
కోలీవుడ్ స్టార్ జంట జ్యోతిక- సూర్య దంపతులకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ప్రస్తుతం ముంబయిలో ఉంటున్న ఈ జంట.. ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్నారు. తాజాగా మహారాష్ట్ర కొల్లాపూర్‌లోని మహాలక్ష్మి, కామాఖ్య ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న ఈ జంట ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇటీవల తమిళ న్యూ ఇయర్ సందర్భంగా ఆలయానికి వెళ్లినట్లు జ్యోతిక పోస్ట్ చేసింది.
ఇక సినిమాల విషయానికొస్తే జ్యోతిక ఇటీవలే డబ్బా కార్టెల్ అనే వెబ్ సిరీస్‌తో అభిమానులను అలరించింది. సూర్య ప్రస్తుతం రెట్రో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజా హేగ్డే హీరోయిన్‌గా నటించింది. ఇటీవలే రెట్రో ట్రైలర్ విడుదల చేయగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. కంగువా డిజాస్టర్ తర్వాత వస్తోన్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
రెట్రో సెన్సార్ పూర్తి..
ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన సెన్సార్ పూర్తయింది. ఈ చిత్రానికి యూ/ ఏ సర్టిఫికేట్ పొందినట్లు మేకర్స్ వెల్లడించారు. రెట్రో సినిమా నిడివి(రన్‌టైమ్) దాదాపు రెండు గంటల 48 నిమిషాలుగా ఉండనుంది. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమా లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా అభిమాలను అలరించనుంది. ఈ చిత్రంలో కరుణాకరన్, జోజూజార్జ్, సుజిత్ శంకర్, నాజర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కార్మికుల దినోత్సవం సందర్భంగా మే డే రోజున తెరపైకి రానుంది.