Miss World 2024
-
Nikita Porwal: టీవీ యాంకర్ టు మిస్ ఇండియా
మధ్యప్రదేశ్ ఉజ్జయినికి చెందిన నికిత పొర్వాల్ మిస్ ఇండియా కిరీటం దక్కించుకుంది. టీవీ యాంకర్‌గా, నటిగా కెరీర్ మొదలుపెట్టి ఒక సామాన్య కుటుంబం నుంచి ఆమె ఈ గుర్తింపు పొందింది. ‘మన జీవితానికి ఒక విలువ ఉండాలి. మనం లేకపోతే నష్టాన్ని అనుభూతి చెందాలి’ అంటుంది నికిత పొర్వాల్. అక్టోబర్ 16 (బుధవారం) ముంబైలో జరిగిన ‘ఫెమినా మిస్ ఇండియా 2024’ ఫైనల్స్‌లో నికిత పొర్వాల్ కిరీటధారిగా నిలిచింది. 27 రాష్ట్రాల నుంచి మొత్తం 30 మంది పోటీ పడితే నికిత మొదటి స్థానంలో నిలిచింది. దాద్రా నాగర్ హవేలీకి చెందిన రేఖాపాండే రెండో స్థానంలో, గుజరాత్‌కు చెందిన ఆయూషీ ఢోలాకియా మూడో స్థానంలో నిలిచింది. సంగీతా బిజిలానీ, నేహా ధూపియా తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. మరో నెల రోజులలో జరగనున్న ‘మిస్ వరల్డ్ 2024’ పోటీల్లో మన దేశం తరఫున నికిత ప్రపంచ దేశాల సుందరీమణులతో పోటీ పడనుంది. మిస్ వరల్డ్ కిరీటం కూడా దక్కించుకోవాలని ఆశిస్తోంది.తండ్రి ్రపోత్సాహంతో ...మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చెందిన నికిత హైస్కూల్ రోజుల నుంచే మోడలింగ్‌లోకి రావాలని భావించింది. ఆమె తండ్రి అశోక్ పొర్వాల్ ఇందుకు ప్రోత్సహించాడు. కూతురి ప్రతిభ గమనించి మోడలింగ్ రంగంలోకి చిన్న వయసులోనే ప్రవేశ పెట్టాడు. తల్లి రాజ్‌కుమారి కూడా వెన్నంటే ఉంటే నికితను నడిపించింది. ‘మోడల్‌గా పని చేసి మరుసటి రోజు స్కూల్‌కి వెళితే ఆ ప్రపంచం ఈ ప్రపంచం చాలా వేరేగా ఉండేవి. అడ్జస్ట్ కావడం కష్టమయ్యేది. కాని మా స్కూల్ వాళ్లు నాకు సపోర్ట్ నిలిచారు. కాలేజీలో చదువుకుంటూ ఫ్యాషన్ ప్రదర్శనలకు వెళ్లేదాన్ని. రాత్రుళ్లు మేలుకొని సిలబస్ చదవడం, రికార్డులు పూర్తి చేయడంలో నిమగ్న మయ్యేదాన్ని. ఆ హార్డ్‌వర్క్ వృథా పోలేదు’ అంటుంది నికిత.లోపలి సౌందర్యం‘అందాల పోటీలో రాణించాలంటే లోపలి సౌందర్యాన్ని బయటకు తేవాలి. ఆ సౌందర్యానికి రూపమే మన దేహం. ముందుగా ఆ సౌందర్యాన్ని నమ్మాలి. అందుకు ధ్యానం చేయడం లాంటి ఎన్నో విధానాలు అవలంబించాను. నా మాటను, నడకను రోజుల తరబడి సాధన చేశాను. ఎదుటివారు మనలో చూసేది నిజాయితీని... మనం మనలా ఉన్నామా లేదా అనే విషయాన్ని. దాన్ని పోగొట్టుకోకూడదు’ అంటుంది నికిత. నాటకాల మీద మక్కువతో థియేటర్లో పని చేసిందామె. ‘కృష్ణలీల’ అనే నాటకాన్ని స్వయంగా రాసింది కూడా!టీవీ యాంకర్‌గా...కుటుంబానికి మద్దతుగా నిలవడం కోసం టీవ యాంకర్‌గా కూడా పనిచేసింది నికిత. అలాగే సీరియల్స్‌లో, సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలు పోషించింది. తుదకు ‘మిస్ ఇండియా’ అయ్యింది. ‘ఈ గుర్తింపును ఎలా ఉపయోగిస్తారు’ అనంటే ‘యువతను మోటివేట్ చేయడానికి ఉపయోగిస్తాను. మన దేశంలోని యువతకు చాలా స్కిల్స్ ఉన్నాయి. కాని కమ్యూనికేషన్లో వెనుకబడుతున్నారు. మీ మాటే మిమ్మల్ని ముందుకు తీసుకెళుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ధ్యాస పెట్టండి అని చెబుతాను’ అంటోంది నికిత. మిస్ ఇండియా అయ్యాక సంజయ్ లీలా భన్సాలీ వంటి దర్శకుల నుంచి పిలుపు వింటోందామె. త్వరలో వెండి తెర మీద చూడొచ్చు. -
మిస్ యూనివర్స్ పోటీలు.. సౌదీ అరేబియా సంచలన నిర్ణయం
రియాద్: ఇస్లామిక్ దేశం సౌదీ అరేబియా సంలచన నిర్ణయం తీసుకుంది. దేశ చరిత్రలోనే తొలిసారిగా మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొనాలని నిర్ణయించింది. ఈ ఏడాది జరిగే మిస్ యూనివర్స్ పోటీలకు దేశం తరపున 27 ఏళ్ల సుందరి రుమీ అల్కతానీని నామినేట్ చేశారు. ఈ విషయాన్ని రుమీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. సౌదీ అరేబియా మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొనడం ఇది తొలిసారని ఆమె తన పోస్టులో పేర్కొంది. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌కు చెందిన రుమీ ఇప్పటికే మిస్ సౌదీ అరేబియా కిరీటం గెలుచుకోవడం విశేషం. దేశ ప్రస్తుత క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సాద్ హాయంలో ఈ తరహా చరిత్రాత్మక నిర్ణయాలు ఇటీవల ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇస్లామిక్ దేశం తన సంప్రదాయ ముద్రను తొలగించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇదీ చదవండి.. అమెరికాలో కూలిన బ్రిడ్జ్.. ప్రమాదమా.. ఉగ్రవాదమా..? -
నీతా అంబానీ ధరించిన ఈ నగ ధర, అసలు ఇది ఎక్కడిదో తెలుసా?!
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ వ్యాపారవేత్తగా, ఫ్యాషన్ ఐకాన్‌గా తన ప్రత్యేకతను చాటుకుంటారు. భారతీయ వారసత్వ సంపదను, అద్భుతమైన కళారీతులను ప్రదర్శించేలా చేనేత చీరలను ధరించి ఆకట్టుకోవడంలో నీతా తర్వాతే ఎవరైనా. అంతేనా కోట్ల విలువ చేసే డైమండ్ నగలు, ఖరీదైన బ్యాగులు మొదలు లిప్‌స్టిక్‌లు, చెప్పుల దాకా ప్రతీదీ ప్రత్యేకమే. తాజాగా ముంబైలో జరిగిన ఒక వేడుకలో బనారసీ చీరలో మెరిసిపోయారు. అంతేకాదు ఈ సందర్బంగా ఆమె ధరించిన అరవంకి (బాజూబాంద్) స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. దీంతో దీని ఖరీదు ఎంత అని వాకబు చేసిన నెటిజనులు ఔరా! అంటున్నారు. మార్చి 9 ముంబైలో జరిగిన 71వ మిస్ వరల్డ్ ఈవెంట్లో రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా నీతా చేసిన దాతృత్వ సేవలకు గాను 'బ్యూటీ విత్ పర్పస్ హ్యుమానిటేరియన్ అవార్డు' అందుకున్నారు. ఈ సందర్భంగా హ్యాండ్ మేడ్ జాంగ్లా డిజైన్ బనారసీ చీరలో అందరి చూపును తన వైపు తిప్పుకున్నారు నీతా. చీర మాత్రమే కాదు, ఆమె ఆభరణాలు, మరీ ముఖ్యంగా ఆర్మ్ బ్యాండ్‌పై అందరి దృష్టి పడింది. మొఘల్ చక్రవర్తి అయిన షాజహాన్ చక్రవర్తి శిరస్సుపై(తలపాగాపై) ధరించే (సర్పేచ్ లేదా కల్గీ)ని మరింత అందంగా రీ-స్టైలింగ్ చేసి మరీ ధరించారట. ఈ ఆభరణం ధర తాజా సమాచారం ప్రకారం రూ. 200 కోట్లు అని తెలుస్తోంది. టోపోఫిలియా ఇన్‌స్టా సమాచారం ప్రకారం, ఈ ఆభరణం 13.7 సెం.మీ ఎత్తు , 19.8 సెం.మీ వెడల్పుతో మేలిమి బంగారంతో తయారు చేశారు. వజ్రాలు, కెంపులు, ఇతర విలువైన రాళ్లను అందంగా పొదిగారు. మొఘల్ చక్రవర్తి షాజహాన్కి చెందిన కొన్ని ఆభరణాలను 2019లో వేలం వేసిన సందర్భంలో చివరిసారిగా దీన్ని చూసినట్టు ఇన్‌స్టా పోస్ట్ పేర్కొంది. -
Miss World 2024 Photos: అంతర్జాతీయ వేదికపై ఇండియన్ సెలబ్రిటీల డామినేషన్ (ఫోటోలు)
-
మిస్ వరల్డ్ 2024 విజేత క్రిస్టినా పిస్కోవా ఎవరు?
మిస్ వరల్డ్ 2024 అందాల పోటీల ఫైనల్స్ శనివారం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో అట్టహాసంగా జరిగాయి. ఈ పోటీల్లో చెక్‌రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టినా పిస్కోవో విజేతగా నిలిచి కిరిటాన్ని దక్కించుకుంది. దాదాపు 115 దేశాల నుంచి పోటీదారులు పాల్గొన్నారు. వీరంతా తమ అందం, ప్రతిభతో న్యాయనిర్ణేతలను ఆకట్టుకునేలా ప్రదర్శన ఇచ్చారు. ఇంతమంది అందగత్తెలను వెనక్కి నెట్టి ఫైనల్లో క్రిస్టినా పిస్కోవా కిరిటాన్ని కైవసం చేసుకుంది. పోలాండ్‌కు చెందిన మాజీ ప్రపంచ సుందరి కరోలినా బిలావ్స్క్ క్రిస్టినా పిస్కోవాకు తన కిరీటాన్ని అందించింది. ఇంతకీ ఎవరీమె అంటే.. క్రిస్టినా పిస్కోవాకి ఇంగ్లీష్, పోలిష్, స్లోవాక్, జర్మన్ తదితర భాషలపై మంచి పట్టు ఉంది. ఆమె ఎత్తు 180 సెం.మీ. చెక్ రిపబ్లిక్ నుంచి 2006 మిస్ వరల్డ్ పోటీలో గెలుపొందిన టటానా కుచరోవా తర్వాత క్రిస్టినా మళ్లీ ఈ కిరీటాన్ని దక్కించుకోవడం విశేషం. క్రిస్టినా యువత, పిల్లలు, పెద్దలు, వికలాంగులకు విద్య అందేలా ఒక ఫౌండేషన్‌ని నడుపుతోంది. అలాగే సంక్షేమ పనుల కోసం క్రిస్టినా పిస్జ్కోవా ఫౌంలడేషన్ను స్థాపించింది. ఇవిగాక టాంజానియాలో ఒక ఆంగ్ల మాధ్యమ పాఠశాలను ఏర్పాటు యువత విద్యను కొనసాగించేలా చేసింది. నిరుపేద పిల్లలకు విద్య అందేలా చేయడం వంటి పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టింది. పెద్ద మొత్తంలో దాతృత్వక కార్యక్రమాలు చేసింది. ఆమెకు కళలంటే మక్కువ. ఆ ఆసక్తితోనే ఆర్ట్ అకాడమీలో చేరి సంగీతం, వేణువు, వయోలిన్ వంటివి వాయించడం నేర్చుకుంది. View this post on Instagram A post shared by Miss World (@missworld) (చదవండి: మిస్ వరల్డ్ పోటీల్లో పింక్ సీక్విన్ గౌనుతో మెరిసిన పూజా హెగ్డే!) -
మిస్ వరల్డ్-2024 కిరీటాన్ని దక్కించుకున్న చెక్ రిపబ్లిక్ భామ క్రిస్టినా (ఫోటోలు)
-
మిస్ వరల్డ్ పోటీల్లో పింక్ సీక్విన్ గౌనుతో మెరిసిన పూజా హెగ్డే!
ముంబైలో శనివారం రాత్రి(మార్చి 9న) జరిగిన 71వ మిస్ వరల్డ్ 2024 పోటీలకు ప్రముఖ సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ అందాల పోటీల్లో పూజా హెగ్డే పింక్ స్వీక్విన్ గౌనులో మరో అందమైన గులాబీలా కనిపించింది. అలా వైకుంఠపురంతో ప్రేక్షకులకు చేరువైన బుట్టబొమ్మ పూజా హెగ్డే లుక్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పొడవాటి స్లీవ్స్ తో కూడిన ఫుల్ లెంగ్త్ గ్లిట్టర్ పింక్ సీక్విన్ గౌన్‌లో క్యూట్‌లుక్‌తో సందడి చేసింది. రెడ్ కార్పెట్‌పై ఆ డ్రస్‌తో అందమైన గులాబీలా లుక్ అదిరిపోయింది. ఎలాంటి నగలు ధరించకపోయినా డీప్ నెక్‌తో కూడిన ఆ పింక్ డ్రస్‌లో అందానికే రాణిలా అందరి దృష్టిని ఆకర్షించింది. అలాగే ఈ కార్యక్రమంలో కృతి సనన్ ఆకుపచ్చ గౌను, సోనాక్షి సిన్హా ఎరుపు రంగు గౌను, మన్నారా చోప్రా సిల్వర్ డ్రస్‌తో రెడ్ కార్పెట్‌పై సందడి చేశారు. కాగా, ఈ 71వ ప్రపంచ సుందరి పోటీల్లో 12 మంది సభ్యుల ప్యానెల్ లో పూజా హెగ్డే న్యాయ నిర్ణేతగా ఉన్నారు. బాలీవుడ్ నటి కృతి సనన్, మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సీఈవో జూలియా ఎవ్లిన్ మోర్లే సీబీఈ, అమృత ఫడ్నవీస్, సాజిద్ నడియాడ్వాలా, భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, రజత్ శర్మ, జమీల్ సయీద్, వినీత్ జైల్ ఈ ఎడిషన్‌కు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. View this post on Instagram A post shared by Vishal Mohan Jaiswal (@mj.vishal) (చదవండి: మిస్ వరల్డ్ పోటీల్లో నీతా అంబానీకి హ్యుమానిటేరియన్‌అవార్డు!)