హర్యానాకు చెందిన ఇరవై ఏళ్ల యువతి మానుషి చిల్లర్ ‘మిస్ వరల్డ్’ టైటిల్ గెలుచుకున్నారు. 2000 సంవత్సరంలో ప్రియాంక చోప్రా మిస్ట్ వరల్డ్ విజేతగా ఎన్నికైన పదిహేడేళ్లకు మళ్లీ భారత్‌కు ఈ ఘనతను మానుషి సాధించిపెట్టారు. చైనాలోని శాన్యా సిటీలో నవంబర్ 18న జరిగిన ప్రపంచ సుందరి అందాల పోటీల ఫైనల్స్‌లో 117 మందితో మానుషి పోటీ పడి టైటిల్ గెలిచారు.
మానుషి ఢిల్లీలోని సెయింట్ థామస్ స్కూల్‌లో చదువుకున్నారు. సి.బి.ఎస్.ఇ.లో ఇంగ్లిష్ సబ్జెక్టులో ఆలిం డియా టాపర్‌గా నిలిచారు. తొలి ప్రయత్నంలోనే ‘నీట్’లో సీటు సాధించి సోనిపట్ (హర్యానా) లోని భగత్ ఫూల్ సింగ్ మెడికల్ కాలేజీలో ఎం.బి.బి.ఎస్.లో చేరారు. ఆమె కూచిపూడి డ్యాన్సర్ కూడా. రాజా రాధారెడ్డి దంపతుల దగ్గర నాట్యం నేర్చుకున్నారు.
ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు
జూన్ 30 అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చిన జి.ఎస్.టి.
92 ఏళ్లుగా ప్రభుత్వం విడిగా ప్రవేశపెడుతున్న రైల్వే బడ్జెట్ సాధారణ బడ్జెట్‌లో విలీనం.
కొచ్చి, హైద్రాబాద్‌ల మెట్రో రైళ్లు ప్రారంభం.
భారత 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్.
బెంగళూరులో సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్‌ను తుపాకీతో కాల్చి చంపిన దుండగులు.
భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ.
Comments
Please login to add a commentAdd a comment