
మిస్ వరల్డ్ 2024 అందాల పోటీలకు ఇండియా వేదికైంది. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో మార్చి 9న అట్టహాసంగా ఈ వేడుకలు జరిగాయి.

జాతీయ, అంతర్జాతీయ సెలబ్రిటీలు ఈ వేదికపై ర్యాంప్‌వ్యాంక్‌తో అదరగొట్టారు.

అయితే అందాల తారలను వెనక్కు నెడుతూ హీరామండి (వెబ్ సిరీస్) టీమ్ స్టేజీపై తళుక్కుమని మెరిసింది.

మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హ, సంజీదా షైఖ్, షర్మిని సెగల్, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా.. గ్రాండ్ లెహంగాలో, కళ్లు చెదిరే ఆభరణాలతో నిండుగా ముస్తాబై స్టేజీపై ఎంతో హుందాగా నడిచారు.

వీరిని చూసి అంతా ఫిదా అయిపోయారు. అంతర్జాతీయ సెలబ్రిటీలను మన భారతీయ తారలు డామినేట్ చేశారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే చెక్ రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టినా పిస్కోవో మిస్ వరల్డ్‌గా నిలిచి కిరిటాన్ని దక్కించుకుంది.












