offer
-
విద్యార్థులకు ఎయిరిండియా టికెట్ ధరలో ఆఫర్
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా దేశంలోని ఇతర ప్రాంతాలతోపాటు, విదేశాలకు వెళ్లే విద్యార్థులకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఉన్నత చదువుల కోసం దేశంలో ఇతర ప్రాంతాలతోపాటు, ఇతర దేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థులకు విమాన ధరలో 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది. అదనంగా 10 కిలోల వరకు బ్యాగేజ్‌ను కూడా అనుమతిస్తున్నట్లు పేర్కొంది.అర్హతలు ఇవే..దేశీయ ప్రయాణాలు చేయాలనుకునే విద్యార్థుల వయసు 12 ఏళ్ల వరకు ఉండాలి. అదే అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవారు 12-30 ఏళ్ల వయసు వరకు ఉండొచ్చు. అడ్మిషన్ పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ ప్రభుత్వ గుర్తింపు పొందిందై ఉండాలి. విద్యార్థులు కనీసం ఒక విద్యాసంవత్సరం ఫుల్ టైమ్ కోర్సులో చేరి ఉండాలి.ఇదీ చదవండి: యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడిపై సెబీ కొరడాఎక్కడ బుక్ చేసుకోవాలి..?ఈ ఆఫర్ వినియోగించుకోవాలనుకునే విద్యార్థులు ఎయిరిండియా అధికారిక వెబ్సైట్, మొబైల్ యాప్, కస్టమర్ కాంటాక్ట్ సెంటర్, ఎయిర్పోర్ట్ టికెటింగ్ కార్యాలయాల ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. యూపీఐ, నెట్ బ్యాంకింగ్, ఎయిరిండియా బ్యాంకు పార్టనర్లు జారీ చేసిన క్రెడిట్/ డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేస్తే అందనంగా ప్రయోజనాలు పొందవచ్చని కంపెనీ తెలిపింది. అధికారిక వెబ్సైట్ నుంచి బుక్ చేసుకునే విద్యార్థులకు కన్వినియెన్స్ ఛార్జీల రూపంలో ఎలాంటి అదనపు ఫీజు వసూలు చేయబోమని కంపెనీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ నిపుణ్ అగర్వాల్ తెలిపారు. దానివల్ల దేశీయ విమానాల్లో ప్రయాణించే విద్యార్థులు రూ.399, అంతర్జాతీయ విమానాల్లో వెళ్లేవారు రూ.999 వరకు అదనంగా ఆదా చేసుకోవచ్చని స్పష్టం చేశారు. -
విద్యార్థులకు ఇండిగో స్పెషల్ ఆఫర్..
దేశంలోని ప్రముఖ విమానయాన సంస్థ 'ఇండిగో' విద్యార్థుల కోసం 'స్టూడెంట్ స్పెషల్' అనే ప్రత్యేకమైన ఆఫర్ తీసుకువచ్చింది. ఇండిగో కంపెనీ అధికారిక వెబ్సైట్ లేదా యాప్ ద్వారా ఫ్లైట్ టిక్కెట్లను బుక్ చేసుకునే సమయంలో విద్యార్థులకు ప్రత్యేక ఛార్జీలు, అదనపు ప్రయోజనాలు లభించనున్నట్లు ప్రకటించింది.విమాన టికెట్ మీద 6 శాతం రాయితీ కల్పించడం మాత్రమే కాకుండా.. 10 కేజీల వరకు అదనపు లగేజ్ తీసుకెళ్లడానికి ఇండిగో అనుమతించింది. విద్యార్థులు కోసం తీసుకొచ్చిన ఈ స్పెషల్ ఆఫర్ ఈ ఆఫర్ ఎన్ని రోజుల వరకు అందుబాటులో ఉంటుందో.. స్పష్టంగా వెల్లడించలేదు.ఇదీ చదవండి: తెలంగాణలో బీజం.. ఇతర రాష్ట్రాలకు చేరే అవకాశంఇండిగో ప్రకటించిన ఈ స్పెషల్ ఆఫర్ కేవలం హైదరాబాద్‌లో మాత్రమే కాకుండా గోవా, ముంబై, ఢిల్లీ, చెన్నై వంటి మొత్తం 80 రూట్లలో నడిచే విమాన సర్వీసుల్లో అందుబాటులో ఉంటుంది. 21 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న విద్యార్థులు తమ స్కూల్ లేదా యూనివర్సిటీకి సంబంధించిన ఐడీ కార్డును కలిగి ఉండాలి. ఐడీ కార్డు కలిగిన వారు మాత్రమే ఈ ఆఫర్ ఉపయోగించుకోవడానికి అర్హులు. -
దీపావళి షాపింగ్ చేస్తున్నారా?: డబ్బు ఆదా కోసం ఐదు టిప్స్..
దీపావళి వచ్చేస్తోంది.. ఇప్పటికే చాలామంది షాపింగ్ చేయడం కూడా స్టార్ట్ చేసి ఉంటారు. షాపింగ్ అంటేనే డబ్బు ఖర్చు పెట్టడం. ఇలా డబ్బు ఖర్చుపెట్టే క్రమంలో కొంత ఆదా చేసే మార్గాల కోసం అన్వేషిస్తారు. దీనికోసం కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుంది. ఈ కథనంలో అలాంటి టిప్స్ గురించి తెలుసుకుందాం.బడ్జెట్ ప్లాన్ వేసుకోవడంపండుగ వస్తోంది కదా అని కంటికి కనిపించిందల్లా.. కొనేస్తే పర్సు ఖాళీ అయిపోతుంది. కాబట్టి ఏ వస్తువులు కొనుగోలు చేయాలి, ఎక్కడ కొనుగోలు చేయాలి? దానికి ఎంత ఖర్చు అవుతుందనే విషయాలను ముందుగానే లెక్కించుకోవాలి. కిరాణా వస్తువులు, స్వీట్స్ వంటివన్నీ కూడా ఒకేసారి కొనుగోలు చేయడం ఉత్తమం. పండుగ సీజన్లో అందుబాటులో ఉన్న అన్ని డిస్కౌంట్స్ వాడుకోవాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే.. డిస్కౌంట్స్ ఉన్నాయి కదా అని అనవసర వస్తువులను కొనుగోలు చేయకూడదు.క్యాష్‌బ్యాక్ ఆఫర్స్ ఉపయోగించుకోవడందసరా, దీపావళి సమయంలో క్యాష్‌బ్యాక్ ఆఫర్స్ విరివిగా అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఏ ప్లాట్‌ఫామ్‌లలో క్యాష్‌బ్యాక్ ఆఫర్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. అయితే ఆన్లైన్ షాపింగ్‌లో క్యాష్‌బ్యాక్ లభించే అవకాశాలు ఎక్కువ. వీటిని ఉపయోగించుకుంటే కొంత డబ్బు ఆదా అవుతుంది.ధరలను సరిపోల్చడంఆన్లైన్ షాపింగ్ చేసే సమయంలో ఒక వస్తువు ధర ఏ ప్లాట్ఫామ్లో ఎంత ఉందో గమనించాలి. ఎక్కడ తక్కువ ధర ఉంటే అక్కడ వస్తువులను కొనుగోలు చేయాలి. ఇలా చేయడం ద్వారా కూడా డబ్బు ఆదా అవుతుంది. ధరలను సరిపోల్చడానికి ప్రైస్ ట్రాకింగ్ టూల్స్ ఉపయోగించడం ఉత్తమం.డిస్కౌంట్స్ తెలుసుకోవడంషాపింగ్ చేసేటప్పుడు ముఖ్యంగా డిస్కౌంట్స్ గురించి తెలుసుకోవాలి. అయితే చాలా సైట్స్ డిస్కౌంట్స్ పేరుతో మోసాలకు పాల్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచి డిస్కౌంట్స్ లభించే ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయాలి. ఈ విషయంలో ఏ మాత్రం ఆదమరిచినా నష్టపోవడం ఖాయం.ఇదీ చదవండి: రతన్ టాటా కఠిన నిర్ణయం: వెలుగులోకి కీలక విషయాలుబ్యాంక్ ఆఫర్స్ సద్వినియోగం చేసుకోవడంషాపింగ్ చేసే క్రమంలో బ్యాంకులు అందించే ఆఫర్స్ వినియోగించుకోవాలి. క్రెడిట్ కార్డులు లేదా డెబిట్ కార్డుల మీద డిస్కౌంట్స్, క్యాష్ బ్యాక్ వంటివి ఈ పండుగల సమయంలో చాలానే లభిస్తాయి. కొన్ని బ్యాంకులు రివార్డ్ పాయింట్లను కూడా అందిస్తాయి. వీటిని కూడా ఉపయోగించుకుంటే.. డబ్బు కొంత ఆదా అవుతుంది. అయితే క్రెడిట్ కార్డులు ఉపయోగించి షాపింగ్ చేస్తే.. నిర్దిష్ట కాలంలో తిరిగి చెల్లించాలి. లేకుంటే అది మీ సిబిల్ స్కోర్ మీద ప్రభావం చూపుతుంది. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ మరచిపోకూడదు. -
దసరా బంపర్ ఆఫర్.. వంద రూపాయలకే 10 కేజీల మేక!
dussehra offer: రండీ బాబూ రండీ.. ఆలసించినా ఆశాభంగం. త్వరపడండి.. మంచి తరుణం మించినా దొరకదు. ఏంటీ హడావుడి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. సాధారణంగా దసరా పండుగకు జనమంతా షాపింగ్ చేయడం సర్వసాధారణం. అటు దుకాణాదారులు కూడా ఆఫర్లతో పాటు ఉచిత బహుమతులతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. దీంతో దుకాణాలు, షాపింగ్ మాల్స్ కొనుగోలుదారులతో కిటకిటలాడుతుంటాయి.ఇదిలావుంచితే రానున్న దసరా పండుగ సందర్భంగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వాసులకు వెరైటీ ఆఫర్లు ప్రకటించారు. నేలకొండపల్లి చెందిన కొందరు యువకులు డ్రా ద్వారా బహుమతులు అందించాలని నిర్ణయించారు. అయితే, టీవీలు, కూలర్లు, బైక్‌లు వంటివి కాకుండా ఈసారి వినూత్న బహుమతులను ప్రకటించారు.కేసు బీర్లు, నాటు కోళ్లురూ.100 చొప్పున టికెట్లు అమ్మకం చేపట్టి ఈనెల 10న తీయనున్న డ్రాలో మొదటి బహుమతి 10 కిలోల మేక ఇస్తామని పోస్టర్లను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. రెండో బహుమతిగా బ్రాండెడ్ మద్యం బాటిల్, మూడో బహుమతి కేసు బీర్లు, నాలుగో బహుమతి రెండు నాటు కోళ్లు, ఐదో బహుమతిగా మద్యం బాటిల్ ఇస్తామని ప్రకటించడంతో టికెట్లు జోరుగానే అమ్ముడవుతున్నాయని తెలుస్తోంది.వేములవాడలో కేసు కాగా, నల్లగొండ జిల్లా మునుగోడు మండలం వెల్మకన్నె గ్రామంలోనూ ఇంతకుముందు ఇలాంటి ఆఫర్లే ప్రకటించారు. ఈ ట్రెండ్ చాలా ఊర్లకు పాకింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాత్రం పోలీసులు కన్నెర్ర చేశారు. వేములవాడ పట్టణంలో “100 కొట్టు మేకను పట్టు” క్యాప్షన్‌తో పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బుధవారం నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ప్రైజ్‌మనీల పేరుతో మోసాలకు పాల్పడితే చర్యలు తప్పవని వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. -
మూవీ లవర్స్‌కు బంపరాఫర్.. అయితే ఆ ఒక్క రోజే!
మూవీ లవర్స్‌కు ఓ గుడ్ న్యూస్. తాజాగా మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సినీ ప్రియులకు అదిరిపోయే వార్త చెప్పింది. ఈనెల 20న జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా సినిమా టిక్కెట్లపై బంపర్ ఆఫర్ ప్రకటించింది. దేశంలోని మల్టీప్లెక్స్‌లో ఎక్కడైనా సరే రూ.99 రూపాయలకే సినిమా చూడవచ్చని ప్రకటించింది. దేశవ్యాప్తంగా దాదాపు 4వేలకు పైగా స్క్రీన్స్‌పై ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. ఐమ్యాక్స్, 4డీఎక్స్, రిక్లైనర్స్ వంటి ప్రీమియర్ కేటగిరీలకు ఇది వర్తించదని పేర్కొంది.ఇంకేందుకు ఆలస్యం.. మీకు నచ్చిన సినిమాను కేవలం రూ.99కే మల్టీప్లెక్స్ థియేటర్లలో చూసేయండి. అయితే ఈ ఆఫర్ కేవలం పీవీఆర్ ఐనాక్స్, సినీ పోలీస్, మిరాజ్, మూవీటైమ్, డిలైట్ మల్టీప్లెక్స్‌ల్లో మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. ఈ ఆఫర్ ఆ రోజు అన్ని సినిమాలతో పాటు అన్ని షోలకు వర్తిస్తుందని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్లైన్లోనూ ఆఫర్ వర్తిస్తుందని ప్రకటించింది. కాగా.. ఈ రోజుల్లో థియేటర్లలో ఫ్యామిలీతో కలిసి ఒక సినిమా చూడాలంటే వేలకు వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ బంపరాఫర్ పట్ల సినీ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
ఉచితంగా 'జియో ఎయిర్ ఫైబర్': ఇలా చేయండి
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'దీపావళి డబుల్ ధమాకా' ఆఫర్‌ను రిలయన్స్ డిజిటల్ ప్రకటించింది. దీంతో వినియోగదారులు ఒక సంవత్సరం ఫ్రీ 'జియో ఎయిర్ ఫైబర్' సేవను ఆస్వాదించే అవకాశాన్ని పొందవచ్చు. ఇంతకీ ఈ అవకాశాన్ని ఎలా పొందాలి? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం..ఉచితంగా జియో ఎయిర్ ఫైబర్ పొందాలంటే?ఫ్రీగా జియో ఎయిర్ ఫైబర్ సేవలను పొందాలంటే.. 2024 సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 3వరకు ఏదైనా రిలయన్స్ డిజిటల్ స్టోర్‌లో లేదా మైజియో స్టోర్‌లో రూ. 20000 లేదా అంతకంటే ఎక్కువ ధరకు షాపింగ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేసినవాళ్ళే ఉచిత జియో ఎయిర్ ఫైబర్ పొందటానికి అర్హులు.ఈ ఆఫర్ కొత్త వాళ్ళకు మాత్రమే కాకుండా ఇప్పటికే జియో ఫైబర్ లేదా జియో ఎయిర్ ఫైబర్ ఉన్న కస్టమర్లు కూడా హై-స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్ పొందవచ్చు.ఇదీ చదవండి: కంపెనీలో సమస్యలు!.. సత్య నాదెళ్ల కీలక విషయాలుఅర్హత పొందిన కస్టమర్లు ప్రతి నెల నవంబర్ 24 నుంచి అక్టోబర్ 25 వరకు యాక్టివ్ ఎయిర్‌ఫైబర్ ప్లాన్‌కు సమానమైన 12 కూపన్లను పొందుతారు. ప్రతి కూపన్‌ను 30 రోజులలోపు సమీప రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్, జియో మార్ట్ డిజిటల్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌లో రీడీమ్ చేసుకోవచ్చు. ఈ దీపావళి డబుల్ ధమాకా ఆఫర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్ సంప్రదించండి. -
ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్
ఐఫోన్ 16 సిరీస్‌ను ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి యాపిల్ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఐఫోన్ 14 మోడల్ ధర భారీగా తగ్గింది. ఐఫోన్ 14 ప్లస్ (iPhone 14 Plus) ప్రస్తుతం ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది.యాపిల్ అధికారిక వెబ్సైట్లో ఐఫోన్ 14 ప్లస్ ధర రూ. 79,600 లుగా ఉంది. దీన్ని ఫ్లిప్‌కార్ట్‌లో కొంటే రూ. 56,000 కంటే తక్కువకే సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 14 ప్లస్ బేస్ వేరియంట్ రూ. 56,499కి అందుబాటులో ఉంది. అంటే ఈ ఫోన్ కొనుగోలుపై కొనుగోలుదారులు రూ.23,101 ఆదా చేసుకోవచ్చు. దీంతో పాటు, యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తే రూ. 1,000 అదనపు తగ్గింపు కూడా పొందవచ్చు. అంటే ఐఫోన్ 14 ప్లస్ రూ.55,499కే లభిస్తుందన్న మాట.ఐఫోన్ 14 ప్లస్ స్పెసిఫికేషన్స్» 1200 నిట్స్ బ్రైట్‌నెస్‌తో పెద్ద » 6.7-అంగుళాల స్క్రీన్ సూపర్ రెటినా XDR OLED డిస్ప్లే» డిస్ప్లే దెబ్బతినకుండా సిరామిక్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్» A15 బయోనిక్ చిప్సెట్» 12-మెగాపిక్సెల్ రియర్ డ్యూయల్ కెమెరా» 12-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా -
నీరజ్ ‘గోల్డ్’ గెలిస్తే అందరికీ... ఓ సీఈవో అదిరిపోయే ఆఫర్!
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics 2024)లో బంగారు పతకం సాధిస్తే అందరికీ ఉచిత వీసాలు ఇస్తామని ఆన్లైన్ వీసా స్టార్టప్ సంస్థ అట్లీస్ సీఈవో మోహక్ నహ్తా హామీ ఇచ్చారు. ఆయన ప్రకటించిన ఆఫర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.తన లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లో ఓ పోస్ట్‌ను పంచుకుంటూ.. "ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా స్వర్ణం గెలిస్తే నేను వ్యక్తిగతంగా అందరికీ ఉచిత వీసా పంపుతాను" అంటూ ప్రకటించారు. జూలై 30న నహ్తా పోస్ట్ పెట్టిన వెంటనే, ఈ ఆఫర్‌కు సంబంధించి యూజర్లు ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో తన ఆఫర్‌ను వివరిస్తూ మరో పోస్ట్‌ను మోహక్ నహ్తా షేర్ చేశారు."నీరజ్ చోప్రా బంగారు పతకం గెలిస్తే అందరికీ ఉచిత వీసా ఇస్తామని జూలై 30న వాగ్దానం చేశాను. చాలా మంది అడిగారు కాబట్టి, ఇవిగో వివరాలు.." అంటూ తాజా పోస్ట్‌లో పూర్తి వివరాలు అందించారు. పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా ఆగస్ట్ 8న పతకాల కోసం పోటీపడతాడు. ఆయన బంగారు పతకం సాధిస్తే, ఒక రోజంతా వినియోగదారులందరికీ ఒక ఉచిత వీసా అందిస్తామన్నారు. ఆ రోజు అన్ని దేశాలకు వీసా ఖర్చును కంపెనీ భరిస్తుందని ఆయన తెలిపారు.వినియోగదారులు తమ ఈమెయిల్ అడ్రస్‌ను కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే కంపెనీ ఉచిత వీసా క్రెడిట్‌తో యూజర్ తరపున ఖాతాను సృష్టిస్తుందన్నారు. సీఈవో మోహక్ నహ్తా పోస్ట్ లింక్డ్ఇన్ ప్లాట్‌ఫారమ్‌లో భాఈగా రీపోస్ట్‌లు, లైక్‌లు, కామెంట్లను పొందింది. యూఎస్‌లోని శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా ఉన్న అట్లీస్ కంపెనీకి భారత్‌లోని ఢిల్లీ, ముంబైలలో శాఖలు ఉన్నాయి. -
రూ.2 లక్షల కోట్ల గూగుల్ ఆఫర్.. తిరస్కరించిన విజ్
సైబర్ సెక్యూరిటీ స్టార్టప్ 'విజ్' (Wiz)ను కొనుగోలు చేయడానికి గూగుల్ 23 మిలియన్ డాలర్లు (రూ. 2 లక్షల కోట్లు) ఆఫర్ చేసింది. ఈ భారీ ఆఫర్‌ను విజ్ సున్నితంగా తిరస్కరించింది. ఈ ఆఫర్‌ను తిరస్కరించడానికి గల కారణాన్ని కంపెనీ కో ఫౌండర్ 'అసాఫ్ రాపాపోర్ట్' మెమోలో వెల్లడించారు.గూగుల్ ఇచ్చిన ఈ భారీ ఆఫర్‌ను తిరస్కరించడం కష్టమే.. కానీ కంపెనీ ముందుగా నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం, యాన్యువల్ రికావరింగ్ రెవెన్యూలో 1 బిలియన్ డాలర్లను సాధించాలని విజ్ కో-ఫౌండర్ అసాఫ్ రాపాపోర్ట్ మెమోలో వెల్లడించినట్లు సమాచారం. అయితే ఈ డీల్ గురించి గూగుల్ కంపెనీగానీ, విజ్ గానీ అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం.విజ్ కంపెనీ ప్రస్తుతం అమెరికా, యూరప్, ఆసియా, ఇజ్రాయెల్ దేశాల్లో 900 కంటే ఎక్కువ మంది పనిచేస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా మోర్గాన్ స్టాన్లీ, డాక్యుసైన్తో సహా ప్రముఖ క్లయింట్లను కలిగి ఉంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్ కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నట్లు సమాచారం. ఈ కంపెనీ ప్రస్తుతం ఫార్చ్యూన్ 100 కంపెనీలలో 40 శాతం వాటాను కలిగి ఉంది. -
ఎలక్ట్రిక్ స్కూటర్లపై ప్రత్యేక ఆఫర్లు
బెంగళూరు: ’ఓలా ఎలక్ట్రిక్ రష్’ ప్రచార కార్యక్రమంలో భాగంగా విద్యుత్ వాహనాల సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తమ ఎస్1 పోర్ట్‌ఫోలియోపై రూ. 15,000 వరకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఇవి జూన్ 28 వరకు వర్తిస్తాయి. వీటి ప్రకారం ఎస్1 ఎక్స్+పై రూ. 5,000, ఎస్1 ప్రో.. ఎస్1 ఎయి ర్‌పై రూ. 2,500 ఫ్లాట్ డిస్కౌంటు లభిస్తుంది.ఎస్1 ఎక్స్+పై రూ. 5,000 వరకు ఎక్స్చేంజ్ బోనస్, మొత్తం ఎస్1 శ్రేణిపై నిర్దిష్ట క్రెడిట్ కార్డ్ ఈఎంఐలపై రూ. 5,000 వరకు క్యాష్‌బ్యాక్ సహా మొత్తం రూ. 10,000 వరకు అదనపు ప్రయోజనాలను కూడా కస్టమర్లు పొందవచ్చు. ఎస్1 పోర్ట్‌ఫోలియోలో ఆరు వేరియంట్లు ఉన్నాయి.మొత్తం ఉత్పత్తుల శ్రేణి బ్యాటరీలపై 8 ఏళ్లు/80,000 కి.మీ. మేర ఎక్స్టెండెడ్ వారంటీని కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది. కావాలంటే పరిమితిని పెంచుకునేందుకు కస్టమర్లు రూ. 4,999–రూ. 12,999 వరకు చెల్లించి యాడ్–ఆన్ వారంటీని ఎంచుకోవచ్చు. -
వన్ ప్లస్ ఫోన్ పై క్రేజీ డిస్కౌంట్..
-
బంపరాఫర్.. మల్టీప్లెక్స్‌ల్లో టికెట్ రూ.99 మాత్రమే
సినిమాలు తెగ చూసేవాళ్లకు ఇది బంపరాఫర్. ఎందుకంటే మే 31న అంటే ఈ శుక్రవారం సినిమా లవర్స్ డే సందర్భంగా మల్టీఫ్లెక్స్ అసోసియేషన్ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఏ మల్టీఫ్లెక్స్‌లో అయినా సరే రూ.99 మాత్రమే మూవీ చూడొచ్చని ప్రకటించింది. కానీ ఈ ఆఫర్ తెలుగు రాష్ట్రాలకు వర్తించదని చెప్పి చిన్నపాటి షాకిచ్చింది.ఈ ఏడాది సంక్రాంతికి తెలుగులో 'హనుమాన్', 'గుంటూరు కారం' లాంటి సినిమాలు వచ్చాయి. వీటి వల్ల బాక్సాఫీస్ కళకళాలాడింది. దీని తర్వాత టాలీవుడ్ అనే కాదు దేశవ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీల్లో సరైన మూవీస్ రిలీజ్ కాకపోవడం వల్ల థియేటర్లకు వెళ్లి చూడటం గతంతో పోలిస్తే బాగా తగ్గిపోయింది. ఈ క్రమంలోనే మల్టీప్లెక్స్ అసోసియేషన్ టికెట్ రూ.99 అని ఆఫర్ పెట్టింది.(ఇదీ చదవండి: హీరోయిన్ని తోసేసిన బాలకృష్ణ.. అందరిముందు మద్యం తాగుతూ!)ఆఫర్ చూసి మీరు తెగ ఎగ్జైట్ అయిపోయింటారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇది వర్తించదని చెప్పి షాకిచ్చింది. మన దగ్గర సినిమా లవర్స్ డే ఉన్నప్పటికీ.. కొన్ని మల్టీప్లెక్స్‌ల్లో కొన్ని సినిమాలకు మాత్రం టికెట్ ధర రూ.112గా ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. వీళ్లకు ఆఫర్ ఇవ్వకపోయినా సరే ఎలానూ చూస్తారులే అనే ధీమానా? లేదా మరేదైనా కారణం ఉందో తెలియదు గానీ.. ఇలా తెలుగు ప్రేక్షకులపై మల్టీప్లెక్స్‌లా చిన్నచూపు ఏంటని పలువురు అభిప్రాయపడుతున్నారు.అయితే ఈ ఏడాది జనవరిలోనూ ఇలానే సినిమా లవర్స్ డే అని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫర్ ప్రకటించింది. నాలుగు నెలల తిరక్కుండానే మళ్లీ బంపరాఫర్ అని చెప్పుకొచ్చింది. ఇదంతా చూస్తుంటే వ్యాపారం తగ్గినా ప్రతిసారీ కావాలనే ఇలా ఆఫర్స్ అని అంటున్నారా అనే సందేహం వస్తోంది.(ఇదీ చదవండి: నన్ను వాళ్లు మోసం చేశారు: నటుడు జగపతిబాబు)Cinema Lovers Day returns on 31st May with movies for just Rs 99/-!🍿Join us at cinemas across India to celebrate a day at the movies. Over 4000+ screens are participating, making it an unforgettable cinematic experience!#CinemaLoversDay pic.twitter.com/b2XAOC3yxy— Multiplex Association Of India (@MAofIndia) May 28, 2024 -
యువతకు జాక్‌పాట్.. భారీ వేతనంతో ఉద్యోగాలు!
హర్యానాకు చెందిన యువతకు ఇజ్రాయెల్‌లో అత్యధిక వేతనంలో కూడిన ఉద్యోగాలు లభించాయి. దీంతో 530 మంది యువకుల బృందం హర్యానా నుండి ఇజ్రాయెల్‌కు బయలుదేరింది. వీరిని హర్యానా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎంపిక చేసింది. ఇంతకుముందే వీరికి ఇంటర్వ్యూలు పూర్తికాగా, ఇప్పుడు వీరంతా ఇజ్రాయెల్‌కు పయనమయ్యారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం మంగళవారం 530 మంది యువకులు న్యూఢిల్లీ నుండి ఇజ్రాయెల్‌కు వెళ్లారు. దీనికి ముందు హర్యానా సీఎం నయాబ్ సైనీ, మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఈ యువకులతో మాట్లాడారు. ఇజ్రాయెల్‌లో ఉద్యోగాల భర్తీకి హర్యానా ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. ఈ క్రమంలో గత జనవరిలో రోహ్తక్లో ఆరు రోజుల పాటు జరిగిన రిక్రూట్మెంట్ ప్రక్రియలో పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు. మొత్తం 8,199 మంది యువకులు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరు ఇజ్రాయెల్ వెళ్లే ముందు హర్యానా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ ఈ యువకులను అభినందించారు. ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ నేపధ్యంలో ఇజ్రాయెల్‌లో కార్మికుల కొరత తలెత్తింది. దీంతో కార్మికులను తమ దేశానికి పంపాలని ఇజ్రాయెల్ భారతదేశాన్ని అభ్యర్థించింది. ఇజ్రాయెల్‌లో 10 వేల మంది నిర్మాణ కార్మికుల అవసరం ఉంది. వీరికి నెలకు రూ.1,37,000 జీతం లభించనుంది. దీంతో పాటు వైద్య బీమా, ఆహారం, వసతి సౌకర్యాలు కూడా కల్పించనున్నారు. -
మండుతున్న ఎండలు.. ఏసీ కొంటున్నారా..? జాగ్రత్తలివే..
ఎండలు మండిపోతున్నాయి. ఈ ఏడాది భారీగా వేసవి తాపం ఉంటుందని పలువురు అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరగనున్నాయి. ఇప్పటికే ఇంట్లో తీవ్ర ఉక్కపోత మొదలైంది. ఫ్యానులు, కూలర్లు ఉన్నా గది అంతా చల్లదనం రాక ఇబ్బందులు పడుతున్నారు. దాంతో చాలా మంది ఏసీలు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ యాప్‌లు, రిటైల్ స్టోర్‌ల్లో వీటి అమ్మకాలు ఇప్పటికే ఊపందుకున్నాయి. అయితే వాటిని కొనుగోలు చేసేపుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఐసెర్ రేటింగ్ కొందరు సరైన అవగాహన లేక పెద్ద గదులకు తక్కువ సామర్థ్యం ఉన్న ఏసీలు కొనుగోలు చేస్తారు. 110 చదరపు అడుగులు పరిమాణంలో గది ఉంటే 1 టన్ను, 110-150 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన గదికి 1.5 టన్నులు, 150-190 చదరపు అడుగుల గదికి 2 టన్నుల సామర్థ్యమున్న ఏసీని ఎంచుకోవాలి. ఏసీ కొనుగోలు చేసేటప్పుడు ముఖ్యంగా ఐసెర్ (ఐఎస్‌ఈఈఆర్) రేటింగ్ చూడాలి. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ ప్రమాణాల ప్రకారం ప్రతి రెండు సంవత్సరాలకు ఐసెర్ రేటింగ్ మారుతుంది. ప్రస్తుతం ఐసెర్ రేట్ 5 అంత కంటే ఎక్కువ ఉంటే ఫైవ్ స్టార్ ఉంటుంది. రేటింగ్ 4.4- 4.99 మధ్య ఉంటే ఫోర్ రేటింగ్ ఉంటుంది. రేటింగ్‌లో తేడా వల్ల విద్యుత్తు వినియోగంలో మార్పు ఉంటుంది. ఇన్వర్టర్తో మేలు చాలా ఇళ్లల్లో నిత్యం ఏసీని ఉపయోగించే వారు ఇన్వర్టర్తో కూడిన ఏసీ కొనుగోలు చేసుకోవాలి. ఇది విద్యుత్తును పొదుపు చేస్తుంది. మోటారు వేగాన్ని నియంత్రిస్తూ గది ఉష్ణోగ్రతను సర్దుబాటు చేస్తుంది. నాన్ ఇన్వర్టర్ ఏసీల్లో ఈ వెసులుబాటు ఉండదు. కేవలం ఆన్, ఆఫ్ మాత్రమే ఉంటాయి. కేవలం వేసవిలో మాత్రమే రోజుకు మూడు నుంచి నాలుగు గంటలు ఉపయోగించేవారు నాన్ ఇన్వర్టర్ ఏసీ కొనుక్కోవచ్చు. మార్కెట్లో చాలా వరకు కన్వర్ట్‌బుల్ ఏసీలు అందుబాటులో ఉన్నాయి. చిన్న గదిలో 1.5 టన్నుల సామర్థ్యం కలిగిన వాటిని ఏర్పాటు చేసినా.. అవసరం మేరకు 1 టన్ను, 0.8 టన్ను ఇలా సమర్థ్యాన్ని మార్చుకోవచ్చు. సామర్థ్యం తగ్గించడం వల్ల అవుట్డోర్ యూనిట్‌లోని ఫ్యాన్ వేగం తగ్గి విద్యుత్తు పొదుపు అవుతుంది. ఇదీ చదవండి: 8.8 కి.మీ క్యాబ్ రైడ్ ధర చూసి షాక్.. చివరికి ఏమైందంటే.. ధరల మధ్య వ్యత్యాసం ఏసీ కొనుగోలు చేసేప్పుడే తప్పకుండా స్టెబిలైజర్ కొనాలి. వోల్టేజ్ హెచ్చుతగ్గుల పరిధి దాటినప్పుడు స్టెబిలైజర్ లేకుంటే ఏసీ పాడవుతుంది. వోల్టేజ్ హెచ్చుతగ్గుల వల్ల పాడైతే వారంటీ ఉండదనే విషయం గుర్తుపెట్టుకోవాలి. చాలా కంపెనీలు స్మార్ట్ ఏసీలను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. వాటిని యాప్‌ల ద్వారానూ నిర్వహించవచ్చు. ఏసీ కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా వారంటీ చూసుకోవాలి. ఈ-కామర్స్ సంస్థల మధ్య ధరల విషయంలో తేడాలు ఉంటాయి. ఆఫర్లు ఉంటే గమనించాలి. కొన్ని సందర్భాల్లో ఈ-కామర్స్ సంస్థల కంటే కంపెనీల డీలర్ల వద్ద కూడా తక్కువ ధరకు లభిస్తాయి. -
గుంపు మేస్త్రీకి 1.37 లక్షల శాలరీ ఆఫర్!
దారిద్ర్యంలో మగ్గిపోతున్న వ్యక్తికి ఒక్కసారిగా లక్షల రూపాయల జీతం వచ్చే ఉద్యోగం లభిస్తే ఎలా ఉంటుంది? ఇలాంటి ఊహకందని ఆఫర్ బీహార్ గుంపు మేస్త్రీకి దక్కింది. దీంతో అతని జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఇజ్రాయెల్‌లో గత కొన్ని నెలలుగా హమాస్‌తో జరుగుతున్న యుద్ధం కారణంగా పలు భవనాలు శిధిలమయ్యాయి. తిరిగి భవనాలను నిర్మించేందుకు ఇజ్రాయెల్‌కు నిర్మాణ కార్మికుల అవసరం ఎంతో ఉంది. దీనిలో భాగంగానే కార్మికుల నియామక ప్రక్రియ కొనసాగుతోంది. ముఖ్యంగా భవన నిర్మాణపు పనుల్లో పాల్గొనే కార్మికులకు డిమాండ్ అధికంగా ఉంది. అర్హతను అనుసరించి గుంపు మేస్త్రీలను రూ. 1.37 లక్షల వేతనంతో నియమించుకుంటున్నారు. ఇలా నియమితులైనవారు ఏడాది నుంచి ఐదు సంవత్సరాల పాటు అక్కడ పనులు చేయాల్సి ఉంటుంది. బీహార్‌లోని చాప్రా నివాసి జితేంద్ర కుమార్ రాయ్ అనే తాపీ మేస్త్రీకి ఇజ్రాయెల్‌లో పనిచేసే అవకాశం దొరికింది. పొలిటికల్ సైన్స్‌లో గ్రాడ్యుయేట్ అయిన జితేంద్ర చిన్నప్పటి నుంచి సైనికునిగా మారాలని కలలుగనేవాడు. అతనికి తగిన పని దొరక్కపోవడంతో తాపీ మేస్త్రీగా జీవనం సాగిస్తున్నాడు. గుంపు మేస్త్రీగా ధృవీకరణ పత్రం పొందేందుకు జంషెడ్‌పూర్‌లోని నేషనల్ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఎనిమిది సంవత్సరాలు పనిచేశాడు. ప్రస్తుతం జితేంద్ర బీహార్‌లో తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. ప్రతీనెలా రూ.20 వేల వరకూ సంపాదిస్తుంటాడు. ఇజ్రాయెల్ వెళ్లే అవకాశం రాగానే జితేంద్ర ఎగిరిగంతేశాడు. తమ కుటుంబం ఇన్నాళ్లూ అనుభవించిన పేదరికం ఇక పటాపంచలైపోతుందని జితేంద్ర ఆశాభావం వ్యక్తం చేశాడు. -
బంపరాఫర్.. రూ. 1799కే ఫ్లైట్ జర్నీ!
టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా బంపరాఫర్ ప్రకటించింది. వన్‌వే టికెట్ డొమెస్టిక్ రూట్లలో రూ. 1,799, అంతర్జాతీయ రూట్లలో రూ. 3,899 నుంచి ప్రారంభమయ్యే నెట్వర్క్-వైడ్ సేల్‌ను ప్రారంభించింది . ఎయిర్ ఇండియా నమస్తే వరల్డ్ సేల్ పేరిట పరిమిత-కాల నెట్వర్క్-వ్యాప్త ఆఫర్‌ను ఫిబ్రవరి 2న ప్రారంభించింది. ఇది ఫిబ్రవరి 5 వరకు చెల్లుబాటులో ఉంటుంది. దీంతోపాటు ఎయిర్ ఇండియా వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా చేసే బుకింగ్ చేస్తే ఈ ఆఫర్‌పై కన్వీనియన్స్ ఫీజు కూడా మినహాయించనున్నట్లు ఎయిర్ఇండియా ఒక విడుదలలో తెలిపింది. షరతులు ఇవే.. ఎయిర్ ఇండియా నమస్తే వరల్డ్ సేల్ కింద బుకింగ్‌లు కేవలం నలుగురికి మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఫిబ్రవరి 2 నుంచి సెప్టెంబర్ 30 మధ్య చేసే ప్రయాణాలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఫిబ్రవరి 5వ తేదీ లోపు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. దేశీయ మార్గాల్లో అన్నీ కలుపుకొని వన్-వే ఎకానమీ క్లాస్ ఛార్జీలు రూ.1,799 నుంచి ప్రారంభమవుతాయి. అయితే వన్-వే బిజినెస్ క్లాస్‌లో ఇది రూ. 10,899. ఇక అంతర్జాతీయ మార్గాల్లో వన్-వే ఎకానమీ క్లాస్ ఛార్జీలు రూ. 3,899 నుంచి ప్రారంభమవుతాయి. ఈ సేల్ అందుబాటులో ఉన్న సీట్లు పరిమితంగా ఉంటాయి. ముందుగా బుక్ చేసుకున్నవారికి సీట్లు లభిస్తాయని ఎయిర్ లైన్స్ తెలిపింది. ఎయిర్ ఇండియా వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా కొనుగోలు చేసిన టిక్కెట్లపై కన్వీనియన్స్ ఫీజు ఆదా చేసుకోవచ్చు. దేశంలోని పలు నగరాలతో పాటు యూఎస్, కెనడా, యూకే, యూరప్, ఆస్ట్రేలియా, గల్ఫ్ & మిడిల్ ఈస్ట్, ఆసియా పసిఫిక్, దక్షిణ ఆసియాలో ఎయిర్‌లైన్ నిర్వహించే గమ్యస్థానాలకు తగ్గింపు ధరలు అందుబాటులో ఉంటాయి. -
లేటెస్ట్ ఫ్లిప్ ఫోన్.. అప్పుడు కొనలేకపోయారా? ఇప్పుడు కొనేయండి!
మార్కెట్లోకి రకరకాల లేటెస్ట్ స్మార్ట్ఫోన్లు వస్తూ ఉన్నాయి. ప్రత్యేకమైన సరికొత్త ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. అయితే లాంచ్ అయినప్పుడు వాటి ధర ఎక్కువగా ఉంటుంది. దీంతో కొంతమంది వాటిని కొనలేకపోయామే అని బాధపడుతూ ఉంటారు. అలాంటి వారి కోసం కంపెనీలు కొన్ని నెలల తర్వాత ఆ ఫోన్ల ధరలను తగ్గిస్తుంటాయి. మోటరోలా రేజర్ 40 (Moto Razr 40), మోటరోలా రేజర్ 40 అల్ట్రా (Moto Razr 40 Ultra) ఫ్లిప్ ఫోన్లు గతేడాది జూన్‌లో విడుదలయ్యాయి. 2000ల ప్రారంభం నాటి ఐకానిక్ Motorola Razr ఫ్లిప్ ఫోన్లను పునరుద్ధరిస్తూ లేటెస్ట్ ఫీచర్లతో కంపెనీ వీటిని తీసుకొచ్చింది. ప్రస్తుతం వీటి ధరలను మోటరోలా భారీగా తగ్గించింది. అధిక ధరల కారణంగా అప్పుడు కొనలేకపోయినవారు ఇప్పుడు కొనవచ్చు. రూ.20,000 తగ్గింపు మోటరోలా భారత్‌లో తన మోటో రేజర్ 40, మోటో రేజర్ 40 అల్ట్రా ఫ్లిప్ ఫోన్లకు గణనీయమైన ధర తగ్గింపును ప్రకటించింది. మోటో రేజర్ 40 ధరను రూ. 15,000 తగ్గించింది. దీని అసలు ధర రూ. 59,999 కాగా ఇప్పడు రూ. 44,999కి తగ్గింది. అదేవిధంగా మోటో రేజర్ 40 అల్ట్రా ధరను ఏకంగా రూ. 20,000 తగ్గించింది. రూ. 89,999 ఉన్న ఈ ఫోన్‌ను రూ. 69,999కే కొనుక్కోవచ్చు. మోటరోలా అధికారిక వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్‌లోనూ ఇవి అందుబాటులో ఉన్నాయి. మోటో రేజర్ 40 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు 144 Hz రిఫ్రెష్ రేట్, 1080×2640 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.90-అంగుళాల ప్రైమరీ డిస్ప్లే, 1.50-అంగుళాల సెకండరీ డిస్ప్లే ఆండ్రాయిడ్ 13 ద్వారా ఆధారితం 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్. ఇందులో 64-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 13-మెగాపిక్సెల్ కెమెరా, 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అజూర్ గ్రే, చెర్రీ పౌడర్, బ్రైట్ మూన్ వైట్ రంగులలో లభ్యం 4200 mAh బ్యాటరీ, వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ మోటో రేజర్ 40 అల్ట్రా ఫీచర్లు, స్పెసిఫికేషన్లు 1080×2640 పిక్సెల్స్ రిజల్యూషన్, 165 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల ప్రైమరీ డిస్ప్లే ఆండ్రాయిడ్ 13 ద్వారా ఆధారితం 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 12-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 13-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇన్ఫినిట్ బ్లాక్, వివా మెజెంటా రంగులలో లభ్యం వైర్లెస్, వైర్డు ఛార్జింగ్ రెండింటినీ సపోర్ట్ చేసే 3800mAh బ్యాటరీ -
Ayodhya: బంపరాఫర్.. అయోధ్యకు ఉచితంగా బస్సు టికెట్
అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ట వేడుక జనవరి 22న జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు అయోధ్యను సందర్శించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం భారతీయ రైల్వే అనేక ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఎయిర్ లైన్ సంస్థలు కూడా విమాన సర్వీసులను పెంచాయి. అయోధ్యకు వెళ్లే వారి కోసం ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం (Paytm) ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. రామ జన్మభూమిని దర్శించేవారికి పేటీఎం యాజమాన్య సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (OCL) ఒక పథకాన్ని ప్రారంభించింది. దీని కింద 1000 మందికి అయోధ్యకు ఉచితంగా బస్సు టిక్కెట్ లభిస్తుంది. ఈ ఆఫర్ జనవరి 19న ప్రారంభమైంది. ఇదీ చదవండి: Ayodhya Ram Mandir: పుణ్యంతోపాటు పన్ను ఆదా! ఎలాగంటే.. రామ మందిర ప్రతిష్ఠాపన వేడుక కోసం అయోధ్యకు వెళ్లే ప్రయాణికుల కోసం పేటీఎం ఈ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. పేటీఎం మొబైల్ యాప్ ద్వారా టిక్కెట్‌ను బుక్ చేసుకునే మొదటి 1,000 మంది వినియోగదారులకు మాత్రమే ఉచిత బస్సు టిక్కెట్లు లభిస్తాయి. ఆఫర్‌ను పొందడానికి 'BUSAYODHYA' అనే ప్రోమో కోడ్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది. -
చిరంజీవి ఇంటికి పిలిచి ఆఫరిస్తే రిజెక్ట్ చేశా..
-
పేరులో రాముడుంటే బంపర్ ఆఫర్!
జనవరి 22న అయోధ్యలోని రామాలయంలో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపనకు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఈ సంతోష సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జూ నిర్వాహకులు పర్యాటకులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. గోరఖ్‌పూర్‌లోని షహీద్ అష్ఫాక్ ఉల్లా ఖాన్ జూలాజికల్ పార్క్ అధికారులు జనవరి 21న జూపార్కునకు వచ్చే వారిలో ఎవరిపేరులోనైనా ‘రాము’ అని ఉంటే వారికి ఎంట్రీ టిక్కెట్లో 50 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ ఆఫర్ అందుకునేందుకు రాము అనే పేరు కలిగినవారు తమ అధికారిక గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుంది. జూలాజికల్ పార్క్ డైరెక్టర్ మనోజ్ కుమార్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ జనవరి 21న ఒక రోజు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. జంతుప్రదర్శనశాలకు ప్రతీ సోమవారం సెలవు. అయితే రాబోయే సోమవారం నాడు జూపార్కు ప్రవేశద్వారం దగ్గర ప్రాణ ప్రతిష్ఠ వేడుక ప్రత్యక్ష ప్రసారాన్ని చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: అయోధ్యకు చేరుకున్న హనుమంతుడు.. -
బంపర్ డిస్కౌంట్.. ఐఫోన్ 15పై రూ.10,000 తగ్గింపు!
స్మార్ట్ ఫోన్ల వినియోగం ప్రస్తుతం బాగా పెరిగిపోయింది. దాదాపు ప్రతిఒక్కరి దగ్గరా స్మార్ట్‌ఫోన్ ఉందంటే అతిశయోక్తి కాదు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్లకు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. వీటిపై డిస్కౌంట్లు ఎప్పుడు వస్తాయా అని చాలా మంది ఎదురు చూస్తుంటారు. ఇలాంటి వారి కోసమే ఐఫోన్ 15పై భారీ తగ్గింపు సమాచారం ఇక్కడ ఇస్తున్నాం. కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ రిటైల్ చైన్ విజయ్ సేల్స్ తమ ఇయర్ ఎండ్ యాపిల్ సేల్‌ను తాజాగా ప్రకటించింది. ఐఫోన్ 15 (iPhone 15) సిరీస్‌తో సహా కొన్ని లేటెస్ట్ యాపిల్ ఉత్పత్తులను తగ్గింపు ధరలకు అందిస్తోంది. ఇందులోనూ ఐఫోన్ 15 సిరీస్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఐఫోన్ 15ప్రో 1టీబీ వేరియంట్‌ను డిస్కౌంట్‌పై రూ. 159,990కి కొనుగోలు చేయవచ్చు. ఇక ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ బేస్ 256జీబీ వేరియంట్‌ను బ్యాంక్ ఆఫర్లు లేకుండానే కేవలం రూ. 148,710లకే లిస్ట్ చేసింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్ వినియోగిస్తే రూ. 5,000 వరకు అదనపు తక్షణ తగ్గింపును పొందవచ్చు. విజయ్ సేల్స్ స్టోర్లలో రూ. 10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. పాత ఐఫోన్ 14 మోడల్‌లు కూడా ఆకర్షణీయమైన ధరలకు లభిస్తున్నాయి. కేవలం ఐఫోన్లే కాకుండా మ్యాక్‌బుక్స్, ఐప్యాడ్లు, యాపిల్ వాచీలు, ఇతర ఉపకరణాలపై కూడా రూ. 5,000 వరకు తగ్గింపును పొందవచ్చు. బేస్ మ్యాక్‌బుక్ ఎయిర్ ఎం2 (MacBook Air M2)ని డిస్కౌంట్‌తో రూ. 96,960కే కొనుగోలు చేయవచ్చు. ఐప్యాడ్ ఎయిర్ (iPad Air 5th Gen) ఆఫర్ల తర్వాత రూ. 50,680కి అందుబాటులో ఉంది. యాపిల్ సెకండ్ జనరేషన్ ఎయిర్ పాడ్స్ ప్రోని డిస్కౌంట్ తర్వాత కేవలం రూ. 18,990 లకే సొంతం చేసుకోవచ్చు. డిసెంబర్ 31 నుంచి జనవరి 7 వరకు వారం రోజుల పాటు ఈ సేల్ ఉంటుందని విజయ్ సేల్స్ తెలిపింది. -
అన్లిమిటెడ్ ‘రెడ్ అలర్ట్ సేల్’
న్యూఢిల్లీ: అన్లిమిటెడ్ స్టోర్స్ ‘రెడ్ అలర్ట్ సేల్ ఆఫర్’ను ప్రకటించింది. అన్ని బ్రాండెడ్ వ్రస్తాలపై 50% ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తుంది. అలాగే రూ.3వేల షాపింగ్‌పై అంతే విలువైన ఉత్పత్తులు ఉచితంగా పొందవచ్చు. దేశవ్యాప్తంగా 87 స్టోర్లలో జనవరి 1 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఫ్యాషన్ ఇష్టపడే ప్రతి ఒక్కరూ అవకాశాన్ని సది్వనియోగం చేసుకోవాలని కోరింది. -
సింగిల్ ఛార్జ్ 200 కిమీ రేంజ్! ధర కూడా తక్కువే..
Komaki LY Electric Scooter: ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న తరుణంలో దాదాపు అన్ని సంస్థలు ఈ రంగం వైపే జోరుగా అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగానే దేశీయ మార్కెట్లో విడుదలైన 'కొమాకి ఎల్వై' (Komaki LY) ఎలక్ట్రిక్ స్కూటర్ మీద కంపెనీ ఇప్పుడు అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. లాంచ్ సమయంలో రూ. 96,968 వద్ద అమ్ముడైన ఈ స్కూటర్ ఇప్పుడు రూ. 78,000 వద్ద లభిస్తోంది. అంటే కంపెనీ ఈ స్కూటర్ మీద రూ. 18,968 డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ కేవలం పరిమిత సమయం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. నగర ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని తయారైన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్, డ్యూయల్ బ్యాటరీ ఎంపికలలో అందుబాటులో ఉంది. సింగిల్ బ్యాటరీతో కూడిన స్కూటర్ 85 కిలోమీటర్ల రేంజ్ అందిస్తే, డ్యూయల్ బ్యాటరీ స్కూటర్ 200 కిమీ రేంజ్ అందిస్తుంది. అయితే వాస్తవ ప్రపంచంలో రేంజ్ కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. ఇదీ చదవండి: కలిసొచ్చిన చంద్రయాన్ 3 సక్సెస్ - బిలియనీర్ల జాబితాలోకి కొత్త వ్యక్తి రిమూవబుల్ బ్యాటరీ కలిగిన 'కొమాకి ఎల్వై' (Komaki LY) ఎలక్ట్రిక్ స్కూటర్ TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పొందుతుంది. ఇది బ్యాటరీ స్టేటస్, న్యావిగేషన్ వంటి మరిన్ని వివరాలను రైడర్‌కు తెలియజేస్తుంది. ఆన్‌బోర్డ్‌లో సౌండ్ సిస్టమ్ ఉండటం వల్ల, బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా ప్లే చేయవచ్చు. డిజైన్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. -
ఈ బైక్ కొనుగోలుపై రూ.1.97 లక్షల డిస్కౌంట్ - నేడే ఆఖరు..
భారతీయ మార్కెట్లో ఎక్కువ మంది బైక్ రైడర్లు ఇష్టపడే బైక్ బ్రాండ్లలో ఒకటి 'డుకాటి' (Ducati). ఫెస్టివల్ సీజన్ పూర్తయిన తరువాత కూడా ఈ కంపెనీ కస్టమర్ల కోసం ఎంపిక చేసిన మోడల్ మీద భారీ డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిపింది. ఇంతకీ ఏ బైకుపై సంస్థ డిస్కౌంట్ అందిస్తోంది, డిస్కౌంట్ తర్వాత ఈ బైక్ ధర ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. డుకాటి కంపెనీకి చెందిన మాన్స్టర్ (Monster) బైకుపై సంస్థ ఏకాంగి రూ. 1.97 లక్షలు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ బైక్ ధర రూ. 12.95 లక్షలు కాగా.. డిస్కౌంట్ తరువాత ఇది రూ. 10.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్ కేవలం ఈ రోజు (నవంబర్ 30) వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. డుకాటి మాన్స్టర్ బైక్ 937 సీసీ ట్విన్ సిలిండర్ ఇంజన్ కలిగి 9250 ఆర్పీఎమ్ వద్ద 109 బీహెచ్పీ పవర్, 6500 ఆర్పీఎమ్ వద్ద 92 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది స్లిప్పర్ క్లచ్, డుకాటి క్విక్ షిఫ్ట్ ద్వారా 6-స్పీడ్ గేర్‌బాక్స్ పొందుతుంది, తద్వారా అద్భుతమైన పర్ఫామెన్స్ అందిస్తుంది. ఇదీ చదవండి: దిగ్గజ కంపెనీల నిర్ణయంపై 'ఎలాన్ మస్క్' ఘాటు వ్యాఖ్యలు దేశీయ మార్కెట్లో డుకాటి మాన్స్టర్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి స్టాండర్డ్, ఎస్పీ వేరియంట్లు. ప్రారంభంలో ఈ బైక్ రూ. 15.95 లక్షల ధర వద్ద విడుదలైంది, ఆ తరువాత ఈ ధరలు కొంత అతగ్గుముఖం పట్టాయి. దీంతో ఎక్కువ మంది కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. -
బుకింగ్‌లపై బ్లూడార్ట్ భారీ డిస్కౌంట్లు
ముంబై: దక్షిణాసియాలో ప్రముఖ ఎక్స్?ప్రెస్ ఎయిర్ రవాణా, ఏకీకృత లాజిస్టిక్స్ సంస్థ బ్లూడార్ట్ ఎక్స్?ప్రెస్ లిమిటెడ్ దీపావళి పండుగ సందర్భంగా బుకింగ్‌లపై ఆఫర్లను ప్రకటించింది. ఇందుకోసం ‘దివాలి ఎక్స్?ప్రెస్’ను తీసుకొచి్చంది. ఈ ప్రత్యేక ఆఫర్ నవంబరు 19 వరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. దేశీయ లేదా అంతర్జాతీయ ప్రదేశాలకు పంపించే అన్ని దీపావళి బహుమతుల షిప్మెంట్లపై డిస్కౌంట్ ఇస్తున్నట్టు ప్రకటించింది. 2 నుంచి 10 కిలోల బరువు ఉన్న దేశీయ షిప్మెంట్లపై 40 శాతం తగ్గింపు, 3 కిలోలు, 5 కిలోలు, 10 కిలోలు, 15 కిలో లు, 20 కిలోలు, 25 కిలోల బరువు ఉన్న అంతర్జాతీయ నాన్–డాక్యుమెంట్ షిప్మెంట్స్పై 50 శాతం తగ్గింపును పొందొచ్చని తెలిపింది.