
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ విక్రయ సంస్థ రిలయన్స్ డిజిటల్ ‘డిజిటల్ డిస్కౌంట్ డేస్’ సేల్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా బ్యాంకు కార్డులపై, పేపర్ ఫైనాన్స్ పై రూ. 25000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఏప్రిల్ 4 నుండి 20 వరకు అన్ని రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్స్, ఆన్‌లైన్‌లో సంస్థ వెబ్‌సైట్‌లో ఈ సేల్ అందుబాటులో ఉంటుంది.
అన్ని ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై ఆఫర్లు చెల్లుతాయని, సులభ ఫైనాన్సింగ్, ఈఎమ్ఐ ఎంపికలు, వేగవంతమైన డెలివరీ, ఇన్‌స్టాలేషన్ వంటి సదుపాయాలు ఉంటాయని కంపెనీ తెలిపింది. వేసవి నేపథ్యంలో ఏసీలు, విస్తృత శ్రేణి ఏయిర్ కూలర్స్ పైనా మంచి డీల్స్ ఉన్నాయి.
ల్యాప్‌టాప్స్, సరికొత్త స్మార్ట్ ఫోన్స్, టీవీలపై భారీగా తగ్గింపులు అందిస్తోంది. ఇక యాపిల్ ఏయిర్ పాడ్స్, యాపిల్ వాచ్ వంటి ప్రీమియం గ్యాడ్జెలను తక్కువ ఈఎమ్ఐలకు అందుబాటులో ఉన్నాయి. అలాగే గృహోపకరణాలు, కిచెన్ పరికరాలపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు అందిస్తోంది.