కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన భారీ యాక్షన్ చిత్రం కంగువా. శివ డైరెక్షన్‌లో తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. అయితే మొదటి రోజే ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ రావడంతో కలెక్షన్లపై ప్రభావం పడింది. భారీ అంచనాల మధ్య రిలీజైన కంగువా తొలి రోజు కేవలం ఇండియావ్యాప్తంగా రూ.22 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది.
ఆ తర్వాత రెండో రోజు కంగువా వసూళ్లు మరింత తగ్గిపోయాయి. రెండో రోజు కేవలం రూ. 9.25 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. శనివారం వీకెండ్ కూడా కంగువాకు కలిసిరాలేదు. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 9.50 కోట్ల కలక్షన్స్ మాత్రమే సాధించింది. దీంతో మూడు రోజుల్లో కేవలం రూ. 42.75 కోట్లకే పరిమితమైంది. అయితే ప్రపంచవ్యాప్తంగా చూస్తే రెండో రోజుల్లోనే రూ.89.32 కోట్ల వసూళ్లు సాధించినట్లు మూవీ టీమ్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.
కాగా.. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై నిర్మించారు. దాదాపు రూ.350 కోట్లతో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అయితే బాక్సాఫీస్ వద్ద అంచనాలన్నీ తలకిందులయ్యాయి. సూర్య కెరీర్‌లోనే హైయ్యెస్ట్ బడ్జెట్ చిత్రంగా కంగువా నిలిచింది. ఈ మూవీ విడుదలైన మూడు రోజులైనప్పటికీ ఇంకా రూ.100 కోట్ల మార్క్ చేరుకోకపోవడం ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురిచేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment