check republic
-
వాళ్లు వచ్చిన తరువాతే ఆడతామన్నారు...
బుడాపెస్ట్ (హంగేరి) వేదికగా 45వ చెస్ ఒలింపియాడ్ టోర్నీ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో చెక్ రిపబ్లిక్ జట్టు తమ మంచి మనసును చాటుకుంది. భారత్‌తో మ్యాచ్ సందర్భంగా చెక్ రిపబ్లిక్ గ్రాండ్‌మాస్టర్లు అద్భుతమైన క్రీడా స్పూర్తిని ప్రదర్శించి అందరితో శెభాష్ అనిపించుకుంటున్నారు.అసలేం ఏం జరిగిందంటే?ఈ టోర్నీలో భాగంగా భారత మహిళల జట్టు గురువారం తమ రెండో రౌండ్ మ్యాచ్‌లో SYMA స్పోర్ట్స్ అండ్ కాన్ఫరెన్స్ సెంటర్ వేదికగా చెక్ రిపబ్లిక్‌తో తలపడింది. అయితే తానియా సచ్దేవ్, హారిక ద్రోణవల్లి, వంటికా అగర్వాల్, దివ్య దేశ్‌ముఖ్‌లతో కూడిన భారత బృందం.. వేదిక వద్దకు చేరుకోవడం కాస్త ఆలస్యమైంది.ట్రావిలింగ్లో సమస్యల కారణంగా రెండు బృందాలుగా వేదిక వద్దకు చేరుకున్నారు. టీమిండియాలోని కొంతమంది సభ్యులు వేదిక వద్దకు వచ్చిన వెంటనే టోర్నమెంట్ అధికారులు చెక్ రిపబ్లిక్ ఆటగాళ్లను గడియారం(క్లాక్)ను ప్రారంభించాలని సూచించారు. సరిగ్గా ఇదే సమయంలో చెక్ రిపబ్లిక్ జట్టు తమ క్రీడా స్పూర్తిని చాటుకుంది. భారత జట్టు మొత్తం సభ్యులందరూ వచ్చేవరకు తమ గడియారాలను ప్రారంభించకూడదని వారు నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత సభ్యులందరూ వచ్చాక గేమ్ ప్రారంభమైంది. అయితే ఈ రెండో రౌండ్లో మ్యాచ్‌లో భారత మహిళల జట్టు చెక్ రిపబ్లిక్‌పై 3.5-05 తేడాతో విజయం సాధించారు.చదవండి: అంతా అనుకున్నట్టే జరిగింది.. న్యూజిలాండ్- అఫ్గాన్ టెస్టు రద్దు Due to conveyance issues, the Indian women team arrived late. After some of the team members arrived and the arbiter asked to start the clocks, the Czech Republic players decided not to start the clocks and wait for their opponents. This is true sportsmanship! pic.twitter.com/0GbbWlNcrl— ChessBase India (@ChessbaseIndia) September 12, 2024 -
మిస్ వరల్డ్ 2024 విజేత క్రిస్టినా పిస్కోవా ఎవరు?
మిస్ వరల్డ్ 2024 అందాల పోటీల ఫైనల్స్ శనివారం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో అట్టహాసంగా జరిగాయి. ఈ పోటీల్లో చెక్‌రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టినా పిస్కోవో విజేతగా నిలిచి కిరిటాన్ని దక్కించుకుంది. దాదాపు 115 దేశాల నుంచి పోటీదారులు పాల్గొన్నారు. వీరంతా తమ అందం, ప్రతిభతో న్యాయనిర్ణేతలను ఆకట్టుకునేలా ప్రదర్శన ఇచ్చారు. ఇంతమంది అందగత్తెలను వెనక్కి నెట్టి ఫైనల్లో క్రిస్టినా పిస్కోవా కిరిటాన్ని కైవసం చేసుకుంది. పోలాండ్‌కు చెందిన మాజీ ప్రపంచ సుందరి కరోలినా బిలావ్స్క్ క్రిస్టినా పిస్కోవాకు తన కిరీటాన్ని అందించింది. ఇంతకీ ఎవరీమె అంటే.. క్రిస్టినా పిస్కోవాకి ఇంగ్లీష్, పోలిష్, స్లోవాక్, జర్మన్ తదితర భాషలపై మంచి పట్టు ఉంది. ఆమె ఎత్తు 180 సెం.మీ. చెక్ రిపబ్లిక్ నుంచి 2006 మిస్ వరల్డ్ పోటీలో గెలుపొందిన టటానా కుచరోవా తర్వాత క్రిస్టినా మళ్లీ ఈ కిరీటాన్ని దక్కించుకోవడం విశేషం. క్రిస్టినా యువత, పిల్లలు, పెద్దలు, వికలాంగులకు విద్య అందేలా ఒక ఫౌండేషన్‌ని నడుపుతోంది. అలాగే సంక్షేమ పనుల కోసం క్రిస్టినా పిస్జ్కోవా ఫౌంలడేషన్ను స్థాపించింది. ఇవిగాక టాంజానియాలో ఒక ఆంగ్ల మాధ్యమ పాఠశాలను ఏర్పాటు యువత విద్యను కొనసాగించేలా చేసింది. నిరుపేద పిల్లలకు విద్య అందేలా చేయడం వంటి పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టింది. పెద్ద మొత్తంలో దాతృత్వక కార్యక్రమాలు చేసింది. ఆమెకు కళలంటే మక్కువ. ఆ ఆసక్తితోనే ఆర్ట్ అకాడమీలో చేరి సంగీతం, వేణువు, వయోలిన్ వంటివి వాయించడం నేర్చుకుంది. View this post on Instagram A post shared by Miss World (@missworld) (చదవండి: మిస్ వరల్డ్ పోటీల్లో పింక్ సీక్విన్ గౌనుతో మెరిసిన పూజా హెగ్డే!) -
స్వియాటెక్ ముందంజ
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్ స్వియాటెక్ మూడో రౌండ్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో టాప్‌సీడ్ ఇగా స్వియటెక్ (పోలండ్) 6-4, 4-6, 6-3తో లెస్లీ కెర్కోవ్ (నెదర్లాండ్స్)పై గెలుపొందగా, అన్‌సీడెడ్ కెటీ బౌల్టర్ (ఇంగ్లండ్) 3-6, 7-6 (7/4), 6-4తో ఆరో సీడ్ కరోలినా ప్లిస్కొవా (చెక్ రిపబ్లిక్)కు షాకిచ్చింది. నాలుగో సీడ్ పౌలా బడొసా (స్పెయిన్) 6-3, 6-2తో ఇరినా (రొమేనియా)పై, 12వ సీడ్ ఒస్టాపెంకొ (లాత్వియా) 6-2, 6-2తో విక్మయేర్ (బెల్జియం)పై అలవోక విజయం సాధించారు. మరో వైపు పురుషుల విభాగంలో రెండు సార్లు చాంపియన్ (2013, 2016), బ్రిటన్ స్టార్ అండీ ముర్రే ఈ సారి రెండో రౌండ్‌తోనే సరిపెట్టుకున్నాడు. ముర్రే 4-6, 6-7 (4/7), 7-6 (7/3), 4-6తో 20వ సీడ్ జాన్ ఇస్నర్ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. రెండో రౌండ్లో స్పెయిన్ దిగ్గజం, రెండో సీడ్ నాదల్ 6-4, 6-4, 4-6, 3-0తో రికార్డస్ బెరంకిస్ (లిథువేనియా)పై ఆధిక్యంలో ఉన్న దశలో వర్షంతో మ్యాచ్ ఆగిపోయింది. నాలుగో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) 6-2, 6-3, 7-5తో జోర్డాన్ (ఆస్ట్రేలియా)పై గెలుపొందాడు. 16వ సీడ్ సిమోన హలెప్ (రొమేనియా) 7-5, 6-4తో ఫ్లిప్కెన్స్ (బెల్జియం)పై, 25వ సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) 6-1, 7-6 (7/5)తో అన బొగ్దన్ (రొమేనియా)పై గెలుపొందారు. చదవండి: SL VS AUS 1st Test Day 2: వర్ష బీభత్సానికి అతలాకుతలమైన స్టేడియం -
ప్రాగ్ మాస్టర్స్ చెస్ టోర్నీ విజేత హరికృష్ణ
సాక్షి, హైదరాబాద్: భారత గ్రాండ్‌మాస్టర్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పెంటేల హరికృష్ణ చెక్ రిపబ్లిక్లో జరిగిన ప్రాగ్ ఓపెన్ మాస్టర్స్ టోర్నమెంట్లో విజేతగా నిలిచాడు. 10 మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య తొమ్మిది రౌండ్లపాటు రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో 36 ఏళ్ల హరికృష్ణ 6.5 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచాడు. డేవిడ్ ఆంటోన్ గిజారో (స్పెయిన్)తో జరిగిన చివరిదైన తొమ్మిదో రౌండ్ గేమ్‌లో హరికృష్ణ 57 ఎత్తుల్లో గెలిచి టైటిల్‌ను ఖరారు చేసుకున్నాడు. ఈ టోర్నీలో హరికృష్ణ నాలుగు గేముల్లో గెలిచి, ఐదు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచాడు. విజేతగా నిలిచిన హరికృష్ణకు 25 వేల చెక్ కొరూనాలు (రూ. 82 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
ఒస్ట్రావా ఓపెన్ ఫైనల్లో సానియా మీర్జా జంట..
Sania Mirza in Doubles Final at Ostrava Open: ఈ ఏడాది తొలి డబుల్స్ టైటిల్ సాధించేందుకు భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా విజయం దూరంలో నిలిచింది. చెక్ రిపబ్లిక్లో జరుగుతున్న ఒ్రస్టావా ఓపెన్ డబ్ల్యూటీఏ–500 టోర్నీలో సానియా మీర్జా (భారత్)–షుయె జాంగ్ (చైనా) ద్వయం ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో సానియా–షుయె జాంగ్ జోడీ 6–2, 7–5తో ఇరి హొజుమి–మకోటో నినోమియా (జపాన్) జంటను ఓడించింది. 81 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సానియా–షుయె జాంగ్ ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసి తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయింది. నేడు జరిగే ఫైనల్లో కైట్లిన్ (అమెరికా)–ఎరిన్ (న్యూజిలాండ్) జోడీతో సానియా జంట ఆడుతుంది. చదవండి: Delhi vs Rajasthan: రాజస్తాన్ కెప్టెన్ సామ్సన్‌కు మళ్లీ భారీ జరిమానా.. -
French Open: క్వీన్ క్రిచికోవా
సింగిల్స్ విభాగంలో ఆడుతున్న ఐదో గ్రాండ్‌స్లామ్ టోర్నీలోనే చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి బర్బోర క్రిచికోవా అద్భుతం చేసింది. ఎంతోమందికి తమ కెరీర్లో కలగానే మిగిలిపోయే ‘గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్’ను క్రిచికోవా సాకారం చేసుకుంది. డబుల్స్ స్పెషలిస్ట్ అయిన క్రిచికోవా గతంలో నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో సింగిల్స్ విభాగంలో ఆడినా నాలుగో రౌండ్‌ను దాటలేకపోయింది. పారిస్: వరుసగా ఆరో ఏడాది ఫ్రెంచ్ కోటలో కొత్త రాణికి కిరీటం లభించింది. ఎలాంటి అంచనాలు లేకుండా ఫ్రెంచ్ ఓపెన్‌లో బరిలోకి దిగిన చెక్ రిపబ్లిక్ టెన్నిస్ క్రీడాకారిణి బర్బోర క్రిచికోవా సూపర్ ఫినిషింగ్ ఇచ్చింది. మహిళల సింగిల్స్ విభాగంలో ఆమె తొలిసారి చాంపియన్‌గా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో ప్రపంచ 33వ ర్యాంకర్, అన్‌సీడెడ్ క్రిచికోవా 6–1, 2–6, 6–4తో ప్రపంచ 32వ ర్యాంకర్, 31వ సీడ్ అనస్తాసియా పావ్లుచెంకోవా (రష్యా)పై గెలిచింది. గంటా 58 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో క్రిచికోవా కీలకదశల్లో పైచేయి సాధించి విజయాన్ని దక్కించుకుంది. విజేత క్రిచికోవాకు 14 లక్షల యూరోలు (రూ. 12 కోట్ల 41 లక్షలు)... రన్నరప్ పావ్లుచెంకోవాకు 7 లక్షల 50 వేల యూరోలు (రూ. 6 కోట్ల 65 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. నేడు జరిగే మహిళల డబుల్స్ ఫైనల్లో సినియకోవాతో కలిసి విజేతగా నిలిస్తే 2000లో మేరీ పియర్స్ (ఫ్రాన్స్) తర్వాత ఒకే ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో సింగిల్స్, డబుల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారిణిగా క్రిచికోవా గుర్తింపు పొందుతుంది. పావ్లుచెంకోవాతో జరిగిన ఫైనల్లో క్రిచికోవా కచ్చితమైన సర్వీస్‌లు, డ్రాప్ షాట్లు, డబుల్ బ్యాక్‌హ్యాండ్ షాట్లు, ఫోర్‌హ్యాండ్ షాట్లతో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచింది. హానా మాండ్లికోవా, నొవోత్నా, క్విటోవా తర్వాత చెక్ రిపబ్లిక్ తరఫున గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన నాలుగో ప్లేయర్ క్రిచికోవా. ఒస్టాపెంకో (లాత్వియా–2017), స్వియాటెక్ (పోలాండ్–2020) తర్వాత అన్‌సీడెడ్ హోదాలో ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన మూడో క్రీడాకారిణి క్రిచికోవా. ఓవరాల్‌గా క్రిచికోవా కెరీర్లో ఇది మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్. తన దేశానికే చెందిన సినియకోవాతో కలిసి క్రిచికోవా 2018లో ఫ్రెంచ్ ఓపెన్‌లో, 2018 వింబుల్డన్ ఓపెన్‌లో మహిళల డబుల్స్ టైటిల్‌ను సాధించింది. -
క్విటోవా కేక...
పారిస్: కెరీర్లో మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై గురి పెట్టిన చెక్ రిపబ్లిక్ టెన్నిస్ స్టార్ క్రీడాకారిణి పెట్రా క్విటోవా ఆ దిశగా మరో అడుగు వేసింది. ఎనిమిదేళ్ల తర్వాత ఆమె ఫ్రెంచ్ ఓపెన్‌లో మళ్లీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ క్విటోవా 6–3, 6–3తో లౌరా సిగెముండ్ (జర్మనీ)పై విజయం సాధించింది. 80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో క్విటోవా ఆరు ఏస్‌లు సంధించింది. నాలుగు డబుల్ ఫాల్ట్‌లు, 15 అనవసర తప్పిదాలు చేసిన ఆమె ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. పదునైన ఏస్‌లతో చెలరేగిన క్విటోవా తొలి సెట్లో ప్రత్యర్థికి ఒక్కసారీ బ్రేక్ పాయింట్ అవకాశం ఇవ్వలేదు. ఫోర్ హ్యాండ్ విన్నర్‌తో తొలి సెట్‌ను నెగ్గిన ఆమె రెండో సెట్లోనూ అదే జోరు కొనసాగించింది. తొలి గేమ్‌లోనే సిగెముండ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన క్విటోవా ఆ తర్వాత తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయింది. కానీ సిగెముండ్ తన సర్వీస్‌ను కాపాడుకోవడంలో మూడుసార్లు విఫలమవ్వడంతో క్విటోవాకు విజయం సులువుగానే దక్కింది. 2012లో ఏకైకసారి ఈ టోర్నీలో సెమీస్ చేరిన క్విటోవా తొలిసారి ఫైనల్‌కు చేరాలంటే సెమీఫైనల్లో నాలుగో సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా)ను ఓడించాల్సి ఉంటుంది. మరో క్వార్టర్ ఫైనల్లో సోఫియా 6–4, 4–6, 6–0తో అన్‌సీడెడ్ డానియెలా కొలిన్స్ (అమెరికా)పై గెలిచింది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన సోఫియా ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలిసారి సెమీఫైనల్‌కు చేరడం విశేషం. 2 గంటల 4 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సోఫియా రెండో సెట్లో తడబడింది. కానీ నిర్ణాయక మూడో సెట్లో ఈ అమెరికా క్రీడాకారిణి ఒక్క గేమ్ కూడా కోల్పోకుండా విజయాన్ని ఖాయం చేసుకుంది. -
కొత్త సంవత్సరమంటే కొన్ని నమ్మకాలు..
ఎన్నో కలలతో మరెన్నో ఆకాంక్షలతో కొత్త దశాబ్దంలోకి అడుగు పెట్టబోతున్నాం. గ్రాండ్‌గా న్యూ ఇయర్‌కి వెల్కమ్ చెప్పబోతున్నాం. కొత్త ఏడాదంటేనే కొత్త ఉత్సాహం, కొత్త ఉల్లాసం, కొత్త ఉత్తేజం. అంత జోష్‌లోనూ కొత్త సంవత్సరమంటే కొన్ని నమ్మకాలు ఉన్నాయి. వివిధ దేశాల ప్రజలు పాటించే ఆ సంప్రదాయాలు ఆసక్తిని రేపుతున్నాయి. అవేంటో ఓ సారి చూద్దాం. స్పెయిన్ డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు మేల్కొని గడియారం ముల్లు సరిగ్గా 12 మీదకి రాగానే స్పెయిన్ దేశస్తులు 12 ద్రాక్షపళ్లు తింటారు. అలా తింటే అదృష్టం కలిసొస్తుందని వారి నమ్మకం. ఈక్వెడార్ ఈక్వెడార్‌లో డిసెంబర్ 31 రాత్రి ఎవరూ ఇళ్లల్లో ఉండరు. అందరూ రోడ్లపైనే గడుపుతారు. ప్రధాన కూడళ్లలో మంటలు రాజేసి రాజకీయ నాయకుల దిష్టి బొమ్మలను తగుల బెడతారు. ఈ చర్యతో గత ఏడాది కాలంలో జరిగిన చెడు అంతా పోయినట్టుగా భావిస్తారు. ఈ సంప్రదాయం 1895 నుంచి వస్తోంది. గ్రీస్ గ్రీస్‌లో జనవరి 1న చర్చికి వెళ్లి వచ్చిన వాళ్లందరికీ అక్కడ ఉల్లిపాయలు పంచుతారు. వాటిని తీసుకువచ్చి దండలా తయారు చేసి ఇంటి గుమ్మానికి వేళ్లాడతీస్తారు. ఉల్లిపాయలు అంటే ఆరోగ్యానికి, సంతానం వృద్ధికి, ఆయుఃప్రమాణాలు పెంచడానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే కొత్త సంవత్సరం ఉల్లిపాయల దండ గుమ్మానికి వేళ్లాడదీయడం శుభ పరిణామంగా విశ్వసిస్తారు. చెక్ రిపబ్లిక్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో భాగంగా చెక్ రిపబ్లిక్లో యాపిల్ కట్ చేస్తారు. అదీ కొత్త ఏడాది తమ అదృష్టం ఎంతో తెలుసుకోవడం కోసం. యాపిల్‌ను మధ్యకి కోస్తారు. యాపిల్ మధ్య భాగంలో విత్తనాలు ఉన్న చోట స్టార్ వస్తే కొత్త ఏడాదంతా మంచే జరుగుతుందని, అదే క్రాస్ వస్తే చెడు జరుగుతుందని వారి నమ్మకం. జపాన్ జపాన్‌లో కొత్త సంవత్సరం అంటే అర్ధరాత్రి గంటల్ని గణగణమని మోగిస్తారు. రాత్రి 12 అవగానే 108 సార్లు గంటలు మోగుతాయి. అలా చేస్తేనే తమ జీవితం ఆనందంగా సాగుతుందని అంటారు. ఇటలీ ఇటలీలో కొత్త సంవత్సరం కాస్త వినూత్నంగా ఉంటుంది. చెత్త సామాను వదిలించుకోవడానికి ఈ ఉత్సవాల్ని నిర్వహిస్తారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి ఇంట్లో ఉన్న చెత్త సామానంతటినీ బయట పడేస్తారు. అంటే మనసుల్లో ఉన్న చెడు జ్ఞాపకాల్ని వదిలించుకోవడం అన్నమాట. దక్షిణాఫ్రికావంటి దేశాలూ ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నాయి. చిలీ కొత్త ఏడాది ఉత్సవాల్ని వివిధ దేశాల ప్రజలు చర్చిల్లో జరుపుకుంటే చిలీ వాసులు తమ రూటే సెపరేటు అంటున్నారు. తమకు అత్యంత ప్రియమైన వారి సమాధుల వద్ద ఈ సంబరాలు నిర్వహిస్తారు. సమాధుల్ని పూల తో అలంకరించి, దీపాలు ఉంచుతారు. ఈ లోకంలో లేకపోయినా సరే కొత్త సంవత్సరం ప్రియమైన వారిని తలచుకోవడం కంటే మించినదేదీ ఉండదని చిలీ వాసులు 1995 నుంచి ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. డెన్మార్క్ డెన్మార్క్‌లో రకరకాల పింగాణి పాత్రలు (క్రాకరీ)ని బద్దలు కొడతారు. ప్లేట్లు, కప్పులు, స్పూన్లు లాంటివన్నీ డిసెంబర్ 31 అర్ధరాత్రే విరగ్గొట్టేస్తారు. అప్పుడే అదృష్టం తమకి కలిసివస్తుందని వారి నమ్మకం. -
భారత్‌కు ఐదో స్థానం
సాక్షి, హైదరాబాద్: చెక్ రిపబ్లిక్లో జరిగిన ఐటీఎఫ్ జూనియర్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత జట్టు ఐదో స్థానంలో నిలిచింది. ఐదు, ఆరు స్థానాల కోసం శుక్రవారం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి ప్రాంజల రాణించడంతో భారత్ 2-1తో ఆస్ట్రేలియాపై గెలుపొందింది. తొలి సింగిల్స్ మ్యాచ్‌లో యడ్లపల్లి ప్రాంజల 1-6, 6-4, 6-2తో డెస్తానీ ఐవాపై గెలుపొందగా, రెండో సింగిల్స్‌లో మిహికా యాదవ్ 0-6, 0-6తో జేమీ ఫౌర్లీస్ చేతిలో పరాజయం చవిచూసింది. దీంతో నిర్ణాయక డబుల్స్‌లో బరిలోకి దిగిన ప్రాంజల-హిమాని మోర్ జంట 4-6, 6-1, 6-4తో డెస్తానీ ఐవా- ఫౌర్లీస్ జోడిపై విజయం సాధించి భారత్‌ను గెలిపించింది.