Miss World
-
హైదరాబాద్‌లో ‘మిస్ వరల్డ్ ’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మరో ప్రతిష్టాత్మక పోటీలకు వేదిక కాబోతోంది. ప్రపంచమంతా ఆసక్తిగా తిలకించే ప్రపంచ సుందరి (మిస్ వరల్డ్) పోటీలు ఈ ఏడాది హైదరాబాద్‌లో జరగనున్నాయి. మే 7వ తేదీ నుంచి 31 వరకు నగరంలో 72వ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించనున్నట్లు మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్పర్సన్, సీఈవో జులియా మోర్లే.. తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ బుధవారం సంయుక్తంగా ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి మిస్ వరల్డ్ లిమిటెడ్ ఈ పోటీలను నిర్వహించనుంది. పోటీల ప్రారంభ, ముగింపు, గ్రాండ్ ఫినాలే వేడుకలు హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు జులియా మోర్లే వెల్లడించారు. ‘బ్యూటీ విత్ ఏ పర్పస్’నినాదంతో ఈ పోటీలు నిర్వహించనున్నారు. ఆసక్తిగా ఎదురుచూస్తున్నా: జులియా తెలంగాణ ప్రభుత్వంతో కలిసి హైదరాబాద్‌లో ప్రపంచ సుందరి పోటీలు నిర్వహించేందుకు ఆసక్తిగా ఎదుచూస్తున్నట్లు జులియా మోర్లే తెలిపారు. ‘గొప్ప సంస్కృతి, వారసత్వం, అద్భుత ఆతిథ్యం, వేగవంతమైన వృద్ధి ఉన్న తెలంగాణ ప్రభుత్వంతో కలిసి నిర్వహిస్తున్న ఈ పోటీలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిస్ వరల్డ్ అభిమానులకు గొప్ప అనుభూతిని పంచనున్నాయి. ఈ భాగస్వామ్యం మిస్ వరల్డ్ పోటీల కోసం మాత్రమే కాదు.. సమూహాల సాధికారతకు, బ్యూటీ విత్ ఏ పర్సస్ అనే మా ఉమ్మడి నిబద్ధతకు నిదర్శనం’అని పేర్కొన్నారు. ఇది అద్భుతాల తెలంగాణ: స్మిత ప్రపంచ సుందరి పోటీలకు హైదరాబాద్ వేదిక కావటంపై రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ సంతోషం వ్యక్తంచేశారు. ‘ఇది తెలంగాణ.. ఇక్కడ ప్రతి పండుగలో గొప్ప ఆనందం ఉంటుంది. ప్రతి చేతి నైపుణ్యం ఓ కొత్త కథను, ఆరాధనను తెలిపే నేల ఇది. ఇది తెలంగాణ.. అసలైన అందాలను ప్రతిబింబించే నేల. మిస్ వరల్డ్ వేదిక తెలంగాణలోని చేనేత గొప్పతనాన్ని, అద్భుతమైన ఆతిథ్యాన్ని, జానపద రీతులకు వేదిక కాబోతోంది’అని వెల్లడించారు. 2024 మిస్ వరల్డ్ పోటీలు ముంబైలో నిర్వహించారు. ఆ పోటీల్లో చెక్ రిపబ్లిక్కు చెందిన క్రిస్టినా పిస్కోవా విజేతగా నిలిచారు. మే 31న జరిగే గ్రాండ్ ఫినాలేలో విజేతకు ఆమె వజ్రాల కిరీటాన్ని అలంకరిస్తారు. -
మిస్ యూనివర్స్ ట్రాన్స్ పోటీలో తెలుగు శాస్త్రవేత్త
పట్టుమని 200 కుటుంబాలు నివాసమున్న గ్రామం. నగర శివారులో ఉన్నా... కాంక్రీట్ జంగిల్ పోకడలు కనిపించవు. పదో తరగతి వరకూ గ్రామంలో బేల్దారి పనులు, నగరంలో పండ్ల విక్రయంతో తల్లిదండ్రులకు చేదోడు. చిరుప్రాయం నుంచే శారీరక మార్పులతో సహ విద్యార్థుల చిన్నచూపు. వ్యక్తి వెనుక సూటిపోటి మాటలు... అవమానకర వ్యాఖ్యలు. కట్ చేస్తే.. ప్రస్తుతం స్పెయిన్ దేశంలో ఫార్మా రంగ శాస్త్రవేత్త... ట్రాన్స్ఫ్యూజన్ శస్త్రచికిత్స తర్వాత ప్రపంచ దేశాలు గుర్తించేలా మిస్ వరల్డ్ రన్నరప్.. స్ఫూర్తిదాయక జీవనంతో పలువురికి ఆదర్శం. నవంబర్‌లో మిస్ యూనివర్స్ ట్రాన్స్ విజేత దిశగా అడుగులు. ఇది అనంతపురం జిల్లాకు చెందిన ట్రాన్స్‌జెండర్ హన్నా రాథోడ్ విజయ ప్రస్థానం. చదువుతో ఆమె సాధించిన ఒక్క గెలుపు కుటుంబాన్నే కాదు.. ఏకంగా జిల్లా కీర్తిప్రతిష్టలను పెంచింది. స్ఫూర్తిదాయకమైన ఆమె జీవనం ఆమె మాటల్లోనే... అనంతపురం రూరల్ పరిధిలోని సోములదొడ్డి గ్రామం. నాన్న మల్లేష్, అమ్మ పద్మావతికి మూడో సంతానంగా పుట్టాను. ఓ అన్న, అక్క ఉన్నారు. నాకు ఆనంద్‌బాబు అని పేరుపెట్టారు. అమ్మ, నాన్న అనంతపురం నగరంలోని తాడిపత్రి బస్టాండ్‌లో పండ్ల వ్యాపారం చేసేవారు. పేదరికం కారణంగా పస్తులతో గడిపిన రోజులెన్నో చూశా. దీంతో బడికి వెళ్లే సమయంలోనే ఏ మాత్రం వీలు చిక్కినా ఊళ్లో కూలి పనులకు, అమ్మ, నాన్నతో కలసి పండ్ల వ్యాపారం చేస్తూ వచ్చా. ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడు నాలో శారీరక మార్పులు గుర్తించా. సమాజానికి తెలిస్తే బయటకు గెంటేసి హేళన చేస్తారేమోనని భయపడ్డా. దీంతో ఎవరితోనూ చెప్పుకోలేదు. చిన్న కొడుకు కావడంతో మా అమ్మ నన్ను ఎంతో గారాబంతో పెంచుతూ వచ్చింది. నా వెనుక గేలి చేసేవారు సమాజంలో ట్రాన్స్జెండర్లు ఎదుర్కొంటున్న వివక్ష నన్ను చాలా భయపెట్టేది. ఇలాంటి సమయంలో కేవలం చదువు ఒక్కటే నా సమస్యకు చక్కటి పరిష్కారమని గుర్తించాను. దీంతో పట్టుదలగా చదువుకుంటూ క్లాస్‌లో టాపర్‌గా నిలుస్తూ వచ్చా. ఇంటర్ వరకూ ప్రభుత్వ విద్యాసంస్థల్లో తెలుగు మీడియం చదివిన నేను ఆ తర్వాత అనంతపురంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీ–ఫార్మసీ చేశా. అక్కడ చాలా మంది స్నేహితులు ఉండేవారు. వారిలో కొందరు నా ముందు ఏమీ అనకపోయినా... నా వెనుక చెడుగా మాట్లాడుకునేవారని తెలిసి బాధపడ్డాను. జన్యుపరమైన లోపాన్ని ఎవరూ గుర్తించలేదు. గేలి చేసినా కుంగిపోలేదు. పట్టుదలతో బీ–ఫార్మసీ, ఎం–ఫార్మసీ పూర్తి చేశా. పెళ్లి ప్రయత్నాల నుంచి బయటపడి ఎం–ఫార్మసీ పూర్తి చేసిన తర్వాత విదేశాల్లో ఎంఎస్ చేయాలని అనుకున్నా. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించలేదు. దీంతో అనంతపురంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా రెండేళ్లు పనిచేశా. అదే సమయంలో జూనియర్ ఫార్మసీ విద్యార్థులకు ట్యూషన్లు చెప్పడం ద్వారా వచ్చిన డబ్బును దాచుకుని విదేశీ విద్యావకాశాలపై అన్వేషిస్తూ వచ్చా. ఈ లోపు అనంతపురం కలెక్టరేట్లో ఉద్యోగం వచ్చింది. ఈ విషయం తెలియగానే చాలా మంది అమ్మాయిని ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. అయితే పెళ్లి చేసుకుని ఆమె జీవితాన్ని నాశనం చేయకూడదని భావించిన నేను.. విదేశాలకు వెళ్లిపోతే పెళ్లి ప్రయత్నాలు వాయిదా పడతాయనుకున్నా. అదే సమయంలో విదేశీ విద్యావకాశాలపై అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీ పరీక్ష రాసి మెరుగైన ఫలితాలతో స్పెయిన్‌లో ఎంఎస్ సీటు దక్కించుకున్నా. కోర్సు పూర్తి కాగానే అక్కడే బయో ఇంజినీరింగ్ సొల్యూషన్స్‌లో శాస్త్రవేత్తగా పనిచేసే అవకాశం వచ్చింది. శాస్త్రవేత్తగా స్థిరపడిన తర్వాత 2021లో ట్రాన్స్ఫ్యూజన్ ఆపరేషన్ చేయించుకుని హన్నారాథోడ్గా పేరు మార్చుకుని ఇంట్లో వారికి విషయం చెప్పా. చదువే సెలబ్రిటీని చేసింది ట్రాన్స్జెండర్ల జీవితం ఎప్పుడూ సాఫీగా ఉండదు. మన వ్యక్తిత్వం చెదరకుండా కాపాడుకోవాలి. ఎలాంటి వ్యక్తికైనా ప్రతికూల కాలమంటూ ఉంటుంది. నిరాటంకంగా అవరోధాల్ని అధిగమించి విజయం సాధిస్తే ఈ సమాజమే గౌరవప్రదంగా చూస్తుంది. మనం కోరకుండానే వచ్చే జన్యుపరమైన లోపాలకు కుంగిపోరాదు. ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి, ధర్మాన్ని, దైవాన్ని నిందించడం కూడా పొరబాటే. అసలు ప్రతికూలతల్లో కూడా అనుకూలతను వెదికి అనుకూలంగా మలచుకునే యుక్తిని సాధించగలగాలి. అప్పుడే విజయం మన సొంతమవుతుంది. నా జీవితమే ఇందుకు నిదర్శనం. చదువే ననున్న సెలబ్రిటీని చేసింది. ఈ స్థాయికి నేను ఎదగడంలో ఎదుర్కొన్న కష్టాలు, బాధలు వివరిస్తూ తెలుగు, ఇంగ్లిష్, స్పానిష్ మూడు భాషల్లో పుస్తకం రచిస్తున్నా. త్వరలో ఈ పుస్తకాన్ని మీ ముందుకు తీసుకువస్తా. మిస్ వరల్డ్ పోటీల్లో ప్రతిభ గతేడాది స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో మిస్ వరల్డ్ ట్రాన్స్–2023 పోటీలు జరిగాయి. అక్కడే పనిచేస్తున్న నాకు ఈ విషయం తెలిసి భారతదేశం తరఫున ప్రాతినిథ్యం వహించేందుకు దరఖాస్తు చేసుకున్నా. దీంతో నిర్వాహకులు అవకాశం ఇచ్చారు. ఈ పోటీలో ఏకంగా రన్నరప్‌గా నిలవడంతో నాలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. దీంతో సేవా కార్యక్రమాలు చేపట్టి ట్రాన్స్ సమాజంలో సమూల మార్పులు తీసుకురావాలని భావించాను. ఆ దిశగా తొలి ప్రయత్నం చేశాను. ఇందుకోసం స్పెయిన్‌లోని కొన్ని కంపెనీలతో సంప్రదింపులు కూడా జరిపాను. ట్రాన్స్ సమాజంలో దుర్భర జీవితం గడుపుతున్న వారి సంక్షేమానికి తమ వంతు సహకారం అందిస్తామని కంపెనీ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ ఏడాదికి సంబంధించి నవంబర్‌లో న్యూఢిల్లీలో మిస్ యూనివర్స్ ట్రాన్స్ పోటీల్లో ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కింది. ఈ పోటీల్లో పాల్గొనడానికే ఇండియాకు వచ్చా. ఇక్కడ మా ఊరి ప్రజలు నన్ను చూసి చాలా సంతోష పడ్డారు. ప్రతి ఒక్కరూ నన్ను ఆశీర్వదించారు. ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా నేనే చీఫ్ గెస్ట్. ఇంతకంటే గౌరవం ఏమి కావాలి? -
ఆ రోజు కృతజ్ఞతతో కాదు..భయంతో నమస్తే చెప్పా: ప్రియాంక చోప్రా
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలిచిన సంగతి తెలిసింది. ఆ తర్వాతే ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్లో వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. పాప్ సింగర్ నిక్ కచేరీని పెళ్లి చేసుకొని హలీవుడ్లో అడుగుపెట్టేసింది. ఇప్పుడు అక్కడ వరుసగా వెబ్ సిరీస్‌లు, సినిమాలు చేస్తూ బిజీ అయింది. తాజాగా ఈ బ్యూటీ కూతురుతో కలిసి లండన్‌లోని ఎరీనాలో తన భర్త నిర్వహించిన కచేరికి వెళ్లింది. ఆ వేదికపైనే ప్రియాంక మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకుంది. దాదాపు 24 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ వేదికపైకి రావడంతో ఆనందంతో ఆనాటి రోజులను గుర్తు చేసుకుంది.(చదవండి: ప్రెగ్నెన్సీ ప్రకటించిన శ్రద్ధా ఆర్య.. పోస్ట్ వైరల్!)‘నా జీవితంలో ఈ వేదికను, 2000వ సంవత్సరాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. అప్పట్లో ఈ వేదికను మిలీనియం డోమ్ అని పిలిచేవారు. నాకు 18 ఏళ్ల వయసులో మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొన్నాను. టైటిల్ గెలిచేందుకు చాలా కష్టపడ్డాను. ఆ ఏడాది నవంబర్ 30వ తేదిని ఎప్పటికీ మర్చిపోలేను. మంచి డ్రెస్, హీల్స్ ధరించి స్టేజీపైకి వచ్చాను. అందరిని చూసి భయంతో నాకు చెమటలు పట్టాయి. టెన్షన్ తట్టుకోలేకపోయాను. శరీరంలోని ప్రతి నరం వణుకుతోంది. మరోవైపు నేను ధరించిన దుస్తులు అసౌకర్యంగా ఉన్నాయి. (చదవండి: లైంగిక వేధింపుల కేసు.. ఆ ఊరిలో దాక్కున్న జానీ)అవి ఎక్కడ జారిపోతాయోనని భయమేసింది. అందుకే వాటిని పట్టుకొని అందరికి నమస్తే చేశాను. గూగుల్‌లో ఆ ఫోటోలు చూస్తే.. నేను కృతజ్ఞతతో నమస్కారం చేస్తున్నట్లు కనిపిస్తుంది. కానీ వాస్తవం ఏంటంటే.. నా దుస్తులు జారిపోకుండా కాపాడుకోవడం కోసం నేను అలా నమస్కరించాను. దాదాపు 24 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ వేదికపైకి నా కూతురుతో కలిసి రావడం ఆనందంగా ఉంది’ అని ప్రియాంక చెప్పుకొచ్చింది. -
Manushi Chhillar: బ్యూటీ క్వీన్, ఆపరేషన్ వాలెంటైన్ భామ బర్త్‌డే స్పెషల్ రేర్ ఫోటోలు
-
Miss World 2024 Photos: అంతర్జాతీయ వేదికపై ఇండియన్ సెలబ్రిటీల డామినేషన్ (ఫోటోలు)
-
మిస్ వరల్డ్ పోటీల్లో నీతా అంబానీకి హ్యుమానిటేరియన్ అవార్డు!
దాదాపు 28 ఏళ్ల తర్వాత భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ 71వ మిస్ వరల్డ్ పోటీల్లో రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీని ప్రతిష్టాత్మక హ్యుమానిటేరియన్ అవార్డుతో సత్కరించారు. సామాజిక కార్యక్రమల పట్ల నీతాకు ఉన్న అచంచలమైన నిబద్ధత తోపాటు సమాజంపై సానుకూత ప్రభావం చూపేలా ఆమె చేసిన అవిశ్రాంత ప్రయత్నాలకు గానూ ఈ ప్రతిష్టాత్మక అవార్డుని అందుకుంది. నీతా చేసిన అశేష దాతృత్వ సేవలు, జాతీయ-అంతర్జాతీయ పరంగా ఆమెకు విశేషమైన కీర్తిని, గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. ఈ కార్యక్రమంలో మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్మన్ సీఈవో జూలియా మోర్లీ చేతుల మీదుగా నీతా అంబానీ ఈ మిస్ వరల్డ్ ఫౌండేషన్ హ్యుమానిటేరియన్ అవార్డుని అందుకుంది. ఆమె ఒక గృహిణిగా, సక్సెఫుల్ బిజినెస్ విమెన్‌గా ఎన్నో విజయాలు సాధించింది. అలాగే దాతృత్వంలో కూడా ఆమెకి సాటి లేరెవ్వరూ అని నిరూపించింది. ఆమె నేటి యువతకు, భావితరాలను స్పూర్తిగా నిలిచింది. ఓ మహిళ ఇల్లాలిగా ఉంటూ ఎలాంటి విజయాలను అందుకోగలదు అనేందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. కాగా, మిస్ వరల్డ్–2024 పోటీల్లో కిరీటాన్ని చెక్ రిపబ్లిక్ సుందర్ క్రిస్టినా పిజ్కోవా దక్కించుకున్నారు. రన్నరప్‌గా మిస్ లెబనాన్ యాస్మినా జెటౌన్ ఎంపికయ్యారు. ఇక భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన ముంబై వాసి ఫెమినా మిస్ ఇండియా సిని షెట్టి(22) అయిదో స్థానంతో సరిపెట్టుకున్నారు. (చదవండి: 'ఇల్లాలిగా, బిజినెస్ విమెన్‌గా సరిలేరామెకు;! దటీజ్ నీతా) -
ప్రపంచ సుందరి 2024
-
మిస్ వరల్డ్ ఫైనల్స్.. కిరీటం రేసులో ఇండియన్ బ్యూటీ
ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీలు భారత్‌లో జరుగుతున్నాయి. సుమారు 28 ఏళ్ల తర్వాత 71వ మిస్ వరల్డ్ ఎడిషన్‌కు భారత్ ఆతిథ్యం ఇచ్చిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 18 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం మార్చి 9 వరకు కొనసాగుతుంది. 71వ మిస్ వరల్డ్‌లో 130కి పైగా దేశాల నుంచి పోటీదారులు పాల్గొని తమ అందాలతో పాటు ప్రతిభను ప్రదర్శించేందుకు పోటీ పడ్డారు. భారత్ నుంచి కన్నడ బ్యూటీ సినీ శెట్టి (21) మిస్ వరల్డ్ కోసం బరిలో ఉన్నారు. ప్రస్తుతం ఆమె ఫైనల్ రౌండ్‌కు చేరుకున్న టాప్ 20లో ఉన్నారు. 1994లో మిస్ వరల్డ్ టైటిల్‌ను గెలుచుకున్న ఐశ్వర్యరాయ్ భారతీయుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆ కిరీటాన్ని ఆమె అందుకుని ఇప్పటికి మూడు దశాబ్దాలు అవుతుంది. ఈ సందర్భంగా 2024 మిస్ వరల్డ్ 'టాలెంట్ ఫైనల్స్' రౌండ్లో ఐశ్వర్యారాయ్ హిట్ సాంగ్స్‌కు 'సినీ శెట్టి' డ్యాన్స్ చేశారు. హమ్ దిల్ దే చుకే సనమ్ సినిమా నుంచి నింబుడా సాంగ్‌తో తాల్, బంటీ ఔర్ బబ్లీ వంటి మూవీలలోని హిట్ పాటలకు అద్భుతమైన డ్యాన్స్ చేసి ఐశ్వర్యకు అంకితం చేశారు సినీ శెట్టి. ప్రస్తుతం ఆ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఐశ్వర్య వారసత్వానికి గుర్తుగా భారతీయ శాస్త్రీయ, బాలీవుడ్ నృత్య రీతుల కలయికతో సినీ శెట్టి నృత్యం చేసింది. దీంతో పలువురు ఆమె ప్రతిభను పలువురు మెచ్చుకున్నారు. మార్చి 9న ముంబైలో జరగనున్న మిస్ వరల్డ్ 2024 ఫైనల్‌పై అందరి దృష్టి ఉంది. ఫైనల్ పోటీలను రాత్రి 7.30 గంటల నుంచి 10.30 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడొచ్చు. 2017లో మానుషి చిల్లర్ 'మిస్ వరల్డ్' కిరీటాన్ని దక్కించుకున్నారు. 2024లో మన సినీ శెట్టి కూడా ఆ కిరీటాన్ని తప్పకుండా అందుకుంటారని ఊహాగానాలు మొదలయ్యాయి. View this post on Instagram A post shared by Sini Shetty (@sinishettyy) View this post on Instagram A post shared by Femina Miss India (@missindiaorg) -
అద్భుతమైన క్రిస్టల్ గౌనుతో టాప్ 20కి చేరుకున్న సినీ శెట్టి!
ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 విజేత సిని శెట్టి ప్రస్తుతం మిస్ వరల్డ్ పోటీల్లో భారతదేశం గర్వపడేలా చేయాలన్న లక్ష్యంతో బిజీగా ఉంది. సుమారు 28 ఏళ్ల తర్వాత భారత్ (India) ఆతిథ్యమిస్తున్న ఈ 71వ ప్రపంచ సుందరి పోటీల్లో (Miss World Pageant) సినీ శెట్టి క్రిస్టల్ గౌనులో మెరిసింది. ముంబైలో జరుగుతున్న ఈ ప్రపంచ సుందరి పోటీట్లో ఆమె ఆసియా అండ్ ఓషియానియ తరుఫు నుంచి బెస్ట్ డిజైనర్ డ్రెస్ అవార్డుని దక్కించుకుని టాప్ 20కి చేరుకుంది. అలాగే ప్రాంతీయ పరంగా ఐదో స్థానంలోనూ నిలిచింది. స్లీవ్ లెస్ బ్లాక్ కలర్ పెప్లమ్ సైల్బాడీ డ్రెస్‌లో అదిరిపోయింది. వీ నెక్లైన్తో కూడిన పొడవు గౌను, కట్స్ ఉండి, లైన్స్ ఆర్ట్‌వర్క్‌లో క్రిస్టల్ పూసలతో అలంకరించి ఉంది. రోహిత్ గాంధీ, రాహుల్ ఖన్నాల డిజైనర్ ద్వయం రూపొందించిన ఈ క్రిస్ట్ల్ గౌను కారణంగా ఆమె ఈ ఘనతను దక్కించుకుంది. అందుకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్ చేసింది. ఇక సినీ శెట్టి ఈ 71వ మిస్ వరల్డ్ పోటీల ప్రారంభోత్సవం కోసం జయంతి రెడ్డి డిజైన్ చేసిన ఎరుపు రంగు బనారసీ చీరను ధరించింది. View this post on Instagram A post shared by Femina Miss India (@missindiaorg) ఆరుగజాల బెనారస్ చీరపై ఎంబ్రాయిడరీ అంచు మంచి లుక్ ఇవ్వగా, దానికి పూర్తి విభిన్నంగా నేవి బ్లూ కలర్ బ్లౌజ్‌ని జత చేయడంతో మరింత ఆకర్షణ ఉంది. అందుకు తగ్గట్లు బంగారు గాజులను ధరించింది సినీ శెట్టి. ఈ సంప్రదాయ లుక్ ఆమెను అగ్రస్థానంలో నిలబెట్టేంత గ్లామరస్‌గా ఉంది. కాగా, ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు ముంబై, ఢిల్లీ (Delhi) వేదికగా అందాల పోటీలు జరగనున్నాయి. ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు ఢిల్లీలోని...భారత్ మండపం, ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. ఫైనల్స్ మాత్రం ముంబయిలోనే జరగనున్నాయి. మార్చి 9న నిర్వహించే ఫైనల్ పోటీలను రాత్రి 7.30 గంటల నుంచి 10.30 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడోచ్చు. ఈ ఈవెంట్లో 130కి పైగా దేశాల నుంచి పోటీదారులు పాల్గొని తమ అందాలతో పాటు ప్రతిభను ప్రదర్శించేందుకు పోటీ పడనున్నారు. View this post on Instagram A post shared by Femina Miss India (@missindiaorg) (చదవండి: స్టన్నింగ్ లుక్‌లో అదిరిపోతున్న మెగా డాటర్ నిహారిక! డ్రెస్ ధర ఎంతంటే..) -
ర్యాంప్ వాక్ లో అదరగొట్టిన 71వ మిస్ వరల్డ్ అందమైన భామలు (ఫొటోలు)
-
ప్రపంచ సుందరి పోటీలు.. నా జెండా గుండెల్లో ఉంది: సినీ శెట్టి
సుమారు 28 ఏళ్ల తర్వాత 71వ మిస్ వరల్డ్ ఎడిషన్‌కు భారత్ ఆతిథ్యం ఇచ్చింది. ఫిబ్రవరి 18 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం మార్చి 9 వరకు కొనసాగుతుంది. మూడు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత ప్రపంచ సుందరి పోటీలకు భారత్ వేదికగా నిలిచింది చివరిసారిగా 1996లో బెంగళూరులో ఈ పోటీలు నిర్వహించారు. 71వ మిస్ వరల్డ్‌లో 130కి పైగా దేశాల నుంచి పోటీదారులు పాల్గొని తమ అందాలతో పాటు ప్రతిభను ప్రదర్శించేందుకు పోటీ పడనున్నారు. నా దేశపు జెండాను గుండెల్లో పెట్టుకున్నా: సినీ శెట్టి భారత్ నుంచి కన్నడ బ్యూటీ సినీ శెట్టి (21) మిస్ వరల్డ్ కోసం బరిలోకి దిగనుంది. ఈ క్రమంలో ఆమె దేశ రాజధాని ఢిల్లీలో అడుగుపెట్టింది. ఈ క్రమంలో ఆమె జాతిని ఉద్దేశించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా పేర్కొన్నారు. ' తూ హీ మేరీ మంజిల్ హై, పెహచాన్ తుజ్ హై సే!" అనే పోస్ట్‌ను పంచుకున్నారు. (నువ్వే నా లక్ష్యం, నువ్వే నా గుర్తు) ఈ ప్రయాణంలో ఈరోజు నేను నాకంటే ఉన్నత స్థానంలో ఉన్నాను.. నా దేశపు త్రివర్ణ పతాకాన్ని చేతిలోనే కాదు, గుండెల్లో పెట్టుకున్నాను..' అంటూ గర్వం వ్యక్తం చేశారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ముంబైలో జన్మించిన సినీ శెట్టి స్వస్థలం కర్ణాటక. అకౌంటింగ్, ఫైనాన్స్‌లో గ్రాడ్యుయేట్ చేసిన ఈ బ్యూటీ భరతనాట్యంలో కూడా శిక్షణ పొందింది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత భారత్‌లో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నందున విభిన్న మార్గాల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. నేను నా దేశపు గర్వాన్ని: సినీ శెట్టి 71వ మిస్ వరల్డ్ పోటీలకు తొలి అడుగు పడింది. ' నేను నా కలలతో అడుగులు వేస్తున్నాను. నేను నా దేశపు గర్వాన్ని.. ఈ క్షణం నుంచి నేను సినీ శెట్టిని మాత్రమే కాదు.. నేను భారతదేశాన్ని. నేను వేసే ప్రతి అడుగు, నేను మాట్లాడే ప్రతి మాట, నన్ను పెంచిన ఈ నేల, నన్ను తీర్చిదిద్దిన భారత సంస్కృతి, నన్ను నమ్మిన ప్రజల ప్రతిబింబాన్ని. నేను మన జాతీయ జెండాను ఎంతో గర్వంగా, గౌరవంగా పట్టుకుని నిల్చున్నాను. ఇది నా కోసం, మన కోసం, భారతదేశం కోసం.' అని సినీ శెట్టి క్యాప్షన్ ఇచ్చారు. భారత్ నుంచి ప్రపంచ సుందరి పోటీల్లోకి అడుగు పెట్టిన ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుతూ కామెంట్లు చేస్తున్నారు. 1966లో భారత్‌కు చెందిన రీటా ఫారియా తొలిసారి ప్రపంచ సుందరి కిరీటాన్ని అందుకున్నారు. ఆ తర్వాత 1994లో ఐశ్వర్యరాయ్ 1997లో డయానా హేడెన్, 1999లో యుక్తా ముఖీ, 2000లో ప్రియాంక చోప్రా, 2017లో మానుషి చిల్లర్ 'మిస్ వరల్డ్' కిరీటాన్ని దక్కించుకున్నారు. 2022లో నిర్వహించిన పోటీల్లో పోలెండ్‌కు చెందిన కరోలినా బిలాస్కా విజేతగా నిలిచారు. ఈ ఏడాది గెలుపొందిన వారికి ఆమె ప్రపంచ సుందరి కిరీటాన్ని అందించనున్నారు. మార్చి 9న ముంబైలో జరగనున్న ఫైనల్ పోటీలను రాత్రి 7.30 గంటల నుంచి 10.30 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడొచ్చు. View this post on Instagram A post shared by Femina Miss India (@missindiaorg) -
మిస్ వరల్డ్ 2023 పోటీల్లో భారత్ తరఫున సినీ శెట్టి ప్రాతినిధ్యం!!
భారతదేశం మిస్ వరల్డ్ 2023 అందాల పోటీలకు ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 28 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ ఈ ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ అందాల పోటీలు భారత్‌లో నిర్వహించనుండటం విశేషం. ఇంకా తేదీలు ఖరారు కాకపోయినప్పటికీ ఈ మిస్ వరల్డ్ 71వ ఎడిషన్ నవంబర్ జరుగనుందని తెలుస్తోంది. భారత్ చివరిసారిగా 1996లో ఈ అంతర్జాతీయ అందాల పోటీలకు ఆతిథ్యం ఇచ్చింది. ఇన్నేళ్ల విరామం తర్వాత భారత్‌కి ఈ ప్రపంచ వేదికపై తన ఆతిధ్యం, సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించే గొప్ప అవకాశం ఇది. ఇక ఈ అందాల పోటీల్లో భారత్ తరుఫున ఫెమినా మిస్ ఇండియా 2022 టైటిల్ విజేతగా నిలిచిన సినీ శెట్టి ప్రాతినిధ్యం వహించనుంది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ..తన తోటి సోదరిమణులకు భారతదేశం అంటే ఏమిటో, ఇక్కడ ఉండే వైవిధ్య సంప్రదాయాలు, విలువలను ప్రదర్శించడం పట్ల ఉత్సాహంగా ఉన్నానని పేర్కొంది. కచ్చితంగా మన సంప్రదాయాలు, ఆతిథ్యం చూసి ముగ్ధులవుతారని నమ్మకంగా చెప్పింది. అలాగే వాళ్లకు ఇక్కడ గడపడం నచ్చుతుందని అన్నారు. ఎవరీ సినీ శెట్టి.. కర్ణాటక మూలాలు ఉన్న సినీ షెట్టి ముంబైలో పుట్టింది. ఆమె మిస్ ఇండియా 2022 పోటీలో కర్ణాటక రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించారు. సినీ శెట్టి అకౌంటింగ్ ఫైనాన్స్‌లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ చదివారు. ప్రస్తుతం ఆమె సీఎఫ్ఏ (చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్) చేస్తున్నట్లు సమాచారం. అలాగే సినీ శెట్టి తన 14 ఏటనే భరతనాట్యంలో ఆరంగ్రేటం చేసింది. ఇక ప్రియాంకా చోప్రా తన రోల్ మోడల్ అని తెలిపింది. (చదవండి: శాకాహారం మాత్రమే తీసుకుంటే..ఈ సమస్యలు వస్తాయట..!) -
మిస్ వరల్డ్: ఈ స్టన్నింగ్ ఇండియన్ బ్యూటీల గురించి తెలుసా?
అందరమూ కలలు కంటాం. వాటిల్లో కొన్ని చాలా పెద్దవి,చాలా చిన్నవి. చిన్నదైనా పెద్దదైనా ఆ కలను నేర్చుకునే పట్టుదల మాత్రం కొందరికే ఉంటుంది. కలలను సాకారం చేసుకునే అదృష్టం కొంతమందికే సాధ్యం. అందులోనే చాలా ప్రత్యేకమైంది అయితే ఆ జర్నీ చాలా కష్టం. ఇక, బ్యూటీ, మోడలింగ్ రంగంలో అమ్మాయిలు రాణించాలంటే నిజంతా అది కత్తి మీద సామే. అలాంటి ఎన్నో సవాళ్లను అధిగమించి ప్రపంచ సుందరీమణులుగా,విజేతలుగా నిలిచారు. ప్రపంచ వేదికల మీద మన దేశాన్ని అత్యున్నతంగా నిలబెట్టారు. తాజాగా మిస్ వరల్డ్ 2023 సంబరాలకు ఇండియా వేదిక కానుంది. బ్యూటీ విత్ పర్పస్ థీమ్‌తో ఈ పోటీలు ఘనంగా నిర్వహించనుంది. ప్రతీ ఏడాది వివిధ దేశాల్లో నిర్వహించే ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు ఈసారి భారత్ ఆతిథ్యమివ్వనుంది. దీంతో మిస్ వరల్డ్ ఈవెంట్ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అంతర్జాతీయంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలు ఎపుడు నిర్వహించారో తెలుసా? యునైటెడ్ కింగ్డమ్లో ఎరిక్ మోర్లీ 1951లో ఈ పోటీలకు నాంది పలికారు. ఇంగ్లీషు టెలివిజన్ వ్యాఖ్యాత ఎరిక్ డగ్లస్ మోర్లీ మిస్ వరల్డ్ పోటీ , కమ్ డ్యాన్సింగ్ ప్రోగ్రామ్‌ను మొదలు పెట్టారు. 1978ల ఆయన నిష్క్రమించడంతో అతని భార్య బ్యూటీ క్వీన్ జూలియా మిస్ వరల్డ్ పోటీలను కొనసాగించింది. 82 ఏళ్ల వయసులో మోర్లీ 2000లో మరణించాడు. అతని భార్య, జూలియా మోర్లీ ఛైర్మన్‌గా ఉండగా కుమారుడు స్టీవ్ డగ్లస్ దాని సమర్పకులలో ఒకరుగా ఉన్నారు. లండన్‌లోని లైసియం బాల్రూమ్లో తొలి మిస్ వరల్డ్ టైటిల్‌ను మిస్ స్వీడన్, కికీ హాకోన్సన్ కైవసం చేసుకుంది. మన ముద్దుగుమ్మలు తమ అందానికి, సంకల్పాన్ని, తెలివితేటల్ని, జోడించి ఆరు సార్లు జగజ్జేతలుగా నిలిచారు. రీటా ఫారియా రీటా ఫారియా పావెల్ ఒక డాక్టర్. మోడలింగ్ రంగంలో రాణిస్తూ 1966లో మిస్ వరల్డ్ పోటీల్లో చరిత్ర సృష్టించింది. తొలి ఆసియా , భారతీయ మిస్ వరల్డ్ విజేతగా నిలిచి బ్యూటీ రంగంలో ఇండియాలో పేరును సమున్నతంగా నిలిపింది. మరియు ముంబైలో గోవా తల్లిదండ్రులకు జన్మించింది. వైద్య శిక్షణ పొందిన తొలి మిస్ వరల్డ్ విజేత ఆమె. ఏడాది పాటు మిస్ వరల్డ్‌గా ఉన్న ఆమె సినిమా ఆఫర్లను తిరస్కరించి వైద్య వృత్తికి అంకితమైంది. 1971లో, తన గురువు డేవిడ్ పావెల్‌ను వివాహం చేసుకుంది. ఐశ్వర్య రాయ్: ప్రపంచంలోనే అందాలరాణిగా నిలిచిన ఐశ్వర్య రాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. 1994 మిస్ వరల్డ్ టైటిల్ గెల్చుకుని యూత్ కలల రాణిగా అవతరించింది. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. రెండు ఫిల్మ్‌ఫేర్ నామినేషన్లతో సహా వివిధ అవార్డులును దక్కించుకుంది. అలాగే 2009లో భారత ప్రభుత్వ పద్మశ్రీ పురస్కారాన్ని ,2012లో ఫ్రెంచ్ ప్రభుత్వం ఆర్డర్ డెస్ ఆర్ట్స్ ఎట్ లెటర్స్‌ను గెల్చుకుంది. డయానా హేడెన్: మోడల్, నటి డయానా హేడెన్ 1997లో మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుంది.మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న మూడో భారతీయ మహిళ. అంతేకాదు ఈ పోటీల్లో మూడు సబ్ టైటిల్స్‌ను గెల్చుకున్న ఏకైక మిస్ వరల్డ్ కూడా యుక్తా ముఖి: మిస్ ఇండియాగా నిలిచిన నాల్గో భామ యుక్తా ఇంద్రలాల్ ముఖి. 1999లో మిస్ వరల్డ్ టైటిల్‌తోపాటు 1999లో ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ కిరీటాన్ని కూడా సొంతం చేసుకుంది. మోడల్‌గాను, కొన్ని హిందీ సినిమాల్లోనూ కనిపించింది. ప్రియాంక చోప్రా : 2000లో మిస్ వరల్డ్ 2000 విజేత ప్రియాంక చోప్రా, మోడల్‌గా, హీరోయిన్గా రాణిస్తోంది. అంతేకాదు ఇండియాలో అత్యధిక పారితోషికం పొందుతున్న హీరోయిన్లలో ఒకరిగా తన సత్తాను చాటుకుంటోంది. రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు , ఐదు ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో సహా పలు గౌరవాలను గెలుచుకుంది. 2016లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు వరించింది. అలాగే ఫోర్బ్స్ ఆమెను ప్రపంచంలోని 100 అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో చేర్చింది. మానుషి చిల్లర్ మిస్ వరల్డ్ 2017 టైటిల్‌ను నటి , మోడల్ మానుషి చిల్లర్ గెలుచుకున్నారు. ఫెమినా మిస్ ఇండియా 2017 పోటీలో ఆమె తన సొంత రాష్ట్రం హర్యానాకు ప్రతినిధిగా పోటీ పడి, గెలిచింది. ఆ తర్వాత మిస్ వరల్డ్ కిరీటం పొందిన ఆరో భారతీయురాలిగా నిలిచింది. చారిత్రాత్మక నాటకం సామ్రాట్ పృథ్వీరాజ్లో సంయోగిత పాత్రతో ఆమె తొలిసారిగా నటించింది. -
భారత్‌లో ‘మిస్ వరల్డ్-2024 ఈవెంట్, 28 ఏళ్ల తర్వాత
అందాల పోటీలకున్న క్రేజే అంతా ఇంతా కాదు. అందులోనూ ప్రపంచ అందగత్తెలంతా పోటా పోటీగా ఒక చోట చేరితే.. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత భారత దేశంలో ఇదే జరగబోతోంది. 71వ ప్రపంచ సుందరి పోటీలకు ఇండియా ఆతిథ్యం ఇవ్వనుంది. 1996 తరువాత మిస్ వరల్డ్ ఈవెంట్ జరగబోతోంది. ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2022 సినీ శెట్టి మిస్ వరల్డ్ 2023కి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనుంది. ఈవెంట్ నిర్వాహకులు అందించిన సమాచారం ప్రకారం ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ఈ పోటీలను అట్టహాసంగా నిర్వహించనున్నారు. మార్చి 9న నిర్వహించే ఫైనల్ పోటీలను రాత్రి 7.30 గంటల నుంచి 10.30 గంటల వరకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. . ఫిబ్రవరి 20న న్యూఢిల్లీలోని హోటల్ అశోకాలో ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ITDC) ఆధ్వర్యంలో "ది ఓపెనింగ్ సెర్మనీ" , "ఇండియా వెల్కస్ ది వరల్డ్ గాలా"తో ఈవెంట్ షురూ అవుతుంది. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఛైర్ పర్సన్, సీఈవో జూలియా మోర్లీ స్వయంగా ఈ విషయాన్ని మిస్ వరల్డ్ అధికారిక పేజీ ట్విటర్ పేజీలో షేర్ చేశారు. మిస్ వరల్డ్‌కు ఆతిథ్యం ఇచ్చే దేశంగా భారతదేశాన్ని ప్రకటించడం గర్వంగా ఉందంటూ హర్షం వ్యక్తం చేశారు. అందం, వైవిధ్యం సాధికారత మేళవింపుగా జరగబోతున్న ఈ అద్భుతమైన ప్రయాణానికి సిద్ధంగా ఉండండి అంటూ ట్వీట్ చేసింది. 2017లో మానుషి చిల్లార్ తర్వాత మరో ఇండియన్, మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకోలేదు. Chairman of Miss World, Julia Morley CBE stated "Excitement fills the air as we proudly announce India as the host country for Miss World. A celebration of beauty, diversity, and empowerment awaits. Get ready for a spectacular journey! 🇮🇳 #MissWorldIndia #BeautyWithAPurpose — Miss World (@MissWorldLtd) January 19, 2024 అందాల రాణులుగా నిలిచిన భారతీయ భామలు ఎవరో తెలుసా? రీటా ఫరియా - 1966 ఐశ్వర్యా రాయ్ - 1994 డయానా హేడెన్ - 1997 యుక్తా ముఖి - 1999 ప్రియాంకా చోప్రా - 2000 మానుషి చిల్లార్ - 2017 -
ప్రపంచ సుందరి పోటీలకు వేదికగా భారత్
న్యూఢిల్లీ: భారత్ త్వరలో ఒక ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు వేదిక అవనుంది. ఈ ఏడది జరిగే 71వ ప్రపంచ సుందరి పోటీలకు ఇండియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ తన అధికారిక ఎక్స్(ట్విటర్)లో ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఈ నిర్ణయంతో 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మిస్ వరల్డ్ పోటీలకు భారత్ వేదికగా నిలవనుంది. చివరిసారిగా 1996లో బెంగళూరులో భారత్‌లో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించారు. Chairman of Miss World, Julia Morley CBE stated "Excitement fills the air as we proudly announce India as the host country for Miss World. A celebration of beauty, diversity, and empowerment awaits. Get ready for a spectacular journey! 🇮🇳 #MissWorldIndia #BeautyWithAPurpose — Miss World (@MissWorldLtd) January 19, 2024 ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు ఢిల్లీలోని భారత్ కన్వెన్షన్ సెంటర్, ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. మార్చి 9న నిర్వహించే మిస్ వరల్డ్ ఫైనల్ పోటీలను రాత్రి 7.30 గంటల నుంచి 10.30 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. కేవలం అందం మాత్రమే కాకుండా సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో సానుకూల మార్పును తీసుకొచ్చే సామర్థ్యం, తెలివితేటలు ఉన్నవారిని గుర్తించి సత్కరించడం దీని ముఖ్య ఉద్దేశం. గతంలో భారత్‌కు చెందిన ఐశ్వర్యరాయ్, ప్రియాంక చోప్రా, మానుషి చిల్లర్ తదితరులు మిస్ వరల్డ్‌గా ఎంపికయ్యారు. ఇదీచదవండి.. మోదీ భావోద్వేగం -
విశ్వనటుడితో మాజీ ప్రపంచసుందరి.. ఆ క్రేజీ ప్రాజెక్ట్‌లోనే!
కోలీవుడ్ స్టార్ హీరో కమలహాసన్ గతేడాది కథానాయకుడిగా నటించి, నిర్మించిన విక్రమ్ చిత్రం సంచలన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఇండియన్–2 చిత్రంలో ఆయన నటిస్తున్నారు. ఈ చిత్రం సమ్మర్ స్పెషల్‌గా తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. అదేవిధంగా తెలుగులో ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న కల్కీ చిత్రంలో కమలహాసన్ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వంలో మరోసారి నటించడానికి రెడీ అవుతున్నారు. ఈ కాంబోలో తెరకెక్కనున్న భారీ చిత్రం ఈ నెలలోనే సెట్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. దీనకి థగ్స్ లైఫ్ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ఈ చిత్రానికి సంబంధించిన ఒక వీడియోను ఇటీవల విడుదల చేయగా.. అందులో కమలహాసన్ తన శత్రువులతో తన పేరు రంగరాయ శక్తివేల్ నాయకన్. కాయల్ పట్టికారన్( కాయల్పట్టికి చెందిన వాడిని) అని చెప్పే డైలాగ్స్ థగ్స్ లైఫ్ చిత్రంపై అంచనాలు మరింత పెంచేశాయి. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో త్రిష, కమలహాసన్‌కు జంటగా నటించబోతున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా ఈ భారీ క్రేజీ చిత్రంలో దర్శకుడు మణిరత్నం అభిమాన నటి, మాజీ ప్రపంచసుందరి ఐశ్వర్యారాయ్ నటించబోతున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే కమలహాసన్, ఐశ్వర్యారాయ్ కలిసి నటించే తొలి చిత్రం ఇదే అవుతుంది. త్రిష, జయంరవికి గానీ, దుల్కర్సల్మాన్కుగానీ జంటగా నటించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఈ విషయంలో మరింత క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. కాగా.. ఈ చిత్రంలో దుల్కర్సల్మాన్, జయంరవి, త్రిష ముఖ్యపాత్రలు పోషించనున్నారు. -
మిస్ వరల్డ్ సైతం టీమిండియా క్రికెటర్లతో ఫోటోలు దిగేందుకు ఎగబడింది..!
ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మూడో రోజు ఆట ప్రారంభానికి ముందు మిస్ వరల్డ్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో ఆచె ఆబ్రహామ్స్ టీమిండియా యంగ్ స్టార్ ప్లేయర్స్ శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్‌లను కలిసింది. ఈ సందర్భంగా ఆమె వారితో మాటామంతి జరిపి, అనంతరం ఫోటోలు దిగేందుకు ఆసక్తి కనబర్చింది. View this post on Instagram A post shared by Miss World Trinidad & Tobago - Aché Abrahams (@acheabrahams) అంతటితో ఆగని మిస్ వరల్డ్, టీమిండియా యంగ్ గన్స్‌తో దిగిన ఫోటోలను తన సోషల్‌మీడియా అకౌంట్స్‌కు స్టేటస్‌గా పెట్టుకుంది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. సోషల్‌మీడియాలో ఎక్కడ చూసినా ఇవే ఫోటోలు దర్శనమిస్తున్నాయి. టీమిండియా యువ స్టార్ల క్రేజ్ అలా ఉంది మరి అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. Miss World Aché Abrahams of Trinidad & Tobago meets Shubman Gill & Ishan Kishan. In this interview she shares her excitement and joy of interacting with the Indian cricketers.@Wowmomo4u @debasissen #WIvIND pic.twitter.com/RCQwRWARl9 — RevSportz (@RevSportz) July 22, 2023 కాగా, మిస్ వరల్డ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో ఆచె ఆబ్రహామ్స్.. వెస్టిండియన్ లెజెండరీ బ్యాటర్ బ్రియాన్ లారా ఆహ్వానం మేరకు భారత్-విండీస్ మ్యాచ్ చూసేందుకు క్వీన్స్ పార్క్ ఓవల్ మైదానానికి వచ్చింది. ఇదిలా ఉంటే, రెండో టెస్ట్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ (75), తేజ్‌నరైన్ చంద్రపాల్ (33), కిర్క్ మెక్కెంజీ (32), జెర్మైన్ బ్లాక్‌వుడ్ (20), జాషువ డిసిల్వ (10) ఔట్ కాగా.. అలిక్ అథనేజ్ (37), జేసన్ హోల్డర్ (11) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో జడేజా 2, ముకేశ్ కుమార్, సిరాజ్, అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులకు ఆలౌటైంది. 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లి (121) సెంచరీతో కదంతొక్కగా.. యశస్వి (57), రోహిత్ (80), జడేజా (61), అశ్విన్ (56)అర్ధసెంచరీలతో రాణించారు. విండీస్ బౌలర్లలో కీమర్ రోచ్, వార్రికన్ చెరో 3 వికెట్లు.. హోల్డర్ 2, గాబ్రియల్ ఓ వికెట్ పడగొట్టారు. -
2023 మిస్ వరల్డ్ పోటీలు.. పాల్గొనాలనుందా? అయితే ఇలా చేయండి!
Miss World 2023: ప్రతిభావంతులైన ఫ్యాషన్ ప్రియులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే మిస్ వరల్డ్ పోటీలు ఈ సారి ఇండియాలో జరగనున్న సంగతి తెలిసిందే. 27 సంవత్సరాల తరువాత మళ్లీ భారత్ ఈ అందాల పోటీలను నిర్వహిస్తుండడం విశేషం. 71వ మిస్ వరల్డ్ పోటీలు ఈ ఏడాది నవంబర్‌లో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 1996 తరువాత మిస్ వరల్డ్ పోటీలు భారతదేశంలో జరగడం ఇదే మొదటి సారి. ఈ పోటీలను గురించి మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్ సీఈవో 'జూలియా మోర్లే' (Julia Morley) వెల్లడించారు. భారతదేశంలో జరగనున్న ఈ పోటీలలో మన దేశం తరపున మిస్ వరల్డ్ 'సినీ శెట్టి' (Sini Shetty) ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇందులో మొత్తం 130 దేశాలకు చెందిన అందగత్తెలు పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పోటీలలో భాగంగా పాల్గొనే అందగత్తెల ప్రతిభ, సేవా దృక్పథం, క్రీడలలో వారికున్న ప్రతిభను ఆధారంగా చేసుకుని రౌండ్స్ నిర్వహిస్తారు. అన్ని రౌండ్స్‌లో ముందున్న వారు మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకుంటారు. భారతదేశం ఇప్పటి వరకు ఆరు సార్లు మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుంది. 1966లో మొదటి సారి ఇండియాకి చెందిన 'రీటా ఫరియా' మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకుంది. ఆ తరువాత 1994లో ఐశ్వర్యారాయ్ బచ్చన్, 1997లో డయానా హైడెన్, 1999 యుక్తాముఖి, 2000లో ప్రియాంక చోప్రా, 2017లో మానుషి చిల్లర్ విశ్వసుందరి కిరీటాలను సొంతం చేసుకున్నారు. ఇక ఈ సారి జరగనున్న మిస్ వరల్డ్ పోటీల్లో కిరీటాన్ని దక్కించుకునే విశ్వ సుందరి ఎవరో తెలియాల్సి ఉంది. భారతదేశం ఆథిత్యమివ్వనున్న మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొనాలంటే ఏం చేయాలి? నియమాలు ఏంటి? రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత అనే మరిన్ని వివరాలు ఇక్కడ చూద్దాం.. నిజానికి మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనాలనుకునే వారు స్థానిక లేదా జాతీయ అందాల పోటీలలో పాల్గొని ఉండాలి. ఈ పోటీకి సన్నద్ధం కావడానికి ఒక కోచ్‌ని ఎంచుకోవాలి. మిస్ వరల్డ్‌లో ఏ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారనేది ముందుగానే అప్లై చేసుకోవాలి. ఆ తరువాత ప్రిలిమినరీ ఇంటర్వ్యూలో అర్హత సాధించాలి. (ఇదీ చదవండి: వేల కోట్లు వద్దనుకుని చిన్న అపార్ట్మెంట్లో రతన్ టాటా తమ్ముడు - ఎందుకిలా..) నియమాలు మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొనాలనుకునే వారు అవివాహితులై ఉండాలి. వయసు 17 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాంటి వారు ఈ పోటీలకు అప్లై చేసుకోవచ్చు. అయితే దేశాన్ని బట్టి మారే కట్-ఆఫ్ తేదీలను ఖచ్చితంగా ద్రువీకరించాలి. పోటీలు జరిగే నాటికి మీకు నిర్దేశించిన వయసు తప్పకుండా ఉండాలి. జరిగే పోటీలు 'మిస్' అని ఉంటాయి కావున వివాహితులు పోటీ చేయడానికి అనర్హులు. మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొనే వ్యక్తికి గతంలో ఎటువంటి నేర చరిత్ర ఉండకూడదు. ఏ దేశం నుంచి పోటీ చేస్తున్నారో ఆ దేశం పౌరసత్వం ఖచ్చితంగా ఉండాలి. 'బ్యూటీ విత్ ఏ పర్సన్' అనే దాన్ని బట్టి బాహ్య సౌందర్యమే కాదు, అంతః సౌందర్యం కూడా చాలా ప్రధానం. కావున ప్రపంచ సుందరి పోటీలో పాల్గొనే మహిళలు ప్రపంచవ్యాప్తంగా వెనుకబడిన వ్యక్తుల కోసం డబ్బు లేదా అవగాహన పెంచడానికి ప్రాజెక్ట్‌లను నిర్వహించి ఉండాలి. డ్యాన్స్ మీద కూడా మంచి పట్టు ఉండాలి. మోడలింగ్ పోటీలలో పాల్గొనే వారు వస్త్ర ధారణ, ర్యాంప్ వాక్ వంటివి ప్రత్యేక ఆకర్షణ అనే చెప్పాలి. ఫిజికల్ ఫిట్నెస్ చాలా ముఖ్యమని మర్చిపోకూడదు. అన్ని అంశాలలోనే ఉత్తమ ప్రతిభను కనపరచిన వారిని విజేతగా న్యాయ నిర్ణేతలు ప్రకటిస్తారు. (ఇదీ చదవండి: పిట్ట కొంచెం.. కూత ఘనం అంటే ఇదేనేమో - 19 ఏళ్లకే కోట్లు విలువైన కంపెనీ) రిజిస్ట్రేషన్ ప్రక్రియ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం క్లోజ్ అప్, మిడ్ లెంత్, ఫుల్ లెంత్ & మేకప్ లేకుండా ఉండే నాలుగు పోటోలను సిద్ధంగా ఉంచుకోవాలి. వ్యక్తిగత రుజువు కోసం పాస్‌పోర్ట్ ప్రధానం. లేకుంటే ఆధార్ కార్డు, ఓటర్ ఐడి లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటివి ఉండాలి. మీ ఎత్తుకి సంబంధించిన ఖచ్చితమైన కొలతల కోసం VLCC కేంద్రాన్ని సందర్శించాలి. మీ ఇమెయిల్ ID లేదా మొబైల్ నంబర్‌తో సైన్ ఇన్ చేయాలి సైన్ ఇన్ చేసుకున్న తరువాత 2 వేర్వేరు ఆడిషన్ టాస్క్ వీడియోలను అప్లోడ్ చేయండి (పరిచయానికి సంబంధించిన వీడియో & రాంప్‌వాక్ వీడియో). వీడియో పరిమితి 60 సెకన్లు వరకు మాత్రమే ఉండాలి. మొదటి మూడు దశలలో మీ ఫోటోలను, కావాల్సిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. అప్లై చేసుకోవడానికి రూ. 2999 + ట్యాక్స్ వంటివి చెల్లించాలి. ఆతరువాత మీరు రిజిస్టర్ చేసుకున్న ఈ మెయిల్ అందుకున్న కోడ్ ఎంటర్ చేసుకోవాలి. అన్ని వివరాలను ఫిల్ చేసిన తరువాత T&Cలను అంగీకరించి సబ్మిట్ చేయాలి. ఇవన్నీ పూర్తయిన తరువాత మీకు ఒక ఈ మెయిల్ వస్తుంది. అప్లై చేసుకోవంలో ఎలాంటి సందేహం ఉన్నా ఉదయం 11 నుంచి సాయంత్రం 7 గంటల మధ్య +91 9619937295 / +91 7039464909 నెంబర్‌కి కాల్ చేయవచ్చు, లేదా missindiaorg@timesgroup.comని సంప్రదించాలి. -
మిస్‌వరల్డ్ పోటీలకు వేదికగా భారత్.. ఎంపిక జరుగుతుందిలా..
న్యూఢిల్లీ: ఈ ఏడాది జరగనున్న ప్రపంచ సుందరి ఎంపిక పోటీలకు భారత దేశం వేదికగా నిలవనుంది. ఈ మేరకు గురువారం ఢిల్లీలో జరిగిన ఓ మీడియా సమావేశంలో మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్, సీఈవో జూలియా మోర్గే ప్రకటన చేశారు. అప్పుడెప్పుడో 1996లో.. ప్రపంచంలోని అందగత్తెలంతా ఒకచోట చేరి తమ అందచందాలతో హొయలొలికిస్తూ, తెలివితేటలను ఇనుమడింపజేస్తూ ఆయా దేశాల కీర్తి పతాకాలను రెపరెపలాడించే భిన్నమైన వేదిక. అయితే ఈసారి జరగబోయే పోటీలకు వేదికగా నిలవనుంది భారత దేశం. గతంలో 1996లో ప్రపంచ సుందరి పోటీలకు వేదికగ నిలిచిన భారత్ సరిగ్గా 27 సంవత్సరాల తర్వాత మరోసారి ఈ పోటీలకు ఆతిధ్యమివ్వనుంది. ఈ పోటీల్లో మిస్ ఇండియా వరల్డ్ సినీ శెట్టి భారత దేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇదే విషయాన్ని ఢిల్లీ మీడియా సమావేశంలో స్పష్టం చేశారు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఛైర్ పర్సన్, సీఈవో జూలియా మోర్లే. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఈసారి పోటీలను భారతదేశంలో నిర్వహించడం చాలా సంతోషకరం. నవంబర్ నెలలో జరగబోయే 71వ ప్రపంచ సుందరి పోటీలకు సంబంధించిన వేదికతో పాటు తేదీ వివరాలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. మొతం 130 దేశాలకు చెందిన సుందరీమణులు ఈ పోటీల్లో పాల్గొననున్నారని తెలిపారు. పోటీల్లో భాగంగా సుందరీమణులు ప్రతిభా పాటవాలు, సేవాతత్వ దృక్పధం, క్రీడా ప్రతిభ తోపాటు ఇతర అంశాల్లో కూడా రౌండ్లవారీగా పోటీ పడతారు. మిస్ వరల్డ్ గా ఎంపికయ్యే సుందరీమణి మార్పునకు రాయబారిగా వ్యవహరించనున్నారు కాబట్టి ఈ అంశాలన్నిటినీ స్పృశించి ప్రపంచ సుందరిని ఎంపిక చేయడం జరుగుతుందని అన్నారు జూలియా. ఈ కార్యక్రమంలో 2022 ప్రపంచ సుందరి కరోలినా బియెలావ్ స్కా కూడా పాల్గొని.. నా చేతులతో నా వారసురాలికి ఈ కిరీటం ధరింపజేయడానికి ఎదురుచూస్తున్నానని సాంప్రదాయానికి ప్రతిరూపమైన భారత్‌లో ఈ పోటీలు జరగడం సంతోషంగా ఉందన్నారు. ఇది కూడా చదవండి: భారత విద్యార్థులకు భరోసానిచ్చిన కెనడా ప్రధాని -
భారత్‌లో మిస్ వరల్డ్ 2023
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అందాల పోటీ మిస్ వరల్డ్–2023కు భారత్ వేదిక కానుంది. దాదాపు మూడు దశాబ్దాల అనంతరం మన దేశం ఈ పోటీకి వేదికవుతుండటం గమనార్హం. మిస్ వరల్డ్ 71వ ఎడిషన్ వచ్చే నవంబర్‌లో జరిగే అవకాశాలున్నాయి. తేదీలు ఖరారు కావాల్సి ఉంది. చివరిసారిగా 1996లో ఈ పోటీకి భారత్ వేదికైంది. ‘71వ మిస్ వరల్డ్ ఫైనల్‌కు భారత్ వేదికైనట్లు ప్రకటిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. మీ ప్రత్యేకమైన, విభిన్న సంస్కృతి, ప్రపంచ స్థాయి ఆకర్షణలను ప్రపంచంతో పంచుకోవడానికి మేం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఈ పోటీలో 130 దేశాల చాంపియన్లు అద్భుతమైన భారత్‌లో తమ నెల రోజుల ప్రయాణంలో సాధించిన విజయాలను మిస్‌వరల్డ్ ఫైనల్లో ప్రదర్శించనున్నారు’అని మిస్ వరల్డ్ సంస్థ చైర్ పర్సన్, సీఈవో జులియా మోర్లే గురువారం మీడియాకు తెలిపారు. భారత్ తరఫున ఈ ఏడాది పోటీల్లో మిస్ ఇండియా వరల్డ్ సిని షెట్టి ఈ పోటీల్లో పాల్గొంటారు. #WATCH | Miss World 2022 Karolina Bielawska speaks on Miss World 2023 to be held in India. pic.twitter.com/fPxIK736MU — ANI (@ANI) June 8, 2023 -
ఆ శుభదినాన తల్లితో కలిసి.. ఐశ్వర్యరాయ్ ఫోటో వైరల్.. గంటల వ్యవధిలోనే
అందమంటే ఏంటీ? అని హఠాత్తుగా పది మందిని అడిగితే.. కనీసం ఐదుగురు ఐశ్వర్య రాయ్ పేరు చెబుతారట. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యే ఓ విషయం ఇది. నిజమే.. భువి నుంచి దిగి వచ్చినట్టుండే ఐశ్వర్య రాయ్ అత్యంత ప్రసిద్ధ మోడల్స్ లో ఒకరు. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్ వుడ్.. అటుపై బాలీవుడ్, హాలీవుడ్.. ఎన్నో సినిమాలు.. మరెన్నో పాత్రలు. ఇదీ ఐశ్వర్య కెరియర్. ఆమెకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన ఫోటో ఇది. 21 years ago aishwarya rai gave one of her best performances ever. pic.twitter.com/HLDx9KKzyV — ً (@SheethalS5) July 13, 2023 ఈ ఫొటోను చూస్తూ ‘ఇది అంతర్జాల విందు’ అన్నారు ఒక యూజర్. 21 సంవత్సరాల వయసులో ‘మిస్ వరల్డ్’ అందాల కిరీటాన్ని గెలుచుకుంది ఐశ్వర్యరాయ్. ఆ శుభదినాన తల్లితో కలిసి ఫ్లోర్ మ్యాట్‌పై కూర్చొని భోజనం చేస్తున్న ఫొటో వైరల్‌గా మారింది. how can someone who has seen this, not be an aishwarya rai stan ?#aishwaryarai • #devdas pic.twitter.com/MmvHSIzGZT — 𝒂𝒚𝒖𝒔𝒉𝒊. (@_ayushi_saran) July 13, 2023 భారతీయతకు, భారతీయ భోజన సంప్రదాయాలకు అద్దం పట్టే ఫొటో ఇది. పాపులర్ పేజ్ ‘హిస్టారిక్ విడ్స్’లో షేర్ చేసిన ఈ ఫొటో గంటల వ్యవధిలోనే 2.6 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ‘సో...ప్యూర్ అండ్ జెన్యూన్’‘మన విలువలు, సంప్రదాయాలు భూమాతను, భోజన సంప్రదాయాలను గౌరవిస్తాయి’... ఇలా నెటిజనులు రకరకాలుగా స్పందించారు. Gorgeous Aishwarya Rai in Her Early Age. pic.twitter.com/qTUK8Jr58R — 🫶𝙌𝙃𝘿❤️🔥 (@QHDposts) July 10, 2023 ఐశ్వర్యారాయ్ నవంబర్ 1 న కర్ణాటకలోని మంగుళూరులో జన్మించారు. 1994లో మిస్ వరల్డ్ గా ఎంపికయ్యారు. అప్పటినుంచి ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళలలో ఒకరిగా గుర్తింపు పొందారు. 2007లో అభిషేక్ బచ్చన్ ను వివాహామాడి అమితాబ్ ఇంట కోడలిగా అడుగుపెట్టారు. 21 Years of Aishwarya Rai as Iconic Paro. ❤#AishwaryaRaiBachchan #21YearsOfDevdas https://t.co/CvKCHCMztn pic.twitter.com/2pwbHEIGVM — Name! why? (@Whatever820082) July 12, 2023 -
కాబోయే భార్య గురించి ట్వీట్ చేసిన జే కోటక్ - వైరల్ అవుతున్న పోస్ట్
ప్రముఖ బిలియనీర్ బ్యాంకర్ ఉదయ్ కోటక్ కుమారుడు 'జే కోటక్' గురించి దాదాపు అందరికి తెలిసిందే. అయితే ఇతడు ఇటీవల తన కాబోయే భార్యకు అభినందనలు తెలుపుతూ ట్విటర్ పోస్ట్ చేసాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం. జే కోటక్ మాజీ మిస్ ఇండియా 'అదితి ఆర్య'ని వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. అంత కంటే ముందు కాబోయే భార్య యేల్ యూనివర్శిటీ నుంచి ఎంబీఏ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన సందర్భములో అభినందనలు తెలిపాడు. దీనికి సంబంధించిన ఫోటోలను ట్విటర్ అకౌంట్ ద్వారా షేర్ చేస్తూ నా ఫియాన్సీ MBA గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. నేను చాలా గర్వపడుతున్నాను అంటూ మే 24న పోస్ట్ చేసాడు. ఇందులో అదితి గ్రాడ్యుయేషన్ దుస్తులలో ఉండటం కూడా చూడవచ్చు. జే కోటక్ కూడా కొలంబియా యూనివర్సిటీ నుంచి బీఏ, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. ప్రస్తుతం డిజిటల్ బ్యాంక్ కోటక్811కి కో-హెడ్ పదవిలో ఉన్నారు. 2022 ఆగస్ట్ నెలలో జే కోటక్ అండ్ అదితి ఆర్య నిశ్చితార్థం జరిగినట్లు పుకార్లు వచ్చాయి. నిశ్చితార్థం తర్వాత పారిస్‌లోని ఐఫిల్ టవర్ ముందు పోజులిస్తున్న ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. కానీ వారు దీనిని ధ్రువీకరించలేదు. కానీ ఇప్పుడు వీరి జంట త్వరలోనే పెళ్లి పీటలెక్కనట్లు చెప్పకనే చెప్పేసారు. (ఇదీ చదవండి: పట్టుమని పాతికేళ్ళు లేవు.. కోట్లు విలువ చేసే కార్లు, కారవ్యాన్, హెలికాఫ్టర్స్ - ఎవరీ యువ బిలీనియర్?) Aditi, my fiancée, completed her MBA from Yale University today. Immensely proud of you @AryaAditi pic.twitter.com/xAdcRUFB0C — Jay Kotak (@jay_kotakone) May 24, 2023 ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన షహీద్ సుఖ్‌దేవ్ కాలేజ్ ఆఫ్ బిజినెస్ స్టడీస్ పూర్తి చేసిన అదితి ఆర్య 2015లో మిస్ ఇండియా వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుంది. ఆ తరువాత యేల్ యూనివర్శిటీలో చదువుకోవడానికి అమెరికా పయనమైంది. అంతకంటే ముందు ఈమె తెలుగు, హిందీ సినిమాల్లో కూడా కనిపించింది. ఇప్పుడు అమెరికా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేసింది. ఇక జే కోటక్ & అదితి ఆర్యల వివాహం ఎప్పుడనేది తెలియాల్సిన విషయం. -
చీటింగ్ చేసి ప్రియాంక మిస్ వరల్డ్ అయ్యిందా?.. కో-కంటెస్టెంట్ సంచలన ఆరోపణలు
Miss World 2000: గ్లోబర్ స్టార్ ప్రియాంక చోప్రాపై మాజీ మిస్ బార్బడోస్ లీలానీ మెక్‌కానీ సంచలన వ్యాఖ్యలు చేసింది. మిస్ వరల్డ్ 2000 పోటీలో రిగ్గింగ్ చేసి ప్రియాంక గెలిచిందంటూ ఆమె షాకింగ్ చేసింది. దీంతో ఆమె కామెంట్స్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా నిలిచాయి. కాగా ఇటీవల జరిగిన యూఎస్ఏ 2022(Miss USA 2022) పోటీల్లో రిగ్గింగ్ జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ పోటీలో టెక్సాస్‌కు చెందిన రాబోన్ గాబ్రియేల్ కిరీటం గెలుచుకుంది. చీటింగ్ చేసి ఆమె గెలిచిందంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఓటీటీకి వచ్చేసిన బ్రహ్మాస్త్ర మూవీ, అక్కడ అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్ ఈ నేపథ్యంలో ఈ వివాదంపై స్పందిస్తూ లీలానీ ఓ యూట్యూబ్ వీడియో షేర్ చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మిస్ యూఎస్ఏ 2022 పోటీల్లో నిజంగానే రిగ్గింగ్ జరిగిందని, చీటింగ్ చేసి గాబ్రియేల్ని గెలిపించారని వ్యాఖ్యానించింది. అనంతరం ‘మిస్ వరల్డ్ 2000 పోటీలలో కూడా రిగ్గింగ్ చేసి ప్రియాంక చోప్రాని గెలిపించారు. మిస్ వరల్డ్ 1999లో ఇండియా నుంచి యుక్తాముఖి గెలిచింది. ఆ తర్వాత మిస్ వరల్డ్ 2000 సంవత్సరంలో కూడా ఇండియా నుంచి ప్రియాంక చోప్రానే గెలిచింది. అప్పడు నేను కూడా ఈ పోటీల్లో పాల్గొన్నాను. ఇలాంటి వాటిల్లో స్పాన్సర్స్ ఎవర్ని గెలిపించమంటే వారినే గెలిపించే అవకాశాలు కూడా ఉన్నాయి. మిస్ వరల్డ్ 2000కి జీ టీవీ స్పాన్సర్. ఇది ఇండియాకి చెందినది. అందుకే భారత్‌కు చెందిన ప్రియాంక చోప్రాని గెలిపించారు. ఆ పోటీల్లో జరిగిన స్విమ్ సూట్ కాంపిటేషన్‌లో అందరూ బికినీలు వేసుకుంటే.. ప్రియాంక మాత్రం వేరే స్విమ్ సూట్ వేసుకుంది. అయినా న్యాయనిర్ణేతలు ఆమెను క్వాలిఫై చేశారు. అప్పుడే అనుమానం వచ్చింది’ అని పేర్కొంది. అలాగే ఈ పోటీలో ప్రియాంకను ప్రత్యేకంగా చూసేవారు. చదవండి: బరువు పెరగడం ఓ సవాల్‌గా అనిపించింది: హీరోయిన్ ఈ పోటీల్లో పాల్గొన్న అందరికి జాసన్ వు డిజైనర్‌గా వ్యవహరించాడు. మా అందరికి ఒకే రకమైన ఫ్రాక్స్ డిజైన్ చేశాడు. కానీ ప్రియాంకకు మాత్రం స్పెషల్‌గా డిజైన్ చేశాడు. ఇక 1999లోనే యుక్తాముఖి మిస్ ఇండియా, మిస్ వరల్డ్ టైటిల్స్ గెలుచుకుంది. అలాగే 2000 సంవత్సరంలో ప్రియాంక చోప్రా మిస్ ఇండియా రన్నరప్ నిలిచింది. ఆ తర్వాత మిస్ వరల్డ్ గెలుచుకుంది. ఇలా చాలా అంశాల్లో ప్రియాంక చోప్రాని పైకి తీసుకొచ్చి తనని మిస్ వరల్డ్ చేశారు’ అంటూ బార్బడోస్ పేర్కొంది. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. మరి దీనిపై ప్రియాంక ఎలా స్పందిస్తుందో చూడాలి. -
స్వతంత్ర భారతి: మిస్ వరల్డ్ మానుషి
హర్యానాకు చెందిన ఇరవై ఏళ్ల యువతి మానుషి చిల్లర్ ‘మిస్ వరల్డ్’ టైటిల్ గెలుచుకున్నారు. 2000 సంవత్సరంలో ప్రియాంక చోప్రా మిస్ట్ వరల్డ్ విజేతగా ఎన్నికైన పదిహేడేళ్లకు మళ్లీ భారత్‌కు ఈ ఘనతను మానుషి సాధించిపెట్టారు. చైనాలోని శాన్యా సిటీలో నవంబర్ 18న జరిగిన ప్రపంచ సుందరి అందాల పోటీల ఫైనల్స్‌లో 117 మందితో మానుషి పోటీ పడి టైటిల్ గెలిచారు. మానుషి ఢిల్లీలోని సెయింట్ థామస్ స్కూల్లో చదువుకున్నారు. సి.బి.ఎస్.ఇ.లో ఇంగ్లిష్ సబ్జెక్టులో ఆలిం డియా టాపర్‌గా నిలిచారు. తొలి ప్రయత్నంలోనే ‘నీట్’లో సీటు సాధించి సోనిపట్ (హర్యానా) లోని భగత్ ఫూల్ సింగ్ మెడికల్ కాలేజీలో ఎం.బి.బి.ఎస్.లో చేరారు. ఆమె కూచిపూడి డ్యాన్సర్ కూడా. రాజా రాధారెడ్డి దంపతుల దగ్గర నాట్యం నేర్చుకున్నారు. ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు జూన్ 30 అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చిన జి.ఎస్.టి. 92 ఏళ్లుగా ప్రభుత్వం విడిగా ప్రవేశపెడుతున్న రైల్వే బడ్జెట్ సాధారణ బడ్జెట్లో విలీనం. కొచ్చి, హైద్రాబాద్ల మెట్రో రైళ్లు ప్రారంభం. భారత 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్. బెంగళూరులో సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్‌ను తుపాకీతో కాల్చి చంపిన దుండగులు. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ. (చదవండి: భయంకర వెంకటాచారి: గాంధీమార్గం వీడి బాంబులతో జోడీ) -
షైనింగ్ సైనీ: విధిని ఎదిరించింది అందాల పోటీలో నిలిచింది
ఆమెకు డ్యాన్స్ అంటే ప్రాణం. చిన్నప్పటి నుంచి మిస్ వరల్డ్ కిరీటం ధరించాలన్న ఆశ. కానీ గుండె సరిగా కొట్టుకోదు, ఓ యాక్సిడెంట్లో ముఖం మొత్తం కాలిపోయింది. అయినా ఏమాత్రం దిగులు పడలేదు. ఒక్కో సమస్యను అధిగమిస్తూ మిస్ వరల్డ్ రన్నరప్‌గా నిలిచింది శ్రీసైనీ. అమెరికాలోని ప్యూర్టోరికోలో జరిగిన మిస్‌వరల్డ్–2021 కాంపిటీషన్లో పోలాండ్‌కు చెందిన కరోలినా బిల్వస్కా మిస్‌వరల్డ్ కిరీటాన్ని గెలుచుకుంది. భారత్ తరపున పోటీపడిన మానస వారణాసి టాప్–6లోకి కూడా చేరుకోలేకపోయింది. కానీ భారత సంతతికి చెందిన 26 ఏళ్ల శ్రీసైనీ అమెరికా తరపున మిస్ వరల్డ్ కిరీటం కోసం పోటీపడి, మొదటి రన్నరప్‌గా నిలవడం విశేషం. పంజాబ్‌కు చెందిన సంజయ్ సైనీ, ఏక్తా సైనీ దంపతులకు 1996 జనవరి 6న లుథియాణలో శ్రీసైనీ పుట్టింది. ఈమెకు షహరోజ్ సైనీ అనే తమ్ముడు ఉన్నాడు. సంజయ్‌కు వాషింగ్టన్లో గ్యాస్ స్టేషన్ ఉండడంతో ఆమె కుటుంబం మొత్తం అమెరికాలో స్థిరపడ్డారు. దీంతో ఐదేళ్ల వయసులో శ్రీసైనీ భారత్ వదిలి వెళ్లిపోయింది. అప్పటి నుంచి అక్కడే ఇండో అమెరికన్‌గా పెరిగింది. పన్నెండేళ్ల వరకు శ్రీ గుండె స్పందనలు సరిగా లేవు. నిమిషానికి డెభ్బై సార్లు కొట్టుకోవాల్సిన గుండె కేవలం ఇరవై సార్లు మాత్రమే కొట్టుకునేది. శ్రీని పరీక్షించిన డాక్టర్లు ఆమె గుండెలో పూడిక ఏర్పడిందని నిర్ధారించారు. ఇందుకోసం శాశ్వత పేస్‌మేకర్‌ను అమర్చి ఆమె గుండెను సాధారణంగా పనిచేసేలా చేశారు. మూడేళ్ల వయసు నుంచే డ్యాన్స్‌ను ఎంతో ఇష్టంగా చేసే శ్రీకి పేస్‌మేకర్ అమర్చిన తరువాత డ్యాన్స్ చేయకూడదని డాక్టర్లు సూచించారు. అయినా వెనక్కు తగ్గలేదు. తన బలాన్ని మరింత పెంచుకునేందుకు ప్రారంభంలో చిన్నగా డ్యాన్స్ ప్రారంభించి, తరువాత రోజుకి ఆరుగంటలపాటు డ్యాన్స్ చేసేది. ఇలా ఏళ్లపాటు డాన్స్ సాధన చేస్తూ తనలోని ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుకుంది.బ్యాలే, జాజ్ డ్యాన్స్‌లు నేర్చుకుంది.అంతేగాక కాలేజీ హిప్అప్ టీమ్‌తో కలిసి డ్యాన్స్ చేసేది. ముఖం కాలిపోయినా.. చిన్నప్పటి నుంచి మిస్‌వరల్డ్ అవ్వాలనుకునే శ్రీసైనీ, ఆరేళ్లున్నప్పుడే మిస్ వరల్డ్‌గా తయారై బాగా మురిసిపోయేది. అప్పట్లో ఆమెకు మిస్‌వరల్డ్ అంటే సూపర్ హీరోలా కనిపించేది. దీంతో స్కూలు చదువు పూర్తయ్యాక.. వాషింగ్టన్ యూనివర్సిటీలో జర్నలిజం డిగ్రీ చేసింది. తరువాత మోడలింగ్‌లోకి అడుగు పెట్టింది. హార్వర్డ్ యూనివర్సిటీ, యాలే స్కూల్ ఆఫ్ డ్రామా, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో మోడలింగ్ కోర్సులు చేసింది. యూనివర్సిటీలో చదువుతోన్న రోజుల్లో అప్పుడు శ్రీకి పంతొమ్మిదేళ్లు ఉంటాయి. ఒకరోజు అనుకోకుండా కారు ప్రమాదం జరిగి ముఖం బాగా కాలిపోయింది. తన ముఖం తనే గుర్తుపట్టలేనంతగా మారింది. అయినా ఏమాత్రం దిగులుపడలేదు. ఎలాగైనా అందాల పోటీల్లో పాల్గొనాలన్న సంకల్పంతో ఏడాదిలోపే కోలుకుని, తన ముఖాన్ని పూర్వంలా అందంగా మార్చుకుంది. అనేక సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటూ తొలిసారి 2017లో మిస్ ఇండియా యూఎస్ఏ కిరీటాన్ని గెలుచుకుంది. మరుసటి ఏడాది మిస్‌వరల్డ్ ఇండియా వరల్డ్‌వైడ్ కిరీటాన్ని గెలుచుకుంది. ఆ తరువాత 2019లో మిస్ వరల్డ్ అమెరికా కాంపిటీషన్లో పాల్గొన్నప్పటికీ తన హృదయ సంబంధ సమస్యతో మధ్యలోనే తప్పుకోవాల్సి వచ్చింది. ట్రీట్మెంట్ తరువాత 2020లో మిస్ వరల్డ్ అమెరికా కాంపిటీషన్లో పాల్గొని టాప్ ఇన్ఫ్లుయెన్సర్ నేషనల్ విన్నర్, ఏ పర్పస్ నేషనల్ అంబాసిడర్, పీపుల్స్ ఛాయిస్ నేషనల్ విన్నర్, టాలెంట్ ఆడియెన్స్ చాయిస్ నేషనల్ అవార్డు, బ్యూటీ విత్ పర్పస్ విన్నర్ అవార్డులను గెలుచుకుంది. 2021లో మిస్‌వరల్డ్ అమెరికా కిరీటాన్ని గెలుచుకుని ఈ కిరీటం గెలుచుకున్న తొలి భారతసంతతి వ్యక్తిగా పేరు పొందింది. ఇటీవల నిర్వహించిన 2021 మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొని టాప్–6 కంటెస్టెంట్స్‌లో ఒకటిగా నిలిచింది. కానీ వెంట్రుకవాసిలో కిరీటం తప్పిపోయి మొదటి రన్నరప్‌గా నిలిచింది. మోటివేషనల్ స్పీకర్‌గానూ.. పన్నెండేళ్ల వయసు నుంచి మానసిక భావోద్వేగాలపై ఆర్టికల్స్ రాసే అలవాటు ఉంది శ్రీకి. తను రాసిన చాలా ఆర్టికల్స్ అమెరికన్ మీడియాలో పబ్లిష్ అయ్యాయి. చిన్నప్పటి నుంచి ఆమె చేస్తోన్న సామాజిక సేవాకార్యక్రమాలను ప్రముఖులు ప్రశంసించేవారు. ఎనిమిది దేశాల్లోని వందకుపైగా నగరాల్లో తను ఎదుర్కొన్న అనేక మానసిక సంఘర్షణలను వివరిస్తూ ఎంతోమంది యువతీ యువకుల్లో స్ఫూర్తిని నింపుతోంది. అందాల రాణిగానేగాక మెంటల్, ఎమోషనల్ హెల్త్ యాక్టివిస్ట్‌గా, మోటివేషనల్ స్పీకర్‌గా పనిచేస్తూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది శ్రీసైనీ. -
మిస్ వరల్డ్ 2021: అందాల రాశులు ఒక్కచోట చేరితే..
-
ముఖంపై కాలిన గుర్తులు.. అయినా ఆమె అందగత్తెనే!
Indian-American Shree Saini is first runner-up of Miss World 2021: జీవితంలో ‘చేదు’ను.. ‘తీపి’గా మలుచుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. కష్టాలు, నష్టాలు, అవమానాలు ఎదురైనా.. ఓర్చుకుంటూ ముందుకు సాగడమే సిసలైన జీవిత ప్రయాణం. చిన్నవయసులోనే మోయలేనంతగా బాధల్ని చవిచూసింది ఆ చిన్నారి. కానీ, తొణకలేదు. పైగా తల్లిదండ్రుల కన్నీళ్లను చిట్టిచేతులతో తుడిచింది. ఎదురించి పోరాడింది. ఎట్టకేలకు.. చిన్నప్పటి కలను సాధించుకుంది. ఏకంగా ప్రపంచ అందాల పోటీల్లో రన్నరప్‌గా నిలిచింది. శ్రీ సైని(26).. భారత మూలాలు ఉన్న యువతి కావడం గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం. Miss World 2021 పోటీలు మార్చి 17వ తేదీన ప్యూర్టో రికా, శాన్ జువాన్లోని కోకా కోలా హాల్లో ఘనంగా జరిగాయి. పోలాండ్ సుందరి కరోలీనా బెయిలాస్కా(23) Karolina Bielawska ప్రపంచ సుందరి టైటిల్ నెగ్గింది. మాజీ సుందరి జమైకాకు చెందిన టోనీ అన్సింగ్.. ప్రపంచ సుందరి కిరీటంతో కరోలీనాను సత్కరించింది. మొదటి రన్నరప్‌గా మిస్ అమెరికా 2021 శ్రీ సైని నిలవగా.. రెండో రన్నరప్‌గా పశ్చిమ ఆఫ్రికా దేశం కోట్ డీల్వోరికు చెందిన ఒలీవియా యాసే నిలిచింది. ఈ ముగ్గురిలో శ్రీ సైని.. ఇండో అమెరికన్ కాగా.. ఆమె జీవితం ఎంతో స్ఫూర్తిదాయం కూడా. Our newly crowned Miss World Karolina Bielawska from Poland with 1st Runner Up Shree Saini from United States 2nd Runner up Olivia Yace from Côte d’Ivoire#missworld pic.twitter.com/FFskxtk0KO — Miss World (@MissWorldLtd) March 17, 2022 శ్రీ సైని నేపథ్యం.. అందాల పోటీల్లో భారత సంతతి యువతి శ్రీ సైని ఆకట్టుకుంది. 26 ఏళ్ల సైని.. ప్రపంచ సుందరీమణుల పోటీల్లో రన్నరప్‌గా నిలిచింది. కిందటి ఏడాది అక్టోబర్‌లో జరిగిన మిస్ అమెరికా పోటీల్లో ఆమె విజేతగా నిలిచిన విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. ►మిస్ వరల్డ్ ఫస్ట్ రన్నరప్ శ్రీ సైని స్వస్థలం పంజాబ్‌లోని లూథియానా. సైనికి ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు ఆమె కుటుంబం వాషింగ్టన్కు వలస వెళ్లింది. పసితనం నుంచే ఆమె అడుగులు.. ముళ్ల బాటలో సాగాయి. ► ఐదేళ్ల వయసులో ఆమెకు ఆరోగ్య సమస్యలు వచ్చాయి. గుండె సంబంధిత సమస్యలతో బాధపడింది ఆమె. అందరి గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటే.. శ్రీ సైనికి కేవలం 20సార్లు మాత్రమే కొట్టుకునేది. ఆమె అందరు పిల్లలాగా ఆడుకోలేని డాక్టర్లు చెప్పారు. చివరికి.. పన్నెండవ ఏటా ఓపెన్ హార్ట్ సర్జరీతో పేస్‌మేకర్ అమర్చారు. ఆపై ఆమె మిగతా పిల్లల్లాగే గెంతులేస్తూ ఆడింది. ► సవ్యంగా సాగుతున్న శ్రీ సైనిపై మరో పిడుగు పడింది. ఓ రోడ్డు ప్రమాదంలో ఆమె ముఖం బాగా కాలిపోయింది. కానీ, శ్రీ షైని కుంగిపోలేదు. ఆమె కోలుకోవడానికి ఏడాది టైం పడుతుందని వైద్యులు చెప్పారు. కానీ, ఆశ్చర్యకర రీతిలో కేవలం రెండు వారాలకే ఆమె తరగతి గదిలో అడుగుపెట్టింది. తల్లిదండ్రులతో శ్రీ సైని(పాత చిత్రం) ► చిన్నతనంలోనే ప్రపంచ సుందరి కావాలన్న కల నెరవేర్చుకునేందుకు.. ప్రయత్నించింది. కాలిన ఆ మరకలను సహజంగా తగ్గించుకునే ప్రయత్నం చేసింది. అందాల పోటీల్లో పాల్గొంది. 2020లో Miss Washington World గెల్చుకుంది. ► ఆపై మిస్ అమెరికా 2021 కిరీటం దక్కించుకుంది. మిస్ అమెరికా ఫైనల్ పోటీలకు ముందురోజు.. స్టేజ్ మీదే కుప్పకూలిన ఆమె ఆస్పత్రి పాలైంది. అయినా ఆ మరుసటి రోజు నెర్వస్ను పక్కనపెట్టి కిరీటాన్ని దక్కించుకుంది. ఆమె స్ఫూర్తిదాయకమైన ప్రయాణానికి గానూ.. మిస్ వరల్డ్ బ్యూటీ విత్ ఏ పర్పస్(BWAP) అంబాసిడర్ హోదా కూడా దక్కింది. ► ముఖ కాలిన గాయాలు, గుండె లోపాన్ని అధిగమించిన నా కథ.. రోజువారీ సవాళ్లను అధిగమించడానికి ఇతరులను ప్రోత్సహిస్తుందని నేను ఆశిస్తున్నా. నేను కేవలం 6 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, నేను మిస్ వరల్డ్ వేషం వేసుకున్నాను, ఎందుకంటే నేను మిస్ వరల్డ్‌ను సూపర్ హీరోగా చూశాను. సేవ చేయాలనే ఉద్దేశ్యం నాకు కష్ట సమయాల్లో బలాన్నిచ్చింది. నాకు కష్టాలు తెలుసు. బతకాలనే సంకల్పం నా జీవితాన్ని ఇక్కడి దాకా తీసుకొచ్చింది అంటోంది శ్రీ సైని. View this post on Instagram A post shared by SHREE SAINI👑MISS WORLD 1st RU (@shreesaini) -
ఓ గృహిణి లక్ష్యం.. సవాళ్లే మన గురువులు
‘ఒక చిన్న అడ్డంకి కూడా నా ఎదుగుదలను ఆపలేదు’ అంటోంది మోడల్ తనూ గార్గ్ మెహతా. భారతదేశంలోని హర్యానాలో పుట్టి పెరిగిన తనూ కెనడా వెళ్లి, అటు నుంచి అమెరికా చేరుకొని ప్రసిద్ధ కంపెనీలలో పని చేస్తూ అక్కడి గ్లామర్ ప్రపంచంలో మహామహులతో పోటీ పడుతూ గుర్తింపును పొందుతోంది. బ్రిటిష్ ఎయిర్‌లైన్, వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్వేస్లో ఫ్లైట్ అటెండెంట్‌గా పనిచేసిన అనుభవం తనూ గార్గ్ సొంతం. రాబోయే మిసెస్ వరల్డ్ పోటీలకు సిద్ధం కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. వర్ణ వివక్షను ఎదుర్కొంటూ ఒంటరి పోరుకు సిద్ధపడింది. అమెరికాలో పర్యావరణం కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థ కోసం పనిచేస్తోంది. ప్రకటనలలో నటిస్తోంది. కలల సాధనకు కృషితోపాటు కుటుంబం బంధాన్ని నిలుపుకోవాల్సిన విధానం గురించి కూడా వివరిస్తోంది. ‘‘భారతీయ మహిళ అనే కారణం ఏ దశలోనూ నన్ను తగ్గించలేదు. మోడల్‌గా రాణించాలనే నా కల నా పని షెడ్యూల్‌నూ మార్చలేదు. రంగుల ప్రపంచంలో విజయం సాధించడానికి ఏం అవసరమో నాకు తెలుసు. హర్యానాలోని కర్నాల్ జిల్లాలో పుట్టి పెరిగాను. మధ్య తరగతి కుటుంబం. బి.టెక్ అయ్యాక పై చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకున్నాను. కానీ కుటుంబం ఆర్థికంగా మద్దతు ఇవ్వడానికి చాలా కష్టమైంది. కెనడా వెళితే కొంత ఖర్చు తగ్గుతుందనుకున్నా. అందుకు కుటుంబసభ్యులతో పాటు బంధువులు, స్నేహితుల సాయం తీసుకున్నాను. అప్పుడే అనుకున్నా ఎన్ని సవాళ్లు ఎదురైనా ఆర్థికంగా స్వతంత్రంగా నిలబడాలని. అడుగడుగునా సవాళ్లు కెనడాలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాక పేరున్న ఐటి కంపెనీలలో ఉద్యోగం చేశాను. అక్కడే నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను. మా ఇద్దరి బంధానికి గుర్తుగా కొడుకు పుట్టాడు. అందమైన కుటుంబం. హాయిగా సాగిపోతోంది జీవితం. కానీ, నా కల మాత్రం నన్ను వెంటాడుతూనే ఉంది. అమెరికాలోని అందాల పోటీలలో విజేతగా నిలవాలన్నది నా కల. అక్కడి రంగుల ప్రపంచంలో మోడల్‌గా రాణించాలన్నది లక్ష్యం. ఇందుకు నా భర్త మద్దతు లభించింది. బాబును నా భర్త వద్ద వదిలి, కొద్ది కాలంలోనే అమెరికా చేరుకున్నాను. ఉద్యోగం చేస్తున్న సమయంలోనే చాలా విషయాలు స్పష్టమయ్యాయి. అమెరికాలో ఇతర దేశాల నుంచి వచ్చినవారికి ముఖ్యంగా స్త్రీకి చాలా సవాళ్లతో కూడిన జీవితం ఉంటుందని అర్థమైంది. మగవారితో పోల్చితే తక్కువ జీతం, వర్ణ వివక్ష, సాంస్కృతిక అడ్డంకులు .. ఎన్నో చూశాను. కానీ, అన్నింటినీ అధిగమించడమే నేను చేయాల్సింది అని బలంగా అనుకున్నాను. అప్పుడే అందరికీ సమాన అవకాశాలకు మద్దతు ఇచ్చే సేవాసంస్థ నిర్వాహకులతో పరిచయమైంది. దీంతో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి సేవా సంస్థ పనుల్లో నిమగ్నమయ్యాను. మోడలింగ్ చేస్తూ, అందాల పోటీల్లో పాల్గొంటూనే సంస్థ పనులు చేస్తున్నాను. అలాగే, పర్యావరణ రక్షణకు పాటు పడే సంస్థకోసం కృషి చేస్తున్నాను. ఫలితంగా ఆర్థిక వెసులుబాటు, సేవాభాగ్యం లభించింది. నా లక్ష్యం నెరవేర్చుకోవడానికి మార్గమూ సులువయ్యింది. దూరాన్ని దగ్గర చేసే నమ్మకం పెళ్లి అనేది ఒక అద్భుతమైన విషయం. ఒక కప్పు కింద ఉన్నా, సుదూరంగా, ఇతర దేశాలలో ఉన్నా భాగస్వామి కలను అర్థం చేసుకోవడంతో బంధం బలంగా ఉంటుంది. దూరం హృదయాలను మరింత మృదువుగా మార్చేస్తుందనడానికి నా జీవితమే ఉదాహరణ. నిజానికి భారతీయ సంస్కృతిలో భార్య–భర్త దూరంగా ఉండటం ఇప్పటికీ నిషేధం. కానీ, బదిలీలు, దేశ రక్షణలో సైనికులు, అతిగా క్యాంపులు ఉండే ఉద్యోగాలు ఇవన్నీ జీవిత భాగస్వామికి దూరంగా ఉంచుతాయి. దూరం అనేది వివాహానికి సవాల్‌గా ఉంటుంది. కానీ, సరిగ్గా నిర్వహిస్తే వారిద్దరి బంధం కచ్చితంగా బలంగా ఉంటుంది. ఒక మహిళ కుటుంబాన్ని పోషించగలదు, కలలను సాధించుకోవడానికి కృషి చేయగలదు. ఏదైనా సంబంధాన్ని కొనసాగించడంలో వారి మధ్య కమ్యూనికేషన్, నమ్మకం రెండూ కీలకమైన అంశాలు. ఇవి మా ఇద్దరి మధ్య ఉన్నాయి. అందుకే నా కల కోసం నేను తీవ్రంగా ప్రయత్నిస్తున్నాను. ఉద్యోగం చేస్తున్నాను. ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడుకోవడానికి ఫిట్నెస్, యోగా, ధ్యానం, పోషకాహారం .. అన్నింటిపైనా దృష్టిపెడుతున్నాను. తెలుపు–నలుపు, పొట్టి–పొడవు భేదాలేవీ మన కలలకు అడ్డంకి కావు. మానవ ప్రపంచంలో అందరూ సమానమే అని చాటాలన్నదే నా లక్ష్యం’’ అనే తనూ గార్గ్ ఎదుర్కొంటున్న సవాళ్లు మనకూ ఓ లక్ష్యాన్ని నిర్దేశిస్తాయి. -
మిస్ వరల్డ్ అమెరికాగా తొలిసారి భారత సంతతి అమెరికన్
న్యూయార్క్: మిస్ వరల్డ్ అమెరికా 2021ని గెలుచుకున్న తొలి భారత సంతతి అమెరికన్‌గా శ్రీ సైనీ నిలిచింది. వాషింగ్టన్‌కి చెందిన శ్రీసైని ప్రపంచ స్థాయిలోనిర్వహించిన ఈ పోటీలో అమెరికాకు ప్రాతినిథ్యం వహించిన తొలి భారత సంతతి అమెరికన్ కావడం విశేషం. అయితే ఆమెకు 12 ఏళ్ల వయసులో జరిగిన కారు ప్రమాదంలో ఎడమవైపు భాగం ముఖంతో సహా అంతా కాలిపోయింది. పైగా ఆమె జీవితాంత పేస్‌మేకర్ (కృత్రిమ గుండె) సాయంతోనే బతకాలి అయినప్పటికీ వీటిన్నంటిని అధిగమించి మరీ మిస్ వరల్డ్ అమెరికా కిరీటాన్ని గెలుచుకుని ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. (చదవండి: తక్షణమే చర్యలు తీసుకుంటాం!) ఈ మేరకు లాస్ ఏంజెల్స్‌లోని మిస్ వరల్డ్ అమెరికా ప్రధాన కార్యాలయంలో డయానా హెడెన్ శ్రీ సైనికి ఈ కిరీటాన్ని బహుకరించింది. ఈ సందర్భంగా శ్రీ సైని మాట్లాడుతూ......." నేను గెలిచినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. నాభావాలను మాటల్లో చెప్పలేను. ఈ క్రెడిట్ అంతా మా అమ్మనాన్నలకే దక్కుతుంది. ఈ ప్రతిష్టాత్మకమైన గౌరవం దక్కినందుకు మిస్ వరల్డ్ అమెరికాకు ధన్యావాదులు" అంటూ తన సంతోషాన్ని వ్యక్త చేసింది. శ్రీ ఫోర్డ్స్ సిటీ ఆఫ్ న్యూజెర్సీలో జరిగిన పోటీలో శ్రీ 'మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2018' కిరీటాన్ని కూడా గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మిస్ వరల్డ్ అమెరికా ఇన్‌స్టాగ్రామ్‌లో "మిస్ వరల్డ్ అమెరికా వాషింగ్టన్ అయిన శ్రీ 'ఎండబ్ల్యూఏ నేషనల్ బ్యూటీ అంబాసిడర్' అనే ప్రతిష్టాత్మక స్థానంలోఉంది, ఆమె నిరంతరం చేసిన సేవా కార్యక్రమాల కారణంగా ఈ ప్రతిష్టాత్మక కిరీటాన్ని గెలుచుకుంది. అంతేకాదు డాక్టర్లు అందుబాటులోలేని ప్రాంతాల్లో ఆమె కనబర్చిన సేవ దృక్పథాన్ని యూనిసెఫ్, సుసాన జి కొమెన్(యూఎస్ బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్) వంటి ఇతర సంస్థలు గుర్తించాయి. అందం గురించి మంచి నిర్వచనాన్ని ఇవ్వడమే కాక, మిస్ వరల్డ్ అమెరికా మిషన్ పట్ల అవగాహన కలిగిస్తుంది" అని ప్రశంసించింది. View this post on Instagram A post shared by Shree Saini👑Miss World America (@shreesaini) (చదవండి: పుట్టుకతోనే చేతుల్లేవు.. కానీ చాలానే సాధించింది!) -
విశ్వ సుందరి కిరీటం.. నేలపై కూర్చొని భోజనం.. ఐష్ ఓల్డ్ ఫోటో వైరల్
ఐశ్వర్యరాయ్.. అందానికే పర్యాయపదం ఈ పేరు. కుర్రకారు మొదలుకుని సినీ నిర్మాతల వరకూ ఆమె అందానికి ఆకర్షితులే. ప్రతి ఒక్కరు అందాన్ని ఆమెతో పోల్చి చెబుతారు. అలాంటి అందమైన స్త్రీ భూమ్మీద మరొకరు ఉండరని అంటుంటారు. ఈ పిల్లికళ్ల బ్యూటీ 1994లోమిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. మిస్ వరల్డ్ అయిన తర్వాత ఆ కిరీటంతోనే కింద కూర్చొని భోజనం చేసింది ఐశ్యర్య. ఈ అరుదైన ఫొటోను ప్రముఖ నటి అమీజాక్సన్ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చెయ్యగా అది వైరల్ అవుతుంది. అందులో మిస్ వరల్డ్ కిరీటంతోనే మెరూన్ కలర్ చీరలో తల్లి బృందాతో కలిసి నేలపై కూర్చుని స్వహస్తాలతోనే భోజనం చేస్తున్నారు. 1994 లో మిస్ ఇండియా పోటీలో ఐశ్వర్య మొదటి రన్నరప్. ఆమె కిరీటాన్ని సుష్మితా సేన్ చేతిలో కోల్పోయింది. తరువాత, ఇద్దరూ వరుసగా మిస్ వరల్డ్ మరియు మిస్ యూనివర్స్ కిరీటాలను గెలుచుకున్నారు. అమీ జాక్సన్ కూడా 2009లో మిస్ టీన్ వరల్డ్‌గా గెలుపొందారు. అంతేకాదు..2010 లో మిస్ ఇంగ్లాండ్ టైటిల్ పోటీల్లో రన్నరప్ కిరీటాన్ని గెలుపొందారు. 6 ఏళ్లకే మోడల్ గా కెరీర్ ప్రారంభించిన అమీ పలు సినిమాల్లో కూడా నటించారు. View this post on Instagram A post shared by Nineties Violet 🔮 (@90s.violet) -
కాళ్లకు ఏడు కోట్ల ఇన్సూరెన్స్ చేయించిన ఆసీస్ బ్యూటీ..
సిడ్నీ: మిస్ వరల్డ్ ఆస్ట్రేలియా Sarah Marschke తన కాళ్లకు రూ.7 కోట్ల ఇన్సూరెన్స్ చేయించుకుంది. ఆస్ట్రేలియాలోని బుండాబర్గ్‌లో జన్మించిన 22 ఏళ్ల సారా.. 2019లో మిస్ వరల్డ్ ఆస్ట్రేలియాగా ఎంపికైంది. అందాల పోటీల్లో తనకు లభించిన గుర్తింపునకు తన పొడవాటి అందమైన కాళ్లే కారణమని ఈ బ్యూటీ చెబుతోంది. అందుకే తన శరీరంలోని అందమైన కాళ్లకు ఇన్సూరెన్స్ చేయించానని తెలిపింది. కాగా, కాళ్లు పొడవుగా ఉండటంతో చిన్నతనంలో తనను స్నేహితులు ఆటపట్టించేవాళ్లని ఆమె గుర్తు చేసుకుంది. అయితే ఎదిగే క్రమంలో తన కాళ్లే తనకు అందాన్ని ఇస్తాయని ఊహించలేదని పేర్కొంది. గతంలో తన కాళ్లను హేళను చేసినవాళ్లే ఇప్పుడు ఆరాధిస్తున్నారని ఈ పొడుగు కాళ్ల సుందరి గర్వంగా చెప్పుకుంటుంది. మరోవైపు సారా కుటుంబంలో చాలా మంది రగ్బీ ఆటగాళ్లు ఉన్నారు. అయితే, ఆమె మాత్రం ఫుట్‌బాల్ వైపు అడుగులు వేస్తోంది. త్వరలో ఆమె ఆస్ట్రేలియన్ ఫుట్‌బాల్ ఉమెన్స్ లీగ్‌లో ఆడబోతుంది. ఆస్ట్రేలియా మీడియా సంస్థలు సారాకు సంబంధించి రోజూ ఏదో ఒక న్యూస్‌ను రాసేందుకు పోటీపడుతుంటాయి. ఈ నేపథ్యంలో ఆమె కాళ్లకు ఇన్సూరెన్స్ చేయించడం ఆస్ట్రేలియా మీడియా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సారాకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాను ప్రస్తుతం 16,000 మంది అనుసరిస్తున్నారు. చదవండి: వైరల్ వీడియో.. ఆ కుక్క చూపిస్తున్న ప్రేమకు కన్నీళ్లు వస్తున్నాయి -
మిస్ వరల్డ్ గెలిచిన తర్వాత అమ్మ నాతో..
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్ నాటి సంఘటనను గుర్తు చేసుకుని ఆ క్షణంలో చోటుచేసుకున్న కొన్ని ఆసక్తికర విషయాలను తాజాగా పంచుకున్నారు. 2000లో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న వీడియోను ప్రియాంక మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అంతేగాక తను కిరీటం ధరించిన అనంతరం ఆమె తల్లి మధు చోప్రా తనతో చెప్పిన మాటలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ‘మిస్ వరల్డ్ 2000 నాటి వీడియో ఇది. అప్పుడే నాకు 18 సంవత్సరాలు నిండాయి. మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్నాను. ఆ తర్వాత స్టేజ్‌పై నా కుటుంబాన్ని కలుసుకోవడం, శుభాకాంక్షలు తెలుపుకోవడం వంటివి జరుగుతున్నాయి. ఈ క్రమంలో వెంటనే మా అమ్మ నాతో ‘బేబీ ఇప్పడు నీ చదువు సంగతేంటి? అన్నారు’ అంటూ ఇన్‌స్టాలో ప్రియాంక రాసుకొచ్చారు. ప్రియాంక షేర్ చేసిన ఈ వీడియో.. ముగ్గురు ఫైనలిస్టులలో ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్ టైటిల్ గెలిచిందని ప్రకటించిన క్షణంతో ప్రారంభమవుతుంది. అనంతరం ప్రియాంక భావోద్యేగంతో మిగతా ఇద్దరూ కంటెస్టంట్లను కౌగిలించుకుంటుంది. ఆ తర్వాత ఆమె తలపై కిరీటాన్ని ధరిస్తారు. (చదవండి: హత్రాస్ ఘటన: ‘ఎంతమంది నిర్భయలు బలి కావాలి’) ఈ వీడియో గురించి ప్రియాంక ఆమె తల్లి మధు చోప్రా ఆ సమయంలో చోటుచేసుకున్న కొన్ని ఆసక్తికర సంఘటనల గురించి మాట్లాడుకుంటారు. ప్రియాంక తన తల్లిని ‘మామ్ నేను కిరీటం గెలుచుకున్న క్షణాలు గుర్తున్నాయా’ అని అడుగుతుంది. దీనికి ఆమె తల్లి సమాధానం ఇస్తూ.. ‘ముగ్గురు ఫైనలిస్టులో నిన్ను విన్నర్‌గా ప్రకటించగానే హాల్ అంతా చప్పట్లు, అరుపులతో మారుమ్రోగింది. ఆ క్షణం నేను భావోద్యేగానికి లోనయ్యాను. నా కళ్ల నిండా నీళ్లు తిరగాయి. నేను నిన్ను కౌగిలించకున్నాక కిరీటం గెలుచుకున్నందుకు చాలా ఆనందంగా ఉందని, నీకు శుభాకాంక్షలు తెలిపాలి. దానికి బదులుగా బేబీ ఇప్పుడు నీ చదువు విషయం ఏంటి అని తెలివి తక్కువగా ప్రశ్నించాను’ అని గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత ప్రియాంక సోదరుడు కూడా వీడియో కాల్ ద్వారా మాట్లాడుతూ.. తన సోదరి మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్న ఆ క్షణంలో తనలో మెదిలిన ఆలోచనలు పంచుకున్నాడు. (చదవండి: అప్పుడు నేను ఏం ధరించాను? : ప్రియాంక) ‘అప్పుడు నేను 11 లేదా 12 సంవత్సరాలు ఉన్నాను. నాకు బాగా గుర్తుంది. నువ్వు మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకోగానే నాలో ఎన్నో రకాల ఆలోచనలు ఒక్కాసారిగా మెదిలాయి. నువ్వు గెలిచినందుకు చాలా సంతోషించాను కానీ మరు క్షణమే నేను నా చదువుల కోసం అమెరికా వెళ్లాలని ఆలోచించాను’ అంటూ చెప్పకొచ్చాడు. దీంతో ప్రియాంక మధ్యలో స్పందిస్తూ.. అవును ఆక్షణాలు కొంచం గజిబిజిగా ఉన్నాయి. నేను కూడా నా విజయం తర్వాత నా కుటుంబం ఎలా స్పందిస్తుంది, ఏమి అనుకుంటుందో అని కూడా ఆలోచించలేదు’ అని అన్నారు. కాగా ప్రియాంక 2000లో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకోవడం ఒక విశేషం అయితే అదే ఏడాదిలో నటి లారా దత్తా కూడా మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకోవడం మరో విశేషం. భారత్ తరపు మిస్ వరల్డ్‌కు ప్రియాంక చొప్రా, మిస్ యూనివర్స్‌గా లారా దత్తాలు అందాలా పోటీ వేదికలకు ప్రాతినిధ్యం వహించి ఇండియాకు రెండు ప్రతిష్టాత్మక టైటిల్‌లను తెచ్చిపెట్టారు. -
అందం, అణకువల కలబోత
ప్రస్తుతం ఇంటర్నెట్లో ‘థ్రోబ్యాక్’ చాలెంజ్ ట్రెండ్ అవుతోంది. దీనిలో భాగంగా సోషల్ మీడియా వేదికగా నెటిజనులు ఎన్నో విలువైన, అద్భుతమైన, అపురూప చిత్రాలను షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో అందాల రాణి, మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్‌కు సంబంధించిన ఓ అరుదైన ఫోటోను షేర్ చేశారు నెటిజనులు. ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరలవుతోంది. ఐశ్వర్య రాయ్ సింప్లిసిటీకి నెటిజనులు ఫిదా అవుతున్నారు. ఐశ్వర్య రాయ్ మిస్ వరల్డ్ కిరీటం గెలిచిన తర్వాత తీసిన ఫోటో ఇది. దీనిలో ఆమె, తన తల్లి బ్రిందా రాయ్‌తో కలిసి కింద కూర్చుని భోజనం చేస్తున్నారు. తలపైన ప్రపంచ సుందరి కిరీటం ధరించినప్పటికి ఓ సాధారణ యువతిలా నేలపై కూర్చుని భోజనం చేయడం నిజంగా విశేషమే. దాంతో ‘అందం, అణకువల కలబోతకు నిదర్శనం ఈ ఫోటో’ అంటూ తెగ ప్రశంసిస్తున్నారు నెటిజనులు. (‘తన మాటలకు గర్వంగా ఉంది’) ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఐశ్వర్య రాయ్.. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొన్నియన్ సెల్వన్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ రచయిత కల్కి కష్ణమూర్తి రచించిన పాపులర్ నవల ‘పొన్నియిన్ సెల్వన్’ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ పీరియాడికల్ చిత్రంలో విక్రమ్, కార్తి, ‘జయం’ రవి, ఐశ్వర్యారాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. (స్వర్ణయుగం మొదట్లో..) -
‘మారిపోయారు.. గుర్తుపట్టలేకపోతున్నాం!’
దాదాపు ఇరవై ఏళ్ల క్రితం.. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్నారు. అప్పటి వరకు బయటి ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని ఆమె పేరు.. ఒక్కసారిగా పతాక శీర్షికల్లో నిలిచింది. ఆ తర్వాత రెండేళ్లకు తమిళ సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుపెట్టిన ప్రియాంక.. ఎన్నో సవాళ్లు ఎదుర్కొని బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగారు. ప్రస్తుతం హాలీవుడ్‌లోనూ నటిస్తూ గ్లోబల్ స్టార్ అనిపించుకుంటున్నారు. ఇక కేవలం సినిమాలకే పరిమితం కాకుండా పలు సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకునే పిగ్గీ చాప్స్.. యూనిసెఫ్ అంబాసిడర్‌గా పనిచేస్తున్న విషయం తెలిసిందే.(ఆ డ్రెస్ నాకు బాగా నచ్చింది: ప్రియాంక తల్లి) కాగా గత కాలపు జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ ప్రియాంక చోప్రా గురువారం షేర్ చేసిన ‘మిస్ వరల్డ్’ ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ‘‘2000 సంవత్సరం.. మిస్ వరల్డ్ ఎట్ 18! వావ్. ఇదంతా నిన్ననే జరిగినట్లు అనిపిస్తోంది. ఇరవై ఏళ్ల తర్వాత కూడా నాలోని ఉత్సుకత ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ అదే దృఢ సంకల్పంతో.. అంతే పట్టుదలతో ప్రతీ పని చేస్తున్నాను. ఏదైనా మార్చగలిగే శక్తి అమ్మాయిలకు ఉంటుందని నేను విశ్వసిస్తాను. అవకాశాలు వస్తే తమను తాము నిరూపించుకోవడానికి వారు ముందుంటారు’’ అంటూ ప్రియాంక షేర్ చేసిన ఫొటో అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ‘‘అప్పటికీ ఇప్పటికీ ఎంతగా మారిపోయారు. గుర్తుపట్టలేకపోతున్నాం. ఏది ఏమైనా సవాళ్లను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్న మీరు మాకు ఆదర్శం’’ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రియాంక ఫొటోపై మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ కూడా స్పందించారు. ‘‘వన్స్ మిస్ వరల్డ్.. ఆల్వేస్ మిస్ వరల్డ్’’ అని ఆమె కామెంట్ చేశారు. View this post on Instagram #TBT Miss World at 18! The turn of the millennium...the year 2000! Wow. It feels like just yesterday I was living this dream. Now, almost 20 years later, my enthusiasm for changing the status quo remains as strong and is at the core of everything I do. I truly believe girls have the power to bring about change if they get the opportunities they deserve. #strivehigher #dreambig A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on Feb 13, 2020 at 10:56am PST Include caption By using this embed, you agree to Instagram's API Terms of Use . -
బ్యూటిఫుల్ ఇండియా
నల్ల సౌందర్యానికి మళ్లీ కితాబు దక్కింది. శ్వేతవర్ణం వెనక్కు తగ్గింది. ‘మిస్ యూనివర్స్ 2019’ కిరీటం నల్లజాతి వనితకు దక్కిన కొద్ది రోజుల్లోనే ‘మిస్ వరల్డ్ 2019’ కిరీటం కూడా మరో నల్లవజ్రానికే దక్కింది. జమైకాకు చెందిన టోని ఆన్‌సింగ్ శనివారం లండన్‌లోని ఎక్సెల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన భారీ వేడుకలో మిస్ వరల్డ్ కిరీటాన్ని శిరస్సుపై ధరించి ఈ ఘనతను సాధించింది. 23 ఏళ్ల టోని ఆన్‌సింగ్ తండ్రి ఇండియన్ కరేబియన్. తల్లి ఆఫ్రికన్ కరేబియన్. కనుక ఆమె సౌందర్యంలో భారతీయ మూలాలు ఉన్నందుకు భారతీయ సౌందర్యప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో టాప్ 3లో నిలిచి సెకండ్ రన్నరప్‌గా మిస్ ఇండియా సుమన్ రావు స్థానం పొందడం కూడా భారతీయులకు సంతోషం కలిగిస్తోంది. 111 దేశాలు ఈ కిరీటం కోసం పోటీ పడగా టోని ఆన్‌సింగ్ మొదటి స్థానంలో, సుమన్ రావు మూడో స్థానంలో నిలిచి భారతీయ సౌందర్య కేతనాన్ని రెపరెపలాడించారు. నవంబర్ 20 నుంచి మొదలైన ఈ పోటీలు దాదాపు నాలుగు వారాలపాటు కొనసాగాయి. 70 దేశాల పార్టిసిపెంట్స్ రకరకాల దశల్లో వెనుకకు మరలగా టాప్ 40లో నిలిచిన అందగత్తెలు కిరీటం కోసం హోరాహోరి తలపడ్డారు. జమైకా బాలిక ‘ఈ విజయం ఆ జమైకా బాలికకు అంకితం’ అని కిరీటం దక్కించుకున్నాక టోని ఆన్‌సింగ్ వ్యాఖ్యానించింది. ఆ బాలిక ఎవరో కాదు తనే. ఈ విజయం తనూ తనలాంటి నల్లజాతి బాలికలకు సొంతమని టోని పేర్కొంది. ‘స్త్రీల సమానత్వం కోసం నేను చేయదగ్గ పనంతా చేస్తాను’ అని కూడా ఆమె అంది. టోని కుటుంబం ఆమెకు తొమ్మిదేళ్ల వయసు ఉండగా అమెరికాకు వలస వచ్చింది. ఫ్లోరిడా యూనివర్సిటీలోనే టోని విమెన్స్ స్టడీలో గ్రాడ్యుయేషన్ చేసింది. సెకండ్ రన్నరప్ సుమన్‌రావు రాజస్థాన్ అమ్మాయి రాజస్థాన్‌కు చెందిన సుమన్ రావు ‘మిస్ వరల్డ్ 2019’కు హాజరయ్యే ముందు ‘మిస్ రాజస్థాన్’, ‘మిస్ ఇండియా ఫెమినా’ టైటిల్స్ గెలుచుకుంది. ప్రస్తుతం ఆమె కుటుంబం నవీ ముంబైలో ఉంటోంది. చార్టర్డ్ అకౌంటెన్సీ పూర్తి చేసే పనిలో ఉన్న సుమన్ రావు ఇప్పటికే మోడలింగ్‌లో బిజీగా ఉంది. సినిమాలలో అదృష్టం పరీక్షించుకోవాలనుకుంటోంది. కథక్ నృత్యకారిణి కావడం వల్ల మిస్ వరల్డ్ పోటీలలో ఆనవాయితీగా జరిగే డాన్స్ కాంపిటీషన్లో ‘పద్మావత్’ సినిమాలోని ‘ఝమర్’ పాటకు నృత్యం చేసి ఆహూతులను ఉర్రూతలూగించింది. ‘భారతదేశంలో స్త్రీలకు కట్టుబాట్లు ఎక్కువ. నా తల్లి అటువంటి కట్టుబాట్లు చాలా ఎదుర్కొంది. అయినప్పటికీ నన్ను నా కలల వెంట వెళ్లేలా చేసింది’ అని సుమన్ రావు చెప్పింది. మిస్ వరల్డ్ పోటీలో సుమన్ రావు మూడో స్థానంలో నిలిచిందని తెలియగానే ఆమె స్వగృహంలో వేడుకలు మొదలయిపోయాయి. ‘నా కూతురు అనుకున్నది సాధించింది’ అని తండ్రి రతన్ సింగ్ రావు పొంగిపోతూ చెప్పాడు. మొత్తం మీద ఈ శీతాకాలం భారతీయ సౌందర్యానికి మంచి సంతోషాన్ని తెచ్చిందని చెప్పుకోవాలి. ‘పద్మావత్’ సినిమాలోని పాటకు నృత్యం చేస్తున్న సుమన్ రావు -
బ్రిటన్ మిస్ వరల్డ్ లో అందమైన భామలు
-
ప్రపంచంలోకెల్లా అత్యంత అందగత్తె..
ప్రపంచం మొత్తంలో ఉన్న అమ్మాయిల్లో ఎవరు అందంగా ఉన్నారు? అని అడిగితే ఎవరూ చెప్పలేరు. ఒకవేళ చెప్పగలిగినా.. ఏటా జరిగే మిస్ వరల్డ్ పోటీల్లో ఎవరైతే విజేతగా నిలుస్తారో వారే ప్రపంచంలోని అందమైన అమ్మాయి అని చెబుతారు. అయితే ప్రపంచ సుందరిని ఎంపిక చేసేందుకు సరికొత్త విధానం ఉంది. అదే గ్రీక్ మ్యాథమ్యాటిక్స్. గ్రీకు ‘లెక్కల’ ప్రకారం సూపర్ మోడల్ బెలా హదీద్ ప్రపంచంలోకెల్లా అత్యంత అందగత్తె అని సౌందర్య నిపుణులు అభిప్రాయపడ్డారు. అందాన్ని లెక్కించడానికి వాడే ‘గోల్డెన్ రేషియో ఆఫ్ బ్యూటీ ఫై ’ప్రకారం ఈ భూమ్మీద ఉన్నవారందరిలో ఈ విక్టోరియా సూపర్ మోడలే ప్రపంచ అందగత్తె అని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. ఆమె ముఖమే అత్యుత్తమమైనదిగా నిర్ధారణ అయ్యింది. క్లాసిక్ గ్రీక్ కాలిక్యులేషన్‌ను అనుసరించి ‘గోల్డెన్ రేషియో ఆఫ్ బ్యూటీ ఫై’ ద్వారా అందానికి నిర్వచిస్తారు. ఇందుకోసం ముఖభాగాన్నికొలుస్తారు. దీని ఆధారంగా అందగత్తె ఎవరన్నదీ తేలుస్తారు. ‘గోల్డెన్ రేషియో’ లెక్కల ప్రకారం 23 ఏళ్ల బెలా ముఖాన్ని లెక్కించగా 94.35 శాతం మ్యాచ్ అయ్యింది. ఆమె తర్వాత స్థానాన్ని 92.44 మార్కులతో పాప్ సంచలనం బియాన్స్ కొట్టేసింది. 91.85 మార్కులతో హాలీవుడ్ నటి ఆంబర్ హర్డ్ మూడో స్థానంలో నిలిచారు. పాప్‌స్టార్ బియాన్స్ -
మన నమ్మకమే మన విజయం
ఈ అచ్చ తెలుగు అమ్మాయి చెన్నైలోనే కాదు, అందాల పోటీల్లోనూ ఒక సంచలనం. మిస్ సౌత్ ఇండియా.. మిస్ సూపర్ గ్లోబ్ ఇండియా అందాల పోటీల్లో అదరగొట్టి ఇప్పుడు గ్లోబల్ టైటిల్‌ని టార్గెట్‌గా పెట్టుకుంది. ‘‘అసలే మొండిదాన్ని.. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోను’’ అంటోంది అక్షర. కుటుంబ నేపథ్యం నాన్న సుధాకర్ రెడ్డి. అమ్మ గౌరి. చెన్నైలో స్థిరపడిన కుటుంబం. నన్ను ఇంట్లో ముద్దుగా గుగ్గుపాప అని పిలుస్తారు. చిన్నప్పటి నుంచే బ్యూటీ కాంటెస్ట్‌లపై ఎక్కువ ఆసక్తి ఉండేది. 2011లో మిస్ సౌత్ ఇండియా కిరీటాన్ని గెల్చుకున్నాను. 2016లో మిస్ అమరావతి పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించా. మిస్ సూపర్ గ్లోబ్ ఇండియా 2019 పోటీల్లో విజేతగా నిలిచా. ఈ టైటిల్‌కు 22 రాష్ట్రాలకు చెందిన 240 మంది పోటీపడ్డారు. మిస్ సూపర్ గ్లోబ్ ఇండియా తర్వాత దుబాయ్‌లో జరిగే మిస్ సూపర్ వరల్డ్ గ్లోబ్ పోటీలకు భారత్ తరఫున సిద్ధమౌతున్నా. అక్టోబర్‌లో జరిగే ఈ పోటీలలో 45 దేశాలకు చెందిన యువతులు పాల్గొంటారు. భారత్ తరఫున ఇంటర్నేషనల్ బ్యూటీ కాంటెస్ట్‌లో పాల్గొనాలన్నది నా కల. మిస్ సూపర్ వరల్డ్ గ్లోబ్ ద్వారా అది నెరవేరుతుండటం సంతోషంగా ఉంది. ప్రపంచ అందాల పోటీల్లో భారత ప్రతిష్టను మరింత పెంచాలన్నదే నా లక్ష్యం. దుబాయ్‌లో జరిగే పోటీల కోసం అందానికి మరిన్ని మెరుగులద్దుకోవడంతో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్పై దృష్టి సారించా. మిస్ సూపర్ వరల్డ్ గ్లోబ్ పోటీలో పాల్గొనే మిగతా కంటెస్టెంట్లను వెనక్కినెట్టి టైటిల్ తీసుకువస్తానన్న నమ్మకం నాకుంది. జీరోసైజు వద్దేవద్దు ఫ్యాషన్ రంగంపై మోజుతో వచ్చే యువతకు నాదొకటే సలహా. మోడల్ కావాలనే ఆశతో డైటింగ్ అంటూ ఎక్సర్ సైజులతో జీరోసైజ్ కోసం ప్రయత్నిస్తారు. అవన్నీ అవసరం లేదు. మీ శరీరాకృతిపై మీ కంట్రోల్ ఉంటే చాలు. మరీ చబ్బీగా కాకుండా హెల్దీగా ఉంటే చాలు. అపనమ్మకాన్ని వదిలేయండి. మనలోని ప్లస్‌లు మైనస్‌లు బేరీజు వేసుకుని మన నుండి నెగిటివ్ థాట్స్ తీసేస్తే చాలు.. ఏ పోటీలోనైనా విజయం సాధ్యమే. నేను అలాగే ఉంటా. మీపై మీ నమ్మకమే విజయానికి చేరువ చేస్తుంది. నా రోల్ మోడల్ దివంగత ముఖ్యమంత్రి జయలలిత. ఆమె స్ఫూర్తితో ముందుకు సాగటం నాపై నాకు బలమైన నమ్మకం ఏర్పడేలా చేసింది. మిస్ ఇండియా సౌత్ కు ముందు తమిళ్లో ఓ చానెల్‌కు చేసిన ‘విల్లా టు విలేజ్’ అనే కార్యక్రమం.. నేను ఏదైనా సాధించగలను అనే ఆత్మవిశ్వాసానికి దోహదపడింది. అంతేకాదు.. ఆ కార్యక్రమం ద్వారా ఎన్నో ప్రశంసలు అందుకున్నాను. ఇప్పుడైతే వెండితెర అవకాశాలు కూడా వస్తున్నాయి. ‘హ్యాపీ న్యూ ఇయర్’ పేరుతో తీసిన షార్ట్ ఫిలిమ్ ఇప్పుడు యూట్యూబ్‌లో మంచి ట్రెండింగ్‌లో ఉంది. తమిళంలో రెండు సినిమాలకు సంతకాలు చేశా. అవి ఇప్పుడు ప్రొడక్షన్లో ఉన్నాయి. నా అభిమాన హీరో అజిత్ కుమార్. ఆయనతో ఒక్క చిత్రంలోనైనా నటించాలనుంది. ఇంకా అవకాశాలు వస్తున్నాయి. కానీ.. ప్రపంచ పోటీలపై దృష్టి పెట్టా. టైటిల్ సాధించాక భవిష్యత్తు గురించి ఆలోచిస్తా’’ అని ముగించింది అక్షర. సంజయ్ గుండ్ల, ప్రత్యేక ప్రతినిధి, సాక్షీటీవీ, చెన్నై -
ప్రపంచ సుందరిగా ‘మిస్ మెక్సికో’
-
మిస్ వరల్డ్‌గా మెక్సికన్ యువతి
బీజింగ్ : ఈ ఏడాది ప్రపంచ సుందరిగా మెక్సికోకు చెందిన వెనెస్సా పోన్స్ డీ లియోన్(26) ఎంపికైంది. శనివారం సాయంత్రం చైనాలోని సన్యా సిటీలో జరిగిన 68వ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీల్లో న్యాయ నిర్ణేతల బృందం ఆమెను విజేతగా ప్రకటించింది. రన్నరప్‌గా థాయ్‌లాండ్‌కు చెందిన నికోలిన్ లిమ్స్నుకన్ నిలిచింది. మొత్తం 118 మంది పాల్గొన్న ఈ అందాల పోటీల్లో భారత్‌కు చెందిన అనుకృతి వ్యాస్(మిస్ ఇండియా 2018) టాప్ 30(19వ స్థానం)లో చోటు సంపాదించుకుంది. ఇక మిస్ వరల్డ్ 2017 మానుషి చిల్లర్ తన వారసురాలు వెనెస్సాకు కిరీటం తొడిగింది. కాగా మెక్సికోకు చెందిన వెనెస్సా ఇంటర్నేషనల్ బిజినెస్‌లో డిగ్రీ పూర్తి చేసి.. ప్రస్తుతం మోడల్‌గా రాణిస్తోంది. పలు సామాజిక కార్యక్రమాల్లో భాగమవుతూ మానవతావాదిగా గుర్తింపు తెచ్చుకుంది. View this post on Instagram Miss World | 2018 WE HAVE A NEW MISS WORLD !! THE 68TH MISS WORLD TITLE GOES TO: Mexico Vanessa Ponce de Leon Miss World | 2018 | FIRST RUNNER UP Thailand . . CONGRATULATIONS !! . #missworld #mw2018 #mwo #mw2018sanya #mw2018china #missmundo . A post shared by Miss World (@missworld) on Dec 8, 2018 at 6:02am PST -
విశ్వ సుందరి కిరీటమే లక్ష్యం
మిస్ ఇండియా అనుకృతి వాస్ సొంత రాష్ట్రంలో అడుగుపెట్టారు. మిస్ ఇండియా కిరీటంతో స్వగ్రామం చేరుకున్న ఆమెకు ఆప్తులు, అభిమానులు బ్రహ్మరథం పట్టారు. అనుకృతి వాస్ అందరితోనూ ఆనంద క్షణాల్ని పంచుకున్నారు. సాక్షి, చెన్నై : మిస్ ఇండియాగా ఎంపికైన అనుకృతి వాస్ తమిళనాడుకు చెందిన వారే. తిరుచ్చి కోట్టూరు సరస్వతి నగర్లో నివాసం ఉంటున్నారు. ఈ ప్రాంతానికి చెందిన ప్రశాంత్, షెలినా దంపతుల కుమార్తె ఈ అనుకృతి వాస్. ఈమెకు ఇంజినీరింగ్ చదువుతున్న సోదరుడు గౌతమ్ కూడా ఉన్నారు. అనుకృతి వాస్కు నాలుగేళ్ల వయస్సు ఉన్నప్పుడు ఆమె తండ్రి కుటుంబాన్ని వీడి ఎక్కడికో వెళ్లిపోయారు. దీంతో తల్లి షెలినా సంరక్షణలో పెరిగారు. బాల్యం, ప్రాథమిక, మాధ్యమిక విద్యా భ్యాషం అంతా తిరుచ్చిలో సాగింది. ఉన్నత చదువు చెన్నై లయోల కళాశాలలో బీఏ –ఫ్రెంచ్ చదువుతున్నారు. తమ బిడ్డ మిస్ ఇండియాగా ఎంపిక కావడంతో ఆ కుటుంబం ఆనందానికి అవధులు లేవు. ఆప్తులు, సరస్వతి నగర్ వాసులే కాదు, సహచర విద్యార్థినులు, స్నేహితులు అను రాకకోసం ఎదురు చూశారు. అయితే, శనివారం స్వస్థలానికి ఆమె వస్తున్న సమాచారాన్ని అత్యంత రహస్యంగా ఉంచారు. ఉదయాన్నే సరస్వతి నగర్‌కు చేరుకున్న అనుకృతి వాస్కు కుటుంబీకులు, బంధువులు, ఆప్తులు, స్నేహితులు ఆహ్వానం పలికారు. మిత్రులతో కలిసి స్వీట్లు పంచుకుంటూ అను ఆనందాన్ని పంచుకున్నారు. చెన్నైలోనూ.. తిరుచ్చిలో కుటుంబీకులు, ఆప్తులతో ఆనందాన్ని పంచుకునేందుకు అను వచ్చిన సమాచారంతో అభిమానులు పోటెత్తారు. సరస్వతి నగర్ పరిసర వాసులు, తిరుచ్చిలోనూ పలు సంస్థలు, యువజనులు తరలివచ్చి ఆమెను అభినందించారు. అక్కడి నుంచి అనుకృతి వాస్ సాయంత్రం చెన్నైకి చేరుకున్నారు. ఇక్కడి ఓ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమెను పలు సంస్థలు సత్కరించి, అభినందించాయి. కాగా, తల్లి సంరక్షణలో పెరిగినా, తన వంతుగా సామాజిక సేవను సైతం అనుకృతి వాస్ సాగిస్తుండడం విశేషం. హిజ్రాలకు విద్యను బోధిస్తున్నారు. అగ్ని అనే ప్రాజెక్ట్ ద్వారా అందరికీ విద్య లభించాలన్న సంకల్పంతో ప్రత్యేక కార్యక్రమాన్ని సాగిస్తున్నారు. చిన్న అనాథాశ్రమాన్ని సైతం నిర్వహిస్తున్న అనుకృతి వాస్‌ను ప్రముఖులు పొగడ్తలతో, ప్రశంసలతో ముంచెత్తారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ, విశ్వ సుందరి కిరీటం లక్ష్యం అని ఆకాంక్షను వ్యక్తం చేశారు. విశ్వ సుందరి కిరీటం లక్ష్యం విశ్వ సుందరి 2018 పోటీలకు భారత్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న అనుకృతి తన సామాజిక సేవను, తన లక్ష్యాన్ని మీడియా ముందు ఉంచారు. 30 మంది పిల్లలతో తాను చిన్న అనాథాశ్రమాన్ని నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. సమాజంలో అందరికీ విద్య దక్కాలని, స్వయం ప్రతిభతో ప్రతి ఒక్కరూ జీవించాలన్నారు. ఇందులో భాగంగా ముప్ఫై మంది హిజ్రాలకు తన వంతు సాయాన్ని అందిస్తున్నట్టు వివరించారు. సమాజానికి తన వంతు సహకారం అందించే రీతిలో బ్యూటీ విత్ ఏ పర్పస్ ప్రాజెక్టు ద్వారా కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పళని స్వామిని కలవనున్నట్టు పేర్కొన్నారు. ఇక, తన విజయానికి కారణం తల్లి అని ఆనందాన్ని వ్యక్తంచేశారు. ఆమె ఇచ్చిన ప్రోత్సాహం అంతా ఇంతా కాదు అని, తనను సూపర్ ఉమెన్‌గా ఆమె భావించే వారు అని తెలిపారు. మిస్ వరల్డ్ కిరీటాన్ని కైవసం చేసుకునే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. మహిళలు ప్రతికూల దృక్పథాన్ని వీడి అనుకూల దృక్పథాన్ని అలవరచుకోవాలని సూచించారు. మహిళలు తలచుకుంటే సాధించలేనిదంటూ ఏమీ లేదు అని, అన్నింటా జయ కేతనం ఎగుర వేయగలరని వ్యాఖ్యానించారు. కృషి, పట్టుదల, ఆత్మ స్తైర్యంతో లక్ష్య సాధనపై దృష్టిని సారించిన పక్షంలో విజయం తప్పకుండా వరిస్తుందన్నారు. అనుకృతి వాస్ ఆదివారం నగరంలో నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. -
మిస్ వరల్డ్ కిరీటమే నా లక్ష్యం
సాక్షి, విజయవాడ : మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలవడమే తన ముందున్న లక్ష్యమని మిస్ ఇండియా-2018 అనుకృతి వాస్ తెలిపారు. సాక్షి టీవీకి ఆమె ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. మొదట్లో అందాల పోటీలకు వెళ్లొద్దన్ని అడ్డుకున్నవారే ఇప్పుడు తనను అభినందిస్తున్నారని తెలిపారు. తన బలం అమ్మేనని, తన విజయం క్రెడిట్ ఆమెకే దక్కుతుందని అన్నారు. ‘అమ్మాయిలు కలలు కనాలి. వాటిని సాధించాలి’ అని సూచించారు. భవిష్యత్ ప్రణాళికల గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేనని పేర్కొన్నారు. -
మిస్ ఇండియా-2018 అనుకృతి వాస్
-
ప్రపంచసుందరివి కావాలి
భువనేశ్వర్: అర్పిత బెహరా ప్రపంచ సుందరి కావాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అభినందించారు. సంబల్పూర్ సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్న అర్పిత బెహరా లిటిల్ మిస్ గెలాక్సీ –2018 పురస్కారం సాధించింది. ఈ పోటీలు బల్గేరియాలో ఇటీవల ముగిశాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆమెను ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు. 12 నుంచి 14 ఏళ్లలోపు వర్గంలో ఆమె ప్రదర్శించిన అద్భుత ప్రదర్శనతో ప్రతిష్టాత్మక టైటిల్ సాధించడంపట్ల నవీన్ పట్నాయక్ హర్షం వ్యక్తం చేశారు. 2012లో మిస్ సంబల్పూర్గా మిస్ సంబల్పూర్ టైటిల్‌ను అర్పిత బెహరా 2012లో గెలుచుకుంది. ఆ ప్రేరణతో ఇంత వరకు ఎదిగింది. భవిష్యత్తులో ఆమె మిస్ ఇండియా, మిస్ యూనివర్స్‌గా నిలవాలని ఆకాంక్షిస్తున్నట్లు అర్పిత బెహరా తెలిపింది. -
ప్రథమ మహిళ..
ఒకప్పుడు గడప దాటాలంటే ఆడవాళ్లకు ఎన్నో ఆంక్షలు. ఎన్నెన్నో కట్టుబాట్లు. ఆడపిల్ల అంటే వంటింటి కుందేలు అనే భావన. పరిస్థితి మారింది. నేడు ప్రతీ రంగంలోనూ మహిళలు రాణిస్తున్నారు. కాలానుగుణంగా అనేక సవాళ్లు ఎదుర్కొంటూనే... తాము ఎవరి కంటే తక్కువ కాదని నిరూపిస్తున్నారు. విద్య, వైద్య, న్యాయ, శాస్త్ర, సాంకేతిక రంగాలు... ఇలా ఒకటేమిటి అన్ని రంగాల్లో తామేంటో నిరూపిస్తున్నారు. ఆంక్షలు అణిచివేతలను ఎదుర్కొని చరిత్ర సృష్టించిన మొదటి మహిళామణులు వీరు... చంద్రముఖి బసు, కదాంబిని గంగూలీ బ్రిటీష్ సంస్థానంలోని మొట్టమొదటి మహిళా గ్రాడ్యుయేట్లుగా చంద్రముఖి బసు, కదాంబిని గంగూలీ చరిత్రలో నిలిచారు. చంద్రముఖి కలకత్తా యూనివర్సిటీ నుంచి ఆర్ట్స్ విభాగంలో 1883లో పట్టా పొందారు. అదే ఏడాది కదాంబినీ కలకత్తా మెడికల్ కాలేజీ నుంచి యూరోపియన్ మెడిసిన్‌లో పట్టా పొందారు. 1886లో పాశ్చాత్య వైద్యంలో పట్టా పొందిన మహిళా డాక్టర్‌గా, ఆనందీ గోపాల్ జోషీ సరసన నిలిచారు. చంద్రముఖి బసు బేతూన్ కాలేజీలో లెక్చరర్‌గా కెరీర్ ప్రారంభించి, అదే కాలేజీకి ప్రిన్సిపల్ అయ్యారు. దక్షిణాసియాలో అండర్ గ్రాడ్యుయేట్ కాలేజీ స్థాపించిన మొదటి మహిళగా చరిత్రకెక్కారు. కామినీ రాయ్ బెంగాలీ రచయిత్రిగా, సామాజిక కార్యకర్తగా, స్త్రీవాదిగా సుపరిచితమైన కామినీ రాయ్ భారత్‌లోనే మొదటి ఆనర్స్ పట్టా పొందిన మహిళ. సాహిత్య రంగంలో ఆమె కృషికి మహాశ్వేత, పౌరంకీ, జిబాన్, పుండరీక్, ద్వీప్ ఔర్ ధూప్, నిర్మాల్య వంటి రచనలు నిదర్శనాలు. కర్నాలియా సోరబ్జీ కర్నాలియా భారత్‌లో మొదటి న్యాయవాదిగా, ప్రతిష్టాత్మక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో న్యాయ విద్యనభ్యసించిన మొట్టమెదటి మహిళగా గుర్తింపు పొందారు. సామాజిక కార్యకర్తగా, రచయితగా భిన్న పార్శ్వాలు కలిగిన వ్యక్తి. విశ్వ విద్యాలయ మహిళా సమాఖ్య, భారత మహిళా సమాఖ్య బెంగాల్ శాఖ, బెంగాల్ లీగ్ ఆఫ్ సోషల్ సర్వీసెస్ ఫర్ వుమెన్ వంటి సంస్థలతో కలిసి పలు సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. ఆమె చేసిన ప్రజాసేవకు గుర్తింపుగా అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం 1909లో ‘ఖైజర్-ఎ-హింద్’ అవార్డుతో సత్కరించింది. హొమి వైర్‌వాలా భారత్‌లో మొదటి మహిళా ఫోటో జర్నలిస్టు. 1930ల్లో కెరీర్ ప్రారంభించిన హొమి ముంబై చేరుకున్న తర్వాత తను తీసిన ఫొటోల ద్వారా దేశమంతటికీ సుపరిచితురాలయ్యారు. ఢిల్లీకి వెళ్లి గాంధీజీ, ఇందిరా గాంధీ, నెహ్రూ వంటి పలు జాతీయ,రాజకీయ నాయకులతో పనిచేశారు. 1970లో రిటైర్ అయిన తర్వాత అనామక జీవితం గడిపారు. ఆమె సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2011లో దేశంలో రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ ప్రకటించింది . ఆసిమా ఛటర్జీ సైన్స్ రంగంలో డాక్టరేట్ సాధించిన మొదటి భారతీయ మహిళ. పైటోమెడిసిన్, ఆర్గానిక్ కెమిస్ట్రీలో ప్రవీణురాలు. మూర్చ నిరోధక, మలేరియా మందులు అభివృద్ధి చేశారు. కలకత్తా యూనివర్సిటీ నుంచి కెమిస్ట్రీ విభాగంలో ప్రతిష్టాత్మక ‘ఖైరా ప్రొఫెసర్షిప్’ పొందారు. ఆమె సేవలకు గుర్తింపుగా కలకత్తా యూనివర్సిటీ వివిధ విభాగాల్లో ప్రత్యేక హోదా పొందారు. 1960లో జాతీయ సైన్స్ అకాడమీ ఫెలోషిఫ్‌కు ఎంపికయ్యారు. 1961లో రసాయనిక శాస్త్రంలో చేసిన కృషికి ‘శాంతి స్వరూప్ భట్నాగర్’ అవార్డు పొందారు. బచేంద్రీ పాల్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ. 1984లో పద్మ శ్రీ పురస్కారం అందుకున్నారు. 1985లో ఇండో- నేపాలీ మహిళలతో కలిసి ఎవరెస్ట్ సాహస యాత్ర చేపట్టి, 7 ప్రపంచ రికార్డులు సృష్టించారు. భారత మహిళా సాహస యాత్రికులకు మార్గదర్శకురాలిగా నిలిచారు. హరిద్వార్ నుంచి కలకత్తా వరకు 2,500 కి.మీ. మేర గంగా నదిలో యాత్ర సాగించిన రాఫ్టింగ్ బృందానికి నాయకత్వం వహించారు. కల్పనా చావ్లా అంతరిక్షంలో అడుగుపెట్టిన మొదటి ఇండో- అమెరికన్ వ్యోమగామిగా చరిత్రలో నిలిచారు. 1995లో నాసా ఆస్ట్రోనాట్ కార్‌్ప్స బృందంలో చేరి, 252సార్లు భూమిని చుట్టి సుమారు 10.4 మిలియన్ కి.మీ. దూరం ప్రయాణించారు. అంతరిక్ష నౌక ‘కొలంబియా’లో చంద్రగ్రహ యాత్రకు వెళ్లిన బృందంలో ఒకరైన కల్పనా చావ్లాతో సహా ఆరుగురు వ్యోమగాములు మరణించారు. మరణానంతరం కాంగ్రెషనల్ స్సేస్ మెడల్, నాసా స్పేస్ ఫ్లైట్ మెడల్, నాసా సర్వీస్ మెడల్ పొందారు. ఆనందిబాయి గోపాలరావు జోషి నేటికీ ఆడపిల్లకు చదువెందుకనుకునే సమాజం ఇది....అలాంటిది 18వ శతాబ్దంలోనే వైద్య విద్యనభ్యసించి దేశంలోనే తొలి మహిళా వైద్యురాలుగా గుర్తింపు పొందారు. అంతేకాదు పాశ్చాత్య వైద్యశాస్త్రంలో శిక్షణ పొందిన తొలి మహిళ, అమెరికా వెళ్లిన మొట్టమొదటి భారతీయ స్త్రీ కూడా ఆనందిబాయి గోపాలరావు జోషినే. శీలా దవ్రే ఆటో డ్రైవర్ అంటే ఇప్పటికి మనకు గుర్తుకు వచ్చేది మగవారే....అలాంటి పురుషాధిక్య రంగంలోకి ప్రవేశించి వారికి ధీటుగా నిలదోక్కుకున్నారు శీలా దవ్రే. పూనాలో జన్మించిన దవ్రే 1988 నుంచి ఆటో నడపడం ప్రారంభించారు. ప్రస్తుతం ఒక అకాడమీని స్థాపించి ఆసక్తి ఉన్న మహిళలకు ఆటో నడపడంలో శిక్షణ ఇస్తున్నారు. రోషిణి శర్మ దేశంలో తొలి మహిళా బైక్ రైడర్. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ బైక్ పై ప్రయాణించారు. అరుణిమా సిన్హా జాతీయ స్థాయి వాలీబాల్ ప్లేయర్ గా...ఎన్నో విజయాలు సాధించిన అరుణిమాను దొంగల రూపంలో విధి వెక్కిరించింది. వారిని అడ్డుకునే క్రమంలో ఆమెను కదులుతున్న రైలులోంచి బయటకు తోసేసారు. ఈ ప్రమాదంలో ఆమె కాలును పూర్తిగా తొలగించారు. ఇటువంటి పరిస్థితుల్లోనూ ఆమె అధైర్యపడలేదు. ఇంతటితో జీవితం ముగిపోయిందని బాధపడనూలేదు. క్రీడాకారిణిగా గుర్తింపు ఆమెకు తృప్తినివ్వలేదు. ఏదో ఒకటి సాధించాలనే తపనతో ఎవరెస్టు అధిరోహించిన ప్రపంచ తొలి మహిళా వికలాంగురాలుగా చరిత్ర సృష్టించారు. రీటా ఫారియా పావెల్ ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న ఆసియా తొలి మహిళ, తొలి భారతీయురాలు కూడా. బాహ్య సౌందర్యంతో పాటు అంతః సౌందర్యానికి కూడా ప్రాధాన్యమిచ్చే పోటీలో నిలిచి గెలిచిన తొలి వైద్యురాలిగా కూడా చరిత్రకెక్కారు. ఆరతి సాహా ఇంగ్లీష్ చానల్‌ను ఈదిన తొలి ఆసియన్. 1959లో ఈ ఘనత సాధించారు. 1960లో భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఈ అవార్డు పొందిన తొలి మహిళా క్రీడాకారిణి కూడా ఆరతినే కావడం విశేషం. ఇందిరా గాంధీ భారత తొలి మహిళా ప్రధాని. తండ్రి వారసురాలిగా రాజకీయాల్లోకి ప్రవేశించి, తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకున్నారు ఇందిరా గాంధీ. సుదీర్ఘ కాలంపాటు ప్రధానిగా(1966 నుంచి 1977 వరకూ) పనిచేసి, ‘ఉక్కుమహిళ’ గా గుర్తింపు పొందారు. దేశ అత్యున్నత పురస్కారం ‘భారత రత్న’(1971) అందుకున్న తొలి మహిళగా రికార్డుకెక్కారు. 1999లో బీబీసీ వారు నిర్వహించిన సర్వేలో ‘సహస్రాబ్ది మహిళ’గా నిలిచారు. ప్రతిభా పాటిల్ మన దేశ ప్రథమ పౌరుడు అంటే రాష్ట్రపతి. ఆ పదవిని అలంకరించిన తొలి మహిళ ప్రతిభా పాటిల్. 2007 నుంచి 2012 వరకు రాష్ట్రపతిగా కొనసాగారు. 2004 నుంచి 2007 వరకు రాజస్థాన్ గవర్నర్‌గా పనిచేశారు. సుఖోయ్–30ఎమ్కేఐ యుద్ధవిమానంలో ప్రయాణించిన తొలి రాష్ట్రపతిగా కూడా గుర్తింపు పొందారు. అంజలి గుప్తా ఫిలాసఫి చదివి, ఆ విద్యతో ఏమాత్రం సంబంధంలేని త్రివిధ దళాల్లో అత్యంత ప్రమాదభరితమైన వాయుసేనలో చేరారు. భారత వాయుసేనలో ఫ్లైయింగ్ ఆఫీసర్‌గా చేరిన తొలి మహిళ. బెంగళూరులోని ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్ అండ్ టెస్టింగ్ ఎస్టాబ్లిష్మెంట్ యూనిట్లో పనిచేశారు. జస్టిస్ ఎమ్ ఫాతిమా బీబీ సుప్రీంకోర్టులో పనిచేసిన తొలి మహిళా న్యాయమూర్తి. మనదేశంలో అత్యున్నత స్థానంలో పనిచేసిన మొదటి ముస్లిం మహిళ కూడా ఈవిడే. తమిళనాడు గవర్నరుగా కూడా పనిచేశారు. సరళ థాక్రల్ అతిపిన్న వయసులో(21) విమానాలు నడిపేందుకు లైసెన్స్ పొందిన తొలి మహిళ . లైసెన్స్ పొందిన తరువాత, వెయ్యి గంటలపాటు విమానాన్ని నడిపి ‘ఏ’ లైసెన్స్ పొందిన మొదటి మహిళ. ఎయిర్ మెయిల్ పైలట్ లైసెన్స్ పొందిన మొట్టమొదటి భారతీయ మహిళగా కూడా రికార్డు సృష్టించారు. దుర్గా బెనర్జీ ఇండియన్ ఎయిర్‌లైన్స్ మొదటి మహిళా పైలట్, కెప్టెన్. ‘టొర్నాడో అ–200’ విమానాలను నడిపిన మొట్టమొదటి మహిళ కూడా ఈమెనే. హరితా కౌర్ డియోల్ ఆకాశంలో ఒంటరిగా ప్రయాణించాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. అలాంటి ధీశాలి హరితా కౌర్ డియోల్.1994 లో భారత వైమానిక దళంలో ఒంటరిగా విమానంలో ప్రయాణించిన మొట్టమొదటి మహిళా పైలెట్‌గా పేరు పొందారు. ప్రియ ఝింగాన్ పోలీసు నేపథ్యం కుటుంబంలో పుట్టి పెరిగారు . సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే కోరికతో 1993 లో భారత సైన్యంలో చేరారు. సైన్యంలో చేరిన మొట్టమొదటి మహిళా క్యాడెట్‌గా గుర్తింపు పొందారు. - ధరణి, సుష్మారెడ్డి -
గుండె కోసే మిస్ వరల్డ్
బాలీవుడ్ జీవులు ఎప్పుడూ పెద్ద వలను పట్టుకొని ఉంటారు... ఎవరు దొరుకుతారా పట్టేద్దామా అని. మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ పోటీల మీద వాళ్లు రెండు, నాలుగు, లేదంటే ఎన్ని వీలైతే అన్ని కళ్లు వేసి ఉంటారు. అక్కడ ఎవరైనా మన ఇండియన్స్ మెరిస్తే సిల్వర్ స్క్రీన్ మీద గోల్డెన్ కెరీర్ ఆఫర్ చేస్తుంటారు. గతంలో ఐశ్వర్యారాయ్, సుస్మితా సేన్, ప్రియాంకా చోప్రాలను అలాగే వాళ్లు వలేసి పట్టారు. ఇప్పుడు తాజాగా మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ కోసం నెట్ రెడీ చేస్తుంటే ఆమె మాత్రం ‘ఆ..ఆ... ఆగండాగండి’ అని చేయి అడ్డం చూపుతోంది. అద్భుతమైన అందం మానుషి సొంతం. ఆ చిర్నవ్వుకే కొన్ని కోట్ల మంది అలా పడి ఉండే అవకాశం ఉంది. బాలీవుడ్లో లెగ్ పెడితే ఇండస్ట్రీ షేక్ అవడం ఖాయం. కాని ఆమె మాత్రం ‘ముందు నా మెడిసిన్ పూర్తి చేయనివ్వండి’ అంటోంది. మానుషి కుటుంబం ఉండటం ఢిల్లీలోనే అయినా తను మాత్రం హర్యానాలోని సోనెపట్‌లో మెడిసిన్ చేస్తోంది. కార్డియాలజిస్ట్ కావడం అనేది తన కల. అంటే ఆమెను చూసి ఎంత మంది తమ గుండెను లయ తప్పించుకుంటారో అంతమంది ఆమె చేయి తగిలి గుండెను సెట్‌రైట్ చేయించుకుంటారన్న మాట. మిస్ వరల్డ్ అయితే నా సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు మేలు చేస్తాను. డాక్టర్‌గా ఉండి నా వైద్యంతో మేలు చేస్తాను అంటోంది మానుషి చిల్లర్. ఈ మాటలు ఎన్నిరోజులో చూడాలి. ఏ కరణ్ జోహారో, ఏ రణ్వీర్ సింగో పెద్ద ఆఫర్, మంచి రోల్ ఆఫర్ చేసి ఆమెను లాగకుండా ఉంటారా అనేది మిలియన్ డాలర్ల క్వశ్చన్. ఏమో... మన సురేశ్‌బాబు భారీ అడ్వాన్స్ ఇచ్చి వెంకటేశ్ పక్కన బుక్ చేయవచ్చు కూడా. కత్రీనా కైఫ్‌ను బుక్ చేయలేదూ? -
‘మిస్ వరల్డ్ చేతికి ముద్దు పెట్టి.. ఆల్ ది బెస్ట్..’
హరియణాకు చెందిన 20 ఏళ్ల ‘మిస్ ఇండియా’ మానుషి ఛిల్లర్.. మిస్ వరల్డ్ 2017 టైటిల్‌ను సాధించి భారతదేశ ఖ్యాతిని చాటి చెప్పింది. మిస్ వరల్డ్ మానుషి.. మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్‌ను విమానంలో కలిశారు. ఆమె మిస్ వరల్డ్ పోటీలకు రెడీ అవుతున్న సమయంలో వీరి కలయిక జరిగింది. ఈ బామలు ఇద్దరు కలిసి మాట్లాడుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో వారిద్దరూ మాట్లాడుకున్న తీరు అందరినీ ఆకర్షించింది. మానుషి.. ‘సుస్మితాను చూసి షాక్‌కు గురయ్యాను. ఆమె నన్ను అభిమానంతో’ పలకరించారు. అంతేకాక మానుషికి సుస్మితా సేన్ ఐడియాలిస్తూ.. ‘ మన వంతు ప్రయత్నాం మనం చేయాలి.. మిగతాది దేవుడి మీద భారం వేయాలని.. ఆల్ ది బెస్ట్’ అని చెబుతూ మానుషి చేతికి ముద్దు పెట్టిన వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. సుస్మితా సేన్ 1994 సంవత్సరంలోనే ఫెమినా మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ టైటిల్‌లను కైవసం చేసుకున్నారు. ప్రపంచ అందగత్తెలంతా సొంతం చేసుకునేందుకు ఎంతగానే పరితపించే ప్రపంచ సుందరి కిరీటం 17 ఏళ్ల అనంతరం భారత్ వశమైంది. -
‘మిస్ వరల్డ్ చేతికి ముద్దు పెట్టి.. ఆల్ ది బెస్ట్..’
-
ఆ హీరోతో నటించాలని ఉంది: మిస్ వరల్డ్
ముంబై : అందమంటే శారీరక సౌందర్యం కాదు.. మానసిక సౌందర్యమని ప్రపంచ సుందరి-2017 మానుషి ఛిల్లర్ అన్నారు. ముంబైలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర అంశాలను షేర్ చేసుకున్నారు. భారత్‌లో మహిళలందరూ ఒకే రకమైన సమస్య ఎదుర్కొంటున్నారని, స్నేహపూర్వక సమాజాన్ని వారు కోరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. 'పద్మావతి' మూవీతో వివాదంలో చిక్కుకున్నా.. వాటిని ధైర్యంగా ఎదుర్కొంటున్న నటి దీపికా పదుకొనేను చూసి ఎందరో మహిళలు ప్రేరణ పొందే అవకాశం ఉందన్నారు ఛిల్లర్. ఓ ప్రశ్నకు బదులిస్తూ.. ఇప్పటికైతే సినిమా రంగంలోకి వచ్చే ఆలోచన తనకు లేదని, అయితే బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్‌తో కలిసి నటించాలని ఉందని ప్రపంచ సుందరి తెలిపారు. ఆమీర్ చాలెంజింగ్ పాత్రలు ఎంచుకుని సమాజానికి ఏదో రూపంలో మంచి సందేహాన్ని ఇస్తారని కొనియాడారు. హీరోయిన్లలో మాజీ ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రాను అభిమానిస్తానని చెప్పారు. రుతుస్రావ సమయంలో ఆరోగ్యంపై మహిళలకు అవగాహన కల్పించడంపై చేపట్టిన ప్రాజెక్టులో కొంతమేరకు విజయం సాధించాను. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 20 గ్రామాల్లో పర్యటించిన ఆమె 5 వేల మంది మహిళలకు చికిత్స అందించారు. 'బేటీ బచావో బేటీ పడావో' కార్యక్రమంతో పాటు మహిళలకు సంబంధించిన మరికొన్ని అంశాల్లో నా శాయశక్తులా కృషి చేసేందుకు సహకరించిన హర్యానా ప్రభుత్వానికి ఈ సందర్భంగా మానుషి ఛిల్లర్ ధన్యవాదాలు తెలిపారు. హరియాణాకు చెందిన 20 ఏళ్ల ‘మిస్ ఇండియా’ మానుషి ఛిల్లర్ ఇటీవల జరిగిన పోటీల్లో మిస్ వరల్డ్ 2017 టైటిల్‌ను సాధించి భారతదేశ ఖ్యాతిని చాటిచెప్పింది. చైనాలోని సాన్యా నగరంలో నిర్వహించిన 67వ మిస్ వర్డల్‌పోటీలో 118 దేశాల నుంచి వచ్చిన సుందరాంగుల్ని తోసిరాజని ఛిల్లర్ ప్రపంచ సుందరి మకుటాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. -
చిల్లర కామెంట్లు.. ఆగ్రహజ్వాలలు
ఛండీగఢ్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ మిస్ వరల్డ్-2017 మానుషి చిల్లర్‌పై చేసిన ఓ ట్వీట్ తీవ్ర దుమారం రేపింది. బీజేపీపై విమర్శలు చేసే క్రమంలో మానుషి పేరిట ఆయన ఓ అసంబద్ధ పోస్టును చేశారు. ‘‘నోట్ల రద్దు నిర్ణయం తీసుకుని బీజేపీ ప్రభుత్వం పెద్ద తప్పు చేసింది. మన డబ్బులకు అంతర్జాతీయ స్థాయిలో ఎంత గుర్తింపు ఉందో వారికి అర్థం కావట్లేదు. కావాలంటే చూడండి మన చిల్లర(మానుషి చిల్లర్) మిస్ వరల్డ్ అయ్యింది’’ అంటూ ట్వీట్ చేశారు. అంతే ఆయన ట్వీట్‌పై హర్యానా మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి కవిత జైన్ తీవ్రంగా స్పందించారు. మానుషి హర్యానాకే కాదు.. యావత్ దేశానికి వన్నె తెచ్చారు. అలాంటి వ్యక్తిని ఉద్దేశించి ఇలాంటి ప్రేలాపనలు చేయటం థరూర్‌కి తగదు. మన ఆడబిడ్డలను ఆత్మగౌరవాన్ని ఆయన దెబ్బతీశారు. అంతేకాదు చిల్లర్ తెగను అవమానించేలా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి ఆలోచనలు ఉన్న నేతలు ఉన్నారు అంటూ కవిత, శశిథరూర్‌పై మండిపడ్డారు. ఇక ఆర్థిక మంత్రి కెప్టెన్ అభిమన్యు కూడా థరూర్ సిగ్గుచేటు వ్యాఖ్యలు చేశారని.. తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. వివాదం ముదరక ముందే శశిథరూర్ మానుషిని పొగుడుతూ మరో సందేశం ఉంచటం విశేషం. What a mistake to demonetise our currency! BJP should have realised that Indian cash dominates the globe: look, even our Chhillar has become Miss World! — Shashi Tharoor (@ShashiTharoor) November 19, 2017 What a terrific answer by this bright young woman -- a real credit to Indian values! #missworldmanushi https://t.co/0gCQxlqD5L — Shashi Tharoor (@ShashiTharoor) November 19, 2017 -
భారత్‌కు 'మిస్ వరల్డ్'
సాన్యా(చైనా): ప్రపంచ అందగత్తెలంతా సొంతం చేసుకునేందుకు ఎంతగానే పరితపించే ప్రపంచ సుందరి(మిస్ వర్డల్) కిరీటం 17 ఏళ్ల అనంతరం భారత్ వశమైంది. హరియాణాకు చెందిన 20 ఏళ్ల ‘మిస్ ఇండియా’ మానుషి ఛిల్లర్.. మిస్ వరల్డ్ 2017 టైటిల్‌ను సాధించి భారతదేశ ఖ్యాతిని చాటిచెప్పింది. చైనాలోని సాన్యా నగరంలో శనివారం రాత్రి ఎంతో అట్టహాసంగా నిర్వహించిన 67వ మిస్ వర్డల్‌పోటీలో 118 దేశాల నుంచి వచ్చిన సుందరాంగుల్ని తోసిరాజని ఛిల్లర్ ప్రపంచ సుందరి మకుటాన్ని కైవసం చేసుకుంది. ప్రపంచంలో ఏ వృత్తికి అధిక వేతనం ఇవ్వడం సముచితం అన్న ప్రశ్నకు ‘తల్లి ఉద్యోగం’ అని చెప్పి ఆమె న్యాయ నిర్ణేతల మనసుల్ని గెలుచుకుంది. 2000 సంవత్సరంలో ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్ టైటిల్ గెల్చుకున్నాక మరో భారతీయురాలు ఈ ఘనత సాధించడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం ఛిల్లర్ హరియాణాలోని సోనెపట్‌లో వైద్య విద్య రెండో సంవత్సరం చదువుతోంది. హృద్రోగ శస్త్ర చికిత్స నిపుణురాలు కావాలనుకుంటున్న ఆమె.. గ్రామీణ ప్రాంతాల్లో సేవా దృక్పథంతో పనిచేసే ఆస్పత్రుల్ని నిర్వహించడం జీవిత లక్ష్యమని మిస్ వరల్డ్ వెబ్సైట్లో పేర్కొంది. మా అమ్మే అతి పెద్ద ఆదర్శం 2016 మిస్ వరల్డ్ విజేత ప్యూర్టోరికోకు చెందిన స్టెఫానీ డెల్ కిరీటాన్ని అలంకరించగానే ఛిల్లర్ ఆనందం తట్టుకోలేక ఉబ్బితబ్బిబైంది. ఈ పోటీల్లో మొదటి రన్నరప్‌గా మిస్ ఇంగ్లాండ్ స్టెఫానీ హిల్, రెండో రన్నరప్‌గా మిస్ మెక్సికో ఆండ్రియా మెజాలు నిలిచారు. పోటీలో మొదటి నుంచి ఛిల్లర్‡ తన అందచందాలు, తెలివి తేటలతో న్యాయ నిర్ణేతల్ని ఆకట్టుకుంది. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, కెన్యా, మెక్సికో అందగత్తెలతో పాటు తుది ఐదుగురి జాబితాలో చోటు దక్కించుకుంది. ఇక న్యాయ నిర్ణేతలు వేసిన ప్రశ్నకు ఛిల్లర్ ఎంతో తెలివిగా, సమయస్ఫూర్తితో సమాధానం చెప్పింది. ప్రపంచంలో ఏ వృత్తికి అత్యధిక వేతనం ఇవ్వాలి? ఎందుకు? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘ప్రపంచంలో తల్లికే ఎక్కువ గౌరవం దక్కాలని నేను భావిస్తున్నా. ఇక వేతనం గురించి మాట్లాడినప్పుడు.. అది డబ్బు గురించే కానక్కర్లేదు. ఒకరిపై చూపే ప్రేమ, వారికిచ్చే గౌరవం కూడా కావచ్చు. నా జీవితంలో నా తల్లే అతి పెద్ద ఆదర్శం. పిల్లల కోసం తల్లిదండ్రులు ఎంతో త్యాగం చేస్తారు. అందుకే తల్లి ఉద్యోగానికే ఎక్కువ వేతనం దక్కాలని నేను భావిస్తున్నా’ అని ఛిల్లర్ చెప్పగానే మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్న ప్రాంగణం చప్పట్లతో మార్మోగిపోయింది. పోటీ అనంతరం 2017 కిరీటాన్ని మానుషి ఛిల్లర్ గెలుచుకుందని మిస్ వరల్డ్ పోటీల కమిటీ అధికారిక ఫేస్బుక్, ట్వీటర్ పేజీల్లో వెల్లడించింది. ‘2017 మిస్ వరల్డ్ విజేత ఛిల్లర్’ అంటూ ట్వీటర్లో పోస్టుచేసింది. బ్యూటీ విత్ పర్పస్ విభాగంలోనూ మిస్ వర్డల్ – 2017 పోటీల్లో టాప్ మోడల్, పీపుల్స్ చాయిస్, మల్టీమీడియా విభాగాల్లో ఛిల్లర్‡ సెమిఫైనల్‌కు చేరారు. అలాగే ‘బ్యూటీ విత్ పర్పస్’ విభాగంలో మరొకరితో కలిసి సంయుక్త విజేతగా నిలిచారు. బ్యూటీ విత్ పర్పస్ కోసం ఛిల్లర్ ఎంచుకున్న ప్రాజెక్టు ‘శక్తి’. రుతుస్రావ సమయంలో ఆరోగ్యంపై మహిళలకు అవగాహన కల్పించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 20 గ్రామాల్లో పర్యటించిన ఆమె 5 వేల మంది మహిళలకు చికిత్స అందించారు. రీటా ఫారియా నుంచి ఛిల్లర్ వరకూ మానుషి ఛిల్లర్ సాధించిన కిరీటంతో భారత్ ఖాతాలో ఆరు మిస్ వరల్డ్ టైటిల్స్ చేరాయి. మొదటిసారి 1966లో రీటా ఫారియా మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకుని భారత్‌లోని అందగత్తెల సొగసును ప్రపంచానికి చాటిచెప్పారు. 1994లో ఐశ్వర్య రాయ్, 1997లో డయానా హేడన్, 1999లో యుక్తా ముఖీ, 2000లో ప్రియాంకా చోప్రాలు ప్రపంచ సుందరులుగా నిలిచారు. మిస్ వరల్డ్ గెలుచుకున్నాక రీటా ఫారియా వైద్య వృత్తిని ఎంచుకున్నారు. ఇక ఐశ్వర్య బాలీవుడ్ నటిగా కొనసాగారు. డయానా, యుక్తా ముఖీలు బాలీవుడ్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నా విజయాలు దక్కలేదు. ప్రియాంకా చోప్రాకు మొదట్లో సినిమా విజయాలు వెక్కిరించినా.. ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోను ఆమె రాణిస్తున్నారు. భారత్‌కు రెండు సార్లు ‘మిస్ యూనివర్స్’ కిరీటం దక్కింది. 1994లో సుస్మితా సేన్, 2000లో లారాదత్తాలు మిస్ యూనివర్స్‌లుగా నిలిచారు. ప్రపంచంలో భారత్, వెనెజులాలు మాత్రమే ఆరేసి మిస్ వరల్డ్ టైటిల్స్ గెలుచుకున్నాయి. రాజారెడ్డి, రాధారెడ్డిల వద్ద కూచిపూడి శిక్షణ చిన్నప్పటి నుంచి మానుషి ఛిల్లర్‌కు చదువుతో పాటు నాట్యం, చిత్రలేఖనం, ఆటల్లో కూడా అభిరుచి ఉంది. 1997, మే 14న హరియాణాలో జన్మించిన ఆమె పాఠశాల విద్యాభ్యాసం ఢిల్లీలోని సెయింట్ థామస్ స్కూలులో సాగగా, ప్రస్తుతం సోనేపట్‌లోని భగత్ ఫూల్ సింగ్ ప్రభుత్వ మహిళా వైద్య కళాశాలలో వైద్య విద్య అభ్యసిస్తోంది. ఛిల్లర్ తండ్రి డాక్టర్ మిత్రా బసు ఛిల్లర్ డీఆర్డీఓలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. తల్లి డాక్టర్ నీలమ్ ఛిల్లర్‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్, అండ్ అల్లైడ్ సెన్సెన్స్’లో న్యూరో కెమిస్ట్రీ విభాగం హెడ్‌గా ఉన్నారు. ప్రముఖ నాట్యాచార్యులు రాజారెడ్డి, రాధారెడ్డి, కౌసల్యా రెడ్డిల వద్ద మానుషి కూచిపూడి నృత్యం అభ్యసించారు. పారాగ్లైడింగ్, బంగీ జంపింగ్, స్నోర్కెల్లింగ్, స్కూబా డైవింగ్ల్లో చురుగ్గా పాల్గొనడమంటే ఛిల్లర్‌కు ఎంతో ఇష్టం. స్కెచింగ్, చిత్రలేఖనంలో కూడా ప్రవేశముంది. అలాగే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి నటనలో మెలకువలు నేర్చుకున్నారు. ముంబైలో జరిగిన 54వ 2017 –మిస్ ఇండియా పోటీల్లో హరియాణా తరఫున ఆమె ప్రాతినిధ్యం వహించారు. ఈ పోటీలో మిస్ ఇండియాగానే కాకుండా మిస్ ఫొటోజెనిక్‌గా కూడా నిలిచారు. -
మనూషి చిల్లర్‌కు మిస్ వరల్డ్ కిరీటం
-
భారత్‌కు మిస్ వరల్డ్ కిరీటం
బీజింగ్: భారత్‌కు మిస్ వరల్డ్ కిరీటం దక్కింది. దాదాపు 17 ఏళ్ల తర్వాత మిస్ ఇండియా మనూషి చిల్లర్ మిస్ వరల్డ్ కిరీటం అందుకున్నారు. చైనాలో జరిగిన 2017 మిస్ వరల్డ్ పోటీల్లో మొత్తం 118 మంది సుందరీమణులు పోటీపడ్డారు. ప్రేక్షకులు, న్యాయనిర్ణేతల ఓట్లను కలుపుకొని తొలుత టాప్-40 మందిని ఎంపిక చేశారు. అనంతరం టాప్-25, టాప్-8, చివరకు టాప్-3 రౌండ్లు నిర్వహించారు. టాప్-3లో మిస్ ఇండియా, మిస్ మెక్సికో, మిస్ ఇంగ్లండ్‌లు పోటీపడ్డారు. చివరి రౌండ్లో ప్రపంచంలో ఏ వృత్తితో ఎక్కువగా సంపాదించవచ్చన్న న్యాయనిర్ణేతల ప్రశ్నకు.. మిస్ ఇండియా మనూషి చిల్లర్ ప్రపంచంలో అన్నిటికన్నా అమ్మదనమే గొప్పదని తెలిపారు. ఇది డబ్బుల వ్యవహారం కాదు. ప్రేమకు, గౌరవానికి ప్రతిరూపం అని పేర్కొన్నారు. అనంతరం విజేతగా మనూషి చిల్లర్‌ను ప్రకటించడంతో 2016 మిస్ వరల్డ్ నుంచి కిరీటం అందుకున్నారు. రెండోస్థానంలో మిస్ మెక్సికో, మూడో స్థానంలో మిస్ ఇంగ్లండ్‌లు నిలిచారు. 17 ఏళ్ల క్రితం బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా 2000 మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకున్నారు. -
మైమరిపించిన ముద్దుగుమ్మలు..
-
నటరాజన్‌తో ప్రపంచ సుందరి
నట్టి అలియాస్ నటరాజన్ సరసన ప్రపంచ సుందరి నటించనుంది. చతురంగం చిత్రంతో సక్సెస్ఫుల్ హీరోగా పేరుతెచ్చుకున్న నటరాజన్ ప్రముఖ ఛాయాగ్రాహకుడు కూడా. పలు హిందీ చిత్రాలకు పనిచేసిన ఈయన ఇటీవల విజయ్ నటించిన పులి చిత్రానికి ఛాయాగ్రహణం నెరిపారన్నది గమనార్హం. నటరాజన్ తాజాగా మళ్లీ కథానాయకుడిగా తెరపైకి రావడానికి సిద్ధం అవుతున్నారు. ఈయన నటించనున్న చిత్రానికి బొంగు అనే పేరును నిర్ణయించారు. ఇందులో ఆయనకు జంటగా 2014లో ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకున్న రుషీసింగ్ నటించనున్నారు. ఇతర పాత్రల్లో అతుల్కుల్కర్ణి, ముండాసిపట్టి రాందాస్, రాజన్, పాండినాడు చిత్ర విలన్ శరత్లోహిత్ కౌర్, మనీషా శ్రీ, అర్జునన్ తదితరులు నటించనున్నారు. ఈ చిత్రానికి నవ దర్శకుడు తాజ్ కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహించనున్నారు. ఈయన కళా దర్శకుడు శిబుసిరిల్ శిష్యుడన్నది గమనార్హం. ఇది రోడ్డు ప్రయాణాల్లో ఎలాంటి గోల్మాల్లు జరుగుతాయనేది తెరపై ఆవిష్కరించే కథా చిత్రమని దర్శకుడు తెలిపారు. ప్రేమ, హాస్యం, యాక్షన్ తదితర కమర్షియల్ అంశాలతో కూడిన చిత్రంగా బొంగు చిత్రం ఉంటుందని అన్నారు. శ్రీకాంత్‌దేవా సంగీతాన్ని అందించనున్న ఈ చిత్రాన్ని రఘుకుమార్ నిర్మించనున్నారు. చిత్ర షూటింగ్‌ను రజనీకాంత్ పుట్టిన రోజైన డిసెంబర్ 12 న ప్రారంభించనున్నట్లు యూనిట్ వర్గాలు వెల్లడించాయి. చెన్నై, ముంబై, మధురై,దిండిగల్ ప్రాంతాల్లో చిత్రీకరణ నిర్వహించనున్నట్లు తెలిపారు. -
బికినీయే కారణం కాదు!
‘మిస్ వరల్డ్’ కిరీటం సొంతం చేసుకోవడం అంత సులువు కాదు. చక్కటి శరీర కొలతలతో పాటు సమయ స్ఫూర్తి, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ... ఇలా ఎన్నో విషయాల్లో మార్కులు సంపాదిస్తేనే ఆ బిరుదు సొంతం అవుతుంది. అలాగే, ఈ పోటీల్లో భాగంగా ‘బికినీ రౌండ్’ ఒకటుంటుంది. ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ పోటీలో నిలిచే భామలు ఈత దుస్తులు ధరించాల్సిందే. అయితే, ఇక ఈత దుస్తులు ధరించాల్సిన అవసరంలేదు. ‘మిస్ వరల్డ్’ పోటీలకు అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న జూలియా మోర్లీ ఈ విషయాన్ని ప్రకటించారు. ఈత దుస్తుల వల్ల అమ్మాయికి ఒరిగేదేమీ లేదనీ, ఆ మాటకొస్తే దానివల్ల ఎవరికీ ఏమీ ఒరగదని ఈ సందర్భంగా జూలియా పేర్కొన్నారు. దీని గురించి ఐశ్వర్యా రాయ్ స్పందిస్తూ -‘‘1994లో నేను ప్రపంచ సుందరి కిరీటం గెల్చుకున్నాను. వాస్తవానికి ఆ సమయంలో నాతో పాటు పోటీలో నిలిచిన 87 మంది అమ్మాయిలతో పోలిస్తే నా శరీరాకృతి ఈత దుస్తులకు అనువుగా ఉండేది కాదు. కానీ, స్విమ్ సూట్ ధరించాలనే నిబంధన ఉండటంతో ఏమీ చేయలేకపోయాను. అయినప్పటికీ నేను ప్రపంచ సుందరి కిరీటం సాధించగలిగాను. ఈ కిరీటాన్ని ఎవరికి ఇవ్వాలో నిర్ణయించేది బికినీ రౌండే అని చాలామంది భావిస్తారు. కానీ, అదొక్కటే కాదు. ఆత్మవిశ్వాసం, ప్రవర్తన.. ఇలా చాలా విషయాలు పరిగణనలోకి తీసుకుంటారు. ఏదేమైనా బికినీ రౌండ్ తీసేసినందుకు చాలా ఆనందంగా ఉంది’’ అని చెప్పారు. -
వారితో పోలిస్తే మాది అందమే కాదు!
ప్రియాంకా చోప్రా పద్నాలుగేళ్ల క్రితమే మిస్ వరల్డ్. ఆ తర్వాత వెండితెర మీదకొచ్చి అటు తన నటనతోనూ, గ్లామర్‌తోనూ అగ్రస్థాయికెదిగారు. జాతీయ అవార్డు మొదలుకొని లెక్కలేనన్ని పురస్కారాలు గెలుచు కున్నారు. తాజాగా ఈ అందాల రాణి కీర్తి కిరీటంలోకి మరో మణి వచ్చి చేరింది. యూకే వీక్లీ న్యూస్ పేపర్, ఈస్ట్రన్ ఐ సంస్థలు కలిసి నిర్వహించిన పోటీలో ప్రపంచంలోకెల్లా ‘అత్యంత సెక్సీ ఆసియా మహిళ’గా అందగత్తెలందర్నీ వెనక్కు నెట్టి ‘నంబర్‌వన్’గా నిలిచారు ప్రియాంక. గత ఏడాది ఈ గౌరవం కత్రినా కైఫ్‌కి దక్కింది. ఈ ఏడాది ఆ గౌరవం ప్రియాంకకు దక్కింది. తాజాగా నిర్వహించిన సర్వేలో కత్రినా నాలుగో స్థానానికి పరిమితమయ్యారు. ప్రియాంక స్పందిస్తూ -‘‘‘నాకంటే శృంగార దేవత ఈ ఆసియా ఖండంలోనే లేదు’ అని అంటే.. అది నిజంగా హాస్యాస్పదమే. దేన్ని ప్రామాణికంగా తీసుకొని ఈ పురస్కారం అందిస్తారో నాకు తెలీదు. ఏది ఏమైనా నన్ను ఎన్నుకున్న కమిటీకి, గెలిపించిన అభిమానులకు కృతజ్ఞతలు. వెలుగులో లేని, రాని ఎందరో అందాల రాశులు ఈ ఖండంలో ఉన్నారు. వారితో పోలిస్తే మాది అందమే కాదు. ఈ అవార్డు వారికే అంకితం’’ అన్నారు ప్రియాంక. -
అందమే లేకపోతే మిస్ వరల్డ్ అయ్యేదానివా?
బాలీవుడ్ కథానాయికల్లో ప్రియాంక చోప్రా రూటే సెపరేటు. పదుగురిలో ఒకదాన్ని అనిపించుకోవడానికి అస్సలు ఇష్టపడరామె. అందుకు ప్రియాంక కెరీరే ఉదాహరణ. హీరోయిన్లందరూ గ్లామర్ పాత్రలవైపు పరుగులు పెడుతుంటే... ప్రియాంక మాత్రం ప్రయోగాత్మక పాత్రలు చేయడానికే ఇష్టపడతారు. బర్ఫీ, మేరీ కామ్ చిత్రాలే అందుకు నిదర్శనాలు. ముఖ్యంగా ‘మేరీ కామ్’ కోసమైతే... తనలోని సున్నితత్వాన్ని కోల్పోయారు ప్రియాంక. ప్రస్తుతం పూర్వపు అందం కోసం అహర్నిశలూ శ్రమిస్తున్నారామె. బహుశా ఆ శ్రమ భరించలేకేనేమో... ట్విటర్లో ఓ వింత మెసేజ్ పోస్ట్ చేశారు. ‘‘నేను వికృతంగా పుట్టి ఉంటే ఏ సమస్యా ఉండేది కాదు. జీవితం సాఫీగా సాగిపోయేది. అందంగా పుట్టడం వల్లే ఈ సమస్యలన్నీ. ఈ అందమే లేకపోతే... అసలు గ్లామర్ ఫీల్డ్‌లోకే వచ్చేదాన్ని కాదు కదా. ఈ తిప్పలు ఉండేవి కావు కదా. కాసేపు స్కిన్‌పై శ్రద్ధ పెట్టాలి. ఇంకాసేపు జుత్తు గురించి ఆలోచించాలి. నిజంగా చిరాగ్గా ఉంది’’ అని ట్వీట్ చేశారు ప్రియాంక. ఈ ట్వీట్‌పై బాలీవుడ్లో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘ఆ అందమే లేకపోతే నువ్వు మిస్ వరల్డ్ అయ్యేదానివా, సెలబ్రిటీ హోదా ఎంజాయ్ చేసేదానివా, కోటానుకోట్లు సంపాదించేదానివా? అంటూ చాలామంది తమ వ్యక్తిగత సామాజిక మాధ్యమాల ద్వారా ప్రియాంక ట్వీట్‌పై కామెంట్లు విసిరారు. ఇంకొందరైతే.. తాను అందగత్తెనని ఈ ట్వీట్ ద్వారా ప్రియాంక చెప్పకనే చెప్పి, తన తెలివితేటలు ప్రదర్శించిందని కౌంటర్ ఇచ్చారు. మరి... ఈ కామెంట్లపై ప్రియాంక ఎలా స్పందిస్తారో చూడాలి. -
మిస్ వరల్డ్ తర్వాతే బాలీవుడ్..
ముంబై: ‘నాకేం కావాలో నాకు బాగా తెలుసు.. నా తదుపరి టార్గెట్ మిస్ వరల్డ్ టైటిల్‌ను గెలుచుకోవడం.. ఈ మధ్యలో బాలీవుడ్ నుంచి మంచి అవకాశాలు వచ్చినా వాటిపై దృష్టిపెట్టను..’ అని స్పష్టం చేసింది ఫెమినా మిస్ ఇండియా -2014 టైటిల్ గెలుచుకున్న జైపూర్ అందాలభామ కోయల్ రాణా. ‘నేను ప్రపంచంలోనే అత్యున్నతస్థానంలో ఉన్నానని భావిస్తున్నా. నాకు జీవితంలో ఏం కావాలనేది స్పష్టమైన అవగాహన ఉంది.. మిస్ ఇండియా కిరీటం గెలుచుకున్న తర్వాత ఇప్పుడు నా దృష్టి మొత్తం మిస్ వరల్డ్ టైటిల్‌ను సొంతం చేసుకోవడంపైనే కేంద్రీకరించా..’ అని ఆమె పేర్కొన్నారు. గత శనివారం జరిగిన 51వ ఎడిషన్ ఫెమినా మిస్ ఇండియా-2014 అందాల పోటీల్లో ఈ జైపూర్ భామ కిరీటాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా, తనకు మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ ఆదర్శమని రాణా తెలిపింది. ‘మెదడును ఉపయోగించే అందాల సుందరీమణిగా సుస్మితా సేన్‌ను చెప్పవచ్చు. ఆమె మిస్ ఇండియా, మిస్ యూనివర్స్‌గా కీర్తి గడించినా అంతకన్న ఎక్కువ సమాజ సేవ చేయడంలో ముందుంది. ఆమె జీవితాన్ని నేను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నా..’ అని కోయల్ రాణా వివరించింది. ‘నా జీవితంలో ఇంకా సుదీర్ఘ ప్రయాణం ఉంది.. చాలా విజయాలను సొంతం చేసుకోవడానికి ఇంకా కష్టపడాల్సి ఉంది..’ అని ఆమె అంది. సినిమాల్లో నటించడం గురించి ప్రశ్నిస్తే ‘ప్రస్తుతం నా దృష్టి మొత్తం మిస్ వరల్డ్ టైటిల్ పైనే ఉంది.. భవిష్యత్తులో బాలీవుడ్లో మంచి అవకాశాలు వస్తే నటిస్తానేమో.. ఇప్పుడే ఆ విషయాలు చెప్పేంత వయస్సు, అనుభవం నాకు లేవు..’ అని ముద్దుగా చెప్పింది. జైపూర్‌లో పుట్టా.. ఢిల్లీలో పెరిగానని, మిస్ ఇండియా కన్నా తనకు చదువు ఎక్కువ ఇష్టమని కోయల్ వివరించింది. మున్ముందు తాను ఇంకా చదువుకుంటానని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఢిల్లీలో డిగ్రీ చదువుతున్నానని చెప్పింది. -
మిస్ వరల్డ్ తర్వాతే బాలీవుడ్..
ముంబై: ‘నాకేం కావాలో నాకు బాగా తెలుసు.. నా తదుపరి టార్గెట్ మిస్ వరల్డ్ టైటిల్‌ను గెలుచుకోవడం.. ఈ మధ్యలో బాలీవుడ్ నుంచి మంచి అవకాశాలు వచ్చినా వాటిపై దృష్టిపెట్టను..’ అని స్పష్టం చేసింది ఫెమినా మిస్ ఇండియా -2014 టైటిల్ గెలుచుకున్న జైపూర్ అందాలభామ కోయల్ రాణా. ‘నేను ప్రపంచంలోనే అత్యున్నతస్థానంలో ఉన్నానని భావిస్తున్నా. నాకు జీవితంలో ఏం కావాలనేది స్పష్టమైన అవగాహన ఉంది.. మిస్ ఇండియా కిరీటం గెలుచుకున్న తర్వాత ఇప్పుడు నా దృష్టి మొత్తం మిస్ వరల్డ్ టైటిల్‌ను సొంతం చేసుకోవడంపైనే కేంద్రీకరించా..’ అని ఆమె పేర్కొన్నారు. గత శనివారం జరిగిన 51వ ఎడిషన్ ఫెమినా మిస్ ఇండియా-2014 అందాల పోటీల్లో ఈ జైపూర్ భామ కిరీటాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా, తనకు మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ ఆదర్శమని రాణా తెలిపింది. ‘మెదడును ఉపయోగించే అందాల సుందరీమణిగా సుస్మితా సేన్‌ను చెప్పవచ్చు. ఆమె మిస్ ఇండియా, మిస్ యూనివర్స్‌గా కీర్తి గడించినా అంతకన్న ఎక్కువ సమాజ సేవ చేయడంలో ముందుంది. ఆమె జీవితాన్ని నేను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నా..’ అని కోయల్ రాణా వివరించింది.‘నా జీవితంలో ఇంకా సుదీర్ఘ ప్రయాణం ఉంది.. చాలా విజయాలను సొంతం చేసుకోవడానికి ఇంకా కష్టపడాల్సి ఉంది..’ అని ఆమె అంది. సినిమాల్లో నటించడం గురించి ప్రశ్నిస్తే ‘ప్రస్తుతం నా దృష్టి మొత్తం మిస్ వరల్డ్ టైటిల్ పైనే ఉంది.. భవిష్యత్తులో బాలీవుడ్లో మంచి అవకాశాలు వస్తే నటిస్తానేమో.. ఇప్పుడే ఆ విషయాలు చెప్పేంత వయస్సు, అనుభవం నాకు లేవు..’ అని ముద్దుగా చెప్పింది. జైపూర్‌లో పుట్టా.. ఢిల్లీలో పెరిగానని, మిస్ ఇండియా కన్నా తనకు చదువు ఎక్కువ ఇష్టమని కోయల్ వివరించింది. మున్ముందు తాను ఇంకా చదువుకుంటానని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఢిల్లీలో డిగ్రీ చదువుతున్నానని చెప్పింది. -
మిస్ వరల్డ్ అందాల పోటిలకు ముస్లీం నిరసనకారుల సెగ!
ముస్లీం ఆందోళన, నిరసనకారుల సెగలు మిస్ వరల్డ్ పోటీ నిర్వాహకులకు గట్టిగానే తగిలాయి. దాంతో మిస్ వరల్డ్ పోటీల వేదికను మార్చాల్సిన పరిస్థితి తప్పకపోవడంతో ఇండోనేషియాలోని బాలికి తరలించినట్టు నిర్వహకులు వెల్లడించారు. మిస్ వరల్డ్ అందాల పోటీలను నిర్వహించడంపై నిరసన వ్యక్తం చేస్తూ పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు నిర్వహకుల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఆదివారం నుంచి అందాల పోటీలు బాలిలో ప్రారంభం కానున్నాయి. వివిధ విభాగాల్లో పోటీలు జకర్తా పరిసర ప్రాంతాల్లో నిర్వహించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. మిస్ వరల్డ్ ఆందాల ఫైనల్ పోటీ సెప్టెంబర్ 28 తేదిన జరుగుతుంది.