సామ్రాజ్య భారతి.. 1860/1947
ఘట్టాలు
1857 తిరుగుబాట్లలో విధేయ పక్షమైన హైదరాబాద్ నైజాం పాలకులతో బ్రిటిష్ ప్రభుత్వం సరికొత్త సానుకూల ఒప్పందం కుదుర్చుకుంది. కొన్ని ప్రాంతాలను కానుకగా ఇచ్చింది.
చట్టాలు
హైదరాబాద్ నిజామ్ అఫ్జల్ ఉద్దౌలా (1860), ఇండియన్ పీనల్ కోడ్ యాక్ట్, ఇండియన్ సెక్యూరిటీస్ యాక్ట్, అడ్మిరాలిటీ జ్యూరిస్‌డిక్షన్ యాక్ట్, అడ్మిరాలిటీ అఫెన్సెస్ (కలోనియల్) యాక్ట్, సూపరాన్యుయేషన్ యాక్ట్, ఈస్టిండియా లోన్ యాక్ట్, ఈస్టిండియా స్టాక్ యాక్ట్‌లు... అమల్లోకి వచ్చాయి.
జననాలు
విష్ణు నారాయణ్ భత్కాంఢే, మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మించారు. భత్కాండే హిందూస్థానీ శాస్త్రీయ సంగీత పరిశోధకులు. బాంబేలో జన్మించారు. విశ్వేశ్వరయ్య ఇంజనీరు. పండితులు. రాజనీతిజ్ఞులు. 1912 నుండి 1918 వరకు మైసూరు సంస్థానానికి దివానుగా పని చేశారు. చిక్‌బళ్లాపూర్‌లో జన్మించారు.
మోక్షగుండం విశ్వేశ్వరయ్య
Comments
Please login to add a commentAdd a comment