అల్లు అర్జున్ పుష్ప-2 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లను ఊపేస్తోంది. ఈనెల 5న రిలీజైన ఈ సినిమాకు మొదటి రోజే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కించిన ఈ సినిమా మాస్ ఆడియన్స్‌ను తెగ మెప్పిస్తోంది. పుష్పరాజ్.. తగ్గేదేలే అంటూ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. ఎక్కడ చూసినా సరే థియేటర్స్ దగ్గర హౌస్‌ఫుల్ బోర్డులే దర్శనిస్తున్నాయి.
మొదటి రోజే కలెక్షన్స్‌లో పుష్పరాజ్ సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. ఏకంగా రూ.294 కోట్ల గ్రాస్ వసూళ్లతో తిరుగులేని రికార్డ్‌ను సాధించింది. రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ రికార్డ్‌ను బద్దలు కొట్టింది. ఇప్పటికే కేవలం హిందీలోనే రూ.72 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో బాలీవుడ్‌లోనే ఫస్ట్ డే అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీగా నిలిచింది.
అయితే తాజాగా పుష్ప-2 మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది. నైజాంలో మొదటి రోజే 30 కోట్ల షేర్ వసూళ్లు సాధించినట్లు పుష్ప టీమ్ వెల్లడించింది. ఈ మేరకు పుష్ప-2 పోస్టర్‌ను విడుదల చేసింది. నైజాం రీజియన్‌లో ఒపెనింగ్ డే ఆల్‌టైమ్ రికార్డ్‌తో బిగ్గెస్ట్ మూవీగా నిలిచింది. దీంతో బన్నీ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు.
భారతీయ సినీ చరిత్రలో పుష్ప రికార్డ్
భారతీయ సినీ చరిత్రలో అతి పెద్ద ఓపెనర్‌గా పుష్ప2 రికార్డ్ క్రియేట్ చేసింది. బన్నీ దెబ్బకు టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు వరకు ఉన్న టాప్ రికార్డ్స్ అన్నీ చెల్లా చెదురయ్యాయి. ఇప్పటి వరకు ఫస్ట్ డే నాడు అత్యధిక కలెక్షన్స్ సాధించిన ఇండియన్ చిత్రాల జాబితాలో ఆర్‌ఆర్‌ఆర్ ఉండేది.. ఇప్పుడు ఆ రికార్డ్‌ను బీట్ చేస్తూ పుష్ప2 రూ. 294 కోట్ల కలెక్షన్లతో ప్రథమ స్థానంలో ఉంది. రెండో స్థానంలో ఆర్‌ఆర్‌ఆర్ ( రూ. 223 కోట్లు), మూడో స్థానంలో 'బాహుబలి2' (రూ.214 కోట్లు) ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా కల్కి 2898AD (రూ. 191 కోట్లు),సలార్ (రూ. 178 కోట్లు), దేవర (రూ. 172 కోట్లు), కేజీఎఫ్2 (రూ. 160 కోట్లు),లియో (రూ. 148 కోట్లు), ఆదిపురుష్ (రూ. 140 కోట్లు), సాహో (రూ. 130 కోట్లు), జవాన్ (రూ. 129.5 కోట్లు) ఉన్నాయి.
ALL TIME RECORD in Nizam ❤️🔥
WILDFIRE BLOCKBUSTER #Pushpa2TheRule collects a share of 30 CRORES on Day 1 making it the biggest opener in the region 💥💥#RecordRapaRapAA 🔥#Pushpa2BiggestIndianOpener RULING IN CINEMAS
Book your tickets now!
🎟️ https://t.co/eJusnmNS6Y… pic.twitter.com/Xqt3Mmzw5g— Pushpa (@PushpaMovie) December 6, 2024
Comments
Please login to add a commentAdd a comment