Hyderabad
-
లగ్జరీ ఇళ్లల్లో కొత్త ట్రెండ్..
ఆధునికత, విలాసవంతమైన జీవనశైలికి యువ గృహ కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు. లగ్జరీ కాదు.. అంతకుమించి కోరుకుంటున్నారు. దీంతో 4 వేల నుంచి 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అపార్ట్మెంట్లను నిర్మిస్తున్నారు. ఇవి విశాలంగా ఉంటున్నాయే తప్ప సేవలపరంగా యువ కస్టమర్లలో అసంతృప్తి ఉంది. వీరిని సంతృప్తి పరిచేలా యువ డెవలపర్లు బ్రాండెడ్ హౌసింగ్‌లను నిర్మిస్తున్నారు. అగ్రశ్రేణి ఆతిథ్య సంస్థలతో కలిసి బ్రాండెడ్ రెసిడెన్సీ ప్రాజెక్ట్‌లను చేపడుతున్నారు. ఇప్పటివరకు ముంబై, బెంగళూరు, గుర్గావ్ వంటి నగరాలకే పరిమితమైన ఈ తరహా ప్రాజెక్ట్‌లు హైదరాబాద్‌లోనూ నిర్మితమవుతున్నాయి. – సాక్షి, సిటీబ్యూరోమారియట్, తాజ్, లీలా, ఇంటర్కాంటినెంటల్ వంటి అగ్రశ్రేణి ఆతిథ్య సంస్థలతో కలిసి విలాసవంతమైన అపార్ట్మెంట్లను నిర్మించడమే ఈ రెసిడెన్సీల ప్రత్యేకత. డిజైనింగ్, ఆర్కిటెక్చర్, ఎలివేషన్స్, విస్తీర్ణం, వసతులు, సేవలు.. అన్నీ టాప్ క్లాస్‌గా ఉంటాయి. బ్రాండెడ్ రెసిడెన్సీ అంటే కేవలం ప్రాపర్టీని కొనుగోలు చేయడం కాదు.. అంతర్జాతీయ జీవనశైలి అనుభూతిని పొందడం.బ్రాండెడ్ రెసిడెన్సీలు అంటే? స్టార్ హోటల్ సేవలు, అపార్ట్మెంట్ కలిపి ఉండే మిశ్రమ వినియోగ ప్రాజెక్ట్‌లనే బ్రాండెడ్ రెసిడెన్సీలు అంటారు. ఇందులో లేఔట్ స్థలంలో నివాసాల కోసం ప్రత్యేకంగా ఒక టవర్ ఉంటుంది. పక్కనే మరో టవర్‌లో హోటల్ ఉంటుంది. నివాసితులకు సేవలన్నీ ఆతిథ్య సంస్థలే అందిస్తాయి. కొన్ని ప్రాజెక్ట్‌లలో దిగువ అంతస్తుల్లో హోటల్, ఎగువ అంతస్తులో నివాస యూనిట్లు ఉంటాయి. నివాసితులకు ప్రత్యేక యాప్ ఉంటుంది. దాంట్లో నుంచి హోటల్లోని ఫుడ్, స్పా, సెలూన్ వంటి ఆర్డర్ చేయవచ్చు. వాళ్లే అపార్ట్‌మెంట్‌కు వచ్చి సర్వీస్ చేస్తారు. బ్రాండెడ్ గృహాల నిర్వహణ మొత్తం ఆతిథ్య సంస్థల ఆపరేటర్లే చూసుకుంటారు. హెచ్ఎన్ఐ, ప్రవాసులు కస్టమర్లు.. కొనుగోలుదారులకు అంతర్జాతీయ జీవనశైలి, డెవలపర్లకు అధిక రాబడి అందించే ప్రీమియం బ్రాండెడ్ గృహాలకు ఆదరణ పెరిగింది. ఫైవ్, సెవెన్ స్టార్ హోటళ్లు బ్రాండెడ్ రెసిడెన్సీల విభాగంలోకి ఎంట్రీ ఇచ్చాయి. దీంతో హెచ్ఎన్ఐలు(హై నెట్‌వర్త్ ఇండివిడ్యు వల్స్), ప్రవాసులు, బిజినెస్ టైకూన్లు, సినీ, క్రీడా సెలబ్రిటీలు డిజైనర్ హోమ్స్‌కు ఆసక్తి చూపిస్తున్నారు. బ్రాండెడ్ రెసిడెన్సీ కస్టమర్లు రెండు, లేదా మూడో గృహ కొనుగోలుదారులై ఉంటారు. దీంతో వీరికి ఆధునిక వసతులే అధిక ప్రాధాన్యత. ఎవరెక్కువ, వినూత్న, విలాసవంతమైన వసతులు అందిస్తారో అందులో కొనుగోలు చేస్తారు.ఎక్కడ వస్తున్నాయంటే.. దేశంలోని విలాసవంతమైన మార్కెట్లో హైదరాబాద్ వాటా 10 శాతంగా ఉంది. మన దేశంలో బ్రాండెడ్ హౌసెస్ 2,900 యూనిట్లు ఉండగా.. గ్లోబల్ మార్కెట్లో 3 శాతం వాటాగా నమోదైంది. అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు ఉన్న ప్రాంతాల్లోనే ఈ తరహా ప్రాజెక్ట్‌లకు డిమాండ్ ఉంటుంది. కోకాపేట, నియోపొలిస్, హైటెక్‌సిటీ, రాయదుర్గం, నానక్‌రాంగూడ, పుప్పాలగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రీమియం ప్రాంతాల్లో ఈ తరహా నిర్మాణాలు వస్తున్నాయి. శ్రీఆదిత్య హోమ్స్, బ్రిగేడ్ వంటి పలు నిర్మాణ సంస్థలు బ్రాండెడ్ రెసిడెన్సీలను నిర్మిస్తున్నాయి. వీటి ధరలు రూ.6–8 కోట్ల నుంచి ప్రారంభమవుతాయి.ప్రైవసీ, భద్రత.. కరోనా తర్వాత విలాసవంతమైన ఇళ్ల అమ్మకాలు పెరుగుతూ ఉన్నాయి. మిగతా విభాగంలోని ఇళ్లపై ప్రభావం పడినా.. అత్యంత లగ్జరీ ఆవాసాలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఐటీ, ఫార్మా, తయారీ రంగంతో పాటు కాస్మోపాలిటన్ కల్చర్‌తో నగరంలో లగ్జరీకి మించి జీవనశైలి కోరుకుంటున్నారు. సెవెన్ స్టార్ హోటల్లో మాదిరి గ్రాండ్ లాంజ్, డబుల్ హైట్ బాల్కనీ, హోమ్ ఆటోమేషన్, స్కై వ్యూ, స్పా, స్కై లాంజ్, మినీ థియేటర్, రూఫ్‌టాప్ డైనింగ్, ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్, ప్రైవసీ, భద్రత అన్ని ఉంటాయి.ఎక్కువ గ్రీనరీ, ఓపెన్ స్పేస్.. ఆర్కిటెక్చర్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ డిజైన్, పర్యావరణహితంగా ఉండేలా అంతర్జాతీయ డిజైనర్లతో తోడ్పాటు అందిస్తారు. ఈ ప్రాజెక్ట్‌లలో విశాలమైన బాల్కనీ, గ్రీనరీ, ఓపెన్ స్పేస్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దీంతో సాధారణ గృహాలతో పోలిస్తే రెసిడెన్సీలలో 5–7 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఇంట్లోకి గాలి, వెలుతురు ధారాళంగా వస్తాయి. వేర్వేరుగా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ద్వారాలు, ప్రతి అపార్ట్‌మెంట్‌కు ప్రత్యేక మార్గం ఉంటుంది. అపార్ట్మెంట్ ఫేసింగ్ ఎదురెదురుగా ఉండదు. దీంతో పూర్తిగా ప్రైవసీ ఉంటుంది. ఒకేరకమైన అభిరుచులు, జీవన శైలి కోరుకునే నివాసితులు ఒకే గేటెడ్ కమ్యూనిటీలో ఉండటంతో వీరి మధ్య సామాజిక సంబంధాలు బలపడతాయి. -
హైదరాబాద్‌లో ఇళ్ల విక్రయాలు డీలా..
హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు (Housing sales) 2024లో నెమ్మదించాయి. 2023తో పోలిస్తే 25 శాతం తక్కువగా, 61,722 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2023లో విక్రయాలు 82,350 యూనిట్లుగా ఉండడం గమనార్హం. అంతేకాదు, దేశవ్యాప్తంగా తొమ్మిది నగరాల్లోనూ 2024లో ఇళ్ల అమ్మకాలు 9% మేర క్షీణించాయి. 4.71 లక్షల యూనిట్ల ఇళ్ల అమ్మకాలు నమోదయ్యాయి.2023లో ఈ తొమ్మిది నగరాల్లో అమ్మకాలు 5,14,820 యూనిట్లుగా ఉన్నాయి. ఈ మేరకు ప్రాప్ ఈక్విటీ (PropEquity) సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. డిమాండ్‌తోపాటు, తాజా సరఫరా తగ్గడం ఇందుకు కారణాలుగా పేర్కొంది. తొమ్మిది నగరాల్లో కొత్త ఇళ్ల సరఫరా (విక్రయానికి అందుబాటులోకి రావడం) 15 శాతం తగ్గి 4,11,022 యూనిట్లుగా ఉంది.పట్టణాల వారీగా విక్రయాలు.. బెంగళూరులో ఇళ్ల అమ్మకాలు 2024లో 9 % క్షీణించి 60,506 యూనిట్లుగా నమోదు.చెన్నైలో 11% తక్కువగా 19,212 యూనిట్లు అమ్ముడయ్యాయి. కోల్‌కతాలో అమ్మకాలు 2023తో పోల్చితే కేవ లం 1% తగ్గి 19,212 యూనిట్లకు పరిమితం.ముంబైలో అమ్మకాలు 6% క్షీణించాయి. 50,140 యూనిట్ల విక్రయాలు జరిగాయి.నవీ ముంబైలో మాత్రం విక్రయాలు 16 శాతం పెరిగి 33,870 యూనిట్లుగా ఉన్నాయి.పుణెలో ఇళ్ల విక్రయాలు 13 శాతం తగ్గి 92,643 యూనిట్లుగా ఉన్నాయి. థానేలో 5% తక్కువగా 90,288 యూనిట్ల అమ్మకాలు జరిగాయి.ఢిల్లీ ఎన్సీఆర్లో గతేడాది ఇళ్ల అమ్మకాలు 5% వృద్ధితో 43,923 యూనిట్లుగా నమోదయ్యాయి.“2024లో హౌసింగ్ సప్లై,సేల్స్ తగ్గడానికి అధిక బేస్ ఎఫెక్ట్ కారణం. 2023లో ఇది అత్యంత గరిష్టానికి చేరింది. గణాంకాలను విశ్లేషణ ప్రకారం సేల్స్ పడిపోయినప్పటికీ, 2024లో సరఫరా-స్వీకరణ నిష్పత్తి 2023లో ఉన్నట్టుగానే ఉంది. ఇది రియల్ ఎస్టేట్ రంగం ప్రాథమికాలు బలంగా, ఆరోగ్యంగా ఉన్నాయని సూచిస్తున్నాయి” అని ప్రాప్‌ఈక్విటీ వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ జసూజా అన్నారు. -
టమాటా పడిపోయే..
సాక్షి, హైదరాబాద్: టమాటా ధరలు దారుణంగా పడిపోయాయి. మునుపెన్నడూలేని రీతిలో ధరలు నేలచూపులు చూస్తున్నాయి. శివార్లలోని రైతులు ధరలు గిట్టుబాటు కాకపోవడంతో తెంపకుండా తోటల్లోనే వదిలేసేందుకు మొగ్గు చూపుతుండగా.. కొందరు మాత్రం మార్కెట్‌కు తెచి్చనా ధరలు రాకపోవడంతో రోడ్లపై పారబోస్తున్నారు. గతేడాది ఇదే సీజన్లో నగర మార్కెట్లో కిలో రూ. 15 ఉన్న టమాటా ప్రస్తుతం కిలో రూ. రూ.10కి పడిపొయింది. మార్కెట్లకు దిగుబడులు పోటెత్తడంతో సామాన్యులకు మాత్రం టమాటాలు అందుబాటులోకి వచ్చా యి. జంటనగరాల అవసరాలకు సరిపడా టమాటా పెరగడంతో ప్రస్తుతం నగరంలోని గుడిమల్కాపూర్, మోండా, బోయిన్పల్లి, మాదన్నపేట, ఎల్బీనగర్ మార్కెట్లలో టమాటా ధరలు తగ్గాయి. హోల్‌సేల్ మార్కెట్లో కిలో టమాటా రూ.3–8 ఉండగా రిటైల్ మార్కెట్లో ధర కిలో 7–10 పలుకుతోంది. డిమాండ్‌కు తగిన సరఫరా నగరానికి నిత్యం దాదాపు 100 నుంచి 120 లారీల టమాటా డిమాండ్ ఉంది. ప్రస్తుతం మార్కెట్లకు 150 లారీల మేర దిగుమతులు వస్తున్నాయి.దీంతో నగర డిమాండ్ కంటే 30 లారీల టమాటా ఎక్కువగా దిగుమతి అవడంతో ధరలు విపరీతంగా పడిపోయాయి. తెలంగాణ జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాలు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి రోజురోజుకూ దిగుమతులు పెరుగుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ జిల్లాల నుంచి రోజుకు 30 నుంచి 40 లారీలు వస్తుండగా, పొరుగు రాష్ట్రాల నుంచి మరో 90–120 లారీల మేరకు టమాటా దిగుమతి అవుతోంది. ఈ నెల చివరి వరకు దిగుమతులు ఇలాగే ఉంటాయని, ఫిబ్రవరి రెండో వారం నుంచి దిగుమతులు తగ్గుతాయని హోల్‌సేల్ వ్యాపారులు అంటున్నారు. దిగుమతులు తగ్గితే ధరలు పెరిగే అవకాశముంది. -
హైదరాబాద్‌లో యూబీఎస్ జీసీసీ
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయంగా వాణిజ్య సేవల్లో పేరొందిన స్విస్ బ్యాంకర్ హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ)ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. తద్వారా అంతర్జాతీయంగా వాణిజ్య సేవల్లో హైదరాబాద్ స్థానం మరింత బలోపేతం కానున్నది. జూరిక్ ఇన్నోవేషన్ పార్కులో శుక్రవారం రాత్రి స్విట్జర్లాండ్ ఇన్నోవేషన్ కాన్ఫెడరేషన్ ఏర్పాటు చేసిన సదస్సులో యూబీఎస్ ఇండియా చైర్మన్ హెరాల్డ్ ఎగ్గర్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబుతో భేటీ అనంతరం ఈ మేరకు ప్రకటన చేశారు. హైదరాబాద్‌లో యూబీఎస్ సంస్థ కార్యకలాపాలను మరింత విస్తృతం చేస్తూ వచ్చే రెండేళ్లలో మరో 1,800 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. ఐటీ, వాణిజ్య సేవల్లో తెలంగాణను సమీప భవిష్యత్తులో అంతర్జాతీయంగా అగ్రస్థానంలో నిలపడంతో పాటు రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేస్తుందని యూబీఎస్ ప్రకటించింది. ‘దేశంలోని జీసీసీల్లో 11 శాతం హైదరాబాద్‌లోనే ఉన్నాయి. పెట్టుబడులకు అనుకూలత, సాంకేతిక వాతావరణం, అత్యాధునిక మౌలిక వసతులు తదితరాల మూలంగా జీసీసీల ఏర్పాటుకు నగరం అత్యంత అనుకూలంగా మారుతోంది’అని మంత్రి శ్రీధర్‌బాబు ఈ సందర్భంగా ప్రకటించారు. గత ఏడాది మార్చిలో భారత్, ఎఫ్టా దేశాలు (స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్, లీషెన్స్టీన్) నడుమ కీలకమైన ట్రేడ్ అండ్ ఎకానమీ పార్టనర్షిప్ అగ్రిమెంట్ (టెపా) పేరిట స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా ఎఫ్టా దేశాలు భారత్‌లో వచ్చే 15 ఏళ్లలో పది లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా 100 బిలియన్ యూరోలను పెట్టుబడిగా పెడతాయి. టెపా ఒప్పందంపై అవగాహన కలిగించడంతో పాటు తెలంగాణలో స్విస్ కంపెనీల పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా తాజాగా స్విట్జర్లాండ్ ఇన్నోవేషన్ కార్పొరేషన్ సదస్సు జరిగింది. ఈ సదస్సులో స్విస్ జాతీయ కౌన్సిల్ సభ్యులు, స్విస్ ఇండియా పార్లమెంటరీ గ్రూప్ ప్రెసిడెంట్ నికోలస్ గగ్గర్, భారత్‌లో స్విట్జర్లాండ్ రాయబారి మాయా టిసాఫీతో పాటు 40కి పైగా స్విస్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ తరపున పెట్టుబడుల ప్రోత్సాహక విభాగం ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి, టీజీఐఐసీ సీఈఓ మధుసూదన్, లైఫ్‌సైన్సెస్ విభాగం డైరెక్టర్ శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు. -
కిడ్నీ రాకెట్ గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ మూలాలను రాచకొండ పోలీసులు ఛేదించారు. సరూర్‌నగర్‌లోని అలకనంద, మాదన్నపేటలోని జనని, అరుణ ఆసుపత్రులలో అక్రమంగా కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు చేయిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు. ఒక్కో కిడ్నీ మార్పి డికి రూ.60 లక్షల చొప్పున గ్రహీత నుంచి వసూలు చేస్తున్న ఈ గ్యాంగ్.. గత రెండేళ్లలో నగరంలో 50కి పైగా కిడ్నీ మార్పిడులు చేయించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ ముఠాలోని 9 మందిని అరెస్టు చేయగా.. మరో ఆరుగురు పరారీలో ఉన్నారు. కేసు వివరాలను రాచకొండ పోలీస్ కమిషనర్ జీ సు«దీర్ బాబు శనివారం మీడియాకు వెల్లడించారు. ఆర్థిక కష్టాలతో పక్కదారి హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ సిద్ధంశెట్టి అవినాశ్ 2022లో సైదాబాద్‌లోని మాదన్నపేట రోడ్లో ఉన్న జనని, అరుణ ఆసుపత్రులను కొనుగోలు చేసి కొంతకాలం నడిపించాడు. తర్వాత ఆర్థిక ఇబ్బందుల కారణంగా విక్రయించాలని భావించాడు. ఆ సమయంలో విశాఖపట్నంకు చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తి అవినాశ్‌ను సంప్రదించి, ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహించాలని సూచించాడు. ఒక్కో కిడ్నీ మార్పిడికి రూ.2.5 లక్షలు చెల్లిస్తానని ఒప్పందం చేసుకున్నాడు. ఆ ప్రతిపాదనకు అంగీకరించిన అవినాశ్ జనని, అరుణ ఆసుపత్రుల్లో ఏప్రిల్ 2023 నుంచి 2024 జూన్ వరకు అక్రమ కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహించారు. ఈ దందాలో వైజాగ్‌కు చెందిన పవన్ అలియాస్ లియోన్, పూర్ణ అలియాస్ అభిషేక్‌లు కీలక పాత్ర పోషించారు. వీరు తమిళనాడుకు చెందిన డాక్టర్ రాజశేఖర్ పెరుమాల్, జమ్మూకశ్మీర్‌కు చెందిన డాక్టర్ సోహిబ్తోపాటు నల్లగొండకు చెందిన మెడికల్ అసిస్టెంట్లు రమావత్ రవి, సపావత్ రవీందర్, సపావత్ హరీశ్, పొదిల సాయి, తమిళనాడుకు చెందిన ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్లు శంకర్, ప్రదీప్, కర్ణాటకకు చెందిన సూరజ్‌లను కలుపుకొని ముఠాగా ఏర్పడ్డారు. ఒక్కో కిడ్నీ రూ.60 లక్షలు.. ఈ ముఠా ఒక్కో కిడ్నీకి రూ.60 లక్షల చొప్పున గ్రహీత నుంచి వసూలు చేసేది. ఇందులో కిడ్నీ దాతకు రూ.5 లక్షలు, అవినాశ్‌కు రూ.2.5 లక్షలు, ప్రధాన సర్జన్‌కు రూ.10 లక్షలు, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్లకు రూ.30 వేల చొప్పున ముట్టజెప్పేవారు. మిగిలిన రూ.42 లక్షలను లక్ష్మణ్, పవన్, పూర్ణ, అభిషేక్‌లు పంచుకునేవారు. శస్త్ర చికిత్స చేసే సర్జన్‌ను తమిళనాడు, జమ్మూకశ్మీర్ నుంచి హైదరాబాద్‌కు విమానంలో తీసుకొచి్చ, స్టార్ హోటల్లో బస ఏర్పాటు చేసేవారు. అలకానందకు ఆపరేషన్ల మార్పు జనని, అరుణ ఆసుపత్రుల్లో కిడ్నీ మార్పిడి దందా కు బ్రేక్ ఇద్దామని భావించిన డాక్టర్ అవినాశ్.. గతే డాది జూలైలో సరూర్‌నగర్‌లోని అలకానంద ఆసుపత్రి ఎండీ డాక్టర్ గుంటుపల్లి సుమంత్‌ను సంప్ర దించి, దందా గురించి తెలిపాడు. అతడు అంగీకరించటంతో అలకానందలో గతేడాది డిసెంబర్ నుంచి దాదాపు 20 అక్రమ కిడ్నీ మార్పిడి శస్త్ర చికి త్సలు నిర్వహించారు. ప్రతీ సర్జరీకి సుమంత్‌కు రూ.1.5 లక్షలు కమీషన్‌గా అందేవి. విశ్వసనీయ స మాచారం అందడంతో ఈ నెల 21న రంగారెడ్డి జి ల్లా వైద్యాధికారులతో కలిసి పోలీసులు అలకానంద ఆసుపత్రిపై దాడిచేసి దందా గుట్టను రట్టు చేశా రు. తమిళనాడుకు చెందిన కిడ్నీ దాతలు నస్రీన్ బా ను అలియాస్, ఫిర్దోష్, కర్ణాటకకు చెందిన గ్రహీ త లు బీఎస్ రాజశేఖర్, భట్ ప్రభలను అదుపులోకి తీ సుకున్నారు. ఈ నెల 23న డాక్టర్ సుమంత్, రిసెప్షనిస్ట్ నర్సగాని గోపిలను అరెస్టు చేశారు. తాజాగా డాక్టర్ అవినాశ్, ప్రదీప్, రవి, రవీందర్, హరీశ్, సా యి, సూరజ్ మిశ్రాలను అదుపులోకి తీసుకున్నా రు. సర్జన్లు డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ సోహిబ్, దళారులు పవన్, పూర్ణ, లక్ష్మణ్‌లు పరారీలో ఉన్నారు. జీవన్‌దాన్ దాతల జాబితా లీక్ అవయవదానానికి సంబంధించిన సేవలు నిర్వహిస్తున్న జీవన్‌దాన్ సంస్థ డేటా లీక్ కావటమే కిడ్నీ దందాకు కారణమని పోలీసుల విచారణలో తేలింది. పవన్, లక్ష్మణ్‌లు దాతలు, గ్రహీతల వివరాలను అక్రమ మార్గంలో సేకరించి ఈ దందా నిర్వహించినట్లు గుర్తించారు. వారు దొరికితే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నా యి. గతంలో ఈ ముఠా శ్రీలంకలో కూడా కిడ్నీ మార్పిడి దందా చేసిందని అనుమానిస్తున్నారు. -
HYD: పలు చోట్ల రేపు ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి,హైదరాబాద్: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో ఆదివారం(జనవరి26) పలుచోట్ల ట్రాఫిక్ అంక్షలు అమల్లోకి రానున్నాయి. సిక్రింద్రాబాద్ పరేడ్ గ్రాండ్స్‌లో రిపబ్లిక్ డే, రాజ్ భవన్ ఎట్ హోం కార్యక్రమాల దృష్ట్యా ట్రాఫిక్ అంక్షలు విధించనున్నారు. జనవరి 26న ఉదయం 7.30 గంటల నుంచి 11.30 వరకు సిక్రింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో, రాజ్ భవన్ పరిసరాల్లో సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు పోలీసులు ట్రాఫిక్ అంక్షలు విధించారు. ట్రాఫిక్ ఆంక్షల కారణంగా పంజాగుట్ట, గ్రీన్‌ల్యాండ్స్, బేగంపేట్, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ మార్గంలో వచ్చే వాహనాదారులు ప్రత్యామ్నాయ మార్గ్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాలైన టివోలీ థియేటర్ ఎక్స్ రోడ్స్, ప్లాజా ఎక్స్ రోడ్స్ మార్గాలను మూసివేయనున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులు కాస్త ముందుగా బయల్దేరి రైల్వేస్టేషన్‌కు చేరుకోవాలని పోలీసులు సూచించారు. -
దక్షిణ హైదరాబాద్‌కు 'రియల్' అభివృద్ధి!
నీళ్లు ఎత్తు నుంచి పల్లెం వైపునకు ప్రవహించినట్లే.. రోడ్లు, విద్యుత్, రవాణా వంటి మెరుగైన మౌలిక సదుపాయాలు ఉన్న చోటుకే అభివృద్ధి విస్తరిస్తుంది. ఐటీ ఆఫీస్ స్పేస్, నివాస, వాణిజ్య సముదాయాలతో కిక్కిరిసిపోయిన పశ్చిమ హైదరాబాద్ అభివృద్ధి (Real estate Development) క్రమంగా దక్షిణ హైదరాబాద్ (South Hyderabad) మార్గంలో శరవేగంగా విస్తరిస్తోంది. విమానాశ్రయంతో పాటు ఔటర్ మీదుగా వెస్ట్‌తో సౌత్ అనుసంధానమై ఉండటం ఈ ప్రాంతం మెయిన్ అడ్వాంటేజ్. దీనికి తోడు ప్రభుత్వం కూడా ఏఐ, ఫ్యూచర్ సిటీలను దక్షిణ హైదరాబాద్‌లోనే అభివృద్ధి చేయనుంది. పుష్కలంగా భూముల లభ్యత, అందుబాటు ధర, మెరుగైన రవాణా, మౌలిక వసతులు ఉండటంతో దక్షిణ ప్రాంతంలో రియల్ మార్కెట్ అభివృద్ధి చెందే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని శ్రీఆదిత్య హోమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆదిత్యరెడ్డి అన్నారు. ‘సాక్షి రియల్టీ’ ఇంటర్వ్యూలోని మరిన్ని అంశాలివీ.. – సాక్షి, సిటీబ్యూరోనగరం నాలుగు వైపులా అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రధాన నగరంలో మూసీ సుందరీకరణ, శివార్లలో ఫ్యూచర్ సిటీ, మెట్రో రెండో దశ విస్తరణ వంటి బృహత్తర ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టింది. ఆయా ప్రాజెక్ట్‌లతో గృహ కొనుగోలుదారుల భావోద్వేగాలు మారుతాయి. జనసాంద్రత, రద్దీ ప్రాంతాల్లో ఉండే బదులు ప్రశాంతత కోసం దూరప్రాంతాలను ఎంచుకుంటారు. ఇదే సమయంలో మెట్రో విస్తరణతో కనెక్టివిటీ పెరగడంతో పాటు ఆయా మార్గాలలో రియల్ ఎస్టేట్ అవకాశాలు ఏర్పడతాయి. ఉదాహరణకు ఓల్డ్‌సిటీ, చాంద్రయాణగుట్ట మీదుగా శంషాబాద్‌కు మెట్రో అనుసంధానంతో ఆయా ప్రాంతాల్లో కూడా గేటెడ్ కమ్యూనిటీలు జోరుగా వస్తాయి. దీంతో బడ్జెట్ హోమ్స్‌తో సామాన్యుడి సొంతింటి కల మరింత చేరువవుతుంది.ట్రిపుల్ ఆర్తో ఉద్యోగ అవకాశాలు హైదరాబాద్ అభివృద్ధి దశను మార్చేసిన ఔటర్ రింగ్ రోడ్డుకు అవతల 30 కి.మీ. దూరంలో రీజినల్ రింగ్ రోడ్డు(ట్రిపుల్ ఆర్)ను నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఔటర్ లోపల ప్రాంతం ఇప్పటికే రద్దీ అయిపోయింది. ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్కు, ట్రిపుల్ ఆర్ నుంచి రాష్ట్ర సరిహద్దుల వరకు ఇలా వేర్వేరు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అభివృద్ధి ప్రణాళికలు, మాస్టర్ ప్లాన్లను చేపట్టాలి. ట్రిపుల్ ఆర్తో నగరంతోనే కాదు రాష్ట్రంలోని ఇతర జిల్లాలూ అనుసంధానమై ఉంటాయి. కనెక్టివిటీ పెరిగి రవాణా మెరుగవుతుంది. దీంతో ప్రధాన నగరంపై ఒత్తిడి తగ్గడంతో పాటు శివారు, పట్టణ ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతాయి. ట్రిపుల్ ఆర్ ప్రాంతాల్లో కేవలం నివాస, వాణిజ్య సముదాయాలే కాదు గిడ్డంగులు, పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది. దీంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.సిటీ వ్యూతో బాల్కనీ కల్చర్.. లగ్జరీ హౌసింగ్ అంటే కనిష్టంగా 2,500 చ.అ. విస్తీర్ణం ఉండాలి. అయితే విస్తీర్ణం మాత్రమే లగ్జరీని నిర్వచించలేదు. బెంగళూరు, ముంబైలలో 3 వేల చ.అ. ఫ్లాట్లనే ఉబర్ లగ్జరీ అపార్ట్‌మెంట్‌గా పరిగణిస్తారు. కానీ, మన దగ్గర 6, 8, 10 వేల చ.అ.ల్లో కూడా అపార్ట్మెంట్లు కూడా నిర్మిస్తున్నారు. అయినా కూడా ఇతర మెట్రోలతో పోలిస్తే మన దగ్గరే ధరలు తక్కువగా ఉంటాయి. ఉదాహరణకు.. హైదరాబాద్‌లో 5–10 వేల చ.అ. ఫ్లాట్ రూ.6–12 కోట్లలో ఉంటే.. బెంగళూరు, ముంబై నగరాల్లో 3 వేల చ.అ. ఫ్లాటే రూ.12 కోట్లు ఉంటుంది. పుష్కలమైన స్థలం, వాస్తు, కాస్మోపాలిటన్ కల్చర్, ఆహ్లాదకరమైన వాతావరణం, జీవనశైలి బాగుండటం వల్లే హైదరాబాద్‌లో లగ్జరీ ప్రాజెక్ట్‌లు వస్తున్నాయి. మన నగరంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి విశాలమైన, డబుల్ హైట్ బాల్కనీలను వాడుతుంటారు. అదే ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో వాతావరణం పొల్యూషన్ కాబట్టి బాల్కనీలు అంతగా ఇష్టపడరు.ఇంటి అవసరం పెరిగింది గతంలో ఇండిపెండెంట్ హౌస్‌లు ఎక్కువగా ఉండేవి. అందుకే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అబిడ్స్ వంటి పాత నగరంలో ఈ తరహా ఇళ్లే ఎక్కువగా కనిపిస్తాయి. కానీ, ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలు, లగ్జరీ కమ్యూనిటీ లివింగ్ల ప్రాధాన్యం పెరిగింది. దీంతో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట వంటి ఖరీదైన ప్రాంతాల్లో నివాసానికి ఆసక్తి చూపిస్తున్నారు. కరోనా తర్వాత ఇంటి ప్రాముఖ్యత, అవసరం తెలిసొచ్చింది. వర్క్ ఫ్రం హోమ్‌తో 50–60 శాతం సమయం ఇంట్లోనే గడపాల్సిన పరిస్థితి. ఇప్పుడున్న పిల్లలు సెల్ఫోన్లు, టీవీలకు అతుక్కుపోతున్నారు. బయటకు వెళ్లి ఆడుకోవాలంటే ట్రాఫిక్ ఇబ్బందులు, భద్రత ఉండదు. అదే గేటెడ్ కమ్యూనిటీల్లో ఇబ్బందులు ఉండవు. కమ్యూనిటీ లివింగ్లలో గృహిణులు, పిల్లలకు రక్షణ ఉండటంతో పాటు ఒకే తరహా అభిరుచులు ఉన్నవాళ్లు ఒకే కమ్యూనిటీలో ఉంటారు. అలాగే ఒకే ప్రాంతంలో అన్ని వసతులు అందుబాటులో ఉంటాయి. దీంతో టెన్షన్ ఉండదు. చోరీలు, ప్రమాదాల వంటి భయం ఉండదు. సీసీటీవీ కెమెరాలు, 24/7 సెక్యూరిటీ సిబ్బందితో భద్రత ఉంటుంది. నిరంతరం నిర్వహణతో కమ్యూనిటీ పరిశుభ్రంగా, హైజీన్‌గా ఉంటుంది. థర్డ్ పార్టీ మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా వంద శాతం పవర్ బ్యాకప్, నిరంతరం నీటి సరఫరా ఉంటుంది. -
ఫేక్ ఫాస్ట్‌ట్రాక్ వాచ్‌లు అమ్మే ముఠా అరెస్టు
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్‌లో ఫేక్ ఫాస్ట్‌ట్రాక్(Fastrack) వాచ్‌లు అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బ్రాండెడ్ ఫాస్ట్‌ట్రాక్ వాచ్‌లు అంటూ సాధారణ వాచ్‌లను అధిక రెట్లకు విక్రయిస్తున్నారు. ముఠా వద్ద కోటి రూపాయల విలువైన 6వేలకుపైగా ఫేక్ ఫాస్ట్‌ట్రాక్ వాచీలను స్వాధీనం చేసుకున్నారు. ముఠాలో సభ్యులైన ముగ్గురు బీహార్ రాష్ట్రానికి చెందిన యువకులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో చార్మినార్ పరిసరాల్లో వాచ్‌లను ముఠా అమ్ముతోంది. వాచ్‌లు అమ్ముతుండగా పక్కా సమాచారంతో పోలీసులు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. కాగా యువతలో ఫాస్ట్‌ట్రాక్ వాచ్‌లంటే ఒక ప్రత్యేక క్రేజ్ ఉంది. దీనిని క్యాష్ చేసుకునేందుకు ముఠా యత్నించినట్లు తెలుస్తోంది. అన్ని బ్రాండెడ్ వస్తువులకు నకిలీవి సృష్టించి అమ్మినట్లే ఫాస్ట్‌ట్రాక్ వాచ్లకు కూడా ఫేక్ వాచ్‌లను తయారుచేసి లాభాలు ఆర్జింజేందుకు ప్రయత్నించి పోలీసులకు ముఠా సభ్యులు చిక్కారు. -
రియల్ ఎస్టేట్: ఫ్లాటా.. ప్లాటా.. ఏది బెటర్?
ఓపెన్ ప్లాట్ (Open plot), అపార్ట్మెంట్, కమర్షియల్ స్పేస్, రిటైల్.. ఇలా రియల్ ఎస్టేట్ (Real estate) పెట్టుబడులకు సాధనాలు అనేకం. కానీ, ఓపెన్ ప్లాట్లలో ఇన్వెస్ట్మెంట్స్తోనే అధిక రాబడి వస్తుందని హౌసింగ్.కామ్ సర్వే తెలిపింది. 2015 నుంచి దేశంలోని 8 ప్రధాన నగరాలలో ప్రతి సంవత్సరం స్థలాల ధరలలో 7 శాతం వృద్ధి నమోదవుతుంటే.. అపార్ట్మెంట్లలో మాత్రం 2 శాతమే పెరుగుదల కనిపిస్తోందని పేర్కొంది. హైదరాబాద్ (Hyderabad), చెన్నై, బెంగళూరు నగరాల్లోని నివాస ప్లాట్లకే ఎక్కువ డిమాండ్ ఉందని వెల్లడించింది. – సాక్షి, సిటీబ్యూరోపెద్ద నగరాలలో స్థలాల కొరత ఎక్కువగా ఉండటం, విపరీతమైన పోటీ నేపథ్యంలో ఉన్న కొద్ది స్థలాల ధరలు ఎక్కువగా ఉన్నాయని హౌసింగ్.కామ్ గ్రూప్ సీఈఓ ధ్రువ్ అగర్వాలా తెలిపారు. అందుకే ప్రధాన నగరాలలో పరిమిత స్థాయిలోని స్థలాలకు డిమాండ్ ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి సమయంలో ఓపెన్ ప్లాట్లకు, ఇండిపెండెంగ్ గృహాలకు డిమాండ్ ఏర్పడింది. దీంతో పెద్ద నగరాల్లోని శివారు ప్రాంతాలలో బడా డెవలపర్లు ఓపెన్ ప్లాట్ వెంచర్లు, వ్యక్తిగత గృహాల ప్రాజెక్ట్‌లను చేపడుతున్నారని, దీంతో డిమాండ్ పునఃప్రారంభమైందని చెప్పారు.కరోనాతో పెరిగిన డిమాండ్.. ఢిల్లీ–ఎన్సీఆర్, పుణే, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్కత్తా, అహ్మదాబాద్ ఎనిమిది ప్రధాన నగరాల్లో సాధారణంగా కొనుగోలుదారులు ఓపెన్ ప్లాట్ల కంటే ఫ్లాట్లు కొనుగోలు చేయడానికే ఇష్టపడతారు. ఎందుకంటే భద్రతతో పాటు పవర్ బ్యాకప్, కార్ పార్కింగ్, క్లబ్‌హౌస్, జిమ్, స్విమ్మింగ్ పూల్, గార్డెన్ వంటి కామన్ వసతులు ఉంటాయని అపార్ట్మెంట్ కొనుగోళ్లకే మొగ్గు చూపుతున్నారు. కానీ, కరోనా నేపథ్యంలో కామన్ వసతులు వినియోగం, అపార్ట్మెంట్లలో ఎక్కువ జనాభా వంటివి శ్రేయస్కరం కాదనే అభిప్రాయం ఏర్పడింది. దీంతో సొంతంగా స్థలం కొనుగోలు చేసి ఇళ్లు కట్టుకోవడమో లేక వ్యక్తిగత గృహాలను కొనుగోలు చేసేందుకే కొనుగోలుదారులు మొగ్గు చూపుతున్నారు.13–21 శాతం పెరిగిన ధరలు..హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలతో పాటూ గుర్గావ్లోని కొన్ని ప్రధాన ప్రాంతాలలోని నివాస స్థలాలకు డిమాండ్ పెరుగుతుందని హౌసింగ్.కామ్ రీసెర్చ్ హెడ్ అంకితా సూద్ తెలిపారు. 2018 నుంచి ఆయా నగరాలలోని ఓపెన్ ప్లాట్లలో రెండంకెల వృద్ధి నమోదవుతుందని పేర్కొన్నారు. గత మూడు సంవత్సరాలలో ఈ నగరాల్లో భూముల ధరలు 13–21 శాతం మేర పెరిగాయని చెప్పారు. ఇదే నగరాల్లోని అపార్ట్మెంట్ల ధరలలో మాత్రం 2–6 శాతం మేర వృద్ధి ఉందని తెలిపారు. కరోనా నేపథ్యంలో కొనుగోలుదారుల అభిరుచుల్లో వచ్చిన మార్పులు, పాలసీలతో రాబోయే త్రైమాసికంలో ఈ డిమాండ్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు.ఇదీ చదవండి: జూబ్లీహిల్స్‌లో బంగ్లా.. రూ.40 కోట్లు!హైదరాబాద్‌లో ప్లాట్లకే డిమాండ్ ఎక్కువఇతర దక్షిణాది నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోని ఓపెన్ ప్లాట్లకే డిమాండ్ ఎక్కువ గా ఉంది. 2018–24 మధ్య కాలంలో నగరంలోని స్థలాలలో గరిష్టంగా 21 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదవుతుంది. శంకర్పల్లి, పటాన్చెరు, తుక్కుగూడ, మహేశ్వరం, షాద్‌నగర్ ప్రాంతాల్లోని స్థలాలకు డిమాండ్, ధరల పెరుగుదల ఎక్కువగా ఉందని తెలిపింది. కాగా.. చెన్నైలో ప్లాట్లలో వార్షిక వృద్ధి రేటు 18 శాతం, బెంగళూరులో 13 శాతం ఉంది. చెన్నైలో అంబత్తూరు, అవడి, ఒరిగడం, శ్రీపెరంబుదూర్, తైయూర్ ప్రాంతాలలో, బెంగళూరులో నీలమంగళ, దేవనహళ్లి, చిక్కబల్లాపూర్, హోస్కేట్, కొంబల్‌గోడు ప్రాంతాల్లోని ప్లాట్లకు ఆదరణ ఎక్కువగా ఉంది.2018–24 మధ్య ఢిల్లీ–ఎన్సీఆర్లో ప్లాట్ల వార్షిక వృద్ధి రేటు 15 శాతంగా ఉంది. సోహ్నా, గుర్గావ్లో భూముల ధరలు ఏటా 6 శాతం పెరుగుతున్నాయి. సెక్టార్ 99, ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే, సెక్టార్ 95ఏ, సెక్టార్ 70ఏ, సెక్టార్ 63లలోని నివాస స్థలాలలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. -
శ్రీవల్లి అదృశ్యం
నాగోలు: ఇంటర్ విద్యార్థిని అదృశ్యమైన ఘటన నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నాగోలు ఎస్ఐ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా కొండమల్లెపల్లికి చెందిన గౌరు రోజు జయప్రద కుమార్తె శ్రీవల్లి (18) ఇంటర్లో ఫెయిలైన సబ్జెక్టుల కోసం కొన్ని రోజుల క్రితం నాగోలు డివిజన్ పరిధిలోని బండ్లగూడలోని లక్ష్మి బాలికల హాస్టల్ లో ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నది. సంక్రాంతి సెలవులకు ఈనెల 11న ఇంటికి వెళ్లి ఈనెల 17న హాస్టల్‌కు వచ్చింది. 23న కూతురు కోసం హాస్టల్ వారికి ఫోన్ చేసి శ్రీవల్లి 20న ఇంటికి పంపినట్లు సమాచారం తెలిపారు. అయితే తమ కుమార్తె ఇంటికి రాలేదని వారు బదులిచ్చారు. దీంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు బండ్లగూడ హాస్టల్‌కు చేరుకుని సీసీ ఫుటేజీలను పరిశీలించగా తమ గ్రామానికి చెందిన వ్యక్తి ద్వారా పంపినట్లు తెలిపారు. బాధితురాలు తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
khammam: మిర్చితోటలో వ్యక్తి మృతదేహం లభ్యం
కూసుమంచి: ఖమ్మం జిల్లా, కూసుమంచి మండలం, లింగారంతండా సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న మిర్చి తోటలో వ్యక్తి మృతదేహాన్ని గుర్తించగా.. హైదరాబాద్‌కు చెందిన సదరు వ్యక్తిని తీసుకొచ్చి హత్య చేసినట్లు తేలింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం మిర్చి తోటలో ఓ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన రైతు పోలీసులకు సమాచారం అందించాడు.సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్సై నాగరాజు మృతుడి రెండు చేతులు ప్లాస్టిక్ తాడుతో కట్టేసి ఉండటం, తలపై గాయాలు కనిపించడమే కాక మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో మృతుడు హైదరాబాద్‌కు చెందిన బొల్ల రమేష్(52)గా తేలింది. ఆయన రెండు రాష్ట్రాల్లో పాన్ మసాలా సరఫరా చేసేవాడు. ఈనెల 18న బయటికి వెళ్లిన అతను ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు అక్కడి ఖార్ఖానా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ చేస్తుండగానే ఓ వ్యక్తి రమేష్ ను హత్య చేసినట్లు చెబుతూ లొంగిపోయాడు.నలుగురు వ్యక్తులు 18న రాత్రి అతడిని కారులో ఖమ్మం వైపు తీసుకొచ్చి హత్య చేసిన అనంతరం ఖమ్మం–సూర్యాపేట జాతీయ రహదారి పక్కన మిరపతోటలో మృతదేహాన్ని పడవేసినట్లు చెప్పాడు. దీంతో అక్కడి పోలీసులు వచ్చి గాలించినా సరైన ప్రాంతం తెలియక వెనుతిరిగారు. ఇంతలోనే కూసుమంచి పోలీసులు ఇచ్చిన సమాచారం ఆధారంగా రమేష్ కుటుంబీకులతో శుక్రవారం రాత్రి వచ్చి మృతదేహం ఆయనదేనని నిర్ధారించుకున్నారు. డబ్బు కోసమే రమేష్ ను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహం కుళ్లిపోవడంతో ఘటనా స్థలంలోనే పంచనామా నిర్వహించి అన్నం ఫౌండేషన్ సభ్యుల సహకారంతో అంత్యక్రియలు నిర్వహించారు. -
హైటెక్స్.. పెటెక్స్..
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద పెట్ ఎక్స్పో నిర్వహణకు హైదరాబాద్ వేదికగా నిలవనుంది. జనవరి 31 నుండి ఫిబ్రవరి 2 వరకూ మూడు రోజుల పాటు పెటెక్స్, తొలి కిడ్స్ బిజినెస్ కారి్నవాల్, కిడ్స్ ఫెయిర్లను ఏకకాలంలో హైటెక్స్‌లో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన అంశాలను హైటెక్స్ వాణిజ్య ఉన్నతాధికారి టీజీ శ్రీకాంత్ శుక్రవారం వివరించారు. కారి్నవెల్ మద్దతుతో పెటెక్స్ భారత్, టర్కీ, చెక్ రిపబ్లిక్, సింగపూర్, జపాన్, జర్మనీ తదితర దేశాలకు చెందిన 60కిపైగా ఎగ్జిబిటర్లు ఉన్నారన్నారు. పెంపుడు జంతు ప్రేమికులు, ఔత్సాహికులను ఒక చోట చేర్చుతుందన్నారు. ఈ ప్రదర్శనలో 70కిపైగా అలంకారప్రాయమైన చేపల జాతులు ఉంటాని తెలిపారు. వివిధ బ్రీడ్ల గుర్రాలు, పక్షులు, కుక్కల ఫ్యాషన్ షో, కే–9 స్కూల్ కుక్కల ప్రదర్శన, స్కూపీ స్క్రబ్ వారి ఉచిత బేసిక్ గ్రూమింగ్ వంటివి ప్రదర్శించనున్నారు. కిడ్స్ బిజినెస్ కార్నివాల్ తొలి ఎడిషన్‌లో 85 మంది ఔత్సాహిక విద్యార్థులు ఉన్నారన్నారు. పలు ఉత్పత్తులు, ఆవిష్కరణలను ఈ ఎక్స్‌పోలో ప్రదర్శించనున్నారని తెలిపారు. క్యాట్ఛాంపియన్ షిప్ ను ఇండియన్ క్యాట్ క్లబ్ నిర్వహిస్తోంది. 200 రకాల పిల్లులు, అందులోనూ కొన్ని అరుదైన జాతులను సందర్శించొచ్చని పేర్కొన్నారు. మొదటిసారి కిడ్స్ కార్నివాల్ .. మొట్టమొదటిసారి కిడ్స్ బిజినెస్ కార్నివాల్ నిర్వహించనున్నామని, పిల్లల్లోని వ్యవస్థాపక స్ఫూర్తిని ప్రదర్శించేందుకు ఈ ఎక్స్పో వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. వ్యాపార ప్రణాళిక, పోటీ, ఉత్పత్తుల ప్రదర్శన మొదలైనవి ఇందులో ఉంటాయని వివరించారు. ఎల్రక్టానిక్స్, రోబోటిక్ ప్రాజెక్ట్‌లు, పెబుల్ ఆర్ట్, అయస్కాంత బుక్ మార్క్స్, విద్యార్థులు రాసిన పుస్తకాలు, 85 మంది విద్యార్థులు తయారు చేసిన హాండీ క్రాఫ్టŠస్ మొదలైనవి ఎక్స్‌పోలో చూడొచ్చని తెలిపారు. కిడ్స్ రన్.. ఫిబ్రవరి 1న సాయంత్రం 5 గంటలకు హైటెక్స్‌లో 4కిలో మీటర్లు, 2–కే, 1–కే వంటి మూడు విభిన్న కేటగిరీల్లో కిడ్స్ రన్ నిర్వహించనున్నారు. ఐదేళ్ల నుంచి 13 ఏళ్ల వయసు పిల్లలు ఇందులో పాల్గొన వచ్చన్నారు.పది రెట్లు ఎక్కువగా.. పెంపుడు జంతువుల దత్తత ప్రక్రియ భారత్ కంటే పాశ్చాత్య దేశాల్లో పది రెట్లు ఎక్కువని నిర్వాహకులు చెబుతున్నారు. 12 రాష్ట్రాలు, ఐదు దేశాల ప్రదర్శనకారులు ఈ మూడు ఎక్స్‌పోలో పాల్గొంటారని, సుమారు 25 వేలకు పైగా సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నామని తెలిపారు. దేశంలో పెట్ కేర్ పరిశ్రమ ప్రారంభ దశలో ఉందని, క్రమంగా పురోగమిస్తోందని, పెంపుడు జంతువుల దత్తత క్రమంగా పెరుగుతోందన్నారు. -
Hyderabad Literary Festival 2025: సాహిత్య సౌరభం..
హైదరాబాద్ నగరం ఒక్కసారిగా సాహితీ పరిమళాలను అద్దుకుంది. భారత్‌తో పాటు వివిధ దేశాలకు చెందిన సాహితీ ప్రముఖులు నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్లో వాలిపోయారు. నగరంలోని టీ–హబ్, సత్వ నాలెడ్జ్ సిటీ వేదికలుగా భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన ఈ ఫెస్ట్ శుక్రవారం ఉదయం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. శని, ఆదివారాల్లోనూ కొనసాగనున్న ఈ సాహితీ పండుగలో సాహిత్యం, సంస్కృతి, సైన్స్ అండ్ టెక్నాలజీ, అంతరించిపోతున్న భారతీయ భాషలు, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై ప్రత్యేక సదస్సులు, వర్క్‌షాప్స్, కళాప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. మొదటి రోజు కార్యక్రమాల్లో భాగంగా సాహితీ ప్రముఖులతో ప్రత్యక్ష చర్చా కార్యక్రమాలు, సదస్సులు నిర్వహించారు. ప్రారంభ ప్లీనరీలో ఏ లైఫ్ ఆఫ్ సినిమా పై సినీ ప్రముఖులు షభానా అజ్మీ, సాహితీవేత్త అమితా దేశాయ్‌తో చర్చించారు. అనంతరకార్యక్రమంలో అంతరించిపోతున్న సింధీ భాషపై ప్రముఖులు నందితా భవానీ, రితా కొఠారీ, సోనీ వాధ్వా చర్చించారు. అంతేకాకుండా ప్రత్యేకంగా కావ్యధార, స్టేజ్ టాక్స్, ఆర్ట్ వర్క్ షాప్స్, నన్హా నుక్కడ్ కార్యక్రమాలు, పరిశోధనా రంగ ప్రముఖులతో సైన్స్ అండ్ ది సిటీ సెషన్స్, రచయితలకు సంబంధించిన మీట్మై చర్చ నిర్వహించారు. ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్న కళా ప్రదర్శనలు, నగరంలోని కొండరాళ్ల సంరక్షణపై ఏర్పాటు చేసిన ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్టూన్ స్పెషల్.. ఈ ఫెస్ట్‌లో భాగంగా ప్రముఖ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య ఆధ్వర్యంలోని అబ్ట్యూస్ యాంగిల్ కార్టూన్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీపీ ఆచార్య మాట్లాడుతూ.. ఇది నగర ఖ్యాతిని మరింత పెంచుతుందని, ఈ తరం ఆలోచనా విధానానికి స్ఫూర్తి నింపే వ్యక్తులు హాజరుకావడం సంతోషమన్నారు. తన కార్టూన్ పుస్తకంలో బ్యూరోకాట్ల ప్రయాణాన్ని, ఆలోచనా విధానాన్ని కార్టూన్ల రూపంలో తెలిపానన్నారు. ఫొటోలతో ప్రత్యేక చిత్ర ప్రదర్శనను ఏరాప్టు చేశారు. పుస్తకావిష్కరణలో ప్రముఖ రచయిత డా.దినేష్ శర్మ, రిటైర్ట్ ఐఏఎస్ అధికారి డా.ఎస్ఎన్ మోహంతి పాల్గొన్నారు.యాన్ యాక్సిడెంటల్ సూపర్ హీరో 2లోనే క్లైమాక్స్.. అనంతరం ప్రముఖ సినీతార హుమా ఖురేషి ముఖ్య అతిథిగా సాహితీవేత్త కిన్నెర మూర్తితో చర్చించారు. ఈ సందర్భంగా హుమా ఖురేషి రాసిన యాన్ యాక్సిడెంటల్ సూపర్ హీరో పుస్తకంలోని కొన్ని అంశాలను చదివి వివరించారు. ఈ పుస్తకం క్లైమాక్స్ త్వరలో రానున్న రెండో పుస్తకంలో ఉంటుందన్నారు. సినిమా ఎంపికలో కథే ప్రామాణికంగా చేస్తానని, యాక్షన్ కామెడీ వంటి చిత్రం చేయడం ఇష్టమని వెల్లడించారు. -
బంజారాహిల్స్‌లో కారు బీభత్సం.. ఒకరు మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్‌లో కారు బీభత్సం సృష్టించింది. అధిక వేగంలో ఉన్న కారు.. పుట్‌పాత్‌పైన నిద్రిస్తున్న వారి మీదకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒక్కరు మృతి చెందగా.. ఇద్దరు గాయపడ్డారు. దీంతో, వారిద్దరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వద్ద కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంలో ఉన్న కారు.. దుపుతప్పి ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. అయిఏత, ప్రమాదం జరిగిన తర్వాత వాహనం వదిలి పారిపోయిన కారులోని వ్యక్తులు పారిపోయారు. -
మణికొండ : నార్సింగిలో పశుసంక్రాంతి జాతర..భారీగా పలికిన ధరలు (ఫొటోలు)
-
తారలు అక్షరాలు తళుక్కుమన్నాయి
సాహిత్యాభిమానులు క్యూ కట్టారు. వేదికల మీద రచయితలు, రచయిత్రులు, నటీనటులు తమ మాటల మూటలు విప్పారు. పుస్తకాలు మేమున్నామంటూ ఆకర్షణీయమైన అట్టలతో పాఠకుల్ని కేకేశాయి. హైదరాబాద్‌లో శుక్రవారం మొదలైన హైదరాబాద్ లిటరేచర్ ఫెస్టివల్ నగరానికి కొత్త శోభను తెచ్చింది. ఈ సందర్భంగా తారలేమన్నారో అక్షరాలు ఎలా మెరిశాయో ఇక్కడ చదవండి.ప్రపంచమే ఒక రంగస్థలంభారతదేశం గొప్ప లౌకికదేశమని కొనియాడారు అమల్ అల్లానా. దేశవిభజన సమయంలో అమల్ తల్లి రోషన్ నిండు గర్భిణి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నెల రోజులకు పుట్టింది అమల్. ఆమె తండ్రి ఇబ్రహీమ్ అల్కాజీ గుర్తింపు పొందిన డైరెక్టర్. సౌదీ అరేబియా, కువైట్ మూలాలున్న కుటుంబం ఆయనది. విభజన సమయంలో ఇబ్రహీం సోదరులంతా పాకిస్థాన్‌కు వెళ్లిపోయారు. ఇబ్రహీమ్ మాత్రం ఇండియాలో కొనసాగారు. ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు అమల్. తల్లి కుటుంబం గుజరాత్‌కు చెందినది కావడం కూడా తాము ఇండియాలో ఉండిపోవడానికి అదో కారణమంటూ తాను చూసిన ఇండియా గమనాన్ని విశ్లేషించారు. ‘అరవైల నాటి ఇండియాని చూశాను, 90ల నాటికి వచ్చిన మార్పులకు ప్రత్యక్ష సాక్షిని. అలాగే 2025కి సాధించిన పురోగతిని ఆస్వాదిస్తున్నాను. కొత్త బాధ్యతలను భుజానికెత్తుకుంటూ పాత బ్యాగేజ్‌ని తగ్గించుకుంటూ ముందుకుపోవడమే అభివృద్ధి’ అన్నారు అమల్. అవి గోల్డెన్ డేస్! రంగస్థల దర్శకత్వం, కాస్ట్యూమ్ డిజైనింగ్, సీన్ డిజైనింగ్‌లో నైపుణ్యం సాధించిన అమల్ అల్లానా ఢిల్లీలోని ‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా’కు చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఆమె తల్లి రోషన్ అల్కాజీ రచనలు ‘ఏన్షియెంట్ ఇండియన్ కాస్ట్యూమ్, మిడివల్ ఇండియన్ కాస్ట్యూమ్’ లను పరిష్కరించారు. ఇటీవల తండ్రి జీవితాన్ని ‘ఇబ్రహీం అల్కాజీ: హోల్డింగ్ టైమ్ క్యాప్టివ్’ పేరుతో అక్షరబద్ధం చేశారు. ఈ రచనలోని విషయాలను ప్రస్తావించడం అంటే నా తండ్రిని గుర్తు చేసుకోవడమే అంటూ ‘మేము ముంబయిలోని ఒక ఆరు అంతస్థుల భవనంలో నివసించేవాళ్లం. ఆ టెర్రస్‌ని చూసిన మా తండ్రి అక్కడ 80 మంది వీక్షించే రంగస్థల వేదికను ఏర్పాటు చేశారు. అప్పుడు నాటకాన్ని చూడడానికి ప్రేక్షకులు ఐదంతస్థులు మెట్లెక్కి వచ్చేవారు. అవి రంగస్థలానికి గోల్డెన్ డేస్. ఇప్పుడు రంగస్థలానికి వన్నె తగ్గిన మాట నిజమే కానీ, రంగస్థలం అంతరించిపోవడం అనేది జరగదు. ఎందుకంటే ప్రపంచ దేశాల సంస్కృతి అంతా రంగస్థలం చుట్టూనే పరిభ్రమించింది’ అన్నారు అమల్ అల్లానా.భాగమతి ప్రేమకథ స్ఫూర్తినిస్తూనే ఉంటుందిబెంగాల్కు చెందిన మౌపియా బసు జర్నలిస్టు, రచయిత. చారిత్రక పరిశోధనల ఆధారంగా కథనాలను వెలువరించే మౌపియా నాలుగేళ్ల కిందట హైదరాబాద్‌కు వచ్చారు.‘అనార్కలి అండ్ సలీం: ఏ రీటెల్లింగ్ ఆఫ్ ముఘల్ ఈ ఆజమ్, ‘ద క్వీన్స్ లాస్ట్ సెల్యూట్: ద స్టోరీ ఆఫ్ ద రాణీ ఆఫ్ ఝాన్సీ అండ్ ద 1857 మ్యూటినీ, ఖోక, కమల్సుందరి’ రచనలు చేసిన మౌపియాకు హైదరాబాద్ నగరం కొత్త సందేహాలను రేకెత్తించింది. నగరంలో ఎక్కడికెళ్లినా ఆమెకు వినిపించిన భాగ్యనగర్ అనే పేరు మీద పరిశోధన మొదలుపెట్టారు. తాను తెలుసుకున్న విషయాలను ‘భాగమతి : వై హైదరాబాదీస్ లాస్ట్ క్వీన్ ఈజ్ ద సోల్ ఆఫ్ ద సిటీ’ పేరుతో ప్రచురించారు. హైదరాబాద్వాసుల్లో పరిపూర్ణమైన మతసామరస్యాన్ని, బ్రదర్‌హుడ్‌ను చూశానన్నారు మౌపియ. ‘ఈ నగరంలో నివసించే వాళ్లు తమను తాము మతం, కులం,ప్రాంతం, భాషల ఆధారంగా పరిచయం చేసుకోరు. ‘హైదరాబాదీని’ అని గర్వంగా చెప్పుకుంటారు. హైదరాబాద్‌లో మాత్రమే వినిపించే డయలక్ట్ కూడా వీనులవిందుగా ఉంటుంది. హైదరాబాద్ మీద సామాన్యుల్లో ఉన్న అనేక అపోహలను నా పర్యటన తుడిచేసింది. ఓల్డ్‌సిటీకి వెళ్లవద్దనే హెచ్చరికలను పట్టించుకోకుండా రంజాన్ మాసంలో వెళ్లాను. ఆత్మీయతకు అర్థాన్ని తెలుసుకున్నాను. అక్కడి వాళ్లను పలకరించినప్పుడు వారి నోటివెంట కూడా భాగమతి మాట వినిపించింది. ఒక ప్రేమ కథ రెండు మతాలను కలిపి ఉంచుతోంది. ఆ ప్రేమకథ నాలుగు వందల ఏళ్లుగా జనం నాలుకల మీద సజీవంగా ఉంది. అయితే నాకు సమాధానం దొరకని ప్రశ్న ఏమిటంటే... గోల్కొండను పాలించిన కుటుంబాల సమాధులున్నాయి, మహళ్లు, ప్యాలెస్‌లున్నాయి. కానీ భాగమతి ఊహాచిత్రం తప్ప అధికారిక డాక్యుమెంట్ కానీ, శిల్పం వంటి ఆధారం కానీ లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. హైదరాబాద్ అధికారిక రికార్డుల్లో ఎక్కడా ఆమె పేరు కనిపించదు. కానీ ఇక్కడ పర్యటించిన యాత్రికుల రచనల్లో ఉంది. డచ్, బ్రిటిష్ వ్యాపారుల రికార్డుల్లో భాగ్నగర్ పేరు ఉంది. సినిమా, రంగస్థలం, కవిత్వం, పెయింటింగ్లుల్లో భాగమతి కనిపిస్తోంది. ఆమెకు సంబంధించిన భౌతిక ఆధారం ఒక్కటీ లభించకపోవడానికి కారణం ఉద్దేశపూర్వకంగా తుడిచేయడం జరిగిందా అనేది సమాధానం లేని ప్రశ్నగానే ఉంది’ ఈ చారిత్రకాంశం తరతరాలుగా ఒకరి నుంచి ఒకరికి మౌఖికంగా కొనసాగుతోంది’ అని వివరించారు మౌపియా బసు. ఆమె శిల్పం లేదు. ఆమె రూపాన్ని చిత్రపటంగా అయినా ఎవరూ చూడలేదు. ఆమె సమాధి ఎక్కడో తెలీదు. కానీ ఇన్ని వందల ఏళ్లుగా ఆమె పేరును తలవడం మానలేదు హైదరాబాదీలు.ఫెమినిస్ట్ అయితే తప్పేంటి?షబానా ఆజ్మీ తెలుగింటి ఆడపడచు. ఆమె పుట్టిల్లు హైదరాబాద్. తొలిసారి కెమెరా ముందుకు వచ్చిందీ ఇక్కడే! ఆ జ్ఞాపకాలతోపాటు నేటి సినిమా.. ఆ రంగంలో పెరుగుతున్న అమ్మాయిల పాత్ర గురించీ ముచ్చటించారు. అవి ఆమె మాటల్లోనే.. ‘నేను హైదరాబాద్‌లోనే పుట్టినా ఇక్కడ గడిపింది తక్కువే! నాన్న (కైఫీ ఆజ్మీ)పోయెట్ మాత్రమే కాదు కమ్యూనిస్ట్ పార్టీ మెంబర్ కూడా. ఆయన అండర్ గ్రౌండ్ జీవితం వల్లే నా తొమ్మిదో ఏట అమ్మ నన్ను తీసుకుని ముంబైకి వెళ్లింది. సమ్మర్‌కి మాత్రం వచ్చేవాళ్లం. అమ్మ (షౌకత్ ఆజ్మీ) రంగస్థల నటి. దాంతో హైదరాబాద్‌లోని మా ఇంట్లో సాహిత్యం, నాటకం, సామాజిక స్పృహ కలగలసిన ఒక ప్రోగ్రెసివ్ వాతావరణం ఉండేది. ఆ నేపథ్యంలో పెరిగాన్నేను. దాంతో యాక్టివిజం కూడా నాకు వారసత్వంగా అబ్బింది. ఆ గుణం వల్లే ముంబైలోని మురికివాడల నిర్వాసితుల కోసంపోరాడాను. పొట్ట చేతపట్టుకుని సిటీకి వచ్చేవాళ్లకు పని దొరుకుతుందేమో కానీ సొంత జాగా దొరకదు. దానికోసం వాళ్ల తరఫున నిలబడ్డాను. మహిళల హక్కుల కోసమూ ముందుంటాను. కొంతమంది ఫెమినిస్ట్ అని చెప్పుకోవడం పట్ల నామోషీ ఫీలవుతున్నట్లనిపిస్తోంది ‘నేనేం ఫెమినిస్ట్‌ను కాను’ అని చెప్పుకుంటున్న వాళ్ల తీరును చూస్తే! ‘అంకురం’తో సొంతూరు పర్యటననా మొదటి సినిమా శ్యామ్ బెనెగల్ తీసిన ‘అంకురం’ షూటింగ్ హైదరాబాద్ (ఎల్లారెడ్డి గూడ) లోనే జరిగింది. బాల్యం తర్వాత మళ్లీ హైదరాబాద్‌కు రావడం అప్పుడే! అంతా కొత్తగా అనిపించింది. అంకురంలో నాది పనమ్మాయి పాత్ర. దానికి తగ్గట్టు నన్ను మలచడానికి శ్యామ్ బెనెగల్ నన్ను.. చీర కట్టుకుని మేమున్న ఇంటి పరిసరాల చుట్టూ తిరిగి రమ్మన్నాడు. మనుషులను, కల్చర్‌ను అబ్జర్వ్ చేయడానికి. ఓ మూడు రోజులు అదేప్రాక్టీస్! మాకు భోజనాలు ఏర్పాటు చేసిన చోట కూడా వాళ్లంతా టేబుల్ మీద తింటుంటే.. నన్నో మూలన, కింద కూర్చొని తినమనేవాడు. ఒకరోజు నేనలా తింటుంటే.. కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ నా దగ్గరకు వచ్చి ‘ఇక్కడేదో సినిమా షూటింగ్ అవుతోందట కదా! హీరోయిన్ ఏది’ అనడిగారు. ‘బయటకు వెళ్లింద’ని చెప్పాను. ‘నువ్వెవరు?’ అనడిగారు. ‘ఆయాను’ అన్నాను. దీన్నంతా దూరం నుంచి గమనించిన శ్యామ్ బెనెగల్.. ఆ స్టూడెంట్స్ వెళ్లిపోగానే నన్ను పిలిచి, ‘నువ్విక ఈప్రాక్టీస్ ఆపేయొచ్చ’ని చెప్పారు. అలా ఉండేది ప్యార్లల్ మూవీస్‌లో పాత్రల ప్రిపరేషన్! హాలీవుడ్లో కూడా నటించాను (Madame Sousatzka, City of joy) కదా! వాళ్ల తీరు వేరు. పేపర్ మీద రాసుకున్నది రాసుకున్నట్టుగా జరగాలి. అది ఏ కాస్త కింద మీదైనా కంగారుపడిపోతారు. మళ్లీ అంకుర్ జ్ఞాపకాలకొస్తే.. నాకు కాస్ట్యూమ్స్‌ను కుట్టించడానికి ఓ దర్జీని పిలిపించారు. అతను టేప్ లేకుండా జస్ట్ అలా వచ్చి నన్నోసారి పై నుంచి కిందకు.. కింద నుంచి పైకి చూసి వెళ్లిపోయాడంతే! తర్వాత రెండు రోజులకు పర్ఫెక్ట్ సైజ్‌తో కాస్ట్యూమ్స్‌ను రెడీ చేసిచ్చాడు.పారలల్ మూవీస్‌కి... ఫార్ములా మూవీస్‌కి మధ్య వ్యత్యాసంపారలల్ మూవీస్‌లో స్త్రీ పాత్రలకు ఔచిత్యం, వ్యక్తిత్వం ఉండేవి. అదంతా సీరియస్ వ్యవహారం. ఫార్ములా మూవీస్‌కి వినోదమే ప్రధానం. ఆర్ట్ మూవీస్ నుంచి కమర్షియల్ మూవీస్‌కి వెళ్తున్న కొత్తలో భలే ఇబ్బంది పడ్డాను. ముఖ్యంగా డాన్స్ విషయంలో! ప్యార్లల్ మూవీ మూవ్‌మెంట్‌ను ఇప్పుడు ఓటీటీ రీప్లేస్ చేస్తోంది. అన్నిరకాల సినిమాలతో ప్రేక్షకులకు చాయిస్ ఉండాలి. ఈ మధ్య కొన్నివర్గాల వాళ్లు తమ ఐడియాలజీస్ను ప్రమోట్ చేసుకోవడానికి సినిమాను ఉపయోగించుకుంటున్నారనే ఆందోళనలు వినిపిస్తున్నాయి. ప్రేక్షకుల విచక్షణ చాలా గొప్పది. కాబట్టి ఆందోళన పడాల్సిన అవసరం లేదు.పురుషులను ఎడ్యుకేట్ చేయాలిఅన్ని రంగాల్లో అమ్మాయిలు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినా వివక్ష వీడట్లేదు. దానికి సినిమా రంగమూ అతీతం కాదు. ప్రతిచోట స్త్రీలకు భద్రత ఉండాలి! వివక్షను రూపుమాపడానికి పురుషులను ఎడ్యుకేట్ చేయాలి. అది ఇంటి నుంచే మొదలవ్వాలి. తల్లిదండ్రులే ఆ ప్రయత్నానికి నాంది పలకాలి. ఈ విషయం మీద మా అబ్బాయి (యాక్టర్, స్క్రిప్ట్ రైటర్, డైరెక్టర్ ఫర్హాన్ అఖ్తర్) ‘మర్ద్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి మగ పిల్లల్లో అవేర్నెస్ కల్పిస్తున్నాడు!’ అంటూ చెప్పుకొచ్చింది నటి షబానా ఆజ్మీ. సినిమా ఇండస్ట్రీలో మహిళా టెక్నీషియన్స్ పెరిగారు. వాళ్లలో స్క్రిప్ట్ రచయితలు, దర్శకులు కూడా ఉండటంతో సున్నితమైన అంశాలు తెరమీదకు వస్తున్నాయి. నటనలో కూడా నేటి అమ్మాయిలు చాలా తెలివైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాకపోతే ఐటమ్ సాంగ్స్‌తోనే పేచీ. అవి పెట్టినా కాస్త అర్థవంతంగా ప్రెజెంట్ చేయొచ్చు కదా!గర్ల్‌ఫ్రెండ్సే కారణం.. ‘స్త్రీకి స్త్రీ శత్రువు కాదు. ఇలాంటి తప్పుడు భావజాలాన్ని ప్రచారం చేసి పబ్బం గడుపుకుంటోంది పురుషాధిపత్య సమాజం. దాని మాయలో పడకూడదు. స్త్రీకి స్త్రీయే నేస్తం. నేనీ రోజు ఈ స్థాయికి చేరానంటే కారణం నా చుట్టూ ఉన్న స్త్రీమూర్తులు.. గర్ల్‌ఫ్రెండ్సే! అందుకే సిస్టర్‌హుడ్‌ను పెంపొందించుకోవాలి. అలాగే తిండి, కట్టు, బొట్టు లాంటివన్నీ వ్యక్తిగత విషయాలు. మన సౌకర్యం, అభిరుచిని బట్టి నిర్ణయించుకునేవి తప్ప సమాజమో, ప్రభుత్వాలో నిర్ణయించేవి కావు!’– హుమా ఖురేషీచిత్చోర్ ఏమన్నాడు‘గోరి తేరా గావ్ బడా ప్యారా’ అంటూ అమోల్ పాలేకర్ హైదరాబాద్ వచ్చేశాడు మరాఠీ న్యూవేవ్ సినిమా పయనీర్, నటుడు, దర్శకుడు, థియేటర్ పర్సనాలిటీ, చిత్రకారుడు అమోల్ పాలేకర్... మారిన సినిమా తీరు, మరాఠీ రంగస్థలం గురించి మాట్లాడుతూ.. ‘సినిమా థియేటర్ ఉనికి కోల్పోయింది. ఓటీటీ వచ్చింది. సెల్ఫోన్లో ప్రపంచం కనబడుతోంది. ఈ మార్పంతా ఓ పద్ధతి ప్రకారం జరిగింది. అది ప్యార్లల్ మూవీ మూవ్‌మెంట్‌నూ కంట్రోల్ చేసింది. సొంత ప్రయోజనాల కోసం పాలక వర్గాలకు కొమ్ముకాసే వాళ్లు సినిమా రంగంలోనూ ఉంటారు. ఏటికి ఎదురీదే వాళ్లు కొద్దిమందే! వాళ్లు మైనారిటీ వర్గంగా మిగిలిపోయి ప్రభావం చూపించలేకపోతారు. వీటన్నిటి క్రమంలో ఊరటను.. సంతోషాన్నిస్తున్నది రంగస్థలమే! అది తన శోభను కోల్పోలేదు. ముఖ్యంగా మరాఠీ రంగస్థలం. యంగ్ జనరేషన్‌తో కళకళలాడుతోంది. అది ఒక్క ముంబై, పుణెలోనే కాదు మహారాష్ట్ర అంతటా ఎక్స్‌పెరిమెంట్స్‌తో వైబ్రెంట్‌గా ఉంది’ అని చెప్పారు. – వాకా మంజులారెడ్డి -
ఆందోళనకరంగా దేశంలో పరిణామాలు
సాక్షి, హైదరాబాద్: ‘ప్రస్తుతం దేశంలో సంభవిస్తున్న పరిణామాలు ఆందోళనకరంగా కనిపిస్తున్నాయి. చరిత్రను తెరమరుగుచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పాఠ్యాంశాల నుంచి కొన్ని అధ్యాయాలను తొలగిస్తున్నారు. దీనిని ప్రజలు చూస్తూ ఉండిపోతున్నారు. ఇది విచారించవలసిన విషయం. భారత రాజ్యాంగం అనేది ఎంతో ముఖ్యమైనది.. ప్రధానమైనది. అధికారంలో ఉన్నవారు రాజ్యాంగ రక్షణకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. భారతదేశం సెక్యులరిజం, బహుళత్వం అనే పునాదులపై నిలుస్తోంది..’అని పద్మభూషణ్, సీనియర్ నటి షబానా అజ్మీ అన్నారు.శుక్రవారం హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ప్రారంభ ప్లీనరీ ‘ఏ లైఫ్ ఇన్ సినిమా’కార్యక్రమంలో షబానా అజ్మీతో ఫెస్టివల్ డైరెక్టర్ అమితా దేశాయ్ చర్చాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు షబానా జవాబిచ్చారు. హింసను ప్రోత్సహించే విధంగా కేరళ స్టోరీ, కశీ్మ ర్ ఫైల్స్ వంటి బాలీవుడ్ సినిమాలు వస్తున్నాయి కదా.. వాటిపై మీ స్పందన ఏమిటని ఒక కాలేజీ విద్యార్థని వేసిన ప్రశ్నకు షబానా పైవిధంగా స్పందించారు.‘మనదేశంలో లెఫ్ట్, రైట్ శక్తుల మధ్య పోరాటం సాగుతూనే ఉంది. ఈ రెండింటి సిద్ధాంతాలు పూర్తిగా భిన్నం. నిజమైన ప్రజాస్వామ్యంలో అన్నింటినీ అనుమతించాలి. ఉద్రిక్తతలు రెచ్చ గొట్టని సినిమాలకు సెన్సార్ సర్టిఫికెట్లు ఇవ్వాలి. నేడు కేవలం పదిమంది ఒక సినిమాకు అభ్యంతరం చెబుతున్నారు. అభ్యంతరం మంచిదే కాని అది హింసకు దారితీయడం ఆమోదయోగ్యం కాదు..’అని షబానా వివరించారు. కమ్యూనిస్టుల మధ్య నా బాల్యం గడిచింది ‘నేను హైదరాబాద్‌లోనే పుట్టాను. ప్రగతిశీల రచయితగా నా తండ్రి ఖైఫీ అజ్మీ ఇక్కడ అజ్ఞాతంలో గడిపారు. కమ్యూనిస్టుపార్టీ నాయకుల మధ్యలోనే నా బాల్యం గడిచింది. చిన్నప్పుడు ప్రతి వేసవిలో హైదరాబాద్‌కు వచ్చేదాన్ని. నగర సంస్కృతి, ప్రగతిశీల సాహిత్యం, చుట్టంతా మేధావులతో నిండిన వాతావరణం నన్నెంతో ప్రభావితం చేసింది. నా తొలి సినిమా ‘అంకుర్’షూటింగ్ సందర్భంగా ఇక్కడే ఓ గ్రామ (నేటి ఎల్లారెడ్డిగూడ) వాతావరణంలోకి తొలిసారిగా అడుగుపెట్టా.అక్కడి నుంచి స్టీఫెన్ స్పీల్బర్గ్ చిత్రంలోనటించే వరకు నా నట జీవితం కొనసాగింది..’అని షబానా వివరించారు. ముంబయి మురికివాడల్లోని పేదలకు రాజకీయవేత్త శరద్‌పవార్ సహకారంతో ఇళ్లు కట్టించి ఇచ్చేందుకు కృషి చేశానన్నారు. తన తండ్రి ఖైఫీ అజ్మీ ప్రారంభించిన ‘మిజ్వా’ద్వారా ఇప్పటికీ కార్యక్రమాలు చేపడుతున్నానని చెప్పారు. ఈ సందర్భంగా షబానా సినీ జీవిత ప్రయాణాన్ని వివరిస్తూ 3 నిమిషాల లఘు చిత్రాన్ని నిర్వాహకులు ప్రదర్శించారు. -
సాహిత్యం, కళలతో సమాజం పురోగతి
సాక్షి, హైదరాబాద్: సమాజం పురోగతి సాధించాలంటే సాహిత్యం, కళల అవసరం ఎంతైనా ఉందని గవర్నర్ డాక్టర్ జిష్ణుదేవ్‌వర్మ అన్నారు. ఇవి చిరస్థాయిగా నిలిచిపోతాయని, సాహిత్యం, పుస్తకాలనేవి అంతర్థానం కావని తాను బలంగా విశ్వసిస్తున్నా నని చెప్పారు. అచ్చయిన పుస్తకం ద్వారా సాహి త్యం ఓ రిజర్వాయర్‌గా నిలిచి అవసరానికి అక్కరకు వస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు. సాహిత్యం, కళలు అనేవి లేకుండా జీవితం పరిపూర్ణం కాదన్నారు.డిజిటల్ పద్ధతిలో, ఆడియో బుక్ లేదా స్మార్ట్‌ఫోన్‌లో అయినా పుస్తకాలు చదవడం మంచిదేనని పేర్కొన్నారు. తనకు మాత్రం సంప్రదాయ పద్ధతుల్లో పుస్తకాన్ని చేతబూని చదవడాన్ని మించిన అనుభూతి మరొకటి లేదన్నారు. పుస్తకం చదవడం ద్వారా నేరుగా రచయితతో సంభాషిస్తున్నట్టు ఉంటుందని చెప్పారు. శుక్రవారం సత్వ నాలెడ్జి సిటీలో ‘హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్–2025’ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. కళలు, సంస్కృతి, సాహిత్యాల సంగమం ‘పెద్ద పెద్ద భవనాలు, కట్టడాలకే కాదు ప్రజల స్నేహాభిమానాలు, కవిత్వానికి హైదరాబాద్ ప్రతీక. ‘సిటీ ఆఫ్ డిస్కవరీ’గా నిలిచినందునే నగరం అభివృద్ధి చెందుతోంది. హైద రాబాదీలు సాహిత్యం, కవిత్వంతో మమేకమై ఉన్నారు. కళలు, సంస్కృతి, సాహిత్యాల సంగమంగా హైదరాబాద్ సాహిత్యోత్సవం (లిటరరీ ఫెస్టివల్) నిలుస్తోంది. త్రిపురకు చెందిన నాకు.. తాత, తల్లి చిత్రకారులు కావడంతో కళలు, సాహిత్యంపై అభిమానం పెరిగింది. కళలు, సాహిత్యం అనేవి సృజనాత్మక స్ఫూర్తితో జీవితానికి పరిపూర్ణతను అందిస్తాయి. పుస్తకం ద్వారా మనల్ని మనం తెలుసుకోవడంతో పాటు ప్రపంచాన్ని కూడా కనుక్కోవచ్చు.ఇటీవలి కాలంలో పుస్తకాల పఠనం తగ్గిపోయిందని, తమ పుస్తకాలు అమ్ముడుపోవడం లేదంటూ హైదరాబాద్ బుక్ ఫెయిర్ సందర్భంగా రచయితలు వాపోయారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని వివాహ వార్షికోత్సవాలు, పిల్లల పుట్టినరోజులు, ఇలా వివిధ సందర్భాల్లో పుస్తకాలను బహుమతులుగా ఇవ్వొచ్చునని సూచించా. ‘ఏక్ భారత్–శ్రేష్ట్ భారత్’స్ఫూర్తితో త్వరలో రాజ్‌భవన్‌లో ‘ఈశాన్య భారత్–హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్’నిర్వహిస్తాం..’అని గవర్నర్ తెలిపారు. ఆ విషయంలో పెద్దలదే బాధ్యత: షబానా అజ్మీ సీనియర్ నటి షబానా అజ్మీ మాట్లాడుతూ..‘స్మార్ట్ఫోన్లు, టాబ్లు, ఇతర డిజిటల్ పరికరాలకు పిల్లలు అతుక్కుపోతున్నారు. అయితే వారు పుస్తకాలు చదివే అలవాటు మరవడానికి పెద్దలదే బాధ్యత అని నేను నమ్ముతా. పెద్దవారు పుస్తకాలను చదివే అలవాటును మరిచిపోతే ఇక పిల్లలేం చేస్తారు. పెద్దలు నాటకాలు చూడడానికి, సాహిత్య సభలకు, సాంస్కృతిక కార్యక్రమాలకు, కళా ఉత్సవాలకు వెళ్లకపోతే ఇక పిల్లలకేం అలవడుతుంది..’అని వ్యాఖ్యానించారు.పుస్తకమనేది భాషను పెంపొందించేందుకు ఎంతో ఉపయోగపడుతుందని ఆమె చెప్పారు. ‘హైదరాబాద్ అంటే నాకెంతో అభిమానం. ఇక్కడ ప్రగతిశీల రచయితల సమావేశంలోనే నా తల్లిని నా తండ్రి ఖైఫీ అజ్మీ కలుసుకున్నారు. మఖ్దూం మొహియుద్దిన్, సర్వర్ డండా, పుష్యమిత్ర ఇతర ప్రగతిశీల, విప్లవ కవులకు కేంద్రంగా హైదరాబాద్ నిలిచింది..’అని పేర్కొన్నారు. ఫెస్టివల్ కమిటీ చైర్‌గా పరిశ్రమలు, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. అమితాదేశాయ్, డాక్టర్ టి.విజయ్‌కుమార్, డాక్టర్ కిన్నెర మూర్తి తదితరులు పాల్గొన్నారు. ‘సాగర సంగమం’గుర్తు చేసుకున్న లిథువేనియా రాయబారి తాను భారతీయ సినిమాలు చూస్తూ పెరిగినట్లు గౌరవ అతిథి, లిథువేనియా రాయబారి డయానా మికెవిసీన్ చెప్పా రు. భారతీయ భాషలకు పెద్ద అభిమానినని, సంస్కృతం, హిందీ నేర్చుకుంటున్నానని తెలిపారు. 1999లో విద్యారి్థనిగా, 2023లో మరోసారి హైదరాబాద్‌ను సందర్శించానన్నా రు. నయా భారత్‌కు చిహ్నంగా ఈ నగరం నిలుస్తోందంటూ ప్రశంసించారు. తాను వృత్తిగతంగా రాయబారినైనా చాలా పుస్తకాలు చదువుతానన్నారు.భారత్‌పై పుస్తకం రాయాలని అనుకుంటున్నట్టు తెలిపారు. ‘సాగర సంగమం’సినిమాను అందులోని ‘మౌనమేలనోయి..’పాటను డయానా గుర్తుచేసుకోగా ఆహూతులు చప్పట్లతో హర్షం వెలిబుచ్చారు. -
ఓయూలో ‘పదోన్నతుల’ రగడ!
ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ)లో పదోన్నతుల రగడ కొనసాగుతోంది. అధిక వేతనం కోసం కొంతమంది ప్రొఫెసర్లు (Professors) అడ్డదారిలో ప్రమోషన్లు పొందారనే అంశం ఓయూ అధ్యాపక, విద్యార్థి వర్గాల్లో కలకలం రేపుతోంది. తప్పుడు సమాచారం ఇచ్చి 50 మంది ప్రొఫెసర్లు సీనియర్ ప్రొఫెసర్లుగా ప్రమోషన్లు పొందినట్లు ‘ఔటా’ ఫిర్యాదు చేయగా, మాజీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ రవీందర్, సైన్స్ మాజీ డీన్ ప్రొఫెసర్ బాలకిషన్ పదోన్నతులను రద్దు చేస్తూ యూజీసీ (UGC) ఉత్తర్వులు జారీ చేసింది.కొత్తగా సీనియర్ ప్రొఫెసర్ హోదా.. యూనివర్సిటీల్లో బోధన, పరిశోధనలకుగాను ప్రొఫెసర్లను నియమిస్తారు. ప్రొఫెసర్ కంటే ముందుగా అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ లేదా రీడర్ హోదాలు ఉంటాయి. అయితే బీజేపీ కేంద్రంలో రెండోసారి అధికారం చేపట్టాక సీనియర్ ప్రొఫెసర్ అనే మరో హోదాను సృష్టించింది. సీనియర్ ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందాలంటే యూజీసీ నిబంధనల ప్రకారం ప్రొఫెసర్‌గా 10 ఏళ్ల సరీ్వస్, 10 పరిశోధనా పత్రాలు(పబ్లికేషన్స్), ఇద్దరు విద్యార్థులకు పీహెచ్డీ పర్యవేక్షకులు(గైడ్షిప్)గా ఉండాలి. సీనియర్ ప్రొఫెసర్‌కు నెలకు రూ.3.40 లక్షల వరకు వేతనంతోపాటు పింఛను, ఇతర అలవెన్సులు ఉంటాయి.తొలిసారి 51 మందికి అవకాశంఓయూ మాజీ వైస్ చాన్స్‌లర్ ప్రొ.రవీందర్ హయాంలో మూడుసార్లు జరిగిన కెరియర్ అడ్వాన్స్డ్ స్కీమ్(సీఎస్ఎస్) పదోన్నతుల్లో 51 మంది సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతి పొందారు. కానీ, అందులో కొందరికి యూజీసీ నిబంధనల ప్రకారం పరిశోధనా పత్రాలు 10 కంటే తక్కువగా ఉన్నాయని ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్(ఔటా) నాయకులు ఫిర్యాదు చేశారు. ఔటా ఫిర్యాదు మేరకు ఓయూ మాజీ వీసీ ప్రొ.తిరుపతిరావు అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిటీని నియమించింది. అయితే కమిటీ విచారించిన అంశాలను బహిర్గతం చేయాలని ఔటా నాయకులు కోరినా ఇంతవరకు బహిర్గతం చేయలేదు. ‘గతం గతః భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్త పడాలి’అని కమిటీ విచారణలో పేర్కొన్నట్లు తెలిసింది. ఇద్దరి పదోన్నతులు చెల్లవు: యూజీసీ ఓయూలో ఇద్దరు సీనియర్ ప్రొఫెసర్ల పదోన్నతులు చెల్లవని యూజీసీ తేల్చి చెప్పింది. మాజీ వీసీ ప్రొ.రవీందర్, సైన్స్ మాజీ డీన్ ప్రొ.బాలకిషన్‌కు యూజీసీ నిబంధనల ప్రకారం 10 పరిశోధనాపత్రాలు లేవని తేలడంతో వారి పదోన్నతులు రద్దు చేయాలని ఉత్తర్వులను జారీ చేసింది. అయితే మరో 40 మందికి కూడా 10 పరిశోధన పత్రాలు లేవని ఔటా, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు పొందినవారికి ఇంతకాలం చెల్లించిన వేతనం, పింఛన్ రికవరీ చేయాలని డిమాండ్ చేశారు.చదవండి: పాతబస్తీ మెట్రో పనులు.. చకచకా!నిబంధన మేరకే..: ప్రొ.రవీందర్ ఓయూలో తొలిసారిగా చేపట్టిన సీనియర్ ప్రొఫెసర్ల పదోన్నతుల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని మాజీ వీసీ ప్రొఫెసర్ రవీందర్ వివరణ ఇచ్చారు. ప్రొఫెసర్ బాలకిషన్‌పై వచ్చిన ఆరోపణలను విచారించి ఆయనకు ఇచ్చిన పదోన్నతిని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. తనకు 10 పబ్లికేషన్స్ ఉన్నాయని, తప్పుడు తడకగా సమాచారాన్ని ఆర్టీఏ ద్వారా సేకరించి తనపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కాగా, అక్రమ పదోన్నతులను రద్దు చేసి, ఇంతవరకు పొందిన వేతనం, పింఛన్‌ను రికవరీ చేయాలని ఔటా అధ్యక్షుడు ప్రొ.మనోహర్, ఏఐఎస్ఎఫ్ నేత నెలి సత్య డిమాండ్ చేశారు. -
మీర్పేట్ హత్య కేసులో సంచలన విషయాలు.. రెండు ఎవిడెన్స్ లభ్యం?
సాక్షి, హైదరాబాద్: మీర్పేట్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గురుమూర్తి హత్య ఎలా చేశాడనే దానిపై పోలీసులు నిర్థారణకు వచ్చినట్లు తెలిసింది. గ్యాస్ స్టౌవ్‌పై శరీరానికి సంబంధించిన ఒక టిష్యూ, రక్తపు మరక లభ్యమైనట్లు సమాచారం. క్లూస్ టీమ్‌కి దొరికిన రెండు ఆధారాలతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రెండు ఆధారాలను క్లూస్ టీమ్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపింది.భార్య వెంకట మాధవి చనిపోయిన తర్వాత డెడ్‌బాడీని బాత్రూమ్లోకి తీసుకెళ్లిన భర్త గురుమూర్తి.. బాత్రూమ్లో డెడ్‌బాడీని ముక్కలు ముక్కలుగా కట్ చేశాడు. ఒక్కొక్క ముక్కని కమర్షియల్ గ్యాస్ స్టౌవ్‌పై పెట్టి కాల్చేశాడు. బాగా కాలిపోయిన ఎముకలను రోట్లో వేసి పొడిగా చేసిన గురుమూర్తి.. ఎముకల పొడి మొత్తాన్ని బకెట్లో నింపి చెరువులో పడేశాడు.మాధవి హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతుందని.. కేసులో కీలక అంశాలున్నాయని రాచకొండ సీపీ అన్నారు. దర్యాప్తు కోసం ఇతర రాష్ట్రాల నుంచి సాంకేతిక నిపుణులను తీసుకొస్తున్నామన్నారు. ఈ కేసు టెక్నికల్ అంశాలతో ముడిపడి ఉందని.. టెక్నాలజీ ఉపయోగించి కేసు దర్యాప్తు చేస్తున్నామని సీపీ తెలిపారు.వీఈ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. మరో మహిళతో అక్రమ సంబంధం నేపథ్యంలో అడ్డు తొలగించుకునేందుకే గురుమూర్తి తన భార్య మాధవిని హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. గురుమూర్తి సెల్ఫోన్లో మరో మహిళతో ఉన్న ఫోటోలు లభించడంతో ఈ దిశగా దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది. అయితే విచారణ సందర్భంగా అతడు పొంతన లేని సమాధానాలు చెబుతుండటం, ఇంకా ఎలాంటి ఆ« దారాలు లభించకపోవడంతో.. అసలేం జరిగింది? అతను చెప్పేది నిజమా, అబద్ధమా? అనేది మిస్టరీగా మారిందని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ కేసులో అధికారికంగా ఇప్పటివరకు ఎలాంటి వివరాలనూ పోలీసులు వెల్లడించకపోవడం గమనార్హం.ఇదీ చదవండి: ఆటో డ్రైవర్ కిరాతకం.. మహిళపై అత్యాచారంతనతో గొడవ పడి భార్య బయటికి వెళ్లిపోయిందని గురుమూర్తి బంధువులతో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి మిస్సింగ్ కేసు పెట్టించాడు. దీనితో పోలీసులు ఆ కాలనీలోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. 14న మాధవి బయటి నుంచి ఇంట్లోకి వెళ్లినట్టుగా సీసీ కెమెరా వీడియోల్లో ఉంది. తర్వాత ఆమె బయటికి రాలేదు. గురుమూర్తి ఒక్కడే ఇంటి నుంచి బయటకు వెళ్లిరావడాన్ని పోలీసులు గుర్తించారు. దీనికితోడు గురుమూర్తి ప్రవర్తనపై సందేహంతో.. మాధవిని ఇంట్లోనే హత్య చేసి ఉండవచ్చని భావించి, ఇంట్లో, పరిసరాలను పరిశీలించారు. తర్వాత అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. భార్య తలపై ఆయుధంతో మోది హత్య చేసి, శరీరాన్ని ముక్కలు చేశానని.. బకెట్లో వేసి వాటర్ హీటర్‌తో ఉడికించి, రోకలితో దంచి చెరువులో పడేశానని నిందితుడు పోలీసుల విచారణలో చెప్పినట్టు తెలిసింది.పోలీసులు చెరువులో గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టినా ఎలాంటి ఆధారమూ లభించలేదని.. ఇంట్లోని బాత్రమ్, వీధిలోని అన్ని మ్యాన్‌హోళ్లను తెరిపించి పరిశీలించినా ఏ స్పష్టతా రాలేదని సమాచారం. దీనితో గురుమూర్తి చెప్పేది నిజమా, అబద్ధమా? పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు అలా చెబుతున్నాడా అన్న సందేహాలు వస్తున్నాయి. హత్యపై రకరకాలుగా ప్రచారం జరుగుతున్నా పోలీసు అధికారులు అధికారికంగా ఎలాంటి వివరాలూ వెల్లడించడం లేదు. కాగా.. గురుమూర్తి ఇంట్లో మద్యం సీసా, దాని పక్కనే మటన్ షాపులో ఉపయోగించే చెక్క మొద్దును గుర్తించారు. హత్య అనంతరం శరీరాన్ని దీనిపైనే ముక్కలుగా చేసినట్టు భావిస్తున్నారు. -
జనవరి 27న రవీంద్రభారతిలోఎఫ్–టామ్ ‘వారధి’
సాక్షి, ముంబై: హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో జనవరి 27న ‘వారధి’కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర (ఎఫ్–టామ్) అధ్యక్షుడు గంజి జగన్‌బాబు తెలిపారు. మూడు రాష్ట్రాల వ్యాపారాలను ఒకే వేదికపైకి తీసుకురావడమే ఈ కార్యక్రమం లక్ష్యమని ఇందులో భాగంగా తెలంగాణ–ఆంధ్రప్రదేశ్–మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (టీఏఎంసీసీఐ) సంస్థ ప్రారంభోత్సవం, లోగోఆవిష్కరణతోపాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, అవార్డుల ప్రదానం జరగనుందని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, నటుడు సాయికుమార్ ముఖ్యఅతిధులుగా హాజరుకానున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రల ప్రజలందరూ విచ్చేయాలని జగన్‌బాబు కోరారు. చదవండి : Birthright citizenship : ట్రంప్ ఆర్డర్‌ను తోసిపుచ్చిన కోర్టు, ఎన్ఆర్ఐలకు భారీ ఊరటసంక్రాంతికి వస్తున్నాం ‘అప్పడాలు’ కాదు... సోషల్ మీడియాను షేక్ చేస్తున్నవీడియో! -
పోలీసులకే దృశ్యం సినిమా చూపిస్తున్న గురుమూర్తి
-
అలకనంద కిడ్నీ రాకెట్.. క్లీనిక్ పర్మిషన్తో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో కిడ్నీ రాకెట్ కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అలకనందా ఆసుపత్రి యజమాని సుమన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, డీహెచ్ఎంవో ఆసుపత్రికి సీజ్ చేశారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నలుగురు పేషంట్స్‌ను గాంధీ ఆసుపత్రికి తరలించారు.అలకనంద కిడ్నీ రాకెట్ కేసు విచారణను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే తాజాగా ఆసుపత్రి యజమాని సుమన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఉజ్బెకిస్థాన్ ఎంబీబీఎస్ సర్టిఫికెట్తో సుమన్ క్లీనిక్ అనుమతి పొందినట్టు పోలీసులు గుర్తించారు. అయితే, ఆసుపత్రిలో నెఫ్రాలజీ ట్రీట్మెంట్కు ఎలాంటి అనుమతి లేకపోవడం గమనార్హం. ఎంబీబీఎస్ సర్టిఫికెట్తో తొమ్మిది బెడ్స్‌కు క్లీనిక్‌కు అధికారులు అనుమతిచ్చారు. కానీ, అక్కడ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని సుమన్ నిర్వహిస్తున్నాడు. దీంతో, డీఎంహెచ్‌వో ఆసుపత్రిని సీజ్ చేశారు.ఇదిలా ఉండగా.. ఇప్పటి వరకు ఈ కేసులో ఎనిమిది మంది బ్రోకర్స్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్ పవన్, మద్యవర్తి ప్రదీప్‌ను అరస్ట్ చేశారు. అలాగే, తమిళనాడుకు చెందిన నస్రీంభాను, ఫిర్ధోస్‌లను కిడ్నీ డోనర్లుగా గుర్తించారు. బెంగళూరుకు చెందిన రాజశేఖర్, బట్టు ప్రభకు కిడ్నీలు అమర్చిన వైద్యులు. ఈ క్రమంలో ఒక్కో ఆపరేషన్ 55లక్షల వసూలు చేశారు ఆసుపత్రి సిబ్బంది.ఈ ఘటన తరువాత, రాష్ట్రవ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈ అంశంపై ప్రత్యేక సమావేశం నిర్వహించి, కిడ్నీ రాకెట్ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తును చేపట్టే ప్రక్రియలో ఉన్నారు. మరోవైపు.. సరూర్‌నగర్ అలకనంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ పై ప్రభుత్వం నిజానిర్దారణ కమిటీ వేసింది. ఈ కేసులో విచారణ వేగవంతం చేయడానికి ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేసును సీఐడీకి బదిలీ చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. -
రోడ్ రోలరే వీరి టార్గెట్
జీడిమెట్ల: సైకిళ్లు, బైకులు, కార్లను అపహరించే చోరులు పోలీసులకు చిక్కుతూనే ఉంటారు. కొన్ని సందర్భాల్లో లారీలు, కంటైనర్ దొంగలూ దొరుకుతారు. గురువారం జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేసిన వారి రూటే సెపరేటు. వీళ్లు ఏకంగా రోడ్ రోలర్లను తస్కరించి కటకటాల్లోకి చేరారు. క్రేన్లు, డీసీఎం వాహనాల సాయంతో ఈ దొంగతనాలు చేసి, స్క్రాప్ దుకాణాలకు విక్రయిస్తున్నట్లు బాలానగర్ డీసీపీ కె.సురేష్‌కుమార్ తెలిపారు. ఏసీపీ హన్మంతరావుతో కలిసి గురువారం జీడిమెట్ల ఠాణాలో ఏర్పాటు చేసిన సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు. కర్ణాటకలోని కలబురిగి (గుల్బర్గా), సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌కు చెందిన అఫ్రోజ్ అహ్మద్ (గ్యాస్ కట్టర్), మహ్మద్ ఇబ్రహీం (స్క్రాప్ వ్యాపారి), సయ్యద్ ముస్తాఫా స్నేహితులు. ప్రస్తుతం వీరంతా బాలానగర్‌లోని రాజు కాలనీలో నివసిస్తున్నారు. తమకు వచ్చే ఆదాయంతో కుటుంబ పోషణ, విలాసాలు కష్టం కావడంతో తేలిగ్గా డబ్బు సంపాదించే మార్గాల కోసం అన్వేషించారు. పార్క్ చేసి ఉండగా.. ఇందులో భాగంగా జీడిమెట్ల పారిశ్రామిక వాడతో పాటు ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికారు. దూలపల్లి రోడ్డులో పార్క్ చేసి ఉన్న రోడ్ రోలర్‌పై వీరి కన్నుపడింది. దాని యజమాని, డ్రైవర్ సైతం సమీపంలో లేకపోవడాన్ని అనుకూలంగా మార్చుకోవాలని భావించారు. కుత్బుల్లాపూర్నకు చెందిన డీసీఎం వాహన యజమాని, డ్రైవర్ షేక్ అన్వర్‌తో కలిసి సోమవారం రాత్రి రోడ్ రోలర్ దగ్గరకు చేరుకున్నారు. ఆపై కుత్బుల్లాపూర్ ప్రాంతానికే చెందిన క్రేన్ల యజమాని బి.రామ్ సత్యనారాయణను సంప్రదించి రెండు క్రేన్లు దూలపల్లి రోడ్లోకి రప్పించుకున్నారు. స్థానికుల సమాచారంతో.. క్రేన్ల సాయంతో రోడ్ రోలర్ని డీసీఎం వ్యాన్‌లోకి ఎక్కించి ఉడాయించే ప్రయత్నం చేశారు. రోడ్ రోలర్‌కు లక్ష్మణ్ డ్రైవర్‌గా వ్యవహరిస్తుంటాడని, జీడిమెట్లలోని ఓ టింబర్ డిపోలో పని చేసి అక్కడ పార్క్ చేశాడని స్థానికులకు సమాచారం ఉంది. గుర్తుతెలియని వ్యక్తులు వ్యాన్‌లో రోడ్ రోలర్ తీసుకువెళ్తుండటంతో వారికి అనుమానం వచి్చంది. దీంతో అప్రమత్తమైన జీడిమెట్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు. తక్షణం స్పందించిన అధికారులు డీసీఎం వాహనాన్ని వెంటాడి పట్టుకున్నారు. అందులో ఉన్న అన్వర్‌ను విచారించగా.. మిగిలిన నలుగురి పేర్లు వెలుగులోకి వచ్చాయి. గతంలోనూ ఓ రోడ్ రోలర్ చోరీ.. ఈ ముఠా గతంలోనూ పేట్ బషీరాబాద్ పరిధి నుంచీ ఓ రోలర్‌ను చోరీ చేసిందని, దాన్ని గ్యాస్ కట్టర్లు వినియోగించి ముక్కలు చేయడంతో పాటు వాటిని మహారాష్ట్రలోని జాల్నాలో ఉన్న స్క్రాప్ వ్యాపారికి అమ్మిందని వెలుగులోకి వచ్చింది. నిందితుల కోసం గాలించిన పోలీసులు ముస్తాఫా మినహా మిగిలిన వారిని పట్టుకుని క్రేన్లు, డీసీఎంతో పాటు రోడ్ రోటర్ స్వా«దీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన జీడిమెట్ల ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్, డీఐ కనకయ్య, ఎస్సై శ్యాంబాబు, హెడ్ కానిస్టేబుల్ రాజశేఖర్, కానిస్టేబుళ్లు కేవీ సుబ్బారావు, ఎస్.ఆంజనేయులు, టి.సాయి ఫణీంద్రలను డీసీపీ అభినందించారు. -
బైక్ రైడ్ .. రికార్డ్ బ్రేక్..
సాక్షి, హైదరాబాద్: వేగవంతమైన రైడ్ చేసిన అతిపిన్న వయస్కుడైన బైకర్‌గా ఇటీవల ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు çఅందుకున్నాడు కొండా సిద్ధార్్థ. నగరవాసి అయిన మంచిర్యాలకు చెందిన సిద్ధార్థ్ ప్రస్తుతం సొంత వ్యాపారం చేస్తున్నాడు. ఈ సందర్భంగా తను పంచుకున్న విశేషాలు తన మాటల్లోనే.. జాలీరైడ్ చేద్దామనుకున్నా.. బైక్ మీద తోచినదారిన సాగిపోవాలని, మార్గ మధ్యంలోనే పని చేసుకుంటూ, సంపాదించుకుంటూ ఆ డబ్బునే ఖర్చు చేసుకుంటూ యాత్ర చేయాలనేది నా ఆలోచన. అయితే రాయల్ ఎన్ఫీల్డ్ మేనేజర్ విమలేష్ కుమార్ నాన్ రిపీటింగ్ రైడ్ గురించి నాకు తొలుత పరిచయం చేశాడు. తనే ఆ తర్వాత కూడా మార్గనిర్దేశం చేస్తూ సహకరించారు. ఈ రైడ్స్ ద్వారా మంచి సందేశాలు అందించవచ్చని, అలాగే రికార్డ్స్ సాధించొచ్చని తెలుసుకున్నాక.. ఆ దిశగా నేనెందుకు ప్రయత్నం చేయకూడదు? అని ప్రశ్నించుకున్నా.. నా యాత్రకు అవయవ దానం, జంతువుల సంక్షేమంపై అవగాహన కల్పించడమే లక్ష్యం మార్చుకున్నా. కేవలం 96 రోజుల్లో 40,708.5 కిమీ ప్రయాణంలో 28 రాష్ట్రాలు 2,731 ప్రదేశాల మీదుగా సాగిపోయా. ఇందులో ఓ కేంద్ర పాలిత ప్రాంతం కూడా కవర్ అయ్యింది. ఈ రైడ్‌లో.. 3వ రికార్డ్.. ప్రపంచంలో ఈ తరహా నాన్ రిపీటింగ్ మారథాన్ ట్రిప్ ఫీట్‌ను సాధించిన ముగ్గురు పిన్న వయసు రైడర్లలో చైనా నుంచి ఒకరు, చెన్నై నుంచి మరొకరు మాత్రమే ఉన్నారు. అలా మన దేశం నుంచి నేను కూడా వారి సరసన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేరును నమోదు చేసుకున్నా. ప్రస్తుతం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు చేయాలనుకుంటున్నా. లడఖ్‌లో రెండు వారాల పాటు మంచు కురుస్తున్న ప్రాంతంలో ట్రాఫిక్ నిలిచిపోయినప్పుడు ద్రాస్‌లో రోడ్డుకు అడ్డంగా మంచు చరియలు విరిగిపడుతున్నప్పుడు.. కఠిన పరిస్థితుల్ని ఎదుర్కొన్నా. అదృష్టవశాత్తూ ఈ డేంజరస్ ప్రయాణంలో ఎలాంటి ప్రమాదానికీ గురికాలేదు. ప్రమాదాల నివారణకు..ఈ రైడ్ కోసం రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 411 అనే అడ్వెంచర్ బైక్ ఉపయోగించా. జర్మనీ నుంచి ప్రత్యేక హెల్మెట్‌ను దిగుమతి చేసుకున్నా. స్లీపింగ్ బ్యాగ్, కెమెరాతో పాటు రోడ్డు ప్రమాదాలను నివారించడానికి జంతువులకు కట్టడానికి కాలర్ టైలను తీసుకువెళ్లా, క్యాంపింగ్ టెంట్, మెడికల్ కిట్, మోటర్‌బైక్ ఉపకరణాలు దగ్గర ఉంచుకున్నా. యుఎస్ లోని ఓ ఇన్స్టిట్యూట్ నుంచి ఫైర్ సేఫ్టీ సంబంధిత కోర్సును అభ్యసించా.