breaking news
karnataka
-
పాలు నచ్చకపోతే తాగొద్దు.. రీల్స్ ఎందుకు?
యశవంతపుర: ‘నీకు పాలు ఇష్టం లేకుంటే తాగడం మానేయాలి. కానీ ఇలా రీల్స్ చేసి పోస్టు చేయడం తప్పు’ అని ఓ మహిళా వైద్యురాలికి హైకోర్టు అక్షింతలు వేసింది. వివరాలు కేఎంఎఫ్ నందిని పాలు విషపూరితమంటూ వైద్యురాలు డాక్టర్ శరణ్య పద్మాపై బెంగళూరు మల్లేశ్వరం పోలీసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ కేసును రద్దు చేయాలని ఆమె హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం కేసు విచారణ సాగింది. ఆ పాలు విషపూరితం అంటూ ఎలా చెప్పగలరని హైకోర్టు జడ్జి ప్రశ్నించారు. ఇలా రీల్స్ చేసి ప్రజలు, వినియోగదారులను గాభరా పెట్టడం సబబేనా? అని అడిగారు. పాలను పరీక్షించి ధృవీకరించుకున్నారా అని ప్రశ్నలు వేశారు. పాలు బాగా లేకుంటే తాగవద్దు, ఇన్‌స్టాలో ఇలాంటి రీల్స్ పోస్టు చేస్తారా? అని జడ్జి మందలించారు. నీపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. ఏమిటీ గొడవ? డాక్టర్ శరణ్య పద్మా ఫిబ్రవరి 8న సోషల్ మీడియాలో వీడియో, రీల్స్‌ను పోస్టు చేశారు. నందిని బ్రాండ్ క్రీమ్ బన్, స్ట్రాబెర్రి ఫ్లేవర్ పాలు, పనీర్, ఇతర పదార్థాలు కల్తీగా ఉన్నట్లు చెప్పారు. శరీరానికీ హాని కలిగించే రసాయనాలున్నట్లు ఆమె ఆరోపిస్తూ, వీటిని సేవిస్తే ఆటో–ఇమ్యూన్ వ్యాధులు వస్తాయని పేర్కొన్నారు. దీంతో ఆమెపై కేఎంఎఫ్ అధికారులు కేసు వేశారు. -
ప్రకాశ్ రాజ్ కు షాక్.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
-
‘యూజ్లెస్ ఫెలోస్.. మీ సంగతి తేలుస్తా’
కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహనం కోల్పోయారు. కర్ణాటకలో నిర్వహించిన కాంగ్రెస్ ‘సంకల్ప సమావేష’ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తుండగా.. కొందరు కార్యకర్తలు అత్యుత్సహం ప్రదర్శించారు. అయితే.. వద్దని వారిస్తున్న వాళ్లు అదే పని చేయడంతో ఖర్గేకు కోపమొచ్చింది. యూజ్లెస్ ఫెలోస్.. అంటూ గట్టిగానే మందలించారాయన. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆదివారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ‘సంకల్ప సమావేష’ కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగిస్తుండగా.. సభలోని కొందరు కార్యకర్తలు కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు మద్దతుగా ‘డీకే.. డీకే’ అంటూ నినాదాలు చేశారు.దీంతో అసహనానికి గురైన ఖర్గే.. “ఇక్కడ మీరు నినాదాలు చేస్తే దేశమంతా ప్రభావితమవుతుందా? ఇది ఒక వ్యక్తి కార్యక్రమం కాదు.. పార్టీ కార్యక్రమం. మీరంతా పనికిమాలిన వాళ్లు(యూజ్లెస్ ఫెలోస్). ఇక్కడ వ్యక్తుల ఆరాధనకు స్థానం లేదు. మనందరినీ ఒక్కచోటికి తీసుకొచ్చేది పార్టీ మాత్రమే. అది గుర్తించండి” అంటూ మండిపడ్డారు.తనకు 58 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని పేర్కొన్న ఖర్గే.. “ఎంతో మంది నాయకులు ఇక్కడికి వచ్చారు. వారి కంటే పార్టీ వారికి ఎక్కువ ఇచ్చింది. ఇక్కడ నినాదాలు చేసిన వారందరి వీడియో ఫుటేజ్‌ను పరిశీలిస్తాను. ఆ తర్వాత క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు.కార్యకర్తలు అలా నినాదాలు చేస్తున్న సమయంలో.. వేదికపైనే ఉన్న డీకే శివకుమార్ తన కుర్చీలోంచి లేచి ఆపమంటూ సైగలు చేశారు. అయినా కూడా వాళ్లు ఆగలేదు. ఆ సమయంలో వేదికపై కూర్చున్న మాజీ సీఎం సిద్ధరామయ్య డీకేను చూస్తూ ఉండిపోయారు.#WATCH | Bengaluru, Karnataka: Congress President Mallikarjun Kharge loses his cool at party workers during the Sankalpa Samavesha programme after the workers raised “DK-DK” slogans“Will the entire country be affected if you shout here? This is not an individual’s programme, it… pic.twitter.com/jmO0rLMftK— ANI (@ANI) June 21, 2026ఖర్గే వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్‌లో వ్యక్తి కంటే పార్టీ ముఖ్యమనే సందేశాన్ని ఇవ్వడానికే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే సభలో డీకే శివకుమార్ అనుచరుల నినాదాలపై ఖర్గే బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేయడం కర్ణాటక కాంగ్రెస్‌లోని అంతర్గత రాజకీయాలపై మరోసారి చర్చకు దారితీసింది. కేడర్‌ను ఉద్దేశించి ఖర్గే అంతలా మాట్లాడిన అవసరం లేదంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. -
కర్ణాటక రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఇటీవల జరిగిన ఏడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. ముఖ్యంగా బీజేపీ–జేడీఎస్ కూటమిలో క్రాస్ ఓటింగ్ ఆరోపణలు రెండు పార్టీల మధ్య ఉన్న అంతర్గత విభేదాలను బయటపెట్టినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దీంతో, కర్ణాటక రాజకీయం మరోసారి చర్చనీయాంశంగా మారింది.కాగా, 2023 సెప్టెంబర్‌లో అధికారికంగా ఎన్డీయేలో చేరిన జేడీఎస్, బీజేపీతో కలిసి కాంగ్రెస్‌ను ఎదుర్కోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో జేడీఎస్ అధినేత హెచ్డీ కుమారస్వామికి కేంద్రంలో మంత్రి పదవి కూడా లభించింది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన రెండు పార్టీలు, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత అనుమానాల మేఘాల్లో చిక్కుకున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల బదిలీ ఆశించిన స్థాయిలో జరగలేదని, కూటమి ఎమ్మెల్యేలలో కొందరు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారనే ప్రచారం జోరుగా సాగుతోంది.దీంతో బీజేపీ–జేడీఎస్ మధ్య ఉన్న సత్సంబంధాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పైకి ఐక్యత కనిపిస్తున్నప్పటికీ, లోలోపల అసంతృప్తి ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఈ ప్రచారాన్ని కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి కొట్టిపారేశారు. బెంగళూరులోని జేడీఎస్ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, బీజేపీతో తమ పొత్తులో ఎలాంటి సమస్య లేదన్నారు. త్వరలో ఢిల్లీ వెళ్లి బీజేపీ జాతీయ అధ్యక్షుడిని కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల అంశంపై పూర్తి వివరాలు తెలియజేస్తానని చెప్పారు.ఈ సందర్భంగా ఎన్నికల్లో కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిగాయని కుమారస్వామి ఆరోపించారు. ఈ విషయంపై దర్యాప్తు ఎవరు చేస్తారు? ఎవరికి ఫిర్యాదు చేయాలి? అని ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత వెలుగులోకి వచ్చిన క్రాస్ ఓటింగ్ వివాదం కూటమి భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. -
ఫలించిన రుక్మిణి వసంత్ పోరాటం
కృత్రిమ మేధ (AI) సాంకేతికత దుర్వినియోగం మరోసారి సినీ పరిశ్రమను కుదిపేసింది. ప్రముఖ నటి రుక్మిణి వసంత్‌కు సంబంధించినట్లు ప్రచారం చేసిన అసభ్యకర ఫొటోలు, వీడియోలు పూర్తిగా నకిలీవని తేలడంతో ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన బెంగళూరు పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా.. పలువురు నటి చూపించిన చొరవను అభినందిస్తున్నారు.'కాంతార' ఫేమ్ నటి రుక్మిణి వసంత్ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అయిన బికినీ ఫొటోలు, వీడియోలు తీవ్ర వివాదానికి దారితీశాయి. స్విమ్మింగ్ పూల్ వద్ద బికినీలో ఫొటోషూట్ చేసినట్లు ప్రచారం కాగా.. ఆ వీడియోలు, ఫొటోలు పూర్తిగా ఏఐ సాయంతో సృష్టించినవేనని రుక్మిణి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, తన వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘిస్తూ అసత్య ప్రచారం చేయడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు.‘‘నా పేరుతో వైరల్ అవుతున్న ఫొటోలు, వీడియోలు అన్నీ ఫేక్. వాటిని ఏఐ సాయంతో రూపొందించారు. ఈ వ్యవహారాన్ని నేను తీవ్రంగా పరిగణిస్తున్నాను. వాటిని సృష్టించిన వారిపైనా, ప్రచారం చేస్తున్న వారిపైనా చట్టపరమైన చర్యలు ప్రారంభించాం’’ అని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి కంటెంట్‌ను ఎవరూ షేర్ చేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ ఘటనపై రుక్మిణి వసంత్ బెంగళూరు నగర సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఏఐ సాంకేతికతను ఉపయోగించి అభ్యంతరకర చిత్రాలు, వీడియోలు తయారుచేసి సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. దీనివల్ల తన గౌరవానికి భంగం కలగడమే కాకుండా మానసిక వేదనకు గురయ్యానని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఐటీ చట్టం, భారతీయ న్యాయ సంహిత (BNS)లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. సాంకేతిక ఆధారాల సాయంతో నిందితులను గుర్తించిన పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నేరానికి ఉపయోగించినట్లు భావిస్తున్న మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.అరెస్ట్ అయిన వారిలో బాగలకోట జిల్లా చిలకముఖి గ్రామానికి చెందిన రవికుమార్ (24), ప్రస్తుతం బెంగళూరులోని కామాక్షిపాళ్యలో నివసిస్తున్న చంద్రకాంత్ (33), మహాలక్ష్మీనగర్‌కు చెందిన రంజిత్ (25) ఉన్నారు. వీరిని కోర్టులో హాజరుపరచగా, కేసుపై మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.ఇటీవలి కాలంలో ఏఐ సాయంతో రూపొందిస్తున్న డీప్‌ఫేక్‌లు, మార్ఫింగ్ చిత్రాలు సినీ తారలు, ప్రజాప్రతినిధులు, సామాన్యులను సైతం ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా నటీమణుల ఫొటోలను అభ్యంతరకరంగా మార్చి వైరల్ చేయడం ఆందోళన కలిగిస్తోంది. గతంలోనూ పబ్లిక్ ఈవెంట్లలో మహిళా నటీమణుల శరీర భాగాలను జూమ్ చేసి చిత్రీకరించడంపై రుక్మిణి వసంత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఏఐ సాయంతో ఏకంగా నకిలీ ఫొటోషూట్లను సృష్టించడంపై పోరాటం మొదలుపెట్టి విజయవంతం అయ్యారు.ఇటీవల పలువురు సినీ నటీమణులు, టెలివిజన్ యాంకర్లు కూడా తమ పేర్లతో ప్రచారం అవుతున్న ఏఐ ఫొటోలు, వీడియోలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నటి, యాంకర్ అనసూయ కూడా ఈ అంశాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో డీప్‌ఫేక్‌లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం మరింత స్పష్టమవుతోంది. -
కర్ణాటకలో క్రాస్ ఓటింగ్.. కాంగ్రెస్ ఘన విజయం
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ తీవ్ర కలకలం రేపుతోంది. మొత్తం 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అధికార కాంగ్రెస్ పార్టీకి 135 మంది సభ్యుల బలం ఉండగా ఏకంగా 151 ఓట్లను సాధించి, 5 స్థానాలను కైవసం చేసుకుంది. ప్రతిపక్ష బీజేపీ కేవలం 2 స్థానాలను మాత్రమే గెలుచుకోగా, జేడీఎస్ అభ్యర్థి ఓటమి పాలయ్యారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జేడీఎస్ (JD-S) పార్టీలకు చెందిన 12 మంది వరకు ఎమ్మెల్యేలు తమ పార్టీ ఆదేశాలను ధిక్కరించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా ఓటు వేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా జేడీఎస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డట్లు సమాచారం. ఆ పార్టీకి అసెంబ్లీలో 18మంది ఎమ్మెల్యేలున్నారు. అంటే జేడీఎస్ అభ్యర్థికి 18ఓట్లు రావాలి. కానీ, జేడీఎస్ మొదటి ప్రాధాన్యతా ఓట్లు 14 మాత్రమే వచ్చాయి. అంటే, నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డట్లు సమాచారం. బీజేపీ కనీసం మూడు ఓట్లను కోల్పోగా కాంగ్రెస్‌కు అదనంగా వచ్చిన ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయనే గందరగోళం ఏర్పడింది. దీనిపై విచారణ సాగుతుంది.ఈ క్రాస్ ఓటింగ్ ద్వారా కాంగ్రెస్ అఖండ విజయం సాధించగా, ప్రతిపక్ష శిబిరంలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. బీజేపీ, జేడీఎస్ కూటమి నుండి క్రాస్ ఓటింగ్ జరగడంపై ఆయా పార్టీల అగ్రనాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై అంతర్గత విచారణ జరిపి, బాధ్యులైన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని బిజెపి నేతలు ప్రకటించారు. కాగా సీఎంగా డీకే శివకుమార్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికలు ఇందులో కాంగ్రెస్ విజయం సాధించడంతో ఈ గెలుపుపై ఆయన సంతోషం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. -
విజయ్ బిగ్ మూవ్.. ఇరకాటంలో కాంగ్రెస్!
కావేరీ నది జలాలపై కర్ణాటక ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న మేకెదాటు డ్యామ్ ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ శుక్రవారం ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెడుతూ.. కేంద్రం కూడా ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని తన రాష్ట్ర రైతుల హక్కులను కాపాడే దిశగా గట్టి వైఖరి ప్రదర్శించారు.కర్ణాటక ప్రభుత్వం రూ. 9,000 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ జలాశయ ప్రాజెక్ట్ ఏకపక్ష చర్యగా ఉందని ఆ తీర్మానంలో తమిళనాడు ఆరోపించింది. కావేరీ జల వివాద ట్రైబ్యునల్ తీర్పు (2007).. అలాగే సుప్రీంకోర్టు తీర్పు (2018)ను ఉల్లంఘించే ప్రయత్నంగా ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగుతోందని తీర్మానంలో సీఎం విజయ్ పేర్కొన్నారు.ఈ తీర్మానం ప్రకారం కావేరీ బేసిన్ ఇప్పటికే నీటి కొరత ఉన్న ప్రాంతమని, అందుబాటులో ఉన్న నీరు రాష్ట్రాల మధ్య పంచబడిపోయిందని ఆయన పేర్కొన్నారు. అందువల్ల కొత్త ప్రాజెక్టులు లేదా అదనపు నీటి వినియోగానికి అవకాశం లేదని స్పష్టం చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని మేకెదాటు ప్రాజెక్ట్‌కు ఎలాంటి అనుమతులు, సాంకేతిక లేదంటే పర్యావరణ క్లియరెన్స్‌లు ఇవ్వకూడదని తమిళనాడు అసెంబ్లీ తరఫున కోరారాయన. కేంద్ర జల సంఘం కూడా ఈ ప్రాజెక్ట్ వివరాల నివేదికను పరిశీలించకూడదని తీర్మానంలో సూచించారు.నీరు అనేది ప్రజల ప్రాథమిక హక్కు అని, దాన్ని కాపాడటం తమ ప్రభుత్వ బాధ్యత అని సీఎం విజయ్ స్పష్టం చేశారు. రాజకీయ భేదాలు ఉన్నా ప్రజల ప్రయోజనాల విషయంలో అందరూ ఏకతాటిపై నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ చర్చలో డీఎంకే, ఇతర పక్షాలు సైతం తీర్మానానికి మద్దతుగా మాట్లాడాయి.#TamilNadu CM Joseph #Vijay passed a resolution in assembly opposing Karnataka’s Mekedatu dam on Cauvery, citing tribunal and #SupremeCourt violations.#20xSubscribedSMEIPO pic.twitter.com/WaMKj7isb7— News Update (@NewsNew1578) June 19, 2026బెంగళూరు తాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు జలవిద్యుత్ ఉత్పత్తి కోసం ఈ ప్రాజెక్ట్ అవసరమని కర్ణాటక చెబుతోంది. అయితే.. తమిళనాడు మాత్రం ఇది తమ రాష్ట్ర నీటి హక్కులకు నష్టం కలిగిస్తుందని గట్టి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇదే సమయంలో ఈ అంశంపై ముఖ్యమంత్రి విజయ్, దేశ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసి.. కర్ణాటక సమర్పించిన డీటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను తిరస్కరించాలని కోరడం కూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పరిణామాలతో మేకెదాటు వివాదం మరోసారి దేశవ్యాప్తంగా రాజకీయంగా వేడెక్కింది.👉ఈ తీర్మానంలో అత్యంత కీలక అంశంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన చీలిక. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా, అదే పార్టీకి చెందిన నాయకత్వం ఉన్నప్పటికీ తమిళనాడు కాంగ్రెస్ నాయకులు మాత్రం విజయ్ సర్కార్ తీసుకున్న తీర్మానానికి మద్దతు ఇవ్వడం రాజకీయంగా విభేదాలకు దారితీసింది. రెండు రాష్ట్రాల్లో ఒకే పార్టీ వేర్వేరు వైఖరులు తీసుకోవడం కాంగ్రెస్‌ను చిక్కుల్లోకి పడేసింది.కర్ణాటక కాంగ్రెస్ నేతలు ఈ తీర్మానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, మేకెదాటు ప్రాజెక్ట్ తమ రాష్ట్ర అభివృద్ధి, బెంగళూరు తాగునీటి అవసరాలకు అవసరమని వాదిస్తున్నారు. కేంద్రం నుంచి అనుమతులు తీసుకుని ముందుకు సాగుతామని వారు స్పష్టం చేస్తున్నారు.అదే సమయంలో తమిళనాడు కాంగ్రెస్ నేతలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వ తీర్మానానికి అనుకూలంగా స్పందిస్తూ, కావేరీ జలాలపై తమిళనాడు హక్కులను కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. రైతుల ప్రయోజనాల విషయంలో రాజీ పడలేమని వారు చెబుతున్నారు. ఇలా రెండు రాష్ట్రాల్లో ఒకే పార్టీ నేతలు భిన్న భిన్న వైఖరులు తీసుకోవడంతో కాంగ్రెస్ హైకమాండ్‌కు పరిస్థితి ఇరకాటంగా మారింది. ఈ ప్రాజెక్టు నేపథ్యం.. మేకెదాటు ప్రాజెక్ట్ కర్ణాటకలోని కనకపుర–రామనగర ప్రాంతాల మధ్య కావేరీ నదిపై నిర్మించాలనుకుంటున్న బ్యాలెన్సింగ్ జలాశయ ప్రాజెక్ట్. మేకెదాటు అంటే కన్నడలో “మేక దూకిన స్థలం” అని అర్థం. ఇక్కడ నది సన్నని లోయలో వేగంగా ప్రవహిస్తుంది. ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం బెంగళూరుకు తాగునీరు అందించడం మరియు జలవిద్యుత్ ఉత్పత్తి చేయడం.కావేరీ నీటి ప్రవాహాన్ని నియంత్రించేందుకు రిజర్వాయర్ నిర్మించాలన్నది కర్ణాటక ప్రభుత్వ ప్రతిపాదన. ఇదేం కొత్తది కాదు. 1940 నుంచే ఉంది. అయితే 2017లో అప్పటి ప్రభుత్వం తెర మీదకు తీసుకొచ్చింది. అయితే మేకెదాటు వల్ల దిగువ రాష్ట్రం తమిళనాడు నీటి ప్రవాహం తగ్గుతుందని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీంతో ఈ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అంశం మాత్రమే కాకుండా రెండు రాష్ట్రాల మధ్య దీర్ఘకాలిక జల వివాదంగా మారింది. -
ఖాళీగా ఓలా.. అయినా ఉబర్ కోసం అరగంట వెయిటింగ్!
ధర తక్కువగా ఉండడమో లేదంటే వెంటనే అందుబాటులో ఉండడమో.. ఈ కారణాలతోనే వినియోగదారుడు ఏదైనా ఎంచుకుంటాడని అనుకుంటాం. కానీ బెంగళూరు విమానాశ్రయంలో జరిగిన ఓ సంఘటన మాత్రం అందుకు భిన్నమైన చిత్రాన్ని చూపించింది. ఓలా క్యాబ్‌లు సిద్ధంగా ఉన్నా.. ప్రయాణికులు మాత్రం అరగంటపాటు ఉబర్ కోసం వేచి ఉండడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.బెంగళూరుకు చెందిన ఆకాశ్ కొటాల్వార్ అనే వ్యక్తి తన లింక్డ్ఇన్ పోస్టులో ఆసక్తికర అనుభవాన్ని పంచుకున్నాడు. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-2లో దిగిన తర్వాత ఉబర్ గో సేవ కోసం దాదాపు 30 నుంచి 40 మంది ప్రయాణికులు క్యూలో నిలబడి ఉన్నారని తెలిపాడు. అదే సమయంలో ఓలా కౌంటర్ వద్ద క్యాబ్‌లు సిద్ధంగా ఉన్నాయని, వెంటనే ప్రయాణం ప్రారంభించవచ్చని సిబ్బంది చెబుతున్నప్పటికీ ఎవరూ అక్కడికి వెళ్లలేదని పేర్కొన్నాడు. అయితే.. ఆకాశ్ కూడా ఉబర్ కోసం సుమారు 30 నిమిషాల నిరీక్షణ సమయం కనిపించిందని, అయినప్పటికీ ఓలాకు మారకుండా ఉబర్‌లోనే ఖరీదైన ‘ఉబర్ కంఫర్ట్’ సేవను ఎంచుకున్నానని ఆకాష్ తెలిపాడు. తనలాగే క్యూలో ఉన్నవారిలో కూడా ఎవరూ ఓలాకు మారలేదని చెప్పాడు.కారణం ఏంటంటే.. ఇది బ్రాండ్ లాయల్టీ (బ్రాండ్‌పై అభిమానం) కంటే "స్విచింగ్ కాస్ట్" అనే మానసిక భావనకు ఉదాహరణ అని ఆకాష్ అభిప్రాయపడ్డాడు. కొత్త సేవకు మారితే ఏమవుతుందో తెలియని అనిశ్చితి, ఇప్పటికే అలవాటైన సేవను వదలాలనే ఇబ్బంది.. దీనినే 'స్విచింగ్ కాస్ట్'గా పిలుస్తారు. ఈ కేసులో.. జర్నీ కోసం మరో యాప్ డౌన్లోడ్ చేయడం, కొత్త సేవను ప్రయత్నించడం, అనిశ్చితిని ఎదుర్కోవడం కంటే ఇప్పటికే తెలిసిన సేవనే వినియోగదారులు ఎంచుకుంటారని వివరించాడు. అంటే.. ప్రజలు కేవలం తక్కువ ధర కోసం కాకుండా, "ఏం జరుగుతుందో ముందే తెలిసిన నమ్మకం" కోసం కూడా ఎక్కువ డబ్బు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంటారన్నమాట.ఈ పోస్టుపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరు ఉబర్ సేవలు గతంలో మరింత స్థిరంగా, వినియోగదారులకు అనుకూలంగా ఉండటంతో ప్రజలు దానిని ఎక్కువగా నమ్ముతున్నారని వ్యాఖ్యానించారు. మరికొందరు మాత్రం వినియోగదారుల నిర్ణయం పరిస్థితిని బట్టి మారుతుందని, ధరలు, సౌలభ్యం, ప్రయాణ సమయం వంటి అంశాలు కూడా ప్రభావం చూపుతాయని అభిప్రాయపడ్డారు.మొత్తంగా.. బెంగళూరు విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటన ఒక విషయాన్ని స్పష్టం చేసింది. వినియోగదారుల ఛాయిస్ మన అంచనాలకు తగ్గట్లు ఉండదు. కొన్నిసార్లు నమ్మకం, అలవాటు, ముందస్తు అనుభవం కూడా వారి నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే ఓలా క్యాబ్‌లు సిద్ధంగా ఉన్నా.. ఉబర్ కోసం ప్రయాణికులు క్యూలో నిలబడిన దృశ్యం ఇప్పుడు చర్చకు దారితీసింది. -
జాతీయ స్థాయి బాడీబిల్డర్ : జిమ్ చేసి వచ్చి అంతే కుప్పకూలిపోయాడు!
కర్ణాటకలోని దావెణగిరిలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. అనేక రాష్ట్ర, జాతీయ స్థాయి బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకున్న బాడీబిల్డర్ సుశీల్ కుమార్ (26) జిమ్‌లో వర్కౌట్ ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చిన కొద్ది సేపటికే అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలొదిలిన ఘటన కలకలం రేపింది. అంతర్జాతీయ పోటీకి సిద్ధమవుతున్న ఈ యువ ప్రతిభావంతుడి మరణం అతని కుటుంబానికి, క్రీడా సమాజానికి ,కుటుంబ సభ్యులు, స్నేహితులను తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది. దావెణగిరిలో కేటీజే లేఅవుట్ నివాసి అయిన సుశీల్ కుమార్, అతను ప్రస్తుతం ఒక అంతర్జాతీయ బాడీబిల్డింగ్ పోటీకి సన్నద్ధమవుతున్నాడు. మంగళవారం సాయంత్రం జిమ్‌కు వెళ్లిన సుశీల్ కుమార్, రాత్రి 8.30 గంటలకు ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంట్లో భోజనం చేసి కూర్చుని అకస్మాత్తుగా కుప్పకూలి పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. మార్గమధ్యలోనే గుండెపోటుతో అతను మరణించినట్లు వైద్యులు తెలిపారు. లో బ్లడ్ ప్రెషర్ కారణంగా గుండెపోటు వచ్చి మృతి చెందినట్లు వైద్యులు భావిస్తున్నారు.ఆసుపత్రిలో గ్రూప్-డి ఉద్యోగిగా పనిచేస్తున్న సుశీల్ తల్లి దేవమ్మ కుమారుడి మృతితో కన్నీరుమున్నీరుగా విలపించారు. శోక సంద్రంలో ముగినిపోయిన ఆమె ఇక తనకు దిక్కెవరంటూ గుండెలవిసేలా రోదించిన తీరున పలువురి కంట కన్నీరు తెప్పించింది.(రోజుకు 12 గంటలు, అయినా : 82 ఏళ్ల మన్సుఖ్ కాకా స్టోరీ తెలిస్తే!)కాగా జిమ్ చేసే సమయంలో యువత వైద్యుల సలహాలు, జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కండలు పెంచే క్రమంలో మత్తుమందులు, స్టెరాయిడ్స్ లాంటి వాటి వాడకంపై కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రమబద్ధమైన జీవనశైలి, సరైన ఆహారం, వైద్య పరీక్షలు, అధిక ఒత్తిడి లేకుండా వ్యాయామం చేయడం ఉత్తమ మంటున్నారు. ఇదీ చదవండి : ఎస్ఐ ఉద్యోగం వదిలేసి, ఆస్ట్రేలియాలో రియల్ ఎస్టేట్ కింగ్ అయ్యాడు! -
ప్రకృతి ఒడిలో మైమరపించే జలపాతాలు ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
-
ఆరు నెలల సహజీవనం.. ఒక్క క్షణంలో విషాదాంతం
కర్ణాటక: యువతీ యువకుడు సహజీవనం చేస్తుండగా, యువతి హత్యకు గురైంది. ఈ ఘటన బెంగళూరు మల్లేశ్వరం పోలీసుస్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎన్డీ అనుషా (20)ను ఆమె ప్రియుడు శరత్ (25) హత్య చేశాడు. ఇద్దరూ కూడా హాజన్ జిల్లాలోని సకలేశపురకు చెందినవారు. శరత్ వాటర్ ట్యాంక్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు, ఆమె ఓ ప్రైవేటు ఉద్యోగం చేసేదని సమాచారం. ఇన్‌స్టాలో పరిచయం పెరిగి 6 నెలల నుంచి ఒకే గదిలో సహజీవనం ప్రారంభించారు. అయితే 13వ తేదీన ఇద్దరి మధ్య గొడవ జరిగి ఆమెను తీవ్రంగా కొట్టి గొంతు పిసికి చంపి పారిపోయాడు. తరువాత మరుసటి రోజున తనకు తెలిసిన న్యాయవాదికి చెప్పాడు. పోలీసులు వచ్చి చూడగా ఇంటికి తాళం వేసి ఉండడం బద్ధలు కొట్టి లోపలకు వెళ్లారు. అనుషా నేలపై విగతజీవిగా పడి ఉంది. ఇంటి నిర్వహణ, పనుల విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవని యజమాని మహాదేవ తెలిపాడు. నిందితుని కోసం గాలింపు చేపట్టారు. -
ధర్మస్థలపై ప్రశ్నిస్తే తప్పా?.. చిన్నయ్యతో నాకేం సంబంధం??
బెంగళూరు: ధర్మస్థల వ్యవహారంలో తన పేరును లాగుతూ చేస్తున్న ప్రచారం పూర్తిగా నిరాధారమని ప్రముఖ నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్‌రాజ్ స్పష్టం చేశారు. ధర్మస్థల ప్రతిష్ఠను దెబ్బతీయడానికి రూ.200 కోట్లు అందుకున్నానంటూ ముసుగువ్యక్తిగా గుర్తింపు పొందిన చిన్నయ్య చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు.‘‘చిన్నయ్యతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఇప్పటివరకు ధర్మస్థలకు ఒక్కసారి కూడా వెళ్లలేదు. ఆలయ వ్యవహారాలతో సంబంధం ఉన్నవారిని కూడా కలవలేదు’’ అని వెల్లడించారు.బెంగళూరు ప్రెస్‌క్లబ్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ప్రకాశ్‌రాజ్.. తన సహచర కార్యకర్త గిరీశ్ మట్టణ్ణనవర్ ద్వారా చిన్నయ్య ఫోన్లో మాట్లాడాడని తెలిపారు. ‘‘ధర్మస్థల అంశంపై మాట్లాడాలని అతడు కోరాడు. అయితే ఇలాంటి విషయాలు నాతో కాకుండా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముందు చెప్పాలని సూచించాను. అతని మాటలు అనుమానంగా అనిపించాయి. అందుకే ఆ సంభాషణను రికార్డు చేసి సిట్ చీఫ్‌కు కూడా పంపించాను’’ అని చెప్పారు.ధర్మస్థలలో వెలుగుచూసిన అనుమానాస్పద మరణాలు, బాధిత కుటుంబాలు వ్యక్తం చేసిన సందేహాల నేపథ్యంలోనే తాను స్పందించానని ప్రకాశ్‌రాజ్ పేర్కొన్నారు. ‘‘సామాజిక బాధ్యతతోనే ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసి సమగ్ర దర్యాప్తు జరపాలని కోరాను. ఇందులో వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలేమీ లేవు’’ అని స్పష్టం చేశారు.చిన్నయ్య ఆరోపణలపై స్పందిస్తూ, ‘‘ధర్మస్థల ప్రతిష్ఠను దెబ్బతీయడానికి కేరళ నుంచి రూ.200 కోట్లు తీసుకున్నాననే ఆరోపణలకు ఆధారాలేంటి?’’ అని ప్రశ్నించారు. తనను హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, కొన్ని వర్గాల మీడియా చిన్నయ్య వ్యాఖ్యలను వక్రీకరించి ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ధర్మస్థల ప్రతిష్ఠకు తాను మసి పూసేందుకు ప్రయత్నిస్తున్నానని జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని కోరారాయన. తాను దేవాలయాలకు వెళ్లనప్పటికీ తన భార్య భక్తురాలని, ఆమె విశ్వాసాలను ఎప్పుడూ ప్రశ్నించలేదన్నారు. ధర్మస్థలలో విద్యార్థిని సౌజన్య హత్య కేసులో నిజాలు బయటపడాలని, నిందితులకు కఠిన శిక్ష పడాలని మాత్రమే తాను కోరుకుంటున్నానని స్పష్టం చేశారు.విలేకరులతో మాట్లాడిన టైంలో.. ‘అమ్ముడుబోయిన ప్రచార మాధ్యమాలు’ అంటూ చేసిన ప్రకాశ్‌రాజ్ చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీంతో కాసేపు అక్కడ గందరగోళం నెలకొంది. అయితే ప్రకాశ్‌రాజ్ ఆ వ్యాఖ్యలపై క్షమాపణలు మాత్రం చెప్పలేదు. ఆపై వివరణ ఇస్తూ.. ఆ వ్యాఖ్యలు మీడియా మొత్తాన్ని ఉద్దేశించి చేసినవి కావని, కొందరికి మాత్రమే వర్తిస్తాయని అన్నారు. దీంతో మీడియా ప్రతినిధులు శాంతించడంతో.. ప్రెస్‌మీట్ కొనసాగింది.Prakash Raj called a press meet to clarify Chinnayya's claim that they had spoken during the alleged Dharmasthala hoax mass burial kconspiracy.He invited the "sold-out Godi Media."The media turned up.Then came the questions and a heated exchange. #Dharmasthala #Massburial pic.twitter.com/j8uVCMfba5— Harish Upadhya (@harishupadhya) June 17, 2026కర్ణాటకలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన ధర్మస్థల వ్యవహారం గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ ప్రాంతంలో 1995-2014 మధ్య కాలంలో పలువురు మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరిగాయని, ఆ మృతదేహాలను తానే ఖననం చేశానంటూ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చిన్నయ్య (ముసుగువ్యక్తి) సంచలన ఆరోపణలు చేయడంతో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. అయితే అనంతరం చిన్నయ్య తన వాంగ్మూలాన్ని మార్చుకుంటూ.. ధర్మస్థల ఆలయ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి రూ.200 కోట్ల కుట్ర జరిగిందని, అందులో ప్రకాశ్‌రాజ్ సహా పలువురి పేర్లు ప్రస్తావించాడు. మరోవైపు 2012లో ధర్మస్థల సమీపంలో హత్యకు గురైన విద్యార్థిని సౌజన్య కేసులో అసలు నిందితులు శిక్ష తప్పించుకున్నారనే ఆరోపణలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ధర్మస్థల, సౌజన్య కేసులపై సమగ్ర దర్యాప్తు జరిపి నిజాలు వెలికితీయాలని ప్రకాశ్‌రాజ్ డిమాండ్ చేస్తున్నారు. -
వాట్సాప్ స్టేటస్ విప్పిన గుట్టు!
ఒకరికొకరు జీవితాంతం తోడుంటామని ప్రమాణాలు చేసుకున్నారు. కానీ ఆ బంధం చివరికి ఓ ఊహించని క్రైమ్ కథగా మారుతుందని ఎవ్వరూ ఊహించలేదు. చిన్న రోడ్డు ప్రమాదం.. ఆసుపత్రిలో చికిత్స.. ఆ తర్వాత ఒక్కసారిగా భర్త గుండెపోటుతో మృతి చెందాడు. కన్నీళ్లతో కుప్పకూలిన ఆమె… ఆ క్షణం అది ముగింపు అనుకుంది. కానీ అదే ముగింపు కాదు. అసలు కథ మొదలు.ఈ కేసులో మలుపు తిప్పింది ఒక వాట్సాప్ స్టేటస్. సాధారణంగా కనిపించిన ఆ ఒక్క మెసేజ్ పోలీసుల అనుమానాన్ని రేకెత్తించింది. అదే ఆధారంగా సాగిన దర్యాప్తు… చివరికి ఇది ప్రమాదం కాదు పక్కా ప్లాన్‌తో చేసిన హత్యగా అని బయటపెట్టింది. కర్ణాటకలోని బెలగావి జిల్లాలో మాజీ ఆర్మీ జవాన్ శాండీప్ మంజర్గి మృతి కేసు.. సంచలన మలుపు తీసుకుంది. ప్రియుడితో కలిసి భార్యే ఆయన్ని.. అదీ ఆస్పత్రిలోనే హతమార్చినట్లు నిర్ధారణ అయ్యింది. మొదట ఇది గుండెపోటు వల్ల జరిగిన సహజ మరణమని వైద్య నివేదికలు పేర్కొన్నప్పటికీ.. తర్వాతి దర్యాప్తులో ఇది పక్కా ప్రణాళికతో చేసిన హత్యగా పోలీసులు తెలుసుకుని కంగుతిన్నారు. ఈ కేసులో అతని భార్య సుమ మంజర్గి, ఆమె ప్రేమికుడు పుండలిక్ దొంబార్ సహా మొత్తం తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఆస్పత్రి సిబ్బంది కూడా ఉండడం గమనార్హం.పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మార్చి 13న శాండీప్ రోడ్డు మీద యాక్సిడెంట్ కావడంతో స్వల్పంగా గాయపడ్డాడు. మొదట ఆయన్ని హుక్కేరి ప్రభుత్వ ఆసుపత్రిలో, తరువాత జీ.జె. ఆసుపత్రికి తరలించారు. చిన్న గాయమే కావడంతో ఒకట్రెండు రోజుల్లో ఆయన డిశ్చార్జి అవుతారని కుటుంబ సభ్యులు భావించారు. అయితే రెండ్రోజుల తర్వాత.. హఠాత్తుగా ఆయన గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఇది అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. దీంతో భార్య సుమ గుండెలు పగిలేలా రోదించడం అక్కడున్నవాళ్లను కంటతడి పెట్టించింది. అయితే.. శవ పరీక్షలో అతని శరీరంలో తీవ్రమైన గాయాలు లేకపోవడం.. అప్పటిదాకా సాధారణంగా ఉన్న ఆరోగ్యం హఠాత్తుగా విషమించడంతో వైద్యులు పోలీసుల వద్ద అనుమానాలను వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో.. సుమ మంజర్గి స్నేహితుడిగా చెలామణి అవుతున్న పుండలిక్ దొంబార్ తీరుపై పోలీసులకు అనుమానం మొదలైంది. ఫోన్ కాల్ డాటా ఆధారంగా.. ఇద్దరూ గంటల తరబడి మాట్లాడుకుంటున్నారని గుర్తించారు. అలాగే ‘‘యాక్సిడెంట్ తర్వాత ఇలా ఎలా జరుగుతుంది?’’ అంటూ అతను పెట్టిన వాట్సాప్ స్టేటస్ ఆ అనుమానాల్ని మరింత బలపరిచింది. వైద్యులు ఏం చెప్పారో తెలియకుండానే.. అతను శాండీప్ మరణంపై అలా ఎలా పూర్తి వివరాలను తెలుసుకోగలిగాడు అని ఆశ్చర్యపోయారు. విచారణకు పిలిచారు. ఈ క్రమంలో తమదైన శైలిలో ప్రశ్నించడంతో అసలు విషయం ఒప్పుకున్నాడు. సుమ, పుండలిక్‌కు వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలోనే శాండీప్‌ను అడ్డు తొలగించుకోవాలనుకున్నారు. ఈ యాక్సిడెంట్‌ను అవకాశంగా మల్చుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే అతడికి సెలైన్ బాటిల్ ద్వారా విషం ఇచ్చారు. తీసుకునే జ్యూస్‌లో నిద్ర మాత్రలు కలిపారు. అలా నిద్రలోనే శాండీప్ కన్నుమూశాడు. ఆ తర్వాత.. మరణాన్ని సహజ గుండెపోటుగా చూపించేందుకు వైద్య రికార్డులు, ఫోరెన్సిక్ రిపోర్టులు డబ్బు ఎర వేసి మార్చేశారు. దర్యాప్తులో బయటపడ్డ మరో షాకింగ్ విషయం ఏంటంటే.. శాండీప్ పేరు మీద రూ.2 కోట్ల ఇన్సూరెన్స్‌లు ఉండడం, ఆయన చనిపోయాక వాటిని త్వరగా క్లెయిమ్ చేసుకోవాలని సుమ చేసిన ప్రయత్నాలు. ఇక హత్య కుట్రలో ఆసుపత్రి సిబ్బంది, ల్యాబ్ సిబ్బంది, కొందరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా భాగస్వాములైనట్లు పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్ పరీక్షలపై ప్రభావం చూపేందుకు రూ.3 లక్షలకు పైగా లంచాలు ఇచ్చినట్లు కూడా అనుమానం వ్యక్తమవుతోంది. ఆధారాలు చెరిపివేయడం, టాక్సిక్ పదార్థాలు రిపోర్టుల్లో కనిపించకుండా చేయడం కోసం పెద్ద నెట్వర్క్ పనిచేసినట్లు తెలుస్తోంది.ఇన్వెస్టిగేషన్లో పోలీసులు సిరింజ్‌లు, విష పదార్థాల కంటైనర్లు, మొబైల్ ఫోన్లు సహా కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం తొమ్మిది మందిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ కేసు కేవలం ఓ భార్య తన పప్రియుడితో కలిసి భర్తకు రాసిన మరణశాసనమే కాదు.. వ్యవస్థలోని లోపాలను బయటపెడుతూ పెద్ద చర్చకు దారి తీసింది. అన్నట్లు తెలంగాణలోని కామారెడ్డిలోనూ ఈ తరహా నేరమే ఒకటి బయటపడడం తెలిసిందే. కామారెడ్డి కేసులో ఓ వ్యక్తి హత్యను మొదట రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. అయితే పోలీసులు దర్యాప్తు చేస్తుండగా, అది యాక్సిడెంట్ కాదని పక్కా ప్లాన్‌తో చేసిన హత్యగా తేలింది. భార్యకు తన భర్తను తొలగించాలనే ఉద్దేశం ఉండగా, ఆమెకు సహకరించిన ప్రియుడి పాత్ర కూడా బయటపడింది. ఇద్దరూ కలిసి హత్య చేసి, దాన్ని ప్రమాదంగా చూపించే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. సీసీటీవీ ఫుటేజ్, టెక్నికల్ ఆధారాలు, పోస్టుమార్టం రిపోర్ట్లు అసలు నిజాన్ని బయటపెట్టాయి. చివరికి భార్య, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. -
'హొన్నావర్' అందానికి జయహో అనాల్సిందే..!
పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడూ మంచి స్ఫూర్తిదాయకమైన కథలను, కమనీయ ప్రదేశాల గురించి షేర్ చేస్తూ ఉంటారు. అలానే ఈసారి ప్రకృతి రమ్యతకు, నిశబ్దమైన గంభీరతకు ఆలవాలమైన ఒక కమనీయ ప్రదేశం ఫోటోలను షేర్చేస్తూ..దాని గురించి రాసుకొచ్చారు. అంతగా చూడని, గమనించని అందమైన ప్రదేశం అంటూ..ఆ పర్యాటక అందాల గురించి కళ్లకు కట్టినట్లు వివరించారు. ఇంతకీ ఆ పర్యాటక ప్రదేశం ఎక్కడ ఉందంటే..కర్ణాటక తీరప్రాంతంలోని హొన్నవార్ అందాలకు ఫిదా అవ్వుతూ దాని గొప్పతనం గురించి సోషల్ మీడియా ఎక్స్‌లో రాసుకొచ్చారు ఆనంద్ మహీంద్రా. శ్రద్ధ అనే పదానికి అర్హమైన అపురూపమైన ప్రకృతి రత్నంగా అభివర్ణించారు. తాను ప్రజలు అంతగా అన్వేషించని, రద్దీ తక్కువగా ఉండే ప్రశాంతమైన ప్రదేశాల కోసం అన్వేషిస్తున్నానంటూ రాశారు. అంతా కేరళ బ్యాక్‌వాటర్స్(బ్యాక్ వాటర్స్ (Backwaters) అనగా నదులు, సరస్సులు లేదా సముద్రపు తీరాలకు సమీపంలో నీటి ప్రవాహం మందగించడం వల్ల ఏర్పడే నిశ్చలమైన జలాలు. )ని ప్రశంసిస్తుంటాం. కానీ కర్ణాటక తీరంలో అలాంటి బ్యాక్వాటర్కి సంబంధించిన అద్భుతమైన ప్రదేశం ఒకటి ఉందని అన్నారు. జోగ్జలపాతంపై ఘోషించే శరావతి నది చివరకు హొన్నవార్ వద్ద నిశ్శబ్దంగా అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఇదోక మాయ ప్రదేశం. మడ అవడవులు, వంకరటింకరగా ప్రవహించే జలమార్గాలు, అద్దంలాంటి బ్యాక్‌వాటర్స్, ఎవ్వరినైన కట్టిపడేస్తాయని అన్నారు. మడ అడవులు ప్రకృతి అత్యంత సమర్థవంతమైన తీర రక్షకులలో ఒకటి కాబట్టి..హోన్నవార్ అందానికి పర్యావరణ ప్రాముఖ్యత కూడా తోడైన రమ్యమైన ప్రదేశంలా ఉంటుంది అంటూ అందుకు సంబంధించిన ఫోటోలను షేర్చేశారు. అందుకు నెటిజన్లు కూడా మద్దతిస్తూ..తమకు లిసిన తెలిసిన అద్భుత పర్యాటక ప్రదేశాల గురించి పంచుకున్నారు. కొందరు కేరళ తరచుగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది, కానీ భారతదేశ తీరప్రాంతం దాగి ఉన్న అద్భుత కళాఖండాలతో నిండి ఉంది. అసాధారణంగా ఉండటానికి అందానికి జనసమూహం అవసరం లేదని మనకు గుర్తుచేసే ప్రదేశాలలో హొన్నవార్ ఒకటిగా కనిపిస్తుంది.Continuing my search for underexplored & less crowded destinations….We often celebrate Kerala’s backwaters. But on Karnataka’s coast is a hidden gem that deserves equal attention.The same river that roars over Jog Falls, the Sharavathi River, finally and quietly merges with… pic.twitter.com/N9himujjg1— anand mahindra (@anandmahindra) June 14, 2026 (చదవండి: ఆక్వా కలర్ బనారసీ చీరలో నీతా అంబానీ అందమైన లుక్..! తయారీకే ఏకంగా..) -
సీఎంలంతా ఆ అమ్మ చెంతకే ఎందుకంటే..?! ఆఖరికి విజయ్ సైతం..
తమిళనాడు ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి, పార్టీ పెట్టిన రెండేళ్లకే అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన స్టార్ హీరో విజయ్. ఆయన ఇటీవలే కర్ణాటకలోని కొల్లూరు శ్రీ మూకాంబికా అమ్మవారిని సందర్శించుకుని పూజలు చేసిన సంగతి తెలిసిందే. ఇలా ముఖ్యమంత్రి హోదాలో తమిళనాడు ఆలయాన్ని ఎందరో దర్శించుకున్నారు. అంతేగాదు సెలబ్రిటీలు, ప్రముఖులు సైతం ఈ ఆలయానికే తరలి వస్తుంటారు. మన టాలీవుడ్ హీరో ఎన్టీర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, సంగీత మాంత్రికుడు ఇళయరాజా వంటి దిగ్గజాలు వరకు చాలామంది ఈ అమ్మవారిని దర్శించుకుని, పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రులు ఎంజీఆర్ నుంచి జయలలిత వరకు అంతా ఈ అమ్మవారిని దర్శించుకున్నారు. అలా అంతటి అతిరథమహారథులంతా తరలివస్తున్న ఈ కొల్లూరు మూకాంబిక క్షేత్రం విశిష్టత ఏంటి, ఎందుకు రాజకీయ నాయకులు దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు ఈ అమ్మ దర్శనానికి బారులు తీరుతున్నారు వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా.!.కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో ఉన్న కొల్లూరు మూకాంబికా దేవాలయం.. దక్షిణాదిన ప్రసిద్ధ శక్తి పీఠాల్లో ఒకటి. పార్వతీదేవి ఇక్కడ మూకాంబికాగా పూజలందుకుంటోంది. దీన్ని పరశురాముడు సృష్టించిన ఏడు మోక్ష క్షేత్రాల్లో ఒకటిగా స్థానిక పురాణాలు పేర్కొంటున్నాయి.ఆకుపచ్చని పశ్చిమ కనుమల్లో వెలిసిందీ ఆలయం. ఇక్కడి అమ్మవారి విగ్రహం.. బంగారం, వెండి, రాగి, ఇనుము, సీసం అనే అయిదు పంచలోహాల సమ్మేళనంతో రూపొందింది. మూకాంబికా దేవిని మాట, అక్షరం, విద్యకు సంబంధించిన శక్తిగా భక్తులు ఆరాధిస్తారు. అందుకే విద్యాభ్యాసం ప్రారంభించే పిల్లలను ఈ ఆలయానికి తీసుకువచ్చే సంప్రదాయం కూడా ఉంది.ఎంజీఆర్ టు అమ్మ జయలిలత వరకు..అంతేగాదు 1200 ఏళ్ల చరిత్ర కలిగిన కొల్లూరు మూకాంబిక ఆలయాన్ని తమిళనాడు ముఖ్యమంత్రులు దర్శించుకుని, ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీగా మారింది. గతంలో ఎంజీ రామచంద్రన్ ఈ అమ్మవారిని దర్శించుకుని బంగారు కత్తిని కానుకగా అందజేశారు. ఆయన భార్య జానకీ రామచంద్రన్ కూడా సీఎం అయిన తర్వాత ఇక్కడకు వచ్చారు. అలాగే, ‘అమ్మ’ జయలలిత కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. జులై 30, 2004లో కొల్లూరు నూకాంబిక ఆలయంలో ప్రత్యేకంగా చండీయాగం కూడా జరిపించి, అన్నదానం కోసం రూ. 30,000లను జయలలిత సమర్పించారు. ఇక, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సతీమణి దుర్గ కూడా ఎన్నికలకు ముందు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. వారి బాటలోనే ఇటీవలే తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ సైతం ఈ అమ్మవారిని దర్శించుకుని వెండి ఖడ్గాన్ని సమర్పించారు. ఆలయ చరిత్ర..పురాణాల ప్రకారం.. ఈ ప్రాంతాన్ని పాలించిన కౌమాసురుడనే రాక్షసుడు తనకు మరణం లేకుండా వరం పొందడానికి శివుడి కోసం తపస్సు చేశాడట. తన మనోబలంతో ఆ రాక్షసుడి కోరికను పసిగట్టిన కోల మహర్షి.. సరస్వతికి తెలియజేయడంతో శివుడు ప్రత్యక్షమయ్యే సమయంలో అతడ్ని అమ్మవారు మూగవాడిని చేసిందట. అప్పటి నుంచి అతడ్ని మూసాసురుడిగా పిలిచేవారు. అయినప్పటికీ అతడు గర్వం వీడకపోగా.. దేవతలను, యక్షులను హింసించేవాడట. తననే పూజించాలని హుకుం జారీచేసి.. యజ్ఞయాగాదులను కూడా అడ్డుకోవడంతో కోల మహర్షి ఆధ్వరంలో మునులు పార్వతిదేవి వద్దకు వెళ్లి తమ కష్టాలను చెప్పుకున్నారు. దీంతో అమ్మవారు దైవగణాలతో వచ్చి ఆ మూసాసురుడిని సంహరించింది.ఇది జరిగిన కొన్నాళ్ల తర్వాత ఆది శంకరాచార్యులు కుడజాద్రి కొండలలో ధ్యానం చేస్తున్న సమయంలో అమ్మవారు ప్రత్యక్షమై వరం కోరుకోమని అడిగిందట. దీనికి శంకరాచార్యులు.. కేరళలోని తాను చెప్పిన చోట వెలిసి పూజలు అందుకోవాలని, తద్వారా ఆ ప్రాంతం సుభిక్షమవుతుందని, ఆలయాన్ని దర్శించుకునే వారికి ఎన్నుకున్న రంగంలో విజయం సిద్ధించేలా వరాలు ఇవ్వాలని కోరారట. ఇందుకు సరేనన్న అమ్మవారు.. ముందుగా శంకరాచార్యులను నడవమని, తర్వాత వెనుకగా వస్తాని, గమ్యం చేరే వరకూ తిరిగి చూడొద్దని చెప్పిందట. అలా మూకాసురుడ్ని వధించిన ప్రాంతానికి వచ్చేసరికి దేవి ఆగిపోయిందట. అమ్మవారి గజ్జల శబ్దం వినబడకపోవడంతో శంకరాచార్య వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడే మూకాంబికగా వెలిసిందట.దీంతో నిరాశకు గురైన శంకరాచార్యలకు అమ్మవారు తన విగ్రహాన్ని ప్రతిష్ఠించమని చెప్పడంతో ఆయన అలాగే చేశారని అంటారు. అమ్మవారి మొట్టమొదటి స్థానం కోడచాద్రి శిఖరంపై ఉండేదని.. కానీ అక్కడకు వెళ్లడం భక్తులకు కష్టంగా ఉండటంతో శంకరాచర్య ఆలయాన్ని కొల్లూరులో తిరిగి ప్రతిష్ఠించారని చెబుతుంటారు స్థానికులు.అంతేగాదు ఆదిశంకరాచార్యులు స్వయంగా ఇక్కడ తపస్సు చేసి, అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. ఆయనే ఇక్కడ స్వయంభూ జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించారు. ఈ లింగం మధ్యలో ఒక 'స్వర్ణ రేఖ' ఉంటుంది. ఇది శివశక్తుల కలయికకు ప్రతీకగా నిలుస్తుంది. అంటే ఒకే క్షేత్రంలో అటు పరమశివుడిని, ఇటు పరాశక్తిని కలిపి దర్శించుకునే అరుదైన భాగ్యం భక్తులకు ఇక్కడ కలుగుతుంది.ఈ అమ్మ ఆసీస్సుల కోసమే ఎందుకంటే..ఈ మూకాంబికా అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటే, తమ కెరీర్ అద్భుతంగా రాణిస్తుందని, విజయాలు వరిస్తాయని ఇండస్ట్రీ వర్గాల గట్టి నమ్మకం. అందుకే ముఖ్యమైన సినిమాలు ప్రారంభించే ముందు లేదా రాజకీయాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో ప్రముఖులు ఇక్కడికి రావడం ఆనవాయితీగా మారింది. అంతేగాదు ఈ అమ్మవారిని మహిమాన్వితమైన శక్తిగా (లక్ష్మి, సరస్వతి, కాళీ స్వరూపిణిగా) భక్తులు విశ్వసిస్తారు. ఆ నేపథ్యంలోనే రాజకీయ నాయకులు ఎన్నికల్లో జయాలు సాధించిన తర్వాత, తమ పదవికి, ప్రభుత్వానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా పరిపాలన సాగాలని కోరుకుంటూ ఇక్కడ ప్రత్యేక పూజలు, చండీ యాగం వంటివి నిర్వహిస్తారు. పచ్చని ప్రకృతి ఒడిలో, సౌపర్ణిక నది తీరాన వెలసిన కొల్లూరు క్షేత్రం అటు ఆధ్యాత్మిక ప్రశాంతతను, ఇటు మానసిక ప్రశాంతతను ప్రసాదించే మహిమాన్విత క్షేత్రం. అందుకే సామాన్య భక్తుల నుంచి కోట్లాది మంది అభిమానులు ఉన్న సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ అమ్మవారి పాద చెంతకు చేరుకుంటున్నారు.🚨 Why CM Vijay’s visit to the Kollur Mookambika Temple is a massive political statement.Tamil Nadu Chief Minister Vijay is visiting the Kollur temple in Karnataka today at 3 PM. While it looks like a standard spiritual visit, the historical context is fascinating.He is…— MacroMatrix (@MacroMatrix1) June 12, 2026 (చదవండి: ఈతరం పిల్లల ఆసక్తికే మద్దతు) -
డీకే శివకుమార్‌కు కొత్త తలనొప్పి.. ఇదేం కర్మరా బాబు
బెంగళూరు: కర్ణాటక రాజకీయాలు రోజుకో మలుపుతిరుగుతున్నాయి. ఎన్నో అపసోపాలు పడి ఎట్టికేలకు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన డీకే శివకుమార్‌కు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. కొద్దిరోజుల క్రితం తనకు కీలక శాఖ కేటాయించలేదని పార్టీ సీనియర్ నేత రామలింగారెడ్డి రాజీనామా అనంతరం అది సద్దుమణగడం జరిగింది. ఇప్పుడు తాజాగా మరోనేత డీకే శివకుమార్‌పై అసమ్మతి గళం వినిపిస్తున్నారు.కన్నడ మంత్రి కృష్ణ బైరేగౌడకు ఇటీవల జరిగిన క్యాబినేట్ విస్తరణలో బెంగళూరు డెవలఫ్‌మెంట్ ఫోర్ట్ పోలియో కేటాయించారు. అయితే అందులో కీలకమైన గ్రేటర్ బెంగళూరు అభివృద్ధి బాధ్యతలు సీఎం వద్దే ఉండటం, బీడీఏ, బీఎంఆర్డీఏ వంటి కీలక సంస్థలు కూడా ఆయన పరిధిలో ఉండడంతో ఆయనకు అధికార విభజనపై గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో కృష్ణబైరే గౌడ స్పందించారు. తనకు కేటాయించిన ఫోర్ట్ పోలియోపై స్పష్టతనివ్వాలని సీఎం శివకుమార్‌ను కోరారు.కృష్ణబైరే గౌడ మాట్లాడుతూ " నాకు ఎలాంటి అసంతృప్తి లేదు. బెంగళూరు అభివృద్ధిని పర్యవేక్షించే కష్టమైన బాధ్యతను పార్టీ నాకు అప్పగించింది. ఇది చాలా కఠినమైన పని. నేను దీనిని అధికార సమస్యగా చూడటం లేదు. ఇలాంటి బాధ్యత తీసుకునేటప్పుడు స్పష్టత ఉండాలి, ఎందుకంటే నేను ఏ బాధ్యత తీసుకున్నా నా వైపు నుండి జవాబుదారీతనం ఉంటుంది. స్పష్టత ఉన్నప్పుడే మనం ఫలితాలను అందించగలం," అని గౌడ అన్నారు.నాకు ఒక బాధ్యత ఇచ్చినప్పుడు దానిపై స్పష్టత ఆశిస్తానని పేర్కొన్నారు. అయితే ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తానని సీఎం తనకు హామీ ఇచ్చారని పేర్కొన్నారు.కాగా ఈ అంశంమై కృష్ణబైరే గౌడ ఇదివరకే అదిష్ఠానంతో చర్చించడానికి ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం. ఇక కర్ణాటకలో గత వారం కేబినెట్ విస్తరణలో మొత్తం 13 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా.. ఇంకా 21 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలపై తీవ్ర స్థాయిలో లాబీయింగ్ కొనసాగుతోంది. ఒక్కో శాఖ కేటాయింపే ఇప్పుడు రాజకీయ ప్రాధాన్యం పొందుతుండటంతో కాంగ్రెస్‌లో అంతర్గత సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. -
సముద్రంలో స్వర్గం.. దూరం కాదు, మన పక్కనే! (ఫొటోలు)
-
ఒకే ఒక్క తప్పుతో అథఃపాతాళానికి..
సాక్షి, బెంగళూరు: చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి అనే యువకుని హత్య శాండల్‌వుడ్‌లో ఎంతటి ప్రకంపనలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. రాష్ట్రమే కాదు, దేశమంతటా వార్తలకెక్కింది. చాలెజింగ్ స్టార్‌గా లక్షలాది అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన నటుడు దర్శన్ ఈ హత్య కేసులో జైలు పాలయి గురువారంతో రెండేళ్లు పూర్తి అయింది. ఆయన కెరీర్ అగమ్యగోచరమైంది.2024, జూన్ 11న మైసూరులోని ఒక హోటల్లో ఉండగా దర్శన్‌ను, ఆయన సన్నిహితులను పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఈ కేసులో అనేకానేక మలుపులు తీసుకుంటూ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మధ్యలోనే ఒక్కసారి బెయిల్ మీద బయటకు వచ్చిన దర్శన్ ఆ తర్వాత సుప్రీంకోర్టు బెయిల్‌ను రద్దు చేయడంతో మళ్లీ బెంగళూరు పరప్పన సెంట్రల్ జైలులో ఊచలు లెక్కబెడుతున్నాడు. అన్నీ మిస్.. మిస్ బెయిలు మధ్యలో దర్శన్ తన ప్రతిష్టాత్మక ‘ది డెవిల్’ సినిమా షూటింగ్ పూర్తి చేసినప్పటికీ ఆ సినిమా విడుదల సమయంలో కటకటాల్లోనే ఉండాల్సి వచ్చింది. అంతేకాకుండా ఈ ఏడాది తన 49వ పుట్టినరోజు, 23వ పెళ్లి రోజును కూడా అభిమానులు, కుటుంబ సభ్యులతో జరుపుకోలేకపోయారు.దర్శన్ జీవితంలో చీకటిదినం 2024, జూన్ 9 నటుడు దర్శన్ పాలిట ఒక చీకటి రోజు.. బెంగళూరు సుమ్మనహళ్లి రాజకాలువలో రేణుకాస్వామి శవం లభ్యం అయింది. ఈ కేసులో దర్శన్ పేరు వినిపించడంతో పోలీసులు జూన్ 11న అరెస్టు చేశారు. జూన్ 7న కిడ్నాప్ అయిన రేణుకాస్వామి రెండు రోజుల తర్వాత రాజకాలువలో శవమై కనిపించాడు. దర్శన్ స్నేహితురాలు, నటి పవిత్ర గౌడకు రేణుకాస్వామి అసభ్యంగా సందేశాలు పంపించాడనే కారణంతో దర్శన్ అనుచరులు చిత్రదుర్గ నుంచి అతన్ని బెంగళూరుకు కిడ్నాప్ చేసి తీసుకొచ్చి హత్య చేశారన్నది అభియోగం. తరచూ మలుపులు ఈ కేసు నిరంతరం మలుపులు తిరుగుతూనే ఉంది. బెంగళూరు జైలులో దర్శన్‌కు రాచ మర్యాదలు కల్పిస్తున్నారని కొన్నాళ్లు బళ్లారి జైలుకు తరలించారు. కొన్ని నెలల తర్వాత వైద్య సేవల కారణంతో బెయిల్ పొందారు. దర్శన్ బెయిల్‌ను రద్దు చేయాలని పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా బెయిలు రద్దయింది. గత ఏడాది ఆగస్టు నుంచి మళ్లీ దర్శన్ జైలు పక్షి అయ్యారు. బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన దర్శన్‌కు తీవ్ర నిరాశే మిగిలింది. దర్శన్, పవిత్రతో పాటు 7 మంది నిందితులు కారాగారంలోనే ఉండగా, అభిమానులు విచారంలో మునిగారు. -
ప్రియుడి ఘరానా మోసం.. అప్పటికే కన్నతల్లి ఘాతుకం!
కట్టుకున్న భర్తను, కన్నబిడ్డలను వదిలి ప్రియుడితో కొత్త జీవితం ప్రారంభించాలని భావించిన ఓ మహిళ.. చివరకు ఊహించని రీతిలో జైలు పాలైంది. తన సహజీవనానికి అడ్డుగా ఉందనే అనుమానంతో ఆరేళ్ల చిన్నారిని హత్య చేయడమే కాదు.. ప్రియుడి మాయమాటలకు నమ్మి జీవితాన్నే నాశనం చేసుకుంది. బెంగళూరులో సంచలనం సృష్టించిన ఈ కేసు వివరాల్లోకి వెళ్తే..దావణగెరెకు చెందిన ప్రవీణ్, ప్రియాంక దంపతులకు 2007లో వివాహమైంది. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రవీణ్ విద్యాసంస్థ నిర్వహిస్తుండగా, ప్రియాంక న్యాయవాదిగా పనిచేస్తున్నారు. 2025 చివర్లో కుటుంబానికి చెందిన 25 ఎకరాల భూమి వివాదానికి సంబంధించిన కేసు పనిమీద బెంగళూరు వెళ్లిన ప్రియాంక.. కాలేజీ రోజుల స్నేహితుడు, ఒకప్పుడు ప్రేమించిన మోహన్‌ను మళ్లీ కలిసింది.తాను రూ.1,000 కోట్ల ఆస్తులున్న రియల్ ఎస్టేట్ వ్యాపారినని మోహన్ నమ్మబలికాడు. అంత ఆస్తి ఉందని చెప్పడంతో ఆమె అతనికి ఆకర్షితురాలైంది. క్రమంగా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. బెంగళూరు నుంచి తిరిగొచ్చిన తర్వాత భర్త ప్రవీణ్‌పై విడాకుల కోసం ఒత్తిడి తెచ్చిన ప్రియాంక.. చివరకు ఇంటిని విడిచి వెళ్లిపోయింది.విడిపోయిన తర్వాత పెద్ద కుమార్తె తండ్రి వద్ద ఉండగా, చిన్నారి వెన్నెల మాత్రం ప్రియాంకతో కలిసి బెంగళూరులోని సీగేహళ్లిలో అద్దె విల్లాలో నివసిస్తోంది. ఈ క్రమంలో మార్చి 24న వెన్నెల పుట్టినరోజు వేడుకలు జరిపిన ప్రియాంక.. బిర్యానీ, ఐస్‌క్రీం తినిపించిన తర్వాత చిన్నారిని కారులోనే వదిలేసి ప్రియుడు మోహన్‌తో కలిసి కాఫీ షాప్‌కు వెళ్లినట్లు చెప్పింది. మరుసటి రోజు వెన్నెల నిద్రలేవకపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.అనారోగ్యంతో చిన్నారి మరణించిందని కుటుంబ సభ్యులకు చెప్పి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే బిడ్డ మృతిపై అనుమానంతో ప్రవీణ్ పోస్ట్‌మార్టం నివేదికను పరిశీలించాడు. ఆ నివేదికను విదేశాల్లో పనిచేస్తున్న తన డాక్టర్ సోదరికి చూపించగా, అందులో అనేక లోపాలు ఉన్నాయని ఆమె గుర్తించింది. దీంతో ప్రవీణ్ పోలీసులను ఆశ్రయించాడు.దర్యాప్తులో వెన్నెలది సహజ మరణం కాదని, గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. తమ భవిష్యత్తుకు చిన్నారి అడ్డుగా మారిందనే కారణంతో ప్రియాంక, మోహన్ కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. చిన్నారి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు మోహన్‌ను అరెస్టు చేశారు. అయితే అప్పటి నుంచి పరారీలో ఉన్న ప్రియాంకను గురువారం హాసన్‌లో అదుపులోకి తీసుకుని బెంగళూరుకు తరలించారు.కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ప్రియాంక, మోహన్‌లు కాశీలో రహస్యంగా వివాహం చేసుకున్నారట. ఆ తర్వాత దుబాయ్‌లో నూతన సంవత్సర వేడుకలు కూడా జరుపుకున్నారని తెలుస్తోంది. వెన్నెల కేసు దర్యాప్తులో మరో షాకింగ్ విషయం బయటపడింది. తాను కోటీశ్వరుడినని చెప్పిన మోహన్ వాస్తవానికి పెద్ద వ్యాపారి కాదని, అద్దె ఇళ్ల బ్రోకర్‌గా పనిచేస్తున్నాడని తేలింది. అతని మాటలు నమ్మి కుటుంబాన్ని వదిలేసిన ప్రియాంక.. చివరకు కన్నకూతురి హత్య కేసులో నిందితురాలిగా కటకటాల వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. -
రూ.2,400 కోట్ల భారీ స్కాం.. అడ్డంగా బుక్కైన సన్నీ లియోన్
-
కుప్పలు కుప్పలుగా పాములు
దూరంగా వెళ్లే ఒక్క పామును చూస్తేనే ఒళ్లు భయంతో జలదరిస్తుంది. అలాంటి ఇళ్ల ముందే అనేక సర్పాలు కనిపిస్తే చెమటలు పట్టాల్సిందే. బెంగళూరు సమీపంలో నెలమంగల పట్టణంలో ఇలాంటి సమస్యే ఏర్పడింది. ఇళ్ల మధ్యలో కుప్పలుగా సర్పాలు తిరుగుతున్నాయి. దీంతో ప్రజలు బెంబేతెల్లిపోతున్నారు. ఇళ్ల లోపల, ముందు, కాంపౌండ్లలో, చెప్పుల స్టాండ్లలో, పొదల్లో ఇలా ఎక్కడ చూసినా సర్పాలే దర్శనమిస్తున్నాయి. స్నేక్ క్యాచర్ విశ్వనాథ్ ఎవరు ఫోన్ చేసినా వెంటనే వెళ్లి బంధించి దూరంగా వదిలేస్తున్నాడు. ఎక్కువగా ప్రమాదకర రక్తపింజర, నాగుపాములు ఉంటున్నాయి. ఓ ఫాం హౌస్‌లోనే 20 పైగా రక్తపింజర పాముల పిల్లలు కనిపించగా వాటిని పట్టి బకెట్లో వేశారు. అలాగే నాగుపాము పిల్లలూ దొరికాయి. దేశంలోనే అత్యధిక విషం కలిగిన నాలుగు రకాల పాములు కూడా నెలమంగలో దొరికాయని విశ్వనాథ్ తెలిపాడు. ప్రజలు చాలా జాగ్రత్తా ఉండాలని ఆయన సూచించారు.- కర్ణాటక -
Viral Video: భారీ వర్షం...! బైకులతో పాటు కొట్టుకుపోయిన జనం..
-
Viral Video: సగం తిన్న యాపిల్ ను జనాల్లోకి విసరిన డీకే శివకుమార్
-
హమ్మయ్యా అనుకునేలోపే.. కర్ణాటకలో బిగ్ ట్విస్ట్
కర్ణాటక కాంగ్రెస్‌లో లుకలుకలు సర్దుమణిగాయి అనుకునేలోపే మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు కొత్త తలనొప్పి మొదలైంది. కేబినెట్ కేటాయింపులపై అసంతృప్తి.. ఇంకా చల్లారలేదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ‘మా మొర ఆలకించండి మహా ప్రభో’.. అంటూ మరో ఇద్దరు సీనియర్లు ఢిల్లీకి పయనమవడం కొత్త చర్చకు దారితీసింది.బెంగళూరు డెవలప్మెంట్ పోర్ట్‌ఫోలియోపై అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో మంత్రి కృష్ణ బైరేగౌడ ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. ఈ కీలక శాఖ నిర్వహణపై స్పష్టత లేకపోవడమే ఆయన అసంతృప్తికి కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే గ్రేటర్ బెంగళూరు అభివృద్ధి బాధ్యతలు సీఎం వద్దే ఉండటం, బీడీఏ, బీఎంఆర్డీఏ వంటి కీలక సంస్థలు కూడా ఆయన పరిధిలోనే ఉండటంతో అధికార విభజనపై గందరగోళం నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఆయన పార్టీ హైకమాండ్‌తో చర్చించేందుకు ఢిల్లీలో ఉన్నారని సమాచారం.ఇదే సమయంలో మరో ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ కూడా ఢిల్లీ పర్యటనకు వెళ్లడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. కేబినెట్ విస్తరణలో తనకు అవకాశం దక్కేలా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. డీకే శివకుమార్‌కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన ఆయన గతంలోనూ నాయకత్వ మార్పుపై బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.ఇక గత వారం కేబినెట్ విస్తరణలో మొత్తం 13 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా.. ఇంకా 21 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలపై తీవ్ర స్థాయిలో లాబీయింగ్ కొనసాగుతోంది. ఒక్కో శాఖ కేటాయింపే ఇప్పుడు రాజకీయ ప్రాధాన్యం పొందుతుండటంతో కాంగ్రెస్‌లో అంతర్గత సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.ఇప్పటికే సీనియర్ నేత రామలింగారెడ్డి వ్యవహారం, ఆయన రాజీనామా వెనక్కి తీసుకోవడం.. తదితర పరిణామాలు పార్టీకి తలనొప్పిగా మారింది. అదే సమయంలో సీనియర్ నేత కెహెచ్ మునియప్ప కూడా తనకు ఇచ్చిన శాఖపై అసంతృప్తి వ్యక్తం చేవారు. తన స్థాయికి తగ్గ ప్రాధాన్యం లభించలేదని హైకమాండ్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. రాహుల్ గాంధీతో సహా పార్టీ పెద్దలకు తన అభిప్రాయాలు తెలియజేశానని ఆయన స్వయంగా వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.మొత్తానికి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తొలివారాల్లోనే కర్ణాటక కాంగ్రెస్‌లో కేబినెట్ అసంతృప్తి, శాఖల పంపిణీ వివాదాలు, ఢిల్లీ లాబీయింగ్ రాజకీయ వేడి పెంచుతున్నాయి. పరిస్థితి ఇంకా పూర్తిగా చక్కబడలేదన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. -
రహస్య వీడియోలతో వేధింపులు.. అంగన్వాడీ టీచర్ ఆత్మహత్య
కర్ణాటక: స్నానం చేస్తున్న మహిళ ఫోటో, వీడియోలను చిత్రీకరించుకుని వేధించడమే కాకుండా రూ.17 లక్షల నగదు వసూలు చేసిన నేపథ్యంలో జీవితంపై విరక్తి చెందిన ఆ మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరంలోని ఉణకల్‌లో జరిగింది. వివరాలు.. సుధ మృతురాలు. సిద్దారూఢ, అరుణ, మీనాక్షి, మల్లికార్జున, వీరప్ప, ప్రకాష్ బసవలింగప్ప, శివానంద, గిరిజాలపై కేసు నమోదైంది. సుధ ప్రస్తుతం ఉణకల్‌లో నివసిస్తూ సవదత్తి మునవళ్లిలో అంగన్వాడీ టీచర్‌గా పని చేస్తోంది.రెండేళ్ల క్రితం ఇంట్లో స్నానం చేస్తుండగా ఫొటో, వీడియో తీసుకొని ఆమెపై నిందితులు వేధింపులకు పాల్పడి ఆమె నుంచి క్రమంగా రూ.17 లక్షల మేర వసూలు చేశారు. అంతేగాక చెక్ బౌన్స్ కేసులో సవదత్తి కోర్టు ద్వారా కూడా ఆమెను మనోవేదనకు గురి చేశారు. వారి వేధింపులు భరించలేక ఉణకల్లోని అద్దె ఇంట్లో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు విద్యానగర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
ఫోన్ చూడొద్దంటే.. ప్రాణాలు తీశాడు
సాక్షి, బళ్లారి: ఎక్కువసేపు మొబైల్ ఫోన్ చూడొద్దు అని ఓ తండ్రి కొడుక్కి చెప్పడమే తప్పు అయింది. ఫోన్లో గేమ్స్ ఆడడం మాని బుద్ధిగా చదువుకో అని ఓ అక్క తమ్ముడికి చెప్పడమే మరణశాసనం అయింది. ఫోన్ చూడొద్దని చెప్పిన తండ్రి, అక్కపై ఓ యువకుడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చిన దారుణ ఉదంతం కర్ణాటకలో కొప్పళ జిల్లా గంగావతి తాలూకా అయోధ్య గ్రామంలో శనివారం రాత్రి జరిగింది. గ్రామంలో వ్యవసాయపనులు చేసుకునే రైతు వెంకట నాయుడు (48)కు కూతురు ప్రగతి(20), కొడుకు సాయి వెంకట్ మణిదీప్ (18)ఉన్నారు. వెంకటనాయుడు కుటుంబం తెలుగువారు. గొడవగా మొదలై రక్తపాతంగా మారి.. రాత్రి పొద్దుపోయే వరకూ మణిదీప్ మొబైల్లో గేమ్స్ ఆడుతుండగా అక్క ప్రగతి మొబైల్ పక్కనపెట్టి చదువుకోవాలని అతనికి సూచించింది. దీంతో మణిదీప్ ఆమెతో గొడవకు దిగాడు. అంతటితో ఆగని అతడు కోపోద్రిక్తుడై వంటగదిలో కత్తి తీసుకుని అక్క ప్రగతిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆమె కేకలు విన్న తండ్రి వెంకటనాయుడు వచ్చి కొడుకును అడ్డుకోబోయాడు. అయితే తండ్రి అని కూడా చూడకుండా చంపేశాడు. అడ్డొచ్చిన తల్లిని కూడా కత్తితో పొడిచాడు. తరువాత తాను కూడా పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలతో ప్రగతి అక్కడే మరణించింది.తీవ్రంగా గాయపడిన ముగ్గురినీ స్థానికులు తొలుత గంగావతి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం బళ్లారి విమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తండ్రి మృతి చెందాడు. తల్లి సౌజన్య పరిస్థితి కూడా విషమంగా ఉంది. ప్రస్తుతం తల్లీ కుమారుడు ఒకే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ఆదివారం ఉదయం కొప్పళ జిల్లా ఎస్పీ రామ్ అరసిద్ధి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తండ్రీ, కుమార్తె మృతితో అయోధ్య గ్రామంలో విషాదం నెలకొంది. మొబైల్ఫోన్లు, ఆన్లైన్ గేమ్స్ యువతపై ఏమేర దు్రష్పభావం చూపుతున్నాయో ఈ ఘటనే అద్దం పడుతోంది. -
డీకేకు బిగ్ రిలీఫ్.. 24 గంటల్లోనే మారిన సీన్!
బెంగళూరు: తీవ్ర రాజకీయ చర్చలు, పార్టీ సీనియర్ నాయకులతో వరుస సమావేశాల అనంతరం కాంగ్రెస్ నాయకుడు రామలింగారెడ్డి శనివారం తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు. ఆయన రాష్ట్ర మంత్రివర్గంలోనే కొనసాగనున్నారు. దీంతో కర్ణాటకలో పెద్ద రాజకీయ సంక్షోభం సద్దుమణిగినట్లు కనిపిస్తోంది. కొత్తగా ఏర్పాటైన రాష్ట్ర మంత్రివర్గంలో శాఖల కేటాయింపుపై రామలింగారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో అసమ్మతి చెలరేగింది.తనకున్న సుదీర్ఘ రాజకీయ అనుభవం, బెంగళూరు నియోజకవర్గాలతో ఉన్న ప్రత్యేక అనుబంధం కారణంగా రామలింగారెడ్డికి బెంగళూరు అభివృద్ధి శాఖను ఆశించారు. కానీ రామలింగారెడ్డికి నీటిపారుదల శాఖను కేటాయించారు. దీంతో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు.ఈ క్రమంలో సీఎం డీకే శివకుమార్ స్వయంగా రంగంలోకి దిగారు. ఆయనతో జరిపిన సుదీర్ఘ చర్చలు ఫలించడంతో సమస్యకు తాత్కాలికంగా తెరపడింది. ఈ సమస్య పరిష్కారమైందని తెలిపిన డీకే.. పార్టీలో విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు. ‘‘రామలింగారెడ్డి నా మిత్రుడు. సమస్యలన్నీ సద్దుమణిగాయి. కథలు సృష్టించకండి.. ఆ కథలన్నీ పాతబడిపోయాయి. రాజీనామా వ్యవహారం ముగిసిన అధ్యాయం’’ అంటూ డీకే వ్యాఖ్యానించారు.మంత్రివర్గ శాఖల కేటాయింపులు జరిగిన కొన్ని గంటల్లోనే రామలింగారెడ్డి తన రాజీనామాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘‘నాకు బెంగళూరు అభివృద్ధి శాఖ ఇస్తామని హామీ ఇచ్చారని.. కానీ మధ్యతరహా నీటిపారుదల శాఖను ఇచ్చారు. నా అంతరాత్మకు విరుద్ధంగా నేను పనిచేయలేను. అందుకే నా పదవికి రాజీనామా చేస్తున్నాను. నాకు వేరే దారి ఏముంది? రెండుసార్లు నన్ను పిలిచి ఆ శాఖ ఇస్తామని హామీ ఇచ్చారు, కానీ చివరకు అది వేరొకరికి దక్కింది...అందుకే నేను బాధపడ్డాను. అందుకే రాజీనామా చేస్తున్నాను. పదవికి రాజీనామా చేసినప్పటికీ, తాను కాంగ్రెస్‌లోనే ఉంటానని.. ఎమ్మెల్యేగా కొనసాగుతాను’’ అని ఆయన స్పష్టం చేశారు ఈ వారమే బాధ్యతలు స్వీకరించిన శివకుమార్ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఎదురైన మొదటి పెద్ద రాజకీయ సవాలు ఇదే. అయితే, పార్టీ అధిష్టానం జోక్యంతో ఈ వివాదం సద్దుమణిగింది. దీంతో రామలింగారెడ్డి మంత్రివర్గంలోనే కొనసాగనున్నారు. -
కథలు అల్లకండి.. డీకే శివకుమార్ వార్నింగ్
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పదవీ బాధ్యతలు స్వీకరించిన కొద్దిరోజులకే ఊహించని షాక్ తగిలింది. ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదంటూ కాంగ్రెస్ సీనియర్ నేత రామలింగారెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో డీకే శివకుమార్‌పై విమర్శలు రావడంతో ఆయన దిద్దుబాటు చర్యలకు దిగారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సమస్యలన్నీ పరిష్కారమయ్యాయని అనవసర కథనాలు సృష్టించకూడదని వార్నింగ్ ఇచ్చారు.కొత్తగా కొలువుదీరిన శివకుమార్ ప్రభుత్వానికి ఆదిలోనే ఆటంకం ఎదురైంది. సీనియర్ నాయకుడు రామలింగారెడ్డి తన మంత్రి పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. కొత్తగా ఏర్పడే ప్రభుత్వంతో ముఖ్యమంత్రి తనకు బెంగళూరు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ ప్రమాణ స్వీకారం తర్వాత నీటిపారుదల మంత్రిత్వ శాఖను కేటాయించారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి మాట తప్పినందుకు గానూ తన మంత్రిత్వ శాఖకు రాజీనామా చేస్తున్నానని తెలిపారు.దీంతో శివకుమార్ డ్యామేజ్ కంట్రోల్ పనులు చేపట్టారు. ఆయన రాజీనామాపై స్పందిస్తూ "రామలింగారెడ్డి నాకు అత్యంత సన్నిహితుడు తన అత్యంత సన్నిహితుడు సమస్యలన్నీత్వరలోనే పరిష్కారమవుతాయి. అనవసరమైన కథలు సృష్టించకండి అవన్నీ నిరాధారమవుతాయి.ఇప్పుడు సమస్యలన్నీ సర్ధుకున్నాయి" అన్నారు. అతను వాట్సాప్‌లో రాజీనామా పంపాడని పేర్కొన్నారు.కాగా నిన్న (శుక్రవారం) రాత్రి, రామలింగారెడ్డి రాజీనామా అనంతరం శివకుమార్ ఆయనతో రెండు గంటల పాటు సమావేశమయ్యారు.ఆయనతో సుదీర్ఘ చర్చల అనంతరం ఈ విధంగా మాట్లాడారు. కాగా డీకే శివకూమార్ క్యాబినేట్ బెర్తులపై మరో మంత్రి కేఎం మునియప్ప సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న తనకు మరింత మెరుగైన క్యాబినేట్ దక్కాల్సిందన్నారు. ప్రస్తుతం ఆయనకు సివిల్ సప్లైస్ మంత్రిత్వశాఖ కేటాయించారు. -
మంత్రి పదవికంటే విలువైనదా? ఆ శాఖ కోసం ఎందుకింత పోటీ?
సాక్షి బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర మంత్రివర్గం ఏర్పాటు లేదా శాఖల కేటాయింపు సమయంలో ఎప్పుడూ పదేపదే వినిపించే పేరు ‘బెంగళూరు నగరాభివృద్ధి శాఖ’. ఇప్పటివరకు ఈ శాఖను సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వంలో డీకే శివకుమార్ చూసుకున్నారు. అయితే కొత్తగా ఏర్పడిన డీకే శివకుమార్ కేబినెట్లో బెంగళూరు నగరాభివృద్ధి శాఖ కోసం తీవ్ర పోటీ నెలకొంది. అవును.. కర్ణాటకలో డీకే శివకుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు రోజులైంది. శాఖల కేటాయింపు కూడా జరిగిపోయింది. బెంగళూరు నగరాభివృద్ధి శాఖను కృష్ణభైరేగౌడకు డీకే శివకుమార్ అప్పగించారు. అయితే బెంగళూరు నగరాభివృద్ధి శాఖపై కొండంత ఆశతో ఉన్న రామలింగారెడ్డికి ఇది అసలు నచ్చలేదు.. తనకు ఆ శాఖ కేటాయించలేదనే కారణంతో అసంతృప్తికి లోనై మనస్తాపానికి గురై ఏకంగా మంత్రి పదవికే రామలింగారెడ్డి రాజీనామా చేశారు. అసలు ఆ బెంగళూరు నగరాభివృద్ధి శాఖలో ఏముంది ఇంతకీ? అనే చర్చ ఇప్పుడు మొదలైంది.. ఎందుకింత పోటీ నెలకొంది? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఆర్థిక ఇంజిన్‌గా బెంగళూరు బెంగళూరు అంటే కేవలం రాష్ట్ర రాజధాని మాత్రమే కాదు. ప్రపంచ స్థాయిలో ఐటీ హబ్‌గా పేరు గాంచింది. అధికారానికి అక్షయపాత్ర ఈ బెంగళూరు మహానగరం. ఇంకా చెప్పాలంటే ఒక విధంగా బంగారు ఖనిజంగా చెప్పొచ్చు. కర్ణాటక రాష్ట్రం మొత్తానికి అత్యధిక రెవెన్యూ అందించే ఆర్థిక ఇంజిన్ ఈ బెంగళూరు నగరం. ఇక్కడ తీసుకునే నిర్ణయాలు ప్రపంచ స్థాయిలో బ్రాండ్ బెంగళూరు ఇమేజ్‌పై ప్రభావం చూపుతాయి. ఈ శాఖ బాధ్యతలు నిర్వహించే నాయకులకు పార్టీలో, ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తర్వాత అత్యున్నత స్థానం దక్కినట్లుగా భావిస్తారు. ఈ నేపథ్యంలో ఈ బెంగళూరు నగరాభివృద్ధి శాఖకు అధిక డిమాండ్ ఏర్పడింది. బడ్జెట్లో అధిక కేటాయింపులు బెంగళూరు కేవలం రాజధాని మాత్రమే కాదు. రాష్ట్ర రాజకీయ, ఆర్థిక శక్తి కేంద్రం. దేశంలో సిలికాన్ వ్యాలీగా ప్రసిద్ధి పొందిన ఈ మహానగరం నుంచి ఒక్కసారి నాయకుడిగా ఎన్నికైతే ప్రపంచ స్థాయిలో ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా పేరు పొందవచ్చు. అత్యున్నత రాజకీయ గౌరవం, శక్తి లభిస్తుంది. అందుకే ఈ బెంగళూరు నగరాభివృద్ధి శాఖ బాధ్యతలు తీసుకోవడం ద్వారా దేశ వ్యాప్తంగా రాజకీయంగా క్రియాశీలకంగా మారే అవకాశాలు మెండుగా ఉంటాయని నాయకులు భావిస్తారు. అలాగే ఈ బెంగళూరు నగరాభివృద్ధి శాఖకు లభించే బడ్జెట్ కూడా సామాన్యమైనది కాదు. వేలాది కోట్ల రూపాయల మేర భారీ బడ్జెట్ కేటాయింపులు ఈ శాఖకు దక్కుతాయి. అనేకానేక పథకాలు, ప్రాజెక్టులు ఈ శాఖకు బడ్జెట్లో లభిస్తాయి. నమ్మ మెట్రో విస్తరణ, ఫ్లై ఓవర్లు, సొరంగ మార్గాలు, రాజ కాలువలు, చెరువుల అభివృద్ధి, నగర ట్రాఫిక్ నిర్వహణ తదితర కోట్లాది రూపాయల ప్రాజెక్టుల పరిశీలన, బాధ్యత నేరుగా సంబంధిత శాఖ మంత్రిపై ఉంటాయి. స్థానిక ఎమ్మెల్యేలకే ప్రేమ ఎక్కువ.. వాస్తవానికి బెంగళూరు నగరాభివృద్ధి మంత్రిత్వ శాఖపై కేవలం బెంగళూరు నగరానికి చెందిన ఎమ్మెల్యేలు కన్ను వేస్తుంటారు. ఉత్తర కర్ణాటక, మధ్య కర్ణాటక ఎమ్మెల్యేలు ఎవరూ ఈ శాఖను నిర్వహించేందుకు ఇష్టపడరు. ఈ శాఖ కేవలం బెంగళూరు నగరానికే పరిమితం కావడంతో వారు దీన్ని స్వీకరించేందుకు ముందుకు రారు. బెంగళూరు నగర ఎమ్మెల్యేలు ఎక్కువగా ఈ శాఖను తీసుకునేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. ఇప్పటివరకు ఈ శాఖకు మంత్రులుగా చేసిన వారు కూడా చాలా మంది బెంగళూరు వాసులే కావడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా తిరగాల్సిన అవసరం లేకపోవడం, సొంత నియోజకవర్గంలో ఉంటూ ఈ శాఖ బాధ్యతలు చూసుకునే వెసులుబాటు ఉండడంతో బెంగళూరు ఎమ్మెల్యేలు దీనికోసం పట్టుబడుతున్నారు. ఆఖరికి కొత్తగా ఈ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న కృష్ణబైరేగౌడ సైతం బెంగళూరు వాసి కావడం గమనార్హం.ప్రభుత్వ సంస్థలన్నీ ఇక్కడే.. బెంగళూరు అభివృద్ధిని, భవిష్యత్తును రూపొందించే, అత్యంత ప్రభావవంతమైన ప్రముఖ ప్రభుత్వ సంస్థలు కూడా ఈ శాఖ కిందకే వస్తాయి. బీడీఏ (బెంగళూరు అభివృద్ధి ప్రాధికార, బీడబ్ల్యూఎస్ఎస్బీ (బెంగళూరు జలమండలి), జీబీఏ (గ్రేటర్ బెంగళూరు అథారిటీ) తదితర ప్రభుత్వ రంగ పెద్ద సంస్థలు, వాటి కార్యాలయాలు బెంగళూరులోనే ఉంటాయి. ఆ సంస్థల నిర్ణయాలు, నియామకాలు మొత్తానికి పాలన పూర్తిగా బెంగళూరు నగరాభివృద్ధి శాఖ పరిధిలోకి వస్తాయి. బెంగళూరులో మౌలిక వసతుల పెంపుదల కోసం ఏటికేడాది ప్రభుత్వాలు కేటాయింపులను పెంచుతూ పోతున్నాయి. దీనికితోడు బెంగళూరులో వేగంగా విస్తరిస్తున్న రియల్ ఎస్టేట్, అనేక పరిశ్రమలు, పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా ఈ మహానగరం నిలుస్తోంది. -
కర్ణాటక మంత్రి వర్గంలో కలకలం.. రంగంలోకి దిగిన డీకే
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు తీసుకున్న రెండు రోజులకే ఆయనకు షాక్ తగిలింది. నూతన మంత్రి వర్గంలో తనకు సరైన ప్రాధాన్యత కల్పించలేదని ఆ పార్టీ సీనియర్ నేత మంత్రి రామలింగారెడ్డి రాజీనామా చేశారు. ఈ చర్యలతో శివకుమార్‌కు ఆదిలోనే హంసపాదు తగిలినట్లయింది. దీనిపై తాజాగా ఆయన స్పందించారు. దీనిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.ప్రస్తుతం కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్... సీఎం కుర్చీ కోసం ఎంతగా కష్టపడ్డారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. గతేడాది చివరలో మెుదలైన ఈ రాజకీయ రగడ ఎట్టకేలకు శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో శాంతించిందని చెప్పుకోవచ్చు. అయితే ఆయన క్యాబినెట్ విస్తరణలో తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదంటూ సీనియర్ నేత మంత్రి రామలింగారెడ్డి రాజీనామా చేయడం ఆ రాష్ట్ర రాజకీయాలలో తీవ్ర చర్చనీయాంశమయ్యింది. దీంతో శివకూమార్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు.ఈ అంశమై డీకేశివకుమార్ మాట్లాడుతూ.. "ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆయన నాకు గొప్ప స్నేహితుడు. కేబినెట్లో మేమే అత్యంత సన్నిహిత మిత్రులం. ఈ సమస్యను పరిష్కరిస్తాం. రామలింగారెడ్డి నా సహచరుడు, మా సీనియర్ నాయకుడు. ఆయన గ్రామానికి వెళ్లి పని చేయలేనని చెప్పారు. నాకు వేరే మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. నేను రామలింగారెడ్డితో మాట్లాడి అంతా సరిచేస్తాను," అని డీకే చెప్పుకొచ్చారు.కాగా బృహత్ బెంగళూరు అభివృద్ధి (గ్రేటర్ బెంగళూరు డెవలప్మెంట్) శాఖను కృష్ణ బైరెగౌడకు కేటాయించడంపై మంత్రి రామలింగారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజీనామా అనంతరం రామలింగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను పదవులు ఆశించలేదు. సిద్దరామయ్య, డీకే శివకుమార్ కేబినెట్లో పదవులు కోరలేదు. నాకు బెంగళూరు డెవలప్మెంట్ శాఖ ఇస్తామని డీకేనే హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట తప్పినందుకే నా పదవికి రాజీనామా చేస్తున్నాను’ అని వివరణ ఇచ్చారు. తాజాగా డీకే సీనియర్ నేతను బుజ్జగించే యత్నం చేస్తున్నట్లు సమాచారం. -
రాజ్యసభకు మల్లికార్జున్ ఖర్గే నామినేషన్
బెంగళూరు: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కర్ణాటక నుండి రాజ్యసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. బెంగుళూరులోని విధానసౌధలో ఈ నామినేషన్ ప్రక్రియ జరిగింది. ఈ కార్యక్రమంలో లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కర్ణాటక సీఎం డీ.కె. శివకుమార్, సిద్ధరామయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.రాజ్యసభలో ప్రతిపక్షనాయకుడిగా మల్లికార్జున్ ఖర్గే కొనసాగుతున్నారు. ప్రస్తుతం కర్ణాటక నుంచే పెద్దల సభకు ప్రాతినిథ్యం వహిస్తుండగా మరోసారి అదే రాష్ట్రం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. కన్నడలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంఖ్యాబలం రీత్యా ఆయన రాజ్యసభ ఎంపిక దాదాపు లాంఛనమే. కాగా రాజ్యసభ ఎన్నికలకు జూన్ 1 న నోటిఫికేషన్ విడుదలవగా జూన్ 18న ఎన్నికలు జరగనున్నాయి. -
మాట ఇచ్చి తప్పారు.. అందుకే మంత్రి పదవికి రాజీనామా?
-
డీకే కేబినెట్లో కొత్త ట్విస్ట్.. మంత్రి రాజీనామా
బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కర్ణాటకలో డీకే శివకుమార్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేబినెట్ విభజన ప్రక్రియ మరోసారి రాజకీయ ఉద్రిక్తతలకు దారి తీసింది. తన శాఖపై సీనియర్ నేత, మంత్రి రామలింగారెడ్డి తీవ్ర అసంతృప్తితో తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాజీనామా అనంతరం రామలింగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘నేను పదవులు ఆశించలేదు. సిద్దరామయ్య, డీకే శివకుమార్ కేబినెట్లో పదవులు కోరలేదు. నాకు బెంగళూరు డెవలప్మెంట్ శాఖ ఇస్తామని డీకేనే హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట తప్పినందుకే నా పదవికి రాజీనామా చేస్తున్నాను’ అంటూ బాంబు పేల్చారు. మంత్రివర్గంలో అసంతృప్తి..అయితే, అంతకుముందు శాఖల కేటాయింపు ప్రకటన వెలువడిన వెంటనే కర్ణాటక కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు తెరపైకి వచ్చాయి. బృహత్ బెంగళూరు అభివృద్ధి (గ్రేటర్ బెంగళూరు డెవలప్మెంట్) శాఖను కృష్ణ బైరెగౌడకు కేటాయించడంపై మంత్రి రామలింగారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బెంగళూరు అభివృద్ధి శాఖకు బదులుగా రామలింగారెడ్డికి భారీ, మధ్యతరహా నీటిపారుదల శాఖను కేటాయించడంతో ఆయన మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి శివకుమార్, రామలింగారెడ్డి, కృష్ణ బైరెగౌడల మధ్య విధాన సౌధలో సుదీర్ఘంగా అత్యవసర చర్చలు జరిగినట్టు వార్తలు బయటకు వచ్చాయి. కాగా, కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తొలిరోజే శాఖల సర్దుబాటు వ్యవహారం బెంగళూరు రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీశాయి.🔴#BREAKING | Ramalinga Reddy unhappy with allocated portfolio, likely to resign from Karnataka cabinet: SourcesNDTV's @reethu_journo joins @reetksahni with more details pic.twitter.com/B2SRLdG7g5— NDTV (@ndtv) June 5, 2026మరోవైపు.. గతంలో కూడా రామలింగారెడ్డికి తగిన ప్రాధాన్యం దక్కలేదన్న భావన ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో, ఆయన రాజీనామా చేసే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పార్టీ పెద్దలు ఆయనను శాంతింపజేసే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ హైకమాండ్ జోక్యం ద్వారా సమస్య పరిష్కారమవుతుందని అంచనా వేస్తున్నారు. గతంలో కూడా ఆయన రాజీనామా చేసిన సందర్భాల్లో పార్టీ నాయకత్వం జోక్యం చేసుకుని పరిస్థితిని సర్దుబాటు చేసిన సందర్భాలు ఉన్నాయి.ఇదిలా ఉండగా.. సీఎంగా కొత్త బాధ్యతలు స్వీకరించిన డీకే శివకుమార్ తన కేబినెట్లోని సహచర మంత్రులకు శాఖలను కేటాయించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆర్థిక శాఖ, క్యాబినెట్ వ్యవహారాలు, ఇంటెలిజెన్స్ విభాగంతో పాటు పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ శాఖలను తన వద్దే ఉంచుకున్నారు. వీటితో పాటు మంత్రులకు కేటాయించని మిగిలిన అన్ని శాఖల బాధ్యతలను కూడా ఆయనే పర్యవేక్షించనున్నారు. ఇక రాష్ట్ర డిప్యూటీ సీఎం బాధ్యతలు స్వీకరించిన సీనియర్ నేత జి. పరమేశ్వరకు రెవెన్యూ, క్రీడా శాఖలను కేటాయించారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేకు ఈ కేబినెట్లో అత్యంత కీలకమైన హోం మంత్రిత్వ శాఖ (ఇంటెలిజెన్స్ మినహా) బాధ్యతలను అప్పగించారు. అంతేకాకుండా ఐటీ, బయోటెక్నాలజీ, ఈ-గవర్నెన్స్ పోర్ట్‌ఫోలియోలను కూడా ఆయనే చూసుకోనున్నారు. అలాగే మాజీ సీఎం సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర కూడా శివకుమార్ క్యాబినెట్లో చోటు దక్కించుకోగా.. ఆయనకు పట్టణాభివృద్ధి (అర్బన్ డెవలప్మెంట్) శాఖను కేటాయించారు. -
సీఎం DK శివకుమార్ భారీ ప్రకటనలు, విద్యార్థులందరికీ ...!
-
కన్నడ సమ్రాట్ డీకే శివకుమార్
సాక్షి బెంగళూరు: కర్ణాటకలో అధికార మార్పిడి సజావుగా పూర్తయ్యింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు సిద్ధరామయ్య రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో ట్రబుల్ షూటర్, కింగ్ మేకర్ డీకే శివకుమార్ బాధ్యతలు స్వీకరించారు. బెంగళూరులోని లోక్‌భవన్ గ్లాస్హౌజ్లో నిరాడంబరంగా ఈ కార్యక్రమం జరిగింది. బుధవారం సాయంత్రం 4.05 గంటలకు నూతన సీఎంగా డీకే శివకుమార్‌తో రాష్ట్ర గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ప్రమాణ స్వీకారం చేయించారు. మరో 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంత్రులుగా ప్రమాణం చేశారు. హోంశాఖ మాజీ మంత్రి డాక్టర్ జి.పరమేశ్వరను ఉప ముఖ్యమంత్రి పదవి వరించింది. కేబినెట్లో చోటు దక్కడంతో స్పీకర్ యూటీ ఖాదర్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రమాణ స్వీకారానికి ముందు అదిచుంచనగిరి మఠాధిపతి డాక్టర్ శ్రీ నిర్మలానందనాథ స్వామీజీతోపాటు పలువురు మఠాధిపతుల ఆశీస్సులను డీకే శివకుమార్ స్వీకరించారు. తొలి కేబినెట్ సమావేశం కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం డీకే శివకుమార్ విధానసౌధ ప్రాంగణానికి చేరుకున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, బసవణ్ణ, మహాత్మ గాంధీతోపాటు పలువురు మహనీయుల విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. విధానసౌధ ఆవరణలో ఉన్న మునేశ్వర దేవస్థానంలో పూజలు చేశారు. తర్వాత విధానసౌధ మెట్లకు సాష్టాంగ నమస్కారం చేశారు. ఉత్తరనంది ద్వారం గుండా విధానసౌధలోకి ప్రవేశించారు. అనంతరం నూతన మంత్రులతో మొదటి కేబినెట్ సమావేశం నిర్వహించారు. డీకే శివకుమార్ ప్రమాణ స్వీకార వేడుకను ప్రత్యక్షంగా వీక్షించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన డీకే ప్రమాణ స్వీకారంలో డీకే శివకుమార్ సంప్రదాయ వస్త్రధారణ అందరినీ ఆకట్టుకుంది. పట్టు పంచ, పట్టు జుబ్బా, శాలువా ధరించారు. భారత రాజ్యాంగాన్ని చేతబూని వీరగంగాధర అజ్జయ్య పేరుతో ప్రమాణ స్వీకారం చేశారు. వేదికపై అజ్జయ్య చిత్రపటానికి నమస్కరించారు. అంతకంటే ముందు తనకు సీఎంగా అవకాశం కల్పించిన కర్ణాటక ప్రజలకు వేదికపై సాష్టాంగ నమస్కారం చేశారు. సీఎం కార్యాలయానికి మార్పులు డీకే శివకుమార్ ప్రమాణం చేయటానికి ముందే విధానసౌధలోని కార్యాలయంలో వాస్తు ప్రకారం సీఎం సీటును అధికారులు ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మికమైన మార్పులు సైతం చేశారు. సీఎం ఆఫీసును ప్రఖ్యాత జ్యోతిషులు, వాస్తు నిపుణుల బృందం సూక్ష్మంగా పరిశీలించింది. డీకే శివకుమార్ కుర్చీ స్థానాన్ని వాస్తుకు అనుగుణంగా మార్పు చేశారు. సీఎం గదిలో డీకే శివకుమార్‌కు ఇష్టమైన నోణవినకెరె అజ్జయ్య చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. హాజరైన ప్రముఖులు ప్రమాణ స్వీకార వేడుకకు కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, రణదీప్ సింగ్ సుర్జేవాలాతోపాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేరళ సీఎం సతీశన్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఠాకూర్ సుఖ్విందర్ సింగ్ సుఖు, కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య, బీకే హరిప్రసాద్, తెలంగాణ మంత్రులు మల్లు భట్టివిక్రమార్క, మొహమ్మద్ అజారుద్దీన్ తదితరులు హాజరయ్యారు. వివిధ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సినీ, వ్యాపార, వాణిజ్య ప్రముఖులు తరలివచ్చారు. దేవెగౌడ, యడ్యూరప్పతో భేటీ డీకే శివకుమార్ బుధవారం ఉదయం విపక్ష నాయకులతో భేటీ కావడం ఆసక్తి రేపింది. మాజీ ప్రధాని, జేడీ(ఎస్) పార్టీ అధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడ, మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూప్పను కలుసుకున్నారు. ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. ప్రభుత్వ పరిపాలన నిర్వహణలో వారి సలహాలు, సూచనలు కోరినట్లు డీకే తెలిపారు. అలాగే కనకపురలో నివసిస్తున్న తన తల్లి గౌరమ్మ వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత డీకే శివకుమార్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి ‘ఎక్స్’లో శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణం చేయడం పట్ల ఆయన కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల పురోగతి, సంక్షేమం కోసం ఆయన అవిశ్రాంతంగా కృషి చేస్తారన్న నమ్మకం తమకు ఉందని భార్య ఉష, కుమార్తె ఐశ్వర్య పేర్కొన్నారు. కర్ణాటక ప్రజలకు సేవ చేయడంలో ఆయన విజయం సాధించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. సిద్ధరామయ్య కుమారుడికి మంత్రి పదవిమాజీ సీఎం సిద్ధరామయ్య కుమారుడు యతీంద్రకు డీకే శివకుమార్ మంత్రివర్గంలో చోటు దక్కింది. కేహెచ్ మునియప్ప, కేజే జార్జ్, ఎంబీ పాటిల్, రామలింగారెడ్డి, సతీశ్ జార్కిహొళి, కృష్ణ బైరేగౌడ, బైరతి సురేశ్, శరణ ప్రకాష్ పాటిల్, ఈశ్వర్ ఖండ్రే, ప్రియాంక్ ఖర్గే మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరందరూ గత కేబినెట్లో మంత్రులే. కొత్తగా యూటీ ఖాదర్, యతీంద్ర మంత్రులయ్యారు. సీఎం డీకే శివకుమార్ కర్ణాటక పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయన మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగారు. అది పవిత్రమైన బాధ్యత ముఖ్యమంత్రి పదవి కేవలం రాజ్యాంగబద్ధమైన పదవి మాత్రమే కాదని.. అది రాష్ట్ర ప్రజలు తనపై ఉంచిన ఒక పవిత్రమైన బాధ్యత అని తనకు పూర్తి అవగాహన ఉన్నట్లు సీఎం డీకే శివకుమార్ చెప్పారు. మునుపెన్నడూ లేనంత కరుణామయమైన, సమానత్వంతో కూడిన, సుసంపన్నమైన కర్ణాటకను నిర్మించడానికి ప్రజలందరూ చేతులు కలపాలని పిలుపునిచ్చారు. మన భవిష్యత్ తరాలు గర్వపడేలా రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని పేర్కొన్నారు. ఆయన బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘‘ఈ క్షణం కేవలం నాది మాత్రమే కాదు. కర్ణాటక ప్రజలది. నా ప్రయాణంలోని ప్రతి సవాలులో, ప్రతి మైలురాయిలో నాకు మార్గనిర్దేశం చేసిన లక్షలాది అంకితభావం గల కార్యకర్తలది కూడా. ఎన్నో ఒడిదుడుకులలో వారే నా బలం, నా స్ఫూర్తి. నన్ను నమ్మి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతతో శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. కోట్లాది కన్నడిగుల ఆశలు, ఆకాంక్షలు, కలలను నెరవేర్చడానికి అవిశ్రాంతంగా కృషి చేయాల్సిన బాధ్యత నా భుజాలపై ఉంది. నా సీనియర్లకు, గురువులకు, మార్గనిర్దేశం చేసి, ప్రోత్సహించి, పట్టుదలతో ముందుకు సాగేందుకు బలాన్నిచ్చిన వారందరికీ నేను ఎప్పటికీ కృతజ్ఞుడనై ఉంటా. కర్ణాటక ఎల్లప్పుడూ అవకాశాలు, ఆవిష్కరణలు, పురోగతికి ఒక కేంద్రస్థానంగా నిలుస్తోంది. రాష్ట్ర అభివృద్ధిలో తదుపరి అధ్యాయాన్ని లిఖించడంలో ప్రతి రైతు, కార్మికుడు, పారిశ్రామికవేత్త, మహిళ, విద్యార్థి, యువత కీలక పాత్ర పోషించాలి. మనం మరింత బలమైన, సుసంపన్నమైన, సమ్మిళిత భవిష్యత్తును నిర్మించడానికి నూతన ఆలోచనలు, సాంకేతికత, సామూహిక శక్తిని ఉపయోగించుకోవాలి. ఏ ఒక్క నాయకుడూ ఒంటరిగా మార్పును తీసుకురాలేడు. ప్రజలందరూ ఒకే దృక్పథంతో, ఉమ్మడి లక్ష్యంతో ఏకమైనప్పుడే నిజమైన పురోగతి సాధ్యమవుతుంది. మనం కలిసి నడిస్తే.. చేరుకోలేని లక్ష్యం గానీ, అధిగమించలేని సవాలు గానీ ఉండదు’’ అని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. -
మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో ఇద్దరు మినహా అందరూ...
బెంగళూరు: డీకే శివకుమార్ బుధవారం కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అలాగే, మరో 13 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జీ పరమేశ్వర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కర్ణాటక కొత్త మంత్రివర్గంలో శివకుమార్ సహా ఇద్దరు నేతలు వొక్కలిగ సామాజిక వర్గానికి చెందినవారు. ఇద్దరు మంత్రులు మైనారిటీ వర్గాలకు చెందినవారు. పరమేశ్వర సహా ఇద్దరు మంత్రులు దళిత వర్గాలకు చెందినవారు.జీ పరమేశ్వర, ఎంబీ పాటిల్, కేజే జార్జ్, కేహెచ్ మునియప్ప, రామలింగ రెడ్డి, సతీశ్ జార్కిహోళి, యూటీ ఖాదర్, కృష్ణ బైరె గౌడ, ప్రియాంక్ ఖర్గే, యతీంద్ర సిద్ధరామయ్య, శరణ ప్రకాశ్ పాటిల్, బైరతి సురేశ్, ఈశ్వర్ ఖండ్రే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.ఖాదర్, యతీంద్ర మినహా ప్రమాణ స్వీకారం చేసిన వారంతా గతంలో సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వంలో మంత్రులుగా పని చేశారు. ఖాదర్ కర్ణాటక శాసనసభ స్పీకర్‌గా సేవలు అందిస్తున్నారు. ఇక సిద్ధరామయ్య కుమారుడే యతీంద్ర. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ అగ్ర నాయకత్వం సిద్ధరామయ్య, శివకుమార్‌తో సమావేశమై కొత్త మంత్రివర్గంలో చోటు దక్కనున్న నేతలపై మంగళవారం కూడా చర్చలు జరిపింది. గమనించదగ్గ విషయం ఏమిటంటే.. రెండో మంత్రివర్గ విస్తరణ రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత జరిగే అవకాశం ఉంది.గత వారం శివకుమార్‌ను కాంగ్రెస్ శాసనసభాపక్షం నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో కర్ణాటకలో నాయకత్వ వివాదానికి ముగింపు పడింది. పదవి నుంచి వైదొలిగిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్యే శివకుమార్ పేరును ప్రతిపాదించారు. పరమేశ్వర ఆ ప్రతిపాదనకు మద్దతు తెలిపారు. ఆ తర్వాత కాంగ్రెస్ శాసనసభాపక్షం దానిని ఏకగ్రీవంగా ఆమోదించింది. కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన సమయంలోనే సిద్ధరామయ్య, శివకుమార్ మధ్య నాయకత్వ పోటీ మొదటిసారి వెలుగులోకి వచ్చింది. -
డీకేకు సీఎం కిరీటం.. 2028 ఎన్నికలే లక్ష్యంగా మాస్టర్‌స్ట్రోక్
కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవి నుంచి సిద్ధరామయ్య తప్పుకునేలా చేసి, డీకే శివకుమార్‌కు ఆ బాధ్యతలు అప్పగిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం సక్సెస్‌ఫుల్‌గా అధికార మార్పిడి చేసింది. అయితే, 2028లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ వ్యూహం ఎలా ఉండనుంది? డీకే శివకుమార్‌కు ఎదురయ్యే సవాళ్లు ఎలా ఉంటాయి?కర్ణాటకలో నాయకత్వ మార్పును కాంగ్రెస్ చాలా జాగ్రత్తగా చేసింది. కర్ణాటకలో కాంగ్రెస్‌కు అత్యంత కీలక నాయకుడిగా భావించే డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావాలన్న తన ఎన్నో ఏళ్ల ఆకాంక్షను జూన్ 3న నెరవేర్చుకున్నారు.కర్ణాటకలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు సిద్ధరామయ్యది. ఆయన నుంచి బాధ్యతలను శివకుమార్‌కు అప్పగించడం ద్వారా కాంగ్రెస్.. కొత్త ముఖ్యమంత్రి అనుచరుల అసంతృప్తిని తగ్గించే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికల ప్రచారాన్ని నడిపిన శివకుమారే ఈ పదవికి అర్హుడని ఆయన అనుచరులు భావించారు.రాజస్థాన్, పంజాబ్ పరిణామాలు ఇలా.. పైకి కనిపిస్తున్న దాని ప్రకారం.. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం కర్ణాటకలో నాయకత్వ మార్పును 2020లో రాజస్థాన్, 2021లో పంజాబ్‌లో జరిగిన పరిణామాల కంటే మెరుగ్గా నిర్వహించినట్లు తెలుస్తోంది. రాజస్థాన్‌లో సచిన్ పైలట్ తిరుగుబాటు చేసినప్పటికీ 2020లో అశోక్ గెహ్లాట్‌ను కొనసాగించారు. అంటే, సచిన్ పైలట్ సీఎం పదవి కోసం ఒత్తిడి తెచ్చినా కాంగ్రెస్ అశోక్ గెహ్లాట్‌ను మార్చకుండా పదవిలోనే కొనసాగించింది. పంజాబ్‌లో 2021లో అమరిందర్ సింగ్ స్థానంలో చరణ్‌జిత్ సింగ్ చన్నీని తీసుకొచ్చారు. అయితే ఆ మార్పులు అన్నీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రయోజనం ఇవ్వలేదు.కాంగ్రెస్ అధిష్ఠానం కర్ణాటకలో నాయకత్వ మార్పును 2028 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కూడా చేపట్టింది. ప్రభుత్వ వ్యతిరేక భావన క్రమంగా బలపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. సిద్ధరామయ్య స్థానంలో శివకుమార్ వంటి వొక్కలిగ (కర్ణాటకలోని ఒక ప్రముఖ సామాజిక వర్గం) నాయకుడిని ఎంపిక చేసింది. బీజేపీ, జనతాదళ్ (సెక్యులర్) కూటమిగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. అన్ని వర్గాలను కలుపుకోవాలి.. జేడీఎస్ అగ్ర నాయకులు కూడా వొక్కలిగ వర్గానికే చెందినవారు. పాత మైసూరు ప్రాంతంలో ఈ వర్గాన్ని ఆకర్షించేందుకు శివకుమార్ వారితో దశాబ్దాలుగా పోటీపడుతున్నారు. సాధారణంగా కర్ణాటకలో ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వం మారుతుంది. 35 ఏళ్ల ఈ రాజకీయ సంప్రదాయాన్ని కాంగ్రెస్, శివకుమార్ సరైన వ్యూహంతో ముందుకు సాగితే చెరిపివేసే అవకాశం ఉంది.రాజకీయ సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొన్న శివకుమార్ ఇప్పుడు 2028 ఎన్నికల్లో విజయానికి ప్రణాళిక రూపొందించాలి. పార్టీకి చెందిన అన్ని వర్గాలను కలుపుకుని నడవాలి. కీలక విధాన నిర్ణయాల సమయంలో సంప్రదింపులకు ప్రాధాన్యం ఇవ్వాలి.అనేక సంక్షేమ, ప్రజాకర్షక పథకాలను అమలు చేసినప్పటికీ కాంగ్రెస్ పాలనలో కర్ణాటక ఆర్థిక క్రమశిక్షణను కొనసాగించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆదాయ లోటు రూ.19,500 కోట్లు. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఇది అతి తక్కువ స్థాయి.ఇది కొంత ఊరటనిచ్చే అంశమే అయినప్పటికీ, కర్ణాటక మొత్తం ఆదాయ వసూళ్లలో పెరుగుదల కేవలం 6.3% మాత్రమే నమోదైంది. ప్రాంతాల మధ్య స్పష్టంగా కనిపిస్తున్న అసమానతలను తగ్గించడం ప్రాధాన్యంగా ఉండాలి. 2024-25లో బెంగళూరు నగర జిల్లా కర్ణాటక జీఎస్డీపీకి దాదాపు 40% వాటా అందించింది. దక్షిణ కన్నడ, బెలగావి జిల్లాలు వరుసగా 5.3%, 3.9% వాటా అందించాయి.ప్రస్తుతం రాష్ట్రాలు, ముఖ్యంగా బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలు, ఆర్థిక వనరులు, అభివృద్ధి అవకాశాలు తగ్గుతున్న పరిస్థితిని ఎదుర్కొంటున్నాయంటూ కాంగ్రెస్ వంటి పార్టీల నుంచి విమర్శలు వస్తున్నాయి. అలాంటి సమయంలో ముఖ్యమంత్రులు వెనుకబడిన వర్గాలపై ప్రభావం చూపుతున్న క్లిష్ట సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలి. శివకుమార్‌కు ఉన్న అనుభవం ఈ బాధ్యతను సమర్థంగా నిర్వహించేందుకు తోడ్పడవచ్చు. -
డీకే శివకుమార్ అనే నేను.. కర్ణాటక నూతన సీఎంగా ...!
-
DK శివ కుమార్ ప్రమాణ స్వీకారంలో సీఎం రేవంత్
-
సీఎంగా DK ప్రమాణం దేవెగౌడ కాళ్లు మొక్కిన DK
-
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణం
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే శివకుమార్ బుధవారం బెంగళూరులోని లోక్ భవన్లో కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ప్రమాణ స్వీకారం చేయించారు. మరో 13 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర కూడా ఉన్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎంగా పరమేశ్వర ప్రమాణ స్వీకారం చేశారు. డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారానికి ముందు పీఠాధిపతుల ఆశీర్వాదం తీసుకున్నారు. డీకే శివకుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తదితరులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం చేసినవారుడీకే శివకుమార్ జీ పరమేశ్వర్కె హెచ్ మునియప్పకె జే జార్జ్ఎం బీ పాటిల్రామలింగ రెడ్డిసతీశ్ జరకిహోళికృష్ణ బైరెగౌడప్రియాంక్ ఖర్గేయూటీ ఖాదర్ఈశ్వర్ ఖండ్రేయతీంద్ర సిద్ధరామయ్యబైరతి సురేశ్శరణ ప్రకాశ్ పాటిల్భద్రత కట్టుదిట్టంలోక్ భవన్లో ప్రమాణ స్వీకారం నేపథ్యంలో డీకే శివకుమార్ నివాసం బయట భద్రతను కట్టుదిట్టం చేశారు. శివకుమార్‌ను అభినందిస్తూ నగరమంతా అభిమానులు పోస్టర్లు ఏర్పాటు చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తప్పుకున్న సిద్ధరామయ్యకు శివకుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందే కాంగ్రెస్‌లో కీలక బాధ్యత లభించింది. ఆయనను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా నియమించారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న డీకే శివకుమార్ తన తల్లి గౌరమ్మను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. కాగా, కర్ణాటకలో దీర్ఘకాలంగా సాగిన పోరు తర్వాత డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో 2023 మేలో అధికారంలోకి వచ్చింది. సోనియా గాంధీ సందేశండీకే శివకుమార్‌కు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. “అందరినీ కలుపుకుని ముందుకు సాగండి. మీరు కర్ణాటకకు విజయవంతంగా నాయకత్వం వహిస్తారనే సంపూర్ణ విశ్వాసం నాకు ఉంది. మీ కొత్త బాధ్యతను సమర్థంగా నిర్వహించండి” అని ఆమె చెప్పారు. అలాగే, పలువురు ప్రముఖులు డీకే శివకుమార్‌కు శుభాకాంక్షలు తెలిపారు. -
కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి
బెంగళూరు: నీట్ (యూజీ) ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వంపై కర్ణాటక కాంగ్రెస్ ఎంపీ సాగర్ ఖాండ్రే తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలో ఇటువంటి కీలక అంశాలపై ఎవరైనా ప్రశ్నలు లేవనెత్తితే వారిని వెంటనే దేశద్రోహులు లేదా ఎవరికో ఏజెంట్లుగా ముద్ర వేస్తున్నారని వాపోయారు. బుధవారం ఆయన ఏఎన్ఐతో మాట్లాడుతూ.. నీట్ పేపర్ లీకేజీ కారణంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు.నీట్ పేపర్ లీకేజీ ఘటనకు బాధ్యులను చేస్తూ సంబంధిత శాఖ కార్యదర్శిని కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసినప్పటికీ అది సరిపోదని అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి, తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ సాగర్ ఖాండ్రే డిమాండ్ చేశారు.అధిష్ఠానానికి కృతజ్ఞతలుడీకే శివకుమార్ కేబినెట్లో తన తండ్రి ఈశ్వర్ ఖాండ్రేకు చోటు దక్కడంపై ఆయన సంతోషం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు. కర్ణాటక అటవీ, పర్యావరణ శాఖ మంత్రిగా ఈశ్వర్ ఖాండ్రే సమర్థవంతంగా పనిచేశారని, ఆయన పనితీరు, పార్టీ పట్ల అంకితభావాన్ని గుర్తించి కేబినెట్లో చోటు కల్పించారని పేర్కొన్నారు. పార్టీ నాయకత్వం తమ కుటుంబంపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ప్రజాసేవకు మరింత కట్టుబడి పనిచేస్తామని సాగర్ ఖాండ్రే (Sagar Khandre) స్పష్టం చేశారు.రాష్ట్ర అభివృద్ధి, పార్టీ బలోపేతమే లక్ష్యం: ఈశ్వర్ ఖాండ్రేడీకే శివకుమార్ మంత్రివర్గంలోనూ తనకు చోటు దక్కడంపై కాంగ్రెస్ సీనియర్ నేత ఈశ్వర్ ఖాండ్రే (Eshwar Khandre) హర్షం ప్రకటించారు. ఈరోజు సాయంత్రం కర్ణాటక కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు వెల్లడించారు. పార్టీ అధిష్ఠానం తనపై ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని చెప్పారు. కర్ణాటక అభివృద్ధి, ప్రజా సంక్షేమం, కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతమే తన ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు.“నాపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన మా నాయకత్వానికి నేను ఎంతో కృతజ్ఞుడిని. గతంలో కూడా నేను నా బాధ్యతలను నిజాయితీగా, చిత్తశుద్ధితో, అంకితభావంతో, కష్టపడి నిర్వర్తించాను. ఈసారి కూడా అదే నిబద్ధతతో పని చేస్తాను” అని అన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేయడంతో పాటు పార్టీని గ్రామీణ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. -
సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధం
-
డీకే శివకుమార్ అనే నేను..
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారానికి సంబంధించి.. -
ప్రమాణస్వీకారం వేళ డీకే కీలక వ్యాఖ్యలు
“నేను వెళ్లబోయే మార్గం సులభం కాదని నాకు తెలుసు..” అంటూ కర్ణాటక కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాజకీయ వర్గాలను, విశ్లేషకులను ఆయన మాటల్లో అంతర్యాన్ని వెతుక్కునే పనిలో పడేసింది. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బెంగళూరులోని లోక్ భవన్లో సాయంత్రం 4.05 గంటలకు గవర్నర్ తావర్‌చంద్ గెహ్లాట్ ఆయనకు పదవీ ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు కూడా బాధ్యతలు స్వీకరించనున్నట్లు సంకేతాలు అందుతున్నప్పటికీ.. అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. అయితే..ప్రమాణ స్వీకారానికి ముందు డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రజల నుంచి తనపై ఉంచిన నమ్మకానికి తాను కృతజ్ఞుడినని ఆయన తెలిపారు. అదే సమయంలో “ముందున్న మార్గం సులభం కాదు” అంటూ చేసిన వ్యాఖ్యలు, పాలనలో ఎదురయ్యే సవాళ్లపై ముందస్తు సంకేతంగా భావిస్తున్నారు.డీకే శివకుమార్ ఎమోషనల్‌గా చేసిన వ్యాఖ్యలు.. ఆయన భవిష్యత్ పాలనా దిశపై హింట్ ఇచ్చినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అలాగే ఆయన “ఒక కొత్త యువ యుగం ప్రారంభమవుతుంది” అని చేసిన వ్యాఖ్యలు.. కొత్త ప్రభుత్వంలో యువత, అభివృద్ధి, సమగ్ర పాలనకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సూచిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. రైతులు, మహిళలు, యువత సహా అన్ని వర్గాలను కలుపుకుని పాలన సాగిస్తానని ఆయన స్పష్టం చేశారు.#WATCH | Delhi: Karnataka CM-designate DK Shivakumar says, "The faith and the confidence the people of this country have shown me, I am very much obliged, and I have to do a lot of hard work and deliver. I know roads will not be so easy. It will be difficult times, but still I… pic.twitter.com/0LutwvdX9l— ANI (@ANI) June 3, 2026ఈ పరిణామాల నేపథ్యంలో డీకే శివకుమార్ చేసిన “యువ యుగం” వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఒకవైపు మాజీ సీఎం సిద్ధరామయ్య రాజకీయంగా పూర్తిగా వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించకపోవడం, తన వర్గానికి ప్రాధాన్యం కొనసాగించాలనే ప్రయత్నాలు సాగుతున్నాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందుకోసం సీనియర్ల మద్దతును ఆయన ప్రయోగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో డీకే యువత, అభివృద్ధి, సమగ్ర పాలనపై ఇచ్చిన సంకేతాలు భవిష్యత్ పాలనా శైలిపై స్పష్టమైన సూచనగా భావిస్తున్నారు. దీంతో కర్ణాటక కాంగ్రెస్‌లో కొత్త సమీకరణాలు, అంతర్గత సమతుల్యతపై చర్చలు మరింత వేగం అందుకున్నాయి.డీకే శివకుమార్ అలియాస్ డీకే.. 64 ఏళ్ల వోక్కలిగా నేతగా, సుదీర్ఘ రాజకీయ ప్రయాణం అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. బెంగళూరులోని లోక్ భవన్లో జరిగే ఈ ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాంగ్రెస్ అగ్రనేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉండటంతో కార్యక్రమాన్ని కొంత నియంత్రిత స్థాయిలో నిర్వహిస్తున్నారు. -
ఎమ్మెల్సీ ఐదో సీటు ఎవరిది.. క్రాస్ ఓటింగ్?
శివాజీనగర: కర్ణాటక విధానసభ కోటాలో ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఎన్నికలపై కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్‌లలోని అనేకమంది నాయకులు ఆశలు పెట్టుకున్నారు. ఒక్కో సీటు పొందాలంటే 28 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరముంది. 112 మంది ఎమ్మెల్యేల మద్దతుతో కాంగ్రెస్ నుంచి నలుగురు సునాయాసంగా గెలుస్తారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల బలం 135 కాగా, ఇంకా 23 ఓట్లు మిగిలి ఉంటాయి. దీంతో ఐదో సీటు మీద కూడా హస్తం నేతలు కన్నేశారు. సర్వోదయ కర్ణాటక పార్టీకి చెందిన దర్శన్ పుట్టణ్ణయ్య కాంగ్రెస్‌కు మద్దతిచ్చారు. బీజేపీ నుంచి సస్పెండ్ అయిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఎస్.టీ.సోమశేఖర్, శివరామ్ హెబ్బార్‌కు కాంగ్రెస్‌తో సత్సంబంధాలున్నాయి. మరో ఒకరు లేదా ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతుతో ఐదో సీటును స్వాధీనం చేసుకోవచ్చని కేపీసీసీ నేతలు నిశ్చయించారు.క్రాస్ ఓటింగ్ జరిగేనా?బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య 62 కాగా, 2 ఎమ్మెల్సీ సీట్లు పొందగలదు. ఇంకా 6 ఓట్లు మిగులుతాయి. జేడీఎస్ శిబిరంలో 18 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్ మద్దతు కోరుతోంది. ఈ ఎన్నికల్లో రహస్య ఓటింగ్ జరుగుతుంది. అందుచేత క్రాస్ ఓటింగ్ జరిగినా కూడా కనిపెట్టడం కష్టమని పార్టీల నేతలు ధీమాగా ఉన్నారు. దీంతో కాంగ్రెస్, జేడీఎస్‌లు క్రాస్ ఓటింగ్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నాయి. కాంగ్రెస్ ఐదో స్థానం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. దీంతో ఎవరిది పైచేయి అవుతుందనేది ఉత్కంఠభరితంగా మారింది. మొత్తం 7 స్థానాలకు అంతేమంది నామినేషన్ వేస్తే పోలింగ్ జరగదు. ఎనిమిది మంది బరిలో నిలిస్తే పోలింగ్ యుద్ధం తప్పదు. -
హైకమాండ్ Vs DK శివకుమార్.. డిప్యూటీ సీఎం పోస్టుల రచ్చ
-
కర్ణాటక కేబినెట్ కసరత్తు.. ఢిల్లీ బాట పట్టిన డీకే, సిద్దూ
-
సిద్ధరామయ్య మాస్టర్ ప్లాన్‌కు డీకే బ్రేక్!
ఢిల్లీ: కర్ణాటకలో నూతన ప్రభుత్వ ఏర్పాటు, మంత్రిమండలి కూర్పు వ్యవహారం హస్తినకు చేరుకుంది. మాజీ, కాబోయే సీఎంలు ఇద్దరూ హుటాహుటిన దేశ రాజధానికి వెళ్లారు. ఎవరెవరికి మంత్రి పదవులు కేటాయించాలి, ప్రభుత్వం ఎలా సాగాలి అనే దానిపై చర్చిస్తున్నారు. రేపటి(బుధవారం)లోగా కొత్త అమాత్యుల జాబితా రెడీ కావచ్చు.కర్ణాటక కేబినెట్ కూర్పుపై కసరత్తు జరుగుతోంది. అధిష్టానం పెద్దలతో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ చర్చలు జరుపుతున్నారు. దాదాపు పదిమంది పేర్లపై ఏకాభిప్రాయం వచ్చినట్లు సమాచారం. మంత్రి వర్గంతో పాటు రాజ్యసభ కౌన్సిల్ సీట్ల పైన చర్చలు జరుపుతున్నారు. పార్టీ అధ్యక్షుడిగా సతీష్ జర్కి హోలీ, హెచ్‌కే పాటిల్, బీకే హరిప్రసాద్‌కు శివకుమార్ మద్దతు పలకగా, అహింద వర్గాలకు ప్రాధాన్యత కలిగిన శాఖలు ఇవ్వాలని సిద్ధరామయ్య ఒత్తిడి చేస్తున్నారు. సిద్ధరామయ్య వర్గానికి 10కి మించి మంత్రి పదవులు ఇవ్వకూడదనే యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.జీ.పరమేశ్వర, జమీర్ అహ్మద్ ఖాన్, కేజే జార్జ్, ఎంబి పాటిల్‌లకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వాలని సిద్ధరామయ్య పట్టుబడుతున్నారని.. మరో వైపు ఎవరికి కూడా ఉప ముఖ్యమంత్రుల పదవులు ఇవొద్దని డీకే శివకుమార్ వాదిస్తున్నట్లు సమాచారం. అలాగైతే మరో పవర్ సెంటర్‌గా మారుతారని డీకే వాదిస్తున్నారు. సిద్ధ రామయ్య తనయుడు యతేంద్రకు క్యాబినెట్లో చోటు కల్పించేందుకు అధిష్టానం ఓకే చెప్పింది. తొలి దశలో పది నుంచి 20 మంది మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. రేపు(బుధవారం) ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.సిద్దరామయ్య సతీమణి పార్వతి, తనయుడు యతీంద్రకు పదవులు లభిస్తాయనే ప్రచారం ఊపందుకుంది. రాజీనామా చర్చల సమయంలో హైకమాండ్ నేతలు సిద్దరామయ్యకు రాజ్యసభ స్థానం ఆఫర్ ఇచ్చారు. కానీ సిద్దరామయ్య రాష్ట్ర రాజకీయాల్లోనే కొనసాగుతానని చెప్పారు. ఆయనకు బదులు భార్య పార్వతికి రాజ్యసభ సీటు ఇస్తారని తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు కూడా సిద్దరామయ్య అంగీకరించలేదని, ఆమెకు రాజకీయాలతో ఏమాత్రం పరిచయం లేదని చెప్పారని సమాచారం. ఇక పుత్రుడు యతీంద్రకు మంత్రి లేదా డిప్యూటీ సీఎం పదవి దక్కడం ఖాయమంటూ ప్రచారం జరుగుతోంది. -
ట్రాఫిక్ ఆపేశారని.. గవర్నర్ కాన్వాయ్ వస్తుంటే అడ్డుగా కూర్చొని..
బెంగళూరులో ట్రాఫిక్ రద్దీ వాహనదారులను ఎంతగా సమస్యలకు గురి చేస్తాయో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. దానికి తోడు వీఐపీ కాన్వాయ్ వెళ్లే సమయంలో ఎవరూ అడ్డురాకుండా ట్రాఫిక్‌ను ఆపేస్తుంటారు. ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొన్న ఓ వ్యక్తి నిరసన తెలిపాడు. ఇండియా ఐటీ రాజధానిగా పేరున్న బెంగళూరులో ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఓ వ్యక్తి గాంధేయ మార్గంలో నిరసన తెలిపాడు. గర్భిణీ అయిన తన భార్యతో కారులో అతడు ప్రయాణిస్తున్న సమయంలో కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లోత్.. మోటర్కేడ్ వెళ్లేందుకు ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్డును పోలీసులు ఖాళీ చేయించారు. ఆ సమయంలో మిగతా వైపుల ఉన్న రోడ్లపై వాహనాలను ముందుకు వెళ్లనివ్వలేదు. చాలా సేపు ఆలస్యం కావడంతో ఓ వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు. నిరసనగా అతడు రోడ్డుకు మధ్యలో కూర్చున్నాడు. ఎంత చెప్పినా అక్కడి నుంచి కదల్లేదు. సాధారణ పౌరుడి సమయం కూడా రాజకీయ నాయకుడి సమయంతో సమానంగా విలువైనదేనని వాదించాడు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్తో అతడు వాగ్వివాదానికి దిగాడు.వారి మధ్య జరిగిన సంభాషణనిరసన తెలిపిన వ్యక్తి: "నా భార్య గర్భిణీ. మాకూ పనులు ఉంటాయి కదా?"ట్రాఫిక్ పోలీసులు: "పక్కకు జరగండి. అక్కడ నిలబడండి"వ్యక్తి: "నా భార్య గర్భిణీ. సిగ్నల్ ఎందుకు ఆపేశారు? గవర్నర్ వీఐపీ అయినంత మాత్రాన మాకు విలువ లేదా?"ట్రాఫిక్ పోలీసులు: "మీరు కూడా వీఐపీనే. ఇప్పుడు లేచి పక్కకు వెళ్లండి. లేస్తారా లేదా?"వ్యక్తి: "లేవను"ట్రాఫిక్ పోలీసులు: "లేస్తారా లేదా?"వ్యక్తి: "లేవను"కాన్వాయ్ చివరకు జనంతో నిండిన రహదారి పక్క నుంచి వెళ్లినట్లు వీడియోలో కనిపిస్తోంది. అయితే ఆ గొడవ ఎలా ముగిసింది, ఆ వ్యక్తి అక్కడి నుంచి ఎలా వెళ్లిపోయాడు అన్న విషయం స్పష్టంగా తెలియలేదు.ఈ ఘటన "వీఐపీ సంస్కృతి"పై పెరుగుతున్న అసంతృప్తిని వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ గత నెలలో స్పందించారు. అధికారిక విధివిధానాల్లో మంత్రులు, అధికారులు, వ్యయ నియంత్రణ పాటించాలని, అధికార ప్రదర్శన కంటే సాదాసీదా విధానం, సమర్థతకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని సూచించారు.Traffic stopped for 30 minutes in Bengaluru for Governor’s VVIP movement.A man carrying his pregnant wife to the hospital was stuck and sat in protest.99% of us do not even know who the Governor of Karnataka is but the city traffic is halted every-time he passes by.This…— Roshan Rai (@RoshanKrRaii) June 1, 2026 -
ప్లీజ్.. పూలు చల్లొద్దు!
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ జూన్ 3న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ కూర్పు చర్చల కోసం మాజీ సీఎం సిద్ధరామయ్యతో కలిసి ఆయన నేడు ఢిల్లీకి పయనమయ్యారు. ఈ పర్యటనకు ముందు ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలకు భావోద్వేగపూరిత విజ్ఞప్తి చేశారు.ప్రమాణ స్వీకార వేడుకలను అతి హంగులుగా కాకుండా నియంత్రితంగా నిర్వహించాలని ఆయన కాంగ్రెస్ శ్రేణులకు, తన అభిమానులకు సూచించారు. ముఖ్యంగా తనపై పలు జల్లొద్దని.. పూలమాలలతో, శాలువాలతో సత్కరించకుండా ఉండాలని కోరడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. బెంగళూరులో మీడియాతో మాట్లాడిన శివకుమార్.. పార్టీ కార్యకర్తల ఉత్సాహాన్ని తాను అర్థం చేసుకుంటున్నానని చెప్పారు. అయితే భారీ జనసందోహం, అతిగా జరిగే సంబరాలు తనకు అసౌకర్యాన్ని కలిగించవచ్చని పేర్కొన్నారు. అందుకే కార్యకర్తలు పరిమితుల్లోనే వేడుకలు జరపాలని, దూరం నుంచే అభినందనలు తెలిపినా తాను స్వీకరిస్తానని స్పష్టం చేశారు.తన విజ్ఞప్తికి ప్రధాన కారణం ఆరోగ్య సమస్యేనని ఆయన వెల్లడించారు. తనకు పూలమాలలపై అలర్జీ ఉందని, అందువల్ల ఎవ్వరూ వాటిని తీసుకురావద్దని స్పష్టంగా చెప్పారు. “ప్లీజ్… నాకు పూలమాలలు వద్దు. నేను వాటిని స్వీకరించలేను” అని ఆయన వ్యాఖ్యానించారు. గతంలోనూ ప్లాస్టిక్ పూలకు ప్రాధాన్యం ఇవ్వడం ఆయన గుర్తు చేశారు. పూలతో పాటు శాలువాలు కూడా తేవొద్దంటూ ఆయన సూచించారు.అలాగని ఈ విజ్ఞప్తితో ఆయన కార్యకర్తల ఉత్సాహాన్ని తగ్గించలేదు. కాంగ్రెస్ విజయాన్ని సాధారణ కార్యకర్తల విజయం అని అభివర్ణిస్తూ, “ఈ రోజు ముఖ్యమంత్రి అవుతున్నది నేను మాత్రమే కాదు, ప్రతి పార్టీ కార్యకర్త కూడా” అని భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. 1979–80లో విద్యార్థి నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలో చేరిన తన రాజకీయ ప్రయాణాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. దశలవారీగా ఎదుగుతూ ఈ స్థాయికి చేరుకున్నానని, ఈ ఎదుగుదల సాధారణ కార్యకర్తల కష్టం, నిబద్ధతకు ప్రతిబింబమని తెలిపారు.మొత్తంగా చూస్తే, శివకుమార్ విజ్ఞప్తి సంబరాల మధ్య కూడా నియంత్రణ అవసరాన్ని సూచిస్తోంది. వ్యక్తిగత ఆరోగ్య కారణాలు, అలాగే అతిగా ఆర్భాటం వద్దన్న తన స్వభావం ఈ నిర్ణయానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. రాజకీయ వేడుకల్లో హంగు తగ్గించి సింపుల్‌గా నిర్వహించాలని ఆయన ఇచ్చిన సందేశం ఇప్పుడు రాజకీయాల్లో చర్చకు దారితీస్తోంది. -
అందుకే ఆర్సీబీ సంబురాలకు బ్రేక్!
ఒకటి క్రికెట్ కప్.. మరొకటి ఫుట్‌బాల్ ట్రోఫీ. ఒకటి బెంగళూరు.. ఇంకొకటి పారిస్. క్రీడలు వేరు, దేశాలు వేరు. కానీ రెండు నగరాలు ఒకే ప్రశ్నను ఎదుర్కొన్నాయి. విజయోత్సవాలు ఎక్కడ, ఎలా ముగియాలి?. గత ఏడాది ఆర్సీబీ టైటిల్ విజయోత్సవాల సందర్భంగా బెంగళూరులో జరిగిన తొక్కిసలాట దేశాన్ని కుదిపేస్తే.. తాజాగా పీఎస్జీ ఛాంపియన్స్ లీగ్ విజయం తర్వాత పారిస్‌లో చెలరేగిన అల్లర్లు ప్రపంచాన్ని షాక్‌కు గురిచేశాయి. ఈ రెండు ఘటనలు కలిసి క్రీడా సంబరాలపై కొత్త హెచ్చరికగా మారాయి.యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్ ఫైనల్లో ఆర్సెనల్ను ఓడించి ప్యారిస్ సెయింట్ జర్మైన్ (PSG) మరోసారి యూరప్ ఛాంపియన్‌గా నిలిచిన వెంటనే పారిస్ వీధులు అభిమానులతో కిక్కిరిశాయి. మొదట అది ఆనందోత్సవంలా కనిపించింది. ఐఫిల్ టవర్ క్లబ్ రంగులతో మెరిసింది. వేలాది మంది అభిమానులు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. కానీ కొద్ది గంటల్లోనే పరిస్థితి మారిపోయింది. కార్లకు నిప్పంటించడం, దుకాణాలపై దాడులు, పోలీసులపై రాళ్లు రువ్వడం, వీధుల్లో విధ్వంసం చోటుచేసుకున్నాయి.అధికారిక లెక్కల ప్రకారం ఒకరు ప్రాణాలు కోల్పోగా.. 780 మందికిపైగా అరెస్టయ్యారు. 264కు పైగా వాహనాలు దగ్ధమయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు వేలాది మంది పోలీసులను రంగంలోకి దించాల్సి వచ్చింది. క్రీడా విజయాన్ని జరుపుకునేందుకు ప్రారంభమైన రాత్రి చివరకు చట్టవ్యవస్థకు సవాలుగా మారింది.ఈ దృశ్యాలు భారత అభిమానులకు గత ఏడాది బెంగళూరులో జరిగిన విషాదాన్ని గుర్తు చేశాయియి. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకున్నప్పుడు నగరం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. జట్టు విజయోత్సవాలను ప్రత్యక్షంగా చూడాలని లక్షలాది మంది అభిమానులు తరలివచ్చారు. కానీ భారీ జనసందోహాన్ని పోలీసులు నియంత్రించలేకపోవడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. పలువురు అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. మరెందరో గాయపడ్డారు. క్రీడా చరిత్రలో నిలిచిపోవాల్సిన ఆనంద క్షణం విషాద అధ్యాయంగా మారిపోయింది.ఆ ఘటన కేవలం ఒక ప్రమాదంగా ముగియలేదు. క్రీడా విజయోత్సవాల నిర్వహణపై ప్రభుత్వాలు, పోలీసు శాఖలు, క్రీడా సంస్థల ఆలోచననే మార్చేసింది. అభిమానుల భావోద్వేగం ఎంత ముఖ్యమో, వారి భద్రత కూడా అంతే ముఖ్యమని అందరికీ అర్థమైంది.అందుకే.. ఈ ఏడాది ఆర్సీబీ మళ్లీ ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచినప్పటికీ, గతంలో లాగా భారీ ర్యాలీలు, నియంత్రణలేని బహిరంగ సంబరాలకు అవకాశం ఇవ్వలేదు. బెంగళూరు పోలీసులు ముందుగానే అప్రమత్తమయ్యారు. నగరంలో పెద్ద ఎత్తున గుమికూడే కార్యక్రమాలపై పరిమితులు విధించారు. భారీ జనసందోహాలు ఏర్పడే అవకాశమున్న ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. విజయోత్సవాల కంటే భద్రతకే ప్రాధాన్యం ఇచ్చారు.ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆర్సీబీ యాజమాన్యం కూడా ఇదే సందేశాన్ని అభిమానులకు ఇచ్చింది. గత ఏడాది విషాదాన్ని గుర్తుచేస్తూ, వీధుల్లోకి పెద్ద ఎత్తున రావద్దని, కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే సురక్షితంగా విజయాన్ని ఆస్వాదించాలని అభిమానులకు పిలుపునిచ్చింది. సోషల్ మీడియా వేదికగా బాధ్యతాయుతమైన సంబరాలు జరుపుకోవాలని సూచించింది. సాధారణంగా జట్లు అభిమానులను బయటకు రమ్మని పిలుస్తాయి. కానీ ఈసారి అభిమానులు సురక్షితంగా ఉండటమే పెద్ద సంబరమని ఆర్సీబీ భావించడం గమనార్హం.What a night. What a feeling. 🥹To every member of the RCB nation, congratulations. This is YOUR win. 🏆❤️As the celebrations begin, let’s be responsible. 🙌Best way to celebrate is with your loved ones. Relive the memories, and enjoy this special moment from the comfort of… pic.twitter.com/hdGO3n115a— Royal Challengers Bengaluru (@RCBTweets) May 31, 2026వాస్తవానికి పారిస్ ఘటన, బెంగళూరు తొక్కిసలాట రెండూ ఒకే సందేశాన్ని ఇస్తున్నాయి. క్రీడా విజయాలు ప్రజలను ఏకం చేయగలవు. కానీ అదే భావోద్వేగం అదుపు తప్పితే ప్రమాదకరంగా మారుతుంది. సంబరాలు అల్లర్లకు దారి తీసినా, జనసందోహం ప్రాణాలను బలిగొన్నా చివరకు నష్టపోయేది అభిమానులే.ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రీడా నిర్వాహకులు ఒక కొత్త వాస్తవాన్ని అంగీకరిస్తున్నారు. విజయం ఎంత గొప్పదైనా, భద్రత దానికంటే గొప్పది. బెంగళూరు తొక్కిసలాట నేర్పిన పాఠాన్ని పారిస్ అల్లర్లు మరోసారి గుర్తు చేశాయి. కప్‌లు ప్రతి ఏడాది ఎవరో ఒకరు గెలుస్తారు. కానీ ఒక్క ప్రాణం కూడా పోకూడదనే బాధ్యత మాత్రం అందరిదీ. అందుకే ఈసారి ఆర్సీబీ సంబరాలకు బ్రేక్ పడింది. అది ఆనందంపై ఆంక్ష కాదు... గత విషాదం మళ్లీ పునరావృతం కాకూడదన్న ముందస్తు జాగ్రత్త. -
ఫ్యాన్స్‌కి షాక్.. వేడుకలకు పోలీసులు నో..?
బెంగళూరు: ఐపీఎల్- 19 విజేతగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటక పోలీసులు అప్రమత్తమయ్యారు. విన్నింగ్ సెలబ్రేషన్స్‌ను పబ్లిక్ రోడ్లపై వేడుకలు జరుపుకోవడాన్ని నిషేధించారు. 2025లో జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆర్సీబీ.. ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎల్ ఫ్రాంచైజీలో అత్యధికంగా ఫ్యాన్ బేస్ ఉన్న జట్టుగా ఆర్సీబీకీ మంచి రికార్డుంది. ఇక వారి స్వంత రాష్ట్రంలో అభిమానుల సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆర్సీబీ ఫ్యాన్స్‌కు అక్కడి పోలీసులు షాక్ ఇచ్చారు. భద్రతా కారణాల రీత్యా బెంగళూరు నగర వీధుల్లో బహిరంగ వేడుకలను పోలీసులు నిషేధించారు. గతేడాది జరిగిన ఘోర తొక్కిసలాట సంఘటనను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. సిటీ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ "బెంగళూరు సిటీ పోలీస్ ప్రేక్షకులు, అభిమానులకు వీధుల్లో బహిరంగంగా వేడుకలు జరుపుకోవద్దని, ముఖ్యంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని అడ్వైజరీ జారీ చేసింది. మేము వాహనాలను తనిఖీ చేస్తున్నాము. బహిరంగ వేడుకలకు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించము. ఎవరైనా వేడుకలు జరుపుకోవాలనుకుంటే, వారు తమ ఇళ్ల లోపలే జరుపుకోవచ్చు," అని పేర్కొన్నారు. కాగా గతేడాది ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలిచిన సమయంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలవడంతో వేలాది మంది అభిమానులు ఎం. చిన్నస్వామి స్టేడియం పరిసరాల్లో సంబరాల కోసం గుమిగూడారు. అపరిమితంగా వచ్చిన ఈ జనసందోహం వల్ల ఘోర తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది అభిమానులు మృతి చెందారు. -
డీకే శివకుమార్‌కు సీఎం పీఠం.. ఒకే దెబ్బకు రెండు లక్ష్యాలు!
బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో భారీ రాజకీయ మార్పునకు తెరలేచింది. కాంగ్రెస్ అధిష్ఠానం చివరకు నాయకత్వ మార్పుపై నిర్ణయం తీసుకోవడంతో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. దాదాపు మూడు సంవత్సరాలుగా కొనసాగుతున్న సీఎం పదవి రేసుకు ఇది ముగింపు పలికినట్లైంది. అయితే, ఈ పరిణామం సాధారణ సీఎం మార్పు కంటే చాలా పెద్ద రాజకీయ వ్యూహంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ 2028 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు, 2029 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.కర్ణాటకలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత సీఎం పదవికి సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరూ ప్రధాన పోటీదారులుగా నిలిచారు. అప్పట్లో కాంగ్రెస్ అధిష్ఠానం రాజీ ఫార్ములా అమలు చేసి సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా, డీకే శివకుమార్‌ను ఉప ముఖ్యమంత్రిగా నియమించింది. అప్పటి నుంచే ప్రభుత్వం సగకాలం తర్వాత సీఎం మార్పుపై రాజకీయ చర్చలు కొనసాగుతున్నాయి. కాగా, శివకుమార్ కాంగ్రెస్‌కు కర్ణాటకలో అత్యంత కీలకమైన నిర్వాహక నాయకుడిగా గుర్తింపు పొందారు. 2019లో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం కూలిపోతున్న సమయంలో ఎమ్మెల్యేలను కాపాడటం నుంచి, 2023 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడం వరకు ఆయన కీలక పాత్ర పోషించారు.కాంగ్రెస్ హైకమాండ్‌కు చాలా కాలంగా డీకే శివకుమార్‌ను సీఎం చేయాలనే ఒత్తిడి ఉండేది. 2023లో సిద్ధరామయ్యను సీఎం చేసినప్పుడు కూడా డీకే వర్గం అసంతృప్తిగా ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అందుకే ఇప్పుడు నాయకత్వ మార్పు ద్వారా ఆ అసంతృప్తిని తగ్గించాలనే ప్రయత్నం చేసినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే గత కొన్ని రోజులుగా ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు వరుస సమావేశాలు నిర్వహించారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో జరిగిన చర్చల అనంతరం సిద్ధరామయ్య పదవి నుంచి తప్పుకోవడానికి అంగీకరించారు అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.సీఎల్పీ సమావేశంలో ఏమైంది?బెంగళూరులో జరిగిన కాంగ్రెస్ శాసనసభా పక్షం (CLP) సమావేశంలో సిద్ధరామయ్య స్వయంగా డీకే శివకుమార్ పేరును కొత్త నాయకుడిగా ప్రతిపాదించారు. ఇతర ఎమ్మెల్యేలు కూడా మద్దతు తెలపడంతో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం గవర్నర్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అనుమతి కోరారు. ఈ సందర్భంగా కేసీ వేణుగోపాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఆయన మాట్లాడుతూ.. సిద్ధరామయ్య సేవలను కొనియాడారు. మీ సేవలు కేవలం కర్ణాటకకే పరిమితం కావు అనే సందేశాన్ని ఇచ్చారు. అలాగే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడంలో కీలక పాత్ర పోషించాలని సిద్ధరామయ్యను కోరినట్లు నివేదికలు పేర్కొన్నాయి. దీంతో సిద్ధరామయ్యకు భవిష్యత్తులో జాతీయ స్థాయి బాధ్యతలు ఇవ్వవచ్చన్న ఊహాగానాలు మరింత బలపడ్డాయి. ఒకవైపు డీకే శివకుమార్‌కు రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తూనే, మరోవైపు సిద్ధరామయ్యను జాతీయ స్థాయిలో వినియోగించాలనే సంకేతాలు కాంగ్రెస్ అధిష్ఠానం ఇస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.సిద్ధరామయ్యకు ఏ పదవి రావచ్చు?కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC)లో పెద్ద బాధ్యత.ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC)లో జాతీయ పదవి.ఓబీసీ వర్గాల్లో పార్టీ బలోపేతానికి జాతీయ ప్రచార బాధ్యతలు ఇవ్వవచ్చు.2029 లోక్‌సభ ఎన్నికల వ్యూహరచనలో కీలక పాత్ర కల్పించవచ్చు.రాజ్యసభకు పంపించే అవకాశం. అయితే, ఈ అంశాలపై కాంగ్రెస్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.డీకే శివకుమార్ ముందున్న సవాళ్లు..ఇదిలా ఉండగా.. కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌కు పలు కీలక సవాళ్లు ఎదురుకానున్నాయి.కాంగ్రెస్ అంతర్గత వర్గపోరును సమతుల్యం చేయడం.సిద్ధరామయ్య అనుచరులను సంతృప్తిపరచడం.ఐదు గ్యారంటీ పథకాల అమలు కొనసాగించడం.2028 అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీని బలోపేతం చేయడం.బీజేపీ, జేడీఎస్ నుంచి వచ్చే రాజకీయ ఒత్తిడిని ఎదుర్కోవడం. -
ట్రబుల్ షూటర్
బెంగళూరు: కన్నడనాట రాజకీయ చదరంగంలో కాంగ్రెస్ తరఫున ఎత్తులకు పైఎత్తులు వేస్తూ పార్టీని పలుమార్లు విజయతీరాలకు చేర్చిన రాజకీయ దురంధరుడు డీకే శివకుమార్ ఎట్టకేలకు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్నారు. రామనగర జిల్లాలోని దొడ్డ అలహళ్లి గ్రామంలో దుమ్ముకొట్టుకుపోయిన వీధుల్లో స్నేహితులతో కలిసి స్వేచ్ఛగా తిరుగుతూ బాల్యాన్ని ఆస్వాదించిన దొడ్డలహళ్లి కెంపెగౌడ శివకుమార్ తన నాలుగు దశాబ్దాల రాజకీయప్రస్థానాన్ని కొనసాగిస్తూ సీఎం స్థాయికి ఎదగడం ఆద్యంతం ఆసక్తిదాయకం. కనకపుర బండె(గ్రానైట్ శిల)గా పేరొందిన డీకే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సమస్యల సుడిగుండంలో పడిన ప్రతిసారీ పార్టీని కాపాడి ట్రబుల్షూటర్గా పేరు సంపాదించారు. కనకపుర తాలూకా దొడ్డ అలహళ్లిలో కెంపెగౌడ, గౌరమ్మ దంపతులకు 1962 మే 15న డీకే జన్మించారు. 1980వ దశకంలో కాంగ్రెస్ విద్యార్థినేతగా తన రాజకీయ ప్రస్థానం మొదలెట్టారు. 1985లో తొలిసారిగా సతనూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి ఓడినా నియోజకవర్గ సమస్యలపై పోరాడి 1989లో అదే స్థానం నుంచి ఘనవిజయం సాధించారు. అప్పుడు ఆయన వయసు కేవలం 27 ఏళ్లే. అప్పట్నుంచి వరసగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డ్ సృష్టించారు. కనకపుర నియోజకవర్గం ఈయనకు కంచుకోట. 64 ఏళ్ల డీకే కాంగ్రెస్‌లో వొక్కలిగ సామాజికవర్గం నుంచి తిరుగులేని శక్తిగా ఎదిగారు. 2002లో మహారాష్ట్రలో నాటి ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ సర్కార్ విశ్వాసపరీక్షను ఎదుర్కొన్నప్పుడు విలాస్‌రావ్‌కు డీకే సాయపడ్డారు. పార్టీ ఎమ్మెల్యేలను వెంటనే బెంగళూరు రిసార్ట్‌కు రప్పించి క్రాస్ఓటింగ్ను నివారించారు. 2018లో జేడీయూతో కలిసి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటులో కీలక భూమిక పోషించారు. తొమ్మిదేళ్ల క్రితం రాజ్యసభ ఎన్నికల వేళ గుజరాత్లో 42 మంది పార్టీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ వలలో చిక్కుకోకుండా చూసుకునే బాధ్యతను పార్టీ అధిష్టానం డీకేకు అప్పగించింది. పార్టీ ఎమ్మెల్యేలను బెంగళూరుకు తరలించి బీజేపీ కుట్రను భగ్నంచేసి డీకే ట్రబుల్ షూటర్ అని మరోసారి నిరూపించుకుని అధిష్టానం దృష్టిలో పడ్డారు. తర్వాత అక్రమాస్తుల కేసులతో బీజేపీ ప్రభుత్వాలు ఇబ్బందులు పెట్టినా, జైల్లో పడేసినా డీకే ప్రభ ఏమాత్రం తగ్గకపోగా ఆయనకు రాష్ట్రంలో ఆదరణ మరింత పెరిగింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వరస దాడులు, దర్యాప్తుల పర్వం సైతం డీకే ఫాలోయింగ్‌ను అమాంతం పెంచేసింది. 2019 సెపె్టంబర్ మూడోతేదీన డీకేను అరెస్ట్‌చేసి 50 రోజులపాటు తీహార్ కేంద్ర కారాగారంలో విచారణఖైదీగా ఉంచారు. జైలు శిక్ష భయంతో కమలదళంలో చేరబోతున్నారన్న పుకార్లను పటాపంచలుచేస్తూ ఆయన కాంగ్రెస్ పార్టీపై తన అచంచల భక్తిని చాటారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం మనసును డీకే గెల్చుకున్నారు. తర్వాత 2020లో పార్టీ ఆయనకు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్‌గా బాధ్యతలు అప్పగించింది. అప్పట్లో రాష్ట్రంలో పార్టీ అత్యంత క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటోంది. 2018 కర్ణాటక శాసనసభ ఎన్నికలు, 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘోర వైఫల్యంతో ఆయన నాయకత్వ సమర్థతపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయినాసరే పట్టువదలకుండా ప్రయత్నించి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతంచేశారు. 2023లో పార్టీని విజయతీరాలకు చేర్చి తన రాజకీయ చాతుర్యాన్ని మరోసారి చాటారు. మరుసటి ఏడాది సైతం రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతంచేయడంతో విజయం సాధించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో పార్టీ ఒకే ఒక్క స్థానంలో గెలవగా 2024 ఎన్నికల్లో 9 చోట్ల విజయకేతనం ఎగరేసేలా చేశారు. సీఎం కుర్చీకి తాను అర్హుడినే అని అధిష్టానం వద్ద బలంగా తన వాదనను విన్పించారు. అయితే సిద్ధరామయ్య నుంచి సీనియార్టీ రూపంలో ప్రతిఘటన ఎదురుకావడంతో మధ్యేమార్గంగా డీకేకు అధిష్టానం డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టింది. ఉపముఖ్యమంత్రిగా ఉంటూనే పార్టీ రాష్ట్ర చీఫ్‌గా కొనసాగుతూ పార్టీపై తన పట్టు నిలుపుకున్నారు. ఎట్టకేలకు తాను కలలుగన్న కీలక సీఎం పదవిని కైవసంచేసుకున్నారు. 1993లో ఉషను డీకే పెళ్లాడారు. వీళ్లకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె కెఫే కాఫీడే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ కుమారుడిని వివాహం చేసుకున్నారు. దేశంలోని అత్యంత ధనవంతులైన రాజకీయవేత్తలో డీకే కూడా ఒకరు. -
సీఎల్పీ నేతగా డీకేఎస్ ఏకగ్రీవం
సాక్షి బెంగళూరు: కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష(సీఎఎల్పీ) నేతగా ఆయన ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ సజావుగా సాగింది. బెంగళూరు విధానసౌధలో శనివారం సాయంత్రం 4 గంటలకు సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ భేటీలో స్పీకర్ యూటీ ఖాదర్ సహా నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వేర్వేరు కారణాలతో హాజరు కాలేకపోయారు. మిగిలిన ఎమ్మెల్యేలందరూ పాల్గొన్నారు. అనుకున్న సమయానికే డీకే శివకుమార్ విధానసౌధకు చేరుకున్నారు. విధానసౌధ గడపకు నమస్కరించి లోపలికి వెళ్లారు. సీఎల్పీ నాయకుడిగా డీకే శివకుమార్ పేరును ఆపద్ధర్మ సీఎం సిద్ధరామయ్య ప్రతిపాదించారు. ‘‘మన శాసనసభాపక్ష నాయకుడు డీకే శివకుమార్’’అంటూ ఏకవాక్య తీర్మానాన్ని ప్రతిపాదించగా, కాంగ్రెస్ సీనియర్ నేత, హోంమంత్రి పరమేశ్వర ఆమోదించారు. తర్వాత ఎమ్మెల్యేలందరూ చేతులెత్తి ఏకగీవ్రంగా ఆమోదం తెలిపారు. అనంతరం సీఎల్పీ నేతగా శివకుమార్ ఎన్నికైనట్లు కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ పరిశీలకులుగా కేసీ వేణుగోపాల్, రణదీప్ సింగ్ సూర్జేవాలా పాల్గొన్నారు. అయితే, ఈ భేటీ మధ్యలో 10 నిమిషాలపాటు విరామం తీసుకోవడం విశేషం. సిద్ధరామయ్య, కేసీ వేణుగోపాల్, సూర్జేవాలా ప్రత్యేకంగా మరో గదిలో కొద్దిసేపు సమావేశమైనట్లు తెలిసింది. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఇన్నాళ్లూ అందించిన సేవలను కొనియాడుతూ సీఎల్పీ భేటీలో డీకే శివకుమార్ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. గవర్నర్‌తో భేటీ సీఎల్పీ సమావేశం కంటే ముందు డీకే శివకుమార్ లోక్‌భవన్‌కు వెళ్లడం ఆశ్చర్యానికి గురిచేసింది. లోక్‌భవన్‌లో గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌ను డీకే శివకుమార్, ఆయన సోదరుడు డీకే సురేశ్ కలిసి చర్చించారు. ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గం కూర్పుపై గవర్నర్‌కు సమాచారం అందించారు. గవర్నర్‌తో భేటీ అనంతరం ప్రమాణ స్వీకారాన్ని జూన్ 3న సాయంత్రం 4.05 గంటలకు ఖరారు చేసుకున్నారు. అదేరోజు మరో 14 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, సీఎల్పీ నేత ఎన్నిక పూర్తయిన తర్వాత డీకే శివకుమార్, సిద్ధరామయ్య, సీనియర్ నేతలు కలిసి లోక్‌భవన్‌లో గవర్నర్‌తో భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు గవర్నర్‌కు తెలియజేశారు. అసెంబ్లీలో తమకు సంపూర్ణ మెజార్టీ ఉందని తెలిపారు. ఈ మేరకు లేఖ అందించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ డీకే శివకుమార్‌ను గవర్నర్ ఆహా్వనించారు. జూన్ 3న నిరాడంబరంగా ప్రమాణం సీఎల్పీ భేటీలో డీకే శివకుమార్ ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి కరచాలనం చేస్తూ పలకరించారు. జూన్ 3న సాయంత్రం 4.05 గంటలకు లోక్‌భవన్‌లో ఆయన కర్ణాటక నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. పెట్రోల్, డీజిల్ కొరత కొనసాగుతుండడంతోపాటు బెంగళూరులో ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకొని నిరాడంబరంగా ప్రమాణ స్వీకారం చేయాలని డీకే శివకుమార్ నిర్ణయించారు. అంకితభావంతో సేవలందిస్తాం: డీకేఎస్ కర్ణాటక ప్రజలకు అంకితభావం, నిజాయితీతో సేవ చేయడానికి తాను, కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నట్లు కాబోయే సీఎం డీకే శివకుమార్ చెప్పారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టుచేశారు. తనను సీఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలకు చిత్తశుద్ధితో సేవలందించడమే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. సమన్వయ సమితికి నో రాష్ట్రంలో ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సిద్ధరామయ్య సూచించగా, కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు తిరస్కరించారు. పారీ్టలో చాలా మంది సీనియర్లు ఉన్నారని, ప్రభుత్వంతో సమన్వయం కోసం కొత్తగా కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని వారు నిర్ణయానికి వచి్చనట్లు సమాచారం. -
‘సీఎం’ గొడవ అయిపోయింది.. ఇప్పుడు ‘డిప్యూటీ సీఎం’ కోసం..
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి పదవి నుంచి సిద్ధరామయ్య తప్పుకోవడంతో డీకే శివకుమార్ త్వరలోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవి కోసం కొందరు నేతలు పోటీ పడుతున్నారు.ఉప ముఖ్యమంత్రిగా మాజీ మంత్రి కేహెచ్ మునియప్పను నియమించాలని కోరుతూ దళిత వర్గ నేతలు శనివారం కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద నిరసన చేపట్టారు. మడార మహాసభ, పలు దళిత సంఘాల నేతలు పోస్టర్లు ప్రదర్శిస్తూ మునియప్పకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ నాయకత్వాన్ని కోరారు. రాష్ట్రానికి చేరుకుంటున్న ఏఐసీసీ కర్ణాటక ఇన్చార్జ్ రణదీప్ సింగ్ సుర్జేవాలాకు వినతిపత్రం అందించేందుకు నిరసనకారులు అక్కడికి వెళ్లారు.విమానాశ్రయంలోని టెర్మినల్ 1 వద్ద ఈ నిరసన కొన్ని గంటల పాటు కొనసాగింది. మడిగ వర్గానికి ఇప్పటివరకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు వంటి కీలక పదవులు దక్కలేదని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సారి ఉప ముఖ్యమంత్రి పదవి ద్వారా తమ వర్గానికి ప్రాతినిధ్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్టం తప్పదని హెచ్చరించారు. తమ వర్గాన్ని పట్టించుకోకపోతే పార్టీకి తగిన గుణపాఠం చెబుతామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, రణదీప్ సుర్జేవాలా నగరంలోని షాంగ్రి లా హోటల్‌కు చేరుకున్నారు. కర్ణాటక కాంగ్రెస్ శాసనసభ పక్షం (సీఎల్పీ) సమావేశంపై మునియప్ప మాట్లాడుతూ.. "కొంతమంది ప్రతిపాదిస్తున్నారు, మరికొందరు బలపరుస్తున్నారు. ఇదే విధానం. దీని కంటే ఎక్కువగా ఇప్పుడేమీ చెప్పలేం. అయితే ఈ ప్రక్రియ ఈ సాయంత్రానికే పూర్తవుతుంది" అని తెలిపారు.కాంగ్రెస్ నాయకత్వంపై ఒత్తిడి లింగాయత్ వర్గం నుంచి కూడా వచ్చింది. సీనియర్ నేత ఈశ్వర్ ఖండ్రేకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని గురు బసవ పట్టదేవరు, ఆయన అనుచరులు డిమాండ్ చేశారు.గురు బసవ మీడియాతో మాట్లాడుతూ.. "ఈశ్వర్ ఖండ్రేకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే వచ్చే శాసనసభ ఎన్నికల్లో లింగాయత్ వర్గం కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెబుతుంది" అని అన్నారు. కాగా, కర్ణాటకలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రుల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. -
జూన్ 3న డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం..?
-
DKశివకుమార్ ఏన్నోసార్లు ఏడ్చారు, డీకే జ్యోతిష్యుడు సంచలన వ్యాఖ్యలు
-
ఒక్కసారి సీఎం కాదు, డీకేకు తిరుగే లేదు : గురూజీ జోస్యం
సాక్షి, చెన్నై: కర్ణాటకలో నాయకత్వ మార్పుకు సన్నాహాలు జరుగుతున్న వేళ, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ శాసనసభాపక్ష (CLP) నాయకుడిగా ఎన్నికవడం, సీఎం పదవిని దక్కించుకోవడం ఇక లాంఛనప్రాయమేననిఅందరూ భావిస్తున్నారు ఈ క్రమంలో డీకే రాజకీయ ప్రస్థానం సుదీర్ఘకాలం కొనసాగుతుందని జ్యోతిష్యుడు ద్వారకానాథ్ గురూజీ జోస్యం, ఆసక్తికరంగా మారింది.ప్రమాణ స్వీకారానికి సూచించిన తేదీలుమనీ కంట్రోల్ కథనం ప్రకారం డీకే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ద్వారకానాథ్ గురూజీ మూడు అనుకూలమైన తేదీలుగా మే 31 (ఆదివారం), లేదంటే జూన్ 5, 6 శుక్ర, శని) సూచించారట.గురూజీ అంచనాలు డీకే శివకుమార్ కేవలం తాత్కాలిక లేదా ఒక్కసారి మాత్రమే ముఖ్యమంత్రి అయ్యే వ్యక్తి కాదని, ఆయన జాతకం చాలా బాగుందని గురూజీ తెలిపారు. ఆయన కర్ణాటక రాజకీయాల్లో సుదీర్ఘ కాలం పాటు కీలక పాత్ర పోషిస్తారని ప్రశంసించారు. శివకుమార్‌కు కాంగ్రెస్ అధిష్ఠానం (హైకమాండ్) పూర్తి మద్దతు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: సీఎంగా డీకే.. జూన్ 3 ముహూర్తం : ఎందుకలా?2028 ఎన్నికల్లోనూ విజయంశివకుమార్ నాయకత్వంలోని దూరదృష్టి వల్ల కర్ణాటక రాష్ట్రం సుసంపన్నంగా ఉంటుందని గురూజీ జోస్యంచెప్పారు. అయితే, వచ్చే (2028) అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మళ్లీ అధికారంలోకి వచ్చినప్పుడే ఆయన అసలైన ముఖ్యమంత్రి అవుతారని, ప్రస్తుతానికి ఆయనపై కేవలం బాధ్యతలు మాత్రమే ఉన్నాయని అన్నారు. ఇప్పుడు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి, తదుపరి విడతలో ముఖ్యమంత్రి పదవిని పూర్తి స్థాయిలో ఆస్వాదించాలని సూచించారు.కాగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామాను గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఆమోదించి, మంత్రివర్గాన్ని రద్దు చేసిన తర్వాత కర్ణాటకలో రాజకీయ వ్యూహాలు వేగవంతమయ్యాయి.శనివారం సాయంత్రం బెంగళూరులోని విధానసౌధలో జరగనున్న కాంగ్రెస్ శాసనసభా పక్ష (CLP) సమావేశంలో కొత్త నాయకుడిని ఎన్నుకో నున్నారు. ఈ రేసులో డీకే శివకుమార్ అందరికంటే ముందు వరుసలో ఉన్నారు, ఆయన ఎన్నిక దాదాపు ఖాయమని అందరూ భావిస్తున్నారు. -
సీఎంగా డీకే శివకుమార్ : జూన్ 3న ప్రమాణ స్వీకారం
సాక్షి, చెన్నై: ఉత్కంఠ రాజకీయాల నడుమ కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టేందుకు ముహూర్తం ఖరారైంది. జూన్ 3న తేదీన సాయంత్రం 4:10 గంటలకు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ జూన్ 3న కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జీసీ చంద్రశేఖర్ శనివారం తెలిపారు. రాష్ట్ర రాజధానిలో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావద్దని చంద్రశేఖర్ పార్టీ కార్యకర్తలకు సూచించారు. ఈ సాయంత్రం జరిగే భేటీలో డీకేను సీఎల్పీ నేతగా ఎన్నుకోన్నారు. ఈ సమావేశానికి పార్టీ పరిశీలకులు హాజరుకానున్నారు. మరోవైపు సీఎల్పీ సమావేశంలో నలుగురు ఉప ముఖ్యమంత్రులను ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే దీన్ని శివకుమార్ వ్యతిరేకించినట్లు తెలిసింది. జూన్ 3నే ఎందుకు?ప్రస్తుతం రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా ఉన్న శివకుమార్‌కు దైవభక్తి ఎక్కువ. ఆయన తన జ్యోతిష్యుడు బెల్లూరు ద్వారకానాథ్‌ను సంప్రదించిన తర్వాత, జూన్ 3వ తేదీని "శుభ ముహూర్తం"గా నిర్ణయించారు. దీనికి తోడు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఆయన అందుబాటులో ఉండే సమయాన్ని బట్టి కూడా ఈ తేదీని ఎంచుకున్నారు. అంతేకాదు ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం చాలా సాదాసీదాగా సాగనుందని సమాచారం.డీకేతోపాటు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. వారిలో ఒకరు దళిత సామాజిక వర్గానికి, మరొకరు మైనారిటీ వర్గానికి చెందినవారై ఉంటారని తెలుస్తోంది.ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా తర్వాత, పార్టీలోని వివిధ వర్గాలను సమతుల్యం చేయడానికి సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్యకు కొత్త ప్రభుత్వంలో కీలక పోర్ట్‌ఫోలియో (మంత్రి పదవి) దక్కే అవకాశం ఉందని అంచనా. అలాగే సిద్ధరామయ్య రూపంలో ఒక ఓబీసీ ముఖ్యమంత్రిని మార్చాల్సి వచ్చినందున, ఈ సామాజిక సమతుల్యత కాంగ్రెస్కుకీలకంగా మారింది.ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ మార్గదర్శకాల ప్రకారం దళితులు, ఓబీసీలు, మైనారిటీలకు మంత్రివర్గంలో ఎక్కువ ప్రాధాన్యత కల్పించనున్నారు. అలాగే, 2028 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని యువ నాయకులకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని భావిస్తున్నారు. -
డీకే జీవిత రహస్యాలను బయట పెట్టిన జ్యోతిష్యుడు
-
సీఎంగా నేడే డీకేఎస్ ఎంపిక
సాక్షి బెంగళూరు: కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై పూర్తిస్థాయి స్పష్టత రావడంతో గందరగోళానికి తెరపడింది. సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయడంతో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కర్ణాటక ప్రభుత్వ పగ్గాలు చేపట్టడం దాదాపుగా ఖరారైంది. ఇందుకు అవసరమైన ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై కసరత్తు సాగుతోంది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వేర్వేరుగా ఢిల్లీకి చేరుకున్నారు. మంత్రివర్గంలో తమ అనుచర వర్గానికి చోటు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. శనివారం సాయంత్రం 4 గంటలకు బెంగళూరు విధానసౌధలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభాపక్ష(సీఎల్పీ) సమావేశం జరగనుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోపాటు కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జేవాలా తదితరులు పాల్గొంటారు. కాంగ్రెస్ అధిష్టానం సూచన మేరకు డీకే శివకుమార్‌ను సీఎల్పీ నేతగా ఎన్నుకోనున్నట్లు సమాచారం. ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ అభ్యర్థిత్వాన్ని కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి రణదీప్ సింగ్ సూర్జేవాలా ప్రతిపాదించనున్నారు. ఈ ప్రతిపాదనకు పార్టీ ఎమ్మెల్యేలు ఆమోదం తెలపాల్సి ఉంది. సీఎల్పీ నేతను ఎన్నుకున్న తర్వాత ఎమ్మెల్యేల మద్దతు లేఖను లోక్‌భవన్‌లో గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌కు అందజేస్తారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని గవర్నర్‌కు తెలియజేస్తారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ గవర్నర్ ఆహ్వానిస్తే.. సోమవారం విధానసౌధ వద్ద కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ప్రమాణ స్వీకార శుభముహూర్తం కోసం ఆయన ఇప్పటికే జ్యోతిష్యులను సంప్రదించినట్లు సమాచారం. సోమవారం మంచి ముహూర్తం ఉందని వారు సూచించినట్లు తెలిసింది. విధానసౌధ ఎదుట ప్రమాణ స్వీకారానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఢిల్లీలో సిద్ధరామయ్య, డీకేఎస్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం సిద్ధరామయ్య ఢిల్లీకి చేరుకున్నారు. శుక్రవారం ఉదయం అగ్రనేతలు సోనియా గాం«దీ, రాహుల్ గాం«దీ, మల్లికార్జున ఖర్గేను కలుసుకొని ధన్యవాదాలు తెలియజేశారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గం కూర్పుపై సుమారు గంటకు పైగా చర్చించారు. అలాగే సిద్ధరామయ్య రాజకీయ భవిష్యత్తుపైనా చర్చ జరిగినట్లు తెలిసింది. జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిందిగా ఆయనను మరోసారి ఆహ్వానించినట్లు సమాచారం. ఈ సందర్భంగా సిద్ధరామయ్య వెంట ఆయన కుమారుడు యతీంద్ర, సీనియర్ మంత్రి కేజే జార్జ్ కూడా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఇప్పటివరకు తనకు అవకాశం కల్పించినందుకు, సహకరించినందుకు అధిష్టానం పెద్దలకు సిద్ధరామయ్య కృతజ్ఞతలు తెలిపారు. డీకే శివకుమార్ సైతం పార్టీ అగ్రనేతలను కలుసుకున్నారు. మంత్రివర్గంలో తన వర్గం ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరినట్లు తెలుస్తోంది. రాజీనామాకు గవర్నర్ ఆమోదం సిద్ధరామయ్య రాజీనామాకు గవర్నర్ గెహ్లాట్ శుక్రవారం ఉదయం ఆమోదం తెలిపారు. రాజీనామా తక్షణమే అమల్లోకి వస్తున్నట్లు గవర్నర్ ప్రకటించారు. ఈ మేరకు గెజిట్ విడుదల చేశారు. నూతన సీఎం ప్రమాణస్వీకారం చేసేదాకా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని సిద్దరామయ్యను గవర్నర్ కోరారు. శనివారం జరిగే సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలందరూ తప్పనిసరిగా పాల్గొనాలని కేపీసీసీ ఆదేశించింది. ఢిల్లీలో ఉన్న సిద్ధరామయ్య, డీకే శివకుమార్, రణదీప్ సింగ్ సూర్జేవాలా శుక్రవారం రాత్రి బెంగళూరుకు తిరిగి వచ్చారు. మంత్రి పదవుల కోసం లాబీయింగ్ కొత్తగా ఏర్పడనున్న మంత్రివర్గంలో చోటు కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లాబీయింగ్ ప్రారంభించారు. చాలామంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి చేరుకుని అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హైకమాండ్‌తో మంత్రివర్గ కూర్పుపై సంప్రదింపులు జరుపుతున్నారు. ఒకట్రెండు రోజుల్లో మంత్రుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. తమ సన్నిహిత ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కేలా సిద్ధరామయ్య, డీకే శివకుమార్ అధిష్టానం వద్ద పావులు కదుపుతున్నారు. తమ వర్గానికి అత్యధిక మంత్రి పదవులు దక్కించుకునేందుకు ఇరువురు నేతలు పోటీ పడుతున్నారు. ఈసారి మంత్రివర్గంలో కొత్తముఖాలకు ఎక్కువగా ప్రాధాన్యం దక్కుతుందని ఊహాగానాలు సాగుతున్న తరుణంలో సీనియర్ మంత్రులు, ముఖ్యంగా సిద్ధరామయ్య వర్గీయుల్లో టెన్షన్ పెరుగుతోంది. 40 మందికి పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రివర్గంలో చోటు కోసం ప్రయతి్నస్తున్నారు. సిద్ధరామయ్యపై డీకేఎస్ పొగడ్తల వర్షం డీకే శివకుమార్ ‘ఎక్స్’లో సిద్ధరామయ్యపై పొగడ్తల వర్షం కురిపించారు. ‘‘దేవుడు వరం ఇవ్వడు, శాపం కూడా ఇవ్వడు, అవకాశం మాత్రం ఇస్తాడు. ఆ అవకాశంతో ఏం సాధిస్తామనేది ముఖ్యం’’ అంటూ వేదాంత ధోరణిలో స్పందించారు. అవకాశాలను అందిపుచ్చుకుని విజయం సా«ధించిన వారిలో ముఖ్యుడు సిద్ధరామయ్య అని కొనియాడారు. మైసూరు జిల్లాలోని ఓ కుగ్రామంలో జన్మించి, పోరాటం ద్వారా రాజకీయాల్లోకి వచ్చి, సామాజిక న్యాయం అందిస్తూ, పేదల పెన్నిధిగా, కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య సేవలందించారని డీకే శివకుమార్ ప్రశంసించారు. కర్ణాటక రాజకీయ చరిత్రలో అత్యంత విజయవంతంగా, దీర్ఘకాలంగా ముఖ్యమంత్రిగా పనిచేసి సామాన్య ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్నారని ఉద్ఘాటించారు. నూతన మంత్రివర్గ ఏర్పాటుపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఢిల్లీలో డీకే శివకుమార్ తెలిపారు. -
దారుణం.. భూతగాలతో ఆరుగురి హత్య
బెంగళూరు: కర్ణాటకలోని విజయపుర జిల్లాలో శుక్రవారం (నిన్న) దారుణం జరిగింది.గోవింద్పూర్ గ్రామంలో భూతగాదాలతో ఆరుగురు వ్యక్తులపై ప్రత్యర్థులు కాల్పులు జరిపారు. ఆపై అత్యంత దారుణంగా నరికి చంపారు.పోలీసుల వివరాల ప్రకారం.. స్థానికంగా ఉండే 'నిరాలే', 'గోలగి' కుటుంబాల మధ్య గత కొంతకాలంగా భూవివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో గోలగి కుటుంబ సభ్యులు ఈ దాడికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితులపై మొదట కాల్పులు జరిపి, ఆ తర్వాత కత్తులతో నరికి చంపారు. మృతిచెందిన వారి వివరాలు చందు నిరాలే, దుండప్ప నిరాలే, శివపుత్ర నిరాలే, రాహుల్ నిరాలే, సమర్థ్ నిరాలే షబ్బీర్ నదాఫ్ గా పేర్కొన్నారు. వీరంతా గోవింద్పూర్ గ్రామానికి చెందిన వారు.అయితే ఈ ఘటనపై లోతైన విచారణ జరుపుతున్నామని ఇప్పటివరకూ నిందితులను ఎవరిని అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పోలీసులు వెల్లడించారు. -
బిగ్ ప్లాన్.. సిద్ధరామయ్య కొత్త మెలిక
సీఎంగా రాజీనామా చేసినా కానీ.. పార్టీపై పట్టు కోసం సిద్ధరామయ్య ప్రయత్నాలు సాగిస్తున్నారు. డీకే శివకుమార్‌కు పూర్తి స్వేచ్ఛ ఇవ్వకుండా సిద్ధరామయ్య చక్రం తిప్పుతున్నారు. ఢిల్లీలో వరుసగా పార్టీ పెద్దలతో సుదీర్ఘ భేటీలు జరుపుతున్నారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య గ్యాప్ లేకుండా కోఆర్డినేషన్ కమిటీ వేయాలంటూ సిద్ధరామయ్య కొత్త మెలిక పెట్టారు.కేబినెట్లో తన వర్గానికి చెందిన 15 మంది ఉండేలా సిద్ధరామయ్య ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తన మనుషులకు డిప్యూటీ సీఎం పోస్ట్ ఇవ్వాలని హైకమాండ్‌ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. తన కొడుక్కి వైద్య, విద్య వంటి ప్రాధాన్యత గల పోస్టు ఇవ్వాలంటున్న సిద్ధరామయ్య.. కర్ణాటక కాంగ్రెస్‌లో తన ప్రాధాన్యం తగ్గకుండా రాజ్యసభకు వెళితే రాష్ట్రంలో తన పట్టుపోతుందని భయం పడుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఉంటేనే అహిందా వర్గాలు.. పార్టీకి అండగా ఉంటాయని హైకమాండ్‌ను సిద్ధరామయ్య ఒప్పించారు.ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సిద్ధరామయ్య.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచనల మేరకు పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. రాజ్యసభకు పంపిస్తామంటూ కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఆఫర్ వచ్చిందని.. తనకు జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదని వినమ్రంగా ఆ వినతిని తోసిపుచ్చినట్లు ఆయన చెప్పారు. రాష్ట్ర రాజకీయాల్లోనే కొనసాగుతానని, ప్రజలు తమకు ఐదేళ్లపాటు పదవీకాలం ఇచ్చారని, ఇంకా రెండేళ్ల కాలం మిగిలి ఉందని, అప్పటివరకు వారి కోసం కోసం పని చేయాల్సి ఉందని అధిష్టానానికి చెప్పినట్లు ఆయన వెల్లడించారు.ఇదిలా ఉండగా, సీఎం పదవికి రాజీనామా చేసిన సిద్ధరామయ్యకు మద్దతుగా ఆయన అనుచరులు, అభిమానులు రాష్ట్రవ్యాప్తగా ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే తమ నాయకుడికి అనుకూలంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం వైఖరిపై మండిపడ్డారు. సిద్ధరామయ్యతో బలవంతంగా రాజీనామా చేయించారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. అలాగే కురుబ సామాజిక వర్గం నాయకులు సైతం సిద్ధరామయ్య రాజీనామాను వ్యతిరేకిస్తూ ప్రదర్శనలు నిర్వహించారు. రాజీనామాను వెనక్కి తీసుకోవాలని, పదవిలో కొనసాగాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాల ప్రకారమే సిద్ధరామయ్య రాజీనామా చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. -
సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు
-
పదవీ త్యాగం.. హైకమాండ్ ఎదుట సిద్దరామయ్య డిమాండ్స్
బెంగళూరు: కర్ణాటక రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజీనామాకు గవర్నర్ ఆమోదం దక్కింది. దీంతో, డీకే శివకుమార్‌కు లైన్ క్లియర్ అయ్యింది. ఈ నేపథ్యంలో సీఎంగా డీకే శివకుమార్ సోమవారం ప్రమాణం చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే, ఇద్దరు నేతలు ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. ముఖ్యమంత్రి పదవిని వదులుకున్న నేపథ్యంలో హైకమాండ్ ఎదుటు సిద్దరామయ్య పలు డిమాండ్లు ఉంచినట్టు సమాచారం.కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కొద్దిసేపటికే సిద్ధరామయ్య ఢిల్లీ వెళ్లారు. తదుపరి ప్రభుత్వ ఏర్పాటుపై అధిష్ఠానంతో చర్చించేందుకే ఆయన హస్తిన వెళ్లినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కాగా, సిద్దరామయ్య శుక్రవారం ఉదయం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో సమావేశయ్యారు. ఈ సమావేశంలో సిద్దరామయ్యతో పాటు, ఆయన కుమారుడు యతీంద్ర, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జ్ సూర్జేవాలా కూడా ఉన్నారు. ఈ సమావేశంలో హైకమాండ్ ఎదుట సిద్దరామయ్య పలు డిమాండ్లు ఉంచినట్టు సమాచారం.రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ కూర్పుపై రాహుల్‌తో సిద్దరామయ్య సమాలోచనలు జరిపారు. సిద్ధూ రాజకీయ భవిష్యత్తుపైనా చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా రాహుల్ ముందు సిద్ధరామయ్య పలు డిమాండ్లను ఉంచినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. తన కుమారుడు యతీంద్రకు కీలకమైన మంత్రిత్వశాఖను కేటాయించాలని ఆయన హైకమాండ్‌ను కోరినట్లు తెలిపాయి. తన కుమారుడు యతీంద్రకు వైద్య, విద్య.. వెనుకబడిన తరగతుల వంటి కీలక శాఖల్లో ఏదో ఒకటి కేటాయించాలని ఆయన అడిగినట్లు సమాచారం. లేదంటే గతంలో డీకే శివకుమార్ నిర్వహించిన పరిశ్రమలు, జలవనరుల శాఖ అయినా ఇవ్వాలని గట్టిగా పట్టుబట్టినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ నియామకాలతో పాటు మంత్రివర్గ పదవుల కేటాయింపులకు సంబంధించి పలువురు నేతల జాబితాను సిద్ధరామయ్య.. రాహుల్ గాంధీకి అందజేశారు. ఈ భేటీ తర్వాత కాంగ్రెస్ అధ్యక్షడు ఖర్గేతో ఆయన భేటీ అయ్యారు.అలాగే, కర్ణాటకలో తన పాత్రపై హైకమాండ్‌తో చర్చించినట్టు తెలుస్తోంది. సిద్దరామయ్యను రాజ్యసభకు పంపించేందుకు రాహుల్ గాంధీ ఒప్పించే ప్రయత్నం చేయగా.. రాజ్యసభకు, జాతీయ రాజకీయాల్లోకి వెళ్లబోనని సిద్ధరామయ్య మరోసారి స్పష్టం చేశారు. కాగా, తదుపరి కర్ణాటక ప్రభుత్వంలో సిద్దరామయ్య ఎలాంటి పాత్ర పోషించనున్నారనేది ఆసక్తికరంగా మారింది. అయితే, అహింద వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దరామయ్యకు ప్రభుత్వానికి మార్గదర్శిలా ఉండే పాత్ర కేటాయించే అవకాశం ఉంది.ఇదిలా ఉండగా.. అధిష్టానం ముందు రెండు వర్గాల బలమైన లాబీయింగ్ గట్టిగానే సాగినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కర్ణాటకలో కొత్త ప్రభుత్వంలో ఇద్దరు డిప్యూటీ సీఎంలుగా ఉండేలా ప్లాన్ చేసినట్టు తెలిసింది. లింగాయత్, దళిత వర్గాల నుండి డిప్యూటీ సీఎంలు ఉండే అవకాశముంది. అనంతరం, కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ సూర్జేవాలా మాట్లాడుతూ.. రాహుత్‌తో సమావేశంలో చాలా విషయాలు చర్చలకు వచ్చాయి. అంతా సానుకూలంగానే సాగుతోంది. నాయకత్వ మార్పిడిపై ఎలాంటి అడ్డంకులు లేవు అని స్పష్టం చేశారు. -
డీఎస్పీగా ప్రమోషన్.. ఇంతలోనే పోలీస్ అధికారి ఆత్మహత్య..!
బెంగళూరు: పోలీసు శాఖలోని ఎస్డీఆర్ఎఫ్లో ఇన్స్పెక్టర్గా పనిచేసే శ్రీశైల్ చౌగలే (37) ఆత్మహత్య చేసుకున్న ఘటన బెళగావి సిటీలో జరిగింది. బుధవారం రాత్రి విధులు ముగించుకుని చెన్నమ్మ నగరలోని ఇంటికి వెళ్లి ఉరి వేసుకున్నాడు. భార్య చూసి వెంటనే ఆయన పనిచేసే ఆఫీసుకు కాల్ చేసి చెప్పింది. సిబ్బంది, పోలీసులు చేరుకుని తలుపులు పగలగొట్టి గదిలోకి వెళ్లారు. మృతదేహాన్ని కిందకు దించి ఆస్పత్రికి తరలించారు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే విషయాలు బహిర్గతం కాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. త్వరలో డీఎస్పీ ప్రమోషన్ ఆయన బంధువులు మాట్లాడుతూ చౌగలే ప్రతిభావంతుడైన అధికారి అని, గతంలో రిజర్వు పోలీసు సీఐగా ఉండేవాడని తెలిపారు. త్వరలోనే డీఎస్పీగా ప్రమోషన్ వస్తుందని చెప్పేవాడని, ఇంతలోనే ఘోరం జరిగిందని విలపించారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
కర్ణాటకలో డీకే శివకుమార్‌కు అగ్నిపరీక్షే!
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయంతో అక్కడి ముఖ్యమంత్రి ప్రభుత్వ టర్మ్ మధ్యలోనే మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సిద్ధరామయ్య రాజీనామాతో డీకే శివకుమార్ రేపో, మాపో సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నారన్న చర్చ జోరందుకుంది. ఈ పవర్ షిఫ్టింగ్ ఇప్పుడు దేశ రాజకీయాల్లోనే హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇది కేవలం నాయకత్వ మార్పు మాత్రమే కాదన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి.డీకే శివకుమార్ నేతృత్వంపై కాంగ్రెస్‌లోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనను క్రమశిక్షణ గల, కష్టపడి పనిచేసే నాయకుడిగా పార్టీ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. గాంధీ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉండటం వల్ల కేంద్ర నాయకత్వం నుంచి ఆయనకు బలమైన మద్దతు లభిస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాలనలో స్థిరత్వం తీసుకురావడంతో పాటు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తగ్గించగలరన్న ఆశాభావం కాంగ్రెస్‌లో కనిపిస్తోంది.అయితే ఇదే సమయంలో ఈ మార్పు వెనుక కాంగ్రెస్ అధిష్టానం ఒక వ్యూహాత్మక అగ్నిపరీక్షను కూడా పెట్టినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. శివకుమార్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించడం ద్వారా రాష్ట్రంలో పార్టీని నిలబెట్టగల సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ నిర్ణయం విజయవంతమైతే కాంగ్రెస్‌కు బలం, విఫలమైతే పెద్ద రాజకీయ రిస్క్‌గా మారే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.ముఖ్యంగా ఈ మార్పు రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. సిద్ధరామయ్య చెందిన కురుబా సామాజిక వర్గం నుంచి కొంత అసంతృప్తి వ్యక్తమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో బీజేపీ ఓబీసీ అంశాన్ని ముందుకు తెచ్చే ప్రయత్నంలో ఉందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అయినప్పటికీ దళితులు, ఆదివాసీలు, మైనారిటీ వర్గాలు కాంగ్రెస్‌కు సాంప్రదాయ మద్దతుగా కొనసాగుతాయని పార్టీ ఆశిస్తోంది.కర్ణాటకలో గత నాలుగు దశాబ్దాలుగా ఒకే ప్రభుత్వం వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం సాధ్యం కాలేదు. ఈ చారిత్రక ధోరణిని మార్చడం ఇప్పుడు కాంగ్రెస్ ముందున్న అతిపెద్ద సవాల్‌గా మారింది. 2028లో జరగనున్న రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని మధ్యకాలంలో నాయకత్వ మార్పు ద్వారా పార్టీకి కొత్త ఉత్సాహం తీసుకురావాలని హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యూహం ఎంతవరకు విజయవంతమవుతుందన్నది రాబోయే పరిణామాలే నిర్ణయించనున్నాయి.మరోవైపు డీకే శివకుమార్ నేతృత్వం వోక్కలిగ వర్గంలో కాంగ్రెస్‌కు కొత్త బలం తీసుకురావచ్చని అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో జేడీఎస్ నుంచి కొంత ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపు మళ్లే అవకాశం ఉందని విశ్లేషణలు సూచిస్తున్నాయి. ఈ మొత్తం పరిణామాలు కాంగ్రెస్‌కు వ్యూహాత్మకంగా అనుకూలంగా మారతాయని కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఇక సిద్ధరామయ్య పాత్ర కూడా ఈ మార్పులో కీలకంగా మారనుంది. ఆయన రాజ్యసభ ఆఫర్‌ను తిరస్కరించి రాష్ట్ర రాజకీయాల్లోనే కొనసాగాలని నిర్ణయించుకోవడం, పార్టీ లోపల సమతుల్యతను నిలబెట్టే అంశంగా చూస్తున్నారు. శివకుమార్‌తో కలిసి పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడటంతో ప్రభుత్వంలో అంతర్గత సమన్వయం ఎంతవరకు సజావుగా సాగుతుందన్నది కీలకంగా మారనుంది. మొత్తానికి కర్ణాటక కాంగ్రెస్‌లో జరుగుతున్న ఈ నాయకత్వ మార్పు కేవలం వ్యక్తిగత పదవుల మార్పు మాత్రమే కాకుండా రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేసే కీలక మలుపుగా కనిపిస్తోంది. నాలుగు దశాబ్దాల పాత ధోరణిని బ్రేక్ చేసి అధికారాన్ని నిలబెట్టుకోవడం శివకుమార్ ముందున్న అతిపెద్ద అగ్నిపరీక్షగా మారనుంది. -
కర్ణాటక రాజకీయం.. సీఎం కుర్చీ శాపమేనా?
నిశ్చలత.. సుస్థిరత అనేది కన్నడ రాజకీయాలు, ప్రభుత్వాలలో ఎండమావిగానే మిగిలిపోయింది. ఉన్నత పదవికి సోపానమే ధ్యేయంగా, జీవిత లక్ష్యంగా నేతలకు మారడంతో పదవీ రాజకీయాలు పతాకస్థాయికి చేరాయి. ఓ పార్టీలో నుంచి అవలీలగా మరో పార్టీలోకి చేరడం, అంతే వేగంగా ఇంకో పక్షంలోకి దూకడం సాధారణ విషయాలయ్యాయి. ఎన్నికల సమయంలో అయితే ఈ విన్యాసాలకు అంతం ఉండదు. తాజాగా జరిగిన పరిణామాలు కొత్తవేమీ కాదనేది తేటతెల్లమే. గతంలోనూ దశాబ్దాలుగా కుర్చీ రాజకీయాలకు ప్రజలు సుపరిచితం. అందుకే ఎక్కువమంది ముఖ్యమంత్రులు ఐదేళ్ల పాటు సీటులో కూర్చోలేకపోయారు. రాష్ట్ర నేతల వ్యూహాలు, హైకమాండ్ల నిర్ణయాలు ముఖ్యమంత్రి పోస్టును మూణ్నాళ్ల ముచ్చట చేశాయి. కన్నడనాట ముఖ్యమంత్రి పీఠం అనేది ప్రతి ఒక్క ముఖ్య నేతకు ఓ కల.. ఈ కలను నెరవేర్చుకునేందుకు అనేక ఎత్తుకుపైఎత్తులు వేయాల్సి ఉంటుంది. సీఎం పీఠం దక్కాకా కూడా ఐదేళ్ల పాటు ఈ పదవిలో కూర్చొంటామనే గ్యారెంటీ లేదు. కర్ణాటక రాజకీయ ముఖచిత్రం గమనించే ఎవరికైనా ఈ విషయం సుస్పష్టంగా అర్థం అవుతుంది. చరిత్రలో ఒకరిద్దరు మినహాయించి ఏ ముఖ్యమంత్రి కూడా గట్టిగా ఐదేళ్ల పాటు పూర్తి పదవీ కాలాన్ని పూర్తి చేసుకోలేదు. ప్రభుత్వం ఏర్పడిన ప్రతిసారి వైకుంఠపాళిని తలపిస్తూ ముఖ్యమంత్రుల మార్పులు కర్ణాటకలో నిత్యకృత్యంగా మారిపోయాయి. సిద్దు– డీకే వార్ ప్రస్తుతం సిద్దరామయ్య, డీకే శివకుమార్ మధ్య జరుగుతున్న అధికార మారి్పడి వివాదం కొలిక్కి వచ్చింది. అయితే ఇలా ముఖ్యమంత్రి సీటు కోసం జరుగుతున్న పొలిటికల్ వార్ కర్ణాటకకు కొత్తేమీ కాదు.. గతంలో కూడా పలుమార్లు సీఎం పదవి కోసం చాలా మంది నేతలు యుద్ధాలు చేశారు. ఇందులో కొందరు పైచేయి సాధిస్తే మరికొందరు చతికిలపడ్డారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలుపొందిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో సీఎం పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ అనే ఇద్దరు మేటి నాయకులు పోటీపడ్డారు. చాలా రోజుల చర్చల తర్వాత ఆ పార్టీ అధిష్టానం సిద్ధరామయ్యను సీఎంగా ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ తరువాత కథ తెలిసిందే. ఎస్ఎం కృష్ణ హయాం నుంచీ గతంలోకెళ్తే ఎస్ఎం కృష్ణ పదవీకాలంలోనూ ఆ తర్వాత కుమారస్వామి–యడియూరప్ప సంకీర్ణ ప్రభుత్వంలోనూ సీఎం పదవి కోసం పోరాటాలు జరిగిన చరిత్ర ఉంది. 1980–1990 మధ్య కాలంలో కూడా ఇదే విధంగా సీఎం పదవి కోసం పలువురు పోటీపడ్డారు. జనతా పార్టీలో నెలకొన్న మనస్పర్థల కారణంగా తరచూ ముఖ్యమంత్రుల మార్పు జరిగింది. ఆరోపణలు, ప్రత్యర్థి వర్గం ఒత్తిళ్ల మేరకు అప్పట్లో రామకృష్ణ హెగ్డే అధికారం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. 1990 దశాబ్దంలో కూడా జనాతదళ్తో గొడవలు తీవ్రతరం అవ్వడంతో పార్టీ విభజన జరిగిపోయింది. ఈ కారణంగా ఎస్ఎం కృష్ణ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2018–2019లో సంకీర్ణ ప్రభుత్వం తర్వాత కూడా హఠాత్తుగా సీఎం మార్పు జరిగింది. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకున్నప్పటికీ మెజారిటీ నంబర్ 113కు దగ్గరగా వచ్చి ఆగింది. అయితే ఎన్నికల అనంతరం జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలు పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. జేడీఎస్ పార్టీ కంటే ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నప్పటికీ సీఎం స్థానాన్ని హెచ్డీ కుమారస్వామికి అప్పగించింది. ఏడాదికే ఆపరేషన్ కమలతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. 2019లో బీఎస్ యడియూరప్ప నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత బీజేపీ హైకమాండ్ యడియూరప్పతో రాజీనామా చేయించి 2021లో బసవరాజు బొమ్మైకి సీఎం కుర్చీని కట్టబెట్టింది.యడియూరప్పకూ ఎదురుదెబ్బలు 2011లో బీజేపీ గెలిచి పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి అయిన బీఎస్ యడియూరప్పపై భారీ అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తరువాత బీజేపీలో వర్గ పోరు వల్ల ఏ సీఎం కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు. నాలుగేళ్లలో ముగ్గురు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఆపై సదానంద గౌడ కొన్నాళ్లు, జగదీశ్ శెట్టర్ కొంతకాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాష్ట్రంలో సీఎం పదవి కోసం జరిగిన ప్రధాన డ్రామాలు..2006 కుమారస్వామి సర్కార్ పతనం:కాంగ్రెస్ పార్టీతో పొత్తు వీగిపోవడంతో బీజేపీతో కలసి జేడీఎస్ పార్టీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు2007 అధికార మార్పిడి వివాదం:బీజేపీ–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు. తరువాత అధికార మార్పిడి ఒప్పందంలో తలెత్తిన వివాదం, కుప్పకూలిన ప్రభుత్వం2018 స్పష్టమైన మెజారిటీ లేని ఫలితంబీజేపీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా గెలిచినప్పటికీ సంఖ్యాబలం లోపించింది. కాంగ్రెస్, జేడీఎస్ ఒక్కటై సర్కారును ఏర్పాటు చేశాయి 2019 ఆపరేషన్ కమల: బీజేపీలోకి ఫిరాయించిన కాంగ్రెస్–జేడీఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. సామూహిక రాజీనామాలు, కూలిన సంకీర్ణ ప్రభుత్వం, మళ్లీ అధికారంలోకి బీజేపీ.2023 కాంగ్రెస్ పార్టీ గెలుపు: సీఎం పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య పోటీ. -
సిద్దరామయ్య రాజీనామాకు గవర్నర్ ఆమోదం
బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజీనామాకు ఆమోదం దక్కింది. సిద్దరామయ్య రాజీనామాను గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఆమోదించారు. దీంతో, డీకే శివకుమార్‌కు లైన్ క్లియర్ అయ్యింది. ప్రస్తుతం డీకే శివకుమార్, సిద్ధరామయ్య ఢిల్లీలో ఉన్నారు. ఇద్దరు నేతలు కాసేపట్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలవనున్నారు. ఇదిలా ఉండగా.. కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కొద్దిసేపటికే సిద్ధరామయ్య ఢిల్లీ వెళ్లారు. తదుపరి ప్రభుత్వ ఏర్పాటుపై అధిష్ఠానంతో చర్చించేందుకే ఆయన హస్తిన వెళ్లినట్లు అధికార వర్గాలు తెలిపాయి. తదుపరి ముఖ్యమంత్రిగా భావిస్తున్న డీకే శివకుమార్ కూడా ఢిల్లీకి పయనమయ్యారు. కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం కొత్త శాసనసభాపక్ష నేత ఎంపిక, మంత్రివర్గ కూర్పుపై సిద్ధరామయ్య, డీకే శివకుమార్ అధిష్ఠానంతో చర్చించనున్నారు. ప్రస్తుతం శివకుమార్ నిర్వహిస్తున్న కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి మరొకరిని ఎంపిక చేయడంపైనా చర్చించే అవకాశముంది. రాజ్యసభకు, జాతీయ రాజకీయాల్లోకి వెళ్లబోనని చెబుతున్న సిద్ధరామయ్య, తదుపరి కర్ణాటక ప్రభుత్వంలో ఎలాంటి పాత్ర పోషించనున్నారనేది కూడా ఆసక్తికరంగా మారింది. -
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా... కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకే పదవి నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడి
-
నుజ్జునుజ్జైన కారు.. అక్కడికక్కడే ఐదుగురి దుర్మరణం
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో మరోసారి ఘోర రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. చిత్రదుర్గం జిల్లా తుమకుర్లహళ్లి సమీపంలో కారు–లారీ ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జయ్యిందని తెలుస్తోంది.ప్రాథమిక సమాచారం ప్రకారం.. వేగంగా వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను బయటకు తీశారు. క్షతగాత్రులు ఉన్నట్లయితే వారిని సమీప ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.మృతుల వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. ప్రమాదానికి అతివేగం, డ్రైవర్ నిద్రమత్తు లేదా నియంత్రణ కోల్పోవడం కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రెండ్రోజుల కిందట ఇదే జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఓకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. -
ఐటీ జాబ్ వదిలి వ్యవసాయం.. చివరికి విషాదం
మైసూర్: కర్ణాటకలో విషాదం జరిగింది. 43 ఏళ్ల ఐటీ నిపుణుడు మృతిచెందారు. వ్యవసాయ పనుల్లో ఉండగా.. పిడుగు పడి టెక్కీ రోషన్ బాలకృష్ణ మరణించారు. మడికేరి పట్టణానికి చెందిన రోషన్.. కుటుంబంతో కలిసి పొలానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆయన ఇటీవలే వ్యవసాయం మీద ఆసక్తితో తన ఐటీ జాబ్‌ను వదిలేసి.. ఒక స్నేహితుడితో కలిసి సాగు బాట పట్టారు. అలాగే రైతులకు ఆధునిక వ్యవసాయ పరికరాలను విక్రయించే (మార్కెటింగ్) వ్యాపారంలో కూడా ఆయన భాగస్వామిగా ఉన్నారు. ఇంటి నుంచే ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు.రోషన్ తన వ్యవసాయ ప్రణాళికల్లో భాగంగా ఒక భూమిని పరిశీలించడానికి మైసూర్‌కు వెళ్లారు. ఆ సమయంలో ఆయనతో పాటు భార్య, కుమారుడు కూడా ఉన్నారు. ఆ పొలం సమీపంలో రోషన్.. ఒక మామిడి చెట్టు దగ్గర కాయలు కోయడానికి ఆగిన సమయంలో ఒక్కసారిగా పిడుగు పడింది. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో వ్యక్తికి కూడా గాయాలయ్యాయి.రోషన్ బాలకృష్ణ కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మొత్తంలో రూ.4 లక్షలను రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (SDRF) నుండి, మిగిలిన రూ.1 లక్షను జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (NDRF) నుండి విడుదల చేయనున్నారు. -
అందుకే రాజీనామా చేశా..
-
కర్ణాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా.. భావోద్వేగం
బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది. కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. లోక్‌భవన్‌లో గవర్నర్ లేకపోవడంతో ఆయన కార్యదర్శికి రాజీనామా లేఖ ఇచ్చారు. హైకమాండ్ ఆదేశాలను అనుగుణంగా రాజీనామా చేశానని సిద్ధరామయ్య తెలిపారు. సిద్ధరామయ్య మీడియా సమావేశంలో తన పదవీకాలం గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.“నేను గవర్నర్ కార్యాలయానికి నా రాజీనామా సమర్పించాను. గవర్నర్ ఇక్కడ లేరు. ఆయన ఈ రాత్రికి తిరిగి వస్తున్నారు. అందుకే నా రాజీనామాను ఆయన కార్యాలయానికి సమర్పించాను. పార్టీ అధిష్ఠానం రాజీనామా చేయాలని చెప్పింది. అందుకే నేను ఈ రోజు నా రాజీనామాను సమర్పించాను. గవర్నర్ తిరిగి వచ్చిన తర్వాత దాన్ని తప్పకుండా ఆమోదిస్తారనే పూర్తి నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే ఇది రాజ్యాంగ ప్రకారం జరగాల్సిన ప్రక్రియ. మాకు స్పష్టమైన మెజారిటీ ఉంది. అందువల్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రికి అవకాశం ఇవ్వడం రాజ్యాంగబద్ధం. నాకు ఇన్నాళ్లు ఈ అవకాశం కల్పించిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.అధిష్ఠానం నాకు రాజ్యసభ ఆఫర్ ఇచ్చింది. కానీ, నేను రాజ్యసభ సీటును తీసుకోనని అధిష్ఠానానికి చెప్పాను. ఐదేళ్ల కాలానికి నన్ను ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. రాష్ట్ర రాజకీయాల్లోనే క్రియాశీలకంగా వ్యవహరిస్తాను. డీకే శివకుమార్ తదుపరి ముఖ్యమంత్రిగా ఉంటారు. జాతీయ రాజకీయాలపై నాకు ఆసక్తి లేదు’’ అని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. దీంతో రాష్ట్ర అత్యున్నత పదవి విషయంలో పార్టీలో చాలా కాలంగా కొనసాగుతున్న నాయకత్వ పోరు ముగిసింది. ముఖ్యమంత్రి పదవిని చేపట్టడానికి డీకే శివకుమార్‌కు కాంగ్రెస్ నేతలు మద్దతు ఇచ్చారు. గవర్నర్ కార్యాలయం ఏమంది? మరోవైపు, కర్ణాటక గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ప్రభు శంకర్ మాట్లాడుతూ.. “సిద్ధరామయ్య ఇచ్చిన రాజీనామాను నేను స్వీకరించాను. అయితే గవర్నర్ తిరిగి వచ్చిన తర్వాత మాత్రమే ఆయన దాన్ని ఆమోదిస్తారు” అని తెలిపారు. -
కర్ణాటక కాబోయే సీఎం.. కుటుంబం గురించి తెలుసా?
కర్ణాటక రాజకీయాల్లో ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న నాయకత్వ మార్పు ఖాయమైంది. కాంగ్రెస్‌లో ట్రబుల్ షూటర్‌గా పేరొందిన డీకే శివకుమార్ త్వరలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న డీకే.. ఇప్పుడు అధికార పీఠం ఎక్కబోతుండటంతో ఆయన వ్యక్తిగత జీవితం, కుటుంబ నేపథ్యం, రాజకీయ ప్రస్థానం, ఆస్తుల వివరాలపై నెట్టింట వెతుకులాట కనిపిస్తోంది.. డీకే శివకుమార్ పూర్తి పేరు దొడ్డలహళ్లి కెంపేగౌడ శివకుమార్. 1962 మే 15న కర్ణాటకలోని కనకపుర ప్రాంతంలో జన్మించారు. వొక్కలిగ సమాజానికి చెందిన ఆయన కుటుంబం వ్యవసాయ నేపథ్యంతో ఎదిగింది. తండ్రి కెంపేగౌడ, తల్లి గౌరమ్మ. చిన్నప్పటి నుంచే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్న డీకే.. విద్యార్థి దశలోనే కాంగ్రెస్ రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు.1989లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. అప్పటి నుంచి కర్ణాటక రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. సతనూరు నియోజకవర్గం నుంచి రాజకీయ ప్రయాణం ప్రారంభించిన ఆయన.. తర్వాత కనకపురకు మారి వరుస విజయాలు సాధించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో అత్యంత ప్రభావవంతమైన వొక్కలిగ నేతగా గుర్తింపు పొందారు.కుటుంబం కూడా హైప్రొఫైల్!డీకే శివకుమార్ భార్య ఉషా శివకుమార్. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలు ఐశ్వర్య, ఆభరణ.. ఒక కుమారుడు ఆకాశ్. పెద్ద కుమార్తె ఐశ్వర్య వివాహం ప్రముఖ వ్యాపారవేత్త, కేఫే కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ కుమారుడు అమర్త్యతో జరిగింది. ఈ వివాహం దేశవ్యాప్తంగా హైప్రొఫైల్ ఈవెంట్‌గా నిలిచింది.డీకే కుటుంబంలో రాజకీయ ప్రభావం కూడా గట్టిగానే ఉంది. ఆయన సోదరుడు డీకే సురేష్ కుమార్ కూడా కాంగ్రెస్ నేతగానే గుర్తింపు పొందారు. బెంగళూరు రూరల్ నుంచి పలుమార్లు ఎంపీగా గెలిచారు. దీంతో డీకే కుటుంబం కర్ణాటక కాంగ్రెస్‌లో శక్తివంతమైన రాజకీయ కుటుంబంగా ఎదిగింది.కాంగ్రెస్‌కు ‘ట్రబుల్ షూటర్’డీకే శివకుమార్ కాంగ్రెస్ హైకమాండ్‌కు అత్యంత నమ్మకస్తుడిగా పేరొందారు. కర్ణాటకలో సంక్షోభాలు వచ్చినప్పుడల్లా ఎమ్మెల్యేలను కాపాడటం, రిసార్ట్ రాజకీయాలు నిర్వహించడం, ప్రభుత్వాలను నిలబెట్టడం వంటి వ్యవహారాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. గుజరాత్లో అహ్మద్ పటేల్ రాజ్యసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరులో రక్షించడం ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.దేశంలోనే ధనిక నేతల్లో ఒకరుడీకే శివకుమార్ దేశంలోనే అత్యంత ధనిక రాజకీయ నాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఎన్నికల అఫిడవిట్ల ప్రకారం ఆయన ఆస్తులు వందల కోట్లలో ఉన్నాయి. 2018 ఎన్నికల సమయంలోనే దాదాపు రూ.840 కోట్లకు పైగా ఆస్తులు ప్రకటించారు. తర్వాతి అఫిడవిట్లలో ఈ ఆస్తుల విలువ మరింత పెరిగినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.వ్యవసాయ భూములు, కమర్షియల్ ప్రాపర్టీలు, బెంగళూరులో భారీ స్థలాలు, వ్యాపార పెట్టుబడులు, లగ్జరీ వాహనాలు, ఆభరణాలు, ఖరీదైన గడియారాలు ఆయన పేరుతో ఉన్నట్లు అఫిడవిట్లలో నమోదైంది. ఇటీవల రూ.43 లక్షల విలువైన కార్టియర్ వాచ్‌పై కూడా రాజకీయ వివాదం చెలరేగింది. దానిపై స్పందించిన డీకే.. “నా దగ్గర రోలెక్స్ కూడా ఉంది” అంటూ సెటైరిక్‌గా బీజేపీకి కౌంటర్ ఇచ్చారు.ఈడీ, ఐటీ కేసులతోనూ వార్తల్లో..డీకే శివకుమార్ రాజకీయ జీవితంలో వివాదాలు కూడా తక్కువ లేవు. ఆదాయానికి మించిన ఆస్తులు, మనీలాండరింగ్, ఐటీ దాడుల కేసుల్లో ఆయన పేరు పలుమార్లు వార్తల్లో నిలిచింది. 2019లో ఈడీ కేసులో అరెస్టై జైలుకూ వెళ్లారు. అయితే ఆ తర్వాత మరింత బలంగా రాజకీయాల్లో తిరిగి నిలబడ్డారు.ఇప్పుడు సీఎం కుర్చీ..2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడే డీకే సీఎం అవుతారన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే పార్టీ హైకమాండ్ అప్పట్లో సిద్ధరామయ్యకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించింది. అప్పటి నుంచి డీకే శివకుమార్ సహనంతో ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో.. ఆయన కల నిజం కాబోతోందన్న చర్చ కర్ణాటక రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. -
డీకే శివకుమార్ మంత్రివర్గ కూర్పుపై రాహుల్ ఆదేశాలు
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం మేరకు ముఖ్యమంత్రి పీఠాన్ని డీకే శివకుమార్‌కు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పార్టీ నాయకత్వం కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై దృష్టి సారించింది. శివకుమార్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ఎలా ఉండాలనేదానిపై పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక మార్గదర్శకాలను జారీ చేశారు. కొత్త మంత్రివర్గంలో దళితులు, ఓబీసీలు, మైనారిటీలకు ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించాలని ఆయన కోరినట్లు సమాచారం.యువతకు ప్రాధాన్యతమంత్రివర్గంలోకి అధికశాతం యువకులను తీసుకోవాలని రాహుల్ గాంధీ యోచిస్తున్నారని ఎన్డీటీవీ తన కథనంలో పేర్కొంది. 2028లో జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, పార్టీలో మార్పును ప్రతిబింబించేలా, యువతను ఆకర్షించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కేరళ తరహాలోనే యువ కాంగ్రెస్ నేపథ్యం ఉన్న యువ నేతలకు మంత్రి పదవులు ఇవ్వాలని హైకమాండ్ భావిస్తోంది. పార్టీ తన వ్యూహంలో భాగంగా, ప్రస్తుతమున్న 35 మంది మంత్రులలో 25 మందిని తొలగించి, వారిని పార్టీ సంస్థాగత పనులకు పరిమితం చేసే అవకాశం ఉంది.ఇద్దరు ఉపముఖ్యమంత్రుల ప్రతిపాదనకొత్త ప్రభుత్వంలో ఇద్దరు ఉపముఖ్యమంత్రులను నియమించాలనే ప్రతిపాదన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వారిలో ఒకరిని దళిత నేతకు కేటాయించే అవకాశం ఉంది. కర్ణాటకలో ఇప్పటివరకు దళిత ముఖ్యమంత్రి లేరు. ఉపముఖ్యమంత్రి పదవిని దళిత నేతకు ఇవ్వడం ద్వారా ఆ వర్గానికి భరోసా కల్పించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం హోంమంత్రిగా ఉన్న జి. పరమేశ్వర దళిత నేత కావడం గమనార్హం. సిద్ధరామయ్యకు మద్దతుగా ఉన్న దళిత, వెనుకబడిన తరగతులు, మైనారిటీల ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి కూడా ఈ నిర్ణయం తోడ్పడుతుందని పార్టీ భావిస్తోంది.భిన్నాభిప్రాయాలుఅయితే ఉపముఖ్యమంత్రుల సంఖ్య విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శివకుమార్ వర్గం ఒక్కరికే అవకాశం ఇవ్వాలని కోరుతుండగా, సిద్ధరామయ్య వర్గం మాత్రం ఇద్దరు ఉపముఖ్యమంత్రులు ఉండాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే కొత్త మంత్రివర్గం రాజకీయంగా సమతుల్యంగా ఉండాలని, ఏ ఒక్క వర్గం లేదా క్యాంపునకు అనుకూలంగా ఉండకూడదని రాహుల్ గాంధీ పార్టీకి స్పష్టమైన సందేశాన్ని పంపారు. నెలల తరబడి సాగిన అంతర్గత పోరుకు తెరదించుతూ, మంగళవారం ఢిల్లీలో జరిగిన సుదీర్ఘ సమావేశాల అనంతరం సిద్ధరామయ్యను ఒప్పించడంలో కాంగ్రెస్ హైకమాండ్ విజయం సాధించింది. జూన్ 18న జరగనున్న రాజ్యసభ ఎన్నికల ద్వారా సిద్ధరామయ్య ఎగువ సభలోకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.ఇది కూడా చదవండి: బీజేపీలో భారీ ప్రక్షాళన: కీలక రాష్ట్రాలకు కొత్త సారథులు! -
మే 31.. డబుల్ హిస్టారిక్ డే!
మే 31.. ఆదివారం.. కర్ణాటక చరిత్రలో కీలక మలుపు దిశగా సాగే తేదీగా మారింది. ఒకవైపు క్రికెట్ ప్రపంచంలో ఉత్కంఠభరిత ఫైనల్, మరోవైపు రాష్ట్ర రాజకీయాల్లో పవర్ షిఫ్ట్.. ఈ రెండు భిన్న ప్రపంచాల్లోనూ ఒకే రోజు చర్చకు కేంద్రబిందువుగా నిలుస్తోంది.కర్ణాటక రాజకీయాల్లో ఆ తేదీ కొత్త చరిత్రకు వేదికగా మారుతోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ 31నే ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే ప్రచారం నడుస్తోంది(అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది).డీకే శివకుమార్ రాజకీయ ప్రస్థానం చూస్తే ఇది ఒక దీర్ఘ ప్రయాణానికి ఫలితంగా చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీకి సంవత్సరాలుగా నిబద్ధతతో పనిచేసిన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు. “కట్టె కాలేదాకా కాంగ్రెస్‌తోనే ఉంటాను” అనే ఆయన మాటలు ఆ నిబద్ధతను చెబుతాయి. 2023లోనే ఆయన సీఎం పదవికి అర్హుడిగా ఉన్నప్పటికీ రాజకీయ సమీకరణాల కారణంగా అవకాశం వాయిదా పడింది. ఇప్పుడు ఆ నిరీక్షణకు ముగింపు లభించబోతోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.ఇటు కర్ణాటకకు చెందిన ఆర్సీబీ జట్టు అభిమానులు మే 31వ తేదీ కోసం ప్రత్యేకంగా ఎదురు చూస్తున్నారు. ఆరోజు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఉంది. గత సీజన్లో 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలికి ఆ జట్టు తొలి ఐపీఎల్ కప్పును సాధించింది. జట్టు సభ్యుడు, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ కూడా 18 కావడంతో ఆ విజయం మరింత భావోద్వేగంగా నిలిచింది. ఇప్పుడు మరోసారి ఫైనల్ చేరడంతో అదే మ్యాజిక్ మళ్లీ రిపీట్ అవుతుందా అనే ఉత్కంఠ నెలకొంది.ఒకవైపు క్రీడా ప్రపంచంలో 18 ఏళ్ల కల నెరవేరిన కథ మళ్లీ రిపీట్ అవుతుందా అనే ఆశ, మరోవైపు దశాబ్దాల రాజకీయ ప్రయాణం చివరికి శిఖరాన్ని చేరబోతున్న క్షణం.. ఇవన్నీ కలిసి మే 31ను “డబుల్ హిస్టారిక్ డే”గా నిలబెడుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
రాజీనామా ఊహాగానాల వేళ.. డీకేకు సిద్దూ మాస్టర్‌స్ట్రోక్!
కర్ణాటకలో అధికారం మార్పుపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మరో కీలక రాజకీయ అడుగు వేశారు. రాజీనామా చేసే అవకాశాలపై చర్చలు జరుగుతున్న సమయంలోనే వెనుకబడిన వర్గాల కమిషన్ కులగణన సర్వే నివేదికను ఆయన ఆమోదించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఇది కేవలం పరిపాలనా నిర్ణయం మాత్రమే కాదని.. తన రాజకీయ వారసత్వాన్ని బలపరచుకునే వ్యూహాత్మక అడుగుగా విశ్లేషకులు భావిస్తున్నారు.మైనార్టీలు, వెనుకబడిన వర్గాలు, దళితుల సమీకరణమైన ‘అహిందా’ రాజకీయాలతో ఎదిగిన సిద్దరామయ్య.. సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్న నాయకుడిగా తన ఇమేజ్ను చివరి వరకూ నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారనే చర్చ సాగుతోంది. ముఖ్యంగా సీఎం పదవి నుంచి తప్పుకునే ముందు కులగణన రిపోర్ట్‌ను ఆమోదించడం ద్వారా.. వెనుకబడిన వర్గాల పక్షాన నిలిచే నేతగా తన ముద్ర మరింత బలపడేలా చూసుకున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.అయితే అసలు రాజకీయ ట్విస్ట్ ఇక్కడే ఉంది. రిపోర్ట్‌ను ఆమోదించడం మాత్రమే సరిపోదు.. దానిని అమలు చేయాలంటే కొత్త ప్రభుత్వం కేబినెట్లో ఆమోదించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే.. ఈ నివేదికపై నిర్ణయం తీసుకోవడం ఆయన ప్రభుత్వానికి పెద్ద రాజకీయ పరీక్షగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే లింగాయత్, వొక్కలిగ వర్గాలకు చెందిన పలువురు నేతలు ఈ కులగణనపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అలాంటి సమయంలో రిపోర్ట్‌ను అమలు చేస్తే ఆధిపత్య వర్గాల అసంతృప్తి ఎదురయ్యే అవకాశం ఉంది.మరోవైపు దానిని తిరస్కరించినా లేదా ఆలస్యం చేసినా.. వెనుకబడిన వర్గాలు, అహిందా వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చే పరిస్థితి ఉంది. దీంతో సిద్దరామయ్య ఒకవైపు సామాజిక న్యాయ రాజకీయాలకు కట్టుబడి ఉన్న నాయకుడిగా తన ఇమేజ్ను బలోపేతం చేసుకుంటూనే.. ఇదే సమయంలో తదుపరి ప్రభుత్వానికి రాజకీయంగా క్లిష్టమైన పరిస్థితిని వదిలి వెళ్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
అధిష్టానం సూచనలకు కట్టుబడి ఉంటా: సిద్ధరామయ్య
కర్ణాటకలో నాయకత్వ మార్పునకు ఎట్టకేలకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజీనామాతో డీకే శివకుమార్‌కు లైన్ క్లియర్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆదివారం(31వ తేదీ) రోజున డీకే.. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు సమాచారం. సీఎం పదవికి రాజీనామా చేసిన అనంతరం సిద్ధరామయ్య.. మీడియాతో మాట్లాడారు.సిద్ధరామయ్య ప్రెస్‌మీట్:నేను సీఎం పదవికి రాజీనామా చేశా: సిద్ధరామయ్యహైకమాండ్ సూచన మేరకు రాజీనామా చేశాహైకమాండ్ రాజీనామా చేయాలని వెంటనే తొలుత రాజ్‌భవన్‌కు సమాచారం ఇచ్చారాజీనామా పత్రాన్ని లోక్‌భవన్‌లో కార్యదర్శికి ఇచ్చాగవర్నర్ ప్రస్తుతం బెంగుళూరులో లేరునా రాజీనామా ఆమోదిస్తారని సంపూర్ణ విశ్వాసంతో ఉన్నాగవర్నర్ రాగానే నా రాజీనామా అంగీకరిస్తాన్న నమ్మకం ఉందికొత్త సీఎం ప్రమాణస్వీకారానికి రాజ్యాంగపరంగా అన్నీ ఆమోదయోగ్యంగా ఉన్నాయిఅధిష్టానం సూచనలకు కట్టుబడి ఉంటారాష్ట్ర ప్రయోజనాల కోసమే పదవి నుంచి తప్పుకుంటున్నాఏడు కోట్ల కర్ణాటక ప్రజలకు సేవ చేయడం నా అదృష్టంమాకు మెజారిటీ ఉంది.. మద్దతు కూడా ఉందిసీఎం పదవికి రాజీనామా సమర్పించిన సిద్ధరామయ్యగవర్నర్ సెక్రటరీకి రాజీనామా పత్రం అందజేసిన సిద్ధరామయ్యసిద్ధరామయ్య వెంట డీకే శివకుమార్, పలువురు మంత్రులులోక్భవన్కు చేరుకున్న సిద్ధరామయ్యరాజీనామాను సమర్పించనున్న సిద్ధరామయ్యగవర్నర్ లేకపోవడంతో ఆయన కార్యదర్శికి ఇచ్చే అవకాశంసీఎం సిద్ధరామయ్య వెంట డీకే శివకుమార్అనంతరం ఢిల్లీ వెళ్లనున్న సిద్ధరామయ్యరేపు బెంగుళూరులో కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంశివకుమార్ను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకోనున్న ఎమ్మెల్యేలు మధ్యాహ్నం మూడు గంటలకు ప్రెస్‌మీట్..మధ్యాహ్నం మూడు గంటలకి సిద్ధరామయ్య మీడియా సమావేశంరాజీనామా లేఖను సమర్పించనున్న సీఎం సిద్ధరామయ్యసాయంత్రం ఐదు గంటలకు ఢిల్లీకి సిద్ధ రామయ్యరాహుల్ గాంధీ, సోనియా గాంధీతో సమావేశంరేపు బెంగళూరులో కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశండీకే శివకుమార్‌ను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోనున్న ఎమ్మెల్యేలు కాసేపట్లో డీకే, సిద్దు మీడియా సమావేశం..నేడు ఉదయం 11:15 గంటలకు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఉమ్మడి ప్రెస్ మీట్మీడియా సమావేశంలో రాజీనామా నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనున్న సిద్ధరామయ్యఅధిష్టానం ఆదేశాల మేరకు రాజీనామా చేస్తున్నట్లు మంత్రివర్గ సహచరులకు తెలిపిన సిద్ధరామయ్యసిద్ధరామయ్య ప్రయోజనాలను కాపాడుతామని హామీ ఇచ్చిన అధిష్టానంఅహిందా ఓటు బ్యాంక్ ను కాపాడుకునేందుకు ఆ వర్గాలకు డిప్యూటీ సీఎం పదవిఓబీసీ నుంచి సిద్ధరామయ్య తనయుడు యతీంద్రకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే అవకాశందళిత సామాజిక వర్గం నుంచి పరమేశ్వర్‌కు డిప్యూటీ సీఎంమైనారిటీల నుంచి ఒకరికి, లింగాయత్ సామాజిక వర్గం నుంచి ఎంబీ పాటిల్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే అవకాశం సీఎంగా డీకే.. లైన్క్లియర్సీఎం పదవికి సిద్దరామయ్య రాజీనామా.ఈనెల 31న కర్ణాటక సీఎంగా డీకే ప్రమాణం చేసే అవకాశం. #WATCH | Bengaluru: Supporters of Karnataka Deputy CM and KPCC president D.K. Shivakumar distribute sweets and raise slogans in his support outside his residence, amid the speculations around CM post. pic.twitter.com/7OF4WnYJ5v— ANI (@ANI) May 28, 2026 కర్ణాటక సీఎం బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌లో ఆసక్తికర దృశ్యాలు..సిద్దరామయ్య రాజీనామా నిర్ణయం ప్రకటన తర్వాత ఆసక్తికర పరిణామంసీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామాబ్రేక్ ఫాస్ట్ మీటింగ్‌లో వెల్లడించిన సిద్ధరామయ్యగవర్నర్కు తన రాజీనామా లేఖ ఇవ్వనున్న సిద్దరామయ్య#WATCH | Karnataka CM Siddaramaiah and Deputy CM DK Shivakumar share a hug at the CM residence in Bengaluru at the breakfast meeting. Deputy CM DK Shivakumar also touched the feet of CM Siddaramaiah.(Video Source: Office of Deputy Chief Minister) pic.twitter.com/8bCChizsFL— ANI (@ANI) May 28, 2026సిద్దూ ఆశ్వీరాదం..సిద్ధరామయ్య కాళ్లు మొక్కి ఆశ్వీరాదం తీసుకున్న డీకే.డీకేను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న సిద్దరామయ్య. డీకే శివకుమార్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పిన సిద్ధ రామయ్యరాజీనామా సమర్పించేందుకు గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన సిద్ధరామయ్య Karnataka CM and Deputy CM, Siddaramaiah and DK Shivakumar, respectively, share a hug at the CM residence in Bengaluru at the breakfast meeting. Deputy CM DK Shivakumar also touched the feet of CM Siddaramaiah.(Pics: CMO Karnataka) pic.twitter.com/qIATmAwj8a— ANI (@ANI) May 28, 2026కాసేపట్లో మంత్రివర్గ సహచరులతో బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్..బ్రేక్‌ఫాస్ట్ సమావేశంలో సిద్దరామయ్య, డీకే శివకుమార్మధ్యాహ్నం మూడు గంటలకు రాజీనామా లేఖ పంపనున్న సిద్ధరామయ్య.బెంగళూరులో అందుబాటులో లేని గవర్నర్ తావర్‌చంద్ గెహ్లాట్.ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా గత రాత్రి ఇండోర్‌కు వెళ్లిన గెహ్లాట్.గవర్నర్ అందుబాటులో లేకున్నా లోక్‌భవన్‌కు రాజీనామా లేఖ పంపనున్న సిద్దరామయ్య. #WATCH | Karnataka Deputy CM and KPCC president D.K. Shivakumar arrives at the residence of Chief Minister Siddaramaiah for the breakfast meeting called by him. pic.twitter.com/yAT1SmRuQv— ANI (@ANI) May 28, 2026 సిద్దు ఇంటికి చేరుకున్న డీకే..బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌లో భాగంగా డీకే శివకుమార్.. సిద్ధరామయ్య ఇంటికి చేరుకున్నారు.మరోవైపు.. డీకే సీఎం అవుతున్నారనే వార్తలు.. జోష్‌లో ఆయన మద్దతుదారులుస్వీట్ పంచుతూ డీకే అనుచరులు సందడి. కాసేపట్లో బ్రేక్‌ఫాస్ మీటింగ్.. నేడు కర్ణాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామాఎల్లుండి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశంకాసేపట్లో మంత్రివర్గ సహచరులతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్హాజరుకానున్న డీకే శివకుమార్ రాజ్యసభ సీటు నిరాకరించిన సిద్ధరామయ్యమరో రెండేళ్లు ఎమ్మెల్యేగానే కొనసాగుతానని అధిష్టానానికి వెల్లడిజాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదని స్పష్టం చేసిన సిద్ధరామయ్యమధ్యాహ్నం మూడు గంటలకు రాజీనామా సమర్పించనున్న సిద్ధరామయ్యఅధికారికంగా కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం ఏర్పాటు చేయలేదని వెల్లడించిన ఏఐసీసీ వ్యవహారాల ఇంచార్జ్ సూర్జేవాలా. రాజ్యసభకు సిద్ధూ నోసీఎం పదవి నుంచి వైదొలుగనున్న నేపథ్యంలో సిద్ధరామయ్యకు కాంగ్రెస్ రాజ్యసభ సీటు ఆఫర్ఎంపీగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా లేనన్న సిద్ధరామయ్యజాతీయ రాజకీయాల్లోకి వెళ్లకుండా.. మరో రెండేళ్లపాటు ఎమ్మెల్యేగానే కొనసాగాలని నిర్ణయం. -
నిన్న తమిళనాడు.. ఇవాళ కర్ణాటకలో ‘గవర్నర్ ట్విస్ట్’
కర్ణాటకలో సీఎం మార్పు చుట్టూ ఇప్పటికే రాజకీయ ఉత్కంఠ తారాస్థాయికి చేరగా.. ఇప్పుడు గవర్నర్ ఎంట్రీ మరో కొత్త ట్విస్ట్‌కు దారి తీసింది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజీనామా చేసే అవకాశాలపై జోరుగా చర్చ జరుగుతున్న వేళ.. కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ వ్యక్తిగత పనులపై ముంబై వెళ్లడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు కారణమైంది. సీఎం కార్యాలయం ఇప్పటికే గవర్నర్ అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం రావడం.. మరోవైపు గవర్నర్ తిరుగు ప్రయాణ టికెట్ కూడా ఇంకా బుక్ చేయలేదన్న వార్తలు బయటకు రావడంతో ఉత్కంఠ మరింత పెరిగింది. కాంగ్రెస్ వర్గాలు మాత్రం గవర్నర్ అందుబాటులో లేకపోయినా సిద్దరామయ్య రాజీనామా చేసే అవకాశం ఉందని చెబుతున్నాయి. లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ కార్యదర్శిని కలిసి రాజీనామా లేఖ సమర్పించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. రాజీనామా ప్రక్రియ, తదుపరి ప్రభుత్వ ఏర్పాటు, డీకే శివకుమార్‌కు ఆహ్వానం వంటి అంశాల్లో ఆలస్యం జరిగితే రాజకీయంగా కొత్త సంక్షోభం తలెత్తొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇప్పటికే కర్ణాటక కాంగ్రెస్‌లో సిద్దరామయ్య-డీకే శివకుమార్ మధ్య అధికార సమీకరణాలపై గత కొన్ని నెలలుగా అంతర్గత పోరు కొనసాగుతోంది. అలాంటి సమయంలో గవర్నర్ అందుబాటులో లేకపోవడం, నిర్ణయాల్లో జాప్యం జరగడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి.ఇక్కడే మరో ఆసక్తికర పోలిక కూడా తెరపైకి వస్తోంది. ఇటీవల తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్ వ్యవహారించిన తీరు తీవ్ర వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. అత్యధిక స్థానాలు గెలిచిన విజయ్ నేతృత్వంలోని టీవీకేకు వెంటనే ఆహ్వానం ఇవ్వకుండా, పూర్తి మెజారిటీ లేదంటూ పలుమార్లు ఆలస్యం చేయడం హాట్‌టాపిక్‌గా మారింది. ఆ వ్యవహారంపై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి.ఇప్పుడు కర్ణాటకలో కూడా అలాంటి రాజకీయ హైడ్రామా చోటుచేసుకునే అవకాశాలపై చర్చ మొదలైంది. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. గవర్నర్ వ్యవస్థను రాజకీయ ఆయుధంగా ఉపయోగిస్తోందంటూ కాంగ్రెస్, ఇతర విపక్షాలు ఇప్పటికే ఆరోపణలు చేస్తున్నాయి. కర్ణాటకలో కూడా అదే తరహా వ్యూహం అమలు చేసే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఒకవేళ సీఎం మార్పు ప్రక్రియలో ఆలస్యం జరిగితే.. కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరింత బహిర్గతమయ్యే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అదే సమయంలో డీకే శివకుమార్ వర్గం, సిద్దరామయ్య వర్గం మధ్య అసంతృప్తులు మరింత పెరిగే అవకాశమూ కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే.. గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఎప్పుడు తిరిగి వస్తారు? సిద్దరామయ్య నిజంగా ఎప్పుడు రాజీనామా చేస్తారు? డీకే శివకుమార్‌కు సీఎం బాధ్యతలు అప్పగింపు ఎప్పుడు జరుగుతుంది? అనే దానిపైనే నిలిచింది. కర్ణాటక రాజకీయాల్లో ఇప్పటికే వేడెక్కిన పవర్ గేమ్‌కు ఇప్పుడు ‘గవర్నర్ ట్విస్ట్’ మరింత హీట్ పెంచింది. -
రాజ్యసభకు సిద్దరామయ్య నో!
కర్ణాటక రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా ఉత్కంఠ రేపుతున్న నాయకత్వ మార్పు అంశంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అధిష్టానం బుజ్జిగింపుతో ముఖ్యమంత్రి పదవి నుంచి సిద్ధరామయ్య తప్పుకునేందుకు సిద్ధమైనట్లు స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి. అయితే జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారన్న ప్రచారానికి మాత్రం ఆయన బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది.రాజ్యసభకు వెళ్లే ఆలోచన ప్రస్తుతం తనకు లేదని, మరో రెండేళ్లు ఎమ్మెల్యేగా కొనసాగాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో కాంగ్రెస్‌లో జరుగుతున్న ‘పవర్ ట్రాన్సిషన్’ మరింత ఆసక్తికరంగా మారింది. సిద్దరామయ్య రాజ్యసభకు వెళ్లేందుకు నిరాకరించడం కర్ణాటక కాంగ్రెస్‌లో శక్తి సమీకరణాలు ఇంకా పూర్తిగా డీకే శివకుమార్‌వైపు మారలేదనే సంకేతంగా కనిపిస్తోంది. మరో రెండేళ్లు ఎమ్మెల్యేగా కొనసాగాలని నిర్ణయించడం ద్వారా రాష్ట్ర రాజకీయాలపై తన పట్టు కొనసాగించాలని ఆయన భావిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా తన వర్గానికి ప్రభుత్వంలో ప్రాధాన్యం తగ్గకుండా చూడాలన్న వ్యూహం ఇందులో కనిపిస్తోంది. మరోవైపు సీఎం మార్పు జరిగినా.. సిద్దరామయ్య ప్రభావం అలాగే కొనసాగుతుందనే సందేశాన్ని పార్టీ హైకమాండ్ కూడా ఇవ్వాలనుకుంటోందని అంటున్నారు. దీంతో డీకే శివకుమార్‌కు సీఎం పదవి దక్కినా.. కాంగ్రెస్‌లో అసలు పవర్ సెంటర్ ఎవరు అనే చర్చ మాత్రం ఇంకా కొనసాగుతోంది.ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం బెంగళూరు-ఢిల్లీ మధ్య వరుస చర్చలు నిర్వహిస్తోంది. సీఎం మార్పుపై ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో పార్టీ కార్యాలయాలు, కీలక నేతల నివాసాలు రాజకీయ చర్చలకు కేంద్రాలుగా మారాయి. ఈ నేపథ్యంలో సిద్దరామయ్య గురువారం మధ్యాహ్నం తర్వాత రాజీనామా చేసే అవకాశముందని కాంగ్రెస్ వర్గాలు సంకేతాలు ఇస్తున్నాయి. ఆయన రాజీనామా అనంతరం డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను కొత్త ముఖ్యమంత్రిగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.అయితే ఈ మార్పు కేవలం పదవి బదిలీ మాత్రమే కాదని.. కాంగ్రెస్ అంతర్గత శక్తి సమీకరణాలకు సంబంధించినదిగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా సిద్దరామయ్య వర్గానికి ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యం కొనసాగించేలా ఫార్ములా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. డీకే శివకుమార్ నేతృత్వంలో ఏర్పడే కొత్త మంత్రివర్గంలో సిద్దరామయ్య అనుచరులకు కీలక పదవులు దక్కే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.శనివారం డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశాలపై కాంగ్రెస్‌లో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. ఈ నేపథ్యంలో సిద్దరామయ్య గురువారం సాయంత్రం ఢిల్లీలో పార్టీ అధిష్టానంతో సమావేశమై మార్పు ప్రక్రియకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉందని సమాచారం.ఇదిలా ఉండగా, కాంగ్రెస్ హైకమాండ్ కూడా కర్ణాటకలో అధికారం మార్పును ఎలాంటి అసంతృప్తులు లేకుండా నిర్వహించాలని చూస్తోంది. ఒకవైపు డీకే శివకుమార్‌కు సీఎం పదవి ఇచ్చే హామీని నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఉండగా.. మరోవైపు సిద్దరామయ్య ప్రభావాన్ని కూడా తగ్గించకుండా సమతౌల్యం పాటించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఇక ప్రతిపక్ష బీజేపీ మాత్రం కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలను “అధికార పోరు”గా అభివర్ణిస్తోంది. సీఎం కుర్చీ కోసం కాంగ్రెస్‌లో అంతర్గతంగా తీవ్ర పోటీ నడుస్తోందని విమర్శిస్తోంది. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం ఇది పార్టీ అంతర్గత వ్యవహారమని, మార్పు ప్రక్రియ పూర్తిగా సమన్వయంతోనే జరుగుతోందని చెబుతున్నారు.కర్ణాటక రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే.. సిద్దరామయ్య నిజంగా రాజీనామా చేస్తారా? డీకే శివకుమార్ ఎప్పుడు సీఎం అవుతారు? అనే దానిపైనే నిలిచింది. -
‘‘రాజీనామా చేయాలని సిద్ధరామయ్య నిర్ణయం’’
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆర్వీ దేశ్‌పాండే తెలిపారు. దేశ్‌పాండే ప్రస్తుతం పరిపాలనా సంస్కరణల కమిషన్ చైర్మన్‌గా ఉన్నారు. దేశ్‌పాండే బుధవారం సిద్ధరామయ్య నివాసంలో ఆయనను కలిశారు. కొందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయొద్దని కోరగా, తాను అధిష్ఠానానికి మాట ఇచ్చానని, ఆ మాటను గౌరవిస్తానని ముఖ్యమంత్రి చెప్పారని ఆయన వెల్లడించారు.విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సిద్ధరామయ్య నివాసంలో సమావేశమై చర్చలు జరిపారు. రాజీనామా చేయొద్దని వారు కోరారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్ఠానంతో మాట్లాడతామని తెలిపారు.కొన్ని నివేదికల ప్రకారం.. ఈ అంశంపై శాసనసభ పక్ష సమావేశంలో చర్చ జరపాలని కొందరు సూచించారు. అయితే సిద్ధరామయ్య అలాంటి సూచనలకు సానుకూలంగా స్పందించలేదు. “నేను ముఖ్యమంత్రితో ఉన్నాను. రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని సిద్ధరామయ్య చెప్పారు. ఎందుకు రాజీనామా చేస్తున్నారో నేను అడగలేదు” అని దేశ్‌పాండే చెప్పారు. ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య గురువారం లేదా ఆ తర్వాతి రోజు రాజీనామా చేసే అవకాశం ఉందన్నారు.“ఈ నిర్ణయం మాకు ఆశ్చర్యంగా అనిపించిందని మేము చెప్పాం. అయితే ‘లేదు, నేను రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను’ అని ఆయన అన్నారు. అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఆయన కొనసాగాలని కోరారు. కానీ తాను అధిష్ఠానానికి మాట ఇచ్చానని, ఆ మాటను గౌరవిస్తానని ఆయన చెప్పారు. ఆయన కొనసాగితే మంచిదని నేను చెప్పాను. కానీ అధిష్ఠానానికి హామీ ఇవ్వడంతో రాజీనామా చేస్తున్నానని ఆయన చెప్పారు” అని ఆయన తెలిపారు.సిద్ధరామయ్య ఎందుకు రాజీనామా చేస్తున్నారని తాను అడిగితే, ఢిల్లీలో చర్చలు జరిగాయని ఆయన చెప్పారని దేశ్‌పాండే వెల్లడించారు. “సీఎంగా కొనసాగాలని నేను చెప్పాను. కానీ నిర్ణయం ఆయనదే” అని ఒక ప్రశ్నకు సమాధానంగా ఎమ్మెల్యే తెలిపారు.కొత్త మంత్రివర్గంలో డీకే శివకుమార్ నేతృత్వంలో మంత్రి పదవి దక్కుతుందా? అని అడిగితే.. శివకుమార్ ముఖ్యమంత్రిగా ఎంపికైతే అది ఆయన, అధిష్ఠానం నిర్ణయిస్తారని దేశ్‌పాండే చెప్పారు. ముఖ్యమంత్రి నిరాశలో ఉన్నారా అని అడిగితే, “లేదు… ఎందుకు నిరాశ?” అని ఆయన స్పందించారు.బుధవారం ముఖ్యమంత్రిని కలిసిన వారిలో మంత్రులు మహదేవప్ప, అహ్మద్ ఖాన్, నంజేగౌడ, బి నాగేంద్ర, ఉమేశ్ మేటి, ఎ ఎస్ పొన్నన్న, సలీమ్ అహ్మద్ తదితరులు హాజరయ్యారు.సిద్ధరామయ్య మరో రెండు రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, శివకుమార్‌కు బాధ్యతలు అప్పగించే అవకాశముందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సిద్ధరామయ్య గవర్నర్‌ను కలిసేందుకు సమయం కోరినట్టు సమాచారం. గురువారం తన అధికార నివాసంలో మంత్రివర్గ సహచరులతో అల్పాహార సమావేశం కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరగాలని కాంగ్రెస్ అధిష్ఠానం సిద్ధరామయ్యను కోరిందన్న వార్తల తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. -
సేమ్ సీన్: 1992లో బంగారప్ప రాజీనామా.. ఇప్పుడు సిద్ధరామయ్య!
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి పదవి నుంచి సిద్ధరామయ్యను తప్పుకునేలా చేసి డీకే శివకుమార్‌కు ఆ పదవి ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్ఠానం ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలు ఈ ప్రచారానికి బలాన్నిస్తున్నాయి. గురువారం మీడియాతో మాట్లాడతానని సిద్ధరామయ్య అన్నారు. ఆయనను కాంగ్రెస్ పార్టీ రాజ్యసభకు పంపాలని భావిస్తున్నట్లు సమాచారం.సిద్ధరామయ్యకు కాంగ్రెస్ షాక్! తాజాగా, న్యూఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతల సమావేశం తర్వాత సిద్ధరామయ్య వర్గానికి షాక్ తగిలినట్లు తెలుస్తోంది. మధ్యాహ్న భోజన విరామం తర్వాత అగ్రనేత రాహుల్ గాంధీ తన నివాసానికి వెళ్లి తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంక గాంధీతో చర్చించారు. ఆ సమయంలో శివకుమార్‌కు ఇచ్చిన హామీ గుర్తుచేసిన సోనియా గాంధీ దాన్ని అమలు చేసే సమయం వచ్చిందని సూచించినట్టు తెలుస్తోంది. శివకుమార్‌కు ఎప్పటి నుంచో మద్దతుగా నిలిచిన ప్రియాంక గాంధీ కూడా పార్టీకి ఆయన చూపిన విధేయత దృష్ట్యా ఇప్పుడు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని వాదించినట్టు సమాచారం.లంచ్ బ్రేక్ తర్వాత మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, రణదీప్ సుర్జేవాలా, సిద్ధరామయ్య, శివకుమార్ మరోసారి సమావేశమైన వేళ రాహుల్ గాంధీ లోపలికి వచ్చి నేరుగా సిద్ధరామయ్యను చూస్తూ పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుందని చెప్పినట్టు సమాచారం. ఆ వార్త విన్న వెంటనే సిద్ధరామయ్య ముఖంలో షాక్ స్పష్టంగా కనిపించిందని చెబుతున్నారు. అయితే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాత్రం ఎన్నికల అంశాలపైనే చర్చ జరిగిందని, మిగతావన్నీ ఊహాగానాలేనని మీడియాకు చెప్పారు. 1992లోనూ ఇలాంటి పరిణామాలు తాజాగా, చోటుచేసుకున్న ఈ పరిణామాలన్నీ 1992 ఘటనను గుర్తుచేస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. బీసీ వర్గానికి చెందిన ప్రముఖ నేత ఎస్.బంగారప్ప ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ప్రభుత్వంపై అవినీతి, అధికార దుర్వినియోగ ఆరోపణలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధిష్ఠానానికి బంగారప్పపై ఫిర్యాదులు చేసేవారు.అప్పుడు ప్రధానమంత్రి పీవీ నరసింహరావు మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపిస్తూ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కర్ణాటక రాజకీయ పరిణామాలు ఆయనకు పెద్ద తలనొప్పిగా మారాయి. ఒక రోజు బంగారప్పను ఢిల్లీకి పిలిపించారు. ప్రధానమంత్రి నివాసానికి వెళ్లిన బంగారప్ప ఎదుట పీఎంవో సిద్ధం చేసిన భారీ ఫైల్ ఉంచిన నరసింహరావు, కొన్ని ఫిర్యాదులు చదివి ఆయన స్పందన అడిగారని ప్రచారం జరిగింది. బంగారప్ప మౌనంగా ఉండటంతో ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిస్తున్నానని తెలిపారు. బెంగళూరులో రాజ్ భవన్‌కు వెళ్లి రాజీనామా సమర్పించాలని చెప్పినట్టు అప్పట్లో ఢిల్లీలో పనిచేసిన రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.చేసేది ఏమీలేక బంగారప్ప రాజీనామా బంగారప్ప బయటకు రాగానే మీడియా ఆయనను రాజీనామా చేస్తారా? అంటూ పలు ప్రశ్నలు అడిగింది. సమాధానం చెప్పకుండా బంగారప్ప చాణక్యపురిలోని కర్ణాటక భవన్‌కు వెళ్లి తన అనుచర మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. వెంటనే బెంగళూరుకు ఫోన్ చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు వేలాది మంది మద్దతుదారులను విమానాశ్రయానికి రప్పించాలని ఆదేశించారు.వెనుకబడిన వర్గాల ప్రజలు అధిష్ఠానంపై తిరుగుబాటు చేస్తారని, ఎమ్మెల్యేల మద్దతుతో రాజకీయ సంక్షోభం సృష్టించి ప్రధానమంత్రి నిర్ణయాన్ని మార్చగలనని బంగారప్ప భావించారు. అయితే మరుసటి రోజు ఆయన విమానం బెంగళూరు విమానాశ్రయానికి చేరేసరికి అక్కడ కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, కొన్ని వందల మంది మద్దతుదారులే కనిపించారు. ఆ తర్వాత బంగారప్ప ఆలస్యం చేయకుండా రాజ్ భవన్‌కు వెళ్లి రాజీనామా సమర్పించారు. ఆ తర్వాత వీరప్ప మొయిలీ ముఖ్యమంత్రిగా 1992 నవంబర్ 19న బాధ్యతలు స్వీకరించారు.సిద్ధరామయ్య కర్ణాటకలో వెనుకబడిన వర్గాల నుంచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండో వ్యక్తి. అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన నాయకుడిగానూ రికార్డు సృష్టించారు. కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయంతో ఆయన మౌనంగా ఉంటున్నారు. ఒకవేళ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందేనని కాంగ్రెస్ అధిష్ఠానం చెబితే ఆయన తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుందో..? -
డీకే ప్రమాణ స్వీకారం ఎపుడు? ఉత్కంఠగా బ్రేక్‌ఫాస్ట్ భేటీ
కర్ణాటకలో అధికార మార్పిడి, ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకునే రాజకీయ పరిణామాలు మళ్లీ ఊపందుకున్నాయి. ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్‌తో జరిగిన సుదీర్ఘ చర్చల తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీంతో డీకే శివకుమార్ సీఎం పదవిని స్వీకరించేది ఎపుడు అనేది ఉత్కంఠగా మారింది.‘‘మంచి రోజులు వస్తాయి," అని తన పదోన్నతి గురించిన వార్తలపై గతవారం ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చమత్కరించారు. ఇప్పుడు, కర్ణాటక అధికార మార్పిడి దాదాపు ఖరారు కావడంతో, ఆయన అనుకున్న సమయం రానే వచ్చినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ అధిష్ఠానం ఉప ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. అయితే ఇప్పుడు మిగిలిన ఏకైక ప్రశ్న... ఇది ఎప్పుడు జరుగుతుంది?2023 అసెంబ్లీ ఎన్నికల విజయం తర్వాత జరిగిన ఒప్పందం ప్రకారం.. ఐదేళ్ల కాలపరిమితిలో సగం గడువు (రెండున్నరేళ్లు) ముగియడంతో ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్‌కు సీఎం పీఠాన్ని అప్పగించేందుకు హైకమాండ్ పచ్చజెండా ఊపింది. రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం డి.కె. శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి రెండు రకాల అవకాశాలు కనిపిస్తున్నాయి.తక్షణమే? జూన్ 18?అందులో మొదటిది సిద్ధరామయ్య గురువారం (మే 28) లేదా శుక్రవారం లోపు తన రాజీనామాను సమర్పించవచ్చు. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ వారాంతంలోనే (శని లేదా ఆదివారం) డి.కె. శివకుమార్ కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. రెండోది అంశం విషయానికి వస్తే ఒకవేళ సిద్ధరామయ్య రాజీనామాను కొద్దిరోజులు వాయిదా వేయాలని భావిస్తే, రాబోయే రాజ్యసభ ఎన్నికల (జూన్ 18) వరకు ఈ ప్రక్రియ ఆగవచ్చు. అంతర్గత విభేదాలు ఎన్నికలపై ప్రభావం చూపకూడదని హైకమాండ్ భావిస్తే, జూన్ 18 తర్వాతే ప్రమాణ స్వీకారం ఉంటుంది. సిద్ధపరామయ్య పదవీ త్యాగానికి హైకమాండ్ ఇచ్చిన ఆఫర్ ఏంటి అనేది కూడా చర్చకు దారితీసింది. రాష్ట్ర రాజకీయాల నుండి సిద్ధరామయ్యను గౌరవప్రదంగా సాగనంపడానికి కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు భారీ ఆఫర్లనే ప్రకటించినట్టు సమాచారం. ఇందులో రాజ్యసభ సీటు, ఢిల్లీ రాజకీయాల్లో ప్రాధాన్యతఅనే అంశాలు కీలకంగా మారనున్నాయి. జూన్ 18న జరిగే ఎన్నికల్లో సిద్ధరామయ్యకు రాజ్యసభ సీటు, ఏఐసీసీ (AICC) లో కీలక బాధ్యతలు అప్పగించడంతోపాటు, కొత్తగా ఏర్పడే డీకే శివకుమార్ ప్రభుత్వంలో సిద్ధరామయ్య వర్గానికి చెందిన మంత్రులకు ప్రాధాన్యత కల్పించడం. అయితే సిద్ధరామయ్య వర్గం ఇద్దరు లేదా ముగ్గురు డిప్యూటీ సీఎం పదవులను డిమాండ్ చేస్తోంది. అయితే శివకుమార్ మాత్రం కేవలం ఒక్క డిప్యూటీ సీఎం పదవికి మాత్రమే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇన్ని అంచనాల నడుమ డీకే క్యాంప్‌లో పండగ వాతావరణం నెలకొనగా, సంబరాలు వెల్లివిరుస్తుండగా, సిద్దరామయ్య మాత్రం ఇంకా తన వ్యూహాలను గోప్యంగా ఉంచుతుండటం గమనార్హం.గురువారం ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్బుధవారం బెంగళూరుకు చేరుకున్న తర్వాత, ఢిల్లీ సమావేశాలు, అధికార మార్పిడి వార్తలపై వ్యాఖ్యానించడానికి ముఖ్యమంత్రి నిరాకరించారు. విలేకరుల ప్రశ్నలకు ఆయన ఇచ్చిన ఏకైక సమాధానం, "నేను రేపు(గురువారం) మాట్లాడతాను." అని. గురువారం ఉదయం అల్పాహారం కోసం డీకే శివకుమార్, సిద్ధరామయ్యను కలవనున్నారు. ఇడ్లీ, సాంబార్, వడలతో పాటు ముఖ్యమంత్రి శివకుమార్‌కు మరో తీపి కబురు అందిస్తారా లేక ఈ ఇడ్లీ, సాంబార్, వడల చర్చల తర్వాత సిద్ధరామయ్య తన రాజీనామా నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తారా, లేక మరికొంత కాలం ట్విస్ట్ ఇస్తారా అనేది వేచి చూడాలి! -
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పునకు సంకేతాలు.. సిద్ధరామయ్య రేపు రాజీనామా చేసే అవకాశం
-
కర్ణాటకలో ఇక పవర్ షిఫ్ట్!
కర్ణాటక అధికార కాంగ్రెస్‌లో నెలలుగా ఉత్కంఠ రేపుతున్న అధికారం పోరు చివరికి క్లైమాక్స్‌కు చేరినట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి పదవిపై సాగిన సిద్ధరామయ్య-డీకే శివకుమార్ మధ్య అంతర్గత పోరుకు కాంగ్రెస్ హైకమాండ్ ఫుల్స్టాప్ పెట్టిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో.. పార్టీ కేంద్ర నాయకత్వం ఏకగ్రీవంగా డీకే శివకుమార్ పేరుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.ప్రస్తుతం సీఎంగా ఉన్న సిద్ధరామయ్య రాజీనామాకు సిద్ధమవుతున్నారని, ఆయనకు రాజ్యసభ సీటుతో పాటు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తన అనుచరులతో చర్చించిన ఆయన… “హైకమాండ్ నిర్ణయానికే కట్టుబడి ఉంటా” అని చెప్పినట్లు సమాచారం. కుదిరితే ఇవాళే లేదంటే గురువారం ఆయన రాజీనామా చేసే అవకాశాలపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడతారని తెలుస్తోంది. మరోవైపు.. డీకే శివకుమార్ అనుచరుల్లో ఆనందం ఆయన నాయకత్వంలోనే ఈ రెండేళ్లు ప్రభుత్వం నడవబోతుందా? అనే సంకేతాలిస్తోంది. ఇంతకు ముందు 2023 ఎన్నికల తర్వాతే “రెండున్నరేళ్ల తర్వాత సీఎం పదవి” హామీ ఇచ్చారని డీకే వర్గం ఎప్పటినుంచో చెబుతూ వస్తోంది. ఇప్పుడు ఆ హామీ అమలు దశకు చేరిందని వారు భావిస్తున్నారు.ఢిల్లీలో మంగళవారం జరిగిన ఆరు గంటల మారథాన్ సమావేశం తర్వాత కాంగ్రెస్ నాయకత్వం ఈ పంచాయితీని ఓ కొలిక్కి తెచ్చినట్లు స్పష్టమవుతోంది. అధికారికంగా మాత్రం రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికల గురించే చర్చించామని పార్టీ చెప్పినా, లోపల మాత్రం “పవర్ ట్రాన్స్ఫర్” ఫార్ములా ఫైనల్ అయినట్లు జాతీయ మీడియా చానెళ్లు కథనాలు ఇస్తున్నాయి. ఇక.. సిద్ధరామయ్య అనుచరుల్లో అసంతృప్తి ఇంకా కొనసాగుతోంది. “ఇంత ఈజీగా పదవి వదలొద్దు” అని కొందరు నేతలు ఆయనపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. దీంతో చివరి నిమిషంలో ఏదైనా ట్విస్ట్ ఉంటుందా? అనే ఆసక్తి కూడా రాజకీయ వర్గాల్లో కనిపిస్తోంది.సిద్ధరామయ్య వర్గాన్ని సమతుల్యం చేసేందుకు కొత్త ప్రభుత్వంలో పలువురు డిప్యూటీ సీఎంలను నియమించే అవకాశమున్నట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్ అంతర్గత అసంతృప్తిని తగ్గించే ప్రయత్నం జరుగుతోంది. అహిందా((A – Alpasankhyataru (మైనార్టీలు), HI – Hindulida Vargagalu, వెనుకబడిన వర్గాలు / OBCలు), DA – Dalitaru (దళితులు)) వర్గాల మద్దతు కోల్పోతామనే భయంతో ఇప్పటివరకు మార్పును వాయిదా వేసిన కాంగ్రెస్… తమిళనాడు ఎన్నికలు పూర్తయ్యాక ఇప్పుడు ధైర్యంగా నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి… కర్ణాటక కాంగ్రెస్‌లో “సిద్ధరామయ్య యుగం ముగిసి… డీకే శకం ప్రారంభమవుతుందా?” అనే చర్చ అటు కర్ణాటకతో పాటు ఇటు దేశవ్యాప్త రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.జరిగింది ఇదే..2023లో జరిగిన “రొటేషనల్ సీఎం” హామీని అమలు చేయాల్సిన సమయం వచ్చిందని డీకే వర్గం హైకమాండ్‌పై తీవ్ర ఒత్తిడిఢిల్లీకి చేరుకుని మంతనాలు జరిపిన డీకే శివకుమార్సిద్ధరామయ్యకు ఢిల్లీ నుంచి ఆకస్మిక పిలుపుఇద్దరితో భేటీ అయిన ఏఐసీసీ అగ్రనేతలురాహుల్ గాంధీ ప్రత్యేకంగా సిద్ధరామయ్యతో భేటీ రాష్ట్ర రాజకీయాల్ని వదిలి.. పెద్దన్న పాత్ర పోషించాలని సిద్ధూని కోరిన రాహుల్“కర్ణాటకను దాటి జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టాలి” అని సిద్దూకి సూచించిన రాహుల్ రాజ్యసభ సీటుతో పాటు ఢిల్లీలో జాతీయ స్థాయి బాధ్యతలు ఆఫర్ డీకే శివకుమార్ సీఎం పదవికి కాంగ్రెస్ హైకమాండ్ ఏకగ్రీవంగా గ్రీన్సిగ్నల్సిద్ధరామయ్య వర్గాన్ని సంతృప్తిపర్చేందుకు కొత్త కేబినెట్లో ఆయన అనుచరులకు కీలక పదవులుఅసంతృప్తిని తగ్గించేందుకు ‘డిప్యూటీ సీఎంల ఫార్ములా’ను కూడా పరిశీలన సిద్ధరామయ్య కుమారుడు యతింద్రకు కీలక కేబినెట్ లేదంటే పార్టీ బాధ్యతలపై చర్చ 2028 కర్ణాటక అసెంబ్లీ, 2029 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడే మార్పు అవసరమని భావిస్తున్న కాంగ్రెస్ అగ్రనేతలుఅహిందా ఓటుబ్యాంక్ దూరం కాకుండా… సిద్ధరామయ్యకు “గౌరవప్రదమైన ఎగ్జిట్” ఇవ్వాలనే ఆలోచనకేబినెట్ రీషఫుల్‌తో పాటు ప్రాంతీయ, కుల సమీకరణాలను బ్యాలెన్స్ చేసేలా కొత్త టీమ్కొసమెరుపు.. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాత్రం “కర్ణాటక నాయకత్వ మార్పుపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఈరోజు సమావేశంలో రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికల గురించే చర్చించాం” అంటూ ఇద్దరి సమక్షంలో అధికారిక ప్రకటన చేయడం. -
రేపు సిద్ధరామయ్య రాజీనామా!
న్యూఢిల్లీ/బెంగళూరు: కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పునకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ మధ్య ఇన్నాళ్లూ సాగిన కోల్డ్‌వార్‌కు కాంగ్రెస్ అధిష్టానం తెరదించబోతున్నట్లు సమాచారం. అధిష్టానం ఆదేశాల మేరకు సిద్ధరామయ్య గురువారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన బుధవారం బెంగళూరులో మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు. రాజీనామాకు కారణాలు, రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కర్ణాటక కాంగ్రెస్ నాయకత్వం, పార్టీ అధిష్టానం మధ్య ఢిల్లీలో కొన్నిరోజులుగా చర్చోపచర్చలు సాగుతున్నాయి.ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టాలని కాంగ్రెస్ పెద్దలు సూచించగా, సిద్ధరామయ్య అందుకు నిరాకరించినట్లు తొలుత వార్తలు వచ్చాయి. రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పిస్తామని, 2029 లోక్‌సభ ఎన్నికల ముందు సంస్థాగతంగా పార్టీలో కీలక పాత్ర పోషించాలని కోరగా ఆయన మెత్తబడినట్లు సమాచారం. వచ్చే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సామాజిక న్యాయం, కులాల సమైక్యత వ్యూహానికి పదును పెడుతున్నారు. బడుగు బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు.జాతీయ స్థాయిలో ఓబీసీ కీలక నాయకుల్లో ఒకరిగా సిద్ధరామయ్య ఎదగాలని కాంగ్రెస్ నాయకత్వం కోరుకుంటున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జాతీయ రాజకీయాల్లో తమ పార్టీ తరపున ఓబీసీల ప్రాతినిధ్యాన్ని పెంచాలని కాంగ్రెస్ యోచిస్తోంది. సీఎం పదవి నుంచి పక్కన పెట్టడాన్ని సిద్ధ రామయ్య పరపతి, ప్రాధాన్యతను తగ్గించే చర్యగా చూడొద్దని, ఆయనకు మరింత ఉన్నత స్థాయి అవకాశాలు కల్పిస్తున్నామని పార్టీ పెద్దలు పేర్కొంటున్నారు. రాజకీయ భవిష్యత్తుపై అధిష్టానం హామీ జాతీయ స్థాయిలో ఓబీసీ కులాల సమీకరణ ప్రయత్నాలను బలోపేతం చేయడానికి ఢిల్లీలో పార్టీకి సిద్ధరామయ్య అవసరం ఉందని, అలాగే కాంగ్రెస్ దీర్ఘకాలిక ఎన్నికల వ్యూహంలో ఆయన రాజకీయ పలుకుబడి కీలక పాత్ర పోషిస్తుందని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. అలాగే రాజకీయ భవిష్యత్తుపై సిద్ధరామయ్యకు పార్టీ అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ వచ్చినట్లు ప్రచారం సాగుతోంది. సిద్ధరామయ్య, డీ.కే.శివకుమార్ మంగళవారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, కర్ణాటక కాంగ్రెస్ ఇంఛార్జ్ రణదీప్ సూర్జేవాలాతో సమావేశమయ్యారు. వారిద్దరూ తమ అనుకూల ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు.ఈ భేటీలో సీఎం మార్పుపై కీలక చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కానీ, కాంగ్రెస్ నాయకులు మాత్రం రాజ్యసభ ఎన్నికలు, కర్ణాటక శాసన మండలి ఎన్నికలు, అభ్యర్థుల ఎంపికపైనే చర్చ జరిగినట్లు పైకి చెబుతున్నారు. రాజీనామాకు సిద్ధ రామయ్యను ఎట్టకేలకు ఒప్పించినట్లు తెలిసింది. కానీ, మీడియాలో వస్తున్న వార్తలు కేవలం ఊహాగానాలేనని, వాటిలో ఏమాత్రం వాస్తవం లేదని కే.సీ.వేణుగోపాల్ అన్నారు. భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజ్యసభ సీట్లు, మండలి సీట్ల గురించి చర్చించామని తెలిపారు.ఈ సందర్భంగా ఆయన పక్కన సిద్ధరామయ్య, డీ.కే.శివకుమార్ కూడా ఉన్నారు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్ వంటి రాష్ట్రాల్లో రాజ్యసభ అభ్యర్థులతోపాటు కర్ణాటక రాజ్యసభ, మండలి స్థానాల అభ్యర్థులను త్వరలో ప్రకటిస్తామని వేణుగోపాల్ చెప్పారు. సీఎం మార్పు నిజమేనా? అని ప్రశి్నంచగా, అది ఊహాగానమేనని సిద్ధరామయ్య బదులిచ్చారు. అలాంటి చర్చ ఏదీ జరగలేదన్నారు. త్వరలో రాజ్యసభకు సిద్ధరామయ్య కర్ణాటకలో 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచి్చంది. అప్పట్లో సీఎం పోస్టు కోసం సిద్ధరామయ్య, డి.కె.శివకుమార్ తీవ్రంగా పోటీపడ్డారు. అధిష్టానం సిద్ధరామయ్యను ఎంపిక చేసింది. శివకుమార్ ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రెండేళ్ల తర్వాత సీఎంగా అవకాశం కల్పిస్తామని అప్పట్లో శివకుమార్‌కు అధిష్టానం హామీ ఇచి్చనట్లుగా ఆయన అనుచరులు చెప్పుకున్నారు. అయితే, దీనిపై అధిష్టానం ఏనాడూ బహిరంగంగా స్పందించలేదు. సీఎం మార్పు జరిగితే కొత్త సీఎంగా శివకుమార్‌కు ఎంపిక చేయడం తథ్యమని కర్ణాటక రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని శివకుమార్ వైపు అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు. శివకుమార్‌కు సీఎం పదవి కట్టబెట్టాలన్న ఆలోచనను సిద్ధరామయ్య తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నాయకత్వ సమస్యపై సిద్ధరామయ్య గానీ, శివకుమార్ గానీ బహిరంగంగా వ్యాఖ్యానించలేదు. కర్ణాటక సీఎంను మార్చే అంశంపై కాంగ్రెస్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కర్ణాటకలో ఇటీవల 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. వాటికి జూన్ 18న ఎన్నికలు జరుగనున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాలు గెల్చుకోనుంది. వాటిలో ఒక స్థానాన్ని సిద్ధరామయ్యతో భర్తీ చేస్తారని అంటున్నారు. -
ఢిల్లీకి చేరుకున్న సిద్దరామయ్య, DK శివప్రసాద్
-
కర్ణాటక పవర్ గేమ్‌లో వైల్డ్ కార్డ్ ట్విస్ట్!
సాక్షి, ఢిల్లీ: కర్ణాటక రాజకీయాలు మరోసారి ఢిల్లీ కేంద్రంగా వేడెక్కాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లు కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకు ఢిల్లీ చేరుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. సీఎం మార్పు ఊహాగానాల నడుమ.. ఇవాళ జరగనున్న కీలక సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో రాహుల్ గాంధీ సహా పార్టీ అగ్రనేతలు పాల్గొననున్నారు.ఈ భేటీ ప్రధానంగా కర్ణాటక ప్రభుత్వ భవిష్యత్ దిశ, పరిపాలనా మార్పులు.. 2028 అసెంబ్లీ ఎన్నికలకు ముందు “పాలిటికల్ రీసెట్”పై కేంద్రంగా సాగనుందని సమాచారం. ప్రభుత్వం పనితీరు మెరుగుపరచడం, మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించడం వంటి అంశాలు కూడా చర్చలో ఉండే అవకాశం కనిపిస్తోంది. పార్టీ వర్గాల ప్రకారం ప్రస్తుతం మూడు ఆప్షన్లు హైకమాండ్ పరిశీలనలో ఉన్నాయి. అందులో మొదటిది.. సీఎం సిద్ధరామయ్యనే సీఎంగా కొనసాగించడం. అంటే నాయకత్వ మార్పు లేకుండా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేయడం ఆప్షన్‌గా ఉంది. ఇందులో పనితీరు తక్కువగా ఉన్న మంత్రులను తొలగించి, సామాజిక సమతుల్యత (అహిందా ఫార్ములా.. మైనారిటీలు+వెనుకబడిన వర్గాలు+దళితులు) ఆధారంగా కొత్త సమీకరణాలు తీసుకురావాలనే ఆలోచన ఉందని తెలుస్తోంది.రెండో ఆప్షన్‌గా.. నాయకత్వ మార్పు. డీకే శివకుమార్‌ను ముఖ్యమంత్రి బాధ్యతల్లోకి తీసుకురావడం. అదే సమయంలో సీనియర్ నేత హోదాలో సిద్ధరామయ్యను రాజ్యసభకు పంపించడం. అయితే ఇది అత్యంత సున్నితమైన రాజకీయ నిర్ణయంగా భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.మూడో ఆప్షన్.. దీనికి అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ ఇదే జరిగితే.. నిజంగా కర్ణాటక రాజకీయాలకు పెద్ద సర్ప్రైజే. అదే మల్లికార్జున ఖర్గేను కర్ణాటక రాజకీయాల్లో కీలక పాత్రలో తీసుకురావడం. అంటే ప్రస్తుతం జాతీయాధ్యక్షుడిగా ఉన్న ఖర్గేను.. “వైల్డ్ కార్డ్” ఎంట్రీ ద్వారా రాష్ట్ర రాజకీయాల్లోకి తెచ్చి సీఎంను చేయడం. ఇది జరిగితే రాష్ట్రంతో పాటు జాతీయ కాంగ్రెస్ రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇరు వర్గాలను చల్లబర్చే ఈ ఆప్షన్ కూడా హైకమాండ్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. పై మూడు ఆప్షన్లలో ఏది అమలు చేసినా.. అది కర్ణాటక రాజకీయాల వరకు సంచలనమే కానుంది.పార్టీ లోపల వర్గపోరు, నాయకత్వ ఆశలు, సామాజిక సమీకరణాలు.. వెరసి ఢిల్లీలో ఇవాళ్టి కర్ణాటక కాంగ్రెస్ నేతల కీలక భేటీని అత్యంత కీలకంగా మార్చాయి. మరోవైపు.. రాజ్యసభ, శాసనమండలి ఎన్నికలు కూడా దగ్గరలో ఉండటంతో, టికెట్ల పంపకం గురించీ చర్చించవచ్చని తెలుస్తోంది. మొత్తానికి ఈ చర్చలు కర్ణాటకలో కేవలం పాలన మార్పుల గురించి కాకుండా.. కాంగ్రెస్ భవిష్యత్ రాజకీయ వ్యూహాన్ని నిర్ణయించే స్థాయిలో ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. -
మళ్లీ సీఎం కుర్చీ రచ్చ
కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఢిల్లీకి వెళ్లడం, అదే సమయంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఆకస్మిక పిలుపు రావడం.. భారీ ఊహాగానాలకు దారి తీసింది. ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో కీలక చర్చలు జరిగే అవకాశం ఉండటంతో సీఎం మార్పు అంశం మళ్లీ కేంద్ర బిందువుగా మారింది.“కర్ణాటకలో నాయకత్వ మార్పు జరుగుతుందా?” అనే ప్రశ్న మరోసారి రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ముఖ్యంగా 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత పవర్‌షేరింగ్ ఫార్ములాతో ఈ ఇద్దరు కీలక నేతల మధ్య రాజీ కుదిరిందనే ప్రచారం గురించి తెలిసిందే. దానిని కచ్చితంగా అమలు చేయాల్సిందేనని డీకే వర్గం, సీనియర్ నేత నాయకత్వంలోనే ఐదేళ్లు ప్రభుత్వం పూర్తి చేసుకోవాల్సిందేనని సిద్దూ వర్గం అధిష్టానంపై ఒత్తిళ్లు దిగాయి. ఈ తరుణంలో ఇవాళ్టి భేటీలో ఏం జరగనుందా? అనే ఉత్కంఠ నెలకొంది.సిద్ధరామయ్య వైఖరి ఏమిటి?ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వర్గం ప్రస్తుతం “ప్రభుత్వ స్థిరత్వమే ప్రధాన లక్ష్యం” అనే వైఖరిని బలంగా వినిపిస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ ఉంది. ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీ పథకాలు, ప్రజాపాలన కార్యక్రమాలు కొనసాగాలంటే నాయకత్వ మార్పు అవసరం లేదని ఆయన వర్గం హైకమాండ్‌కు వివరించనున్నట్టు సమాచారం. “ప్రభుత్వాన్ని మధ్యలో మార్చడం వల్ల పాలనా స్థిరత్వం దెబ్బతింటుంది” అన్నది సిద్ధరామయ్య వర్గం ప్రధాన వాదనగా చెబుతున్నారు.డీకే శివకుమార్ వాదన ఏమిటి?మరోవైపు డీకే శివకుమార్ వర్గం మాత్రం “పార్టీకి ఇచ్చిన రాజకీయ హామీల అమలు” అంశాన్ని ముందుకు తెస్తోందని సమాచారం. 2023లో జరిగిన అనధికారిక ఒప్పందాల ప్రకారం నాయకత్వ మార్పుపై స్పష్టత ఇవ్వాల్సిన సమయం వచ్చిందని డీకే వర్గం భావిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంలో తన పాత్ర కీలకమని, అందుకే భవిష్యత్ నాయకత్వ బాధ్యతపై చర్చ జరగాలని ఆయన వర్గం అభిప్రాయపడుతున్నట్టు చెబుతున్నారు.ఢిల్లీ కేంద్రంగా నిర్ణయం?ఇప్పుడు మొత్తం వ్యవహారం ఢిల్లీ హైకమాండ్ చేతిలోకి వెళ్లింది. ఖర్గే, రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో సిద్ధరామయ్య–డీకే మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను సమతుల్యం చేసే ప్రయత్నం జరుగుతుందని తెలుస్తోంది. అయితే తక్షణ సీఎం మార్పు కన్నా, “పార్టీ అంతర్గత సమతుల్యత, భవిష్యత్ రోడ్‌మ్యాప్”పై నిర్ణయం వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.ప్రస్తుతం ఇది అధికారిక సంక్షోభం కంటే “పవర్ షేరింగ్ చర్చల పొడిగింపు”గానే కనిపిస్తోంది. కానీ ఢిల్లీ భేటీల తర్వాత తీసుకునే నిర్ణయం కర్ణాటక రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చే అవకాశం లేకపోలేదని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
కేఎల్ రాహుల్ మాజీ సహచరుడి ఆకస్మిక మరణం
భారత క్రికెట్లో పెను విషాదం చోటు చేసుకుంది. టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మాజీ సహచరుడు (కర్ణాటక) ఎస్ఎల్ అక్షయ్ గుండెపోటుతో కన్నుమూశాడు. 39 ఏళ్ల అక్షయ్ బెంగళూరులో స్థానిక డివిజన్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఛాతినొప్పితో కుప్పకూలగా.. ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు.ఈ విషాద ఘటన మే 24న బెంగళూరులోని కేఆర్‌పురం ప్రాంతంలో జరిగింది. మూడో డివిజన్ క్రికెట్ మ్యాచ్‌లో పాల్గొంటున్న అక్షయ్‌కు మధ్యాహ్నం సమయంలో తీవ్ర అస్వస్థత కలిగింది. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా.. మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఆస్పత్రి వైద్యులు అక్షయ్ మరణించినట్లు నిర్ధారించారు.అక్షయ్ మృతిపై కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అక్షయ్ కర్ణాటక తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో విశిష్ట సేవలు అందించాడు. ఆటగాడిగా మాత్రమే కాదు.. యువ క్రికెటర్లకు కోచ్‌గా కూడా వ్యవహరించాడు. అతడి సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి అని KSCA తమ ప్రకటనలో పేర్కొంది.1987 ఏప్రిల్ 30న జన్మించిన అక్షయ్ 2011-12 సీజన్లో రంజీ అరంగేట్రం చేశాడు. ఆ సమయంలోనే కేఎల్ రాహుల్, రాబిన్ ఉతప్ప, వినయ్ కుమార్ వంటి ప్రముఖులతో కలిసి కర్ణాటక జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. కుడిచేతి ఫాస్ట్‌బౌలర్‌గా గుర్తింపు పొందిన అక్షయ్.. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 10 ఇన్నింగ్స్‌ల్లో 18 వికెట్లు తీశాడు. లిస్ట్-ఏ క్రికెట్లో 6 వికెట్లు, టీ20ల్లో 8 వికెట్లు సాధించాడు.దీర్ఘకాలం ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో కొనసాగలేకపోయిన అక్షయ్.. రెండు, మూడు డివిజన్ లీగ్‌ల్లో ఆడుతూ కెరీర్‌ను కొనసాగించాడు. చివరివరకు ఆటను వదలకుండా స్థానిక క్రికెట్లో కొనసాగుతుండగానే ఈ విషాదం చోటు చేసుకుంది.ఇటీవలికాలంలో యువ క్రీడాకారులు గుండెపోటులతో మరణించడం ఆందోళన కలిగిస్తోంది. ఫిబ్రవరిలో మహారాష్ట్రకు చెందిన 40 ఏళ్ల క్రికెటర్ ప్రవీణ్ బాబన్ పవార్ కూడా మ్యాచ్ ఆడుతుండగానే గుండెపోటుతో మరణించాడు. అలాగే బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ కూడా 2025లో ఢాకా ప్రీమియర్ లీగ్ మ్యాచ్ సందర్భంగా గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే.అక్షయ్ మృతి వార్తతో కర్ణాటక క్రికెట్ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మాజీ సహచరులు, అభిమానులు సోషల్‌మీడియా ద్వారా సంతాపం తెలుపుతున్నారు. -
నత్తల వేట కోసం వెళ్లి గల్లంతు.. 8మంది మృతి
బెంగళూరు: కర్ణాటకలో విషాదం చోటుచేసుకుంది. ఉత్తర కన్నడ జిల్లాలో నత్తల వేట కోసం వెళ్లిన పడవ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 8 మంది మృతిచెందారు. మృతిచెందిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో మెుత్తం 11 మంది గల్లంతు కాగా మిగతా వారి కోసం ఆచూకీ కోసం గాలింపులు చేపడుతున్నారు.మృతులందరూ భట్కల తాలూకా సిరాలి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఉత్తర కన్నడ జిల్లా భట్కల సమీపంలో ఉన్న బెంకెట్టిపురనదిలో వేటకు నత్తల వేట కోసం వీరంతా నదిలో దిగారు గుల్లలు ఏరుతుండగా ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగడంతో నదిలో గల్లంతయ్యారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న సహాయక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టి 8 మంది మృతదేహాలను బయిటకి తీశారు.మృతులలో ఏడుగురు మహిళలున్నారు. అయితే మిగతా వారి కోసం గాలింపులు చేపడుతున్నారు. ఈ ఘటనపై సీఎం సిద్ధరామయ్య ఎక్స్ వేదికగా స్పందించారు. ఇది అత్యంత విషాదకరమైన, బాధకరమైన ఘటన అని పేర్కొన్నారు. మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు పేర్కొన్నారు. -
పోలీస్ క్వార్టర్స్‌లో కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య.. ఏం జరిగింది?
బెంగళూరు: కర్ణాటకలో ఓ పోలీసు కానిస్టేబుల్ భార్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అయితే, ఆమె మృతికి ముందు తన చెల్లికి ఫోన్ పాస్వర్డ్ పంపించడం గమనార్హం. ఆ తర్వాత కాసేపటికే ఆమె ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా, భర్త, అత్తమామలు కలిసి ఆమెను అదనపు కట్నం కోసం శారీరకంగా, మానసికంగా వేధించడం వల్లే ఆత్మహత్య చేసుకున్నట్టు మృతురాలి పేరెంట్స్ ఆరోపిస్తున్నారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరుకు చెందిన లక్ష్మీ ప్రియ (26)కు మైసూర్ నివాసి అయిన రాజేష్ ఆరాధ్యతో మే 11, 2023న వివాహం జరిగింది. రాజేష్ బెంగళూరులోని హెచ్ఏఎల్ (HAL) పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. బెంగళూరులోని కేఆర్‌పుర ఏరియాలోని పోలీస్ క్వార్టర్స్‌లో వీరు నివాసం ఉంటున్నారు. కాగా, పెళ్లయిన కొద్ది రోజుల నుండే భర్త రాజేష్, మామ పాలక్షారాధ్య, అత్త భాగ్యమ్మ కలిసి అదనపు కట్నం కోసం లక్ష్మీ ప్రియను వేధించడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఎనిమిది నెలల క్రితం లక్ష్మీ ప్రియ ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. కాన్పు కోసం పుట్టింటికి వెళ్లిన ఆమె, దాదాపు ఆరు నెలల పాటు అక్కడే ఉండి, ఇటీవలే తిరిగి బెంగళూరులోని పోలీస్ క్వార్టర్స్‌కు వచ్చింది.ఇంతలో.. మే 22, 2026 మధ్యాహ్నం సుమారు 2:30 గంటల సమయంలో లక్ష్మీ ప్రియ తన చెల్లెలు జయశ్రీకి వాట్సాప్‌లో ఒక మెసేజ్ పంపింది. అందులో తన మొబైల్ ఫోన్ 'పాస్వర్డ్'ను షేర్ చేసింది. సాధారణంగా కాకుండా అకస్మాత్తుగా ఫోన్ పాస్వర్డ్ పంపడంతో చెల్లెలికి అనుమానం వచ్చి, వెంటనే అక్కకు ఫోన్ చేసింది. కానీ లక్ష్మీ ప్రియ ఎంతకీ ఫోన్ ఎత్తలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే లక్ష్మీ ప్రియ భర్త రాజేష్‌కు ఫోన్ చేసి విషయం చెప్పారు. ఆ తర్వాత కాసేపటికే లక్ష్మీ ప్రియ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని రాజేష్ వారికి సమాచారం అందించాడు.అయితే, చనిపోయే ముందు ఫోన్ పాస్వర్డ్ చెల్లికి పంపడం, అప్పటికే ఇంట్లో వేధింపులు జరుగుతుండటంతో.. ఇది ఆత్మహత్య కాదని, లక్ష్మీ ప్రియ మృతి వెనుక భర్త, అత్తమామల హస్తం ఉందంటూ పుట్టింటి వారు గట్టిగా నమ్ముతున్నారు. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేఆర్ పుర పోలీసులు కానిస్టేబుల్ రాజేష్, అతని తల్లిదండ్రులపై కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీస్ క్వార్టర్స్‌లోనే కానిస్టేబుల్ భార్య ఇలా అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోవడం చర్చనీయాంశంగా మారింది. -
విజయ్ మాస్టర్ ప్లాన్.. కర్ణాటకలో టీవీకే ఎంట్రీ?
తమిళనాడు సీఎం, టీవీకే అధినేత విజయ్ పేరు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో మార్మోగుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం, ప్రభుత్వం ఏర్పాటు చేయడం చకచకా జరిగిపోయాయి. ఎన్నికల్లో భారీ విజయంతో టీవీకే విజయ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కర్ణాటక రాజకీయాల్లోకి టీవీకే ఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలు బయటకు వచ్చాయి. బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీకి విజయ్ నేతృత్వంలోని టీవీకే సిద్ధమవుతోందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కర్ణాటక రాజకీయాల్లో టీవీకే గేమ్ ప్లాన్ ఏంటంటే..తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్.. పార్టీ విస్తరణపై ఫోకస్ పెట్టినట్టు సమాచారం. తమిళనాడుకు బయట కూడా పార్టీ విస్తరణపై విజయ్ ఫోకస్ చేశారని రాజకీయ వర్గాల చర్చ నడుస్తోంది. దక్షిణాదిలో ప్రాంతీయ రాజకీయ సమీకరణాలపై టీవీకే ఆలోచన చేస్తోందని తెలుస్తోంది. ఇందులో భాగంగానే కర్ణాటకలో బరిలోకి దిగాలనే టీవీకే ప్లాన్ చేస్తోంది. బెంగళూరు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా కొత్త రాజకీయ అవకాశాలను పరీక్షించుకునేందుకు సిద్దమైనట్టు వార్తలు బయటకు వచ్చాయి. బెంగళూరులో 50 వార్డుల్లో పోటీ చేసి తన బలం పరీక్షించుకోవాలని యోచిస్తోంది. ఇక, ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే విజయ్ స్వయంగా బెంగళూరులో ప్రచారం చేసే అవకాశం ఉంది. ఇది పార్టీకి పెద్ద మద్దతు తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థానిక స్థాయిలో విజయాలు సాధిస్తే కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీవీకే అడుగుపెట్టే అవకాశం ఉంది.TVK might contest Bengaluru Local Polls in Karnataka as per Asianet. pic.twitter.com/RSYX5fSRYw— News Algebra (@NewsAlgebraIND) May 23, 2026కర్ణాటకలో టీవీకేకు అవకాశాలు..1. బలంతమిళ ఓటర్ల ఆధారం: బెంగళూరులో సుమారు 15–20 లక్షల తమిళ మాట్లాడే ప్రజలు ఉన్నారని అంచనా. వీరిని లక్ష్యంగా చేసుకోవడం టీవీకే ప్రధాన వ్యూహం.విజయ్ అభిమాన సంఘాలు: బెంగళూరులో విజయ్‌కు పెద్ద అభిమాన వర్గం ఉంది. అభిమాన సంఘాలు ఇప్పటికే సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పనిచేస్తున్నాయి. వీరిని అభ్యర్థులుగా నిలబెట్టడం ద్వారా టీవీకేకు బలమైన గ్రాస్‌రూట్ నెట్వర్క్ లభిస్తుంది.2. సవాళ్లుస్థానిక సమస్యలు: బెంగళూరులో నీటి సమస్య, ట్రాఫిక్, మౌలిక సదుపాయాలు వంటి స్థానిక అంశాలపై స్పష్టమైన అజెండా లేకపోతే టీవీకేకు పెద్ద పార్టీలతో పోటీ కష్టమవుతుంది.ప్రతిష్టాత్మక పార్టీలు: కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ పార్టీలు ఇప్పటికే బలమైన స్థావరాన్ని కలిగి ఉన్నాయి. టీవీకేకు మొదటి దశలో వార్డుల స్థాయిలో మాత్రమే ప్రభావం చూపే అవకాశం ఉంది.ప్రాంతీయ గుర్తింపు: టీవీకే తమిళనాడు ఆధారిత పార్టీ కావడంతో, కర్ణాటకలో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందే అవకాశం లేదు.టీవీకే బలం..ప్రాంతాలు: శివాజి నగర్, హలసూరు, వివేక్ నగర్, ఈజిపుర, మడివాల, శాంతినగర్ వంటి వార్డుల్లో తమిళ ఓటర్ల ప్రభావం ఎక్కువ.ఓటు బ్యాంక్: ఈ ఓటర్లు సాధారణంగా కాంగ్రెస్ లేదా జేడీఎస్ వైపు మొగ్గు చూపుతారు. టీవీకే ప్రవేశం వల్ల ఈ ఓటు బ్యాంక్ విభజించే అవకాశం ఉంది.ప్రాంతీయ విస్తరణ: తమిళనాడు, పుదుచ్చేరి తర్వాత, కర్ణాటకలో కూడా తన ప్రభావాన్ని విస్తరించడం.అయితే, ఇప్పటివరకు కర్ణాటక రాజకీయాల్లో ప్రత్యక్ష ఎంట్రీపై టీవీకే అధికారిక ప్రకటన చేయలేదు. ఒకవేళ కర్ణాటకలో టీవీకే.. తమిళ ఓటర్ల ఆధారం మరియు విజయ్ ప్రజాదరణను బలంగా ఉపయోగించుకుంటే, స్థానిక ఎన్నికల్లో గెలుపు అవకాశాలు ఉన్నాయి. కానీ, స్థానిక సమస్యలపై స్పష్టమైన అజెండా లేకపోతే, పెద్ద పార్టీలతో పోటీ చేయడం కష్టతరం అవుతుంది. ఈ నేపథ్యంలో టీవీకే పోటీ చేస్తుందా? ఒకవేళ బరిలో నిలిస్తే ఫలితాలు ఎలా ఉంటాయో కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. -
ఆమె వచ్చింది.. పెళ్లి చేస్తాం.. ఇక కిందకి దిగు!
కర్ణాటక: పాగల్ ప్రేమికుని వ్యవహారం తీవ్ర రచ్చకు కారణమైంది. ప్రియురాలు పెళ్లికి నిరాకరించడంతో ప్రియుడు విద్యుత్ హైటెన్షన్ టవర్ ఎక్కి నానా రభస సృష్టించాడు. ఈ సంఘటన బెంగళూరు శివార్లలో ఆనేకల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానిక చిన్నయ్యనపాళ్యకు చెందిన సోమశేఖర్ అనే యువకుడు విద్యుత్ హైటెన్షన్ టవర్ ఎక్కారు. మూడేళ్ల నుంచి ఓ యువతిని ప్రేమిస్తున్నానని, ఆమె ఇప్పుడు ప్రేమ, పెళ్లికి తిరస్కరించిందని బాధితుడు తెలిపాడు. జనం అతన్ని కిందకు దిగమని కేకలు వేసినా దిగేది లేదని చెప్పాడు. ఇది తెలిసి విద్యుత్ సిబ్బందిని కరెంటును నిలిపివేసి ఆనేకల్ పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. పోలీసులు ఎంతగా అతన్ని కోరినా.. ప్రియురాలు ఇక్కడికి వచ్చేవరకు దిగేది లేదని సోమశేఖర్ గట్టిగా కేకలు వేశాడు.యువతిని రప్పించిదీంతో పోలీసులు సదరు యువతిని తాళి, పసుపు కుంకుమ తీసుకుని రావాలని చెప్పగా ఆమె, తల్లిదండ్రులతో కలిసి వచ్చింది. నీ ప్రియురాలు వచ్చిందని, ఆమెతో వివాహం బాధ్యత తమదే అని, నిన్ను ఎవరూ ఏమి చేయరు, కిందికి వచ్చేయాలని మైకులో పోలీసులు ప్రకటించారు. అయితే అతనికి టవర్‌ను ఎక్కినంత సులువుగా దిగడానికి రాలేదు. తాడు కట్టి కిందకు దిగడానికి సహాయం చేశారు. చివరకు క్షేమంగా దిగడంతో కథ సుఖాంతమైంది. సోమశేఖర్ అంతకుముందే ఇంటి పైకెక్కి షీట్లు పగలగొట్టి హంగామా చేశాడని స్థానికులు తెలిపారు. పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. -
ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం
బెంగళూరు: ఎయిరిండియా విమానానికి ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో రన్‌వేను విమాన చివరి భాగం(తోక) తగలడంతో ఒక్కసారిగా కలవరం మొదలంది. ఢిల్లీ నుంచి నుంచి బెంగళూరుకు వచ్చిన ఎయిర్ ఇండియా విమానం ల్యాండ్ అవుతుండగా ఇది చోటు చేసుకుంది. ఆ సమయంలో విమానంలో 181 ప్రయాణికులు ఉన్నారు. ఎయిర్ ఇండియా విమానం AI2651లో ఇది చోటు చేసుకుంది. ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానం ల్యాండింగ్ తర్వాత క్షుణ్ణంగా పరిశీలించారు. ల్యాండింగ్ కోసం సమీపిస్తున్నప్పుడు విమానం తీవ్రమైన కుదుపులకు గురైంది. ఈ అస్థిరమైన ల్యాండింగ్ ప్రయత్నం తరువాత పైలట్ గో-అరౌండ్ (ల్యాండింగ్ ప్రయత్నాన్ని రద్దు చేసి మళ్లీ గాల్లోకి ఎగిరి, మరోసారి ల్యాండింగ్ ప్రయత్నం చేయడం) చేయాలని నిర్ణయించుకున్నారు. ఇది చేస్తున్నప్పుడు విమాన చివరి భాగం నేలను తాకింది. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని, ప్రయాణీకులు, సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నారని ఎయిర్ ఇండియా ప్రతినిధి పీటీఐకి తెలిపారు. -
స్వా‘భీమా’నం కర్ణాటకకు తాకట్టు
సాక్షి, అమరావతి: ఇప్పటికే ఆల్మట్టి ఎత్తు పెంపు, అప్పర్‌భద్రతో జల దోపిడీకి పాల్పడుతున్న కర్ణాటక.. ఇప్పుడు కృష్ణానదికి మరో ప్రధాన ఉపనది భీమాపై కల్బుర్గి జిల్లా సొంతి వద్ద బ్యారేజ్‌తోపాటు ఎత్తిపోతలను శరవేగంగా పూర్తి చేస్తోంది. భీమా నదిలో 15 టీఎంసీలకు మించి వినియోగించుకోకూడదని కర్ణాటకకు బచావత్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–1) నిర్దేశించినా అంతకంటే ఎక్కువ నీటినే ఆ రాష్ట్రం ఇప్పటికే వినియోగించుకుంటోంది. సొంతి బ్యారేజీ, ఎత్తిపోతల ద్వారా భీమా జలాలను మరింతగా తరలించుకోవడానికి ఇప్పుడు యత్నిస్తోంది. దీనికి సీడబ్ల్యూసీ వంతపాడింది. సొంతి బ్యారేజీ, ఎత్తిపోతలకు అనుమతిస్తూ మార్చి 25న సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం), సాంకేతిక సలహా మండలి(టీఏసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ హక్కులను హరిస్తూ కర్ణాటక చేపట్టిన సొంతి బ్యారేజీ, ఎత్తిపోతలపై చంద్రబాబు సర్కారు మౌనం దాల్చింది. సీడబ్ల్యూసీ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేయలేదు. దీంతో ఏపీ రైతులు మండిపడుతున్నారు. కృష్ణా జలాలపై ఎగువ రాష్ట్రాలకు రాష్ట్ర హక్కులను చంద్రబాబు సర్కారు తాకట్టు పెడుతుందనడానికి సొంతి బ్యారేజీ, ఎత్తిపోతల మరో తార్కాణం అని సాగునీటిరంగ నిపుణులు, రైతు సంఘ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు టీఎంసీల ఎత్తిపోత.. 40 వేల ఎకరాలకు నీళ్లు కృష్ణా బేసిన్(పరీవాహక ప్రాంతం)లో భీమా సబ్ బేసిన్లో 15 టీఎంసీలకు మించి కర్ణాటక వాడుకోకుండా కేడబ్ల్యూడీటీ–1 పరిమితిని నిర్దేశించింది. కానీ భీమా జలాలను భారీ ఎత్తున ఇప్పటికే కర్ణాటక సర్కారు మళ్లిస్తోంది. మరింతగా మళ్లించేందుకు 2015లో సొంతి బ్యారేజీ, ఎత్తిపోతలను కర్ణాటక చేపట్టింది. ఆ రాష్ట్రంలో కల్బుర్గి జిల్లాలో చిట్టాపూర్ తాలుకాలోని తర్వార్పేట్ వద్ద భీమాపై బ్యారేజీ నిర్మించి, అక్కడి నుంచి 4 టీఎంసీలను ఎత్తిపోసి కల్బుర్గి, యాద్గిర్‡ జిల్లాలలో 40 వేల ఎకరాలకు నీళ్లందించేలా సొంతి ఎత్తిపోతలను కర్ణాటక ప్రభుత్వం చేపట్టింది. ఈ బ్యారేజ్, ఎత్తిపోతలకు అనుమతి కోసం సీడబ్ల్యూసీకి డీపీఆర్‌ను సమర్పించింది.. దీనిపై 2015, మే 25న సీడబ్ల్యూసీ టీఏసీ 125వ సమావేశంలో అనుమతి ఇచ్చింది. రాష్ట్ర హక్కులను హరించే ఈ నిర్ణయంపై చంద్రబాబు సర్కార్ అప్పట్లో అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అనుమతిచ్చేసిన సీడబ్ల్యూసీ.. అటవీ అనుమతుల్లో జాప్యం వల్ల సొంతి బ్యారేజీ, ఎత్తిపోతల పనులు గడువులోగా కాంట్రాక్టర్ పూర్తి చేయలేకపోయారు. తాజాగా అటవీ అనుమతులు తెచ్చిన కర్ణాటక సర్కార్.. ఆ ప్రాజెక్టు వ్యయాన్ని రూ.942.39 కోట్లకు సవరిస్తూ సీడబ్ల్యూసీకి డీపీఆర్‌ను సమర్పించింది. ఈ ఏడాది మార్చి 25న సీడబ్ల్యూసీ టీఏసీ 160వ సమావేశంలో సొంతి బ్యారేజీ, ఎత్తిపోతలను అజెండాలో చేర్చి, చర్చించింది.. తాజా సమావేశంలోనూ సొంతి బ్యారేజీ, ఎత్తిపోతలకు సీడబ్ల్యూసీ అనుమతి ఇచ్చేసింది. అంతర్రాష్ట్ర ప్రాజెక్టు అయిన ఈ బ్యారేజీ, ఎత్తిపోతలపై రాష్ట్ర అభిప్రాయం తీసుకోకుండా ఎలా అనుమతిస్తారని సీడబ్ల్యూసీని నిలదీయాల్సిన చంద్రబాబు సర్కార్ తద్భిన్నంగా మౌనవ్రతం పాటిస్తోండటంపై రైతులు మండిపడుతున్నారు. క్షేత్ర స్థాయిలో సొంతి బ్యారేజీ, ఎత్తిపోతల పనులు.. ఆయకట్టును చూస్తే భీమా ప్రవాహాన్ని భారీ ఎత్తున మళ్లించే లక్ష్యంతోనే ఈ ఎత్తిపోతలను కర్ణాటక చేపట్టిందని సాగునీటిరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. శ్రీశైలానికి ఎగువ నుంచి ప్రవాహం వచ్చేదెన్నడు?ఆల్మట్టి డ్యాం ఎత్తును 519.6 నుంచి 524.256 మీటర్లకు పెంచడం ద్వారా మరో 100 టీఎంసీలను డ్యాంలో నిల్వ చేయడంతోపాటు 130 టీఎంసీలను వినియోగించుకునేలా కర్ణాటక సర్కార్ అప్పర్ కృష్ణ ప్రాజెక్టు మూడో దశ పనులను వేగవంతం చేసింది. ఇక తుంగభద్ర సబ్ బేసిన్లో తుంగభద్ర డ్యామ్‌కు ఎగువన 295 టీఎంసీలకు మించి కర్ణాటక వాడుకోవడానికి వీల్లేదని కేడబ్ల్యూడీటీ–1 స్పష్టం చేస్తే.. 1980–81 నాటికే 319.558 టీఎంసీలను కర్ణాటక వినియోగిస్తున్నట్లు కేడబ్ల్యూడీటీ–2 తేల్చింది. ఇక 29.9 టీఎంసీలను తరలించేలా అప్పర్ భద్రను చేపట్టిన కర్ణాటక పనులు వేగవంతం చేసింది. ఇప్పుడు భీమాలోనూ అదే తీరు. కృష్ణా ప్రధాన పాయ, ప్రధాన ఉప నదులు తుంగభద్ర, భీమా ప్రవాహాలను కర్ణాటక ఎక్కడికక్కడ కట్టడి చేస్తే శ్రీశైలానికి ఎగువ నుంచి వరద చేరేదెన్నడని సాగునీటిరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు ఉత్పన్నమైతే ఎగువ నుంచి నీటి చుక్క కూడా శ్రీశైలానికి చేరే అవకాశం ఉండదు. శ్రీశైలం, సాగర్‌పై ఆధారపడ్డ ప్రాజెక్టుల ఆయకట్టులో సాగునీటి మాట దేవుడెరుగు గుక్కెడు తాగునీళ్లు కూడా దొరకవని తేల్చిచెబుతున్నారు. -
మహిళ జలసమాధి ఘటనలో మరో విషాదం
యశవంతపుర: కర్ణాటకలో కొడగు జిల్లాలోని దుబారె ఏనుగుల సంరక్షణాకేంద్రంలో సోమవారం వృద్ధ ఏనుగును మరో ఏనుగు కావేరి నదీతీరంలో తోసేయడం, దాని కింద నలిగిపోయి తమిళనాడు పర్యాటకురాలు మృతిచెందిన ఘటనలో మరో విషాదం చోటుచేసుకుంది. కిందపడిన ఏనుగు మార్తాండ తీవ్రమైన గాయాలతో మంగళవారం తెల్లవారుజామున చనిపోయింది. కంచన్ అనే ఏనుగు దాడి చేయడంతో మార్తాండ కడుపులోకి దంతాలు దిగబడిపోయాయి. చెవుల వెనుక, కాళ్ల మీద సైతం తీవ్రమైన గాయాలయ్యాయి. వెనువెంటనే సమీప ఏనుగుల సాయంతో మార్తాడను బుదర నుంచి పైకి లేపిదీశారు. తర్వాత పశువైద్యులు చికిత్స మొదలెట్టినా ఫలితంలేకుండా పోయిందని అటవీశాఖ పశు వైద్యాధికారి డాక్టర్ ముజీబ్ బృందం మంగళవారం ప్రకటించింది. సౌమ్య స్వభావిగా పేరుగాంచిన మార్తాండ మైసూరు దసరా జ్ఞాపకాలను గుర్తుచేసుకుని అటవీ సిబ్బంది, మావటీలు, జంతు ప్రేమికులు తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఇదీ చదవండి: మూల్యం : ప్రధాని మోదీని ప్రశ్నించిన జర్నలిస్టుకు ఎదురుదెబ్బ53 ఏళ్ల మార్తాండ బరువు 4,500 కేజీలు. మూడేళ్ల క్రితం హసన్ జిల్లాలోని ఆలూర్‌లో దీనిని అధికారులు బంధించి సంరక్షణాకేంద్రానికి తీసుకొచ్చి దీని ఆలనాపాలన చూస్తున్నారు. దీనిపై దాడిచేసిన 26 ఏళ్ల కంజన్ గజరాజును 2014లో అదేజిల్లాలోని ఏసలూర్లో బంధించి ఇక్కడికి పట్టుకొచ్చారు. మార్తాండపై దాడిచేసిన చంపడంతో ఇకపై దానిని మైసూర్ దసరా ఉత్సవాలకు పంపబోమని అధికారులు స్పష్టంచేశారు. ఇదీ చదవండి: సరస్వతీ మాత విగ్రహం కోహినూర్ కన్నా ముఖ్యం -
చెత్త ఎందుకు వేస్తున్నారు.. తెలంగాణ- కర్ణాటక సరిహద్దులో ఉద్రిక్తత
తెలంగాణ- కర్ణాటక సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కర్ణాటక నుంచి వస్తున్న చెత్త వాహనాలను సరిహద్దు గ్రామాల ప్రజలు అడ్డుకున్నారు. బీదర్‌లో సేకరించిన చెత్తను తెలంగాణలో డంప్ చేయడం ఏంటని ఆగ్రహించారు. ఇలా చెత్త పారబోయడంపై అడిగితే బీదర్ పోలీసులు తమను బెదిరిస్తున్నారని అన్నారు. ఎట్టిపరిస్థితుల్లో డంపింగ్ యార్డు తీసేయాలని లేకుంటే ఊరుకునేది లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆ ఇంటి దీపం ఆరిపోలేదు
అనుకోని రీతిలో మృత్యువు ఆమెను కబళించింది. అయితే అంత విషాదంలోనూ ఆమె భర్త శెభాష్ అనిపించే నిర్ణయం తీసుకున్నారు. ఏనుగుల దాడిలో చనిపోయిన తన భార్య కళ్లను దానం చేశారు. కర్ణాటకలో పర్యాటక ప్రాంతం కొడగు జిల్లా దుబారే వద్ద ఏనుగుల పొట్లాటలో ఓ మహిళ నలిగి చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే వైద్యుల సలహా మేరకు మృతురాలు తులసి కళ్లను దానం చేశాడు భర్త జోయెల్. తద్వారా ఆమె చూపు మరొకరి జీవితంలో వెలుగుని నింపుతుందని.. ఇలాగైనా తాను జీవించి ఉంటుందని చెబుతూ ఆ భర్త కన్నీళ్లు పెట్టుకున్నాడు. Heartbreaking Yet Inspiring Story of Love & Humanity ❤️Tulsi, lost her life in a tragic elephant attack at Dubare. Even in the deepest pain, her husband Joel showed extraordinary strength and compassion.Following doctors’ advice (as the body was severely injured), Joel… pic.twitter.com/gO3VuwF8Q0— Aparajite (@amshilparaghu) May 18, 2026ఏనుగులను చూసేందుకు దుబారే శిబిరం, దాని సమీప కావేరి నది వద్దకు నిత్యం పర్యాటకులు వస్తుంటారు. సోమవారం కూడా తమిళనాడుకు చెందిన ఝాన్సీ (33) కుటుంబం అక్కడికి వెళ్లింది. ఈ క్రమంలోనే కావేరి నది వద్దకు ఏనుగులను మావటీలు స్నానానికి తీసుకువచ్చారు. ఆ సమయంలో రెండు ఏనుగులు పోట్లాడుకోగా.. అందులో ఒకటి అక్కడే ఉన్న ఝాన్సీపై పడిపోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించేె లోపు మృతి చెందింది. ఆమె భర్త, కుమార్తె ఈ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఆ సమయంలో భార్యను రక్షించుకునేందుకు జోయెల్ చేసిన ప్రయత్నం.. వీడియోగా నెట్టింట వైరల్ అయ్యింది. అయితే ఈ ఘటనలో ఆమె శరీరం ఏనుగు కింద పడి నలిగిపోగా.. కళ్లు మాత్రం దెబ్బతినలేదు.Today, a tragic incident at Dubare Elephant Camp in Kodagu district, Karnataka, India.A 33-year-old tourist died after a temporary structure collapsed during an elephant bathing session following a clash between two elephants. pic.twitter.com/lfKJ5tpM6i— Weather Monitor (@WeatherMonitors) May 18, 2026 -
గజరాజుల జలకాలాటలో మహిళ జలసమాధి
యశవంతపుర: గజరాజుల జలకాలాట ఒక కుటుంబాన్ని విషాదంలో ముంచేసింది. ఏనుగులను దగ్గరగా చూడాలని ముచ్చటపడిన ఓ పర్యాటకురాలు అనూహ్యంగా ఏనుగు కింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలోని కొడగు జిల్లాలోని దుబారెలో ఉన్న అటవీశాఖ ఏనుగుల శిబిరంలో సోమవారం ఈ దుర్ఘటన జరిగింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం మైసూరు దసరా ఉత్సవాలలో పాల్గొనే ఏనుగులు కావేరీ నదీతీరం వెంట జలకాలాడుతున్నాయి. వీటిని చూసేందుకు పర్యాటకులు ఎగబడ్డారు. తమిళనాడు నుంచి వచ్చిన 33 ఏళ్ల తులసి అనే మహిళ సైతం తన కుమార్తె, భర్తతో కలిసి నది ఒడ్డున ఏనుగులను చూసేందుకు అత్యంత సమీపంగా వెళ్లారు. అదే సమయంలో కంజన్, మార్తాండ అనే ఏనుగులు స్వల్పంగా ఘర్షణపడ్డాయి. ఈ సమయంలో కోపంతో కంజన్ అనే ఏనుగు మార్తాండ అనే ఏనుగును తోసేసింది. దీంతో అది బురదతో నిండిన ఒడ్డులో పడిపోయింది. ఒరిగిపోతూ అది అక్కడే ఉన్న తులసి మీద పడింది. దీంతో ఆమె బురదలో కూరుకుపోయింది. ఇది చూసిన మావటి కంజన్ను దూరంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా ఫలితంలేకుండా పోయింది. అది కిందపడిపోయిన ఏనుగును పదేపదే నెట్టడంతో అది లేవలేక అలాగే బురదలో ఉండిపోయింది. దీంతో ఏనుగు బరువుకు దాని కింద ఇరుక్కుని మహిళ మట్టిలో కూరుకుపోయి ప్రాణాలుకోల్పోయారు. ఎట్టకేలకు దాడిచేసిన ఏనుగును మావటి దూరంగా తీసుకెళ్లాక కిందపడిన ఏనుగు పైకి లేచింది. వెంటనే తోటి పర్యాటకులు తులసిని సమీప ఆస్పత్రికి తరలించినా అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు ధ్రువీకరించారు. ఏనుగుల ఘర్షణ, తులసి పడిపోవడం, ఆమెపై ఏనుగు పడటం అన్నీ సమీపంలోని పర్యాటకుల స్మార్ట్ఫోన్లలో రికార్డయ్యాయి. ఈ ఘటనలో మహిళ భర్త, కూతురు అక్కడే ఉన్నా తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. భార్యను ఎలాగైనా ఏనుగు కింద నుంచి లాగేందుకు భర్త ఎంతగానో శ్రమించడం వీడియోలో రికార్డయింది. అప్పటిదాకా ఏనుగుల ఘీంకారాలు, పర్యాటకులతో ఆనందంతో సందడిగా ఉన్న ఆ ప్రాంతంలో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. భయంతో జనమంతా దూరంగా పారిపోయారు. ఘటనపై కర్ణాటక ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. వన్యప్రాణులకు ముఖ్యంగా ఏనుగులను కనీసం 100 అడుగుల దూరం నుంచే పర్యాటకులు చూడాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర ఖండ్రె సూచించారు. ఏనుగును తాకడం, దగ్గరగా ఉండి ఫొటోలను తీసుకోవడం చేయరాదని హెచ్చరించారు. పర్యాటకులు అరటిపండ్లు, బెల్లం, చెరకు గడలు వంటివి ఏనుగులకు చేతితో అందించడంపై నిషేధం విధిస్తామని తెలిపారు. వన్యప్రాణులుండే పర్యాటక ప్రదేశాల్లో అమలుచేయాల్సిన ప్రామాణిక కార్యాచరణ ప్రణాళిక(ఎస్ఓపీ)ని అధికారులు తప్పకుండా అమలుచేయాలని ఫారెస్ట్, వైల్డ్‌లైఫ్ వార్డెన్ల ప్రధాన కార్యదర్శికి మంత్రి ఆదేశాలు జారీచేశారు. I have always been stunned by, and have marvelled at, the raw brute force of nature manifested in elephants.[in this tragedy, a life was lost]https://t.co/OfHTUtgkwn— Sandeep Manudhane (@sandeep_PT) May 18, 2026 -
ఏపీ డిప్యూటీ కలెక్టర్ ఖాతాలో మరో టైటిల్
బెంగళూరు: భారత డేవిస్‌కప్ జట్టు మాజీ సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని తన కెరీర్లో 21వ ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్‌ను జమ చేసుకున్నాడు. శనివారం ముగిసిన కర్ణాటక ఓపెన్ ఏటీపీ చాలెంజర్–50 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో భారత్‌కే చెందిన నిక్కీ కలియంద పునాచాతో జతకట్టి ఆడిన సాకేత్ విజేతగా నిలిచాడు. పీటర్ బార్ బిరుకోవ్ (రష్యా)–గ్రిగోరి లొమాకిన్ (కజకిస్తాన్) జోడీతో జరిగిన తుది పోరులో సాకేత్–పునాచా జంట 6–2, 6–3తో విజయం సాధించింది. కేవలం 52 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సాకేత్–పునాచా మూడు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశారు. తమ సర్వీస్‌ను ఒక్కసారి కూడా కోల్పోకుండా, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశారు. విజేతగా నిలిచిన సాకేత్–పునాచాలకు 2,980 డాలర్ల (రూ. 2 లక్షల 85 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 50 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సాకేత్ ఏడాదిన్నర తర్వాత మరో అంతర్జాతీయ డబుల్స్ టైటిల్‌ను సాధించాడు. సాకేత్ చివరిసారి 2024 నవంబర్‌లో యోకోహామా ఏటీపీ–75 చాలెంజర్ టోర్నీలో బెంజిమిన్ హసన్ (జర్మనీ)తో జతగా డబుల్స్ టైటిల్‌ను సాధించాడు. -
మందుబాబులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన ధరలు..!
బెంగళూరు: రాష్ట్రంలో మందుబాబుకు ఎక్సైజ్ శాఖ తీపి కబురు చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం మే 11 నుంచి కొత్త ఆల్కహాల్ ఇన్ బేవరేజస్(ఏఐబీ) విధానాన్ని అమలు చేసింది. దీంతో ప్రీమియం బీర్, విదేశీ స్కాచ్ విస్కీ ధరలు గణనీయంగా తగ్గాయి. కొత్త ఎక్సైజ్ విధానం ప్రకారం 5 శాతం ఆల్కహాల్ కలిగిన సాధారణ, లాగర్ బీర్ల ధరలను 20 నుంచి 25 శాతం తగ్గించింది. కింగ్‌ఫిషర్ ప్రీమియం, ఆల్ట్రా 650 మిలీబాటిల్స్ వంటి పేరొందిన బ్రాండ్ల ధరను రూ.75 మేర తగ్గించారు. హైనెకెన్ బీర్ ధర రూ.70, యూబీ ఎక్స్‌పోర్ట్స్ ధర రూ.25, బడ్‌వైసర్ ప్రీమియం ధర రూ.20 మేర తగ్గించారు. బీర్ మాత్రమే కాకుండా విదేశీ ప్రీమియం స్కాచ్ విస్కీ ధరను సైతం 20 శాతం తగ్గించారు. బ్లాక్ లేబల్, చివాస్ రీగల్ లాంటి ప్రజాదరణ పొందిన బ్రాండ్ల 750 మిల్లీబాటిల్ ధర రూ.5,190 నుంచి రూ.4,100కు తగ్గింది. ఇది ప్రీమియం మద్యంప్రియులకు వరంగా మారింది. సాధారణ ప్రజలు తాగే తక్కువ ధర మద్యం ధరలు పెరిగాయి. ప్రభుత్వం కొత్త పన్ను విధాన పద్ధతితో తక్కువ ధర కలిగిన మద్యంపై భారీ భారం మోపింది. దీంతో సాధారణ ప్రజల్లో అసంతృప్తి ఏర్పడింది. కర్ణాటక ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఏఐబీ విధానం దేశంలో మొదటి ప్రయోగం. మద్యంలో ఆల్కహాల్ శాతం ఆధారంగా పన్ను విధించే వ్యవస్థను రూపొందించారు. గతంలో ఉన్న 16 స్లాబ్‌ల విధానాన్ని ప్రస్తుతం 8కి తగ్గించారు. సుమారు 6 దశాబ్దాల పాత పన్ను వ్యవస్థను రద్దు చేసి కొత్త విధానంలో పన్ను వ్యవస్థను అమల్లోకి తెచ్చారు. -
బతికి ఉన్న భర్తకు రిప్ (RIP)..!
కర్ణాటక: నేటి డిజిటల్ యుగంలో కుటుంబ సంబంధాలు, దంపతుల మధ్య అనుబంధాలు మృగ్యమవుతున్నాయి. చిన్న కారణాలకే విడిపోతూ కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. ఇదే మాదిరిగా ఓ భార్య.. భర్తను వదిలేసి అతని ఫోటో మీద రెస్ట్ ఇన్ పీస్ (ఆర్ఐపీ) అని రాసింది. వివరాలు.. 9 ఏళ్ల కిందట ఇక్కడి సాగానహళ్ళిలోని అనూజకు శిడ్లఘట్ట తాలూకా దొడ్డతేకనహళ్ళి కుమార్‌తో వివాహమయ్యింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జల్సాలకు అలవాటు పడిన అనూజా పల్లెలో అత్తమామలను వదిలి బెంగళూరు దేవనహళ్ళిలో భర్తతో బాడుగ ఇంట్లో కాపురం ఉంటున్నారు. పుట్టింటికి వచ్చేసి పోస్టింగులు భర్త కారు డ్రైవర్ కాగా, భార్య విలాసవంత జీవనం కోసం పెద్ద మొత్తంలో అప్పులు చేశాడు. కొన్నిరోజుల కిందట అనూజ భర్తను వదిలేసి పుట్టిల్లయిన సాగానహళ్ళికు వచ్చింది. భర్త ఫోను చేసి కాపురానికి రావాలన్నా అనూజ తిరస్కరించింది. పైగా సోషల్ మీడియాలో.. భర్త ఫోటో పెట్టి రిప్ అని రాసింది. దీంతో కోద్రిక్తుడైన కుమార్ బంధుమిత్రులతో వచ్చి భార్యను నిలదీశాడు. అనూజ, ఆమె అన్న కలిసి కారంపొడి చల్లి చితకబాదడంతో కుమార్, అతని బంధువుల గాయపడ్డారు. బాధితులు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులు పరారయ్యారు. -
ఫైనల్లో సాకేత్ జోడీ
బెంగళూరు: కర్ణాటక ఓపెన్ ఏటీపీ చాలెంజర్-50 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో భారత డేవిస్‌కప్ జట్టు మాజీ సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని ఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో సాకేత్-నికీ కలియంద పునాచా (భారత్) జోడీ 7-5, 6-1తో టాప్ సీడ్ ప్రజ్వల్ దేవ్-నితిన్ కుమార్ సిన్హా (భారత్) జంటపై విజయం సాధించింది.71 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్-పునాచా మూడు ఏస్‌లు సంధించి, ఒక డబుల్ ఫాల్ట్ చేశారు. తొలి సర్వీస్‌లో 27 పాయింట్లు, రెండో సర్వీస్‌లో 12 పాయింట్లు స్కోరు చేశారు. తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సాకేత్ ఈ ఏడాది తొమ్మిది టోర్నీల్లో పాల్గొన్నా క్వార్టర్ ఫైనల్ దాటి ముందుకెళ్లలేకపోయాడు.పదో టోర్నీలో మాత్రం టైటిల్‌కు విజయం దూరంలో నిలిచాడు. నేడు జరిగే ఫైనల్లో పీటర్ బార్ బిరుకోవ్ (రష్యా)-గ్రిగోరి లొమాకిన్ (కజకిస్తాన్)లతో సాకేత్-పునాచా తలపడతారు. రెండో సెమీఫైనల్లో బిరుకోవ్-లొమాకిన్ 7-6 (7/4), 7-6 (7/4)తో ఆదిల్ కల్యాణ్‌పూర్-ముకుంద్ శశికుమార్ (భారత్)లపై విజయం సాధించారు. -
చిన్నారి ఘనత..శీర్షాసనంలో శివ తాండవ స్తోత్రం!
ఓ చిచ్చర పిడుగు అనితర సాధ్యమైన ఘనత సాధించాడు. గుక్కతిప్పుకోకుండా వేగవంతంగా పాడే శివతాండవ స్త్రోత్రాన్ని ఓ చిన్నారి యోగాసనంలో రాజుగా పిలిచే శీర్షాసనంలో పఠించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఉచ్ఛ్వాశ నిశ్వాసాలపై నియంత్రణ సాగిస్తూ..కష్టతరమైన ఈ స్త్రోత్రాన్ని పఠించడం విశేషం. ఎవరా చిచ్చరపిడుగు అంటే..కర్ణాటకలోని సిర్సికి చెందిన ఎనిమిదేళ్ల ఓం ఈ రికార్డు నెలకొల్పాడు. సంస్కృత పదాలతో ఉండే శివతాండవ స్త్రోత్రాన్ని పఠించడానికి అపారమైన అంకితభావం, సాధన అవసరం. కానీ ఈ చిన్నారి ఓం గోడ ఆధారంగా చేసుకుని శీర్షాసనం వేసి చేతలు ఆధారం లేకుండా నమస్కరిస్తూ..అలవోకగా శివతాండవ స్త్రోత్రాన్ని పఠించి ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంత చిన్న వయసులో అపారమైన ఏకాగ్రత, బ్యాలెన్సింగ్, క్రమశిక్షణపై ఉన్న పట్టు అందర్నీ అమితంగా ఆకర్షించింది. ప్రపంచ రికార్డు ప్రకారం.. చిన్నారి ఓం ఫిబ్రవరి 15న 3 నిమిషాల 47 సెకన్లలో ఈ ప్రదర్శనను పూర్తి చేశాడు. ఇక్కడ యోగాసనాల్లో అత్యంత కష్టమైన కఠినమైన ఆసనాన్ని కొనసాగిస్తూనే లయబద్ధంగా సంస్కృత పఠనాన్ని నిరంతరాయంగా కొనసాగించడం అత్యంత సవాలు. కానీ ఈ రెండింటిని అలవోకగా బ్యాలెన్స్ చేయలంటే సదరు వ్యక్తికి శ్వాస నియంత్రణ, శారీరక స్థిరత్వం, మానసిక ఏకాగ్రత అపారంగా ఉండాల్సిందే. కానీ ఈ ఆ చిన్నారి ఓం అంత చిన్న వయసులోనే వాటన్నింటిపై పట్టు సాధించి ఆ సవాలుని తక్కువ సమయంలోనే దిగ్విజయంగా పూర్తి చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పడం విశేషం. View this post on Instagram A post shared by Boldsky (@boldskyliving) (చదవండి: ఒత్తిడి లేకుండా వందేళ్లు బతకాలంటే..! అక్కడికి వెళ్లాల్సిందే) -
వివాహేతర సంబంధం.. భర్త, మామను హత్య చేసిన కోడలు..!
కర్ణాటక: దేశ రక్షణ కోసం పోరాడే జవాన్, మాజీ జవాన్‌కు సొంత ఇంట్లోనే భద్రత లేకుండా పోయింది. మూడు రోజుల క్రితం క్రిష్ణగిరి సమీపంలో కాలిన స్థితిలో బయటపడిన మృతదేహాల కేసును పోలీసులు ఛేదించారు. తండ్రీకుమారుడు హత్యకు గురికాగా, కోడలి అక్రమ సంబంధమే ఇంత ఘోరానికి కారణమని తేల్చారు. ఉలిక్కిపడిన బెల్లారంపల్లి వెప్పాలంపట్టి సమీపంలో కాలిన స్థితిలో ఇద్దరి మృతదేహాలున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. సేలం డీఐజీ సంతోష్, క్రిష్ణగిరి ఎస్పీ తంగదురైలు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదుచేసుకొని, దర్యాప్తు చేపట్టారు. హత్యకు గురైన వ్యక్తులు క్రిష్ణగిరి సమీపంలోని బెల్లారంపల్లి గ్రామానికి చెందిన సైనికుడు మాదేశ్ (43), అతని తండ్రి, మాజీ జవాన్ సెల్లప్ప (63)గా గుర్తించారు. భర్త జమ్మూకశ్మీర్‌లో ఉంటే..మాదేష్ జమ్మూకశ్మీర్‌లో విధుల్లో ఉండేవాడు. ఈ క్రమంలో అతని భార్య భానుప్రియ (30)పై పోలీసులకు అనుమానం ఏర్పడింది. ఆమెను ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలివ్వడంతో.. పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి తమదైన శైలిలో ప్రశ్నించారు. దాంతో అసలు గుట్టును భానుప్రియ విప్పింది. బెల్లారంపల్లివాసి, జవాన్ మాదేశ్ (43) జమ్మూకశ్మీర్‌లో పని చేసేవాడు. ఈ క్రమంలో భానుప్రియకు స్థానికంగా ఉండే వ్యాన్ డ్రైవర్ పూవరసన్ (24) అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరి తతంగమంతా గ్రామస్థులకు తెలిసింది. భర్త మాదేశ్‌కు కూడా విషయం తెలియడంతో.. ఆయన ఆగ్రహంతో ఈ నెల 10వ తేదీన హఠాత్తుగా ఊరికి వచ్చి భార్యను నిలదీసి దండించాడు. భానుప్రియ ఈ సంగతిని ప్రియునికి చెప్పింది. పథకం ప్రకారం ప్రియుడు పూవరసన్ ఆ రోజు రాత్రి కత్తితో భానుప్రియ ఇంటికెళ్లి మాదేశ్‌పై దాడి చేశాడు. మాదేశ్ కేకలు వేయడంతో తండ్రి, మాజీ జవాన్ సెల్లప్ప బయటకొచ్చాడు. వారిద్దరిపై భానుప్రియ, ప్రియుడు కత్తులతో విరుచుకుపడి హత్య చేశారు. శవాలను వ్యాన్‌లో తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు నిందితులు వివరించారు. ఈ కేసు చుట్టుపక్కల గ్రామాల్లో తీవ్ర సంచలనం కలిగిస్తోంది. -
హిజాబ్ ఓకే... మిగిలినవి కూడా!
బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు నిర్దేశిత యూనిఫాంలతో పాటు హిజాబ్, రుద్రాక్ష, జనివర (పవిత్ర జంధ్యం), ఇతర మత విశ్వాస చిహ్నాలను ధరించడానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులు ఇవి కలిగి ఉన్నారని నెపంతో విద్యాలయాల్లో అనుమతి ఎట్టి పరిస్థితుల్లో నిరాకరించకూడదని తెలిపింది. మతపరమైన దుస్తుల అంశంలో 2022లో విధించిన ఆంక్షలను అధికారికంగా రద్దు చేసింది.విద్యార్థులకు మతపరమైన గుర్తింపు చిహ్నాలను స్వేచ్ఛగా ధరించే విధంగా ఈ నూతన విధానం అనుమతిస్తోందని అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం అన్ని వర్గాల వారి మత సంప్రదాయాలను సమానంగా చూసే ఒక గొప్ప చర్యగా పేర్కొన్నారు.హిజాబ్ వివాదం ఏంటి2021 డిసెంబరులో కర్ణాటకలోని ఉడిపి జిల్లాకు చెందిన ఒక ప్రభుత్వ ప్రీ-యూనివర్శిటీ కళాశాలలో ఆరుగురు ముస్లిం విద్యార్థినులు హిజాబ్ (శిరోవస్త్రం) ధరించి తరగతులకు హాజరవ్వగా, యాజమాన్యం వారిని అనుమతించలేదు. ఇది యూనిఫాం నిబంధనలకు విరుద్ధమని కళాశాల పేర్కొంది. దీంతో విద్యార్థినులు తమ మతపరమైన హక్కుల కోసం నిరసనకు దిగగా, దీనికి ప్రతిచర్యగా కొందరు ఇతర విద్యార్థులు కాషాయ కండువాలు ధరించి కళాశాలకు రావడం మొదలుపెట్టారు. ఇది ఉద్రిక్తతలకు దారితీసింది, ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు జరిగాయి.దీంతో కర్ణాటక ప్రభుత్వం ఫిబ్రవరి 5, 2022న ఒక ఉత్తర్వు జారీ చేసింది. దీని ప్రకారం విద్యాసంస్థలు నిర్ణయించిన యూనిఫాంను విద్యార్థులు తప్పనిసరిగా పాటించాలని సమానత్వం, సమగ్రత మరియు ప్రజా శాంతికి భంగం కలిగించే దుస్తులను ధరించకూడదని ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ప్రభుత్వం ఆ ఉత్తర్వును రద్దు చేసింది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది ఈ నిర్ణయాన్ని మత స్వేచ్ఛ మరియు విద్యార్థులకు సమాన హోదా కల్పించే దిశగా ఒక ప్రగతిశీల చర్యగా ప్రశంసిస్తున్నారు.విమర్శకులు ఇది దేశ ఏకరూపతకు, వ్యక్తిగత భావ ప్రకటనకు మధ్య ఉన్న గీతను చెరిపివేస్తుందని వాదిస్తున్నారు. హిజాబ్ వంటి కనిపించే వస్త్రాలను, సాధారణంగా కనపడకుండా ఉంచే జంధ్యం వంటి వాటితో సమానం చేయవచ్చా అని వారు ప్రశ్నిస్తున్నారు. -
కర్ణాటకలో మరోసారి సీఎం వార్..? శివకుమార్ ఏమన్నారంటే
బెంగళూరు: కర్ణాటకలో మరోసారి ముఖ్యమంత్రి వివాదం తెరపైకి వచ్చింది. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డీకే శివకుమార్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు పోస్టర్లు ఏర్పాటు చేశారు. అందులో డీకే శివకుమారా్ ముఖ్యమంత్రి కావాలని ఉండడంతో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది.2023 మే 13న వెలువడిన కర్ణాటక అసెంబ్లీ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 135 స్థానాలు గెలిచి అధికారం సాధించింది. దీంతో సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆ సందర్భంలో ముఖ్యమంత్రి పీఠం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ చెరో రెండున్నరేళ్లు పంచుకునేలా ఒప్పందం జరిగిందని ఫుకార్లు చెలరేగాయి. ఈ నేపథ్యంలోనే గతేడాది నవంబర్‌లో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య పెద్దఎత్తున కోల్డ్ వార్ నడిచింది. అధిష్టానం ఎంట్రీ ఇచ్చి ఇరునేతల మధ్య సయోధ్య కుదర్చడంతో ఎట్టకేలకు పరిస్థితులు సద్దుమణిగాయి.అయితే తాజాగా మరోసారి ఈ వివాదం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మే 15న డీకే శివకుమార్ జన్మదినం సందర్భంగా ఆయన అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అందులో కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అంటూ రాసుకొచ్చారు. దీంతో ఈ అంశం ఇప్పుడు ఆ రాష్ట్రంలో మరోసారి రచ్చలేపుతోంది. కాంగ్రెస్ అధికారం చేపట్టి మూడేళ్లు అవుతున్న సందర్భంగా ఒకవేళ ముఖ్యమంత్రి మార్పు జరగనుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.అయితే అధికార మార్పు అంశమై గత నెలలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. సీఎం మార్పు అంశం జరుగుతుందన్న నిర్ణయం పూర్తిగా అవాస్తవం అని కొట్టిపడేశారు. ఈ విషయమై ఇప్పుడు చర్చలేవి లేవని హైకమాండ్ సరైన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటుందన్నారు. -
శోకసంద్రంలో కర్ణాటక.. మంత్రి సుధాకర్ కన్నుమూత
బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో విషాదం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రణాళిక, గణాంక శాఖ మంత్రిగా సేవలందిస్తున్న సీనియర్ కాంగ్రెస్ నాయకుడు డీ సుధాకర్ (66) ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో సుదీర్ఘ కాలంగా బాధపడుతూ, ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాలను, పార్టీ శ్రేణులను, అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.ప్రాణాలు తీసిన తీవ్రమైన ఇన్ఫెక్షన్గత మార్చి నెలాఖరు నుంచి మంత్రి డీ సుధాకర్ తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. బెంగళూరులోని ఎలక్ట్రానిక్స్ సిటీలో ఉన్న ప్రముఖ కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్) ఆసుపత్రిలో ఆయన ఇంటెన్సివ్ కేర్‌లో చేరి, గత కొన్ని వారాలుగా చికిత్స పొందుతున్నారు. గత వారం ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో ఎక్మో సహా అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్‌పై ఉంచి చికిత్స అందించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండటంతో ఊపిరితిత్తుల మార్పిడి (లంగ్ ట్రాన్స్‌ప్లాంట్) చేసే అవకాశాలను కూడా వైద్యులు పరిశీలించారు.తెల్లవారుజామున ఆగిన శ్వాసఅత్యాధునిక వైద్య సదుపాయాలు ఉన్నప్పటికీ, సుధాకర్ శరీరం చికిత్సకు సహకరించలేదు. కిమ్స్ ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ఆర్. చిన్నదురై విడుదల చేసిన అధికారిక హెల్త్ బులిటెన్ ప్రకారం.. ‘66 ఏళ్ల గౌరవ మంత్రి సుధాకర్ డీ, ఆదివారం తెల్లవారుజామున 3:15 గంటలకు కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో మరణించారు’ అని ప్రకటించారు. ఈ వార్త బయటకు రాగానే ఆయన అనుచరులు, అభిమానులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.అంచెలంచెలుగా ఎదిగి..చిత్రదుర్గ జిల్లాకు చెందిన డీ సుధాకర్.. ప్రస్తుతం హిరియూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన 2004లో చల్లకెరె నియోజకవర్గం నుంచి తొలిసారి ఎన్నిక కాగా, ఆ తర్వాత 2008, 2013లో హిరియూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో సామాజిక సంక్షేమం, యువజన వ్యవహారాలు వంటి అనేక కీలక మంత్రిత్వ శాఖలకు ఆయన బాధ్యతలు వహించారు. ప్రజలతో ఎంతో మమేకమై పనిచేసే నాయకునిగా పేరొందిన సుధాకర్ మృతి పట్ల అన్ని పార్టీల రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.ఇది కూడా చదవండి: తీవ్ర గాయాలతో అజ్ఞాతంలో ఇరాన్ సుప్రీం లీడర్? -
‘దండుపాళ్యం’కు ఏమాత్రం తీసిపోకుండా..
ఇంటర్నెట్ వినియోగం పెరుగుతున్నా కొద్దీ.. నేరాల తీరు కూడా మారిపోతోంది. ఏ తరహాలో క్రైమ్ చేయాలి?.. చేతులకు మట్టి అంటకుండా ఎలా చూసుకోవాలి.. ఎలా తప్పించుకుని తిరగాలి.. ఒకవేళ దొరికితే అందులోంచి ఎలా బయటపడాలి.. లాంటి విషయాలను కూడా ఆన్లైన్లోనే వెతికేస్తున్నారు. ఈ క్రమంలో.. పొరుగు రాష్ట్రంలో ఓ షాకింగ్ వెలుగు చూసింది. దండుపాళ్యం బ్యాచ్‌కు ఏమాత్రం తీసిపోని రీతిలో ఓ ముఠా కర్ణాటక రాజధాని బెంగళూరులో అఘాయిత్యానికి పాల్పడింది. ఒంటరి మహిళపై సుదీర్ఘకాలం నిఘా ఉంచి.. డబ్బు కోసం పథకం ప్రకారం ఆమెను మట్టుపెట్టింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఏప్రిల్ 20వ తేదీన కురుబరహల్లి ప్రాంతాలో ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఓ బైక్ వేగంగా దూసుకొచ్చి ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలపాలైందామె. దీంతో అక్కడే ఉన్న కొందరు యువకులు ఆమెను హుటాహుటిన ఆటోలో ఎక్కించుకుని తీసుకెళ్లారు. రెండ్రోజుల తర్వాత.. ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతూ కన్నుమూసింది. అయితే..అది ప్రమాదవశాత్తూ జరిగింది కాదని.. పైగా ఆమెను ఆస్పత్రిలో చేర్పించే టైంలో ఘోరం జరిగిందని పోలీసులు గుర్తించారు. అంతేకాదు.. ఈ యాక్సిడెంట్ చేసినోడే.. ఆమెను ఆస్పత్రిలో చేర్పించానంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఈ ఎపిసోడ్లో మరో కొసమెరుపు.మహాలక్ష్మి లేఅవుట్ పీఎస్ పరిధిలో మహాలక్ష్మి అనే మహిళ ఒంటరిగా ఓ అద్దె ఇంట్లో ఉంటోంది. తెలిసినవాళ్ల ద్వారా చేతన్ అనే వ్యక్తి ఆమె దగ్గర కొంత డబ్బు అప్పు తీసుకున్నాడు. అయితే ఆమె దగ్గర మరింత డబ్బు, నగలు ఉన్నట్లు భావించాడు. ఈ క్రమంలో.. స్నేహితులు రాకేష్, మంజునాథ్, చిప్స్ ప్రదీప్, యోహాన్ జాన్‌తో కలిసి ఓ పథకం వేశాడు.ప్లాన్ ప్రకారం.. రాకేష్ తన బైక్‌తో నడుచుకుంటూ వెళ్తున్న మహాలక్ష్మిని ఢీ కొట్టాడు. ఆ వెంటనే మిగతా నిందితులు ఆటోతో పాటు అక్కడికి చేరుకుని ఆమెను రక్షించడానికి ప్రయత్నించినట్లు నటించారు. ఆస్పత్రికి తీసుకెళ్లే వంకతో ఆమె పర్సులోని ఇంటి తాళం కొట్టేశాడు మంజునాథ్. ఆపై ఆమె అద్దెకు ఉంటున్న ఇంటికి వెళ్లి తాళం తెరవబోయాడు. అయితే అది చూసిన ఇంటి యాజమాని అతన్ని నిలదీశాడు. మహాలక్ష్మికి యాక్సిడెంట్ అయ్యిందని.. ఆస్పత్రిలో చేర్పించామని.. ఆస్పత్రివాళ్లు ఆధార్ కార్డు అడుగుతున్నారని చెప్పాడు. దీంతో యాజమాని హుటాహుటిన మంజునాథ్‌తో ఆస్పత్రికి బయల్దేరాడు. ఈలోపు.. మంజునాథ్ మిగతా వాళ్లకు సమాచారం ఇవ్వడంతో తమ పథకం విఫలమైందని భావించి ఆమెను విక్టోరియా ఆస్పత్రిలో చేర్పించారు.అయితే.. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. రెండ్రోజుల తర్వాత మంజునాథ్ ఇంటి తాళం తెరవబోయిన విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు ఆ ఇంటి ఓనర్. దీంతో సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా మంజునాథ్‌ను.. అతనిచ్చిన సమాచారంతో మిగతా వాళ్లనూ అరెస్ట్ చేశారు. మహాలక్ష్మికి బైక్‌తో ఢీ కొట్టాక.. సరాసరి ట్రాఫిక్ పీఎస్‌కు వెళ్లిన రాకేష్ ‘‘గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టిందని.. తాను ఆస్పత్రిలో చేర్పించానని.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’’ అని ఫిర్యాదు చేశాడు. చివరకు పోలీసులు అసలు విషయం తేల్చేయడంతో.. దొంగతనం చేయడానికి ఆమెకు యాక్సిడెంట్ చేశామని, ప్రాణం పోతుందని అనుకోలేదని ఆ యువకులు ఒప్పుకున్నారు. దీంతో హత్య కేసు నమోదు చేసుకుని నిందితుల్ని రిమాండ్‌కు తరలించారు.Accident Turned Murder: Bengaluru Woman Killed in Chilling Extortion PlotA shocking and well-planned crime has come to light in Bengaluru, where a woman was deliberately killed under the guise of a road accident for financial gain.The incident occurred on April 21 on Pipe Lane… pic.twitter.com/FAJd9SOUZw— Karnataka Portfolio (@karnatakaportf) May 8, 2026 -
ఎవండీ.. నీతో సంసారం చేయటం ఇష్టంలేదు..!
బెంగళూరు: ప్రియుడితో దిగిన ఫొటోను భార్య తన భర్తకు పంపడంతో అతను ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తరకన్నడ జిల్లా దాండేలి పట్టణంలో జరిగింది. పట్టణానికి చెందిన రాఘవేంద్ర వాడకర్ మలేషియాలో ఉంటన్నాడు. వారం రోజుల క్రితం దాండేలికి వచ్చాడు. ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిన భార్య తాను.. నీతో సంసారం చేయటం ఇష్టంలేదని పేర్కొంది. మరో యువకుడితో ఆమె కలిసి ఉన్న ఫొటోను రాఘవేంద్రకు పంపించి వాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకుంది. నీతో కలిసి జీవించడం ఇష్టం లేదని, కావాలంటే చచ్చిపో అంటూ తేల్చి చేప్పింది. దీంతో రాఘవేంద్ర బుద్ధి మాటలు చెప్పాడు. అయినా భార్య పట్టించుకోలేదు. దీంతో చాకుతో కోసుకోని వాట్సాప్‌లో పొటోలు పంపాడు. నీవు చచ్చినా నాకు ఎలాంటి ఇబ్బందిలేదంటూ భార్య చెప్పడంతో జీవితంపై విరక్తి చెందిన రాఘవేంద్ర ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు తన భార్య తీరు గురించి లేఖ రాశాడు. దాండేలి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
భార్య మరొక పురుషునితో.. తట్టుకోలేక భర్త..!
తుమకూరు(కర్ణాటక): రాష్ట్రంలో కుటుంబాల్లో సామూహిక ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. కోలారు జిల్లాలో ఇద్దరు కూతుళ్లతో తల్లి బావిలోకి దూకి ప్రాణాలు తీసుకున్న ఘటన మరువక ముందే మరో విషాదం వెలుగుచూసింది. భార్య మరొక పురుషునితో పరారు కావడంతో తీవ్ర వ్యథ చెందిన భర్త ఘోర కృత్యానికి ఒడిగట్టాడు. ఇద్దరు కొడుకును గొంతు పిసికి చంపి, ఆపై ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ దుర్ఘటన తుమకూరు జిల్లా కుణిగల్ తాలూకా ఆల్కెరె గ్రామంలో జరిగింది. శివణ్ణ (40), పిల్లలు జీవన్ (11), ప్రాణేష్ (6) మృతులు. ఇంటికి వచ్చినట్టే వచ్చి.. వివరాలు.. శివణ్ణ గ్రామంలో మల్లేశ్వరస్వామి ఆలయంలో పూజారిగా ఉంటూ, ఓప్రైవేట్ కంపెనీలో కూడా పని చేస్తుండేవారు. భార్య కావ్య, ఇద్దరు పిల్లలతో ప్రశాంత జీవితం గడుపుతుండగా, వారం రోజుల కిత్రం కావ్య వేరే వ్యక్తితో కలిసి ఇంటి నుంచి పరారైంది. ఈ పరిణామంతో భర్త తీవ్రంగా ఆవేదన చెందాడు. భార్య మిస్సింగ్‌పై పోలీసు స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత కావ్య మళ్లీ ఇంటికి వచ్చింది. మరుసటి రోజు భర్త పనిమీద వెళ్లగా, కావ్య ఇంటిలోని లక్షలాది రూపాయల విలువ చేసే బంగారు, డబ్బుతో మళ్లీ పరారైంది. దీంతో విరక్తి చెందిన శివణ్ణ శుక్రవారం రాత్రి తన ఇంటిలోనే ఇద్దరు మగ పిల్లలను ఊపిరాడకుండా చేసి చంపి, తర్వాత తానూ ఉరి వేసుకున్నాడు. ఆమె కోసం గాలింపు శనివారం ఉదయం చుట్టుపక్కల వారు గమనించగా ఈ దుర్ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. జిల్లా పోలీసు అధికారులు, కుణిగల్ పోలీసులు స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను మరణోత్తర పరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు. కావ్య కోసం గాలింపు చేపట్టారు. ఈ దుర్ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇందుకు కారణమైన కావ్య, ఆమె ప్రియున్ని పట్టుకుని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. -
‘చైల్డ్ లేబర్.. FIR వేయిస్తా.. వైభవ్ చదువుకోవాలి’
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ గత కొన్నాళ్లుగా అద్భుత ఆట తీరుతో అలరిస్తున్నాడు. భారత్ అండర్-19 జట్టుతో పాటు ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ తరఫున దుమ్ములేపుతున్నాడు. గతేడాది ఐపీఎల్లో 35 బంతుల్లోనే శతక్కొటిన ఈ బిహారీ పిల్లాడు.. ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడి (14 ఏళ్లు)గా నిలిచాడు.సంచలనాలకు కేంద్రంనిజానికి అంతకంటే ముందే అంటే పన్నెండేళ్లకే రంజీల్లో అరంగేట్రం చేసి వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత భారత్ అండర్-19 జట్టుకు ఎంపికై.. ఆసియా రైజింగ్ స్టార్స్‌తో టోర్నీ పాటు ఇటీవలే వరల్డ్‌కప్ టోర్నీలోనూ ఆడాడు. ఫైనల్లో ఇంగ్లండ్‌పై కేవలం 80 బంతుల్లో 175 పరుగులు సాధించి భారత్‌కు ట్రోఫీ అందించాడు.ఆరెంజ్ క్యాప్ రేసులోఇక ఇటీవలే పదిహేనో వసంతంలోకి అడుగుపెట్టిన వైభవ్.. ఐపీఎల్-2026లో భాగంగా ఈ టోర్నీలో తన రెండో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 36 బంతుల్లోనే శతక్కొట్టాడు. మొత్తంగా ఈ సీజన్లో ఇప్పటికి పది మ్యాచ్‌లలో కలిపి ఈ లెఫ్టాండర్ బ్యాటర్ 404 పరుగులు పూర్తి చేసుకుని.. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో టాప్-4లో నిలిచాడు.ఈ నేపథ్యంలో అలెన్ బోర్డర్, బ్రియాన్ లారా, సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు సైతం వైభవ్ సూర్యవంశీ ఆటకు ఫిదా అవుతున్నారు. త్వరలోనే అతడిని టీమిండియాకు ఆడించాలని మరికొందరు మాజీ క్రికెటర్లు సైతం సెలక్టర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.యాక్టివిస్ట్ సంచలన వ్యాఖ్యలుఇలాంటి తరుణంలో ఓ వ్యక్తి వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. కన్నడ టీవీ చానెల్లో యాక్టివిస్ట్‌గా పరిచయమైన ఓ వ్యక్తి.. వైభవ్‌ను తక్షణమే ఇంటికి పంపాలని రాజస్తాన్ యాజమాన్యానికి సూచించాడు. లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేసి.. FIR వేయిస్తానని హెచ్చరించాడు.చైల్డ్ లేబర్.. చదువుకోనివ్వండిఈ మేరకు.. ‘‘పదిహేనేళ్ల పిల్లాడు ప్రొఫెషనల్ క్రికెట్ ఆడకూడదు. ఇలా చేయడం చైల్డ్ లేబర్ కిందకు వస్తుంది. ఈ పిల్లాడిని ఐపీఎల్ క్రికెట్ ఆడనివ్వద్దు. క్రికెట్ ఆడే బదులు అతడు చదువుకోవాలి’’ అని సదరు వ్యక్తి పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌కాగా.. నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.This activist appeared on a Kannada TV channel and said he plans to file a police case or legal complaint against Rajasthan Royals. He said - Don't let this 15-year-old boy "Vaibhav Suryavanshi " play IPL cricket — it's child labour, he should study! pic.twitter.com/zEwVJQseGR— ExtraOrdinary (@Extreo_) May 2, 2026క్రీడాకారులకు వర్తిస్తుందా?కాగా భారత బాల కార్మిక నిరోధక సవరణ చట్టం 2016 ప్రకారం.. పద్నాలుగేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలతో పని చేయించకూడదు. అయితే, సాధారణంగా బాల క్రీడాకారులను చైల్డ్ లేబర్‌గా పరిగణించరు. ప్రతిభకు పట్టం కడుతూ వారిని ప్రోత్సహిస్తారు. క్రికెట్ ఒక్కటే కాదు.. చెస్, బ్యాడ్మింటన్ వంటి క్రీడల్లో చాలా మంది పదేళ్లలోపు వయసులోనే ప్రవేశిస్తారు.ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్నిజానికి వైభవ్ సూర్యవంశీ ప్రతిభకు మెచ్చి కేంద్ర ప్రభుత్వం.. ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ అందించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా గతేడాది డిసెంబరులో అతడు ఈ అవార్డు అందుకున్నాడు. అయితే, సదరు యాక్టివిస్టు మాత్రం వైభవ్‌ను ఐపీఎల్లో ఆడించడం సరికాదని.. ఇది చైల్డ్ లేబర్ కిందకు వస్తుందంటూ కొత్త వాదన తెరమీదకు తెచ్చాడు.ఎన్నో కష్టనష్టాలకు ఓర్చికాగా వైభవ్ సూర్యవంశీ తల్లిదండ్రులు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి కుమారుడిని ఈ స్థాయికి తీసుకువచ్చారు. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టినా కుమారుడు లక్ష్యాన్ని చేరుకునేలా చేశారు. అయితే, చదువులోనూ వైభవ్ ముందే ఉంటాడని ఇటీవలే అతడి స్కూల్ యాజమాన్యం తెలిపింది. కాకపోతే ఈసారి ఐపీఎల్ కారణంగా అతడు సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలకు హాజరుకాలేకపోయాడు. ఇక గతేడాది మెగా వేలంలో 1.10 కోట్లకు వైభవ్‌ను కొన్న రాజస్తాన్ రాయల్స్.. ఈసారి పూర్తి స్థాయి ఓపెనర్‌గా బరిలోకి దించింది.చదవండి: Heinrich Klaasen: 'క్షమించండి.. అది సాధ్యం కాదు' -
బెంగళూరులో సెమీకండక్టర్ హబ్ కోసం 140 ఎకరాలు
దేశంలోనే సెమీకండక్టర్ పరిశ్రమకు ప్రధాన కేంద్రంగా ఎదుగుతున్న కర్ణాటక మరో కీలక మైలురాయిని చేరుకుంది. అమెరికాకు చెందిన ప్రఖ్యాత సెమీకండక్టర్ పరికరాల తయారీ దిగ్గజం ‘అప్లైడ్ మెటీరియల్స్ ఇంక్’ కోసం బెంగళూరులో 140 ఎకరాల భూమిని కేటాయించేందుకు రాష్ట్ర మంత్రివర్గం అధికారికంగా ఆమోదం తెలిపింది. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆనుకుని ఉన్న ‘బెంగళూరు సిగ్నేచర్ బిజినెస్ పార్క్’ (బీఎస్బీపీ)లో ఈ భారీ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. ఈ భూ కేటాయింపు ద్వారా రాష్ట్రంలో సెమీకండక్టర్ రంగం మరింత బలోపేతం కానుంది.కేటాయింపు ముఖ్యాంశాలుప్రాజెక్టు స్థలం: కెంపెగౌడ విమానాశ్రయ సమీపంలోని బెంగళూరు సిగ్నేచర్ బిజినెస్ పార్క్.కేటాయింపు భూమి: 140 ఎకరాలు.నిబంధన: లీజు-కమ్-సేల్ ప్రాతిపదికన కేటాయింపు.ధర: చదరపు అడుగుకు రూ.1,288 చొప్పున, మొత్తం రూ.780 కోట్ల విలువైన భూమిని కంపెనీకి కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.వ్యూహాత్మక ప్రాధాన్యతరాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ ఇటీవల ఫ్యూచర్ ఆఫ్ వర్క్ సమ్మిట్‌లో మాట్లాడుతూ, రాష్ట్రంలో చిప్ తయారీకి సంబంధించిన ఒక భారీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చామని పేర్కొన్న తరుణంలో ఈ వార్త వెలువడింది. కర్ణాటక ప్రభుత్వం సెమీకండక్టర్ డిజైన్, పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ), గ్లోబల్ క్యాబిలిటీ సెంటర్లపై (జీసీసీ) ప్రత్యేక దృష్టి సారిస్తోంది. అప్లైడ్ మెటీరియల్స్ రాకతో ఈ రంగంలో రాష్ట్రం తన పట్టును మరింత పెంచుకోనుందని మంత్రి చెప్పారు.పారదర్శకతకు పెద్దపీటఈ భూ కేటాయింపు చట్టబద్ధమైన అనుమతులు, ధరల నిర్ణయానికి లోబడి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. అలాగే, బీఎస్బీపీలో మిగిలి ఉన్న 267 ఎకరాల భూమిని ఏ విధంగా వినియోగించాలనే దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పారదర్శకత కోసం పోటీ బిడ్డింగ్, నిపుణుల సలహాల మేరకు తదుపరి విధివిధానాలను రూపొందించనున్నట్లు పరిశ్రమల శాఖ తెలిపింది.ఇదీ చదవండి: కోర్టు గదిలో వాదోపవాదాలు పీక్స్! -
బెంగళూరులో ఘోర విషాదం.. స్పాటికి సీఎం సిద్ధరామయ్య
-
వివాహేతర సంబంధం.. పోక్సో కేసుతో చిక్కుల్లో ఆనంద్ నాయుడు
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ నాయకుడు రెచ్చిపోయారు. తన ప్రేయసి.. పిల్లలపై(మైనర్లు) సదరు కాంగ్రెస్ నేత దాడి చేసిన విషయంలో చర్చనీయాంశంగా మారింది. దీంతో, ఆమె భర్త.. ఈ విషయమై పోలీసులను ఆశ్రయించడంతో పిల్లల రక్షణ చట్టం (పోక్సో) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన కలకలం రేపుతోంది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరు ఉత్తర జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) ప్రధాన కార్యదర్శి ఆనంద్ నాయుడు.. గత మూడు, నాలుగు సంవత్సరాలుగా ఒక వివాహితతో సంబంధంలో ఉన్నాడు. వీరిద్దరి సంబంధంపై ఆమె పిల్లలు వారిని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆగ్రహంతో రగిలిపోయిన ఆనంద్.. వారిని చితకబాదాడు. ఇనుప రాడ్‌తో పిల్లలపై విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో, వారికి గాయాలయ్యాయి.అనంతరం, ఇంటికి వచ్చిన ఆమె భర్త.. పిల్లల గాయాలు చూసి ఒక్కసారిగా షాకయ్యాడు. దీంతో, ఆనంద్, తన భార్య మధ్య ఉన్న సంబంధం బహిర్గతమైంది. వెంటనే తేరుకున్న బాధితులు.. స్థానిక పోలీసులను ఆశ్రయించారు. ఆనంద్ నాయుడు.. తన పిల్లల కాళ్లు, చేతులు, శరీరంలోని ఇతర భాగాలపై రాడ్లతో కొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ దాడి ఆరోపణలను పిల్లలు కూడా ధృవీకరించినట్లు సమాచారం. అనంతరం, పోలీసులు పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అంతేకాకుండా తన అనుమతి లేకుండా తన భార్య, నాయుడు ఆస్తిని బదిలీ చేశారని బాధితుడు ఆరోపించారు. దర్యాప్తు అధికారులు కేసులోని అన్ని కోణాలను పరిశీలిస్తున్నారని తెలిపారు.Congress MLA assaults minors with rod for questioning his extra-marital affair in KarnatakaAnand Naidu, the general secretary of Bengaluru North District Congress Committee, has been booked under the POCSO Act for allegedly assaulting two minors with a rod. pic.twitter.com/Bnq6WukHmZ— monkey. D. luffy (@luffy_735) April 29, 2026 -
‘బోష్’ మహిళా ఉద్యోగిని అనుమానాస్పద మరణం
బెంగళూరులోని ఒక అద్దె ఇంట్లో 34 ఏళ్ల మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించడం కలకలం రేపింది. రక్తపు మడుగులో ఆమె నగ్న మృతదేహం లభ్యం కావడం మరింత ఆందోళన రేపింది. ఫ్లాట్ నుండి దుర్వాసన వస్తుండటంతో ఇరుగుపొరుగువారు అధికారులకు సమాచారం అందించారు. దీంతో సోమవారం నాడు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మృతురాలిని జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాకు చెందిన పూజా దత్తాగా గుర్తించారు. ఆమె బెంగళూరులోని 'బాష్' (Bosch) కంపెనీలో పనిచేస్తోంది. గత మూడేళ్లుగా ఆమె బెంగళూరులో ఒంటరిగా నివసిస్తోంది.ఏం జరిగింది?పోలీసుల సమాచారం ప్రకారం సోమవారం నాడు ఆమె నివసిస్తున్న ఫ్లాట్ నుండి తీవ్రమైన దుర్వాసన రావడంతో పొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులొచ్చి తలుపులు పగులగొట్టి చూడగా, పూజా దత్తా మృతదేహం నగ్నంగా, రక్తపు మడుగులో పడి ఉంది. మృతదేహం అప్పటికే కుళ్ళిపోయిన స్థితిలో ఉంది. ఫోరెన్సిక్ నిపుణుల అంచనా ప్రకారం, మృతదేహం లభ్యం కావడానికి రెండు లేదా మూడు రోజుల ముందే ఆ మహిళ మృతిచెంది ఉంటుందని భావిస్తున్నారు.ఇదీ చదవండి: బండిపై 6 గురు బుడ్డోళ్లు, పేరెంట్స్‌ను అరెస్ట్ చేయాలి!గత మూడేళ్లుగా ఆమె తన ఫ్లాట్‌లో అద్దెకు నివసిస్తోందని, ఏప్రిల్ 23న కిరాణా సామాగ్రి కొనడానికి వెళ్లినప్పుడు ఆమె చివరిసారిగా కనిపించిందని ఇంటి యజమాని తెలిపారు. అయితే, గదిలో చెల్లా చెదురుగా పడి ఉన్న కాగితాలు తప్ప ఘటనా స్థలంలో ఎటువంటి ఆత్మహత్య లేఖ దొరకలేదు. అయితే తలుపు లోపలి నుండి వేసి ఉండటంతో, ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ, పోలీసులు దీనిని "అనుమానాస్పద మృతి"గా కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు పోస్టుమార్టం నివేదిక తర్వాత తెలిసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: మండే ఎండల్లో ఏసీలు పేలే ప్రమాదం : ఈ జాగ్రత్తలు మస్ట్ -
బండిపై 6 గురు బుడ్డోళ్లు, పేరెంట్స్‌ను అరెస్ట్ చేయాలి!
సాక్షి, బెంగళూరు: బెంగళూరు నగరంలోని ఒక రద్దీ రోడ్డుపై ఆరుగురు చిన్న పిల్లలు ఒకే స్కూటర్‌పై ప్రయాణిస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.. రోడ్డు భద్రతా నియమాలను దారుణంగా ఉల్లంఘించడమే కాకుండా, మైనర్లు డ్రైవింగ్ చేస్తుండటంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది?శ్రేయాస్ అనే ఎక్స్ యూజర్ ఆఫీసుకి వెళ్తుండగా ఈ దృశ్యాన్ని చూసి, ఫోటోలు తీసి ఎక్స్ వేదికగా పంచుకున్నారు. బెంగళూరు నగర పోలీసులను, బెంగళూరు ట్రాఫిక్ పోలీసులను ట్యాగ్ చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీని ప్రకారం సుమారు 10 నుండి 12 ఏళ్ల లోపు వయసున్న ఆరుగురు మైనర్లు (ఆడ, మగ) పిల్లలు ఒకే స్కూటర్‌పై కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. రైడర్‌తో పాటు అందరూ మైనర్లు కావడంతో తీవ్ర ఆందోళన రేపింది. రద్దీగా ఉండే బహిరంగ రహదారిలో ఒక చిన్న బాలుడే స్కూటర్‌ను నడుపుతున్నాడు. పైగా వీరిలో ఎవరికీ హెల్మెట్లు లేవు. దరిదాపుల్లో పెద్దలెవరూలేరు. ఈ ఘటన ఏప్రిల్ 26 గోరిపాళ్య సమీపంలోని పాదరాయణపుర మెయిన్ రోడ్డుపై జరిగింది. మరోవైపు ఈ ఫిర్యాదుకు స్పందిస్తూ, బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఆ పోస్ట్‌ను గుర్తించి, తదుపరి చర్యల కోసం మగడి రోడ్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అధికారిక ఖాతాను ట్యాగ్ చేశారు. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించి, వాహన యజమానిపై చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇదీ చదవండి: అమెరికా నుంచి వచ్చి ఆరేళ్లు : గార్డ్స్పై కత్తితో దాడి, షాకింగ్ రీజన్?నెటిజన్ల ఆగ్రహంస్కూటర్ రిజిస్ట్రేషన్ నంబర్ (KA05JZ9065) స్పష్టంగా కనిపిస్తుండటంతో, నెటిజన్లు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులను ట్యాగ్ చేస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు వీళ్లకి వాహనం ఇచ్చినందుకు తల్లిదండ్రులను కనీసం వారం రోజుల పాటు జైల్లో పెట్టాలి. వారి నిర్లక్ష్యం పిల్లల ప్రాణాల మీదకు తెస్తోందని కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేశారు. "వేసవి సెలవుల్లో పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనించాలి. ఇంత నిర్లక్ష్యమా?" పెద్దోళ్ని చూసే పిల్లలు నేర్చుకుంటారు. వీళ్లకి కేవలం జరిమానా వేస్తే సరిపోదని మరి కొందరు వ్యాఖ్యానించారు. నోట్ : మైనర్లు వాహనాలు నడపటం వల్ల ఇప్పటికే అనేక ఘోర ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటన మైనర్ డ్రైవింగ్ వల్ల కలిగే ప్రమాదాలపై మరోసారి హెచ్చరిస్తోంది. చట్టప్రకారం, మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితేవాహన యజమాని లేదా తల్లిదండ్రులకు భారీ జరిమానా లేదా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అంతేకాదు, ఆ వాహనం రిజిస్ట్రేషన్ కూడా రద్దవుతుంది. సదరు మైనర్‌కు 25 ఏళ్ల వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందే అర్హత ఉండదు.This is haappend on today 26/04/2026 morning 10:45 am those kid's illegally ridding scooter No. ( KA05JZ9065 ) on location ( Padarayanapura main road near gowripalya on opposite of total engineer auto gas ) new Bridge. please take necessary. @BlrCityPolice @blrcitytraffic pic.twitter.com/S4rrOE8vbD— Shreyas Shreyu (@Shreyas35240282) April 26, 2026 -
పోలీసులారా.. ఇదేం పని?
బెంగళూరు: పోలీసులు ఏమైనా చేయగలరు. నిజమైన నేరాలపై విచారణ చేయకుండా ప్రజలను తిప్పించుకుంటారు అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.నాగప్రసన్న అసంతృప్తి వ్యక్తంచేశారు. ఓ కేసులో పోలీసుల తీరును తప్పబట్టారు. రామనగర జిల్లా చన్నపట్టణ తాలూకా ఎంకె దొడ్డి పోలీసుస్టేషన్ పరిధిలో 2024లో రెండు పశువులు అదృశ్యమయ్యాయి. రెండేళ్ల తరువాత పశువుల సొంతదారు పక్కింటి వ్యక్తి సహా నలుగురిపై కేసు పెట్టాడు. తమకు సంబంధమే లేదని, ఈ కేసును కొట్టేయాలని మంగళమ్మ అనే నిందితురాలు హైకోర్టులో అర్జీ దాఖలు చేసింది. రెండేళ్ల తరువాత పొరుగింటివారిపై ఎలా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారని పోలీసులను జడ్జి ప్రశ్నించారు. కనీస విచారణ జరపలేదని, ఇది చట్ట ఉల్లంఘన అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు పశువులను వెతకటం మానేసి, సమాజంలో జరుగుతున్న తీవ్రమైన, నిజమైన నేరాల వెంటపడాలి. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని స్పష్టం చేశారు. ఇలాంటి కేసులు మళ్లీ తమ దృష్టికి వస్తే పోలీసులపై కఠినంగా వ్యవహరిస్తానని తెలిపారు. -
అందుకే కిరణ్‌కు నిప్పంటించా!
ప్రియుడ్ని ఇంటికి పిలిపించుకుని వెస్ట్రన్ స్టయిల్లో ప్రపోజ్ చేస్తానంటూ కుర్చీకి కట్టేసి మరీ తగలబెట్టి చంపేసింది ఓ ప్రియురాలు. ఈ కేసు దేశవ్యాప్తంగా.. అందునా సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారి తీసింది. ఈ కేసులో ఇప్పుడు మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తనతో వివాహానికి కిరణ్ ఒప్పుకున్నాడని నిందితురాలు ప్రేమ అలియాస్ ప్రేరణ చెబుతోంది.బెంగళూరులో ప్రియున్ని తన ఇంట్లో కుర్చీకి కట్టేసి పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసిన కేసులో నిందితురాలు ప్రేమ అలియాస్ ప్రేరణ నెమ్మదిగా నిజాలు బయటపెడుతోంది. కిరణ్‌ను తాను చాలా ప్రేమించేదాన్నని, అయితే అతడు మాత్రం శారీరక అవసరాలు తీర్చే వస్తువుగా తనను భావించేవాడని అంటోంది.వారం కిందట(21 ఏప్రిల్) బెంగళూరు శివారులోని బైదరహళ్లి పీఎస్ పరిధిలోని అంజనానగర్లో ఈ దారుణం జరిగింది. తుమకూరుకు చెందిన కిరణ్.. నగరంలోని ఓ మొబైల్ సర్వీస్ సెంటర్లో పనిచేస్తున్నాడు. అక్కడే పనిచేస్తున్న ప్రేమ(ప్రేరణ)తో ప్రేమలో పడ్డాడు. ఈ క్రమంలో మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిచింది. కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత.. కుర్చీలో కూర్చోబెట్టి ఫ్యాంట్, షర్ట్ ఊడదీసి కళ్లకు గంతలు కట్టింది. అనంతరం కాళ్లు, చేతులూ కట్టేసింది.ఆ సమయంలో కిరణ్ కంగారుపడ్డాడు. అయితే.. పాశ్చాత్య దేశాల్లో ఇలాగే చేస్తారని, తానూ అలా వినూత్నంగా ప్రేమను వ్యక్తం చేస్తానని (Love Proposal) నమ్మించింది. ఆ వెంటనే కిరోసిన్ పోసి నిప్పటించి తన మొబైల్లో రికార్డు చేసింది. స్థానికులు వచ్చేలోపే హాహాకారాలు చేస్తూ కుర్చీలోనే కిరణ్ సజీవదహనమయ్యాడు. ఘటన జరిగినప్పుడు తాను బాత్రూమ్లో ఉన్నానని, పొగ రావడంతో గమనించి బయటకు వచ్చేసరికి కిరణ్ కుర్చీలో కాలిపోయి ఉన్నాడని పోలీసులకు చెప్పింది. అయితే, ఆమె తీరుపై అనుమానంతో పోలీసులు గట్టిగా విచారించారు. దీంతో పథకం ప్రకారమే ప్రేమ అతడిని హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.నార్త్‌వెస్ట్ డీసీపీ డీఎల్ నగేష్ నేతృత్వంలోని టీం నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారించింది. తొలుత దూరం పెడుతున్నాడనే అతన్ని హత్య చేసిందని అంతా భావించారు. అయితే.. ‘‘కిరణ్‌ను తాను ఎంతో ప్రేమించానని.. కానీ, అతను తనను ఎంతో అవమానించేవాడని ప్రేమ పోలీసుల వద్ద కన్నీళ్లు పెట్టుకుంది. ‘కిరణ్ నన్ను శారీరక అవసరాల కోసం వాడుకుంటున్నాడన్న విషయం నాకు ఆలస్యంగా అర్థమైంది. పెళ్లి చేసుకుందామని అడిగా. ‘నువ్వు కులం తక్కువదానివి.. మా ఇంట్లో ఒప్పుకోరు’ అనేవాడు. ఈ విషయం ప్రేమించినప్పుడు.. కలిసి తిరిగినప్పుడు తెలియదా? అని గట్టిగా నిలదీశా. దీంతో పెద్దల్ని ఒప్పించి ఎలాగోలా వివాహం చేసుకుంటానన్నాడు. అయితే.. పెళ్లి తర్వాత కూడా కేవలం శారీరక అవసరం కోసమే తనతో ఉంటానని చెప్పేవాడు. ఆ మాట నాతోనే కాదు.. అతని స్నేహితుల వద్ద చెబుతూ నన్ను బూతులు తిట్టేవాడు. ఆ విషయం అతని స్నేహితులు రికార్డ్ చేసి పంపారు. నన్ను వాడుకుంటూ నన్నే తిట్టడం, అవమానించడం ఎంతో బాధించింది. భరించలేకపోయా.. అందుకే నిప్పు పెట్టి చంపేశా’’ అని పోలీసుల ముందు ప్రేరణ కన్నీళ్లతో నిజం ఒప్పుకుంది. -
మహిళల్ని ముందు, వెనుక వీడియోలు తీసి ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తారా?
యశవంతపుర: బెంగళూరులో నమ్మ మెట్రో రైళ్లలో ప్రయాణించే యువతులు, మహిళ ఫోటోలను రహస్యంగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ వికృతానందం పొందే నిందితునికి హైకోర్టులో మందలింపు దక్కింది. తనపై పెట్టిన కేసును రద్దు చేయాలని వేసిన ఫిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. నిందితుడు బీకే దిగంత్.. బెంగళూరు మెట్రో చిక్స్ అనే ఇన్‌స్టా ఖాతాలో ఈ ఫోటోలు, వీడియోలను పోస్టు చేసేవాడు. గత ఏడాది మేలో బనశంకరి పోలీసులు విచారణ జరిపి అతన్ని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో తనపై కేసు చెల్లుబాటు కాదని, కొట్టేయాలని నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు. ఈ అర్జీని విచారించిన న్యాయమూర్తి.. నిందితునిపై భగ్గుమన్నారు. మహిళలను ఎక్కడా సురక్షితంగా ఉండనివ్వరా? అని దిగంత్‌ను నేరుగా ప్రశ్నించారు. ఇలా చేయడం చూస్తే నీకు మానవత్వం ఉందా? అంటూ అర్జీని కొట్టివేశారు. మహిళలను ముందు, వెనుక నుంచి వీడియో తీసి ఎడిట్ చేసి ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తారా?, మీరు ఎలాంటి మనుషులు అని జడ్జి ఆగ్రహించారు. నిందితుని న్యాయవాది వాదిస్తూ, మహిళలు ఎవరూ ఫిర్యాదు చేయలేదు, పోలీసులు సుమోటో కేసుగా నమోదు చేసుకున్నారు. ఇక్కడ ఎలాంటి నేరానికి పాల్పడలేదని అన్నారు. అయితే సాంకేతిక అంశాలను చూపించి తప్పించుకోలేదని న్యాయమూర్తి చురకలు ముట్టించారు. కొన్ని విషయాలలో నైతికత, భద్రత ముఖ్యమన్నారు. మహిళల అనుమతి లేకుండా అశ్లీలంగా చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడమే పెద్దనేరమని న్యాయమూర్తి పేర్కొన్నారు. -
జస్ట్ ఆటో జర్నీ కాదు.. అంతకుమించి..!
చిన్న ఆటో అయినా..దాన్ని కస్టమర్లకు విభిన్నంగా పరిచయం చేసేలా సెట్ చేసే తీరు ఎవ్వరినైనా..ఇట్టే ఆకట్టుకుంటుంది. ఇంతకు మునుపు వరకు చల్లదనం కోసం మొక్కలతో, పర్యావరణ అనుకూలంగా మార్చిన అందమైన ఆటోలను చూశాం. కానీ ఈ ఆటో డ్రైవర్ అంతకు మించి అన్నట్లుగా.. ఆటో జర్నీని అందిస్తున్నాడు ప్రయాణికులకు. అందుకోసం ఏం చేస్తున్నాడంటే..అందుకు సంబంధించిన వీడియోని వర్ష అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది. ఆ వీడియోలో ఒక సాధారణ ఆటో ప్రయాణంలా కనిపించేదాన్ని చిత్రీకరించినట్లు ఉంటుందే తప్ప, అందులో విభిన్నంగా ఏమీ కనిపించదు. కానీ కెమెరా లోపలికి మారినప్పుడు, మొత్తం ఆటోజర్నీనే మంచి అనుభూతిగా మార్చేస్తోంది. ఆ వీడియోలో సాధారణ ఆటో ప్రయాణంలా మొదట్లో కనిపించినా..ఆ తర్వాత డ్రైవర్ సీటు వెనుక, పుస్తకాలతో నిండిన ఒక చిన్న అర ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. దొరికిన ఆ కొద్ది సమయం ఫోన్‌కి అంకితమవ్వకుండా కాసేపయినా పుస్తకాలు తెరిచేలా చేసే ప్రయత్నం ముచ్చటగొలుపుతుంది. వాటి తోపాటు ఆ ఆటోలో ప్రయాణికుల కోసం ఒక చిన్న క్యాండీల డబ్బా కూడా ఉంది. చిన్నపాటి ఆలోచన అయినా..ప్రయాణికులకు తమ జర్నీ సమయాన్ని విలువైనదిగా మార్చుకునేలా చేస్తోంది. పైగా ఫోన్‌ని స్క్రోల్ చేసే బదులు కొన్ని నిమిషాల పాటు చదువుకునేలా చేస్తుంది. మాములు ప్రయాణం అనుకున్నాం కానీ ఒక చిన్న లైబ్రరీగా మారింది అంటూ క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ షేర్ చేశారు. నెటిజన్లు సైతం ఈ వీడియోని సైతం “ఈ ఆటో సీఎన్జీతో గానీ, పెట్రోల్‌తో గానీ నడవడం లేదు, ఇది కేవలం కరుణతో నడుస్తోంది. అతడు అందిస్తున్న ప్రతిదానికి అంతకుమించిన ఆశీస్సులు అందాలి అని దీవిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by _np_ (@by.nanthithaparkavi) (చదవండి: సమానత్వానికి కేరాఫ్‌గా ఆ వివాహం..!) -
చెక్‌బౌన్స్ కేసులో బీజేపీ నేత సుమతి అరెస్ట్
సాక్షి, అనంతపురం: చెక్‌బౌన్స్ కేసులో కర్ణాటక బీజేపీ నేత సురతాని సుమతి అరెస్ట్ అయ్యారు. గురువారం కోర్టులో హాజరుపరచగా.. 14 రోజుల రిమాండ్ విధిస్తూ అనంతపురం ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కేసు విచారణ ఒక్క రోజులో పూర్తయ్యే అంశం కాకపోవడంతో రిమాండ్ విధించినట్టు కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అనంతపురం టూటౌన్ పోలీస్ స్టేషన్లో మాధవి అనే మహిళ ఫిర్యాదు మేరకు సుమతిపై చెక్ బౌన్స్ కేసు నమోదైంది. గతేడాది సెప్టెంబర్ 12న అనంతపురం ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. తాజాగా అరెస్ట్ తర్వాత రిమాండ్‌కు పంపింది. అయితే.. సుమతిపై ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లోని పలు పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. విజయవాడ పెనమలూరు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించి ఈ ఏడాది జనవరి 24న అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయ్యింది. ‘వాల్మీకి’ నిధుల గోల్‌మాల్‌లో సుమతి పాత్ర!కర్ణాటక వాల్మీకి అభివృద్ధి మండలి నిధుల గోల్మాల్ వ్యవహారం కర్ణాటక రాష్ట్రాన్ని కుదిపేసింది. ఈ వ్యవహారంలో రూ.80 కోట్లు గోల్మాల్ జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ నిధులను కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు బ్యాంకు ఖాతాలకు మళ్లించినట్టు ఈడీ ఆధారాలను సేకరించింది. దీంతో అప్పటి కర్ణాటక ఎస్టీ సంక్షేమ, క్రీడా శాఖల మంత్రి బి.నాగేంద్ర పదవికి రాజీనామా చేశారు. ఈ నిధుల అక్రమాల్లో అనంతపురం జిల్లాకు చెందిన పలువురి పాత్రపైనా ఈడీ దర్యాప్తు చేసింది. డొల్ల(షెల్) కంపెనీల ఏర్పాటు చేసి బ్యాంకు రుణాలు పొందడం, సబ్సిడీ తీసుకోవడం, చివరకు కంపెనీ నష్టపోయినట్టు లేదా ప్రమాదం జరిగినట్టు చూపించి రుణాలను ఎగవేయడం వంటి అంశాలపై ఈడీ ఆరా తీసింది. కర్ణాటక వాల్మీకి అభివృద్ధి మండలి నిధుల గోల్మాల్ వ్యవహారంలోనూ సుమతి పాత్ర ఉందనే ఆరోపణలు వచ్చాయి. -
హవ్వ..! మతపైత్యం అదుపులో ఉంచుకోలేరా?
మతాలు, కులాలు మనుషుల మధ్య అడ్డుగోడలుగా నిలవడం ఇవాళ్టి వ్యవహారం కాదు. ఈ గీతలు దాటిన ప్రేమలు ఎన్ని మొగ్గ తొడుగుతున్నప్పటికీ, పెళ్లిళ్లు ఎన్ని జరుగుతున్నప్పటికీ.. భవిష్యత్తులోనైనా ఏదో ఒకనాటికి సమసిపోతాయని అనుకునే వాతావరణం మాత్రం లేదు. ఎందుకంటే.. ఎంతగా ఆధునిక సమాజం ఈ అడ్డుగోడల్ని దాటి వికసిస్తున్నదో.. అంతకంటే ఎక్కువగా మనుషుల్లో కుల జాడ్యం, మతమౌఢ్యం మరింతగా వేళ్లూనుకుంటున్న ఉదాహరణలు మనకు సర్వత్రా కనిపిస్తుంటాయి. సున్నితమైన ఈ అంశాల్లో ఎదుటివారి మనోభావాల్ని గాయపరచడం మాత్రమే కాదు.. దారుణంగా రెచ్చగొట్టే భయావహ వాతావరణానికి గురిచేసే ఘటనలు మనకు నిత్యం అనేకం తారసపడుతుంటాయి. బెంగుళూరు నగరంలో కూడా అలాంటిదే ఒక సంఘటన చోటు చేసుకుంది.అబ్బిగెరె ప్రాంతంలో ఓ దంపతులు.. ఒక ముస్లిం వ్యక్తిని అభ్యంతరకరమైన మాటలతో నిందించారు. ‘నువ్వు ముస్లింవి. నువ్వు పాకిస్తానీవి. నువ్వొక టెర్రరిస్టువి’ అంటూ వారు అతడిని తూలనాడారు. ఇలాంటి మాటలు ఒక సాధారణ ముస్లింను ఎంతగా గాయపరుస్తాయో మనం అర్థం చేసుకోవచ్చు. వీరి నిందల పర్యవసానంగా స్థానికంగా ఒక సంస్థకు చెందిన వారు.. ఆ దంపతులకు సదవగాహన కల్పించి, బుద్ధిమాటలు చెప్పే ప్రయత్నం చేశారు. వారి ఇంటికి వచ్చి.. ఇలా ముస్లిం పేరుతో ఒక మనిషిని కించపరుస్తూ మాట్లాడడం, టెర్రరిస్టుగా అభివర్ణించడం తప్పు అని తెలియజెప్పే ప్రయత్నం చేశారు. నిజానికి ఆ సంస్థ తరఫున వచ్చిన వారిలో కేవలం ముస్లిములే కాదు. అన్ని మతాల వారూ ఉన్నారు. ముస్లిం అయిన ప్రతీ వ్యక్తిని టెర్రరిస్టుగా చిత్రీకరించి.. సభ్యసమాజంలో అశాంతికి, అపోహలకు బీజం వేసే ఇలాంటి బుద్ధులను ఎండగట్టారు. ఆ దంపతులకు వీరు బుద్ధి మాటలు చెబుతున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారుతోంది.ప్రత్యేకించి ఈ సంఘటనలో మరో సంగతి చెప్పుకోవాలి. ఈ సందర్భంగా ఆ దంపతుల్లో భర్త తమను గురించి తాము ఘనంగా చెప్పుకుంటూ.. నేను డిఫెన్సులో పనిచేస్తున్న వాడినే అంటూ గంభీరంగా సెలవిచ్చారు. డిఫెన్సులో పనిచేస్తున్న వ్యక్తివే అయితే గనుక.. నీలో మరింతగా దేశభక్తి ఉండాలి. ఈ దేశం అన్ని మతాలు, అన్ని ధర్మాల సమ్మేళనం అనే స్పృహ నీకు ఎక్కువగా ఉండాలి. పరమతసహనం కూడా నీలో ఎక్కువగా ఉండాలి.. కనిపించిన ప్రతి ముస్లింను పాకిస్తానీగా, టెర్రరిస్టుగా చిత్రీకరిస్తూ ఎలా మాట్లాడతావు? అంటూ వాళ్లు నిలదీశారు. చివరికి ఆ దంపతులు క్షమాపణ చెప్పబోయినప్పుడు కూడా.. మీరు క్షమాపణ చెప్పడం కాదు.. మీ ఆలోచన మార్చుకోవాలి.. అంటూ వారు హితవు చెప్పి వెళ్లడం గమనించాల్సిన సంగతి.Abbigere, BengaluruA woman and her husband (a former army officer) have been accused of making derogatory remarks to a Muslim man, saying, "You are Muslim, you are Pakistani, you are a terrorist." Subsequently, members of an organization arrived at the scene, protested. pic.twitter.com/5YwFlPieHg— The Muslim (@TheMuslim786) April 22, 2026మనం చాలా సందర్భాల్లో గమనిస్తుంటాం. ఇళ్లు అద్దెకు తీసుకునేందుకు తిరిగేవారిని మీరు శాకాహారులైతేనే ఇస్తాం’ అని చెప్పే వాళ్లు మనకు పురాతన కాలం నుంచి ఇవాళ్టికీ కనిపిస్తూనే ఉంటారు. ఇలాంటి మనుషుల్ని తప్పుబట్టే వాళ్లూ ఉంటారు. అయితే అలాంటి వారి బాధల్ని కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ.. ముస్లిం అయిన వ్యక్తి కనిపిస్తే చాలు.. ‘మీరంతా పాకిస్తానీలు.. మీరంతా టెర్రరిస్టులు..’ అని నిందించే వారిని ఏమనాలి? పాకిస్తాన్ మీద ఉన్న ద్వేషాన్ని ఒక మతానికి ఆపాదించడమూ, ఆ మతానికి చెందిన అందరి మీదా టెర్రరిజం ముద్ర వేసేయడమూ ఎంత అనైతికం అనే చర్చ ఇప్పుడు ప్రజల్లో నడుస్తోంది.దుర్మార్గాలు కులాల్ని బట్టి, మతాల్ని బట్టి ఉండవు. కేవలం మనుషుల్లో ఉండే బుద్ధుల్లో మాత్రమే ఉంటాయి. అలాంటి తప్పుడు మనుషులు ఒకే మతంలో లేదా ఒకే కులంలో ఉంటారని అనడం, ఆపాదించడం సుహృద్భావ సమాజ ఆవిష్కరణకు పెనుద్రోహం అవుతుంది. ఆ సత్యం మనలో ప్రతి ఒక్కరూ తెలుసుకోగలిగితే.. ఏ ఇద్దరు మనుషుల మధ్య కూడా ఎలాంటి అపోహలూ ఉండని మంచి రోజులు తప్పకుండా వస్తాయి.-యం.రాజేశ్వరి. -
సర్ ప్రైజ్.. ప్రియుడిని కుర్చీలో కట్టేసి
-
భరణం పేరుతో భర్తపై 'భారం' విడాకుల కేసుల్లో విడ్డూరాలు?
-
సందిట్లో సడేమియా RTC సమ్మెతో.. తెలంగాణలో కర్ణాటక స్పెషల్ బస్సులు
-
డిఫరెంట్ గా ప్రపోజ్ చేస్తానని పిలిచి లవర్ పై పెట్రోల్ పోసి తగలబెట్టిన ప్రేయసి
-
హోం స్టేలో యుఎస్ యువతిపై అత్యాచారం
బెంగళూరు: కర్ణాటకలో దారుణం జరిగింది. హోం స్టేలో నివాసం ముంటున్న ఓ యుఎస్ మహిళ అత్యాచారానికి గురైంది. మూడురోజులుగా తనను లైంగిక వేదింపులకు గురి చేస్తున్నట్లు మహిళ పేర్కొంది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు.వివరాల్లోకి వెళితే కొడుగులోని ఓ హోమో స్టేలో ఒక అమెరికన్ మహిళ తాత్కాలిక నివాసం ఉంటుంది. అయితే ఆమెపై గత మూడురోజులు అందులో పనిచేసే వ్యక్తి అత్యాచారం చేసినట్లు యువతి పేర్కొంది. ఆ సమయంలో ఆమె ఎవరిని సంప్రదించకుండా వైపై సేవలు నిలిపివేసినట్లు పేర్కొంది. దీంతో తను మైసూరు వెళుతున్నానని చెప్పి అక్కడి నుండి తప్పించుకున్నానని కంప్లేంట్‌లో తెలిపింది. అనంతరం అక్కడి నుండి యుఎస్ ఎంబసీని సంప్రదించగా వారు మైసూరు పోలీసులకు వివరాలు తెలియజేశారు.దీంతో వివరాలు తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. హోం స్టే నిర్వాహకుడితో పాటు అందులో పని చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు కొడగు ఎస్పీ తెలిపారు. నిందుతుడు జార్ఖండ్‌కు చెందిన వృజేశ్ కుమార్‌గా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ కేసుపై లోతైన విచారణ జరుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
ప్రేమ.. ఎంత పని చేసింది?
ప్రేమలో అనుమానం ఎంత ఘోర పరిణామానికి దారి తీస్తుందో తెలియజేసే ఘటనే ఇది. ఓ యువతి తన ప్రియుడ్ని ఇంటికి పిలిచి ఘాతుకానికి పాల్పడింది. తనను పట్టించుకోవడం లేదనే అనుమానంతో అతన్ని సజీవదహనం చేసిన ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో కలకలం రేపింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ కథనం అసలు వివరాల్లోకి వెళ్తే.. ప్రేరణ, కిరణ్ ఇద్దరూ ఓ టెలికాం స్టోర్‌లో జాబ్ చేస్తున్నారు. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఒకరినొకరు ఇష్టపడ్డారు కూడా. అయితే కొంత కాలంగా అతను ఆమెను దూరం పెడుతూ వస్తున్నాడు. తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని.. మరో యువతితో సన్నిహితంగా ఉంటున్నాడని ఆమె అనుమానించింది. తనకు దక్కనిది ఎవరికీ దక్కకూడదని భావించింది. మంగళవారం దక్షిణ బెంగళూరులో ఉన్న తన ఇంటికి రావాలంటూ పిలిచింది. వెరైటీ ప్రపోజ్ ప్లాన్ గురించి చెప్పింది. దానికి తొలుత అతను ఒప్పుకోలేదు. అయితే ఫారిన్లో ఇదంతా కామన్ అని బలవంతం చేసేసరికి సరే అన్నాడు. కిరణ్‌ను ఓ కుర్చీలో కూర్చోబెట్టి కాళ్లు చేతులు కట్టేసింది. కళ్లకు గంతలు కట్టేసింది. అతను నిజంగానే ఆమె ఏదో సర్ప్రైజ్ ఇవ్వబోతోందని ఆశపడ్డాడు. కానీ.. ఇంట్లో అప్పటికే దాచిన కిరోసిన్‌ను తెచ్చి అతని మీద పోసి నిప్పంటించి దూరం నుంచి ఫోన్లో వీడియో తీయసాగింది. కిరణ్ ఆరుపులు విని స్థానికులు పరుగెత్తుకుంటూ వచ్చి రక్షించే ప్రయత్నం చేసినా, అప్పటికే అతను మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసుల విచారణలో.. తనను పెళ్లి చేసుకోడనే అనుమానంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఆమె ఒప్పుకుంది. దీంతో ఆమెను అరెస్ట్ చేశారు.ఈ ఘాతుకానికి సంబంధించిన వీడియోను ఆమె ఫోన్ నుంచి స్వాధీనపర్చుకున్నారు. కిరణ్-ప్రేరణల మధ్య స్నేహం గురించి తమకు తెలుసని.. వాళ్లు ఒప్పుకుంటే వివాహం కూడా జరిపించాలని తాము భావించామని ఇరువైపులా పెద్దలు చెబుతున్నారు. ప్రేమ అనేది నమ్మకం.. కానీ అనుమానం ప్రాణాలు తీసింది అని సోషల్ మీడియాలో కొందరు కామెంట్లు చేస్తున్నారు. -
బాయ్‌ఫ్రెండ్ కళ్లకు గంతలు కట్టి.. నిప్పంటించిన అమ్మాయి
బెంగళూరు: టెలికాం స్టోర్‌లో పని చేసే ఓ యువతి తన ప్రియుడిని ఇంటికి పిలిచి, కొత్త తరహా ప్రపోజల్ అంటూ కళ్లకు గంతలు కట్టింది. ఆ తర్వాత అతడిని కుర్చీకి కట్టేసి, అతడికి నిప్పు అంటించింది. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. తన ప్రియుడు తనను పట్టించుకోలేదని కోపంతో ఆ యువతి ఈ ఘటనకు పాల్పడింది. అతడు కాలిపోతోంటే కెమెరాలో చిత్రీకరించి, అతను చనిపోయే వరకు చూస్తూ ఉండిపోయింది.ఆ అమ్మాయి పేరు ప్రేర్నా(27). కిరణ్ (27)తో అదే టెలికాం స్టోర్‌లో పనిచేస్తోంది. వారిద్దరు ఏడాది పైగా రిలేషన్షిప్లో ఉన్నారు. ఇటీవలి కాలంలో కిరణ్ తనను పట్టించుకోవడం లేదని, తనను పెళ్లి చేసుకోడని ప్రేర్నాకు అనిపించింది. మంగళవారం ప్రేర్నా తన తల్లి, అన్నతో కలిసి నివసించే దక్షిణ బెంగళూరు అంజనాపుర ప్రాంతంలోని ఇంటికి కిరణ్‌ను పిలిచింది. ఇంట్లో ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో కిరణ్ ఆమె ఇంటికి వచ్చాడు. కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత ఆ యువతి అతని కళ్లకు గంతలు కట్టి కుర్చీలో కూర్చోబెట్టింది. ఆ యువకుడు అభ్యంతరం చెప్పినప్పుడు.. విదేశాల్లో ప్రాచుర్యం పొందుతున్న విధంగా ప్రపోజ్ చేయాలనుకుంటున్నానని ఆ యువతి చెప్పింది. కిరణ్ ప్రపోజల్ కోసం ఎదురు చూశాడు. అప్పటికే ముందుగా సిద్ధం చేసుకున్న పెట్రోల్ వంటి ద్రావణాన్ని అతడిపై పోసింది ప్రేర్నా. “ప్రేర్నాను అదుపులోకి తీసుకున్నాం. అతనికి ఆమె నిప్పు పెట్టి హత్య చేసినట్టు నిర్ధారణ అయ్యింది. ఇద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారు. అతను తనను పట్టించుకోలేదని ఆమె భావించింది” అని పోలీసులు తెలిపారు. -
కోడలిపై కన్నేసిన మామ.. చివరికి జైలు పాలయ్యాడు!
కర్ణాటక: అక్రమ సంబంధాన్ని కొనసాగించడానికి నిరాకరించిన కోడలిని హత్య చేసిన మామకు మైసూరు ఐదవ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.వివరాలు..దోషి గంటయ్య కుమారుడు చిక్కలూరియాకు కవిత అనే యువతితో వివాహమైంది. ఆమె ఒక ప్రైవేట్ కళాశాలలో స్టోర్ కీపర్‌గా పనిచేసేది. మామ గంటయ్య ఆమెతో అక్రమ సంబంధం కలిగి ఉంది. ఆ సంబంధం కొనసాగించేందుకు కవిత అంగీకరించలేదు. అయితే కవిత మహేష్ అనే వ్యక్తితో సంబంధం పెట్టుకుందని గంటయ్య అనుమానించాడు. 2023 జూలై 10న తెల్లవారుజామున కవిత నిద్రలో ఉండగా గంటయ్య సుత్తితో తలపై, నుదుటిపై బాది హత్య చేశాడు. పోలీసులు గంటయ్యపై కేసు నమోదు చేసి, కోర్టుకు ఛార్జిషీట్ సమర్పించారు. నేరం నిరూపణ కావడంతో గంటయ్యకు యావజ్జీవ కారాగార శిక్ష, రూ. 1.5 లక్షల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి కె. ఎన్.రూపా తీర్పు వెలువరించారు. తప్పుడు సాక్ష్యం ఇచ్చిన ప్రభుత్వ అధికారి మైఖేల్ మాథ్యూపై శాఖాపరమైన విచారణకు న్యాయమూర్తి ఆదేశించారు. ప్రభుత్వం తరఫున న్యాయవాదులు బి. ఇ. యోగేశ్వర్, ఏ.ఎన్. మధు వాదించారు. -
బైక్ ట్యాక్సీలకు భారీ షాక్..?
బెంగళూరు: బైక్ ట్యాక్సీల విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం, రవాణా శాఖ నిర్ణయించాయి. రాష్ట్రంలో బైక్ ట్యాక్సీల విధానానికి నియమావళి రూపొందించే ఉద్దేశం లేదని చెబుతున్న ప్రభుత్వం, హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేయనుంది. గతేడాది హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం బైక్ ట్యాక్సీలను అనధికారికమని ప్రకటించి నిషేధించింది. అయితే ఈ జనవరి 23న ద్విసభ్య ధర్మాసనం బైక్ ట్యాక్సీలకు అనుమతిస్తూ ఆయా సంస్థలకు లైసెన్సులు ఇవ్వాలని సర్కారును ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం బైక్ ట్యాక్సీలకు అవకాశం లేదని సర్కారు వాదించింది. మూడు నాలుగు రోజుల్లో బైక్ ట్యాక్సీల నిషేధం కోసం సుప్రీంలో పిటిషన్ సమర్పించనుంది. దీంతో వేలాదిమంది రైడర్లు అయోమయంలో పడిపోయారు. -
ఇంట్లో అందమైన భార్య ఉన్నా.. పరస్త్రీ మోజుతో దారుణం
సాక్షి,బళ్లారి: వారిద్దరిరి జంట చూడముచ్చటైనదని పెళ్లి రోజు రెండు కుటుంబాల వారు సంబరపడ్డారు. పెళ్లయి రెండున్నర సంవత్సరాలకే అక్రమ సంబంధం వ్యామోహంలో పడిన భర్త తన భార్యను వేధింపులకు గురి చేయడం ప్రారంభించడంతో పాటు వరకట్న వేధింపులకు గురి చేయడం కూడా మొదలు పెట్టారు. అక్రమ సంబంధం మోజు రోజు రోజుకు పెరిగిపోవడంతో అందమైన భార్యను హతమార్చాలని కుట్ర పన్ని ఆ దిశగా పథకం పన్నారు. భర్త వేధింపులు తదితరాలను భార్య రోజు సెల్ఫోన్లో చిత్రీకరించింది. వివరాల్లోకి వెళితే... దావణగెరె తాలూకా మండలూరు గ్రామానికి చెందిన పేదింటి అందమైన అమ్మాయి కావ్యకు చెన్నగిరి తాలూకా హూదగెరె గ్రామానికి చెందిన మను అనే వ్యక్తితో రెండున్నర సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. మను ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఆడబిడ్డ తల్లిదండ్రులు సంబరపడి పెళ్లి చేశారు. పెళ్లిలో అష్టకష్టాలతో రెండున్నర లక్షల నగదు, 70 గ్రాముల బంగారం కూడా ఇచ్చి ఘనంగా పెళ్లి జరిపించారు. భార్యను అంతమొందించాలని వేధింపులు అయితే పెళ్లి అయిన రెండు సంవత్సరాల నుంచి భార్యను విపరీతంగా వేధించడం మొదలుపెట్టిన మను తీరును భార్య గమనించింది. పరస్త్రీ మోజులో పడి తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని గమనించి తల్లిదండ్రులకు తెలిపిన తర్వాత పంచాయతీ కూడా చేశారు. దావణగెరె నగరంలో కాపురం ఉంటున్న కావ్య, మను మంత్రాలయానికి వెళ్లాలని ఏర్పాట్లు చేసుకున్నారు. భార్యను హత్య చేయాలని పథకం వేసుకున్న మను ఆ దిశగా ఆమెను హత్య చేసిన తర్వాత అత్తమామలకు ఫోన్ చేసి కావ్య ఫోన్ పని చేయడం లేదని చెప్పారు. తల్లిదండ్రులు దావణగెరెకి వచ్చి పరిశీలించగా, కుమార్తె అచేతనంగా పడి ఉండటం గమనించి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే కావ్య మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. కూతురు మృతితో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కుమార్తె సెల్‌ఫోన్ పరిశీలించగా భర్త గుట్టురట్టు కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్య మిస్టరీని సెల్‌ఫోన్ ద్వారా ఛేదించి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
తీర్థయాత్ర విషాదాంతం ఆరుగురు సజీవ దహనం
రాయచూరు రూరల్: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తీర్థయాత్ర విషాదాంతమైంది. ఆరుగురు సజీవదహనమయ్యారు. ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన యాదగిరి జిల్లాలో శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో జరిగింది. యాదగిరి జిల్లా సురపుర తాలూకాలో జాతీయ రహదారి– 150పై శాంతాపుర వద్ద బెంగళూరు నుంచి కలబుర్గికి వెళుతున్న ప్రైవేట్ బస్సు, కలబుర్గి నుంచి లింగసుగూరు వైపు వస్తున్న కారు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. ఆ వెంటనే మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన బస్సులోని ప్రయాణికులందరూ కిందకు దిగారు. ప్రమాద తీవ్రతకు కారు డోర్లు తెరచుకోకపోవడంతో అందులోని ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రయాణికులు బయటికి రాలేక సజీవ దహనమయ్యారు. ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా రాయచూరు జిల్లా సిరవారకు చెందిన పంచాయతీ మాజీ సభ్యుడు కృష్ణానాయక్ కుటుంబ సభ్యులు.తిరుగు ప్రయాణంలో దుర్ఘటనఅమావాస్య కావడంతో శుక్రవారం సురపురలోని వేణుగోపాల స్వామి ఆలయాన్ని దర్శించుకునేందుకు ఉదయాన్నే 6.30 గంటలకు రాయచూరు జిల్లా సిరవార నుంచి పట్టణ పంచాయతీ మాజీ సభ్యుడు కృష్ణా నాయక్ కుటుంబం కారులో బయలుదేరింది. స్వామిని దర్శించుకుని 10.45 గంటలకు తిరుగు ప్రయాణమైన కొద్దిసేపటికే ప్రమాదం జరగడంతో కృష్ణా నాయక్(52), ఆయన భార్య అనంతకళ(45), కుటుంబ సభ్యులు శరణప్ప (36), నిసర్గ (30), సిద్ధార్థ(3), శశికళ(30) మరణించారు. కారుడోర్లు తెరుచుకోకపోవడంతో సజీవదహనమయ్యారు. వెనకవైపు కూర్చున్న పిల్లలు అద్విక, శ్రీనిధిని అటుగా వెళ్లేవారు అద్దాలు పగలగొట్టి బయటకు లాగారు. అయినా అప్పటికే పిల్లలిద్దరు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం యాదగిరి ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించినట్లు జిల్లా ఎస్పీ పృథ్వీశంకర్ తెలిపారు. బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది సురక్షితంగా బయట పడగా, కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. మంటల్లో కారు, బస్సు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనా స్థలాన్ని సురపుర ఎమ్మెల్యే వేణుగోపాల నాయక్ పరిశీలించారు. క్షతగాత్రులను పరామర్శించారు. కృష్ణా నాయక్‌తో పాటు కుటుంబ సభ్యులు దుర్మరణం చెందడంపై రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు, ఎమ్మెల్యేలు హంపయ్య నాయక్, బసనగౌడ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
కాంగ్రెస్ ఎమ్మెల్యేకి జీవితఖైదు
బెంగళూరు: కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వినయ్ కులకర్ణికి జీవితఖైదు విధించింది ప్రజాప్రతినిధుల కోర్టు. బీజేపీ నేత యోగేష్‌గౌడ్ హత్య కేసులో వినయ్ కులకర్ణిని దోషిగా నిర్ధారించిన కోర్టు.. జీవితఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. 2016లో యోగేష్ గౌడ్ హత్యకు గురయ్యారు. ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘ విచారణల అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణితో పాటు మరో 16 మందికి ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం యావజ్ఝీవ కారాగార శిక్ష విధించింది. ఈ కేసులో ఇప్పటికే దోషిగా వినయ్ కులకర్ణిని నిర్ధారించిన కోర్టు.. శిక్షా కాలాన్ని శుక్రవారం ఖరారు చేసింది. ఈ ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్ శిక్షా కాలాన్ని ఖరారు చేశారు. ఈ కేసుకు సంబంధించి వినయ్ కులకర్ణి, మరో 16 మందిపై హత్య (సెక్షన్ 302), నేరపూరిత కుట్ర (సెక్షన్ 120బి) నేరాలకు పాల్పడినట్లు న్యాయస్థానం నిర్ధారించింది.ఈ హత్య కేసులో పదవిలో ఉన్న శాసనసభ్యుడి ప్రమేయం ఉన్నందున సమాజానికి గట్టి సందేశం పంపే శిక్ష విధించాలని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లు శివానంద పెర్ల , ఎస్. హేమహద్‌లు వాదించారు. యావజ్జీవ కారాగార శిక్ష విధించాలని తమ వాదనలు వినిపించారు. అయితే వినయ్ కులకర్ణి న్యాయబృందం మాత్రం ఆయనకున్న కనికరం చూపి శిక్ష తగ్గించాలని అ భ్యర్థించిన ప్పటికీ నేరం యొక్క తీవ్రతను బట్టి యావజ్జీవ శిక్ష ఖరారు చేసింది కోర్టు.యోగేష్ గౌడ్ హత్య ఇలా..2016, జూన్ 15న బీజేపీ ధార్వాడ్ జిల్లా పంచాయత్ సభ్యుడైన యోగేష్‌గౌడ గౌడర్‌ను ధార్వాడ్‌లోని ఆయన జిమ్‌లో దారుణంగా నరికి చంపారు. మొదట్లో స్థానిక పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేపట్టారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఈ కేసును స్థానిక పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ చేశారు. అప్పటి జిల్లా ఇన్చార్జ్ మంత్రి కులకర్ణి అప్పటి జిల్లా ఇన్చార్జ్ మంత్రి కులకర్ణి.., ఎదుగుతున్న రాజకీయ ప్రత్యర్థిని అణచివేసేందుకు ఈ హత్యను చేయించారనే ఆరోపణలు వచ్చాయి. అయితే 2016లో హత్య జరిగితే 2019లో ఈ కేసును సీబీఐకి బదిలీ చేశారు. -
కర్ణాటకలో బిగ్ ట్విస్ట్.. సిద్దరామయ్యకు ఎదురుగాలి!
సాక్షి, బెంగళూరు: కొన్ని నెలలుగా కన్నడ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి కుర్చీ గురించి రగడ జరుగుతూనే ఉంది.. సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్ మధ్య పోరాటంతో ప్రభుత్వంలో, పార్టీలో వర్గాలు ఏర్పడ్డాయి. అంతఃకలహాలు అధికం కావడంతో ఆధిక్యం కోసం ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. కొన్నిరోజులుగా సీఎం సిద్ధరామయ్య శిబిరంపై దాడులు జరుగుతున్నాయి. పలువురు సిద్ధరామయ్య సన్నిహితులు పదవులు కోల్పోయేలా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ శిబిరం చేయగలిగింది. వరుస ఎదురుదెబ్బలతో సీఎం సిద్ధరామయ్య డైలామాలో పడిపోయారు. రాజణ్ణ నుంచి షురూ సీఎం ఆప్తుడు మంత్రి కేఎన్ రాజణ్ణ.. రాహుల్ గాంధీ మీద నోరు జారడంతో వెంటనే పదవి నుంచి తొలగించారు. దావణగెరె ఉప ఎన్నికలు వచ్చాక సిద్దరామయ్యకు ఎదురుగాలి అధికమైంది. అక్కడ తిరుగుబాటు అభ్యర్థికి మద్దతిచ్చారని సీఎం రాజకీయ కార్యదర్శి పదవి నుంచి నజీర్ అహ్మద్ సస్పెండ్, మైనారిటీ నేత అబ్దుల్ జబ్బార్‌ను పదవితో పాటు పార్టీ సభ్యత్వం నుంచి తీసేయడం కలకలానికి కారణమైంది. సిద్ధరామయ్య కూడా సన్నిహితులను కాపాడుకోవడానికి ఎక్కువ పోరాటం చేయడం లేదు. ఈ సమయంలో కేపీసీసీ చీఫ్‌గా డీకే శివకుమార్ పోరును తీవ్రం చేశారు. భవిష్యత్ కష్టమే.. భవిష్యత్తులో మరింత మంది సిద్ధరామయ్య వర్గీయులకు ఎదురు దెబ్బలు తగిలినా ఆశ్చర్యం లేదని తెలుస్తోంది. నోటీసులు, క్రమశిక్షణ చర్యల హెచ్చరికలు కాకుండా నేరుగా పదవి నుంచి తప్పించే ప్రయత్నాలు కొనసాగుతాయని తెలుస్తోంది. తాను ముఖ్యమైన పదవిలో ఉండడంతో పాటు పార్టీ పరిమితుల దృష్ట్యా సిద్ధరామయ్య మౌనం వహిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పుడు తన పదవిని కాపాడుకోవడం చాలా ముఖ్యమని సిద్ధరామయ్య భావిస్తున్నట్లు పలువురు సీనియర్లు పేర్కొన్నారు. త్వరలో బెంగళూరుకు ఓ చెందిన ఓ మంత్రిని కూడా పార్టీ హైకమాండ్ తప్పించవచ్చని జోరుగా ప్రచారం సాగుతోంది. మునుముందు ఏం జరుగుతుందనేది సస్పెన్స్‌గా ఉంది. బెంగళూరు విమానాశ్రయంతో ప్రధాని మోదీ, సిద్దరామయ్య చెవిలో మంతనాలు జరపడం దేనికి సంకేతమని తీవ్ర చర్చనీయాంశమైంది. -
కర్నూలులో ఘోర ప్రమాదం.. 8 మంది దుర్మరణం
సాక్షి, కర్నూలు: జిల్లాలో గురువారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ వాహనం- రెడీమిక్స్ లారీ ఢీ కొట్టి ఎనిమిది మంది మృతి చెందారు. మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మంత్రాలయం మండలం చిలకలడోన సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం ధాటికి బొలెరో వాహనం నుజ్జునుజ్జు అయ్యింది. మరోవైపు లారీ కూడా ఓ పక్కకు ఒరిగి పడిపోయింది. ఘటనాస్థలంలోనే ఐదుగురు మృతిచెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు చనిపోయారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, మూడేళ్ల చిన్నారి, వాహన డ్రైవర్‌తో సహా మరో వ్యక్తి. గాయపడినవాళ్లలో మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల పేర్లు.. కుమార్ (60), దీపిక వీణ (35), సునీల్ (40), బెల్లి (3), పుట్టమ్మ (60), మీనాక్షి (50), తాయమ్మ (60), లోలాక్షి. కర్ణాటక చిక్మంగళూరు వాసులుగా గుర్తించారు. మంత్రాలయ శ్రీరాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్తుండగా ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాద సమయంలో బొలెరోలో 16 మంది ఉన్నారు. మృతదేహాలను ఎమ్మిగనూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. -
గ్యాస్ సిలిండర్‌తో భర్తపై దాడి.. ప్రియుడితో కలిసి కుట్ర
కర్ణాటక: తప్పటడుగులతో భార్యాభర్తల సంబంధాలు అవహేళనకు గురవుతున్నాయి. ఎవరో ఒకరు పరుల వ్యామోహంలో చిక్కుకుని రక్తపాతానికీ వెనుకాడడం లేదు. ఇదే మాదిరిగా తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఆగ్రహించిన భార్య తన ప్రియునితో కలిసి భర్తను హత్య చేయించిన సంఘటన బెళగావి నగరంలో తిళకవాడి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఆయుర్వేద వైద్యుడు అవినాశ్ సుప్పన్న (40) హత్యకు గురైన వ్యక్తి. ఈ కేసులో ఇతని భార్య లక్ష్మి (29), ఆమె ప్రియుడు కైలాస బాలక్రిష్ణ (43) అరెస్టయ్యారు. గ్యాస్ సిలిండర్‌తో బాది.. వివరాలు.. అవినాశ్ 5న తన ఆయుర్వేదిక్ కేర్ సెంటర్లో తలకు తీవ్ర గాయమై చనిపోయాడు. మృతిపై అనుమానాలున్నాయని అతని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్య మాత్రం అధిక బీపీ వల్ల కిందపడి చనిపోయి ఉంటాడని నమ్మబలికింది. కేసు నమోదు చేసుకున్న తిళకవాడి పోలీసులు సీసీ కెమెరాల చిత్రాలు, ఫోన్ కాల్స్ ఆధారంగా దర్యాప్తు చేసి కనిపెట్టారు. లక్షి్మ, బాలక్రిష్ణ మధ్య అక్రమ సంబంధం ఉండగా, ఇది తెలిసి అవినాశ్ భార్యను మందలించాడు. బాలక్రిష్ణ వీరి ఇంటికి దగ్గరిలోనే ఓ మొబైల్ఫోన్ల షాప్ నడిపేవాడు. తమ సంతోషానికి అడ్డుగా ఉన్న అతన్ని తొలగించుకోవాలని భార్య, ప్రియుడు నిర్ణయించారు. అవినాశ్ తన క్లినిక్‌లో ఉండగా, పథకం ప్రకారం బాలక్రిష్ణ చొరబడి అక్కడి గ్యాస్ సిలిండర్‌తో తలపై, గుండెల మీద బలంగా కొట్టి హత్య చేసి వెళ్లిపోయాడని పోలీస్ కమిషనర్ భూషణ్ బోర్సే తెలిపారు. లక్ష్మి తనకు ఏం తెలీదని బుకాయించినా పొంతనలేని సమాధానాలు ఇస్తుండడంతో పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా నిజం బయటకు వచ్చింది. నిందితులను అరెస్టు చేశారు. ఈ సంఘటన బెళగావిలో తీవ్ర సంచలనం కలిగిస్తోంది. -
కొండల్లో కేరళ బాలిక మిస్సింగ్.. నాలుగు రోజుల తర్వాత..
కర్ణాటక కొండల్లో కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లి అదృశ్యమైన 14 ఏళ్ల కేరళ బాలిక నాలుగు రోజుల తర్వాత శవమై కనిపించింది. పోలీసులు ముమ్మరంగా గాలించిన తర్వాత ఆమె మృతదేహం లభ్యం కాగా.. తమ బిడ్డను ఎవరో కిడ్నాప్ చేశారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన 10వ తరగతి విద్యార్థిని శ్రీనంద తన బంధువులతో సుమారు 40 మందితో కలిసి కర్ణాటక పర్యటనకు వచ్చింది. వీరు మొదట ఉత్తర కర్ణాటకలోని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద హంపిని సందర్శించారు. ఏప్రిల్ 7వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు చిక్కమగళూరు చేరుకున్నారు. అక్కడ ప్రైవేట్ జీపుల్లో ఒక పుణ్యక్షేత్రానికి వెళ్లి.. ఆ తర్వాత చంద్రద్రోణ కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లారు.ట్రెక్కింగ్ రోజున ఒక కుటుంబ సభ్యుడితో కలిసి ఉన్న వీడియోలో బాలిక చివరిసారిగా కనిపించింది. అయితే, ఏప్రిల్ 7వ తేదీ సాయంత్రం 6 గంటల ప్రాంతంలో చీకటి పడుతున్న సమయంలో ఆమె అదృశ్యమైంది. కొండల్లోని మాణిక్యధార ప్రాంతంలో ఆమెను చివరిగా చూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు వెతికినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. లోతైన ఘాట్ ప్రదేశాలు, ఎత్తైన కొండ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. లోతైన ప్రాంతాలకు వెళ్లేందుకు తాళ్లను కూడా ఉపయోగించారు. రాత్రి సమయాల్లో డ్రోన్ సర్వైలెన్స్, థర్మల్ కెమెరాలను వినియోగించారు. నాలుగు రోజులు పాటు గాలింపు అనంతరం మాణిక్యధార వ్యూ పాయింట్‌కు సుమారు 1,500 అడుగుల దిగువన ఉన్న లోయలో శ్రీనంద మృతదేహం లభ్యమైంది.అయితే, బాలిక మృతిపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఈ ఘటనపై కర్ణాటక హోం మంత్రి స్పందిస్తూ.. బాలిక కిడ్నాప్ అయి ఉండవచ్చని ఒక వాదన ఉందని.. ఎవరితోనైనా వెళ్లి ఉండవచ్చని మరో వాదన వినిపిస్తున్నాయి. అయితే ఆమె ఆచూకీ లభించిన నేపథ్యంలో వాస్తవాలు విచారణలో తేలుతాయని పేర్కొన్నారు. పోలీసులు పలు కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ప్రమాదవశాత్తూ కొండపై నుండి జారిపడిందా? ఇతర కారణాలు ఉన్నాయా అన్నది తేల్చాల్సి ఉంది. దర్యాప్తులో భాగంగా బాలిక తల్లిదండ్రుల మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
కృతికా కేసు: ‘పోలీసులు అడిగితే మనం స్నేహితులమని చెప్పు’
బెంగళూరు: సంచలనం సృష్టించిన బెంగళూరు డాక్టర్ కేసులో ఏడాది తర్వాత.. చాటింగ్ వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. బెంగళూరుకు చెందిన జనరల్ సర్జన్ డాక్టర్ మహేంద్ర రెడ్డి.. కట్టుకున్న భార్యను(చర్మవ్యాధి నిపుణురాలు) కిరాతకంగా హతమార్చిన సంగతి తెలిసిందే. ఆ నేరాన్ని కప్పిపుచ్చడానికి తన ప్రియురాలితో కలిసి పథకం పన్నినట్లు తెలుస్తోంది. తన భార్య కృతికా రెడ్డికి ఇంట్లోనే మోతాదుకు మించి అనస్థీషియా డ్రగ్ ఇచ్చి హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహేంద్ర రెడ్డిని.. గతేడాది అక్టోబర్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ ఘటన గత ఏడాది ఏప్రిల్ 21న జరిగింది. ఇంట్లో కృతిక అస్వస్థతకు గురైనట్లు నాటకమాడి, మహేంద్ర ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మొదట ఇది సహజ మరణంగా భావించినప్పటికీ తదుపరి విచారణలో పోలీసులకు అనుమానాలు కలిగాయి. ఒక డాక్టరుగా తనకున్న పరిజ్ఞానాన్ని ఉపయోగించి, ఆ హత్యను సహజ మరణంగా చిత్రీకరించేందుకు మహేంద్ర ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు.దర్యాప్తు సమయంలో నిందితుడు హర్షిత అనే నర్సుతో సంబంధంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణలు ఈ కేసులో అత్యంత కీలక ఆధారాలుగా మారాయి. నిఘా సంస్థలకు దొరకకుండా ఉండేందుకు మహేంద్ర వాట్సాప్ వంటి సాధారణ ప్లాట్‌ఫారమ్‌లను వాడకుండా, ఫోన్ పే వంటి యూపీఐ పేమెంట్ యాప్‌ల ద్వారా సందేశాలు పంపినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL) నిందితుడి ఫోన్ నుండి డిజిటల్ ఫైళ్లను రికవరీ చేసింది. ఇందులో డిలీట్ చేసిన డేటా, సన్నిహితంగా ఉన్న ఫోటోలు, ఫోన్ పే చాట్లు ఉన్నాయి. వీటిని పోలీసులు చార్జ్‌షీట్‌లో చేర్చారు.నిందితుడు హర్షితకు పంపిన కొన్ని మెసేజ్‌లు.. అతని నేరం చేయడానికి ముందస్తు ప్లాన్ బయటపడింది. "ఈ మెసేజ్ చూసిన తర్వాత నాకు ఎక్కడా టెక్స్ట్ చేయొద్దు, కాల్ చేయొద్దు. అంతా సర్దుకున్నాక నేనే కాల్ చేస్తాను. ఒకవేళ పోలీసులు నిన్ను పిలిచి మన మధ్య సంబంధం ఏంటని అడిగితే.. మనం కేవలం స్నేహితులమని చెప్పు’’ అంటూ చేసిన చాటింగ్ బయటపడింది. మహేంద్ర, కృతికలకు మే 2024లో వివాహం జరిగింది. వీరిద్దరూ బెంగళూరులోని ఒకే ఆసుపత్రిలో పనిచేసేవారు. సేకరించిన ఆధారాలు బలంగా ఉండటంతో స్థానిక కోర్టు.. మహేంద్ర రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. -
జస్ట్ తాళి కడుతుండగా షాకింగ్ న్యూస్, వరుడు మాత్రం !
కర్ణాటకలోని హాసన్ జిల్లాలో ఒక వివాహ వేడుకలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సరిగ్గా తాళి కట్టే సమయానికి కొన్ని నిమిషాల ముందు, వధువు పల్లవి అకస్మాత్తుగా పెళ్లిని ఆపేసింది. దీంతో పెళ్లి కొడుకుతోపాటు, అందరూ షాకయ్యారు. వధువు ఎందుకలా చేసింది? చివరికి ఏమైంది? ఇలాంటి మీ అనుమానాలకు, సందేహాలకు సమాధానం దొరకాలంటే..ఈ కథనాన్ని చదివేయండి మరి.బంధువుమిత్రులు, బాజా భజంత్రీల మధ్య వరుడు వేణుగోపాల్ తాళి కట్టడానికి రెడీ అయ్యాడు. ఇంతలో సినిమా ఫక్కిలో నాకీ పెళ్లి ఇష్టం లేదంటూ భయపడుతూనే ధైర్యం చేసి మెల్లగా చెప్పింది వధువు పల్లవి. దీంతో అందరూ ఒకింత దిగ్భ్రాంతికి, మరింత గందర గోళానికి గురయ్యారు.అసలు ఏం జరిగింది? అపుడు అసలు విషయం తాపీగా చెప్పింది. తాను వేరొకరిని ప్రేమిస్తున్నానని, అయితే ప్రేమించిన వ్యక్తి వేరే కులానికి చెందినవాడని, అందుకే ఈ విషయాన్ని ముందుగా తన కుటుంబానికి చెప్పలేకపోయానని కళ్ళనీళ్లతో చెప్పింది. ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, వరుడికి, ఆమె తన కుటుంబ సభ్యులకు చెప్పింది. అయినా ఆమె తల్లిదండ్రులు, బంధువులు ఆమెను ఒప్పించడానికి ప్రయత్నించారు, కానీ ఆమె తన మనసు మార్చుకోలేదు.వరుడు ఏం చేశాడు?అయితే వరుడి స్పందన మరింత విశేషంగా నిలిచింది. వధువు మానసకి పరిస్థితిని అర్థం చేసుకున్న వరుణ వేణుగోపాల్ ఆమె పట్ల సానుకూలంగా స్పందించాడు. తాను ప్రేమించని వారిని పెళ్లి చేసుకోమని ఎవరినీ బలవంతం చేయనని స్పష్టం చేశాడు. ఈ స్టోరీని ఒక ఎక్స్యూజర్ వరుడికి హ్యాట్యాఫ్ అంటూ పోస్ట్ చేశారు. దీంతో నెటిజనులనుంచి కూడా సానుకూల స్పందన లభించింది. In Karnataka's Hassan district, minutes before the wedding started, the bride Pallavi suddenly stopped it.Everyone was shocked and confused. She told her family that she didn't want to marry the groom Venugopala because she loved someone else. She explained that the person she… pic.twitter.com/h3u9kn8ejS— Aparajite (@amshilparaghu) April 2, 2026నెటిజన్లు స్పందనఈ క్రెడిట్‌కు పల్లవికి కూడా దక్కుతుంది. ఎలాగైతేనేం ధైర్యం చేసి తన ప్రేమకోసం ధైర్యంగా నిలబడింది. అలాగే వరుడు కూడా ఎలాంటి డ్రామా క్రియేట్ చేయకుండా పరిస్థితిని అర్థం చేసుక్నాడని ఒకరు, వావ్, ఇద్దరికీ అభినందనలు! తన ప్రేమ కోసం నిలబడిన పల్లవికి, పరిస్థితిని అర్థం చేసుకున్న వేణుగోపాలకు. ఇదే నిజమైన పరిణితి, గౌరవం అంటూ ఒకరు కమెంట్ చేశారు. అంతేకాదు ఇంతదాగా ఎందుకు లాగాలని కొందరంటే.. ఒకే బెటర్ నెవర్ దేన్ లేట్, అబ్బాయ్ సేఫ్.. బతికిపోయాడు బిడ్డ ఇలాంటి ఫన్నీ కామెంట్లు వెల్లువెత్తడం గమనార్హం. Pelli koduku frds : mavodu safe pic.twitter.com/l9fO731r4R— Charan (@charan14in) April 3, 2026 -
వైద్య విద్యార్థిని లిఖిత ఆత్మహత్య కలకలం
కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా హోలెల్కెరె పట్టణంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తనపై జరిగిన పుకార్ల ప్రచారంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ ఆయుర్వేద వైద్య విద్యార్థిని (BAMS) ఆత్మహత్యకు పాల్పడిన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి:23 ఏళ్ల లిఖిత, మల్లాడిహళ్లిలోని రాఘవేంద్ర ఆయుర్వేద కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ (BAMS) చదువుతోంది. హోలెల్కెరె పట్టణంలోని బసవ లేఅవుట్లో ఉన్న తన ఇంట్లో మంగళవారం ఆమె విగతజీవిగా కనిపించడం విషాదాన్ని నింపింది. లిఖితకు ఆమె కాలేజీలోని ఒక ప్రొఫెసర్‌తో సంబంధం ఉందంటూ గత కొంతకాలంగా కళాశాలలో దుష్ప్రచారం జరుగుతోంది. ఈ పుకార్ల వల్ల తన పరువు పోయిందని, సమాజంలో తల ఎత్తుకోలేకపోతున్నానని ఆమె తీవ్ర మానసిక వేదనకు గురైనట్లు ప్రాథమిక విచారణలో తేలింది.సంఘటనా స్థలంలో పోలీసులు సూసైడ్ నోట్లో స్వాధీనం చేసుకున్నారు. ఈ లేఖలో లిఖిత సంచలన విషయాలు పేర్కొంది.తన మరణానికి ఒక ఫ్యాకల్టీ మెంబర్, అతని భార్య, మరి కొందరు తోటి విద్యార్థినులు కారణమని ఆరోపించింది. వేధించి, తనపై తప్పుడు ప్రచారం చేసి మానసిక క్షోభకు గురిచేశారని లేఖలో వాపోయింది.మరోవైపు స్కూల్ హెడ్ మాస్టర్‌గా పనిచేస్తున్న లిఖిత తండ్రి ఉమాశంకర్ మరికొన్ని కీలక విషయాలను వెల్లడించారు. కొందరు క్లాస్మేట్స్ తమ కుమార్తెను కావాలనేవేధించారని, లెక్చరర్‌తో అఫైర్ ఉన్నట్లు పుకార్లు సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ వారిద్దిరీ కేవలం గురువుకు, శిష్యురాలికి మధ్య ఉండే గౌరవ ప్రద సంబంధం మాత్రమే ఉందని ఆయన స్పష్టం చేశారు. నిరంతరం వేధించడం, సూటిపోటి మాటలతో అవమానించడం వల్లే తన కూతురు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనకు బాధ్యులని భావిస్తున్న సహవిద్యార్థులను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాని ఆయన డిమాండ్ చేశారు. ఈఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. -
ఐఏఎస్ రోహిణి సింధూరికి బిగ్ షాక్..
శివాజీనగర: కర్ణాటకలో సీనియర్ ఐఏఎస్ రోహిణి సింధూరికి ఊహించని షాక్ తగిలింది. కాటన్ బ్యాగుల కొనుగోలులో నిధుల దుర్వినియోగం జరిగాయనే ఆరోపణలపై సింధూరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.మైసూరుకు చెందిన న్యాయవాది ఎన్.ఆర్.రవిచంద్రేగౌడ సమర్పించిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ ఎన్.నాగప్రసన్న విచారించారు. ఆమె మీద విచారణకు అనుమతి నిరాకరిస్తూ సర్కారు ఇచ్చిన ఆదేశాలను జస్టిస్ రద్దు చేశారు. దర్యాప్తు ద్వారానే వాస్తవాలను బహిరంగపరచాలి, అప్పుడే ప్రజలకు నిజాలేమిటో తెలుస్తాయి అని పలు వ్యాఖ్యలు చేశారు. నాలుగు వారాల్లోగా వాస్తవాలను వెలికి తీసేందుకు విచారణకు ఆదేశించాలని ప్రభుత్వానికి సూచించారు. అవినీతిని నియంత్రించకపోతే అది రాజకీయ రంగాన్ని అస్థిరపరుస్తుందని, ప్రభుత్వ సంస్థలను నాశనం చేస్తుందని న్యాయమూర్తి పేర్కొన్నారు.గతంలో రోహిణి సింధూరి మైసూరు కలెక్టర్‌గా ఉన్న సమయంలో స్వచ్ఛ భారత్ అభియాన్‌లో భాగంగా మైసూరులో ప్లాస్టిక్ సంచుల బదులుగా వస్త్రపు సంచులు కొనుగోలు చేసి, వితరణ చేయాలని ప్రభుత్వం సూచించింది. ఇందులో భాగంగా రూ.13 ధర కలిగిన బట్ట సంచులను రూ.52 ధరతో కొనుగోలు చేశారని, దీని వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.7.65 కోట్ల నష్టం జరిగిందని న్యాయవాది పిటిషన్ వేశారు. -
నవ జంట బతుకులో కల్లోలం
దొడ్డబళ్లాపురం: కొత్తగా పెళ్లయిన జంటను కారు ప్రమాదం విచ్ఛిన్నం చేసింది. ఎన్నో కలలతో శ్రీకారం చుట్టిన కొత్త జీవితం మూణ్నాళ్ల ముచ్చటే అయ్యింది. వారు ప్రయాణిస్తున్న కారు ముందు వెళ్తున్న కంటైనర్ లారీని ఢీకొన్న ప్రమాదంలో భార్య, బంధువు దుర్మరణం చెందారు, భర్త తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన చిక్కబళ్లాపురం తాలూకా శెట్టిగెరె వద్ద బెంగళూరు–హైదరాబాద్ హైవేలో జరిగింది. రక్షిత రెడ్డి (23), పవన్‌రెడ్డి (30) మృతులు కాగా, రక్షితరెడ్డి భర్త రాజశేఖర్ రెడ్డి (28) తీవ్రంగా గాయపడ్డాడు.ఎలా జరిగింది?రక్షిత, రాజశేఖర్ ఇద్దరూ బెంగళూరులో ఐటీ ఇంజినీర్లుగా పని చేస్తున్నారు. వీరికి గత నవంబర్‌లో వివాహమైంది. ఏపీలోని అనంతపురానికి చెందిన వీరు గురువారం నాడు కారులో బెంగళూరు నుంచి అనంతపురం వెళుతున్నారు. శెట్టిగెరె వద్ద వీరి కారు ముందు వెళ్తున్న కంటైనర్ లారీని వేగంగా ఢీకొంది. దీంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా, రక్షిత, బంధువు పవన్ తీవ్ర గాయాలతో దుర్మరణం చెందారు. గాయపడిన రాజశేఖర్‌ని స్థానికులు బెంగళూరుకు తరలించారు. ప్రమాదంతో హైవేపై గంటకు పైగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పేరేసంద్ర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
వంటింట్లో తిష్ట వేసిన 14 అడుగుల కింగ్ కోబ్రా!
కర్ణాటక: రోడ్డు మీద వెళ్తున్న కింగ్ కోబ్రా పాము ఇంట్లోకి దూరింది. జిల్లాలోని కాచిబట్టి గ్రామంలో రోడ్డు దాటుతున్న సుమారు 14 అడుగుల గిరినాగు ఒకటి వాహనం తగలడంతో పక్కనే రాజు నాయక్ అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడింది. వంటింట్లో తిష్టవేసిన అతిథిని చూసిన కుటుంబ సభ్యులు భయాందోళనకు లోనయ్యారు. అటవీ సిబ్బందికి కాల్ చేయగా, వారు మహేశ్ నాయక్‌కు చెప్పారు. మహేశ్ నాయక్, ఆయన కుమారుడు గగన్ నాయక్ చాలాసేపు కష్టపడి కింగ్ కోబ్రాను క్షేమంగా పట్టుకున్నారు. దానిని దూరంగా తీసుకెళ్లి వదిలిపెట్టారు. -
టీవీ ఆన్ చేస్తే నాగు గర్జన.. లోపల చూసి షాక్!
కర్ణాటక: సామాన్యంగా టీవీ పాడైపోతే మెకానిక్ దగ్గరికి తీసుకెళతారు. అయితే చామరాజనగర మల్లయ్యనపుర గ్రామంలో దొడ్డమాదప్ప ఇంటిలో జరిగింది వేరే. కొన్ని రోజుల నుంచి ఇంట్లో టీవీ నుంచి విచిత్రమైన శబ్దాలు వినిపిస్తున్నాయి. రోజురోజుకూ శబ్ధాలు ఎక్కువ కావడంతో టీవీ లోపల చూసి నిశ్చేష్టులయ్యారు. లోపల ఏదో కదులుతూ కనిపించింది. ఆ తర్వాత అది పాము అని తెలిసి వెంటే స్నేక్ చాపు నకు కాల్ చేశారు. స్నేక్ చాపు టీవీని జాగ్రత్తగా బయటకు తీసుకెళ్లి అందులో మకాం వేసిన 8 అడుగుల విషపూరిత పామును పట్టుకున్నాడు. టీవీ వైర్ల మధ్య చుట్టుకుని ఉందది. ఇంటి చుట్టుపక్కల ఎలుకలు, కప్పలు ఎక్కువగా ఉండడంతో వాటి కోసం వచ్చి టీవీలో చేరినట్లు స్నేక్ చాపు తెలిపాడు. ఈ వీడియోలు వైరల్ అయ్యాయి.


