Kollywood
-
రెండు నెలలుగా ఆస్పత్రిలో.. కన్నుమూసిన నటుడు
చెన్నై: ప్రముఖ తమిళ నటుడు జయశీలన్ (40) అనారోగ్యంతో మరణించారు. రెండు నెలల క్రితం కామెర్ల వ్యాధితో చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. జయశీలన్.. విజయ్‌తో బిగిల్, తేరి, ధనుష్‌తో పుదుపేట్టై, విజయ్ సేతుపతితో విక్రమ్ వేద సినిమాల్లో నటించారు.తన కెరీర్లో వందకు పైగా సినిమాలు చేశారు. సినిమా ఇండస్ట్రీలో ఉండాలన్న కోరికతో చిన్నాచితకా పాత్రలు చేసుకుంటూ పోయారు. కానీ ఆయన టాలెంట్‌కు తగ్గ గుర్తింపు రాలేదు. ఈయన విజయ్ సేతుపతికి మంచి స్నేహితుడని తెలుస్తోంది.చదవండి: హిట్ సినిమా.. వారంలోనే ఓటీటీలో తెలుగు వర్షన్ -
విజయ్‌తో చేయి కలిపేందుకు అడుగులేస్తున్న త్రిష
సౌత్ ఇండియా చిత్రపరిశ్రమలో సంచలనాలకు చిరునామా నటి త్రిష(Trisha Krishnan) అంటారు. ముఖ్యంగా కోలీవుడ్‌లో ఆమెకు సంబంధించి ఏ వార్త వచ్చినా నెట్టింట వైరల్ అవుతూనే ఉంటుంది. 41 ఏళ్ల వయసులో కూడా యంగ్ హీరోయిన్లకు పోటీ పడుతూ అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటూ భారీ హిట్లు కొడుతుంది. నటిగా 22 ఏళ్ల కెరీర్లో తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ మొదలగు ఐదు భాషల్లో కథానాయకిగా సత్తా చాటుతుంది. ఇప్పటికీ అజిత్, చిరంజీవి, మోహన్ లాల్ వంటి స్టార్ హీరోల సరసన నటిస్తూ అగ్ర కథానాయకిగానే కొనసాగుతుంది. ఇన్ని అర్హతలు కలిగిన ఈ చైన్నె సుందరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందా అని ఎదురుచూస్తున్నారు. అయితే, ఈమె గురించి వదంతులు చాలా కాలంగానే నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల నటుడు విజయ్‌తో (Vijay) కలుపుతూ రకరకాల ప్రచారం కూడా జరిగింది. ఈమె మాత్రం విజయ్ తనకు మంచి ఫ్రెండ్ అంటూ పలు వేదికల మీద తెలిపింది. అయితే, త్రిష త్వరలో రాజకీయ రంగ ప్రవేశం(Political Entry) చేయబోతున్నట్లు ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అదేవిధంగా ఈమె చాలా కాలం క్రితమే తనకు ముఖ్యమంత్రి అవ్వాలనే ఆశ ఉందని పేర్కొంది. ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. అదే విధంగా నటుడు విజయ్ పార్టీలో చేరనున్నారు అనే ప్రచారం బలంగా జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో త్రిష తన అభిమానులకు త్వరలో ఒక షాకింగ్ న్యూస్ చెప్పబోతుందని వార్త సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. ఇప్పటికీ అగ్ర కథానాయకిగా నటిస్తూ బిజీగా ఉన్న త్రిష నటనకు స్వస్తి చెబుతారా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. అయితే తనకు మంచి మిత్రుడు అని చెప్పుకునే నటుడు విజయ్ కూడా కెరీర్ పరంగా మంచి పీక్‌లో ఉండగానే నటనకు స్వస్తి చెబుతూ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కాగా త్రిష ఇప్పుడు నటనకు స్వస్తి చెప్పబోతున్నారనే వార్త ఎంతవరకు నిజం అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఈ విషయంలో ఆమె ఎలా స్పందిస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. అయితే, త్రిష పాలిటిక్స్‌లోకి తప్పకుండా ఎంట్రీ ఇస్తుందని తమిళనాడు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. -
కోలీవుడ్‌లో సీక్వెల్ సందడి
కోలీవుడ్‌లో సీక్వెల్ హవా బాగా వీస్తోంది. కోలీవుడ్ హీరోలందరూ సీక్వెల్ జపం చేస్తున్నారు. ప్రస్తుతం తమిళంలో పదికి పైగా సీక్వెల్స్ సినిమాలు ఉండటమే ఇందుకు ఓ నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మరి... ఈ సీక్వెల్స్, ఫ్రాంచైజీ చిత్రాలతో బిజీగా ఉన్న తమిళ హీరోలు ఎవరో తెలుసుకుందాం...జైలర్ తిరిగి వస్తున్నాడురజనీకాంత్ హీరోగా చేసిన ‘జైలర్’ (2023) మూవీ బ్లాక్‌బస్టర్ హిట్. నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్షన్లో కళానిధి మారన్ నిర్మించిన ఈ మూవీలో రజనీ కొత్త తరహా స్టైల్, స్వాగ్, మేనరిజమ్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. వీటికి అనిరు«ధ్ రవిచందర్ మ్యూజిక్, ఆర్ఆర్ ప్లస్ అయ్యాయి. దీంతో ‘జైలర్’ మూవీ రజనీ ఖాతాలో ఓ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిపోయింది. ఈ సినిమా మూవీ రిలీజ్ తర్వాత ‘జైలర్ 2’ ఉంటుందనే ఊహాగానాలు వినిపించాయి. ఆ ఊహాలను నిజం చేస్తూ నెల్సన్ దిలీప్‌కుమార్ ఇటీవలే ‘జైలర్ 2’ సినిమాను ప్రకటించారు. రజనీకాంత్ హీరోగా చేయనున్న ‘జైలర్ 2’ చిత్రీకరణ ఈ ఏడాది మార్చిలో ప్రారంభం కానుందని తెలిసింది. కాగా ‘జైలర్’లో రమ్యకృష్ణ, మీర్నా మీనన్ కీ రోల్స్‌లో, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ గెస్ట్ రోల్స్‌లో నటించారు. వీరందరి పాత్రలు ‘జైలర్ 2’లోనూ కొనసాగుతాయని కోలీవుడ్ టాక్. అంతే కాదు... బాలకృష్ణ, ‘కేజీఎఫ్’ బ్యూటీ శ్రీనిధి శెట్టి ‘జైలర్ 2’లో యాడ్ అవుతారట. ఈ సీక్వెల్ 2026 ప్రారంభంలో రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.వీర శేఖరన్ పోరాటంహీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) మూవీ 1996లో విడుదలై, బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. 28 సంవత్సరాల తర్వాత కమల్, శంకర్ కాంబినేషన్లోనే 2024లో విడుదలైన ‘ఇండియన్ 2’ సినిమా మాత్రం ఆడియన్స్‌ను అంతగా మెప్పించలేకపోయింది. అయితే ‘ఇండియన్ 2’ సినిమా తీస్తున్న సమయంలోనే ‘ఇండియన్ 3’ చిత్రీకరణను కూడా దాదాపు పూర్తి చేశారు దర్శకుడు శంకర్.ఈ ఏడాదే ‘ఇండియన్ 3’ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లుగా ఇటీవల ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘గేమ్ చేంజర్’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో శంకర్ పేర్కొన్నారు. ‘ఇండియన్, ఇండియన్ 2’ చిత్రాల్లో సేనాపతిగా కనిపించారు కమల్‌హాసన్. కానీ ‘ఇండియన్ 3’ మాత్రం సేనాపతి తండ్రి వీరశేఖరన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కథనం ఉంటుంది. స్వాతంత్య్రం కోసం బ్రిటీషర్లతో వీరశేఖరన్ ఏ విధంగా పోరాడారు? అన్నది ‘ఇండియన్ 3’ స్టోరీ అని కోలీవుడ్ సమాచారం. ఈ ఫ్లాష్‌బ్యాక్‌లో వీరశేఖరన్ భార్యగా కాజల్ అగర్వాల్ కనిపిస్తారు. రెడ్ జెయింట్ మూవీస్, లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ‘ఇండియన్ 3’కి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.ఇటు సర్దార్... అటు ఖైదీతండ్రీకొడుకులుగా కార్తీ ద్విపాత్రాభినయం చేసిన స్పై యాక్షన్ మూవీ ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ మూవీ 2022లో విడుదలై, బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. అయితే ‘సర్దార్’ సినిమా క్లైమాక్స్‌లో ‘మిషన్ కంబోడియా’ అంటూ ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘సర్దార్ 2’ను కన్ఫార్మ్ చేశారు పీఎస్ మిత్రన్. అలాగే జూలైలో ‘సర్దార్’కు సీక్వెల్‌గా పీఎస్ మిత్రన్ డైరెక్షన్లోనే ‘సర్దార్ 2’ ప్రారంభమైంది.కార్తీ హీరోగా ఎస్జే సూర్య, మాళవికా మోహనన్, ఆషికా రంగనాథ్, రజీషా విజయన్ ప్రధాన తారాగణంగా నటిస్తారని ఆల్రెడీ మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ మొదలైంది కాబట్టి ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో థియేటర్స్‌లో చూడొచ్చు. అప్పుడు మిషన్ కంబోడియా వివరాలు కూడా తెరపైన కనిపిస్తాయి. ఇక ‘ఖైదీ’లో కార్తీ చేసిన దిల్లీ రోల్‌ను మర్చిపోరు ఆడియన్స్. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో కార్తీ హీరోగా నటించిన ‘ఖైదీ’ చిత్రం 2019లో విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో వెంటనే కార్తీతో ‘ఖైదీ 2’ చేయాలని లోకేశ్ ప్లాన్ చేశారు. కానీ లోకేశ్‌కు కమల్‌హాసన్‌తో ‘విక్రమ్’, రజనీకాంత్‌తో ‘కూలీ’ సినిమాల ఆఫర్స్ రావడంతో ‘ఖైదీ’ సీక్వెల్ షూటింగ్‌ను కాస్త ఆలస్యం చేశారు. రజనీకాంత్ ‘కూలీ’ సినిమా చిత్రీకరణ పూర్తి కావొచ్చింది. దీంతో లోకేశ్ నెక్ట్స్ మూవీ కార్తీ ‘ఖైదీ 2’నే ఉండొచ్చు. ఇలా రెండు సీక్వెల్స్‌తో ఆడియన్స్‌ను అలరించేందుకు రెడీ అవుతున్నారు కార్తీ.రెండు దశాబ్దాల తర్వాత..!‘7/జీ రెయిన్బో కాలనీ’ అంటే తెలుగు ప్రేక్షకులకు తెలియకపోవచ్చు. కానీ ‘7/జీ బృందావన కాలనీ’ అంటే మాత్రం చాలామంది తెలుగు ఆడియన్స్‌కు ఈ సినిమా గుర్తొస్తుంది. 2004లో సెల్వ రాఘవన్ డైరెక్షన్లో రూపొందిన ‘7/జీ రెయిన్బో కాలనీ’ తెలుగులో ‘7/జీ బృందావన కాలనీ’గా అనువాదమై, సూపర్‌హిట్‌గా నిలి చింది. ఈ మూవీలో హీరో హీరోయిన్లుగా రవికృష్ణ, సోనియా అగర్వాల్ నటించారు. ఏఎమ్ రత్నం నిర్మించారు. ఇప్పుడు 28 ఏళ్ల తర్వాత ‘7/జీ బృందావన కాలనీ’ సినిమాకు సీక్వెల్‌గా ‘7/జీ బృందావన కాలనీ 2’ సినిమా తీస్తున్నారు దర్శకుడు సెల్వ రాఘవన్.తొలి భాగంలో నటించిన రవికృష్ణనే మలి భాగంలోనూ హీరోగా చేస్తుండగా, అనశ్వర రాజన్ హీరోయిన్గా చేస్తున్నారు. ఏఎమ్ రత్నం నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. జయరామ్, సుమన్ శెట్టి, సుధ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ‘7/జీ బృందావన కాలనీ 2’ సినిమా రిలీజ్‌పై త్వరలోనే ఓ ప్రకటన రానుంది. ఇక సెల్వ రాఘవన్ డైరెక్షన్లో వచ్చిన ‘ఆయిరత్తిల్ ఒరువన్’ (తెలుగులో ‘యుగానికి ఒక్కడు’) సినిమా గుర్తుండే ఉంటుంది.కార్తీ, రీమా సేన్, పార్తీబన్, ఆండ్రియా లీడ్ రోల్స్‌లో నటించిన ఈ మూవీ 2010లో విడుదలై, బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ఆయిరత్తిల్ ఒరువన్ 2’ సినిమాను 2021 జనవరి 1న ప్రకటించారు సెల్వ రాఘవన్. ఈ సీక్వెల్లో ధనుష్‌ను హీరోగా ప్రకటించారు. ఈ చిత్రం 2024లో రిలీజ్ అవుతుందని, అప్పట్లో ధనుష్ ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. కానీ ఈ సినిమా చిత్రీకరణ ఇంకా ఆరంభం కాలేదు. ఇక ‘ఆయిరత్తిల్ ఒరువన్’ సీక్వెల్ గురించి మరో అప్డేట్ రావాల్సి ఉంది.అమ్మోరు తల్లినయనతార నటించిన ‘ముకుత్తి అమ్మన్’ (తెలుగులో అమ్మోరు తల్లి) 2020 నవంబరులో డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై, వీక్షకుల మెప్పు పొందింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ముక్కుత్తి అమ్మన్ 2’ను ప్రకటించింది వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ. ‘ముక్కుత్తి అమ్మన్’లో నటించిన నయనతారనే సీక్వెల్లోనూ లీడ్ రోల్ చేస్తున్నారు. అయితే ‘ముక్కుత్తి అమ్మన్’కు నటుడు ఆర్జే బాలాజీ–ఎన్జే శరవణన్ దర్శకత్వం వహించగా, ‘ముకుత్తి అమ్మన్ 2’ను మాత్రం నటుడు–దర్శకుడు సుందర్ .సి తెరకెక్కించనున్నారు. సుందర్.సి నేతృత్వంలోని మరో ఫ్రాంచైజీ ‘కలగలప్పు’లోని ‘కలగలప్పు 3’ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. కామెడీ డ్రామాగా ‘కలగలప్పు’కు తమిళ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ ఉంది.హారర్ ఎఫెక్ట్!ఇవే కాదు... కమల్‌హాసన్ ‘విక్రమ్ 2’, ధనుష్ ‘వడ చెన్నై 2’ వంటి చిత్రాలతో పాటు మరికొన్ని తమిళ చిత్రాల సీక్వెల్స్ వచ్చే అవకాశం ఉంది.ఈసారి హారర్ జానర్ సీక్వెల్స్ కోలీవుడ్‌లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలవనున్నాయి. రాఘవా లారెన్స్ ఆధ్వర్యంలో ఆడియన్స్‌ను అలరిస్తున్న ‘కాంచన’ సిరీస్‌కు మంచి ఆదరణ ఉంది. ఈ సిరీస్‌లో మరో చిత్రంగా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు ‘కాంచన 4’ రానుందని కోలీవుడ్ సమాచారం. రాఘవా లారెన్స్ నటించి, దర్శకత్వం వహించనున్న ‘కాంచన 4’లో పూజా హెగ్డే హీరోయిన్గా నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది. మరి... ‘కాంచన 4’లో ఎవరు నటిస్తారనే విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇక సుందర్ .సి సారథ్యంలో నడుస్తున్న హారర్ ఫ్రాంచైజీ ‘అరణ్మణై’ గురించి చెప్పుకోవాలి. తమన్నా, రాశీ ఖన్నా లీడ్ రోల్స్‌లో నటించిన ‘అరణ్మణై 4’ (తెలుగులో ‘డాకు’) ఆడియన్స్‌ను మెప్పించింది. దీంతో ఈ ఏడాదిలోనే ‘అరణ్మణై 5’ను కూడా తీయాలని సుందర్ .సి ప్లాన్ చేస్తున్నారని కోలీవుడ్ టాక్. అలాగే హారర్ జానర్లో సంతానం చేస్తున్న హారర్ కామెడీ ఫ్రాంచైజీ ‘డీడీ’ నుంచి నాలుగో మూవీగా ‘డీడీ నెక్ట్స్ లెవల్’ చిత్రం రానుంది. ఎస్. ప్రేమ్ ఆనంద్ డైరెక్షన్‌లోని ఈ మూవీలో సెల్వ రాఘవన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇతర లీడ్ రోల్స్ చేశారు. ఈ మూవీ మేలో రిలీజ్ కానుంది. ఇక 2014లో మిస్కిన్ డైరెక్షన్లో వచ్చిన ‘పిశాసు’ (తెలుగులో ‘పిశాచి’) చిత్రం ఆడియన్స్‌ను ఆకట్టుకోగలిగింది. దాదాపు పదేళ్ల తర్వాత ‘పిశాసు’ సినిమాకు సీక్వెల్‌గా ‘పిశాసు 2’ తీస్తున్నారు మిస్కిన్. సీక్వెల్లో ఆండ్రియా మెయిన్ లీడ్ రోల్ చేశారు. మార్చిలో ఈ మూవీ రిలీజ్ కానుంది. ‘డీమాంటి కాలనీ’ ఫ్రాంచైజీ గురించి హారర్ చిత్రాలను ఇష్టపడేవారికి తెలిసే ఉంటుంది. గత ఏడాది ఆగస్టులో విడుదలైన ‘డీమాంటి కాలనీ 2’ తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందే ప్రయత్నం చేసింది. కాగా ‘డీమాంటీ కాలనీ’ ఫ్రాంచైజీ దర్శకుడు అజయ్.ఆర్ జ్ఞానముత్తు ‘డీమాంటీ కాలనీ’కి సీక్వెల్‌గా ‘డీమాంటీ కాలనీ 3’ని ఆల్రెడీ ప్రకటించారు. ఈ చిత్రం ఈ ఏడాదే సెట్స్‌పైకి వెళ్లనున్నట్లుగా తెలిసింది. రిలీజ్ మాత్రం 2026లో ఉండొచ్చు.ప్రకటించారు... కానీ..!కోలీవుడ్‌లో కొన్ని హిట్ ఫిల్మ్స్‌కు సీక్వెల్స్ ప్రకటించారు మేకర్స్. కానీ ఈ సినిమాలు ఇంకా పూర్తి స్థాయిలో సెట్స్‌పైకి వెళ్లలేదు. ఆ సినిమాలేవో చదవండి.విదేశాల్లో డిటెక్టివ్ విశాల్ కెరీర్‌లోని వన్నాఫ్ ది బెస్ట్ హిట్స్‌లో ‘తుప్పరివాలన్’ ఒకటి. మిస్కిన్ డైరెక్షన్‌లోని ఈ మూవీ తెలుగులో ‘డిటెక్టివ్’గా విడుదలై, ప్రేక్షకులను మెప్పించింది. అప్పట్నుంచే ఈ మూవీకి సీక్వెల్ తీయానులనుకున్నారు విశాల్. మిస్కిన్ డైరెక్షన్లోనే ‘డిటెక్టివ్ 2’ను ప్రకటించారు విశాల్. అయితే కథ విషయంలో మిస్కిన్కు, విశాల్‌కు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయి. దీంతో ఈ ప్రాజెక్ట్ నుంచి మిస్కిన్ తప్పుకున్నారు. ఆ తర్వాత ‘డిటెక్టివ్ 2’కి తానే దర్శకత్వం వహించాలనుకున్నారు విశాల్.తన స్టైల్ ఆఫ్ ‘డిటెక్టివ్ 2’తో తాను దర్శకుడిగా పరిచయం కాబోతున్నానని, ఇది తన పాతికేళ్ల కల అని, ఇందుకోసం లండన్, అజర్ బైజాన్, మాల్తా వంటి లొకేషన్స్‌ను పరిశీలిస్తున్నానని గత ఏడాది మార్చిలో విశాల్ పేర్కొన్నారు. కానీ ‘డిటెక్టివ్ 2’ చిత్రం ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదని తెలుస్తోంది. ఇలా విశాల్ నుంచి ‘డిటెక్టివ్ 2’ అప్డేట్ రావాల్సి ఉంది. అలాగే విశాల్ హీరోగా పీఎస్ మిత్రన్ డైరెక్షన్లో వచ్చిన ‘ఇరంబుదురై’ మూవీ 2018లో రిలీజై, హిట్ సాధించింది. ఈ సినిమాకు సీక్వెల్ రానుందనే టాక్ వినిపిస్తోంది. బాక్సింగ్ రౌండ్ 2 నాలుగు సంవత్సరాల క్రితం కరోనా సమయంలో ‘సార్పట్టై పరంబర’ చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలైంది. పా. రంజిత్ డైరెక్షన్‌లోని ఈ మూవీకి వీక్షకుల నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. దీంతో ‘సార్పట్టై పరంబర’ సినిమా సీక్వెల్‌ను థియేటర్స్‌లో రిలీజ్ చేయాలని పా. రంజిత్ భావించారు. 2023 మార్చిలో ‘సార్పట్టై పరంబర’ సినిమాకు సీక్వెల్‌గా ‘సార్పట్టై రౌండ్ 2’ ప్రకటించారు. అయితే ఈ మూవీపై మరో అప్డేట్ రావాల్సి ఉంది.తని ఒరువన్ 2 రవి మోహన్ (‘జయం’ రవి తన పేరును ఇటీవల రవి మోహన్‌గా మార్చుకున్నారు) హీరోగా మోహన్ రాజా డైరెక్షన్లో వచ్చిన ‘తని ఒరువన్’ మూవీ గుర్తుండే ఉంటుంది. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ మూవీ 2015లో విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘తని ఒరువన్ 2’ని ప్రకటించారు మోహన్ రాజా. అయితే మణిరత్నం పొన్నియిన్ సెల్వన్’తో రవి మోహన్ బిజీగా ఉండటం వల్ల ‘తని ఒరువన్ 2’ చేయడానికి వీలు పడలేదు. ఈ ఏడాది ఈ సినిమాను సెట్స్‌కు తీసుకువెళ్లే సాధ్యసాధ్యాలను రవి మోహన్ పరిశీలిస్తున్నారని కోలీవుడ్ సమాచారం. ఈ సినిమాని కూడా ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించనుంది. ఇక ‘తన్ ఒరువన్’ మూవీ తెలుగులో ‘ధృవ’ (రామ్ చరణ్ హీరోగా నటించారు)గా రీమేక్ అయి, విజయం సాధించిన సంగతి తెలిసిందే. – ముసిమి శివాంజనేయులు -
చిత్ర పరిశ్రమలో ఉండటం ఇష్టం లేదు.. కారణం ఇదే: నిత్య మేనన్
మలయాళం, తెలుగు, తమిళం భాషల్లో నటించిన నిత్య మేనన్‌కు(Nithya Menen) భారీగానే అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఆమె ఎంచుకున్న పాత్రలు కూడా ప్రేక్షకులను మెప్పించేలా ఉంటాయి. సినిమా రంగం వల్ల తనకు పేరు, ప్రఖ్యాతలు ,ఆస్తులు, అంతస్తులు అన్ని వచ్చాయి. అయినప్పటికీ తనకు చిత్ర పరిశ్రమలో ఉండటం ఏమాత్రం ఇష్టం లేదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె పేర్కొంది. అందుకే ఈమెను సంచలన నటి అంటారు. ఇటీవల జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా అందుకున్న ఈ మలయాళ భామ తాజాగా రవి మోహన్‌తో (జయం రవి) కలిసి నటించిన చిత్రం కాదలిక్క నెరమిల్లై (Kadhalikka Neramillai). ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న నిత్య మేనన్ ఒక భేటీలో పేర్కొంటూ తనకు నచ్చని రంగం సినిమా అని డైరెక్ట్‌గానే చెప్పింది. తనకు ఏదైనా రంగంలో ఇప్పుడు అవకాశం వస్తే వెళ్లిపోతానని పేర్కొంది. సెలబ్రిటీలా కాకుండా తనకు సాధారణ జీవితాన్ని అనుభవించడమే ఇష్టమని పేర్కొంది. అదేవిధంగా తనకు ప్రయాణం చేయడం అంటే చాలా ఇష్టం అని అందుకే పైలెట్ కావాలని చిన్నప్పుడు కోరుకున్నానని గుర్తు చేసుకుంది. కానీ, ఫైనల్‌గా నటిని అయ్యానని చెప్పింది. నటిగా స్వేచ్ఛగా జీవించడం మరిచిపోయానని తెలిపింది. అదేవిధంగా పార్కుల్లో నడవటం అంటే ఎంతో ఇష్టమని అయితే అది ఇప్పుడు జరగదని పేర్కొంది. ఒక్కొక్కసారి ఇదంతా నాకు అవసరమా అని అనిపిస్తుందని చెప్పింది. జాతీయ అవార్డు రాకముందు సైలెంట్ గా ఎక్కడికై నా వెళ్లిపోతామని భావించానంది అలాంటి సమయంలోనే జాతీయ ఉత్తమ నటి అవార్డు వచ్చిందనే వార్త తెలిసిందని నటి నిత్యా మీనన్ చెప్పింది. కాగా ఈమె వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. నిత్యామీనన్ ప్రస్తుతం ధనుష్ కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఇడ్లీ కడై చిత్రంలో కథానాయికిగా నటిస్తుంది. -
బిడ్డకు జన్మనిచ్చిన 'బిగిల్' సినిమా నటి
కోలీవుడ్ ప్రముఖ లేడీ కమెడియన్ ఇంద్రజకు (Indraja) కుమారుడు జన్మించాడు. గతేడాదిలో తన స్నేహితుడు డైరెక్టర్ కార్తీక్‌తో ఆమె ఏడడుగులు వేసింది. ఇంద్రజ తండ్రి రోబో శంకర్(Robo Shankar) తమిళ్ చిత్ర సీమలో కమెడియన్‌గా రాణించారు. రోబో డ్యాన్స్‌తో ఫేమస్ అయినందున శంకర్ కాస్తా రోబో శంకర్ అయ్యాడు. కోలీవుడ్‌లో దాదాపు అందరు హీరోలతోనూ నటించాడు.నటి ఇంద్రజ తమిళ్‌తో పాటు తెలుగులో కూడా పలు చిత్రాలలో నటించింది. దళపతి విజయ్ 'బిగిల్' (తెలుగులో 'విజిల్') సినిమాతో నటిగా మారిన ఈమె.. బాగానే గుర్తింపు తెచ్చుకుంది. దీని తర్వాత విశ్వక్ సేన్ 'పాగల్', కార్తీ 'విరుమాన్' చిత్రంలోనూ హీరోయిన్ అదితి శంకర్ స్నేహితురాలి పాత్రలో యాక్ట్ చేసింది. ప్రస్తుతం టీవీ షోలు చేస్తూ బిజీగా ఉంది. (ఇదీ చదవండి: దయచేసి ఇలాంటివి ఆపండి.. కరీనా కపూర్ ఆవేదన)తమిళ్లో ప్రసారం అవుతున్న`మిస్టర్ అండ్ మిస్సిస్` షో చేస్తున్నప్పుడు ఇంద్రజ గర్భవతి అయింది. ఈ విషయం ఆమె చెబుతూ ఆ షో నుంచి మధ్యలోనే తప్పుకుంది. ఇప్పుడు ఆమెకు పండంటి మగబిడ్డ జన్మించడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని బంధువులు తెలుపుతున్నారు. మనవడు పుట్టడంతో రోబో శంకర్ కుటుంబం ఆనందంలో మునిగిపోయినట్లు తెలుస్తోంది.కార్తీక్‌ను దత్తత తీసుకున్న రోబో శంకర్,ప్రియాంక దంపతులుఇంద్రజ పెళ్లి తర్వాత అందరూ తన మేనమామనే ఆమె పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, అందులో నిజం లేదని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇంద్రజ తల్లి ప్రియాంకకు కార్తీక్ సొంత సోదరుడు అని చాలామంది అనుకున్నారు. ఇంద్రజకు కార్తీక్ మేనమామ అవుతాడని అనుకున్నారు. ఈ క్రమంలో కార్తీక్ మాట్లాడుతూ.. తాను ఇంద్రజకు మేనమామను కాదని గతంలో ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. తనను సోదరుడిగా ప్రియాంక దత్తత తీసుకున్నారని కార్తీక్ వెల్లడించారు. తాను ఇంద్రజ అమ్మ ప్రియాంకకు సొంత తమ్ముడిని కాదు. రోబో శంకర్, ప్రియాంక ఇద్దరూ చాలారోజులుగా తెలుసు. ప్రియాంకకు సోదరులు లేకపోవడంతో ఆమె తనను దత్తత తీసుకున్నారని ఆయన తెలిపారు. -
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన స్టార్ నటుడి ముద్దుల కూతురు
సినీ నటుడు, బాహుబలితో కట్టప్పగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సత్యరాజ్(Sathyaraj ) కూతురు దివ్య సత్యరాజ్( Divya Sathyaraj) డీఎంకేలో చేరారు. డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం స్టాలిన్( M K Stalin) సమక్షంలో ఆ పార్టీ సభ్యత్వాన్ని ఆమె తీసుకున్నారు. మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ డీఎంకే అని, అందుకే తాను చేరినట్టు దివ్య పేర్కొన్నారు. సినీ నటుడు సత్యరాజ్ తనయుడు సీబీ రాజ్ తండ్రిబాటలో వెండి తెర మీద రాణిస్తున్న విషయం తెలిసిందే. ఆయన కుమార్తె దివ్య సత్యరాజ్ పోషకాహార నిపుణులుగా ఉన్నారు. దివ్య రాజకీయాల్లో రావాలని గత కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె 2019 డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ను కలిసిన సందర్భంలోనే ఆపార్టీలో చేరనున్నారన్న ప్రచారం జరిగింది. ఇది మర్యాద పూర్వక భేటీ అని ఆమె స్పష్టం చేయడంతో రాజకీయ ప్రచారానికి తెర పడింది. ఆ తదుపరి సామాజిక మాధ్యమాలలో వ్యక్తిగత పోస్టులు, పోషకాహారానికి సంబంధించిన అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ వచ్చారు. ఫాస్ట్‌ఫుడ్ ప్రభావాల గురించి అవగాహన కల్పించే పనిలో పడ్డారు. (ఇదీ చదవండి: ఐదు వేలకు పైగా సినిమాల్లో నటించిన ప్రముఖ నటుడు మృతి)ఈక్రమంలో సోషల్ మీడియా పోస్టులు అనేకం వివాదాస్పదమవుతూ వచ్చాయి. ఈ పరిస్థితుల్లో డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్‌ను ఆమె కలిశారు. పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించి సభ్యత్వాన్ని తీసుకున్నారు. ఈ సమయంలో డీఎంకే కోశాధికారి టీఆర్‌బాలు, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కేఎన్ నెహ్రూ, చైన్నె తూర్పు జిల్లా పార్టీ కార్యదర్శి శేఖర్‌బాబు ఆమెకు స్టాలిన్ ద్వారా సభ్యత్వాన్ని అందజేశారు. అనంతరం దివ్య మాట్లాడుతూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ను కలవడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. తాను పోషకాహార నిపుణురాలు అని పేర్కొంటూ, డీఎంకే ప్రభుత్వం అమలు చేస్తున్న పోషకాహార పథకం, అల్పాహార పథకం , మహిళలకు ప్రాధాన్యత ఇచ్చేవిధంగా మరెన్నో పథకాలకు ఆకర్షిస్తురాలైనట్లు వివరించారు. అన్ని మతాలను గౌరవించే పార్టీ డీఎంకే అని, అందుకే ఈ పార్టీలో చేరానని పేర్కొన్నారు. తన తండ్రి, స్నేహితులు, అందరూ ఎల్లప్పుడు నా వెన్నంటి ఉంటారని వ్యాఖ్యానిస్తూ ఏ బాధ్యతను తనకు అప్పగించినా శ్రమిస్తానని, కష్ట పడి పనిచేసి మంచి పేరు తీసుకొస్తానని ధీమా వ్యక్తం చేశారు. -
నిర్మాత లవ్ రిజెక్ట్ చేశా.. ఆ కోపంతో రైల్లో నుంచి తోసేయాలని..: దృశ్యం నటి
దృశ్యం సినిమాతో పాపులరైంది అంజలి నాయర్ (Anjali Nair). తాజాగా ఈ బ్యూటీ తనకు గతంలో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని బయటపెట్టింది. అంజలి మాట్లాడుతూ.. ఉన్నయే కాదలిప్పన్ (Unnaiye Kadhalipen) అనే తమిళ సినిమా చేస్తున్నప్పుడు ఆ మూవీ నిర్మాత నాకు ప్రపోజ్ చేశాడు. అతడు ఆ సినిమాను నిర్మించడంతో పాటు అందులో విలన్‌గానూ నటించాడు. తన ప్రపోజల్‌ను నేను తిరస్కరించాను. దాంతో అతడు నేను వేరే సినిమాకు వెళ్లినప్పుడు ఆ సెట్స్‌కు వచ్చి వేధింపులకు గురి చేశాడు.రైల్లో నుంచి నెట్టేయాలని..ఒకసారి రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు సడన్‌గా వచ్చి నా బ్యాగు తీసుకున్నాడు. తిరిగిచ్చేయమని అతడిని వెంబడించినప్పుడు రైలు డోర్ దగ్గర నన్ను బయటకు నెట్టేయాలని చూశాడు. ఒకసారి అతడి సోదరి నాకు ఫోన్ చేసి ఆమె తల్లి ఆరోగ్యం బాగోలేదని చెప్పింది. నన్ను చూడాలని కలవరిస్తోందని చెప్పింది. అతడు ఇంట్లో ఉంటే రానని చెప్పాను. అందుకామె.. తన సోదరుడు ఇంట్లో లేడని స్విట్జర్లాండ్‌కు వెళ్లిపోయాడని, కంగారుపడాల్సినం అవసరం లేదని సర్ది చెప్పింది.కత్తితో బెదిరించి సంతకం..నిజమేననుకుని వెళ్లాను. నేను ఇంట్లో ఓ గదిలోకి వెళ్లగానే బయట నుంచి గడియ పెట్టారు. ఆ గదిలో ఆ రాక్షసుడు ఉన్నాడు. కొన్ని పేపర్లు నా ముందు పెట్టి సంతకం పెట్టమన్నాడు. కత్తితో బెదిరించడంతో సంతకం చేశాను. ఆ పేపర్లలో లవ్ లెటర్ కూడా ఉంది. తర్వాత ఎలాగోలా ఆ గది నుంచి బయటపడ్డాను. అయితే అతడి నెక్స్ట్ సినిమాలో నేనే హీరోయిన్గా నటించాలని కాంట్రాక్ట్ పేపర్‌పై నాతో బలవంతంగా సంతకం చేయించుకున్నాడని అర్థమైంది.(చదవండి: 'సంక్రాంతికి వస్తున్నాం' బుల్లి రాజు.. తీవ్రంగా ఇబ్బంది పెట్టిన ఫ్యాన్స్!)అంత చెండాలంగా లెటర్ రాస్తారా?నేను సినిమా చేయనని చెప్పాను. ఆధారాలతో సహా అతడిపై కేసు పెట్టాను. అప్పుడు అతడు నేను రాసినట్లుగా లవ్ లెటర్స్‌ను సాక్ష్యంగా చూపించాడు. నేనొకటే అడిగా.. ప్రేమించే ఏ అమ్మాయైనా అంత చెండాలంగా లవ్ లెటర్ రాస్తుందా? అని ప్రశ్నించాను. ఆ కేసు నాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. తర్వాత మళ్లీ ఎప్పుడూ అతడు నాకు కనిపించలేదు అని చెప్పుకొచ్చింది. సినిమాఅంజలి.. మలయాళంలో ద కింగ్ అండ్ ద కమిషనర్, 5 సుందరికల్, పట్టం పోలే, వెనిసిలె వ్యాపారి, ఏంజెల్స్, టమార్ పడార్, 100 డిగ్రీ సెల్సియస్, సెకండ్స్, సెంట్రల్ థియేటర్, లైలా ఓ లైలా, బెన్, దూరం, తీరం, ఆమి, దృశ్యం 2, మాన్స్టర్ సినిమాలు చేసింది. తమిళంలో ఇదువుమ్ కాదంధు పొగుం, నెల్లు, ఆగడు సినిమాలు చేసింది. ఇటీవలే చిత్తా(తెలుగులో చిన్నా) సినిమాకుగానూ ఉత్తమ సహాయ నటిగా రాష్ట్రీయ అవార్డు గెలుచుకుంది. కాగా అంజలి దర్శకుడు అనీశ్‌ను 2011లో పెళ్లి చేసుకుంది. వీరికి అవని అనే కూతురు ఉంది. 2016లో అతడికి విడాకులు ఇచ్చింది. 2022లో అజిత్ రాజును రెండో పెళ్లి చేసుకోగా వీరికి ఓ కూతురు పుట్టింది.చదవండి: నాన్న చేసిన పనికి అమ్మ ఏడుస్తూ... ఈ బతుకే వద్దనుకున్నా! -
నాన్న చేసిన పనికి అమ్మ ఏడుస్తూ... ఈ బతుకే వద్దనుకున్నా!
వైవిధ్యభరిత కథాచిత్రాలకు కేరాఫ్ అడ్రస్ పా.రంజిత్. చుట్టూ ఉన్న సామాజిక అంశాలనే కథావస్తువులుగా తీసుకుని సినిమా అనే శిల్పంగా చెక్కుతుంటాడు. ఈయన సినిమాలు డైరెక్ట్ చేయడంతో పాటు పలు సినిమాలను నిర్మిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో నీలం ప్రొడక్షన్స్ బ్యానర్లో బాటిల్ రాధ అనే సినిమా నిర్మిస్తున్నాడు. తాగుడుకు బానిసైన వ్యక్తి దాన్నుంచి ఎలా బయటపడ్డాడన్నదే కథ.పా.రంజిత్ ఎమోషనల్ఈ మూవీ ట్రైలర్ లాంచ్‌లో పా.రంజిత్ (Pa. Ranjith) తన గతాన్ని తలుచుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. ఆయన మాట్లాడుతూ.. ఈ చిత్ర ట్రైలర్ చూస్తుంటే నాకు మా అమ్మే గుర్తొస్తోంది. తినే తిండి కోసం మనం ఎవరిపైనా ఆధారపడకూడదు. మా నాన్న కూడా ఎప్పుడూ అలాంటి పరిస్థితి రానివ్వలేదు. ఏనాడూ మమ్మల్ని పస్తులుంచలేదు. మేము మంచి బట్టలు వేసుకోవాలని, బాగా చదువుకోవాలని చెప్తుండేవాడు. అందుకోసం ఎంతో కష్టపడేవాడు.(చదవండి: పిల్లలతో ఇదేం పని? టీఆర్పీ కోసం ఏదైనా చేయిస్తారా?)పండగరోజు అమ్మ ఏడుస్తూ..కానీ ఎప్పుడైతే తాగడం మొదలుపెట్టాడో తనను తానే కోల్పోయాడు. నాకు బాగా గుర్తుంది.. ఓ పండగరోజు ఊర్లోని అందరూ సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కానీ మా ఇంట్లో మాత్రం పరిస్థితి వేరేలా ఉంది. అమ్మ ఏడుస్తూ కూర్చుంది. అప్పుడు నేను పన్నెండవ తరగతి చదువుతున్నాను. మా అమ్మ అలా నిత్యం ఏడుస్తుంటే చూడలేకపోయాను. తన బాధ భరించలేకపోయాను. చచ్చిపోదామనుకున్నాను. మా నాన్నతో మందు మాన్పించాలని అమ్మతో పాటు నా సోదరులు కూడా చాలా ప్రయత్నించారు.మద్యానికి బానిసై చనిపోయాడుచివరకు ఆస్పత్రిపాలయ్యాడు. ఆరు నెలలకంటే ఎక్కువ బతకడని చెప్పారు. కానీ వారం రోజుల్లోనే కన్నుమూశాడు. నాన్న.. మా అమ్మను కష్టపెట్టినట్లుగా నేను నా భార్యాపిల్లల్ని బాధ పెట్టకూడదని ఆరోజే నిర్ణయించుకున్నాను అని చెప్పాడు. బాటిల్ రాధ సినిమా (Bottle Radha Movie) విషయానికి వస్తే.. దినకరణ్ శివలింగం డైరెక్ట్ చేసిన ఈ మూవీలో గురు సోమసుందరం, సంచన నటరాజన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ జనవరి 24న విడుదల కానుంది.విభిన్న సినిమాల డైరెక్టర్పా.రంజిత్ విషయానికి వస్తే.. అట్టకత్తి సినిమాతో దర్శకుడిగా కెరీర్ ఆరంభించాడు. కార్తీతో మద్రాస్ మూవీ చేశాడు. రజనీకాంత్‌తో కబాలి, కాలా సినిమాలు చేశాడు. సార్పట్ట పరంపరై, నచ్చత్రం నగర్గిరదు మూవీస్ తెరకెక్కించిన ఈయన చివరగా తంగలాన్ చేశాడు. హిందీలోనూ నేరుగా ఓ సినిమా చేస్తానని గతేడాది ప్రకటించాడు. దీనికి బిర్సా ముండా అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేశాడు. ఎవరీ బిర్సా ముండాబిర్సా ముండా ఆదివాసీ నాయకుడు. 19వ శతాబ్దంలో జార్ఖండ్ రాష్ట్రంలో బ్రిటిష్, స్వదేశీ భూస్వాములచే బానిసలుగా ఉన్న గిరిజన ప్రజల కోసం పోరాడారు. భారతీయ అటవీ జాతుల స్వాతంత్ర్య సమరయోధుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. 22 ఏళ్ల వయసులోనే బ్రిటీషర్లపై యుద్ధం ప్రకటించారు. ఇతడి గౌరవార్థం భారత పార్లమెంటులోని సెంట్రల్ హాల్లో ఈయన చిత్రపటం ఉంది. ఆయన గుర్తుగా రాంచీలోని విమానాశ్రయానికి బిర్సా ముండా విమానాశ్రయంగా నామకరణం చేశారు.ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: సంక్రాంతికి వస్తున్నాం: ఐశ్వర్య కాకపోతే ఆ హీరోయిన్.. మీనాక్షికి బదులుగా! -
పిల్లలతో ఇదేం పని? టీఆర్పీ కోసం ఏదైనా చేయిస్తారా?
హీరోయిన్ కాయడు లోహర్ (Kayadu Lohar)కు వింత అనుభవం ఎదురైంది. డ్రాగన్ సినిమా (Dragon Movie) ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె తమిళ సరిగమప లిటిల్ ఛాంప్స్ సీజన్ 4కు హాజరైంది. అక్కడ పాటలు పాడే ఓ బుడ్డోడు హీరోయిన్ను హత్తుకుని ముద్దుల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో హీరోయిన్ పెదాలపైనా ముద్దు పెట్టేందుకు ప్రయత్నించగా ఆమె తల పక్కకు తిప్పుకుంది. ఇది చూసిన జడ్జి ఎస్పీ చరణ్ ఏమీ చేయలేక చిరునవ్వు చిందించాడు. చెడిపోతున్నారుఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షో టీఆర్పీ కోసం పిల్లలతో ఇలాంటి పనులు చేయించడం దారుణమని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో సోషల్ మీడియా వల్ల పిల్లలు చెడిపోతున్నారనడానికి ఇదే సాక్ష్యమంటున్నారు. తల్లిదండ్రులైనా పిల్లలు ఎలా నడుచుకోవాలనేది నేర్పిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి పనులు చేసినప్పుడు నవ్వడానికి బదులు లాగి పెట్టి ఒక్కటిస్తే వారే దారికొస్తారని సలహా ఇస్తున్నారు.తెలుగులోనూ యాక్ట్ చేసిన హీరోయిన్తమిళంలో ప్రసారమవుతున్న సరిగమప లిటిల్ ఛాంప్స్ నాలుగో సీజన్‌కు సింగర్ శ్వేతా మోహన్‌తో పాటు, దివంగత గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్పీ చరణ్ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. హీరోయిన్ కాయడు లోహర్ విషయానికి వస్తే.. అస్సాం రాష్ట్రానికి చెందిన ఈ బ్యూటీ ముగిల్పేటె అనే కన్నడ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. పతనోపాతం నూట్టండుతో మలయాళంలో ప్రవేశించింది. అదే ఏడాది శ్రీవిష్ణు హీరోగా నటించిన అల్లూరి (2022) సినిమాతో తెలుగువారిని పలకరించింది. ప్రస్తుతం డ్రాగన్ సినిమా చేస్తోంది. లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 21న విడుదల కానుంది. 🤦♂️🤦♂️🤦♂️pic.twitter.com/KbZVlDlTU6— Christopher Kanagaraj (@Chrissuccess) January 18, 2025 చదవండి: సంక్రాంతికి వస్తున్నాం: ఐశ్వర్య కాకపోతే ఆ హీరోయిన్.. మీనాక్షికి బదులుగా! -
12 ఏళ్ళకు విశాల్ సంచలనం దెబ్బకు సంక్రాంతి రికార్డు బద్దలు
-
ఐదు వేల మందికి సాయం చేసిన సినీ నిర్మాత
సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకుంటారు. కానీ ఆదిత్య గ్రూప్ ఛైర్మన్ ఆదిత్యరామ్ పేదలతో పండుగ జరుపుకున్నారు. చెన్నై ECR వద్ద ఉన్న తన ఆదిత్యరామ్ ప్యాలెస్ వద్దకు పణైయూర్, అక్కరై, ఉతండి, ఇంజంబాకం, శోలింగనల్లూరు వంటి ప్రాంతాల్లోని సుమారు ఐదువేల మంది పేద ప్రజలు, అనాథ వృద్ధులు అక్కడికి చేరుకున్నారు. వారందరితో కలిసి ఆయన సంక్రాంతి జరుపుకున్నారు.కులమత భేదాలు లేకుండా వారికి నాణ్యమైన బియ్యంతో పాటు పండుగ సందర్భంగా చేసుకునే వంటలకు అవసరమైన వస్తువులను వారందరికీ పంపిణీ చేసి, వారు పండుగను ఆనందంగా జరుపుకునేలా శుభాకాంక్షలు తెలిపారు. ఆదిత్యరామ్ అందించిన పండుగ కానుకలను స్వీకరించిన ప్రజలు, 'ప్రతి పండుగలో మాకు ఆదిత్యరామ్ అందించే ఈ సహాయం మా జీవితాలకు ఎంతో ముఖ్యమైనది. ఇది మాకు ఆర్థికంగా చాలా తోడ్పాటుగా ఉంది' అని సంతోషంతో తెలియజేశారు. వారు తమ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆయనకు ధన్యవాదాలు చెప్పారు.ఆదిత్యరామ్ కూడా తన జీవన ప్రయాణం గురించి ఇలా పంచుకున్నారు. 'నేను ఒక సాధారణ కుటుంబంలో పుట్టి, పలు కష్టాలను ఎదుర్కొన్నాను. ఆ అనుభవం కారణంగా కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయాలని గాఢమైన సంకల్పం కలిగింది. నా శక్తి మేరకు చివరి వరకు సహాయం చేయడం కొనసాగిస్తాను.' అని తెలిపారు. ఆదిత్యరామ్ కోలీవుడ్‌లో నిర్మాతగా పలు సినిమాలు నిర్మించారు. ఆపై రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా ఆయన రాణిస్తున్నారు. View this post on Instagram A post shared by ADITYARAM P (@adityaram_chairman) View this post on Instagram A post shared by Tag Telugu (@tag.telugu) -
జాతీయ అవార్డ్ విన్నింగ్ హీరో సినిమాకు నో చెప్పిన సాయిపల్లవి
నటి సాయి పల్లవి సినిమా రంగంలో సంపాదించుకున్న పేరు మామూలుగా లేదు. ముఖ్యంగా గ్లామర్‌కు దూరంగా సహజ నటిగా ముద్ర వేసుకున్న ఈ బ్యూటీ మలయాళ చిత్రం ప్రేమమ్‌తో కథానాయకిగా పరిచయమైంది. అయితే, సాయి పల్లవి తన తొలి చిత్రంతోనే నటనలో తనదైన ముద్ర వేసుకుంది. దీంతో వెంటనే టాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. ఇక్కడ పలు చిత్రాల్లో నటించి సక్సెస్ ఫుల్ కథానాయకిగా రాణిస్తోంది. అదేవిధంగా కోలీవుడ్ లోనూ నటిస్తూ దక్షిణాదిలో ప్రముఖ నటిగా గుర్తింపు పొందిన సాయి పల్లవి ఇటీవల శివకార్తికేయన్‌కు జంటగా అమరన్ చిత్రంలో నటించి మరోసారి నటిగా తన సత్తా చాటుకుంది. కథలోని తన పాత్ర నచ్చితేనే నటించడానికి సమ్మతించే ఈమె పాత్రకు ప్రాధాన్యత లేకపోతే ఎలాంటి అవకాశం అయినా తిరస్కరిస్తుంది. అయితే తాజాగా అందుకు భిన్నంగా ఒక అవకాశాన్ని చేజార్చుకుందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో జోరందుకుంది. అదే నటుడు విక్రమ్ సరసన నటించే అవకాశం అని సమాచారం. తంగలాన్ చిత్రంలో తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించిన నటుడు విక్రమ్ ప్రస్తుతం వీర వీర సూరన్ చిత్రంలో నటిస్తున్నారు. ఎస్.అరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. కాగా తదుపరి మడోన్ అశ్విన్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు ఈ దర్శకుడు ఇంతకుముందు యోగిబాబు కథానాయకుడిగా మండేలా, శివ కార్తికేయన్ హీరోగా మావీరన్ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. కాగా విక్రమ్ హీరోగా ఈయన దర్శకత్వం వహించనున్న చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలిసింది. కాగా ఇందులో విక్రమ్ సరసన నటి సాయిపల్లవి నటింపజేసే ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం. అయితే కాల్షీట్స్ సమస్య కారణంగా ఆమె ఈ చిత్రంలో నటించే అవకాశాన్ని చేజార్చుకున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆరు ఫిలిం ఫేర్ అవార్డ్స్ అందుకున్న సాయిపల్లవి ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డ్ అందుకున్న విక్రమ్‌తో కలిసి ఒక సినిమా చేస్తే అంచనాలు భారీగానే ఉంటాయి. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అనేది ఎంతవరకు నిజమో అన్నది తెలియాల్సి ఉంది. అదేవిధంగా విక్రమ్ దర్శకుడు మండోన్ అశ్విన్ కాంబోలో రూపొందనున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. -
జయం రవి, ఆర్తీ విడాకుల కేసులో మధ్యవర్తులతో చర్చలు
కోలీవుడ్ ప్రముఖ నటుడు జయం రవి (రవి మోహన్) భార్య ఆర్తీతో విడిపోతున్నట్లు కొద్దిరోజుల క్రితం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో వీరి 14 ఏళ్ల వివాహ బంధానికి తెర పడినట్లయ్యింది. ఈ వ్యవహారంలో జయం రవి భార్య ఆర్తీ (Aarthi) నుంచి విడాకులు కోరుతూ చైన్నె కుటుంబ సంక్షేమ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఆయన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఇందరు మళ్లీ కలిసి జీవించడానికి సామరస్య చర్చలకు అవకాశం ఇచ్చింది. (ఇదీ చదవండి: సైఫ్ అలీ ఖాన్‌పై దాడి.. అసలైన నిందితుడి అరెస్టు)ఇప్పటికే జయం రవి (Jayam Ravi), ఆర్తీల మధ్య మూడు సార్లు సామరస్య చర్చలు జరిగాయి. కాగా శనివారం ఈ కేసు మరోసారి న్యాయమూర్తి తేనెతోమొళి సమక్షంలో విచారణకు వచ్చింది. దీంతో జయం రవి,ఆర్తల తరపు న్యాయవాదులు కోర్టుకు హాజరయ్యారు. నటుడు జయం రవి, ఆర్తీ కూడా ఆన్లైన్ ద్వారా విచారణలో పాల్గొన్నారు. కాగా వారి న్యాయవాదులు తమ క్లైంట్ల మధ్య శనివారం సామరస్య చర్చల కోసం మధ్యవర్తులు ఆహ్వానించినట్లు కోర్టుకు విన్నవించారు. దీంతో సామరస్య చర్చలు పూర్తి అయిన తరువాత తీర్పును ప్రకటిస్తామంటూ న్యాయమూర్తి ఈ కేసు విచారణను ఫిబ్రవరి 15వ తేదీకి వాయిదా వేశారు.పేరు మార్చుకున్న జయం రవి.. కారణం ఇదేజయం రవి (Jayam Ravi) పేరు మార్చుకున్నాడు. తనను ఇకపై రవి మోహన్(Ravi Mohan) అని పిలవాలని కొద్దిరోజుల క్రితమే తెలిపాడు. అతడు ప్రధాన పాత్రలో నటించిన కాదలిక్క నెరమలై సినిమా రిలీజ్‌కు ఒక రోజు ముందు ఈ నిర్ణయం తీసుకున్నాడు. అందుకు కారణం ఎంటో ఇలా చెప్పాడు. 'ఈ రోజు నుంచి నా పేరు రవి లేదా రవి మోహన్. వ్యక్తిగతంగా కానీ, వృత్తిగతంగా కానీ ఇలాగే పిలవండి. దయచేసి ఇకపై ప్రతి ఒక్కరూ నన్ను జయం రవి అని సంభోదించకుండా రవి/ రవి మోహన్ అని మాత్రమే పిలవాలని కోరుతున్నాను' అని అన్నాడు. జయం రవి అసలు పేరు రవి. ఆయన తండ్రి మోహన్ డైరెక్ట్ చేసిన జయం (తెలుగు జయం మూవీ రీమేక్) మూవీ బ్లాక్‌బస్టర్ కావడంతో తన పేరు జయం రవిగా మారింది. రెండు దశాబ్దాలుగా జయం రవిగానే కొనసాగిన ఆయన ఇప్పుడు తనను పాత పేరుతోనే పిలవాలని చెప్తున్నాడు. అలాగే ఈ హీరో తన పేరు మీద రవి మోహన్ స్టూడియోస్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. తన బ్యానర్ ద్వారా మంచి కథలను అందించడంతో పాటు ప్రతిభావంతులైన కొత్తవారిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తానని చెప్పుకొచ్చాడు. -
అనుపమ పరమేశ్వరన్ ప్రేమలో మోసపోయిందా?
తమిళసినిమా: మాలీవుడ్‌లో కంటే టాలీవుడ్ లోనే ఎక్కువ చిత్రాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. ప్రేమవ్ు అనే చిత్రం ద్వారా ముగ్గురు కథానాయకిల్లో ఒకరిగా పరిచయమైన ఈమెను ఆ చిత్ర విజయం దక్షిణాది నటిగా మార్చేసింది. ఆ తర్వాత మాతృభాషలోనే కాకుండా తెలుగు, తమిళం భాషల్లోనూ అవకాశాలు వరుసగట్టాయి. అయితే ఎక్కువగా తెలుగులోనే ఈమె నటించిన చిత్రాలు సక్సెస్ కావడంతో అక్కడ స్టార్ ఇమేజ్ను సంపాదించుకుంది. ఇకపోతే డీజే టిల్లు చిత్రానికి ముందు వరకు పక్కింటి అమ్మాయి ఇమేజ్ను సొంతం చేసుకున్న అనుపమ పరమేశ్వరన్ ఆ చిత్రంలో అందాలను ఆరబోయడంతో పాటు లిప్‌లాక్ సన్నివేశాలలో నటించి తనలోని గ్లామర్ కోణాన్ని తెరపై విచ్చలవిడిగా ఆవిష్కరించింది. అయితే తమిళంలో ధనుష్ జంటగా కోడి చిత్రంతో కథానాయకిగా పరిచయం అయింది. కోలీవుడ్‌లో ఈ అమ్మడికి ఆశించిన విజయాలు రాలేదు. ఇటీవల జయం రవి సరసన నటించిన సైరన్ చిత్రం కూడా పూర్తిగా నిరాశపరిచింది. ఇలాంటి పరిస్థితుల్లో అనుపమ పరమేశ్వరన్ ఒక భేటీలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.‘‘ఎప్పుడు నిన్నే ప్రేమిస్తున్నాను అని చెప్పడం శుద్ధ అబద్ధం. అదేవిధంగా నువ్వే నా ప్రాణం నువ్వు లేక నేను లేను అనే ప్రేమలో చిక్కుకున్న వారు వెంటనే అందులోంచి బయటపడండి’’ అని నటి అనుపమ పరమేశ్వరన్ పేర్కొన్నారు. దీంతో అమ్మడు ప్రేమలో మోసపోయిందా? ఆ చేదు అనుభవంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేసిందా? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. -
అజిత్ కుమార్ 'విదాముయార్చి'.. తెలుగు ట్రైలర్ వచ్చేసింది
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) నటించిన తాజా చిత్రం విదాముయార్చి(Vidaamuyarchi Movie). ఈ సినిమాకు మగిజ్ తిరుమేని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించారు. అర్జున్ సర్జా కీలక పాత్ర పోషించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్డెట్‌తో నిర్మించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. కాగా.. ఈ చిత్రానికి తెలుగులో పట్టుదల అనే టైటిల్ ఖరారు చేశారు. ట్రైలర్ చూస్తే ఈ సినిమా అంతా అజర్ బైజాన్‌లోనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్లో కార్లతో అజిత్ స్టంట్స్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ముఖ్యంగా అర్జున్ సర్జాతో వచ్చే సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్ చూస్తుంటే మాఫియా నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.ముందుగా అనుకున్న ప్రకారం ఈ సంక్రాంతికే విదాముయార్చి విడుదల కావాల్సి ఉంది. కానీ అనివార్య కారణాలతో వాయిదా వేయాల్సి వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.కారు రేస్ గెలిచిన అజిత్..ఇటీవల దుబాయ్‌లో జరిగిన 24హెచ్ కారు రేసులో అజిత్ టీమ్ మూడోస్థానంలో నిలిచింది. అజిత్ దాదాపు 15 సంవత్సరాల విరామం తర్వాత అజిత్ తిరిగి రేసింగ్‌కు వచ్చాడు. దీంతో అజిత్ టీమ్‌పై సినీ తారలు ప్రశంసలు కురిపించారు. రేస్ గెలిచిన అనంతరం అజిత్ జాతీయజెండా పట్టుకుని సంతోషం వ్యక్తం చేశారు.అజిత్ కుమార్‌కు ప్రమాదం..రేసు ప్రారంభానికి ముందే తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్‌కు(Ajith Kumar) పెను ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. దుబాయ్‌లో జరుగుతున్న రేసింగ్‌లో ఆయన నడుపుతున్న కారు పక్కనే ఉన్న ట్రాక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో అజిత్‌కు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారు రేసింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అజిత్ ప్రమాదం నుంచి బయటపడడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.మైత్రి మూవీ మేకర్స్‌తో సినిమా..అజిత్ కుమార్ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌తో జతకట్టారు. ఆయన హీరోగా తెరకెక్కిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఇందులోనూ త్రిషనే హీరోయిన్గా నటిస్తోంది . ‘మార్క్ ఆంటోని’ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీని వేసవిలో ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. Persistence is the path, Victory is the destination. 💥 The VIDAAMUYARCHI & PATTUDALA Trailer is OUT NOW. ▶️🔗 Tamil - https://t.co/zKlPqI9XGE🔗 Telugu - https://t.co/mYt21igQIsFEB 6th 🗓️ in Cinemas Worldwide 📽️✨#Vidaamuyarchi #Pattudala #EffortsNeverFail#AjithKumar… pic.twitter.com/wTL2C1tZHP— Lyca Productions (@LycaProductions) January 16, 2025 -
ఈయన్ను బయటకు పంపించేయండి: విజయ్ సేతుపతి
భిన్న నటులందరూ ఒకే దగ్గర సమావేశమయ్యారు. తమిళ సినీ స్టార్స్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi), అరవింద్ స్వామి, మలయాళ హీరో ఉన్ని ముకుందన్, కన్నడ నటుడు ప్రకాశ్ రాజ్, తెలుగు హీరో సిద్ధు జొన్నలగడ్డ, హిందీ నటుడు విజయ్ వర్మ.. అందరూ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ప్రోమో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇన్‌సెక్యూర్‌గా ఫీలవుతాఇందులో విజయ్ సేతుపతి సరదా వ్యాఖ్యలకు మిగిలినవారంతా పడిపడి నవ్వారు. ఎవరైనా అద్భుతంగా నటిస్తే నేను అభద్రతాభావానికి లోనవుతాను. ఫలానా సన్నివేశంలో అంత ఈజీగా ఎలా యాక్ట్ చేశారు? అని ఆలోచిస్తుంటాను.. అని విజయ్ చెప్పుకుంటూ పోతుంటే అరవింద్ స్వామి నవ్వకుండా ఉండలేకపోయాడు.(చదవండి: Saif Ali Khan: వెన్నెముకలో విరిగిన కత్తి.. నటుడికి ప్లాస్టిక్ సర్జరీ)అంతా ఈయన వల్లే..అతడిని చూసి ప్రకాశ్ రాజ్ సైతం నవ్వేశాడు. ఈయన వల్లే నవ్వానంటూ ప్రకాశ్.. అరవింద్వైపు వేలు చూపించాడు. దీంతో సేతుపతి.. సర్.. ఈయన నన్ను మాట్లాడినవ్వట్లేదు. ఇంటర్వ్యూ మధ్యలో చెడగొడుతున్నాడు. వెంటనే ఈయన్ని బయట నిల్చోబెట్టండి అని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తిని కోరాడు. దీంతో అక్కడున్న మిగతా నటులు సైతం ఘొల్లుమని నవ్వారు.రాత్రి సిట్టింగ్..కొన్నిసార్లు అరవింద్ స్వామి నాకు ఫోన్ చేసి ఇంటికి రమ్మంటాడు. వెళ్లాక మేము తాగుతూ కూర్చుంటాం. రెండుమూడు గంటలపాటు నన్ను టీజింగ్ చేస్తూనే ఉంటాడు. కొన్నిసార్లయితే తెల్లవారేవరకు నన్ను ఏడిపిస్తూనే ఉంటాడు అని సీక్రెట్ బయటపెట్టాడు. ఇక మరో సందర్భంలో జీవిత సత్యాన్ని బయటపెట్టాడు. జీవితం కొన్నిసార్లు మనకు పాఠాలు చెప్తుంది. దాన్ని నేర్చుకోకపోతే లైఫ్ మనకు గుణపాఠం చెప్తుందన్నాడు. చదవండి: ఇంట్లో దోపిడీయత్నం.. హీరో సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి! -
సూపర్ స్టార్ మూవీలో నటించే ఛాన్స్ కొట్టిన శ్రద్ధా శ్రీనాథ్
-
పేరు మార్చుకున్న హీరో.. ఇకపై అలా పిలవొద్దంటూ..
తమిళ హీరో జయం రవి (Jayam Ravi) పేరు మార్చుకున్నాడు. తనను ఇకపై రవి మోహన్(Ravi Mohan) అని పిలవాలని చెప్తున్నాడు. అతడు ప్రధాన పాత్రలో నటించిన కాదలిక్క నెరమలై సినిమా రిలీజ్‌కు ఒక రోజు ముందు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేశాడు. ఈ రోజు నుంచి నా పేరు రవి లేదా రవి మోహన్. వ్యక్తిగతంగా కానీ, వృత్తిగతంగా కానీ ఇలాగే పిలవండి. ఇకపై అలా పిలవొద్దుదయచేసి ఇకపై ప్రతి ఒక్కరూ నన్ను జయం రవి అని సంభోదించకుండా రవి/ రవి మోహన్ అని మాత్రమే పిలవాలని కోరుతున్నాను అన్నాడు. జయం రవి అసలు పేరు రవి. ఆయన తండ్రి మోహన్ డైరెక్ట్ చేసిన జయం (తెలుగు జయం మూవీ రీమేక్) మూవీ బ్లాక్‌బస్టర్ కావడంతో తన పేరు జయం రవిగా మారింది. రెండు దశాబ్దాలుగా జయం రవిగానే కొనసాగిన ఆయన ఇప్పుడు తనను పాత పేరుతోనే పిలవాలని చెప్తున్నాడు. అలాగే ఈ హీరో తన పేరు మీద రవి మోహన్ స్టూడియోస్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. తన బ్యానర్ ద్వారా మంచి కథలను అందించడంతో పాటు ప్రతిభావంతులైన కొత్తవారిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తానని చెప్పుకొచ్చాడు. (చదవండి: 50 ఏళ్ల వయసులో హీరోయిన్ డేటింగ్? నిజమిదే!)మీరిచ్చిన ప్రేమకు ప్రతిఫలంగా..అంతే కాదు తన అభిమానుల కోసం రవిమోహన్ ఫ్యాన్స్ ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించాడు. దీని ద్వారా ఆపదలో ఉన్నవారికి, అవసరం కోసం అర్థిస్తున్నవారికి సాయం చేస్తానన్నాడు. ఈ ఫౌండేషన్‌తో సమాజంలో సానుకూల మార్పును ఆశిస్తున్నట్లు తెలిపాడు. మీరు నాకందించిన ప్రేమాభిమానాలను, సపోర్ట్‌కు ప్రతిఫలంగా నేను మీకు సహాయసహాకారాలు అందిస్తాను అని సదరు లేఖలో పేర్కొన్నాడు. సినిమాఇకపోతే జయం రవి, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలో నటించిన కాదళిక్క నేరమిళై మూవీ జనవరి 14న విడుదల కానుంది. కిరుతిగ ఉదయనిధి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు. ఉదయనిధి స్టాలిన్ నిర్మించారు. View this post on Instagram A post shared by Ravi Mohan (@jayamravi_official) చదవండి: డైరెక్టర్ అసభ్యకర వ్యాఖ్యలు.. స్పందించిన మన్మథుడు హీరోయిన్ -
'మీరు అనుకున్నది సాధిస్తే'.. ప్రమాదం తర్వాత అజిత్ వీడియో రిలీజ్!
కోలీవుడ్ స్టార్ ప్రస్తుతం అజిత్ కుమార్(ajith Kumar) విదాముయార్చి మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పొంగల్ బరిలో నిలిచింది. కానీ ఊహించని కారణాలతో ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కాలేదు. ఈ సినిమాకు మగిళ్ తిరుమేని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించారు. అర్జన్ సర్జా కీలక పాత్ర పోషించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్డెట్లో నిర్మించారు.అయితే ఇటీవల తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్‌కు(Ajith Kumar) పెను ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. దుబాయ్‌లో జరుగుతున్న రేసింగ్‌లో ఆయన నడుపుతున్న కారు పక్కనే ఉన్న ట్రాక్‌ను ఢీకొట్టారు. ఈ ఘటనలో అజిత్‌కు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారు రేసింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేసింది. అజిత్ ప్రమాదం నుంచి బయటపడడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.ఈ ప్రమాదం జరిగిన తర్వాత తొలిసారిగా అజిత్ ఓ వీడియో సందేశం రిలీజ్ చేశారు. మోటార్‌స్పోర్ట్స్ పట్ల తనకున్న ఇష్టాన్ని వెల్లడించారు. అలాగే కుటుంబం, హార్ట్ వర్క్, సక్సెస్, ఫెయిల్యూర్‌ను జీవితంలో సమానంగా చూడాలని అభిమానులకు సూచించారు. ప్రస్తుతం దుబాయ్‌లో జరగనున్న 24హెచ్ కారు రేసింగ్‌లో అజిత్ పాల్గొంటున్నారు.ఈ వీడియోలో అజిత్ మాట్లాడుతూ.. 'నేను చాలా సంతోషంగా ఉన్నా. మోటార్ స్పోర్ట్స్ నా జీవితాంతం ఇష్టమైంది. చాలా మంది అభిమానులు ఇక్కడకు వచ్చారు. మీరందరూ సంతోషం, ఆరోగ్యంతో పాటు ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని నేను కోరుకుంటున్నా. ముందు మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి. సమయాన్ని వృథా చేయకండి. బాగా చదవండి. కష్టపడి పనిచేయండి. జీవితంలో మీకు నచ్చినది చేసినప్పుడు విజయం సాధిస్తే దాని ఫలితం అద్భుతంగా ఉంటుంది. అంతే కానీ, విజయం సాధించకలేకపోయామని అక్కడే ఆగిపోవద్దు. ఈ ప్రపంచంలో పోటీ చాలా ముఖ్యం. ఎప్పటికైనా మీ సంకల్పం, అంకితభావాన్ని వదులుకోవద్దు. మీ అందరినీ ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా' అంటూ రిలీజ్ చేశారు.కార్ రేసింగ్ గురించి మాట్లాడుతూ.. ' రేసింగ్ అనేది ఇతర క్రీడల మాదిరిగా వ్యక్తిగత క్రీడ కాదు. మీరు స్ప్రింట్ రేసర్లను చూసి ఉండవచ్చు. కానీ ఇందులో నలుగురు, ఐదుగురు డ్రైవర్లు ఒకే కారు నడుపుతారు. కాబట్టి మనమందరం అందరి పనితీరుకు బాధ్యత వహించాలి. మన కారును జాగ్రత్తగా చూసుకోవాలి. అదే సమయంలో మనం ల్యాప్ టైమింగ్‌లను సాధించాలి. ఇందులో సిబ్బంది, మెకానిక్స్, లాజిస్టికల్ సపోర్ట్‌తో పాటు డ్రైవర్ల సమష్టి కృషి ఉంటుంది. ఇది సినిమా పరిశ్రమ లాంటిది. ప్రతి ఒక్కరూ తమ పాత్రపై దృష్టి పెడితే ఫలితాలు వస్తాయి' అని అన్నారు.కాగా.. అజిత్ దాదాపు 15 సంవత్సరాల విరామం తర్వాత తిరిగి రేసింగ్‌కు వచ్చాడు. అతని జట్టు ఈ కారు రేసింగ్‌లో పోటీపడుతోంది. రేసింగ్ జట్టు యజమానిగా తాను రేసింగ్‌లో పాల్గొంటానని అజిత్ తెలిపారు.మైత్రి మూవీ మేకర్స్‌తో సినిమా..అజిత్ కుమార్ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌తో జతకట్టారు. ఆయన హీరోగా తెరకెక్కిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఇందులోనూ త్రిషనే హీరోయిన్గా నటిస్తోంది . ‘మార్క్ ఆంటోని’ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీని వేసవిలో ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. Ak. My fans Their commitments. pic.twitter.com/5fW17Gghgu— Suresh Chandra (@SureshChandraa) January 11, 2025 -
అనారోగ్యంపై వార్తలు.. క్లారిటీ ఇచ్చిన హీరో విశాల్
హీరో విశాల్ (Vishal) ప్రధాన పాత్రలో నటించిన మదగజరాజ మూవీ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. షూటింగ్ పూర్తయిన 12 ఏళ్ల తర్వాత ఈ చిత్రం రిలీజ్‌కు నోచుకోవడం గమనార్హం. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో విశాల్ బక్కచిక్కిపోయి వణుకుతూ కనిపించాడు. మైక్ పట్టుకున్నప్పుడు అతడి చేతులు వణకడంతో పాటు మాట కూడా తడబడుతూ వచ్చింది. సరిగ్గా నడవలేని స్థితిలో ఉన్న వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో అభిమానులు విశాల్‌కు ఏమైందని ఆందోళన చెందారు.వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న విశాల్ఈ క్రమంలో విశాల్‌కు చికిత్స అందిస్తున్న వైద్యులు అతడి ఆరోగ్య పరిస్థితిని వివరించారు. ప్రస్తుతం అతడు వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారని, పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్నప్పటికీ విశాల్ సినిమా ఈవెంట్‌కు రావడాన్ని పలువురూ అభినందిస్తున్నారు. అభిమానులు మాత్రం.. ఆయన ఆరోగ్యంపై దృష్టి సారించాలని, త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు చేశారు.ఆరు నెలలకోసారి దూరం?తాజాగా విశాల్ కోలుకున్నట్లు తెలుస్తోంది. మదగజరాజ సినిమా (Madha Gaja Raja Movie) ప్రీమియర్ షోకు హాజరైన విశాల్.. తన హెల్త్ అప్డేట్ ఇచ్చాడు. మా నాన్నగారి సంకల్పం వల్లే నేను ధృడంగా ఉండగలుగుతున్నాను. ఆయన ఇచ్చిన శక్తి వల్లే నా జీవితంలో ఎదురైన అడ్డంకులను దాటగలుగుతున్నాను. ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నానంటే.. మూడు, ఆరు నెలలకోసారి సినిమాలకు దూరంగా ఉంటున్నానని, సరిగా పని చేయట్లేదని అంటున్నారు. ఎన్ని మాటలన్నా నేను మరింత శక్తి కూడదీసుకుని మీ ముందుకొస్తాను.(చదవండి: Daaku Maharaaj Review: ‘డాకు మహారాజ్’ మూవీ రివ్యూ)ఇప్పుడు బానే ఉన్నానునేను అనారోగ్యంగా ఉండటం చూసి అభిమానులు ఆందోళన చెందారు. ఇప్పుడు నేను బాగున్నాను. చూడండి, నా చేతులు కూడా వణకడం లేదు. నా ఆరోగ్యం బాగుంది. మీరు చూపించిన ప్రేమకు తుదిశ్వాస వరకు రుణపడి ఉంటాను. మీ అభిమానాన్ని ఎన్నటికీ మర్చిపోలేను. మీరందరూ తప్పకుండా సినిమా చూసి ఎంజాయ్ చేయండి అని చెప్పుకొచ్చాడు.ఆ సినిమాతో హీరోగా క్రేజ్కాగా విశాల్.. చెల్లమే (Chellamae Movie) సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు. సండ కోడి మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇంది తెలుగులో పందెం కోడిగా విడుదలవగా ఇక్కడ కూడా హిట్‌గా నిలిచింది. తామిరభరణి, మలైకొట్టాయి, సత్యం, తోరణై (పిస్తా), అవన్ ఇవన్, వేడి, పాట్టతు యానై, పాండియ నాడు, తుప్పరివాలన్, ఎనిమీ, సండకోడి 2, మార్క్ ఆంటోని వంటి పలు చిత్రాలతో అలరించాడు.ఎయిట్ ప్యాక్‌తో విశాల్మార్క్ ఆంటోని మూవీలో అదరదా పాట.. విశాలే ఆలపించాడు. అంతేకాదు మదగజరాజ సినిమాలోని మై డియర్ లవరూ సాంగ్ కూడా అతడే పాడటం విశేషం. ఇందులో విశాల్ ఎయిట్ ప్యాక్స్‌లో కనిపిస్తాడని డైరెక్టర్ సుందర్ తెలిపాడు. సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో సుందర్ మాట్లాడుతూ.. క్లైమాక్స్‌లో 8 ప్యాక్స్‌తో కనిపించాలని హీరోకు చెప్పాను. కొన్ని కారణాల వల్ల ఆ క్లైమాక్స్ షూట్ ఆలస్యమైంది. అయినా సరే విశాల్ తన ఎయిట్ ప్యాక్ బాడీని ఏడాదిపాటు మెయింటెన్ చేశాడు అని సుందర్ పేర్కొన్నాడు. ఈ చిత్రంలో అంజలి హీరోయిన్గా నటించగా ఖుష్బూ కీలక పాత్ర పోషించింది. #Vishal Watching #MadhaGajaRaja Special Premiere 💯pic.twitter.com/sb9XNuvrt0— Sugumar Srinivasan (@Sugumar_Tweetz) January 11, 2025 చదవండి: పుష్ప-2 రీ లోడ్ వర్షన్.. మేకర్స్ బిగ్ అప్డేట్ -
ఓటీటీలో మాధవన్ ‘హిసాబ్ బరాబర్’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
విలక్షణ నటుడు ఆర్.మాధవన్ (R Madhavan) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘హిసాబ్ బరాబర్’. నీల్ నితిన్, కీర్తి కుల్హారి ఇతర పాత్రలు పోషించిన ఈ మూవీ నేరుగా ఓటీటీలో రిలీజ్ కానుంది. జీ5లో జనవరి 24 నుంచి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలో తాజాగా సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఓ బ్యాంక్ చేసే చిన్న పొరపాటు ఓ వ్యక్తి జీవితాన్ని తలకిందులు చేస్తే .. అతనెలా స్పందించాడు? న్యాయం కోసం ఎలాంటి పోరాటం చేశాడనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఆర్థిక మోసం, అవినీతి, న్యాయం కోసం చేసే పోరాటం ఇవన్నీ ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నాయి. అశ్విన్ ధీర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్, ఎస్పి సినీకార్ప్ నిర్మించాయి. దర్శకుడు అశ్విన్ ధీర్ మాట్లాడుతూ .. సమాజంలో అవినీతి, మోసాలను ఓ సామాన్యుడు ఎలా ఎదుర్కొన్నాడనే కథాంశంతో రూపొందిన ‘హిసాబ్ బరాబర్’ అందర్నీ ఆలోచింపజేసే చిత్రం. సామాజిక అంశాలతో పాటు ప్రేక్షకులకు కావాల్సిన డ్రామా, కామెడీ, ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. మాధవన్, నీల్ నితిన్, కీర్తి కుల్హారి వంటి వారు తమదైన నటనతో మెప్పిస్తారు. జనవరి 24న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది అన్నారు.ఆర్.మాధవన్ మాట్లాడుతూ.. జీ5తో నేను చేసిన తొలి సినిమా ఇది. ఇలాంటి ఓ సినిమాలో భాగం కావటం ఎంతో సంతోషంగా ఉంది. సామాన్యుడైన రాధే మోహన్ శర్మ పాత్రలో నటించటాన్ని ఎంజాయ్ చేశాను. ఈ పాత్ర నాకు ఛాలెంజింగ్‌గా అనిపించింది. మనలో ఉండే కామన్‌మ్యాన్ అవినీతికి వ్యతిరేకంగా ఎలా పోరాటం చేశాడనేదే కథ. ఇలాంటి వాస్తవ కథనాలతో మరిన్ని సినిమాలు రావాలని కోరుకుంటున్నాను అన్నారు.నీల్ నితిన్ మాట్లాడుతూ.. హిసాబ్ బరాబర్ చిత్రంలో మిక్కీ మెహతా అనే బ్యాంకర్ పాత్రతో మెప్పిస్తాను. యాక్టర్‌గా నాకు సవాలు విసిరిన పాత్ర ఇది. మాధవన్ వంటి నటుడితో కలిసి యాక్ట్ చేయడం చాలా సంతోషం. తనొక అద్భుమైన వ్యక్తి. స్క్రీన్‌పై మా ఇద్దరి మధ్య పోటాపోటీగా ఉండే సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పిస్తాయి అన్నారు.కీర్తి కుల్హారి మాట్లాడుతూ ‘‘హిసాబ్ బరాబర్ వంటి చిత్రంలో నటిగా సవాలు విసిరిన వైవిధ్యమైన పాత్రలో నటించటం ఎంతో సంతోషంగా ఉంది. మాధవన్‌గారితో నటించటం మంచి ఎక్స్‌పీరియె్స్. అశ్విన్ ధీర్ సినిమాను ఎంతో గ్రిప్పింగ్‌గా తెరకెక్కించారు. అన్నీ అంశాలను మేళవించి తెరకెక్కించిన ఎంటైర్‌టైనర్ ఇది. అందరినీ ఆలోచింప చేసే చిత్రం. జనవరి 24 నుంచి ప్రీమియర్ కానున్న ఈ సినిమాను ఆదరించాలని కోరుకంటున్నాను’’ అన్నారు. చదవండి: ప్రముఖ కమెడియన్‌కు బ్రెయిన్ స్ట్రోక్ -
రక్తమోడుతున్న ‘వెండితెర’
నాటి క్లైమాక్స్ సీన్: హీరో గన్ను పట్టుకుని సుదూరం నుంచి విలన్ అండ్ కో మీద బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నాడు..పిట్టల్లా వారంతా నేల కొరిగిపోతున్నారు. ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. మంచి పైన చెడు గెలిచింది అంటూ సంతోషంగా ఇంటికి తిరుగు ముఖం పట్టారు.నేటి క్లైమాక్స్: హీరో విలన్ అండ్ కో మీద ఎగిరి దూకాడు చేతులు కట్టేసి ఉన్నప్పటికీ..అడవి మృగాన్ని తలపిస్తూ వరుసపెట్ట్లి కంఠాల్ని నోటితో కరిచేశాడు.. కండల్ని దంతాలతో లాగేశాడు. రక్తమోడుతున్న నోటిని నాలుకతో తుడుచుకున్నాడు. ప్రేక్షకులు చప్పట్లు కొట్టడం కూడా మరచిపోయారు ఎందుకంటే వారు అప్పటికే షాక్‌లో ఉన్నారు.. చెడు మీద చెడు గెలిచిందో మంచి గెలిచిందో తెలీని అదే షాక్‌లో ఇంటికి తిరుగుముఖం పట్టారు.కళాత్మకమా? హింసాత్మకమా?ఆటవికన్యాయమే ఆధునిక సినిమా విజయసూత్రంగా మారిందా? వయె‘‘లెన్స్’’ లో నుంచే సినిమా రూపకర్తలు తమ సుసంపన్న భవిష్యత్తును దర్శిస్తున్నారా? ఇలాంటి ప్రశ్నలకు కాదు అని చెప్పే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఇప్పుడు లేదు. మొన్నటి కెజీఎఫ్ నుంచి నేటి మార్కో(Marco Movie) దాకా దక్షిణాదిలో, మొన్నటి కిల్(Kill) నుంచి నిన్నటి యానిమల్ దాకా ఉత్తరాదిలో..భాషా బేధాల్లేకుండా.. గత రెండు మూడేళ్లుగా సినిమా తెర అవిశ్రాంతంగా రక్తమోడుతోంది. నవరసాల్ని పంచే వినోదం నవనాడుల్లో దానవత్వాన్ని పెంచి పోషిస్తోంది. కళ్ల ముందు తెగిపడుతున్న శరీరభాగాలు కనపడితేనే కౌంటర్లలో టిక్కెట్లు తెగుతాయనే ప్రమాదకర విశ్వాసం సినీజీవుల్లో ప్రబలుతోంది.ఈ పరిస్థితికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కోవిడ్–19 మహమ్మారి ఇంట్లో నుంచే సినిమాలను ఎక్కువగా వీక్షించే విధానాన్ని సృష్టించింది. ఇది దేశంలోని ఇతర భాషలతో పాటు కొరియన్ జపనీస్తో సహా ప్రపంచ సినిమాలకు వారిని సన్నిహితం చేసింది. దాంతో క్రూరమైన పంధాకు పేరొందిన పలు సినిమా పరిశ్రమల చిత్రాలు మనకీ చేరువయ్యాయి. చెన్నైకి చెందిన జికె సినిమాస్ మేనేజింగ్ డైరెక్టర్ రూబన్ మతివానన్ మాట్లాడుతూ యువతలో యాక్షన్ హింసాత్మక చిత్రాల పట్ల మోజు పెరిగిందని అన్నారు మహమ్మారి తర్వాత, థియేటర్లు యాక్షన్, థ్రిల్లర్ గ్యాంగ్‌స్టర్, హింసాత్మక చిత్రాలతో నిండిపోతున్నాయి. ‘‘ఈ ధోరణి యూత్‌ను ఆకర్షిస్తున్నప్పటికీ, సినిమాలకు కుటుంబ ప్రేక్షకులను కూడా రాకుండా చేస్తుంది. సినిమా అంటే అన్ని వర్గాల ప్రేక్షకులనూ కలిగి ఉండాలి’’ అన్నారాయన.కొబ్బరికాయ కొట్టిన కెజీఎఫ్...గతంలోనూ సినిమాల్లో వయెలెన్స్ ఉండేది అయితే ఈ స్థాయిలో కాదు. ఈ ట్రెండ్‌కి శ్రీకారం చుట్టింది కెజీఎఫ్(KGF Movie) అని చెప్పొచ్చు. అక్కడ నుంచి వరుసగా ఈ తరహా చిత్రాలు తెరప్రవేశం చేస్తూ వచ్చాయి. గత ఏడాది బాలీవుడ్ హిట్స్‌గా నిలిచిన యానిమల్, కిల్... బాలీవుడ్ చరిత్రలోనే అత్యంత హింసాత్మక చిత్రాలుగా అవతరించాయి. తండ్రి మీద అవ్యాజ్యమైన ప్రేమ కలిగిన ఓ యువకుడు ఆ సాకుతో సాగించిన దారుణ మారణకాండ యానిమల్ కాగా, ఓ రైల్లో ప్రేమజంట డెకాయిట్ల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ నేపధ్యంలో ఓ సైనికాధికారి సాగించిన హత్యాకాండ కిల్.. రెండూ ప్రేక్షకులకు కొత్తదనాన్ని క్రూరత్వంలో ముంచి పంచాయి. ఇక ఇటీవలే విడుదలైన మార్కో భారతీయ చిత్రాల తాజా హింసోన్మాదానికి పరాకాష్ట. అత్యధిక శాతం సన్నివేశాలు చూడలేక ప్రేక్షకులు కళ్ల మీద కర్చీఫ్‌లు కప్పుకున్న సినిమా ఇదేననే ఘనతను దక్కించుందంటే ఏ స్థాయిలో మార్కో హింసను పండించిందో అర్ధం చేసుకోవచ్చు. విషాదమో విచిత్రమో లేక వినాశనమో తెలీదు గానీ ఈ చిత్రాలన్నీ అత్యంత సమర్ధులైన, సృజనశీలురైన దర్శకుల చేతుల్లో రూపుదిద్దుకున్నవి. దీంతో ఇవి నచ్చి మెచ్చి ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. పైన చెప్పుకున్నవే కాకుండా అఖండ, దేవర, పుష్ప2..ఇలా భారీ కలెక్షన్లు సాధించిన, సాధిస్తున్న చిత్రాలన్నీ విపరీతమైన హింసకు పట్టం కట్టినవే కావడం గమనార్హం. ఇది అహింసో పరమో ధర్మః అని నినదించిన మన భారతీయ ధర్మానికి గొడ్డలిపెట్టుగానే చెప్పాలి.మన వ్యక్తిగత వృత్తి పరమైన జీవితాలలో టెన్షన్ల నుంచి తప్పించుకునే మార్గం సినిమా. ప్రస్తుత క్రైమ్ చిత్రాలు మనసును మరోవైపు మళ్లిస్తున్నప్పటికీ... మితిమీరిన హింస ప్రభావానికి గురైనప్పుడు, మనస్సును మరింత గందరగోళానికి గురి చేస్తుందని సైకాలజిస్ట్‌లు హెచ్చరిస్తున్నారు. ఈ చిత్రాల్లో హీరోలకు చట్టంతో పనిలేదు, కోర్టుల జాడే ఉండట్లేదు, మంచి చెడు మీమాంస అసలే కనపడదు. ఓ వయసు దాటిన వారి సంగతి ఎలా ఉన్నా... ఇప్పుడిప్పుడే ఓ పర్సనాలిటీ(వ్యక్తిత్వం) రూపుదిద్దుకుంటున్న యువ మనస్తత్వాలను ఇవి ప్రభావితం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. విజయమే లక్ష్యంగా సినిమా రూపొందించడంలో తప్పులేదు కానీ.. దాని కోసం సామాజిక బాధ్యతను విస్మరించడం తప్పు మాత్రమే కాదు..ముప్పు కూడా. దీనిని మన సినిమా దర్శకులు గుర్తించాలి..అది సమాజానికి...సమాజంలో భాగమైన సినిమా రూపకర్తలకు, వారి పిల్లల భవిష్యత్తుకు కూడా అవసరం. -
రజనీకాంత్ బయోపిక్.. శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
'గేమ్ ఛేంజర్' తర్వాత స్టార్ హీరో బయోపిక్ ప్లాన్ చేస్తున్న శంకర్
పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల జీవిత చరిత్రతో చిత్రాలు రూపొందాయి. ఇందిరాగాంధీ, జయలలిత, కామరాజర్, భారత క్రికెట్ క్రీడాకారుడు ఎంఎస్ ధోనీ వంటి ప్రముఖుల జీవిత చరిత్రతో చిత్రాలు రూపొందిన విషయం తెలిసిందే. కాగా ఇటీవల సంగీత దర్శకుడు ఇళయరాజా బయోపిక్‌ను తెరకెక్కించడానికి ప్రయత్నాలు జరిగాయి. నటుడు ధనుష్ ఈ చిత్రంలో ఇళయరాజాగా నటించనున్నట్లు ప్రకటించారు కూడా. అయితే ఈ చిత్రం ఇప్పుడు డ్రాప్ అయ్యిందనే ప్రచారం జరుగుతోంది. ఇకపోతే ఇప్పుడు నటుడు రజనీకాంత్ (Rajinikanth) బయోపిక్ గురించి చర్చ జరుగుతోంది. దీనికి కారణం దర్శకుడు శంకర్ (Shankar) చేసిన వ్యాఖ్యలే. ఆయన ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ (Game Changer) చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. చాలా ఏళ్ల పాటు తెరకెక్కిన ఈ చిత్రం అనుకున్నంత స్థాయిలో మెప్పించలేదు. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం తొలిరోజే డిజాస్టర్ టాక్‌ను తెచ్చుకుంది. అయితే, ఈ చిత్రం తర్వాత దర్శకులు శంకర్ మరో సినిమాపై అడుగులు వేస్తున్నారు.తన తదుపరి చిత్రం గురించి శంకర్ ఒక భేటీలో పేర్కొంటూ నటుడు రజనీకాంత్ బయోపిక్‌ను తెరకెక్కించాలన్న కోరికను వ్యక్తం చేశారు. కోలీవుడ్‌లో 50 ఏళ్లుగా కథానాయకుడిగా ఏకచత్రాధిపత్యాన్ని సాగిస్తున్న రజనీకాంత్ బయోపిక్ తెరకెక్కుతుందా..? అన్న చర్చ సామాజిక మాధ్యమాల్లో జరుగుతోంది. కాగా దర్శకుడు శంకర్ ఇప్పటికే రజనీకాంత్ హీరోగా శివాజీ, రోబో, 2.ఓ చిత్రాలను తెరకెక్కించిన విషయం తెలిసిందే. దీంతో ఈయన రజనీకాంత్ బయోపిక్‌ను చిత్రంగా చేస్తే కచ్చితంగా సక్సెస్ అవుతుందనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ( ఇదీ చదవండి: ఊహలకు మించి డాకు మహారాజ్ ఉంటుంది: బాలకృష్ణ)కాగా రజనీకాంత్ ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రంలో నటిస్తున్నారు. తదుపరి నెల్సన్ దర్శకత్వంలో జైలర్– 2 చిత్రాన్ని సిద్ధం అవుతారని తెలుస్తోంది. అదేవిధంగా దర్శకుడు శంకర్ వెల్పారి చిత్రాన్ని తెర రూపం ఇవ్వడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రం గురించి గతంలో ప్రకటన కూడా వచ్చింది. అయితే, ఇందులో సూర్య, విక్రమ్‌లు నటించనున్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో ఈయన రజనీకాంత్ బయోపిక్ ఎప్పుడు తెరకెక్కిస్తారు ? అన్న ప్రశ్న తలెత్తుతోంది. దీనికి సమాధానం రావాలంటే కొంత కాలం ఆగాల్సిందే. -
కోలీవుడ్‌లో గేమ్ చేంజ్
సంక్రాంతి అంటే స్టార్ హీరోల చిత్రాలు కనీసం మూడు నాలుగైనా ఉండాలి. అప్పుడే సినీ లవర్స్‌కి అసలైన పండగ. కానీ ఈ పొంగల్‌కి తమిళ తెరపై ఒకే ఒక్క స్టార్ హీరో కనిపించనున్నారు. అది కూడా తెలుగు స్టార్ రామ్‌చరణ్. ‘గేమ్ చేంజర్’ తమిళంలో డబ్ అయి, విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇక తమిళంలో అజిత్ ‘విడాముయర్చి’ పొంగల్ రేసు నుంచి తప్పుకుంది. మొత్తంగా తమిళంలో ఆరేడు స్ట్రయిట్ చిత్రాలు పొంగల్‌కి రానున్నాయి. అవి కూడా మీడియమ్ కంటే ఓ మెట్టు ఎక్కువ ఉన్న హీరోలు, ఓ మెట్టు తక్కువ ఉన్న హీరోలవే. హీరోల రేంజ్ పక్కన పెడితే... ఒకవేళ కథాబలం ఉండి, ప్రేక్షకులను ఆకట్టుకుంటే మీడియమ్ రేంజ్ సినిమా పెద్ద రేంజ్ అయిపోతుంది. మరి... పొంగల్పోటీలో వసూళ్లు కొల్లగొట్టే సినిమా ఏది? అనేది తర్వాత డిసైడ్ అవుతుంది. ఇక ఈ పొంగల్‌కి తెరపైకి రానున్న చిత్రాల గురించి తెలుసుకుందాం...తెలుగు సినిమాకి సంక్రాంతి సీజన్ ఎంత ముఖ్యమో తమిళ ఇండస్ట్రీకి పొంగల్ కూడా అంతే ముఖ్యం. వరుస సెలవులను క్యాష్ చేసుకునే వీలు ఉన్న సీజన్ కాబట్టి భారీ చిత్రాల విడుదలను ప్లాన్ చేస్తుంటారు. ఎప్పటిలానే ఈసారి తెలుగులో భారీ చిత్రాలు విడుదలకు సిద్ధం అయ్యాయి. సీనియర్ స్టార్ హీరోలు బాలకృష్ణ ‘డాకు మహారాజ్’, వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సంక్రాంతి సందడికి రెడీ అయ్యాయి. యంగ్ స్టార్ రామ్‌చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ కూడా ఈ పండగకి రానుంది. అయితే అటు తమిళంలో మాత్రం మీడియమ్ రేంజ్ హీరోల చిత్రాలే విడుదల కానున్నాయి. ఆ మాట కొస్తే... గతేడాది కూడా కోలీవుడ్ పరిస్థితి ఇదే. ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ మినహా మిగతావన్నీ ఓ మోస్తరు చిత్రాలే.ఈసారి అజిత్ ‘విడాముయర్చి’ రావాల్సింది కానీ సంక్రాంతి రేసు నుంచి ఆ సినిమా తప్పుకోవడంతో ఇక పొంగల్‌కి పెరియ పడమ్ ఇల్లే (సంక్రాంతికి పెద్ద సినిమా లేదు) అన్నట్లు అయింది. సో... ఉన్నదంతా ‘గేమ్ చేంజర్’ మాత్రమే. అనువాద రూపంలో తమిళ తెరపై ‘గేమ్ చేంజర్’ కనిపించనుంది. ‘ఆర్ఆర్ఆర్’తో గ్లోబల్ స్టార్ అనిపించుకున్న రామ్‌చరణ్ హీరోగా నటించిన చిత్రం కావడం, తమిళ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన చిత్రం కావడం, సక్సెస్ఫుల్ ప్రోడ్యూసర్ ‘దిల్’ రాజు నిర్మించిన చిత్రం కావడంతో ‘గేమ్ చేంజర్’పై తమిళనాడులోనూ భారీ అంచనాలు ఉన్నాయి. సో... ఒక స్టార్ డైరెక్టర్–స్టార్ హీరో–స్టార్ ప్రోడ్యూసర్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం కావడంతో కోలీవుడ్ పొంగల్ బాక్సాఫీస్ దగ్గర ఆట అంతా ‘గేమ్ చేంజర్’దే అని చె΄÷్పచ్చు. వేరే పెద్ద చిత్రాలు లేకపోవడంతో ఈ చిత్రానికే ఎక్కువ థియేటర్లు లభించాయి. ‘గేమ్ చేంజర్’కి ఇదో మంచి అవకాశం.10న 3 సినిమాలు ఈ నెల 10న తెలుగులోనూ, అనువాద రూపంలో తమిళ్, హిందీ భాషల్లోనూ ‘గేమ్ చేంజర్’ విడుదల కానుంది. అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, ‘దిల్’ రాజు ప్రోడక్షన్ బ్యానర్స్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ దాదాపు రూ.450 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మించినట్లు సమాచారం. శంకర్ అంటే దాదాపు లార్జ్ స్కేల్ సినిమానే అవుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘గేమ్ చేంజర్’తోపాటు 10న తమిళంలో విడుదల కానున్న వాటిలో విలక్షణ నటుడు బాల దర్శకత్వంలో అరుణ్ విజయ్ నటించిన ‘వణంగాన్’, మలయాళ నటుడు షానే నిగమ్ తమిళ తెరకు హీరోగా పరిచయం అవుతున్న ‘మద్రాస్క్కారన్’ చిత్రాలు ఉన్నాయి. నిజానికి ‘వణంగాన్’ని సూర్య హీరోగా ప్లాన్ చేశారు బాల.అయితే కొన్ని కారణాల వల్ల అరుణ్ విజయ్‌తో ఈ చిత్రం చేశారు. ఒకవేళ సూర్యతో చేసి ఉంటే... పొంగల్ రేస్‌లో తమిళంలో ఓ స్టార్ ఉండి ఉండేవారు. ఇక ‘మద్రాస్ క్కారన్’ విషయానికొస్తే... గతేడాది ‘రంగోలి’ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన వాలీ మోహన్‌దాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మలయాళ యంగ్ హీరో షానే నిగమ్ నటించారు. 11 ఏళ్ల తర్వాత 12న ఇక పొంగల్ రేస్‌లోని తమిళ చిత్రాల్లో చెప్పుకోదగ్గ మాస్ హీరో అంటే విశాల్. ‘మద గజ రాజా’ చిత్రంతో ఈ 12న రానున్నారు విశాల్. ఈ సినిమా 2013లో విడుదల కావాల్సింది. కొన్ని కారణాల వల్ల కుదరలేదు. చివరికి 11 ఏళ్ల తర్వాత ఈ 12న విడుదల కానుంది. సుందర్.సి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది.పొంగల్ రోజున... పండగ రోజున ఆకాశ్ మురళి అనే నూతన హీరో వెండితెరకు పరిచయం కానున్నారు. ‘ఇదయం’ (హృదయం) ఫేమ్ మురళి రెండో కుమారుడే ఆకాశ్ మురళి. ఆల్రెడీ పెద్ద కుమారుడు అథర్వ హీరోగా (తెలుగులో ‘గద్దలకొండ గణేశ్’లో నటించారు) సినిమాలు చేస్తున్నారు. ఇక తమిళంలో ‘బిల్లా, ఆరంభం’ చిత్రాలతో మంచి మాస్ స్టయిలిష్ దర్శకుడు అనిపించుకున్న విష్ణువర్ధన్ నూతన హీరో ఆకాశ్ మురళితో తీసిన ‘నేసి΄్పాయా’ 14న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు శంకర్ కుమార్తె అదితీ శంకర్ హీరోయిన్గా నటించారు.ఇక పండగ రోజున సీనియర్ హీరో ‘జయం రవి’ ప్రేమించడానికి సమయం లేదంటూ ప్రేక్షకులు ముందుకొస్తున్నారు. ఆయన హీరోగా నిత్యామీనన్ హీరోయిన్గా నటించిన ‘కాదలిక్క నేరమిల్లై’ (ప్రేమించడానికి సమయం లేదు) చిత్రం ఈ 14న విడుదల కానుంది. ఈ చిత్రానికి కృతికా ఉదయనిధి స్టాలిన్ దర్శకత్వం వహించారు.ఇలా పొంగల్ రేసులో తమిళంలో ఐదు చిత్రాలు నిలవగా, వాటిలో విశాల్, ‘జయం’ రవి పేరున్న హీరోలు కాగా... వీరి తర్వాత అరుణ్ విజయ్ కొంచెం చెప్పుకోదగ్గ హీరో కాగా... మిగతా ఇద్దరిలో యువ హీరోలు ఆకాశ్ మురళి, షానే నిగమ్ ఉన్నారు. ఈ ఐదు చిత్రాలే కాకుండా మరో రెండు మూడు చిన్న సినిమాలు కూడా విడుదల కానున్నాయి. సో... ఎలా చూసుకున్నా పొంగల్‌కి తమిళ ప్రేక్షకుల ముందుకు రానున్న పెద్ద సినిమా ‘గేమ్ చేంజర్’ మాత్రమే. మరి... వసూళ్ల పరంగా ఈ సినిమా ప్రభావం ఇతర చిత్రాలపై ఏ మేరకు ఉంటుంది? పొంగల్పోటీలో బాక్సాఫీస్ హిట్ ఏ సినిమాకి దక్కుతుంది? అనేది మరో వారంలో తెలిసిపోతుంది. గేమ్ చేంజర్‌తో రీ ఎంటర్ కావడం హ్యాపీ ‘సందడే సందడి’తో నిర్మాతగా తెలుగులో ఆదిత్యా రామ్ ప్రయాణం ఆరంభమైంది. ఆ తర్వాత ‘ఖుషీ ఖుషీగా, స్వాగతం, ఏక్ నిరంజన్’ చిత్రాలు నిర్మించారాయన. ‘ఏక్ నిరంజన్’ (2009) తర్వాత మళ్లీ సినిమాలు నిర్మించలేదు. చెన్నైలో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు. కాగా ‘గేమ్ చేంజర్’ని తమిళంలో విడుదల చేస్తున్నారు ఆదిత్యా రామ్. ‘‘చాలా కాలం తర్వాత ఒక గ్రాండ్ స్కేల్ సినిమాతో వస్తున్నందుకు ఆనందంగా ఉంది. తమిళనాడులో దాదాపు నాలుగువందల స్క్రీన్స్‌లో విడుదల చేస్తున్నాం. రామ్‌చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్లో వస్తున్న ‘గేమ్ చేంజర్’ ఈ వీకెండ్‌కి పెద్ద సినిమా అవుతుంది. ‘దిల్’ రాజుగారి సినిమాని విడుదల చేయడం ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నారు ఆదిత్యా రామ్. – డి.జి.భవాని‘విడాముయర్చి’ రాకపోవడం నిరుత్సాహమే ‘‘పొంగల్ చాలా పెద్ద పండగ. పైగా ఇది పెద్ద వీకెండ్. పెద్ద హీరోల సినిమాలు రాకపోతే అస్సలు పండగలానే అనిపించదు. తమిళనాడులోని థియేటర్ ఓనర్స్ అందరూ అజిత్ హీరోగా నటించిన ‘విడాముయర్చి’ కోసం ఎదురు చూశారు. హఠాత్తుగా ఈ సినిమా వాయిదా పడటంతో అందరూ నిరుత్సాహపడ్డారు’’ అంటూ తమిళ చిత్రపరిశ్రమకు చెందిన ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.