Reliance induatries
-
ఇషా, ఆకాష్ అంబానీ పేర్ల వెనుక స్టోరీ, వాటి అర్థం తెలుసా?
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ,నీతా అంబానీల పిల్లలు ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ. ఐవీఎఫ్ ద్వారా ఈ కవల పిల్లలకు జన్మనిచ్చారు నీతా అంబానీ. అక్టోబర్ 23న పుట్టిన ఇషా , ఆకాష్ అంబానీలు పేర్లు ఎలా వచ్చాయో తెలుసా?ఇషా, ఆకాష్ అంబానీ పుట్టిన రోజు సందర్బంగా గతంలో డిజైనర్లు అబు జానీ, సందీప్ ఖోస్లాతో నీతా అంబానీ సంభాషణ ఇపుడు వైరల్‌గా మారింది. ఇందులో తన కవల పిల్లలు ఇషా, ఆకాష్ పేర్ల వెనుకున్న కథను నీతా పంచుకున్నారు.కవలల పిల్లల ప్రసవం కోసం తాను అమెరికాలో ఉన్నానని నీతా తెలిపారు. అపుడు నత భర్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ తనను కలిసి ఇండియా వెళ్లేందుకు విమానం దిగారో లేదో వెంటనే అమెరికా బయలుదేరాల్సి వచ్చింది. ఎందుకంటే... నెలలకు నిండకుండానే. ఇషా, ఆకాష్‌కు జన్మనిచ్చారట నీతా. దీనితో ముఖేష్ U.S.కి తిరిగి వెళ్లవలసి వచ్చింది. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే..నీతాకు డెలివరీ అయిందన్న సంగతి తెలియగానే అంబానీతోపాటు, నీతా తల్లి, డాక్టర్ ఫిరోజా, విమానంలో అమెరికాకు బయలు దేరారు. అపుడు వారు ప్రయాణిస్తున్న విమానం పైలట్ ఈ సంతోషకరమైన వార్తను ప్రకటించారు. అంతేకాదు తమ పిల్లలకు ఇషా, ఆకాష్ పేర్లు ఎలా పెట్టిందీ వివరించారు నీతా. పిల్లలకు పేర్ల చర్చ వచ్చినపుడు పర్వతాల మీదుగా ఆకాశంలో ఎగురుతున్నపుడు ఈ వార్త తెలిసింది కాబట్టి అమ్మాయికి ఇషా (పర్వతాల దేవత) ఆకాష్ (ఆకాశం) అని అనే పేర్లు పెడదామని చెప్పారట అంబానీ. అదీ సంగతి. ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ పుట్టిన మూడేళ్ల తర్వాత వారి మూడో సంతానం అనంత్ అంబానీ జన్మించాడు. కాగా ప్రస్తుతం ఇషా, ఆకాష్, అనంత్ రిలయన్స్వ్యాపార సమ్రాజ్య బాధ్యతల్లో ఉన్నారు. ఆకాష్ , డైమండ్స్ వ్యాపారి కుమార్తె శ్లోకా మెహతాను పె ళ్లాడాడు వీరికి ఇద్దరు సంతానం. వ్యాపారవేత్త ఆనంద్పిరమిల్ వివాహమాడిన ఇషాకు ఇద్దరు కవల పిల్లలు. అనంత్ తన చిన్న నాటి స్నేహితురాలు రాధికా మర్చంట్‌ను ఈ ఏడాది జూలైలో అంగరంగ వైభవంగా పెళ్లాడిన సంగతి తెలిసిందే. -
గ్రేట్ సన్ ఆఫ్ ఇండియా.. రతన్ టాటాకు అంబానీ ఫ్యామిలీ నివాళి
రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక దీపావళి విందులో 'రతన్ టాటా'కు ముఖేష్ అంబానీ ఫ్యామిలీ, వేలాది మంది ఉద్యోగులు నివాళులర్పించారు. నీతా అంబానీ 'గ్రేట్ సన్ ఆఫ్ ఇండియా' అని రతన్ టాటాను కొనియాడారు. దూరదృష్టి కలిగిన పారిశ్రామికవేత్త, పరోపకారి, ఎల్లప్పుడూ సమాజ శ్రేయస్సు కోసం ఆలోచించే వ్యక్తి అని అన్నారు.దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా.. మా మామయ్య ధీరూభాయ్ అంబానీకి, నా భర్త ముకేశ్ అంబానీకి, మా కుటుంబానికి మంచి స్నేహితులు. ఆకాష్ అంబానీకి మార్గదర్శి అని నీతా అంబానీ అన్నారు. మహనీయుడు రతన్ టాటాకు నివాళిగా అందరూ మౌనం పాటించాలని పేర్కొన్నారు. ఈ సమయంలో ముకేశ్ అంబానీ భావోద్వేగానికి గురైనట్లు కనిపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. -
రిలయన్స్ బోర్డులోకి అంబానీ వారసులు - ఆమోదం తెలిపిన షేర్ హోల్డర్స్
ఆయిల్ నుంచి టెలికామ్ వరకు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ భారతదేశంలో అతిపెద్ద కంపెనీగా అవతరించింది. ఈ సంస్థలో ముఖేష్ అంబానీ, నీతా అంబానీతో పాటు వారి పిల్లలు కూడా ఒక్కో విభాగంలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తాజాగా ఆకాశ్, ఇషా, అనంత్ అంబానీ ముగ్గురూ కంపెనీ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమితులయ్యారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ ఏడాది ప్రారంభంలో వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రకటించిన వారసత్వ ప్రణాళికను ఈ రోజు అధికారికం చేసింది. కంపెనీ బోర్డులో ఇషా, ఆకాష్, అనంత్ అంబానీలను నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమించడానికి వాటాదారులు ఆమోదించారు. కంపెనీ బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా కొనసాగటానికి షేర్ హోల్డర్ల నుంచి అంబానీ పిల్లలు ముగ్గురూ (ఇషా, ఆకాష్, అనంత్ అంబానీ) వరుసగా 98.21 శాతం, 98.06 శాతం, 92.75 శాతం ఆమోదం పొందారు. ఇదీ చదవండి: ఇంతకంటే ఖరీదైన ప్యాలెస్ మరొకటి లేదు! ముఖేష్ అంబానీ యాంటిలియా దీని తరువాతే.. ముఖేష్ అంబానీ మరో ఐదేళ్లు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలను ముఖేష్ అంబానీ మరో ఐదేళ్లపాటు నిర్వహించనున్నారు. నీతా అంబానీ పదవీ విరమణ తరువాత కూడా రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్‌గా కొనసాగుతారు. దీనికి రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల నుంచి ఆమోదం లబించింది. -
రూ.1600 కోట్ల నిధులు.. ఎడ్టెక్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తున్న అదితి అవస్తీ!
Aditi Avasthi founder and CEO of Embibe: మహిళలు అనుకుంటే సాధించలేనది ఏదీ లేదు. ఏ రంగంలోనైనా తమకు తిరుగులేదని నిరూపిస్తున్నారు. అలాంటి విజయవంతమైన మహిళల్లో ఒకరే అదితి అవస్తీ. బెంగళూరుకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ ఎంబైబ్ వ్యవస్థాపకురాలు, సీఈవో. టాప్ ఎడ్టెక్ కంపెనీల్లో ఒకటిగా నిలిచి బైజూస్, ఫిజిక్స్ వాలా, అనకాడెమీ వంటి పెద్ద ఎడ్టెక్ ప్లాట్‌ఫామ్‌లకు గట్టి పోటీ ఇస్తోంది ఎంబైబ్. ఇదీ చదవండి: Divis Laboratories: ఎవరీ నీలిమ మోటపర్తి? ఈమె బ్యాగ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్యపోతారు! అదితి అవస్తీ నేపథ్యం అదితి అవస్తీ పంజాబ్‌లోని లూథియానాలో జన్మించించారు. 2003లో థాపర్ విశ్వవిద్యాలయం నుంచి బీటెక్ పూర్తి చేశారు. చికాగో యూనివర్సటీ బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఫైనాన్స్ మార్కెటింగ్‌లో ఎంబీఏ పట్టా అందుకున్నారు. బీటెక్ పూర్తి చేసిన తర్వాత టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో పని చేసిన అదితి అవస్తి తర్వాత బార్క్లేస్లో ఆఫ్రికాలోని మొబైల్ బ్యాంకింగ్ విభాగానికి డిప్యూటీ చీఫ్ ఆఫ్ ప్రొడక్ట్ స్ట్రాటజీ హెడ్‌గా పనిచేశారు. ఏంజల్ ఇన్వెస్టర్స్ సహాయంతో 7 లక్షల డాలర్ల నిధులతో 2012లో ఎంబైబ్ సంస్థను స్థాపించారు. తర్వాత కలారి క్యాపిటల్, లైట్‌బాక్స్ వెంచర్స్ నుంచి కూడా పెట్టుబడులను సాధించారు. రిలయన్స్ పెట్టుబడులు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను మెప్పించి తన ఎంబైబ్ సంస్థలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పించింది. 2018లో రిలయన్స్ ఇండస్ట్రీస్ 180 మిలియన్ డాలర్లను ఎంబైబ్‌లో ఇన్వెస్ట్ చేసింది. తద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎంబైబ్‌లో 73 శాతం వాటాను కొనుగోలు చేయింది. అలాగే 2020లోనూ అదనంగా రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టింది. గుర్తింపులు, అవార్డులు అదితి అవస్తి 2021లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ యంగ్ గ్లోబల్ లీడర్‌గా ఎంపికయ్యారు. 2017లో బీబీసీ టాప్ 100 మంది మహిళలలో స్థానం సాధించారు. 2018లో వోగ్ ఆమెను 'ఉమెన్ ఆఫ్ ది ఇయర్'గా ఎంపిక చేసింది. రూ.1600 కోట్లకుపైగా నిధులు నివేదికల ప్రకారం.. ఎంబైబ్ నాలుగు రౌండ్లలో మొత్తం 196.7 మిలియన్ డాలర్లు( రూ.1600 కోట్లకుపైగా) నిధులను సేకరించింది. కంపెనీ చివరి సారిగా 2020 ఫిబ్రవరిలో నిధులు సమీకరించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్నోవెన్ క్యాపిటల్‌తో సహా నాలుగు సంస్థలు ఎంబైబ్కు నిధులు సమకూరుస్తున్నాయి. గోవా ప్రభుత్వంతో భాగస్వామ్యం గోవా ప్రభుత్వం ఇటీవల ఆ రాష్ట్రంలోని ప్రభుత్వ , ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించేందుకు డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌గా ఎంబైబ్తో ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో ఉన్న 594 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లోని సుమారు లక్ష మంది విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించనుంది ఎంబైబ్. బిజినెస్ రంగంలో ఇలాంటి విజయగాథలు, స్పూర్తివంతమైన కథనాల కోసం సాక్షి బిజినెస్ పేజీని చూస్తూ ఉండండి. -
ఐస్‌క్రీమ్ అమ్మబోతున్న అంబానీ: రూ. 20వేల కోట్లతో..
ప్రపంచ కుబేరుల్లో ఒకరు, రిలయన్స్ కంపెనీ అధినేత 'ముఖేష్ అంబానీ' త్వరలో భారతదేశంలో మరో కొత్త బిజినెస్ ప్రారంభించనున్నట్లు సమాచారం. పెట్రోల్, ఎలక్రానిక్స్, క్లాథింగ్, టెలికాం, ఎనర్జీ వంటి మరెన్నో రంగాల్లో ముందుకు దూసుకెళ్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పుడు మరో రంగంపై కన్నేసింది. నివేదికల ప్రకారం, రిలయన్స్ సంస్థ త్వరలో ఐస్‌క్రీమ్ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే రిలయన్స్ ఇండస్ట్రీస్ భారతదేశంలో రూ. 20,000 కోట్ల టర్నోవర్‌తో ఐస్‌క్రీమ్ పరిశ్రమలోకి ప్రవేశించడానికి ఏర్పాట్లు చేస్తోంది. గత సంవత్సరం గుజరాత్‌లోనే రిలయన్స్ కంపెనీ ఈ బ్రాండ్ విడుదల చేసింది, కాగా ఇప్పుడు మార్కెటింగ్ కోసం అక్కడి ఐస్‌క్రీమ్ తయారీ అవుట్ సోర్సింగ్ కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. రిలయన్స్ కంపెనీ ఐస్‌క్రీమ్ రంగంలోకి ప్రవేశిస్తే ఇక్కడి మార్కెట్లో పోటీ భారీగా పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. భారతదేశంలోని ఐస్ క్రీమ్ పరిశ్రమలో ఐసిస్ క్రీమ్, స్టార్మి ఇండస్ట్రీస్, అమూల్ సంస్థలు అత్యధిక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి. అయితే రానున్న రోజుల్లో ఈ కంపెనీలు రిలయన్స్‌తో పోటీ పట్టడానికి సిద్దమవ్వాల్సి ఉంటుంది. (ఇదీ చదవండి: Flipkart Offers: మండే ఎండల్లో కూల్ ఆఫర్స్.. ఏసీ కొనటానికి ఇదే మంచి సమయం) రిలయన్స్ సంస్థ కొన్ని రోజుల క్రితం డెయిరీ రంగంలోని ఆర్ఎస్ సోధి కంపెనీని కొనుగోలు చేసింది. అమూల్‌తో కలిసి పనిచేసిన అనుభవం ఈ కంపెనీ ఐస్‌క్రీమ్ రంగంలో చాలా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. ఒకప్పుడు టెలికాం రంగంలో జియో పేరుతో ప్రవేశించినప్పుడు ఈ రంగంలోని చాలా కంపెనీలు భారీగా నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. అలంటి పరిస్థితి మళ్ళీ వచ్చే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. -
నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్ లాంచ్: తరలి వచ్చిన తారలు, ఫోటోలు వైరల్
సాక్షి: ముంబై: రిలయన్స్ అధినేత ముఖేశ అంబానీ సతీమణి, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘ఎన్ఎంఏసీసీ’ (నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్) ఘనంగా లాంచ్ అయింది. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో శుక్రవారం రాత్రి జరిగిన ఎన్ఎంఏసీసీ ఆరంభోత్సవానికి పలువురు రాజకీయ, వ్యాపార వర్గాల, క్రీడా రంగ ప్రముఖులు, బాలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేశారు. ఈ వేడుకల్లోఅంబానీ కుటుంబసభ్యులు, కాబోయే జంట అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బాలీవుడ్, హాలీవుడ్, సౌత్ సినీ పరిశ్రమలకు చెందిన తారలు మెరిసారు. ముఖ్యంగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆయన కుమార్తె సౌందర్య, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, ఆయన సతీమణి గౌరీ ఖాన్, కుమారుడు ఆర్యన్‌ఖాన్, కుమార్తె సుహానా ఖాన్, సల్మాన్‌ఖాన్, వరుణ్ ధావన్, భార్య మీరాతో కలిసి షాహిద్ కపూర్ రాజ్‌పుత్ ఉన్నారు. ఇంకా దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్, ప్రియాంకా చోప్రా, నిక్ జొనాస్ జంటతోపాటు శ్రద్ధాకపూర్, జాన్వీకపూర్, సోనం కపూర్, అలియాభట్, కొత్త జంట సిద్ధార్థ్ మల్హోత్ర, కియారా తదితర అతిరధమహారథులంతా ఈ వేడుకలో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. ఇంకా టీవీ ప్రముఖులలో రాహుల్ వైద్య, దిశా పర్మార్ , తారక్ మెహతా కా ఊల్తా చష్మా, జెతలాల్ ఏకేఏ దిలీప్ జోషిగాయని శ్రేయా కూడా కనిపించారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కుటుంబం, అమృత ఫడ్నవీస్‌తో దేవేంద్ర ఫడ్నవిస్, ఎస్బీఐ మాజీ మాజీ చీఫ్ అరుంధతి భట్టాచార్య,సద్గురు కూడా ఈ వేడుకల్లో సందడి చేశారు. గ్రాండ్ ఓపెనింగ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కొత్త శకానికి నాంది: అంబానీ నీతా చిరకాల స్వప్నం నెరవేరడంపై స్పందించిన ముఖేశ్ అంబానీ స్పందిస్తూ ఇది భావి భారతానికి కళలు , సంస్కృతికి కొత్త శకానికి నాంది అని వ్యాఖ్యానించారు. నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ లేదా ఎన్ఎంఏసీసీ అని కూడా పిలుస్తారు. భారతీయ సంస్కృతి, అంతరించిపోతున్న కళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. గ్రాండ్ లాంచ్‌కి పలువురు ప్రముఖ బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Priyanka Chopra and Nick Jonas at the grand opening of the #NitaMukeshAmbaniCulturalCentre#CultureAtTheCentre #NMACC@priyankachopra @nickjonas pic.twitter.com/6UveIg2XFX — Nita Mukesh Ambani Cultural Centre (@nmacc_india) March 31, 2023 -
రిలయన్స్ అధినేత అంబానీ కళ్లు చెదిరే రెసిడెన్షియల్ ప్రాపర్టీస్
వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ,ఎండీ ముఖేశ్ అంబానీ గురించి తెలియని వారుండరు. భారతదేశంలోనే అత్యంత ధనవంతుడు బిలియనీర్ అంబానీకి ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన ఆస్తులను సొంతం చేసుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యాపార దిగ్గజం అంబానీ భారీ నికర విలువతో, విలాసవంతమైన జీవనశైలి, విలాసవంతమైన ఇళ్ళు, లగ్జరీ కార్లను సొంతం చేసుకున్నారు. రూ. 15 వేల కోట్ల ఇంద్రభవనం యాంటిలియా నుంచి 2 వేల కోట్ల లావిష్ హోటల్ దాకా అంబానీ ప్రాపర్టీ పోర్ట్‌ఫోలియో ఎప్పుడూ చర్చనీయాంశాలే. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీకి చెందిన కొన్నిఆస్తులను చూద్దాం: అంబానీ నివాసముండే ఆంటిలియా గురించి ముందుగా చెప్పాలి. ముఖేశ్ అంబానీ, భార్య నీతా అంబానీ రాజభవనం లాంటి ఆంటిలియాలోనే ఉంటారు. పిల్లలు ఆకాష్, అనంత్ అంబానీ, ఇషా అంబానీలకు ఇప్పటికే పెళ్ళిళ్లు చేసిన సంగతి తెలిసిందే. అంబానీ 15 వేల కోట్ల రూపాయల విలువైన తన 27అంతస్తుల నివాసం యాంటిలియాతో సహా ప్రపంచవ్యాప్తంగా చాలా ఖరీదైన ఆస్తులను కలిగి ఉన్నారు. అలాగై లగ్జరీ కార్లు, ఆభరణాల కలెక్షన్ వారికి పెద్ద లెక్కే కాదు. యాంటిలియా ప్రపంచంలో రెండో అత్యంత ఖరీదైన నివాసం యాంటిలియా. 60 ప్లోర్లతో 27 అంతస్తుల భవనం యాంటిలియా విలువ రూ. 15,000 కోట్లు. ఈ ఇంటి పైఅంతస్తులో హెలిప్యాడ్ ప్రత్యేక ఆకర్షణ, ఇంకా గుడి, థియేటర్, ఐస్ క్రీం పార్లర్, స్విమ్మింగ్ పూల్, స్పా లాంటివి ఉన్నాయి. యాంటిలియాకు మారడానికి ముందు, ముఖేశ్ అంబానీ కుటుంబం, అనిల్ అంబానీ కఫ్ పరేడ్‌లోని సీ విండ్ అపార్ట్మెంట్లో నివసించేవారు. 17 అంతస్తుల భవనాన్ని దక్షిణ ముంబైలో రిలయన్స్ ఫౌండర్ ధీరూభాయ్ అంబానీ కొనుగోలు చేశారు. యూకేలోని స్టోక్ పార్క్ లండన్‌లోని 900 ఏళ్ల పురాతన హోటల్, స్టోన్ పార్క్‌కు కూడా ముఖేశ్ అంబానీ సొంతం. అల్ట్రా-రిచ్ ఫెసిలిటీస్‌తో ఉండే ఈహోటల్ కొనుగోలు విలువ 2020 నాటికి రూ. 529 కోట్లు. 1760లో సైనికుడు జాన్ పెన్ నిర్మించిన ఈ హోటల్లో 49 విలాసవంతమైన గదులు మూడు రెస్టారెంట్లు ఉన్నాయి. అంతేకాదు స్టోన్ పార్క్‌లో 4000 చదరపు అడుగుల జిమ్, గోల్ఫ్ కోర్స్, పదమూడు మల్టీ-సర్ఫేస్ టెన్నిస్ కోర్ట్ , ఇండోర్ స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. న్యూయార్క్‌లోని లావిష్ హోటల్ దీంతోపాటు హాలీవుడ్ ప్రముఖులు బస చేసే, న్యూయార్క్‌లోని కొలంబస్ సర్కిల్లోని పాపులర్ హోటల్లో అంబానీ 248 సూట్లతో ఉన్న ఒక ఇంటిని 2022లో 98.15 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారట. పామ్ జుమేరియా ఇల్లు లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. దుబాయ్‌లోని పామ్ జుమేరియా ఇల్లు. అంబానీకి రూ. 639 కోట్ల విలువైన, బీచ్-ఫేసింగ్ ప్రాపర్టీలో స్పా బార్, స్విమ్మింగ్ పూల్స్ లాంటివి స్పెషల్ ఎట్రాక్షన్స్. అనేది అరచేతి ఆకారంలో ఉండే జుమేరియా కృత్రిమ ద్వీపం పోష్ కాలనీలు, అతి విలాసవంతమైన నివాస ఆస్తులకు ప్రసిద్ధి. -
రిలయన్స్ ‘మెట్రో’ డీల్ ఓకే, రూ.2,850 కోట్లతో కొనుగోలు
న్యూఢిల్లీ: ‘మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఇండియా’ని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ) సొంతం చేసుకునేందుకు కాంపిటిషన్ కమిషన్ (సీసీఐ) ఆమో దం తెలిపింది. జర్మనీకి చెందిన మెట్రో ఏజీ భారత్‌లోని తన హోల్‌సేల్ కార్యకలాపాలను విక్రయించేందుకు రిలయన్స్‌తో ఈ ఒప్పందం చేసుకోవడం గమనార్హం. మెట్రో క్యాష్ అండ్ క్యారీలో 100 శాతం వాటాలను రూ.2,850 కోట్లతో కొనుగోలు చేసేందుకు రిలయన్స్ తప్పనిసరి ఒప్పందంపై సంతకాలు చేసింది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్, మెట్రో క్యాష్ అండ్ క్యారీ కొనుగోలు ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్టు ట్విట్టర్లో సీసీఐ ప్రకటించింది. ఇవీ చదవండి: ఇషా ట్విన్స్‌కు అంబానీ బ్రహ్మాండమైన గిఫ్ట్: వీడియో వైరల్ ముఖేష్ అంబానీ లగ్జరీ కార్లు.. రోల్స్ రాయిస్ నుంచి ఫెరారీ వరకు -
ముద్దుల మనవలకు అంబానీ బ్రహ్మాండమైన గిఫ్ట్: వీడియో వైరల్
సాక్షి,ముంబై: బిలియనీర్, రిలయన్స్చైర్మన్ ముఖేష్ అంబానీ, నీతా అంబానీ అమ్మమ్మ, తాతయ్యలుగా కవల మనవలకు బ్రహ్మాండమైన గిఫ్ట్ ఇచ్చారు. ఆకర్షణీయమైన ఐదడుగుల అల్ట్రా-లగ్జరీ క్లోసెట్ను బహుమతిగా ఇచ్చారు. మనవడు కృష్ణ మనవరాలు ఆదియా పుట్టిన సందర్భంగా గ్రాండ్‌గా పార్టీ ఇచ్చిన అంబానీ దంపతులు తాజాగా వారికిచ్చిన గిఫ్ట్ వైరల్‌గా మారింది. పాపులర్ మహిళా పారిశ్రామిక వేత్త, అంబారీ ఏకైక కుమార్తె ఇషా అంబానీ, వ్యాపార దిగ్గజం ఆనంద్ పిరమల్ దంపతులకు 2022 నవంబరులో కవల పిల్లలకు జన్మించిన సంగతి తెలిసిందే. ఈ కవలల కోసమే లగ్జరీ క్లోసెట్( కప్బోర్డ్)ను ప్రత్యేకంగా కస్టమైజ్ చేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎల్లో కలర్ రూంలో హాట్-ఎయిర్ బెలూన్లతో మేఘాల వాల్‌పేపర్‌తో ఆకట్టుకుంటోంది. అలాగే టెడ్డీ బేర్లు, ఆకర్షణీయమైన రంగుల కృత్రిమ పువ్వులు, రెండు స్పెషల్ బాక్స్లతోపాటు, ఒక గ్లోబ్, రెండు పాస్‌పోర్ట్‌లు, ఒక చిన్న విమానాన్ని కూడా ఇందులో పొందుపర్చారు. అలాగే కస్టమైజ్డ్ క్లోసెట్ డోర్ పైన "అడ్వెంచర్స్ ఆఫ్ ఆదియా అండ్ కృష్ణ" అని రాసి ఉండటం గమనార్హం. View this post on Instagram A post shared by Gifts Tell All (@giftstellall) -
రిలయన్స్ ‘చల్లటి’ కబురు... మార్కెట్లోకి రిఫ్రెష్ డ్రింక్స్
వేసవి సమీపిస్తున్న వేళ రిలయన్స్ చల్లటి కబురు చెప్పింది. 50ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ‘క్యాంపా’ బ్రాండ్ కూల్‌డ్రింక్స్‌ను మళ్లీ మార్కెట్లోకి తీసుకొచ్చింది. మూడు రకాల సాఫ్ట్డ్రింక్స్ను పరిచయం చేస్తూ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ విభాగం రిలయన్స్ కన్సూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇదీ చదవండి: బీటెక్ అమ్మాయి.. బుల్లెట్‌పై హైజీనిక్ పానీపూరి మూడు ఫ్లేవర్లు.. ఐదు ప్యాక్‌లు క్యాంపా కూల్‌డ్రింక్స్‌లో మూడు రకాల ఫ్లేవర్లను రిలయన్స్ విడుదల చేసింది. అవి క్యాంపా కోలా, క్యాంపా లెమన్, క్యాంపా ఆరెంజ్. మొత్తం ఐదు రకాల ప్యాక్‌లలో లభిస్తాయి. 200 ఎంఎల్ తక్షణ వినియోగ ప్యాక్, 500 ఎంఎల్, 600 ఎంఎల్ ఆన్-ది-గో షేరింగ్ ప్యాక్‌లు, 1,000 ఎంఎల్, 2,000 ఎంఎల్ హోమ్ ప్యాక్‌లు ఇందులో ఉన్నాయి. క్యాంపా డ్రింక్స్‌ను అన్ని వయసుల వారు ఇష్టపడతారని, ఎంతో చరిత్ర ఉన్న క్యాంపా పానీయాలను తిరిగి మార్కెట్లోకి తెస్తున్నందుకు సంతోషిస్తున్నామని రిలయన్స్ కన్సూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ప్రతినిధి తెలిపారు. ఎఫ్ఎంసీజీ వ్యాపారానికి ఇది మరో సాహసోపేతమైన ముందడుగు అని పేర్కొన్నారు. ఈ శీతల పానీయాల పోర్ట్‌ఫోలియోను ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో ప్రారంభించి దేశం అంతటా విస్తరించనున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: టాప్ సీక్రెట్ చెప్పిన గూగుల్ మాజీ వైస్ ప్రెసిడెంట్... ఇది ఉంటే జాబ్ పక్కా! -
కమర్షియల్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి ముఖేశ్ అంబానీ
సాక్షి,ముంబై: బిలియనీర్, పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యాపార విస్తరణలో దూసుకుపోతోంది. కమర్షియల్ రియల్ ఎస్టేట్ రంగానికి పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో తాజాగా ఈ వ్యాపారంలోకి అడుగుపెడుతోంది. ఇందుకోసం రిలయన్స్ ఆర్ఎస్ఏయూఎల్ (RSOUL) లిమిటెడ్ అనే కొత్త యూనిట్‌ను స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లలో ప్రకటించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ బీఎస్ఈ ఫైలింగ్ ప్రకారం, రిలయన్స్ సోయు లిమిటెడ్ (Reliance SOU Ltd ) అనే పూర్తిగా యాజమాన్య అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. తద్వారా వాణిజ్య రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దూకుడుగా వస్తోంది. ఈ సంస్థలో (ఆర్ఎస్ఓఎల్ ఈక్విటీ షేర్లలో) రూ. ఒక లక్ష ప్రారంభ మూలధనాన్ని పెట్టుబడి పెట్టినట్లు తెలిపింది. అయితే రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ డెవలప్మెంట్ రంగంలో రిలయన్స్‌ది ఇదే మొదటి అడుగు కాదు. 2019లో, ముంబై వ్యాపార కేంద్రమైన బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లో 65శాతం వాటాను రూ.1,105 కోట్లకు కొనుగోలు చేసింది. నెల తరువాత, ఇది రియల్ ఎస్టేట్ అభివృద్ధి కోసం రిలయన్స్ నవీ ముంబై ఇన్ఫ్రా డెవలప్మెంట్ను స్థాపించింది. జియో వరల్డ్ గార్డెన్ బాంద్రా కుర్లాలోని జియో వరల్డ్ సెంటర్ వంటి ముఖ్యమైన అభివృద్ధి ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. అలాగే గత ఏడాది సెప్టెంబర్ నాటికి రూ. 8,000 కోట్ల పెట్టుబడితో రిలయన్స్ అనుబంధ సంస్థ, మోడల్ ఎకనామిక్ టౌన్షిప్ లిమిటెడ్ (METL), ప్రస్తుతం హర్యానాలోని ఝజ్జర్‌లో సమీకృత పారిశ్రామిక టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేస్తోంది. తాజా నిర్ణయంతో కమర్షియల్ రియల్ ఎస్టేట్ రంగంలో అదానీ ప్రాపర్టీస్, టాటా రియల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, షాపూర్జీ పల్లోంజీ అండ్ కో వంటి దిగ్గజాలతో గట్టి పోటీ ఇవ్వనుందని అంచనా. -
అంబానీ కీలక నిర్ణయం: మరో రంగంలో సునామీకి సిద్ధం
సాక్షి, ముంబై: ఆసియా బిలియనీర్ రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ మరో రంగంలోకి అడుగు పెట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆయిల్, టెలికాం, రీటైల్ రంగాల్లో దూసుకుపోతున్న రిలయన్స్ ఇపుడిక హెల్త్ కేర్ సెక్టార్లో ప్రవేశించనుంది. అదీ స్థానికంగా లభించే ఇతర ఆఫర్ల కంటే తక్కువకే జినోమ్ మ్యాపింగ్ పరీక్షలను అందుబాటులోకి తీసుకురానుంది. స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ రూపొందించిన జినోమ్ కిట్‌ను 145 డాలర్లకు, మార్కెట్ ధరలతో పోలిస్తే దాదాపు 86 శాతం తక్కువకే అందించనుంది. కొన్ని జన్యుపరమైన రుగ్మతలు, వ్యాధులను గుర్తించడానికి ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. మైజియో యాప్‌లో రాబోయే వారాల్లో ఈ టెస్ట్‌ను దూకుడుగా మార్కెట్ చేయాలని రిలయన్స్ యోచిస్తోంది. ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జినోమ్ మ్యాపింగ్ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తోంది. క్యాన్సర్లు, న్యూరో-డీజెనరేటివ్ వ్యాధులు, గుండె సంబంధిత ప్రమాదాలు లాంటి వ్యాధులు, వాటి ప్రభావాలు తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఈ ప్రొఫైల్‌ని స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ అభివృద్ధి చేసింది. మరికొన్నివారాల్లో జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్ష కిట్‌ను కేవలం రూ.12 వేలకే అందుబాటులోకి తెస్తున్నట్లు స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో రమేష్ హరిహరన్ తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత చౌకైన జినోమిక్ ప్రొఫైల్ ఇదేనని రమేష్ హరిహరన్ తెలిపారు. ఫలితాలను వివరించడంలో స్ట్రాండ్ సరికొత్త శాస్త్రీయ పరిశోధనలను పొందుపరుస్తుందని హరిహరన్ తెలిపారు. ఈ పరీక్ష ఔషధాల అభివృద్ధికి సహాయపడే జీవసంబంధమైన డేటా రిపోజిటరీని రూపొందించడానికి కూడా అనుమతిస్తుందని ఆయన పేర్కొన్నారు. బెంగళూరుకు చెందిన ఈ సంస్థలో దాదాపు 80 శాతం వాటాలను రిలయన్స్ గ్రూప్ 2021లోనే కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అమెరికాలోని 23andMe స్టార్టప్ మాదిరిగా తక్కువ ఖర్చుతో భారతీయులందరికీ అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. ఇంకా MapmyGenome, Medgenome వంటి భారతీయ కంపెనీల పూర్తి జీనోమ్ సీక్వెన్సింగ్ 1,000డాలర్లు కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఈ నేపథ్యంలో తక్కువ ధరలో టెలికాం రంగంలో సునామీ సృష్టించిన అంబానీ తాజా నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది. -
ఐపీఎల్ 2023: అంబానీ పవర్ ప్లే: ఫ్రీ స్ట్రీమింగ్!
సాక్షి,ముంబై: ఐపీఎల్ 2023 సందర్భంగా బిలియనీర్ రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ అదిరి పోయే ప్లాన్ వేశారు. క్రికెట్ క్రేజ్‌ను క్యాష్చేసుకునేలా రిలయన్స్ సొంతమైన వయోకామ్ 18 మీడియా ద్వారా ప్రధాన ప్రత్యర్థులను ఢీకొట్టి మరీ ఈ బిడ్డింగ్‌ను గెల్చుకోవడమే కాదు ఇపుడిక ఉచితంగా ప్రసారాలను అందించనున్నారు. ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని వయాకామ్ 18 దాదాపు రూ. 23,758 కోట్లతో ఐపీఎల్ 20223 రైట్స్ గెల్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా భారతదేశపు అతిపెద్ద క్రికెట్ టోర్నమెంట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ని ఉచితంగా ప్రసారం చేయనుందని తెలుస్తోంది. ఫిఫా వరల్డ్ కప్ తరువాత 16వ ఐపీఎల్ లీగ్ ప్రసార హక్కులు దక్కించుకోవడం ఒక ఎత్తయితే ఉచితంగా అందించాలని భావించడం మరో ఎత్తు. డిస్నీ హాట్‌స్టార్ , అమెజాన్ ప్రైమ్ వంటి ప్రత్యర్థులను ఢీకొట్టి వయాకామ్ 18 స్ట్రీమింగ్ హక్కులను పొందడం ఇదే మొదటిసారి. డిస్నీ హాట్‌స్టార్ గత ఐదు సంవత్సరాలుగా ప్రసార హక్కులను కలిగి ఉంది. దీంతో అటు జియో 5జీ సేవ విస్తరణతో పాటు, పోటీ సంస్థలకు దెబ్బ అదిరిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వయాకామ్ 18 ఐపీఎల్ టోర్నమెంట్‌ను దాని రెండు OTT ప్లాట్‌ఫారమ్‌లు, వూట్, జియో సినిమా, ఒక TV ఛానెల్ ద్వారా ఉచితంగా ప్రసారం చేయాలని భావిస్తోందట. అదీ 4కే రిజల్యూషన్‌తో అందించనుందని తెలుస్తోంది. ఖతర్ ఫిఫా వరల్డ్ కప్-2022ను ఉచిత ప్రసారాలపై వచ్చిన విమర్శల నేపథ్యంలో ఐపీఎల్‌ను మాత్రం 4కే రిజల్యూషన్‌తో 12 భారతీయ భాషల్లో ఉచితంగా అందించాలని నిర్ణయించింది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్ సహా పలు భాషల్లో కామెంటరీ ఇస్తుందట. మరోవైపు ఈ ఐపీఎల్‌ను 550 మిలియన్ల కుపైగా మంది ప్రేక్షకులు చూస్తారని వయోకామ్ అంచనా వేస్తోంది. అయితే వయాకామ్ 18 మీడియా సీఈఓ (స్పోర్ట్స్), అనిల్ జయరాజ్ వ్యాఖ్యల్ని బట్టి ఐపీఎల్ మొదటి సంవత్సరం మాత్రమే జియో సినిమాలో ఉచితంగా చూడవచ్చని కూడా భావిస్తున్నారు. తాజా వార్తలపై వయాకామ్ 18 అధికారికంగా స్పందించాల్సి ఉంది. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ వయాకామ్ 18 రిలయన్స్ ప్రాజెక్ట్స్ అండ్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీసెస్ లిమిటెడ్ (RPPMSL) యాజమాన్యంలో ఉన్న వయాకామ్ 18 మీడియా ప్రైవేట్ లిమిటెడ్ (Viacom18), జియో సినిమా OTT ప్లాట్‌ఫారమ్‌ల విలీనానికి గత ఏడాదే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. -
ఈ ఏడాది ముఖేష్ అంబానీ జీతం ఎంతో తెలుసా!
బిలియనీర్ ముఖేష్ అంబానీ రెండో ఏడాది సైతం రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి జీతం తీసుకోలేదని తెలుస్తోంది. కోవిడ్-19 సంక్షోభం బిజినెస్, ఎకానమీపై ప్రభావం చూపింది. దీంతో గత ఆర్థిక సంవత్సరంలో ముఖేష్ అంబానీ తన రెమ్యునరేషన్ వదులుకున్నట్లు తెలుస్తోంది. జులై 22న రిలయన్స్ క్యూ1 వార్షిక ఫలితాల్ని విడుదల చేసింది. తాజాగా ముఖేష్ అంబానీ జీతం ఎంత తీసుకున్నారనే విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత ఆర్ధిక సంవత్సరంలో ముఖేష్ అంబానీ ఎలాంటి శాలరీ తీసుకోలేదని రిలయన్స్ వెల్లడించింది. కరోనా మహమ్మారి దేశ సామాజిక, ఆర్థిక, పారిశ్రామిక రంగంపై తీవ్ర నష్టాన్ని కలిగించింది. అందుకే ముఖేష్ అంబానీ 2020-21లో జీతం వద్దనుకున్నారని, అలాగే 2021-22లో సైతం ఎలాంటి రెమ్యునరేషన్ లేదని పేర్కొంది. దీంతో ఈ రెండేళ్లలో రిలయన్స్ సంస్థ అంబానీకి అందించే శాలరీతో పాటు అలవెన్సులు, విదేశీ ప్రయాణ ఖర్చులు, సోషల్ సెక్యూరిటీ, రిటైరల్ ప్రయోజనాలు, కమీషన్ లేదా స్టాక్ ఆప్షన్స్‌ను కోల్పోయారు. గడిచిన ఆర్ధిక సంవత్సరాల్లో 2020,2021,2022 మార్చి వరకు ముఖేష్ అంబానీ ఎలాంటి శాలరీ తీసులేదు. కానీ 2020కి ముందు ఆయన శాలరీ భారీగా ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఆ నివేదికల ప్రకారం.. ►రిలయన్స్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న ముఖేష్ అంబానీ మేనేజిరీయల్ కాంపన్సేష లెవల్స్ ఆర్డర్ ప్రకారం..2008-2009లో సుమారు రూ.15కోట్లు శాలరీ తీసుకున్నారు. ► నాటి నుంచి అంటే 2008-09 నుండి 2019-2020 వరకు ఈ 11ఏళ్ల కాలంలో ఏడాదికి జీతం రూ.15కోట్లు మాత్రమే తీసుకున్నారు. చదవండి👉ముఖేష్ అంబానీ స్కెచ్ మామూలుగా లేదుగా! ఇక ప్రత్యర్ధులకు చుక్కలే! -
నిరుద్యోగులకు అలర్ట్,'సాఫ్ట్వేర్' కొలువుల జాతర!
ముంబై: ఓమ్నీ చానల్, మల్టీ ప్లాట్‌ఫామ్ టెక్నాలజీ సంస్థ ఫైండ్.. 2022–23 నాటికి 2,000 మంది ఇంజనీర్లను నియమించుకోనున్నట్టు ప్రకటించింది. ఇందులో 800 మంది ఇంజనీర్లు దక్షిణాది నుంచి ఉంటారని తెలిపింది. ఈ సంస్థ బెంగళూరులో కొత్త కేంద్రాన్ని ప్రారంభించింది. ఇక్కడే ఎక్కువ మందిని నియమించుకోనున్నట్టు పేర్కొంది. ఈ సంస్థ రిలయన్స్ గ్రూపులో భాగం. ప్రస్తుతం 750 మంది ఉద్యోగులను కలిగి ఉంది. ఇందులో సగం మందిని గత ఆరు నెలల్లోనే నియమించుకోవడం గమనార్హం. వృద్ధిని కొనసాగించేందుకు వీలుగా ఉద్యోగులను పెంచుకోనున్నట్టు తెలిపింది. -
గ్రీన్ ఎనర్జీలో దూసుకుపోతున్న రిలయన్స్.. మరో కీలక నిర్ణయం
గ్రీన్ ఎనర్జీలో భారీ ఎత్తున పెట్టుబడులు పెడతామంటూ భవిష్యత్ ప్రణాళిక ప్రకటించిన రిలయన్స్ సంస్థ అందుకు తగ్గట్టుగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే జామ్‌నగర్ దగ్గర గిగా ఫ్యాక్టరీ పనులు కొనసాగిస్తూనే మరోవైపు గ్రీన్ టెక్నాలజీలో వివిధ సంస్థలతో జట్టు కడుతోంది రిలయన్స్. సోడియం ఐయాన్ బ్యాటరీ టెక్నాలజీలో ప్రపంచంలోనే పేరెన్నికగల ఫారడియన్ కంపెనీని రియలన్స్ కొనుగోలు చేసింది. ఈ కంపెనీలో వంద శాతం వాటాలను కొనుగోలు చేసినట్టు రిలయన్స్ ప్రకటించింది. యూకేలోని ఆక్స్ఫర్డ్, షేక్‌ఫీల్డ్ బేస్డ్గా వ్యాపారం నిర్వహిస్తున్న ఈ కంపెనీ మార్కెట్ వ్యాల్యూ 100 మిలియన్ పౌండ్లుగా ఉంది. కాగా మరో 25 మిలియన్ పౌండ్లను ఫారడియన్ కంపెనీ విస్తరణ, ఆర్ అండ్ డీ కోసం రిలయన్స్ కేటాయించనుంది. బ్యాటరీ తయారీలో వినియోగించే కోబాల్ట్, కాపర్, లిథియం, కాపర్, గ్రాఫైట్‌లతో పోల్చితే సోడియం ఉపయోగించడం సులువు. భూమిపై సోడియం నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి. కాబట్టి బ్యాటరీ తయారీ ఖర్చు గణనీయంగా తగ్గిపోతుంది. అంతేకాదు సోడియం ఐయాన్ బ్యాటరీలు త్వరగా ఛార్జ్ అవుతాయి. న్యూ ఎనర్జీకి సంబంధించి మేము నిర్ధేశించుకున్న లక్ష్యాలను చేరడానికి ఫారడియన్ టేకోవర్ ఎంతగానో ఉపకరిస్తుందని రియలన్స్ అధినేత ముకేశ్ అంబానీ అన్నారు. ఫారడియన్ దగ్గరున్న టెక్నాలజీని మరింత వేగంగా ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఆయన ప్రకటించారు. ఫారడియన్ని రిలయన్స్ టేకోవర్ చేయడం మంచి పరిణామం అని ఆ సంస్థ సీఈవో జేమ్స్ క్విన్ అన్నారు. -
కరోనా కాలంలో దూసుకెళ్తున్న రిలయన్స్ రిటైల్
కరోనా మహమ్మరీ కాలంలో కూడా రిలయన్స్ డీజిటల్ కామర్స్, రిలయన్స్ రిటైల్ వ్యాపారం గణనీయమైన వృద్దిని సాధించింది. రిలయన్స్ రిటైల్ 2020-21 ఆర్ధిక సంవత్సరంలో ఆదాయంలో 10 శాతం పెరుగుదల కనబరిచి రూ.1,53,818 కోట్లకు చేరుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజా వార్షిక నివేదిక ప్రకారం, డిజిటల్ వాణిజ్యం, మర్చెంట్ బిజినెస్ వ్యాపారం దాదాపు 10 శాతం ఆదాయాన్ని అందించింది. గత ఏడాది సున్నా దగ్గర నుంచి గణనీయంగా పెరిగింది. ఎఫ్వై 21లో ప్రీ-టాక్స్ లాభం 9,842 కోట్ల రూపాయలగా ఉంది. రిలయన్స్ రిటైల్ అన్ని వ్యాపారాలలో తన డిజిటల్ వాణిజ్యం, రిలయన్స్ రిటైల్ సామర్థ్యాలను బలోపేతం చేసింది. మారుతున్న వినియోగదారుల ప్రవర్తనలను తెలుసుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుంది. మారుతున్న కస్టమర్ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను పంపిణీ చేయడానికి, మొత్తం కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి ఇది కంపెనీకి భాగ సహకరిస్తుంది. గత ఏడాది భారతదేశపు అతిపెద్ద హైపర్‌లోకల్ ప్లాట్‌ఫామ్ జియోమార్ట్‌ను ప్రారంభించిన రిలయన్స్ ఆన్లైన్ ఫార్మసీ నెట్‌మెడ్స్, ఆన్లైన్ ఫర్నిచర్ రిటైలర్ అర్బన్ లాడర్, ఆన్లైన్ లోదుస్తుల రిటైలర్ జివామెలను సొంతం చేసుకుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ-కామర్స్ విభాగంలో తన ఆటను పెంచుకుంది. చదవండి: రూ.25,000 వేలలో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ -
ఆ డీల్ అమెజాన్‌కు ముందే తెలుసు!
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో తాము చేసుకున్న రూ.24,713 కోట్ల ఒప్పందం విషయం తమకు తెలియదని అమెజాన్ పేర్కొనడం సరికాదని ఫ్యూచర్ గ్రూప్ చేస్తున్న వాదనలను బలపరుస్తూ తాజాగా ఒక డాక్యుమెంట్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఒప్పందం విషయం అమెజాన్‌కు ముందే తెలుసని ఈ డాక్యుమెంట్ స్పష్టంచేస్తోంది. రిలయన్స్–ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందం విషయంలో తనకు పరిహారంగా రూ.40 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.290.41 కోట్లు) చెల్లించాలని కూడా అమెజాన్ డిమాండ్ చేసిందని డాక్యుమెంట్ ద్వారా వెల్లడైంది. . కిషోర్ బియానీ నేతృత్వంలోని సంస్థ అత్యవసర ఆర్ర్బిట్రేటర్– ఎస్ఐఏసీ (సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్ర్‌బిట్రేషన్ సెంటర్)కు ఈ మేరకు గత ఏడాది అక్టోబర్‌లో సమర్పించిన ఒక డాక్యుమెంట్ తాజాగా వెలుగుచూసింది. ‘‘2020 ఆగస్టులో 3వ ప్రతివాది (కిషోర్ బియానీ), 8వ ప్రతివాది (రాకేష్ బియానీ) అమెజాన్ తరఫున అభిజిత్ ముజుందార్ మధ్య రెండు ఫోన్ కాల్స్ చోటుచేసుకున్నాయి. ఫ్యూచర్–రిలయన్స్ డీల్‌కు ప్రతిగా 40 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని అభిజిత్ ముజుందార్ అడిగారు’’ అని 2020 అక్టోబర్ 12వ తేదీ డాక్యుమెంట్ పేర్కొంది. ఆగస్టులో ఈ ఫోన్ సంభాషణ జరిగితే నెల తర్వాత అక్టోబర్‌లో అమెజాన్ ఆర్ర్‌బిట్రేషన్ పక్రియను ప్రారంభించినట్లు తెలిపింది. కాగా, ఈ అంశంపై వివరణకు పంపిన ఈ–మెయిల్ సందేశాలకు అమెజాన్ ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. తన రిటైల్ అండ్ హోల్‌సేల్, లాజిస్టిక్స్ బిజినెస్‌ను రిలయన్స్ రిటైల్‌కు రూ.24,713 కోట్లకు విక్రయిస్తున్నట్లు ఫ్యూచర్స్ గ్రూప్ 2020 ఆగస్టు 29న ప్రకటించింది. ఇది ఎంతమాత్రం తగదని 2020 అక్టోబర్‌లో అమెజాన్ ఎస్ఐఏసీని ఆశ్రయించింది. ఫ్యూచర్ అన్‌లిస్టెడ్ సంస్థల్లో ఒకటైన ఫ్యూచర్స్ కూపన్స్ లిమిటెడ్‌లో (బీఎస్ఈ లిస్టెడ్ ఫ్యూచర్ రిటైల్‌లో ఫ్యూచర్స్ కూపన్స్ లిమిటెడ్‌కు కన్వెర్టబుల్ వారెంట్స్ ద్వారా 7.3 శాతం వాటా ఉంది) 49 శాతం వాటా కొనుగోలుకు 2019 ఆగస్టులో ఫ్యూచర్స్ లిమిటెడ్‌తో చేసుకున్న ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ, ఫ్యూచర్ కూపన్స్‌తో డీల్ కుదుర్చుకున్నప్పుడే .. మూడు నుంచి పదేళ్ల వ్యవధిలో ఎఫ్‌ఆర్‌ఎల్‌ను కూడా కొనుగోలు చేసేందుకు తమకు హక్కులు దఖలు పడ్డాయని అమెజాన్ పేర్కొంది. ఈ ఒప్పందంపై 90 రోజుల పాటు స్టే విధిస్తూ ఆర్బిట్రేషన్ ప్యానెల్ అక్టోబర్ 26వ తేదీ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం నుంచి ఫిబ్రవరి 8వ తేదీ వరకూ రెండు సంస్థల మధ్య సుదీర్థ న్యాయ పోరాటం జరుగుతోంది. చివరకు రెండు సంస్థల మధ్య న్యాయ పోరాటం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు రూలింగ్ కీలకం కానుంది. అమెజాన్‌ను ‘సుప్రీం’లో ఎదుర్కొంటాం ఫ్యూచర్ గ్రూప్ ప్రకటన రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో తాము చేసుకున్న రూ. 24,713 కోట్ల ఒప్పందం విషయంలో అమెజాన్‌పై సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తామని ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ (ఎఫ్ఆర్ఎల్) పేర్కొంది. స్టాక్ ఎక్స్చేంజీలకు సమర్పించిన ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఫ్యూచర్ రిటైల్ ఈ విషయాన్ని తెలిపింది. లక్ష కోట్ల రిటైల్ బిజినెస్ లక్ష్యం...! నిపుణుల విశ్లేషణ ప్రకారం చూస్తే, దేశవ్యాప్తంగా సుమారు 12,000 పైచిలుకు స్టోర్స్‌తో రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్ఆర్వీఎల్) అత్యంత వేగంగా రిటైల్ రంగంలో విస్తరిస్తోంది. దాదాపు 1 లక్ష కోట్ల డాలర్ల పైగా విలువ చేసే దేశీయ రిటైల్ వ్యాపార విభాగంలో వృద్ధి కోసం గత ఏడాది సెప్టెంబర్ మొదలుకుని ఇప్పటిదాకా దాదాపు రూ. 37,710 కోట్ల మేర పెట్టుబడులు సమీకరించింది. ఒకవేళ ఎఫ్ఆర్ఎల్ డీల్ కుదిరిన పక్షంలో దేశవ్యాప్తంగా ఆర్ఆర్వీఎల్ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోనుంది. ఇది అమెజాన్‌కు గట్టి పోటీని ఇస్తుంది. ఎఫ్ఆర్ఎల్ ప్రస్తుతం గ్రోసరీ చైన్ బిగ్బజార్సహా దేశ వ్యాప్తంగా 1,500కుపైగా స్టోర్లను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఒప్పందాన్ని అమెజాన్ వ్యతిరేకిస్తోంది. -
అమెజాన్‌కు ఎలాంటి పరిహారం చెల్లించం : కిశోర్ బియానీ
సాక్షి, న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో (ఆర్ఐఎల్) రిటైల్ ఆస్తుల విక్రయానికి కుదుర్చుకున్న ఒప్పందం సెబీ ఆమోదం లభిస్తే రెండు నెలల్లోపే పూర్తవుతుందన్న ఆశాభావాన్ని ఫ్యూచర్ గ్రూపు అధినేత కిశోర్ బియానీ వ్యక్తం చేశారు. ఫ్యూచర్ గ్రూపు పరిధిలో ఉన్న అన్ని రకాల రిటైల్, లాజిస్టిక్స్ ఆస్తుల విక్రయానికి ఆయన గతేడాది ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటికే ఫ్యూచర్ రిటైల్‌లో పరోక్షంగా 5 శాతం వాటా కలిగిన అమెజాన్ దీన్ని వ్యతిరేకిస్తూ సింగపూర్ ఆర్బిట్రేషన్‌కు వెళ్లడంతో డీల్‌కు అవరోధాలు ఏర్పడ్డాయి. ఈ అంశంలో కాంట్రాక్టు ఉల్లంఘన జరగనందున ఎటువంటి పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని ఫ్యూచర్ గ్రూప్ అమెజాన్‌కు స్పష్టం చేసింది. ఈ వివాదంపై బియానీ తన అంతరంగాన్ని ఓ వార్తా సంస్థతో పంచుకున్నారు. ‘‘ఒక్కసారి సెబీ ఆమోదం లభిస్తే ఎన్సీఎల్టీ, వాటాదారుల ఆమోదం తీసుకుంటాము. ఇందుకు 45-60 రోజులు పట్టొచ్చు. జనవరి చివర్లో ఆర్బిట్రేషన్ మొదలవుతుంది. డీల్, ఆర్బిట్రేషన్ ప్రక్రియ సమాంతరంగా కొనసాగుతాయి. ముకేశ్ అంబానీ ఆధ్వర్యంలోని గ్రూపుతో చేసుకున్న డీల్.. ఫ్యూచర్ గ్రూపు పరిధిలోని ఒకసంస్థ(ఫ్యూచర్ కూపన్స్)లో అమెజాన్‌కు ఉన్న వాటాకు సంబంధించినది కాదు’’అని కిశోర్ బియానీ వివరించారు. లాక్‌డాన్ కారణంగా తమ ఫ్యూచర్ రిటైల్ వ్యాపారం తీవ్ర ఇబ్బందుల్లోకి వెళ్లి, రుణ భారం భారీగా పెరిగిపోవడంతో సాయం కోసం అమెజాన్‌ను ఎన్నో సందర్భాలు సంప్రదించినా ఫలితం దక్కలేదని స్పష్టం చేశారు. ‘‘కోవిడ్, లాక్డౌన్ ఆరంభం నుంచి అమెజాన్‌తో అదే పనిగా సంప్రదింపుల్లోనే ఉన్నాము. ఈ విషయమై వారికి అవగాహన లేకపోవడం అన్న ప్రశ్నే లేదు. షేర్ల ధరలు పడిపోవడంతో తనఖాలో ఉంచిన షేర్ల విక్రయం విషయమై గతేడాది మార్చిలో అమెజాన్‌కు లేఖ కూడా రాయడం జరిగింది’’ అని బియానీ వివరించారు. అయినా, చూద్దాంలేనన్న స్పందన అమెజాన్ నుంచి వ్యక్తమైనట్టు చెప్పారు. (జెఫ్ బెజోస్ టాప్ : మరో రికార్డు) వాస్తవం కాదు..: అమెజాన్ ‘‘ఫ్యూచర్ రిటైల్‌కు ఎటువంటి సాయాన్ని ఆఫర్ చేయలేదనడం నిజం కాదు. ఒకవైపు భాగస్వాములతో పలు అవకాశాల పట్ల చర్చిస్తూనే..మరోవైపు ఫ్యూచర్ గ్రూపు ప్రమోటర్లతోనూ సంప్రదింపులు కొనసాగించాము. టర్మ్ షీట్‌పై సంతకం కూడా చేశాము’’ అంటూ అమెజాన్ అధికార ప్రతినిధి స్పందించారు. కాగా ముకేశ్ అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో 24,000 కోట్ల రూపాయల డీల్ తరువాత ఫ్యూచర్ గ్రూప్, అమెజాన్ మధ్య వివాదం నెలకొంది. ఆర్ఐఎల్తో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా తమ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని,ఇందుకు తమకునష్టపరిహారం చెల్లించాల్సి ఉందని అమెజాన్ అంతర్జాతీయ కోర్టును ఆశ్రయించింది. -
సీసీఐ ఓకే: ఆర్ఐఎల్, ఫ్యూచర్ షేర్లు గెలాప్
ముంబై, సాక్షి: రిటైల్ బిజినెస్‌ల విక్రయానికి రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో కుదుర్చుకున్న ఒప్పందానికి కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఫ్యూచర్ గ్రూప్ కౌంటర్లకు ఒక్కసారిగా డిమాండ్ పుట్టింది. ఈ బాటలో రిలయన్స్ రిటైల్ ద్వారా ఫ్యూచర్ గ్రూప్ ఆస్తుల కొనుగోలుకి డీల్ కుదుర్చుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ కౌంటర్లన్నీ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. అప్పర్ సర్క్యూట్స్ ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఫ్యూచర్ గ్రూప్‌లోని పలు లిస్టెడ్ కంపెనీల షేర్లు అప్పర్ అనుమతించినమేర అప్పర్ సర్య్యూట్లను తాకాయి. కొనుగోలుదారులు అధికంకాగా.. అమ్మేవాళ్లు కరువుకావడంతో ఫ్యూచర్ రిటైల్ షేరు 10 శాతం జంప్‌చేసింది. రూ. 79 ఎగువన ఫ్రీజయ్యింది. ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్స్ సైతం 10 శాతం లాభపడి రూ. 90.5 వద్ద నిలిచింది. ఈ బాటలో ఫ్యూచర్ సప్లై చైన్ సొల్యూషన్స్ 5 శాతం పురోగమించి రూ. 103 సమీపంలో ఫ్రీజయ్యింది. ఇదే విధంగా ఫ్యూచర్ కన్జూమర్ 5 శాతం పెరిగి రూ. 8.25 వద్ద, ఫ్యూచర్ ఎంటర్ప్రైజ్ 5 శాతం పుంజుకుని రూ. 10.40 వద్ద ఫ్రీజయ్యాయి. ఇక డైవర్సిఫైడ్ దిగ్గజం ఆర్ఐఎల్ షేరు 3.2 శాతం బలపడి రూ. 1,959 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1,970 వరకూ ఎగసింది. కాగా.. ఆర్ఐఎల్తో ఫ్యూచర్ గ్రూప్ కుదుర్చుకున్న ఒప్పందానికి ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. డీల్‌ను నిలిపివేయమంటూ భాగంగా సింగపూర్ ఆర్బిట్రేషన్ కోర్టులో ఫిర్యాదు చేసింది. తద్వారా తాత్కాలిక ఉత్తర్వులను సైతం పొందింది. ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన రిటైల్, హోల్‌సేల్, లాజిస్టిక్స్ తదితర బిజినెస్‌ల కొనుగోలుకి రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 24,713 కోట్లకు ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. -
రిలయన్స్ @ రూ.2000
దేశీయ ప్రైవేట్ రంగ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు బుధవారం రూ.2000లు అందుకుంది. నేడు బీఎస్ఈలో ఈ కంపెనీ షేరు రూ.1980 వద్ద మొదలైంది. మార్కెట్ ప్రారంభం నుంచి సూచీలు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నప్పటికీ.., రిలయన్స్ షేరు స్థిరమైన ర్యాలీ చేసింది. ఫలితంగా ఒక దశలో 1.50శాతం లాభపడి రూ.2000 మార్కును అందుకుంది. ఈ ధర షేరుకు కొత్త జీవితకాల గరిష్టస్థాయి కావడం విశేషం. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.12.6లక్షల కోట్లను అందుకుంది. ఉదయం గం.11:30ని.లకు షేరు క్రితం ముగింపు(రూ.1971.85)తో పోలిస్తే 1శాతం లాభంతో రూ.1992 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ ఏడాది (2020)లో రియలన్స్ షేరు 32శాతం ర్యాలీ చేసింది. ఇటీవల మార్చి కనిష్ట స్థాయి(రూ.867.82) నుంచి ఏకంగా 130 శాతం లాభపడటం విశేషం. బోర్డు సమావేశం జూలై 31కు వాయిదా: రియలన్స్ ఇండస్ట్రీస్ బోర్డు డైరెక్టర్ల సమావేశాన్ని జూలై 24నుంచి జూలై 30కు వాయిదా వేస్తున్నట్లు ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చింది. దీంతో రియలన్స్ క్యూ1 గణాంకాలు జూలై 30వ తేదిన వెల్లడి కానున్నాయి. -
ఆర్ఐఎల్ ఏజీఎం- ముకేశ్ గ్రూప్ షేర్ల హవా
డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ వర్చువల్ ప్రాతిపదికన నేడు వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం) నిర్వహిస్తోంది. ఇటీవల డిజిటల్ అనుబంధ విభాగం రిలయన్స్ జియోకు తరలివచ్చిన విదేశీ పెట్టుబడులు, ఆర్ఐఎల్ చేపట్టిన రైట్స్ ఇష్యూ నేపథ్యంలో ఏజీఎంకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. గత ఏజీఎంలో రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీ పేర్కొన్న గడువుకంటే ముందుగానే ఆర్ఐఎల్ రుణరహిత దిగ్గజంగా ఆవిర్భవించిన నేపథ్యంలో ప్రస్తుత సమావేశంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ముకేశ్ అంబానీ వెల్లడించనున్న ప్రణాళికలపై అంచనాలతో ఇన్వెస్టర్లు ఆర్ఐఎల్ గ్రూప్ కౌంటర్లలో కొనుగోళ్లకు ఎగబడుతున్నారు. దీంతో ముకేశ్ అంబానీ గ్రూప్ షేర్లు భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. జోరుగా హుషారుగా ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఆర్ఐఎల్ షేరు 2.2 శాతం ఎగసి రూ. 1960 వద్ద ట్రేడవుతోంది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. ఇటీవలే కంపెనీ మార్కెట్ విలువ రూ. 12 లక్షల కోట్లను అధిగమించింది. తద్వారా ఈ ఘనతను సాధించిన తొలి దేశీ కంపెనీగా రికార్డ్ నెలకొల్పింది. ఈ ప్రభావంతో గ్రూప్‌లోని ఇతర కంపెనీల కౌంటర్లు సైతం జోరందుకున్నాయి. హాథవే కేబుల్ అండ్ డేటాకామ్ 13 శాతం దూసుకెళ్లి రూ. 47 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 50 సమీపంలో ఏడాది గరిష్టాన్ని తాకింది. ఇతర కౌంటర్లలో డెన్ నెట్వర్క్స్, 5.25 శాతం జంప్‌చేసి రూ. 94 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 97 సమీపంవరకూ ఎగసింది. ఇక రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 0.5 శాతం బలపడి రూ. 461 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో రూ. 468ను దాటింది. ఇటీవల ర్యాలీ రెండు రోజులుగా దూకుడు చూపుతున్న హాథవే కేబుల్ షేరు గత నెల రోజుల్లో 73 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! ఇదే విధంగా రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైతం 46 శాతం లాభపడింది. ఈ బాటలో టీవీ18 బ్రాడ్‌క్యాస్ట్, నెట్వర్క్ 18 మీడియా, డెన్ నెట్వర్క్స్ 12-40 శాతం మధ్య ఎగశాయి. -
ప్రపంచ కుబేరుల్లో 6వ స్థానానికి ముకేశ్
ఆసియా కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముకేశ్ అంబానీ మరో ఘనత సాధించాడు. ప్రపంచ కుబేరుల జాబితాలో 6వ స్థానానికి ఎగబాకారు. సిలికాన్ వ్యాలీ టెక్ దిగ్గజం ఎలెన్ మస్క్‌ను, గూగుల్ సహ-వ్యవస్థాపకులు బ్రెయిన్, లారీ పేజ్‌లను అధిగమించడం ద్వారా ఈ ఘనతను సాధించినట్లు బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకటించింది. ప్రస్తుతం ముఖేష్ అంబానీ సంపద 72.4బిలియన్ డాలర్లుగా ఉంది. అమెరికా టెక్ షేర్లు సోమవారం భారీ పతనాన్ని చవిచూశాయి. షేర్ల పతనంతో లారీ పేజ్ సంపద 71.6బిలియన్ డాలర్లకు, బ్రెయిన్స్ సంపద 69.4బిలియన్ డాలర్లకు, టెస్లా అధినేత మస్క్ సంపద 68.6బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గతవారంలో చివర్లో ఇదే సంపద విషయంలో స్టాక్ మార్కెట్ దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్‌ను అధిగమించిన సంగతి తెలిసిందే. కరోనా కట్టడికి ఈమార్చి నుంచి పలు దేశాలు విధించిన లాక్‌డౌన్‌తో అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఇటువంటి క్లిష్టతరుణంలో ముఖేష్ అంబానీ జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఫేస్బుక్, సిల్వర్‌లేక్, క్వాల్‌కాంతో సహా సుమారు 12 విదేశీ కంపెనీలకు 25.24 శాతం వాటా విక్రయం ద్వారా 13 విదేశీ సంస్థల నుంచి రూ.1.18 లక్షల కోట్ల మేర నిధులు సమీకరించింది. ఫలితంగా రిలయన్స్ షేరు మార్చి కనిష్టస్థాయి నుంచి రెట్టింపు లాభాల్ని ఆర్జించింది. భారత్‌లో శరవేగంగా వృద్ధి చెందుతున్న డిజిటల్ వ్యాపారాన్ని దృష్టి పెట్టుకుని ముకేశ్ ఈ-కామర్స్ రంగంలో వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద జనాభ కలిగిన మనదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక విదేశీ కంపెనీలు... ముఖ్యంగా అమెరికా ఆధారిత కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. అందులో భాగంగా నిన్నటి రోజులన వచ్చే 5–7 సంవత్సరాల్లో సుమారు రూ. 75 వేల కోట్లు (దాదాపు 10 బిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు గూగుల్ కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
మూడో రోజూ మార్కెట్లు లాభాలతో!
నేడు (3న) దేశీ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.25 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 46 పాయింట్లు బలపడి 10,598 వద్ద ట్రేడవుతోంది. గురువారం ఎన్ఎస్ఈలో నిఫ్టీ జులై నెల ఫ్యూచర్స్ 10,552 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. జూన్‌లో 4.8 మిలియన్ ఉద్యోగాల కల్పన జరిగినట్లు కార్మిక శాఖ వెల్లడించడంతో గురువారం యూఎస్ మార్కెట్లు 0.5 శాతం లాభపడ్డాయి. ప్రస్తుతం ఆసియాలో మార్కెట్లన్నీ సానుకూలంగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు దేశీ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు హుషారుగా ప్రారంభమయ్యే అవకాశమున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తదుపరి యధాప్రకారం ఒడిదొడుకులను చవిచూడవచ్చని భావిస్తున్నారు. జియోలో ఇంటెల్ రిలయన్స్ జియోలో టెక్ దిగ్గజం ఇంటెల్ కార్ప్ 0.39 శాతం వాటా కొనుగోలు చేయనుంది. ఇందుకు దాదాపు రూ. 1895 కోట్లను వెచ్చించనుంది. దీంతో రిలయన్స్ జియోలో 25.1 శాతం వాటా విక్రయం ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 1.17 లక్షల కోట్లను సమీకరించినట్లయింది. వ్యాక్సిన్ పుష్ యూఎస్ ఫార్మా దిగ్గజం ఫైజర్ ఇంక్ కోవిడ్-19 చికిత్సకు అభివృద్ధి చేస్తున్న ఔషధంపై ఆశలతో గురువారం దేశీ స్టాక్ మార్కెట్లు జోరందుకున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్ 429 పాయింట్లు జంప్‌చేసి 35,844 వద్ద ముగిసింది. తద్వారా 36,000 పాయింట్ల మైలురాయికి చేరువలో నిలిచింది. వెరసి రెండు రోజుల్లో సెన్సెక్స్ 928 పాయింట్లు ర్యాలీ చేసింది. నిఫ్టీ సైతం 122 పాయింట్లు పెరిగి 10,552 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కదలికలు? నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్ఎస్ఈ నిఫ్టీకి తొలుత 10,492 పాయింట్ల వద్ద, తదుపరి 10,432 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 10,605 పాయింట్ల వద్ద, ఆపై 10,658 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 21,781 పాయింట్ల వద్ద, తదుపరి 21,609 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్ నిఫ్టీకి తొలుత 22,235 పాయింట్ల వద్ద, తదుపరి 22,517 స్థాయిలో రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని భావిస్తున్నారు. ఎఫ్‌పీఐల అమ్మకాలు నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 557 కోట్ల అమ్మకాలు నిర్వహించగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 909 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 1696 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 1377 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. -
రిలయన్స్ షేరు ర్యాలీ ఇప్పట్లో ఆగదు
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ర్యాలీ మరింత కాలం కొనసాగే అవకాశం ఉందని స్టాక్ మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాప్తితో గత ఈక్విటీ మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూసిన సందర్భంలో... రిలయన్స్ షేరు ధర కేవలం 3నెలల్లో రెట్టింపు అయ్యింది. ఈ మార్చి 23న రూ.868 వద్ద ఉన్న షేరు జూన్ 20నాటికి రూ.1761కి చేరుకుంది. ఇంతటి స్థాయిలో ర్యాలీ చేసినప్పటికీ.., పలు బ్రోకరేజ్ సంస్థలు షేరుపై ‘‘బుల్లిష్’’ వైఖరిని కలిగి ఉన్నాయి. ఈ షేరుకు మొత్తం 17 బ్రోకరేజ్ సంస్థలు ‘‘స్ట్రాంగ్ బై’’ రేటింగ్‌ను, 8 కంపెనీలు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించాయి. మరోవైపు 3 బ్రోకరేజ్ సంస్థలు ‘‘సెల్’’ రేటింగ్‌ను ఇవ్వగా, 1 బ్రోకరేజ్ సంస్థ ‘‘స్ట్రాంగ్ సెల్’’ రేటింగ్‌ను ఇచ్చింది. మరో 3ఏళ్లలో షేరు ధర రెట్టింపు: ప్రభుదాస్ లిల్లాధర్ బ్రోకరేజ్ షేర్ హోల్డర్ల కోణంలో పరిశీలిస్తే వచ్చే 3ఏళ్లలో షేరు మరోసారి రెట్టింపు అయ్యే అవకాశాలున్నాయని ప్రభుదాస్ లిల్లాధర్ బ్రోకరేజ్ సంస్థ రీసెర్చ్ విశ్లేషకుడు అజయ్ బోడ్కే తెలిపారు. భారత క్యాపిటల్ మార్కెట్లో అతి తక్కువ కాల వ్యవధిలో రూ.1లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం అనేది అరుదుగా జరిగే సంఘటనగా ఆయన అభివర్ణించారు. ‘‘భారత్ జనాభాలో ఆరోవంతు అవసరాల్లో జియో భాగం కానుంది. రిటైల్, టెలికాం, కన్జ్యూమర్ కేంద్రీకృత వ్యాపారాల వృద్ధి రిలయన్స్ షేరు ర్యాలీకి సహకరిస్తాయి. ఈ షేరు మార్చి కనిష్టస్థాయి నుంచి డ్రీమ్ ర్యాలీ చేసింది. షేర్ హోల్డర్ల కోణంలో పరిశీలిస్తే వచ్చే 3ఏళ్లలో షేరు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది.’’ అని అజయ్ బోడ్కే తెలిపారు. వచ్చే 2-5ఏళ్లలో జియో వాల్యూయేషన్ 200 బిలియన్ డాలర్లు: కేఆర్ చౌక్సీ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే 2-5ఏళ్లలో జియో ప్లాట్‌ఫాం 200 బిలియన్ డాలర్ల వాల్యూయేషన్స్‌ను సాధించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కేఆర్ చౌక్సీ ఇన్వెస్ట్మెంట్స్ మేనేజర్ దేవన్ చౌక్సీ అన్నారు. జియో ప్లాట్‌ఫామ్ సామర్థ్యాన్ని గూగుల్, ఆపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి వాటితో పోలిస్తున్నారు. కంపెనీని రుణ రహితంగా మారుస్తామని ఇచ్చిన వాగ్ధానాన్ని ముకేశ్ నిలబెట్టుకున్నారని ఆయన తెలిపారు. రిటైల్, హెల్త్‌కేర్, పేమెంట్స్ గేమింగ్ అండ్ ఎడ్యుకేషన్, మీడియా, ఎంటర్టైన్మెంట్ వంటి అనేక పెద్ద మొత్తంలో వ్యాపార అవకాశాల కోసం రిలయన్స్ పూర్తి ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించిందని చౌక్సీ చెప్పారు. ఆశావాదం విస్తృతంగా వ్యాపించింది: ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ కంపెనీపై ఆశావాదం విస్తృత స్థాయిలో వ్యాపించడంతో షేరు మరి కొంతకాలం ర్యాలీ చేసేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ అయాన్ ముఖోపాధ్యాయ్ అన్నారు. ఇంకా చాలా ఫండింగ్ సంస్థలు ఈ షేరును కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. ఇటీవల స్టాక్ విభజన జరగవచ్చనే ఊహాగానాలు కూడా వెలుగులోకి వచ్చాయని ఆయన తెలిపారు. రిలయన్స్ వ్యాపారాల విభజన జరిగి వేర్వేరు సంస్థలుగా ఎక్చ్సేంజీల్లో లిస్ట్ కావచ్చన్నారు. దీంతో మరిన్ని పెట్టుబడులను రిలయన్స్‌ను ఆకర్షించేందుకు అవకాశం ఉందిని ముఖోపాధ్యాయ్ అభిప్రాయపడ్డారు. నిర్ణయించిన గడువుకు ముందే కంపెనీని నికర రుణరహితంగా మారుస్తామని ఇచ్చిన హామిని ముకేశ్ అంబానీ నిలబెట్టుకోవడంతో ఇన్వెస్టర్లు రిలయన్స్ షేరు కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. వాస్తవానికి వచ్చే ఏడాది మార్చి 31వ తేదిలోగా కంపెనీని రుణ రహిత కంపెనీగా మారుస్తామని గతంలో కంపెనీ ఛైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు. రిలయన్స్ అనుబంధ సంస్థ జియో ఫ్లాట్‌ఫామ్ పెట్టుబడుల ప్రవాహం పెరగడంతో పాటు దేశంలో అతిపెద్ద రైట్స్ ఇష్యూను విజయవంతం చేయడంతో కంపెనీ మార్కెట్ క్యాప్ తొలిసారి 150బిలియన్ డాలర్లను అందుకుంది. ఈ క్రమంలో 150బిలియన్ డాలర్లను అందుకున్న తొలి భారతీయ కంపెనీగా రిలయన్స్ చరిత్ర సృష్టించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ కేవలం 58 రోజుల్లో రూ.1,68,818 కోట్లను సమీకరించింది. ఇందులో జియోలో వాటా విక్రయంతో రూ.115,693.95 కోట్లను, రైట్స్ ఇష్యూ ద్వారా రూ.53,124.20 కోట్లును సేకరించింది. గతంలో పెట్రో-రిటైల్ జాయింట్ వెంచర్లో బ్రిటన్ సంస్థ బీవీకి వాటాను విక్రయించడంతో రూ.7వేల కోట్లకు విక్రయించడంతో మొత్తం రూ.1.75లక్షల కోట్లు నిధుల సమీకరణ చేయగలిగింది.