మిస్ వరల్డ్ 2024 అందాల పోటీల ఫైనల్స్ శనివారం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో అట్టహాసంగా జరిగాయి. ఈ పోటీల్లో చెక్‌రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టినా పిస్కోవో విజేతగా నిలిచి కిరిటాన్ని దక్కించుకుంది. దాదాపు 115 దేశాల నుంచి పోటీదారులు పాల్గొన్నారు. వీరంతా తమ అందం, ప్రతిభతో న్యాయనిర్ణేతలను ఆకట్టుకునేలా ప్రదర్శన ఇచ్చారు. ఇంతమంది అందగత్తెలను వెనక్కి నెట్టి ఫైనల్‌లో క్రిస్టినా పిస్కోవా కిరిటాన్ని కైవసం చేసుకుంది. పోలాండ్‌కు చెందిన మాజీ ప్రపంచ సుందరి కరోలినా బిలావ్స్క్ క్రిస్టినా పిస్కోవాకు తన కిరీటాన్ని అందించింది. ఇంతకీ ఎవరీమె అంటే..
క్రిస్టినా పిస్కోవాకి ఇంగ్లీష్, పోలిష్, స్లోవాక్, జర్మన్ తదితర భాషలపై మంచి పట్టు ఉంది. ఆమె ఎత్తు 180 సెం.మీ. చెక్ రిపబ్లిక్ నుంచి 2006 మిస్ వరల్డ్ పోటీలో గెలుపొందిన టటానా కుచరోవా తర్వాత క్రిస్టినా మళ్లీ ఈ కిరీటాన్ని దక్కించుకోవడం విశేషం. క్రిస్టినా యువత, పిల్లలు, పెద్దలు, వికలాంగులకు విద్య అందేలా ఒక ఫౌండేషన్‌ని నడుపుతోంది. అలాగే సంక్షేమ పనుల కోసం క్రిస్టినా పిస్జ్‌కోవా ఫౌంలడేషన్‌ను స్థాపించింది.
ఇవిగాక టాంజానియాలో ఒక ఆంగ్ల మాధ్యమ పాఠశాలను ఏర్పాటు యువత విద్యను కొనసాగించేలా చేసింది. నిరుపేద పిల్లలకు విద్య అందేలా చేయడం వంటి పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టింది. పెద్ద మొత్తంలో దాతృత్వక కార్యక్రమాలు చేసింది. ఆమెకు కళలంటే మక్కువ. ఆ ఆసక్తితోనే ఆర్ట్ అకాడమీలో చేరి సంగీతం, వేణువు, వయోలిన్ వంటివి వాయించడం నేర్చుకుంది.
(చదవండి: మిస్ వరల్డ్ పోటీల్లో పింక్ సీక్విన్ గౌనుతో మెరిసిన పూజా హెగ్డే!)
Comments
Please login to add a commentAdd a comment