బెంగళూరు: వాహనదారులు పెండింగ్ చలాన్లు కట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిన 50 శాతం డిస్కౌంట్ వర్కవుట్ అయింది. ఆఫర్ ప్రకటించిన మరునాడే వాహనదారులు ఎగబడ్డారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లకు వెళ్లి తమ పెండింగ్ చలాన్లు కట్టారు. దీంతో శుక్రవారం ఒక్క రోజే రూ.5.6 కోట్లు వసూలు అయినట్లు అధికారులు తెలిపారు.
కర్ణాటకలో మొత్తం రూ.530 కోట్ల పెండింగ్ చలాన్లను వాహనాదారులు కట్టాల్సి ఉంది. ఇందులో కేవలం బెంగళూరుకు చెందినవారే రూ.500కోట్లు చెల్లించాల్సి ఉంది. దీంతో ప్రభుత్వం 50 శాతం డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఫలితంగా వాహనదారుల నుంచి మంచి స్పందన వచ్చింది.
బెంగళూరులో చలాన్లు పెండింగ్ ఉన్నవారు స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లకు వెళ్లి లేదా వెబ్‌సైట్, పేటీఎం ద్వారా చెల్లింపులు జరపవచ్చని అధికారులు తెలిపారు. 50 శాతం డిస్కౌంట్ ఆఫర్ ఫిబ్రవరి 11 వరకు మాత్రమే వర్తిస్తుంది. దీంతో వచ్చే వారం రోజులు కలెక్షన్లు భారీగా ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.
చదవండి: సన్నీలియోన్ వెళ్లే ఫ్యాషన్ షో వేదిక సమీపంలో పేలుడు..
Comments
Please login to add a commentAdd a comment