కరోనా మహమ్మరీ కాలంలో కూడా రిలయన్స్ డీజిటల్ కామర్స్, రిలయన్స్ రిటైల్ వ్యాపారం గణనీయమైన వృద్దిని సాధించింది. రిలయన్స్ రిటైల్ 2020-21 ఆర్ధిక సంవత్సరంలో ఆదాయంలో 10 శాతం పెరుగుదల కనబరిచి రూ.1,53,818 కోట్లకు చేరుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజా వార్షిక నివేదిక ప్రకారం, డిజిటల్ వాణిజ్యం, మర్చెంట్ బిజినెస్ వ్యాపారం దాదాపు 10 శాతం ఆదాయాన్ని అందించింది. గత ఏడాది సున్నా దగ్గర నుంచి గణనీయంగా పెరిగింది. ఎఫ్‌వై 21లో ప్రీ-టాక్స్ లాభం 9,842 కోట్ల రూపాయలగా ఉంది.
రిలయన్స్ రిటైల్ అన్ని వ్యాపారాలలో తన డిజిటల్ వాణిజ్యం, రిలయన్స్ రిటైల్ సామర్థ్యాలను బలోపేతం చేసింది. మారుతున్న వినియోగదారుల ప్రవర్తనలను తెలుసుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుంది. మారుతున్న కస్టమర్ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను పంపిణీ చేయడానికి, మొత్తం కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి ఇది కంపెనీకి భాగ సహకరిస్తుంది. గత ఏడాది భారతదేశపు అతిపెద్ద హైపర్‌లోకల్ ప్లాట్‌ఫామ్ జియోమార్ట్‌ను ప్రారంభించిన రిలయన్స్ ఆన్‌లైన్ ఫార్మసీ నెట్‌మెడ్స్, ఆన్‌లైన్ ఫర్నిచర్ రిటైలర్ అర్బన్ లాడర్, ఆన్‌లైన్ లోదుస్తుల రిటైలర్ జివామెలను సొంతం చేసుకుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ-కామర్స్ విభాగంలో తన ఆటను పెంచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment