India@75
-
నెల్లూరు జిల్లాకు జాతీయ అవార్డు
నెల్లూరు (పొగతోట): అజాదీకా అమృత్ మహోత్సవం కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు జాతీయ స్థాయి అవార్డు లభించింది. దేశవ్యాప్తంగా 780 జిల్లాలో120 రోజులపాటు ఈ కార్యక్రమాల అమలు తీరును కేంద్ర ప్రభుత్వం పరిశీలించింది. ఉత్తమ పనితీరు కనబర్చిన టాప్ 10 జిల్లాలను కేంద్ర ప్రభుత్వం అవార్డులకు ఎంపిక చేసింది. ఇందులో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 4వ స్థానంలో నిలిచింది. త్వరలో ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు ఢిల్లీలో ఈ అవార్డు అందుకోనున్నారు. చదవండి: (దశాబ్దాల స్వప్నం సాకారం) -
గాంధీ గురించి ఈ తరం పిల్లలకు తెలియాలి: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: 75 ఏళ్ల స్వాతంత్య్ర ఫలాలను భారత ప్రజలు ఆస్వాదిస్తున్న వేళ.. నాటి అమరవీరులను త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఎల్బీ స్టేడియంలో స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ.. 'ఎంతో మంది త్యాగాలతోనే స్వాతంత్య్రం వచ్చింది. గాంధీ గురించి ఈ తరం పిల్లలకు తెలియాల్సి ఉంది. దేశాన్ని ఉన్మాద స్థితిలోకి మారుస్తున్నారు. దీన్ని చూస్తూ ఊరుకోవడం కరెక్ట్ కాదు. దేశం అనుకున్నంత పురోగతి సాధించలేదు. ధీరోదాత్తులు, మేధావులు, వైతాళికులు కరదీపికలుగా మారి ఏ సమాజాన్ని అయితే సరైన మార్గంలో నడిపిస్తారో ఆ సమాజం గొప్పగా పురోగమించే అవకాశం ఉంటుందని' సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. చదవండి: (సీఎం జగన్ నిర్ణయంతో మంచి జరుగుతుందని భావిస్తున్నా: ఉండవల్లి) -
రగిలింది విప్లవాగ్ని ఈరోజే!
భారత స్వాతంత్య్ర ఉద్యమానికి అతివాద, మితవాద, విప్లవ వాద మార్గాలను ఎన్నుకున్న అనేకమంది దేశ భక్తులు తమ జీవితాలను అంకితం చేశారు. ఈ ఉద్యమ స్రవంతుల్లో ఆయుధం పట్టి బ్రిటిష్‌వాళ్ల భరతం పట్టాలన్న వర్గానికి చెందినవారు అల్లూరి సీతారామరాజు. అమాయక గిరిజనుల బాధలను దగ్గర నుంచి గమనించి, విజ్ఞాపనల ద్వారా వారి సమస్యలు పరిష్కారం కావని గ్రహించారు. అందుకే మన్యం ప్రాంతంలో అద్భుతమైన గిరిజన తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. అల్లూరి సీతారామరాజు చేసిన ఈ సంచలన యుద్ధానికి నేటితో నూరు వసంతాలు. ► అడవి నుంచీ, పూర్వీకుల నుంచీ వచ్చిన స్వేచ్ఛా జీవనానికి సంకెళ్లు వేయాలని చూసిన చట్టాలకు ప్రతిఘటనలే గిరిజనోద్యమాలు. దేశం నలుమూలలా జరిగిన అలాంటి ఉద్యమాలలో 1922–24 నడుమ విశాఖ మన్యంలో అల్లూరి సీతారామరాజు (శ్రీరామరాజు) నిర్వహించిన పోరాటం ప్రత్యేకమైనది. అవన్నీ కొండా కోనా మీద హక్కు కోసం కొన్ని తరాల ఆదివాసీలు పడిన తపన, వేదనలే. స్థానిక సమస్యల మీద తలెత్తినట్టు కనిపించినా నిజానికి అవి ప్రభుత్వాల మీద యుద్ధాలే. విశాఖ మన్య పోరాటంలో మైదాన ప్రాంత రాజకీయ స్పృహ, సైద్ధాంతిక ఛాయ ఉన్నాయి. ► శ్రీరామరాజు ఉద్యమకారునిగా అవతరించడం ఒక చారిత్రక నేపథ్యంలో జరిగింది. మొదటి ప్రపంచయుద్ధం, గాంధీజీ సహాయ నిరాకరణోద్యమం పిలుపు, ఉపసంహరణ; ఉత్తర భారత యాత్ర ఆ నేపథ్యాన్ని ఇచ్చాయి. తన కుటుంబం తునిలో ఉన్నప్పుడే 1915లో ఉద్యోగాణ్వేషణ పేరుతో రామరాజు ఉత్తర భారతదేశం వెళ్లారు. ఆ యాత్రలోనే రామరాజు కలకత్తా వెళ్లి ప్రముఖ జాతీయ ఉద్యమ నేత సురేంద్రనాథ్ బెనర్జీని కలుసుకున్నారు. ఆ తరువాత అల్లూరి తూర్పు కనుమలలోని కృష్ణ్ణదేవిపేటకు 1917 జూలై 24న ఒక ఆధ్యాత్మికవేత్తగా చేరుకున్నారు. ఈ ఊరే ఆయన కార్యక్షేత్రమయింది. ఇక ఆయన ఆయుధం పట్టి, ఉద్యమం ప్రారంభించడానికి చాలా కారణాలు ఉన్నాయి. ► 1920లో గాంధీజీ సహాయ నిరాకరణోద్యమానికి పిలుపూ, ‘ఒక్క ఏడాదిలోనే స్వాతంత్య్రం’ అన్న నినాదమూ ఇచ్చారు. రాళ్లపల్లి కాశన్న, నర్సీపట్నం ప్రాంత కాంగ్రెస్ కార్యకర్తలు కృష్ణదేవిపేటలోనూ సహాయ నిరాకరణోద్యమ ప్రచారం చేశారు. 1921లో రామరాజు కాలినడకన నాసికాత్రయంబకం వెళ్లారు. అక్కడ ‘అభినవ్ భారత్’ విప్లవ సంస్థ ప్రభావం ఆయనపై గాఢంగా పడింది. అప్పటికే రామరాజు మన్యవాసులలో కొన్ని సంస్కరణలు తెచ్చారు. గాంధీజీ కార్యక్రమమంతటిలోను మద్యపాన నిషేధం, కోర్టుల బహి ష్కారం... ఈ రెండూ ఆయనకు నచ్చాయి. ఇవే రామరాజు ‘సహాయ నిరాకరణ వాది’ అన్న అనుమానం కలిగించాయి. ► మొదటి ప్రపంచ యుద్ధం ఆగిన తర్వాత కరవు విజృంభించ డంతో మద్రాస్ ప్రెసిడెన్సీలో ఆకలి దాడులు జరిగాయి. ప్రభుత్వం ఉపాధి కల్పన ఆరంభించింది. మన్యంలో రోడ్ల నిర్మాణం అందులో ఒకటి. ఆసియా చరిత్రలోనే ఈ రోడ్ల నిర్మాణం ఓ అమానుష ఘట్టం. ఇందుకు బాధ్యుడు గూడెం డిప్యూటీ తహసీల్దార్ అల్ఫ్ బాస్టియన్. నిజానికి 1882 చట్టంతో అడవిలో ప్రవేశం కోల్పోయిన ఆదివాసీలు కూలీలుగా మారిపోయారు. పెద్దవలస మాజీ ముఠాదారు కంకిపాటి బాలయ్యపడాలు (ఎండు పడాలు), బట్టిపనుకుల మునసబు గాం గంతన్న దొర, అతని తమ్ముడు గాం మల్లు దొర, గోకిరి ఎర్రేసు, బొంకుల మోదిగాడు వంటివారు 1922 జనవరిలో రాజు దగ్గరికి వచ్చి గోడు వినిపించుకున్నారు. ► బాస్టియన్ మీద పై అధికారులకు శ్రీరామరాజు ఫిర్యాదు రాశారు. రామరాజు మన్యంలో సహాయ నిరాకరణ ఆరంభించాడన్న ఆరోపణకు ఈ ఫిర్యాదు దోహదం చేసింది. రామరాజును ఆ ఫిబ్రవరి 3న నిర్బంధంలోకి తీసుకున్నది కూడా సహాయ నిరాకరణవాది అన్న ఆరోపణతోనే! ఆ ఒకటో తేదీనే సహాయ నిరాకరణను తీవ్రం చేస్తున్నట్టు గాంధీజీ ప్రకటించారు. 5వ తేదీన జరిగిన ‘చౌరీచౌరా’ ఉదంతంతో గాంధీ ఆ పిలుపును ఉపసంహరించుకున్నారు. అహింసాయుతంగా పోరాడే సంస్కారం భారతీయులకు లేదని నింద మోపారు. ఇదే యువతను ఇతర పంథాల వైపు నడిపించింది. అలాంటి వారిలో రామరాజు ఒకరు. ► సంప్రదాయ, ఆధునిక ఆయుధాలతో గెరిల్లా పోరు జరపాలని అనుకున్న రాజు... ఆయుధాల కోసం మన్యంలోని పోలీస్ స్టేషన్లను దోచుకోవాలని నిర్ణయించారు. అనుచరులను మూడు దళాలుగా విభజించారు. 1922 ఆగస్ట్ 22న పట్టపగలు చింతపల్లి పోలీస్ స్టేషన్ మీద 300 మందితో దాడి చేశారు. ఆయుధాలు తీసుకు వెళుతున్నానని ఒక లేఖ రాసి వచ్చారు రాజు. తొలి దాడితోనే మన్య ఉద్యమ తత్త్వం తెలుస్తుంది. కొండదళం ‘వందేమాతరం... మనదే రాజ్యం’, ‘గాంధీజీకి జై’ అంటూ నినదించింది. ► ఆగస్టు 23న కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్ మీద దాడి జరిగింది. ఆగస్ట్ 24న రాజవొమ్మంగి స్టేషన్ (తూర్పు గోదావరి)ను ఎంచు కున్నారు. లాగరాయి పితూరీని సమర్థించిన నేరానికి అరెస్టయిన మొట్టడం వీరయ్యదొర అప్పుడు ఆ స్టేషన్లోనే ఉన్నారు. ఆయనను విడిపించడం కూడా ఈ దాడి ఆశయాలలో ఒకటి. తొలి రెండు దాడులతోనే మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రధాన కార్యదర్శి ఆర్ఏ గ్రాహవ్ుకు టెలిగ్రావ్ులు వెళ్లాయి. 26 తుపాకులు, వేలాది తూటాలు కొండదళం చేతికి చిక్కాయి. ఎంత ప్రమాదం! ఏజెన్సీ జిల్లా పోలీసు సూపరిం టెండెంట్ సాండర్స్, కలెక్టర్ వాయువేగంతో నర్సీపట్నం చేరు కున్నారు. నర్సీపట్నం కేంద్రంగా మన్యం ఖాకీవనమైంది. ► అలాంటి వాతావరణంలోనే జైపూర్ మహారాజు ఐదు ఏనుగుల మీద పోలీసుల కోసం పంపిన సామగ్రిని సెప్టెంబర్ 3న ఒంజేరి ఘాట్‌లో రాజుదళం వశం చేసుకుంది. తరువాత జరిగిన ఘటన మద్రాస్ ప్రెసిడెన్సీని మరీ కలవరపెట్టింది. రామరాజు పేరు మొదటిసారి తెలుగునేలంతా వినిపించింది. దామనపల్లి అనే కొండమార్గంలో 1924 సెప్టెంబర్ 24న గాలింపు జరుపుతున్న స్కాట్ కవర్ట్, నెవెల్లి హైటర్ అనే ఒరిస్సా పోలీసు ఉన్నతాధికారులను రాజు దళం చంపింది. వీరిలో హైటర్ మొదటి ప్రపంచయుద్ధంలో పాల్గొన్నాడు. తరువాత అడ్డతీగల, చోడవరం, మల్కనగిరి, పాడేరు స్టేషన్ల మీద చేసిన దాడులు విఫల మయ్యాయి. బ్రిటిష్‌వాళ్లు ఆయుధాలను ట్రెజరీలకు పంపి జాగ్రత్త పడ్డారు. మన్యం మీద పట్టు బిగించడానికి మద్రాస్ ప్రెసిడెన్సీ మరొక అడుగు ముందుకు వేసి, 1922 సెప్టెంబర్ 23న మలబార్ పోలీసు దళాలను దించింది. కానీ రామవరం అనే చోట ఆ దళమూ వీగిపోయింది. ► 1922 డిసెంబర్ 6న పెద్దగడ్డపాలెం, లింగాపురం అనేచోట్ల రాజుదళం మీద లూయీ ఫిరంగులతో మలబార్ దళం యుద్ధానికి దిగింది. ఎనిమిది మంది రాజు అనుచరులు వీరమరణం చెందారు. ఆ డిసెంబర్ 23న ఉద్యమకారుల తలలకు ప్రభుత్వం వెలలు ప్రకటించింది. నాలుగు మాసాల అనంతరం 1923 ఏప్రిల్ 17న రామరాజు దళం ఆకస్మాత్తుగా అన్నవరం పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షమై మొత్తం యంత్రాంగాన్ని కలవరపరిచింది. ఆ సంవత్సరం డిసెం బర్లో కాకినాడలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు రామరాజు మారువేషంలో హాజరయ్యారు. నడిపేది గిరిజనోద్యమమే అయినా, ఆయన మైదాన ప్రాంత ఉద్యమాన్ని గమనిస్తూనే ఉన్నారు. ► 1924 జనవరికి అస్సాం రైఫిల్స్‌ను దించారు. వీరికి మొదటి ప్రపంచ యుద్ధంలో అనుభవం ఉంది. అస్సాం రైఫిల్స్ అధిపతే మేజర్ గుడాల్. గుంటూరు జిల్లా కలెక్టర్‌గా ఉన్న థామస్ జార్జ్ రూథర్‌ఫర్డ్‌ను ఆ ఏప్రిల్‌లో మన్యం స్పెషల్ కమిషనర్‌గా నియమిం చారు. మే ఐదు లేదా ఆరున ‘రేవుల కంతారం’ దగ్గర పోలీసుల దాడి నుంచి తప్పించుకున్న రాజు ఒక్కడే రాత్రివేళ ‘మంప’ అనే గ్రామం వచ్చి, ఒక చేనులోని మంచె మీద గడిపారు. మే 7వ తేదీ వేకువనే ఓ కుంటలో స్నానం చేస్తుండగా రాజును ఈస్ట్‌కోస్ట్ దళానికి చెందిన కంచుమేనన్, ఇంటెలిజెన్స్ సబ్ ఇన్స్పెక్టర్ ఆళ్వార్‌నాయుడు అరెస్టు చేశారు. రాజును ఒక నులక మంచానికి కట్టి, కృష్ణదేవిపేటకు పయన మయ్యారు. దారిలోనే ఉంది కొయ్యూరు. అక్కడే మేజర్ గుడాల్... రాజుతో మాట్లాడాలని గుడారంలోకి తీసుకువెళ్లాడు. ఒక చెట్టుకు కట్టి కాల్చి చంపాడు. జూన్ 7న గాం గంతన్నను కాల్చి చంపారు. ► దాదాపు రెండేళ్ల ఉద్యమం, పోలీస్ వేధింపులతో మన్యవాసులు భీతిల్లి పోయారు. కొందరు ఉద్యమకారులను స్థానికులే చంపారు. పోలీసు లకు పట్టించారు. సరైన విచారణ లేకుండానే 270 మంది వరకు ఉద్యమకారులకు శిక్షలు విధించింది మిలిటరీ ట్రిబ్యునల్. 12 మందిని అండమాన్ పంపారు. చివరిగా... దేశం కోసం పోరాడిన ఏ వర్గం త్యాగమైనా విలువైనదే. అవన్నీ నమోదైతేనే స్వరాజ్య సమర చరిత్రకు పరిపూర్ణత. ఉద్యమ నూరేళ్ల సందర్భం ఇచ్చే సందేశం అదే! డా‘‘ గోపరాజు నారాయణరావు వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ (అల్లూరి సీతారామరాజు పోరాటానికి నూరు వసంతాలు) -
Peddavadugur: గాంధీజీ మెచ్చిన ఊరు
అనంతపురం జిల్లా గుత్తికి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘పెద్ద వడుగూరు’ గ్రామం స్వాతంత్య్ర ఉద్యమంలో గొప్ప పాత్ర పోషించింది. ఆ ఊళ్లో గొప్ప పారిశ్రామికవేత్త కె. చిన్నారప రెడ్డి. ఎన్నో ఆదర్శ భావాలు కలిగినవాడు. ఆయన పనిపై మద్రాస్ వెళుతూ ఉండేవారు. 1934లో ఒకరోజు ఆయన మద్రాసు మెరీనా బీచ్‌లో మహాత్మాగాంధీ ఉపన్యాసం విన్నారు. ఆ రోజు గాంధీ ఉపన్యసిస్తూ స్వాతంత్ర పోరాటానికి నిధులు కొరతగా ఉన్నాయనీ, దాతలు సహాయం చేయాలనీ విజ్ఞప్తి చేశారు. ఆ మాటలు నారపరెడ్డిని ఆలోచనలో పడవేశాయి. తమ ఊరికి రావాలని గాంధీజీని సంప్రదించారు. స్వాతంత్రోద్య మానికి రూ. 12 వేల నిధి ఇస్తే వస్తానని హామీ ఇచ్చారు. అన్నట్టుగానే బాపు 1934 సెప్టెంబర్ 21న మద్రాసు నుండి రైలులో ఉదయం 7 గంటలకు గుత్తి రైల్వేస్టేషన్లో దిగారు. ప్రజలు పెద వడుగూరుకు ఘన స్వాగతం పలికారు. చిన్నారప రెడ్డే గాంధీకి వసతి చేకూర్చారు. తిరుపతిరావు అనే వ్యక్తి గాంధీజీని తన భుజస్కంధాలపై ఎత్తుకొని వేదికపైకి చేర్చాడు. హిందీ పండిట్ సత్యనారాయణ... గాంధీ ప్రసంగాన్ని తెలుగులోకి అనువదించారు. నిధులు అందించి స్వాతంత్ర పోరాటాన్ని విజయవంతం చేయాలని అక్కడ చేరిన ప్రజలను కోరారు గాంధీ. అందరూ కలిసి దాదాపు రూ. 27 వేలు ఇచ్చారు. సభాస్థలికి 11 కిలోమీటర్ల దూరం నుంచి విచ్చేసిన భూస్వామి హంపమ్మ రూ. 1,116 అంద జేశారు. ఆమె అంతటితో ఆగకుండా మరో అరగంట గడుస్తుండగా తన ఒంటిపై ఉన్న బంగారు నగలన్నీ విరాళంగా ఇచ్చేశారు. అలా ఒకరికొకరు పోటీలు పడుతూ దాదాపు 5 కేజీల బంగారాన్ని గాంధీకి ఇచ్చారు. ఈ ఊరిని కేంద్రంగా చేసుకుని గాంధీ అనేక గ్రామాలు సందర్శించారు. ఉరవకొండ, హిందూపురం, కదిరి సమావేశాల్లో కూడా ప్రసంగించారు. రాత్రి అయ్యే సరికి తిరిగి పెద్ద వడుగూరులోని తన విడిది గృహానికి చేరుకునేవారు. ఈ నాలుగు రోజులూ గాంధీ చిన్నారప రెడ్డి కారులోనే తిరిగేవారు. ఆఖరు రోజున చిన్నారప రెడ్డి తనకున్న 32 ఎకరాల పొలాన్ని, తన కారును కూడా విరాళంగా ప్రకటించి గొప్ప మనసును చాటుకున్నారు. గాంధీజీని గ్రామానికి పిలవద్దని కూడా అప్పట్లో బ్రిటిష్‌వాళ్లు ఆయనను బెదిరించారు. అయినా ఆయన భయపడకుండా ధైర్యంగా నిలబడి తన నిర్ణయాన్ని అమలుపరిచారు. ఇక్కడ ఇల్లూరి కేశమ్మ అనే మహిళను కూడా మనం స్మరించుకోవాలి. ఇల్లూరు కేశమ్మ పోలీసుల బెదిరింపులకు భయపడకుండా గ్రామ గ్రామం తిరిగి, గాంధీ సభలకు రావాల్సిందిగా వేసిన కరపత్రాలు పంచింది. ఆమెను ఒకసారి అరెస్టు కూడా చేశారు. అయినా జడవక విడుదల కాగానే తిరిగి ప్రచారం మొదలు పెట్టింది. గాంధీ వెంట నారాయణమ్మ, సుభద్రమ్మ అనే మహిళలు సైతం 4 రోజులు తిరిగారు. ఆరోజు గాంధీ సభకు తోరణాలు కట్టి, అలంకరణ చేసి అందరికీ మంచినీళ్లు అందించిన వెంకటరెడ్డి వయసు నేడు 110 ఏళ్లు. ఆ గ్రామానికి 3 దశాబ్దాలు సర్పంచ్‌గా సేవలందించిన శరభా రెడ్డి కూడా ఆ కాలంలో గాంధీకి రూ. 1,116 విరాళంగా ఇచ్చారు. ఆయన కొడుకు సూర్యనారాయణరెడ్డి (88 ఏళ్ళు)... గాంధీ తమ ఊరికి వచ్చినపుడు తాను చిన్న పిల్లవాడిననీ, అప్పటి విశేషాలు ఎన్నో తన మనసులో దాగివున్నాయనీ పూస గుచ్చినట్లు వివరించారు. 1947 ఆగస్టు 15న గ్రామమంతా పండుగ చేసుకున్నామనీ, అందరికీ పిప్పరమెంట్లు, బోరుగులు పంచామనీ చెప్పుకొచ్చారు. గాంధీజీ పెద వడుగూరును ప్రశంసిస్తూ తన డైరీలో ప్రత్యేకంగా రాసుకున్నారనీ ఆయన అన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న ఆనాటి కోట్లాదిమందిని స్మరిస్తూ, జీవించివున్న స్వాతంత్య్ర సమరయోధులకు పాదాభివందనాలు తెలియజేద్దాం. (క్లిక్: ఉద్యమ వారసత్వమే ఊపిరి) - డాక్టర్ సమ్మెట విజయ్‌కుమార్ సామాజిక శాస్త్రవేత్త -
వజ్రోత్సవాల్లో జాతీయ పతాకాల వినియోగం.. వాటిని ఇప్పుడేం చేయాలి?
సాక్షి, హైదరాబాద్: భారత స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా దేశమంతా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన విషయం విదితమే. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో ఇంటింటికీ త్రివర్ణ పతాకాలను పంపిణీ చేసింది. స్వాతంత్రం సాధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమం కావడంతో ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఇంటింటింకే కాదు.. తమ దేశ భక్తి చాటుకోడానికి వాహనాలకు, పబ్లిక్ ప్లేస్ల్లో, పార్కులలో, కార్యాలయాల్లో విస్తృతంగా త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించారు. ఈసారి పంద్రాగస్టున లక్షల సంఖ్యలో జెండాలను ఘనంగా రెపరెపలాడించారు. కానీ జాతీయ జెండా అతి గౌరవప్రదమైనది. జెండాను ఎగురవేయడంలో, వినియోగించడంలో ఫ్లాగ్ కోడ్ విధిగా పాటించాలి. వజ్రోత్సవాల్లో భాగంగా వారం రోజుల పాటు వేడుకలను నిర్వహిస్తున్నారు. అనంతరం ఈ జెండాలను ఏ విధంగా పరిరక్షిస్తారు, ఫ్లాగ్ కోడ్ నిబంధనలకు అనుగుణంగా అగౌరవపరచకుండా జాగ్రత్తగా భద్రపరచాల్సిన అంశాలపైన అవగాహాన పెరగాల్సిన అవసరముంది. చదవండి: ‘పతాక’ స్థాయిలో పొరపాట్లు! జెండాల పంపిణీలో ఫ్లాగ్ కోడ్ ఉల్లంఘనలు పరిరక్షణ బాధ్యతలపై వెలువడని మార్గదర్శకాలు.. ఇంటింటికీ ఎగరేసిన జెండాలను జాగ్రత్తగా, గౌరవంగా చూసుకోవాల్సిన భాద్యత ఆ ఇంటి వారిదే అని నిపుణులు చెబుతున్నారు. ర్యాలీల పేరుతో వాహనాలకు కూడా జాతీయ జెండాను వినియోగించారు. వజ్రోత్సవాల అనంతరం వీటినన్నింటినీ జాగ్రత్తగా భద్రపరచాల్సిన అవసరముంది. ఈ విషయంలో మరింత అవగాహాన పెరగాలని, లేదంటే ఘనంగా నిర్వహించిన వేడుకల పేరుతో జాతీయ పతాకాన్ని అగౌరవపరిచినట్లేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా పబ్లిక్ ప్లేస్‌లలో, పార్క్‌లు, వీధులు, పాఠశాలలు, కళాశాలలు, ఫుట్‌పాత్, ఫ్లైఓవర్, గ్రౌండ్స్, కూడళ్ల వద్ద భారీస్థాయిలో జాతీయ జెండాలను ఏర్పాటు చేశారు. మరికోద్ది రోజుల్లో వజ్రోత్సవాలు ముగియనున్నాయి. ఈ సందర్భంగా జాతీయ జెండా గౌరవానికి భంగం కలగకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిదన్న విషయంలో సందిగ్ధం కొనసాగుతోంది. జెండాను అమర్చిన ప్రదేశం, సంస్థలను బట్టి వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత కూడా వారిపైనే ఉంటుంది. ఈ విషయంలో ప్రభుత్వం, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ నుంచి ఇంకా ఎలాంటి మార్గ నిర్దేశకాలు విడుదల కాలేదు. జాతీయ పతాకాన్ని ఏ మాత్రం అగౌరవ పరచినా చట్టపరమైన చర్యలు, శిక్షలు తప్పవు. కాబట్టి జెండాల విషయంలో పౌరులు సంబంధిత సంస్థలు బాధ్యతాయుంగా, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది. చదవండి: రామంతాపూర్ నారాయణ కాలేజీలో ఎప్పుడేం జరిగింది? -
భరతమాత తొలి వెలుగులకు దూరమైన తెలంగాణ
1600 సంవత్సరంలో భారత గడ్డపై వ్యాపార నిమిత్తం కాలు మోపి, ఇంతింతై వటుడింతై అన్నట్లు అంచెలంచెలుగా తమ ఆధిపత్యాన్ని పెంచుకుంటూ, భారతీయుల, పాలకుల అమాయకత్వాన్ని తమకు అనువుగా మలచుకొంటూ సాగిన ఈస్ట్ ఇండియా కంపెనీ జైత్రయాత్ర ప్లాసీ యుద్ధం అనంతరం మరింతగా విస్తరించి, బెంగాల్ ప్రాంతాన్ని పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకుంది. భారతదేశ స్వయం సిద్ధ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ప్రకృతిని కాపాడుకుంటూ సాగే జీవన విధానం, విద్యా వ్యవస్థ మరియు ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచే ధార్మిక మూలాలు, వాటి విశిష్టతని అర్థం చేసుకున్న కంపెనీ పాలకులు, వారి వ్యాపార విస్తరణకు అడ్డుగా ఉంటుందన్న భావనతో దేశం మొత్తాన్ని ముందుగా తమ చేతుల్లోకి తీసుకుంది. అనంతరం భారతీయ మూలాల్ని పెకిలించే కంపెనీ ప్రక్రియ యథేఛ్చగా సాగడం వల్ల దేశ ప్రజల్లో రాజుకున్న స్వతంత్ర కాంక్ష 1857 లో సిపాయి రెబెల్లియన్గా ,తొలి స్వాతంత్య్ర పోరాటంగా మారడం గమనించిన బ్రిటిష్ ప్రభుత్వం, అఖండ భారత పాలన కేవలం కంపెనీతో సాధ్య పడదని తెలుసుకుని నేరుగా దేశాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. భారతీయులకి ఈ స్థితి నేరుగా పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా అయ్యింది. మెల్లిమెల్లిగా రాజుకుంటున్న స్వాతంత్ర కాంక్షని ముందుగానే అంచనా వేసిన బ్రిటిష్ ప్రభుత్వం 1861, 1892, 1909, 1919 లలో ఇండియన్ కౌన్సిల్ యాక్ట్స్ రూపంలో దేశ ప్రజలకి ఎంగిలి మెతుకుల్ని విదిల్చినట్టు అధికారంలో, పాలనలో తమకు అడ్డు రాకుండా కొద్దిపాటి భాగ స్వామ్యాన్ని కల్పించింది. అరకొరగా ఇచ్చిన పాలనా భాగస్వామ్యం ప్రజల్లో పెరుగుతున్న స్వాతంత్య్ర భావనని తగ్గించక పోగా మరింత తీవ్రరూపం దాల్చడంతో ఇండియన్ యాక్ట్ 1935 రూపంలో బ్రిటిష్ ప్రభుత్వం భారతీయులకి పూర్తి పాలన స్వేఛ్చని ఇచ్చినట్లు ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది. అత్యంత దారుణమైన స్థితి ఏంటంటే తమ సోదరులు, మిగిలిన భారతీయులు తమ స్వాతంత్య్రాన్ని చాటుతూ ముందుకు సాగుతుంటే, తెలంగాణ, మరట్వాడ మరియు కల్యాణ కర్ణాటక (ఉత్తర కర్ణాటక ) ప్రాంత వాసులు మాత్రం, 1724 లో మొగలు రాజుల నుండి సొంత జెండా ఎగరవేసిన అసిఫ్ జాహి నిజాం పాలకుల కబంధ హస్తాల్లోకి వెళ్లి, విద్యకి ,వైద్యానికి, చివరికి తమ సంస్కృతి సాంప్రదాయాల్ని, మత స్వేచ్ఛని కోల్పోయి మానవ సమాజంపై జరిగే దాడి నుంచి తమను తాము రక్షించుకునే ప్రయత్నంలో మునిగి పోయారు.15 ఆగష్టు, 1947, దేశం పూర్తి స్వేచ్చా వాయువుల్ని పీల్చుకునే సమయంలో హైదరాబాద్ సంస్థానం మాత్రం రజాకార్ల రూపంలో ఉన్న మానవ మృగాల పైశాచిక దాడిని ఎదుర్కొంటూ, తమను తాము రక్షించేకునే దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. విలాసాలు , వినోదాలతో సాగిన నిజాం పాలన ప్రజల కనీస హక్కులు కాలరాస్తూ సాగి, చివరకి అప్పు కట్టలేక తన రాజ్యాన్ని కొద్ది కొద్దిగా ముక్కలు చేస్తూ, కంపెనీకి , బ్రిటిష్ పాలకులకు అప్పగించే స్థితి దాపురించింది . 1768లో మచిలీపట్టణం సంధి ద్వారా కోస్తా ప్రాంతాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగించిన నిజాం, 1903 లో బేరార్ ప్రాంతాన్ని బ్రిటిష్ పాలకులకి అప్పజెప్పాడు. ఇదే క్రమంలో సీడెడ్ ప్రాంతాన్ని కూడా కోల్పోవాల్సి వచ్చింది. జులై 4 1946 వరంగల్ జిల్లాలోని కడవేని గ్రామంలో దొడ్డ కొమరయ్య అనే రైతు హత్య ఘటన, నిజాం అనుచరులైన దొరలపై రైతుల తిరుగుబాటుకి దారి తీసింది. రజాకార్ల పైన ఆత్మ రక్షణ యుద్ధంలో తెలంగాణ ప్రజలంతా ఏకమై, కుల సంఘాలు, వామపక్షాలు, రైతులు, విద్యావంతులు గెరిల్లా యుద్దాన్ని చేబట్టారు. గోండు జాతిని రక్షించే బాధ్యత, 1900-1949 సమయంలో కొమరం భీంపై పడి, జమిందార్ లక్ష్మణ్ రావు దాష్టికాలపై, నిజాంపై 1900-1949 మధ్య కాలంలో సాగిన అస్తిత్వ పోరాటం..‘జల్, జంగిల్ జమీన్’ నినాదంతో సాగి 1940 లో భీం ప్రాణాలని హరించింది. విసునూరు రామ చంద్రా రెడ్డి విశృంఖల దౌర్జన్యానికి, నిజాం దోపిడీ విధానానికి వ్యతిరేకంగా సాగిన చాకలి ఐలమ్మ పోరాటం మనకి సదా ప్రాతఃస్మరణీయం. ఈ హైదరాబాద్ సంస్థాన వాసుల దయానీయ స్థితిని గమనించిన భారత ప్రభుత్వం, మన ప్రథమ హోం శాఖామాత్యులు, స్వర్గీయ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో సాగించిన పోలీస్ ఆక్షన్ 13 సెప్టెంబర్ 1948 లో మొదలై 17 సెప్టెంబర్ 1948న నైజాం దాస్య శృంకలాల నుంచి స్వేఛ్చ వాయువుల్ని పీల్చుకునే వరకు సాగింది. దేశం ఎన్నో బలిదానాల ఫలితంగా ఏర్పడ్డ స్వాతంత్రం, ఆ మధురమైన అమృత ఘడియలు, ఆ అద్భుత మైన అనుభూతికి దూరంగా, హైదరాబాద్ సంస్థాన వాసులు మాత్రం తీర్చలేని వెలితితో భరతమాత తొలి వెలుగులకు దూరంగా ఉండిపోయింది. దొర్లి పోయిన కాలంలో గాయపడ్డ తెలంగాణ మరకలు అలాగే మిగిలి పోయాయి. -వేముల శ్రీకర్, ఐఆర్ఎస్, కమిషనర్, ఇన్‌కంటాక్స్ -
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా కొన్ని సంగతులు...
►1947, ఆగస్ట్ 15న దేశమంతా స్వాతంత్య్ర సంబురాల్లో మునిగి ఉంటే గాంధీ మాత్రం ఆ వేడుకలకు దూరంగా ఉండిపోయారు. బెంగాల్లో చెలరేగిన మతకలహాలకు నిరసనగా నిరహార దీక్ష చేస్తూ. ►రవీంద్రనాథ్ టాగోర్ ‘జనగణ మన’ను 1911లో రచించారు. అది జాతీయ గీతంగా అధికారికంగా అమల్లోకి వచ్చింది 1950, జనవరి 24 నుంచి. రవీంద్రుడే రాసిన (1905) ‘అమోర్ సోనార్ బంగ్లా’లోని మొదటి పదిలైన్లను తీసుకొని బంగ్లాదేశ్ తన జాతీయ గీతంగా పాడుకుంటోంది. అంతేకాదు శ్రీలంక జాతీయ గీతమైన ‘శ్రీలంక మాతా’ గీతానికి, స్వరకల్పనకూ రవీంద్రనాథ్ టాగోర్ సాహిత్యం, సంగీతమే స్ఫూర్తి. ►స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 1973 వరకు ఆగస్ట్ 15న గవర్నర్లే ఆయా రాష్ట్రాల్లో జెండా వందనం చేసేవారు. ఈ పద్ధతిని కాదని ఆగస్ట్ 15న ముఖ్యమంత్రులే జెండా వందనం చేయాలనే కొత్త సంప్రదాయాన్ని సూచించింది ఎమ్. కరుణానిధి.. 1974లో. ►ప్రతి ఆగస్ట్ 15న రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులే జెండా వందనం చేస్తే బాగుంటుందని.. ఈ సంప్రదాయాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోరుతూ అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి లేఖ రాశారట. ఆ ప్రతిపాదనను ఆమె ప్రభుత్వం ఒప్పుకుంటూ 1974 నుంచి అమల్లోకి తెచ్చింది. ►మన జాతీయ పతాకం తయారయ్యేది ఒకే ఒక్క చోట. కర్ణాటకలోని ధార్వాడ్‌లో ఉన్న ‘కర్ణాటక ఖాదీ గ్రామోద్యోగసంయుక్త సంఘ (కేకేజీఎస్సెస్)’లో తయారయ్యి దేశమంతా పంపిణీ అవుతుంది. అదీ బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) నిర్ధారించిన ప్రమాణాల్లో. -
కస్టమర్లకు ఎస్బీఐ స్వాతంత్య్ర దినోత్సవ కానుక: కొత్త స్కీం
సాక్షి,ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 75 సంవత్సరాల భారత స్వాతంత్ర్య దినోత్సవాలు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఖాతాదారులకు ఒక కొత్త పథకాన్ని లాంచ్ చేసింది. "ఉత్సవ్ డిపాజిట్" అనే ప్రత్యేకమైన టర్మ్ డిపాజిట్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీంలో అధిక వడ్డీరేట్లను ఆఫర్ చేస్తోంది. అయితే ఇది పరిమిత సమయం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఎస్బీఐ ఒక ట్వీట్లో వెల్లడించింది. చదవండి: ఖాతాదారులకు షాకిచ్చిన ఎస్బీఐ: మూడు నెలల్లో మూడోసారి ఉత్సవ్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్‌లో, 1000 రోజుల కాలవ్యవధితో ఫిక్స్డ్ డిపాజిట్లపై సంవత్సరానికి 6.10శాతం వడ్డీ రేటును అందిస్తోంది. సీనియర్ సిటిజన్లు సాధారణ రేటు కంటే 0.50శాతం అదనపు వడ్డీ రేటును పొందేందుకు అర్హులు. ఈ రేట్లు 15 ఆగస్టు 2022 నుండి అమలులోకి వస్తాయి. ఇఇది 75 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. A delightful offer especially for our customers to celebrate 75 years or Azadi. With ‘Utsav’ Deposit, get higher interest rate on Fixed Deposits. #SBI #UtsavDeposit #FixedDeposits #AmritMahotsav pic.twitter.com/DhPQnis568 — State Bank of India (@TheOfficialSBI) August 15, 2022 -
76 వ ఇండిపెండెన్స్ డే: తొలిసారి మేడిన్ ఇండియా గన్
న్యూఢిల్లీ: 75వ స్వాతంత్ర్య దినోత్సవం మరో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆగస్టు 15న ఎర్రకోట వద్ద గౌరవ వందనం కోసం మేడ్-ఇన్-ఇండియా తుపాకీని తొలిసారి ఉపయోగించారు. ఇప్పటి వరకు సెర్మోనియల్ సెల్యూట్ కోసం బ్రిటీష్ తుపాకులను ఉపయోగించారు. అంతేకాదు ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తొలిసారిగా ఎంఐ-17 హెలికాప్టర్లు ఎర్రకోటపై పూల వర్షం కురిపించాయి. స్వదేశీ అడ్వాన్స్డ్ టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ హోవిట్జర్ గన్ను కేంద్రం ఆధ్వర్యంలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) రూపొందించింది. ఈ గన్‌తోనే స్వాతంత్ర్య దినోత్సవం రోజున చారిత్రాత్మకమైన ఎర్రకోట వద్ద త్రివర్ణ పతాకానికి 21-షాట్ల గౌరవ వందనం లభించింది. "మనం ఎప్పటినుంచో వినాలనుకునే శబ్దాన్ని 75 ఏళ్ల తర్వాత వింటున్నాం. 75 ఏళ్ల తర్వాత ఎర్రకోట వద్ద తొలిసారిగా భారత్‌లో తయారు చేసిన తుపాకీతో త్రివర్ణ పతాకానికి గౌరవ వందనం లభించింది" అని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చెప్పారు. ఈ మేడ్-ఇన్-ఇండియా తుపాకీ గర్జనతో భారతీయులందరూ స్ఫూర్తి పొంది, మరింత శక్తివంతం అవుతారని మోదీ పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్‌ను సాకారం చేసే దిశగా అడుగులు వేస్తున్నందుకు సాయుధ దళాల సిబ్బందిని ప్రధాని ప్రశంసించారు. #WATCH | Made in India ATAGS howitzer firing as part of the 21 gun salute on the #IndependenceDay this year, at the Red Fort in Delhi. #IndiaAt75 (Source: DRDO) pic.twitter.com/UmBMPPO6a7 — ANI (@ANI) August 15, 2022 For the first time, MI-17 helicopters shower flowers at the Red Fort during Independence Day celebrations. #IDAY2022 #IndependenceDay2022 #स्वतंत्रतादिवस pic.twitter.com/j1eQjIoZAn — PIB India (@PIB_India) August 15, 2022 -
వజ్రోత్సవాల వేళ ఆంటిలియాకు కొత్త కళ: మనవడితో అంబానీ సందడి
సాక్షి, ముంబై: భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగు తున్నాయి. దేశవ్యాప్తంగా పిల్లా పెద్దా అంతా త్రివర్ణ పతాకాలు చేబూని, మాతృదేశ స్వేచ్ఛ కోసం ప్రాణాలర్పించిన స్వాతంత్య్ర సమర యోధుల త్యాగాలను గుర్తు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కూడా ఈ సంబరాల్లో పాలు పంచుకున్నారు. భార్య నీతా అంబానీ, మనవడు పృథ్వీ అంబానీతో కలిసి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకను ఉత్సాహంగా జరుపుకున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వాతంత్య్ర అమృత్ మహోత్సవ్‌ను జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగా దేశంలోని చారిత్రక కట్టడాలు, ప్రభుత్వ భవనాలు త్రివర్ణ కాంతులతో దేదీప్యమానంగా ఆకర్ణణీయంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దేశంలోనే అత్యంత సంపన్నుడు ముఖేశ్ అబానీ ఇల్లు ఆంటిలియా కూడా త్రివర్ణ పతాక కాంతులతో వెలిగిపోతోంది. యాంటిలియా వెలుపల ఉన్న రహదారి మొత్తం త్రివర్ణ వెలుగులతో అందంగా ముస్తాబు చేశారు. దీంతో జనం తమ కార్లను ఆపి మరీ సెల్ఫీలు తీసుకోవడం విశేషం. అంతేకాదు ఆంటిలియా ఇంటి బయట శీతల పానీయాలు, చాక్లెట్లు అందిస్తున్నారు. దీంతో అటు సెల్ఫీలు, ఇటు కూల్ డ్రింక్స్, చాక్లెట్లతో జనం ఎంజాయ్ చేస్తున్నారు. #WATCH | Reliance Industries chairman Mukesh Ambani along with his wife Nita Ambani and grandson Prithvi Ambani celebrates Independence Day pic.twitter.com/QNC8LmtoHL — ANI (@ANI) August 15, 2022 -
ఇండియా@75: ప్రాభాత ప్రాంగణాన మోగేను నగారా
మొదటి స్వాతంత్య్ర దినం నేను మర్చిపోలేని రోజు. ఆ రోజు మా మామయ్య దేవులపల్లి కృష్ణశాస్త్రి కలం నుంచి జాలువారిన ‘ప్రాభాత ప్రాంగణాన మోగేను నగారా’ అనే దేశభక్తి గేయాన్ని 1947 ఆగస్టు 15 న పొద్దున్న ఆరుగంటలకి మద్రాసు రేడియోలో లైవ్ పాడాను. తరవాత తొమ్మిది గంటలకి ఆంధ్ర విజ్ఞాన సమితిలో పాడాను. 10 గం.లకి వై.యమ్.సి.ఏ.లో పాడాను. సాయంత్రం నాలుగు గంటలకి ఆంధ్ర మహిళా సభలోను, ఆరు గంటలకి ఆంధ్ర మహాసభలోను, రాత్రి 8 గం.లకి రేడియో వారు చేసిన స్వాతంత్య్ర రథం కార్యక్రమంలోను ఒకే రోజున అన్ని లైవ్‌లు పాడాను. ఊరంతా పండగలా అలంకరించారు. దేశమంతా వంద దీపావళులలాగ సంబరాలు చేసుకున్నారు. అలంకరించారు. ఆ రోజే మరో చిత్రమైన సంఘటన. నాకు అలంకారం అంటే చాలా ఇష్టం. నేనే ఒక ఫ్యాషన్ క్రియేట్ చేశాను. 5 గజాల తెల్ల చీర కొనుక్కుని వచ్చి; ఎరుపు, ఆకుపచ్చ రంగుల శాటిన్ రిబ్బన్లు పొడవుగా కట్‌చేసి చీర మీద నిలువు చారలుగా వేసుకున్నాను. జాకెట్కి కూడా బోర్డర్ వేసుకున్నాను. టైలర్ని రాత్రింబవళ్లు కూచోపెట్టి దగ్గరుండి కుట్టించుకున్నాను. నా పాటలాగే నా డ్రస్కూడా హిట్అయ్యింది. – కీ. శే. వింజమూరి అనసూయ, గాయని -
చిన్నవాణ్ణని వదిలేశారు
జాతీయోద్యమంలో గాంధీ శకం మొదలయ్యాక ఉద్యమ కార్యాచరణకు కేంద్రస్థానం సబర్మతి ఆశ్రమం అయింది. తెలుగు జాతీయోద్యమకారుడు, భాషాప్రయుక్త రాష్ట్రాలు ఉండాలని నిరాహారదీక్ష చేసి అమరుడైన శ్రీ పొట్టి శ్రీరాములు సబర్మతి ఆశ్రమంలో చాలాకాలం ఉన్నారు. అలా ఉన్న కొంతమంది ఉద్ధండులను వారి వారి ప్రదేశాలకు వెళ్లి సామాన్యుల్లో సైతం చైతన్యవంతం చేయవలసిందిగా సూచించారు గాంధీజీ. ఆయన సూచనలను చిత్తశుద్ధితో అనుసరించేవారిలో పొట్టి శ్రీరాములు కూడా ఉన్నారు. అంతటి శ్రీరాములును దగ్గరగా చూడడం, ఆయనతో కలిసి నడవటం వల్ల జాతీయస్ఫూర్తిని పెంపొందించుకుని ఉద్యమాల్లో పాల్గొన్న ఓ కుర్రాడు కోన వెంకట చలమయ్య! ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఆ ‘కుర్రాడు’ సాక్షి తో పంచుకున్న కొన్ని జ్ఞాపకాలివి. మా ఇంట్లో ఉండేవారు ‘‘మాది తిరుపతి (ఉమ్మడి చిత్తూరు) జిల్లా వాయల్పాడు. నెల్లూరులో మా మేనమామ దేవత చెంచు రాఘవయ్య దగ్గర పెరిగాను. మా మామ లాయరు. ఆయనకు పొట్టి శ్రీరాములు గారికి మంచి స్నేహం ఉండేది. అలా శ్రీరాములు గారు నెల్లూరులో మా ఇంట్లో ఉండేవారు. గాంధీజీ ఆదేశంపై జాతీయోద్యమాన్ని వాడవాడలా విస్తరింపచేయడానికి శ్రీరాములు గారు సబర్మతి నుంచి వచ్చిన సందర్భం అది. నాకు వారితో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. వారితో కలిసి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాను. ఆ స్ఫూర్తితో విదేశీ వస్త్ర బహిష్కరణలో.. నెల్లూరు పట్టణంలో జొన్నలగడ్డ వారి వీథి, అత్తి తోట అగ్రహారంలో ఇళ్లకు వెళ్లి విదేశీ వస్త్రాలను సేకరించి మంటల్లో వేశాను. ‘‘బ్రిటిష్ వారి పరిపాలనను మనం అంగీకరించడం లేదనే విషయాన్ని వాళ్లకు తెలిసేలా చేయాలంటే ఇదే మంచి మార్గం’’ అని మహిళలకు చెప్పేవాళ్లం. వాళ్లు వెంటనే లోపలికి వెళ్లి.. ఇంట్లో ఉన్న ఫారిన్ చీరలు, చొక్కాలు, పంచెలు అన్నింటినీ బయటవేసే వాళ్లు. అప్పట్లో మద్రాసులో పొత్తూరి అయ్యన్న శెట్టి అనే వ్యాపారి విదేశీ వస్త్ర బహిష్కరణ, స్వదేశీ ఉద్యమంలో పాల్గొనలేదు. విదేశీ వ్యాపారంతోపాటు, ఆ దుస్తులు చాలా ఖరీదైనవి ధరించేవారు. సాటి వైశ్యులు ఆయనను కుల బహిష్కరణ చేశారు. జాతీయత భావన అంత తీవ్రంగా ఉండేది. అప్పుడు అలా మొదలైన ఖాదీ వస్త్రధారణను నేను వదల్లేదు. మాకు ఖాదీ మీద ఎంత ఇష్టం ఉండేదంటే నేను ఒక దుకాణంలో నెలకు యాభై రూపాయలకు పని చేస్తూన్న రోజుల్లో పండుగకు నూట యాభై రూపాయలు పెట్టి పట్టు ఖాదీ దుస్తులు కొనుక్కుని అపురూపంగా దాచుకుని ముఖ్యమైన రోజుల్లో ధరించేవాడిని. అప్పట్లో చొక్కా గుండీలు కూడా ఖాదీవే. నూలుతో బఠాణీ గింజ సైజులో అల్లేవారు. ఎడ్ల బాధ చూడలేక నేను గాంధీజీని దగ్గరగా చూసిన సందర్భాలు రెండు మూడు ఉన్నాయి. ఒకసారి నెల్లూరులో రైలు దిగి పల్లిపాడులోని గాంధీ ఆశ్రమానికి ఎడ్ల బండి మీద వస్తున్నారు. పెన్నా నదిలో నీళ్లు లేవు, ఒక ఒడ్డు నుంచి మరో ఒడ్డుకు నది మధ్య ఇసుకలో బండిని లాగడానికి ఎడ్లు ఇబ్బంది పడుతున్నాయి. గాంధీజీ ఆ సంగతి గమనించిన వెంటనే ఇక బండిలో ఉండలేకపోయారు. వెంటనే బండి దిగి నడక మొదలు పెట్టారు. మరో సందర్భంలో నాయుడు పేటలో ఒక సభలో ఆయన ప్రసంగం విన్నాను. మెరీనా బీచ్ సంఘటన చాలా ముఖ్యమైనది. గాంధీజీ ప్రసంగం వినడానికి జనం పోటెత్తారు. ఆ జనంలో దూరంగా ‘హరిజనులకు ఆలయ ప్రవేశం’ అని రాసి ఉన్న ఒక ప్లకార్డు కనిపించింది. ఆ ప్లకార్డు పట్టుకున్నవారు పొట్టి శ్రీరాములు. ఆయన్ని వేదిక మీదకు పిలిచి సభకు పరిచయం చేస్తూ ‘శ్రీరాములు వంటి ఏడుగురు సైనికుల్లాంటి దేశభక్తులు నా దగ్గర ఉంటే, మనదేశానికి ఎప్పుడో స్వాతంత్య్రం వచ్చి ఉండేది’ అన్నారు గాంధీజీ. ఆయన అన్న ఆ మాట ఆ తర్వాత చాలా ప్రభావాన్ని చూపించింది. అప్పట్లో ఉద్యమ సమాచారం అంతా ఉత్తరాల ద్వారానే జరిగేది. శ్రీరాములు గారికి గాంధీజీ స్వహస్తాలతో రాసిన ఉత్తరం నా దగ్గర ఇప్పటికీ ఉంది. లాఠీ దెబ్బలే దెబ్బలు మా సమావేశాలు ఎక్కువగా తిప్పరాజు వారి సత్రంలో జరిగేవి. పెద్ద నాయకుల నుంచి ఉత్తరాల ద్వారా సమాచారం అందుకున్న స్థానిక నాయకులు ఒక్కో ఉద్యమాన్ని ఎలా నిర్వహించాలనే వివరాలను ఆ సమావేశాల్లో చెప్పేవారు. వస్త్ర బహిష్కరణ ఉద్యమంలో నేను పోలీసులకు దొరకలేదు, కానీ సహాయ నిరాకరణోద్యమంలో లాఠీ దెబ్బలు బాగా తిన్నాను. ఆందోళనలు ఒకరోజుతో పూర్తయ్యేవి కాదు, పట్టణంలో ఒక్కోరోజు ఒక్కోచోట. నగరంలో ఎక్కడ జరుగుతున్నా సరే.. వెళ్లి నినాదాలివ్వడం, దెబ్బలు తినడమే. మాలో కొంతమందిని జైల్లో పెట్టారు. అప్పుడు నన్ను చూసి ‘చిన్నవాడు’ అని వదిలేశారు. అనేకానేక ఉద్యమాల తర్వాత పోరాటం ఇంకా తీవ్రమయ్యేదే తప్ప శాంతించే పరిస్థితి లేదనే నిర్ధారణకు వచ్చేశారు బ్రిటిష్ వాళ్లు. మనకు స్వాతంత్య్రం వచ్చేస్తోందని మా పెద్దవాళ్లు చెప్పారు. నెల్లూరు పట్టణ వీథుల్లో లైట్లు, రంగురంగులుగా కాగితాలతో కోలాహ లంగా ఉంది వాతావరణం. మేమంతా ఆనం దంతో గంతులు వేశాం. స్వాతంత్య్రం ప్రకటిం చారనే వార్త వినడం కోసం నిద్రను ఆపుకుంటూ ఎదురు చూశాం’’ అని చెప్పారు స్వాతంత్య్ర సమర యోధులు కె.వి. చలమయ్య. – ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి -
నెహ్రూ టు నరేంద్ర
భారత స్వాతంత్య్ర సమరం, స్వాతంత్య్రం వచ్చిన సందర్భం, రెండో ప్రపంచ యుద్ధానంతర పరిణామాలు, ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం, ప్రపంచ పరిస్థితులు కలసి భారత ప్రధానమంత్రి పదవికి రూపురేఖలను ఇచ్చాయి. దేశంలో బ్రిటిష్ వలస వాసనలు, మారిన రాజకీయ తాత్త్వికతలను అవగతం చేసుకుంటూ, అవి తెచ్చిన సమస్యలను అధిగమిస్తూ దేశాన్ని పునర్నిర్మాణం చేసే గురుతర బాధ్యతను మన ప్రధానులు నిర్వహించారు. 1947 నుంచి 2022 వరకు భారతీయులు 14 మంది ప్రధానుల పాలనను వీక్షించారు. ఒక్కొక్క ప్రత్యేకతతో ఒక్కొక్క ప్రధాని చరిత్ర ప్రసిద్ధులయ్యారు. 1947–1977 ప్రథమ ప్రధాని జవాహర్లాల్ నెహ్రూ. 16 ఏళ్ల 286 రోజుల నెహ్రూ పాలనా కాలమే ఇప్పటికి వరకు రికార్డు. తరువాత ఆయన కుమార్తె ఇందిరాగాంధీ హయాం 11, 4 సంవత్సరాలతో రెండో స్థానంలో నిలిచారు. రెండు పర్యాయాలు ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ మూడో స్థానంలో నిలుస్తారు. లాల్ బహదూర్‌శాస్త్రి (19 నెలలు), గుల్జారీలాల్ నందా (రెండు పర్యాయాలు ఆపద్ధర్మ ప్రధాని, 27 రోజులు), రాజీవ్‌గాంధీ, పీవీ నరసింహారావు (ఐదేసి సంవత్సరాలు) ప్రధాని పదవిలో ఉన్నారు. మొత్తంగా 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఒక్క కాంగ్రెస్ పార్టీ ప్రధానులే దాదాపు 56 ఏళ్లు ఆ పదవిలో ఉన్నారు. భారత్‌కు స్వాతంత్య్రం ఇవ్వాలన్న నిర్ణయం తరువాత ఏర్పడిన జాతీయ ప్రభుత్వానికి (1946) నాయకత్వం వహించినవారు నెహ్రూయే. ఆపై 1947 ఆగస్ట్ 15 నుంచి స్వతంత్ర భారత తొలి ప్రధాని. దేశ విభజన నాటి నెత్తుటి మరకలు ఆరకుండానే 1947 అక్టోబర్‌లో పాకిస్తాన్ తో యుద్ధం చేయవలసి వచ్చింది. రాజ్యాంగ రచన, అలీన విధానం, పంచవర్ష ప్రణాళికలు, ఐఐటీలు, భారీ నీటిపారుదల పథకాలు, భారీ పరిశ్రమలు ఆయన హయాం ప్రత్యేకతలు. 1962లో ఆయన పాలనలోనే చైనాతో యుద్ధం జరిగింది. అది చేదు ఫలితాలను మిగిల్చింది. 1964 లో నెహ్రూ మరణంతో లాల్ బహదూర్‌శాస్త్రి ప్రధాని అయ్యారు. 1965లో పాకిస్తాన్ తో యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో ఓడిన పాకిస్తాన్ తో శాంతి ఒప్పందం మీద సంతకాలు చేయడానికి తాష్కెంట్ (సోవియెట్ రష్యా) వెళ్లిన శాస్త్రి అక్కడే అనుమానాస్పద పరిస్థితులలో మరణించారు. జైజవాన్ జై కిసాన్ ఆయన నినాదమే. తరువాత 1966లో ఇందిరాగాంధీ ప్రధాని అయ్యారు. ఇందిర పాలన అంటే కొన్ని వెలుగులు, ఎక్కువ చీకట్ల సమ్మేళనం. ఆమె బ్యాంకులను జాతీయం చేశారు. రాజభరణాలు రద్దు చేశారు. 1969 నాటి రాష్ట్రపతి ఎన్నికలో ఆమె నిర్వహించిన విధ్వంసక భూమికతో కాంగ్రెస్ చీలిపోయింది. పార్టీ నిర్ణయించిన నీలం సంజీవరెడ్డిన ఓడించి, తాను నిలబెట్టిన వీవీ గిరిని ‘ఆత్మ ప్రబోధం’ నినాదంతో గెలిపించిన అపకీర్తి ఆమెది. 1971లో ఇందిర కూడా పాకిస్తాన్ తో యుద్ధం చేశారు. ఆ యుద్ధ ఫలశ్రుతి భారత్ గెలుపు, బంగ్లాదేశ్ ఆవిర్భావం. ఇందిర హయాంకు మకుటాయమానమైనది 1974 నాటి పోఖ్రాన్ అణపరీక్ష (స్మైలింగ్ బుద్ధ). దీనితో భారత్ ప్రపంచంలోనే అణుపాటవం ఉన్న ఆరోదేశంగా ఆవిర్భవించింది. 1975లో అత్యవసర పరిస్థితిని ప్రకటించిన ఇందిర చరిత్రలో తన స్థానాన్ని తానే చిన్నబుచ్చుకున్నారు. అలా కాంగ్రెస్‌కు ఒక ప్రత్యామ్నాయాన్ని సృష్టించి పెట్టిన ఘనత కూడా ఆమెదే. అత్యవసర పరిస్థితి ఎత్తివేసిన తరువాత 1977లో జనతా పార్టీ ఏర్పడింది. అందులో భారతీయ జనసంఘ్ భాగస్వామి అయింది. ద్వంద్వ సభ్యత్వం కారణంగా జనతా పార్టీని వీడిన జనసంఘ్ సభ్యులు 1980లో భారతీయ జనతా పార్టీని స్థాపించారు. భారత రాజకీయాలలో జాతీయ స్థాయి పార్టీగా కాంగ్రెస్‌కు ఉన్న స్థానాన్ని కూలదోసిన పార్టీగా బీజేపీ ఎదగడం చరిత్ర. జనతా పార్టీ, ప్రభుత్వం కుప్ప కూలిపోవడంతో 1980లో మధ్యంతర ఎన్నికలు జరిగి ఇందిర మళ్లీ ప్రధాని అయ్యారు. ఇది కూడా చరిత్రలో ఒక అనూహ్య ఘట్టమే. అత్యవసర పరిస్థితి తరువాత ఘోరంగా ఓడిపోయిన పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. రెండో దశ ఏలుబడిలో ఆమె చేసిన సాహసోపేత నిర్ణయం అమృత్సర్ స్వర్ణాలయం మీద ఆపరేషన్ బ్లూ స్టార్, పేరిట సైనిక చర్య. కానీ అది సాహసం కాదు, దుస్సాహసమేనని చరిత్ర రుజువు చేసింది. ఆ చర్య నుంచి వచ్చిన ప్రతీకార జ్వాలకే ఆమె 1984లో ఆహుతయ్యారు. అంగరక్షకులే కాల్చి చంపారు. ఇందిర భారత తొలి మహిళా ప్రధానిగానే కాదు, హత్యకు గురైన తొలి ప్రధానిగా కూడా చరిత్రకు ఎక్కారు. 1977–1980 ఈ కొద్దికాలంలోనే భారతదేశం ఇద్దరు ప్రధానులను చూసింది. ఒకరు మొరార్జీ దేశాయ్, మరొకరు చౌధురి చరణ్‌సింగ్. నెహ్రూతో, ఇందిరతో ప్రధాని పదవికి పోటీ పడిన మొరార్జీ దేశాయ్ జనతా పార్టీ గెలిచిన తరువాత ప్రధాని పదవిని చేపట్టారు. స్వాతంత్య్ర సమరస్ఫూర్తి, గాంధేయవాదం మూర్తీభవించిన ప్రధాని ఆయన. వరసగా పది కేంద్ర బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఘనత ఉన్న మొరార్జీ ప్రధానిగా రెండు సంవత్సరాల నాలుగు నెలలు మాత్రమే పదవిలో ఉన్నారు. జనతా పార్టీ పతనమే ఇందుకు కారణం. ద్వంద్వ సభ్యత్వం, రాజ్ నారాయణ్ రగడ, మాజీ జనసంఘీయుల నిష్క్రమణ వంటి కారణాలు ఆయన రాజీనామాకు దారి తీశాయి. తరువాత చౌదరి చరణ్‌సింగ్ ప్రధాని అయ్యారు. ప్రధానిగా పార్లమెంట్‌కు వెళ్లకుండా రాజీనామా చేసిన ప్రధానిగా మిగిలారు. భారత్‌కు సంకీర్ణ ప్రభుత్వాలు తప్పవన్న సంకేతం ఈ కాలం ఇచ్చింది. 1984–1996 ఇందిర హత్య తరువాత ఆమె పెద్ద కుమారుడు రాజీవ్‌గాంధీ ప్రధాని అయ్యారు. తల్లి హత్యతో ప్రధాని పదవిని అధిష్టించిన రాజీవ్, మాజీ ప్రధానిగా తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో హత్యకు గురయ్యారు. షాబోనో కేసు, హిందువుల కోసం అయోధ్య తలుపులు తెరవడం, భోపాల్ విషవాయువు విషాదం, బోఫోర్స్ తుపాకుల అవినీతి వ్యవహారం ఆయన హయాంలోనే జరిగాయి. కమ్యూనికేషన్ వ్యవస్థ బలోపేతానికి ఆయన కృషి ఆరంభించారు. రాజీవ్ మంత్రివర్గంలోనే ఆర్థిక, రక్షణ శాఖలను నిర్వహించిన విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ బోఫోర్స్ వ్యవహారంతో కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు చేసి, జనతాదళ్ కూటమి బలంతో ప్రధాని పదవిని చేపట్టారు. ఉపప్రధాని దేవీలాల్‌తో వీపీ సింగ్‌కు విభేదాలు తీవ్రమైనాయి. అలాంటి సందర్భంలో సింగ్ మండల్ కమిషన్ నివేదికను బయటకు తీశారని చెబుతారు. ఎల్‌కె అడ్వాణిని అయోధ్య రథం మీద నుంచి దించడంతో వీపీ సింగ్‌ను ప్రధాని పదవి నుంచి బీజేపీ దించివేసింది. సింగ్ తరువాత చంద్రశేఖర్ కాంగ్రెస్ ‘బయటి నుంచి మద్దతు’తో ప్రధాని అయ్యారు. చంద్రశేఖర్ సమాజ్‌వాదీ జనతా పార్టీ మైనారిటీ ప్రభుత్వం బడ్జెట్‌ను కూడా ఆమోదింప చేయలేకపోయింది. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడానికి ఈ ప్రభుత్వం బంగారాన్ని కుదువ పెట్టవలసి వచ్చింది. చంద్రశేఖర్ తరువాత తెలుగువారు పీవీ నరసింహారావు ప్రధాని అయ్యారు. ఆర్థిక సంస్కరణల ద్వారా దేశాన్ని ఒక తీవ్ర సంక్షోభం నుంచి బయటపడవేసిన వారు పీవీ. కానీ అయోధ్య వివాస్పద కట్టడం ఆయన హయాంలోనే కూలింది. మైనారిటీ ప్రభుత్వమే అయినా ఐదేళ్ల పాటు అధికారంలో కొనసాగిన ఘనత పీవీ ప్రభుత్వానికి ఉంది. 1996–2004 ఒక రాజకీయ సంక్షుభిత దేశంగానే భారత్ కొత్త మిలీనియంలోకి అడుగు పెట్టింది. కాంగ్రెస్ ప్రభను కోల్పోతుండగా, బీజేపీ బలపడుతున్న కాలమది. అలాగే హంగ్ యుగం కూడా. ఏ పార్టీకి మెజారిటీ రాని పరిస్థితి చిరకాలం కొనసాగింది. 1996లో జరిగిన ఎన్నికలలో అతి పెద్ద మెజారిటీ సాధించిన పార్టీగా బీజేపీ అవతరించింది. కానీ హంగ్ లోక్‌సభ ఏర్పడింది. వాజపేయి తొలిసారి 1996 మే 16 న ప్రధానిగా ప్రమాణం చేశారు. 1996 జూన్ 1 న రాజీనామా చేశారు. తరువాత హెచ్డి దేవెగౌడ ప్రధాని అయ్యారు. కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలతో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పడింది. సీతారాం కేసరి నాయకత్వంలోని కాంగ్రెస్ యథాప్రకారం బయట నుంచి మద్దతు ఇచ్చింది. కానీ 11 మాసాలకే ఆయన ప్రభుత్వం పడిపోయింది. దేవెగౌడ వారసునిగా ఇందర్‌కుమార్ గుజ్రాల్ పదవీ స్వీకారం చేశారు. విదేశ వ్యవహారాలలో దిట్ట అయిన గుజ్రాల్ కూడా 11 మాసాలు మాత్రమే అధికారంలో ఉన్నారు. ఇరుగు పొరుగు దేశాలతో భారత్ సంబంధాల గురించి గుజ్రాల్ సిద్ధాంతం పేరుతో ఒక విధానం ప్రసిద్ధమైంది. 1998లో మళ్లీ మధ్యంతర ఎన్నికలను దేశం ఎదుర్కొనవలసి వచ్చింది. ఈసారి చాలా పార్టీలు బీజేపీ వెనుక నిలిచాయి. నేషనల్ డెమాక్రటిక్ అలయెన్స్ కూటమి ఏర్పడి, వాజపేయి ప్రధాని అయ్యారు. కూటమిలో భాగస్వామి అన్నా డీఎంకే మద్దతు ఉపసంహరించుకొనడంతో ఒక్క ఓటుతో ప్రభుత్వం కూలిపోయింది. 1999లో మళ్లీ ఉప ఎన్నికలు జరిగి ఎన్ డీఏ విజయం సాధించింది. వాజపేయి ప్రధానిగా ప్రమాణం చేశారు. కొద్ది నెలలు మినహా పూర్తి సమయం అధికారంలో కొనసాగారు. తన పదమూడు మాసాల పాలనలోనే వాజపేయి పోఖ్రాన్ 2 అణుపరీక్ష జరిపించారు. మూడోసారి ప్రధాని అయినప్పుడు పాకిస్తాన్ తో కార్గిల్ సంఘర్షణ జరిగింది. లాహోర్ బస్సు దౌత్యం వంటి ప్రయత్నాలు కూడా జరిగాయి. 2004–2022 2004లో జరిగిన ఎన్నికలలో మళ్లీ కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ అధికారంలోకి వచ్చింది. పీవీ నరసింహారావు మంత్రివర్గంలో ఆర్థికమంత్రి, ఆర్థిక సంస్కరణల శిల్పి డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధాని అయ్యారు. 2009 ఎన్నికలలో కూడా మళ్లీ యూపీఏ గెలిచి ఆయనే ప్రధాని అయ్యారు. యూపీఏ మొదటి దశ సజావుగానే సాగినా, రెండో దశ అవినీతి ఆరోపణలను మూటగట్టుకుంది. 2014 ఎన్నికలలో బీజేపీ ఘన విజయం సాధించి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. 2019లో జరిగిన ఎన్నికలలో మరొకసారి మోదీకే భారతీయులు పట్టం కట్టారు. ముప్పయ్ ఏళ్ల తరువాత తిరుగులేని మెజారిటీ సాధించిన పార్టీగా 302 సీట్లు బీజేపీ సాధించింది. కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణాన్ని మోదీ ప్రభుత్వం రద్దు చేసింది. గిరిజన మహిళ ద్రౌపది ముర్మును భారత రాష్ట్రపతిగా ఎంపిక చేసిన ఘనతను కూడా బీజేపీ దక్కించుకుంది. – డా. గోపరాజు నారాయణరావుఎడిటర్, ‘జాగృతి’ (చదవండి: మహాత్మా మన్నించు..) -
భారత్.. ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిది: ప్రధాని మోదీ
సాక్షి, ఢిల్లీ: చరిత్ర విస్మరించిన స్వాతంత్ర్య యోధులను ఇవాళ భారత దేశం గౌరవించుకుంటోంది అని ఉద్వేగపూరితంగా ప్రసంగించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా.. సోమవారం ఉదయం ఎర్రకోట నుంచి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన.. దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కర్తవ్య మార్గంలో తమ ప్రాణాలను అర్పించిన బాపు, నేతాజీ సుభాష్ చంద్రబోస్, బాబాసాహెబ్ అంబేద్కర్, వీర్ సావర్కర్ తదిరత మహోన్నతులకు దేశ పౌరులం కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. దేశం కోసం పోరాడిన వీరనారీమణులకు సెల్యూట్. ఈ పోరాటంలో ఎంతో మంది ప్రముఖులు దేశాన్ని జాగృతం చేశారు. త్యాగధనుల పోరాటల ఫలితమే మన స్వాతంత్రం. మంగళ్ పాండే, తాత్యా తోపే, భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు, చంద్రశేఖర్ ఆజాద్, అష్ఫాఖుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్, బ్రిటిష్ పాలన పునాదిని కదిలించిన మన అసంఖ్యాక విప్లవకారులకు ఈ దేశం కృతజ్ఞతలు తెలుపుతోంది. మాతృ భూమి కోసమే అల్లూరి సీతారామరాజు జీవించారు. గిరిజనలు దేశం కోసం తమ జీవితాలను త్యాగం చేశారు. ఎర్రకోటపై ప్రధాని మోదీ ప్రసంగం.. 76th Independence Day ఇవాళ త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ఆవిష్కరిస్తున్నాం. దేశంలోనే కాదు.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా జరిగాయి. సంబురాలలో మన మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. 75 ఏళ్ల స్వాతంత్ర భారతం ఇవాళ ఓ మైలు రాయిని దాటింది. ఈ 75 ఏళ్లు మనం ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నాం. ఎలాంటి సమస్య వచ్చినా ఓటమిని అంగీకరించలేదు. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిది. భారతదేశం తన 75 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని, తనకు అమూల్యమైన సామర్థ్యం ఉందని నిరూపించుకుంది. ఈ 75 ఏళ్ల ప్రయాణంలో, ఆశలు, ఆకాంక్షలు, ఎత్తులు, కనిష్ఠాల మధ్య అందరి కృషితో మేము చేయగలిగిన చోటికి చేరుకున్నాము. 2014లో, పౌరులు నాకు బాధ్యత ఇచ్చారు. స్వాతంత్ర్యం తర్వాత జన్మించిన నాకు.. ఎర్రకోట నుండి ఈ దేశ పౌరులను ప్రశంసించే మొదటి వ్యక్తిగా ఓ అవకాశాన్ని ఇచ్చారు. పేదవాళ్లకు సాయం అందించడమే నా లక్ష్యం. దేశ ప్రజలు పునరుత్తేజంతో ఉండడమే మన బలం. మన ముందు ఉన్న మార్గం కఠినమైంది. ప్రతీ లక్ష్యాన్ని సకాలంలో సాధించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఇప్పుడు నవసంకల్పంతో ముందుకు వెళ్తున్నాం అని ప్రధాని మోదీ తెలిపారు. ప్రధాని మోదీలో తొమ్మిదవ సారి నరేంద్ర మోదీ పతాకాన్ని ఆవిష్కరించారు. వచ్చే 25 ఏళ్లు ఐదు అంశాలపై ప్రధానంగా దృష్టిపెట్టాలి వచ్చే 25 ఏళ్లులో ప్రధానంగా ఐదు అంశాలపై దృష్టిపెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. 1. దేశంలోని ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలి 2. బానిసత్వపు ఆలోచనల్ని మనసులో నుంచి తీసిపారేయండి 3. మన దేశ చరిత్రి, సంస్కృతిని చూసి గర్వ పడాలి 4. ఐకమత్యంతో ప్రజలంతా ముందుకెళ్లాలి 5. ప్రతి ఒక్క పౌరుడు తమ బాధ్యతను గుర్తించి పని చేయాలి #WATCH Live: Prime Minister Narendra Modi addresses the nation from the ramparts of the Red Fort on #IndependenceDay (Source: DD National) https://t.co/7b8DAjlkxC — ANI (@ANI) August 15, 2022 -
ఏపీ పోలీసులకు పతకాల పంట
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీకి చెందిన ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ట్రైనింగ్ పి.వెంకట్రామిరెడ్డి సేవలను గుర్తించిన కేంద్ర హోం శాఖ ఆయనకు రాష్ట్రపతి పోలీస్ మెడల్ ప్రకటించింది. ఏటా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోం శాఖ ఈ పతకాలు ప్రకటిస్తుంది. ఏపీకి చెందిన ఏఏసీ మండ్ల హరికుమార్కు పోలీస్ మెడల్ ఫర్ గ్యాలెంటరీ (పీఎంజీ), జేసీ ముర్రే సూర్యతేజకు ఫస్ట్ బార్ టు పీఎంజీ, జేసీ పువ్వుల సతీష్‌కు పీఎంజీ ప్రకటించింది. రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శాంతారావు (ఎస్ఎస్జీ ఐఎస్‌డబ్ల్యూ, విజయవాడ), ఎస్ఐ వి.నారాయణమూర్తి (ఎస్ఐబీ, విజయవాడ)లకు పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ పతకాలు దక్కాయి. -
ఎర్రకోటపై ప్రధాని మోదీ జెండా ఆవిష్కరణ
Independence Day celebrations ఢిల్లీ అప్డేట్స్ ►వచ్చే 25 ఏళ్లు ఐదు అంశాలపై ప్రధానంగా దృష్టిపెట్టాలి: ప్రధాని మోదీ ►1. దేశంలోని ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలి ►2. బానిసత్వపు ఆలోచనల్ని మనసులో నుంచి తీసిపారేయండి ►3. మన దేశ చరిత్రి, సంస్కృతిని చూసి గర్వ పడాలి ►4. ఐకమత్యంతో ప్రజలంతా ముందుకెళ్లాలి ►5. ప్రతి ఒక్క పౌరుడు తమ బాధ్యతను గుర్తించి పని చేయాలి ►మనదేశం టెక్నాలజీ హబ్‌గా మారుతోంది ►జై జైవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్‌తో పాటు జై అనుసంధాన్ ►ప్రజలంతా నిలదొక్కుకోవడమే ఆత్మ నిర్బర్ లక్ష్యం ►డిజిటల్ ఇండియాతో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి ►వాళ త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ఆవిష్కరిస్తున్నాం. దేశంలోనే కాదు.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా జరిగాయి. ►సంబురాలలో మన మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. 75 ఏళ్ల స్వాతంత్ర భారతం ఇవాళ ఓ మైలు రాయిని దాటింది. ►ఈ 75 ఏళ్లు మనం ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నాం. ఎలాంటి సమస్య వచ్చినా ఓటమిని అంగీకరించలేదు. ►భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిది. ► స్వాతంత్రం కోసం పోరాడిన యోధులను స్మరించుకుంటూ ముందుకు వెళ్లాలి. నారీ శక్తికి ప్రత్యేకంగా గౌరవం ప్రకటించుకోవాలి. ► దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ఆవిష్కరిస్తున్నాం. దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగానూ సంబురాలు జరుగుతున్నాయి. ► ఎర్రకోటపై మువ్వన్నెల జెండా ఆవిష్కరించిన ప్రధాని మోదీ #WATCH PM Narendra Modi hoists the National Flag at Red Fort on the 76th Independence Day pic.twitter.com/VmOUDyf7Ho — ANI (@ANI) August 15, 2022 ►ఎర్రకోట వేదికకు చేరుకున్న ప్రధాని మోదీ ► ఎర్రకోటలో ఇంటర్ సర్వీసెస్, పోలీస్ గార్డ్ ఆఫ్ హానర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ తనిఖీ చేశారు. Delhi | PM Modi inspects the inter-services and police Guard of Honour at Red Fort pic.twitter.com/IxySt0G0r4 — ANI (@ANI) August 15, 2022 ► ఎర్రకోట వద్దకు చేరుకున్న ప్రధాని మోదీకి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ స్వాగతం పలికారు. జాతీయ జెండాను ఎగురవేసేందుకు ఆయన ఎర్రకోట ప్రాకారం వైపు వెళ్తున్నారు. ► 76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా.. రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళులర్పించిన ప్రధాని మోదీ Delhi | PM Modi pays tribute to Mahatma Gandhi at Rajghat on the 76th Independence Day pic.twitter.com/1UFpkoVoAR — ANI (@ANI) August 15, 2022 ► భారత స్వాతంత్రం 1947 సంవత్సరపు మొదటి వేడుకలను కలిపి చూసుకున్నా.. ఇప్పుడు భారత ప్రభుత్వం నిర్వహిస్తోంది 76వ ఏడాది వేడుకలు. ► 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలు మార్చి 2021లో ప్రారంభమైన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే మెగా కార్యక్రమం ద్వారా గుర్తించబడుతున్నాయి. ► 75 వసంతాల స్వాతంత్రాన్ని పూర్తి చేసుకుని 76వ వడిలోకి అడుగుపెట్టింది భారత్. దేశం మొత్తం గత నాలుగైదు రోజులుగా సందడి వాతావరణం నెలకొంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
IDAY2022: ఈ పాటలు విన్నప్పుడల్లా ఉప్పొంగే దేశభక్తి
పంద్రాగస్టు దేశానికి పెద్ద పండుగ. కుల, మత, జాతి, వర్గాలన్నీ కలిసి చేసుకునే సందర్భం. స్కూల్ పిల్లల దగ్గరి నుంచి పెద్దల దాకా అందరినీ.. ఏళ్ల తరబడి అలరిస్తూ వస్తున్న కొన్ని దేశభక్తి సినీ గేయాలను ఈ స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల సందర్భంగా గుర్తు చేసుకుందాం. సగటు భారతీయుడి నరనరాలను కదలించి.. దేశభక్తిని ఉప్పొంగేలా చేశాలు కొన్ని సినీ గేయాలు.. -
అమృతోత్సాహం.. 76వ స్వాతంత్య్ర దినోత్సవాలకు దేశం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: ఎటు చూసినా మువ్వన్నెల రెపరెపలే. ఎవరిని కదిలించినా అమృతోత్సవ సంగతులే. ఊరూ వాడా, పల్లె పట్నం మూడు రంగుల వెలుగుల్లో మెరిసిపోతున్నాయి. స్వాతంత్య్ర సంబరాల ముచ్చట్లతో మురిసిపోతున్నాయి. స్వాతంత్య్ర భానూదయానికి 75 ఏళ్లు పూర్తవుతుండటం ఈసారి పంద్రాగస్టు ప్రత్యేకతను మరింత పెంచింది. ఈ నేపథ్యంలో దేశమంతా త్రివర్ణ శోభితమైంది. నెలల తరబడి సాగుతున్న స్వాతంత్య్ర అమృతోత్సవాలకు అద్భుతమైన ముగింపు ఇచ్చేందుకు అన్నివిధాలా ముస్తాబైంది. గోల్కొండ కోటపై జాతీయజెండా ఎగరేయనున్న సీఎం కేసీఆర్ దేశ 76వ స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా సీఎం కేసీఆర్ సోమవారం ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌లోని చరిత్రాత్మక గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగరవేయనున్నారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. స్వాతంత్య్రం సాధించి 75 ఏళ్లు పూర్తైనా.. దేశం అన్ని రంగాల్లో వెనుకబడి ఉండటాన్ని, కేంద్ర ప్రభుత్వాల వైఫల్యాలను సీఎం తన ప్రసంగంలో ఎండగట్టే అవకాశం ఉంది. దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ముందున్న సవాళ్లు, కర్తవ్యాలు వివరించడంతో పాటు.. తెలంగాణ ఏర్పాటైన తర్వాత సాధించిన పురోగతిని, భవిష్యత్ కార్యక్రమాలను ప్రస్తావించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. త్రివర్ణ శోభితమైన గోల్కొండ కోట కాగా రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి కొత్తగా 10 లక్షల పెన్షన్లు జారీ చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కొందరు లబ్ధిదారులకు సీఎం కేసీఆర్ స్వయంగా పెన్షన్ కార్డులు అందజేసే అవకాశం ఉంది. స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా 75 మంది ఖైదీలను విడుదల చేయాలని కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు సోమవారం ఖైదీలు విడుదల కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదివారం గోల్కొండ కోటను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ తమిళిసై జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. మిగతా జిల్లాల్లో స్థానిక మంత్రులు, ప్రభుత్వ విప్‌లు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ సలహాదారులు జాతీయ జెండా ఎగురవేయనున్నారు. త్రివర్ణ శోభితమైన చార్మినార్ చదవండి: స్వతంత్ర భారత సందేశం -
స్వతంత్ర భారత సందేశం
స్వతంత్ర భారతావనికి నేటితో డెబ్భై అయిదు వసంతాలు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో దేశ సాఫల్య వైఫల్యాలు అనేకం. కులం, మతం, జాతి, భాష లాంటి లోటుపాట్లు బోలెడున్నా, ఈ 75 ఏళ్లలో గణనీయమైన విజయాల విషయంలో మనం రొమ్ము విరుచుకోవచ్చు. కానీ, చేసిన పొరపాట్లతో పాటు ఉద్దేశపూర్వకమైన తప్పులు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉన్నాయి. ఉన్న సమస్యలకు మరికొన్ని చేర్చుకున్నాం. గత ఎనిమిదేళ్లుగా వ్యతిరేక స్వరాలను ఆలకించే సహనం మనలో చచ్చిపోయింది. తోటి పౌరులైన ముస్లిమ్‌లను పక్షపాత దృష్టితో చూడడం మొదలుపెట్టాం. ఇవన్నీ సిగ్గుతో తలదించుకునేలా చేసేవే! ఇవన్నీ సమీక్షించుకొని, సరిదిద్దుకొని, సమైక్యంగా ముందుకు సాగాల్సిన సందర్భం ఇది. మన భారతదేశం స్వతంత్రమై నేటితో 75 ఏళ్ళు పూర్తవుతున్నాయి. ఒక దేశంగా మనం సాధించిన విజయాలేమిటి? చవిచూసిన వైఫల్యాలేమిటి? అని సమీక్షించుకునేందుకు తగిన సందర్భం ఇది. అలాగే, ఇదే సందర్భంలో మనం ఏ రకమైన దేశాన్ని నిర్మించుకున్నామన్నదీ ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ప్రశ్నలకు ఏవో స్పష్టమైన, కచ్చితమైన సమాధానాలు లభిస్తాయని కాదు. ఒక్కొక్కరి మదిలో ఒక్కో సమాధానం కచ్చితంగా ఉంటుంది. వారికి అదే సరైనదని కూడా అనిపిస్తుంది. అదే స్ఫూర్తితో నా దృష్టిలో మన దేశ సాఫల్య వైఫల్యాలను వివరించాలని అనుకుంటున్నా. ఒకవేళ దానివల్ల ప్రత్యేకించి ప్రయోజనమేదీ లేకున్నా... అది మీలో మరిన్ని ఆలోచనలు రేకెత్తించవచ్చు. ► కులం, మతం, జాతి, భాష లాంటి లోటుపాట్లు బోలెడున్నప్పటికీ, ఈ 75 ఏళ్లలో మన సాధనల విషయంలో మనం కొంచెం గర్వంగా రొమ్ము విరుచుకోవచ్చు. ఈ తేడాలు దేశాన్ని నాశనం చేస్తాయని 1960లలో పాశ్చాత్యులు కూడా విమర్శించారు. అయినా సరే... మనం ఒక్కతాటిపై నిలిచాం. అన్నింటినీ తట్టుకుని మనగలిగాం. అత్యవసర పరిస్థితులను అధిగమించి, దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లింది. ఎన్నికలు సక్రమంగా జరుపుకోగలిగాం. ప్రభుత్వాలు మారాయి. ప్రజాగ్రహం శక్తిమంతమైన పరిపాలనా వ్యవస్థలను కూడా నియంత్రణలో ఉంచగలిగింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ల మాదిరిగా దేశం సైనిక పాలనను అనుభవించాల్సిన అవసరం రాలేదు. ► అక్షరాస్యత, ఆయుః ప్రమాణాల విషయానికి వస్తే 1947కూ, ప్రస్తుతానికీ అస్సలు సారూప్యతే లేదు. అక్షరాస్యత అప్పటి కన్నా నాలుగు రెట్లు పెరిగింది. అలాగే, ఆయుః ప్రమాణం రెట్టింపు అయ్యింది. సాధించాల్సింది ఇంకా ఎంతో ఉన్నా... సాధించింది తక్కువేమీ కాదని స్పష్టంగా చెప్పవచ్చు. తిండిగింజల కోసం అంగలార్చిన దేశం ఈ రోజు వాటిని ఎగుమతి చేసే దశకు చేరిందంటే అంతకంటే గొప్ప విజయం ఇంకోటి ఉండదు. నౌకల్లో దిగుమతి అయితేనే నాలుగు వేళ్లూ నోట్లోకి వెళ్లే పరిస్థితి ఉండేది అప్పట్లో! ఇప్పుడు ఆహార ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామి మన దేశం. పాల ఉత్పత్తిలో మనది అగ్రస్థానం. బియ్యం, గోదుమల ఉత్పత్తిలో రెండో స్థానం. బియ్యం ఎగుమతి చేసే దేశాల్లోనూ తొలిస్థానం మనదే! మన అంతరిక్ష పరిశోధనా కార్యక్రమం, పదమూడు మంది ప్రపంచస్థాయి సీఈవోలను అందించిన మన ఐఐటీలు, ప్రపంచ ప్రేక్షకాదరణ కలిగిన క్రికెట్ టోర్నమెంట్లు, సినిమా పరిశ్రమ... ఇలాంటివన్నీ తృతీయ ప్రపంచదేశాల్లో మనల్ని ప్రత్యేకంగా నిలిపే అంశాలు. ఇంతటి వైవిధ్యభరితమైన దేశం మరొకటి ఉండదు. ► దురదృష్టవశాత్తూ మనం చేసిన పొరపాట్లు, మన లోటుపాట్లు, చివరకు ఉద్దేశపూర్వకమైన తప్పులు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉన్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, వరుసగా అనేక ప్రభుత్వాలు దేశ ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడంలో విఫలమయ్యాయని స్పష్టంగా చెప్పవచ్చు. భారీ నీటి ప్రాజెక్టులు కట్టుకున్నా... ఉక్కు కర్మాగారాలను నిర్మించినా... సోషలిజానికి ఇచ్చిన ప్రాధానంతో ఒక రేటు అభివృద్ధిలోనే చిక్కుబడి, దేశ ప్రజల్లో పారిశ్రామిక స్ఫూర్తిని ఉద్దీపింపజేయలేకపోయింది. ► 1984, 2002లలో జరిగిన సంఘటనలు అహింసా వాదులమని చెప్పుకొనే మన వాదనలోని డొల్లతనాన్ని ఎత్తి చూపుతాయి. చైనా, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్‌లపై ఆర్థిక ఆంక్షలు ఉన్నా 1947 నాటికి వాటి జాతీయ ఆదాయం, మన దేశ జాతీయ ఆదాయం దాదాపుగా ఒకే స్థాయిలో ఉండేవి. డెబ్భై అయిదేళ్ళ తరువాత ఒక్కసారి ఈ దేశాల ఆదాయాలను భారత్‌తో పోల్చి చూసినప్పుడు మనం ఎంతో వెనుకబడ్డ విషయం స్పష్టమవుతుంది. 1990లో ఆర్థిక సంస్కరణలు ఓ మూడు దశాబ్దాల ముందే ప్రారంభమై ఉంటే భారత్ పరిస్థితి ఇంకోలా ఉండేది. ► అయితే ఏమంటారు అని అడిగితే ఒక సలహా ఇస్తా. భారతదేశం ఎంతో సాధించేసిందని మాత్రమే గట్టిగా నమ్ముతూ... ఎన్నిసార్లు దారితప్పామో మరచిపోతే అది అవివేకమే అవుతుంది. పచ్చిగా చెప్పాలంటే మనం ఎంత సాధించామో, అంతేస్థాయిలో తప్పటడుగులూ వేశాము. అలాగైతే మనమిప్పుడు ఏ రకమైన దేశంగా అవతరించామన్న ప్రశ్న వస్తుంది. పాత సమస్యలు ఇప్పటికీ చాలానే వెంటాడుతున్నాయి. దళితులు, ఆదివాసీలు ఇప్పటికీ అత్యంత అణగారిన వర్గాలుగానే కొనసాగుతున్నారు. వారి కన్నీళ్ళు తుడవడంలో విఫలమయ్యాం. ‘అస్పశ్యత’ను చట్టం ద్వారా నిషేధించినా... సమాజంలో అది పూర్తిగా తుడిచిపెట్టుకుపోలేదు. ఆకలి, కరవు వంటివి గత చరిత్రే కావచ్చు కానీ... దేశ జనాభాలో దాదాపు 25 శాతం మంది ఇప్పటికీ దారిద్య్రరేఖకు దిగువనే ఉన్నారు. వాస్తవం ఏమిటంటే... పదేళ్లుగా పేదరికం స్థాయి ఏమిటన్నది కూడా తెలుసుకోవడం మానివేశాం మనం. ► ఉన్న సమస్యలకు మరికొన్ని చేర్చుకున్నాం కూడా! ఎనిమిదేళ్లుగా వ్యతిరేక స్వరాలను ఆలకించే సహనం చచ్చిపోయింది మనలో! మన పోకడల్లో ఆధిపత్యవాదన ఎక్కువైంది. తోటి పౌరులైన ముస్లిమ్‌లను పక్షపాత దృష్టితో చూడడం మొదలుపెట్టాం. జనహనన బెదిరింపులు ఇప్పుడు బహిరంగంగానే జరిగిపోతున్నా ప్రభుత్వం చెవులు మూసుకుని ఉండేందుకే మొగ్గు చూపుతోంది. ఇవన్నీ 1940, ’50లలో ఊహించను కూడా ఊహించలేము. ఇవన్నీ మనల్ని సిగ్గుతో తలదించుకునేలా చేసేవే! కానీ కొంతమంది ఇలాంటివి కొన్ని ఉన్నాయని కూడా ఒప్పుకోరు. ► సరే... మరి స్వతంత్ర భారతావని 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న ఈ రోజున మనం దేన్ని నొక్కి చెబుదాం? మన ఘనతల్ని మరోసారి నెమరేసుకుంటాం. తప్పులేదు. అయితే గట్టిగా చెప్పుకోలేకపోయినా, చేసిన తప్పులను కూడా ఒక్కసారి మననం చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఈ తప్పులన్నీ మనం నిర్దేశించుకున్న విలువలు, ఆర్థిక సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకోకపోవడం వల్ల జరిగినవే! ఇంకోలా చెప్పాలంటే మనం రాసుకున్న రాజ్యాంగానికి కట్టుబడి ఉండకపోవడం వల్ల జరిగినవే! అందుకే ప్రమాణపూర్తిగా ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలి! ఈ స్వతంత్ర భారత ఉత్సవాల సందర్భంగా మనం చేయాల్సింది అదే! కరణ్ థాపర్ వ్యాసకర్త ప్రసిద్ధ పాత్రికేయులు -
అమృతోత్సవ భారతం
మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి నేటికి నిండా డెబ్బయి ఐదేళ్లు. దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర అమృతోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ప్రజల్లో దేశభక్తి ప్రజ్వరిల్ల చేయడానికి కేంద్ర ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవానికి కొద్ది నెలల ముందుగానే ‘హర్ ఘర్ తిరంగా’– అంటే, ‘ఇంటింటా మువ్వన్నెలు’ నినాదాన్ని హోరెత్తించడం ప్రారంభించింది. ఎలాగైతేనేం, దేశమంతటా ఊరూవాడా మువ్వన్నెల రెపరెపలతో మెరిసిపోతున్నాయి. డెబ్బయి ఐదేళ్ల కిందట సాధించుకున్న స్వాతంత్య్రం మనకు తేలికగా దక్కలేదు. దశాబ్దాల తరబడి సాగిన పోరాటంలో ఎందరో మహనీయులు చేసిన త్యాగాల ఫలితమే మనకు దక్కిన ఈ స్వాతంత్య్రం. ప్రజాపక్షపాతుల బలిదానాల ఫలితంగా దక్కిన స్వాతంత్య్రాన్ని మనం ఎంత పదిలంగా కాపాడుకోవాలి? కష్టనష్టాలకు ఎదురీది, నెత్తురు చిందించి సాధించుకున్న స్వాతంత్య్ర ఫలాలను అట్టడుగు ప్రజానీకానికి అందేలా చేయడానికి ఎంతటి దీక్షాదక్షతలను చాటుకోవాలి? గడచిన డెబ్బయి ఐదేళ్లలో దేశంలోని సామాన్యుల కష్టాలు పూర్తిగా తొలగిపోయాయని చెప్పగల పరిస్థితులు లేవు. అలాగని ఇన్నేళ్లలో సాధించినది శూన్యం అని చెప్పడానికీ లేదు. అయితే, మనం సాధించిన పురోగతి కొంతేనని, సాధించాల్సినది ఎంతోనని నిస్సందేహంగా చెప్పవచ్చు. దేశాన్ని అట్టుడికించిన స్వాతంత్య్ర సమరంలో ఎందరెందరో కవులు, రచయితలు ప్రజల పక్షాన నిలిచారు. బ్రిటిష్ దుష్పరిపాలనను ఎదిరించారు. పోలీసుల లాఠీదెబ్బలు తిన్నారు. జైళ్లకు వెళ్లారు. శిక్షలు అనుభవించారు. దుర్భర దారిద్య్ర బాధలను అనుభవించారు. స్వాతంత్య్రం వచ్చాక స్వాతంత్య్రోద్యమంలో త్యాగాలు చేసిన రచయితలు, కవుల్లో చాలామందికి దక్కాల్సినంత గౌరవం దక్కకపోవడమే చారిత్రక విషాదం. ఇందుకు కొందరు తెలుగు ప్రముఖుల ఉదాహరణలనే చెప్పుకుందాం. స్వాతంత్య్ర సమరం ఉద్ధృతంగా సాగుతున్న కాలంలో ‘మాకొద్దీ తెల్లదొరతనము– దేవ– మాకొద్దీ తెల్లదొరతనము’ అంటూ గరిమెళ్ల సత్యనారాయణ రాసిన ధిక్కారగీతం తెలుగునాట నలుచెరగులా ఊరూవాడా మార్మోగింది. జనంలోకి చొచ్చుకుపోయిన ఆ పాట తెల్లదొరలకు వెన్నులో వణుకు పుట్టించింది. అప్పటి బ్రిటిష్ కలెక్టర్ బ్రేకన్, గరిమెళ్లను పిలిపించుకుని, ఆ పాటను ఆయన నోటనే విన్నాడు. భాష అర్థం కాకపోయినా, పాటలోని తీవ్రతను గ్రహించి, ఆయనకు ఏడాది జైలుశిక్ష విధించాడు. స్వాతంత్య్రం వచ్చాక మన పాలకులు ఆయనను తగినరీతిలో గౌరవించిన పాపాన పోలేదు. దుర్భర దారిద్య్రంతోనే ఆయన కన్నుమూశారు. ఆయన మరణానంతరం మన పాలకులు ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసి, ఆయన పట్ల భక్తిప్రపత్తులను చాటుకున్నారు అంతే! గరిమెళ్లకు సమకాలికుడైన తొలితరం దళితకవి కుసుమ ధర్మన్న అదేకాలంలో ‘మాకొద్దీ నల్లదొరతనము’ పాట రాశారు. అప్పట్లో కాంగ్రెస్‌లో కొనసాగుతూనే ఆయన ఈ పాట రాశారంటే, స్వాతంత్య్రోద్యమ కాలంలోనే కొందరు ఉద్యమనేతల అవినీతి, ద్వంద్వప్రవృత్తి ఎలా ఉండేవో అర్థం చేసుకోవచ్చు. కుసుమ ధర్మన్న స్వాతంత్య్రానికి వ్యతిరేకి కాదు గాని, అణగారిన దళిత వర్గాల అభ్యున్నతిపై నిబద్ధత, చిత్తశుద్ధి లేని నాయకుల చేతికి అధికారం దక్కితే జరగబోయే అనర్థాలను ముందుగానే గుర్తించిన దార్శనికుడు ఆయన. స్వాతంత్య్రం వచ్చాక కుసుమ ధర్మన్నకు కూడా ఎలాంటి గౌరవమూ దక్కలేదు. పరాయి పాలనను తీవ్రస్థాయిలో వ్యతిరేకించిన తెలుగు కవులలో చిలకమర్తి లక్ష్మీనరసింహం అగ్రగణ్యుడు. ఆయన ‘భరతఖండంబు చక్కని పాడియావు/ హిందువులు లేగదూడలై యేడ్చుచుండ/ తెల్లవారను గడుసరి గొల్లవారు/ పితుకుచున్నారు మూతులు బిగియగట్టి’ పద్యాన్ని రాశారు. ఇక్కడి సంపదను బ్రిటిష్‌వారు దౌర్జన్యంగా కొల్లగొట్టుకుపోతుండటంపై ఆయన సంధించిన పద్యాస్త్రం అప్పట్లో విపరీతంగా ప్రభావం చూపింది. ఇక సహాయ నిరాకరణోద్యమ సమయంలో చీరాల–పేరాల ఉద్యమానికి నేతృత్వం వహించిన ‘ఆంధ్రరత్న’ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఆనాడు రగిలించిన స్ఫూర్తి తక్కువేమీ కాదు. సహజ చమత్కారి అయిన దుగ్గిరాల బ్రిటిష్ పాలనను మాత్రమే కాదు, నాటి కాంగ్రెస్ నేతల సంకుచిత స్వభావాలను ఎండగడుతూ చాటువులు రాయగలిగిన సాహసి. సహాయ నిరాకరణోద్యమంలో జైలుపాలై, విడుదలయ్యాక మద్రాసు చేరుకుని అక్కడ ఇచ్చిన ఉపన్యాసంలో ‘న యాచే రిఫారం– నవా స్టీలు ఫ్రేముం/ న కౌన్సిల్ న తు ప్రీవి కౌన్సిల్ పదం వా/ స్వరాజ్యార్తి హన్తాంగ్లరాజ్యే నియన్తా/ ఫరంగీ ఫిరంగీ దృగంగీ కరోతు’ అంటూ నాటి పరిస్థితులపై చమత్కారాస్త్రాన్ని సంధించగల చతురత దుగ్గిరాలకే చెల్లింది. చిలకమర్తి, దుగ్గిరాల– ఇద్దరూ స్వాతంత్య్రానికి ముందే కన్నుమూశారు. స్వాతంత్య్రానంతర ప్రభుత్వాలు వారికి సముచిత గౌరవం కల్పించే చర్యలు చేపట్టిన దాఖలాల్లేవు. ఈ సందర్భంగా గరిమెళ్ల మాటలను గుర్తు చేసుకోవాలి. ‘కొందరు త్యాగము చేయవలె, కొందరు దారిద్య్రముతో నశించవలె, పూర్తిగా నాశనమైనగాని దేశమునకు స్వరాజ్యము రాదు’ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర సమరంలో త్యాగాలు చేసిన ఇలాంటి కవులు, రచయితలు ఎందరో ఉన్నారు. స్వాతంత్య్ర సమరంలో స్ఫూర్తి రగిలించిన కవులు, రచయితల సాహిత్యాన్ని భావితరాలకు అందించేందుకు ఇప్పటికైనా నడుం బిగిస్తే బాగుంటుంది. స్వాతంత్య్ర పోరాటంలో తమ వంతు పాత్ర పోషించినా, గుర్తింపు దక్కించుకోలేకపోయిన కవులు, రచయితల కృషిని వెలుగులోకి తెచ్చేందుకు విశ్వవిద్యాలయాలు, అకాడమీలు ఇప్పటికైనా చిత్తశుద్ధితో కృషి ప్రారంభించినట్లయితే, స్వాతంత్య్ర అమృతోత్సవాలకు సార్థకత దక్కినట్లవుతుంది. -
శతమానం భారతి: స్వర్ణశకం
అమృత మహోత్సవం ముగిసింది! స్వర్ణ శకం ప్రారంభమైంది! కొత్త సంకల్పాలతో, కొత్త సంతోషాలతో, నవయుగంలోకి ప్రవేశిస్తున్నాం. వచ్చే 25 ఏళ్ల ప్రయాణాన్ని గతిశక్తితో, అగ్నిపథంలో ఆరంభిస్తున్నాం. ఈ స్ఫూర్తి 130 కోట్ల ప్రజల సమీకరణ, అనుసంధానం ద్వారా స్వాతంత్య్ర అమృత మహోత్సవాలను చేపట్టడంతో మొదలైంది. ఈ వేడుకల ప్రధాన స్ఫూర్తి ప్రజా భాగస్వామ్యమే. ఈ 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవం ఒక జాతీయ పండుగగా మారి, స్వాతంత్య్ర సమర స్ఫూర్తి, త్యాగం, అంకిత భావం నేటి తరానికి అనుభవంలోకి వచ్చాయి. తద్వారా ఈ మహోత్సవం సనాతన భారత ఆత్మవిశ్వాసం సాక్షాత్కరించే పండుగగా రూపుదాల్చింది. అమృత మహోత్సవంలో భాగమైన కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు దేశాన్ని సమైక్యంగా ఉంచేవి. మరికొన్ని దేశానికి పురోగతిని అందించేవి. ఇండియా గేట్ వద్ద నేతాజీ హోలోగ్రామ్, వినియోగదారులకు సాధికారత, విద్యార్థుల ద్వారా ప్రధానికి పోస్ట్ కార్డులు రాయించడం, ఎర్రకోట వద్ద వేడుకలు.. దేశ ప్రజల్లో స్ఫూర్తిని నింపి, భవిష్యత్తు తరాల జాతీయ భావనకు ప్రేరణనిస్తాయి. ‘‘ఈ 21 వ శతాబ్దంలో ప్రపంచం వేగంగా మారిపోతోంది. కొత్త అవసరాలకు అనుగుణంగా భారతదేశ ప్రజానీకంలో, యువతరంలో ఆశలు, ఆకాంక్ష పెరిగిపోతున్నాయి. వాటిని నెరవేర్చవలసిన ప్రజాస్వామ్య వ్యవస్థల్ని వచ్చే పాతికేళ్ల కోసం సంసిద్ధం చేసుకోవాలి. అందుకు ఈ అమృత మహోత్సవాల కృషి, చిత్తశుద్ధి తోడ్పడతాయి’’ అని ప్రధాని మోదీ అన్నారు. మనం ఇక కలిసికట్టుగా స్వర్ణోత్సవ స్వాతంత్య్ర భారతంలోకి పయనించవలసిన తరుణం ఆసన్నమైంది. (చదవండి: ఆ రోజు.. ఐదు నదులకు పోటీగా పంజాబ్‌లో నెత్తురు పారింది!) -
చిత్రం.. భళారే త్రివర్ణం!
అణువణువున రగిలే దేశభక్తిని కళ్లకు కట్టినట్టు చూపడం, తన ముఖం త్రివర్ణ రూపమని చాటి చెప్పడం, ఆకలివేట సాగించే పక్షి ఆతృతను ఒడిసి పట్టుకోవడం, పచ్చని పంట పొలాల్లో సైతం త్రివర్ణ రెపరెపలు కనువిందు చేయడం, సముద్రపు నీటిరాళ్లపై త్రివర్ణాలు అద్దడం.. లాంటి అద్భుతమైన చిత్రాలను కడప నగరంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ఆర్ట్స్ విశ్వవిద్యాలయం విద్యార్థులు తీసి ఆకట్టుకున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీల్లో సమన్వయకర్త సతీష్ ఆధ్వర్యంలో విద్యార్థులు కడప నగరంలోని పాతకడప తదితర ప్రాంతాల్లో తీసిన చిత్రాలు.. భళా అనిపించేలా ఉన్నాయి. వీరి కళను ఇన్చార్జి వైస్ చాన్సలర్ ఆచార్య మునగాల సూర్యకళావతి, రిజిస్ట్రార్ ఆచార్య ఇ.సి. సురేంద్రనాథ్‌రెడ్డి అభినందించారు. – ఏఎఫ్‌యూ -
ఆ రోజు.. ఐదు నదులకు పోటీగా పంజాబ్‌లో నెత్తురు పారింది!
నేడు ‘విభజన భయానక జ్ఞాపకాల దినం’... 2021 ఆగస్టు 14న భారత ప్రధాని మోదీ ఈ ‘డే’ని ప్రకటించారు. విషాదాలను మరిచిపోకూడదని, అవి పునరావృతం కాకుండా చూసుకోడమే ఈ విభజన భయానక జ్ఞాపకాల దినం (పార్టిషన్ హారర్స్ రిమంబరెన్స్ డే) ఉద్దేశం అని ఆయన వివరించారు. తేనెపట్టును తలపిస్తూ రైళ్లను ముసురుకున్న మానవ సమూహాలు, కిలోమీటర్ల మేర ఎడ్లబళ్లు, మంచం సవారీ మీద వృద్దులు, భుజాల మీద పిల్లలు, బరువైన కావళ్లు, ఓ ఎత్తయిన ప్రదేశంలో తల పట్టుకుని కూర్చొన్న బాలుడు, కలకత్తా వీధులలో దిక్కులేకుండా పడి ఉన్న శవాల గుట్టలు.. ఇవీ విభజన జ్ఞాపకాలు. ఇవన్నీ అప్పటి ఫొటోలలో చూసి ఉంటాం. ఇంతకు మించిన విభజన ఘోరాలు కూడా ఉన్నాయి. అవి పుస్తకాలలో అక్షరబద్ధం అయ్యాయి. మతావేశాలలో చెలరేగిన ఆ కల్లోలంలో కోటి నుంచి రెండు కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. మృతులు పది లక్షల మంది అని అంచనా. అపహరణకు గురైనవారు, అత్యాచారాలకు బలైనవారు.. బాలికలు, యువతుల 75 నుంచి లక్ష వరకు ఉంటారు. తమస్ (భీష్మ సహానీ), ఎ ట్రెయిన్ టు పాకిస్థాన్ (కుష్వంత్ సింగ్), ది అదర్ సైడ్ ఆఫ్ సైలెన్స్ (ఊర్వశీ బుటాలియా), ఎ టైమ్ ఆఫ్ మ్యాడ్ నెస్, మిడ్నైట్ చిల్డ్రన్ (సల్మాన్ రష్దీ), పార్టిషన్ (బార్న్‌వైట్, స్పున్నర్), ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్ (ల్యారీ కోలిన్, డొమినక్ లాపిరె), మిడ్నైట్ ఫ్యూరీస్ (నిసీద్ హజారీ) వంటి నవలలు, చరిత్ర పుస్తకాలలో; అమృతా ప్రీతమ్, ఇస్మత్ చుగ్తాయ్, గుల్జార్, సాదత్ హసన్ మంటో వంటి వారి వందలాది కథలలో విభజన విషాదం స్పష్టంగా కనిపిస్తుంది. హిందువులు, ముస్లింలు ఒకరిని ఒకరు చంపుకున్నారు. సిక్కులు, ముస్లింలు ఒకరిని ఒకరు చంపుకున్నారు. ముస్లింలీగ్ నేత జిన్నా 1946లో ఇచ్చిన ‘ప్రత్యక్ష చర్య’ పిలుపుతో ఉపఖండం కనీవినీ ఎరుగని రీతిలో హత్యాకాండను చూసింది. ఆ సంవత్సరం బెంగాల్ రక్తసిక్తమైంది. 1947లో ఐదు నదులకు పోటీగా పంజాబ్‌లో నెత్తురు పారింది. 1947 ఆగస్ట్ 15న స్వాతంత్య్రం ఇస్తున్నట్టు బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించినా, సరిహద్దుల నిర్ణయం ఆగస్టు 17కు గాని జరగలేదు. ఆ నలభై, యాభై గంటలలో జరిగిన ఘోరాలు భారత స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి మీద అనేక ప్రశ్నలను సంధిస్తాయి. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీలు చేసిన ఘోరాల కంటే ఆ సమయంలో ఇక్కడ జరిగిన ఘోరాలు దారుణమైనవని ఆ యుద్ధంలో పని చేసి వచ్చిన బ్రిటిష్ సైనికులూ పత్రికా విలేకరులూ చెప్పడం విశేషం. అంతటి విషాదాన్ని ఎందుకు గుర్తు చేసుకోవాలంటే, అలాంటిది మరొకటి జరగకుండా జాగ్రత్త పడేందుకు. జాగృతం అయ్యేందుకు. -
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్
భారతదేశానికి స్వాతంత్య్రం లభించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 2021లో ప్రారంభించిన కార్యక్రమమే.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. భారత స్వాతంత్య్ర దినోత్సవం 2022 ఆగస్టు 15 కు 75 వారాల ముందుగా ఈ మహోత్సవ్ ప్రారంభమైంది. నేటితో ముగుస్తోంది. కేంద్ర హోంమంత్రి నేతృత్వంలో 250 మందికిపైగా రాజకీయ, వ్యాపార, క్రీడా తదితర రంగాల ప్రముఖులతో అమృత్ మహోత్సవ్ జాతీయ అమలు కమిటీ ఏర్పాటైంది. డెబ్బయ్ ఐదు వారాల పాటు దేశ వ్యాప్తంగా చేపట్టాల్సిన కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా ఈ కమిటీ దిగ్విజయంగా అమలు చేసింది. ఇందులో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలను, ప్రజల్ని భాగస్వాములను చేసింది. దండియాత్ర జరిగిన మార్చి 12 నుంచి ఈ ఉత్సవాల నిర్వహణ ప్రారంభం అయింది. వేడుకలను ప్రారంభించే చరిత్రాత్మక ప్రాంతాలను పురావస్తు శాఖ గుర్తించింది. ఆ మేరకు ఢిల్లీలోని ఖిలా రాయ్ పిథోరా వద్ద వేడుకలు ప్రారంభం అయ్యాయి. అనంతరం గ్వాలియర్ కోట, ఢిల్లీలోని హుమయూన్ సమాధి, ఫతేపూర్ సిక్రీ, హైదరాబాద్‌లోని గోల్కొండ కోట, ఐజ్వాల్‌లోని భువనేశ్వరి ఆలయం, ముంబయిలోని అగాఖాన్ ప్యాలెస్, ఒడిశాలోని కొణార్క్ ఆలయం, ఝాన్సీ కోట, జైపూర్ ప్యాలెస్ వంటి చారిత్రక ప్రదేశాల వద్ద వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. -
స్వతంత్ర భారత గణతంత్ర సారథులు
భారత ప్రథమ పౌరుడు రాష్ట్రపతి. త్రివిధ దళాధిపతి. దేశంలోనే అత్యున్నత రాజ్యాంగ పదవి రాష్ట్రపతి. కొన్ని సందర్భాలలో, కొందరు రాష్ట్రపతులు ప్రధానితో విభేదించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రథమ రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ విషయంలోనే ఇది రుజువైంది. ఒక బలమైన ప్రధానితోనే ఆయన తన మనోగతాన్ని వ్యక్తీకరించడానికి వెనుకాడలేదు. తరువాత కూడా అలాంటి సందర్భాలు ఉన్నాయి. చదవండి: జెండా ఊంఛా రహే హమారా! రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉండగా నాటి రాష్ట్రపతి జ్ఞాని జైల్‌సింగ్ కొన్ని బిల్లులను వెనక్కి తిప్పి పంపారు.అందులో తపాలా బిల్లు ఒకటి. వాస్తవానికి కేంద్ర మంత్రి మండలి సిఫారసు చేసిన ఏ అంశాన్నయినా రాష్ట్రపతి ఆమోదించవలసి ఉంటుంది. ప్రణబ్‌కుమార్ ముఖర్జీ రాష్ట్రపతి పదవీకాలం పూర్తయిన తరువాత నాగపూర్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని కూడా సందర్శించారు! స్వాతంత్య్ర సమరయోధులు, ప్రపంచ ప్రఖ్యాత విద్యావంతులు, రాజకీయవేత్తలు, శాస్త్రవేత్తలు, దౌత్యవేత్తలు, న్యాయ నిపుణులు రాష్ట్రపతి పదవిని అలంకరించారు. జూలైలో పదవీ స్వీకారం చేసిన ద్రౌపది ముర్ము భారతదేశానికి 15వ రాష్ట్రపతి. 1950లో భారత్ గణతంత్ర దేశమైన తరువాత ఆ పదవిలోకి వచ్చిన 15 మందిలో ఎనిమిది మంది రాజకీయ పార్టీల నుంచి వచ్చిన వారే. వారిలో ఆరుగురు కాంగ్రెస్ మద్దతుతో గెలిచినవారు. పన్నెండు మంది ఐదేళ్లు పదవిలో ఉన్నారు. దేశంలో అధికార పార్టీ నుంచి రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసే సంప్రదాయమే ప్రధానంగా కనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ నుంచి ఇద్దరు రాష్ట్రపతులయ్యారు. వారే రామ్‌నాథ్ కోవింద్, ద్రౌపది ముర్ము. స్వతంత్ర భారత తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్. ఆయన అధ్యాపకుడు, న్యాయవాది. గాంధేయవాది. నెహ్రూతో సమంగా గాంధీజీతో కలసి స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారు. రాజ్యాంగ పరిషత్‌కు అధ్యక్షునిగా కూడా వ్యవహరించారు. రెండవసారి రాష్ట్రపతి పదవికి ఎన్నికైన ఏకైన రాజనీతిజ్ఞుడు రాజెన్ బాబు. ప్రథమ ప్రధాని వలెనే, తొలి రాష్ట్రపతి రాజేన్ బాబు కూడా పన్నెండేళ్ల నూట ఏడు రోజులు ఉన్నారు. ఇప్పటి వరకు అదే రికార్డు. హిందూ కోడ్ బిల్లు విషయంలో నెహ్రూతో విభేదించారు. సోవ్‌ునాథ్ ఆలయం ప్రతిష్టకు తాను హాజరు కావడంపై నెహ్రూ అభ్యంతరాలను త్రోసిపుచ్చారు. రెండవ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్.ఆయన తత్త్వశాస్త్ర వ్యాఖ్యాత. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా పనిచేశారు. యునెస్కోకు అధ్యక్షులుగా కూడా వ్యవహరించారు. మూడవ రాష్ట్రపతి డాక్టర్ జకీర్ హుస్సేన్. ఆయన రాష్ట్రపతి పదవి చేపట్టిన తొలి ముస్లిం. అలీగఢ్ విశ్వవిద్యాలయం చాన్సలర్‌గా పనిచేశారు. ఆయన పదవిలో ఉండగానే కన్నుమూశారు. నాల్గవ రాష్ట్రపతి వరాహగిరి వెంకటగిరి. కార్మికోద్యమం నుంచి వచ్చారు. ఈయన ఎన్నిక వివాదాస్పదమైన మాట నిజమే. కాంగ్రెస్ పార్టీ నీలం సంజీవరెడ్డిని అభ్యర్థిగా నిర్ణయించింది. ఆ నిర్ణయాన్ని నాటి ప్రధాని ఇందిర కూడా పార్టీ సమావేశంలో ఆమోదించారు. కానీ తరువాత వీవీ గిరిని అభ్యర్థిగా నిలిపారు. పార్టీ అభ్యర్థి నీలం ఓడిపోయారు. గిరి విజయం సాధించారు. ఐదవ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. జకీర్ హుస్సేన్ మాదిరిగానే ఈయన కూడా పదవిలో ఉండగానే చనిపోయారు. స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత వివాదాస్పద అంశం అత్యవసర పరిస్థితి విధింపు. ఆ ఆదేశాల మీద మారు మాట లేకుండా అర్ధరాత్రి సంతకం చేసి పంపిన రాష్ట్రపతిగా ఈయన గుర్తుండిపోయారు. ఆరో రాష్ట్రపతి డాక్టర్ నీలం సంజీవరెడ్డి. దేశ చరిత్రలో ఏకగీవ్రంగా ఎన్నికైన రాష్ట్రపతి. తెలుగువారు. స్వాతంత్య్ర సమరయోధుడు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి. లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు. 1969 నాటి రాష్ట్రపతి ఎన్నిక తరువాత దాదాపు అజ్ఞాతం లోకి వెళ్లిన నీలం సంజీవరెడ్డి జనతా పార్టీలో చేరి ఆంధ్రప్రదేశ్ నుంచి గెలుపొందారు. 42 లోక్‌సభ స్థానాలకు గాను, 41 కాంగ్రెస్ గెలుచుకుంది. నంద్యాల స్థానం మాత్రం జనతా పార్టీ గెలిచింది. ఆ గెలుపు నీలం సంజీవరెడ్డిది. ఏడవ రాష్ట్రపతి జ్ఞాని జైల్‌సింగ్. సిక్కు వర్గం నుంచి ఎన్నికైన తొలి రాష్ట్రపతి. స్వర్ణాలయం మీద ఆపరేషన్ బ్లూస్టార్ సైనిక చర్య, ఇందిరా గాంధీ హత్య, వెంటనే దేశవ్యాప్తంగా సిక్కుల మీద హత్యాకాండ ఆయన రాష్ట్రపతిగా ఉండగానే జరిగాయి. ఎనిమిదో రాష్ట్రపతి ఆర్.వెంకటరామన్. ఈయన కూడా స్వాతంత్య్ర పోరాట యోధుల తరానికి చెందినవారే. తామ్రపత్ర గ్రహీత కూడా. కె. కామరాజ్ నాడార్ మీద ఆయన రాసిన పుస్తకానికి గాను సోవియెట్ రష్యా సోవియెట్ ల్యాండ్ పురస్కారం ఇచ్చింది. తొమ్మిదో రాష్ట్రపతి డాక్టర్ శంకర్‌దయాళ్ శర్మ. గొప్ప న్యాయ నిపుణుడు. న్యాయ వ్యవస్థకు ఆయన చేసిన సేవలకు ఇంటర్నేషనల్ బార్ అసోసియేషన్ ‘లివింగ్ లెజెండ్ ఆఫ్ లా అవార్డ్ ఆఫ్ రికగ్నిషన్’ బహూకరించింది. పదవ రాష్ట్రపతి కేఆర్ నారాయణన్. దళిత వర్గం నుంచి తొలిసారిగా ఆ పదవిని అధిరోహించిన వారు. రాష్ట్రపతి అయిన తొలి మలయాళి. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ సంస్థలో విద్యాభ్యాసం చేశారు. 1980–1984 మధ్య అమెరికాలో భారత రాయబారిగా పనిచేశారు. పదకొండవ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్‌కలాం. రాజకీయాలలో సంబంధం లేని వ్యక్తి. రోహిణి ఉపగ్రహాలు, అగ్ని, పృథ్వి క్షిపణులు ఆయన పర్యవేక్షణలోనే విజయవంతంగా ప్రయోగించారు. మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఖ్యాతి గడించారు. అలాగే పోటీ చేసిన గెలిచిన రాష్ట్రపతులందరి కంటే ఎక్కువ ఓట్లు సాధించినవారు కలాం. అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో 1998లో జరిపిన రెండో పోఖ్రాన్ అణు పరీక్షలో కలాం కీలకపాత్ర వహించారు. పన్నెండవ రాష్ట్రపతి ప్రతిభాసింగ్ పాటిల్. ఆ పదవిని అలంకరించిన తొలి మహిళ. సుఖోయి విమానంలో ప్రయాణించిన తొలి రాష్ట్రపతి. పదమూడవ రాష్ట్రపతి డాక్టర్ ప్రణబ్‌కుమార్ ముఖర్జీ. పద్నాల్గవ రాష్ట్రపతి రావ్‌ునాథ్ కోవింద్. పదిహేనవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆ పదవిని అలంకరించిన తొలి ఆదివాసీ మహిళ. వీవీ గిరి (1969), హిదయ్‌తుల్లా (1969), బసప్ప దాసప్ప జెట్టి (1977) తాత్కాలిక అధ్యక్షులుగా పనిచేశారు. అప్పుడు వీరు ఉపరాష్ట్రపతులుగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. – డా. గోపరాజు నారాయణరావు ఎడిటర్, ‘జాగృతి’ -
జెండా ఊంఛా రహే హమారా!
జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య. ఆయన విజయవాడ సమీపంలోని పెదకళ్ళేపల్లిలో మాతామహుల ఇంట జన్మించి, భట్లపెనుమర్రులో పెరిగారు. జైహింద్ నినాద సృష్టికర్త అబిద్ హాసన్. హైదరాబాద్ వాసి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా జాతీయ జెండాల రెపరెపలు, జైహింద్ నినాదాల హోరు దేశమంతటా అలుముకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజా హృదయాలు గర్వంతో ఉప్పొంగుతున్నాయి. ఆజాద్ భారత్‌కు ఇది 75వ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు బాగానే పనిచేసింది. ‘హర్ ఘర్ తిరంగా’ నినాదాన్ని జనం ఆదరిస్తున్నారు. ఇళ్ళ మీదనే కాదు, వీధుల్లో సైతం జెండా ప్రదర్శనలు జరుగుతున్నాయి. లక్షలాదిమంది ప్రజలు మొబైల్ ఫోన్లలో వారి ప్రొఫైల్ పిక్‌గా జాతీయ జెండాను పెట్టుకున్నారు. జెండా ఉత్సవాల ఫోటోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఆక్రమించాయి. కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో తిరుగుతున్న ఒక ఫోటో కొంత ప్రత్యేకంగా కనిపించింది. ఒక ఛాయాచిత్రం అనేక విషయాలను చెప్పగలదనేది నానుడి (Photo speaks volumes). ఈ ఫోటో చాలా ప్రశ్నల్ని కూడా సంధిస్తున్నది. దాని బ్యాక్‌గ్రౌండ్‌ను పరిశీలిస్తే ఏజెన్సీ ప్రాంతంగా తోస్తున్నది. ఒక సన్నటి వెదురు కర్రకు ఒక జాతీయ జెండాను తొడిగారు. కర్రను మట్టిలో పాతి, దాని చుట్టూ ముగ్గు వేశారు. మందార పూలు పెట్టారు. చుట్టూ ఓ పదిమంది పిల్లలు నిలబడి జెండా వందనం చేస్తున్నారు. వారి వయసు నాలుగు నుంచి ఎనిమిదేళ్ల వరకుండవచ్చు. వాళ్ల నిక్కర్లు జీర్ణావస్థలో ఉన్నాయి. పైన చొక్కా ల్లేవు. అందరికంటే చిన్నవాడికి నిక్కర్ కూడా లేదు. జెండా ఎగరేసే తాడు వాని చేతిలోనే ఉన్నది. కనుక వాడే చీఫ్గెస్టయి వుంటాడు. అందరిలో పేదరికం తాండవిస్తున్నది. జెండాను తలకిందులుగా ఎగరేయడం వంటి తప్పులు వాళ్లు చేయలేదు. ఫ్లాగ్ కోడ్ పాటించారు. వారి సెల్యూల్లో ఏ వంకా లేదు. ఆ జెండా తమలాంటి వాళ్ల జీవితాల్ని మార్చివేస్తానన్న హామీని 75 ఏళ్ల కిందనే ఇచ్చిందన్న విషయం ఆ పిల్లలకు తెలియకపోవచ్చు. జెండా అంటే దేవుడితో సమానమని మాత్రమే తెలుసు. పూజించాలని మాత్రమే తెలుసు. ఈ ఫోటో మరోసారి కొన్ని మౌలికమైన ప్రశ్నల్ని మనముందు తెచ్చింది. అసలు స్వతంత్రం అంటే ఏమిటి? కేవలం మాట్లాడే స్వేచ్ఛ మాత్రమేనా? ఆర్థిక స్వాతంత్య్రం, రాజకీయ స్వాతంత్య్రాల మాటేమిటి? సామాజిక న్యాయం సంగతేమిటి? రాజ్యాంగం పూచీపడినట్టు అందరికీ ఆలోచనా, భావ ప్రకటనా, నమ్మకం, విశ్వాసం, ఆరాధనా స్వేచ్ఛ సమకూరిందా? హోదాల్లో అవకాశాల్లో సమానత్వం సిద్ధించిందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు మనందరికీ తెలుసు. స్వతంత్రం వచ్చిన నాటి రోజులతో పోలిస్తే దారిద్య్రం అంత తీవ్రంగా లేకపోవచ్చు. ఇప్పుడు ఆకలి చావుల మాటలు వినిపించకపోవచ్చు. అక్షరాస్యత పెరిగి ఉండవచ్చు. జీవన ప్రమాణాలు, ఆయుర్దాయం పెరిగి ఉండవచ్చు. కానీ అసమానతలు కూడా పెరిగాయి. పేదలు – ధనికుల మధ్య పెరుగుతున్న అంతరాల్లో ప్రపంచంలోనే ఇండియా నెంబర్ 1 స్థానంలో ఉన్నది. సీఐఏ వరల్డ్ ఫ్యాక్ట్ బుక్ లెక్క ప్రకారం దేశ సంపదలో 58% కేవలం ఒక్కశాతం కుబేరుల చేతిలోనే ఉన్నది. పది శాతం శ్రీమంతుల చేతిలో 80 శాతం జాతి సంపద పోగుపడింది. స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటీష్ ఇండియాలో పది శాతం సంపన్నుల చేతిలో 54 శాతం సంపద ఉండేది. ఆ అంతరం ఇప్పుడు మరింత పెరిగింది. పేదలు, నిరుపేదలు, దిగువ, ఎగువ మధ్యతరగతులందరి ఉమ్మడి సంపద ప్రస్తుతం 14 శాతమే. ఆర్థిక అసమానతలు తొలగించలేక మరింత పెంచుకోవడం ఒక విషాదం. సామాజిక అసమానతలను కూడా పూర్తిగా రూపుమాపలేకపోయాము. సోషల్లీ రాడికల్ స్వభావం కలిగిన రాజ్యాంగంగా భారత రాజ్యాంగాన్ని కొందరు పరిగణిస్తారు. అయినప్పటికీ సామాజిక అసమానతలు 75 ఏళ్ల తరువాత కూడా కొనసాగుతున్నాయి. ‘ఎస్.సీ. కులాల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా’ అని బాహాటంగా మీడియా గోష్ఠి లోనే కామెంట్ చేయగలిగిన ఒక కులదురహంకారి పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా, పదమూడేళ్లు ప్రతిపక్ష నేతగా చలామణి కాగలగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టే విషయం. మెదళ్లకు బూజు పట్టించిన ఛాందస భావాలు ఇంకా సమాజాన్ని వెన్నాడుతూనే ఉన్నాయి. దళితులు వండిపెట్టిన మధ్యాహ్న భోజనాన్ని తమ పిల్లలు తినబోరంటూ బహిష్కరిస్తున్న ఘటనలు ఇంకా జరగడాన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలి? కూతురు తక్కువ కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే అల్లుడిని కరకు కత్తులకు బలి ఇస్తున్నారు. పైగా దానికి ‘పరువు హత్య’ అనే ముద్దుపేరు పెట్టుకుంటున్నారు. వెనుకబడిన వర్గాలుగా పరిగణించే చేతివృత్తుల వారి వృత్తి వ్యాపారాల్లోకి క్రమంగా సంపన్నులు ప్రవేశించారు. చెప్పుల వ్యాపారం, బట్టల వ్యాపారం, పాల వ్యాపారం, లిక్కర్ బిజినెస్, కుండలు, బుట్టలు, ఫర్నిచర్, బంగారం వగైరాలన్నీ వెనుకబడిన వర్గాల నుంచి ఎప్పుడో చేజారిపోయాయి. వీధిన పడిన ఇటువంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కొంత రిజర్వేషన్ కోటాను అమలుచేయ ప్రయత్నించినప్పుడు ఎంత విధ్వంసం జరిగిందో తెలిసిందే. మనదేశంలో పొట్టకూటి కోసం రెక్కలమ్ముకుంటున్న వారి సంఖ్య 90 కోట్లు. ఇందులో కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్న వారి సంఖ్య కేవలం రెండు కోట్లు మాత్రమే. ప్రైవేట్ సెక్టార్‌లోని వైట్‌కాలర్ ఉద్యోగాల్లో ఈనాటికీ ఎటువంటి రిజర్వేషన్ లేదన్న విషయాన్ని గమనంలో ఉంచుకోవాలి. ప్రజలందరికీ సమానావకాశాలు కల్పించి వారిని ఎంపవర్ చేయకుండా నిజమైన అభివృద్ధి సాధ్యం కాదనే అభిప్రాయంతో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ ప్రభుత్వం కొన్ని విప్లవాత్మక కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఆ రాష్ట్రంలోని కుల దురహంకార విషసర్పం వేయి పడగల్ని విప్పి రోజూ వేయిటన్నుల విషాన్ని విరజిమ్ముతున్న భయానక పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఉపముఖ్యమంత్రి పదవులిస్తే గిట్టదు. మహిళలకు కీలక శాఖల్ని కేటాయిస్తే నచ్చదు. వారికి నామినేటెడ్ పదవులిస్తే కోపం. నామినేటెడ్ పనులు అప్పగిస్తే కోపం. 30 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలిస్తే పట్టరాని ఆగ్రహం. రాజధాని ప్రాంతంలో నిరుపేదలకు ఇళ్ల పట్టాలిస్తామంటే తనువంతా కంపరం. పారదర్శకంగా ప్రజలకు నగదు బదిలీ చేస్తే పాపం. ప్రజలందరికీ ఉచితంగా నాణ్యమైన విద్యనందించడం సహించరాని నేరం. ప్రజా వైద్యానికి పెద్దపీట వేస్తూ ఇంటింటికీ డాక్టర్‌ను పంపిస్తాననడం అపచారం. స్వపరిపాలనను గ్రామస్థాయికి వికేంద్రీకరించడం మహా పాపం. అవ్వాతాతల పెన్షన్ డబ్బులు ఠంచన్‌గా తలుపు తట్టడం అపరాధం... వేయి పడగల విషసర్పం దృష్టిలో ఇవన్నీ జగన్ ప్రభుత్వ నేరాలు. ఇటువంటి పడగల్ని కత్తిరించకుండా నిజమైన స్వాతంత్య్రం సాధ్యం కాదనే విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజల అనుభవంలోకి వచ్చింది. ఈ 75 సంవత్సరాల కాలంలో దేశం సాధించిన ఆర్థిక అభివృద్ధి తక్కువేమీ కాదు. పంపిణీలో అసమానతలుండడమే అసలు సమస్య. ప్రధానమంత్రి పెట్టుకున్న లక్ష్యం ప్రకారం వచ్చే రెండు మూడేళ్లలో దేశ సంపద ఐదు ట్రిలియన్ డాలర్లకు చేరుకోవాలి. ఇంకో పది పన్నెండేళ్లలో పది ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాకారం కాబోతున్నదని ప్రసిద్ధ ఆర్థికవేత్తలు జోస్యం చెబుతున్నారు. ఇందుకు దోహదపడే కారణంగా మన మానవ వనరుల సంపదను వారు చూపెడుతున్నారు. ఈ వనరులకు నాణ్యమైన విద్యనిచ్చి నైపుణ్యాన్ని జతచేయడమే మనం చేయవలసిన పని. ఇప్పుడున్న ప్రభుత్వాలు ఆ బాధ్యతను నెరవేర్చగలిగితే రాబోయే తరం యువకులు ఈ దేశాన్ని మరో రెండు దశాబ్దాల్లోగా అగ్రరాజ్యంగా నిలబెట్టగలుగుతారు. ఈ లక్ష్యసాధన కోసం మానవ వనరుల్ని సాధికారం చేయడానికి ప్రగతి శీల ప్రభుత్వాలు పెడుతున్న ఖర్చును కొందరు ప్రబుద్ధులు తప్పుపడుతున్నారు. ‘ఉచితాలు అనుచితం’ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి ప్రచారం చేస్తున్న వారి జేబుల్లోనే సుజనా చౌదరి వంటి బ్యాంకు కేటుగాళ్లుండటం ఒక విచిత్రం. ఇటువంటి కేటుగాళ్లు ఎగవేసిన లక్షలకోట్ల రూపాయలను మాఫీ చేస్తున్న కేంద్రం ప్రజలను ఎంపవర్ చేసే పథకాలకు మోకాలడ్డాలనుకోవడం ఒక వైరుద్ధ్యం. ఇటువంటి వంకర విధానాలను సరిదిద్దుకోకుండా భారతదేశం తన ముందున్న సవాళ్లను ఎదుర్కోవడం సాధ్యంకాదు. కట్టుబట్టలు కూడా లేకున్నా సరే, దేశభక్తిలో ఎవరికీ తీసిపోమని నిరూపిస్తున్న మన ఏకలవ్య బాలల్ని మరవద్దు. వారికి చేయూతనిచ్చి ప్రధాన స్రవంతిలో నిలబెడితే మన ప్రగతి రథం పరుగులు తీస్తుంది. అట్లా కాకుండా మళ్లీ బొటనవేళ్లు నరకడానికే పూనుకుంటే ఇంకో వందేళ్లయినా ఈ దేశం అగ్రదేశం కాబోదు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
శతమానం భారతి: డెబ్బై ఐదు
75 వ స్వాతంత్య్ర వార్షికోత్సవానికి 75 అనే సంఖ్యను కేంద్ర ప్రభుత్వం అర్థవంతమైన సంకేతంగా మలుచుకుంది. నగరాల అభివృద్ధి లక్ష్యంగా 2001 అక్టోబర్ 5న ఉత్తర ప్రదేశ్‌లో 75 పథకాలకు శంకుస్థాపన చేసింది. ఉత్తర ప్రదేశ్‌లోని 75 జిల్లాల్లో 75 వేల మంది లబ్దిదారులకు పక్కా ఇళ్లు నిర్మించి, ఇళ్ల తాళాలు వారి చేతికి అందించింది. ఆ రాష్ట్రంలోనే బ్యాటరీతో నడిచే 75 విద్యుత్ బస్సులను ప్రారంభించింది. ఇక దేశంలో 18 ఏళ్లు పైబడిన, 60 ఏళ్ల లోపు వారికి ప్రభుత్వ ఆసుపత్రులలో 75 రోజుల పాటు కోవిడ్–19 ముందు జాగ్రత్త టీకా ఉచితంగా వేయిస్తోంది. 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవాల నేపథ్యంలోనే దేశ విభజన నాటి భయానక ఘటనల సంస్మరణ దినం నిర్వహించాలని నిర్ణయించింది. నాటి విషాదాలకు ప్రతి భారతీయుడి తరఫునా నివాళిగా ఈ నిర్ణయం తీసుకుంది. 75 వారాల అమృత మహోత్సవాలలో దేశం నలుమూలల్నీ కలిపేలా 75 వారాల్లో 75 వందే భారత్ రైళ్లు నడపడంపై ప్రకటన విడుదల చేసింది. అమృత వేడుకల్లో స్వాతంత్య్ర యోధులపై పుస్తకం రాసేందుకు 75 మంది యువ రచయితల్ని ఎంపిక చేసింది. అమృత మహోత్సవాలలో సగటున గంటలకు 4 కార్యక్రమాల వంతున ప్రభుత్వం నిర్వహిం చింది. ఐదు ఇతి వృత్తాల ద్వారా అమృత వేడుకలు ముందుకు సాగేందుకు ప్రణాళిక రూపొందించింది. వేడుక లేని సంకల్పం, కృషి ఎంత గొప్పదైనా నిష్ఫలమే అనే భారతీయ సంస్కృతిని అనునసరించి ప్రభుత్వం ఈ వేడుకల్ని ఘనంగా నిర్వహించి, దిగ్విజయంగా 76 వ స్వాతంత్య్ర దినోత్సవానికి చేరువ అయింది. (చదవండి: చైతన్య భారతి: ఈశాన్య భారత పోరాట వీరుడు టోగన్ సంగ్మా) -
సామ్రాజ్య భారతి: 1942,1943/1947 ఘట్టాలు
ఘట్టాలు: క్విట్ ఇండియా తీర్మానం. బొంబాయిలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ నిర్ణయం. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న కొత్త జంట ఇందిరాగాంధీ, ఫిరోజ్ గాంధీ అరెస్ట్. బెంగాల్ దుర్భిక్షం, పోర్ట్ ఆఫ్ కలకత్తాపై జపాన్ దాడి చట్టాలు కాఫీ మార్కెట్ ఎక్స్పాన్షన్ యాక్ట్ రెసిప్రొసిటీ యాక్ట్, వార్ ఇంజ్యురీస్ (కాంపెన్సేషన్ ఇన్సూరెన్స్) యాక్ట్ జననాలు: అమితాబ్ బచన్ : బాలీవుడ్ నటుడు (అలహాబాద్); ఆశా పరేఖ్ : బాలీవుడ్ నటి (బొంబాయి); అమరీందర్ సింగ్ : రాజకీయనేత (పాటియాలా); రాజేశ్ ఖన్నా : బాలీవుడ్ నటుడు (అమృత్సర్); జతేంద్ర : బాలీవుడ్ నటుడు (అమృత్సర్); కె.రాఘవేంద్రరావు : సినీ దర్శకులు (మద్రాస్ ప్రెసిడెన్సీ); జైపాల్‌రెడ్డి : రాజకీయ నేత (తెలంగాణ); సురవరం సుధాకరరెడ్డి : కమ్యూనిస్టు నేత (మహబూబ్ నగర్); సాక్షి రంగారావు : క్యారెక్టర్ యాక్టర్ (కలవకూరు); సారథి : హాస్య నటుడు (పెనుకొండ). మాధవన్ నాయర్ : ఇస్రో సైంటిస్ట్ (తమిళనాడు); ఇళయరాజా : సంగీత దర్శకులు (పన్నైపురం); కృష్ణ : స్టార్ యాక్టర్ (బుర్రిపాలెం); మనోరమ : రంగస్థల, సినీ నటి (మన్నార్గుడి); టి.సుబ్బరామిరెడ్డి : రాజకీయనేత (నెల్లూరు). (చదవండి: సామ్రాజ్య భారతి 1940,1941/1947) -
స్వతంత్ర భారతి: తీరిన తల్లి ఘోష
దేశం యావత్తునూ నిర్ఘాంతపరచిన ఢిల్లీ సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులైన ముఖేష్ (26), అక్షయ్‌ఠాకూర్ (28), పవన్ గుప్తా (19), వినయ్‌శర్మ (20) లను ఢిల్లీలోని తీహార్ జైల్లో 2020 మార్చి 20న ఉరి తీశారు. 2012 డిసెంబర్ 16 న దేశ రాజధాని ఢిల్లీలో ఒక వైద్య విద్యార్థినిని కదులుతున్న బస్సులో ఆరుగురు కర్కశంగా, దారుణంగా ఇనుప కడ్డీతో కొట్టి అత్యాచారం చేశారు. ఆ సంఘటనలో తల, పేగులకు తగిలిన గాయాలతో 13 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు 2012 డిసెంబరు 29 న ఆమె తుదిశ్వాస విడిచారు. ఏడేళ్ల పాటు జరిగిన ఈ కేసు విచారణ కాలంలో ఆరుగురు నిందితులలో ఒకరు చనిపోగా, మరొకరు మైనరు కావడంతో అతడికి ఉరి నుంచి మినహాయింపు లభించింది. ‘2012 ఢిల్లీ సామూహిక అత్యాచార ఉదంతం’గా వార్తల్లో ఉన్న ఆ ఘటనలో దేశం మొత్తం ఆ యువతి కుటుంబం తరఫున నిలబడింది. యువతి తల్లిదండ్రులు.. ముఖ్యంగా తల్లి ఆషాదేవి చేసిన న్యాయపోరాటం ఫలించి చివరికి దోషులకు ఉరి అమలయింది. ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు ఇండియాలోకి కోవిడ్–19 వ్యాప్తి. తొలి కేసు జనవరి 20న కేరళలో నిర్థారణ. టిక్‌టాక్ సహా 59 చైనా యాప్‌లను నిషేధించిన భారత్. ఆ తర్వాత పబ్జీ సహా మరో 118 చైనా యాప్‌ల నిషేధం. నేషనల్ ఎడ్యుకేషన పాలసీ–2020 కి కేంద్ర క్యాబినెట్ ఆమోదం. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం, ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్, చేతన్ చౌహాన్, ప్రణబ్ ముఖర్జీ, జయప్రకాశ్ రెడ్డి, రామ్‌విలాస్ పాశ్వాన్.. కన్నుమూత. (చదవండి: సమర కవి: సుబ్రహ్మణ్య భారతి/ 1882-1921) -
మహోజ్వల భారతి: భారత విప్లవోద్యమ మాత
భారతదేశంలో రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటానని లిఖిత పూర్వకంగా హామీ ఇస్తేనే అనుమతిస్తామని ఆంగ్లేయుల నుంచి సమాచారం అందింది. అందుకు మేడమ్ కామా నిరాకరించి లండన్, పారిస్ నగరాలలోనే ఉండిపోయారు. పరాయి పాలనలోని దైన్యం భారతీయుల గుండెను తడుతున్న కాలమది. అలాంటి సమయంలో మేడమ్ కామా జన్మించారు. తండ్రి సొరాబ్జీ ఫ్రాంజీ పటేల్. బొంబాయిలోనే కోటీశ్వరులనదగ్గ పార్శీల కుటుంబం వారిది. నాటి చాలామంది పార్శీల మాదిరిగానే కామా కూడా ఇంగ్లిష్ విద్యను అభ్యసించారు. పలు భాషలలో ప్రావీణ్యం సంపాదించారు. చిన్నతనం నుంచి ఆమెలో ఒక తిరుగుబాటు తత్వం ప్రస్ఫుటంగా ఉండేది. ఆమె జాతీయ వాదం ఎంత గాఢమైనదంటే అందుకోసం ఆమె వైవాహిక జీవితాన్ని త్యాగం చేశారు. 1885లో ఆమె రుస్తోంజీ కేఆర్ కామాను వివాహం చేసుకున్నారు. రుస్తోంజీ కామా పూర్తిగా ఆంగ్లేయ పక్షపాతి. భారత దేశానికి ఆంగ్లేయులు చేసిన మేలు అసాధారణమైనదని రుస్తోంజీ వాదన. భికాజీ కామా ఇందుకు పూర్తి విరుద్ధం. అణచివేత, దోపిడీ ఆంగ్ల జాతి మౌలిక లక్షణమని ఆమె ప్రగాఢ విశ్వాసం. ఫలితంగా ఆ దంపతులు విడిపోయారు. అప్పటికే భికాజీ కామా సమాజ సేవకురాలిగా మారిపోయారు. కానీ తన పేరులో నుంచి భర్త పేరును ఆమె తొలగించలేదు. 1890లో దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో బ్యుబోనిక్ ప్లేగు వ్యాధి ప్రబలింది. అదొక భయంకరమైన అంటువ్యాధి. ఆ వ్యాధి ఆమెకు కూడా సోకింది. కానీ అతికష్టం మీద బతికారు. అప్పుడే పూర్తిగా కోలుకోవడానికి యూరప్ వెళ్లవలసిందని వైద్యులు సూచించారు. అలా ఆమె 1902లో ఇంగ్లండ్ చేరుకున్నారు. అనుకున్నట్టే అక్కడ భికాజీ కామా కోలుకున్నారు. ఆమె అక్కడ కాలు పెట్టే సమయానికి బ్రిటిష్ వ్యతిరేక తీవ్ర జాతీయవాదులకు లండన్ కేంద్రంగా ఉంది. లాలా హరదయాళ్, శ్యాంజీ కృష్ణ వర్మ, వినాయక్ దామోదర్ సావర్కర్ అక్కడే పనిచేసేవారు. వారితో ఆమెకు పరిచయం కలిగింది. తరువాత ఆమె స్వదేశానికి రావాలని ప్రయత్నించారు. భారతదేశంలో రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటానని లిఖిత పూర్వకంగా హామీ ఇస్తేనే అనుమతిస్తామని ఆంగ్లేయుల నుంచి సమాచారం అందింది. అందుకు ఆమె నిరాకరించి లండన్, పారిస్ నగరాలలోనే ఉండిపోయారు. ఇంగ్లిష్ పాలనలో భారతీయులు పడుతున్న ఇక్కట్లు, దేశంలో నశించిన హక్కులు వంటి వాటి గురించి భికాజీ కామా ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ ప్రచారం చేశారు. సింగ్ రేవాభాయ్ రాణా, మంచేర్షా బుర్జోర్జీ గోద్రెజ్, మేడమ్ కామా కలసి పారిస్ ఇండియన్ సొసైటీ స్థాపించారు. వందేమాతరం’, ‘తల్వార్’ అనే పత్రికలను నడిపారు. ఏది చేసినా దేశ స్వాతంత్య్రమే ఆమె లక్ష్యం. ఇవన్నీ ఒక ఎత్తయితే, భారత జాతికి తొలిసారిగా ఒక ఐక్య పతాకాన్ని తయారు చేసిన ఘనత మేడమ్ కామాకే దక్కుతుంది. ఆ పతాకాన్ని ఆమె 1907 ఆగస్టు 22 న జర్మనీలోని స్టట్‌గార్ట్‌లో ఎగురవేశారు. అనంతర కాలంలో.. నిరంతర ఉద్యమంతో భికాజీ ఆరోగ్యం దెబ్బ తింది. 1935లో ఆమెకు పక్షవాతం వచ్చింది. ఒకసారి గుండెపోటు వచ్చిది. అప్పుడు మళ్లీ భారతదేశం వెళ్లిపోవాలన్న కోరికను వ్యక్తం చేశారామె. ఇక ఆమెతో ఎలాంటి ప్రమాదం ఉండబోదన్న నమ్మకంతో ఆంగ్ల ప్రభుత్వం అనుమతించింది. స్వదేశానికి చేరుకున్న తొమ్మిది మాసాలకే ఆ విప్లవ మహిళ తుది శ్వాస విడిచారు. కొందరు పేర్కొన్నట్టు ఆమె ‘భారత విప్లవోద్యమ మాత’. నేడు కామా వర్ధంతి. 74 ఏళ్ల వయసులో 1936 ఆగస్టు 13న ఆమె కన్ను మూశారు. (చదవండి: జైహింద్ స్పెషల్: మీ డబ్బొద్దు.. మీరు కావాలి) -
ఉద్యమానికి అక్షర చుక్కాని
సమాజంలో పత్రికలది ప్రధాన పాత్ర. ఒక్క పత్రిక చాలు వెయ్యిమంది సైన్యంతో సమానం అని పెద్దలు పేర్కొంటారు. పత్రికలు సమాజాన్ని ఎంత గొప్పగా ప్రభావితం చేస్తాయో స్వాతంత్య్ర ఉద్యమాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది. ఎందరో దేశభక్తులు తమ చదువు, విజ్ఞానం కలబోసి ఉన్నంతలో పత్రికలను వెలువరించారు. సమాజం పట్ల తమ ధోరణి, నిరసనను తీవ్ర స్థాయిలో వ్యక్తం చేశారు. భరతమాతను బానిస సంకెళ్ల నుంచి విడిపించడానికి జరిగిన పోరాటంలో జిల్లా పత్రికలు కీలకపాత్ర పోషించాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా జిల్లాలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన పత్రికలు, సంపాదకులు, నిర్వాహకుల గురించి సాక్షి ప్రత్యేక కథనం.. కడప కల్చరల్: 1835లో బళ్లారి నుంచి వెలువడిన సత్యదూతను తొలి తెలుగు పత్రికగా చెప్పాల్సి వస్తుంది. తెలుగు జర్నలిజానికి మాతృభూమి రాయలసీమేనని పలువురు పేర్కొంటారు.మరికొందరు తొలి పత్రిక వృత్తాంతిని అని కూడా చెబుతారు. ఈ పత్రిక సంపాదకులు కడపజిల్లాకు చెందిన మండిగల వెంకటరామశాస్త్రి. వృత్తాంతిని పత్రికను ఆయన మద్రాసు నుంచి వెలువరించేవారు. అప్పట్లో దానికి ఫ్రముఖ దినపత్రికగా పేరుండేది. ఆంధ్రపత్రిక తొలి సంపాదకుడు గాడిచర్ల హరిసర్వోత్తమరావు స్వరాజ్య పత్రికలో రాసిన సంపాదకీయానికి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అలా స్వాతంత్య్ర పోరాటంలో తొలిసారిగా జైలుకు వెళ్లిన ఈ ప్రాంతం వ్యక్తిగా గాడిచర్ల పేరొందారు. ఎడిటర్ అన్న పదానికి సంపాదకుడని అనువాదం చేసింది కూడా ఆయనే అంటారు. భారత స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో పత్రికలు ఉద్యమానికి అండగా నిలిచి ప్రజల్లో జాతీయ భావాలను రగిలించాయి. ఎన్నో పత్రికలు ఎన్నెన్నో రకాల వ్యాసాలు, కథనాలతో తెలుగు నేలను ప్రభావితం చేశాయి. కడప నుంచి కూడా.. జిల్లా స్వాతంత్య్ర ఉద్యమకాలంలో ప్రధానంగా పత్రికా రంగ వికాస దశలో జిల్లాలో తొలి పత్రిక వెలువడినట్లు తెలుస్తోంది. 1897–98 ప్రాంతంలో ప్రభావతి పేరిట కడప నగరం నుంచి తొలి పత్రిక వెలువడింది. దీనిని టి.గోపాలనాయుడు కంపెనీ వారు తమ కల్యాణ కుమార్ విలాస్ ముద్రణాలయం నుంచి ప్రచురించారు. 1899లో ఆ సంస్థ నుంచి పూర్ణిమ అనే మరోమాస పత్రిక కూడా వెలువడింది 1910లో ఆంధ్ర చంద్రిక అనే వారపత్రిక ప్రొద్దుటూరు నుంచి బీఎన్ స్వామి సంపాదకత్వంలో వచ్చింది. ఇది రాజకీయ, సాంఘిక అంశాలకు ప్రాధాన్యత ఇచ్చింది. 1920లో కడప నుంచి క్రైస్తవ సమాజం పక్షాన గెయిల్స్ మెయిల్ అనే ఆంద్ల మాసపత్రిక వెలువడేది. ఇంకా.... 1924లో రాజంపేట నుంచి పద్మశాలీయ సంఘం పక్షాన పద్మశాలి అనే పత్రిక వెలువడింది. 1925లో అవధానం కృష్ణముని ఆధ్వర్యంలో బ్రహ్మనందిని పత్రికను ప్రొద్టుటూరు నుంచి వెలువరించారు. గాంధేయవాది ఏకే మునికి తోడుగా ప్రముఖ సాహితీవేత్త కైక శేషశాస్త్రి, దుర్బాక రాజశేఖర శతావధాని లాంటి కవులు ఈ పత్రికలో సాహిత్య ప్రచారానికి దోహదం చేశారు. 1926లో ప్రొద్దుటూరు నుంచి దాదాపు పదేళ్లపాటు భారత కథానిధి పేరిట మాసపత్రిక వెలువడింది. 1927లో కడప నుంచి గుళ్లపల్లి వెంకట పున్నయ్య సంపాదకత్వంలో ప్రజాశక్తి వారపత్రిక వచ్చింది. 1928లో పచ్చిమాంధ్ర అనే వారపత్రిక కడప నుంచి జీవీ పున్నయ్యశాస్త్రి సంపాదకత్వంలో వచ్చింది. 1929–31 మధ్యకాలంలో ఆర్య ప్రణాళిక పేరిట గడియారం చిదంబరయ్య సంపాదకత్వంలో జమ్మలమడుగు నుంచి పత్రిక వెలువడింది. 1929లో భక్త సంజీవిని పేరిట వావిలికొలను సుబ్బారావు సంపాదకత్వంలో ఒంటిమిట్ట నుంచి మాస పత్రిక వెలువడింది. 1940లో కడపజిల్లా ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు కందుల బాలనారాయణరెడ్డి ప్రధాన సంపాదకుడిగా వెల్లాల మైసూరయ్య సహాయకునిగా ప్రొద్దుటూరు నుంచి రేనాడు వారపత్రక వెలువడేది. ఉద్యమ స్ఫూర్తిని రగిలిస్తూ 1940లో మాజీ శాసనసభ్యులు వై.ఆదినారాయణరెడ్డి సంపాదకునిగా మాజీ ఎమ్మెల్యే శంభురెడ్డి ఉప సంపాదకునిగా కడప నుంచి ఆజాద్ హింద్ పత్రిక వెలువడింది. ఇది జిల్లాలో రాజకీయ చైతన్యానికి దోహదం చేసింది. 1945లో రహస్యం పత్రిక పి.కృష్ణారెడ్డి సంపాదకునిగా, వైసీవీ రెడ్డి ఉప సంపాదకునిగా వెలువడేది. ఇందులో సమాజంలోని అవినీతి, లంచగొండితనాన్ని బహిర్గతం చేసేవారు. 1946లో రెడ్డి పేరిట పక్షపత్రికను కడప నుంచి బి.సుబ్బారెడ్డి సంపాదకత్వంలో వెలువరించారు. ఇలా కడప జిల్లా నుంచి పలు దిన, వార, మాసపత్రికలు స్వాతంత్రోద్యమ పోరాటస్ఫూర్తిని రగిలిస్తూ తమ బాధ్యతను నిర్వర్తించాయి. -
75వ ఇండిపెండెన్స్ డే: జియో కొత్త రీచార్జ్ ప్లాన్
ముంబై: భారతదేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో కొత్త ప్లాన్‌నులాంచ్ చేసింది. తన కస్టమర్లకోసం రూ.750 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఇందులో రోజుకు 2జీబీ డేటా వినియోగదారులు వాడుకోవచ్చు. (YouTube: మరో బంపర్ ఫీచర్‌ను లాంచ్ చేయనున్న యూట్యూబ్) ఈ రీఛార్జ్ ప్యాక్ ఇతర ప్రయోజనాలను పరిశీలిస్తే ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాల్స్, ప్రతిరోజూ 100 SMSలు, Jio సూట్ యాప్‌లకు యాక్సెస్ లభిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 90 రోజులు.ఈ ప్లాన్ ఇప్పటికే జియో వెబ్సైట్లో అందుబాటులో ఉంది. ఆసక్తి గల కస్టమర్లు కొత్త ప్లాన్ MyJio యాప్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇటీవల జియో రూ. 2,999 విలువైన వార్షిక రీఛార్జ్ ప్లాన్తీసుకొచ్చినసంగతి తెలిసిందే. తాజాగా మరో స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్‌ను జియో వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. రూ. 750 ప్రీపెయిడ్ ప్లాన్ ఏనెట్వర్క్కైనా అన్లిమిటెడ్ కాలింగ్ రోజుకు 2 జీబీ డేటా ప్రతిరోజూ 100 SMSలు 90రోజుల వాలిడిటీ చదవండి: వీఎల్సీ మీడియా ప్లేయర్‌పై నిషేధం, వెబ్సైట్, డౌన్లోడ్ లింక్ బ్లాక్ -
చైతన్య భారతి: ఈశాన్య భారత పోరాట వీరుడు టోగన్ సంగ్మా
‘బ్రిటిషర్లు మా భూమిని పరిపాలించేందుకు మేము అనుమతించం! మమ్మల్ని వారి బానిసలుగా మార్చే కుట్రలను సహించం!’’ అంటూ తన ప్రజలనుద్దేశించి ఒక ఆదివాసీ వీరుడు ఆవేశంతో ప్రసంగిస్తున్నాడు. ఆయన మాటలకు తెగ మొత్తం మంత్రముగ్దులవుతోంది. తెల్లవాళ్లను తమ గడ్డ నుంచి తరిమికొట్టేందుకు ఎంతకైనా సిద్ధమని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేశారు. నాగరికత పేరిట మారణాయుధాలతో దాడికి వచ్చిన బ్రిటిష్ ముష్కరులను కేవలం తమ విల్లంబులతో ఒక ఆదివాసీ తెగ ఎదిరించడానికి ఆ నాయకుడు కలిగించిన ప్రేరణే కారణం! ఈశాన్య భారతంలో వలసపాలనకు వ్యతిరేకంగా శంఖం పూరించిన అతడు..పా టోగన్ సంగ్మా! ఈశాన్య భారతావనిలో నేటి మేఘాలయ ప్రాంతంలో గారోహిల్స్ ప్రాంతం కీలకమైనది. ఈ కొండలను నెలవుగా చేసుకొని పలు ఆదివాసీ తెగలు జీవనం కొనసాగిస్తుంటాయి. వీటిలో ముఖ్యమైనది అచిక్ తెగ. ఈ గిరి పుత్రులు సాహసానికి పెట్టింది పేరు. వీరి నాయకుడు పా టోగన్ సంగ్మా అలియాస్ పా టోగన్ నెంగ్మింజా సంగ్మా. తూర్పు గారోహిల్స్ లోని విలియం నగర్ సమీపంలోని సమందా గ్రామంలో ఆయన జన్మించారు. బైబిల్‌ల్లో పేర్కొనే గోలియత్‌తో ఆయన్ను ఆచిక్ తెగ ప్రజలు పోలుస్తుంటారు. 1872వ సంవత్సరంలో ఈశాన్య భారతాన్ని స్వాధీనం చేసుకునే క్రమంలో బ్రిటిషర్లు గారోహిల్స్‌పై కన్నేశారు. కొండల్లోని మట్చా రోంగెర్క్ గ్రామం వద్ద బ్రిటిష్ సేనలు విడిది చేశాయి. దేశభక్తుడైన సంగ్మాకు విదేశీయుల ఆక్రమణ నచ్చలేదు. దీంతో ఆయన బ్రిటిషర్లపై పోరాటానికి యువ సైన్యాన్ని కూడగట్టారు. మాతృభూమి రక్షణ కోసం యువత త్యాగాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారంలో భాగంగా గ్రామాల్లో పర్యటించి ప్రజలను చైతన్యవంతులను చేశారు. బలిదానం బ్రిటిష్ సేనలు విడిది చేసిన శిబిరంపై దాడి చేసి తరిమి కొట్టాలని సంగ్మా నిర్ణయించుకున్నారు. అయితే వారి వద్ద ఉండే ఆధునిక ఆయుధాల గురించి అమాయక ఆదివాసీలకు తెలియదు. కేవలం సాహసంతో, స్వాతంత్ర కాంక్షతో ఆచిక్ వీరులు సంగ్మా నేతృత్వంతో బ్రిటిషర్లపై దాడి చేశారు. సంగ్మా, ఆయన సహచరులు బ్రిటిష్ శిబిరానికి నిప్పంటించారు. ఇలాంటి దాడిని ఊహించని బ్రిటిష్ వారు నిత్తరపోయారు. అయితే ఆయుధాలు, ఆధునిక పోరాట పద్ధతులతో మెరుగైన బ్రిటిష్ సైన్యం ముందు ఆచిక్ వీరులు నిలవలేకపోయారు. దాడిలో సాహసంగా పోరాడిన సంగ్మా చివరకు అసువులు బాశారు. అరటి బోదెలతో ఏర్పాటు చేసిన డాళ్లను వాడితే బుల్లెట్ల నుంచి తప్పించుకోవచ్చని సంగ్మా భావించారు. అయితే బుల్లెట్ల దెబ్బకు అరటి షీల్డులు ఛిన్నాభిన్నమవడంతో అచికు వీరులకు మరణం తప్పలేదు. సంగ్మా, తదితర వీరులు మరణించినా ఈశాన్య భారత ప్రజల్లో దేశభక్తిని రగల్చడంలో సఫలమయ్యారు. తర్వాత కాలంలో ఈశాన్య భారత ప్రజలు స్వాతంత్ర పోరాటంలో పాల్గొనేలా చేయడంలో సంగ్మా వీర మరణం ఎంతగానో దోహదం చేసింది. ఇప్పటికీ అక్కడి ప్రజలు డిసెంబర్ 12 న సంగ్మా వర్ధంతిని ఘనంగా జరుపుకుంటారు. – దుర్గరాజు శాయి ప్రమోద్ -
సమర కవి: సుబ్రహ్మణ్య భారతి/ 1882-1921
అక్షరాన్నీ, అలజడినీ సమంగా ప్రేమించిన కవి సుబ్రహ్మణ్య భారతి. ఆయన పేరు చివర ఉన్న ‘భారతి’ ఇందుకు సాక్ష్యం పలుకుతుంది. ఆయన నిరంతరం స్వేచ్ఛ కోసం పరితపించేవారు. చదువుల కోసం వారణాసి వెళ్లారు. అదే ఆయన జీవితంలో పెద్ద మలుపు అయింది. భారతీయ ఆధ్యాత్మిక చింతన, జాతీయ భావాలు ఆ గంగాతీరంలోనే ఆయనను ముంచెత్తాయి, ఆలోచనలను మలిచాయి. ఆయన జీవితం మీదే కాదు, కవిత్వం మీద కూడా అవే ప్రతిబింబించాయి. బ్రిటిష్ వారి బెంగాల్ విభజనతో వేలాది మంది తొలిసారి స్వరాజ్య సమరంలోకి అడుగుపెట్టారు. వారణాసిలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు భారతి హాజరయ్యారు. మళ్లీ కలకత్తా సభలకు కూడా వెళ్లారు. 1907 నాటి సూరత్ కాంగ్రెస్ సమావేశాలను కూడా భారతి చూశారు. జాతీయ కాంగ్రెస్‌కే చెందిన తిరుమలాచారి 1906 లో ‘ఇండియా’ అనే తమిళ పత్రికను నెలకొల్పారు. ఆయనే ‘బాల భారతి’ పేరుతో ఆంగ్ల పత్రిక కూడా స్థాపించారు. ఈ రెండింటికీ సంపాదకునిగా సుబ్రహ్మణ్య భారతినే తిరుమలాచారి ఎంపిక చేశారు. ఎడిటర్‌గా ఆయన ఆయన రాసిన రాతలకు అరెస్టు వారంట్లు జారీ అవడంతో భారతి కొందరు మిత్రుల సలహాతో మద్రాసు విడిచిపెట్టి పుదుచ్చేరి వెళ్లిపోయారు. తిరిగి ఆయన పుదుచ్చేరి విడిచిపెట్టి మద్రాసు ప్రెసిడెన్సీలోని కడలూరుకు రాగానే పోలీసులు అరెస్టు చేశారు. నెల రోజుల పాటు తమ నిర్బంధంలోనే ఉంచారు. ఆ సమయంలో అనీబిసెంట్, సీపీ రామస్వామి అయ్యర్ జోక్యం చేసుకుని ఆయనను విడిపించారు. అప్పటి నుంచి రాజకీయ ఉద్యమానికి కొంచెం దూరంగా ఉన్నప్పటికీ సంఘ సంస్కరణోద్యమానికి ఆయన దగ్గరయ్యారు. ముఖ్యంగా మహిళల పరిస్థితి మీద ఆయన పోరాటం చేశారు. మహిళలను గౌరవించాలన్న ఆశయాన్ని ఆయన ఆచరణలో పెట్టడానికి ప్రధాన కారణం సిస్టర్ నివేదిత. ఆధునిక తమిళ సాహిత్యానికి ఆయన సేవలు నిరుపమానమైనవి. పుదుచ్చేరిలో ఉండగా లభించిన వెసులుబాటుతో భగవద్గీతకు, పతంజలి యోగ సూత్రాలకు ఆయన వ్యాఖ్యానాలు రాశారు. భారతి పేరును తమిళ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిపిన ‘కణ్ణన్ పట్టు’, కూయిల్ పట్టు’ కావ్యాలు కూడా పుదుచ్చేరిలో ఉండగానే రాశారు. 1921 సెప్టెంబర్ 12న తుదిశ్వాస విడిచేనాటికి సుబ్రహ్మణ్య భారతి వయసు 39 సంవత్సరాలు. అందులో పదేళ్లు అజ్ఞాతంలోనే గడిచాయి. కానీ ఆయన కవిత్వానికి ఒక వెలుగునిచ్చిన ఘనత భారతి సహధర్మ చారిణి చెల్లమ్మాళ్‌దే. తన సోదరుడు, మరొక దగ్గర బంధువు సాయంతో ఆమె మద్రాసులో ఒక ఆశ్రమం స్థాపించి, భారతి రచనలను సంకలనాలుగా వెలువరించారు. -
MS Dhoni: భారతీయుడినైనందుకు నా జన్మ ధన్యమైంది: ధోని
Independence Day 2022: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా భారతీయత ఉట్టిపడేలా త్రివర్ణాలతో కూడిన డీపీలు పెడుతున్నారు నెటిజన్లు. భారత 75 ఏళ్ల స్వాతంత్య్ర ఉత్సవాలను పురస్కరించుకుని సోషల్ మీడియా వేదికగా ఫొటోలు షేర్ పంచుకుంటూ త్రివర్ణ శోభితం చేస్తున్నారు. టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని కూడా ఈ జాబితాలో చేరాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో మువ్వన్నెల జెండాను తన డిస్ప్లే పిక్చర్‌గా పెట్టాడు. ఇందుకు ‘‘భారతీయుడినైనందుకు నా జన్మ ధన్యమైంది’’ అన్న అర్థం వచ్చేలా సంస్కృత, ఆంగ్ల, హిందీ భాషల్లో కోట్ జోడించాడు. ఇది చూసిన అభిమానులు ధోనిని ప్రశంసిస్తూ తాము కూడా ఇలాంటి డీపీనే పెడతామంటూ కామెంట్లు చేస్తున్నారు. అత్యుత్తమ కెప్టెన్! టీమిండియా అత్యుత్తమ కెప్టెన్లలో ధోనికి ప్రత్యేక స్థానం ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత్‌కు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన ఘనత అతడి సొంతం. ధోని సారథ్యంలోని భారత జట్టు 2007 టీ20 వరల్డ్‌కప్, 2011 వన్డే వరల్డ్‌కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. ఇక దేశభక్తిని చాటుకోవడంలో ధోని ఎల్లప్పుడూ ముందే ఉంటాడు. 2015 ప్రపంచకప్ సమయంలోనే ధోని సతీమణి సాక్షి తమ మొదటి సంతానం జీవాకు జన్మనిచ్చింది. ఆ సమయంలో బిడ్డను చూసేందుకు వెళ్తారా అన్న ప్రశ్నకు బదులుగా.. ‘‘నేను దేశం కోసం కర్తవ్యం నిర్వర్తించాల్సిన బాధ్యతాయుత స్థానంలో ఉన్నాను. నేషనల్ డ్యూటీ తర్వాతే మరేదైనా’’ అని ధోని సమాధానం ఇవ్వడం విశేషం. సైనికుడిగా భారత్ తరఫున 350 వన్డేలు, 98 టీ20లు, 90 టెస్టులు ఆడిన ధోని 17 వేల పరుగులు సాధించాడు. ఇక ఆగష్టు 15, 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అతడు ఐపీఎల్లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు సారథిగా కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే.. ధోని సేవలను గుర్తించిన కేంద్రం అతడికి టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదా కల్పించిన విషయం విదితమే. చదవండి: MS Dhoni: ఆ అవకాశమే లేదు! ఒకవేళ అదే ముఖ్యమైతే.. బీసీసీఐతో బంధాలన్నీ తెంచుకున్న తర్వాతే! The Great Khali: 'ది గ్రేట్ ఖలీ' కన్నీటి పర్యంతం.. అంతుచిక్కని ప్రశ్నలా! View this post on Instagram A post shared by M S Dhoni (@mahi7781) -
జైహింద్ స్పెషల్: మీ డబ్బొద్దు.. మీరు కావాలి
‘‘మీరు ప్రాక్టీస్ మానేసి కాంగ్రెస్‌లో చేరాలి’’.. గాంధీజీ అభ్యర్ధన! ‘‘నా సంపాదన యావత్తూ కాంగ్రెస్ ప్రచారం కోసం పూర్తిగా ఇచ్చేస్తాను.. నన్ను వదిలిపెట్టండి’’ .. చిత్తరంజన్‌దాస్ వేడికోలు..! సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రారంభించిన గాంధీజీ కలకత్తా వెళ్లినపుడు అక్కడి ప్రముఖ న్యాయవాది అయిన చిత్తరంజన్‌దాస్ ఇంట్లో బస చేశారు. కాంగ్రెస్‌లో చేరమంటూ ప్రతిరోజూ గాంధీజీ అడగటం, వదిలేయమంటూ దాస్ ప్రాధేయపడటం జరుగుతుండేది. న్యాయవాది అయిన చిత్తరంజన్ దాస్ సంపాదన నెలకు రూ.50 వేలుండేది. ఆరోజుల్లో థూమ్రాన్ కేసు జరుగు తోంది. అంటే మొదటి ప్రపంచ యుద్ధానికి సంబంధించిన కాంట్రాక్టు తగాదాల వ్యవహారం. చదవండి: విక్టోరియా స్మారక చిహ్నం పై డ్రోన్ల కలకలం... తమ తరపును వాదించటానికి ప్రభుత్వం చిత్తరంజన్‌దాస్‌ను రూ.3 లక్షల ఫీజు చెల్లించే ఒప్పందంతో న్యాయవాదిగా నియమించుకుంది. ‘‘ఈ ఫీజు మొత్తాన్ని కాంగ్రెస్‌కు సమర్పించు కుంటాను.. నన్ను వదిలిపెట్టారంటే కాంగ్రెస్‌కు ఎంతో లాభం కలుగుతుంది..’’ అని చిత్తరంజన్ దాస్ ఎన్నో విధాలా గాంధీజీకి నచ్చజెప్పచూశాడు. గాంధీజీ మాత్రం ఒక్కటే చెప్పారు. ‘‘ మీ ధనంతో నాకు నిమిత్తం లేదు.. నాకు కావలసింది మీరు..’’ అని స్పష్టంగా చెప్పారు. ఆ మాటల్లో ఏ సమ్మోహనశక్తి ఉందో గానీ దాస్ మాత్రం ఎదురుమాట లేకుండా లొంగిపోయారు. చిత్తరంజన్‌దాస్ మహామేధావి. ఆలీపూర్ బాంబు కేసుతో ఆయన ప్రజ్ఞావిశేషాలు దేశమంతటా తెలిశాయి. జాతీయోద్యమంతో సహా వంగ దేశంలో ఆ రోజుల్లో తలెత్తిన ప్రతి విప్లవోద్యమానికి దాస్ ధన సహాయం తప్పనిసరి. ఎప్పుడో తన తండ్రి బాకీలు చేసి దివాలా తీస్తే, తనకు సంబంధం లేకున్నా, బాకీదారులను పిలిచి దమ్మిడీతో సహా లెక్కగట్టి చెల్లించిన దొడ్డమనిషిగా గుర్తింపు ఉంది. నెలకోసారి బీదాబిక్కీకి పిండివంటలతో అన్నదానం చేయటం ఆయనకు ఆలవాటు. కలకత్తా పట్టణంలో ఆయన ధనసాయం పొందని బీద విద్యార్థి అంటూ లేరు. ప్రతి విప్లవోద్యమం వెనుక ఆయన దాతృత్వం ఉందని ప్రభుత్వానికి స్పష్టంగా తెలిసినా, ఆయనపై చర్యకు సర్కారు గడగడ వణికేది. గాంధీజీకి ఈ విషయాలు తెలుసు కనుకనే కాంగ్రెస్ ఉద్యమానికి దాస్ ధనం కంటే దాస్ ఒక్కడే ఎక్కువ ఉపయోగపడతాడని గ్రహించి ఆయన్నే కోరుకున్నారు. పట్టుబట్టి స్వాతంత్య్ర ఉద్యమంలో భాగస్వామిని చేశారు. (పిల్లుట్ల హనుమంతరావు ఆత్మకథ నుంచి) సేకరణః బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి -
సామ్రాజ్య భారతి 1940,1941/1947
ఘటనలు: లాహోర్ సమావేశంలో ఆలిండియా ముస్లిం లీగ్ ‘పాకిస్థాన్ తీర్మానం’. ప్రత్యేక పాకిస్థాన్ కోసం తొలిసారి జిన్నా డిమాండ్. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్‌కు ఇండియా మద్దతు ఉపసంహరణకు గాంధీజీ ఇచ్చిన పిలుపుపై దేశవ్యాప్త సత్యాగ్రహాలు. వారిలో అరెస్ట్ అయిన తొలి సత్యాగ్రహి వినోభా భావే. విశాఖపట్నంలో సింధియా షిప్‌యార్డ్ (నేటి హిందూస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్) కు బాబూ రాజేంద్ర ప్రసాద్ శంకుస్థాపన. చట్టాలు: డ్రగ్స్ అండ్ కాస్మటిక్స్ యాక్ట్, ఢిల్లీ రిస్ట్రిక్షన్ ఆఫ్ యూజస్ ఆఫ్ ల్యాండ్ యాక్ట్, బేరర్ ‘లా’ స్ యాక్ట్ జననాలు: మురళీమోహన్ : నటుడు (చాటపర్రు); రాజేంద్ర కె. పచౌరి : ఆర్థికవేత్త, పర్యావరణ శాస్త్రవేత్త (నైనిటాల్); అంజాద్ ఖాన్ : నటుడు, దర్శకుడు (బాంబే); శరద్ పవార్ : రాజకీయనేత (బారామతి, మహారాష్ట్ర); ఎ.కె.ఏంటోనీ : రాజకీయనేత (కేరళ); కె.జె.జేసుదాస్ : గాయకులు (కొచ్చి); కృష్ణంరాజు : నటుడు (మొగల్తూరు); వీరప్ప మొయిలీ : రాజకీయనేత (కర్ణాటక); నజ్మా హెప్తుల్లా : రాజకీయనేత (భోపాల్); గోవింద్ నిహలానీ : సినీ దర్శకులు (పాకిస్థాన్); జి.ఎం.సి. బాలయోగి : రాజకీయనేత (తూ.గో.); యామిని కృష్ణమూర్తి : నృత్యకారిణి (మదనపల్లి); వరవరరావు : (వరంగల్); జగ్మోహన్ దాల్మియా : క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ (కలకత్తా). మణిశంకర్ అయ్యర్ : రాజకీయనేత (లాహోర్); భారతీరాజా : తమిళ దర్శకులు (మదురై); మన్సూర్ అలీఖాన్ పటౌడీ : క్రికెటర్ (భోపాల్); అరుణ్‌శౌరీ : జర్నలిస్ట్, రాజకీయనేత (జలంధర్); ఆదూర్ గోపాలకృష్ణన్ : సినీ దర్శకులు (కేరళ); వై.వేణుగోపాల్ రెడ్డి : ఆర్థికవేత్త (కడప); ఆస్కార్ ఫెర్నాండెజ్ : రాజకీయనేత (ఉడుపి). (చదవండి: చైతన్య భారతి: విభజన విషాదానికి ప్రత్యక్ష సాక్షి.. మార్గరెట్ బూర్కి వైట్) -
ఇండియా@75: పుల్వామా దాడి
జమ్మూ కశ్మీర్లో 2019 ఫిబ్రవరి 14 న పాకిస్థాన్ ముష్కరులు సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతికి దాడికి తెగబడ్డారు. జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు జరిపిన ఆ బాంబు దాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)కి చెందిన 40 మంది సైనికులు బలయ్యారు. జమ్మూ– శ్రీనగర్ జాతీయ రహదారిపై లేథిపుర (అవంతిపురా సమీపం) లో ఆ రోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ఘాతుకం చోటుచేసుకుంది. జమ్మూ నుంచి సైనికులు శ్రీనగర్‌కు వెళ్తుండగా ముష్కరులు మాటువేసి ఘాతానికి పాల్పడ్డారు. సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్‌లో 10 మందికి పైగా మిలిటెంట్లు హతమయ్యారు. పుల్వామా దాడి తర్వాత భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ దాడికి తామే బాధ్యులమంటూ పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. పాక్ ప్రేరేపిత ఉగ్రమూకలకు గుణపాఠం చెప్పాలని భావించిన భారత్.. ఫిబ్రవరి 26న తెల్లవారుజామున సరిహద్దులు దాటి పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి బాలాకోట్‌లోని జైషే మొహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. 40 ఏళ్ల తర్వాత పాక్ భూభాగంలోకి భారత్ యుద్ధ విమానాలు చొచ్చుకెళ్లడం ఇదే తొలిసారి. మరోవైపు.. పుల్వామా దాడికి తామే కారణమంటూ.. ఇది పాక్ ప్రజల విజయమని ఆ దేశ మంత్రి ఫవద్ ఛౌధురీ ఆ తర్వాతి ఏడాది జాతీయ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడంతో పాక్ కుట్ర తేటతెల్లమయ్యింది. ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి. పాకిస్థాన్‌కి పట్టుబడి, విడుదలైన ఫైటర్ పైలట్ అభినందన్ వర్థమాన్. యాంటీ శాటిలైట్ మిస్సైయిల్ కలిగిన నాలుగో దేశంగా భారత్. చంద్రయాన్ 2 ని ప్రయోగించిన భారత్. కోడి రామకృష్ణ, మనోహర్ పారికర్, వింజమూరి అనసూయాదేవి, రాళ్లపల్లి, గిరీశ్ కర్నాడ్, షీలా దీక్షిత్, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, రామ్ జఠ్మలానీ, వేణమాధవ్.. కన్నుమూత. (చదవండి: మహోజ్వల భారతి: నంబర్ 1 స్టూడెంట్ ) -
ఇండియా@75: సబ్ కా ప్రయాస్
భారత 75వ స్వాతంత్య్ర దినాన్ని ఉత్సవంగా నిర్వహించుకోవాలన్న నవ భారత నిర్మాణ సంకల్పంతో ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తూ, సరికొత్త కార్యక్రమాలు, పథకాలతో దేశ వర్తమాన, భవిష్యత్తు ప్రణాళికలను రూపుదిద్దింది. తద్వారా దేశం శతాబ్ది (100వ) స్వాతంత్య్ర వేడుకల్ని నిర్వహించుకునే నాటికి ప్రతి ఒక్కరి కృషితో స్వయం సమృద్ధ భారత స్వప్నం సాకారమౌతుంది. అయితే, స్వాతంత్య్ర పునాదులపై ప్రత్యక్షం కాబోయే ఈ బృహత్ నిర్మాణం ఒక్కటే మన జాతి గమ్యం కాదు. నవ భారతావని రూపు దిద్దుకోవడానికి ఇది ఆరంభం మాత్రమే. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవాలను ప్రజల భాగస్వా మ్యంతో ఒక సంకల్పం స్థాయికి చేర్చడం ద్వారా దేశ ప్రగతిని ముందు తీసుకెళుతున్నారు. మన సుసంపన్న వారసత్వం మనకో సరికొత్త గుర్తింపు దిశగా బాటలు వేస్తుండగా, ‘సబ్ కా ప్రయాస్’ తారక మంత్రంతో స్వర్ణ భారతావని నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తున్నారు. నాటి స్వాతంత్య్ర సమరంలో సామాన్య ప్రజల భాగస్వామ్యం అధికంగా ఉండేది. చరఖా, ఉప్పు వంటివి స్వాతంత్య్ర ఉద్యమంతో ప్రజల్ని మమేకం చేయడానికి శక్తిమంతమైన చిహ్నాలుగా నిలబడ్డాయి. అదే తరహాలో ఈనాటి 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవాన్ని అమృత మహోత్సవంగా సంకేత పరుస్తూ కేంద్ర ప్రభుత్వం దేశ పౌరులందరికీ ఇందులో భాగస్వామ్యాన్ని పంచింది. 2022 స్వాతంత్య్ర దినోత్సవానికి 75 వారాల ముందుగా దండియాత్ర ఉద్యమ ఘటనతో మొదలైన ఈ అమృత మహోత్సవం భారతదేశ చరిత్రలో సుసంపన్నమైనదిగా, చిరస్థాయిగా ఉండిపోతుంది. (చదవండి: ఉద్యమ స్ఫూర్తి.. కడప కీర్తి) -
విక్టోరియా స్మారక చిహ్నం పై డ్రోన్ల కలకలం...
న్యూఢిల్లీ: కోల్‌కతాలో స్వాత్రత్య్ర దినోత్సవ వేడుకలకు ముందే ఇద్దరు బంగ్లదేశ్ పౌరులు విక్టోరియా స్మారక చిహ్నం పై డ్రోన్లు ఎగరువేశారు. దీంతో భారత్ హై కమాండ్ ఒక్కసారిగా అలర్ట్ అయ్యింది. దీంతో ఆ ఇద్దరు బంగ్లాదేశ్ పౌరులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. భారీ కంటైనర్లలో పెద్ద మొత్తంలో ఆయుధ సామాగ్రి, పేలుడు పదార్థాలను తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో సుమారు ఆరుగురు అనుమానితుల్ని అదపులోకి తీసుకుని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....మీరట్ జైలులో ఉన్న అనిల్ గ్యాంగ్ స్టర్‌కి ఈ ఆపరేషన్‌లో ప్రమేయం ఉన్నట్లు చెబుత్నున్నారు. ఈ మేరకు జౌన్‌పర్ నివాసి సద్దాం కోసం అనిల్ ఉత్తరాఖండ్‌లోని డెహ్రుడూన్‌లోని గన్‌హౌస్ నుంచి ఈ ఆయుధాల కంటైనర్లను సిద్ధం చేశాడని తెలిపారు. అంతేకాదు ఇప్పటి వరకు అదుపులోకి తీసుకున్న ఆరుగురిలో ఒకరు గన్‌హౌస్ యజమాని. దీన్ని ఉగ్రవాదుల కుట్రగా అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీసులు ఆగస్టు 6న ఆనంద్ విహార్ ప్రాంతంలో ఓ ఆటో డ్రైవర్‌తో సహా అనుమానస్పద స్థితిలో ఇద్దరు వ్యక్తులు రెండు బరువైన బ్యాగులను తరలిస్తున్నట్లు సమాచారం అందిందని తెలిపారు. దీంతో తాము వారిని అదుపులోకి తీసుకుని ఆయుధాలతో కూడిన కంటైనర్లను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఆయుధాలను లక్నోకు సరఫరా చేయన్నుట్లు విచారణలో తేలిందని చెప్పారు. అలాగే స్మారక చిహ్నంపై డ్రోన్లు ఎగరువేసిన బంగ్లాదేశ్ పౌరులు మహ్మద్ షిఫాత్, మహ్మద్ జిల్లూర్ రెహమాన్‌లుగా గుర్తించామని చెప్పారు. ఆ వ్యక్తులు స్మారక చిహ్నం పై డ్రోన్లు ఎగరు వేయడమే కాకుండా పరిసరాల్లో ఫోటోలు తీస్తుండటంతో సీఎస్ఎఫ్ పోలీసులు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ ఘటనలతో భారత ప్రభుత్వం అప్రమత్తమై గట్టి బంధోబస్తు ఏర్పాటు చేసింది. అదీగాక స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముందుగానే దేశవ్యాప్తంగా గట్టి భద్రతను కట్టుదిట్టం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించడం తోపాటు, తనీఖీలు కూడా ముమ్మరం చేశారు. అంతేకాకుండా మెట్రో స్టేషన్లు, విమానాశ్రయాలు, మార్కెట్లతో సహా అన్ని ప్రజా సందోహం ఎక్కువగా ఉండే అన్ని ప్రాంతాల్లో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. -
ఉద్యమ స్ఫూర్తి.. కడప కీర్తి
బ్రిటీష్ పాలకుల కబంధ హస్తాల నుంచి దేశాన్ని విముక్తం చేసేందుకు ఎంతోమంది తమ ప్రాణాలను సైతం లెక్కచేయక జాతీయోద్యమంలో ఉత్సాహంగా ఉరకలేశారు. కడప జిల్లాకు చెందిన వారు కూడా తెల్లదొరలపై తిరుగుబాటు బావుటా ఎగరేసి జైలు జీవితం గడిపారు. అలాంటి వారి గురించిన సంక్షిప్త సమాచారం సాక్షి పాఠకుల కోసం.. కడప కల్చరల్ : స్వాతంత్య్ర సంగ్రామంలో మన జిల్లాకు విశిష్ట స్థానముంది. 1847లో విప్లవ వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తెల్లదొరలపై తిరుగుబాటుతో ఈ ప్రాంత ప్రజల్లో స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని నింపారు. అనంతరం మన జిల్లాలో పుల్లంపేటకు చెందిన షేక్ పీర్షా ఆంగ్ల ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగరేశారు. దీంతో దేశ ద్రోహం నేరంపై ఆయనను అరెస్టు చేసి తిరునల్వేలి జైలులో పది సంవత్సరాలు బంధించారు. ప్రొద్దుటూరులో కలవీడు వెంకట రమణాచార్యులు, వెంకోబారావు తెల్లవారికి వ్యతిరేకంగా భారీ ఊరేగింపు నిర్వహించారు. అలీఘర్ విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన మహహ్మద్ హుసేన్, షఫీవుర్ రెహ్మాన్ 1921 నవంబరు 21న కడపలో బ్రిటీషు వ్యతిరేక సభలు నిర్వహించారు. ఖిలాఫత్ కమిటీ ఏర్పాటు చేశారు. ఫలితంగా నెల్లూరు జైలులో బంధింపబడ్డారు. 1921లో గాంధీజీ జిల్లాలో పర్యటించినప్పుడు (27.09.1921) రాజంపేటలో ప్రసంగించారు. 28న కడప పట్టణంలో పర్యటించారు. మౌలానా సుబహాని ఉర్దూలో మాట్లాడి విదేశీ వస్త్రాలను త్యజించమని పిలుపునిచ్చారు. నాటి ప్రముఖులు కె.సుబ్రమణ్యం తన కరణం పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొన్నారు. ఈత చెట్ల నరికివేత, ఖద్దరు వ్యాప్తి, మద్య నిషేధం అమలు చేయడంలో జిల్లా వాసులు చురుగ్గా వ్యవహరించి జమ్మలమడుగులో నాలుగు ఖద్దరు అంగళ్లు ఏర్పాటు చేశారు. 1940లో జరిగిన సత్యాగ్రహంలో దేవిరెడ్డి రామసుబ్బారెడ్డి, చందన వెంకోబరావు, స్వర్ణనాగయ్య, ఎంసీ నాగిరెడ్డి, భూపాళం సుబ్బరాయశెట్టి, రావుల మునిరెడ్డి, భాస్కర రామశాస్త్రి, చవ్వా బాలిరెడ్డి, గాజులపల్లె వీరభద్రరావు, వీఆర్ సత్యనారాయణ, పార్థసారథి, ఆర్.సీతారామయ్య పాల్గొన్నారు. జమ్మలమడుగులోని పెద్ద పసుపులలో కడప కోటిరెడ్డి సత్యాగ్రహం చేసి జైలుకు వెళ్లారు. నబీరసూల్, దూదేకుల హుసేన్ సాబ్ కూడా జైలు పాలయ్యారు. క్విట్ ఇండియా ఉద్యమంలో రాయచోటికి చెందిన హర్షగిరి నరసమ్మ రహస్య కార్యకలాపాల్లో పాల్గొని గుంతకల్లులో అరెస్టు అయ్యారు. స్వాతంత్య్ర ఉద్యమ నాయకత్రయంగా వై.ఆదినారాయణరెడ్డి, భాస్కర రామశాస్త్రి, పోతరాజు పార్థసారథి స్వాతంత్య్ర పోరాటంలో తీవ్ర కృషి చేశారు. 11.12.1942 నుంచి 07.12.1944 వరకు జైలు జీవితం అనుభవించారు. సీతారామయ్య క్విట్ ఇండియా ఉద్యమంలో ముద్దనూరు రైల్వేస్టేషన్ నుంచి తపాలా సంచులను తస్కరించి అరెస్టు అయ్యారు. టేకూరు సుబ్బారావు, టి.చంద్రశేఖర్‌రెడ్డి, కోడూరుకు చెందిన రాఘవరాజు, చమర్తి చెంగలరాజు తదితరులు కూడా ఉద్యమంలో జైలు పాలయ్యారు. నర్రెడ్డి శంభురెడ్డి, పంజం పట్టాభిరెడ్డి, పెద్ద పసుపులకు చెందిన ఎద్దుల ఈశ్వర్‌రెడ్డి, నాగిరెడ్డి సుబ్బారెడ్డి, బొమ్ము రామారెడ్డి తదితరులు కూడా స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. -
మహోజ్వల భారతి: నంబర్ 1 స్టూడెంట్
సీతారాం ఏచూరి కమ్యూనిస్టు నాయకుడు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) ప్రస్తుత ప్రధాన కార్యదర్శి. నేడు ఆయన జన్మదినం. ఏచూరి 1952 ఆగస్టు 12న మద్రాసులో జన్మించారు. ఆయన విద్యాభ్యాసమంతా ఢిల్లీ లోనే సాగింది. సీబీఎస్ఈ పరీక్షలో జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. సెయింట్ స్టీఫెన్ కళాశాలలో బీఏ (ఆనర్స్) ఆర్థికశాస్త్రం, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఎంఏ ఆర్థికశాస్త్రంలో పట్టా పొందారు. డిగ్రీ, పీజీ రెండింటిలోనూ ప్రథమ శ్రేణిలోనే ఉత్తీర్ణులయ్యారు. 1975లో దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో అరెస్టయ్యారు. ఫలితంగా జేఎన్‌యూలో పీహెచ్.డీ లో చేరినా, డాక్టరేటు పూర్తి చేయలేకపోయారు. 1974లో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) లో సభ్యుడిగా ఏచూరి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఆ మరుసటి ఏడాదే భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) సభ్యుడిగా చేరారు. అత్యవసర పరిస్థితికి కొంతకాలం ముందు ఆయన ఆజ్ఞాతంలోకి వెళ్లారు. దేశంలో అత్యవసర పరిస్థితి ఎత్తివేసిన తర్వాత జేఎన్‌యూ విద్యార్థి నాయకునిగా మూడుసార్లు ఎన్నికయ్యారు. 1978లో అఖిల భారత ఎస్ఎఫ్ఐ సంయుక్త కార్యదర్శిగా, ఆ తర్వాత అధ్యక్షునిగా ఉన్నారు. చదవండి: (మహోజ్వల భారతి: చిరునవ్వుతో ఉరికంబానికి!) ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి, సీపీఎం ప్రధాన కార్యదర్శి అయ్యారు. 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. పార్లమెంటు దృష్టికి ఎన్నో ముఖ్యమైన సమస్యలను తీసుకురావటంతోపాటు వాటిపై ప్రశ్నలు సంధించిన సభ్యునిగా రాజ్యసభలో ఏచూరి గుర్తింపు పొందారు. సమస్యలను సభ దృష్టికి తేవడానికి పార్లమెంటును అడ్డుకోవడాన్ని ఏచూరి సమర్థిస్తారు. 2015 మార్చి 3 న బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానానికి రాజ్యసభలో ఏచూరి సవరణలు ప్రతిపాదించారు. దీనిపై జరిగిన ఓటింగ్‌లో ఆయన సవరణ ప్రతిపాదన నెగ్గింది. రాజ్యసభ చరిత్రలో ఇలా జరగటం చాలా అరుదు. ఇది సహజంగానే ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించింది. అమెరికా విదేశాంగ విధానాన్ని ఏచూరి తీవ్రంగా వ్యతిరేకిస్తారు. భారత గణతంత్ర వేడుకలకు బరాక్ ఒబామా ముఖ్య అతిథిగా రావటాన్ని కూడా ఆయన వ్యతిరేకించారు. సీతారాం తండ్రి ఏచూరి సర్వేశ్వర సోమయాజి, తల్లి ఏచూరి కల్పకం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మోహన్ కందా మేనల్లుడు. ఏచూరి తల్లి కల్పకం, మోహన్ కందా సోదరి, ప్రముఖ సంఘసంస్కర్త దుర్గాబాయి దేశ్‌ముఖ్ శిష్యురాలు. గత ఏడాదే ఆమె కన్నుమూశారు. ఏచూరి భార్య సీమా చిస్తీ జర్నలిస్టు. ముగ్గురు సంతానం. కుమార్తె, ఇద్దరు కుమారులు. -
చైతన్య భారతి: విభజన విషాదానికి ప్రత్యక్ష సాక్షి.. మార్గరెట్ బూర్కి వైట్
1947లో జరిగిన భారత విభజన మానవాళి చరిత్రలో ఒక మహా విషాదం. కోటీ యాభయ్ లక్షల నుంచి రెండు కోట్ల మంది పాకిస్థాన్ నుంచి భారత్ కూ, భారత్ నుంచి పాకిస్థాన్‌కూ తరలిపోయారు. ఇరవైరెండు లక్షల మంది ఆచూకీ దొరకలేదు. ఈ రక్తకన్నీటి ధారలను తన కెమెరాతో బంధించిన వారిలో ముఖ్యులు మార్గరెట్ బూర్కి–వైట్. ‘గ్రేట్ కలకత్తా కిల్లింగ్స్’ పేరుతో ప్రసిద్ధమైన హత్యాకాండ మిగిల్చిన విషాదాన్ని మార్గరెట్ భావి తరాలు మరచిపోలేని విధంగా చిత్రీకరించారు. మార్గరెట్ అమెరికా పౌరసత్వం తీసుకున్న పోలెండ్ జాతీయురాలు. తండ్రి జోసెఫ్ వైట్ యూదు జాతీయుడు. తల్లి మిన్నీ బూర్కి ఐరిష్ జాతీయురాలు. మార్గరెట్ చిన్నతనం న్యూజెర్సీలో గడిచింది. కెమెరాలంటే ఆసక్తి చూపించే తండ్రి నుంచి ప్రోత్సాహం రావడంతో చిన్ననాడే ఆమె ఫొటోలు తీయడం ఆరంభించారు. ప్రఖ్యాత ‘టైమ్’ మ్యాగజైన్ యజమాని హెన్రీ లూస్ ‘లైఫ్’ పేరుతో ఒక పత్రికను వెలువరించాలని ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడే మార్గరెట్‌ను ఆ పత్రికకు ఎంపిక చేశారు. ఆమె లైఫ్‌లో పనిచేసిన తొలి మహిళా ఫొటోగ్రాఫర్. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో రణభూమి దగ్గర ఉండి ఫొటోలు తీసే అవకాశం వచ్చిన మొదటి మహిళ మార్గరెట్. అప్పుడే క్రెమ్లిన్ (రషా) మీద నాజీ సేనలు దాడుల (1941) దృశ్యాలను తన కెమెరాలో బంధించే అవకాశం కూడా ఆమెకు దక్కింది. ఇలాంటి సంక్షుభిత పరిణామాలను చిత్రించేందుకు అనుమతి పొందిన ఏకైక విదేశీయురాలు మార్గరెట్. తన ఫొటో తీయడానికి స్టాలిన్ కూడా ఆమెను అనుమతించాడు. సోవియెట్ పరిశ్రమలను ఫొటోలు తీయడానికి అనుమతి పొందిన తొలి పాశ్చాత్య మహిళ కూడా ఆమే. హిట్లర్ పతనం తరువాత జర్మనీ దుస్థితిని కూడా ఆమె తన ఫ్రేములలో బంధించారు. ఇక మనదేశానికైతే కేవలం మహాత్మా గాంధీ ఫొటోలు తీయడానికే మార్గరెట్ వచ్చారు. చరఖా ముందు కూర్చుని ఉన్న గాంధీజీ ఫొటో మార్గరెట్ తీశారు. ఇంకా చాలా పోజులలో ఫొటోలు ఉన్నాయి. ఆమె భారతదేశంలో తీసిన ఫొటోలు 66. అందులో గాంధీ, జిన్నా, అంబేడ్కర్ వంటి చరిత్ర పురుషుల పోర్టెయ్రిట్లు, విభజన విషాదాల ఫొటోలు ప్రధానంగా ఉన్నాయి. అసలు భారత విభజన విషాదాన్ని కెమెరాలో బంధించడానికే ఆమె ఇక్కడికి వచ్చారని అనిపిస్తుంది. మార్గరెట్ తన కెమెరాతోను, లీ ఐటింగన్ డైరీ కలంతోను ఆ దారుణ దృశ్యాలకు శాశ్వతత్వం కల్పించారు. మార్గరెట్ విభజన విషాద చిత్రాలను మనం ఇప్పటికీ చూస్తున్నాం. ఆమె మాత్రం పార్కిన్సన్ పెయిన్ వ్యాధితో 1971లో తుదిశ్వాస విడిచారు. గాంధీజీ వంటి అహింసామూర్తిని ఫొటోలు తీయడానికి వచ్చిన మార్గరెట్ హింసాత్మక భారతావనిని చూడటం ఒక వైచిత్రే. -
జైహింద్ స్పెషల్: బట్వాటా యోధుడు రంగారావు పట్వారీ
ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో సంస్థానాధీశులు, రాజులు, వారి సైనికులు మాత్రమే కాదు.. అజ్ఞాతంగా చిన్న చిన్న జమిందార్లు, గ్రామాధికార్లయిన పట్వారీల వంటివారు కూడా కీలక పాత్ర పోషించారు. అటువంటి విస్మృత యోధులలో నిజామాబాద్ జిల్లాలోని కౌలాస్‌ను కేంద్రంగా చేసుకుని బ్రిటిష్ వారిపై తిరుగుబాటుకు పథక రచన చేసిన రంగారావు కూడా ఒకరు. తిరుగుబాట్ల రహస్య సమాచారం పొందుపరిచి ఉన్న లేఖలను నానా సాహెబ్‌కు, నిజాం పాలనలోని సమర యోధులకు చేర్చడానికి ఆయన అనేక కష్టాలు పడ్డారు. చివరికి బ్రిటిష్ సైనికుల చేతికి చిక్కారు. చదవండి: గాంధీజీ గ్రామ స్వరాజ్యానికి చంద్రమౌళి చెక్ పవర్ ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి దేశవ్యాప్తంగా మరాఠా పీష్వా బాలాజీ బాజీరావు (నానాసాహెబ్), చివరి మొగల్ చక్రవర్తి బహదూర్ షా, ఆయన కుమారుడు మిర్జా మొగల్ తదితరులు నాయకత్వం వహిస్తున్న సమయంలో రంగారావు నిజాం ప్రాంతంలోని నార్కెట్ గ్రామ పట్వారిగా ఉన్నారు. రంగారావుతో పాటు కౌలాస్ జమిందార్ రాజా దీప్ సింగ్ (రాజా సాహెబ్), నిజాం ఆస్థానంలోని సఫ్దర్ ఉద్దౌలా మరికొంతమంది కలిసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటుకు వ్యూహ రచన చేస్తుండగా 1857 ఫిబ్రవరిలో రహస్య సమర యోధుడు, బ్రిటిష్ సైనిక ఉద్యోగి అయిన సోనాజీ పండిట్ నుండి పిలుపు రావడంతో రంగారావు ఆయన్ని కలిశారు. సోనాజీ పండిట్ ఆయనకు ఒక లేఖ ఇచ్చి నానా సాహెబ్‌కు అందజేయమని కోరారు. ఎక్కడో ఉత్తరభారతంలో ఉన్న నానా సాహెబ్ ను కలవడానికి బయలుదేరిన రంగారావు నర్మద, యమున నదులను దాటి లక్నో సమీపంలోని బెర్వతోడ గ్రామం వద్ద నానాసాహెబ్ కు తాను తీసుకు వచ్చిన ఉత్తరాన్ని అందజేశారు! ఆ లేఖ ద్వారా నిజాం రాజ్యంలోని బ్రిటిష్ పాలనా పరిస్థితులను అవగాహన చేసుకున్న నానాసాహెబ్... సొనాజీ పండిట్ లేఖకు సమాధానంగా... నిజాం రాజ్యంలో ఉన్న డఫేదారులు, జమిందార్లు, రోహిల్లాలు తిరుగుబాటు జెండా ఎగురవేసి సాధ్యమైనన్ని చోట్ల బ్రిటిష్ వారిని తరిమి కొట్టాలని కోరుతూ ఒక లేఖ రాసి దానిపై తన రాజ ముద్ర వేశారు. అలాగే సఫ్దర్ ఉద్దౌలా, రావు రంభా నింబాల్కర్, గులాబ్ ఖాన్, బుజురీలను ఉద్దేశించి విడివిడిగా రాసిన లేఖలను రంగారావుకు అందజేసి ఎవరి లేఖలు వారికి అందజేయాలని కోరారు. నిజామాబాద్‌లోని కౌలాస్ కోట: కౌలాస్ జమిందార్ రాజా దీప్ సింగ్ (రాజా సాహెబ్), మరికొందరు కలిసి బ్రటిషర్లపై తిరుగుబాటుకు వ్యూహరచన చేశారు. రంగారావు విస్మృత యోధుడిగా మిగిలిపోయినట్లే.. వ్యక్తిగా ఆయన రూపురేఖల్ని తెలిపే చిత్రాలు కూడా చరిత్రలో మిగలకుండా పోయాయి. తిరిగి వచ్చేలోగా..! రంగారావు ముందుగా ఔరంగాబాద్ చేరుకుని గులాం ఖాన్, బుజురీలను కలిసి వారి లేఖలను వారికి అందజేశారు. ఆ క్రమంలో కొండలు, నదీనదాలు, అడవులను అధిగమిస్తూ అలుపెరగని ప్రయాణం చేస్తున్న రంగారావును ఒకరోజు బందిపోటు దొంగలు చుట్టుముట్టారు. డబ్బు, ఆహార పదార్థాలతో పాటు ఆయన చేతిలో ఉన్న సఫ్దర్ ఉద్దౌలా, నింబాల్కర్‌లకు ఉద్దేశించిన లేఖలను కూడా దోచుకున్నారు. రంగారావు ధైర్యం వీడలేదు. సోనాజీ పండిట్ కి రాసిన లేఖ, మరో లేఖ తలపాగాలో దాచి ఉంచడం వల్ల వాటిని దొంగలపాలు కాకుండా రక్షించుకోగలిగారు. చివరికి అలసిసొలసి సోనాజీ పండిట్ ఉండే గ్రామానికి తిరిగివచ్చిన రంగారావుకు సోనాజీ మరణించాడనే వార్త తెలిసి ఖిన్నుడయ్యాడు. ఆ ఘటనతో రంగారావు తనే స్వయంగా తిరుగుబాటు బావుటా ఎగురవేసి ఉద్యమ నాయకత్వాన్ని భుజానికెత్తుకుని హైదరాబాద్ వైపు కదిలారు. తన ప్రయత్నంలో ఎటువంటి లోపం లేకుండా ఎంతో మందిని కలిసి మద్దతు పొందడానికి ప్రయత్నించారు. వెళ్లే మార్గంలో మాదాపూర్ గ్రామ నాయక్‌కు, తర్వాత హల్లి గ్రామానికి వెళ్లి బాబూ పటేల్‌కు, ఆ తర్వాత చక్లి గ్రామం చేరి అధికారిని కలిసి సోనాజీకి నానాసాహెబ్ రాసిన లేఖ చూపించారు. అయితే ఎవరూ ఆయనకు సహాయం చేయలేదు. దీంతో హైదరాబాద్ వెళ్లకుండా నిజామాబాద్ జిల్లాలో ఉన్న కౌలాస్ చేరారు. అక్కడే కొంతకాలం గడిపారు. ఈ కాలంలో నాలుగుసార్లు కౌలాస్ రాజాతో చర్చలు జరిపారు. ఇక్కడ ఉండటం ఎవరికీ శ్రేయస్కరం కాదని, కాబట్టి మకాం మార్చమని రాజా సాహెబ్ చెప్పడంతో నీలేకర్ గ్రామం చేరి రఘునాథ్ పజ్జీ దగ్గర రెండువారాలు ఆశ్రయం పొందారు. అయితే రఘునాథ్.. తిరుగుబాటుకు సంబంధించి ఎటువంటి సహాయం అందించడానికి నిరాకరించడమే కాక సొంత ఊరికి పోయి హాయిగా శేష జీవితం గడపమని రంగారావుకు సలహా ఇచ్చాడు. పట్టువదలని విక్రమార్కుడిలా రంగారావు మాణిక్ నగర్ వైపు నడిచి మాణిక్ ప్రభుని కలిసి తన కథను వినిపించారు. ప్రభు వద్ద ఎనిమిది రోజులు గడిపి, అతడి ఆశీస్సులతో నీలేకర్ గ్రామానికి వెళ్లి బడే అలీని కలిశారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలలో తిరుగుబాటు వచ్చినప్పుడు తాను తప్పకుండా సహకరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. కనిపెట్టిన బ్రిటిషర్లు! ఈ పరిస్థితుల్లో స్వగ్రామం వైపు బయల్దేరిన రంగారావు మార్గమధ్యంలో బ్రిటిష్ సైన్యానికి చిక్కాడు. 1859, ఏప్రిల్12 న ‘ఇంగ్లిష్మెన్’ అనే ఆంగ్లపత్రికలో ఆయన ఆరెస్టు వార్త వచ్చింది. బ్రిటిష్ సైన్యం రంగారావుతో పాటు కౌలాస్ రాజా దీప్ సింగ్, సఫ్దరుద్దౌలాలను, వారి అనుచరులను అరెస్టు చేసింది. రాజా దీప్ సింగ్ కు మూడు సంవత్సరాల కారాగార శిక్ష విధించింది. జాగీరును కూడా స్వాధీనం చేసుకుంది. తర్వాత ఆ జాగీర్ ను ఆయన కుమారునికి ఇచ్చింది. సఫ్దరుద్దౌలాను పదవి నుంచి తొలగించి అతడి స్థిర, చరాస్తులను స్వాధీనం చేసుకుని జీవిత ఖైదు విధించారు. రంగారావుకు మరణశిక్ష విధించినా... తరువాత దానిని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చి అండమాన్‌కు పంపారు. ఆయన 1860 సంవత్సరంలో అక్కడే చనిపోయారు. – జి. శివరామకృష్ణయ్య -
సామ్రాజ్య భారతి: 1938,1939/1947
ఘట్టాలు: రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభం. ఇండియాలో రాజకీయ ప్రతిష్ఠంభన. భారతీయ జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సుభాస్ చంద్రబోస్ రాజీనామా. బ్రిటిష్ అరాచక పాలనకు నిరసనగా ఆమరణ నిరాహారదీక్షకు కూర్చున్న గాంధీజీ. చట్టాలు: గుడ్ కాండక్ట్ ప్రిజనర్స్ ప్రొబేషనల్ రిలీజ్ యాక్ట్, ఇన్సూరెన్స్ యాక్ట్; మనోవర్స్, ఫీల్డ్ ఫైరింగ్ అండ్ ఆర్టిలరీ ప్రాక్టీస్ యాక్ట్, కట్చీ మెమాన్స్ యాక్ట్. రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫారినర్స్ యాక్ట్, పోర్చుగీస్ కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్, కమర్షియల్ డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ యాక్ట్, డిజల్యూషన్ ఆఫ్ ముస్లిం మ్యారేజస్ యాక్ట్. జననాలు: బి.సరోజాదేవి : నటి (బెంగళూరు); శశి కపూర్ : నటుడు (కలకత్తా); షీలా దీక్షిత్ : రాజకీయనేత (కపుర్తాలా); గిరీష్ కర్నాడ్ : నటుడు (మహారాష్ట్ర); రాహుల్ బజాజ్ : బిజినెస్‌మేన్ (కలకత్తా); సంజీవ్ కుమార్ : నటుడు (సూరత్); ఎస్.జానకి : సి.నే.గాయని (రేపల్లె); హరిప్రసాద్ చౌరాసియా : వేణుగాన విద్వాసులు (అలహాబాద్); గిరిజ : నటి (కంకిపాడు); ఆర్.డి.బర్మన్ : సంగీత దర్శకుడు (కలకత్తా); ములాయం సింగ్ యాదవ్ : రాజకీయనేత (ఉత్తరప్రదేశ్); ఎల్.ఆర్. ఈశ్వరి : సినీ గాయని (మద్రాసు); గొల్లపూడి మారుతీరావు : నటుడు (విజయనగరం). (చదవండి: జమ్మూకశ్మీర్) -
శతమానం భారతి: జమ్మూకశ్మీర్
మూడేళ్ల క్రిందట ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం.. దశాబ్దాల అంతరాన్ని అంతం చేస్తూ ప్రగతిలో వెనుకబడి ఉన్న జమ్ము, కశ్మీర్, లద్దాఖ్ లకు ఆర్టికల్ 370 నుంచి విముక్తి కల్పిం చింది. దీంతో ‘ఏక్ భారత్ – శ్రేష్ఠ భారత్’ భావన మరింత బలం పుంజుకుంది. జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని ఇస్తున్న రాజ్యాంగం లోని 370 ఆర్టికల్‌ను రద్దు చేయడం అంటే, స్వతంత్ర భారతదేశానికి పునరేకీకరణ శక్తిని ఇవ్వడమే. ఈ నేపథ్యంలో గడిచిన మూడేళ్లుగా జమ్ము కశ్మీర్ ప్రగతి పథంలో శరవేగంతో పరుగులు తీస్తోంది. అక్కడి ఉపాధి, సౌభాగ్యాలకు కొత్త ఉత్తేజం లభించింది. జమ్ము కశ్మీర్‌కు 7 కొత్త వైద్య కళాశాలలు, 5 కొత్త నర్సింగ్ కళాశాలు మంజూరు అయ్యాయి. వైద్య కోర్సులలో సీట్ల సంఖ్య 500 నుంచి దాదాపుగా రెట్టింపు అయింది. జల విద్యుత్ ప్రాజక్టులు ఉద్పాదన ప్రారంభించాయి. వాటి ద్వారా పరిశ్రమ లకు ప్రయోజనంతో పాటు ఆ ప్రాంతాల రాబడీ పెరుగుతోంది. వ్యవసాయ రంగ ప్రగతితో కూడా ఆదాయం పెరిగి, దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపునిస్తోంది. జమ్ము, కశ్మీర్లో కొత్తగా అమలవుతున్న ‘ఒకే దేశం.. ఒకే రేషన్ కార్టు’ పథకం సగటు ప్రజల జీవితాలను సులభతరం చేసింది. జమ్ముకశ్మీర్‌లో ఉజ్వల, డి.బి.టి., సౌభాగ్యం వంటి అనేక పథకాలు 100 శాతం అమలవుతున్నాయి. 2024 కల్లా ఆ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ సురక్షిత తాగునీరు అందించాలని సంకల్పించిన ప్రభుత్వం.. రెండేళ్ల ముందుగానే ఈ ఆగస్టు 15 కల్లా పూర్తి లక్ష్యాన్ని నెరవేర్చనుంది! దేశంలో ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ యోజన కింద ప్రతి వ్యక్తీ లబ్ది పొందిన ఏకైక రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం.. జమ్ము కశ్మీర్ మాత్రమే కావడం విశేషం. (చదవండి: చైతన్య భారతి: చరిత్రకు సమకాలీనుడు! మామిడిపూడి వెంకటరంగయ్య) -
ఇండియా@75: ఐక్యతా ప్రతిమ ప్రతిష్ఠాపన
భారత ప్రధాని నరేంద్ర మోదీ 2018 అక్టోబర్ 31న గుజరాత్లో ‘ఐక్యతా ప్రతిమ’ (స్టాచ్యూ ఆఫ్ యూనిటీ) ను ఆవిష్కరించారు. 182 మీటర్ల ఎత్తయిన ఈ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహాన్ని ఐక్యతకు ప్రతీకగా ప్రతిష్టించారు. అక్టోబర్ 31 పటేల్ జయంతి కాగా, 182 అనే సంఖ్య గుజరాత్ రాష్ట్రంలోని 182 నియోజక వర్గాలకు సంకేతం. విగ్రహ నిర్మాణ పనులు 2013 అక్టోబర్ 31న మొదలయ్యాయి. నర్మదా నదిపై నిర్మించిన సర్దార్ సరోవర్ డ్యామ్‌కు అభిముఖంగా ఉండేలా 19 వేల చదరపు కిలో మీటర్ల వ్యాసార్థంలో, 2989 కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఈ ఐక్యతా ప్రతిమను నిర్మించారు. ఇందుకోసం 75 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రిట్, 5 వేల 700 టన్నుల ఉక్కు, 18 వేల 500 టన్నుల స్టీల్ రాడ్లు, 22 వేల 500 టన్నుల రాగి పలకలు అవసరం అయ్యాయి. దాదాపు 2,500 మంది కార్మికులు పని చేశారు. అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహానికి రెండింతల ఎత్తులో నిర్మించిన ఈ సర్దార్ పటేల్ ఐక్యత స్మారక ప్రతిమను ఆ ఒక్క ఏడాదిలోనే (2018–2019) 2 కోట్ల 80 లక్షల మంది దేశ విదేశీయులు సందర్శించారు. ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు అటల్ బిహారి వాజ్‌పేయి, నటి శ్రీదేవి, జగద్గురు శ్రీ జయేంద్ర సరస్వతి శంకరాచార్య, ఎం. కరుణానిధి, సోమనాథ్ చటర్జీ, మృణాల్‌సేన్.. కన్నుమూత. మహిళల్ని శబరిమల ఆలయ ప్రవేశానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు. నానాపటేకర్‌పై బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా ఫిర్యాదుతో ఇండియాకూ విస్తరించిన మీటూ మహిళా ఉద్యమం. ఫైటర్ జెట్‌ను ఒంటరిగా నడిపిన తొలి భారతీయ మహిళా పైలట్ 24 ఏళ్ల అవని చతుర్వేది. (చదవండి: చైతన్య భారతి: చరిత్రకు సమకాలీనుడు! మామిడిపూడి వెంకటరంగయ్య) -
జైహింద్ స్పెషల్: గాంధీజీ గ్రామ స్వరాజ్యానికి చంద్రమౌళి చెక్ పవర్
మన దేశంలో పంచాయతీ చట్టం 1951 ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చింది. స్వేచ్ఛా భారతంలో గ్రామాలు ప్రతి చిన్న విషయానికీ రాష్ట్రానికేసి చూడకూడదు, స్వశక్తితో స్వయం పోషకత్వం స్థితికి రావాలనే భావనతో పంచాయతీ చట్టం తీసుకొచ్చింది వుద్రాస్ ప్రావిన్స్. ఈ చట్టానికి ఇప్పుడు 71 ఏళ్లు. 2010 నుంచి ఏటా ఏప్రిల్ 24 న జాతీయ పంచాయతీ దినోత్సవం జరుపుకుంటున్నాం. విశేషం ఏంటంటే.. ఈ చట్టం రూపకల్పన, అవులులో ఒక తెలుగు వ్యక్తి పాత్ర ఉండటం తెలుగు వారందరికీ గర్వకారణం. ఆ వ్యక్తే.. కాంగ్రెస్‌లో తిరుగులేని నాయకుడిగా దశాబ్దాలకాలం పార్టీని ముందుకు నడిపించిన కల్లూరి చంద్రమౌళి. దేశంలో మరే ప్రజాప్రతినిధికీ లేనటువంటి చెక్ పవర్‌ను పంచాయతీ సర్పంచ్‌కు కట్టబెట్టారాయన. చదవండి: హైదరాబాద్‌లో 75 ఫ్రీడమ్ పార్కులు మోపర్రుకు గాంధీజీ! తెనాలికి సమీపంలోని మోపర్రు చంద్రమౌళి స్వస్థలం. 1898లో జన్మించారు. హైస్కూలు విద్యలోనే సంస్కృతాంధ్ర భాషలు అధ్యయనం చేశారు. తెనాలి, గుంటూరు, కలకత్తాలలో విద్యాభ్యాసం జరిగింది. 1919లో వివాహమైంది. 1920లో ఇంగ్లండ్ వెళ్లి అగ్రికల్చర్ బీఎస్సీ చదివి 1924లో ఇండియా తిరిగొచ్చారు. భారతీయ సంస్కృతిని రక్షించాలన్నా, ఇంగ్లండ్ దేశంలా వునదేశం అభివృద్ధి చెందాలన్నా స్వపరిపాలన అవసరవుని ఆయన భావించారు. దేశవ్యాప్తంగా పర్యటించి గాంధీజీ ఆశ్రవూనికి చేరి ఆయన సేవచేశారు. స్వగ్రామం మోపర్రుకు చేరుకుని స్వరాజ్య ఉద్యవూన్ని ఆరంభించారు. 1929లో గాంధీజీని మోపర్రుకు రప్పించారు. తెనాలి నుంచి ఎక్కువవుంది యువకులను స్వరాజ్య ఉద్యవుంవైపు వుళ్లించారు. అనేకసార్లు జైలుకెళ్లారు. 1933–62 వరకు జిల్లా కాంగ్రెస్ రాజకీయాలకు పెద్ద దిక్కుగా నిలిచారు. 1934లో పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, జిల్లా కాంగ్రెస్ కార్యాలయాన్ని తెనాలిలోనే ఏర్పాటుచేశారు. తెనాలి కేంద్రంగానే జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు నడిపారు. జిల్లా బోర్డు అధ్యక్షుడిగా సావుర్ధ్యాన్ని నిరూపించుకొని 1964లో తెనాలి నుండి శాసనసభ సభ్యునిగా, 1947లో భారత రాజ్యాంగసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1947 వూర్చిలో ఏర్పాటైన మద్రాస్ ప్రావిన్స్‌లో ఓవుండూరి రావుస్వామి రెడ్డియార్ వుంత్రివర్గంలో స్థానిక స్వపరిపాలన, సహకార వుంత్రిగా నియమితులయ్యారు. స్వరాజ్య ఉద్యవుంలో పాల్గొన్నవారికి భూవుులు ఇచ్చే ఏర్పాటు చేశారు. తర్వాత 1949లో కువూరస్వామి రాజా వుంత్రివర్గంలోనూ సహకార, స్థానిక స్వపరిపాలన వుంత్రిగా పనిచేశారు. సవుగ్ర పంచాయతీ చట్టం మంత్రిగా ఉన్న ఆ సమయంలోనే చంద్రమౌళి వుహాత్మాగాంధీ ప్రధాన ఆశయమైన గ్రామ స్వరాజ్యం కోసం దేశంలోనే మెుదటగా సవుగ్ర పంచాయతీ చట్టాన్ని తీసుకొచ్చారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్ర గ్రామ పంచాయతి చట్టం–1950తో గ్రామాలు పంచాయతీలుగా ఏర్పడ్డాయి. వాస్తవమైన అధికారాన్ని ప్రజల చేతుల్లో పెట్టి అన్ని రంగాల్లోనూ గ్రామ జీవనాన్ని వారే నిర్వహించుకొంటూ, గ్రావూల సర్వతోముఖాభివృద్ధికి కృషి జరగాలనేది చట్టం ప్రధాన ఉద్దేశం. అందుకే గ్రామ పంచాయతీ సర్పంచ్‌కు చెక్‌పవర్ కల్పించారు. ఇళ్లు, వ్యవసాయ ఉత్పత్తులు, వూర్కెట్లపై పన్ను వసూలు అధికారాన్ని కల్పించారు. ఆవిధంగా గ్రామ ప్రభుత్వాలు ఆవిర్భవించాయి. రూ.100 వరకు సివిల్ వివాదాలనూ గ్రామ పంచాయతీ కోర్టు పరిధిలోకి తెచ్చారు. నాడు వుద్రాస్ ప్రావిన్సులో తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాలుండేవి. స్వయం నిర్ణయ ఉద్దేశం చట్టం అవుల్లోకి వస్తున్నపుడు చంద్రవ˜ళి చేసిన రేడియో ప్రసంగం అప్పట్లో ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. గ్రావుసీవుల అభివృద్ధికి సంబంధించి తన అభిప్రాయాలను ఆయన సూటిగా వెల్లడించారు. ‘‘పంచాయతీలు ప్రతి అల్ప విషయానికి రాష్ట్ర ప్రభుత్వంకేసి చూడరాదు. ప్రతి స్వల్ప విషయం రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించే ‘కేంద్రీకరణ విధానం’ ప్రజాపాలనకు ప్రధాన సూత్రమైన స్వయం నిర్ణయత్వానికి వుుప్పుతెస్తుంది’’ అన్నారు. ‘‘కొలదివుంది పాలకులు ఎచటనో ఒక చోటు నుండి, సర్వ గ్రావూలకు సంబంధించిన సవుస్యలన్నింటిని పరిష్కరింపబూనుట అసంభవవుు’’గా కూడా తేల్చారు. గ్రామీణ ప్రజలు విద్యావిహీనులు, సదా కలహాలతో కాలం గడుపుతారు... ఇలాంటివారు అధికార నిర్వహణకు అనర్హులు.. అని కొందరు శంకిస్తుంటారని చెబుతూ, ఇది అసవుంజసం అన్నారు. ‘‘చదవను రాయను నేర్చుటయే విద్య కాదు.. ఇట్టి చదువ#కంటే సద్గుణవువసరం. సుచరితులకు సదవకాశ మెుసగినచో సేవాతత్పరులయి, యోగ్యతను బడసి పైకి రాగలరు’’ అన్నారు. ప్రజలు తవుకు విశ్వాసపాత్రులయిన వారినే పంచాయతీ సభ్యులుగా ఎన్నుకుంటారు. ఒకవేళ స్వార్ధపరులనే ఎన్నుకుంటే దాని ప్రతిఫలం వారిని ఎన్నుకున్నవారే అనుభవిస్తారని కూడా చెప్పారు. ప్రజలు తవు అనుభవంతో తప్పులు గ్రహించి సరిదిద్దుకుంటారని చంద్రవ˜ళి భరోసాగా అన్నారు. ప్రభుత్వం చేసిన చట్టం ఉద్దేశం.. గ్రామాలను స్వశక్తితో స్వయం పోషకత్వ స్థితికి తీసుకురావటమే నని చెప్పారు. ఇందుకు సుచరితులు, సుశిక్షితులు అయిన యువకులు అత్యవసరంగా కావాలని అని స్పష్టం చేశారు. – బి.ఎల్.నారాయణ -
చైతన్య భారతి: చరిత్రకు సమకాలీనుడు! మామిడిపూడి వెంకటరంగయ్య
మామిడిపూడి వెంకటరంగయ్య ఉన్నత శ్రేణి చరిత్రకారుడు. చారిత్రక ఘటనలతో ప్రేరణ పొంది, ప్రత్యక్ష సాక్షిగా ఉండి ఆ క్రమంలో చరిత్రకారునిగా తనను తాను తీర్చిదిద్దుకున్నారు. వెంకటరంగయ్య నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా పురిణి గ్రామంలో జన్మించారు. ప్రాథమిక విద్య పురిణిలోనే సాగింది. 1907 నాటికి పచ్చయప్ప కళాశాలలోనే బీఏ చదువుతున్నారు. సరిగ్గా అప్పుడే వెంకటరంగయ్య జీవితం మలుపు తిరిగింది. బెంగాల్ విభజన (1905) వ్యతిరేకోద్యమంలో భాగంగా బిపిన్ చంద్ర పాల్ దక్షిణ భారతదేశంలో పర్యటిస్తూ మద్రాస్‌లో దిగారు. వందేమాతరం నినాదం దేశమంతటా ప్రతిధ్వనించిన కాలమది. పాల్ మేరీనా బీచ్‌లో ఐదు రోజుల పాటు ప్రసంగాలు చేశారు. ఈ ఐదు రోజులు కూడా ఆయన ప్రసంగాలు విన్నవారిలో వెంకటరంగయ్య కూడా ఉన్నారు. అదే ఆయనలో కొత్త చింతనకు శ్రీకారం చుట్టింది. తర్వాత వెంకటరంగయ్య పచ్చయప్ప కళాశాలలోనే చరిత్ర ట్యూటర్‌గా చేరారు. ఈ ఉద్యోగంలో ఉంటూనే ఆయన ఎంఏ విడిగా చదివి ఉత్తీర్ణులయ్యారు. ఆ తర్వాతి మలుపు కాకినాడకు తిప్పింది. బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడిగారి ఆహ్వానం మేరకు వెంకటరంగయ్య పీఆర్ విద్యా సంస్థలో 1910లో చరిత్రోపన్యాసకులుగా చేరారు. ఆ తరువాత విజయనగరం మహారాజా కళాశాలలో బీఏ తరగతులు ప్రారంభించారు. 1928తో ఆయనకు విజయనగరం బంధం తెగిపోయింది. విజయనగరం సంస్థానం నుంచి వెంకటగిరి సంస్థానం చేరారు. అక్కడ వెంకటగిరి మహారాజా కళాశాల ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టారు. అక్కడ నుంచే వెంకటరంగయ్యగారికి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి పిలుపు వచ్చింది. వైస్‌చాన్స్‌లర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వెంకట రంగయ్యను చరిత్ర, రాజనీతి శాఖలో రీడర్‌గా నియమించారు. ఆ తరువాత అక్కడే ఆయన ప్రొఫెసర్ కూడా అయ్యారు. మధ్యలో... అంటే 1949లో బొంబాయి విశ్వవిద్యాలయంలో రాజనీతిశాస్త్ర విభాగం అధిపతిగా పనిచేశారు. ఆంధ్రలో స్వాతంత్య్రోద్యమం పేరుతో వెలువరించిన నాలుగు సంపుటాలు చరిత్రకారునిగా వెంకటరంగయ్య ప్రతిభను వెల్లడిస్తాయి. భారత స్వాతంత్య్రం సమరగాథను మూడు సంపుటాలలో ఆయన రచించారు. ఆంగ్లంలో కూడా ది వెల్ఫేర్ స్టేట్ అండ్ సోషలిస్ట్ స్టేట్, సమ్ థియరీస్ ఆఫ్ ఫెడరలిజమ్ వంటి వైవిధ్య భరితమైన రచనలు కనిపిస్తాయి. జీవితంలో ఎక్కువ భాగం విద్యా బోధనకీ, చరిత్ర రచనకీ అంకితం చేసిన వెంకటరంగయ్య 93 ఏళ్ల వయసులో కన్నుమూశారు. -
మహోజ్వల భారతి: చిరునవ్వుతో ఉరికంబానికి!
ఖుదీరాం బోస్ భారత స్వాతంత్య్ర సమరవీరులలో మొదటి తరానికి చెందిన అతి పిన్నవయస్కుడు. బ్రిటిష్ అధికారిపై బాంబు వేసిన మొదటి సాహసవీరుడు. బాంబు వేసిన కారణంగానే అతడిని ఉరి తీసేనాటికి అతని వయసు కేవలం 18 సంవత్సరాలు. ఖుదీరాం పశ్చిమ బెంగాల్, మిడ్నాపూర్ జిల్లా హబిబ్‌పూర్‌లో 1889 డిసెంబర్ 3న జన్మించాడు. తల్లిదండ్రులు ఇద్దరూ ఖుదీరాం చిన్నవయస్సులోనే కన్నుమూశారు. ఖుదీరాం పాఠశాలలో చదువుతున్న రోజుల్లో స్వాతంత్య్ర సమర యోధుల గురించి విని జాతీయోద్యమానికి ప్రభావితుడయ్యాడు. నిరంతరం తీవ్రమైన స్వాతంత్య్ర సాధనేచ్ఛతో రగిలిపోతుండే వాడు. మొదట్లో ‘అఖ్రా’ అనే విప్లవ సంస్థలో చేరాడు. 1905లో బెంగాల్ విభజన ఖుదీరాంలో బ్రిటిష్ ప్రభుత్వంపై మరింత కసి రేపింది. 16 ఏళ్ల వయసులోనే ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లను బాంబులతో పేల్చివేశాడు. ఆ తర్వాత ఒక ఘటన జరిగింది. 1907 ఆగస్టు 26న ఒక కేసు విచారణ సందర్భంగా అనేకమంది యువకులు కోర్టు ముందర ఆసక్తిగా గుమికూడి ఉన్నారు. పరిస్థితి శాంతియుతంగా ఉన్నప్పటికీ ఉన్నట్లుండి పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఈ వ్యవహారాన్ని కొద్దిదూరంలో నిలబడి చూస్తున్న సుశీల్ కుమార్ సేన్ అనే 15 ఏళ్ల యువకుడు ఈ దాడిని చూసి భరించలేక ఆవేశంతో ఒక ఇంగ్లిషు అధికారి ముక్కు మీద ఒక్క గుద్దు గుద్దాడు. వెంటనే పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్లారు. ఈ కేసు విచారణ చేసిన జడ్జి కింగ్స్‌ఫోర్డ్ అనే అధికారి. భారతీయులపట్ల క్రూరత్వానికి అతడు పెట్టింది పేరు. ‘యుగాంతర్ ’ పత్రిక మీద అతను ఎప్పుడూ ప్రతికూల నిబంధనలు విధిస్తూ, ఆ పత్రికా కార్యకర్తలకు నరకయాతన పెట్టేవాడు. చిన్నవాడన్న దయ లేకుండా సుశీల్ కుమార్‌కు జడ్జి 15 కొరడాదెబ్బలను శిక్షగా విధించాడు. కానీ సాహసవంతుడైన ఆ యువకుడు ప్రతి కొరడాదెబ్బకు వందేమాతరం అని నినదిస్తూనే ఉన్నాడు. ఈ ఘటన తరువాత స్వతంత్ర వీరులంతా కింగ్స్‌ఫోర్డ్‌కు గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నారు. 1908 ఏప్రిల్ మొదటివారంలో యుగాంతర్ విప్లవ సంస్థకి చెందిన విప్లవ కారులు కొందరు కలకత్తాలో ఒక ఇంటిలో రహస్యంగా సమావేశమై కింగ్స్ఫోర్ట్ ను అంతం చెయ్యడానికి ఒక ప్రణాళిక రచించారు. ఆ సమావేశంలో అరవిందఘోష్ కూడా ఉన్నాడు. ఖుదీరాం బోస్‌ను, ప్రఫుల్లచాకి అనే మరో నవ యువకుడినీ ఈ పనికై నియమించారు. 1908 ఏప్రిల్ 30 రాత్రివేళ వీరిద్దరూ ముజఫర్‌పూర్ లోని యురోపియన్ క్లబ్ కు ఒక బాంబు, రివాల్వర్ తీసుకొనివెళ్లారు. కింగ్స్‌ఫోర్డ్ క్లబ్ వాహనం బయటకు రాగానే దానిపై బాంబును విసిరేసి ఇద్దరు చెరో దిక్కుకు పరిగెత్తి వెళ్లిపోయారు. అయితే ఆ వాహనంలో కింగ్స్‌ఫోర్డ్ లేడు. అతని భార్య, కుమార్తెలు మాత్రమే ఉన్నారు. ఆ తరువాత ఒక రైల్వే స్టేషన్లో టీ తాగుతుండగా ఖుదీరాం బోస్‌ను పోలీసులు పట్టుకోగలిగారు. ఖుదీరాంను నిర్బంధించి రెండునెలలపాటు విచారణ చేశారు. ముజఫర్‌పూర్ బాంబు కేసులో ఫోర్డ్ భార్య, కుమార్తెల మరణానికి కారకుడైన ఖుదీరాంకు మరణశిక్ష విధించారు. 1908 ఆగస్టు 11న ఈ శిక్ష అమలైంది. పెదవులపై చిరునవ్వు చెదరకుండా ఖుదీరాం మృత్యువును ఆహ్వానించాడు. దేశం కోసం బలిదానం చేశాడు. నేడు ఖుదీరాం వర్ధంతి. -
హైదరాబాద్‌లో 75 ఫ్రీడమ్ పార్కులు
సాక్షి, హైదరాబాద్: దేశ స్వాతంత్య్రానికి 75 సంవత్సరాల సందర్భంగా వజ్రోత్సవాలు నిర్వహిస్తున్న రాష్ట్రప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రేటర్‌లోని 75 ఖాళీ ప్రదేశాల్లో ఫ్రీడమ్ పార్కుల ఏర్పాటును బుధవారం చేపట్టింది. వజ్రోత్సవం గుర్తుగా 75ను ప్రామాణికంగా తీసుకొని పనులు చేయనున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా 75 ఫ్రీడమ్ పార్కులకుగాను ఎల్బీనగర్, చార్మినార్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, సికింద్రాబాద్‌జోన్లలో 12 చొప్పున, ఖైరతాబాద్ జోన్లో 15 పార్కులు వెరసి మొత్తం 75 ఫ్రీడమ్‌పార్కులకు శ్రీకారం చుట్టారు. వాటిల్లో ప్లాంటేషన్ ప్రారంభించారు. ఈ పార్కుల్లోని వాకింగ్ ట్రాక్స్, బెంచీలు సైతం జెండా రంగులను కలిగి దేశ ఫ్రీడమ్‌ను గుర్తుచేస్తాయి. ఎటొచ్చీ ఫ్రీడమ్ థీమ్‌తోనే ఈ పార్కుల్ని అభివృద్ధి చేస్తారు. పార్కులకున్న స్థలాల్ని బట్టి 75 లేదా 750 లేదా 7500 మొక్కలు నాటుతున్నారు. 75 జాతులతో.. జూబ్లీహిల్స్‌లోని రోడ్‌నెంబర్ 36లోని రెండెకరాల విస్తీర్ణంలోని ఫ్రీడమ్ పార్కులో 75 జాతులకు చెందిన మొక్కల్ని ఒక్కో జాతివి పది చొప్పున 750 మొక్కలు నాటినట్లు జీహెచ్ఎంసీ జీవవైవిధ్యవిభాగం అధికారులు పేర్కొన్నారు. వీటితోపాటు 75 వెరైటీల ఔషధమొక్కలు ఒక్కో వెరైటీవి 100 చొప్పున 7500 మొక్కలు నాటుతున్నారు. 75 జాతుల్లో పొగడ, మర్రి, మోదుగు, కదంబ, మారేడు, జువ్వి, పొన్న, సంపంగి, గోవర్ధనం, ఎర్రచందనం, జమ్మి, ఫౌంటెన్ ట్రీ, గోవర్ధనం, వెలగ, బూరుగు, వేప తదితరమైనవి ఉన్నాయి. పూలు సైతం.. ఈ పార్కుల బోర్డులు సైతం వజ్రోత్సవాల ఎంబ్లమ్‌ను కలిగి ఉంటాయి. పార్కుల్లో నాటే మొక్కల పూలు సైతం జెండారంగులో కనిపించేలా ఆయా రంగుల మొక్కలు నాటుతున్నారు. ఉదాహరణకు 12 వరుసల్లో మొక్కలు వచ్చేచోట నాలుగేసి వరుసలు ఒక్కోరంగు చొప్పున జెండాలోని మూడు రంగుల్లో కనిపించేలా సంబంధిత మొక్కలు నాటుతున్నారు. భవిష్యత్‌లో ఎప్పుడు చూసినా అవి దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ప్రారంభించిన ప్రత్యేకపార్కులని తెలుస్తాయని అధికారులు పేర్కొన్నారు. వీటితోపాటు ఆయా రోడ్ల వెంబడి వర్టికల్ గార్డెన్స్, జంక్షన్లలో విగ్రహాలు, జలపాతాలు వంటివి సైతం జెండా రంగుల్లో స్వాతంత్య్రాన్ని గుర్తు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మ్యూజిక్ట్రాక్స్.. వాకర్స్ ఎక్కువగా వచ్చే చాచా నెహ్రూపార్క్, కేబీఆర్పార్క్, కేఎల్ఎన్యాదవ్ పార్క్, జేవీఆర్ పార్క్, కృష్ణకాంత్ పార్క్, ఏఎస్‌రావునగర్ పార్క్, ఉప్పల్ అర్బన్‌పార్క్, ఎన్జీఓకాలనీపార్క్, ఇందిరాపార్క్, సుందరయ్యపార్క్ వంటి పార్కుల్లో వాకింగ్ట్రాక్ల వెంబడి ఏర్పాటు చేసే మ్యూజిక్ సిస్టమ్‌లో ఉదయం, సాయంత్రం వేళల్లో మంద్రస్థాయిలో స్వాతంత్య్ర స్ఫూర్తి కలిగించే దేశభక్తిపాటలు వినిపించనున్నాయి. 15 రోజుల పాటు దేశభక్తి గీతాలు వినిపిస్తారు. అనంతరం ఇతర గీతాలు వినిపిస్తారు. నగరంలోని వివిధ పార్కుల గేట్లు, పార్కులోని కెర్బింగ్లు, బెంచీలు మాత్రమే కాదు.. కొద్దినెలల తర్వాత వాటిల్లోని మొక్కలు..పూచే పూలు సైతం జెండారంగుల్లో కనిపించనున్నాయి. అంతేకాదు.. పెద్ద పార్కుల ప్రహరీ గోడలపై స్వాతంత్య్ర సంగ్రామ ఘటనల దృశ్యాలు కనపడనున్నాయి. ఎవరైనా సరే వాటిని చూడగానే దూరం నుంచే ‘ఫ్రీడమ్’ పార్కులుగా గుర్తించేలా ఫ్రీడమ్ పార్కుల నిర్మాణానికి జీహెచ్ఎంసీ సిద్ధమైంది. -
సికింద్రాబాద్ మహాత్మాగాంధీ రోడ్డు ఏరియాకు ఎన్నో ప్రత్యేకతలు
సాక్షి, హైదరాబాద్: 75 ఏళ్ల భారత స్వాతంత్ర సమరోత్సవాన్ని పురస్కరించుకొని.. అప్పటి మహా సంగ్రామ సమయంలో హైదరాబాద్ నగరంతో ముడిపడి ఉన్న అద్భుత ఘట్టాలను ‘సాక్షి’ ప్రత్యేకంగా గుర్తు చేస్తోంది. ఇందులో భాగంగా మహాత్మా గాంధీ మొదటిసారి నగరంలో పర్యటించిన సందర్భానికి ప్రత్యేక విశేషముంది. 1929 ఏప్రిల్ 7వ తేదీన గాంధీ మొదటిసారి నగరానికి విచ్చేశారు. ఆ రోజు జేమ్స్ స్ట్రీట్ రైల్వే స్టేషన్లో దిగిన గాంధీజీ. అక్కడి నుంచి సుల్తాన్ బజార్ చేరుకున్నారు. ఈ సందర్భానికి గుర్తుగా భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన తరువాత జేమ్స్ స్ట్రీట్‌కు ఎంజీ (మహాత్మా గాంధీ) రోడ్డుగా నామకరణం చేశారు. అంతకు ముందు ఈ ప్రాంతంలో నివాసమున్న జేమ్స్ కిర్క్‌పాట్రిక్ పేరు మీద ఆ వీధిని జేమ్స్ స్ట్రీట్‌గా పిలిచారు. వ్యాపారానికి కేంద్రం ప్రస్తుత ఎంజీ రోడ్డు జేమ్స్ స్ట్రీట్‌గా పిలువబడుతున్నప్పటి నుంచే ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో జేమ్స్ స్ట్రీట్ వ్యాపారానికి కేంద్రంగా ఉండేది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వర్తక వ్యాపారాలకు చెందిన పెద్ద షాప్‌లు దర్శనమిస్తాయి. దాదాపు 150 ఏళ్ల నుంచి ఈ ప్రాంతంలో గోల్డ్ మార్కెట్ అభివృద్ధి చెందుతూ వస్తుంది. జనరల్ బజార్, క్లాత్ మార్కెట్‌కు ఎంజీ రోడ్డు మీదుగానే చేరుకునేవారు. ఇక్కడి వస్త్ర వ్యాపారం గురుంచి తెలుసుకున్న మహాత్మా గాంధీ ప్రత్యేకంగా అభినందించారు. దేశంలోని వస్త్ర వ్యాపారానికి హైదరాబాద్–సికింద్రాబాద్ జంట నగరాలు ప్రత్యేక కేంద్రాలని కొనియాడారు. రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాహనాలు ఎంజీ రోడ్ మీదుగానే ప్రయాణిస్తాయి. నగరంలోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్, రాణీ గంజ్ బస్ డిపో, జూబ్లీ బస్టాండ్లకు మధ్య వారధిగా కూడా ఎంజీ రోడ్ ఉంటుంది. ప్రభుత్వం వారసత్వ కట్టడంగా గుర్తించిన మలానీ భవనం కూడా ఎంజీ రోడ్లోనే ఉంది. ఈ భవనాన్ని నిర్మించిన దేవాన్ బహదూర్ రాంగోపాల్ మలానీ పోలీసు శాఖకు విరాళంగా ఇవ్వగా..ఈ భవనం పోలీస్ స్టేషన్‌గా మారింది. ఇక్కడే ఉన్న గడియారాన్ని 1998లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారసత్వ సంపదగా గుర్తించింది. ఆ విగ్రహం.. ఎంతో ప్రత్యేకం.. ప్రస్తుతం ఎంజీ రోడ్లో ఉన్న ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ప్యారడైజ్ బిర్యానీ రెస్టారెంట్ స్థానంలో ప్యారడైజ్ థియేటర్ ఉండేది. ఆ థియేటర్ యజమాని తొడుపునూరి అంజయ్య గౌడ్ గాంధీజీ పర్యటనకు గుర్తుగా అప్పట్లోనే మహాత్మా గాంధీ విగ్రహాన్ని విరాళంగా అందించారు. 1951లో ఈ విషయం తెలుసుకున్న భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ స్వయంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ విగ్రహాన్ని పంచలోహాలతో ప్రత్యేకంగా ఇటలీలో తయారు చేయించారని సమాచారం. 70 ఏళ్లుగా ఈ విగ్రహం ఎంజీ రోడ్డులో అందరికీ కనిపిస్తుంది. ఈ గాంధీ సర్కిల్‌కు ఇటీవల జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో సుందరీకరణ పనులను చేపట్టారు. -
ఏపీలో త్రివర్ణ పతాక ర్యాలీలు(ఫొటోలు)
-
విజయవాడలో భారీ మువన్నెల జెండా (ఫొటోలు)
-
సామ్రాజ్య భారతి: 1936,1937/1947
ఘట్టాలు: ‘టెంపుల్ ఎంట్రీ ప్రొక్లమేషన్’తో హిందూ ఆలయ ప్రవేశానికి ‘అట్టడుగు వర్ణాలు’ అని పిలవబడేవారిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసిన ట్రావెన్కూర్ మహారాజు చితిర తిరునాళ్ బలరామ వర్మ. కేరళ యూనివర్సిటీ ఏర్పాటు. ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ స్థాపన. చట్టాలు: పేమెంట్ ఆఫ్ వేజస్ యాక్ట్, పార్సీ మ్యారేజ్ అండ్ డైవోర్స్ యాక్ట్. అగ్రికల్చరల్ ప్రొడ్యూజ్ (గ్రేడింగ్ అండ్ మార్కింగ్) యాక్ట్, ముస్లిం పర్సనల్ లా (షరియత్) అప్లికేషన్ యాక్ట్, ఆర్య మ్యారేజ్ వాలిడేషన్ యాక్ట్ వైజయంతిమాల : తమిళనటి, భరతనాట్య ప్రవీణ (మద్రాసు); నూతన్ : బాలీవుడ్ నటి (బాంబే); జుబిన్ మెహ్తా : పాశ్చాత్య శాస్త్రీయ సంగీత నిర్వాహకులు (బాంబే); డి.రామానాయుడు : సినీ నిర్మాత (కారంచేడు); వేటూరి : సినీ గేయ రచయిత (పెదకళ్లేపల్లి); చిట్టిబాబు : సంగీతజ్ఞులు, కర్ణాటక సంగీత వైణికులు (కాకినాడ); విజయబాపినీడు : సినీ రచయిత, దర్శకులు (చాటపర్రు). రామచంద్ర గాంధీ : తత్వవేత్త, గాంధీజీ మనవడు (మద్రాసు); అనితా దేశాయ్ : నవలా రచయిత్రి, (ముస్సోరి); రతన్‌టాటా : పారిశ్రామికవేత్త (బాంబే); శోభన్‌బాబు : సినీ నటులు (నందిగామ); లక్ష్మీకాంత్ శాంతారామ్ : లక్ష్మీకాంత్, ప్యారేలాల్ ద్వయంలో ఒకరు. బాలీవుడ్ సంగీత దర్శకులు (బాంబే); రావుగోపాలరావు : సినీ నటుడు (కాకినాడ). (చదవండి: శతమానం భారతి: కొత్త పార్లమెంట్ ) -
మహోజ్వల భారతి: విదేశం బహిష్కరించిన తెలుగు వీరుడు
తెలుగు వీరుడు: వి.వి.గిరిగా ప్రసిద్ధులైన వరాహగిరి వేంకటగిరి భారతదేశ నాల్గవ రాష్ట్రపతి. మన తెలుగువారు! నేడు ఆయన జయంతి. 1894 ఆగస్టు 10న అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలోని గంజాం జిల్లాకు చెందిన బెర్హంపూర్‌లో జన్మించారు. వి.వి.గిరి తండ్రి వరాహగిరి వెంకట జోగయ్య, తల్లి సుభద్రమ్మ. వెంకట జోగయ్య ప్రసిద్ధి చెందిన న్యాయవాది. తూర్పుగోదావరి జిల్లాలోని చింతల పూడి నుండి బరంపురానికి ఈ కుటుంబం వలస వెళ్లింది. వి.వి.గిరి 1913 ఐర్లండ్‌లోని డబ్లిన్ యూనివర్శిటీ కళాశాలలో న్యాయశాస్త్రం అభ్యసించడానికి వెళ్లారు. ఐర్లండ్‌లో ‘సీన్‌ఫెన్’ జాతీయోద్యమంలో పాల్గొని ఆ దేశ బహిష్కరణకు గురయ్యాడు. ఆ ఉద్యమ కాలంలోనే ఆయనకు ఈమొన్ డి వలేరా, డెస్మండ్ ఫిట్జెరాల్డ్, ఈయోన్ మెక్నీల్, జేమ్స్ కాన్నలీ వంటి రాజకీయ ఉద్యమనేతలతో సాన్నిహిత్యం ఏర్పడింది. ఇండియా తిరిగి వచ్చాక ఇక్కడ క్రియాశీలకంగా ఉన్న కార్మిక ఉద్యమంలో పాల్గొన్నారు. అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్‌కు అధ్యక్షునిగా పని చేశారు. అనంతరం 1934లో ఇంపీరియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో సభ్యుడయ్యారు. 1936లో మద్రాసు రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభ అభ్యర్థిగా బొబ్బిలి రాజా పై పోటీ చేసి గెలిచారు. 1937లో మద్రాసు ప్రావిన్స్‌లో రాజాజీ నేతృత్వంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్మిక, పరిశ్రమల మంత్రిగా పనిచేశారు. 1942లో దేశంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ రాజీనామా చేసిన ప్పుడు, వి.వి. గిరి తిరిగి క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా కార్మిక ఉద్యమాన్ని నడిపి జైలుకు వెళ్లారు. 1975లో వి.వి.గిరికి భారత ప్రభుత్వం ‘భారత రత్న’ అవార్డు ప్రదానం చేసింది. ప్రసన్న కవి ప్రసన్న కవి శంకరంబాడి సుందరాచారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతమైన ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ రచయిత. నేడు ఆయన జయంతి. 1914 ఆగష్టు 10 న తిరుపతిలో జన్మించారు. మదనపల్లెలో బిసెంట్ థియొసాఫికల్ కళాశాలలో ఇంటర్మీడియట్ వరకు చదివారు. చిన్నతనం నుండే ఆయన స్వతంత్ర భావాలు కలిగి ఉండేవారు. భుక్తి కోసం ఎన్నో పనులు చేశారు. హోటలు సర్వరుగా, రైల్వే స్టేషనులో కూలీగా కూడా పనిచేశారు. ‘ఆంధ్ర పత్రిక’లో ప్రూఫ్ రీడర్‌గా, పాఠశాల ఉపాధ్యాయుడిగా, పాఠశాల పర్యవేక్షకుడిగా కూడా చేశారాయన. మహాత్మా గాంధీ హత్య జరిగినపుడు ఆవేదన చెంది, ‘బలిదానం’ అనే కావ్యం రాశారు. అది ఎంతో మందిని కదిలించింది. కన్నీరు తెప్పించింది. సుందరాచారికి అమితమైన ఆత్మగౌరవం. దాని కోసం ఉద్యోగాలు కూడా వదులుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య వేదమ్మాళ్ మనోవ్యాధిగ్రస్తురాలైన కారణంగా ఆయన వేదన చెంది, జీవిత చరమాంకంలో నిర్లిప్త జీవితం గడిపారని అంటారు. 2004లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తిరుపతి పట్టణం తిరుచానూరు రోడ్డులోని అన్నపూర్ణేశ్వరి సర్కిల్లో సుందరాచారి జ్ఞాపకార్థం ఆయన కాంస్య విగ్రహాన్ని నెలకొల్పింది. శంకరంబాడి సుందరాచారిని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రసన్న కవి అని గౌరవించింది. ఆయనను భావకవి అనీ, అహంభావకవి అని కూడా అనేవారు. సుందరకవి అన్నది ఆయన మరోపేరు. (చదవండి: స్వతంత్ర భారతి: మిస్ వరల్డ్ మానుషి) -
స్వతంత్ర భారతి: మిస్ వరల్డ్ మానుషి
హర్యానాకు చెందిన ఇరవై ఏళ్ల యువతి మానుషి చిల్లర్ ‘మిస్ వరల్డ్’ టైటిల్ గెలుచుకున్నారు. 2000 సంవత్సరంలో ప్రియాంక చోప్రా మిస్ట్ వరల్డ్ విజేతగా ఎన్నికైన పదిహేడేళ్లకు మళ్లీ భారత్‌కు ఈ ఘనతను మానుషి సాధించిపెట్టారు. చైనాలోని శాన్యా సిటీలో నవంబర్ 18న జరిగిన ప్రపంచ సుందరి అందాల పోటీల ఫైనల్స్‌లో 117 మందితో మానుషి పోటీ పడి టైటిల్ గెలిచారు. మానుషి ఢిల్లీలోని సెయింట్ థామస్ స్కూల్లో చదువుకున్నారు. సి.బి.ఎస్.ఇ.లో ఇంగ్లిష్ సబ్జెక్టులో ఆలిం డియా టాపర్‌గా నిలిచారు. తొలి ప్రయత్నంలోనే ‘నీట్’లో సీటు సాధించి సోనిపట్ (హర్యానా) లోని భగత్ ఫూల్ సింగ్ మెడికల్ కాలేజీలో ఎం.బి.బి.ఎస్.లో చేరారు. ఆమె కూచిపూడి డ్యాన్సర్ కూడా. రాజా రాధారెడ్డి దంపతుల దగ్గర నాట్యం నేర్చుకున్నారు. ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు జూన్ 30 అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చిన జి.ఎస్.టి. 92 ఏళ్లుగా ప్రభుత్వం విడిగా ప్రవేశపెడుతున్న రైల్వే బడ్జెట్ సాధారణ బడ్జెట్లో విలీనం. కొచ్చి, హైద్రాబాద్ల మెట్రో రైళ్లు ప్రారంభం. భారత 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్. బెంగళూరులో సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్‌ను తుపాకీతో కాల్చి చంపిన దుండగులు. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ. (చదవండి: భయంకర వెంకటాచారి: గాంధీమార్గం వీడి బాంబులతో జోడీ) -
చైతన్య భారతి: అణకువ కలిగినవాడు.. ఇనాయతుల్లా అల్ మష్రికి
భారత స్వాతంత్య్ర సమరంలో జాతీయ కాంగ్రెస్, ముస్లింలీగ్, గదర్ పార్టీ, హిందూ మహాసభ, స్వరాజ్య పార్టీ హిందుస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ వంటివెన్నో కనిపిస్తాయి. అలాంటిదే ఖక్సర్ తెహ్రీక్. ఖక్సర్ అంటే అర్థం అణకువ కలిగినవాడు. నలభై లక్షల సభ్యత్వంతో (1942 నాటికి), దేశంలోను, విదేశాలలో కూడా శాఖలు నెలకొల్పింది. దీని మీద గట్టి నిర్బంధం ఉండేది. బ్రిటిష్ ప్రభుత్వం అణచివేతే కాదు, మహమ్మద్ అలీ జిన్నా నాయకత్వంలోని అఖిల భారతీయ ముస్లిం లీగ్ కూడా ఖక్సర్‌ను పరమ శత్రువులాగే చూసింది. లాహోర్ కేంద్రంగా ఉద్యమించిన ఈ ఖక్సర్ తెహ్రీక్‌ను 1931లో అల్లామా ఇనాయతుల్లా అల్ మష్రికి స్థాపించారు. సంస్థ నిబంధనలకు కచ్చితంగా లోబడి ఉండడమే కాదు, సభ్యులు ఉద్యమానికి సమయం ఇవ్వడంతో పాటు, దేశం కోసం ఎవరి వ్యయం వారే భరించాలి. అచ్చంగా బ్రిటిష్ పోలీసుల యూనిఫామ్‌ను పోలి ఉన్న దుస్తులు ధరించేవారు. దాని మీద సోదరత్వం అన్న నినాదం (ఉఖూవ్వాత్) ఉండేది. నాయకుడు సహా అంతా ఇదే ధరించేవారు. మష్రికి అనేకసార్లు కారాగారవాసం అనుభవించాడు. 1942 జనవరి 19 న వెల్లూరు జైలు నుంచి విడుదలచేసి మద్రాస్ ప్రెసిడెన్సీ దాటకూడదని ఆయనపై ఆంక్షలు విధించారు. సంస్కరణ, వ్యక్తి నిర్మాణం, దేశం కోసం త్యాగం ఖక్సర్ ఆశయాలు. ఇరుగు పొరుగులకు సేవ... కార్యక్రమంలో అంతర్భాగం. ఇక్కడ ముస్లింలు, ముస్లిమేతరులు అన్న భేదం లేదు. పరిసరాలను శుభ్రం చేస్తూ, పేదలు, వృద్ధులు, రోగులకు సేవలు అందించాలి. మష్రికి ఇస్లామిక్ పండితులు, మేధావిగా గుర్తింపు పొందారు. అమృత్‌సర్‌కు చెందిన ముస్లిం రాజ్‌పుత్ కుటుంబంలో జన్మించిన మష్రికి కేంబ్రిడ్జ్ నుంచి గణితశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. 1912లో స్వదేశం వచ్చి 25 ఏళ్లకే కళాశాల ప్రిన్సిపాల్ అయ్యారు. 29 ఏళ్లకి విద్యాశాఖ అండర్ సెక్రటరీ అయ్యారు. మష్రికి 1939లో బ్రిటిష్ ప్రభుత్వానికి తుది హెచ్చరికలు చేయడం ఆరంభించాడు. దాంతో ఖక్సర్ ప్రమాదకరంగా తయారైందని పంజాబ్ గవర్నర్ హెన్రీ డఫీల్డ్ వైస్రాయ్ లిన్ లిత్‌గోకు నివేదిక పంపించాడు. ఇలాంటి నివేదికే మధ్య పరగణాల నుంచి కూడా వెళ్లింది. ఓసారి ఢిల్లీలో ప్రసంగిస్తూ మష్రికి మీద జిన్నా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మష్రికి ఒక ఉన్మాది అని వ్యాఖ్యానించారు. ఇదే బ్రిటిష్ ప్రభుత్వానికి ఉపకరించింది. మష్రికితో మరింత కర్కశంగా వ్యవహరించడం మొదలుపెట్టింది. అయినప్పటికీ ఆయన జీవితాంతం తన సిద్ధాంతాలకే కట్టుబడి ఉన్నారు. 75 ఏళ్ల వయసులో క్యాన్సర్‌తో మర ణించారు. -
భయంకర వెంకటాచారి: గాంధీమార్గం వీడి బాంబులతో జోడీ
గాంధీ– ఇర్విన్ ఒప్పందంలో భాగంగా ఖైదీల విడుదల జరిగినప్పుడు భయంకర్ కూడా విడుదలయ్యారు. ఈ ఘటన అనంతరం ఆయన భావజాలంలో మార్పు వచ్చింది. కేవలం విప్లవం ద్వారా మాత్రమే సంపూర్ణ స్వతంత్రం సిద్ధిస్తుందని ఆయన భావించారు. పేరులో మాత్రమే కాదు చర్యలతో కూడా వలసపాలకులకు దడ పుట్టించిన పోరాట యోధుడు భయంకర వెంకటాచార్యులు. బ్రిటిష్‌వారి తొత్తులుగా పనిచేసే స్థానిక అధికారులను మట్టుబెట్టి తద్వారా వారిలో భయాందోళనలు సృష్టించడానికి ప్రయత్నించిన వ్యక్తి. కాకినాడ బాంబు కేసుగా ప్రసిద్ధి గాంచిన కేసులో ప్రథమ ముద్దాయి. విప్లవ భావాలు కల దేశభక్తుడు భయంకరాచారిని స్థానికులు ఆంధ్రా భగత్ సింగ్ అనేవారు. సాహో లాహోర్ తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో 1910లో జన్మించిన భయంకరాచారి పదో తరగతి వరకు అక్కడే చదివారు. అనంతరం విశాఖలో చదువు కొనసాగించారు. చదువుకునే రోజుల్లోనే ఆయన లాహోర్ కాంగ్రెస్ సమావేశాలకు హాజరయ్యారు. అనంతరం గాంధీ పిలుపు మేరకు ఉప్పు సత్యాగ్రహంలో చురుగ్గా పాల్గొన్నారు. గురజానపల్లిలో ఆయన ఉప్పు సత్యాగ్రహం నిర్వహిస్తుండగా అరెస్టయి జైలుకు వెళ్లారు. గాంధీ– ఇర్విన్ ఒప్పందంలో భాగంగా ఖైదీల విడుదల జరిగినప్పుడు ఆయన కూడా విడుదలయ్యారు. ఈ ఘటన అనంతరం ఆయన భావజాలంలో మార్పు వచ్చింది. కేవలం విప్లవం ద్వారా మాత్రమే సంపూర్ణ స్వతంత్రం సిద్ధిస్తుందని ఆయన భావించారు. ఇందుకోసం బ్రిటిష్ ప్రభుత్వం కింద పనిచేస్తూ స్వదేశీయులపై దమనకాండ జరిపే అధికారులను మట్టుబెట్టాలని ఆలోచన చేశారు. దీనివల్ల బ్రిటిషర్లకు స్థానికాధికారుల సాయం తగ్గుతుందని భావించారు. డీఎస్పీకి ముహూర్తం! ఆ సమయంలో కాకినాడలో ముస్తఫా ఆలీ ఖాన్ డీఎస్పీగా పనిచేస్తుండేవాడు. ఆయన కింద డప్పుల సుబ్బారావనే సీఐ ఉండేవాడు. వారిద్దరూ స్వతంత్ర సమర యోధుల పట్ల అత్యంత కర్కశంగా ప్రవర్తించేవారు. వారికి తగిన గుణపాఠం చెప్పాలని భయంకరాచార్యులు నిర్ణయించుకున్నారు. కామేశ్వర శాస్త్రి తదితరులు ఆయనకు సహకరించేందుకు అంగీకరించారు. వీరంతా కలకత్తా, బొంబాయి, పాండిచ్చేరి నుంచి బాంబు తయారీ సామగ్రిని తెప్పించి తమ ప్రణాళికను కొనసాగించారు. ఈ పనులన్నీ రహస్యంగా చేసినప్పటికీ, తమకో బహిరంగ కార్యక్షేత్రంగా ఉండేందుకు గాను సి.హెచ్.ఎన్.చారి అండ్ సన్స్ అనే ఒక దొంగ కంపెనీని పెట్టారు. అయితే 1933 ఏప్రిల్ 6, 14 తేదీలలో చేసిన వీరి యత్నాలు రెండూ విఫలమయ్యాయి. అనంతరం ఏప్రిల్ 15న మూడో ప్రయత్నానికి వీరంతా సిద్ధమయ్యారు. కాకినాడలో కాపుగాసి 1933 ఏప్రిల్ 15న ముస్తఫా కాకినాడ వస్తాడని తెలుసుకొన్న భయంకరాచార్యుల బృందం బాంబులు తయారుచేసుకొని పోర్టులో మాటు వేసారు. కానీ మూడోసారి కూడా ముస్తఫా అటు వైపు రాలేదు. దీంతో ఈదఫా ముస్తఫాను చంపకుండా ఇంటికి వెళ్లకూడదని నిర్ణయించుకొని, బాంబులను అక్కడే ఉన్న ఒక పడవలో ఒక సంచిలో పెట్టి, దగ్గరలో ఉన్న హోటలుకు కాఫీ తాగేందుకు వెళ్లారు. వీళ్లు కాఫీ తాగుతూండగా రేవు కూలీ ఒకతను పడవలో ఉన్న సంచీని చూసి కుతూహలం కొద్దీ సంచీని తెరచి బాంబులను బయటికి తీసాడు. బాంబు పేలింది. ఆ కూలీతో సహా తొమ్మిది మంది గాయపడ్డారు. పేలుడు స్థలానికి కేవలం కొన్ని వందల గజాల దూరంలోనే ఉన్న ముస్తఫా, పేలుడును విని వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాడు. తక్షణం దర్యాప్తు మొదలైంది. ఘటనా స్థలంలో మరో మూడు బాంబులు దొరికాయి. అదొక విప్లవకారుల కుట్ర అని, అధికారులను చంపే పథకమనీ ఓ ఐదు రోజుల వరకూ దర్యాప్తు అధికారులకు తెలియలేదు. ఐదు రోజుల తరువాత కాకినాడకు చెందిన ఎస్.కె.వి.రాఘవాచారి అనే వ్యక్తి రామచంద్రాపురం పోలీసులకు కుట్ర సంగతి వెల్లడించడంతో విషయం బైటపడింది. అండమాన్‌లో ఏడేళ్లు అనంతరం పోలీసులు కుట్రలో పాల్గొన్న వారిని ఒక్కొక్కర్ని పట్టుకున్నారు. ఆ ఏడాది సెప్టెంబర్ 11 న భయంకరాచారిని ఖాజీపేట్ రైల్వే స్టేషన్లో పట్టుకున్నారు. డిసెంబరు 1933 నుండి ఏప్రిల్ 1934 వరకు తూర్పు గోదావరి జిల్లా సెషన్సు కోర్టు ఈ కేసును విచారించింది. మొత్తం తొమ్మిది మంది కుట్రదారులకు వేరువేరు శిక్షలు విధించింది. సెషన్సు కోర్టు ఇచ్చిన తీర్పుపై నిందితులు మద్రాసు హైకోర్టుకు వెళ్లారు. అక్కడ తీర్పు 1935 సెప్టెంబరు 26 న వచ్చింది. హైకోర్టు మాత్రం భయంకరాచార్యులు, కామేశ్వరశాస్త్రిలను మాత్రమే కుట్రకు ప్రధాన నిందితులుగా పేర్కొంది. మిగిలిన ఏడుగురినీ అప్పటికే వారు గడిపిన రెండేళ్ల శిక్ష సరిపోతుందని భావించి విడుదల చేసింది. భయంకరాచారికి ఏడేళ్ల జైలుశిక్షను విధించి, అండమాను జైలుకు పంపింది. కామేశ్వరశాస్త్రికి నాలుగేళ్ల శిక్ష విధించింది. 1937 లో ప్రాంతీయ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినపుడు భయంకరాచారి జైలు నుండి విడుదలయ్యారు. జైలు నుంచి వచ్చాక ఆయన ‘క్రైగ్స్ పారడైజ్’ అని అండమా¯Œ లో దుర్భర పరిస్థితులను వర్ణిస్తూ పుస్తకం రాశారు. తర్వాత రోజుల్లో ఆయన ప్రకాశం పంతులుగారికి మద్దతుదారుగా మారారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నెహ్రూ ప్రభుత్వంలో ఉద్యోగం చేశారు. 1978లో మరణించారు. – దుర్గరాజు శాయి ప్రమోద్ -
శతమానం భారతి: కొత్త పార్లమెంట్
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 12 కంటే నాలుగు రోజులు ముందుగానే ముగిశాయి. ఈ సమావేశాల్లోనే కొత్త బిల్లులు ఆమోదం పొందాయి. దేశానికి కొత్త రాష్ట్రపతి వచ్చారు. కొత్త ఉపరాష్ట్రపతి వచ్చారు. ఇక మిగిలింది కొత్త పార్లమెంటు! రానున్న శీతాకాల సమావేశాలను కొత్త పార్లమెంటు భవనంలో నిర్వహిం చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రు. 13,450 కోట్ల అంచనాతో మోదీ ప్రభుత్వం తలపెట్టిన ‘సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్టు’లో భాగంగా కొత్త పార్లమెంటు భవన నిర్మాణం జరిగింది. ప్రాజెక్టులోని మొత్తం నిర్మాణాలు 2026 నాటికి పూర్తి చెయ్యాలన్న సంకల్పంతో సెంట్రల్ విస్టా పనులు జరుగుతున్నాయి. చదవండి: ఉళ్లాల రాణి అబ్బక్క.. ఐదు యుద్ధాల విజేత ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న కొత్త పార్లమెంటు భవనంపై దేశ జాతీయ చిహ్నమైన అశోకస్తంభం ఆవిష్కరణ ఇటీవలే జరిగింది. ప్రధాని మోదీ సూచించిన విధంగా నవ, స్వయం సమృద్ధ భారతదేశపు మౌలిక ఆలోచనా విధానాలను ప్రతిబింబించే రీతిలో ఈ కొత్త పార్లమెంటు భవన నిర్మాణం జరిగింది. ఈ నేపథ్యంలోనే జూలై 11న మోదీ అక్కడ అశోక స్తంభాన్ని ఆవిష్కరించారు. కాంస్యంతో తయారు చేసిన ఈ జాతీయ చిహ్నం 21 అడుగుల పొడవు, 9500 కిలోల బరువు, 3.3–4.3 మీటర్ల చుట్టు కొలతతో ఉంటుంది. నవ భారతం ఆకాంక్షలు ఇకపై ఈ కొత్త పార్లమెంటు ద్వారా నెరవేరనున్నాయి. భారతదేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమాధికారాల పరిరక్షణ దిశగా జాతీయ చిహ్నం ఉత్తేజం ఇస్తూ ఉంటుంది. అమృతోత్సవాల ముగింపు నాటికి కాస్త ముందే నిర్మాణం పూర్తి చేసుకున్న కొత్త పార్లమెంటు భవనం.. భారత్ పురోగతికి ఒక ముందడుగు సంకేతంగా భాసిల్లుతోంది. -
సామ్రాజ్య భారతి:1934,1935/1947 ఘట్టాలు
ఘట్టాలు శాసనోల్లంఘన ఉద్యమాన్ని నిలిపివేసిన గాంధీజీ. భారత కమ్యూనిస్టు పార్టీపై బ్రిటిష్ ప్రభుత్వ నిషేధం. చట్టాలు: వారానికి 65 గంటల పని చట్టం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్, సుగర్కేన్ యాక్ట్, ఇండియన్ ఎయిర్‌క్రాఫ్ట్ యాక్ట్, పెట్రోలియం యాక్ట్, డాక్ లేబరరర్స్ యాక్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ –1935 జననాలు: మహేంద్ర కపూర్ : సి.నే. గాయకులు (అమృత్సర్); విజయ్ ఆనంద్ : సినీ దర్శక, నిర్మాత (గురదాస్‌పూర్); కాన్షీరామ్ : బహుజన్ సమాజ్ పార్టీ స్థాపకులు (రూప్‌నగర్); రస్కిన్ బాండ్ : బాలల రచయిత (హిమాచల్‌ప్రదేశ్); ప్రతిభా పాటిల్ : భారతదేశ తొలి మహిళా రాష్ట్రపతి (మహారాష్ట్ర); చో రామస్వామి : ‘తుగ్లక్’ పత్రిక సంపాదకులు (చెన్నై); శ్యామ్ బెనెగల్ : సినీ దర్శకులు (సికింద్రాబాద్); రాజశ్రీ : సినీ గేయ రచయిత, డైలాగ్ రైటర్ (విజయనగరం). జయేంద్ర సరస్వతి : ఆథ్యాత్మిక గురువు (తమిళనాడు); ప్రేమ్ చోప్రా : బాలీవుడ్ నటుడు (లాహోర్); సలీమ్ ఖాన్ : బాలీవుడ్ నటుడు (ఇండోర్); ప్రణబ్ ముఖర్జీ : భారత 13వ రాష్ట్రపతి (ప.బెం.); సావిత్రి : సీనియర్ నటి (చిర్రావూరు); పి.సుశీల : గాయని (విజయనగరం); కైకాల సత్యనారాయణ : నటులు (కౌతారం); రాజసులోచన : నటి, శాస్త్రీయ నృత్యకారిణి (విజయవాడ); డాక్టర్ ప్రభాకరరెడ్డి : నటులు (తుంగతుర్తి); తెన్నేటి హేమలత : రచయిత్రి (విజయవాడ); సి.ఎస్.రావ్ : సినీ రచయిత (ద్రాక్షారామం) (చదవండి: చైతన్య భారతి: ఇరోమ్ చాను షర్మిల, పౌర హక్కుల కార్యకర్త.. నిరశన ఉద్యమం!) -
India@75: పెద్ద నోట్ల రద్దు
2016 నవంబర్ 8 అర్ధరాత్రి నుంచి 500, 1000 రూపాయల నోట్లు రద్దయ్యాయి. అవినీతిపై పోరాడేందుకు, నల్లధనం సమస్యను పరిష్కరించేందుకు పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు భారత ప్రభుత్వం చేసిన ఆ అకస్మాత్తు ప్రకటన దేశ రాజకీయాల్లో కలకలం రేపింది. కొన్ని నెలల పాటు ప్రజా జీవితం స్తంభించిపోయింది. ఆరోజు జాతిని ఉద్దేశించి చేసిన ప్రత్యేక ప్రసంగంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లు చెల్లవని ప్రకటించడం తోపాటు, కొత్త 500, 2000 నోట్లు చెలామణిలోకి తెస్తున్నట్లు వెల్లడించారు. ఉగ్రవాదులకు ఆర్థిక వనరుగా మారిన దొంగనోట్ల మాఫియాను, దేశంలోని నల్లధనాన్ని నియంత్రించేందుకు నోట్లను రద్దు చేసినట్లు తెలిపారు. నోట్ల రద్దు ప్రకటన అనంతరం దేశవ్యాప్తంగా నవంబర్ 9, 10 తేదీలలో ఏటీఎం లను, అన్ని బ్యాంకులను మూసి ఉంచారు. పాత పెద్ద నోట్లను కొత్తవాటితో మార్చుకునేందుకు 2016 డిసెంబర్ 31 వరకు గడువు ఇచ్చారు. అనంతరం ఆ గడువును 2017 మార్చి 30 వరకు పొడిగించారు. ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు జయలలిత, చో రామస్వామి, ముఫ్తీ మొహమ్మద్ సయ్యద్, నాయని కృష్ణకుమారి, పరమేశ్వర్ గోద్రెజ్.. కన్నుమూత పార్లమెంటులో జి.ఎస్.టి. బిల్లుకు ఆమోదం. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో 26 ఏళ్ల దళిత పిహెచ్.డి. స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య. అత్యంత వేగంగా ప్రయాణించే ‘గతిమాన్ ఎక్స్‌ప్రెస్’ రైలు ఢిల్లీ ఆగ్రాల మధ్య ప్రారంభం. (చదవండి: శతమానం భారతి: లక్ష్యం 2047.. కృత్రిమ మేధస్సు) -
ఉళ్లాల రాణి అబ్బక్క.. ఐదు యుద్ధాల విజేత
పోర్చుగీస్ దురాక్రమణదారులకు, ఉళ్లాల రాణి అబ్బక్కదేవికి మధ్య ఐదు యుద్ధాలు జరిగాయి. ఐదు యుద్ధాల్లోనూ రాణి అబ్బక్క ప్రతిఘటనను ఎదుర్కోలేక పరాజయంతో వెనక్కు మళ్లింది పోర్చుగీస్ సైన్యం. ప్రత్యక్ష యుద్ధ క్షేత్రంలో ఖడ్గం తిప్పిన అబ్బక్క.. తొట్ట తొలినాళ్ల భారత స్వాతంత్య్ర సంగ్రామ యోధురాలిగా చరిత్రలో నిలిచిపోయారు. పోర్చుగీస్ నావికుడు వాస్కోడగామా మన దేశానికి సముద్రమార్గాన్ని కనిపెట్టిన 1498 లోనే మనకు ముప్పు మొదలైంది. ఆ తర్వాత కొన్నేళ్లకే పోర్చుగీస్ వారి అరాచకం మొదలైంది. వ్యాపారం నెపంతో వేళ్లూనుకుని పోయి తర్వాత ఆ ఓడ రేవులను స్వాధీనం చేసుకోడానికి కుయుక్తులు పన్నారు. అప్పటి నుంచి స్థానిక పాలకులకు పోర్చుగీస్ వారికి మధ్య యుద్ధాలు మొదలయ్యాయి. అలా మొదలైన యుద్ధాల్లో తుళునాడు రాజ్యంలోని ఉళ్లాల యుద్ధం ఒకటి. మంగుళూరు నగరానికి పది కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్ర తీరాన ఉంది ఉళ్లాల రాజ్యం. ఆ తుళు రాజ్యాన్ని అప్పుడు పరిపాలిస్తున్న వారు రాణి అబ్బక్క మహాదేవి. ఐదు యుద్ధాలలో పోర్చుగీస్ వారిని తరిమికొట్టిన ధీశాలి. రాయలవారి బంధువు అబ్బక్క రాణి అసలు పేరు అభయరాణి. ఆ పేరుకి తగ్గట్టే ఆమె ఏ మాత్రం భయం లేకుండా ధైర్యంగా పెరిగారు. వారిది చౌత వంశం. విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయల సమీప బంధువు తిరుమల రాయలుకు అన్న కూతురు అబ్బక్క. తిరుమల రాయలు ఆమెకు యుద్ధవిద్య లన్నీ నేర్పించారు. అలా అబ్బక్క బాణాలు వేయడం, కత్తియుద్ధం, గుర్రపు స్వారీలో ఆరితేరారు. రాజ్యపాలనను చేపట్టారు. పొరుగున ఉన్న బాన్ఘేర్ రాజ్యానికి రాజు లక్ష్మప్పతో అబ్బక్క వివాహం జరిగింది. కానీ వారి బంధం సయోధ్యతో కొనసాగలేకపోయింది. ఆమె పుట్టింటికి వచ్చేశారు. భర్త పెళ్లి కానుకగా ఇచ్చిన ఆభరణాలను కూడా వెనక్కి పంపించేశారు. సొంత రాజ్యాన్ని సమర్థంగా పాలించారు. రాణిగా ప్రజల్లో మంచి పేరు సంపాదించారు. అబ్బక్క జైన మతాన్ని అవలంబిం చినప్పటికీ ఆమె పాలనలో హిందూ, ముస్లింలతో పాటు ఇతర మతాల వారూ సౌకర్యంగా జీవించారు. సైన్యంలో కూడా అందరూ కలగలిసి ఉండేవారు. పొంచివున్న పోర్చుగీస్ పోర్చుగీస్ వాళ్లు గోవాను హస్తగతం చేసుకున్న తర్వాత దక్షిణముఖంగా విస్తరించాలనుకున్నారు. దక్షిణ కర్ణాటక తీరాన ఉన్న ఉళ్లాల.. రేవు పట్టణం. వ్యాపార సమృద్ధి గల రేవు. సుగంధద్రవ్యాలను పాశ్చాత్యదేశాలకు రవాణా చేయడానికి అనువైన ప్రదేశం. ఉళ్లాల పట్టణం అబ్బక్క రాజ్యానికి వాణిజ్య రాజధాని వంటిది. ఈ రేవు మీద డచ్, బ్రిటిష్ వాళ్ల కళ్లు కూడా పడ్డాయి. పశ్చిమ తీరాన పోర్చుగీస్ వాళ్లు ముందంజలో ఉండేవాళ్లు. ఆ సామ్రాజ్య విస్తరణ కాంక్షతోనే 1525లో మంగుళూరు మీద దాడి చేసి కోటను ధ్వంసం చేశారు. ఆ చర్యతో రాణి అబ్బక్క దేవి అప్రమత్తమయ్యారు. రాజ్యాన్ని పరిరక్షించు కోవడానికి చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. 1555లో పోర్చుగీస్‌వారు మరోసారి దాడికి సిద్ధమయ్యారు. కానీ, అబ్బక్క వ్యూహాలు వాళ్లకు అంతుపట్టకపోగా వాళ్లను అయోమయానికి గురిచేశాయి. వాళ్ల ఆధిపత్యాన్ని అంగీకరించి కప్పం కట్టాలని ఆదేశిస్తూ అడ్మిరల్ ఇవారో ద సిల్వేరా ద్వారా సందేశం పంపించారు. అందుకు ఆమె ససేమిరా అనడంతో రెండేళ్లలోనే మరోసారి యుద్ధానికి సిద్ధమైంది పోర్చుగీస్ సైన్యం. మంగుళూరు నగరాన్ని అగ్నికి ఆహుతి చేసినంత పని చేశారు, కానీ అబ్బక్క ప్రతిఘటనతో వెనుదిరగక తప్పలేదు. 1567లో నాలుగవ యుద్ధానికి కూడా సిద్ధమయ్యాయి పోర్చుగీస్ దళాలు. ఆ ప్రయత్నాన్ని కూడా తిప్పికొట్టారు అబ్బక్క. ఆ తర్వాత ఏడాదిలో జరిగిన ఐదవ యుద్ధంలో పోర్చుగీసు వాళ్లు ఉళ్లాల పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాయల్ కోర్టులోకి కూడా ప్రవేశించారు. ఆ క్షణంలో అబ్బక్క అక్కడి నుంచి చాకచక్యంగా తప్పించుకుని వెళ్లి ఒక మసీదులో ఉన్నారు. అదే రోజు రాత్రి ఆమె 200 మంది సైన్యంతో పోర్చుగీసు దళాల మీద మెరుపుదాడి చేశారు. జెనరల్ పీక్సోటోను సంహరించి, 70 మంది పోర్చుగీసు సైనికులను ఖైదీలుగా బంధించారు. ఆ దాడిలో అడ్మిరల్ మాస్కారెన్హాస్ వంటి వాళ్లు కూడా మరణించారు. చివరికి పోర్చుగీసు సేనలు ఉళ్లాల పట్టణాన్ని, మంగుళూరు కోటను వదిలి వెనక్కి వెళ్లిపోయాయి. ఆరవ యుద్ధం క్రీ.శ 1569లో రాణి అబ్బక్క పాల్గొన్న యుద్ధం ఆఖరి యుద్ధం. ఈ యుద్ధంలో ఆమె భర్త కూడా ఆమెకు ప్రత్యర్థిగా మారాడు! వైవాహిక బంధం విఫలమైన కారణంగా భర్త లక్ష్మప్ప ఆమె మీద కోపం పెంచుకున్నాడు. ప్రతీకారేచ్ఛతో అవకాశం కోసం చూస్తూ ఉన్న అతడు పోర్చుగీసు వారితో అంగీకారం కుదుర్చుకుని అబ్బక్కకు వ్యతిరేకంగా పావులు కదిపాడు. ఈ దాడిలో పోర్చుగీసు వాళ్లు మంగుళూరు కోటను, కుందాపూర్‌లోని ధాన్యాగారాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత కూడా లక్ష్మప్ప అందిస్తున్న సమాచారంతో అబ్బక్క రాణి మీద దాడులను కొనసాగిస్తూనే వచ్చారు. అప్పటి వరకు ఏకాకిగానే ఎదుర్కొన్న ఆమె 1570లో... పోర్చుగీసు పాలకుల ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తున్న బీజాపూర్, అహ్మద్ నగర్ సుల్తానులు, కోల్‌కతాలోని జమోరైన్ పాలకులతో కలిసి కొత్త రాజకీయ సమీకరణలతో వ్యూహరచన చేశారు. ఆ యుద్ధంలో జమోరైన్ జనరల్, కుట్టి పోకార్ మార్కర్ వంటి వాళ్లు పోర్చుగీస్ సైన్యాలను చెదరగొట్టారు. కానీ ఆమె భర్త తలపెట్టిన ద్రోహంతో అబ్బక్క ఆ యుద్ధంలో విజయానికి దూరమయ్యారు. పోర్చుగీసు వాళ్లు ఆమెను పట్టి కారాగారంలో బంధించారు. బందీగా కూడా ఆమె పాశ్చాత్య ఆధిపత్యాన్ని స్వీకరించడానికి ఏ మాత్రం సిద్ధపడలేదు. జైల్లో తిరుగుబాటు చేసి వీరోచితంగా ప్రాణాలు వదిలారు. – వాకా మంజులారెడ్డి (చదవండి: శతాధిక స్ఫూర్తి... ‘శెట్టూరు గాంధీ’ అలుపెరుగని పోరు ) -
జెండా మెరువంగా.. ఇంటింటా పండుగ!
దేశానికి బ్రిటీష్ పాలన నుంచి విముక్తి లభించిన రోజు.. భారతీయులు బానిస సంకెళ్లను తెంచుకున్న రోజు.. దేశమంతా స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న రోజు.. భరత జాతి ప్రతి ఏటా పండగ జరుపుకుంటోంది. మూడు రంగుల జెండా స్వేచ్ఛగా నింగికెగిసి 75 ఏళ్లు పూర్తవుతోందని చాటుతూ భారత దేశమంతా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. ఓ వైపు తెల్లదొరల పాలనకు నాటి భవనాలు, కట్టడాలు సాక్ష్యంగా నిలుస్తుంటే, మరో వైపు తొలి రోజుల్లో జరుపుకున్న స్వాతంత్య్ర వేడుకలను పూర్వీకులు స్మరించుకుంటున్నారు. నగరి(చిత్తూరు జిల్లా): భరతమాత దాస్య శృంఖలాలు తెంచుకొని 75 ఏళ్లవుతోంది. దేశమంతటా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు అంబరాన్ని తాకుతున్నాయి. మనం ఎన్ని పండుగలు ఎంత వైభవంగా జరుపుకున్నా వాటికి మూలం స్వాతంత్య్రమే అనేది ప్రతి ఒక్కరూ గుర్తించాలి. స్వాతంత్య్ర దినోత్సవం వారం రోజుల్లో రానుంది. స్వాతంత్య్రం రాకమునుపు ఆంగ్లేయుల పాలనలో జీవించి, నేటి స్వాతంత్య్ర సంబరాల్లో పాల్గొన్న పెద్దల మనసు ఆనందంతో నిండిపోతోంది. అలనాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. ఆంగ్లేయుల పాలనలో నిర్మించిన కట్టడాలు వారి పాలనకు, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగానికి గుర్తుగా నిలుస్తున్నాయి. రైల్ కమ్ రోడ్ వంతెన ఆంగ్లేయుల స్వార్థ ప్రయోజనాలకు, దేశ సంపదను కొల్లగొట్టడానికి భారతీయులను కూలీలుగా చేసి నిర్మించిన కట్టడాలు నేటీకి చెక్కు చెదరలేదు. వాటిని మనం వాడుకుంటున్నామంటే అది మనకు స్వాతంత్య్ర సమరయోధుల త్యాగఫలమే. ఇలా నగరి కుశస్థలి నదిపై ఆంగ్లేయుల పాలనలో నిర్మించిన ‘రైల్ కమ్ రోడ్’ వంతెన అలనాటి బ్రిటీష్ పాలనకు సాక్ష్యంగా నిలుస్తోంది. 1880వ సంవత్సరం డల్హౌసి వైస్రాయ్గా ఉన్న సమయంలో ఈ వంతెనను నిర్మించారు. ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా నదిపై నిర్మించిన రైల్ కం రోడ్ బ్రిడ్జ్‌గా ఇది పేరుపొందింది. నగరి నుంచి రేణిగుంట వరకు రైలుమార్గం వేసే ప్రక్రియలో భాగంగా ఈ వంతెనను నిర్మించారు. తెల్లరాతి బండలతో 15 స్థూపాలు కలిగిన విధంగా 120 మీటర్ల ఈ వంతెనను నిర్మించారు. బ్రిటీష్ ఇంజినీర్లు మన దేశానికి చెందిన కూలీలతో ఈ వంతెనను నిర్మించారు. రైలు పట్టాలతో పాటు పక్కనే ఒక కారు వెళ్లేలా వంతెన నిర్మాణం జరిగింది. వంతెన నిర్మాణం ఏడాదిపాటు సాగింది. తొలి వంతెన కావడంతో జనం అదేపనిగా వెళ్లి నిర్మాణాలను వింతగా చూసి వచ్చేవారు. ఈ ట్రాక్‌పై తొలి రైలు వచ్చిన రోజు ఈ ప్రాంతంలో ఒక పండగే జరిగింది. నాడు ఆంగ్లేయులు మన సంపదను తరలించడానికి నిర్మించిన వంతెన నేడు వంతెన నిర్మాణంలో భారతీయులు పడ్డ కష్టానికి 142 సంవత్సరాలుగా ప్రతీకగా నిలుస్తోంది. నాటి తరం వారికి అప్పటి స్వాతంత్య్ర వేడుకలను గుర్తుకు తెస్తోంది. నాటి త్యాగమూర్తులను స్మరించుకొని గుండెల్లో దేశభక్తిని పెంపొందించుకుంటూ చైతన్యవంతులు కావడమే స్వాతంత్య్ర దినోత్సవ లక్ష్యం అంటున్నారు. సమర యోధుల అనుభవాలు చెప్పేవారు మా పెదనాన్న వెంకటశేషయ్య స్వాతంత్య్ర సమరయోధులు ఆయనతోపాటు కుమారస్వామి శెట్టి, జానకమ్మ పోరాటంలో ఉండేవారు. ఆగస్టు 15న పాఠశాలలో వేడుకలు జరిగేవి. విద్యార్థులతో పాటు గ్రామ ప్రజలందరూ పాఠశాలకు వచ్చేవారు. విద్యార్థులు జాతీయ నాయకులనుద్దేశించి పాటలు పాడుతూ నాట్యం చేసేవారు. ఝాన్సీ లక్ష్మీబాయి దండయాత్రల నుంచి జాతీయ నాయకులు బ్రిటీష్ వారితో పోరాటం చేసిన గాథలు, వారికి జాతీయ నాయకులతో ఉన్న పరిచయాలు, అరెస్టులు, ఉప్పుసత్యాగ్రహపు అనుభవాల గురించి సమరయోధులు మాకు చెప్పేవారు. వీధుల్లో రేడియోలు పెట్టి ఎర్రకోట వద్ద జరిగే కార్యక్రమాలను రోజంతా వింటూ కూర్చునేవాళ్లం. అది ఒక చక్కటి అనుభూతి. – ఓ.బాలసుబ్రమణ్యం (85), విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యదర్శి, నగరి. జెండా కింద పడేయరు అప్పట్లో స్వాతంత్య్ర దినోత్సవం వస్తే అందరూ కలిసి ముందురోజు రాత్రి ఇంటివద్ద పచ్చిబియ్యం నానబెట్టేవాళ్లం. మరుసటి రోజు ఉదయాన్నే బియ్యంలో బెల్లం కలిపి తీసుకెళ్లి అందరికీ పంచేవాళ్లం. జెండా పండగ అని పిలుచుకునే వాళ్లం. ఆ పండుగ జరుపుకునే సమయంలో అందరిలోనూ దేశభక్తి అధికంగా ఉండేది. జెండాను ఎక్కడా కింద పడేసేవారు కాదు. ప్రతి ఇంటి ముందు రంగుల ముగ్గులు వేసేవారు. జాతీయ నాయకుల ఫొటోలతో ఊరేగింపు జరిగేది. జెండాలో కట్టడానికి, నాయకుల ఫొటోలపై వేయడానికి అందరూ పువ్వులు తెచ్చేవారు.అప్పుడు రోజంతా పండగే. ఇప్పుడు మధ్యాహ్నానికే ముగిసిపోయినట్లు భావిస్తున్నారు. అప్పుడు దేశ ప్రజల్లో ఉండే ఉత్సాహం క్రమంగా తగ్గిపోతోంది. – విజయులు (87), ఆలపాకం, విజయపురం పెద్ద పండుగలా చేసేవాళ్లం స్వాతంత్య్ర దినోత్సవాన్ని జెండా పండుగ అని పిలుచుకునేవాళ్లం. ఆరోజున జెండా ఎగురవేయడానికి పాఠశాలకు వెళ్లేవారం. స్థానికులందరూ రావడంతో పెద్ద ఊరేగింపు జరిగేది. స్వాతంత్య్ర సమరయోధులు స్వాతంత్య్ర సమరంలో వారు ఎదుర్కొన్న కష్టాలను కథలు కథలుగా చెప్పేవారు. గ్రామ ప్రజలందరూ ఇళ్లు కడిగి, ఎర్రమట్టి పెట్టి ముగ్గులు వేసి పెద్ద పండుగలా జరుపుకునేవారు. గ్రామదేవతలకు పూజలు చేసేవారు. మహాత్మాగాంధీకీ జై, వల్లభాయ్పటేల్కీ జై, జవహర్లాల్ నెహ్రూకీ జై .. అంటూ జేజేలు పలుకుతూ వీధుల్లో తిరిగాం. జెండా ఎగురవేసిన అనంతరం మాకు బొరుగులు, టెంకాయ, బెల్లం పంచేవారు. అది అందరితో కలిసి తింటూంటే ఆనందంగా ఉండేది. – కె.రామచంద్రన్ (80), రిటైర్డ్ ఈవో పంచాయత్, నగరి ఆ రోజు ఇళ్లపై జెండాలు ఎగురవేశాం స్వాతంత్య్రం వచ్చే సమయంలో నాకు పెళ్లికూడా అయింది. బ్రిటీష్‌వారు మనకు స్వాతంత్య్రం ఇచ్చి వెళ్లిపోయారంటూ వీధుల్లో యువకులతో పాటు పెద్దలు ఎగిరి గంతులు వేశాం. ఆ సమయంలో మా ఆనందం చెప్పడానికి మాటలు చాలవు. మహిళలు తలస్నానం చేసి ఆలయాల వద్ద దేవుళ్లకు పొంగళ్లు పెట్టాం. వీధులన్నింటినీ ముగ్గులతో అలంకరించాము. అందరూ ఇళ్లపై జెండాలు ఎగురవేశాం. జాతీయ నాయకుల ఫొటోలను, జాతీయ జెండాను ఊరేగింపుగా తీసుకెళ్లాం. ఆ తరువాత కూడా స్వాతంత్య్ర దినోత్సవం ఐకమత్యానికి ప్రతీకగా నిలిచేది. – మునెమ్మ(101), గొల్లపల్లి, పుత్తూరు మండలం -
శతాధిక స్ఫూర్తి... ‘శెట్టూరు గాంధీ’ అలుపెరుగని పోరు
స్వాతంత్య్ర సమరయోధుడైన ఆయనంటే అందరికీ గౌరవం. అచంచల దేశభక్తి ఆయన సొంతం. స్వాతంత్య్రం కోసం అలుపెరుగని పోరాటం చేశారు. వందేళ్లు దాటినా అదే తరగని ఉత్సాహం. నేటికీ తన పని తాను చేసుకుంటూ ఆరోగ్యంగా ఉన్నారు. రోజూ ఉదయం గ్రంథాలయానికి వెళ్లి పత్రికలు, పుస్తకాలు చదువుతుంటారు. ఆయన అచ్చం గాంధీలానే కనిపిస్తారు. అందుకే చెట్ల రుద్రప్ప ‘శెట్టూరు గాంధీ’గా పేరుతెచ్చుకున్నారు. అనంతపురం కల్చరల్: స్వాతంత్య్రం కోసం భారతీయులు చేసిన పోరాటాన్ని అణచివేసేందుకు ఆంగ్లేయులు శతవిధాలా ప్రయత్నించారు. నాయకులను నిర్బంధించి.. జైలుకు పంపితే ఉద్యమం ఆపవచ్చని భావించారు. అయితే నాయకుల స్ఫూర్తితో పోరాటంలో భాగస్వాములైన వారు తదుపరి ఉద్యమానికి నాయకత్వం వహిస్తారని ఊహించలేకపోయారు. అలాంటి బాధ్యతలు నిర్వర్తించిన వారిలో జిల్లాకు చెందిన చెట్లరుద్రప్ప ఒకరు. ‘శెట్టూరు గాంధీ’ అని ఆయన్ని ప్రజలు ముద్దుగా పిలుచుకుంటుంటారు. శతాధిక వృద్ధుడైన ఈయన ఆనాటి జ్ఞాపకాలను ఆజాదీ కా అమృత్ మహోత్సవాల వేళ ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆయన మాటల్లోనే... ‘మా పూర్వీకులందరూ కళ్యాణదుర్గం తాలూకాలోని శెట్టూరు గ్రామంలోనే నివసించారు. మా నాన్న చెట్ల తిమ్మప్ప, అమ్మ రంగమ్మ. నాన్న ఫారెస్ట్ హెడ్ వాచర్‌గా బ్రిటీష్ వారి దగ్గర పనిచేసేవాడు. తిరుమలరావు అని మా గురువు ఉండేవారు. దేశం కోసం పరితపించే ఆయన వద్ద ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నాను. యాజమాని నారాయణరావు, ఉమాబాయి అనే వాళ్లు స్వాతంత్య్రం కోసం పనిచేశారు. కళ్యాణదుర్గానికి చెందిన ఐ.ఓబయ్య, బంగి ఎర్రిస్వామి నన్ను అమితంగా ప్రభావితం చేశారు. ప్రజా సమస్యలంటే ఏవిధంగా ఉంటాయో నేను దగ్గరగా చూశాను. కరువుకు కనికరం లేదు స్వాతంత్య్ర పోరాటం సాగుతున్న తరుణంలోనే మా ప్రాంతాలను కరువు పట్టిపీడించేది. మేము ఇంటింటా ధాన్యం సేకరించి ప్రజలకు గంజినందించి ఆకలి తీర్చేవారం. అసలు పోరాటం చేయాలంటే బతికుండాలనే భావన అధికంగా ఉండేది. జిల్లా కేంద్రంలో స్వాతంత్య్ర పోరాటం చేస్తున్న తరిమెల నాగిరెడ్డి, ఐదుకల్లు సదాశివన్, నీలం రాజశేఖరరెడ్డి, గుత్తి రామకృష్ణ వంటి వారితో నేను కలిసి పనిచేశాను. వారు అరెస్టై జైలుకెళ్లినా మా ఉద్యమం ఆగలేదు. తరిమెల నాగిరెడ్డి విడిపించారు కాంగ్రెస్, కమ్యూనిస్టు నాయకులు పార్టీలకతీతంగా స్వాతంత్య్ర పోరులో పనిచేశారు. మేమెక్కువగా కమ్యూనిస్టుల వైపే నడిచాము. మా ఊరి కరణం భీమసేనరావు మా నాన్నను, పెద్దనాన్నపాలయ్యను అధికార బలంతో ఉద్యమాలకు పోనీకుండా అరెస్టు చేయించారు. అయితే తరిమెల నాగిరెడ్డి స్వయంగా వచ్చి విడిపించిన సంఘటన నాకింకా గుర్తుంది. స్వాతంత్య్ర పోరుకు మేము సైతం అనే వాళ్ల సంఖ్య అధికంగా ఉండేది. గాంధీజీకి రక్షణగా సదాశివన్ నిలబడ్డారు కల్లూరు సుబ్బారావు ప్రధాన శిష్యగణంలో నీలం సంజీవరెడ్డి, తరిమెల నాగిరెడ్డి, ఐదుకల్లు సదాశివన్ ఉండేవారు. వారి అనుయాయులుగా మేమూ వారి బాటలోనే నడిచాము. మాకు నేరుగా పెద్దవారితో పరిచయం ఉండేది కాదు. ఒకరిని తొక్కి ముందుకుపోవాలన్న యావ అప్పట్లో ఎవరికీ ఉండేది కాదు. నిబద్ధత, నిజాయితీ అధికంగా ఉండేరోజులవి. సదాశివన్ ఓ చిన్నకొట్టులో పనిచేసేవారు. ఆయన గాంధీజీ స్ఫూర్తితో స్వాతంత్య్ర పోరులో నడిచారు. ఆ క్రమంలో గాంధీజీ జిల్లా పర్యటనకొచ్చినపుడు రక్షణగా నిలబడిన సదాశివన్ పోలీసు దెబ్బలు తిన్న విషయం తెలిసి మేము బ్రిటీష్వారికి వ్యతిరేకంగా పనిచేశాము. మాకు పెద్ద పండుగ ఎంతో మంది ప్రజాక్షేత్రంలో ఉన్నవారే కాకుండా అజ్ఞాతంగా ఉండి దేశమాత దాస్య శృంఖలాలను తొలగించడానికి పోరు సల్పారు. వారందరి కృషితో స్వాతంత్య్రం సిద్ధించింది. స్వాతంత్య్రం వచ్చిన ఆగస్టు 15వ తేదీ మాకు పెద్ద పండుగ. ఆ రోజు జాతీయ జెండా ఎగురవేసి మిఠాయిలు పంచుకున్నాము. అవన్నీ జ్ఞాపకం వస్తే కళ్లు చెమరుస్తాయి. అదే స్ఫూర్తి కొనసాగుతోంది ప్రజల సమస్యలు, స్వాతంత్య్ర కోసం పోరాడేవాడిని. ఇంటిని పట్టించుకునేవాడిని కాదు. మేము పొందిన స్ఫూర్తి అలాంటిది మరి. మా ఊరు చైతన్యవంతం కావాలని గ్రంథాలయం తెప్పించుకున్నాం. చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో కళ్యాణదుర్గం పర్యటనకు వచ్చినపుడు మా ప్రాంతానికి నీళ్లు ఎందుకివ్వరని నిలదీసిన సంఘటన పెద్ద సంచలనమైంది. స్వాతంత్య్ర కాలం నాటి స్ఫూర్తి ఇప్పటికీ కొనసాగుతోంది. నన్ను మా మండల ప్రజలు ఎంతో ప్రేమిస్తారు. జాతీయ పండుగలొస్తే త్రివర్ణపతాకం ఎగురవేయమని కోరుతారు. ఇవన్నీ భరతమాత నాకందించిన భాగ్యమే. గాంధీని తలపించే చెట్ల రుద్రప్ప సమాజ హితం.. ఆనందమయ జీవితం నాకు నలుగురు కూతుళ్లు, ముగ్గురు కొడుకులు. అందరూ నేను చెప్పింది ఈనాటికీ చక్కగా వింటారు. వారిలో చెట్ల ఈరన్న డిగ్రీ దాకా చదివాడు. టీచర్ ఉద్యోగం వస్తే వెళ్లిపోతానన్నాడు. కానీ ప్రజల కోసం పనిచేయాలనే ఉద్దేశంతో విశాలాంధ్ర బుక్‌హౌస్‌లో ఓ చిన్న ఉద్యోగమైనా సరే చేరమన్నాను. ఇటీవల బుక్‌హౌస్ మేనేజర్‌గా ఉద్యోగ విరమణ చేశాడు. వందేళ్లు వచ్చినా ఎలా ఉత్సాహంగా ఉంటావని నన్ను చాలామంది అడిగారు. ఆహార నియమాలు పాటించడంతో పాటు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం వల్లే ఆరోగ్యంగా, చలాకీగా ఉంటున్నాను. సమాజం కోసం బతికితే ఆనందంగా ఉంటుందన్నది నా జీవితం చెప్పే సత్యం.’ -
శతమానం భారతి: లక్ష్యం 2047.. కృత్రిమ మేధస్సు
భవిష్యత్తు యుద్ధాలను ఎదుర్కొవడంలో ఎ.ఐ. ఆధారిత రక్షణ ఉత్పత్తుల ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని భారత్ 2018 లోనే కృత్రిమ మేధస్సుపై కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేసుకుంది! రక్షణ రంగంలో కృత్రిమ మేధస్సును ప్రోత్సహించే వ్యూహం రూపకల్పన ఈ బృందం బాధ్యత. రక్షణ రంగంలో స్వావలంబన దిశగా భారతదేశం రక్షణ ఉత్పత్తుల తయారీకి ప్రాధాన్యం ఇస్తోంది. అంతేకాక, ఆవిష్కరణలకు ప్రోత్సాహంలో భాగంగా అంకుర సంస్థలకు, విదేశీ పెట్టుబడులకు అవకాశం కల్పిస్తోంది. ఫలితంగా భారత రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు సైతం పెరిగాయి. అదే సమయంలో భారత సైన్యానికి అత్యాధునిక ఆయుధ పరికరాల కొరత కూడా తీరింది. దేశం నుంచి 2021–22 ఆర్థిక సంవత్సరంలో రక్షణ ఎగుమతులు అత్యధికంగా నమోదై రు.13,000 కోట్లకు చేరాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది జూలై 11న కృత్రిమ మేధస్సు ఆధారిత ఉత్పత్తులు, సాంకేతిక పరిజ్ఞానాలను ఓ 75 ర కాల వరకు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. వాటిల్లో కృత్రిమ మేధ వేదికగా గల స్వయం ప్రతిపత్తి / మానవ రహిత / రోబోటిక్ వ్యవస్థలు, బ్లాక్ చైన్ ఆధారిత యాంత్రీకరణ, కమ్యూనికేషన్లు, కమాండ్, కంట్రోల్, కంప్యూటర్ నిఘా, అంతరిక్ష నిఘా, సైబర్ భద్రత, మానవ ప్రవర్తన విశ్లేషణ, మేధో పర్యవేక్షక వ్యవస్థలు, స్వయం ప్రతిపత్తిగల మారణాయుధ వ్యవస్థలు ఉన్నాయి. 75 ఏళ్ల క్రితం సాధించుకున్న స్వేచ్ఛను వేడుకగా జరుపుకుంటున్న ఈ తరుణంలో.. దేశ సార్వభౌమత్వ ప్రకటనకు, ప్రదర్శనకు కృత్రిమ మేధను భారత్ ఒక వజ్రాయుధంలా మలుచుకుంటున్న తీరు అగ్రరాజ్యాల దృష్టిని సైతం ఆకర్షిస్తోంది. -
చైతన్య భారతి: ఇరోమ్ చాను షర్మిల, పౌర హక్కుల కార్యకర్త.. నిరశన ఉద్యమం!
దాదాపు 16 సంవత్సరాల పాటు నిరాహార దీక్షలో ఉన్న ‘మణిపూర్ ఉక్కు మహిళ’ ఇరోమ్ చాను షర్మిల. దీక్షలో ఉన్న అన్నేళ్లలోనూ ఆమె నోటి నుంచి మంచినీటి చుక్క కూడా తీసుకోలేదు! విసిరేసినట్టుండే ఈశాన్య భారతంలో, మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లోని జవహర్లాల్ నెహ్రూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డులోనే ఆ పదహారేళ్లూ ఆమె ఉన్నారు. నిజానికి ఆమె కోసం జైలుగా మారిన వార్డు అది. ప్రతి మూడు వారాలకు ఒకసారి కోర్టు బోనులో నిలబడి రావడం, మళ్లీ ఆస్పత్రి వార్డులో వైద్యుల పర్యవేక్షణలో ఉండడం.. ఇదే కథ. భారత ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆమె ఈ నిరాహార దీక్ష చేపట్టారు. ప్రపంచంలోనే సుదీర్ఘ నిరశన అది: మణిపూర్ ప్రభుత్వమే ఆమెను బతికిస్తూ వచ్చింది. అయితే నిమ్మరసం ఇచ్చి కాదు, నాసోగాస్ట్రిక్ ఇన్‌ట్యూబేషన్ పద్ధతిలో.. అంటే ముక్కులో నుంచి గొట్టం అమర్చి ఆహారం, ఇతర ఔషధాలు నిర్బంధంగా పంపించడం! ‘అఫ్స్పా’ సాయుధ బలగాలు తన కంటి ఎదురుగా జరిపిన ఒక రక్తపాతానికి నిరసనగానే షర్మిల ఆ నిరాహార దీక్ష ఆరంభించారు. అది 2000 నవంబర్ 2. షర్మిల ఆ రోజు హక్కుల కార్యకర్తగా ఒక ఊరేగింపులో పాల్గొనడం కోసం మాలోం అనే చిన్న పట్టణంలోని ఒక బస్టాప్ దగ్గర నిలబడి ఉన్నారు. అక్కడే పెద్ద శబ్దం వినిపించింది. అది వేర్పాటువాదులు విసిరిన బాంబు పేలుడు. అంతే.. అస్సాం రైఫిల్స్ (పారా మిలటరీ) రంగంలోకి దిగి కాల్పులు జరిపింది. అక్కడికక్కడ పదిమంది చనిపోయారు. తరువాత సాయుధులు ఊరి మీద పడి బాంబు విసిరిన ఉగ్రవాదులు ఎవరో చెప్పమంటూ కనిపించిన ప్రతివారి మీద జులుం ప్రదర్శించారు. దీనినే మాలోం ఊచకోత అంటారు. ఇది జరిగిన రెండు రోజుల తరువాత 2000 నవంబర్ 5న షర్మిల నిరాహార దీక్ష ఆరంభించారు. దీక్ష ప్రారంభించే సమయానికి షర్మిల వయసు 28 సంవత్సరాలు. అప్పటికి వివాహం కాలేదు. దీక్ష వల్ల ప్రయోజనం లేదనీ, ఎన్నికల్లో గెలిచి చట్టసభల్లో పోరాడాలనీ తలచి 2016 ఆగస్టు 9 న దీక్షను విరమించారు. ఆ తర్వాత ఎన్నికల్లో నిలుచున్నప్పటికీ ఆమె గెలవలేదు. అఫ్స్పా చట్టం నేటికీ పూర్తిగా రద్దవలేదు. షర్మిల 1972 మార్చి 2 ఇంఫాల్‌లోని కోంగ్పాల్ గ్రామంలో జన్మించారు. పౌరహక్కుల కార్యకర్త అయిన ఇరోమ్ తన ఉద్యమ భాగస్వామి అయిన బ్రిటిష్ పౌరుడు డెస్మండ్ ఆంథోనీని వివాహం చేసుకున్నారు. ఇద్దరు కవల కుమార్తెలకు జన్మనిచ్చారు. ప్రస్తుతం సామాజిక అంశాలపై వ్యాస రచనలు చేస్తున్నారు. -
మహోజ్వల భారతి: వీరనారి రాజ్‌కుమారి
రాజ్‌కుమారి గుప్త స్వాతంత్య్ర సమరయోధురాలు. 120 ఏళ్ల క్రితం 1902లో కాన్పూర్‌లో జన్మించారు. ఆమె ఏ తేదీన జన్మించిందీ కచ్చితమైన వివరాలు చరిత్రలో నమోదు కాలేదు కానీ, ఆగస్టు 9 అనే తేదీ చరిత్రలో ఆమెను చిరస్మరణీయురాలిని చేసింది. 1925లో లక్నో సమీపంలోని కాకోరీ అనే గ్రామంలో ఆ రోజున జరిగిన రైలు దోపిడీకి రాజ్‌కుమారి విప్లవకారులకు సహకరించారు. ఆ దోపిడీకి పాల్పడింది ‘హిందూస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్’ అనే విప్లవ సంస్థకు చెందిన చంద్రశేఖర ఆజాద్ బృందం. ఆ బృందంలో సభ్యురాలు రాజ్‌కుమారి. ఆమెకు చిన్నప్పుడే మదన్మోహన్ గుప్తా అనే గాంధేయవాదితో వివాహం జరిగింది. ఆయనకు ఈ ‘హిందూస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్’వాళ్లతో పైపై పరిచయాలు ఉండేవి. రాజ్‌కుమారి తన భర్తతో పాటు భారత జాతీయ కాంగ్రెస్ పురమాయించిన కార్యక్రమాలను నిర్వహిస్తుండేవారు. హిందూస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ ఉద్యమకారుల ప్రభావానికి లోనైన రాజ్‌కుమారి.. భర్తకు కూడా తెలీకుండా రహస్యంగా ఉద్యమ సమాచారాలను చేరవేస్తూ అసోసియేషన్ గ్రూపులో కీలక సభ్యురాలిగా మారారు. గ్రూపులో రాజ్‌కుమారి వంటి చురుకైన కార్యకర్తలు ఉన్నారు కానీ, సరిపడా ఆయుధాలే లేవు. ఆయుధాలను కొనేందుకు డబ్బులేదు. అందుకోసం డబ్బు దోచుకోవాలని పథకం వేశారు. అప్పట్లో బ్రిటిష్ అధికారులు పన్నులు, జరిమానాలు, జులుంల రూపంలో తమకు వసూలైన సొమ్మునంతా రైల్లో తరలించేవారు. అది కనిపెట్టి ఆజాద్ బృందం రైలు లక్నో దగ్గరకు రాగానే రైల్లోని డబ్బును దోచుకోవాలని పథకం వేసింది. రైలు కాకోరీ సమీపంలోకి రాగానే ఆజాద్, రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్వఖుల్లా ఖాన్, మరికొందరు రైలు గొలుసును లాగి ఆపారు. ఆయుధాలతో రైలు గార్డును బెదరించి డబ్బు దోచుకెళ్లారు. దోడిపీలో రాజ్‌కుమారి పాత్ర ప్రత్యక్షంగా లేకున్నా, అత్యంత కీలకమైన పాత్రే ఉంది. గార్డును బెదిరించడానికి, ముందు జాగ్రత్త కోసం ఆజాద్ బృందం తీసుకెళ్లిన ఆయుధాలు రాజ్‌కుమారి తెచ్చి ఇచ్చినవే. చంటి బిడ్డను చంకనెత్తుకుని, లోదుస్తుల్లో ఆయుధాలను దాచుకుని పొలాల్లో పడి నడుచుకుంటూ వెళ్లి సమయానికి వారికి ఆయుధాలను అందించారు రాజ్‌కుమారి. తర్వాత విషయం తెలిసి భర్త, అత్తమామలు ఆమెను ఇంట్లోంచి వెళ్లగొట్టారు. ఆమెతో తమకు ఎలాంటి సంబంధమూ లేదని ప్రపంచానికి ప్రకటించారు. తర్వాత ఈ గ్రూప్నంతటినీ, రాజ్‌కుమారి సహా బ్రటిష్ ప్రభుత్వం వెంటాడి, వెతికి పట్టుకుని అరెస్ట్ చేసింది. ఆ తర్వాత కూడా రాజ్‌కుమారి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నందుకు మూడుసార్లు జైలు శిక్ష అనుభవించారు. గాంధీమార్గంలో పైకి కనిపిస్తూ సాయుధ పోరాటాన్ని సాగించిన వీరనారి రాజ్‌కుమారి. -
ఇండియా@75: తెగని బంధం
1947 ఆగస్ట్ 7న ఉదయమే బొంబాయిలోని మజ్గావ్లో ఉన్న ఇస్నాషరి శ్మశానవాటికకు వెళ్లారు జిన్నా. చేతిలో పుష్పగుచ్ఛం. ఒకచోట పెద్ద పేటిక వంటి పాలరాతి సమాధి ముందు నిలిచారు. ముందు భాగంలో శిలాఫలకం మీద నల్లటి అక్షరాలు : రతన్‌బాయి మహమ్మద్ అలీ జిన్నా (జననం 20 ఫిబ్రవరి 1900–మరణం 20 ఫిబ్రవరి 1929). పుష్పగుచ్ఛం ఆ సమాధి మీద పెట్టారు. రతన్‌బాయి పెటిట్ లేదా రతన్‌బాయి జిన్నా లేదా రూతీ.. జిన్నా భార్యే. బొంబాయి కోటీశ్వరులలో ఒకరైన దిన్షా మానేక్‌జీ పెటిట్, దీన్ల కూతురు రూతీ. జిన్నా ప్రేమలో పడింది. అప్పటికి జిన్నా వయసు 41 ఏళ్లు. అంత వయసున్న జిన్నాను మైనారిటీ తీరని ఈ అమ్మాయి ఎందుకు ప్రేమించింది? జిన్నాకు ఆ రోజుల్లో ఉన్న ఖ్యాతి వల్లనే. కరాచీ వదిలి బొంబాయి వచ్చిన జిన్నా పెద్ద బారిస్టర్ అయ్యారు. 1904 నాటికే భారత జాతీయ కాంగ్రెస్‌లో ముఖ్యుడయ్యారు. 1910 నాటికే సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో సభ్యుడయ్యారు. గోపాలకృష్ణ గోఖలేకే కాదు, బాలగంగాధర్ తిలక్‌కూ, అనిబీసెంట్కూ, మదన్మోహన్ మాలవీయకూ సన్నిహితులు. సరోజినీ నాయుడు.. జిన్నాను హిందూ ముస్లిం స్నేహ వారధిగా శ్లాఘించేవారు. కొన్ని అభిరుచులు కూడా జిన్నాను ఆ రూతీకి చేరువచేశాయి. అయితే ఆ ఇద్దరు మాట్లాడుకోకుండా దిన్షా పెటిట్ కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చారు. కానీ పద్దెనిమిదేళ్లు నిండగానే రూతీ మలబార్ హిల్స్‌లోనే ఉన్న జిన్నా పాత ఇంటికి కట్టుబట్టలతో వచ్చేశారు. ఆ ఇంటిలోనే జిన్నా ఆమెను రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. భర్తను ‘జే’ అంటూ ఆప్యాయంగా పిలిచేవారామె. 1919 ఆగస్ట్ 14న వారికి కూతురు దీనా (వాడియా) పుట్టింది. తరువాత జిన్నా ముస్లింలీగ్ రాజకీయాలలో తలమునకలైపోయారు. అప్పటికే రూతీకి పేగు క్యాన్సర్. సరిగ్గా పుట్టిన రోజునే అంటే 1929 ఫిబ్రవరి 20న ఆమె కన్ను మూశారు. దేశ విభజన సమయంలో తనతో పాకిస్తాన్ వచ్చేయమని కూతురు దీనాను ఆర్తితోనే అడిగారు జిన్నా. ఆమె వెళ్లలేదు. ప్రతి ఆగస్ట్ 14న పాకిస్తాన్ ఆవిర్భావ దినోత్సవానికి జెండా ఎగురవేస్తుంటే భారత్‌లోనే ఉండిపోయిన ఒక్కగానొక్క కూతురు దీనా పుట్టినరోజు గుర్తుకు రాకుండా ఉంటుందా? కానీ అలాంటి హింసాత్మక సంఘర్షణకు గురయ్యే పరిస్థితి నుంచి కాలమే అతడిని కరుణించింది. 1948 సెప్టెంబర్ 11న, పాకిస్తాన్ ఏర్పడిన మరుసటి ఏడాదే మేధస్సుతో కాకుండా, హృదయంతో స్పందించడం మొదలు పెడుతున్న వేళ బారిస్ట్టర్ జిన్నా చనిపోయారు. (చదవండి: ఉద్యమం కాదు.. మహాభారత యుద్ధం!) -
India@75: ప్రణాళికా సంఘం స్థానంలో ‘నీతి ఆయోగ్’
భారత ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోప్రణాళికా సంఘం స్థానంలో 2015 జనవరి 1న సరికొత్త వ్యవస్థ ‘నీతి ఆయోగ్’ ఏర్పాటైంది. అంతకు ముందు ఉన్న భారత ప్రణాళికా సంఘం.. కేంద్ర మంత్రిమండలి తీర్మానం ద్వారా 1950 మార్చి 15 న ఏర్పాటైంది. 2014 లో మోడీ తన మొదటి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో, ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయాలనే ఉద్దేశ్యాన్ని ప్రకటించారు. తదనుగుణంగా నీతి ఆయోగ్ కు రూపకల్పన జరిగింది. ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు ఎం.ఎస్.నారాయణ, ఆర్.కె.లక్ష్మణ్, కేశవరెడ్డి, డి. రామానాయుడు, రాళ్లబండి కవితా ప్రసాద్, నర్రా రాఘవరెడ్డి, షీలా కౌల్ (100), ఎం.ఎస్. విశ్వనాథన్, వి. రామకృష్ణ, ఏడిద నాగేశ్వరరావు, కళ్లు చిదంబరం, కొండవలస లక్ష్మణరావు, రంగనాథ్.. కన్నుమూత. జాతీయోద్యమ కార్యకర్త మదన్ మోహన్ మలావ్యాకు మరణానంతర ‘భారత రత్న’. తొలి ‘ఇంటర్నేషనల్ యోగా డే’ వేడుకలు. గోదావరి పుష్కరాల్లో భక్తుల తొక్కిసలాట (రాజమండ్రి). 29 మంది మృతి. (చదవండి: శతమానం భారతి: లక్ష్యం 2047.. అమృతయాత్ర) -
జైహింద్ స్పెషల్: ది గ్రేట్ ఎస్కేప్
జర్మనీ నుంచి బోస్ జపాన్ బయల్దేరాడు. జర్మనీ సబ్‌మెరైన్ యు–180 లో ప్రయాణించి మధ్యలో జపాన్ సబ్‌మెరైన్ ఐ–29లోకి మారి వెళ్లాడు. ఆర్మీకి గానీ, పోలీసు విభాగానికి గానీ చెందని ఒక సాధారణ పౌరుడు రెండు దేశాల సబ్మెరైన్లలో మారి ప్రయాణించడం అదే మొదటిసారి! బోస్ మేనేజ్ చేశాడు. జపాన్‌లో దిగాక, బోస్ అక్కడి నుంచి సింగపూర్ వెళ్లాడు. జర్మనీలో ఎలాగైతే భారతీయులతో సైన్యాన్ని కూడగట్టుకున్నాడో అక్కడా అలాగే ఒక లీజన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అదే.. ఇండియన్ నేషనల్ ఆర్మీ. అదే అజాద్ హింద్ ఫౌజ్ బోస్ తప్పించు కున్నాడు! ‘‘బ్రిటన్ తరఫున జర్మనీపై ఇండియా యుద్ధం చేస్తుందని ప్రకటించడానికి మీరెవరు?’’ అని వైశ్రాయ్ని నిలదీసినందుకు జైలుపాలై.. వారం రోజులు అన్నం నీళ్లూ ముట్టకుండా జైల్లోనే హంగర్ స్ట్రైక్ చేసి విడుదలైనవాడు.. దేశం నుంచే తప్పించుకున్నాడు! బోస్ దేశం దాటకుండా బ్రిటిష్ ప్రభుత్వం కలకత్తాలో అతడు ఉంటున్న ఇంట్లోనే అతడిని బంధించి, చుట్టూ నిఘా పెట్టినప్పటికీ అతడు తప్పించుకున్నాడు.! ‘జర్మనీతో ‘టై–అప్’ అయితే బ్రిటన్‌ని ఇంటికి పంపడం తేలిక. ఓం శాంతి అంటే లాభం లేదు. మిలట్రీ ట్రక్కుల నుంచి ఇండియాలోకి జర్మన్ సైన్యాన్ని దింపాలి..’ అనే ప్లాన్‌తో తప్పించుకున్నాడు! ఎలా తప్పించుకున్నాడు?! పోలికలు తెలియకుండా పఠాన్‌లా వేషం వేసుకున్నాడు. గుండ్రటి ముఖం కనిపించకుండా గడ్డం పెంచాడు. భాష విని గుర్తుపట్టకుండా మూగ, చెవిటి అయ్యాడు. ముందు పెషావర్ వెళ్లాడు. అక్కడి నుంచి కాబూల్. అక్కడి నుంచి రష్యా. అక్కడ బుక్కయ్యాడు! రష్యాకు, బ్రిటన్‌కు పడదు కాబట్టి తనను చేరదీస్తారు అనుకున్నాడు కానీ, రష్యన్ అధికారులు అనుమానిస్తారని అనుకోలేదు. వాళ్లతడిని మాస్కో తరలించారు. అక్కడ కొద్దిగా నయం. రెండు మూడు ఆరాలు తీసి బోస్‌ని మాస్కోలోని జర్మనీ రాయబారి షూలెన్బర్గ్ దగ్గరికి పంపారు. షూలెన్బర్గ్కి బోస్ మీద నమ్మకం కుదిరింది. అతడిని ఇటలీ మీదుగా జర్మనీ పంపే ఏర్పాటు చేశారు! బ్రిటన్‌కు మండిపోయింది. తప్పించుకున్న వాడు తప్పించుకున్నట్లు ఉండకుండా దేశాలన్నీ తిరగడం ఏమిటి? కనిపిస్తే కాల్చిపారెయ్యమని సీక్రెట్ ఏజెంట్లని పంపింది. జర్మనీలో అడుగు పెట్టకముందే అతడిని చంపేయాలి. అదీ టార్గెట్. కానీ బోసే మొదట తన టార్గెట్‌ని రీచ్ అయ్యాడు. జర్మనీలో అతడు క్షణం ఖాళీగా లేడు. హిట్లర్ని కలిశాడు. బ్రిటన్ గురించి, ఇండియా గురించి చెప్పాడు. బెర్లిన్‌లో ఒక రేడియో స్టేషన్ స్టార్ట్ చేశాడు. దాన్నుంచి స్వతంత్ర భారత్ నినాదాలు ప్రసారం చేశాడు. జర్మనీకి బందీలుగా ఉన్న ఐదువేల మంది భారతీయ సైనికులతో కలిసి ‘ఇండియన్ లీజన్’ ఏర్పాటు చేసుకున్నాడు. ఉత్తర ఆఫ్రికాలోని బ్రిటిష్ సైన్యంలో భాగంగా ఉండి, యుద్ధంలో జర్మనీకి చిక్కిన సైనికులు వీళ్లు! హిట్లర్ హ్యాండిచ్చాడు! ‘లీజన్’ అంటే సైనిక సమూహం. ఇండియన్ లీజన్, జర్మనీ సైన్యం కలిసి ఇండియా వెళ్లి కాళ్లతో నేలను రెండు చరుపులు చరిస్తే చాలు... బ్రిటన్ ఎగిరిపడాలని బోస్ వ్యూహం. 1941 నుంచి 1943 వరకు ఇదే వ్యూహం మీద జర్మనీలోనే ఉండిపోయారు బోస్. అక్కడే ఎమిలీ షెంకెల్ని పెళ్లి చేసుకున్నారు. అక్కడే వారికి అనిత పుట్టింది. అక్కడే జర్మనీపై అతడి భ్రమలు తొలగిపోయాయి! హిట్లర్ హ్యాండిచ్చాడు! బోస్ అక్కడి నుంచి జపాన్ బయల్దేరాడు. మొదట జర్మనీ సబ్‌మెరైన్ యు–180 లో ప్రయాణించి మధ్యలో జపాన్ సబ్‌మెరైన్ ఐ–29లోకి మారి వెళ్లాడు. ఆర్మీకి గానీ, పోలీసు విభాగానికి గానీ చెందని ఒక సాధారణ పౌరుడు రెండు దేశాల సబ్మెరైన్లలో మారి ప్రయాణించడం అదే మొదటిసారి! బోస్ మేనేజ్ చేశాడు. జపాన్‌లో దిగాక, బోస్ అక్కడి నుంచి సింగపూర్ వెళ్లాడు.జర్మనీలో ఎలాగైతే భారతీయులతో సైన్యాన్ని కూడగట్టుకున్నాడో అక్కడా అలాగే ఒక లీజన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అదే... ఇండియన్ నేషనల్ ఆర్మీ. అదే అజాద్ హింద్ ఫౌజ్. ‘‘మీ రక్తాన్ని ధారపొయ్యండి. మీకు స్వాతంత్య్రాన్ని ఇస్తాను’’ అన్నాడు బోస్. అంతేనా! ఢిల్లీ చలో అన్నాడు. జైహింద్ అన్నాడు. సొంత సైన్యం, సొంత కరెన్సీ, సొంత పోస్టల్ స్టాంప్స్, సొంత న్యాయం, సొంత నియమం. అన్నీ సొంతం! బ్రిటన్‌ని వ్యతిరేకించే దేశాలన్నీ వీటన్నిటినీ ఆమోదించాయి. ఆఖరికి రష్యా, అమెరికా కూడా! అంటే పారలల్ మిలట్రీ. పారలల్ గవర్నమెంట్. బోస్ సమాంతర ప్రభుత్వాన్ని, సమాంతర సైన్యాన్ని నడుపుతున్నాడు. సింగపూర్‌లో ఏర్పాటు చేసుకున్న అజాద్ హింద్ రేడియోలోంచి 1944 జూలై 6న మాట్లాడుతూ మొదటిసారిగా బోస్ గాంధీజీ పేరెత్తారు! ‘‘జాతిపితా... నన్ను దీవించండి. ఈ పోరాటంలో నేను గెలవాలని నన్ను దీవించండి’’ అని కోరారు. మరణం రాసిపెట్టలేదు! తర్వాత ఏమయింది? మూడేళ్ల తర్వాత భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. బోస్ ఏమయ్యారు? ఇన్నేళ్ల తర్వాత ఇప్పటికీ తెలీదు! సింగపూర్ నుంచి టోక్యో వెళ్లడానికి నేతాజీ సుభాస్ చంద్రబోస్ ఎక్కిన జపాన్ యుద్ధ విమానం 1945 ఆగస్టు 18న నేలకూలి అందులో ఉన్న వారితో పాటు ఆయనా మరణించారని ఒక ‘అధికారిక’ కథనం! కాదు, ఆ ప్రమాదంలో ఆయన తప్పించుకున్నారని, అక్కడి నుంచి ఇండియా వచ్చి అజ్ఞాతంగా సాధువురూపంలో గడిపారని; కాదు కాదు ఏ శత్రుదేశమో నేతాజీని బందీగా ఉంచుకుందనీ, అలాంటిదేం లేదు... రష్యాలో ఆయన తలదాచుకున్నారనీ... ఇలా ఏవేవో అనధికారిక కథనాలు. ఒకటి మాత్రం వాస్తవం. నేతాజీ... అమరుడు! ఆయనకు జననమే కానీ, మరణం లేదు. కావాలంటే ఏ హిస్టరీ బుక్ అయినా తెరిచి చూడండి. జననం ఒక్కటే కనిపిస్తుంది. చదవండి: వైద్య ప్రతిభామూర్తి : యల్లాప్రగడ సుబ్బారావు / 1895–1948 -
Quit India Movement: ఉద్యమం కాదు.. మహాభారత యుద్ధం!
స్వాతంత్య్రం కోసం ఇండియా ఎన్నో ఉద్యమాలు చేసింది. వాటిల్లో చివరి ఉద్యమం.. క్విట్ ఇండియా! నిజానికది ఉద్యమం కాదు. ఒక యుద్ధం. భరతజాతి అంతా ఏకమై బ్రిటిషర్లపై విరుచుకుపడిన మహాభారత యుద్ధం! ఆ యుద్ధంతోనే మనం స్వాతంత్య్రాన్ని గెలుచుకున్నాం. ఈ డెబ్బ ఐదేళ్లను నడిపిన ఒక స్ఫూర్తిగా క్విట్ ఇండియా ఉద్యమం నేటితో 80 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇండియాలో బ్రిటిష్ పాలనను తుదముట్టించేందుకు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో 1942 ఆగస్టు 8న మహాత్మాగాంధీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ బాంబే సమావేశంలో పిలుపు నిచ్చిన ఉద్యమమే క్విట్ ఇండియా. ఆ రోజున బొంబాయిలో గోవాలియా ట్యాంక్ మైదానంలో చేసిన క్విట్ ఇండియా ప్రసంగంలో గాంధీ ‘డూ ఆర్ డై’ అన్నారు. ఆ వెంటనే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ భారతదేశం నుండి ‘క్రమబద్ధమైన బ్రిటిషు ఉపసంహరణ‘ కోరుతూ భారీ నిరసనను ప్రారంభించింది. ప్రపంచ యుద్ధంలో మునిగి ఉన్నప్పటికీ, ఈ నిరసనలపై చర్య తీసుకోవడానికి బ్రిటిషు ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. గాంధీ ప్రసంగించిన గంటల్లోనే భారత జాతీయ కాంగ్రెస్ నాయకత్వం మొత్తాన్నీ విచారణనేది లేకుండా జైల్లో వేసింది. వీళ్లలో చాలామంది యుద్ధం ముగిసే వరకు జైలులోనే, ప్రజలతో సంబంధం లేకుండా గడిపారు. మరోవైపు.. క్విట్ ఇండియాకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా ముస్లిం లీగ్, రాచరిక సంస్థానాలు, ఇండియన్ ఇంపీరియల్ పోలీస్, బ్రిటిషు ఇండియన్ ఆర్మీ, హిందూ మహాసభ, ఇండియన్ సివిల్ సర్వీస్, వైస్రాయ్ కౌన్సిల్ (ఇందులో ఎక్కువ మంది భారతీయులు ఉన్నారు)లు బ్రిటిస్ వారికి మద్దతుగా నిలిచాయి! యుద్ధకాలంలో జరుగుతున్న భారీ వ్యయం నుండి లాభం పొందుతున్న భారతీయ వ్యాపారవేత్తలు చాలామంది కూడా క్విట్ ఇండియా ఉద్యమానికి మద్దతు ఇవ్వలేదు. విద్యార్థులు అక్ష రాజ్యాలకు (జర్మనీ, ఇటలీ, జపాన్) మద్దతు ఇస్తూ ప్రవాసంలో ఉన్న సుభాస్ చంద్రబోస్ పట్ల ఎక్కువ ఆసక్తి చూపారు. దాంతో క్విట్ ఇండియా ఉద్యమాన్ని బ్రిటిషు ప్రభుత్వం సమర్థవంతంగా అణì వేయగలిగింది. వెంటనే స్వాతంత్య్రం ఇవ్వడానికి నిరాకరించింది. యుద్ధం ముగిసాక చూద్దాం లెమ్మంది. ఈ ఘర్షణలో దేశవ్యాప్తంగా హింస చెలరేగింది. బ్రిటిషు వారు పదివేల మంది నాయకులను అరెస్టు చేసి, వారిని 1945 వరకు జైల్లోనే ఉంచారు. అయితే, రెండవ ప్రపంచ యుద్ధంలో జరిగిన ఖర్చు కారణంగా భారతదేశాన్ని ఇక నియంత్రణలో పెట్టలేమని బ్రిటిషు ప్రభుత్వం గ్రహించింది. మర్యాద కోల్పోకుండా, శాంతియుతంగా ఎలా నిష్కమ్రించాలనే ప్రశ్న యుద్ధానంతరం వారికి ఎదురుగా నిలిచింది. అనంత పరిణామాలు ఇండియా స్వాతంత్య్రానికి పురికొల్పాయి. అసలు క్విట్ ఇండియా ఉద్యమానికి గాంధీ పిలుపునివ్వడానికి క్రిప్స్ మిషన్ చర్చల వైఫల్యం ప్రధాన కారణం. 1942 మార్చి 22 న బ్రిటన్ యుద్ధ ప్రయత్నాలకు మద్దతును పొందటానికి బ్రిటిషు ప్రభుత్వం సర్ స్టాఫోర్డ్ క్రిప్స్‌ను ఇండియా పంపింది. ఆయన బ్రిటిషు ప్రభుత్వపు ముసాయిదా ప్రకటనను సమావేశానికి సమర్పించారు. అందులో రాజ్యాంగ సభ ఏర్పాటు, రాష్ట్రాల హక్కుల వంటివేవో ఉన్నాయి. అయితే అవి కూడా రెండవ ప్రపంచ యుద్ధం ఆగిపోయిన తరువాత మాత్రమే. అంటే ఇప్పుడు కాదు అని. క్రిప్స్ ప్రతిపాదనపై గాంధీజీ వ్యాఖ్యానిస్తూ, ‘‘ఇది మునిగిపోతున్న బ్యాంకుకు చెందిన పోస్ట్ డేటెడ్ చెక్కు’’ అని అన్నారు. -
శతమానం భారతి: లక్ష్యం 2047.. అమృతయాత్ర
ఈ ఆగస్టు 15న మనం 75 వారాల అమృత మహోత్సవం పూర్తి చేసుకుంటున్నాం! ఈసారి స్వాతంత్య్ర వేడుకలను అమృత సంకల్ప కాలంగా మార్చడంలోకి భారతదేశం ప్రతి ఒక్కరినీ.. సుప్రసిద్ధులను, సగటు పౌరులను కూడా.. భాగస్వాములను చేసింది. ఎందుకు? ఎందుకంటే ఏ కృషి, ఏ సంకల్పం వృధాగా పోకూడదు. అదొక వేడుకగా జరగాలి. స్వాతంత్య్రం సిద్ధించిన సందర్భం అయితే ఇక చెప్పాల్సిందేముంది? అదొక మహోత్సవమే అవుతుంది. ‘ఉత్స్ వేన్ బినా యస్మాత్ స్థాపనం నిష్ఫలం భవత్’ అని సంస్కృతంలో ఒక మాట ఉంది. అంటే ఏమిటంటే.. ‘వేడుక లేని కృషి, సంకల్పం విజయవంతం కావు’ అని. ఏదైనా సంకల్పం వేడుక రూపం దాల్చినప్పుడు, లక్షలు కోట్ల మంది సంకల్పాలు దానికి తోడైనప్పుడు వాటి శక్తి సమీకృతం అవుతుంది. అదే విధంగా కృషి. ఆ తరహాలోనే స్వాతంత్య్ర అమృత మహోత్సవం ప్రజా భాగస్వామ్యాన్ని, అంటే ప్రతి ఒక్కరి పాత్రను ప్రోత్సహించింది. ఈ 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవాన్ని భారత ప్రభుత్వం ఒక విశిష్టమైన మైలురాయిగా మలిచింది. 2047లో స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాలు నిర్వహించుకునే నాటికి భారతదేశం ప్రతి రంగంలోనూ ప్రపంచంలో అగ్రస్థాయిలో ఉండాలన్నదే లక్ష్యం. రాబోయే 25న ఏళ్ల అమృతకాలంలో ఈ లక్ష్య సాధనకు అమృత యాత్ర ప్రారంభమైంది. నిర్విరామమైన ఈ పయనంలో వినూత్న స్వావలంబన ప్రమాణాల సృష్టికి భారత్ దీక్ష పూనింది. రేపటి నవ భారతానికి సుసంపన్న, ఉజ్వల వారసత్వం దిశగా ఈ ప్రగతి ప్రయాణం ఇప్పటికే తనదైన ముద్ర వేసింది. -
సామ్రాజ్య భారతి: 1930,1931/1947
ఘట్టాలు: జనవరి 26 ను ‘పూర్ణ స్వరాజ్య దినం’గా ప్రకటించిన భారత జాతీయ కాంగ్రెస్. భౌతికశాస్త్రంలో సర్ సీవీ రామన్‌కు నోబెల్ బహుమతి. మార్చి 12న మొదలై ఏప్రిల్ 6న ముగిసిన గాంధీజీ దండి యాత్ర (ఉప్పు సత్యాగ్రహం). లండన్‌లో తొలి రౌండ్ టేబుల్ సమావేశం భారతదేశ రాజధానిగా ఢిల్లీ. బ్రిటిష్ పోలీసులతో హోరాహోరీ ఎన్కౌంటర్లో చంద్రశేఖర ఆజాద్ మృతి. భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను ఉరి తీసిన బ్రిటిషర్లు. చట్టాలు: సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్, హిందూ గెయిన్స్ ఆఫ్ లర్నింగ్ యాక్ట్, గాంధీ ఇర్విన్ ఒప్పందం, ఇండియన్ టోల్స్ (అమెండ్మెంట్) యాక్ట్, ప్రొవిజినల్ కలెక్షన్ ఆఫ్ టెక్సెస్ యాక్ట్. చట్టాలు: కె.విశ్వనాథ్ : సినీ దర్శకులు (రేపల్లె); కె.బాలచందర్ : తమిళ సినీ దర్శకులు (నన్నీలం); పి.బి.శ్రీనివాస్ : సినీ నేపథ్య గాయకులు (కాకినాడ); మధురాంతకం రాజారాం : కథా రచయిత (తిరుపతి); పిఠాపురం నాగేశ్వరరావు : సినీ నేపథ్య గాయకులు (పిఠాపురం) నిరుపారాయ్ : సినీ నటి (గుజరాత్); షమ్మీ కపూర్ : బాలీవుడ్ నటుడు (బాంబే); రొమిల్లా థాపర్ : చరిత్రకారిణి (లక్నో); సింగీతం శ్రీనివాసరావు : సినీ దర్శకులు (ఉదయగిరి); సి.నారాయణరెడ్డి : కవి (తెలంగాణ); ముళ్లపూడి వెంకట రమణ : రచయిత (ధవళేశ్వరం); అవసరాల రామకృష్ణారావు : కథా రచయిత (తుని) (చదవండి: శతమానం భారతి: పరిరక్షణ) -
వైద్య ప్రతిభామూర్తి : యల్లాప్రగడ సుబ్బారావు / 1895–1948
కేన్సర్ చికిత్సలో ఉపయోగించేందుకు మెథోట్రెక్సేట్‌ను అభివృద్ధి చేసినవారు ఎల్లాప్రగడ. మానవ శరీరంలోని కణాలకు శక్తినిచ్చేది ఎడినోసిన్ ట్రై ఫాస్ఫేట్ (ఏటీపీ) అని కనుగొన్నదీ ఆయనే. ఫైలేరియాకు హెట్రాజన్ కనుగొన్నది కూడా ఆయనే. యల్లాప్రగడ పర్యవేక్షణలో వెలువడిన (ఆరోమైసిన్ ) రోగ నిరోధకాలు పెన్సిలిన్ కంటే ఎంతో శక్తిమంతమైనవి. ఆయన కనిపెట్టిన ఫోలిక్ యాసిడ్, స్ప్రూ మందులు నేటికీ మానవాళికి ప్రాణాధారాలు! అందుకే ఎల్లాప్రగడ వైద్యశాస్త్రానికీ, జీవ రసాయనిక శాస్త్రానికీ చేసిన సేవలు చిరస్మరణీయంగా ఉండిపోయాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం (నాటి మద్రాస్ ప్రెసిడెన్సీ) లో ఎల్లాప్రగడ జన్మించారు. జగన్నాథం, వెంకమ్మ దంపతుల ఏడుగురు సంతానంలో నాలుగో సంతానం. యల్లాప్రగడ ప్రెసిడెన్సీ కాలేజీలో ఇంటర్ చదివాక, మద్రాస్ వైద్య కళాశాలలో చేరారు. రాజమండ్రిలో ఉండగా చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి సంస్కరణల ధోరణినీ, వందేమాతరం ఉద్యమం వేడినీ చూసిన ఎల్లాప్రగడ విదేశీ వస్త్ర బహిష్కరణ కోసం గాంధీ ఇచ్చిన పిలుపునకూ స్పందించారు. ఖద్దరుతో ఆపరేషన్ థియేటర్లో కనిపించారు. ఇదే జీవితం మీద తొలిదెబ్బ అవుతుందని ఆయన ఊహించలేదు. సర్జరీ ప్రొఫెసర్ ఎంసీ బ్రాడ్‌ఫీల్డ్‌కు అది తీవ్ర ఆగ్రహం తెప్పించింది. పరీక్ష బాగా రాసినా ఎల్లాప్రగడకు పూర్తి స్థాయిలో ఎంబీబీఎస్ పట్టా ఇవ్వనివ్వలేదు. ఎల్ఎంఎస్ సర్టిఫికెట్తో సరిపెట్టారు. మద్రాస్ మెడికల్ సర్వీస్‌లో చేరడానికి ఇది ఆటంకమైంది. అందుకే డాక్టర్ ఆచంట లక్ష్మీపతిగారి ఆయుర్వేద కళాశాలలో అనాటమీ అధ్యాపకునిగా చేరారు. ఆయుర్వేద ఔషధాలలోని రోగ నిరోధక లక్షణం ఆయనను ఎంతో ఆకర్షించింది. కొత్త పద్ధతులను మేళవించి పరిశోధన ప్రారంభించారు. ఇంతలోనే హార్వర్డ్ మెడికల్ కళాశాలలో ఉష్ణమండల రుగ్మతల విభాగం నుంచి పిలుపు వచ్చింది. మల్లాడి సత్యలింగనాయకర్ చారిటీస్ (కాకినాడ) వారి సాయం కూడా అందింది. హార్వర్డ్‌లో డిప్లొమా పొంది అక్కడే అధ్యాపకుడయ్యారు. వైద్య పరిశోధనలో ఎల్లాప్రగడ ప్రతిభ ఎంతటిదో మొదట రుజువైనది ఇక్కడే. మనిషి రుగ్మతలు ఎన్నింటికో ఎల్లాప్రగడ మందు కనిపెట్టారు. కానీ ప్రపంచానికి పట్టిన రుగ్మతలకు మందు కనిపెట్టే వారి కోసం ప్రజలు ఎదురుచూస్తూనే ఉంటారు. వర్ణ వివక్ష, ఈర్ష్యా ద్వేషాలు, కక్షలు, కార్పణ్యాలతో బాధపడుతున్న ప్రపంచాన్ని మరమ్మతు చేయగల ఒక ఔషధం కోసం లోకం అర్రులు చాస్తోంది. ఎల్లాప్రగడ వంటి ప్రతిభా సూర్యుడిని మేఘాల్లా కమ్మేసినవీ ఇవే! (చదవండి: శతమానం భారతి: పరిరక్షణ) -
అంగారక కక్ష్యలోకి ‘మామ్’
2014 సెప్టెంబరు 24న ఉదయం గం. 7.17.32 లకు ‘మామ్’.. అంగారక గ్రహ కక్ష్యలోకి ప్రవేశించే సంక్లిష్ట దశను సజావుగా అధిగమించింది. అనంతరం 8.15 గంటలకు భూమికి సమాచారాన్ని చేరవేసింది. జీవాన్వేషణ, గ్రహ నిర్మాణం వంటి అంశాలపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఇస్రో’ చేపట్టిన ఈ ‘ప్రాజెక్ట్ అంగారకయాన్’ లేదా ‘మార్స్ ఆర్బిటర్ మిషన్’ (మామ్) ను 2013 నవంబరు 5న శ్రీహరికోట లోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రము నుండి విజయవంతంగా ప్రయోగించారు. పీఎస్ఎల్వీ సీ25 ఉపగ్రహ వాహకనౌక ద్వారా ‘మామ్’ రోదసిలోకి దూసుకెళ్లడంతో భారత్ అంగారకయానం మొదలైంది. దాంతో అంగారక గ్రహంపై విజయవంతంగా ప్రయోగాలు నిర్వహించిన నాలుగో దేశంగా భారత్ గుర్తింపు పొందింది. ప్రయోగించిన తొలి ప్రయత్నంలోనే విజయం సాధించిన ఈ ప్రాజెక్టుకు రాకెట్ శాస్త్రవేత్త నందిని హరినాథ్ ఆపరేషన్స్ డిప్యూటీ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు యువ నటుడు ఉదయ్‌కిరణ్, సీనియర్ నటులు అంజలీదేవి, అక్కినేని నాగేశ్వరరావు; సుచిత్రాసేన్, సునంద పుష్కర్, బాలూ మహేంద్ర, రూసీ మోడీ, కె.బాలచందర్.. కన్నుమూత. భారత ప్రధానిగా నరేంద్ర మోదీ తొలిసారి ప్రమాణ స్వీకారం. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం. -
శతమానం భారతి: లక్ష్యం 2047
ప్రకృతి, నేల, పర్యావరణం భారతదేశానికి కేవలం పదాలు కాదు. సంస్కృతి, ధర్మంతో ముడివడి ఉన్న దైవత్వ అంశాలు. పర్యావరణ పరిరక్షణకు భారత్ కొన్ని సంవత్సరాలుగా పాటిస్తున్న నిబద్ధతను ప్రపంచం అంతా ఆసక్తికరంగా గమనిస్తూ ఉంది. 2021వ సంవత్సరంలో గ్లాస్గోలోజరిగిన సి.ఒ.పి. (కాప్) 26 వ సమావేశం.. భూతాపోన్నతిని తగ్గించే విషయమై భారత్ ప్రయత్నాలను ప్రముఖంగా ప్రస్తావించింది. ప్రధాని మోదీ ఇచ్చిన ‘లైఫ్’ (లైఫ్‌స్టయిల్ ఫర్ ఇన్విరాన్మెంట్) పిలుపును ప్రపంచం ఒక ఉద్యమంగా మార్చుకుంది. గత కొన్నేళ్లుగా నేల ఆరోగ్యం క్షీణించడంపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతూ వస్తున్న నేపథ్యంలో భారత్ ఈ ‘మిట్టీ బచావో’ను చేపట్టింది. సహజ వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తోంది. ఇవేకాక, పర్యావరణ పరిరక్షణకు మరికొన్ని ముఖ్యమైన చర్యలు తీసుకుంది. 37 కోట్ల ఎల్.ఇ.డి. బల్బులను ఇప్పటి వరకు పంపిణీ చేసింది. 5 కోట్ల యూనిట్ల విద్యుత్‌ను ఆదా చేసింది. 4 కోట్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్ను తగ్గించగలిగింది. గంగానది పునరుజ్జీవనానికి బడ్జెట్లో పెద్ద మొత్తాలను కేటాయించింది. రాజస్థాన్‌లోని భడ్లాలో ప్రపంచంలోనే అతి పెద్ద సోలార్ పార్క్ ప్రారంభం కూడా పర్యావరణ పరిరక్షణలో భాగమే. భారత శత స్వాతంత్య్రోత్సవాల నాటికి భూమి వెచ్చదనాన్ని తగ్గించి, పచ్చదనాన్ని పెంచేందుకు భారత్ కృషి చేస్తోంది. చదవండి: మహోజ్వల భారతి: జాతీయోద్యమ కవియోధుడు -
జైహింద్ స్పెషల్.. నిప్పుకణం నేతాజీ
యుద్ధంలో రేగిన దుమ్ము కుదురుకోక ముందే బ్రిటన్ చేతుల్లోంచి ఫ్రీడమ్‌ని లాగేసుకునేందుకు బోస్ కాచుక్కూర్చున్నారు. బ్రిటన్ సతమతం అవుతున్నప్పుడే దానిని చావుదెబ్బ తియ్యాలని బోస్ ఆలోచన. గారిబాల్డీ, మేజినీ అతడిని లోలోపల రాజేస్తున్నారు. 1939. భారత జాతీయ కాంగ్రెస్ పైకి కలిసే ఉంది కానీ, లోపల రెండుగా విడిపోయింది. గాంధీజీ–నేతాజీ వర్గాలవి! పార్టీ అధ్య ఎన్నికల్లో.. ‘‘బోస్.. ఈసారి నువ్వు పోటీ చేయకు’’ అన్నారు గాంధీజీ. కానీ నేతాజీ విన్లేదు! మీ మాట మీద నాకు ఎంత గౌరవం ఉందో, నా సిద్ధాంతం మీద నాకు అంతే గౌరవం ఉంది అన్నాడు. ముత్తురామలింగం దేవర్ ముందుకొచ్చి బోస్ వైపు నిలబడ్డారు. సౌత్ ఇండియా ఓట్లన్నీ బోస్కి పడ్డాయి. నేతాజీ గెలిచారు. వరుసగా రెండోసారి నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడయ్యారు. విజేత నిష్క్రమణ! ప్రజలు సాయుధ పోరాటాన్ని కోరుకుంటున్నారా? గాంధీజీని వద్దనుకుంటున్నారా? లేదు. గాంధీజీ చేతిలో తుపాకీని చూడాలనుకుంటున్నారు! సర్వసభ్య సమావేశంలో కల్లోలం మొదలైంది. ఎవరు అంత మాట అన్నది?! మహాత్ముడిని మామూలు మనిషిగా చూడాలనుకుంటున్నారా? ఆ మాట అన్నదెవరో ముందుకు రండి. ‘‘ఇంకెవరు? బోస్ ముఠా!’’– శాంతి ప్రియుల సహనం చచ్చిపోతోంది. పళ్లు పటపటలాడిస్తున్నారు. ‘‘పార్టీ నుంచి వెళ్లగొట్టండి పొగురుబోతుల్ని’’ – పెద్దగా అరుపులు. ‘‘అవునవును. వెళ్లగొట్టాలి’’ బోస్‌ని పిలిపించారు గాంధీజీ. ‘‘వింటున్నావా?’’ అన్నారు. పార్టీ నుంచి బయటికి వచ్చేశారు నేతాజీ! వచ్చి, ‘ఫార్వర్డ్ బ్లాక్’ పార్టీ పెట్టారు. దేవర్ కూడా ఆయనతో పాటు వచ్చేశారు. మొదటి బహిరంగ సభ మధురైలో. వీధులు చాల్లేదు. ఆకాశం కావలసి వచ్చింది. జనం మేడలు మిద్దెలు ఎక్కి కూర్చున్నారు. ‘‘ఎవరు వచ్చింది గాంధీజీనా?’’ వృద్ధ మూర్తులెవరో అడుగుతున్నారు. ‘‘కాదు, నేతాజీ సుభాస్ చంద్రబోస్.’’ ఇంగ్లండ్‌కు పయనం రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. యుద్ధం ముగిశాక బ్రిటన్ మనకు ఫ్రీడమ్ ఇచ్చేస్తుందని గాంధీ, నెహ్రూ, కాంగ్రెస్‌లోని పెద్దలు నిరీక్షిస్తూ ఉన్నారు. యుద్ధంలో రేగిన దుమ్ము కుదురుకోక ముందే బ్రిటన్ చేతుల్లోంచి ఫ్రీడమ్‌ని లాగేసుకునేందుకు బోస్ కాచుక్కూర్చున్నారు. బ్రిటన్ సతమతం అవుతున్నప్పుడే దానిని చావుదెబ్బ తియ్యాలని బోస్ ఆలోచన. గారిబాల్డీ, మేజినీ అతడిని లోలోపల రాజేస్తున్నారు. కటక్ స్టివార్డ్ స్కూల్లో చదువుకుంటున్నప్పుడు మొదటిసారిగా గ్యారీ, మేజినీల గురించి విన్నాడు బోస్. అక్కడే రేవన్షా కాలేజియేట్ స్కూల్లో వాళ్ల గురించి చదివాడు. ఇద్దరూ ఇటాలియన్ లీడర్స్. కొత్త ఆలోచనలతో దేశానికి కొత్త రక్తం ఎక్కించినవారు. ఒకరు నేషనల్ హీరో. ఇంకొకరు సోల్ ఆఫ్ ఇటలీ! వాళ్లు అవహించారు బోస్‌ని. బ్రిటన్‌ని తరిమికొట్టాక ఇండియాని కొన్నాళ్లయినా ఇటలీలా, టర్కీలా సోషలిస్టు నియంతృత్వంలోకి నడిపించాలని అతడి కల. బ్రిటన్ డిసిప్లీన్ కూడా బోస్కి నచ్చుతుంది! కానీ ఆ జులుం! దాన్నే భరించలేకపోతున్నాడు. బ్రిటన్ లేబర్ పార్టీలో థింకర్స్ కొందరు ఉన్నారు. లార్డ్ హాలిఫాక్స్, జార్జి లాన్స్బరీ, క్లెమెంట్ అట్లీ, గిల్బర్ట్ ముర్రే, సర్ స్టాఫోర్డ్ క్రిప్స్... వీళ్లందరితోనూ ఇంగ్లండ్ వెళ్లి తన ఆలోచనల్ని పంచుకున్నాడు బోస్. కన్సర్వేటివ్ పార్టీ నాయకులు మాత్రం బోస్‌ని దగ్గరకు రానివ్వలేదు. బ్రిటన్ అప్పుడు ఉన్నది కన్సర్వేటివ్‌ల చేతుల్లోనే. వలస దేశీయుడితో మాటలేమిటని వాళ్లంతా మొహం చాటేశాడు. బోస్ ఇండియా వచ్చేశాడు. తిరిగి ఇండియాకు వచ్చీరాగానే వార్త! బ్రిటన్ తరఫున ఇండియా కూడా ప్రపంచ యుద్ధంలోకి వచ్చేస్తోందని వైశ్రాయ్ లిన్లిత్గో ప్రకటించాడని!! ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌తో ఒక్కమాటైనా చెప్పకుండా తీసుకున్న ప్రకటన అది. బోస్ తిరగబడ్డాడు! మనది కాని యుద్ధాన్ని మనం చేయడం ఏమిటని గాంధీజీతో అన్నారు. కాంగ్రెస్ అయోమయంలో ఉంది. ‘‘నాకైతే క్లారిటీ ఉంది’’ అన్నాడు బోస్. మొత్తం కలకత్తాని వెనకేసుకుని వీధివీధీ తిరిగాడు. గో బ్యాక్ అని గర్జించాడు. జైల్లో పడ్డాడు. వారం రోజులు అన్నం నీళ్లూ ముట్టకుండా జైల్లో హంగర్ స్ట్రైక్ చేసి విడుదలయ్యాడు. బోస్ దేశం దాటకుండా బ్రిటిష్ ప్రభుత్వం కలకత్తాలో అతడు ఉంటున్న ఇంట్లోనే అతడిని బంధించింది. చుట్టూ నిఘా పెట్టింది. బోస్ దేశం దాటితే ఏమౌతుంది? దాటకుండానే ఏడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాడు. దాటితే ఏడు ఖండాల శత్రువుల్ని పోగేస్తాడు. రష్యా, జర్మనీ, జపాన్, ఇటలీ, క్రొయేషియా, థాయ్‌లాండ్, బర్మా, ఫిలిఫ్పీన్స్... ఇవన్నీ బ్రిటన్‌కి వ్యతిరేకం. అన్నిటినీ కలుపుకుని భ్రిటన్ని ఒక ఆట ఆడుకుంటాడు. బోస్ ప్లాన్లు వేస్తున్నాడు. అతడికి ఒక విషయం స్పష్టమయింది. యుద్ధం పూర్తయ్యేవరకు తనను వదిలిపెట్టరు. యుద్ధం పూర్తయితే దేశాన్ని వదిలిపెట్టరు. ఈలోపే పొగపెట్టాలి. జర్మనీతో ‘టై–అప్’ అయితే బ్రిటన్‌ని ఇంటికి పంపడం తేలిక. ఓం శాంతి అంటే లాభం లేదు. మిలట్రీ ట్రక్కుల నుంచి ఇండియాలోకి జర్మన్ సైన్యాన్ని దింపాలి. బోస్ జంప్! ది గ్రేట్ ఎస్కేప్! -
మహోజ్వల భారతి: జాతీయోద్యమ కవియోధుడు
రవీంద్రనాథ్ టాగూర్ స్వాతంత్య్ర సమరయోధులు కూడా అయినప్పటికీ ఆయన ‘విశ్వ కవి’గా మాత్రమే గుర్తింపు పొందారు. తొలి నుంచీ ఆయన జాతీయ భావాలున్నవారు. హిందూ మేళాలో దేశభక్తి గీతాలను పాడారు. పృథ్వీరాజు పరాజయం గురించి ప్రబోధాత్మక పద్యనాటకాన్ని రచించారు. బ్రిటిష్ ప్రభుత్వం తిలక్‌ను నిర్భంధించినపుడు ప్రభుత్వాన్ని రాగూర్ తీవ్రంగా విమర్శించారు. బెంగాల్ విభజన ప్రతిఘటనోద్యమంలో కూడా టాగూర్ పాత్ర తక్కువేమీ కాదు. జాతీయ నిధి కోసం ఆయన జోలె పట్టి విరాళాలు వసూలు చేశారు. 1896లో జరిగిన కలకత్తా కాంగ్రెస్ సదస్సులో.. బంకిం చంద్ర చటర్జీ ‘వందేమాతరం’ గీతాన్ని మొట్టమొదటిగా తనే ఆలపించారు టాగూర్. ఆయన రాసిన ‘జనగణమణ’ ను జాతీయగీతంగా ప్రకటించేముందు ‘వందేమాతరం’, ‘జనగణమన’ లపై దేనిని జాతీయ గీతంగా ప్రకటించాలని సుదీర్ఘ చర్చ, తర్జన భర్జనలు జరిగాయి. అంతిమంగా రవీంద్రుడి ‘జనగణమన’ దే పైచేయి అయింది. దీంతో రాజ్యాంగ సభ కమిటీ అధ్యక్షుడు బాబూ రాజేంద్ర ప్రసాద్ 1950 జనవరి 24న ‘జనగణమన’ ను జాతీయగీతంగా, వందేమాతరంను జాతీయ గేయంగా ప్రకటించారు. అదే సమయంలో రెండూ సమాన ప్రతిపత్తి కలిగి ఉంటాయని స్పష్టం చేశారు. ‘గీతాంజలి’ రవీంద్రునికి కవిగా ప్రపంచఖ్యాతిని తెచ్చిపెట్టింది. ఈ కావ్యంలోని.. వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్.. గీతం మహాత్మాగాంధీకి ఇష్టమైనది. తన జీవితంపై రవీంద్రుని ప్రభావమెంతో ఉన్నదని జవహర్లాల్ నెహ్రూ కూడా స్వయంగా చెప్పుకున్నారు. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైనపుడు టాగూర్ మానసికంగా కృంగిపోయి అనారోగ్యానికి గురి అయ్యారు. చికిత్స వల్ల కూడా ప్రయోజనం లేకపోయింది. 1941 ఆగస్టు 7న తన 80 ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు. క్విట్ ఇండియా కార్యకర్త ఎం.ఎస్. గురుపాదస్వామి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమ కార్యకర్త. రాజకీయ నేత. రెండుసార్లు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. నేడు ఆయన జయంతి. 1924 ఆగస్టు 7న మైసూరు జిల్లాలోని మలంగిలో జన్మించాడు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న సమయంలో అఖిల భారత విద్యార్థుల సమాఖ్యలో సభ్యుడిగా ఉన్నాడు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీలో చేరారు. తర్వాత కాంగ్రెస్, జనతా, జనతాదళ్ పార్టీలకు మారారు. -
సామ్రాజ్య భారతి 1928,1929/1947
ఘట్టాలు: బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బి.సి.సి.ఐ) ఏర్పాటు. ఆమ్స్టర్డామ్ ఒలింపిక్స్‌లో స్వర్ణపతకం సాధించిన ఇండియా. న్యూఢిల్లీ అసెంబ్లీ ఛాంబర్లోకి బాంబులు విసిరిన బతుకేశ్వర్ దత్, భగత్‌సింగ్. ఇండియాకు మదర్ థెరిస్సా ఆగమనం. బాంబే ఫ్లయింగ్ క్లబ్‌ను స్థాపించిన జె.ఆర్.డి.టాటా. చట్టాలు: ది హిందు ఇన్హెరిటెన్స్ (రిమూవల్ ఆఫ్ డిస్ఎబిలిటీస్) యాక్ట్, ది చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రెయింట్ యాక్ట్. జననాలు: వీరమాచినేని విమలాదేవి : కమ్యూనిస్టు పార్టీ నాయకురాలు, ఏలూరు ఎంపీ (విశాఖపట్నం); గిరీశ్ చంద్ర సక్సేనా : రాజకీయ నేత, (ఆగ్రా); శివాజీ గణేశన్ : తమిళ నటులు (సురైకోటై్ట); జగ్గయ్య: నటుడు, లోక్‌సభ ఎంపీ (తెనాలి); ఎం.ఎస్.విశ్వనాథన్ : సంగీత దర్శకులు (మద్రాసు ప్రెసిడెన్సీ); జె.వి.సోమయాజులు : నటులు (శ్రీకాకుళం); త్రిపుర (రాయసం వెంకట త్రిపురాంతకేశ్వర రావు) : కథా రచయిత (విశాఖపట్నం); రావు బాలసరస్వతి : గాయని (హైదరాబాద్) నర్గీస్ : నటి (కలకత్తా); సురయా : నటి (పాకిస్థాన్); కిశోర్ కుమార్ : సినీ నేపథ్య గాయకులు (మధ్యప్రదేశ్); సోమనాథ్ చటర్జీ : కమ్యూనిస్టు యోధులు (అస్సాం); యశ్ జోహార్ : సినీ నిర్మాత (అమృత్సర్); లతా మంగేష్కర్ : సినీ నేపథ్య గాయని (ఇండోర్); మిఖాసింగ్ : ట్రాక్ అండ్ ఫీల్డ్ స్ప్రింటర్ (పాకిస్థాన్); సునీల్ దత్ : సినీ దిగ్గజం, రాజకీయనేత (పంజాబ్); అనంత పాయ్ : కామిక్ క్రియేటర్ (కర్ణాటక); జి.వెంకటస్వామి : రాజకీయనేత (హైదరాబాద్); సిహెచ్. హనుమంతరావు : ఆర్థికవేత్త, రచయిత (కరీంనగర్)