Nizam
-
Pushpa 2: పుష్ప-2 ప్రభంజనం.. నైజాంలో తొలిరోజే ఆల్ టైమ్ రికార్డ్!
అల్లు అర్జున్ పుష్ప-2 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లను ఊపేస్తోంది. ఈనెల 5న రిలీజైన ఈ సినిమాకు మొదటి రోజే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ సినిమా మాస్ ఆడియన్స్‌ను తెగ మెప్పిస్తోంది. పుష్పరాజ్.. తగ్గేదేలే అంటూ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. ఎక్కడ చూసినా సరే థియేటర్స్ దగ్గర హౌస్‌ఫుల్ బోర్డులే దర్శనిస్తున్నాయి.మొదటి రోజే కలెక్షన్స్‌లో పుష్పరాజ్ సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. ఏకంగా రూ.294 కోట్ల గ్రాస్ వసూళ్లతో తిరుగులేని రికార్డ్‌ను సాధించింది. రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ రికార్డ్‌ను బద్దలు కొట్టింది. ఇప్పటికే కేవలం హిందీలోనే రూ.72 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో బాలీవుడ్లోనే ఫస్ట్ డే అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీగా నిలిచింది.అయితే తాజాగా పుష్ప-2 మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది. నైజాంలో మొదటి రోజే 30 కోట్ల షేర్ వసూళ్లు సాధించినట్లు పుష్ప టీమ్ వెల్లడించింది. ఈ మేరకు పుష్ప-2 పోస్టర్‌ను విడుదల చేసింది. నైజాం రీజియన్‌లో ఒపెనింగ్ డే ఆల్‌టైమ్ రికార్డ్‌తో బిగ్గెస్ట్ మూవీగా నిలిచింది. దీంతో బన్నీ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు.భారతీయ సినీ చరిత్రలో పుష్ప రికార్డ్భారతీయ సినీ చరిత్రలో అతి పెద్ద ఓపెనర్‌గా పుష్ప2 రికార్డ్ క్రియేట్ చేసింది. బన్నీ దెబ్బకు టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు వరకు ఉన్న టాప్ రికార్డ్స్ అన్నీ చెల్లా చెదురయ్యాయి. ఇప్పటి వరకు ఫస్ట్ డే నాడు అత్యధిక కలెక్షన్స్ సాధించిన ఇండియన్ చిత్రాల జాబితాలో ఆర్ఆర్ఆర్ ఉండేది.. ఇప్పుడు ఆ రికార్డ్‌ను బీట్ చేస్తూ పుష్ప2 రూ. 294 కోట్ల కలెక్షన్లతో ప్రథమ స్థానంలో ఉంది. రెండో స్థానంలో ఆర్ఆర్ఆర్ ( రూ. 223 కోట్లు), మూడో స్థానంలో 'బాహుబలి2' (రూ.214 కోట్లు) ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా కల్కి 2898AD (రూ. 191 కోట్లు),సలార్ (రూ. 178 కోట్లు), దేవర (రూ. 172 కోట్లు), కేజీఎఫ్2 (రూ. 160 కోట్లు),లియో (రూ. 148 కోట్లు), ఆదిపురుష్ (రూ. 140 కోట్లు), సాహో (రూ. 130 కోట్లు), జవాన్ (రూ. 129.5 కోట్లు) ఉన్నాయి.ALL TIME RECORD in Nizam ❤️🔥WILDFIRE BLOCKBUSTER #Pushpa2TheRule collects a share of 30 CRORES on Day 1 making it the biggest opener in the region 💥💥#RecordRapaRapAA 🔥#Pushpa2BiggestIndianOpener RULING IN CINEMAS Book your tickets now!🎟️ https://t.co/eJusnmNS6Y… pic.twitter.com/Xqt3Mmzw5g— Pushpa (@PushpaMovie) December 6, 2024 -
కలెక్టర్ నిజాంను మించిపోయారు!
సాక్షి, హైదరాబాద్: భూములను కట్టబెట్టడంలో రంగారెడ్డి జిల్లా గత కలెక్టర్ నిజాం నవాబ్‌ను కూడా మించిపోయారని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. పేదలకు పంచడం కోసం రామచంద్రారెడ్డి దాదాపు 300 ఎకరాలు ఇచ్చారని, అందినకాడికి నొక్కిన అధికారులు వాటి స్వాహాకు సహకరించారని చెప్పింది. భూదాన్ భూములంటూ అప్పిలేట్ ట్రిబ్యునల్ అథారిటీగా ధ్రువీకరించిన వ్యక్తి.. జిల్లా కలెక్టర్‌గా వారసత్వ ధ్రువీకరణ పత్రం ఎలా జారీ చేస్తారని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. ఆరోపణలున్న అధికారులు కోర్టుకు సమాధానం చెప్పాల్సిందేనని స్పష్టం చేసింది. పీవీ నరసింహారావు లాంటి ఎందరో మహానుభావులు సీలింగ్ చట్టం వచ్చినప్పుడు వందల ఎకరాలు ఇచ్చేశారంది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామం సర్వే నం.182లో 10.29 ఎకరాలకు ఖాదర్ ఉన్నీసాకు వారసత్వ ధ్రువీకరణ పత్రం జారీ చేయడాన్ని సవాలు చేస్తూ నవాబ్ ఫారూక్ అలీఖాన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి గురువారం విచారణ చేపట్టారు. గతంలో భూదాన్ భూములపై ఆర్డీవో ఆదేశాలివ్వగా స్పెషల్ ట్రిబ్యునల్ సమరి్థంచిందని పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. దీనికి విరుద్ధంగా ఖాదర్ ఉన్నీసా ఇచ్చిన దరఖాస్తును కలెక్టర్ ఆమోదించి పాస్‌బుక్ కూడా జారీ చేశారని చెప్పారు. వాదనలను విన్న న్యాయమూర్తి.. భూదాన్ భూముల రక్షణకు అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎందరో మహానుభావులు ఇచ్చిన వందల ఎకరాలను అమ్ముకుని తినేశారని, భూదాన్ భూముల రక్షణలో గత బోర్డుతోపాటు అధికారులూ విఫలమయ్యారని చెప్పారు. భూదాన్ భూములకు సంబంధించిన వివాదం న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉండగా పట్టా పాస్‌బుక్ జారీ చేశారన్నారు. వారసత్వ ధ్రువీకరణ పత్రం ఎలా జారీ చేశారో కౌంటరు దాఖలు చేయాలని భూదాన్ యజ్ఞబోర్డు, రెవెన్యూ ముఖ్యకార్యదర్శి, నాటి కలెక్టర్ అమోయ్‌కుమార్‌కు నోటీసులు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఈ భూములపై యథాతథస్థితిని కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. -
నైజాం నుండే రికార్డ్స్ వేట మొదలుపెట్టనున్న దేవర..
-
చారిత్రక ఆనవాలుగా చార్మినార్ గడియారం
చార్మినార్: నిజాం కాలంలో నిర్మించిన చార్మినార్ కట్టడానికి నలువైపుల ఏర్పాటు చేసిన గడియారాల గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఈ నాలుగు గడియారాల్లో ఒకటి రిపేర్‌కి వచి్చంది. వాచ్‌లోని 4–5 అంకెల నడుమ సిరామిక్ మెటల్ పగిలిపోవడంతో 12 గంటల పాటు సమయం నిలిచిపోయింది. వెంటనే బాగు చేయించి అందుబాటులోకి తెచ్చారు. ఇక ఈ గడియారాల పనితీరును ఒకసారి పరిశీలిస్తే... నిజాం కాలంలో... నిజాం కాలంలో అంటే.. 1889లోనే చార్మినార్ కట్టడానికి నలువైపులా ఈ గడియారాన్ని నిర్మించారు. అప్పట్లో స్థానిక ప్రజలకు సమయం తెలియడం కోసం నిర్మించిన ఈ గడియారంలోని సెరామిక్ మెటల్ ఇటీవల పగిలిపోవడంతో దాదాపు 12 గంటల పాటు సమయం నిలిచిపో యింది. నాలుగింట్లో జీహెచ్‌యంసీ సర్దార్ మహాల్ భవనం (తూర్పు) వైపు ఉన్న ఈ గడియారం మొరాయించింది.1942 నుంచి వాహెద్ వాచ్ కంపెనీ పర్యవేక్షణలో... 1942 నుంచి లాడ్‌బజార్‌లోని వాహెద్ వాచ్ కంపెనీ యాజమాన్యం చార్మినార్ గడియారం పని తీరును పర్యవేక్షిస్తుంది. అప్పట్లో మోతీగల్లిలో ఉండే సికిందర్ ఖాన్ ఈ గడియారాలకు మరమ్మతులు, పర్యవేక్షణ బాధ్యతలను చూసే వారు. ఆయన మరణానంతరం 1962 నుంచి లాడ్బాజర్లోని గులాం మహ్మద్ రబ్బానీ మరమ్మతు పనులను చూస్తున్నారు.పావురాలు తిష్ట వేయడంతో..విషయం తెలిసిన వెంటనే చార్మినార్ కట్టడం కన్జర్వేషన్ క్యూరేటర్ రాజేశ్వరి సంబంధిత వాహెద్ వాచ్ కంపెనీ టెక్నీషియన్స్‌తో మరమ్మతులు చేయించడంతో సమయం తిరిగి అందుబాటులోకి వచ్చింది. గడియారాన్ని మూసి వేయడానికి అవకాశాలు లేకపోవడంతో అలాగే వదిలేశారు. దీంతో అప్పుడప్పుడు సమయం చూపించే ముల్లులపై పావురాలు కూర్చుంటుండడంతో వాటి బరువుకు సమస్యలు తలెత్తుతున్నాయని క్యూరేటర్ రాజేశ్వరి స్పష్టం చేశారు. నాలుగింట్లో చార్‌కమాన్ వైపు గంటల శబ్దం వినిపించే గడియారం.. ఐదు అడుగుల వ్యాసార్ధంతో గుండ్రంగా ఐరన్ మెటల్‌తో ఏర్పాటు చేశారు. లోపల సిరామిక్ మెటల్‌తో రూపొందించారు. గడియారంలోని అంకెలను చెక్కతో ఏర్పాటు చేశారు. ఇక గంటల ముల్లులను ఐరన్ మెటల్‌తో తయారు చేయించి అమర్చారు. గంట ముల్లు దాదాపు మూడు అడుగుల పొడవు, నిముషాల ముల్లు నాలుగ అడుగుల పొడవు ఉన్నట్లు వాహెద్ వాచ్ కంపెనీ యజమాని గులాం మహ్మద్ రబ్బానీ తెలిపారు. మక్కా మసీదు, లాడ్‌బజార్, చార్‌కమాన్, సర్దార్ మహాల్ వైపు నాలుగు గడియారాలను ఏర్పాటు చేయగా.. ఇందులో కేవలం చార్‌కమాన్ వైపు గడియారం ప్రతి గంటకూ శబ్దం చేస్తుంది. అయితే నాలుగు గడియారాల్లో ఈ ఒక్కదానికే సౌండ్ సిస్టం ఉందంటున్నారు.48 గంటలకోసారి... నలువైపుల ఉన్న గడియారాలకు ప్రతి 48 గంటలకొకసారి కీ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రత్యేకంగా రూపొందించిన ఈ ‘కీ’వాహెద్ వాచ్ కంపెనీ వద్ద ఉంటుంది. దాదాపు అర గంటలో ఈ ‘కీ’ ఇవ్వడం పూర్తి చేస్తారు సిబ్బంది. చేతితో ఇచ్చే ఈ ‘కీ’ని సకాలంలో ఇవ్వకపోతే గడియారాలు పనిచేయవు.నిరంతర పర్యవేక్షణలో...ఏళ్ల తరబడి తమ వాచ్ కంపెనీ ఆధ్వర్యంలో చార్మినార్ గడియారాల పని తీరును పర్యవేక్షిస్తున్నాం. వాచ్ మోరాయిస్తుందని తెలిసిన వెంటనే మరమ్మతు చేస్తాం. 1995లో సాలార్జంగ్ మ్యూజియం గడియారం పనిచేయకపోతే.. మేమే మరమ్మతు చేశాం. – గులాం మహ్మద్ రబ్బానీ–వాహెద్ వాచ్ కంపెనీ యజమాని -
నిరుపేదల నెత్తురులో ఎన్ని విప్లవాలో!
నిజాం పాలకుడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావు. ఆయన్ని ప్రశ్నించటం అంటే ప్రాణాలకు తెగించడమే. దాశరథి కృష్ణమాచార్యులు చేసింది అదే! నిజాం పాలనలో తెలంగాణ ప్రజల ఆర్తనాదాలనూ, ఆకలి కేకలనూ చూసి చలించి ఉక్కు పిడికిలి బిగించి జంగు సైరన్ ఊదారు దాశరథి. నిజాం రాజు తనను నిజామాబాద్ జైలులో బంధిస్తే జైలు గోడలపై బొగ్గుతో నిజాంకు వ్యతిరేకంగా ‘ఓ నిజాం పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని’ అంటూ కవితలు లిఖించారు. దాశరథి శతజయంతి సంవత్సర ప్రారంభ సందర్భంగా ఆయన రచించిన ‘అగ్నిధార’ కవితా ఖండికలోని కొన్ని సాహిత్య విషయాలూ, చారిత్రక వాస్తవాలూ పరిశీలించడం నేటి తరానికి స్ఫూర్తినిస్తుంది.‘ఇది నిదాఘము; ఇందు సహింపరాని/ వేడి యేడ్పించుచున్నది; పాడువడిన / గోడలందున జైలులో పాడినాడ/ వాడిపోనున్న పూమొగ్గపైన పాట;/ ఆయాసపడు జైలులో యెన్ని ప్రజల రా/జ్యము లున్నవో! యని యరసినాను;/ నిరుపేదవాని నెత్తురు చుక్కలో నెన్ని/ విప్లవాలో! యని వెదకినాను’ అని ఇందూరు జైలులో (నిజామాబాద్) బందీ అయినది శరీరమే కానీ మనస్సు కాదంటూ నిప్పులు చెరిగే కవిత్వాన్ని రాశారు. బొగ్గుతో గోడలపై వ్రాసి నన్ను బంధిస్తే తన గళం ఇంకా పదునెక్కుతుందని గొంతు చించుకొని అరిచారు. జైలులోని పరిస్థితులను వివరిస్తూ– సహింపరాని వేడి ఏడ్పిస్తు ఉండగా, మొత్తుకున్నాను, ఏడ్చాను నా స్వేచ్ఛకు ఆంక్షలు విధించిన ఓ నిజాం పిశాచమా నన్నే నువ్వు ‘‘బందీని’’ చేస్తే సామాన్యులు పరిస్థితి ఏమిటి? నిరుపేద వాని నెత్తురు చుక్కలో ఎన్ని విప్లవాలో అని వెదికాను అంటూనే... ‘వెన్నెలలు లేవు, పున్నమ కన్నే లేదు, పైడి వెన్నెల నెలవంక జాడలేదు, చుక్కలే లేవు, ఆకాశ శోకవీధి, ధూమదామమ్ము దుఃఖ సంగ్రామ భూమి’ అంటూ తెలంగాణ ప్రాంతం మొత్తం చీకట్లో ఉన్నట్లుగా, యుద్ధ భూమిని తలపిస్తున్నట్లుగా వుందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఓసి కూలిదానా! అరుణోదయాన/ మట్టి తట్ట నెట్టిన బెట్టి మరుగులేని/యెత్తు రొమ్మును పొంగించి యెందుకొరకు/ ఉస్సురనెదవు? ఆకాశ ముడికిపోవ?’ అంటూ రాసిన కవితా పాదాలు చార్మినారు పరిసరాలలో రాతికట్టడాల నిర్మాణ సమయంలో ఓ మహిళా కూలీని చూసి చలించి వ్రాసిన ‘ఉస్సురనెదవు’ కవితలోనివి. ‘అనాదిగా సాగుతోంది/ అనంత సంగ్రామం/ అనాథుడికి, ఆగర్భ/ శ్రీనాథుడికీ మధ్య/ సేద్యం చేసే రైతుకు/ భూమి లేదు, పుట్రలేదు/ రైతుల రక్తం త్రాగే/ జమీందార్ల కేస్టేట్లు’ అంటారు ‘అనంత సంగ్రామం’ కవితలో! యుద్ధం ఇంకా మిగిలేవుంది అన్నట్లుగా ఆదిమ కాలం నుండి నేటి ఆధునిక కాలం వరకు అనేక సంఘర్షణలకు పరిష్కారం లభించట్లేదు, పెద్దచేప చిన్నచేపను మింగుతున్నట్లుగా, ఉన్నవాడు లేనివాడిని దోచుకుంటే, కర్షకుడికి భూమి లేకుండా, విలాసంగా గడిపేవారికి వందల ఎకరాలు (ఎస్టేట్లు) వుంటే తప్పకుండా ‘సంగ్రామం’ జరుగుతుంది మరి! ‘ఇదే మాట ఇదే మాట/ పదే పదే అనేస్తాను/ కదం తొక్కి పదం పాడి/ ఇదే మాట అనేస్తాను/ దగాకోరు బటాచోరు/ రజాకారు పోషకుడవు/ వూళ్ళ కూళ్ళు అగ్గిపెట్టి/ ఇళ్ళన్నీ కొల్లగొట్టి/ తల్లి పిల్ల కడుపుకొట్టి/ నిక్కిన దుర్మార్గమంత/ దిగిపోవోయ్ తెగిపోవోయ్ / తెగిపోవోయ్ దిగిపోవోయ్/ ఇదే మాట ఇదే మాట/ పదే పదే అనేస్తాను’ అంటారు ‘అగ్నిధార’ కావ్యంలోని చివరి కవితలో. ఈ కవిత శ్రీశ్రీ ‘జగన్నాథుని రథ చక్రాలు’ కవితను గుర్తుకు తెస్తుంది. ‘ఇక చాలు నీ అసమర్థపాలన’ అంటూ కడిగిపారేశారు, ఈ కవితలో. కవి ఎప్పుడూ పాలకపక్షం కాకుండా ప్రజలపక్షం నిలబడాలి. అన్నార్థుల వైపు, అనాధల వైపు, ఆకలి కేకల వైపు నిలబడాలి. అచ్చంగా అదే చేశారు దాశరథి.ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఊరు ఊరునా వాడవాడలా ‘అగ్నిధార’ కావ్యంలోని వాక్యాలు తెలంగాణ సమాజంలోని ప్రతి గొంతుకను పిడికిలెత్తి అరిచేలా చేశాయి. స్వరాష్ట్రం సిద్ధించాక దాశరథి పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా లబ్ధప్రతిష్ఠులకు అవార్డులు ఇచ్చి సన్మానించి దాశరథి కీర్తిని దశదిశలా వ్యాపింపజేస్తోంది అధికారికంగా!– డా‘‘ మహ్మద్ హసన్తెలుగు సహాయాచార్యులు, నల్గొండ99080 59234(రేపు దాశరథి శతజయంతి ప్రారంభం) -
'కల్కి' రేంజ్ ఇది.. నైజాంలో వసూళ్ల రికార్డ్ బ్రేక్
ప్రభాస్ 'కల్కి' రిలీజై అప్పుడే ఓ రోజు అయిపోయింది. అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మంచి అంచనాలతో బరిలోకి దిగింది. అందుకు తగ్గట్లు పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మిగతా చోట్ల ఏమో గానీ నైజాంలో మాత్రం సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' సాధించిన ఓ రికార్డుని దాటేయడం విశేషం.(ఇదీ చదవండి: 'బాహుబలి'కి కట్టప్ప.. 'కల్కి'లో మాత్రం ఏకంగా రెండు)'బాహుబలి' తర్వాత ప్రభాస్ సినిమాలు టాక్‌తో సంబంధం లేకుండా రచ్చ లేపుతున్నాయి. మరీ ముఖ్యంగా తొలిరోజు వసూళ్లలో కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. మిగతా వాటి సంగతి కాస్త పక్కనబెడితే తాజాగా థియేటర్లలోకి వచ్చిన 'కల్కి' కేవలం నైజాం ఏరియాలోనే మొదటి రోజు రూ.24 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. దీంతో ఇప్పటివరకు ఆర్ఆర్ఆర్ (రూ.23.55 కోట్లు) పేరిట ఉన్న ఘనత వెనక్కి వెళ్లిపోయింది.కేవలం ఒక్క నైజాం ఏరియాలోనే 'కల్కి' ఈ రేంజు వసూళ్లు సొంతం చేసుకుందంటే ఓవరాల్ Day-1 కలెక్షన్స్‌లో ఇంకెన్ని రికార్డులు బద్ధలు కొట్టేసి ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాం. అయితే నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధికారికంగా తొలిరోజు వసూళ్లు గురించి పోస్టర్ రిలీజ్ చేయాల్సి ఉంది.(ఇదీ చదవండి: పేరు మార్చుకున్న ప్రభాస్.. 'కల్కి'లో ఇది గమనించారా?)(ఇదీ చదవండి: 'కల్కి' మూవీలో కృష్ణుడిగా చేసిన నటుడెవరో తెలుసా?)(ఇదీ చదవండి: ‘కల్కి 2898 ఏడీ’ మూవీ రివ్యూ) -
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. సలార్ టికెట్స్ బుకింగ్ ఎప్పుడంటే?
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం సలార్.. డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలకు రెడీగా ఉంది. ఇప్పటికే విడుదలైన సలార్ టీజర్, ట్రైలర్లోనూ ప్రభాస్ ఎలివేషన్స్ ఆకట్టుకోవడంతో ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా చూస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో సలార్ మూవీ టికెట్ల అమ్మకాలు ఇప్పటికే ఆన్లైన్లో స్టార్ట్ కాగా.. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా మొదలు కాలేదు. తాజాగా సలార్ టికెట్ల బుకింగ్‌కు సంబంధించి మైత్రి మూవీ మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ రోజు రాత్రి 8.24 నిమిషాలకు సలార్ నైజాం టికెట్స్ బుకింగ్స్ ప్రారంభమవుతాయని ట్వీట్ చేసింది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా పంచుకుది. కాగా.. సలార్ చిత్రానికి సంబంధించి తెలంగాణ నైజాం హక్కులను మైత్రి మూవీ మేకర్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. Khansaar ee kaadhu, anni theatres housefulls tho erupekkala ❤️🔥❤️🔥#SalaarNizamBookings opens online today at 8.24 PM 🔥#Salaar Nizam Release by @MythriOfficial 💥#SalaarCeaseFire#Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @VKiragandur @hombalefilms @IamJagguBhai… pic.twitter.com/FqUidhS126 — Mythri Movie Makers (@MythriOfficial) December 19, 2023 -
నిమ్స్‌ను సందర్శించిన నిజాం మనవడు
సాక్షి, సిటీబ్యూరో: నిజాం మనవడు నవాబ్ నజీఫ్ అలీ ఖాన్ శుక్రవారం నిమ్స్ ఆసుపత్రిని సందర్శించారు. పిల్లల గుండె శస్త్ర చికిత్సల శిబిరాన్ని విజయవంతం చేసినందుకు నిమ్స్ డైరెక్టర్ బీరప్పను అభినందించారు. యూకే నుంచి వచ్చిన కార్డియోథెరపిక్ వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. పేద రోగులు, సమాజానికి ప్రయో జనం చేకూరేలా ఇలాంటి కార్యక్రమాలను కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో ఆసుపత్రి అడ్మినిస్ట్రేషన్ విభాగం ఇంచార్జ్, ఆర్ఎంఓ డాక్టర్ సల్మాన్ పాల్గొన్నారు. -
విమోచన కాదు విద్రోహం!
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని కొన్ని రాజకీయ పక్షాలు తమ ప్రయోజనాలకు అనుగుణంగా చిత్రించుకుంటున్నాయి. కానీ అసలు చరిత్రలో జరిగింది వేరు. నైజాం నవాబు ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎట్టి హక్కులు లేకుండా, వెట్టి చాకిరీ చేస్తూ, దారుణ దోపిడీకి గురౌ తున్న సమయంలో ‘ఆంధ్ర మహాసభ’ ఏర్పడింది. క్రమంగా ‘ఆంధ్ర మహాసభ’ కమ్యూనిస్టుల నాయ కత్వంలోకి వచ్చింది. వెట్టి చాకిరీ రద్దు, కౌలు తగ్గింపు, ‘దున్నే వానికే భూమిపై హక్కు’ వంటి డిమాండ్లను ముందుకు తెచ్చి నిజాం పాలనపై ఉద్యమించింది. సంఘంలోకి ప్రజలు పెద్ద ఎత్తున చేరారు. భూమి కోసం పోరు ప్రారంభమైంది. ‘ఆంధ్ర మహాసభ’ ప్రతి గ్రామానికీ విస్తరించింది. తన భూమి, పంటల రక్షణ కోసం చాకలి ఐలమ్మ ప్రదర్శించిన తెగువ భూపోరాట ప్రాధాన్యాన్ని ముందుకు తెచ్చింది. జనగామ తాలూకా కలవెండి గ్రామంలో దేశ్ ముఖ్ విసునూరి రామచంద్రారెడ్డి గూండాలు జరిపిన కాల్పుల్లో దొడ్డి కొమురయ్య అమరత్వంతో పోరాటం కొత్త మలుపు తీసుకున్నది. దేశ్‌ముఖ్‌ల, జమీందార్ల దాడులను సాయుధంగా ప్రతిఘటన చేయాలని కమ్యూనిస్టు పార్టీ నిర్ణయం తీసుకుంది. రైతాంగ ఉద్యమంపై నిజాం నవాబ్ ప్రభుత్వం తీవ్ర నిర్భందం ప్రయోగించింది. నిజాం రజాకార్లు ప్రజలపై పాశవిక దాడులు చేశారు. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన ఈ దాడులను తిప్పికొట్టేందుకు గెరిల్లా దళాలు ఏర్పడ్డాయి. పోరాటం ద్వారా పది లక్షల ఎకరాల భూములు ప్రజలు స్వాధీనపర్చుకుని సాగు చేశారు. వేలాది గ్రామల్లో గ్రామ రాజ్యాలను ఏర్పాటు చేసుకున్నారు. ప్రజాశక్తికి భయపడి జమీందార్లు, దేశ్‌ముఖ్‌లు, జాగీర్దార్లు పట్టణాలకు పారి పోయారు. నిజాం నిరంకుశ ప్రభుత్వం నిర్బంధం పెంచి ప్రజలను తీవ్ర చిత్రహింసలకు గురిచేసింది. ప్రజలను ఒకేచోట మందవేసి పాశవికంగా హింసించారు. అయినా పోరాటం ఆగలేదు. పోరా టాన్ని అడ్డుకునే శక్తి నిజాం ప్రభుత్వం కోల్పోయింది. రైతాంగ సాయుధ పోరాటం నెహ్రూ ప్రభుత్వ వెన్నులో వణుకు పుట్టించింది. ఉద్యమం కొనసాగితే కమ్యూనిస్టుల ప్రాబ ల్యం పెరిగి ఇతర ప్రాంతాల్లో కూడా ఉద్యమాలు ప్రారంభమౌతా యని నెహ్రూ ప్రభుత్వం భయపడింది. అందుకే 1948 సెప్టెంబర్ 13న హైదరాబాద్ సంస్థానానికి సైన్యాలను పంపింది. నిజాం సైన్యాలు బూటకపు ప్రతిఘటన నాటకమాడాయి. రెండు రోజు ల్లోనే నైజాం రాజు లొంగిపోయినట్లు ప్రకటించి, నెహ్రూ సైన్యా లకు స్వాగతం పలికాడు. దీన్ని గమనిస్తే ముందుగానే సైనిక చర్య గురించి నెహ్రూ ప్రభుత్వానికి, నైజాం నవాబుకూ మధ్య ఒప్పందం జరిగిందనేది వెల్లడవుతుంది. నిజాం నవాబును గద్దె దింప టానికే సైన్యం వస్తే, మరి నవాబును (రాజుని) అరెస్టు చేసి నిర్బంధించాలి కదా! కానీ అలా జరగలేదు. ‘రాజ్య ప్రముఖ్’గా నిజాం రాజుని ప్రకటించి 1950 జనవరి 26 వరకు నైజాం ప్రాంతాన్ని అతని పాలనలోనే ఉంచి, నెహ్రూ ప్రభుత్వం 1950లో సెప్టెంబర్ 17న భారత యూనియన్‌లో విలీనం చేసింది. ఈ క్రమంలో గ్రామాలకు సైన్యాలను పంపి ప్రజలు సాగు చేసుకుంటున్న భూములను జమీందార్లకు, భూస్వాములకు అప్ప గించింది. దీన్ని గమనిస్తే నైజాం నవాబును, జమీందార్లను, జాగీర్దారులను, భూస్వాములను రక్షించటానికే రైతాంగ సాయుధ పోరాటంపైకి మిలిటరీ దాడి అన్నది స్పష్టమవుతున్నది. అందుకు అనుగుణంగానే పెద్ద ఎత్తున నిజాం రాజ్యంలో సైన్యాన్ని దింపి రైతాంగ పోరాటంపై విరుచుకుపడింది. కాన్సట్రేషన్ క్యాంపులు పెట్టి ప్రజలను తీవ్ర చిత్రహింసలకు గురిచేసింది. కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించింది. నాయకులను, కార్యకర్తలను పట్టుకుని కాల్చి చంపింది. నెహ్రూ ప్రభుత్వం ఎంత నిర్బంధం ప్రయోగించినా రైతాంగ సాయుధ పోరాటం కొన సాగింది. పార్టీలో చోటు చేసుకున్న మితవాద, అతివాద ధోరణులు 1951 అక్టోబర్ 31న మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం విరమణకు కారణమయ్యాయి. మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించింది కమ్యూనిస్టు పార్టీ. అందుకు అనేక త్యాగాలు చేసింది కమ్యూనిస్టు పార్టీనే! అందువలన ఆ పోరాట వారసులు కమ్యూ నిస్టులే. ఇతరులు దాన్ని ఉచ్చరించటానికి కూడా హక్కు లేదు. అలాగే సెప్టెంబర్ 17న జరిగినది విమోచన కాదు, ప్రజలకు విద్రోహమని ప్రజలు గొంతు విప్పాలి. తెలంగాణ పోరాట వారసులు కమ్యూనిస్టులేనని నినదించాలి. బొల్లిముంత సాంబశివరావు వ్యాసకర్త ఏపీ రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ‘ 98859 83526 -
‘హైదరాబాద్ హౌస్’ యజమాని ఎవరు? డబ్బును నీళ్లలా ఎందుకు ఖర్చు చేశారు?
జీ-20 శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా ఢిల్లీలోని ‘హైదరాబాద్ హౌస్’లో ప్రధాని నరేంద్ర మోదీ, సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ కలుసుకున్నారు. 95 ఏళ్ల చరిత్ర కలిగిన ‘హైదరాబాద్ హౌస్’లో ప్రధాని మోదీని యువరాజు కలుసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఢిల్లీలో హైదరాబాద్ హౌస్‌ను ఎవరు నిర్మించారో తెలుసా? సంస్థానాధీశులు ఢిల్లీకి పరుగులు స్వాతంత్య్రానికి ముందు భారతదేశంలో సుమారు 560 సంస్థానాలు ఉండేవి. ప్రతి సంస్థానానికి వాటి రాజులు, రాచరిక రాష్ట్రాలు, నవాబులు, నిజాంలు ఉండేవారు. నాటి రోజుల్లో స్థానికుల సమస్యలను వినేందుకు, వారితో సమన్వయం కోసం బ్రిటిష్ ప్రభుత్వం 1920లో 'ది ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్'ను ప్రారంభించింది. ఈ ఛాంబర్ సమావేశాలు ఢిల్లీలో జరుగుతుండేవి. దీంతో బ్రిటీష్ ప్రభుత్వం ఎప్పుడు పిలిచినా సంస్థానాధీశులు ఢిల్లీకి పరుగులు తీయాల్సి వచ్చేది. అయితే వారికి తగినట్లు అక్కడ సరైన ఏర్పాట్లు ఉండేవి కాదు. ఎకరా భూమి రూ.5000 చొప్పున కొనుగోలు ఆ సమయంలో మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ సంస్థానానికి నిజాంగా ఉండేవాడు. ఆయన ఢిల్లీలో తన స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపధ్యంలో భూమి కోసం అన్వేషణ ప్రారంభించారు. వైస్రాయ్ హౌస్ (ప్రస్తుతం రాష్ట్రపతి భవన్) సమీపంలోని 8.2 ఎకరాల స్థలాన్ని నిజాం కొనుగోలు చేశారు. అయితే ఆ భూమి కొద్దిగా తక్కువగా ఉందని భావించి, దానికి ఆనుకునివున్న ఓ భవనాన్ని కూడా కొనుగోలు చేశారు. అప్పట్లో నిజాం ఈ భూమిని ఎకరా రూ.5000 చొప్పున కొనుగోలు చేశారు. ‘వైస్రాయ్ హౌస్’ను పోలివుండేలా.. భూమిని కొనుగోలు చేసిన తర్వాత భవన నిర్మాణ మ్యాప్ తయారు చేయాల్సిన అవసరం ఏర్పడింది. దీని బాధ్యతను నిజాం.. నాటి ప్రముఖ ఆర్కిటెక్ట్ ఎడ్విన్ లుటియన్స్‌కు అప్పగించారు. లుటియన్స్ ‘హైదరాబాద్ హౌస్’ కోసం ‘సీతాకోకచిలుక’ ఆకారంలో డిజైన్‌ను సిద్ధం చేశారు, ఇది దాదాపు ‘వైస్రాయ్ హౌస్’ను పోలి ఉంటుంది. స్వాతంత్య్రం వచ్చిన సమయంలో దేశంలోనే అత్యంత ధనవంతుడైన నిజాం ‘హైదరాబాద్ హౌస్’కు తొలుత రూ.26 లక్షలు ఖర్చు చేయాలని అనుకున్నారు. అయితే ఆ తర్వాత ఈ మొత్తాన్ని రూ.50 లక్షలకు పెంచారు. ఆ రోజుల్లో బర్మా (ప్రస్తుతం మయన్మార్)కు చెందిన టేకు చెక్క నాణ్యమైనదిగా గుర్తింపు పొందింది. నిజాం ఈ భవన నిర్మాణానికి అవసరమైన కలపను అక్కడి నుంచి ఆర్డర్ చేశాడు. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్‌లు,ఇతర వస్తువులు న్యూయార్క్ నుండి ఆర్డర్ చేశారు. ఇంటీరియర్ డెకరేషన్‌కు విదేశాల నుంచి ఆర్డర్లు ఆ రోజుల్లో, లండన్‌లోని హాంప్టన్ అండ్ సన్స్ లిమిటెడ్, వారింగ్ అండ్ గిల్లో లిమిటెడ్ ఇంటీరియర్ డిజైనింగ్‌లో ప్రసిద్ధి చెందిన సంస్థలు. నిజాం ఈ రెండు కంపెనీలకు ‘హైదరాబాద్ హౌస్’ను అలంకరించే బాధ్యతను అప్పగించారు. అలంకారానికి లోటు రాకుండా ఉండేందుకు 1921లో ప్రపంచంలోని ప్రముఖ చిత్రకారులందరి నుంచి దాదాపు 17 పెయింటింగ్స్‌కు ఆర్డర్ ఇచ్చారు. అప్పట్లో ఈ పెయింటిగ్స్ ధర రూ.10,000 నుండి 20,000 వరకు ఉండేది. లాహోర్‌కు చెందిన ప్రముఖ చిత్రకారుడు అబ్దుల్ రెహ్మాన్ చుగ్తాయ్ తీర్చిదిద్దిన 30 పెయింటింగ్‌లను కూడా ఆర్డర్ చేశారు. వాటి విలువ రూ. 12,000. 'హైదరాబాద్ హౌస్' కోసం కార్పెట్లను ఇరాక్, టర్కీ, ఆఫ్ఘనిస్తాన్ నుండి తెప్పించారు. నిజాం హోదాకు తగినవిధంగా ఉండేలా ఒకేసారి 500 మంది అతిథులకు భోజన ఏర్పాట్లు చేసేందుకు వీలుగా వెండి ప్లేట్లు, కత్తులు, ఇతర వస్తువులను ఆర్డర్ చేశారు. భవనాన్ని చూసిన నిజాం ఏమన్నారు? 1928 నాటికి ‘హైదరాబాద్ హౌస్’ పూర్తయింది. యూరోపియన్, మొఘల్ శైలిలో నిర్మితమైన ఈ భవనంలో మొత్తం 36 గదులు ఉన్నాయి. అందులో నాలుగు గదులు ‘జనానా’ అంటే మహిళలకు సంబంధించినవి. దాదాపు 10 ఏళ్లకు పూర్తయిన ఈ ‘హైదరాబాద్ హౌస్’లోకి అడుగుపెట్టినప్పుడు నిజాం ఎంతో బాధపడ్డారుట. నిజాంకు ఈ ‘హైదరాబాద్ హౌస్’ అస్సలు నచ్చక దానిని ‘గుర్రపుశాల’తో పోల్చారు. రూ. 50 లక్షలు ఖర్చు చేసినప్పటికీ ‘హైదరాబాద్ హౌస్’ అనేది కొన్ని చౌక భవనాల కాపీ మాత్రమే అని నిజాం పేర్కొన్నారట. ‘హైదరాబాద్ హౌస్’ ఇప్పుడు ఎవరిది? స్వాతంత్ర్యం సిద్ధించాక సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యాయి. 1954లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ‘హైదరాబాద్ హౌస్’ని లీజుకు తీసుకుంది. ఇందుకు ప్రతిగా 1970ల వరకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి డబ్బు చెల్లిస్తూ వచ్చింది. అనంతరం కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాక కేంద్రం, రాష్ట్ర మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ భవన్ నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వానికి 7.56 ఎకరాల భూమిని ఇచ్చింది. దీంతో ‘హైదరాబాద్ హౌస్’ కేంద్రానికి సొంతమయ్యింది. ఇప్పుడు విదేశాంగ మంత్రిత్వ శాఖ హైదరాబాద్ హౌస్‌ను పర్యవేక్షిస్తోంది. -
బ్రో నైజాం రైట్స్ క్లోజ్.. ఫ్యాన్స్‌కు ఊహించని షాక్ ఇచ్చిన నిర్మాతలు
పవన్ కల్యాణ్ - మెగా హీరో సాయితేజ్ కలిసి నటించిన 'బ్రో' సినిమా రిలీజ్‌కు సిద్దంగా ఉంది. తాజాగా ఈ సినిమా నైజాం హక్కుల పంచాయతీకి శుభం కార్డు పడింది. నైజాం హక్కులను మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్స్ సంస్థ తీసుకుంది. పీపుల్స్ మీడియా కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రిప్ట్ ఇవ్వగా సముద్రఖని దర్శకత్వం వహించారు. (ఇదీ చదవండి: సినిమాల్లోకి జూ.ఎన్టీఆర్ కుమారుడు.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే..?) ఈ చిత్రాన్ని నైజాం ఏరియా కోసం రూ.32 కోట్ల నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్ ప్రాతిపదికన మైత్రి వారు కొన్నారని తెలుస్తోంది. ఇదే నిజం అయితే.. అదనంగా జీఎస్టీ ఉంటుంది కాబట్టి నైజాంలో బ్రో సినిమా నుంచి మైత్రీ డిస్ట్రిబ్యూటర్ సంస్థకు రూ. 38 కోట్ల వరకు షేర్ రావాల్సి వుంటుంది. ఈమేరకు వస్తేనే సేఫ్ జోన్లో ఉంటారు.. లేదంటే దిల్ రాజు అంచనాలే నిజం అవుతాయి. నైజాంలో ఎంతో పట్టున్న దిల్ రాజు ఇంత భారీ ధరకు 'బ్రో'ని కొనేందుకు ముందుకు రాలేదు. ఆయన సుమారు రూ. 30 కోట్ల వరకు డీల్ కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు చేశారని టాక్. నైజాం హక్కులను రూ. 35 కోట్లకు ఇవ్వాలని పీపుల్స్ మీడియా ప్రయత్నించినా ఉపయోగం లేదు. చివరకు రూ.32 కోట్లతో మైత్రి వారు డీల్ క్లోజ్ చేసినట్లు ఇండస్ట్రీ టాక్. (ఇదీ చదవండి: దుమ్మురేపిన ‘బేబీ’.. తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే..) ఫ్యాన్స్‌కు ఊహించని షాక్ ఈ నెల 28న థియేటర్లలోకి బ్రో సినిమా వస్తోంది. బ్రో మూవీ రన్ టైం విషయంలోనూ కొంతమేరకు నిరాశే కానుంది. ఈ సినిమా కేవలం 130 నిమిషాలు రన్ టైం లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఇదే నిజం అయితే పవన్ ఫ్యాన్స్‌కు ఊహించని షాక్ ఎదురైనట్లే. అంటే కేవలం రెండు గంటల పది నిమిషాలతో మాత్రమే బ్రో రానున్నాడు. స్టార్ హీరోల సినిమా అంటేనే రెండున్నర గంటలకు పైగానే నిడివి ఉండేలా ప్లాన్ చేస్తారు డైరెక్టర్లు.. అలాంటిది మల్టీస్టారర్ సినిమాకు ఇలా తక్కువ రన్ టైమ్ ఉంటే మూవీపై ఎఫెక్ట్ చూపుతుందని నెటిజన్స్ తెలుపుతున్నారు. ఏదేమైనా జులై 28న అసలైన బొమ్మ ఎవరికి కనిపిస్తుందో చూడాలి. -
యాదాద్రీశుడికి నిజాం తరపున బంగారు హారం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీస్వామి వారికి నిజాం కుటుంబం తరపున ప్రిన్సెస్ బేగం సాహిబా ఎస్రా బిర్గెన్ బంగారు హారాన్ని వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు ద్వారా అందజేశారు. ఈ హారాన్ని ఆదివారం కిషన్‌రావు ఆలయ ఈవో గీతారెడ్డికి అందజేశారు. శ్రీస్వామి వారి ప్రధానాలయం ప్రారంభమైన తరువాత తొలిసారి జరుగుతున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా రూ.4లక్షల విలువైన 67 గ్రాముల బంగారు హారాన్ని నిజాం కుటుంబం తరపున పంపించారని ఆలయాధికారులు వెల్లడించారు. -
ఎనిమిదో నిజాం రాజు ముఖరంజా బహుదూర్ కన్నుమూత
-
టప్పాఖానాలకు కొత్త రూపు
సాక్షి, హైదరాబాద్: ఇది షాద్‌నగర్ సమీపంలోని మొగిలిగిద్ద టప్పాఖానా. 1925లో నిజాం ప్రభుత్వం నిర్మించిన భవనం. 97 ఏళ్లుగా అందులోనే తపాలా కార్యాలయం కొనసాగుతోంది. వందేళ్లకు చేరువవుతున్న నేపథ్యంలో దాదాపు రూ.10 లక్షలు వెచ్చించి దీనికి పూర్తిస్థాయిలో మరమ్మతు చేయాలని, ప్రస్తుత అవసరాలకు వీలుగా మార్చాలని తపాలాశాఖ నిర్ణయించింది. స్వచ్ఛత కార్యక్రమాల్లో భాగంగా మరమ్మతులకు శనివారం శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ రీజియన్ పోస్ట్‌మాస్టర్ జనరల్ డా‘‘ పీవీఎస్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొగిలిగిద్ద పాత భవనం ముందు పచ్చికతో లాన్ కూడా ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో తపాలాశాఖ అధికారులు సంతోశ్‌కుమార్ నరహరి, వెంకటేశ్వర్లు, గౌస్ పాషా, జుబేర్, హేమంత్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా... మొగిలిగిద్దతోపాటు రాష్ట్రవ్యాప్తంగా నిజాం హయాంలో నిర్మించిన టప్పాఖానాలను అభివృద్ధి చేసేందుకు తపాలాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు అందించిన వినతులు, సూచనలకు సంబంధించిన పనులను పూర్తి చేస్తున్నారు. ప్రజలు నేరుగా గానీ, సామాజిక మాధ్యమాల ద్వారా గానీ ఇచ్చిన వినతుల ఆధారంగా పరిష్కరిస్తున్నారు. కార్యాలయాల్లోని తుక్కు, అవసరం లేని కాగితాలు, ఇతర చెత్తను తొలగించి పరిశుభ్రం చేయటంతోపాటు తదుపరి అవసరాలకు వీలుగా ఖాళీ స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నారు. -
చరిత్ర వక్రీకరణ మహానేరం
చరిత్రను వక్రీకరించడం జనసంహారం చేసే ఆయుధాల కన్నా ప్రమాదకరం. అది ప్రజలను తరతరాలుగా తప్పుదోవ పట్టిస్తుంది. చరిత్ర ఒక జ్ఞాపకం మాత్రమే కాదు, అది భావి తరాలకు మార్గదర్శి. తమ రాజకీయ, ఆర్థిక, సామాజిక అవసరాలకు చరిత్రను ఒక సాధనంగా చూడటమనేది స్వార్థ చింతన. చరిత్రకు మసిపూసి మారేడు కాయ చేయడమనేది ఒక రాజకీయ దృక్పథంగా మారిపోవడం విషాదం. ప్రస్తుతం తెలంగాణ సమాజం అదే విధమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నది. తెలంగాణ విమోచన, విలీనం, విద్రోహం, సమైక్యత అనే వాదాలు, వివాదాలు కొనసాగుతున్నాయి. ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం అనేది నిష్పాక్షిక దృష్టితో చూడాల్సిన బాధ్యత తెలంగాణ గడ్డపై ప్రతి ఒక్కరికీ ఉంది.తమ రాజకీయ ప్రయోజనాల కోసం చరిత్రను వక్రీకరిస్తోన్న శక్తుల సంఖ్య గణ నీయంగా పెరిగిపోతున్నది. అందుకుగానూ అసత్యాలను, అర్ధ సత్యాలను తమ అస్త్రాలుగా ప్రయోగిస్తున్నారు. సమత, మమత, కరుణ, ప్రేమలకు ప్రతీకగా ఉన్న తెలంగాణ సమాజాన్ని విద్వేషపు విషంతో నింపాలని చూస్తున్నారు. ఇది ఎంతమాత్రం సమంజసం కాదు. హైదరాబాద్ రాష్ట్రం మూడు భాషాప్రాంతాల కలయిక. హిందూ, ముస్లిం, ఇతర సామాజిక వర్గాల సమ్మేళనంతో కలిసి నడిచిన గంగా–జమునా తెహెజీబ్. హైదరాబాద్ రాజ్యం కేవలం ముస్లింలు పాలించినది కాదు. రాజ్యానికి కేంద్రం నిజాం అయితే, గ్రామీణ ప్రాంతాలు హిందూ సామాజిక వర్గానికి చెందిన జమీం దారులు, జాగీర్దారుల కబంధ హస్తాల్లో ఉండేవి. నిజానికి పరోక్షంగా నిజాంలు సాగించిన దుర్మార్గాల కన్నా, ఎందరో జమీందారులు, జాగీర్దారులు సాగించిన అమానుషాలు ఎన్నో రెట్లు ఎక్కువ. కానీ నిజాం పాలన అనగానే కేవలం నిజాం గుర్తుకు రావడమే సహజంగా జరుగుతోంది. ‘మానుకోట’(ఇప్పటి మహబూబాబాద్) జెన్నారెడ్డి ప్రతాపరెడ్డి, విసునూరు రామచంద్రారెడ్డి లాంటి జమీందారులు జరిపిన దారుణాలు మనం చరిత్రలో మరెక్కడా చూడం. వీటన్నింటికీ రజాకార్ల దాడులు, దౌర్జన్యాలు తోడయ్యాయి. హిందూ జమీందార్లు, ముస్లిం రజాకార్లు ఒక కూటమిగా ఏర్పడ్డారు. రజాకార్ ఉద్యమం 1938లో ప్రారంభమైంది. కానీ 1947 నుంచి దౌర్జన్యాలకు వేదికగా తయారైంది. రజాకార్ అంటే స్వయం సేవకులు అని అర్థం. రజాకార్లలో కొందరు హిందువులు కూడా ఉండేవారు. ప్రభుత్వానికి అండగా ఉండడానికి రజాకార్లను వినియోగించాలన్న కొందరు ముస్లిం జమీదారుల ఒత్తిడికి తలొగ్గి వారికి ప్రత్యేకమైన అధికారాలను ప్రకటించారు. దీనితో రజాకార్లు కమ్యూనిస్టులపైనా, ఇతర ఉద్యమకారులపైనా దాడులు కొనసాగించారు. 1947 జూలై 30 నుంచి 1948 సెప్టెంబర్ 17 వరకు రజాకార్లు విచ్చలవిడి దౌర్జన్యాలు చేసిన మాట నిజం. వాళ్ళను ప్రతిఘటించి ప్రజలకు రక్షణగా నిలి చింది కమ్యూనిస్టులే. జమీందారుల, భూస్వాముల దౌర్జన్యాలకు పరాకాష్ఠగా నిలిచిన దొడ్డి కొమరయ్య హత్యతో అంటే 1946 జూలై 4న కమ్యూనిస్టులు తమ సాయుధ పోరాటాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలోనే 1947 ఆగస్టు 15వ తేదీన బ్రిటిష్ పాలనలో ఉన్న భారతదేశం స్వతంత్రమైంది. ఆనాటికి 565 సంస్థానాలు ఉన్నాయి. స్వాతంత్య్రం సిద్ధించేనాటికి హైదరాబాద్ స్వతంత్ర పాలనా ప్రాంతంగా ఉండేది. బ్రిటిష్ ప్రభుత్వంతో కొన్ని ఒప్పందాలు చేసు కొన్నప్పకీ అన్ని విషయాల్లో స్వేచ్ఛగానే నిర్ణయాలు తీసుకునేది. బ్రిటిష్ ప్రభుత్వం తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి తన సైన్యాన్ని హైదరాబాద్‌లో ఉంచింది. అదే మనం ఇప్పుడు చూస్తోన్న హైదరా బాద్‌లోని కంటోన్మెంట్. 1947లో స్వాతంత్య్రం పొందిన భారతదేశం అన్ని సంస్థానాలను భారత యూనియన్‌లో కలపాలని అడిగింది. అందరూ ఒప్పుకున్నారు. కశ్మీర్, హైదరాబాద్ సంస్థానాలు తాము స్వతంత్రంగా ఉంటామని ప్రకటించుకున్నాయి. అందుకుగానూ భారత ప్రభుత్వం, హైదరాబాద్ రాజ్యం ఒక ఒడంబడికను కుదుర్చు కున్నాయి. దానినే స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అంటారు. బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి స్వాతంత్య్రం ఇచ్చేటప్పుడు కొన్ని నిబంధ నలను పెట్టింది. అందులో ఒకటి, ఇప్పటివరకూ బ్రిటిష్ పాలనలో లేని సంస్థానం అటు పాకిస్తాన్‌లోగానీ, ఇటు భారతదేశంలో గానీ చేర వచ్చు. లేదా స్వతంత్రంగా ఉండవచ్చు. అయితే నిజాం స్వతంత్ర పాకి స్తాన్ ఆహ్వానాన్ని తిరస్కరించాడు. భారతదేశంతో మాత్రం స్నేహంగా ఉండడానికి అంగీకరించాడు. 1947లో ఉనికిలోకి వచ్చిన రజాకార్ల దాడులను ఆసరాగా తీసుకొని భారత ప్రభుత్వం నిజాం మీద ఆంక్షలను పెంచింది. ఆర్థికంగా దిగ్బంధనం చేసింది. భారత ప్రభుత్వం పెంచుతోన్న ఒత్తిడిని తట్టుకోలేక నిజాం ప్రభుత్వం 1948 ఆగస్టు 9న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని ఆశ్రయించింది. భారత ప్రభుత్వం కొన సాగిస్తున్న ఆంక్షలను ఎత్తివేయాలనీ, తాము స్వతంత్రంగా కొనసాగే అవకాశం కల్పించాలనీ నివేదించింది. అది 1948 ఆగస్టు 21న చర్చలకు వచ్చింది. ఆ అభ్యర్థనను స్వీకరించాలా లేదా అనేది చర్చకు వచ్చినప్పుడు అందులో ఉన్న పది దేశాల్లో ఫ్రాన్స్, అమెరికా, కెనడా, కొలంబియా, సిరియా, బెల్జియం, అర్జెంటీనా అభ్యర్థనను స్వీకరించ డానికి తమ మద్దతును తెలియజేశాయి. రష్యా, చైనా, ఉక్రెయిన్ తటస్థంగా ఉన్నాయి. ఇది 1948 సెప్టెంబర్ 16న జరిగింది. అయితే దానిని ఒక రెండు రోజులు వాయిదా వేయాలని భారత ప్రభుత్వ ప్రతినిధులు తెరవెనుక కథ నడిపారు. అప్పటికే భారత సైన్యం హైదరాబాద్‌లో సైనిక చర్యలను ప్రారంభించింది. దాదాపు హైదరా బాద్ సంస్థానం పూర్తిగా ఆక్రమణకు గురైంది. తెల్లారితే సెప్టెంబర్ 17. ఆరోజు హైదరాబాద్‌ను హస్తగతం చేసుకున్నారు. సెప్టెంబర్ 17 మధ్యాహ్నంకల్లా నిజాం చేత భారత ప్రతినిధి కె.ఎం.మున్షీ ఒక ప్రకటన చేయించారు. హైదరాబాద్ ప్రభుత్వం తరఫున భద్రతా మండలిలో చేసిన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నామనేది అందు లోని ప్రధానాంశం. సెప్టెంబర్ 12న మొదలుపెట్టిన సైనికదాడి మొదటి లక్ష్యం ఐక్యరాజ్య సమితి నుంచి ఫిర్యాదును వెనక్కి తీసుకునేటట్టు చేయడం. సైనిక చర్య జరిగిన సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు సైన్యం చేతిలో గానీ, అక్కడక్కడా జరిగిన ఘర్షణల్లోగానీ 25 వేల నుంచి 30 వేల మంది వరకు మరణించినట్టు నిజాం ప్రభుత్వం నియమించిన సుందర్‌లాల్ కమిటీ నివేదిక వెల్లడించింది. ఇది ఒక ఘట్టం. దీనినే మనం విమోచన అంటున్నాము. విమోచన అంటే శత్రువును పదవీ చ్యుతుడిని చేయాలి. కానీ అలా జరగలేదు. నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పేరుమీదనే 1950 జనవరి 26 వరకు ప్రభుత్వం నడిచింది. ఆ తర్వాతనే హైదరాబాద్ భారత ప్రభుత్వంలో అధికారికంగా భాగమైంది. 1948 సెప్టెంబర్ 17న నిజాంను లొంగదీసుకున్న తరువాత భారత సైన్యం కమ్యూనిస్టులపై యుద్ధం ప్రకటించింది. అప్పటి వరకు ప్రజలను దోచుకున్న దొరలు, భూస్వాములు, జమీందారులు, జాగీర్దార్లు కమ్యూనిస్టుల పోరాటంతో ఊళ్ళొదిలి పెట్టారు. భారత సైన్యం రావడంతో, కాంగ్రెస్ టోపీలు పెట్టుకొని మళ్ళీ పల్లెలకు వచ్చారు. భారత సైన్యం, భూస్వాములు, గూండాలు కలిసి ఊరూరునీ వల్లకాడుగా మార్చేశారు. 1948 సెప్టెంబర్ 17 నుంచి 1951 అక్టోబర్ సాయుధ పోరాట విరమణ వరకూ దాదాపు 4 వేల మంది కమ్యూనిస్టులతో పాటు, వేలాది మంది సాధారణ ప్రజలు చనిపోయారు. మరి 1948 సెప్టెంబర్ 17న విమోచన అయితే, 1951 వరకు భారత సైన్యం తెలంగాణ పల్లెలపై ప్రకటించిన యుద్ధం ఎవరి విమోచనం కోసం జరిగింది? కాబట్టి సెప్టెంబర్ 17న జరిగింది నిజాం బలవంతపు లొంగుబాటుగానే చరిత్ర మనకు చెబుతున్నది. ఆ తర్వాత మూడేళ్ళ పాటు తెలంగాణ పల్లెల్లో నెత్తురు ప్రవహించింది. అందువల్ల మనం సెప్టెంబర్ 17న జరపాల్సింది సంబురాలు కాదు. మనల్ని మనం సింహావలోకనం చేసుకోవడమే. రజాకార్ల దౌర్జన్యా లనూ, అమానుషాలనూ ఎండగట్టాల్సిన సమయమిదే. కానీ భారత సైన్యం జరిపిన నరమేధాన్ని తక్కువ చేసి చూడటం ముమ్మాటికీ సరికాదు. తెలంగాణ ప్రజలు అటు నిజాం రాజు, జమీందార్లు, దేశ్‌ముఖ్‌లు, జాగీర్దార్ల దోపిడీ, దౌర్జన్యాలకు బలైపోయారు. రజాకార్ల అమానుషాలను అనుభవించారు. అదేవిధంగా భారత సైన్యం చేసిన విధ్వంసాన్ని, వినాశనాన్ని కూడా చవిచూశారు. ఇదే వాస్తవం. ఇదే నగ్న సత్యం. - మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు -
నిజాం వెంట చీతా.. అతిథులకు వేట సరదా తీర్చిన నవాబులు
నిజాం పాలనా సమయం.. అది మలక్‌పేటలోని రేస్ కోర్సు.. ఓ రోజు సాయంత్రం నాలుగు గంటల సమయం.. ఉన్నట్టుండి అలజడి మొదలైంది. ఆరో నిజాం తన వెంట రెండు చీతాలను తీసుకుని అక్కడికి వచ్చారు. చీతాలను రెండు వైపులా కూర్చోబెట్టుకుని గుర్రపు పందాలను వీక్షించి.. కాసేపటికి వెళ్లిపోయారు. అది 1885.. బ్రిటిష్ అధికారి, రచయిత లార్కింగ్ హైదరాబాద్‌కు వచ్చారు. నిజాం ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. భోజనం, ఆ తర్వాత ప్యాలెస్‌ల వీక్షణంతో గడిచిపోయింది. మరునాడు పొద్దునే లార్కింగ్ను నిజాం పరివారం మహబూబాబాద్ ప్రాంతంలో వేటకు తీసుకెళ్లారు. వారు వెంట రెండు చీతాలను తీసుకురావటం, వాటి సాయంతో వేటాడటం చూసి లార్కింగ్ ఆశ్చర్యపోయారు. ఆ వేటను వివరిస్తూ ఓ పెయింటింగ్ రూపొందించారు. ‘బందోబస్త్ అండ్ ఖబర్’ పేరుతో రాసిన పుస్తకంలో దాన్ని ప్రచురించారు. సాక్షి, హైదరాబాద్: నిజాం కాలంలో తెలంగాణ ప్రాంతంలోనూ చీతాలు ఉండేవి. ప్రస్తుతం మహారాష్ట్రలో ఉన్న విదర్భ ప్రాంతంలో చీతాలు ఉండేవని బ్రిటిష్‌వారి నివేదికలు చెబుతున్నాయి. అక్కడి నుంచి ఆదిలాబాద్ వరకు అటవీ ప్రాంతంలో అవి తిరుగాడేవి. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ లెక్కల ప్రకారం.. 1900 నాటికి ఇండియాలో 414 చీతాలు ఉండేవి. అయితే హైదరాబాద్ సంస్థానానికి సంబంధించి నిజాం ఎలాంటి లెక్కలు తీయించలేదు. ఆ సమయంలో వేట విలాసంగా ఉండేది. పెద్ద పులులను వేటాడేందుకు వెళ్లినవారికి చీతాలు సులభంగా చిక్కేవి. అలా ఎన్నింటినో చంపినా.. ఆ తర్వాతికాలంలో జింకల వేట కోసం చీతాలను వాడటం మొదలుపెట్టారు. ఇందుకోసం నిజాం పాలకులు వేటకుక్కల్లా చీతాలను మచ్చిక చేసుకున్నారు. కానీ వేట, అనారోగ్యం, ఇతర కారణాలతో త్వరగా అంతరించిపోయాయి. దీనితో అడవుల్లో చీతా పిల్లలు కనిపిస్తే తెచ్చి అప్పగించాలని ప్రజలకు నిజాం ఆదేశాలు జారీ చేశారు. చివరికి బ్రిటీష్ అధికారులకు లేఖ రాసి మధ్యప్రదేశ్ ప్రాంతంలో చీతాలను పట్టుకుని, హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఎడ్ల బండిపై చీతాను తీసుకెళ్తున్నట్టు ప్రిన్స్ ఆఫ్ వేల్స్ గీయించిన చిత్రం 1908లో హైదరాబాద్‌కు వచ్చిన ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఆల్బర్ట్ ఎడ్వర్డ్.. ఇక్కడ నిజాంతో కలిసి వేటలో పాల్గొన్నారు. వేటకు వెళ్లేప్పుడు రెండు ఎడ్ల బండ్లపై మంచాలు వేసి, వాటికి చీతాలను కట్టి తీసుకురావడం ఆల్బర్ట్ ఎడ్వర్డ్‌ను ఆశ్చర్యపర్చింది. చీతాలు వాయువేగంతో పరుగెడుతూ జింకలను వేటాడటాన్ని చూసిన ఆయన.. ఆ దృశ్యాలను వివరిస్తూ ఈ చిత్రాలను గీయించారు. జింకను వేటాడుతున్నట్టు గీయించిన మరో చిత్రం ఇప్పటికీ నాటి గుర్తులు నిజాం వారసుల ఇళ్లలో చీతాలకు, నాటి వేటకు సంబంధించిన గుర్తులు ఇప్పటికీ ఉన్నాయి. హైదరాబాద్‌లోని మౌలాలి ప్రాంతంలో నిజాం ఆంతరంగికుడి వారసుడి నివాసంలో నాడు చీతాల కోసం వినియోగించిన పెద్ద పెద్ద ఇనుపబోన్లు ఉన్నాయి. అప్పట్లో బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ కర్జన్ కూడా నిజాం సమక్షంలో వేట సరదా తీర్చుకున్నారు. నిజాం 1903లో లార్డ్ కర్జన్‌ను నిజాం పూర్వపు వరంగల్ జిల్లా నెక్కొండ అడవుల్లో వేటకు తీసుకెళ్లారు. వారు అక్కడ పెద్దపులిని వేటాడి.. దాని పక్కన కూర్చుని ఫొటోలకు ఫోజులిచ్చారు. (క్లిక్: 70 ఏళ్ల తర్వాత భారత్‌లోకి 8 చీతాలు.. పేరు పెట్టిన ప్రధాని మోదీ) -
ఓడినా పైచేయి నిజాందేనంటూ.. మజ్లిస్ పత్రిక ప్రచారం
సాక్షి, హైదరాబాద్: మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ సంస్థకు ‘మీజాన్’ పేరుతో ఓ పత్రిక ఉంది. నరరూప రాక్షసుడిగా ముద్రపడ్డ ఖాసింరజ్వీ నేతృత్వంలో ఉన్న సంస్థ కావటంతో దాని పత్రిక కూడా నిజాం సేనలకు అనుకూల వార్తలతో జనాన్ని తప్పుదోవ పట్టించే యత్నం చేసింది. ఓవైపు భారత సేనలు హైదరాబాద్‌ను చుట్టుముట్టడంతో నిజాం సైన్యం తోకముడిచినా.. ఎంఐఎం పత్రిక మీజాన్ మాత్రం, నిజాం సైన్యానిదే పైచేయి అంటూ తప్పుడు కథనాలను జనంలోకి వదిలింది. మరోవైపు నిజాం నియంత్రణలో ఉన్న హైదరాబాద్ రేడియో కూడా నిజాం సేనలు వీరోచితంగా పోరాడుతూ భారత సైన్యాన్ని అడుగడుగునా అడ్డుకుంటున్నాయని వార్తలు వెలువరించింది. సెప్టెంబర్ 17 సాయంత్రం వరకు జరిగిన ఈ తంతు ఆ తర్వాత ఆగిపోయింది. తప్పుడు వార్తలే కాదు, తుదకు ఆ పత్రిక, రేడియో కూడా ఆ తర్వాత మూగబోయాయి. సైన్యానికి స్వాగతం పలికిన జనంపై రజాకార్ల దాడులు భారత సైన్యం రాకను అడ్డుకోలేకపోయిన నిజాం సేనలు, ఆ అక్కసును సాధారణ ప్రజలపై చూపించాయి. నగరానికి చేరుకున్న భారత సైనిక పటాలాలను చూసి సంబరపడ్డ జనం, హారతులిచ్చి స్వాగతం పలికాయి. బొల్లారం మిలటరీ కేంద్రం వద్ద పండగ వాతావరణం నెలకొంది. సెప్టెంబరు 17న రాత్రి అక్కడికి దొంగచాటుగా చేరుకున్న రజాకార్ల బృందం సాధారణ ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. దీంతో అమాయకులు బలయ్యారు. విషయం తెలుసుకున్న భారత సైనికులు గాలించి మరీ ముష్కరులను పట్టుకుని కోర్టులో హాజరు పరిచారు. చదవండి: (బురఖా ధరించి మహిళ వేషంలో గోడ దూకి పరారైన... నిజాం నవాబు ప్రధాని) -
వంతెనను పేల్చేయించాడు
1948 సెప్టెంబర్ 16 ఉదయం.. మూసీనది పరవళ్లు తొక్కుతోంది. వరద హోరు తప్ప అంతా ప్రశాంతంగా ఉంది. ఇంతలో పెద్ద శబ్దం. దాని తర్వాత వరస శబ్దాలు. చూస్తుండగానే.. సూర్యాపేట – టేకుమట్ల వంతెన నేలకొరిగింది. అద్భుత నిర్మాణ కౌశలంతో రూపుదిద్దుకున్న ఆ రాతి వంతెనను బాంబులు తునాతునకలు చేసేశాయి. సైనికాధ్యక్షుడు జనరల్ ఎడ్రూస్ ప్లాన్. నిజాం ఉస్మాన్ అలీఖాన్ ఆదేశాలు. భారత సైన్యాలు హైదరాబాద్‌లోకి అడుగుపెట్టకుండా అడ్డుకునే ప్రణాళిక ఫలితంగా నిజాం ముచ్చటపడి నిర్మించిన టేకుమట్ల వంతెన కూలిపోయింది. – సాక్షి, హైదరాబాద్ హైదరాబాద్–విజయవాడ రహదారిపై సూర్యాపేటకు పది కి.మీ. ముందున్న మూసీ నదిపై నిజాం ముచ్చటపడి నిర్మించిన వంతెన అది. మంచి ప్లాన్‌తో అద్భుతంగా నిర్మింపజేశాడా వంతెన. సంస్థానానికి సముద్ర రవాణా లేకపోవటంతో సముద్ర వాణిజ్యానికి మచిలీపట్నం పోర్టే ఆధారం. అందుకే అక్కడి నుంచి భాగ్యనగరానికి విశాలమైన రోడ్డు నిర్మించాడు. పన్నుల వసూళ్లకు వెళ్లేందుకు, పోర్టు వస్తువుల రవాణా, సైనిక పటాలాలు వచ్చి వెళ్లేందుకు ఇదే ప్రధాన మార్గం. ‘దండు బాట’గా పిలుచుకునే ఈ రోడ్డుపైనే మూసీ దాటేందుకు అద్భుతంగా వంతెన నిర్మించాడు. సైనికాధికారి ఎడ్రూస్ ప్లాన్.. అయితే 1948 సెప్టెంబర్‌లో భారత సైన్యం దాడికి ఉపక్రమించబోతోందని నిజాంకు సమాచారం వచ్చింది. అప్పటికే ఢిల్లీలోని కొందరు పెద్దలతో నిజాం మంతనాలు జరిపాడు. పెద్దగా ప్రతిఘటించొద్దన్న సంకేతాలొచ్చాయి. దానికి నిజాం కొన్ని షరతులు పెట్టాడు. తుది నిర్ణయంపైనే తర్జనభర్జన నడుస్తోంది(ఇది చరిత్ర పరిశోధకుల మాట). సైనిక చర్యపై నిజాం ఆంతరంగికులలో ముఖ్యుడైన సైనికదళా«దిపతి జనరల్ ఎడ్రూస్ వెంటనే కార్యరంగంలోకి దిగాడు. నిర్ణయం తీసుకునేందుకు నిజాంకు సమయం కావాలని గుర్తించిన ఎడ్రూస్, భారత సైన్యం వెంటనే హైదరాబాద్‌కు చేరకుండా అడ్డుకోవాలనుకున్నాడు. నగరానికొచ్చే ప్రధాన మార్గాలు, సైన్యం ఏయే ప్రాంతాల నుంచి వస్తుందో మ్యాప్ రూపొందించుకున్నాడు. సైన్యాన్ని నిలువరించాలంటే వంతెనలు పేల్చేయడమే మార్గమనే నిర్ణయానికొచ్చాడు. మహారాష్ట్ర నుంచి వచ్చే సైన్యాన్ని అడ్డుకునేందుకు ఉస్మానాబాద్ మార్గంలోని మూడు వంతెనలు గుర్తించాడు. ఒడిశా గుండా వస్తున్న సైన్యాలను, ఆంధ్రాప్రాంతం నుంచి ఖమ్మం మీదుగా వస్తున్న సైన్యాలను ఆపేందుకు టేకుమట్ల వంతెనను పేల్చాలని నిర్ణయించాడు. దీంతో 15 రోజులు సైన్యాన్ని నిలవరించగలమని చెప్పి.. నిజాం ఆమోదంతో వంతెనలు పేల్చేందుకు బృందాలను పంపాడు. అందులో భాగంగా సెప్టెంబరు 16న సూర్యాపేట వంతెనను పేల్చేశారు. ఇంతా చేస్తే ఈ వ్యూహం పారలేదు. కొన్ని దళాలు అనుకున్న సమయానికే హైదరాబాద్‌కు చేరుకోగలిగాయి. మళ్లీ నిర్మాణం.. సైనిక చర్య ముగిసి హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం అయినప్పటికీ, నాటి కేంద్రప్రభుత్వంతో జరిగిన ఒప్పందం మేరకు రాజ్‌ప్రముఖ్‌గా కొనసాగిన నిజాం.. సూర్యాపేట వంతెనను పునర్నిర్మింపజేశాడు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ఆధునిక వంతెనను నిర్మించేవరకు సేవలందించిన ఆ వంతెన.. నాటి జ్ఞాపకాలను నెమరేసుకుంటోందన్నట్టుగా విశ్రాంతి తీసుకుంటోంది. -
నలువైపులా ముట్టడి.. హైదరాబాద్‌పై ఐదు రోజుల ‘ఆపరేషన్’
సాక్షి, హైదరాబాద్: స్ట్రైక్.. స్మాష్.. కిల్.. వీర్.. ఇవి కేవలం నాలుగు పదాలు కాదు.. భారత సైన్యాన్ని హైదరాబాద్ సంస్థానంపైకి నడిపించిన నాలుగు సైనిక దళాల పేర్లు అవి.. సంస్థానాన్ని నలువైపుల నుంచీ ముట్టడించి నిజాం సైన్యాలను తరిమికొట్టిన దళాలు అవి.. నాటి భారత సైన్యం దక్షిణ మండల ప్రధానాధికారి గొడాల్ట్ వ్యూహ రచన మేరకు ‘ఆపరేషన్ పోలో’పేరిట జరిగిన సైనిక చర్యలో.. హైదరాబాద్ సంస్థానంపై నలుదిక్కుల నుంచీ దాడులు జరిగాయి. నల్దుర్గ్ నుంచి నార్కట్‌పల్లి.. ఔరంగాబాద్ నుంచి హోమ్నాబాద్ వరకు జరిగిన ఈ దాడుల వివరాలన్నీ భారత సైన్యానికి చెందిన అధికార పత్రాల్లో ఉన్నాయని చరిత్రకారులు చెప్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. ఆపరేషన్ పోలో గురించి ఒక్కొక్కరు ఒక్కో కథనం వినిపిస్తుండగా.. కొందరు చరిత్రకారులు భారత సైన్యం అధికారిక పత్రాల్లో పేర్కొన్న అంశాలను వివరిస్తున్నారు. ఆ వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 12న మొదలు.. మద్రాసు, ముంబై రాష్ట్రంలోని సేనలు హైదరాబాద్ సంస్థానం వైపు కదలాలని 1948 సెపె్టంబర్ 12న భారత సైన్యం అధికారికంగా ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం మహారాష్ట్రలోని నల్దుర్గ్ ప్రాంతంలో నిజాం సైన్యం ఏర్పాటు చేసుకున్న శిబిరం తమ వశమైందని సెపె్టంబర్ 13న ఉదయం భారత సైన్యం అధికారికంగా వెల్లడించింది. ఆ రోజునే సైనిక చర్య ప్రారంభమైందని కూడా ప్రకటించింది. తొలుత సైనిక చర్యకు ‘ఆపరేషన్ కాటర్ పిల్లర్’అనే పేరు పెట్టినా.. తర్వాత ‘ఆపరేషన్ పోలో’పేరుతో కొనసాగించారు. నాలుగు వైపుల నుంచీ.. హైదరాబాద్ సంస్థానంపై భారత సైన్యం దాడి నలువైపులా ఒకేసారి ప్రారంభమైందని చరిత్రకారులు చెప్తున్నారు. షోలాపూర్–హైదరాబాద్ మార్గంలో పశ్చిమ దిశ నుంచి మేజర్ జనరల్ జయంత్‌నాథ్ చౌదరి నాయకత్వంలోని దళం.. విజయవాడ– హైదరాబాద్ మార్గంలో తూర్పు దిశ నుంచి మేజర్ జనరల్ ఏఏ రుద్ర నాయకత్వంలోని దళం ముందుకు నడిచాయి. ఈ దళాల దాడి సాగుతుండగానే రైల్వే మార్గాల రక్షణతోపాటు నిజాం సైన్యం, రజాకార్లు పారిపోకుండా ఉండేందుకు దక్షిణాన కర్నూలు వైపు నుంచి మరో దళం కదిలింది. ఉత్తర దిశలోని జాల్నా వైపు నుంచి ఇంకో దళం దాడి మొదలుపెట్టింది. ఈ నాలుగు దళాలకు స్ట్రైక్, స్మాష్, కిల్, వీర్ ఫోర్స్లుగా నామకరణం చేశారు. 9వ డొగ్రా బెటాలియన్, 1వ ఆర్మర్డ్ బ్రిగేడ్, 7వ, 9వ ఇన్ఫాంట్రీ బ్రిగేడ్లు, భారత వైమానిక దళానికి చెందిన రెండు విమానాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. ఐదు రోజుల పాటు సాగి.. సైన్యం ప్రకటన మేరకు 1948 సెపె్టంబర్ 13న ఉదయం ప్రారంభమైన ‘ఆపరేషన్ పోలో’ఐదు రోజుల పాటు కొనసాగింది. ఈ ఐదు రోజుల పాటు ఏ రోజు ఏం జరిగిందో సైనిక పత్రాల్లో రాసి ఉంది. నల్దుర్గ్ కోట పతనం, బోరీ నది మీద వంతెన కూలగొట్టడం వంటి విధ్వంసాలనూ పత్రాల్లో నమోదు చేశారు. ఈ సందర్భంగా సూర్యాపేటను జల్లెడ పట్టాం, సూర్యాపేట పతనమైంది, నార్కట్‌పల్లి పతనమైంది, చిట్యాల దగ్గర ఉన్నాం, కాప్చరింగ్ జాల్నా, ఔరాంగాబాద్, హోమ్నాబాద్ అంటూ.. యుద్ధంలో ప్రాంతాలను, స్థావరాలను స్వాధీనం చేసుకున్న తరహాలో భాషనే ఇందులో ఉపయోగించారు. నాటి పత్రికల్లో కూడా.. అధికారిక సైన్య పత్రాలతోపాటు నాటి పత్రికలు కూడా అప్పట్లో జరిగిన ఉదంతాలను ఉటంకిస్తూ కథనాలు రాశాయి. మెర్జర్, అనెక్సేషన్, యాక్సెషన్, అటాక్, యాక్షన్, మిలిటరీ ఆపరేషన్, ఎండ్ ఆఫ్ అసఫ్‌జాహీ రూల్, హైదరాబాద్ పతనం, విలీనం, ఆక్రమణ అనే పదాలు తప్ప సమకాలీనంగా ఇతర మాటలు అప్పట్లో వాడలేదు. నాటి సమకాలీన పత్రికలన్నీ ఈ దాడిని ‘ఇండియా ఇన్వేడ్స్’ అని రాశాయి. స్వయంగా భారత ప్రభుత్వం దీనిని సైనిక చర్యగానే పేర్కొంది. రూ.3.5 కోట్ల ఖర్చుతో.. ‘ఆపరేషన్ పోలో’దాడికి రూ.3.5 కోట్లు ఖర్చయిందని సైనిక పత్రాల్లో పేర్కొన్నట్టు చరిత్రకారులు చెప్తున్నారు. మొత్తం 66 మంది ఇండియన్ యూనియన్ సైనికులు చనిపోగా, 97 మంది గాయపడ్డారని, 490 మంది నిజాం సైన్యం చనిపోగా, 122 మంది గాయపడ్డారని వివరిస్తున్నారు. సైనిక చర్యలో జరిగిన నష్టాలపైనా అప్పటి పత్రికలు కథనాలు రాశాయి. హైదరాబాద్‌పై విజయం సాధించడంపై నాటి సైనిక చర్యకు నాయకత్వం వహించిన మేజర్ జనరల్ రాజేంద్ర సింహ్జీకి బంగారు ఖడ్గంతోపాటు భగవద్గీత గ్రంథాన్ని బహూకరించాలని తూర్పు పంజాబ్ విశ్వవిద్యాలయ హిందూ రక్షణార్థి విద్యార్థులు తీర్మానించారు. వారు దక్షిణ భారత మిలటరీ శాఖను అభినందించారని నాటి పత్రికల్లో రాశారు. ఇదీ చదవండి: Operation Polo: నిజాంను తెలివిగా తోకముడిచేలా చేసిన వల్లభాయ్ పటేల్ -
హైదరాబాద్‌పై కేంద్రం సైనిక చర్య.. ‘ఆపరేషన్ పోలో’ పేరెలా వచ్చింది?
హైదరాబాద్‌లో ఖాసీం రిజ్వీ అరాచాకాలు పెరుగుతుండటంతో శాంతిభద్రతలు పూర్తిగా సన్నగిల్లే ప్రమాదం ఉందని నిఘావర్గాలు భారత ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. చాలా సున్నితమైన హైదరాబాద్ సంస్థానం విలీనం అంశంపై నెహ్రూ-పటేల్‌లు ఇంకా ఏకాభిప్రాయానికి రాలేదు. దీంతో ఓ వైపు సైన్యం సిద్ధమవుతున్నా హైదరాబాద్‌పై సైనిక చర్య జరుగుతుందా లేదా అనే విషయంపై గందరగోళం నెలకొంది. చివరికి సెప్టెంబర్‌లో హైదరాబాద్ సంస్థానంలోకి భారతసైన్యం అడుగుపెట్టడానికి పటేల్ ఓకే అన్నారు. దీనికి ఆపరేషన్ పోలో అని నామకరణం చేశారు. హైదరాబాద్‌లోని పోలో గ్రౌండ్స్ వల్లే సైనికచర్యకు పోలో అనే పేరుపెట్టారని కొందరు చరిత్రకారులు అంటారు. ఇక హైదరాబాద్‌లో భారత సైన్యం ప్రవేశాన్ని సైనిక చర్య అని పిలవకుండా పోలీసు చర్యగా పిలవాలని నిర్ణయించారు. సైనిక చర్య అంటే మళ్లీ అంతర్జాతీయంగా వివాదం రేగే ప్రమాదం ఉంటుందని.. పోలీసుచర్య అంతర్గత వ్యవహారంగా ఉంటుందనేది పటేల్ భావన. అయితే తరువాతి కాలంలో ఆపరేషన్ పోలోను ఆపరేషన్ క్యాటర్ పిల్లర్‌గా మార్చారు. ఇక అటు భారత్ సైనిక చర్యకు సిద్ధమవుతుందనే సమాచారం నిజాం చెవినపడింది. దీంతో ఎలాగైనా యుద్ధం చేయాలని నిజాం నిర్ణయించుకున్నాడు. దీనికోసం తన మంత్రి లాయక్ అలీని లండన్‌కు పంపి అక్కడ భారీగా అయుధాలు కొనుగోలు చేయడానికి ప్రయత్నించాడు. ఇక సిడ్నీ కాటన్ అనే ఆస్ట్రేలియాకు చెందిన పైలట్ ద్వారా యుద్ద విమానాలు కొనుగోలు చేయాలని నిర్ణయించాడు. దీంతో ఆపరేషన్ పోలోను వేగవంతం చేయాలని భారత సైన్యం నిర్ణయించింది. ఆపరేషన్ పోలో ఎప్పుడు ప్రారంభమయినా యుద్ధం ఎక్కువ కాలం కొనసాగకూడదని పటేల్ నిశ్చయించుకున్నారు. ఒకవేళ యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే నిజాం సంస్థానంలో మత కల్లోలాలు చెలరేగే ప్రమాదం ఉందని పటేల్ ఆందోళన చెందారు. నిజాం రాజుకు దేశవ్యాప్తంగా ముస్లింలలో ఉన్న పలుకుబడి వల్ల ఈ కల్లోలాలు దేశవ్యాప్తంగా విస్తరించే ప్రమాదం ఉందని ఉక్కుమనిషి ముందే ఊహించారు. దీంతోపాటు యుద్ధం ఆలస్యం అయితే ఇదే అదనుగా పాకిస్తాన్ కాశ్మీర్లో ఇబ్బందులు సృష్టించే ప్రమాదం ఉంది. అందుకే పటేల్ సైనిక చర్యను వేగంగా ముగించాలని పట్టుదల ప్రదర్శించారు. సెప్టెంబర్ 13న సైనికచర్యకు అన్ని రకాలుగా రంగం సిద్ధమయింది. సరిగ్గా రెండు రోజుల ముందు పాకిస్తాన్లో జిన్నా సెప్టెంబర్-11న చనిపోయాడు. భారత ఆర్మీకి జిన్నా మృతి రూపంలో అవకాశం కలిసి వచ్చింది. దీంతో 13వ తేదీన సైనికచర్య ప్రారంభిస్తే పాకిస్థాన్ అంత తొందరగా స్పందించే అవకాశం ఉండదని పటేల్ భావించారు. సెప్టెంబర్-13 తెల్లవారు జామున ఆపరేషన్ పోలో ప్రారంభమైంది. అయితే ఆపరేషన్ పోలో ప్రారంభం విషయం ప్రధాని నెహ్రూకు తెలియదని పటేల్ నెహ్రూకు చెప్పకుండానే ఆపరేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. ఇటు హైదరాబాద్‌పై పోలీసు చర్య ప్రారంభం కాగానే అప్పటి పాకిస్థాన్ ప్రధాని లియాఖత్ అలీఖాన్ అత్యవసరంగా తన డిఫెన్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో భారత్ ఆర్మీ హైదరాబాద్ సంస్థానంపై దాడి చేసిన నేపథ్యంలో.. హైదరాబాద్‌లో ఉన్న భారత సైన్యంపై పాకిస్తాన్ ఏమైనా చర్యకు దిగే అవకాశాలున్నాయా అని తన సైన్యాన్ని ప్రశ్నించారు. పాకిస్థాన్ సైన్యంలో కెప్టెన్‌గా ఉన్న ఎలవర్థీ.. హైదరాబాద్‌లో పాకిస్తాన్ ఎలాంటి సైనిక చర్యకు దిగే అవకాశం లేదని స్పష్టంచేశారు.. దీంతో ఢిల్లీ పైన పాకిస్థాన్ బాంబులు వేసే అవకాశం ఉందా? అని లియాఖత్ అలీఖాన్ మరో ప్రశ్నవేశారు. దీనికి సమాధానంగా ఎలవర్దీ పాకిస్థాన్ వద్ద ప్రస్తుతం నాలుగు యుద్ధ విమానాలే ఉన్నాయని.. అందులో రెండు పనిచేయడం లేదన్నాడు. తమ వద్ద ఉన్న రెండు విమానాల్లో ఒకటి మాత్రమే ఢిల్లీ వరకు వెళ్లగలదని.. అయితే అది తిరిగివచ్చే గ్యారంటీ లేదని స్పష్టం చేశాడు. దీంతో హైదరాబాద్ విషయంలో జోక్యం చేసుకోకపోవడమే మంచిదని పాకిస్థాన్ నిర్ణయించింది. -
Shoyabullakhan: అక్షర యోధుడు షోయబుల్లాఖాన్
భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వస్తే హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణకు మాత్రం 13 నెలల తర్వాత స్వాతంత్య్రం సిద్ధించింది. హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనం కావడానికి ఎందరో దేశభక్తులు నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడారు. నిజాం నిరంకుశత్వానికి.. రజాకార్ల ఆరాచకాలను ప్రపంచానికి తెలిసేలా వార్తలు, సంపాదకీయాలు రాసిన షోయబ్–ఉల్లా–ఖాన్ గురించి మనం తెలుసుకోవాలి. హైదరాబాద్ సంస్థానం పరిధిలోని ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చాలని తన కలాన్ని గళంగా మార్చుకుని నిజాం వ్యతిరేకంగా నిర్భయంగా పోరాడుతూ అసువులు బాసిన షోయబుల్లాఖాన్‌కు సలాం. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా నేటి యువత, విద్యార్థులు ఆయన గురించి తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ కథనం. పోచారం: ప్రజాస్వామ్య విలువల కోసం అక్షర పోరాటం చేస్తూ.. నడి రోడ్డుపై ప్రాణ త్యాగం చేసిన షోయబుల్లాఖాన్ జీవితం నేటి సమాజానికి స్ఫూర్తిదాయకం. 1947 ఆగష్టు 15న భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించాక హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయాలని షోయబ్ ఆకాంక్షించారు. ఆ తరుణంలోనే హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేయాలని నిజాం రాజుకు ఏడుగురు ముస్లిం పెద్దలు విజ్ఞాపన పత్రం సమర్పించారు. దీనిని షోయబ్ తన సొంత పత్రిక ఇమ్రోజ్‌లో ప్రచురించారు. పత్రికలో వచ్చిన కథనాన్ని ఐక్యరాజ్య సమితిలో భారత్ ప్రస్తావిస్తుందేమోనని నిజాం భయపడి షోయబ్‌ను హత్య చేయించాడు. కుటుంబ నేపథ్యం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వీరి కుటుంబం నిజాం ప్రాంతానికి వలస వచ్చింది. ఖమ్మం జిల్లా సుబ్రవేడ్‌లో 1920 అక్టోబర్ 17న హబీబుల్లాఖాన్, లాయహున్నీసా బేగం దంపతులకు షోయబుల్లాఖాన్ జన్మించారు. తేజ్, రయ్యత్ పత్రికల్లో జర్నలిస్టుగా.. ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తేజ్ అనే ఉర్దూ పత్రికలో చేరి రజాకార్ల అరాచకాలపై అక్షర నిప్పులు చెరిగేవారు. దీంతో తేజ్ పత్రికను సర్కార్ నిషేధించడంతో రయ్యత్ పత్రికలో చేరారు. చివరకు రయ్యత్ పత్రికను ప్రభుత్వం మూసివేయించింది. బూర్గుల సాయంతో ఇమ్రోజ్ పత్రిక స్థాపన నగలు నట్రా అమ్మి బూర్గుల రామకృష్ణారావు సహాయంతో హైదరాబాద్‌లోని కాచిగూడలో ఇమ్రోజ్ అనే పత్రికను షోయబ్ స్థాపించారు. షోయబ్ రచనలకు రగిలిపోయిన ఖాసిం రజ్వీ 1947 నవంబర్ 17న తొలి సంచిక వెలువడింది. నిజాం సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయాలంటూ పదునైన సంపాదకీయాలు రచించేవారు. వీరి రచనలకు రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీ రగిలిపోయాడు. (క్లిక్: చరిత్రను కాటేయ జూస్తున్నారు!) చప్పల్‌బజార్ రోడ్డులో చంపిన రజాకార్లు ► 1948 ఆసుస్టు 21న కాచిగూడ రైల్వే స్టేషన్‌లోని ఇమ్రోజ్ ఆఫీస్ నుంచి అర్ధరాత్రి తన బావమరిది ఇస్మాయిల్‌ఖాన్‌తో కలిసి ఇంటికి వస్తుండగా చప్పల్‌బజార్ రోడ్డులో రజాకార్లు అతిక్రూరంగా చేతిని నరికి తుపాకులతో బుల్లెట్ల వర్షం కురిపించారు. ► అడ్డుకోబోయిన తన బావమరిది చేతులు సైతం నరికేశారు. రక్తపు మడుగులో విలవిల్లాడుతూ 1948 ఆగస్టు 22వ తేదీన తెల్లవారు జామున షోయబ్ తుదిశ్వాస విడిచారు. ► ప్రస్తుతం వీరి కుటుంబ సభ్యులు పోచారం మున్సిపాలిటీ పరిధిలోని సంస్కృతి టౌన్షిప్లో నివసిస్తున్నారు. మలక్‌పేట్‌లో షోయబ్ పేరుతో ఒక గదిలో లైబ్రరీ, చుట్టూ చిన్న పార్కు ఏర్పాటు చేశారు. (క్లిక్: సెప్టెంబర్ 17.. ప్రాధాన్యత ఏమిటి?) -
రజాకార్లకు ఎదురొడ్డిన గుండ్రాంపల్లి!
చిట్యాల: నిజాం కాలంలో రజాకార్ల అకృత్యాలకు సజీవ సాక్ష్యం నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లి గ్రామం. నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో ఇక్కడి యువకులెందరో రజాకార్లకు ఎదురొడ్డి పోరాడి ప్రాణాలు వదిలారు. నాటి పోరాటానికి జ్ఞాపకంగా గ్రామంలో అమరవీరుల స్తూపం సగౌరవంగా నిలబడి ఉంది. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం తమ గ్రామానికి తగిన గుర్తింపు లేదని స్థానికులు వాపోతున్నారు. రక్షక దళాలుగా ఏర్పడి.. రజాకార్ల దారుణాలు సాగుతున్న సమయంలో సూర్యాపేట తాలూకా వర్దమానకోటకు చెందిన సయ్యద్ మక్బూల్ అనే వ్యక్తి.. తన సోదరి నివాసం ఉంటున్న గుండ్రాంపల్లికి వలస వచ్చాడు. మొదట బతుకుదెరువు కోసం ఇదే మండలం ఏపూరులో ఒక భూస్వామి వద్ద పనిలో చేరాడు. కానీ తర్వాత రజాకార్ల బృందంలో చేరాడు. గుండ్రాంపల్లి కేంద్రంగా సాయుధ పోరాటంలో పాల్గొంటున్నవారిపై రజాకార్లతో కలిసి అరాచకాలకు పాల్పడ్డాడు. అవి ఎంత దారుణంగా ఉండేవంటే.. గ్రామంలో తాను నిర్మించుకున్న ఇంటి పునాదిలో నిండు గర్భిణులను సజీవ సమాధి చేసి ఆపై నిర్మాణాన్ని చేపట్టాడని గ్రామస్తులు చెప్తున్నారు. ఈ క్రమంలో మక్బూల్, ఇతర రజాకార్ల ఆగడాలను అడ్డుకోవడానికి గుండ్రాంపల్లి కేంద్రంగా ఏపూర్, రెడ్డిబావి, సైదాబాద్, గుండ్లబావి, ఆరెగూడెం, పలివెల, వెలిమినేడు, పెద్దకాపర్తి, చిన్నకాపర్తి, ఎలికట్టె గ్రామాలకు చెందిన యువకులు రక్షక దళాలుగా ఏర్పడ్డారు. రజాకార్ల దాడులను తిప్పికొట్టారు. 30 మందిని సజీవ దహనం చేసి.. గుండ్రాంపల్లి కేంద్రంగా జరుగుతున్న తిరుగుబాటుతో రగిలిపోయిన మక్బూల్.. పెద్ద సంఖ్యలో రజాకార్లను కూడగట్టి భారీ దాడికి దిగాడు. తమకు దొరికిన 30 మంది యువకులను గుండ్రాంపల్లిలో ఎడ్లబండ్లకు కట్టి చిత్రహింసలు పెట్టాడు. తర్వాత గుండ్రాంపల్లి నడిబొడ్డున మసీదు ఎదురుగా బావిలో వారందరినీ పడేసి సజీవ దహనం చేశాడు. ఇది తట్టుకోలేక ప్రజలు తిరగబడ్డారు. ప్రస్తుత మునుగోడు మండలం పలివెలకు చెందిన కొండవీటి గురునాథరెడ్డి నాయకత్వంలో సాయుధ దళాలు మక్బూల్‌పై దాడికి ప్రయత్నించాయి. కానీ మక్బూల్ తప్పించుకున్నాడు. తర్వాత మరోసారి చేసిన దాడిలో మక్బూల్ చేయి విరిగినా, ప్రాణాలతో తప్పించుకుని పారిపోయాడు. మక్బూల్‌కు సహకరించిన వారి ఇళ్లపై కమ్యూనిస్టు సాయుధ దళాలు దాడి చేసి హతమార్చాయి. నిజాం పాలన నుంచి విముక్తి లభించాక గుండ్రాంపల్లి ఊపిరిపీల్చుకుంది. నాటి పోరాటంలో యువకులను సజీవ దహనం చేసినచోట 1993 జూన్ 4న సీపీఐ ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపాన్ని నిర్మించారు. అమరులైన వారిలో గుర్తించిన 26 మంది పేర్లను ఆ స్తూపంపై రాశారు. ఏటా సెప్టెంబర్ 17న తెలంగాణవాదులు ఈ స్తూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నారు. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి విస్తరణలో ఈ స్థూపాన్ని తొలగించగా.. మరోచోట అమరవీరుల స్తూపాన్ని నూతనంగా ఏర్పాటు చేశారు. గ్రామాన్ని సందర్శించిన అమిత్ షా 2017 మే నెలలో గుండ్రాంపల్లి గ్రామాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సందర్శించారు. నాటి సాయుధ పోరాటంలో అసువులు బాసిన వారసులను ఆయన సన్మానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర సందర్భంగా ఈ ఏడాది జూలైలో గుండ్రాంపల్లిని సందర్శించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే గుండ్రాంపల్లి గ్రామ చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చుతామని.. గ్రామంలో స్మారక కేంద్రం, మ్యూజియం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రజాకార్ల దుర్మార్గాలు చెప్పలేనివి నాకు ఏడేళ్ల వయసు ఉన్నప్పుడు రజాకార్ల దాడులు జరిగాయి. గ్రామంలోని యువకులు దళాలుగా ఏర్పడి తిరుగుబాటు చేశారు. రజాకార్లు వారిని పట్టుకుని చంపేశారు. తర్వాత మా ఊరితోపాటు చుట్టుపక్కల గ్రామాల వారంతా కలిసి మక్బూల్‌పై దాడి చేశారు. నాటి రజాకార్ల దుర్మార్గాలు చెప్పనలవికాదు. – గోపగోని రామలింగయ్య, గుండ్రాంపల్లి గుండ్రాంపల్లికి గుర్తింపు ఇవ్వాలి నిజాం నవాబుకు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గుండ్రాంపల్లి గ్రామ చరిత్రకు తగిన గుర్తింపు ఇవ్వాలి. పోరాట చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చి ముందు తరాలకు తెలియజేయాలి. ఏటా సెప్టెంబర్ 17న మా గ్రామంలో అధికారికంగా ఉత్సవాలను నిర్వహించాలి. – గరిశె అంజయ్య, గ్రామ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు,గుండ్రాంపల్లి -
నిజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్సవ సమితి ఆవిర్భావం
సనత్‌నగర్ (హైదరాబాద్): భారత స్వాతంత్య్ర అమృతోత్సవాలు పూర్తి చేసుకున్న వేళ..నిజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్సవాల నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం ‘నైజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్సవ సమితి’ పురుడుపోసుకుంది. ఈ సమితి సెప్టెంబర్ 17 నుంచి ప్రత్యక్ష కార్యాచరణకు రంగంలోకి దిగనుంది. బేగంపేటలోని ఓ ప్రైవేటు హోటల్లో శనివారం సాయంత్రం జరిగిన ఉత్సవ సమితి సభ్యుల సమావేశంలో కమిటీని ప్రకటించి పలు తీర్మానాలు చేశారు. సెప్టెంబర్ 17న అన్ని జిల్లాల్లో, రెవెన్యూ మండల కేంద్రాల్లో ప్రముఖులు, యువకులతో ఈ అమృతోత్సవాలను ప్రారంభించి జనవరి 2023లో అన్ని గ్రామాల్లో ‘జనజాగరణ’ ద్వారా తెలంగాణ స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని చాటుతామని రిటైర్డ్ జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 17, 2023న గ్రామాల్లో ఇంటింటికీ త్రివర్ణ పతాక వందనంతో ఈ ఉత్సవాలను ముగిస్తామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సమావేశాలతో పాటు రాజకీయాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఉత్సవ సమితి కమిటీ ఇదే.. గౌరవాధ్యక్షుడిగా రిటైర్డ్ జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి, అధ్యక్షుడిగా స్వాతంత్య్ర సమరయోధుడు టీవీ నారాయణ కుమారుడు డాక్టర్ వంశ తిలక్, ఉపాధ్యక్షుడిగా రిటైర్డ్ ఐఏఎస్ చామర్తి ఉమామహేశ్వరరావు, రిటైర్డ్ లేబర్ కమిషనర్ హెచ్‌కే నాగు, ఉస్మానియా వర్సిటీ తెలుగు విభాగం మాజీ అధిపతి కసిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా మసడి బాపురావు (వరంగల్), కార్యదర్శులుగా నిరంజనచారి (కరీంనగర్), ఇటిక్యాల కృష్ణయ్య (నల్లగొండ), గడ్డం సరోజాదేవి (మాజీ ఎంపీ వివేక్ సతీమణి), కోశాధికారిగా చంద్రశేఖర్లతో పాటు మరో 18 మంది సభ్యులు కమిటీలో ఉన్నారు. ఈ కమిటీ 2022–23 ఏడాది కాలం పాటు ఉంటుంది. -
నిజాం రాజ్యంలో నిశ్శబ్దం!
సాక్షి, హైదరాబాద్: అది 1947 ఆగస్టు 15. పరాయి పాలన నుంచి విముక్తి పొంది దేశమంతా ఆనందోత్సాహాలతో పండగ జరుపుకొంటున్న వేళ. వినువీధుల్లో మువ్వన్నెల జెండా సగర్వంగా, సమున్నతంగా రెపరెపలాడిన తరుణం. ఆబాలగోపాలం స్వాతంత్య్ర వేడుకల్లో మునిగిపోయారు. కానీ.. ఆ రోజు హైదరాబాద్‌లో మాత్రం నిశ్శబ్దం రాజ్యమేలింది. నగరవాసులు ఇళ్లకే పరిమిత మయ్యారు. ఎక్కడో ఒకచోట కొంతమంది దేశభక్తులు రహస్యంగా త్రివర్ణ పతాకలతో సంతోషం వ్యక్తం చేశారు. కానీ ఎక్కడా జాతీయ జెండాలను ఎగురవేయలేదు. నగరంలో కర్ఫ్యూ విధించినట్లుగా రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అప్పటికే నిజాం నియంతృత్వ పాలనలో మగ్గుతున్న జనం ఆశావహ దృక్పథంతో స్వాతంత్య్రం కోసం ఎదురుచూశారు. శుక్రవారమూ ఓ కారణమే! దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజు శుక్రవారం. హైదరాబాద్‌కు అది సెలవు దినం. దాంతో నగరంలోని ప్రభు త్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, కళాశాలలు మూసి ఉన్నాయి. వ్యాణిజ్య సంస్థలు కూడా మూసి వేయడంతో సాధారణంగానే జనసంచారం లేకుండా పోయింది. ‘ఒకవేళ అది వర్కింగ్ డే అయి ఉంటే వాతావరణం మరోలా ఉండేది. ఎందుకంటే అప్పటికే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జాతీయోద్యమ భావాలు వెల్లువెత్తాయి. విద్యార్ధులు ఉద్యమాలు చేప ట్టారు. వందేమాతర ఉద్యమం పెద్ద ఎత్తున నడిచింది. బ్రిటిష్ ప్రభుత్వానికి బలమైన మద్దతుదారుగా నిలిచిన నిజాం వందేమాతర గీతాన్ని నిషేధించడంతో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఆ శుక్రవారం యూనివర్సిటీకి సెలవు కావడంతో విద్యార్థులు వేడుకలను నిర్వహించలేకపోయారు’ అని ఇంటాక్ సంస్థ ప్రతినిధి అనురాధారెడ్డికి ఆమె చిన్నతనంలో తన తల్లి స్నేహలత చెప్పినట్లు గుర్తు చేశారు. దక్కన్ రేడియో మూగనోము... అప్పటికి హైదరాబాద్‌లో ఉన్న ముఖ్య మైన ప్రసారమాధ్యమం దక్కన్ రేడియో. ఆ రోజు యథావిధిగా అన్ని రకాల కార్యక్రమాలను ప్రసారం చేశా రు. కానీ స్వాతంత్య్ర వేడుకలను గురించి ఒక్క మాటైనా రేడియోలో ప్రస్తావించకపోవడం గమనార్హం. దేశవ్యాప్తంగా జరుగుతున్న వేడుకలను దక్కన్ రేడియో ప్రసారం చేయలేదు. దీంతో నగరవాసులు ఆల్ ఇండియా రేడి యో, బీబీసీ రేడియోలను ఆ శ్రయించారు. ‘ఆ రోజు మా అమ్మ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వెళ్లారట. కానీ అక్క డా ఎలాంటి సందడి లేదు. కొద్దిమంది ప్రయాణికులు తప్ప రైల్వేస్టేషన్ చాలా వరకు నిర్మానుష్యంగా ఉంది’ అని చెప్పినట్లు అనురాధ గుర్తు చేశారు. అదే సమయంలో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, ఆర్యసమాజ్‌ల ఆధ్వర్యంలో మాత్రం సికింద్రాబాద్, నారాయణగూడలలో కొద్దిమంది నాయకులు త్రివర్ణ పతాకలను ఎగురవేశారని ఆమె పేర్కొన్నారు. (చదవండి: అమృతోత్సాహం.. 76వ స్వాతంత్య్ర దినోత్సవాలకు దేశం సిద్ధం ) -
అనగనగా హైదరాబాద్.. భాగ్యనగరంలో స్వరాజ్య సమరశంఖం
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో ఆ రోజు మువ్వన్నెల జెండా రెపరెపలాడలేదు. దేశమంతా స్వాతంత్య్రోత్సవాలు వెల్లివిరిసిన 1947 ఆగస్టు 15న హైదరాబాద్‌లో జాతీయోద్యమ నేతలు, కాంగ్రెస్ నాయకులు, వివిధ వర్గాల ప్రజలు రహస్యంగానే తమ దేశభక్తిని చాటుకున్నారు. కానీ దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన జాతీయోద్యమానికి దీటుగా హైదరాబాద్‌లోనూ మహత్తరమైన స్వాతంత్య్ర పోరాటాలు జరిగాయి. న గరంలోని అబిడ్స్, కోఠి, సుల్తాన్‌బజార్, బొగ్గులకుంట, ట్రూప్‌బజార్, కుందన్‌బాగ్ వంటి ప్రాంతాలు స్వాతంత్య్రోద్యమ నినాదాలతో మార్మోగాయి. గాంధీజీ పిలుపు మేరకు స్వామి రామానంద తీర్థ నేతృత్వంలో స్టేట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉద్యమాలను చేపట్టారు. ఇదంతా ఒకవైపు అయితే భారత ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంగా పేరొందిన సిపాయిల తిరుగుబాటు హైదరాబాద్‌లోనూ ఉవ్వెత్తున ఎగిసిపడింది. బ్రిటిష్ వలస పాలనను, ఆధిపత్యాన్ని ప్రతిఘటించింది. ఒప్పందంపై నిరసన... అప్పటి నిజాం నవాబు 1800 బ్రిటిష్ ప్రభుత్వంతో సైనిక సహకార ఒప్పందం ఏర్పాటు చేసుకున్నాడు. ఈ మేరకు బ్రిటిష్ అధికార ప్రతినిధికి హైదరాబాద్‌లో రెసిడెన్సీ (కోఠి)ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అదే ఏడాది అక్టోబర్ 12 నుంచి సహకార ఒప్పందం అమల్లోకి వచ్చింది. అయితే అప్పటికే జాతీయ భావాలతో చైతన్యం పొందిన యువత బ్రిటిష్ ఆధిపత్యం పట్ల తమ వ్యతిరేకతను చాటుకుంది. అదే సమయంలో బెంగాల్ సహా దేశవ్యాప్తంగా బ్రిటిష్ పాలకుల వ్యతిరేకంగా మొదలైన వహాబీ ఉద్యమం నగరంలోని ఉద్యమకారులను ప్రభావితం చేసింది. అప్పటి నిజాం నవాబు నసీరుద్దౌలా సోదరుడు ముబారిజ్ ఉద్దౌలా నగరంలో వహాబీ ఉద్యమానికి సారథ్యం వహించాడు. 20 వేల మంది వహాబీ ఉద్యమకారులతో బ్రిటిష్ అధికార ప్రతినిధిపై దాడికి ప్రయత్నించాడనే ఆరోపణలపై నిజాం ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసి 1854లో చనిపోయే వరకు కోటలోనే బంధించారు. చదవండి: ఇంటిపై జాతీయ జెండా ఎగురవేస్తున్నారా?.. ఈ నియమాలు తప్పనిసరి.. నగరంలో 1857 అలజడి.. మీరట్, లక్నో తదితర ప్రాంతాల్లో సిపాయిలు చేపట్టిన తిరుగుబాటు హైదరాబాద్‌లో పెద్దఎత్తున అలజడిని సృష్టించింది. అప్పటికే ముబారిజ్‌ద్దౌలా మృతితో ఆగ్రహంతో ఉన్న ఉద్యమకారులు బ్రిటిష్ ప్రభుత్వంపై ప్రతీకారేచ్ఛతో రగిలిపోయారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ కేంద్రంగా సిపాయిల తిరుగుబాటును చేపట్టేందుకు వచ్చాడనే ఆరోపణలతో జమేదార్ చీదాఖాన్‌ను అరెస్టు చేశారు. దీంతో బ్రిటిష్ ప్రభుత్వంపై ఉద్యమకారుల వ్యతిరేకత తీవ్రస్థాయికి చేరుకుంది. జమేదార్ తుర్రెబాజ్‌ఖాన్, మౌల్వీ అల్లావుద్దీన్‌ల నేతృత్వంలో సుమారు 500 మంది రొహిల్లాలు 1857 జూలై 17వ తేదీన బ్రిటిష్ రెసిడెన్సీ కోఠిపై దాడి చేశారు. బ్రిటిష్ సైనికుల ప్రతిఘటనతో ఇది విఫలమైంది. ‘బ్రిటిష్ వాళ్లను దేశం నుంచి తరిమివేయడమే తమ లక్ష్యమని’ తుర్రెబాజ్ ఖాన్ ప్రకటించడంతో అరెస్టు చేసి జీవిత ఖైదు విధించింది. జైలు నుంచి తప్పించుకొని పారిపోయే క్రమంలో పోలీసులు అత్యంత దారుణంగా కాల్చి చంపారు. అతని శవాన్ని జోగిపేట వద్ద బహిరంగంగా వేలాడదీసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. ♦ఇలా నగరంలో జాతీయోద్యమానికి స్ఫూర్తినిచ్చింది ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం.