
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ భారీ యాక్షన్ చిత్రానికి శివ దర్శకత్వంతో తెరకెక్కించారు. ఈ సినిమాపై అభిమానుల్లో పెద్దఎత్తున అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. అయితే దసరాకు థియేటర్లలో రిలీజ్ కావాల్సిన కంగువా.. ఊహించని విధంగా వాయిదా పడింది. రజినీకాంత్ వేట్టైయాన్ బరిలోకి రావడంతో కంగువా మేకర్స్ విడుదలను వాయిదా వేశారు.
ఇదిలా ఉండగా.. తాజాగా తన బంధువుల ఎంగేజ్‌మెంట్ వేడుకకు సూర్య హాజరయ్యారు. తన భార్య జ్యోతికతో కలిసి జంటగా నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్నారు. ఇందులో కాబోయే నూతన వధూవరులకు ఎంగేజ్‌మెంట్ రింగ్ అందజేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సూర్య అభిమానుల సంఘం పేరుతో ఉన్న ట్విటర్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వేడుక తమిళనాడులోని తిరుప్పూరులో జరిగిందని ఇన్‌స్టాలో ఓ అభిమాని షేర్ చేశారు. సూర్య కుటుంబానికి చెందిన బంధువుతో నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది.
(ఇది చదవండి: దసరా బాక్సాఫీస్.. రజినీకాంత్ - సూర్య ఫ్యాన్స్ మధ్య వార్!)
ఇక సినిమాల విషయానికొస్తే త్వరలోనే కంగువా థియేటర్లలో సందడి చేయనుంది. ఇందులో సూర్య ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రంలో బాబీ డియోల్, దిశా పటాని లాంటి బాలీవుడ్ స్టార్స్ కూడా నటించారు. ఆ తర్వాత కార్తీక్ సుబ్బరాజ్‌తో గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కించనున్న ఓ సినిమాలో కనిపించనున్నారు. అంతేకాకుండా తన సోదరుడు కార్తీ, అరవింద్ స్వామిలతో కలిసి మీయజగన్ అనే చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నాడు.
Exclusive Video @Suriya_offl & Jyotika at Relative's Engagement Yesterday ♥️#Kanguva pic.twitter.com/ykOA50c3YJ
— All India Suriya Fans Club (@Suriya_AISFC) September 17, 2024