లేటెస్ట్‌ గూగుల్‌ ఫోన్‌పై రూ.26 వేల డిస్కౌంట్‌! | Google Pixel 8 becomes cheaper by Rs 26000 crack the deal quickly | Sakshi
Sakshi News home page

లేటెస్ట్‌ గూగుల్‌ ఫోన్‌పై రూ.26 వేల డిస్కౌంట్‌!

Published Fri, Jan 24 2025 7:32 PM | Last Updated on Fri, Jan 24 2025 7:50 PM

Google Pixel 8 becomes cheaper by Rs 26000 crack the deal quickly

మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను (smartphone) మార్చేసి ఖరీదైన కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ కొనాలనుకుంటున్నారా? అయితే లేటెస్ట్‌ గూగుల్‌ పిక్సెల్‌ 8 (Google Pixel 8)ని కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం కావచ్చు. ఈ ఫోన్‌పై ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లో భారీ డీల్‌ అందుబాటులో ఉంది. ఐదు వేలు.. 10 వేలు కాదు.. ఏకంగా రూ. 26,000 తగ్గింపు లభిస్తోంది. ఇంత భారీ డిస్కౌంట్‌ ప్రీమియం ఫోన్లపై తరచుగా లభించదు. కాబట్టి పిక్సెల్ ఫోన్ కొనాలనుకుంటే ఇది సువర్ణావకాశం.

34 శాతం తగ్గింపు 
ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్ ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్‌పై 34 శాతం తగ్గింపు లభిస్తోంది. తగ్గింపు తర్వాత గూగుల్‌ పిక్సెల్‌ 8 (Hazel, 128 GB) (8 GB RAM) ధర రూ.49,999 అయింది. వాస్తవంగా ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 75,999 వద్ద లిస్ట్‌ అయింది. అంతేకాకుండా ఎక్స్చేంజ్ ఆఫర్‌తో రూ. 28200 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) క్రెడిట్ కార్డ్‌పై రూ.3000 తగ్గింపు అందుబాటులో ఉంటుంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ ద్వారా ఐదు శాతం వరకు తగ్గింపు అందుబాటులో ఉంటుంది. నెలకు రూ.8,334 నో-కాస్ట్ ఈఎంఐ (EMI) ఆఫర్ కూడా ఉంది.

గూగుల్‌ పిక్సెల్‌ 8 ఫీచర్లు

  • 6.2-అంగుళాల OLED డిస్‌ప్లే

  • గూగుల్‌ టెన్సర్ G3 ప్రాసెసర్

  • 128GB, 256GB స్టోరేజ్‌ ఆప్షన్లు

  • 27W వైర్డు, 18W వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 4575mAh బ్యాటరీ

  • ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్

అద్భుతమైన కెమెరా
గూగుల్‌ పిక్సెల్‌ 8 ఫోన్‌లో అద్భుతమైన కెమెరా ఫీచర్లు ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్‌ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉంది. సెల్ఫీల కోసం 10.5 MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఇందులో ఏఐ సాంకేతికతను పొందుపరిచారు. కెమెరాలోని 'మ్యాజిక్ ఎరేజర్' ఫీచర్‌తో ఫోటో నుండి అనవసరమైన వాటిని తొలగించవచ్చు. 'రియల్ టోన్' ఫీచర్ విభిన్న స్కిన్ టోన్‌లను ఖచ్చితమైన రీతిలో చూపుతుంది. 'నైట్ సైట్' ఫీచర్ తక్కువ వెలుతురులో కూడా అద్భుతమైన ఫొటోలను తీస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement