discount
-
ఆఫర్లే.. ఆఫర్లు!..ఐదు రోజులు మాత్రమే
రిపబ్లిక్ డే దగ్గర పడుతున్న సందర్బంగా.. ఇప్పటికే పలు ఈ కామర్స్ సంస్థలు ఆఫర్స్ అందించడం మొదలుపెట్టేశాయి. ఈ తరుణంలో స్మార్ట్ బజార్ (SMART Bazaar) 'ఫుల్ పైసా వసూల్ సేల్' ప్రారంభించడానికి సిద్ధమైంది. ఈ సేల్ 2025 జనవరి 22 నుంచి 26 వరకు మాత్రమే ఉంటుంది.స్మార్ట్ బజార్ ప్రారంభించనున్న ఈ ఫుల్ పైసా వసూల్ సేల్ ద్వారా భారీ డిస్కౌంట్స్ లభించనున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 900 కంటే ఎక్కువ స్టోర్లలో కస్టమర్లు ఈ డిస్కౌంట్స్ పొందవచ్చు. కేవలం 799 రూపాయలకే 5 కేజీల బియ్యం 3 లీటర్ల నూనె, కూల్ డ్రింక్స్ మూడు కొంటే.. ఒకటి ఫ్రీ, బిస్కెట్లు రెండు కొంటే.. ఒకటి ఫ్రీ, డిటర్జెంట్లపై 33 శాతం తగ్గింపు వాణి వాటితో పాటు చాక్లెట్లు, గృహాలంకరణ, దుస్తులపై కూడా మంచి డిస్కౌంట్స్ లభిస్తాయి.నిల్వ చేసుకోగలిగిన నిత్యావసర వస్తువులు, కిరాణా వస్తువులను కొనుగోలు చేయడానికి ఇది ఓ మంచి అవకాశం. స్మార్ట్ బజార్ ఫుల్ పైసా వసూల్ సేల్ ద్వారా కస్టమర్లు కొంత మొత్తంలో ఆదా చేసుకోవచ్చు. కంపెనీ దీనికి సంబంధించిన ఓ చిన్న వీడియోను తన ఎక్స్ (Twitter) ఖాతాలో షేర్ చేసింది.Delhi, Goa, Kashmir, Kerala. Secure karo apne travel plans best luggage ke saath. Visit SMART Bazaar Full Paisa Vasool Sale. Live from 22nd to 26th January. #SMARTBazaar #FullPaisaVasoolSale #MehengaiKaMeter#Sale pic.twitter.com/a2ygGiuqhE— SMART Bazaar (@SMARTBazaarIn) January 20, 2025 -
ఐఫోన్ కొనడానికి ఇదే మంచి సమయం!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) రిపబ్లిక్ డేకి ముందే.. మాన్యుమెంటల్ సేల్‌ను నిర్వహిస్తోంది. సేల్ సమయంలో, స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు & ఇతర అనేక ఎలక్ట్రానిక్ వస్తువులపై బ్యాంక్ ఆఫర్లు మాత్రమే కాకుండా.. భారీ తగ్గింపులను కూడా అందించనుంది. ఇందులో భాగంగానే ఐఫోన్ 16 కొనుగోలుపై అద్భుతమైన డిస్కౌంట్ ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు.. ఇక్కడ వివరంగా చూసేద్దాం.ఆపిల్ ఐఫోన్ 16 (Apple iPhone 16)ఐఫోన్ 16 125జీబీ వేరియంట్ ధర రూ. 79,999. అయితే ఫ్లిప్‌కార్ట్ మాన్యుమెంటల్ సేల్ సమయంలో ఇది రూ. 69,999లకే లభిస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఐఫోన్ 16పై 12 శాతం డిస్కౌంట్ లభిస్తోందని స్పష్టమవుతోంది. డిస్కౌంట్ మాత్రమే కాకుండా.. కొనుగోలుదారులు బ్యాంక్ ఆఫర్స్ & ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ వంటివి పొందవచ్చు.ఇతర ఆఫర్స్ఐఫోన్ 16 కొనుగోలు చేయాలనుకునే వారు.. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా ఈఎమ్ఐ కింద కొనుగోలు చేస్తే.. 10 శాతం లేదా రూ.1,500 తగ్గింపు పొందవచ్చు.అంతే కాకుండా HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ.1,000 తగ్గింపు లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద గరిష్టంగా రూ. 42150 వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే ఎక్స్ఛేంజ్ ఆఫర్ అనేది మీరు ఎక్స్ఛేంజ్ చేస్తున్న మొబైల్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది.ఐఫోన్ 16 డీటెయిల్స్ఐఫోన్ 16 కొత్త కెమెరా లేఅవుట్, కొత్త జెన్ చిప్సెట్.. ఆపిల్ ఇంటెలిజెన్స్ వంటి కొన్ని ప్రధాన అప్గ్రేడ్లతో వస్తుంది . ఆపిల్ కెమెరా ఫీచర్లను యాక్సెస్ చేయడానికి లేదా ఏఐ పవర్డ్ విజువల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌ని యాక్టివేట్ చేయడానికి ఉపయోగించే కొత్త కెమెరా కంట్రోల్ బటన్‌ను కూడా పరిచయం చేసింది. ఐఫోన్ 16 మెరుగైన పనితీరు కోసం 8జీబీ ర్యామ్ కలిగిన ఏ18 చిప్ కూడా పొందుతుంది.ఆపిల్ విజన్ ప్రో కోసం.. స్మార్ట్‌ఫోన్ నిలువుగా ఉన్న కెమెరా మాడ్యూల్స్ పొందుతుంది. ఇది 48 మెగా పిక్సెల్ ఫ్యూజన్ కెమెరా, 12 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాను పొందుతుంది. కాబట్టి ఇది మంది ఫొటోగ్రఫీ అనుభూతిని అందిస్తుంది. మొత్తం మీద కొంత తక్కువ ధర వద్ద ఐఫోన్ 16 కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం అని స్పష్టమవుతోంది.భారీగా పెరిగిన ఐఫోన్ ఎగుమతులుదేశంలో తయారవుతున్న ఐఫోన్ ఎగుమతుల విలువ 2024 ఏడాదిలో రూ.1.08 లక్షల కోట్లుగా ఉంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 42% పెరుగుదలను సూచిస్తుంది. ఈ ఎగుమతులు గణనీయంగా పెరగడానికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం(PLI) కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్‌లో ఐఫోన్ల వాడకం కూడా పెరగడం గమనార్హం. స్థానికంగా గతంలో కంటే వీటి వినియోగం 15-20%కి పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి.ఇదీ చదవండి: రూ.86 లక్షల కోట్ల సామ్రాజ్యం.. వారసుడిని ప్రకటించిన వారెన్ బఫెట్ఆపిల్ తయారీ కేంద్రాలుభారతదేశంలో ఆపిల్ ప్రధాన తయారీదారులుగా ఫాక్స్‌కాన్, టాటా ఎలక్ట్రానిక్స్, పెగట్రాన్ వంటి కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలతోపాటు ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించింది. దాంతో వీటి ఉత్పాదకత పెరిగింది. ఆయా కంపెనీల్లో బ్లూకాలర్ ఉద్యోగాలు సైతం గణనీయంగా పెరిగాయి. ఇటీవల కాలంలో ఏడాదిలో 1,85 వేల ఉద్యోగాలు కొత్తగా సృష్టించబడినట్లు కంపెనీల అధికారులు పేర్కొన్నారు. వీటిలో 70 శాతానికి పైగా మహిళలకే అవకాశం ఇచ్చినట్లు చెప్పారు. -
కొత్త సంవత్సరంలో లేటెస్ట్ ఐఫోన్.. బంపర్ డిస్కౌంట్
కొత్త సంవత్సరంలో ఐఫోన్ (iPhone) కొనాలని ప్లాన్ చేస్తున్నారా? భారీ డీల్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం. ఫ్లి ప్కార్ట్ (Flipkart) ఐఫోన్ 15 (iPhone 15)పై గొప్ప డీల్‌ని తీసుకొచ్చింది. ఈ డీల్‌ని సద్వినియోగం చేసుకుంటే ఐఫోన్ 15 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను అతి తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.ఇలా చేస్తే రూ.50,999కే ఐఫోన్ 15యాపిల్ (Apple) అధికారిక వెబ్సైట్లో ఐఫోన్ 15 అసలు ధర 128జీబీ వేరియంట్‌కు రూ.69,900 లుగా ఉంది. ఇదే ఐఫోన్ 15 గ్రీన్ కలర్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 57,999 ధరతో లిస్ట్ అయింది. అన్ని ఇతర కలర్ వేరియంట్లు రూ. 58,999 వద్ద ఉన్నాయి.అయితే మీరు ఈ ఫోన్‌ను రూ.50,999కి కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ టీజర్ చిత్రం ప్రకారం.. ఐఫోన్ 15పై రూ. 1,000 బ్యాంక్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఎక్స్చేంజ్ చేసుకోవడానికి పాత ఫోన్ ఉన్నట్లయితే ఆ ఫోన్ ద్వారా రూ. 6000 వరకు అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్ అందుబాటులో ఉంటుంది. ఈ రెండు ఆఫర్ల తర్వాత, ఫోన్ ప్రభావవంతమైన ధర రూ. 50,999. అయితే ఎక్స్ఛేంజ్ బోనస్ విలువ ఫోన్ పరిస్థితి, బ్రాండ్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది.ఐఫోన్ 15 స్పెక్స్ఐఫోన్ 15 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్ప్లేతో వస్తుంది. ఫోన్లో యాపిల్ బయోనిక్ ఎ16 (Bionic A16) చిప్సెట్ ఉంటుంది. ఇది 5-కోర్ జీపీయూతో వస్తుంది. ఫోన్లో డైనమిక్ నాచ్ కూడా ఉంది. ఫోటోగ్రఫీ కోసం డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 12 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 12 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది. ఇక చార్జింగ్ విషయానికి వస్తే.. యూఎస్బీ టైప్-సి పోర్ట్ వస్తుంది. ఛార్జింగ్ కేబుల్ ఫోన్ బాక్స్‌లోనే వస్తుంది. -
విద్యార్థులకు ఎయిరిండియా టికెట్ ధరలో ఆఫర్
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా దేశంలోని ఇతర ప్రాంతాలతోపాటు, విదేశాలకు వెళ్లే విద్యార్థులకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఉన్నత చదువుల కోసం దేశంలో ఇతర ప్రాంతాలతోపాటు, ఇతర దేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థులకు విమాన ధరలో 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది. అదనంగా 10 కిలోల వరకు బ్యాగేజ్‌ను కూడా అనుమతిస్తున్నట్లు పేర్కొంది.అర్హతలు ఇవే..దేశీయ ప్రయాణాలు చేయాలనుకునే విద్యార్థుల వయసు 12 ఏళ్ల వరకు ఉండాలి. అదే అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవారు 12-30 ఏళ్ల వయసు వరకు ఉండొచ్చు. అడ్మిషన్ పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ ప్రభుత్వ గుర్తింపు పొందిందై ఉండాలి. విద్యార్థులు కనీసం ఒక విద్యాసంవత్సరం ఫుల్ టైమ్ కోర్సులో చేరి ఉండాలి.ఇదీ చదవండి: యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడిపై సెబీ కొరడాఎక్కడ బుక్ చేసుకోవాలి..?ఈ ఆఫర్ వినియోగించుకోవాలనుకునే విద్యార్థులు ఎయిరిండియా అధికారిక వెబ్సైట్, మొబైల్ యాప్, కస్టమర్ కాంటాక్ట్ సెంటర్, ఎయిర్పోర్ట్ టికెటింగ్ కార్యాలయాల ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. యూపీఐ, నెట్ బ్యాంకింగ్, ఎయిరిండియా బ్యాంకు పార్టనర్లు జారీ చేసిన క్రెడిట్/ డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేస్తే అందనంగా ప్రయోజనాలు పొందవచ్చని కంపెనీ తెలిపింది. అధికారిక వెబ్సైట్ నుంచి బుక్ చేసుకునే విద్యార్థులకు కన్వినియెన్స్ ఛార్జీల రూపంలో ఎలాంటి అదనపు ఫీజు వసూలు చేయబోమని కంపెనీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ నిపుణ్ అగర్వాల్ తెలిపారు. దానివల్ల దేశీయ విమానాల్లో ప్రయాణించే విద్యార్థులు రూ.399, అంతర్జాతీయ విమానాల్లో వెళ్లేవారు రూ.999 వరకు అదనంగా ఆదా చేసుకోవచ్చని స్పష్టం చేశారు. -
ఈ బైక్ కొనుగోలుపై రూ.45000 డిస్కౌంట్
2024 ముగుస్తోంది. ఈ తరుణంలో చాలా వాహన తయారీ సంస్థలు తమ ఉత్పత్తులపైన డిస్కౌంట్స్ అందిస్తున్నాయి. ఇందులో టూ వీలర్ బ్రాండ్ 'కవాసకి' కూడా ఉంది. ఈ కంపెనీ ఇప్పుడు నింజా 500కొనుగోలుపైన రూ.15,000, నింజా 650 బైక్ కొనుగోలుపై రూ.45,000 తగ్గింపు ప్రకటించింది. ఈ డిస్కౌంట్ డిసెంబర్ 31 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది.కవాసకి నింజా 650 బైకులో 649 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ ఉంటుంది. ఇది 8000 rpm వద్ద 67 Bhp పవర్, 6700 rpm వద్ద 64 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్ పొందుతుంది. ఈ బైక్ ఎల్ఈడీ లైట్స్, టీఎఫ్టీ డిస్ప్లే, ట్రాక్షన్ కంట్రోల్, ఏబీఎస్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి అనేక ఫీచర్స్ ఉన్నాయి.నింజా 650 బైక్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, మోనోషాక్ వంటివి పొందుతుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే.. ఇది 300 మిమీ డ్యూయల్ ఫ్రంట్, 220 మిమీ రియర్ సింగిల్ డిస్క్ సెటప్ పొందుతుంది. ఈ బైక్ ముందు భాగంలో 120/70, వెనుక 160/60 టైర్లు ఉన్నాయి. ఇవి 17 ఇంచెస్ వీల్స్ పొందుతాయి. కాబట్టి ఇది రైడర్లకు ఉత్తమ రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.ఇదీ చదవండి: బడ్జెట్ ఫ్రెండ్లీ స్కూటర్లు.. చవక మాత్రమే కాదు! -
పెట్రోల్, డీజిల్‌పై రూ.5 తగ్గింపు!
వాహనదారులకు శుభవార్త. పెట్రోల్, డీజిల్‌పై రూ.5 వరకు తగ్గిస్తున్నట్లు ప్రైవేటురంగ ఇంధన రిటెయిలింగ్ సంస్థ నయారా ఎనర్జీ ప్రకటించింది. అయితే అందుకు కనీసం రూ.1000 వరకు పెట్రోల్ లేదా డీజిల్ నింపుకోవాల్సి ఉంటుంది. పండగ సీజన్లో నయారా ఎనర్జీ ‘సబ్ కీ జీత్ గ్యారంటీడ్ 2024’ పేరుతో ఈ ఆఫర్‌ను ప్రారంభించింది.ఈ ఆఫర్ జనవరి 31, 2025 వరకు కొనసాగుతుందని కంపెనీ తెలిపింది. ఈ తగ్గింపును పొందాలంటే కస్టమర్లు డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఇంధన కొనుగోళ్లు చేయాల్సి ఉంటుంది. ఈ ఆఫర్‌తో పెట్రోల్, డీజిల్‌పై వినియోగదారులకు డబ్బు ఆదా అవ్వడంతోపాటు డిజిటల్ చెల్లింపులను కూడా ప్రోత్సహించేందుకు దోహదపడుతుందని కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ మాధుర్ తనేజా వెల్లడించారు.ఇదీ చదవండి: దిగుమతులపై ఆందోళన అక్కర్లేదునయారా ఎనర్జీ రష్యాకు చెందిన రాస్‌నెఫ్ట్, కెసని ఎంటర్ప్రైజెస్ యాజమాన్యంలో నడుస్తోంది. ఇది ఒక ప్రైవేట్ ఆయిల్ రిఫైనింగ్ అండ్ మార్కెటింగ్ కంపెనీ. నయారా ఎనర్జీ గుజరాత్‌లోని వడినార్‌లో రెండో అతిపెద్ద సింగిల్ సైట్ రిఫైనరీని నిర్వహిస్తోంది. ఇది దేశంలో 6,600 రిటైల్ ఫ్యూయల్ అవుట్లెట్లను కలిగి ఉంది. హైదరాబాద్‌లోనూ చాలాచోట్ల ఈ కంపెనీ బంక్‌లున్నాయి. -
జపనీస్ బైక్ కొనుగోలుపై రూ.1.14 లక్షల డిస్కౌంట్
జపనీస్ బైక్ తయారీ సంస్థ కవాసకి భారతీయ విఫణిలోని తన నింజా 'జెడ్ఎక్స్ 10ఆర్' బైక్ ధరను రూ. 1.14 లక్షలు తగ్గించింది. దీంతో ఈ బైక్ ధర 17.34 లక్షలకు చేరింది.కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్ 2025 ఎడిషన్ ప్రారంభ ధర సెప్టెంబర్‌లో రూ. 17.13 లక్షలు. మార్కెట్లో అడుగుపెట్టిన తరువాత.. ఈ బైక్ ధర కొద్దిసేపటికే రూ.18.50 లక్షలకు చేరింది. అయితే ప్రస్తుతం ఇయర్ ఎండ్ సమయంలో మంచి అమ్మకాలను పొందాలనే ఉద్దేశ్యంతో కంపెనీ ఈ భారీ డిస్కౌంట్స్ ప్రకటించినట్లు తెలుస్తోంది.నింజా జెడ్ఎక్స్-10ఆర్ బైక్ 998 సీసీ ఇన్లైన్ ఫోర్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్ పొందుతుంది. ఇది 13200 rpm వద్ద 203 hp పవర్, 11400 rpm వద్ద 114.9 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్.. బై-డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ వంటివి పొందుతుంది.ఇదీ చదవండి: తెలంగాణలో బీజం.. ఇతర రాష్ట్రాలకు చేరే అవకాశంబ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన TFT కన్సోల్, మల్టిపుల్ రైడింగ్ మోడ్లు, క్రూయిజ్ కంట్రోల్, లాంచ్ కంట్రోల్, ఇంజిన్ బ్రేక్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి అనేక లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్.. ఇప్పుడు రూ. 1.14 లక్షల తగ్గుదలతో లభిస్తోంది. -
ఎన్నికల వేళ.. తగ్గింపు ధరల జోరు
రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో నేడు (నవంబర్ 13) మొదటి దశ ఓటింగ్ జరుగుతోంది. ఈ నేపధ్యంలో ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో కోడెర్మా జిల్లాలోని వివిధ సంస్థలు పలు వస్తువులపై విరివిగా ఆఫర్లు ప్రకటించాయి. ఫర్నిచర్ నుండి దుస్తుల వరకూ, అలాగే రెస్టారెంట్లలోని వంటకాలను రుచి చూసేందుకు తగ్గింపు ధరలను ప్రకటించారు. ఓటు వేసిన తర్వాత ఓటర్లు తమ వేలిపై సిరా గుర్తును చూపించిన ఈ తగ్గింపు ధరల ఆఫర్‌ను సొంతం చోసుకోవచ్చు. స్థానిక పిజ్జా సిటీ రెస్టారెంట్ ఆపరేటర్ ఆదిత్య కుమార్ మీడియాతో మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం ఓటుకున్న ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నదని చెప్పారు. కోడెర్మా జిల్లాలోని పలు వ్యాపార సంస్థలు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించి, మరింత మందిని ఓటు వేసేలా చైతన్యపరిచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయన్నారు. ఓటు వేసిన తర్వాత ఓటర్లు తమ వేలిపై సిరా గుర్తును చూపితే, తన రెస్టారెంట్లో భారతీయ, చైనీస్, సౌత్ ఇండియన్ సహా అన్ని రకాల రుచికరమైన వంటకాలపై 10 శాతం ప్రత్యేక తగ్గింపు ఇస్తున్నామని తెలిపారు.ఇది కూడా చదవండి: ‘నేటి పిల్లలే రేపటి సూపర్ మోడల్స్’.. 200 మంది పేరెంట్స్‌కు రూ. 5 కోట్ల టోకరా -
దీపావళి షాపింగ్ చేస్తున్నారా?: డబ్బు ఆదా కోసం ఐదు టిప్స్..
దీపావళి వచ్చేస్తోంది.. ఇప్పటికే చాలామంది షాపింగ్ చేయడం కూడా స్టార్ట్ చేసి ఉంటారు. షాపింగ్ అంటేనే డబ్బు ఖర్చు పెట్టడం. ఇలా డబ్బు ఖర్చుపెట్టే క్రమంలో కొంత ఆదా చేసే మార్గాల కోసం అన్వేషిస్తారు. దీనికోసం కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుంది. ఈ కథనంలో అలాంటి టిప్స్ గురించి తెలుసుకుందాం.బడ్జెట్ ప్లాన్ వేసుకోవడంపండుగ వస్తోంది కదా అని కంటికి కనిపించిందల్లా.. కొనేస్తే పర్సు ఖాళీ అయిపోతుంది. కాబట్టి ఏ వస్తువులు కొనుగోలు చేయాలి, ఎక్కడ కొనుగోలు చేయాలి? దానికి ఎంత ఖర్చు అవుతుందనే విషయాలను ముందుగానే లెక్కించుకోవాలి. కిరాణా వస్తువులు, స్వీట్స్ వంటివన్నీ కూడా ఒకేసారి కొనుగోలు చేయడం ఉత్తమం. పండుగ సీజన్లో అందుబాటులో ఉన్న అన్ని డిస్కౌంట్స్ వాడుకోవాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే.. డిస్కౌంట్స్ ఉన్నాయి కదా అని అనవసర వస్తువులను కొనుగోలు చేయకూడదు.క్యాష్‌బ్యాక్ ఆఫర్స్ ఉపయోగించుకోవడందసరా, దీపావళి సమయంలో క్యాష్‌బ్యాక్ ఆఫర్స్ విరివిగా అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఏ ప్లాట్‌ఫామ్‌లలో క్యాష్‌బ్యాక్ ఆఫర్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. అయితే ఆన్లైన్ షాపింగ్‌లో క్యాష్‌బ్యాక్ లభించే అవకాశాలు ఎక్కువ. వీటిని ఉపయోగించుకుంటే కొంత డబ్బు ఆదా అవుతుంది.ధరలను సరిపోల్చడంఆన్లైన్ షాపింగ్ చేసే సమయంలో ఒక వస్తువు ధర ఏ ప్లాట్ఫామ్లో ఎంత ఉందో గమనించాలి. ఎక్కడ తక్కువ ధర ఉంటే అక్కడ వస్తువులను కొనుగోలు చేయాలి. ఇలా చేయడం ద్వారా కూడా డబ్బు ఆదా అవుతుంది. ధరలను సరిపోల్చడానికి ప్రైస్ ట్రాకింగ్ టూల్స్ ఉపయోగించడం ఉత్తమం.డిస్కౌంట్స్ తెలుసుకోవడంషాపింగ్ చేసేటప్పుడు ముఖ్యంగా డిస్కౌంట్స్ గురించి తెలుసుకోవాలి. అయితే చాలా సైట్స్ డిస్కౌంట్స్ పేరుతో మోసాలకు పాల్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచి డిస్కౌంట్స్ లభించే ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయాలి. ఈ విషయంలో ఏ మాత్రం ఆదమరిచినా నష్టపోవడం ఖాయం.ఇదీ చదవండి: రతన్ టాటా కఠిన నిర్ణయం: వెలుగులోకి కీలక విషయాలుబ్యాంక్ ఆఫర్స్ సద్వినియోగం చేసుకోవడంషాపింగ్ చేసే క్రమంలో బ్యాంకులు అందించే ఆఫర్స్ వినియోగించుకోవాలి. క్రెడిట్ కార్డులు లేదా డెబిట్ కార్డుల మీద డిస్కౌంట్స్, క్యాష్ బ్యాక్ వంటివి ఈ పండుగల సమయంలో చాలానే లభిస్తాయి. కొన్ని బ్యాంకులు రివార్డ్ పాయింట్లను కూడా అందిస్తాయి. వీటిని కూడా ఉపయోగించుకుంటే.. డబ్బు కొంత ఆదా అవుతుంది. అయితే క్రెడిట్ కార్డులు ఉపయోగించి షాపింగ్ చేస్తే.. నిర్దిష్ట కాలంలో తిరిగి చెల్లించాలి. లేకుంటే అది మీ సిబిల్ స్కోర్ మీద ప్రభావం చూపుతుంది. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ మరచిపోకూడదు. -
ప్యూర్ ఎలక్ట్రిక్ బైక్‌లపై రూ.20వేల డిస్కౌంట్
ముంబై: పండుగ సీజన్ సందర్భంగా ఎలక్ట్రిక్ టూ–వీలర్ల సంస్థ ప్యూర్ ఈవీ తమ రెండు మోడల్స్‌పై రూ. 20,000 డిస్కౌంటు ప్రకటించింది. ఎకోడ్రిఫ్ట్, ఈట్రైస్ట్ ఎక్స్ మోటర్సైకిల్స్పై ఇది వర్తిస్తుంది. దీనితో ప్రారంభ ధర రూ. 99,999కి తగ్గినట్లవుతుంది.నవంబర్ 10 వరకు ఈ ఆఫర్ ఉంటుందని సంస్థ వ్యవస్థాపకుడు డి. నిశాంత్ తెలిపారు. రోజువారీ వినియోగం కోసం ఎకోడ్రిఫ్ట్, శక్తివంతమైన రైడింగ్ అనుభూతి కోరుకునే వారి కోసం ఈట్రైస్ట్ ఎక్స్ (171 కి.మీ. రేంజి) అనువుగా ఉంటాయని వివరించారు. -
బుల్లి ఎస్‌యూవీలు.. భలే జోరు!
దేశంలో స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్‌యూవీల) క్రేజ్ ఓ రేంజ్లో ఉంది! ఒకపక్క, కార్ల అమ్మకాల్లో మందగమనం నెలకొన్నప్పటికీ.. మైక్రో ఎస్‌యూవీలు మాత్రం దుమ్మురేపుతున్నాయి. కస్టమర్లు చిన్న కార్లు/ హ్యాచ్‌బ్యాక్‌ల నుంచి అప్‌గ్రేడ్ అవుతుండటంలో వాటి సేల్స్ అంతకంతకూ తగ్గుముఖం పడుతున్నాయి. మరోపక్క, చిన్న ఎస్‌యూవీల సెగ్మెంట్ తగ్గేదేలే అంటూ టాప్ గేర్‌లో దూసుకుపోతోంది! – సాక్షి, బిజినెస్ డెస్క్గత కొంతకాలంగా దేశంలో ప్యాసింజర్ కార్ల అమ్మకాలు స్లో ట్రాక్‌లో వెళ్తున్నాయి. డీలర్ల వద్ద నిల్వలు పేరుకుపోతుండటంతో కంపెనీలు భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తూ వాటిని ఎలాగైనా వదిలించుకునేందుకు నానాతిప్పలు పడాల్సి వస్తోంది. అయితే, చిన్న ఎస్‌యూవీలు దీనికి మినహాయింపు. హాట్ కేకుల్లా సేల్ అవుతూ దేశీ మార్కెట్లో అవి భారీ వాటాను కొల్లగొడుతున్నాయి. రూ.10 లక్షల వరకు ధర ఉన్న మైక్రో ఎస్‌యూవీలకు డిమాండ్ ఓ రేంజ్లో ఉంది. ముఖ్యంగా హ్యుందాయ్ ఎక్స్టర్, టాటా పంచ్ ఈ సెగ్మెంట్లో టాప్ లేపుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో (2024–25, ఏప్రిల్–జూలై) వీటి అమ్మకాలు 72 శాతం దూసుకెళ్లగా... మొత్తం దేశీయ ప్యాసింజర్ వాహన విక్రయాల్లో కేవలం 1.8 శాతం వృద్ధి మాత్రమే నమోదు కావడం దీనికి నిదర్శనం. ఈ నాలుగు నెలల్లో 1,75,350 (11 శాతం వృద్ధి) చిన్న ఎస్‌యూవీలు అమ్ముడవడం విశేషం. మరోపక్క, చిన్నకార్లు/హ్యాచ్బ్యాక్స్ సేల్స్‌లో 17 శాతం (69,936 యూనిట్లు) తగ్గుదల నమోదైంది. చిన్న ఎస్‌యూవీల కేటగిరీలోకి ఎక్స్టర్, పంచ్‌తో పాటు కాంపాక్ట్ మోడల్స్ అయిన మారుతీ బ్రెజా, హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్ ఎంట్రీ వేరియంట్లు ఉంటాయి. క్యూ కడుతున్న కంపెనీలు... ఈ సెగ్మెంట్ శరవేగంగా దూసుకుపోతుండటంతో ఇతర కార్ల దిగ్గజాలు సైతం ఇందులోకి అడుగుపెట్టేందుకు తహతహలాడుతున్నాయి. కియా మోటార్స్ తన తొలి మైక్రో ఎస్యూవీ ‘క్లావియా’ను తీసుకొచ్చే ప్లాన్‌లో ఉండగా.. హ్యుందాయ్ మరో కాంపాక్ట్ ఎస్యూవీ ‘బేయాన్’తో మార్కెట్ షేర్‌ను మరింత పెంచుకోవాలనుకుంటోంది. మారుతీ సుజుకీ ఫ్రాంక్స్‌తో ఈ విభాగంలో పోటీ పడుతోంది. ఇక ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ కంపెనీ స్కోడా సైతం వచ్చే ఏడాది ఆరంభంలో తొలి కాంపాక్ట్ ఎస్యూవీ కైలాక్‌ను ప్రవేశపెట్టడం ద్వారా ఈ సెగ్మెంట్లోకి దూకనుంది. ప్రస్తుతం మైక్రో ఎస్‌యూవీల విభాగంలో పంచ్, ఎక్స్టర్ హవా కొనసాగుతుండటంతో మారుతీ కూడా ఈ విభాగంపై కన్నేసింది. కాంపాక్ట్ ఎస్యూవీ బ్రెజా కంటే తక్కువ ధరలో ప్రత్యేకంగా కొత్త మోడల్‌ను మారుతీ రూపొందిస్తోందని, రెండేళ్లలో రోడ్డెక్కనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.మారుతున్న ట్రెండ్... హ్యాచ్బ్యాక్స్, సెడాన్ కార్లతో పోలిస్తే మరింత విశాలమైన స్పేస్, దృఢమైన రూపంతో ఆకర్షణీయంగా ఉండటంతో దేశంలో ఎస్‌యూవీల క్రేజ్ కేకపుట్టిస్తోంది. దీనికితోడు ఎంట్రీ లెవెల్ మైక్రో ఎస్‌యూవీలు అందుబాటు ధరల్లో లభిస్తుండటం వల్ల గ్రామీణ కొనుగోలుదారులు కూడా వీటికే సై అంటున్నారని, దీంతో చిన్న ఎస్‌యూవీలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ‘ఈ ఏడాది అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న విభాగంగా మైక్రో ఎస్వీయూల సెగ్మెంట్ అవతరించింది. ధర విషయానికొస్తే ఎక్స్టర్ వంటి చిన్న ఎస్‌యూవీలు కొన్ని హ్యాచ్‌బ్యాక్‌లతో సమానమైన ధరకే లభిస్తున్నాయి. దీనికితోడు పరిశ్రమలో తొలిసారిగా సన్‌రూఫ్, డాష్‌క్యామ్, 6 ఎయిర్‌బ్యాగ్‌ల వంటి వినూత్న ఫీచర్లు చిన్న ఎస్‌యూవీల్లోనూ ఉండటం కూడా కస్టమర్లు వీటి వెంట పడటానికి మరో ప్రధాన కారణం. నచి్చన ఫీచర్లు, డిజైన్ ఉంటే రేటెక్కువైనా కొనేందుకు వెనుకాడటం లేదు’ అని హ్యుందాయ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తరుణ్ గార్గ్ పేర్కొన్నారు. 2024 తొలి 8 నెలల్లో మైక్రో ఎస్‌యూవీల సేల్స్ 86% దూసుకెళ్లగా... మొత్తం ఎస్యూవీ విభాగం విక్రయాల వృద్ధి 19 శాతంగా ఉంది. -
ఈ కార్లపై భారీ తగ్గింపులు: రూ. లక్ష నుంచి రూ.12 లక్షలు
పండుగ సీజన్ మొదలైపోయింది. కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి చాలామంది ఆసక్తి చూపుతారు. కంపెనీలు కూడా తమ వాహనాల సేల్స్ పెంచుకోవడానికి ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ వంటివి ప్రకటిస్తాయి. ఈ కథనంలో రూ. 1 లక్ష కంటే ఎక్కువ తగ్గింపు ధర వద్ద లభించే కార్లు ఏవో తెలుసుకుందాం.కార్లు, వాటిపై లభించే తగ్గింపులు ● హోండా సిటీ: రూ. 1.14 లక్షలు ● టాటా నెక్సాన్: రూ. 1.25 లక్షలు ● మారుతి గ్రాండ్ వితారా: రూ. 1.28 లక్షలు ● కియా సెల్టోస్: రూ. 1.30 లక్షలు ● సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్: రూ. 1.50 లక్షలు ● టాటా సఫారీ: రూ. 1.65 లక్షలు ● ఎంజీ హెక్టర్: రూ. 2.0 లక్షలు ● మారుతి జిమ్నీ: రూ. 2.50 లక్షలు ● మహీంద్రా ఎక్స్‌యూవీ400: రూ. 3 లక్షలు ● మెర్సిడెస్ ఏ-క్లాస్ లిమోసిన్: రూ. 3 లక్షలు ● మెర్సిడెస్ సీ-క్లాస్: రూ. 3 లక్షలు ● టయోటా క్యామ్రీ: రూ. 3 లక్షలు ● ఫోక్స్‌వ్యాగన్ టైగన్: రూ. 3.07 లక్షలు ● జీప్ కంపాస్: రూ. 3.15 లక్షలు ● ఎంజీ గ్లోస్టర్: రూ. 6 లక్షలు ● టయోటా హైలక్స్: రూ. 10 లక్షలు ● కియా ఈవీ6: రూ. 10 లక్షలు ● జీప్ గ్రాండ్ చెరోకీ: రూ. 12 లక్షలుఇదీ చదవండి: ఉద్యోగులను తొలగించేందుకు ట్రైనింగ్: టెక్ సీఈఓ పోస్ట్ వైరల్కార్లపైన కంపెనీలు ఇస్తున్న ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ నగరాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అంతే కాకుండా ఈ తగ్గింపులు ఎంచుకునే మోడల్ మీద కూడా ఆధారపడి ఉంటాయి. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఆఫర్లను పొందే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితమైన తగ్గింపులను గురించి తెలుసుకోవడానికి సమీపంలోని కంపెనీ అధికారిక డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు. -
వీటి కొనుగోలుపై 86 శాతం డిస్కౌంట్!.. పండగ చేసుకోండి..
దసరా, దీపావళి వచ్చేస్తున్నాయి. ఈ పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు గొప్ప ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగానే అమెజాన్ 27 నుంచి (సెప్టెంబర్ 27) గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభించనుంది. ఇందులో కొన్ని ఉత్పత్తుల మీద ఏకంగా 86 శాతం డిస్కౌంట్స్ అందించనున్నట్లు సమాచారం.అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ వచ్చే వారంలో ప్రారంభం కానుంది. కంపెనీ ఈ సేల్‌లో ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, కెమెరాలు, హెడ్ఫోన్లు, సౌండ్బార్లు మొదలైన వాటిపైన అద్భుతమైన డిస్కౌంట్స్ అందించనుంది. అయితే ఈ డిస్కౌంట్స్ ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు.అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో దాదాపు అన్ని ఎలక్ట్రానిక్స్ తక్కువ ధరలకే లభించే అవకాశం ఉంది. టాబ్లెట్ల మీద 55 శాతం వరకు డిస్కౌంట్ లభించనుంది. శాంసంగ్, లెనోవా, యాపిల్ వంటి టాప్ బ్రాండ్ల మీద కూడా 55 శాతం డిస్కౌంట్స్ ఉన్నట్లు సమాచారం.ఇదీ చదవండి: లక్షల కోట్ల కంపెనీ.. మీటింగ్‌లో ఓ ఖాళీ కుర్చీ: ఎందుకంటే..అమెజాన్ హెడ్ఫోన్లు, ఇయర్‌బడ్‌ల మీద 86 శాతం డిస్కౌంట్స్ ఉండనున్నట్లు సమాచారం. సోనీ, గోప్రో వంటి కెమెరాల మీద 53 శాతం డిస్కౌంట్స్.. స్పీకర్ల కొనుగోలుపైన 73 శాతం, యాపిల్, శాంసంగ్, నాయిస్, బోట్ వంటి స్మార్ట్‌వాచ్‌లపై అమెజాన్ 83 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. కీబోర్డ్ మరియు మౌస్ కాంబోలపై కూడా 82 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.అమెజాన్ మాత్రమే కాదుఅమెజాన్ మాత్రమే కాకుండా ఫ్లిప్‌కార్ట్, మింత్రా వంటి కంపెనీలు కూడా ఈ పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని తప్పకుండా డిస్కౌంట్స్ లేదా ఆఫర్స్ అందిస్తాయి. దీనికి సంబంధించిన మరిన్న వివరాలు తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ సందర్శించవచ్చు. -
ఈ బైక్స్ కొనుగోలుపై గొప్ప బెనిఫీట్స్
కవాసకి తన నింజా లైనప్‌లోని మూడు మోడళ్లపై గొప్ప డిస్కౌంట్స్ ప్రకటించింది. ఈ డిస్కౌంట్స్ ఆన్-రోడ్ ధరకు వర్తించే వోచర్ల రూపంలో లేదా డీలర్‌షిప్‌ల వద్ద యాక్ససరీస్, సర్వీస్ ప్యాకేజీలను కొనుగోలు చేయడానికి ఉపయోగించవచ్చు.నింజా 300, నింజా 500 కొనుగోలుపైన వినియోగదారుడు రూ. 10000 వోచర్ పొందవచ్చు. అయితే నింజా 650 కొనుగోలుపైన రూ. 25000 వోచర్ పొందవచ్చు. కవాసకి తన బైకులపై డిస్కౌంట్స్ లేదా ఆఫర్స్ అందించడం ఇదే మొదటిసారి కాదు. గత నెలలో కూడా ఇలాబీటి ఆఫర్స్ ప్రకటించింది.కవాసకి నింజా 650 బైక్ ధర రూ.7.16 లక్షలు. నింజా 300, నింజా 500 ధరలు వరుసగా రూ.3.43 లక్షలు, రూ.5.24 లక్షలు. ఆకర్షణీయమైన డిజైన్ కలిగిన ఈ బైక్స్.. అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతాయి. పర్ఫామెన్స్ పరంగా కూడా ఇవి చాలా ఉత్తమంగా ఉంటాయని తెలుస్తోంది. కవాసకి అందిస్తున్న ఈ ఆఫర్స్ సెప్టెంబర్ 1 నుండి 30 వరకు మాత్రమే చెల్లుతాయి. -
పేరుకుపోతున్న ప్యాసింజర్ కార్లు!
భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో ప్యాసింజర్ కార్ల విక్రయాలు తగ్గుతున్నాయి. దాంతో రిటైల్ డీలర్ల వద్ద అధిక సంఖ్యలో వాహనాలు పేరుకుపోతున్నాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశీయంగా డీలర్ల వద్ద పోగైన వాహనాలు ఏకంగా 7 లక్షల యూనిట్లు. వీటి విలువ సుమారు రూ.73,000 కోట్లు ఉంటుందని అంచనా. పండగల సీజన్ రాబోతుండడంతో వీటిలో కొంతమేర విక్రయాలు జరిగే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. అయినా క్షేత్రస్థాయిలో ఈ కార్లకు భారీగా డిమాండ్ తగ్గినట్లు పేర్కొంది.ఫాడా తెలిపిన వివరాల ప్రకారం.. రిటైల్ డీలర్ల వద్ద విక్రయానికి సిద్ధంగా ఉన్న(ఇన్వెంటరీ) ప్యాసింజర్ కార్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇన్వెంటరీను అమ్మే సమయం అధికమైంది. జులై 2024 ప్రారంభంలో 65-67 రోజులుగా ఉన్న ఇన్వెంటరీ క్లియరెన్స్ సమయం, ప్రస్తుతం 70-75 రోజులకు పెరిగింది. దాంతో అమ్ముడవని వాహనాల సంఖ్య అధికమవుతోంది. ఈ వ్యవహారం డీలర్లలో ఆందోళన కలిగిస్తోంది. ఇన్వెంటరీ నిర్వహణ భారంగా మారుతోంది. దాంతో కొన్ని కంపెనీలు వాటి ఉత్పత్తిని తగ్గించుకుంటున్నాయి. ఇప్పటికే దాదాపు రెండు నెలల విక్రయాలకు సమానమైన సుమారు 7 లక్షల యూనిట్ల వాహనాలు పోగయ్యాయి. ఇదిలాఉండగా, రానున్న పండగల సీజన్‌ల్లో విక్రయాలు పెరిగి కొంత ఊరట లభిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.పెరుగుతున్న వాహనాల ఇన్వెంటరీ నేపథ్యంలో మారుతీసుజుకీ కంపెనీ ఇండియా లిమిటెడ్ ఇప్పటికే ఉత్పత్తిని తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి కంపెనీ అంచనాలకు తగిన అమ్మకాలు నమోదు కావడంలేదు. దాంతో ఇన్వెంటరీ నిర్వహణ భారమవుతుందని ఊహించి ఉత్పత్తిని తగ్గించింది. జులై 2024లో మారుతీ సుజుకీ విక్రయాల్లో ఏడాది ప్రాతిపదికన 9.65% క్షీణత నమోదైంది.రిటైల్ మార్కెట్లో కార్ల ధరలో రాయితీ ఇచ్చి ప్రముఖ కంపెనీలు వాటి ఇన్వెంటరీని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగానే మునుపెన్నడూ లేనంతగా కార్ల ధర తగ్గిస్తున్నాయి. 2023 ఆగస్ట్‌తో పోలిస్తే ఈ సారి డిస్కౌంట్లు రెండింతలు అయ్యాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. డిసెంబర్ వరకు ఈ తగ్గింపులు కొనసాగే అవకాశం ఉందని అంటున్నాయి. మార్కెట్ లీడర్ మారుతీ సుజుకీ మొదలుకుని హ్యుందాయ్, టాటా మోటార్స్, స్కోడా, హోండా..వంటి ప్రముఖ కంపెనీలు డిస్కౌంట్లు ఇస్తున్నాయి.ఇదీ చదవండి: కొత్త పెన్షన్ విధానం.. కీలకాంశాలు..నగదు తగ్గింపు, ఎక్స్చేంజ్ బోనస్, అదనపు ప్రయోజనాలను కల్పిస్తున్నాయి. పాపులర్ మోడళ్లకూ వీటిని వర్తింపజేస్తుండడం విశేషం. ఆఫర్స్, ప్రయోజనాలు మారుతీ సుజుకీ బ్రెజ్జా రూ.25,000, గ్రాండ్ విటారాపై రూ.1,28,000 వరకు అందిస్తోంది. హ్యుండై ఎక్స్టర్పై రూ.40,000, ఆల్కజార్‌పై రూ.90,000 వరకు, టాటా మోటార్స్ నెక్సన్ రూ.16,000–1,00,000, హ్యారియర్‌పై రూ.1,20,000 వరకు ఆఫర్ చేస్తున్నాయి. హోండా ఎలివేట్‌పై రూ.80,000 వరకు ఆఫర్స్, ప్రయోజనాలు ఉన్నాయి. -
కార్ల ధరపై భారీ డిస్కౌంట్లు
న్యూఢిల్లీ: కార్ల రిటైల్ మార్కెట్లో డిస్కౌంట్ల పండగ నడుస్తోంది. మునుపెన్నడూ లేనంతగా కార్లపై తగ్గింపు ఉండడం గమనార్హం. 2023 ఆగస్ట్‌తో పోలిస్తే డిస్కౌంట్లు రెండింతలు అయ్యాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. డిసెంబర్ వరకు ఈ తగ్గింపులు కొనసాగే అవకాశం ఉందని అంటున్నాయి. విక్రయాలు మందగించడంతో కంపెనీలు, డీలర్షిప్ కేంద్రాల వద్ద నిల్వలు పేరుకుపోయాయి. వీటిని క్లియర్ చేసుకోవడంలో భాగంగా కంపెనీలు, డీలర్లు డిస్కౌంట్ల బాట పట్టారు. మార్కెట్ లీడర్ మారుతీ సుజుకీ మొదలుకుని హ్యుండై, టాటా మోటార్స్, స్కోడా, హోండా డిస్కౌంట్ల పోటీలో నిలిచాయి.నగదు తగ్గింపు, ఎక్స్చేంజ్ బోనస్, అదనపు ప్రయోజనాలను కల్పిస్తున్నాయి. పాపులర్ మోడళ్లకూ వీటిని వర్తింపజేస్తుండడం విశేషం. ఆఫర్స్, ప్రయోజనాలు మారుతీ సుజుకీ బ్రెజ్జా రూ.25,000, గ్రాండ్ విటారాపై రూ.1,28,000 వరకు అందిస్తోంది. హ్యుండై ఎక్స్టర్పై రూ.40,000, ఆల్కజార్‌పై రూ.90,000 వరకు, టాటా మోటార్స్ నెక్సన్ రూ.16,000–1,00,000, హ్యారియర్‌పై రూ.1,20,000 వరకు ఆఫర్ చేస్తున్నాయి. హోండా ఎలివేట్‌పై రూ.80,000 వరకు ఆఫర్స్, ప్రయోజనాలు ఉన్నాయి.భారీగా కార్ల నిల్వలు..2019–20 తర్వాత అధిక డిస్కౌంట్లు ప్రస్తుతం ఉన్నాయని పరిశ్రమ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. భారత్ స్టేజ్–6 ఉద్గార ప్రమాణాలు 2020 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో నిల్వలను క్లియర్ చేసుకోవడానికి 2019–20లో మార్కెట్లో డిస్కౌంట్ల జోరు కొనసాగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో కార్ల నిల్వలు సుమారు 3,00,000 యూనిట్ల స్థాయిలో నమోదయ్యాయి. 30 రోజుల డిమాండ్‌కు ఇవి సరిపోతాయి. అయితే అమ్మకాలు మందగించడంతో కొద్దిరోజుల్లోనే నిల్వలకు మరో 1,00,000 యూనిట్లు తోడయ్యాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కార్ల తయారీ కంపెనీలు, డీలర్లు డిస్కౌంట్లకు తెరలేపారు. 2019–20 స్థాయిలో తగ్గింపులు ఉన్నాయని పరిశ్రమ చెబుతోంది. 2023–24లో దేశవ్యాప్తంగా ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు అత్యధిక స్థాయిలో 42.3 లక్షల యూనిట్లు నమోదయ్యాయి. సెమికండక్టర్ల కొరత ప్రభావం తగ్గడం, డిమాండ్ కొనసాగడం ఈ జోరుకు కారణమైంది. మూడేళ్లు పరుగుపెట్టిన ప్యాసింజర్ వెహికిల్స్ పరిశ్రమ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విక్రయాలు మందగించడం ప్రారంభమైంది. -
ఎంఎస్ఎంఈలకు యాక్సిస్ బ్యాంక్ ఆఫర్లు
ముంబై: ప్రస్తుత ఎంఎస్ఎంఈ కస్టమర్లకు సెక్యుర్డ్ వర్కింగ్ క్యాపిటల్ సాధనాలకు సంబంధించి ప్రాసెసింగ్ ఫీజులో 50 శాతం డిస్కౌంటును అందిస్తున్నట్లు ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. అలాగే, తక్కువ వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజుతో ఈఎంఐ ఆధారిత అన్సెక్యూర్డ్ రుణాలు కూడా అందిస్తున్నట్లు వివరించింది. అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్సవం సందర్భంగా తెలంగాణలో 350 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల (ఎంఎస్ఎంఈ) కస్టమర్లను బ్యాంక్ సన్మానించింది. హైదరాబాద్, హన్మకొండ, వరంగల్, కరీంనగర్ తదితర ప్రాంతాల్లోని బ్యాంకు శాఖల్లో ఈ మేరకు కార్యక్రమాలు నిర్వహించింది. -
ఎలక్ట్రిక్ స్కూటర్లపై ప్రత్యేక ఆఫర్లు
బెంగళూరు: ’ఓలా ఎలక్ట్రిక్ రష్’ ప్రచార కార్యక్రమంలో భాగంగా విద్యుత్ వాహనాల సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తమ ఎస్1 పోర్ట్‌ఫోలియోపై రూ. 15,000 వరకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఇవి జూన్ 28 వరకు వర్తిస్తాయి. వీటి ప్రకారం ఎస్1 ఎక్స్+పై రూ. 5,000, ఎస్1 ప్రో.. ఎస్1 ఎయి ర్‌పై రూ. 2,500 ఫ్లాట్ డిస్కౌంటు లభిస్తుంది.ఎస్1 ఎక్స్+పై రూ. 5,000 వరకు ఎక్స్చేంజ్ బోనస్, మొత్తం ఎస్1 శ్రేణిపై నిర్దిష్ట క్రెడిట్ కార్డ్ ఈఎంఐలపై రూ. 5,000 వరకు క్యాష్‌బ్యాక్ సహా మొత్తం రూ. 10,000 వరకు అదనపు ప్రయోజనాలను కూడా కస్టమర్లు పొందవచ్చు. ఎస్1 పోర్ట్‌ఫోలియోలో ఆరు వేరియంట్లు ఉన్నాయి.మొత్తం ఉత్పత్తుల శ్రేణి బ్యాటరీలపై 8 ఏళ్లు/80,000 కి.మీ. మేర ఎక్స్టెండెడ్ వారంటీని కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది. కావాలంటే పరిమితిని పెంచుకునేందుకు కస్టమర్లు రూ. 4,999–రూ. 12,999 వరకు చెల్లించి యాడ్–ఆన్ వారంటీని ఎంచుకోవచ్చు. -
విమానం ఎక్కేయండి.. రూ. 883 లకే!!
హైదరాబాద్: విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ తాజాగా స్ల్పాష్ సేల్‌ను ప్రకటించింది. దీని ప్రకారం తమ వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా ఎక్స్‌ప్రెస్ లైట్ కింద బుక్ చేసుకుంటే ఛార్జీలు రూ. 883 నుంచి ప్రారంభమవుతాయని సంస్థ తెలిపింది.అలాగే ఇతర మాధ్యమాల ద్వారా ఎక్స్‌ప్రెస్ వేల్యూ కింద బుక్ చేసుకుంటే రూ. 1,096 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది. సెప్టెంబర్ 30 వరకు చేసే ప్రయాణాల కోసం జూన్ 28 వరకు చేసుకునే బుకింగ్స్‌కి ఇవి వర్తిస్తాయని సంస్థ వివరించింది. దీనితో పాటు airindiaexpress.com లో బుక్ చేసుకునే వినియోగదారులు ఇటీవల లాంచ్ చేసిన జీరో చెక్-ఇన్ బ్యాగేజ్ ఎక్స్ ప్రెస్ లైట్ కు ప్రత్యేక డిస్కౌంట్లతో ఎక్స్ క్లూజివ్ యాక్సెస్ పొందవచ్చు. ఎక్స్‌ప్రెస్ లైట్ ఛార్జీలు అదనంగా 3 కిలోల క్యాబిన్ బ్యాగేజీని ఎటువంటి రుసుము లేకుండా ముందస్తుగా బుక్ చేసుకునే అవకాశాన్ని అందిస్తాయి. అలాగే దేశీయ విమానాలలో 15 కిలోలకు రూ .1000, అంతర్జాతీయ విమానాలలో 20 కిలోలకు రూ .1300 చొప్పున చెక్-ఇన్ బ్యాగేజీ కోసం డిస్కౌంట్ ఫీజును అందిస్తుంది. -
ఐఫోన్ ఇక్కడ కొంటే భారీ డిస్కౌంట్..
ఐఫోన్లు, యాపిల్ ఉత్పత్తులపై డిస్కౌంట్ల కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్‌న్యూస్ ఇది. ప్రముఖ భారతీయ ఎలక్ట్రానిక్స్ రిటైల్ చైన్ విజయ్ సేల్స్ జూన్ 8 నుంచి 17 వరకు "యాపిల్ డేస్" సేల్ ను నిర్వహిస్తోంది. ఆన్లైన్, ఇన్-స్టోర్ రెండింటిలోనూ యాపిల్ ఉత్పత్తులపై అద్భుతమైన డీల్స్‌ను అందిస్తోంది.ఐఫోన్లపై డిస్కౌంట్లు ఇవే..ఐఫోన్ 15 సిరీస్: ఐఫోన్ 15 ప్రారంభ ధర రూ.64,900, ఐఫోన్ 15 ప్లస్ ధర రూ.74,290, ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంక్ కార్డులపై రూ.6,000 వరకు తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది.ఐఫోన్ 15 ప్రో సిరీస్: ఐఫోన్ 15 ప్రో రూ .123,990, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ రూ .145,990 నుంచి ప్రారంభమవుతాయి. ఇందులో రూ .3,000 తక్షణ డిస్కౌంట్లు ఉన్నాయి.పాత ఐఫోన్ మోడల్స్: ఐఫోన్ 14, ఐఫోన్ 13 వంటి పాత మోడల్స్‌పై డీల్స్ వరుసగా రూ .57,990, రూ .50,999 నుంచి ప్రారంభమవుతాయి.ఇతర యాపిల్ ఉత్పత్తులపై.. ఐప్యాడ్లు: ఐప్యాడ్ 9వ జనరేషన్, ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ ప్రో సహా వివిధ ఐప్యాడ్ మోడళ్లపై అద్భుతమైన ఆఫర్లు ఉన్నాయి. వీటి ధర రూ .24,990 నుంచి ప్రారంభమవుతుంది.మ్యాక్‌బుక్స్: శక్తివంతమైన ఎం1, ఎం2, ఎం3 చిప్‌లతో కూడిన మ్యాక్‌బుక్ ఎయిర్, మ్యాక్‌బుక్ ప్రో మోడళ్ల ధర రూ.67,490 నుంచి ప్రారంభమవుతుంది.యాపిల్ వాచ్: ఫిట్నెస్ను ట్రాక్ చేసే యాపిల్ వాచ్ సిరీస్ 9, ఎస్ఈ, అల్ట్రా మోడళ్ల ధరలు రూ .25,900 నుంచి ప్రారంభం.ఎక్స్‌క్లూజివ్ బెనిఫిట్స్ఇన్ స్టంట్ డిస్కౌంట్లు: ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంక్ కార్డుదారులు తమ కొనుగోళ్లపై రూ.10,000 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.ఎక్స్ఛేంజ్ బోనస్: ఇన్-స్టోర్ కస్టమర్లు క్యాషిఫై ద్వారా రూ .12,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు.మైవీఎస్ లాయల్టీ ప్రోగ్రామ్: అన్ని కొనుగోళ్లపై 0.75 శాతం లాయల్టీ పాయింట్లను పొందవచ్చు. వీటిని తర్వాత రీడీమ్ చేసుకోవచ్చు. -
అమెజాన్ సేల్‌లో ఆఫర్ల జాతర.. 95 శాతం వరకు డిస్కౌంట్
కొనుగోలు దారులకు శుభవార్త. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ సమ్మర్ సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్‌లో స్మార్ట్‌వాచ్‌లపై 95 శాతం, బ్లూటూత్ ఇయర్‌బడ్స్‌పై 95శాతం, ఇయర్ఫోన్లపై 95శాతం, నెక్ బ్యాండ్ ఇయర్‌ఫోన్స్‌పై 95 శాతం డిస్కౌంట్ పొందవచ్చారు.అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2024తో ప్రారంభమైన ఈ సేల్‌లో అన్నీ రకాల ప్రొడక్ట్‌లపై డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తున్నట్లు తెలిపింది. దీంతో పాటు రూ.15,000, రూ.25,000 సెగ్మెంట్ ధరల్లో ఉన్న ఫోన్లపై ప్రత్యేక ఆఫర్లను కొనుగోలు దారులు సొంతం చేసుకోవచ్చంటూ అమెజాన్ ప్రతినిధులు తెలిపారు.మే 2 అర్ధరాత్రి నుంచి ప్రారంభమై మే 7 వరకు కొనసాగుతున్న ఈ సేల్‌లో స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ శాంసంగ్, షావోమీ, వన్‌ప్లస్‌తో పాటు ఇతర ఫోన్లపై తగ్గింపు ధరకే కొనుగోలు చేసే అవకాశాన్ని అమెజాన్ కొనుగోలు దారులకు కల్పిస్తుంది. ఈ ఫోన్లలో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, లార్జ్ డిస్ప్లే, పెద్ద బ్యాటరీ, పవర్ఫుల్ ప్రాసెసర్లుతో వస్తున్నట్లు అమెజాన్ వెల్లడించింది.మీరు ఐసీసీఐ, వన్ కార్డ్, బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డ్‌ల ద్వారా కొనుగోలు చేస్తే.. ప్రతి కొనుగోలుపై 10 శాతం డిస్కౌంట్లు పొందవచ్చు.దీంతో పాటు ఎక్ఛేంజ్ ఆఫర్లు, ఈఎంఐలు, కూపన్లు వినియోగించుకోవచ్చని అమెజాన్ వెల్లడించింది. -
ఓటేస్తే మజూరీలో రాయితీ
రాయ్‌పూర్: ఓటేస్తే రెస్టారెంట్లు డిస్కౌంట్ ఇవ్వడాన్ని నోయిడాలో చూశాం. బెంగళూరులో అయితే ఏకంగా ఫ్రీ బీర్ ప్రకటించారు! ఈ జాబితాలో తాజాగా ఛత్తీస్‌గఢ్ చేరింది. అయితే ఇందులో కాస్త వెరైటీ ఉంది! ఓటేసి వేలికి నీలి రంగు సిరా చూపిస్తే బంగారం తయారీ ధరలను (మజూరీ) తగ్గిస్తామని రాష్ట్ర వాణిజ్య మండలి ప్రకటించింది. దాంతోపాటు పలు ఇతర ఉత్పత్తులపైనా రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. వివిధ సంస్థల నిర్వాహకులు కూడా ఇందుకు అంగీకరించారు. చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ అమర్ పర్వానీ నేతృత్వంలో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ గౌరవ్ కుమార్ సింగ్ సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఓటేసిన వారికి తమ ఉత్పత్తుల కొనుగోలుపై ఫర్నిచర్ అసోసియేషన్ 10 శాతం, టెక్స్టైల్ ట్రేడర్స్ అసోసియేషన్ 10 శాతం, రాయ్‌పూర్ ఆప్టికల్ అసోసియేషన్ 15 శాతం, ప్లైవుడ్ అసోసియేషన్ 5 శాతం, బులియన్ అసోసియేషన్ 15 శాతం రాయితీ ప్రకటించాయి. ఛత్తీస్‌గఢ్‌లో 11 లోక్‌సభ స్థానాలకు గాను ఏడింటికి మే 7న మూడో విడతలో పోలింగ్ జరగనుంది. -
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
ఆన్లైన్లో భారీ డిస్కౌంట్ల కోసం ఎదురు చూస్తున్నవారికి గుడ్‌న్యూస్ ఇంది. ప్రముఖ అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ (Amazon Great Summer Sale) అతి త్వరలో ప్రారంభం కానుంది. అనేక పాపులర్ స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపులను అందించే ఈ సేల్ గురించి ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం ముందుగానే ప్రకటించింది.అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ టీజర్ పేజీలో ఈ సేల్ వినియోగదారులకు ‘బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్' అందిస్తుందని పేర్కొంది. సేల్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సేల్ ఈవెంట్‌కు ముందు.. అమెజాన్ డిస్కౌంట్లు ఇవ్వనున్న కొన్ని ఫోన్ల జాబితాను వెల్లడించింది. మీరు కొనాలనుకుంటున్న ఫోన్ ఈ జాబితాలో ఉందో లేదో చూసేయండి..ఈ స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్లు..అమెజాన్ ముఖ్యంగా 8 వన్‌ప్లస్ ఫోన్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందించనుంది. అధికారిక అమెజాన్ సేల్ లిస్టింగ్ ప్రకారం.. వన్‌ప్లస్ 12 (OnePlus 12), వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 (OnePlus Nord CE 4), వన్‌ప్లస్ 12 ఆర్ (OnePlus 12R), వన్‌ప్లస్ నార్డ్ 3(OnePlus Nord 3) వంటి ఫోన్లలపై డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ సమయంలో రెడ్మీ 13సీ (Redmi 13C), రెడ్మీ నోట్ 13 ప్రో (Redmi Note 13 Pro), శామ్సంగ్ గెలాక్సీ ఎం 34 (Samsung Galaxy M34), షావోమీ 14 (Xiaomi 14), శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 23 (Samsung Galaxy S23), ఐకూ జెడ్ 9 (iQOO Z9), గెలాక్సీ ఎస్ 24 (Galaxy S24), టెక్నో పోవా 6 ప్రో (Tecno Pova 6 Pro) వంటి మరిన్ని ఫోన్లపై కూడా డిస్కౌంట్లు ఉంటాయి. ఈ ఫోన్లపై కచ్చితమైన ధరలు రాబోయే రోజుల్లో వెల్లడయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు కొన్ని కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లపై కూడా డిస్కౌంట్లను అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతానికి, డిస్కౌంట్లను పొందే ఐఫోన్ల పేర్లను వెల్లడించలేదు. అయితే, సేల్ ఈవెంట్లో యాపిల్ డివైజ్‌లు కూడా ఉంటాయని టీజర్ పేర్కొంది. -
కార్ల కొనుగోలు దారులకు మారుతి సుజుకి బంపరాఫర్
ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి వినియోగదారులకు శుభవార్త చెప్పింది. ఎస్యూవీ, హ్యాచ్ బ్యాక్ తదితర కార్ల సెగ్మెంట్లలో తన స్థానం పదిలం చేసుకునేందుకు భారీ ఆఫర్లు ప్రకటిస్తోంది. ఈ తరుణంలో ఏప్రిల్‌లో కొన్ని మోడల్ కార్లపై గరిష్టంగా రూ.1.5 లక్షల వరకూ డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిపింది. మారుతి సుజుకి ఇగ్నీస్ మోడల్ కారుపై గరిష్టంగా రూ.58 వేల డిస్కౌంట్ ఆఫర్ చేసింది. మారుతి సుజుకి పాపులర్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ బాలెనోపై రూ.58 వేల డిస్కౌంట్ అందిస్తున్నది. మారుతి సుజుకి సియాజ్ కారుపై క్యాష్ డిస్కౌంట్ రూ.25 వేలు, ఎక్స్చేంజ్ బోనస్ రూ.25 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.3,000 కలుపుకుని మొత్తం రూ.53 వేల డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిపింది. గ్రాండ్ విటారా మైల్డ్ హైబ్రీడ్ కార్లపై రూ.58 వేలు, స్ట్రాంగ్ హైబ్రీడ్ వర్షన్లపై రూ.84 వేల వరకు డిస్కౌంట్ ఆఫర్ చేసింది. ఫ్రాంక్స్ టర్బో పెట్రోల్ వేరియంట్ మీద రూ.68 వేల వరకూ ధర తగ్గించింది. మారుతి సుజుకి జిమ్నీ కారుపై గరిష్టంగా రూ.1.50 లక్షల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. 2022-23, 2023-24 మోడల్ కార్లలో స్పెషిఫిక్ ట్రిమ్స్ మీద గణనీయ క్యాష్ డిస్కౌంట్లు అందిస్తున్నది -
విమాన ప్రయాణికులకు టాటా గ్రూప్ బంపరాఫర్!
విమాన ప్రయాణికులకు టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిరిండియా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ శుభవార్త చెప్పింది. చెక్ ఇన్ బ్యాగేజీ లేకుండా ప్రయాణించడానికి ఇష్టపడే ప్రయాణీకులకు తగ్గింపు ధరలలో టికెట్ల ధరలను అందిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఎక్స్‌ప్రెస్ లైట్ ద్వారా ప్రయాణికులు సాధారణ ఛార్జీల కంటే తక్కువ ధరలో విమాన టికెట్లను పొందవచ్చు. ఎక్స్ ప్రెస్ చెక్ ఇన్ ఫ్లయర్ కౌంటర్లు, బ్యాగేజీ బెల్ట్ వద్ద క్యూలను నివారించేందుకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముందుగా బుక్ చేసుకుంటే 15 కిలోలు, 20 కిలోల చెక్ ఇన్ బ్యాగేజీలపై డిస్కౌంట్ వస్తుందని తెలిపింది. ఎక్స్‌ప్రెస్ లైట్ ఛార్జీలపై ప్రయాణించే ప్రయాణికులు కాంప్లిమెంటరీ కింద అదనంగా 3 కిలోల బ్యాగేజీని ఫ్రీగా బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని ఎయిర్ పోర్ట్ ఎయిర్ లైన్ కౌంటర్లలోని ప్రయాణికులు చెక్ ఇన్ బ్యాగేజీ సేవలను వినియోగించుకోవచ్చని ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.