulasKubera! 💥The wait is almost over!!Catch the explosive #KuberaTeaser on Kartik Purnima, November 15th! 💥🔥@dhanushkraja KING @iamnagarjuna @iamRashmika @sekharkammula @jimSarbh @Daliptahil @ThisIsDSP @AsianSuniel @SVCLLP… pic.twitter.com/9vAsnAv4tu— Annapurna Studios (@AnnapurnaStdios) November 1, 2024 -
శివ కార్తికేయన్ అమరన్.. తొలి రోజే రజనీకాంత్ సినిమాను దాటేసింది!
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం 'అమరన్'. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న అమరన్ థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబడుతోంది.తొలిరోజే దేశవ్యాప్తంగా రూ.21 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించింది. ఒక్క తమిళనాడులోనే ఏకంగా రూ.15 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ రోజు తమిళనాడులో సెలవుదినం కావడంతో రెండో రోజు వసూళ్లు మరింత పెరిగే అవకాశముంది. తమిళ వర్షన్లో మొదటి రోజు థియేటర్లలో 77.94 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. (ఇది చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 15 సినిమాలు)రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన అమరన్ అంచనాలకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద రాణిస్తోంది. అయితే విజయ్ ది గోట్, రజనీకాంత్ వేట్టయాన్ చిత్రాల మొదటి రోజు కలెక్షన్లను మాత్రం అధిగమించలేకపోయింది. అయితే తమిళనాడులో కమల్ హాసన్ చిత్రం ఇండియన్ -2 ఓపెనింగ్ డే కలెక్షన్స్‌ను దాటేసింది. కాగా.. ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాను ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్: ట్రూ స్టోరీస్ ఆఫ్ మోడరన్ మిలిటరీ హీరోస్ అనే పుస్తక ఆధారంగా తెరకెక్కించారు. -
సూర్య 'కంగువా'.. ఆ క్రేజీ సాంగ్ వచ్చేసింది!
కోలీవుడ్ సూపర్ స్టార్ సూర్య నటించిన భారీ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ 'కంగువా'. ఈ చిత్రాన్ని శివ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ వచ్చేనెల థియేటర్లలో సందడి చేయనుంది. ప్రస్తుతం కంగువా టీమ్ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు.కంగువా విడుదలకు మరో రెండు వారాలు ఉండడంతో చిత్రయూనిట్ వరుసగా అప్డేట్స్ ఇస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి నాయకా..' లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందించగా.. రాకేందు మౌళి లిరిక్స్ అందించారు. కాగా.. ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 14న విడుదల కానుంది. -
రాఘవ లారెన్స్ బర్త్ డే.. గ్లింప్స్ అదిరిపోయింది!
కోలీవుడ్ స్టార్ హీరో రాఘవ లారెన్స్ మరో యాక్షన్ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను అలరించనున్నారు. ఇన్నాసి పాండియన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్‌పై కదిరేశన్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. తాజాగా ఇవాళ ఆయన బర్త్ డే కావడంతో బుల్లెట్ బండి మూవీ గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.గ్లింప్స్ చూస్తుంటే ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీశైలం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ గ్లింప్స్‌లో యాక్షన్ సీన్స్, ఫైట్ సీక్వెన్స్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో టాలీవుడ్ నటుడు సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు సామ్ సీఎస్ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రంలో ఎల్విన్, వైశాలి, సింగంపులి ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. -
రియల్ హీరోకు కేరాఫ్ అడ్రస్ మీరే.. బర్త్ డే రోజు ఏం చేశారంటే?
కోలీవుడ్ స్టార్ రాఘవ లారెన్స్ ప్రస్తుతం ఓ యాక్షన్ అడ్వెంచరస్ మూవీలో నటిస్తున్నారు. రమేశ్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎ స్టూడియోస్ ఎల్ఎల్పీ, నీలాద్రి ప్రొడక్షన్స్, హవీష్ ప్రొడక్షన్స్‌పై కోనేరు సత్యానారాయణ నిర్మించనున్నారు. ఇందులో రాఘవ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. గతేడాది జిగర్తాండ డబుల్ ఎక్స్ సినిమాతో అలరించిన సంగతి తెలిసిందే. అయితే రాఘవ లారెన్స్ సినిమాల్లో మాత్రమే హీరో కాదు.. రియల్ లైఫ్‌లోనే హీరోనే. ఇప్పటికే ఆయన తన మాత్రం ఫౌండేషన్ ద్వారా పేదలు, రైతులకు సాయం అందిస్తున్నారు. ఇప్పటికే పలువురు వికలాంగులు, రైతులు అవసరమైన ట్రాక్టర్లు, త్రీవీలర్స్ అందజేశారు. ఇవాళ తన బర్త్ డే కావడంతో పేద వితంతు మహిళలకు అండగా నిలిచారు. వారికి కుట్టు మిషన్స్ అందించి వారి కళ్లలో ఆనందం నింపారు. ఈ విధంగా సాయం అందించి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను తన ట్విటర్లో పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు రాఘవ లారెన్స్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. Hi friends and fans, During my Mataram journey many widowed women requested for a stitching machine as it would give them an opportunity to work and fulfill their daily needs. As a new venture for my birthday tomorrow. I provided Tailoring machines to widowed women. I need all… pic.twitter.com/1vHBCcE1GQ— Raghava Lawrence (@offl_Lawrence) October 28, 2024 -
సినిమా వేరు.. రాజకీయం వేరు.. అయినా తగ్గేదేలే: విజయ్ పవర్ఫుల్ స్పీచ్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తమిళగ వెట్రి కళగం(టీవీకే) పేరుతో పార్టీని స్థాపించిన ఆయన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవనున్నారు. అందులో భాగంగానే ఇవాళ భారీ బహిరంగ సభ నిర్వహించారు. విల్లుపురంలో నిర్వహించిన సభలో తమిళనాడు రాజకీయాలపై విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.సినీరంగంతో పోలిస్తే రాజకీయాలు చాలా సీరియస్ అని విజయ్ కామెంట్స్ చేశారు. అయినా సరే పాలిటిక్స్‌లో భయపడేది లేదని స్పష్టం చేశారు. నా కెరీర్ పీక్స్ దశలో ఉన్నప్పుడే సినిమాలు వదిలేసి వచ్చానని తెలిపారు. తాను ఎవరికీ కూడా ఏ టీమ్.. బీ టీమ్ కాదని అన్నారు. ఈ సందర్భంగా టీవీకే పార్టీ సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యాచరణను ఆయన ప్రకటించారు. ఈ భారీ బహిరంగ సభకు లక్షల సంఖ్యలో విజయ్ అభిమానులు హాజరయ్యారు.ద్రవిడ, తమిళ జాతీయవాద సిద్ధాంతాలను అనుసరిస్తామని విజయ్ ప్రకటించారు. తమిళనాడు గడ్డకు అవీ రెండు కళ్ల లాంటివన్నారు. లౌకిక, సామాజిక న్యాయ సిద్ధాంతాలే మా పార్టీ భావజాలమని ఆయన స్పష్టం చేశారు. పెరియార్ ఈవీ రామస్వామి, కె.కామరాజ్, బాబాసాహెబ్ అంబేడ్కర్, వేలు నాచియార్, అంజలి అమ్మాళ్ ఆశయాలతో పార్టీని ముందుకు తీసుకెళ్తామని విజయ్ వెల్లడించారు. నాకు రాజకీయ అనుభవం లేకపోయినా భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తొలి సభలోనే డీఎంకే, బీజేపీపై విమర్శలు చేశారు. గతంలో ఎన్టీఆర్, ఎంజీఆర్ సైతం విమర్శలు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. తనను ఆర్టిస్ట్ అంటూ విమర్శలు చేస్తున్న వారికి గట్టి కౌంటర్ ఇచ్చారు. తొలి బహిరంగ సభలోనే తన స్పీచ్‌తో అదరగొట్టారు హీరో, టీవీకే అధినేత విజయ్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని సభ వేదికగా విజయ్ ప్రకటించారు. Tamil Nadu | Actor and TVK President Vijay says "In terms of ideology, we are not going to separate Dravidian Nationalism and Tamil Nationalism. They are two eyes of this soil. We shouldn't shrink ourselves to any specific identity. Secular Social Justice ideologies are our… pic.twitter.com/tclhef2BUk— ANI (@ANI) October 27, 2024 -
'అమ్మ, నాన్న పెట్టిన పేరు అదే'.. హీరో సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. ఇటీవల ముంబయి, హైదరాబాద్‌లో ఫుల్ బిజీగా ఈవెంట్స్‌లో పాల్గొన్నారు. శివ దర్శకత్వంలో వస్తోన్న హిస్టారికల్ యాక్షన్ మూవీ కంగువా కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్.. ప్రమోషన్స్‌తో దూసుకెళ్తున్నారు.తాజాగా ఇవాళ వైజాగ్‌లో కంగువా చిత్రయూనిట్ సభ్యులు ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో హీరో సూర్యతో పాటు డైరెక్టర్ శివ, నిర్మాత కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో సూర్య పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. వైజాగ్ సిటీ నా జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాలను అందించిందని అన్నారు. మా అమ్మ, నాన్నలకు ఎంతో ఇష్టమైన నగరాల్లో వైజాగ్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుందన్నారు. హీరో సూర్య మాట్లాడుతూ..'వైజాగ్ సిటీ నాకు చాలా ప్రత్యేకం. అంతేకాదు ఈ రోజు నాకు స్పెషల్ డే. 2015లో సింగం-3 షూటింగ్ కోసం ఇక్కడికి వచ్చా. ఇక్కడ చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. దాదాపు 40 ఏళ్ల క్రితం అమ్మ, నాన్న వైజాగ్‌కు వచ్చారు. కానీ ఆ తర్వాత నా సినిమా షూటింగ్స్ అప్పుడు కూడా ఇద్దరు వచ్చేవారు. ఇక్కడ ప్రజల ప్రేమ ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని నాతో అన్నారు. నాకు మా అమ్మ, నాన్న పెట్టిన పేరు శరవణన్. సినిమాల్లోకి వచ్చాకే నా పేరు సూర్యగా మారింది. నా పట్ల తల్లిదండ్రుల ప్రేమ ఎప్పటికీ జీవితంలో మర్చిపోలేను. నా పట్ల అభిమానులు చూపిస్తున్న ప్రేమకు ఏదో ఒకటి చేయాలని అనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ కంగువా సినిమా చూడాలని కోరుకుంటున్నా' అని అన్నారు. కాగా.. కంగువా చిత్రం వచ్చేనెల 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
భార్యతో విడాకులు.. అలాంటివారే రూమర్స్ క్రియేట్ చేస్తారు: జయం రవి
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే తన భార్య ఆర్తితో విడాకులు తీసుకుంటున్నట్లు ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన జయం రవి విడాకుల తర్వాత తనపై వచ్చిన రూమర్స్‌పై తొలిసారి స్పందించారు. ఈ విషయంలో ఎవరినీ తప్పు పట్టాల్సిన అవసరం లేదన్నారు.జయం రవి మాట్లాడుతూ.. 'మేము పబ్లిక్ డొమైన్లో ఉన్నాం. నేను బయట టీ తాగినా..ఏ చేసినా తెలిసిపోతుంది. ఎందుకంటే మేము సినిమా వ్యక్తులం. మమ్మల్ని ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారు. వారి అభిప్రాయాలు కూడా వెల్లడిస్తుంటారు. మేమైతే వాటిని అడ్డుకోలేం కదా. కొంతమంది పరిణితి చెందిన వారు ఇలాంటి రూమర్స్‌ను పట్టించుకోరు. పరిపక్వత లేని కొద్దిమంది మాత్రమే రూమర్స్ వ్యాప్తి చేయడం చేస్తుంటారు. కొంతమంది ఆ విషయంలో ఉన్న తీవ్రత అర్థం చేసుకోకుండా మాట్లాడతారు. కానీ నా గురించి నాకు పూర్తిగా తెలిసినప్పుడు ఇలాంటి వాటి గురించి తెలుసుకుని ఎందుకు బాధపడతాం' అని అన్నారు.(ఇది చదవండి: మౌనంగా ఉన్నానంటే తప్పు చేసినట్లు కాదు: ఆర్తి)కాగా.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అయితే తన అనుమతి లేకుండానే విడాకుల ప్రకటన విడుదల చేశారని ఆయన భార్య ఆర్తి ఆరోపించింది. అయితే ఆమె మాటల్లో ఎలాంటి నిజం లేదని జయం రవి క్లారిటీ ఇచ్చారు. పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. -
'ఆర్మీ జాబ్ కాదు.. నా లైఫ్'.. అమరన్ ట్రైలర్ వచ్చేసింది!
కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటిస్తోన్న చిత్రం అమరన్. ఆర్మీ మేజర్ నిజ జీవితం ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాకు రాజ్‌కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ దీపావళి కానుకగా ఈ నెల 31న థియేటర్లలో సందడి చేయనుంది.తాజాగా అమరన్ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగానే ఈ సినిమాను తెరకెక్కించారు. ట్రైలర్ చూస్తే ఆర్మీలో దేశం కోసం ఆయన చేసిన పోరాట సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ట్రైలర్లో దేశ రక్షణ కోసం మేజర్ పోరాడిన సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్ చూస్తే మరో సీతారామం మూవీని గుర్తుకు వచ్చేలా ఉన్నాయి. కాగా.. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. -
నేను పాత్రలు ఎంచుకోవడానికి ఆయనే కారణం: సాయిపల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
హీరోయిన్ సాయి పల్లవి ప్రస్తుతం తండేల్ మూవీలో నటిస్తోంది. నాగచైతన్య హీరోగా నటిస్తోన్న ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఓ మత్స్యకారుని నిజ జీవితం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ సాయి పల్లవి ఓ చిత్రంలో కనిపించనుంది. శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కుతోన్న యాక్షన్ మూవీలో నటించింది.తాజాగా ఈ మూవీ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో హీరోయిన్ సాయిపల్లవి పాల్గొన్నారు. అయితే ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా స్టార్ డైరెక్టర్ మణిరత్నం హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరోయిన్ సాయిపల్లవి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆమెకు నేను పెద్ద అభిమానిని.. ఏదో ఒక రోజు సాయిపల్లవితో కచ్చితంగా సినిమా తీస్తానని మణిరత్నం అన్నారు. దర్శకుడి మాటలు విన్న సాయిపల్లవి సంతోషం వ్యక్తం చేసింది.డైరెక్టర్ మణిరత్నం మాటలపై సాయిపల్లవి స్పందించింది. సినిమాల్లోకి రాకముందు నాకు మణిరత్నం సార్ పేరు తప్ప.. ఇతర దర్శకుల పేర్లు తెలియవని చెప్పింది. అంతేకాకుండా తాను స్క్రిప్ట్‌లు, పాత్రలు ఎంచుకోవడానికి కూడా కారణం ఆయనేనని తెలిపింది. కాగా.. అమరన్ చిత్రాన్ని మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమాకు రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ దీపావళి సందర్భంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
రజినీకాంత్ వేట్టయాన్.. ఓటీటీకి అంత త్వరగానా?
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం వేట్టయాన్. టీజే జ్ఞానవేల్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం దసరా సందర్భంగా థియేటర్లలోకి వచ్చింది. ఈనెల 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం తొలిరోజే మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా ఫర్వాలేదనిపించింది. సినిమా రిలీజైన రోజు నుంచి ఇప్పటి వరకు రూ.134 కోట్ల నికర వసూళ్లు రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రావడంతో చిత్రబృందం సెలబ్రేట్ చేసుకుంది.తాజాగా వేట్టయాన్ మూవీ ఓటీటీ విడుదలపై అప్పుడే టాక్ మొదలైంది. రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీకి రానుందని నెట్టింట చర్చ నడుస్తోంది. ప్రస్తుతం వేట్టయాన్ బాక్సాఫీస్ వద్ద రెండో వారంలోకి అడుగుపెట్టింది. విడుదలైన నాలుగు వారాల తర్వాతే ఓటీటీకి వచ్చేలా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఈ లెక్కన ఈ మూవీ నవంబర్ 7న లేదా 9న ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: రజినీకాంత్ వేట్టయాన్.. నాలుగు రోజుల్లోనే రికార్డ్!)కాగా.. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియోకి దక్కించుకుంది. దసరా సందర్భంగా అక్టోబరు 10న వెట్టయాన్ తెరపైకి వచ్చింది. నాలుగు వారాల తర్వాత అంటే ఈ దీపావళి తర్వాత ప్రైమ్‌లో స్ట్రీమింగ్కు వచ్చే అవకాశముంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా.. ఈ సినిమాలో మంజు వారియర్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, కిశోర్, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయ్, రోహిణి ముఖ్యపాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. -
రజినీకాంత్ వేట్టయాన్.. నాలుగు రోజుల్లోనే రికార్డ్!
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం వేట్టయాన్. టీజే జ్ఞానవేల్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం దసరా సందర్భంగా థియేటర్లలోకి వచ్చింది. ఈనెల 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాగా.. తొలిరోజే మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది.విడుదలైన నాలుగు రోజుల్లోనే రికార్డ్ స్థాయి వసూళ్లు సాధించింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 240 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అదేవిధంగా రూ.104.75 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో రజినీ కెరీర్లో రూ.200 కోట్ల క్లబ్లో చేరిన ఏడో చిత్రంగా వేట్టయాన్ నిలిచింది. అంతకుముందు తలైవా చిత్రాలైన పెట్టా, దర్బార్, ఎంథిరన్, కబాలి, జైలర్, రోబో 2.0 చిత్రాలు రూ.200 కోట్ల క్లబ్లో చేరాయి. కాగా.. ఈ ఏడాదిలో రజినీకాంత్ నటించిన జైలర్ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.605 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఇదో జోరు కొనసాగితే మరికొద్ది రోజుల్లోనే పెట్టా (రూ. 223 కోట్లు), దర్బార్ (రూ. 226 కోట్లు) చిత్రాలను వేట్టయాన్ అధిగమించనుంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతమందించారు. కాగా.. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ హీరో రానా కీలక పాత్రలు పోషించారు. -
ది గోట్ సరికొత్త రికార్డ్.. కేక్ కట్ చేసిన విజయ్
విజయ్ హీరోగా నటించిన తాజా చిత్రం ది గోట్. సెప్టెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ సుమారు రూ. 400 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టింది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉంది. విజయ్ సరసన మీనాక్షి చౌదరి నటించగా.. ఈ సినిమాలో త్రిష ప్రత్యేక సాంగ్‌లో మెరిశారు.తాజాగా దళపతి విజయ్ తన చిత్రం గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT) సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకున్నాఈ చిత్రం తమిళనాడులో రూ. 100 కోట్ల షేర్ సాధించడంతో నిర్మాత అర్చన కల్పాతితో కలిసి కేక్ కట్ చేశారు. అర్చనతో కలిసి నటుడు కేక్ కట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.కాగా.. ఈ చిత్రంలో విజయ్ రెండు పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, జయరామ్, స్నేహ, లైలా, అజ్మల్ అమీర్, వైభవ్, ప్రేమి అమరేన్, యుగేంద్రన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు. Celebrating #TheGreatestOfAllTime moment with @actorvijay na❤️❤️❤️ @archanakalpathi for achieving #100CRORESSHAREINTAMILNADU @vp_offl @Jagadishbliss bro thanks @Ags_production @agscinemas @aishkalpathi pic.twitter.com/JdaTdxpvCq— raahul (@mynameisraahul) October 12, 2024 -
వేట్టయాన్‌కు ఊహించని రెస్పాన్స్.. మేకర్స్ కీలక నిర్ణయం!
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం వేట్టయాన్. దసరా సందర్బంగా ఈనెల 10న థియేటర్లలోకి వచ్చింది. టీజీ జ్ఞానవేల్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాకు మొదటి రోజే మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో తొలిరోజు కలెక్షన్లపై ప్రభావం చూపింది. అయినప్పటికీ ఫస్ట్ రోజే రూ.30 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ది గోట్(రూ. 44 కోట్లు) తర్వాత సెకండ్ ప్లేస్‌లో నిలిచింది.అయితే రజనీకాంత్ వేట్టైయాన్కు ఆడియన్స్ నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. దీంతో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వెట్టయాన్ కోసం మరిన్ని థియేటర్లను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. దీంతో దేశంలోని కీలక రాష్ట్రాల్లో అదనపు స్క్రీన్లలో వేట్టయాన్ ప్రదర్శించనున్నారు. ఈ విషయాన్న చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది.ఈ చిత్రం రికార్డు స్థాయిలో వసూళ్లు సాధిస్తోందని.. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లు అదనపు స్క్రీన్స్ కావాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. కాగా..టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన వేట్టయాన్ యాక్షన్ చిత్రంలో అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహద్ ఫాసిల్, మంజు వారియర్, అభిరామి, దుషార విజయన్, రితికా సింగ్ కీలక పాత్రలు పోషించారు. -
'మన దేశ కుమారుడిని కోల్పోయాం'.. రజినీకాంత్ ఎమోషనల్ ట్వీట్
ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా మరణం పట్ల సూపర్ స్టార్ రజినీకాంత్ సంతాపం వ్యక్తం చేశారు. తన విజన్, అభిరుచితో మనదేశాన్ని ప్రపంచపటంలో నిలిపారని కొనియాడారు. దేశంలోని వేలాది మంది పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తిగా నిలిచారని ఆయనతో ఉన్న క్షణాలను గుర్తు చేసుకున్నారు. ఎన్నో తరాలుగా లక్షలాది ఉద్యోగాలు సృష్టించిన వ్యక్తిని కోల్పోవడం తీరని లోటన్నారు. ఈ మేరకు ఆయనతో ఉన్న ఫోటోను రజినీకాంత్ ట్వీట్ చేశారు. రజినీకాంత్ తన ట్వీట్లో.. 'తన విజన్, అభిరుచితో భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలిచారు. వేలాది మంది పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తినిచ్చి, ఎన్నో తరాలుగా లక్షలాది ఉద్యోగాలు సృష్టించిన వ్యక్తి. అందరి అభిమానం, గౌరవం పొందిన వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తితో గడిపిన ప్రతి క్షణాన్ని నేను ఎప్పటికీ గౌరవిస్తాను. భారతదేశానికి నిజమైన కుమారుడు ఇక లేడు. .. మీ ఆత్మకు శాంతి కలగాలి' అంటూ పోస్ట్ చేశారు.కాగా.. బిజినెస్ టైకూన్, టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా (86) కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు.A great legendary icon who put India on the global map with his vision and passion ..The man who inspired thousands of industrialist .. The man who created lakhs and lakhs of jobs for many generations ..The man who was loved and respected by all .. My deepest salutations to… pic.twitter.com/S3yG1G7QtK— Rajinikanth (@rajinikanth) October 10, 2024 -
రజినీకాంత్ వెట్టైయాన్.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో బిగ్ షాక్!
సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న భారీ యాక్షన్ చిత్రం వెట్టైయాన్. టీజీ జ్ఞానవేల్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ పాన్ ఇండియా సినిమా దసరా సందర్భంగా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. జైలర్ తర్వాత తలైవా నటించిన చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది.ఈ నేపథ్యంలో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయ్యాయి. ఇప్పటివరకు తమిళ వర్షన్ కేవలం రూ.10.2 కోట్ల మేర టికెట్స్ బుకింగ్స్ మాత్రమే పూర్తయ్యాయి. తెలుగులో అయితే ఈ సంఖ్య మరింత తక్కువగా ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా కేవలం రూ.74 లక్షలు మాత్రమే వసూళ్లు రానున్నాయి. హిందీలో మరింత దారుణంగా రూ.93 వేల అడ్వాన్స్ బుకింగ్ బిజినెస్ జరిగింది. ఓవరాల్‌గా చూస్తే ఇండియా వ్యాప్తంగా రూ.11 కోట్ల వరకు ముందస్తు టికెట్ బుకింగ్స్ అయినట్లు తెలుస్తోంది.అడ్వాన్స్ బుకింగ్స్‌లో వెట్టైయాన్‌కు క్రేజ్ తగ్గడంపై ఫ్యాన్స్ షాకవుతున్నారు. ట్విటర్లో ఏకంగా వెట్టైయాన్ డిజాస్టర్ అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ చేస్తున్నారు. ఈ విషయంపై నెట్టింట తెగ చర్చ మొదలైంది. అసలే ఈ మూవీ కోసం సూర్య నటించిన కంగువా చిత్రాన్ని మేకర్స్ వాయిదా వేసుకున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలున్నప్పటికీ అడ్వాన్స్ బుకింగ్స్ పెద్దగా జరగకపోవడంపై ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. దీన్ని బట్టి చూస్తే మొదటి రోజు వంద కోట్ల రాబట్టడం కష్టంగానే కనిపిస్తోంది. ఈ చిత్రంలో రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, రితికా సింగ్, దుషార విజయన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
ఓటీటీకి రాని తంగలాన్.. అసలు సమస్య ఇదేనా?
తమిళ స్టార్ హీరో విక్రమ్ ఇటీవల నటించిన సినిమా 'తంగలాన్'. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ భారీగానే కలెక్షన్స్ రాబట్టింది. పా.రంజిత్ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ మూవీని తెలుగు, తమిళంలో ఓకేసారి రిలీజ్ చేశారు.అయితే ఈ మూవీ రిలీజైన రెండు నెలల కావొస్తున్నా ఇప్పటికీ ఓటీటీకి రాలేదు. ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే తంగలాన్ డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను డిజిటల్ స్ట్రీమింగ్ చేయనున్నట్టు అధికారికంగా కూడా ప్రకటించారు. దీంతో ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతుందని ఓటీటీ ఆడియన్స్ వెయిట్ చేశారు. కానీ ఓటీటీలో స్ట్రీమింగ్ కాలేదు.తాజా సమాచారం మేరకు నెట్ ఫ్లిక్స్‌తో మేకర్స్‌కు సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ఒప్పందాన్ని నెట్‌ఫ్లిక్స్ రద్దు చేసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో తంగలాన్ హక్కులు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ కొనుగోలు చేసినట్లు లేటేస్ట్ టాక్. త్వరలోనే స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు సమాచారం.తంగలాన్ కథేంటంటే..'తంగలాన్' విషయానికొస్తే 1850లో చిత్తూరు ప్రాంతంలోని పల్లెటూరు. తంగలాన్ ఓ శ్రామికుడు. అతడికి భార్య ఐదుగురు పిల్లలు. ఓ రోజు పిల్లలతో.. ఏనుగు కొండ వెనకాల బంగారం కొండ ఉందని, దానికి ఓ రక్షకురాలు ఉందని ఏవో కథలు చెబుతాడు. కట్ చేస్తే తంగలాన్‌తోపాటు కొందరిని బ్రిటీష్ దొరలు బంగారం నిధుల కోసం కూలీలుగా తీసుకెళ్తారు. నిధి అన్వేషణ కోసం సాగించిన ప్రయాణంలో వీళ్లకు ఎదురైన సవాళ్లు ఏంటి? చివరకు ఏమైందనేదే కథ. -
రజినీకాంత్ 'వెట్టైయాన్'.. ట్రైలర్ వచ్చేసింది!
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం వెట్టైయాన్. టీజీ జ్ఞానలేల్ డైరెక్షన్లో ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరెకెక్కించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. ఇప్పటికే రిలీజైన 'మనసియాలో' అనే సాంగ్ తలైవా ఫ్యాన్స్‌ను ఊర్రూతలూగిస్తోంది. తాజాగా వేట్టైయాన్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.(ఇది చదవండి: ఆస్పత్రిలో రజినీకాంత్.. కోలుకోవాలంటూ విజయ్ ట్వీట్!) కాగా.. ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి కీలక పాత్ర పోషిస్తున్నారు. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కూడా ాకనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ దసరాకు అక్టోబర్ 10 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేసేందుకు వస్తోంది. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. ఈ మూవీలో ఫాహాద్ ఫాజిల్, రితికా సింగ్, మంజు వారియర్, దుషారా విజయన్ ముఖ్య పాత్రల్లో నటించారు. -
దళపతి సరసన మరోసారి ఛాన్స్ కొట్టేసిన బుట్టబొమ్మ..!
దళపతి విజయ్ ఇటీవలే ది గోట్ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. వెంకట్ ప్రభు డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. సెప్టెంబర్ 5న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 400 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టింది. ఈ మూవీ త్వరలోనే ఓటీటీలోనూ సందడి చేయనుంది. ఈ నెల 3వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.అయితే విజయ్ మరో చిత్రానికి రెడీ అయ్యారు. హెచ్ వినోత్ డైరెక్షన్లో ఆయన నటించనున్నారు. అయితే ఈ మూవీలో దళపతి సరసన బుట్టబొమ్మ ఛాన్స్ కొట్టేసింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఈ సందర్భంగా ప్రొడక్షన్ హౌస్ పూజా హెగ్డేకి స్వాగతం పలుకుతూ పోస్టర్‌ను విడుదల చేసింది. అంతకుముందు పూజా హెగ్డే బీస్ట్ చిత్రంలో విజయ్ సరసన నటించింది. ఈ చిత్రంలో విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నటిస్తున్నారు. రాజకీయాల్లో పోటీకి ముందు ఈ సినిమానే విజయ్ కెరీర్లో చివరి చిత్రంగా నిలవనుంది.(ఇది చదవండి: ఓటీటీలో విజయ్ 'ది గోట్' సినిమా.. అధికారిక ప్రకటన)దళపతి 69 పేరుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్లో విజయ్ టార్చ్ పట్టుకుని కనిపించారు. తాజా సమాచారం ప్రకారం అక్టోబర్ 5న షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. View this post on Instagram A post shared by KVN Productions (@kvn.productions) View this post on Instagram A post shared by KVN Productions (@kvn.productions) -
బిగ్‌బాస్ సీజన్-8.. కంటెస్టెంట్స్ వీళ్లేనా.. లిస్ట్ వైరల్!
టాలీవుడ్ బుల్లితెర ప్రేక్షకులను బిగ్‌బాస్ షో అలరిస్తోంది. ఈ షో ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. అయితే గతేడాది కంటే ఈసారి కాస్తా ఆడియన్స్‌కు ఇంట్రెస్ట్ తగ్గినట్లు కనిపిస్తోంది. అయితే ఇప్పటికే తెలుగు ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ షో తమిళంలోనూ ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమైంది. తమిళ బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌కు విజయ్ సేతుపతి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. గతంలో కమల్ హాసన్ హోస్ట్‌గా ఉండగా.. బిజీ షెడ్యూల్ కారణంగా ఈసారి ఆయన తప్పుకున్నారు.ఈ నెల ఆరో తేదీ నుంచి తమిళ ఆడియన్స్‌ను అలరించేందుకు బిగ్‌బాస్ సీజన్-8 వచ్చేస్తోంది. ఈ ఆదివారం నుంచే విజయ్ టీవీ ప్రసారం కానుంది. విజయ్ టీవీలో రాత్రి 9.30 నుంచి 10.30 గంటల వరకు ప్రసారం ఈ షో ప్రసారం చేయనున్నారు. అంతేకాకుండా ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లోనూ ఈ రియాలిటీ షోను చూడొచ్చు. కాగా.. ఇప్పటికే మేకర్స్ బిగ్‌బాస్ ప్రోమోను కూడా రిలీజ్ చేశారు.కంటెస్టెంట్స్ జాబితా వైరల్!బిగ్‌బాస్ తమిళ్ సీజన్-8లో కంటెస్టెంట్స్ గురించి పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. ప్రముఖంగా నటుడు వీటీవీ గణేశ్ వినిపిస్తోంది. ఆయనతో పాటు సునీతా గొగోయ్, పాల్ డబ్బా అలియాస్ అనీష్, అన్షిత అక్బర్షా, కేఆర్ గోకుల్, ఐశ్వర్య, అరుణ్ ప్రసాద్, దార్శిక, సౌందర్య నంజుండన్, విజే విశాల్ పేర్లు టాప్-10లో ప్రధానంగా వినిపిస్తున్నాయి. తాజా నివేదిక ప్రకారం దాదాపు 16 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశిస్తారని తెలుస్తోంది. ఆ తర్వాత మరో ముగ్గురు-నాలుగు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇవ్వనున్నారు.புது வீடு புது மனுசங்க, சண்ட போடுவாங்களா தெரியாது., ஆனா கண்டிப்பா சமாதானமா இருக்க மாட்டாங்க.. எதுவா இருந்தாலும் நான் Ready..🔥#GrandLaunch of Bigg Boss Tamil Season 8 - அக்டோபர் 6 முதல் மாலை 6 மணிக்கு நம்ம விஜய் டிவில.. 😎 #VJStheBBhost #Vijaysethupathi #BiggBossTamilSeason8 pic.twitter.com/gTjpbrL1x9— Vijay Television (@vijaytelevision) October 1, 2024 -
చిట్టికి 14 ఏళ్లు పూర్తి.. మేకర్స్ స్పెషల్ వీడియో వైరల్!
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ రోబో. శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సైంటిఫిక్ యాక్షన్ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తమిళంలో ఎంథిరన్ పేరుతో ఈ మూవీని శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించారు. తెలుగులో రోబో పేరుతో విడుదలైన ఈ మూవీకి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. చిట్టి అనే పేరు గల రోబో ఆడియన్స్‌ను ఎమోషనల్‌గా టచ్ చేసింది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో రోబో-2ను సైతం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు శంకర్.అయితే ఎంథిరన్(రోబో) విడుదలై సరిగ్గా నేటికి 14 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సన్ పిక్చర్స్ యాజమాన్యం స్పెషల్ వీడియోను షేర్ చేసింది. భారతీయ సినిమాని పునర్వైభవం తీసుకొచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రం.. ఏ మాస్టర్ పీస్ ఎంతిరన్ 14 సంవత్సరాల వేడుక జరుపుకుంటోంది అంటూ స్పెషల్ వీడియోను పోస్ట్ చేసింది. ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.The sci-fi journey that redefined Indian Cinema💥 Celebrating the 14 years of the masterpiece #Enthiran#14YearsofEnthiran pic.twitter.com/L61SIAZ59L— Sun Pictures (@sunpictures) October 1, 2024 -
రామ్ చరణ్ సాంగ్‌కు స్టెప్పులేసిన స్టార్ హీరో.. వీడియో వైరల్!
కోలీవుడ్ స్టార్ ఎస్జే సూర్య ఇటీవలే సరిపోదా శనివారం అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. నాని హీరోగా నటించిన ఈ చిత్రంలో కీలక పాత్రలో మెప్పించారు. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌లో నటిస్తున్నారు. శంకర్ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రంలో కీ రోల్ ప్లే చేస్తున్నారు. తాజాగా ఆ మూవీ నుంచి రా మచ్చా మచ్చా అనే లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.(ఇది చదవండి: రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'.. ఆ క్రేజీ సాంగ్ వచ్చేసింది!)ఈ పాటకు తన స్టెప్పులతో అలరించారు ఎస్జే సూర్య. డ్యాన్స్ చేస్తూ వేదికపై సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. Poduu Thalaaa @iam_SJSuryah 💥💥#RaaMachaMacha #DamTuDikhaja #GameChanger pic.twitter.com/YTBD5ktGns— Raees🚁 (@RaeesHere_) September 30, 2024 #RaaMachaMacha sj surya on fire🔥🔥🔥🔥🔥🔥🔥 pic.twitter.com/aCkFweUpyJ— GCR🚁🚁🚁 (@GaniCharan1) September 30, 2024 -
కార్తీ మూవీకి సూపర్ హిట్ టాక్.. మేకర్స్ షాకింగ్ నిర్ణయం!
కార్తీ, అరవింద స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం 'మెయిజగన్'. ఈ చిత్రాన్ని సత్యం సుందరం పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమాకు సి.ప్రేమ్‌కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని 2డీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్య, జ్యోతిక నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.(ఇది చదవండి: డియర్ కార్తీ.. మళ్లీ ఆ రోజుల్ని గుర్తుచేశావ్: నాగార్జున)ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా రన్‌టైమ్ దాదాపు 2 గంటల 57 నిమిషాలుగా ఉంది. దీంతో నిడివి ఎక్కువ ఉండడంపై పలువురు విమర్శలు చేశారు. హిట్ టాక్ వచ్చినప్పటికీ రన్‌టైమ్‌పై విమర్శలొస్తున్నాయి. అందువల్లే కొన్ని సీన్స్ మేకర్స్ తొలగించినట్లు సమాచారం. దాదాపు 15 నుంచి 18 నిమిషాల వరకు సినిమాను కట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.తాజాగా ట్రిమ్ చేసిన వర్షన్ ఈ రోజు నుంచే థియేటర్లలో ప్రదర్శించబడుతోంది. ప్రస్తుతం ఈ మూవీ రన్ టైమ్ రెండు గంటల 40 నిమిషాలుగా ఉంది. కాగా.. ఈ చిత్రంలో శ్రీ దివ్య, రాజ్‌కిరణ్, స్వాతి కొండే, దేవదర్శిని, జయప్రకాష్, శ్రీరంజని, ఇళవరసు, కరుణాకరన్ కీలక పాత్రలు పోషించారు. -
తెలుగులో ఆ సినిమాతోనే ఫేమ్.. ఇకపై ఆ పాత్రలు చేయను: సత్యరాజ్
కట్టప్పగా తెలుగు ప్రేక్షకులను అలరించిన నటుడు సత్యరాజ్. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రంతో కట్టప్పగా అభిమానుల గుండెల్లో నిలిచిపోయారు. తాజాగా ఆయన జీబ్రా మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నారు. సత్యదేవ్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన సత్యరాజ్ తెలుగు ఇండస్ట్రీలో తన ప్రస్థానంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.సత్యరాజ్ మాట్లాడుతూ..'విలన్‌గానే నా కెరీర్ ప్రారంభించా. మిర్చి సినిమాతో తెలుగులో ఓ మంచి తండ్రిగా ఫేమస్ అయ్యాను. ఆ తర్వాత బాహుబలిలో కట్టప్పగా నటించా. ఇలాంటి పాత్రలు మళ్లీ చేసే అవకాశం రావడం చాలా అరుదు. మిర్చి మూవీతోనే తెలుగులో నాకు ఇమేజ్ వచ్చింది. ఇక నుంచి రెగ్యులర్ విలన్ పాత్రలు చెయ్యను. హీరో ముందు మోకరిల్లే పాత్రల్లో ఇకపై కనిపించను.' అని అన్నారు. (ఇది చదవండి: సత్యదేవ్ 'జీబ్రా' టీజర్ విడుదల)సత్యదేవ్, డాలీ ధనుంజయ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా జీబ్రా. ఈ ఏడాదిలో కృష్ణమ్మ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సత్యదేవ్.. ఇప్పుడు జీబ్రా అనే చిత్రంతో రానున్నాడు. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్లపై ఎస్ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాలసుందరం, దినేష్ సుందరం ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమాను దీపావళి సందర్భంగా అక్టోబరు 31న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో జెన్నిఫర్ పిసినాటో, సునీల్, ప్రియా భవానీ శంకర్, సత్య అక్కల కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం రవి బస్రూర్ అందించారు. -
అమ్మవారి సేవలో స్టార్ హీరో.. వీడియో వైరల్!
కోలీవుడ్ హీరో కార్తీ ప్రస్తుతం సత్య సుందరం మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. అరవింద్ స్వామి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. మూవీకి హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా హీరో కార్తీ, చిత్రబృందం విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించారు.మూవీ సూపర్ హిట్ కావడంతో విజయవాడలో సక్సెస్ మీట్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బెజవాడ చేరుకున్న కార్తీ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ అంటే మా కుటుంబానికి ఎంతో ఇష్టమని తెలిపారు. దాదాపు ఆరేళ్ల తర్వాత మళ్లీ వచ్చాను.. మా సినిమా చూసి నాగార్జన అభినందించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ మా సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. కాగా.. టాలీవుడ్ మూవీ ఊపిరితో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. నాగార్జునకు తమ్ముడి పాత్రలో అభిమానులను మెప్పించారు.(ఇది చదవండి: డియర్ కార్తీ.. మళ్లీ ఆ రోజుల్ని గుర్తుచేశావ్: నాగార్జున)కాగా.. కార్తి , అరవింద స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మెయ్యజగన్. ఈ చిత్రాన్ని సత్యం సుందరం పేరుతో తెలుగులో విడుదల చేశారు. ఈ సినిమాను దర్శకుడు సి.ప్రేమ్‌కుమార్ తెరకెక్కించారు. ఈ సినిమాను 2డీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్య, జ్యోతిక దీనిని నిర్మించారు. ఈ చిత్రానికి గోవింద్ వసంత సంగీతమందించారు. ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న కార్తీ ✨🙏#Karthi #SathyamSundaram #PremKumar #TeluguFilmNagar pic.twitter.com/vnflnQV50R— Telugu FilmNagar (@telugufilmnagar) September 30, 2024 -
జయం రవి విడాకులకు కారణం నేను కాదు.. సింగర్ క్లారిటీ!
కోలీవుడ్ హీరో జయం రవి తన సతీమణి ఆర్తితో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనికి కారణం ఒక సింగర్ అని టాక్ వినిపిస్తోంది. తాము విడిపోతున్నట్లు కొద్దిరోజుల క్రితం ఒక లేఖను కూడా జయం రవి విడుదల చేశారు. ఇదే విషయంపై ఆయన సతీమణి ఆర్తి కూడా తీవ్రమైణ ఆరోపణలు చేశారు. విడాకుల విషయం గురించి తనకు తెలియదని ఆమె ఆరోపించారు. రవి చేసిన ప్రకటనతో తాను ఆశ్చర్యపోయానని అన్నారు. వీరిద్దరూ విడిపోవడానికి కారణం ఒక సింగర్ అని నెట్టింట వార్తలు వస్తున్నాయి. జయం రవితో బెంగళూరుకు చెందిన కెనిషా ఫ్రాన్సిస్ డేటింగ్ చేస్తున్నారంటూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.(ఇది చదవండి: జయం రవి, ఆర్తి విడిపోవడానికి కారణం ఆ సింగరేనా..?)అయితే తనపై వస్తున్న ఆరోపణలపై సింగర్ కెనీషా స్పందించింది. జయం రవికి నాకు మధ్య ఎలాంటి రిలేషన్ లేదని తెలిపింది. మా మధ్య ఉన్నది కేవలం బిజినెస్‌కు సంబంధించిన రిలేషన్ మాత్రమే అని అన్నారు. నాకు బిజినెస్‌లో ఆయన సపోర్ట్ చేస్తున్నారు అంతే.. జయం రవి నాకు మంచి మిత్రుడని తెలిపింది. మీరంతా అనుకుంటున్నట్లు వారి విడాకులకు కారణం నేను కాదని తేల్చి చెప్పింది. తనపై జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేసింది. దయచేసి ఈ వివాదంలోకి నన్ను లాగొద్దంటూ సింగర్ కెనీషా కోరింది. -
ఎంగేజ్మెంట్ వేడుకలో స్టార్ హీరో దంపతులు.. వీడియో వైరల్!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ భారీ యాక్షన్ చిత్రానికి శివ దర్శకత్వంతో తెరకెక్కించారు. ఈ సినిమాపై అభిమానుల్లో పెద్దఎత్తున అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. అయితే దసరాకు థియేటర్లలో రిలీజ్ కావాల్సిన కంగువా.. ఊహించని విధంగా వాయిదా పడింది. రజినీకాంత్ వేట్టైయాన్ బరిలోకి రావడంతో కంగువా మేకర్స్ విడుదలను వాయిదా వేశారు.ఇదిలా ఉండగా.. తాజాగా తన బంధువుల ఎంగేజ్మెంట్ వేడుకకు సూర్య హాజరయ్యారు. తన భార్య జ్యోతికతో కలిసి జంటగా నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్నారు. ఇందులో కాబోయే నూతన వధూవరులకు ఎంగేజ్మెంట్ రింగ్ అందజేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సూర్య అభిమానుల సంఘం పేరుతో ఉన్న ట్విటర్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వేడుక తమిళనాడులోని తిరుప్పూరులో జరిగిందని ఇన్‌స్టాలో ఓ అభిమాని షేర్ చేశారు. సూర్య కుటుంబానికి చెందిన బంధువుతో నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: దసరా బాక్సాఫీస్.. రజినీకాంత్ - సూర్య ఫ్యాన్స్ మధ్య వార్!)ఇక సినిమాల విషయానికొస్తే త్వరలోనే కంగువా థియేటర్లలో సందడి చేయనుంది. ఇందులో సూర్య ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రంలో బాబీ డియోల్, దిశా పటాని లాంటి బాలీవుడ్ స్టార్స్ కూడా నటించారు. ఆ తర్వాత కార్తీక్ సుబ్బరాజ్‌తో గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కించనున్న ఓ సినిమాలో కనిపించనున్నారు. అంతేకాకుండా తన సోదరుడు కార్తీ, అరవింద్ స్వామిలతో కలిసి మీయజగన్ అనే చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నాడు.Exclusive Video @Suriya_offl & Jyotika at Relative's Engagement Yesterday ♥️#Kanguva pic.twitter.com/ykOA50c3YJ— All India Suriya Fans Club (@Suriya_AISFC) September 17, 2024 -
లెజెండ్ శరవణన్.. మళ్లీ వచ్చేస్తున్నాడు!
కోలీవుడ్ నటుడు లెజెండ్ శరవణన్ చాలా రోజుల తర్వాత మళ్లీ సందడి చేశారు. 2022లో 'లెజెండ్' మూవీ తర్వాత పెద్దగా కనిపించలేదు. ఆ మధ్య ఓసారి కొత్త ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఇప్పుడు మాత్రం ఏకంగా మరో సినిమాకు రెడీ అయిపోయాడు. తాజాగా షూటింగ్‌కు వెళ్తూ చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ట్విటర్లో షేర్ చేశారు.గతంలో వచ్చిన లెజెండ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఇందులో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా నటించింది. ఇందులో కథానాయికగా నటించేందుకు ఊర్వశి రౌతేలాకు భారీగానే రెమ్యునరేషన్ చెల్లించారు. అయితే ఈ మూవీ ఆశించినంత స్థాయిలో మెప్పించలేకపోయింది. తాజా చిత్రాన్ని హార్బర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించినున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో లెజెండ్ శరవణన్ సరసన పాయల్ రాజ్‌పుత్ కథానాయికగా నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఆండ్రియా, కిక్ శామ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. గిబ్రాన్ సంగీతమందించనుండగా.. 2025 ఏప్రిల్‌లో ఈ చిత్రం పెద్ద ప్రేక్షకుల ముందుకు రానుంది.(ఇది చదవండి: 'జైలర్' పాటకు స్టెప్పులేసిన లెజెండ్.. డిఫరెంట్ గెటప్!)కాగా.. స్వతహాగా బిజినెస్‌మ్యాన్ అయిన శరవణన్‌కు తమిళనాడులో చాలా క్లాత్ స్టోర్స్ ఉన్నాయి. అలానే తన బ్రాండ్‌కి తానే బ్రాండ్ అంబాసిడర్. గతంలో తమన్నా, హన్సిక లాంటి స్టార్ హీరోయిన్లతో కలిసి యాడ్స్‌లో యాక్ట్ చేశాడు. దీంతో హీరో కావాలని 'లెజెండ్' పేరుతో ఓ సినిమా తీశాడు.எனது அடுத்த படத்தின் படப்பிடிப்புக்காக #தூத்துக்குடி செல்லும் முன் ஊடகம் மற்றும் பத்திரிகையாளர் நண்பர்களை சென்னை விமான நிலையத்தில் சந்தித்த போது#LegendsNext #LegendSaravanan pic.twitter.com/RUWeGRYPKG— Legend Saravanan (@yoursthelegend) September 15, 2024 -
ది గోట్ మూవీకి షాకింగ్ కలెక్షన్స్.. వారం రోజుల్లో ఎన్ని కోట్లంటే?
కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ స్పై థ్రిల్లర్ ది గోట్. వెంకట్ ప్రభు డైరెక్షన్లో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లతో దూసుకెళ్తోంది. తాజాగా ఈ మూవీ దేశవ్యాప్తంగా వారం రోజుల్లోనే రూ. 170.75 కోట్లకు పైగా నికర వసూళ్లు సాధించింది. దీంతో త్వరలోనే రూ.200 కోట్ల మార్కును చేరుకోనుంది. మొదటి రోజు రూ.44 కోట్లు రాబట్టిన ది గోట్.. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించింది. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజే అత్యధికంగా రూ.126 కోట్లు గ్రాస్ వసూళ్లు సాధించింది. కానీ లియో రికార్డ్‌ను మాత్రం అధిగమించలేకపోయింది. రాజకీయాలకు ముందు విజయ్ నటించిన చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రంలో విజయ్ ద్విపాత్రాభినయం చేశారు. తండ్రీకొడుకులుగా విజయ్ అభిమానులను అలరించారు. ఇందులో హీరోయిన్గా మీనాక్షి చౌదరి నటించింది. ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, అజ్మల్ అమీర్, వైభవ్, లైలా, మోహన్, అరవింద్ ఆకాష్, అజయ్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
హీరో జీవాకు రోడ్డు ప్రమాదం
కోలీవుడ్ హీరో జీవా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న కారు రోడ్డు మధ్యలోని డివైడర్‌ను ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా.. హీరో, అతని భార్య క్షేమంగా బయటపడినట్లు సమాచారం. చెన్నై నుంచి సేలం వెళ్తుండగా కన్నియమూర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయేందుకు యత్నించగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.కాగా.. రంగం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు జీవా. ఆ తర్వాత తెలుగులో యాత్ర-2 సినిమాలో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పాత్రలో ప్రేక్షకులను మెప్పించారు. అంతేకాకుండా 1983 ప్రపంచకప్ నేపథ్యంలో బాలీవుడ్లో తెరకెక్కించిన మూవీలో కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రలో జీవా మెరిశారు. ప్రస్తుతం కోలీవుడ్‌లో సినిమాలతో బిజీగా ఆయన ఉన్నారు. (ఇది చదవండి: భార్యకు స్పెషల్‌గా విష్ చేసిన రంగం హీరో.. పోస్ట్ వైరల్!) #BREAKING | கார் விபத்தில் சிக்கிய நடிகர் ஜீவா!#SunNews | #Jiiva | #CarAccident | #Kallakurichi | @JiivaOfficial pic.twitter.com/yW2JWEllID— Sun News (@sunnewstamil) September 11, 2024 -
రజినీకాంత్ లేటేస్ట్ మూవీ .. ఆ క్రేజీ సాంగ్ వచ్చేసింది!
కోలీవుడ్ సూపర్‌స్టార్, తలైవా రజినీకాంత్ ప్రస్తుతం వెట్టైయాన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను లైక్షా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం దసరా బరిలో నిలిచింది. వచ్చేనెల 10 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇంకా నెల రోజులు మాత్రమే సమయం ఉండండతో మేకర్స్ దూకుడు పెంచారు. తాజాగా ఈ మూవీ నుంచి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. మనసిలాయో అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు. తాజాగా రిలీజైన లిరికల్ సాంగ్ తలైవా ఫ్యాన్స్‌ను ఓ ఊపు ఊపేస్తోంది.తలైవా కోసం తప్పుకున్న కంగువా..తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తోన్న భారీ యాక్షన్ చిత్రం కంగువా. శివ దర్శకత్వంలో ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ డేట్‌ను కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. దసరా సందర్భంగా అక్టోబర్ 10న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కానీ ఈ దసరాకు ఊహించని విధంగా సూపర్ స్టార్ రజినీకాంత్ రేసులోకి రావడంతో కంగువా మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కంగువా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ఓ ఈవెంట్లో సూర్య అధికారికంగా ప్రకటించారు. -
సైకిల్‌పై వచ్చిన స్టార్ హీరో.. వీడియో వైరల్!
కోలీవుడ్ స్టార్ హీరో, నిర్మాత విశాల్ చెన్నైలో సందడి చేశారు. చాలా సింపుల్‌గా సైకిల్ తొక్కుతూ కనిపించారు. నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి అయిన విశాల్ 68వ సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ సమావేశానికి హాజరయ్యేందుకు కార్యాలయానికి వచ్చారు. సైకిల్‌పై తమ అభిమాన హీరో రావడంతో ఫ్యాన్స్ చుట్టుముట్టారు. అక్కడే గేట్ దగ్గర ఉన్న అభిమానులతో విశాల్ కరచాలనం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. ఇటీవల మాలీవుడ్‌లో హేమ కమిటీ నివేదిక తర్వాత ఇండస్ట్రీలో మహిళల భద్రత అంశం చర్చనీయాంశంగా మారింది. దీంతో కొద్దిరోజుల క్రితమే నడిగర్ సంఘం సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. మరో పది రోజుల్లో నడిగర్ సంఘం ప్రత్యేక కమిటీ వేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయని.. త్వరలోనే ప్రకటన వస్తుందని విశాల్ వెల్లడించారు. ఎవరైనా వేధింపులకు పాల్పడినట్లు రుజువైతే ఇండస్ట్రీ నుంచి ఐదేళ్లపాటు నిషేధిస్తామని ఇటీవల నిర్ణయించిన సంగతి తెలిసిందే. VIDEO | Actor Vishal arrives on a bicycle to attend 68th South Indian Artist Association meeting being organised in Chennai.(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/EYP25aY3rb— Press Trust of India (@PTI_News) September 8, 2024 -
కలిసొచ్చిన వినాయక చవితి.. ది గోట్ కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?
కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ తాజా చిత్రం ది గోట్. వెంకట్ ప్రభు డైరెక్షన్లో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకొచ్చింది. మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లతో దూసుకెళ్తోంది. శనివారం వినాయక చవితి రోజు బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల మార్క్‌ను అధిగమించింది. వీకెండ్ కావడంతో ఒక్క రోజే రూ.33 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది.విడుదలైన మూడో రోజే దేశవ్యాప్తంగా కలెక్షన్లలో రూ.100 కోట్ల మార్కును దాటేసింది. తొలిరోజు రూ.43 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ రాబట్టిన ది గోట్ చిత్రం రెండో రోజు రూ.25.5 కోట్లు వచ్చాయి. అయితే శనివారం వీకెండ్, వినాయకచవితి పండుగ కలిసి రావడంతో రూ.33 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో మూడు రోజుల్లోనే రూ.102.5 కోట్ల నెట్ వసూళ్లు కలెక్ట్ చేసింది. శనివారం తమిళంలో థియేటర్లలో 72.58 శాతం ఆక్యుపెన్సీతో నడిచాయి.ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మించారు. రాజకీయాల్లో పోటీకి ముందు విజయ్ నటించిన చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో విజయ్ ద్విపాత్రాభినయం చేశారు. తండ్రీకొడుకులుగా విజయ్ అభిమానులను అలరించారు. ఇందులో హీరోయిన్గా మీనాక్షి చౌదరి నటించింది. ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, అజ్మల్ అమీర్, వైభవ్, లైలా, మోహన్, అరవింద్ ఆకాష్, అజయ్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
విజయ్ ది గోట్ మూవీ.. తొలి రోజు ఊహించని కలెక్షన్స్!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం ది గోట్. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అభిమానుల భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 5న థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాలో విజయ్ సరసన గుంటూరు కారం భామ మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది. ఈ మూవీలో విజయ్ ద్విపాత్రాభినయం చేశారు. భారీ బడ్జెట్ సినిమా కావడంతో గోట్ అభిమానుల్లో మరింత అంచనాలు పెంచేసింది. టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఇండియన్-2 సినిమాను అధిగమించి రిలీజ్‌కు ముందే రికార్డ్ క్రియేట్ చేసింది.అంచనాలకు తగ్గట్టుగానే తొలిరోజు కలెక్షన్ల గోట్ దూసుకెళ్లింది. స్పై థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన గోట్ చిత్రానికి ఇండియాలో రూ.55 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాగా.. రూ.43 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. తమిళంలో రూ.38.3 కోట్లు, తెలుగులో రూ.3 కోట్లు, హిందీలో రూ.1.7 కోట్టు కలెక్ట్ చేసింది. మొదటి రోజు థియేటర్లలో 76.23 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించే అవకాశముంది. ఓవర్సీస్ కలెక్షన్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రాబోయే రోజుల్లోనూ ఇదే జోరు కొనసాగితే మరిన్నిరికార్డులు బద్దలు కొట్టనుంది. అయితే తొలిరోజు విజయ్ లియో చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.148.5 కోట్ల వసూళ్లు సాధించింది. ఆ రికార్డ్‌ను గోట్ అధిగమించలేకపోయింది. ఈ సినిమాను ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై దాదాపు రూ.380 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ విషయాన్ని నిర్మాత అర్చన కల్పతి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, స్నేహ, జయరామ్, లైలా, అజ్మల్ అమీర్ కీలక పాత్రలు పోషించారు. -
నడిగర్ సంఘం హెచ్చరిక.. అలాంటి వారిపై ఐదేళ్ల నిషేధం!
హేమ కమిటీ నివేదిక సినీ ఇండస్ట్రీలను కుదిపేస్తోంది. ఇప్పటికే కన్నడ సినీ పరిశ్రమలోనూ ఇలాంటి కమిటీ ఏర్పాటు చేయాలంటూ డిమాండ్స్ వస్తున్నాయి. లైంగిక వేధింపులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. టాలీవుడ్‌లోనూ మహిళల భద్రత, రక్షణ కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరినట్లుగా మా అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. తాజాగా కోలీవుడ్‌కు చెందిన నడిగర్ సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది.లైంగిక వేధింపుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని నడిగర్ సంఘం నిర్ణయించింది. వారిపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలితే సినీ ఇండస్ట్రీ నుంచి ఐదేళ్ల పాటు నిషేధం విధించాలని విశాల్ నేతృత్వంలోని కమిటీ తీర్మానించింది. చిత్ర పరిశ్రమలో మహిళల భద్రతపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.బాధితులకు న్యాయపరమైన సహాయాన్ని అందించడానికి నడిగర్ సంఘం అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటుందని తెలిపారు. ఫిర్యాదుల పరిష్కార సెల్ కోసం ప్రత్యేక మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. వేధింపులకు గురైన వారు నేరుగా తమ ఫిర్యాదులను ముందుగా నడిగర్ సంఘానికి సమర్పించాలని కోరారు. మీడియాకు వెల్లడించవద్దని హెచ్చరిక కూడా ఉంది. చెన్నైలో నడిగర్ సంఘం నిర్వహించిన సమావేశంలో నాసర్, విశాల్, కార్తీ పాల్గొన్నారు. -
ఆయన తప్పకుండా సీఎం అవుతారు: ది గోట్ నటుడు కామెంట్స్
కోలీవుడ్ నటుడు ప్రేమ్గీ అమరేన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. విజయ్ మూవీ ది గోట్ రిలీజ్ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వచ్చే 2026 ఎన్నికల్లో దళపతి విజయ్ తమిళనాడు సీఎం అవుతారని అమరేన్ జోస్యం చెప్పారు. నా ఓటు కూడా విజయ్‌కే వేస్తానని.. తప్పకుండా 2026లో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని హామీ ఇస్తున్నా అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.కాగా.. దళపతి విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT)'ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది. ఈ చిత్రంలో ప్రేమ్గీ స్నేహాకు సోదరుని పాత్రలో నటించినట్లు ఆయన తెలిపారు. తనకు తలైవా, సూపర్‌స్టార్ రజినీకాంత్ అంటే విపరీతమైన అభిమానం అని వెల్లడించారు. అజిత్, విజయ్లంటే అమితమైన ప్రేమ అని.. కానీ నా ఆల్ టైమ్ ఫేవరెట్ సూపర్ స్టార్ మాత్రమేనన్నారు.కాగా.. 'గోట్' చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. అయితే విజయ్ ఇప్పటికే తమిళగ వెట్రి కజగం అనే రాజకీయ పార్టీని ప్రారంభించారు. 2026లో తమిళనాడు రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.