collections
-
కంగువా మరో డిజాస్టర్ కానుందా?.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లంటే!
కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన భారీ యాక్షన్ చిత్రం కంగువా. శివ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. అయితే మొదటి రోజే ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ రావడంతో కలెక్షన్లపై ప్రభావం పడింది. భారీ అంచనాల మధ్య రిలీజైన కంగువా తొలి రోజు కేవలం ఇండియావ్యాప్తంగా రూ.22 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది.ఆ తర్వాత రెండో రోజు కంగువా వసూళ్లు మరింత తగ్గిపోయాయి. రెండో రోజు కేవలం రూ. 9.25 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. శనివారం వీకెండ్ కూడా కంగువాకు కలిసిరాలేదు. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 9.50 కోట్ల కలక్షన్స్ మాత్రమే సాధించింది. దీంతో మూడు రోజుల్లో కేవలం రూ. 42.75 కోట్లకే పరిమితమైంది. అయితే ప్రపంచవ్యాప్తంగా చూస్తే రెండో రోజుల్లోనే రూ.89.32 కోట్ల వసూళ్లు సాధించినట్లు మూవీ టీమ్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.కాగా.. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై నిర్మించారు. దాదాపు రూ.350 కోట్లతో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అయితే బాక్సాఫీస్ వద్ద అంచనాలన్నీ తలకిందులయ్యాయి. సూర్య కెరీర్లోనే హైయ్యెస్ట్ బడ్జెట్ చిత్రంగా కంగువా నిలిచింది. ఈ మూవీ విడుదలైన మూడు రోజులైనప్పటికీ ఇంకా రూ.100 కోట్ల మార్క్ చేరుకోకపోవడం ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. -
బాక్సాఫీస్ వద్ద కంగువా.. మొదటి రోజు షాకింగ్ కలెక్షన్స్!
కోలీవుడ్ స్టార్స్ సూర్య ఫ్యాన్స్ చాలా రోజుల నిరీక్షణకు తెరపడింది. దసరాకు రావాల్సిన కంగువా నెల రోజుల ఆలస్యమైనప్పటికీ ఎట్టకేలకు బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. అభిమానుల భారీ అంచనాల మధ్య నవంబర్ 14 ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. శివ దర్శకత్వంలో వచ్చిన ఈ భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రం కంగువా తొలిరోజే మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది.అయితే కంగువాపై మొదటి నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే మొదటి రోజే కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందని డిసైడ్ అయిపోయారు. సూర్య కెరీర్లో భారీ బడ్జెట్ చిత్రం కావడంతో వసూళ్ల పరంగా పలు రికార్డులు బద్దలు కొడుతుందని భావించారు. కానీ తొలిరోజు వసూళ్లూ చూస్తే.. ఊహించనిదానికి భిన్నంగా వచ్చినట్లు కనిపిస్తోంది. ఇంతకీ కంగువా అంచనాలను మించి రాణించిందా? లేదా అన్నది కలెక్షన్స్ చూస్తే తెలిసిపోతుంది.తాజా సమాచారం ప్రకారం తొలిరోజు ఇండియా వ్యాప్తంగా రూ.22 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. దీంతో సూర్య కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్స్‌గా కంగువా నిలిచింది. గతంలో ఆయన నటించిన సింగం-2 తొలిరోజు రూ.12 కోట్ల నికర వసూళ్లు రాబట్టింది. తాజాగా కంగువా ఆ రికార్డ్‌ను అధిగమించింది. ఇక దేశవ్యాప్తంగా థియేటర్లన్నీ తొలిరోజు 40శాతం ఆక్సుపెన్సీతో నడిచినట్లు ఓ నివేదిక వెల్లడించింది. ఇటీవల విడుదలైన రజినీకాంత్ వేట్టయాన్, విజయ్ ది గోట్ చిత్రాలు మొదటిరోజు 50 నుంచి 60శాతం ఆక్సుపెన్సీతో నడిచాయి.అయితే వసూళ్ల పరంగా చూస్తే కంగువా కోలీవుడ్‌లో మూడోస్థానంలో నిలిచింది. ఈ ఏడాది అత్యధిక వసూళ్ల జాబితాలో ది గోట్, వెట్టయాన్ చిత్రాలను అధిగమించలేకపోయింది. మొదటి రోజే అంచనాలను అందుకోవడంతో కంగువా విఫలమైందని కోలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. సూర్య అత్యధిక భారీ బడ్జెట్ చిత్రం(రూ.350 కోట్లు) కావడంతో అంచనాలు కూడా అదేస్థాయిలో నెలకొన్నాయి. మరి రాబోయే రోజుల్లో కంగువా కాసుల వర్షం కురిపిస్తుందేమో వేచి చూడాల్సిందే. కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, దిశాపటానీ, యోగిబాబు కీలక పాత్రల్లో నటించారు.కోలీవుడ్‌లో ఓపెనింగ్ డే కలెక్షన్స్-2024ది గోట్- రూ.39.15 కోట్లువేట్టయాన్- రూ.27.75 కోట్లుకంగువా- రూ.22 కోట్లుఅమరన్- రూ.17 కోట్లుఇండియన్2- రూ.16.5 కోట్లుతంగలాన్- రూ.12.4 కోట్లురాయన్- రూ.11.85 కోట్లుకెప్టెన్ మిల్లర్- రూ.8.05 కోట్లుకల్కి 2898 ఏడీ- రూ.4.5 కోట్లుఅరణ్మనై 4- రూ.4.15 కోట్లు -
అమరన్ మూవీ.. ఆరు రోజుల్లోనే ఆ మార్కు దాటేసింది!
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం అమరన్. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ చిత్రానికి మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా బెస్ట్ ఓపెనింగ్స్ నమోదు చేసింది. అమరన్ కేవలం ఆరు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. కాగా.. ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. మొదటి రోజే రూ.21 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం ఆరు రోజుల్లో రూ.102 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.అమరన్‌లో మేజర్ ముకుంద్ పాత్రలో శివ కార్తికేయన్ కనిపించగా.. ఆయన భార్యగా ఇందు పాత్రలో సాయిపల్లవి నటించింది. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న థియేటర్లలోకి వచ్చిన అమరన్.. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటికే గ్రాస్ కలెక్షన్ల పరంగా ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల క్లబ్లో చేరేందుకు సిద్ధంగా ఉంది. ఈ వారంలో ఆ రికార్డ్‌ను అధిగమించే అవకాశముంది.కాగా.. ఈ చిత్రాన్ని మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కించారు. 2014లో కాశ్మీర్‌లోని షోపియాన్‌లో జరిగిన ఉగ్రదాడిలో మేజర్ ముకుంద్ అమరుడయ్యారు. ఆయన జీవితాన్ని అమరన్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమాను రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. -
శివ కార్తికేయన్ అమరన్.. తొలి రోజే రజనీకాంత్ సినిమాను దాటేసింది!
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం 'అమరన్'. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న అమరన్ థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబడుతోంది.తొలిరోజే దేశవ్యాప్తంగా రూ.21 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించింది. ఒక్క తమిళనాడులోనే ఏకంగా రూ.15 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ రోజు తమిళనాడులో సెలవుదినం కావడంతో రెండో రోజు వసూళ్లు మరింత పెరిగే అవకాశముంది. తమిళ వర్షన్లో మొదటి రోజు థియేటర్లలో 77.94 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. (ఇది చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 15 సినిమాలు)రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన అమరన్ అంచనాలకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద రాణిస్తోంది. అయితే విజయ్ ది గోట్, రజనీకాంత్ వేట్టయాన్ చిత్రాల మొదటి రోజు కలెక్షన్లను మాత్రం అధిగమించలేకపోయింది. అయితే తమిళనాడులో కమల్ హాసన్ చిత్రం ఇండియన్ -2 ఓపెనింగ్ డే కలెక్షన్స్‌ను దాటేసింది. కాగా.. ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాను ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్: ట్రూ స్టోరీస్ ఆఫ్ మోడరన్ మిలిటరీ హీరోస్ అనే పుస్తక ఆధారంగా తెరకెక్కించారు. -
రవాణాలో భారీగా రామప్రసాదం
‘అయ్యవారికి చాలు ఐదు వరహాలు..! పిల్లలకు చాలు పప్పు బెల్లాలు..!’ అంటూ దసరా పాట ఒకప్పుడు వినిపించేది. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేకున్నా రవాణా శాఖలో కొత్త పాట వినిపిస్తోంది. ‘అయ్యగారికి చాలు 10 కోట్ల రూపాయలు..!’ అని అంటున్నారు!! అన్నట్టుగానే బదిలీలకు ముడుపులు వసూలు చేసి కీలక నేతకు సమర్పించారు. రవాణా శాఖ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ఏకంగా కీలక నేతే స్వయంగా ఉన్నతాధికారులకు ఫోన్లు చేసి మరీ మీ పోస్టులు ఉండాలంటే ముడుపులు చెల్లించాలని హుకుం జారీ చేయడం.. వసూళ్ల కోసం ఏకంగా ముగ్గురు అధికారులను వినియోగించడం విభ్రాంతి కలిగిస్తోంది. – సాక్షి, అమరావతిపోస్టు ఉండాలంటే ముడుపులు చెల్లించాల్సిందే రవాణా శాఖలో ఉన్నతాధికారుల బదిలీల్లో భారీగా వసూళ్లకు పాల్పడ్డారు. ప్రధానంగా జిల్లా రవాణా శాఖ అధికారులు (డీటీసీ), ఆర్టీవోల బదిలీల్లో భారీ దందా సాగింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రవాణా శాఖలో కీలక నేత ఉన్నతాధికారుల బదిలీల పేరిట హైడ్రామాకు తెరతీశారు. ప్రాధాన్యమున్న కేంద్రాల్లో పోస్టులు కావాలంటే భారీగా సమర్పించుకోవాలని తేల్చి చెప్పారు.ప్రస్తుతం ఉన్న పోస్టుల్లో కొనసాగాలన్నా... ప్రాధాన్యత పోస్టులకు బదిలీ కావాలన్నా పేషీకి ముడుపులు సమర్పించుకోవల్సిందేనని.. లేదంటే శంకరగిరి మాన్యాలు తప్పవని సెలవిచ్చారు. అందుకోసం రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలోని ముగ్గురు అధికారులకు బాధ్యతలు అప్పగించారు. పోస్టింగ్ కేంద్రాన్ని బట్టి డీటీసీ పోస్టుకు రూ.25 లక్షలు, ఆర్టీవో పోస్టుకు రూ.10 లక్షల చొప్పున వసూలు చేసి మొత్తంగా రూ.10 కోట్లు వరకు కీలక నేత పేషీకి సమర్పించారు. ముడుపులు ఇవ్వని ముగ్గురిపై వేటు కీలక నేత పేషీ నుంచి ఫోన్లు చేసినా ముగ్గురు డీటీసీలు ముడుపులు ఇచ్చేందుకు నిరాకరించారు. తమకు ఎక్కడ పోస్టింగు ఇచ్చినా విధులు నిర్వహిస్తామని, ముడుపులు ఇవ్వలేమని డీటీసీలు పురేంద్ర, రాజారత్నం, మీరా ప్రసాద్ చెప్పినట్టు సమాచారం. దాంతో ఆ ముగ్గురిపై బదిలీ వేటు వేశారు. వారికి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా రవాణా శాఖ ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేయడం గమనార్హం. సీనియర్ అధికారిపై కక్ష సాధింపు.. రవాణా శాఖలో కమిషనర్ తరువాత అత్యంత కీలకమైన అదనపు కమిషనర్ పోస్టు ప్రస్తుతం ఖాళీగా ఉంది. నిబంధనల ప్రకారం సీనియారిటీలో మొదటి స్థానంలో ఉన్న జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్(జేటీసీ) రమాశ్రీకి ఆ పోస్టు ఇవ్వాలి. సర్వీసు రికార్డులో ఆమెపై ఎలాంటి ఫిర్యాదులు కూడా లేవు. అయితే ఆమెను అదనపు కమిషనర్‌గా నియమించేందుకు మంత్రి పేషీ ససేమిరా అంది. నిబంధనల మేరకు వ్యవహరించే ఆమె కీలక స్థానంలో ఉంటే తమ అక్రమాలకు సాగవని భావించింది. ఈ నేపథ్యంలో రమాశ్రీని హఠాత్తుగా విశాఖ జేటీసీగా బదిలీ చేసి ఆమె కంటే జూనియర్ అధికారి వద్ద రిపోర్ట్ చేయాలని ఆదేశించడం గమనార్హం. భారీ అవినీతికి రంగం సిద్ధం చేస్తున్న కీలక నేత అందుకు వత్తాసు పలికే అధికారులను ప్రత్యేకంగా ఎంపిక చేసుకుంటున్నారని రవాణా శాఖ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. -
రజినీకాంత్ వేట్టయాన్.. నాలుగు రోజుల్లోనే రికార్డ్!
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం వేట్టయాన్. టీజే జ్ఞానవేల్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం దసరా సందర్భంగా థియేటర్లలోకి వచ్చింది. ఈనెల 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాగా.. తొలిరోజే మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది.విడుదలైన నాలుగు రోజుల్లోనే రికార్డ్ స్థాయి వసూళ్లు సాధించింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 240 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అదేవిధంగా రూ.104.75 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో రజినీ కెరీర్లో రూ.200 కోట్ల క్లబ్లో చేరిన ఏడో చిత్రంగా వేట్టయాన్ నిలిచింది. అంతకుముందు తలైవా చిత్రాలైన పెట్టా, దర్బార్, ఎంథిరన్, కబాలి, జైలర్, రోబో 2.0 చిత్రాలు రూ.200 కోట్ల క్లబ్లో చేరాయి. కాగా.. ఈ ఏడాదిలో రజినీకాంత్ నటించిన జైలర్ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.605 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఇదో జోరు కొనసాగితే మరికొద్ది రోజుల్లోనే పెట్టా (రూ. 223 కోట్లు), దర్బార్ (రూ. 226 కోట్లు) చిత్రాలను వేట్టయాన్ అధిగమించనుంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతమందించారు. కాగా.. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ హీరో రానా కీలక పాత్రలు పోషించారు. -
'కలెక్షన్స్ వచ్చాయని చెబుతున్నా నమ్మట్లేదు'.. దేవరపై నాగవంశీ కామెంట్స్
జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ యాక్షన్ చిత్రం దేవర పార్ట్-1. ఇటీవల థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.అయితే దేవర కలెక్షన్స్‌పై టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ మూవీ ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. ఫ్యాన్స్ కోసమే మేము పెద్ద హీరోల సినిమాల వసూళ్లపై పోస్టర్స్ రిలీజ్ చేస్తామని తెలిపారు. అభిమానులు సంతోషంగా ఉంటేనే మాకు కూడా హ్యాపీగా ఉంటుందన్నారు. తొలిరోజు కలెక్షన్స్ గురించి మేము చెప్పిన నంబర్లను చాలామంది నమ్మలేదన్నారు. మేము డబ్బులు వచ్చాయని చెబుతున్నా మీరు నమ్మట్లేదని అన్నారు. దేవర కలెక్షన్స్ నిజమేనా? అని మీడియా ప్రతినిధులు అడగ్గా ఆయన ఇలా సమాధానమిచ్చారు.నాగవంశీ మాట్లాడుతూ.. 'దేవర మిడ్నైట్ షో సినిమాకు ప్లస్ అయినట్టే. దేవర వల్ల నాకొక విషయం తెలిసింది. మిడ్నైట్ షోలో టాక్ ఎలా ఉన్నా.. కథ బాగుంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారు. గుంటూరు కారంతోనూ అదే జరిగింది. దేవరకు అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ వచ్చింది తెలుగు రాష్ట్రాల నుంచే. మేం ఒరిజినల్ నంబర్స్ మాత్రమే ఇచ్చాం. సినిమా కలెక్షన్స్ గురించి పోస్టర్లు వేసేది ఫ్యాన్స్ కోసమే. ఈ కల్చర్ హాలీవుడ్‌లోనూ ఉంది. కలెక్షన్స్‌పై ఇన్కమ్ ట్యాక్స్ వాళ్లు కూడా ఫుల్ క్లారిటీతో ఉన్నారు. దేవర సెలబ్రేషన్స్‌ని విదేశాల్లో ప్లాన్ చేశానని వార్తలొస్తున్నాయి. అందులో నిజం లేదని' చెప్పారు. -
తగ్గేదేలే అంటోన్న దేవర.. పది రోజుల్లో ఎన్ని కోట్లంటే?
జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన యాక్షన్ చిత్రం దేవర. సెప్టెంబర్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం తొలి రోజే బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ప్రీమియర్ షోలతో కలిపి మొదటి రోజే రూ.170 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక ఇప్పటికే దసరా సెలవులు రావడంతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.దేవర విడుదలైన పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.466 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని దేవర టీమ్ ట్విటర్ ద్వారా షేర్ చేసింది.మరోవైపు నార్త్ అమెరికాలోనూ సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఇప్పటివరకు 5.8 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ రాబట్టింది. త్వరలోనే ఆరు మిలియన్లకు చేరుకోనుంది. ఇక వరుసగా దసరా సెలవులు ఉండడంతో త్వరలోనే రూ.500 కోట్ల మార్క్‌ను దాటేయనుంది.కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో మెప్పించారు. దేవరలో శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. కాగా.. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. -
బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న దేవర.. వారం రోజుల్లో ఎన్ని కోట్లంటే?
జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ డైరెక్షన్లో యాక్షన్ చిత్రం దేవర పార్ట్-1. జనతా గ్యారేజ్ తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే మొదటి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ సృష్టించింది. తొలిరోజే రూ.170 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.(ఇది చదవండి: దేవర అభిమానులకు అదిరిపోయే శుభవార్త)దేవర రిలీజై అప్పుడే వారం రోజులు పూర్తి చేసుకుంది. వీక్ డేస్‌లోనూ దేవరకు ఏమాత్రం క్రేజ్ తగ్గట్లేదు. విడుదలైన వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.405 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. సౌత్‌తో పాటు బాలీవుడ్‌లోనూ దేవరకు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఇదే జోరు కొనసాగితే మరికొద్ది రోజుల్లోనే రూ.500 కోట్ల మార్క్ చేరుకోనుంది. కాగా.. ఈచిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో మెప్పించారు. He’s the Dark Cloud of FEAR looming over all rivals 🔥See it. Feel it. Fear it in Cinemas now.#Devara #DevaraBlockbuster pic.twitter.com/v707pr9GGZ— Devara (@DevaraMovie) October 4, 2024 -
బాక్సాఫీస్ వద్ద దేవర దూకుడు.. ఆరు రోజుల్లోనే ఎన్ని కోట్లంటే?
యంగ్ టైగర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన యాక్షన్ చిత్రం దేవర పార్ట్-1. ఈ పాన్ ఇండియా చిత్రం అభిమానుల భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. మొదటి రూ.170 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన దేవర.. ఆరో రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.396 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసింది.ఈ విషయాన్ని దేవర చిత్ర బృందం ఎక్స్ వేదికగా పంచుకుంది. అక్టోబర్ 2న గాంధీ జయంతి కావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్లింది. కేవలం ఆరు రోజుల్లోనే ఇండియా వ్యాప్తంగా రూ.207.85 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. అంతే కాకుండా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మాత్రమే రూ.45.87 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మొదటి వారంలోనే మూడు వందల కోట్ల మార్క్ దాటిపోవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇదే రోజు కొనసాగితే త్వరలోనే రూ.500 కోట్ల క్లబ్లో దేవర చేరడం ఖాయంగా కనిపిస్తోంది.(ఇది చదవండి: ఇలాంటి నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం: అల్లు అర్జున్, వెంకటేశ్)కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ద్వారానే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో కనిపించారు.BIZ JUMPS ON WEDNESDAY... A national holiday can significantly impact #Boxoffice numbers, provided the film has merits... The #JrNTR-starrer #Devara makes a big splash on Wednesday, capitalizing on the #GandhiJayanti holiday, further solidifying its status.The numbers of… pic.twitter.com/LdUycX7PPq— taran adarsh (@taran_adarsh) October 3, 2024 It’s his Brutal Massacre…Box office is left shattered and bleeding 🔥#Devara #BlockbusterDevara pic.twitter.com/4kjvrQpUYo— Devara (@DevaraMovie) October 3, 2024 -
సెప్టెంబర్‌లో జీఎస్టీ వసూళ్లు ఎంతంటే..
అక్టోబర్ 1న విడుదలైన ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. భారతదేశ వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు సెప్టెంబర్‌లో రూ. 1.73 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో (2023 సెప్టెంబర్) జీఎస్టీ వసూళ్లు మొత్తం 1.62 లక్షల కోట్లు.2023 సెప్టెంబర్ కంటే కూడా 2024 సెప్టెంబర్‌లో జీఎస్టీ వసూళ్లు 6.5 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. 2024 ఆగస్టులో జీఎస్టీ వసూళ్లు 1.75 లక్షల కోట్లు. గత నెలలో వ్యాపార కార్యకపాల ద్వారా ఆదాయం 5.9 శాతం (రూ.1.27 లక్షల కోట్లు) పెరిగింది. వస్తువుల దిగుమతుల ద్వారా కూడా ఆదాయం 8 శాతం (రూ.45,390 కోట్లు) పెరిగింది. మొత్తం మీద గత ఏడాది సెప్టెంబర్ కంటే కూడా ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. -
మొదటిరోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన టాప్-10 ఇండియన్ సినిమాలు (ఫొటోలు)
-
Devara Day 1 Advance Booking: 60కోట్లు కొల్లగొట్టిన దేవర
-
బాక్సాఫీస్ షేక్ చేస్తోన్న చిన్న సినిమా.. ఏకంగా షారూక్ మూవీ రికార్డ్ బ్రేక్!
బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్, రాజ్‌కుమార్ రావు నటించిన చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఆగస్టు 15న థియేటర్లలో విడుదలైన హారర్ కామెడీ చిత్రం స్త్రీ 2 తాజాగా మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది. బాలీవుడ్లోనే దేశవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. మొదటిస్థానంలో ఉన్న షారూఖ్ ఖాన్ జవాన్ మూవీని అధిగమించి సరికొత్త రికార్డు సృష్టించింది.షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ చిత్రం జీవితకాల కలెక్షన్లను స్త్రీ-2 అధిగమించింది. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి జవాన్ రూ.640.25 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా.. హిందీలో మాత్రమే రూ.582.31 కోట్లు రాబట్టింది. ఈ ఏడాదిలో స్త్రీ-2 ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కేవలం హిందీలోనే రూ.586 కోట్ల వసూళ్లు సాధించినట్లు ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఈ విషయాన్ని స్ట్రీ 2 నిర్మాణ సంస్థ మడాక్ ఫిల్మ్స్ భారతదేశంలోనే 'ఆల్ టైమ్ నంబర్ వన్ హిందీ చిత్రం' అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.కాగా.. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన స్త్రీ 2లో వరుణ్ ధావన్, అక్షయ్ కుమార్ కూడా అతిథి పాత్రలు పోషించారు. గతంలో స్త్రీ (2018) చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపరశక్తి ఖురానా ప్రధాన పాత్రల్లో నటించారు. కాగా.. గతేడాది షారూక్- అట్లీ డైరెక్షన్లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ జవాన్ బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయి వసూళ్లు రాబట్టింది. -
శ్రద్ధాకపూర్ మూవీ రికార్డ్.. ఏకంగా యానిమల్‌ను దాటేసింది!
బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్, రాజ్‌కుమార్ రావు జంటగా నటించిన హారర్ కామెడీ చిత్రం స్త్రీ-2. ఆగస్టు 15న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే పలు రికార్డులు కొల్లగొట్టిన ఈ మూవీ.. తాజాగా మరో మైలురాయిని అధిగమించింది. బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో రెండోస్థానంలో నిలిచింది. అంతేకాకుండా గతంలోనే టాలీవుడ్ మూవీ బాహుబలి ది బిగినింగ్ వసూళ్లను దాటిన స్త్రీ-2.. సందీప్ రెడ్డి వంగా చిత్రం యానిమల్ దేశవ్యాప్తంగా రాబట్టిన కలెక్షన్స్‌ను సైతం దాటేసింది.కాగా.. రణ్‌బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన యానిమల్ గతేడాది విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. కేవలం ఇండియా వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.553 కోట్లు వసూళ్లు సాధించింది. తాజాగా స్త్రీ-2 రూ.583 కోట్ల వసూళ్లతో యానిమల్ చిత్రాన్ని దాటేసింది. అంతేకాకుండా బాలీవుడ్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల్లో షారూఖ్ ఖాన్ జవాన్ (రూ.640 కోట్లు) తర్వాత రెండోస్థానంలో నిలిచింది. (ఇది చదవండి: బాహుబలిని దాటేసిన చిన్న సినిమా.. జవాన్‌పై గురి!)అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కేవలం కంటెంట్‌తోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆగస్టు 15న విడుదలైన ఈ హారర్ కామెడీ సినిమా.. బాలీవుడ్లో స్టార్ హీరోల చిత్రాలకు గట్టి పోటీ ఇచ్చింది. శ్రద్ధాకపూర్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. -
తగ్గిన జీఎస్టీ ఆదాయం
‘ఎన్నికల ముందు నా అనుభవంతో సంపద సృష్టిస్తా’ అన్న చంద్రబాబు.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొత్తగా ఒక రూపాయి ఆదాయం కూడా సృష్టించలేకపోయారు. రాష్ట్రంలో వాణిజ్య కార్యకలాపాలైతే పూర్తిగా క్షీణించాయి. గత రెండు నెలలుగా నమోదవుతున్న జీఎస్టీ వసూళ్ల గణాంకాలే ఇందుకు నిదర్శనం. చంద్రబాబు సీఎంగా అధికారం చేపట్టిన తర్వాత వరుసగా రెండో నెలలో కూడా జీఎస్టీ ఆదాయం నేలచూపులు చూసింది. గతేడాది ఆగస్టుతో పోల్చితే.. ఈ ఏడాది ఆగస్టులో జీఎస్టీ ఆదాయం 5 శాతం క్షీణించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. 2023 ఆగస్టులో రూ.3,479 కోట్లుగా ఉన్న రాష్ట్ర జీఎస్టీ ఆదాయం 2024 ఆగస్టులో 5 శాతం తగ్గి రూ.3,298 కోట్లకు పడిపోయింది. మహారాష్ట్రలో 13 శాతం, కర్ణాటక 11 శాతం, ఒడిశా 11 శాతం, కేరళ 9 శాతం, తమిళనాడు 7 శాతం, తెలంగాణ రాష్ట్రాల్లో 4 శాతం చొప్పున వృద్ధి నమోదైతే.. ఒక్క ఏపీలో మాత్రమే జీఎస్టీ ఆదాయం తగ్గింది. జూలైలో కూడా ఏపీలో 7 శాతం క్షీణత నమోదైంది. – సాక్షి, అమరావతినాడు కోవిడ్ సంక్షోభంలోనూ రెండంకెల వృద్ధికోవిడ్ సంక్షోభం తర్వాత కూడా రాష్ట్రంలో జీఎస్టీ ఆదాయం పరుగులు తీసింది. జాతీయ సగటు వృద్ధి రేటు కంటే అధికంగా.. రెండంకెల వృద్ధిని నమోదు చేస్తూ వచ్చింది. 2019–20లో రూ.28,241.33 కోట్లుగా ఉన్న జీఎస్టీ ఆదాయం.. కోవిడ్ సంక్షోభం ఉన్నా కూడా ఐదేళ్ల కాలంలో 2023–24 నాటికి 59.35 శాతం వృద్ధితో రూ.45,002.73 కోట్లకు చేరింది. అంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో సగటున జీఎస్టీ ఆదాయం ఏడాదికి 11.87 శాతం చొప్పున వృద్ధి చెందింది. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర జీఎస్టీ ఆదాయం ఏకంగా 15.86 శాతం వృద్ధిని నమోదు చేసి రూ.45,002.73 కోట్లుగా నమోదయ్యింది. ఈ ఏడాది మార్చి నెలలో 16 శాతం, ఏప్రిల్ 12 శాతం, మే నెలలో 15 శాతం వృద్ధిని నమోదు చేసిన ఏపీ.. కోవిడ్ తర్వాత తొలిసారిగా బాబు పాలనలో తిరోగమనం వైపు పరుగులు తీస్తోంది. బాబు నిర్వాకంతో కొనుగోలు శక్తి తగ్గుదల చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిపాలనను గాలికి వదిలేసి ప్రతిపక్షం మీద వేధింపులకే ప్రాధాన్యత ఇవ్వడంతో.. వాణిజ్య కార్యకలాపాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం వానాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని యార్డుల్లో భారీగా ఇసుక నిల్వలు ఉంచగా.. కూటమి పార్టీలు అధికారంలోకి రాగానే వాటిని దోచుకొని పక్క రాష్ట్రాలకు తరలించేశాయి. దీంతో ఇసుక కొరత ఏర్పడి రాష్ట్రంలో భవన నిర్మాణ కార్యకలాపాలు నిలిచిపోయాయి.ఇది జీఎస్టీ ఆదాయంపై గణనీయంగా ప్రభావం చూపిస్తోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అలాగే గత ప్రభుత్వం సంక్షేమ పథకాలతో ఎప్పటికç³్పుడు ప్రజల జేబుల్లో నగదు నింపడం ద్వారా కొనుగోలు శక్తిని పెంచేదని వారు గుర్తు చేస్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వం సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించడంతో ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిందని పేర్కొన్నారు.ఇది కూడా జీఎస్టీ ఆదాయం తగ్గడానికి ముఖ్య కారణమని వెల్లడించారు. ప్రభుత్వ తీరుతో ఆదాయ వనరులు నేలచూపులు చూస్తున్నాయని.. ఇది రాష్ట్ర వృద్ధి రేటుపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
ది గోట్ మూవీకి షాకింగ్ కలెక్షన్స్.. వారం రోజుల్లో ఎన్ని కోట్లంటే?
కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ స్పై థ్రిల్లర్ ది గోట్. వెంకట్ ప్రభు డైరెక్షన్లో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లతో దూసుకెళ్తోంది. తాజాగా ఈ మూవీ దేశవ్యాప్తంగా వారం రోజుల్లోనే రూ. 170.75 కోట్లకు పైగా నికర వసూళ్లు సాధించింది. దీంతో త్వరలోనే రూ.200 కోట్ల మార్కును చేరుకోనుంది. మొదటి రోజు రూ.44 కోట్లు రాబట్టిన ది గోట్.. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించింది. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజే అత్యధికంగా రూ.126 కోట్లు గ్రాస్ వసూళ్లు సాధించింది. కానీ లియో రికార్డ్‌ను మాత్రం అధిగమించలేకపోయింది. రాజకీయాలకు ముందు విజయ్ నటించిన చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రంలో విజయ్ ద్విపాత్రాభినయం చేశారు. తండ్రీకొడుకులుగా విజయ్ అభిమానులను అలరించారు. ఇందులో హీరోయిన్గా మీనాక్షి చౌదరి నటించింది. ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, అజ్మల్ అమీర్, వైభవ్, లైలా, మోహన్, అరవింద్ ఆకాష్, అజయ్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
కలిసొచ్చిన వినాయక చవితి.. ది గోట్ కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?
కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ తాజా చిత్రం ది గోట్. వెంకట్ ప్రభు డైరెక్షన్లో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకొచ్చింది. మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లతో దూసుకెళ్తోంది. శనివారం వినాయక చవితి రోజు బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల మార్క్‌ను అధిగమించింది. వీకెండ్ కావడంతో ఒక్క రోజే రూ.33 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది.విడుదలైన మూడో రోజే దేశవ్యాప్తంగా కలెక్షన్లలో రూ.100 కోట్ల మార్కును దాటేసింది. తొలిరోజు రూ.43 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ రాబట్టిన ది గోట్ చిత్రం రెండో రోజు రూ.25.5 కోట్లు వచ్చాయి. అయితే శనివారం వీకెండ్, వినాయకచవితి పండుగ కలిసి రావడంతో రూ.33 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో మూడు రోజుల్లోనే రూ.102.5 కోట్ల నెట్ వసూళ్లు కలెక్ట్ చేసింది. శనివారం తమిళంలో థియేటర్లలో 72.58 శాతం ఆక్యుపెన్సీతో నడిచాయి.ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మించారు. రాజకీయాల్లో పోటీకి ముందు విజయ్ నటించిన చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో విజయ్ ద్విపాత్రాభినయం చేశారు. తండ్రీకొడుకులుగా విజయ్ అభిమానులను అలరించారు. ఇందులో హీరోయిన్గా మీనాక్షి చౌదరి నటించింది. ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, అజ్మల్ అమీర్, వైభవ్, లైలా, మోహన్, అరవింద్ ఆకాష్, అజయ్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
రూ.500 కోట్ల క్లబ్లో చిన్న సినిమా.. ఏకంగా ఆ జాబితాలో టాప్!
బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ నటించిన హారర్-కామెడీ చిత్రం స్త్రీ-2 బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే పలు రికార్డులు సృష్టించిన ఈ చిత్రం తాజాగా అరుదైన క్లబ్లో చేరింది. ఆగస్టు 15న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం 22 రోజుల్లోనే రూ.502.9 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. షారూఖ్ ఖాన్ జవాన్ తర్వాత అత్యంత వేగంగా రూ.500 కోట్ల క్లబ్లో చేరిన చిత్రంగా నిలిచింది. త్వరలోనే గదర్-2 ఆల్ టైమ్ వసూళ్లను దాటేయనుంది. బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ నటించిన గదర్-2 బాక్సాఫీస్ వద్ద రూ. 525 కోట్లు నికర వసూళ్లు సాధించింది.అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన 'స్త్రీ 2 మొదటి రోజు నుంచే రికార్డ్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ రావడంతో దేశవ్యాప్తంగా ఈ ఏడాది రూ. 500 కోట్ల నికర వసూళ్లను సాధించిన తొలి బాలీవుడ్ సినిమాగా ఘనత సాధించింది. అయితే ఈ నెలలో బాలీవుడ్లో పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో మరిన్ని రికార్డులు బద్దలు కొట్టే అవకాశముంది. దేశవ్యాప్తంగా హిందీలో ఈ మూవీ కంటే ముందు జవాన్(రూ. 640 కోట్లు), పఠాన్(రూ.543 కోట్లు), యానిమల్(రూ.553 కోట్లు), గదర్-2 (రూ. 525 కోట్లు) ముందున్నాయి. -
విజయ్ ది గోట్ మూవీ.. తొలి రోజు ఊహించని కలెక్షన్స్!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం ది గోట్. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అభిమానుల భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 5న థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాలో విజయ్ సరసన గుంటూరు కారం భామ మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది. ఈ మూవీలో విజయ్ ద్విపాత్రాభినయం చేశారు. భారీ బడ్జెట్ సినిమా కావడంతో గోట్ అభిమానుల్లో మరింత అంచనాలు పెంచేసింది. టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఇండియన్-2 సినిమాను అధిగమించి రిలీజ్‌కు ముందే రికార్డ్ క్రియేట్ చేసింది.అంచనాలకు తగ్గట్టుగానే తొలిరోజు కలెక్షన్ల గోట్ దూసుకెళ్లింది. స్పై థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన గోట్ చిత్రానికి ఇండియాలో రూ.55 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాగా.. రూ.43 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. తమిళంలో రూ.38.3 కోట్లు, తెలుగులో రూ.3 కోట్లు, హిందీలో రూ.1.7 కోట్టు కలెక్ట్ చేసింది. మొదటి రోజు థియేటర్లలో 76.23 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించే అవకాశముంది. ఓవర్సీస్ కలెక్షన్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రాబోయే రోజుల్లోనూ ఇదే జోరు కొనసాగితే మరిన్నిరికార్డులు బద్దలు కొట్టనుంది. అయితే తొలిరోజు విజయ్ లియో చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.148.5 కోట్ల వసూళ్లు సాధించింది. ఆ రికార్డ్‌ను గోట్ అధిగమించలేకపోయింది. ఈ సినిమాను ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై దాదాపు రూ.380 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ విషయాన్ని నిర్మాత అర్చన కల్పతి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, స్నేహ, జయరామ్, లైలా, అజ్మల్ అమీర్ కీలక పాత్రలు పోషించారు. -
రిలీజ్‌కు ముందే రికార్డులు.. ఇండియన్-2ను అధిగమించిన విజయ్ చిత్రం!
కోలీవుడ్ స్టార్, దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం ది గోట్. ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. ఈ మూవీలో మీనాక్షి చౌదరి, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాగా.. బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది.తాజాగా అడ్వాన్స్ బుకింగ్‌లతో కమల్ హాసన్'ఇండియన్- 2' మూవీని అధిగమించి కొత్త రికార్డు సృష్టించింది. రిలీజ్‌కు ముందే అడ్వాన్స్ బుకింగ్‌తో రూ. 12.82 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. అంతకుముదు ఇండియన్-2 మూవీకి ముందస్తు బుకింగ్స్ ద్వారా రూ. 11.20 కోట్లు మాత్రమే వచ్చాయి. విడుదలకు ఇంకా ఒకరోజు సమయం ఉడండంతో మరిన్ని రికార్డులు కొల్లగొట్టే అవకాశముంది. కేవలం బాక్సాఫీస్ వద్ద ప్రీ టికెట్ బుకింగ్స్‌తోనే రూ.20 కోట్లకు పైగా బిజినెస్ జరగవచ్చని సినీ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొదటి రోజే అత్యధిక వసూళ్లతో ది గోట్ కోలీవుడ్‌లో రికార్డ్ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. విజయ్ చివరిసారిగా లియో చిత్రంలో నటించారు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది. -
వీకెండ్లో దూసుకెళ్లిన సరిపోదా శనివారం.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
నేచురల్ స్టార్- వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన యాక్షన్ చిత్రం సరిపోదా శనివారం. ఆగస్టు 29న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తొలి రోజే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల వర్షం కురుస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే దేశవ్యాప్తంగా రూ.23.35 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. శనివారం ఒక్కరోజే ఏకంగా రూ.9 కోట్లకు కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.52.18 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ విషయాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్ పోస్టర్ ద్వారా పంచుుకంది. కాదా.. ఇప్పటికే 1.5 మిలియన్ డాలర్లతో ఉత్తర అమెరికాలో తొలి బ్రేక్ ఈవెన్ సొంతం చేసుకుంది. దీంతో నాని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మొదటి రోజు రూ.9 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సరిపోదా శనివారం వీకెండ్లోనూ అదే జోరు కొనసాగించింది. ఈ మూవీ కమర్షియల్ హిట్ కావడంతో మేకర్స్ సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ ఎస్జే సూర్య కీలక పాత్ర పోషించారు. హీరోయిన్గా ప్రియాంక మోహన్ ఆకట్టుకుంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాలో అభిరామి, అదితి బాలన్, పి సాయి కుమార్, శుభలేఖ సుధాకర్, మురళీ శర్మ, అజయ్ ఘోష్ ముఖ్య పాత్రలు పోషించారు.Bhaga Bhaga Bhaga..Bhaga Bhaga Bhaga 🔥#SaripodhaaSanivaaram pic.twitter.com/zsVDRl772X— DVV Entertainment (@DVVMovies) September 1, 2024 -
సరిపోదా శనివారం బాక్సాఫీస్.. నాని మూవీకి ఊహించని కలెక్షన్స్!
నేచురల్ స్టార్ నాని, ప్రియాంక మోహన్ జంటగా నటించిన తాజా చిత్రం 'సరిపోదా శనివారం'. వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం ఆగస్టు 29న థియేటర్లలో రిలీజైంది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ సినిమాకు తొలిరోజు నుంచే తొలి ఆట నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దసరా, హాయ్ నాన్న చిత్రాలతో హిట్స్ కొట్టిన నాని తన ఖాతాలో మరో సూపర్‌హిట్ ఖాయమని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.అభిమానుల భారీ అంచనాల మధ్య విడుదలైన సరిపోదా శనివారం మూవీకి బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా కలెక్షన్స్ రాబట్టింది. గురువారం ఒక్క రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.24.11 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. కేవలం ఇండియాలోనే అత్యధికంగా రూ.12 కోట్ల నెట్ రాట్టింది. ఈ మూవీని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో సహా ఐదు భాషల్లో రిలీజ్ చేశారు మేకర్స్. కాగా.. ఈ చిత్రం కోలీవుడ్ సూపర్ స్టార్ ఎస్జే సూర్య కీలక పాత్రలో నటించాడు. అంతే కాకుండా అభిరామి, అదితి బాలన్, సాయి కుమార్, శుభలేఖ సుధాకర్, మురళీ శర్మ, అజయ్ ఘోష్ కూడా ప్రధాన పాత్రలు పోషించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీకి జేక్స్ బేజాయ్ సంగీతమందించారు. -
బాక్సాఫీస్ వద్ద అదే జోరు.. కేజీఎఫ్-2 రికార్డ్ బద్దలయ్యే ఛాన్స్!
శ్రద్ధాకపూర్, రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రల్లో వచ్చిన హారర్ కామెడీ చిత్రం స్త్రీ-2. ఆగస్టు 15న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ సినిమా రిలీజై 12 రోజులైనప్పటికీ కలెక్షన్స్ విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.589 కోట్ల గ్రాస్ వసూళ్ల సాధించింది. కేవలం ఇండియాలోనే రూ.498 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. రూ.422 కోట్ల నెట్ వసూళ్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఏకంగా రూ.20.2 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.విడుదలైన రెండోవారం మొదలైన స్త్రీ-2 చిత్రానికి థియేటర్లలో ఆదరణ దక్కించుకుంటోంది. హిందీ బాక్సాఫీస్ వద్ద కేజీఎఫ్-2 సాధించిన వసూళ్ల కంటే కేవలం 12 కోట్లు మాత్రమే వెనుకబడి ఉంది. ఇదే జోరు కొనసాగితే కొద్ది రోజుల్లోనే ఆ రికార్డ్‌ను బద్దలు కొట్టనుంది. ఈ చిత్రం త్వరలోనే అత్యధిక వసూళ్లు చేసిన ఆరో భారతీయ చిత్రంగా నిలవనుంది. మూడో వారాంతం నాటికి రూ.500 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబడుతుందని మేకర్స్ అంచనా వేస్తున్నారు. అమర్ కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో అపర్శక్తి ఖురానా, అభిషేక్ బెనర్జీ, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రలు పోషించారు. ఈ వారంలోనూ బాలీవుడ్లో పెద్ద సినిమాల రిలీజ్ లేకపోవడంతో స్త్రీ-2 ప్రభంజనం కొనసాగించే అవకాశముంది. ఆగస్ట్ 30న శుక్రవారం బీటౌన్‌లో బిగ్ స్టార్స్ చిత్రాలు ఏవీ రావడం లేదు. ఇది కూడా ఈ చిత్రానికి వసూళ్లుపరంగా కలిసి రానుంది. View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) -
తగ్గేదేలే.. దంగల్, అవతార్-2ను వెనక్కినెట్టిన స్త్రీ-2!
బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్, రాజ్ కుమార్ రావు జంటగా నటించిన చిత్రం స్త్రీ-2. ఆగస్టు 15న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఈ మూవీ విడుదలైన 11 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.560 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ దెబ్బతో బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమా రికార్డులను బద్దలు కొట్టింది. దేశవ్యాప్తంగా రూ.474 గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. రూ.402 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది.అమర్ కౌశిక్ దర్శకత్వంలో హారర్ కామెడీగా వచ్చిన స్త్రీ-2 రెండో వారాంతంలో అదిరిపోయే వసూళ్లు రాబట్టింది. బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. ఇండియావ్యాప్తంగా 'ఎవెంజర్స్: ఎండ్‌గేమ్' (రూ. 373.05 కోట్లు), 'జైలర్' (రూ. 348.55 కోట్లు), 'సంజు' (రూ. 342.57 కోట్లు), 'దంగల్' (రూ. 387.38 కోట్లు), 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' (రూ. 391.4 కోట్లు) చిత్రాలను అధిగమించింది.ఇదే జోరు కొనసాగితే త్వరలోనే సలార్ పార్ట్-1(రూ. 406.45 కోట్లు), 'బాహుబలి: ది బిగినింగ్' (రూ. 421 కోట్లు), '2.0' (రూ. 407.05 కోట్లు) వసూళ్లను దాటేయనుంది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా 'గదర్ 2' (రూ. 525.7 కోట్లు), 'పఠాన్' (రూ. 543.09 కోట్లు), 'యానిమల్' (రూ. 553.87 కోట్లు) చిత్రాల నెట్ కలెక్షన్స్‌ను అధిగమించే అవకాశముంది. కాగా.. ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, అపరశక్తి ఖురానా, అభిషేక్ బెనర్జీ, వరుణ్ ధావన్ కీలక పాత్రల్లో నటించారు. View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor)