తగ్గేదేలే అంటోన్న పుష్పరాజ్‌.. బాహుబలి -2 రికార్డ్ బ్రేక్ | Allu Arjun Pushpa 2 The Rule Crossed Rajamouli Bahubali 2 All Time collections | Sakshi
Sakshi News home page

Pushpa 2 The Rule Collections: తగ్గేదేలే అంటోన్న పుష్పరాజ్‌.. బాహుబలి -2 రికార్డ్ బ్రేక్

Published Mon, Jan 6 2025 4:24 PM | Last Updated on Mon, Jan 6 2025 5:10 PM

Allu Arjun Pushpa 2 The Rule Crossed Rajamouli Bahubali 2 All Time collections

బాక్సాఫీస్ వద్ద పుష్ప రాజ్‌ దాడి ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఈ సినిమా రిలీజై నెల రోజులు దాటినప్పటికీ వసూళ్ల విషయంలో మాత్రం తగ్గేదేలే అంటున్నాడు పుష్పరాజ్. ఇప్పటికే ఇండియన్ సినీ చరిత్రలోని మునుపెన్నడు లేని రికార్డులు సృష్టించింది. అత్యంత వేగంగా రూ.1000 కోట్లు సాధించిన చిత్రంగా పుష్ప-2 ది రూల్(pushpa 2 the rule) నిలిచిన సంగతి తెలిసిందే.

తాజాగా పుష్ప-2 మరో అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ విడుదలైన 32 రోజుల్లోనే రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి-2(bahubali-2) రికార్డ్‌ను అధిగమించింది. ప్రస్తుతం రూ.1831 కోట్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. అమిర్ ఖాన్  నటించిన దంగల్‌ మూవీ రూ.2 వేల కోట్లకు పైగా వసూళ్లతో మొదటిస్థానంలో ఉండగా.. ఆ తర్వాత బాహుబలి-2 (రూ.1810) కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఈ రికార్డ్‌ను పుష్ప-2 బ్రేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1831 కోట్లతో సెకండ్ ప్లేస్‌ను సొంతం చేసుకుంది. దీంతో రాజమౌళి బాహుబలి-2ను వెనక్కి నెట్టింది. ఈ విషయాన్ని పుష్ప టీమ్ ట్విటర్‌ ద్వారా వెల్లడించింది.

ఇండియాలో టాప్‌-8 చిత్రాలివే..

ఇండియన్‌ సినిమా చరిత్రలో ఇప్పటివరకు అమిర్ ఖాన్‌ దంగల్‌ మాత్రమే రూ.2 వేల కోట్ల మార్కును దాటింది. ఆ తర్వాత ప్లేస్‌లో అల్లు అర్జున్‌(Allu Arjun) పుష్ప- 2 ది రూల్ నిలిచింది. ఇక రాజమౌళి చిత్రం బాహుబలి -2 మూడో స్థానానికి పరిమితమైంది. తర్వాత వరుసగా ఆర్‌ఆర్‌ఆర్‌ (రూ.1387 కోట్లు), కన్నడ మూవీ కేజీయఫ్‌ -2 (రూ.1250 కోట్లు), ప్రభాస్ కల్కి 2898 ఏడీ (రూ.1153 కోట్లు), షారూఖ్ ఖాన్ నటించిన జవాన్‌ (రూ.1148 కోట్లు), పఠాన్‌ (రూ.1050 కోట్లు) చిత్రాలు ఉన్నాయి. వీటిలో టాలీవుడ్‌కు చెందిన నాలుగు సినిమాలు ఉండడం మరో విశేషం.

(ఇది చదవండి: అల్లు అర్జున్‌కు మరోసారి పోలీసుల నోటీసులు)

హిందీలో పుష్ప-2 సరికొత్త రికార్డ్..

అల్లు అర్జున్‌ -సుకుమార్‌ కాంబోలో తెరకెక్కించిన పుష్ప- 2 హిందీలో తిరుగులేని వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రూ.800 కోట్లకు నెట్ వసూళ్లతో దూసుకెళ్తోంది. రిలీజైన మొదటి రోజు నుంచే నార్త్‌లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. నార్త్‌లో అత్యంత వేగంగా రూ.100 కోట్లు  వసూళ్లు చేసిన మూవీగా పుష్ప-2 రికార్డ్ క్రియేట్ చేసింది. వందేళ్ల ఏళ్ల హిందీ సినీ పరిశ్రమ చరిత్రలో కేవలం 15 రోజుల్లోనే రూ. 632 కోట్లు నెట్ వసూళ్లు రాబట్టింది.

పుష్ప-2 ఓటీటీకి ఎప్పుడంటే..

బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కావడంతో పుష్ప-2 ఓటీటీపై సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ మూవీ ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు టాక్ వినిపిస్తోంది. రిలీజ్‌కు ముందే దాదాపు రూ.1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు వార్తలొచ్చాయి. గతంలోనే ఓటీటీ విడుదల తేదీపై పుష్ప టీమ్ క్లారిటీ ఇచ్చింది. పుష్ప-2 రిలీజైన 56 రోజుల తర్వాత మాత్రమే ఓటీటీకి రానుందని పుష్ప మేకర్స్ ప్రకటించారు.

కాగా..2021లో వచ్చిన పుష్పకు సీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కించిన పుష్ప పార్ట్‌-1 బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ విజయంతో పుష్పకు సీక్వెల్‌గా పుష్ప-2 ది రూల్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్‌ మరోసారి కీలక పాత్ర పోషించాడు.

(ఇది చదవండి: గేమ్ ఛేంజర్‌తో పోటీ పడనున్న మూవీ.. మహేశ్‌ బాబు చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement