భారత్‌కు ఐదో స్థానం | India fifth position | Sakshi
Sakshi News home page

భారత్‌కు ఐదో స్థానం

Published Sat, Aug 10 2013 1:17 AM | Last Updated on Fri, Jul 12 2019 6:04 PM

భారత్‌కు ఐదో స్థానం - Sakshi

భారత్‌కు ఐదో స్థానం

 సాక్షి, హైదరాబాద్: చెక్ రిపబ్లిక్‌లో జరిగిన ఐటీఎఫ్ జూనియర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత జట్టు ఐదో స్థానంలో నిలిచింది. ఐదు, ఆరు స్థానాల కోసం శుక్రవారం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి ప్రాంజల  రాణించడంతో భారత్ 2-1తో ఆస్ట్రేలియాపై గెలుపొందింది.
 
 తొలి సింగిల్స్ మ్యాచ్‌లో యడ్లపల్లి ప్రాంజల 1-6, 6-4, 6-2తో డెస్తానీ ఐవాపై గెలుపొందగా, రెండో సింగిల్స్‌లో మిహికా యాదవ్ 0-6, 0-6తో జేమీ ఫౌర్లీస్ చేతిలో పరాజయం చవిచూసింది. దీంతో నిర్ణాయక డబుల్స్‌లో బరిలోకి దిగిన ప్రాంజల-హిమాని మోర్ జంట 4-6, 6-1, 6-4తో డెస్తానీ ఐవా- ఫౌర్లీస్ జోడిపై విజయం సాధించి భారత్‌ను గెలిపించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement