30వ పుట్టిన రోజు : కాలినడకన ద్వారకకు అనంత్ అంబానీ | Anant Ambani spiritual walk From Jamnagar To Dwarka To Celebrate His 30th Birthday | Sakshi
Sakshi News home page

30వ పుట్టిన రోజు : కాలినడకన ద్వారకకు అనంత్ అంబానీ

Apr 1 2025 12:10 PM | Updated on Apr 1 2025 2:32 PM

Anant Ambani spiritual walk From Jamnagar To Dwarka To Celebrate His 30th Birthday

రిలయన్స్ ఇండస్ట్రీస్‌ చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ  ఆధ్యాత్మికకు  ఎక్కువ  ప్రాధాన్యత ఇస్తారు. తాజాగా తన 30వ పుట్టినరోజు సందర్భంగా మరో ఆధ్మాత్మికకార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గుజరాత్‌లోని ద్వారకాధీష్ ఆలయానికి  ‍ కాలినడకన వెళ్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట  వైరల్ అవుతోంది. దాదాపు 141 కిలోమీటర్లమేర కాలినడకన ద్వారకకు చేరుకుని  అక్కడ శ్రీ కృష్ణుడి పాదాలకు నమస్కరించనున్నారు.  రోజుకు 15-20 కిలోమీటర్ల  చొప్పున ఈ ఆధ్యాత్మిక యాత్ర ముగియనుంది.

జామ్‌నగర్ నుండి ద్వారకకు

ఎపుడూ భక్తిని చాటుకునే అనంత్ అంబానీ, జామ్‌నగర్ నుండి శ్రీకృష్ణ నగరం ద్వారకకు  ఆధ్యాత్మిక యాత్ర (పాదయాత్ర)గుజరాత్‌లోని జామ్‌నగర్‌ నుంచి ద్వారక వరకు మార్చి 27న ప్రారంభించారు. ద్వారకలో ద్వారకాధీశుని దర్శనంతో తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోవాలని నిర్ణయించు కున్నారు. 140 కిలోమీటర్ల ప్రయాణం ఐదవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, అనంత్ అంబానీ ఏదైనా పనిని ప్రారంభించే ముందు ఎల్లప్పుడూ ద్వారకాధీశుని దర్శించుకుంటాననీ, దీంతో ఆ పనులు నిర్విఘ్నంగా పూర్తయ్యాయని పేర్కొన్నారు.

 > "జామ్‌నగర్‌లోని మా ఇంటి నుండి ద్వారక వరకు పాదయాత్ర గత ఐదు రోజులుగా కొనసాగుతోంది, మరో రెండు నాలుగు రోజుల్లో  ద్వారక చేరుకుంటాము.ద్వారకాధీశుడు మనల్ని ఆశీర్వదించుగాక. ఏదైనా పని చేసే ముందు ద్వారకాధీశుడుపై విశ్వాసం ఉంచి, ద్వారకాధీశుడిని స్మరించుకోవాలని నేను యువతకు చెప్పాలనుకుంటున్నాను. ఆ పని ఖచ్చితంగా ఎటువంటి అడ్డంకులు లేకుండా పూర్తవుతుంది. దేవుడు ఉన్నప్పుడు, చింతించాల్సిన పని లేదు" అని ఆయన అన్నారు.

 

ఏప్రిల్ 10న పుట్టినరోజు
కృష్ణ భక్తుడైన అనంత్ అంబానీ జై ద్వారకాదీష్ అంటూ నినదిస్తూ ఎంతో ఉత్సాహంగా నడుస్తున్నారు. అనేక మంది భక్తులను ఆకట్టుకుంటున్నారు. పలువురు ఆయనతో సెల్ఫీలు దిగారు. అంబానీ కుటుంబానికి చెందిన వ్యక్తి పాదయాత్ర చేయడం ఇదే తొలిసారి. దీంతో అనంత్‌ అంబానీపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ పాదయాత్ర ద్వారా ద్వారక శ్రీ కృష్ణ మందిరానికిచేరుకుంటారు. ఏప్రిల్ 10న అనంత్ అంబానీ తన 30వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఏప్రిల్ 8 నాటికి అనంత్ అంబానీ భార్య రాధిక మర్చంట్ ద్వారక చేరుకుంటే. తరువాత, ఇద్దరూ కలిసి శ్రీకృష్ణుని దర్శనం చేసుకుంటారు. ఇటీవల  ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళాలో   భార్య రాధికతోపాటు అనంత్‌ అంబానీ త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానం చేసిన సంగతి తెలిసిందే. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement