Google Pixel
-
ఖరీదైన గూగుల్ పిక్సెల్ ఫోన్ సగం ధరకే!
ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ను భారీ తగ్గింపుతో కొనాలనుకుంటే ఇదే సరైన సమయం. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం బిగ్ దీవాళి సేల్ పేరుతో ఆఫర్లు అందిస్తోంది. ఇందులో భాగంగా గూగుల్ కంపెనీకి చెందిన పిక్సెల్ 8 (Google Pixel 8) ఫోన్‌పై భారీ తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంది.గూగుల్ పిక్సెల్ 8 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 82,999 కాగా ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ ఫోన్‌ను రూ. 42,999కే సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎస్బీఐ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అలా గూగుల్ పిక్సెల్ 8 ఫోన్‌ను రూ. 36,499కే సొంతం చేసుకోవచ్చు. మరోవైపు ఈ ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందిస్తున్నారు. మీ పాత ఫోన్ ఇస్తే దాని కండిషన్ ఆధారంగా రూ. 42,500 వరకు తగ్గింపు పొందొచ్చు.గూగుల్ పిక్సెల్ 8 ఫీచర్లు ఈ ఫోన్లో 6.2 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ప్లే అందించారు. 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో ఫుల్హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ ఈ స్క్రీన్ సొంతం. Titan M2 సెక్యూరిటీ చిప్‌తో వచ్చిన ఈ ఫోన్లో ప్రాసెసర్ కోసం T3 చిప్సెట్ ఇచ్చారు. ఇక కెమెరా విషయానికొస్తే 50 మెగాపిక్సెల్స్, 12 మెగాపిక్సెల్స్ డ్యూయల్ రియిర్ కెమెరా సెటప్ ఉంది. అలాగే సెల్పీలు, వీడియో కాల్స్ కోసం 10.5 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. బ్యాటరీ సంగతికొస్తే ఈ ఫోన్లో 27 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4575 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. -
గూగుల్ కొత్త స్మార్ట్‌ఫోన్: స్విచ్ఆఫ్ అయినా ట్రాక్ చేయొచ్చు
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. సాధారణ స్మార్ట్ఫోన్ల కంటే కూడా ఇది అత్యాధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇందులో తప్పకుండా తెలుసుకోవల్సిన మూడు ఫీచర్స్ ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు చూసేద్దాం.యూఎస్బీ-సీ డిస్ప్లే అవుట్‌పుట్‌కు సపోర్ట్ చేస్తుందికొత్త గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ స్మార్ట్ఫోన్లు యూఎస్బీ-సీ డిస్ప్లే అవుట్‌పుట్‌కు సపోర్ట్ చేస్తాయి. యూఎస్బీ-సీ ద్వారా డిస్ప్లే పోర్ట్‌తో స్క్రీన్‌ని కనెక్ట్ చేయవచ్చు. దీంతో మీ మొబైల్ ఓ పాకెట్ కంప్యూటర్ మాదిరిగా మారుతుంది.స్విచ్ఆఫ్ అయినప్పటికీ ట్రాక్ చేయవచ్చుసాధారణంగా మొబైల్ స్విచాఫ్ అయితే దానిని ట్రాక్ చేయడం అసాధ్యం. కానీ గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ మొబైల్ స్విచాఫ్ అయినప్పటికీ ట్రాక్ చేయవచ్చు. అయితే మొబైల్ స్విచాఫ్ అయిన కొన్ని గంటల తర్వాత కూడా ఫైండ్ మై డివైస్ నెట్వర్క్ని ఉపయోగించి ట్రాక్ చేయగల సామర్థ్యానికి సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ లేదా ఆండ్రాయిడ్ పరికరాల నుంచి డేటాను ఉపయోగించి ట్రాక్ చేయడం ద్వారా ఇది పని చేస్తుంది. మొబైల్ స్విచాఫ్ అయిన తరువాత దానిని కనిపెట్టడం చాలా కష్టం. అయితే ఈ ఫీచర అలాంటి సమయంలో ఉపయోగపడుతుంది.బ్యాటరీ సైకిల్ కౌంట్ ఇన్ఫర్మేషన్ఈ ఫీచర్ సాదరంగా ఐఫోన్ 15 సిరీస్ ఫోనులో ఉంటుంది. ఆ ఫీచర్ ఇప్పుడు గూగుల్ తన పిక్సెల్ 9 స్మార్ట్‌ఫోన్‌లో ప్రవేశపుట్టింది. అంటే వినియోగదారు తన స్మార్ట్‌ఫోన్‌కు ఎన్ని సార్లు ఛార్జ్ చేశారు. బ్యాటరీ ఎంత పాతది అనే విషయాలు దీని ద్వారా తెలుస్తాయి. ఐఫోన్ 15 సిరీస్ ఫోను 1000 ఛార్జ్ సైకిల్స్ పూర్తయితే 20 శాతం ఛార్జింగ్ కెపాసిటీ కోల్పోతుంది. అయితే గూగుల్ దీనికి సంబంధించిన విషయాలను వెల్లడించలేదు. -
ఆనంద్ మహీంద్రా వాడే ఫోన్ ఏంటో తెలుసా?
తయారీలో భారత్‌ను అగ్రస్థానంలో నిలిపేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. మేడిన్ ఇండియా ఫలితాలు ఎలా ఉన్నాయో ప్రముఖ వ్యాపార వేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా కళ్లకు కట్టినట్లు చూపించారు. టెక్ దిగ్గజం గూగుల్ కీలక ప్రకటన చేసింది. తమ ప్రీమియం ఫోన్ పిక్సెల్ సిరీస్‌ను భారత్‌లో తయారు చేయనున్నట్లు వెల్లడించింది. మేకిన్ ఇండియాలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రిక్ ఓస్టెర్లో తెలిపారు. ‘గూగుల్ ఫర్ ఇండియా’ కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు. గూగుల్ నిర్ణయంపై ఆనంద్ మహీంద్రా ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. అందులో మేడిన్ ఇండియా గురించి తన ఎదురైన తీపి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నారు. ఇటీవల,ఆనంద్ మహీంద్రా అమెరికాలో పర్యటించారు. ఆ సమయంలో కాల్స్ మాట్లాడేందుకు వీలుగా లోకల్ సిమ్ కొనుగోలు చేసేందుకు వెరిజాన్ స్టోర్‌కి వెళ్లారు. అక్కడ భారత్‌లో తయారైన ఐఫోన్ -15 కోసం సిమ్ కావాలని అడగ్గా సదరు సేల్స్ పర్సన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అతను వ్యక్తం చేసిన ఆశ్చర్యం నాకు ఆనందాన్ని కలిగించింది’ అంటూ ఇదే విషయాన్ని ట్వీట్లో పేర్కొన్నారు. I recently was in a Verizon store in the U.S to get a local sim and proudly informed the salesperson that my iPhone 15 was made in India. It was a particular pleasure to see his raised eyebrows! I also have a Google Pixel. I will switch to the India-made version when it’s out. So… https://t.co/QouFIOSu1M — anand mahindra (@anandmahindra) October 20, 2023 అంతేకాదు తన వద్ద గూగుల్ పిక్సెల్ ఫోన్ కూడా ఉంది. మేడిన్ ఇండియా ‘పిక్సెల్’ విడుదలయ్యాక దాన్నీ తీసుకుంటాను’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం, ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
భారత్‌లో ‘పిక్సెల్ సిరీస్’ స్మార్ట్ఫోన్ల తయారీలో గూగుల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్.. పిక్సెల్ సిరీస్ స్మార్ట్ఫోన్లను భారత్‌లో తయారు చేయాలని నిర్ణయించింది. దేశీయ మార్కెట్‌తోపాటు విదేశాలకు వీటిని సరఫరా చేస్తారు. ప్రస్తుతం ఈ మోడల్ ఫోన్లు చైనా, వియత్నాంలో ఉత్పత్తి అవుతున్నాయి. ఇటీవల విడుదలైన పిక్సెల్ 8 సిరీస్ భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా వినియోగదార్లను ఆకట్టుకుంటోంది. తొలుత పిక్సెల్ 8 మోడల్ ఫోన్లు మేడిన్ ఇండియా ట్యాగ్‌తో రానున్నాయి. పిక్సెల్ 8 ప్రో మోడల్ సైతం ఇక్కడ రూపొందే చాన్స్ ఉంది. దేశీయంగా పిక్సెల్ ఫోన్ల తయారీకై తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్, భారత్‌కు చెందిన డిక్సన్ టెక్నాలజీస్ పోటీపడుతున్నట్టు సమాచారం. 2016 నుంచి అంతర్జాతీయంగా సుమారు 4 కోట్ల పిక్సెల్ స్మార్ట్ఫోన్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. ఇందులో ఒక కోటి యూనిట్లు గడిచిన 12 నెలల్లో అమ్ముడవడం విశేషం. వచ్చే ఏడాది నుంచి.. మేడిన్ ఇండియా పిక్సెల్ స్మార్ట్‌ఫోన్స్ వచ్చే ఏడాది నుంచి అందుబాటులో ఉంటాయని గూగుల్ డివైసెస్, సర్వీసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రిక్ ఓస్టెర్లో గురువారం వెల్లడించారు. ఇందుకోసం అంతర్జాతీయ, దేశీయ ఒప్పంద తయారీ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటామని గూగుల్ ఫర్ ఇండియా 2023 కార్యక్రమంలో పేర్కొన్నారు. గూగుల్ తన ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లను దేశంలో తయారు చేయాలనే నిర్ణయం భారత్‌ను తయారీ కేంద్రంగా మార్చడం, అలాగే ప్రత్యర్థి చైనాతో పోటీ పడాలనే భారత లక్ష్యానికి పెద్ద ప్రోత్సాహం. క్రోమ్‌బుక్స్‌ను భారత్‌లో తయారు చేసేందుకు పర్సనల్ కంప్యూటర్ల ఉత్పత్తిలో పేరెన్నికగల హెచ్‌పీ ఇటీవలే గూగుల్‌తో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. భారత్‌లో ఇప్పటికే యాపిల్.. కొన్నేళ్లుగా యాపిల్ తన తయారీ స్థావరాన్ని విస్తరించాలని కోరుకుంటోంది. ఇందుకోసం చైనా+1 విధానంలో భాగంగా భారత్‌లో పలు ఉపకరణాలను అసెంబ్లింగ్ చేస్తోంది. గత నెలలో ఐఫోన్ 15 విడుదల యాపిల్ ఇండియా తయారీ ప్రణాళికలో ఒక ప్రధాన మైలురాయిగా నిలిచింది. భారత్‌లో, అలాగే చైనాలో ఉత్పత్తి అయిన ఐఫోన్స్‌ను ఒకే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో తొలిసారిగా యాపిల్ విడుదల చేయడం ఇందుకు కారణం. సాధారణంగా భారత్‌లో యాపిల్ తాజా మోడళ్ల ఉత్పత్తి చైనా కంటే కొన్ని నెలలు వెనుకబడి ఉంటుంది. 2025 నాటికి భారత్‌లో 25 శాతం ఐఫోన్లను తయారు చేయాలని యాపిల్ లక్ష్యంగా చేసుకుంది. -
స్మార్ట్ఫోన్లపై సూపర్ డిస్కౌంట్లు..
Flipkart Big Bachat Dhamaal Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ డమాల్ సేల్ మళ్లీ వచ్చేసింది. స్మార్ట్ఫోన్లపై సూపర్ డిస్కౌంట్లు నడుస్తున్నాయి. ఈ సేల్ మే 19న ప్రారంభమైంది. మే 21 వరకు కొనసాగుతుంది. గూగుల్ పిక్సెల్ 7ఏ (Google Pixel 7a), ఐఫోన్ 14 (iPhone 14)తో పాటు కొత్తగా లాంచ్ అయిన మరికొన్ని స్మార్ట్ఫోన్లు తక్కువ ధరకు కొనాలనుకుంటున్నవారికి ఇది మంచి అవకాశం. స్మార్ట్ ఫోన్లు మాత్రమే కాకుండా ఇతర ఎలక్ట్రానిక్స్, ఇయర్ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇతర గాడ్జెట్లపై సూపర్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. కొత్తగా లాంచ్ అయిన ప్రముఖ స్మార్ట్ ఫోన్లపై ఈ సేల్‌లో ఎలాంటి డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయో ఓ లుక్కేయండి.. ఇదీ చదవండి: Redmi A2 Series: రూ. 6 వేలకే సరికొత్త స్మార్ట్ఫోన్లు.. లాంచ్ చేసిన షావోమీ గూగుల్ పిక్సెల్ 7ఏ కొత్తగా లాంచ్ అయిన గూగుల్ పిక్సెల్ 7ఏ (Google Pixel 7a) ధర రూ. 43,999లుగా ఉంది. కోటక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐని ఎంచుకుంటే 10 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. అంతేకాకుండా పాత స్మార్ట్ఫోన్ల ఎక్స్చేంజ్ ద్వారా రూ. 34,000 వరకు తగ్గింపు లభిస్తుంది. గూగుల్ పిక్సెల్ 7ఏ 6.1అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది. Tensor G2 SoC చిప్‌తో జోడించారు. ఐఫోన్ 14 యాపిల్ ఐఫోన్ 14 (Apple iPhone 14) 128 GB వేరియంట్ రూ. 69,999 వద్ద లభిస్తుంది . హెచ్డిఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ. 4000 వరకు డిస్కౌంట్ వస్తుంది. ఇక పాత స్మార్ట్ఫోన్ల ఎక్స్ఛేంజ్పై రూ. 33,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఐఫోన్ 14లో 6.1 అంగుళాల సూపర్ రెటినా XDR డిస్ప్లే ఉంది . Apple A15 బయోనిక్ చిప్సెట్తో వస్తుంది. ఒప్పో రెనో 8 ప్రో 5G ఒప్పో రెనో (OPPO Reno) 8 Pro 5G (12 జీబీ ర్యామ్, 256 జీబీ రోమ్) ఫోన్‌ను రూ. 45,999లకే కొనుక్కోవచ్చు. అంతే కాకుండా కోటక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐని వాడుకుంటే 10 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. Mediatek డైమెన్సిటీ 8100 మాక్స్ ప్రాసెసర్ ఉన్న ఈ ఫోన్ 6.7 అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. ఇదీ చదవండి: అదిరిపోయే రంగులో శాంసంగ్ గెలాక్సీ ఎస్23.. ధర ఎంతంటే.. వివో T1X వివో (Vivo) T1X ఫోన్ 4GB ర్యామ్, 128GB రోమ్ వేరియంట్ ఫ్లిప్ కార్ట్ ఆఫర్ సేల్‌లో రూ. 12,999 కే లభిస్తుంది. మరోవైపు కోటక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐని ఎంచుకుంటే అదనంగా మరో 10 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇక పాత ఫోన్ల ఎక్స్చేంజ్పై గరిష్టంగా రూ. 12,450 లభిస్తుంది. పోకో F5 5G ప్రస్తుత ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో పోకో (Poco) F5 5G ఫోన్ 8GB వేరియంట్ రూ. 29,999లకు లభిస్తోంది. కోటక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.67 అంగుళాల డిస్ప్లే, Qualcomm Snapdragon 7+ Gen2 చిప్సెట్ ఉన్నాయి. కొత్తగా లాంచ్ అయిన స్మార్ట్ఫోన్లు, ఇతర గాడ్జెట్లు, వాటిపై ఉన్న ఆఫర్లు, డిస్కౌంట్ల గురించి తెలుసుకునేందుకు సాక్షి బిజినెస్ పేజీని చూడండి -
బంపర్ ఆఫర్: గూగుల్ పిక్సెల్ 7పై రూ.39 వేల తగ్గింపు
సాక్షి, ముంబై: గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ ఆఫర్ లభిస్తోంది. గత ఏడాది అక్టోబర్‌లో లాంచ్ అయిన పిక్సెల్ సిరీస్‌లో గూగుల్ పిక్సెల్ 7ఇపుడు చాలా తక్కువ ధరకే అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 39,000 తగ్గింపు తర్వాత కేవలం రూ. 20,999కి లభిస్తుంది. మరికొద్ది రోజుల్లో గూగుల్ పిక్సెల్ 7ఏ లాంచ్ కానుందన్న అంచనాల మధ్య డిస్కౌంట్ ధర అందుబాటులోకి వచ్చింది. భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 7 అసలు ధర రూ. 57,999. తాజా ఆఫర్లో బ్యాంక్ ఆఫర్లు, డిస్కౌంట్లతో కలిపి కేవలం రూ. 20,999కే కొనుగోలు చేయవచ్చు. గత రెండేళ్లుగా గూగుల్ బ్రాండ్ ఇకామర్స్ భాగస్వామి ఫ్లిప్‌కార్ట్ ఎక్స్చేంజ్ ద్వారా రూ. 3,000 ప్రత్యేక తగ్గింపుతో సహా రూ. 30వేల వరకు తగ్గింపును అందిస్తోంది. దీంతోపాటు, కస్టమర్లు యాక్సిస్ బ్యాంక్ అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ , డెబిట్ కార్డ్ ద్వారా చేసేకొనుగోళ్లపై రూ.7,000 తగ్గింపును కూడా పొందవచ్చు. మొత్తం మీద గూగుల్ పిక్సెల్ 7 ధర రూ.20,999కి దిగి వచ్చింది. గూగుల్ పిక్సెల్ 7 ఫీచర్లు 6.3-అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే 1080x2400పిక్సెల్ రిజల్యూషన్ 90Hz రిఫ్రెష్ రేట్ 8జీబీ ర్యామ్, 128 జీబీ ర్యామ్స్టోరేజ్ 50 +12 ఎంపి డ్యుయల్ రియర్ 10.8ఎంపీ సెల్ఫీ కెమెరా 4355 mAh బ్యాటరీ మరోవైపు మే 10 న జరగనున్న గూగుల్వార్షిక I/O ఈవెంట్లో పిక్సెల్ 7 సిరీస్‌లో భాగంగా 7ఏను లాంచ్ చేయనుందని తెలుస్తోంది -
Google Pixel 7a: విడుదలకు ముందే లీకైన వివరాలు
ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్ వాడకానికి అలవాటుపడ్డ జనం కోసం గూగుల్ మిడ్ రేంజ్లో 'పిక్సెల్ 7ఏ' విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. కంపెనీ ఈ ఏడాది మేలో జరిగే గూగుల్ ఐ/ఓ 2023 (Google I/O 2023) ఈవెంట్లో కంపెనీ దీనిని లాంచ్ చేయనుంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న గూగుల్ పిక్సెల్ 6ఏ కంటే కూడా 7ఏ చాలా అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ప్రాసెసర్ నుంచి కెమెరాల వరకు చాలా విభాగాల్లో పిక్సెల్ 7ఏ అప్‌గ్రేడ్ పొందినట్లు సమాచారం. ఈ మొబైల్ ఫోన్ 6.1 ఫుల్ హెచ్డీ+ 90హెర్ట్జ్ OLED డిస్ప్లే పొందుతుంది. అంతే కాకుండా గూగుల్ టెన్సార్ జీ2 ప్రాసెసర్ కూడా ఇందులో ఉంటుంది. త్వరలో విడుదలకానున్న గూగుల్ పిక్సెల్ 7ఏ వెనుక 64 మెగాపిక్సెల్ సోనీ IMX787 ప్రైమరీ, 12 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉంటాయని సమాచారం. అయితే కంపెనీ ఈ మొబైల్ ఫ్రంట్ కెమెరా గురించి ఎటువంటి సమాచారం వెల్లడించలేదు. ఇది వైర్లెస్ చార్జింగ్కు సపోర్ట్ చేసే అవకాశం ఉంది. అయితే ఛార్జింగ్ కెపాసిటీ గురించి తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: దెబ్బకు 17 కార్లు డిస్కంటిన్యూ: జాబితాలో ఉన్న కార్లు ఏవంటే?) గూగుల్ పిక్సెల్ 7ఏ మొబైల్ ధరల గురించి కూడా కంపెనీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే గత సంవత్సరం విడుదలైన 6ఏ ధర రూ. 30,000 కంటే తక్కువ. కావున కొత్త ఏ7 దీని కంటే కొంత ఎక్కువ ధర వద్ద విడుదలయ్యే అవకాశం ఉంది. -
ఫ్లిప్‌కార్ట్ సేల్, గూగుల్పిక్సెల్ ఫోన్‌పై భారీ తగ్గింపు
సాక్షి,ముంబై: ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఈ నెలాఖరులో ప్రారంభం కానుంది. అయితే ముందుగానే నథింగ్ ఫోన్ (1), గూగుల్ పిక్సెల్ 6ఏ వంటి కొన్ని పాపులర్ స్మార్ట్ఫోన్లపై ఆకర్షణీయమైన డీల్స్ ప్రకటించింది. డిస్కౌంట్ఆఫర్తో వాస్తవ ధరకంటే చాలా తక్కువకే వీటిని ఆఫర్ చేస్తోంది. ఈ స్మార్ట్ఫోన్లు సుమారు రూ. 30వేల కంటే తక్కువకే అందించనుంది. ముఖ్యంగా గూగుల్ పిక్సెల్ 6ఏ కొనుగోలుపై గరిష్టంగా 20వేల రూపాయల వరకు ధర తగ్గనుంది. బ్యాంక్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో కలిపి ఈ తగ్గింపు ఉండనుంది. మరోవైపు అమెజాన్ తన మెగా సేల్ ఈవెంట్‌ను సెప్టెంబర్ 23న కూడా నిర్వహించనుంది. గూగుల్ పిక్సెల్ 6ఏ డీల్: రూ. 43,999కి లాంచ్ అయిన గూగుల్ పిక్సెల్ 6ఎ, రానున్న సేల్‌లో రూ.27,699లకే లభిస్తుందని ఫ్లిప్‌కార్ట్ లిస్టింగ్ చెబుతోంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఐసీఐసీఐ, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డ్ లావాదేవీలపై ఫ్లిప్‌కార్ట్ 10 శాతం తగ్గింపును అందిస్తుంది. అంతేకాకుండా ఎక్స్ఛేంజ్ ఆఫర్‌గా రూ. 20వేల వరకు ఆఫర్ చేస్తోంది. ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్, ఫోన్ మోడల్, పరిస్థితిపై ఆధారపడి ఉంటుందనేది గమనించాలి. గూగుల్ పిక్సెల్ 6ఏ స్పెసిఫికేషన్స్ 6.1అంగుళాల OLED డిస్ప్లే టైటాన్ M2 సెక్యూరిటీ కోప్రాసెసర్ ఆక్టా-కోర్ Google Tensor SoC కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్ 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ 12.2+ 12 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా 8మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 4,410mAh బ్యాటరీ -
Google Pixel 6 Series: అదిరిపోయే ఫీచర్లతో గూగుల్ పిక్సెల్ 6 సిరీస్ లాంఛ్
All about The New Google Pixel 6 and Pixel 6 Pro Smart Phones: చాలాకాలంగా ప్రచారంలో వినిపిస్తున్న పిక్సెల్ 6 సిరీస్‌ను ఎట్టకేలకు గూగుల్ అధికారికంగా లాంఛ్ చేసింది. మంగళవారం రాత్రి జరిగిన గూగుల్ ఈవెంట్లో.. పిక్సెల్ సిరీస్‌లో భాగంగా పిక్సెల్ 6, పిక్సెల్ 6 ప్రో మోడల్స్ ఫీచర్స్‌ను రివీల్ చేసింది. పిక్సెల్ సిరీస్‌లో గూగుల్ ఈ ఫోన్లను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకు కారణాలు.. సొంత టెన్సార్ చిప్సెట్లతో పాటు ఆండ్రాయిడ్12 వెర్షన్‌తో తీసుకురావడం. గూగుల్ పిక్సెల్ 6 ► 6.4 ఇంచుల ఎఫ్‌హెచ్‌డీ+అమోలెడ్ స్క్రీన్, 90 హెచ్‌జెడ్ డైనమిక్ రిఫ్రెష్ రేట్ ► పంచ్‌హోల్ కట్అవుట్, గొరిల్లా గ్లాస్ విక్టస్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ► టెన్సార్ చిప్సెట్తో 8జీబీ ర్యామ్ 128 జీబీ/256 జీబీ వేరియెంట్లలో లభ్యం.. యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ► 4,614ఎంఏహెచ్ బ్యాటరీ, 30డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ ► 50ఎంపీ మెయిన్ కెమెరా, వైడర్ షాట్స్ కోసం 12ఎంపీ ultrawide lens ► 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ► మ్యాజిక్ ఎరేస్ లాంటి సాఫ్ట్వేర్ ఫీచర్ కూడా గూగుల్ పిక్సెల్ 6 ప్రో ► 6.7 ఇంచుల క్యూహెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 120 హెచ్‌జెడ్ డైనమిక్ రిఫ్రెష్ రేట్ ► కట్అవుట్, గొరిల్లా గ్లాస్ విక్టస్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ► టెన్సార్ చిప్సెట్తో 12జీబీ ర్యామ్ 128 జీబీ/256 జీబీ/512జీబీ.. యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ► 5,003 ఎంఏహెచ్ బ్యాటరీ, 30డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ ► 50ఎంపీ మెయిన్ కెమెరా, వైడర్ షాట్స్ కోసం 12ఎంపీ ultrawide lens, 48ఎంపీ టెలిఫొటో లెన్స్ అదనం. ► 11.1 ఎంపీ సెల్ఫీ కెమెరా ► మ్యాజిక్ ఎరేస్ లాంటి సాఫ్ట్వేర్ ఫీచర్ కూడా We're launching Pixel 6 and Pixel 6 Pro today! They’re unlike any phone we've built before, with a new industrial design, Android 12 with Material You user interface, and running on our custom Google Tensor chip. Can't wait to see how people use them:)https://t.co/QPvVrCtxvB pic.twitter.com/2eFJsGmSOc — Sundar Pichai (@sundarpichai) October 19, 2021 చిప్‌మేకర్ క్వాల్కమ్ కంపెనీని కాదని.. సొంత టెన్సార్ చిప్‌తో గూగుల్ ఈ ఫోన్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ రెండింటి టెన్సార్షిప్ కూడా టైటాన్ ఎం2 చిప్ ద్వారా భద్రత కల్పించనుంది. స్టీరియో స్పీకర్, మూడు మైక్రోఫోన్స్, డ్యుయల్ సిమ్ సపోర్ట్, వైఫై 6ఈ సపోర్ట్, బ్లూటూత్ 5.2, సబ్ 6సీహెచ్ 5జీ.. సపోర్ట్‌తో ఈ ఫోన్లు వచ్చాయి. ధరలు ఎంతంటే.. పిక్సెల్ 6 ప్రారంభ ధర 599 డాలర్లు(దాదాపు మన కరెన్సీలో రూ.44, 971), పిక్సెల్ ప్రొ ధర 899 డాలర్లు(దాదాపు 67,494 రూపాయలు). అయితే ఈ సిరీస్ ఫోన్లు భారత్‌లో ఎప్పుడు లాంఛ్ అవుతాయనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఫోన్లతో పాటు పిక్సెల్ పాస్ ప్రోగ్రామ్‌ను సైతం అనౌన్స్ చేసింది. దీని ప్రకారం.. నెల నెల కొంత చెల్లించి ప్రీమియం గూగుల్ వన్ స్టోర్ 200 జీబీ, యూట్యూబ్ ప్రీమియం, యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం, గూగుల్ ప్లే పాస్ పొందొచ్చు. యూఎస్‌లో ఈ ప్లాన్ల ధరను పిక్సెల్ మోడల్స్‌కు 45 డాలర్లుగా, పిక్సెల్ ప్రోకు 55 డాలర్లుగా నిర్ణయించారు. చదవండి: భూమ్మీద అత్యంత సురక్షితమైన ఫోన్ ఇదే..! -
గూగుల్.. చిప్ చిచ్చు రాజుకుందా?
అమెరికా టెక్ దిగ్గజం గూగుల్(ఆల్ఫబెట్ కంపెనీ), చిప్‌మేకర్ క్వాల్కమ్ మధ్య విభేధాలు మొదలయ్యాయి. చిప్ తయారీ విషయంలో గూగుల్ తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణం. ఈ మేరకు గూగుల్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ క్వాల్కమ్ ఒక ట్వీట్ చేయడం విశేషం. అమెరికన్ చిప్‌మేకర్ కంపెనీ క్వాల్కమ్.. సొంతంగా చిప్‌లు తయారు చేసుకోవాలన్న గూగుల్ నిర్ణయంపై అసంతృప్తితో రగిలిపోతోంది. రాబోయే పిక్సెల్ 6 స్మార్ట్‌ఫోన్స్‌ను గూగుల్ తాము సొంతంగా రూపొందించిన చిప్ సిస్టమ్‌తో మార్కెట్లోకి తీసుకురాబోతోంది. ఈ నిర్ణయంపై క్వాల్కమ్ ట్వీట్ రూపంలో అసంతృప్తి వ్యక్తం చేసింది. "We've decided to make our own smartphone SoC instead of using Snapdragon" 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩 — Snapdragon (@Snapdragon) October 13, 2021 స్నాప్‌డ్రాగన్‌కు బదులు ఇకపై సొంత స్మార్ట్‌ఫోన్ ఎస్‌వోసీని తయారు చేబోతున్నాం అంటూ ఎర్ర జెండాల ఎమోజీతో ఒక ట్వీట్ చేసింది క్వాల్కమ్. ఇప్పటిదాకా పిక్సెల్ ఫోన్లకు చిప్సెట్లను సప్లై చేస్తూ వస్తోంది క్వాల్కమ్. కానీ, తాజా నిర్ణయంతో క్వాల్కమ్కు నష్టం వాటిల్లనుంది. గూగుల్ టెన్సర్ చిప్‌ను నమ్మకూడదంటూ ఆండ్రాయిడ్ యూజర్లను క్వాల్కమ్ హెచ్చరించడం విశేషం. అయితే పొరపచ్చాలు..ఈ రెండు కంపెనీల భవిష్యత్తు వ్యాపారంపై పడే నష్టం ఉండదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు పిక్సెల్ ఫోన్లను మినహాయిస్తే.. మిగతా డివైజ్‌లన్నీ క్వాల్కమ్ ప్రాసెసర్‌లతోనే మార్కెట్లోకి వస్తున్నాయి. కానీ, రాబోయే రోజుల్లో ఇది శత్రుత్వంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇక గూగుల్ డెవలప్ చేస్తున్న సొంత చిప్ అండ్ ప్రాసెసింగ్ వ్యవస్థ 2023 నాటికల్లా మార్కెట్లోకి రానుంది. ప్రపంచంలో 90 శాతం మొబైల్ డివైజ్ వ్యవస్థలో ఉపయోగించే.. బ్లూప్రింట్ ఆఫ్ ఆర్మ్స్ ఆధారంగా గూగుల్ సీపీయూ, మొబైల్ ప్రాసెసర్ ను గూగుల్ తీసుకురాబోతోంది. చదవండి: జీవిత భాగస్వాములపై నిఘా..! గూగుల్ కీలక నిర్ణయం! -
భూమ్మీద అత్యంత సురక్షితమైన ఫోన్ ఇదే..!
స్మార్ట్‌ఫోన్స్‌లో అత్యంత సురక్షితమైనా ఫోన్ ఏది అంటే ఠక్కున చెప్పే పేరు..ఆపిల్ ఐఫోన్ లేదా గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్స్ అని చెప్పేస్తాము. ఐఫోన్లకు, గూగుల్ పిక్సెల్ ఫోన్లకు ఆదరణ మామూలుగా ఉండదు.సెక్యూరిటీ విషయంలో ఇతర మొబైల్ ఫోన్లతో పోలిస్తే ఈ రెండు ఫోన్లకు సాటి లేదు. ఐఫోన్‌ను చాలా మంది వినియోగించడానికి ప్రధాన కారణం భద్రత. ఆపిల్ తన వినియోగదారుల ప్రైవసీ,భద్రత విషయంలో అసలు రాజీ పడదు. కొద్దిరోజుల క్రితం పెగాసస్ సాఫ్ట్‌వేర్‌తో ఐఫోన్లను కూడా హ్యాకింగ్ చేస్తూన్నారనే వార్తలు కూడా వచ్చాయి. అప్పట్లో తమ వినియోగదారులకోసం ఆపిల్ ఐవోఎస్‌ను మార్చుకోండి అని సూచించింది. చదవండి: Apple : సెప్టెంబర్ 14నే ఐఫోన్-13 రిలీజ్..! కారణం అదేనా..! భూమ్మీద అత్యంత సురక్షితమైన ఫోన్ ఇదే..! ఒకానొక సందర్భంలో ఐఫోన్లు కూడా హ్యాకింగ్ గురైతుందనే వార్తలు కొంత విస్మయాన్ని గురిచేశాయి. అసలు ప్రైవసీ విషయంలో అత్యంత సురక్షితమైన స్మార్ట్‌ఫోన్స్ లేవనుకుంటే మీరు పొరపడినట్లే..! జర్మనీకి చెందిన నైట్రోకీ కంపెనీ తయారుచేసిన నైట్రోఫోన్ 1 భూమ్మీద అత్యంత సురక్షితమైన ఫోన్‌గా నిలిచినట్లు 9టూ5 గూగుల్ నివేదించింది. ప్రైవసీపై ఎక్కు వ దృష్టిసారించి నైట్రోఫోన్ 1 ను తయారుచేశారు. ఈ ఫోన్ తయారుచేయడం కోసం గూగుల్ పిక్సెల్ 4ఏలోని హర్డ్‌వేర్ పార్ట్‌ను తీసివేసి ఇతర హర్డ్వేర్తో రిప్లేస్ చేశారు. ఈ ఫోన్లో ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌కు బదులు గ్రాఫ్రేనియన్ఓఎస్తో నడుస్తోంది. నైట్రోకీ కంపెనీ హర్డ్‌వేర్ సెక్యూరిటీకీలను, ల్యాప్‌టాప్‌లను, పర్సనల్ కంప్యూటర్లను జర్మనీలో విక్రయిస్తుంది. నైట్రోఫోన్ 1 స్పెషాలిటీలు నైట్రోఫోన్ 1లో గూగుల్‌కు సంబంధించిన యాప్స్ రావు, ఈ ఫోన్లో గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఫోటోస్ వంటి యాప్స్‌కు యాక్సెస్ ఉండదు. ఆన్లైన్లో సురక్షితమైన బ్రౌజింగ్ కోసం అత్యంత శక్తివంతమైన వెర్షన్ క్రోమియం బ్రౌజర్‌తో నడుస్తోంది. ఆండ్రాయిడ్ కెర్నల్, వెబ్‌వ్యూ, కంపైలర్ టూల్‌చైన్, ఫైల్ సిస్టమ్ యాక్సెస్ వంటివి అత్యంత బలమైన వెర్షన్ సహయంతో ఈ ఫోన్ పనిచేస్తుంది. ప్రైవసీని మెరుగుపరచడానికి ఇంటర్ఫేస్ మెరుగుదల కోసం ఆటోమేటెడ్ షట్డౌన్లు వస్తూంటాయి. మీ IMEI నంబర్, MAC చిరునామాను ఇతరుల డిటెక్ట్ చేయకుండా మాస్క్ చేస్తోంది. నైట్రోఫోన్ 1 ధర 630 యూరోలు(సుమారు రూ. 54,629). చదవండి: Tinder User Creates A Contract: బాయ్‌ఫ్రెండ్‌గా కొనసాగాలంటే..బాండ్ మీద సంతకం చేయాల్సిందే..! -
పిక్సెల్ 6లో అండర్ డిస్ప్లే సెల్ఫీ కెమెరా
న్యూఢిల్లీ: గూగుల్ నుండి త్వరలో రాబోయే ఫ్లాగ్షిప్ ఫోన్ పిక్సెల్ 6లో కొత్త ఫీచర్స్ తీసుకురానున్నట్లు సమాచారం. ఈ మధ్య గూగుల్ తన పిక్సెల్ 6 మొబైల్లో అండర్ డిస్ప్లే సెల్ఫీ కెమెరాను తీసుకురావడం కోసం పేటెంట్ కు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఈ పేటెంట్లో ప్రైమరీ కెమెరా వివరాలతో సహా ఫోన్ గురించి ఇతర వివరాలను కూడా బయటికి వచ్చాయి. పేటెంట్ పిక్సెల్ 6 ప్రైమరీ కెమెరా మాడ్యూల్ యొక్క డిజైన్ చూపిస్తుంది. ఈ డిజైన్ ప్రకారం కెమెరా మాడ్యూల్లో రెండు సెన్సార్లు, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి అని తెలుస్తుంది. గత కొన్ని వారాలుగా, 2021లో అండర్ డిస్ప్లే సెల్ఫీ కెమెరాలతో కొత్త మొబైల్స్ తీసుకురావడానికి అనేక ఫోన్ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడు, గూగుల్ కూడా వాటిలో ఒకటి కావచ్చు. ఇందులో క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 865 ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ తో పని చేయనున్నట్లు సమాచారం. ఇది 8 జీబీ ర్యామ్ + 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో రానుంది. (చదవండి: యాపిల్ బాటలో షియోమీ) -
ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే మొబైల్ బెస్ట్ డీల్స్
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్ తర్వాత మరో కొత్త సేల్ తో ముందుకు వచ్చింది. ఫ్లిప్‌కార్ట్ సంస్థ యొక్క బ్లాక్ ఫ్రైడే సేల్ నేటి నుండి నవంబర్ 30 వరకు ఉంటుంది. కాబట్టి మీరు గత సేల్ లో ఆఫర్లు, డిస్కౌంట్లను కోల్పోయినట్లయితే, ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ మళ్ళి మొబైల్స్ పై బెస్ట్ డీల్స్ ను పొందటానికి మరొక అవకాశాన్ని కల్పించింది. ఈ-కామర్స్ దిగ్గజం ఎస్బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో ఇఎంఐ లావాదేవీలపై ఐదు శాతం క్యాష్‌బ్యాక్ కూడా ఇస్తోంది. ఫ్లిప్‌కార్ట్ యొక్క బ్లాక్ ఫ్రైడే అమ్మకం సందర్భంగా అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ డీల్స్ అందిస్తున్నాం. (చదవండి: మైక్రోమ్యాక్స్ బడ్జెట్ మొబైల్ ఫస్ట్ సేల్) ఫ్లిప్ కార్ట్ ఆఫర్లు ఇవే.. ► ఐఫోన్ ఎక్స్ఆర్ ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే అమ్మకం సమయంలో రూ. 38,999కు లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ ఎక్స్ఆర్ను అసలు ధర కన్నా రూ.10,000 తగ్గింపుతో విక్రయిస్తోంది. దీని యొక్క అసలు ధర రూ .47,900. మీ దగ్గర కనుక పాత ఐఫోన్ ఉన్నట్లయితే ఎక్స్చేంజ్ ఆఫర్లో భాగంగా రూ.14,100 వరకు తగ్గింపును పొందవచ్చు. ► ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే అమ్మకాలలో భాగంగా మోటో జి9 రూ.9,999కు లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొన్ని నెలల క్రితం భారతదేశంలో లాంచ్ చేశారు. ఇది స్నాప్‌డ్రాగన్ 662 చిప్సెట్ మరియు 48 ఎంపి ట్రిపుల్ కెమెరాతో పనిచేస్తుంది. ► ఫ్లిప్‌కార్ట్ కొన్ని రియల్మీ ఫోన్లపై భారీ తగ్గింపును అందిస్తోంది. రియల్మీ నార్జో 20 ప్రో ఫ్లిప్‌కార్ట్‌లో రూ.13,999కే లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హిలియో జి95 ప్రాసెసర్ తో నడుస్తుంది. ఇది 90హెర్ట్జ్ రిఫ్రెష్ రేటుతో 6.5-అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ప్లేని కలిగి ఉంది. దీని వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్, 4500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ► శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 20 + ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ సందర్భంగా రూ. 49,999కు లభిస్తుంది. ఈ ఫ్లాగ్షిప్ మొబైల్ ఎక్సినోస్ 990 ప్రాసెసర్‌తో పాటు 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. దీని వెనుక భాగంలో 64ఎంపీ ప్రైమరీ కెమెరా మరియు డ్యూయల్ 12 మెగాపిక్సెల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. సెల్ఫీల కోసం 10 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ► గూగుల్ పిక్సెల్ 4ఎ ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే అమ్మకంలో భాగంగా రూ.31,999కు లభిస్తుంది. ఇది 1080x2340 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 5.81-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. పిక్సెల్ 4ఎలో క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 730జీ ప్రాసెసర్, 6 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్‌తో వస్తుంది. ► శామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 ప్లస్ 12జీబీ ర్యామ్ + 256జీబీ మోడల్ ను ప్రస్తుతం రూ.54.999కి అందిస్తుంది. ఈ ఫ్లాగ్షిప్ మొబైల్ అసలు ధర రూ. 79,999కు లభిస్తుంది కాబట్టి ఇది ఒక బెస్ట్ డీల్. ఈ మోడల్ రూ.14,300 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో లభిస్తుంది. ► ఐఫోన్ SE 2020 మీరు ఐఫోన్ కొనాలనుకుంటే, ఇది ఉత్తమ సమయం. ఐఫోన్ SE 2020ను రూ. 32,999కు కొనుగోలు చేయవచ్చు. దీని 64 జీబీ స్టోరేజ్ మోడల్ అసలు ధర. 42,500 రూపాయల నుండి తగ్గింది. ఈ ఐఫోన్‌పై మీకు 9,501 రూపాయల తగ్గింపు లభిస్తుంది. ఈ మోడల్ రూ.14,300 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద లభిస్తుంది. -
యాపిల్ ? గూగుల్? ఏది బెటర్ - ఆనంద్ మహీంద్రా
అమెరికా: మహీంద్ర అండ్ మహీంద్ర ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర మరోసారి సోషల్ మీడియాలో నెటిజనులకు పని చెప్పారు. ప్రముఖ మొబైళ్ల ద్వారా ఒకే ప్లేస్‌లో తీసిన రెండు ఫోటోలను ట్విటర్లో పోస్ట్ చేశారు. వీటిల్లో ఏది బెటరో చెప్పమంటూ ట్వీట్ చేశారు. దీంతో యాపిల్, గూగుల్ పిక్సెల్ స్మార్ట్ఫోన్ల ప్రేమికుల మధ్య చిన్నపాటి వార్ మొదలైంది. కొత్తగా మార్కెట్లోకి విడుదలైన గూగుల్ పిక్స్ల్, ఐఫోన్10 కెమెరా చిత్రాలను వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా రివ్యూ చేసి శనివారం ట్విటర్లో పోస్ట్ చేశారు. మాన్‌హట్టన్ వేదికగా రెండు రకాల కెమెరాలను ఒకే ప్లేస్‌లో, ఒకే కోణంలో, ఒకే సమయంలో చిత్రీకరించానని ఆనంద్ మహీంద్రా తెలిపారు. తాను తీసిన ఫోటోల నాణ్యతపై న్యాయనిర్ణేతలుగా మీరే వ్యవహరించాలని ఆయన కోరారు. దీంతో దుమారం రేగింది. అటు పాజిటివ్, ఇటు నెగిటివ్ కామెంట్లతో ట్విటరేటియన్లు ఆయనపై విరుచుకుపడ్డారు. అటు ఆపిల్ ఆభిమానులు కూడా ఆనంద్ ట్వీట్‌పై మండిపడ్డారు. అలాగే ఆనంద్ మహీంద్ర యాపిల్ 11 ప్రొ కు ఇంకా అప్డేట్ అవలేదా మరో యూజర్ కమెంట్ చేశారు. గూగుల్ పిక్సల్ చిత్రాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అయితే అంతిమంగా సబ్జెక్ట్, ఫోకస్నే నమ్ముతానంటూ త్యాగి అనే నెటిజన్ రిప్లై ఇచ్చాడు. మరోవైపు యాపిల్‌ను సరియైన లెన్స్‌లతో చిత్రీకరించలేదంటూ మరో నెటిజన్ జెర్క్ తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. Manhattan moonscape. Have to admit, my pixel takes much sharper pics than my iPhone X. And I'm told the Samsung is even better? pic.twitter.com/WMPhGGlNRl — anand mahindra (@anandmahindra) September 14, 2019 Definitely 1st for clarity but second one has depth. check lights at end of road in both pic.first one gets blurred a little. At the end i believe it's all abt subject and focus — Langda Iago Tyagi (@BakreKiAankh) September 18, 2019 The second picture has been clicked with a dirty lens. Not a fair comparison. — The Sarcastic Jerk (@The_Sarcastic_J) September 18, 2019 -
మరోసారి నవ్వుల పాలైన అనుష్క
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఇటీవల సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతూ ఉన్నారు. తన అప్‌కమింగ్ సినిమా ‘సూయి ధాగా-మేడిన్ ఇండియా’ ట్రైలర్లో ఆమె ఎక్స్ప్రెషన్స్ నెటిజన్లకు విపరీతంగా నవ్వు తెప్పించాయి. తాజాగా మరోసారి అనుష్క నెటిజన్ల బారిన పడ్డారు. ఐఫోన్‌ను వాడుతూ.. గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌ను ట్విటర్లో ప్రమోట్ చేశారు. ప్రపంచంలో టెక్ బ్లాగర్స్‌లో ఒకరైన, యూట్యూబ్ సెన్సేషన్ మార్క్స్ బ్రౌన్లీ ఈ విషయాన్ని గుర్తించారు. ఇంకేముంది ఆ విషయాన్ని ట్విటర్ ద్వారా షేర్ చేశారు. దీంతో అనుష్క మరోసారి ట్విటర్లో బుక్ అయిపోయారు. సూయి ధాగా నటి అనుష్క శర్మ, గూగుల్ పిక్సెల్ 2 ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్‌ను ప్రమోట్ చేయడానికి, ఐఫోన్‌ను వాడుతూ ట్వీట్ చేశారని తెలిపారు. ఆమె ట్వీట్‌ను కూడా స్క్రీన్‌షాట్ తీసి షేర్ చేశారు. పొరపాటు జరిగినట్టు గుర్తించిన అనుష్క, ఆ ట్వీట్‌ను డిలీట్ చేసి, మరోసారి షేర్ చేశారు. కానీ ఆ లోపే మార్క్స్ అనుష్క పొరపాటును గుర్తించేశారు. అనుష్క చేసిన ఈ పొరపాటుపై ఈ యూట్యూబ్ స్టార్ మరోసారి మరో ట్వీట్ చేశారు. ‘డిలీట్ చేశావ్, మళ్లీ రీట్వీట్ చేశావు. కానీ కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేయండి. ఐఫోన్ నుంచి వచ్చిన మరిన్ని పిక్సెల్ యాడ్స్ కనిపిస్తాయి’ అని పేర్కొన్నారు. అనుష్క చేసిన ఈ పనికి ట్విటర్ యూజర్లు పలువురు ఛలోక్తులు పేలుతున్నారు. కొంతమంది ట్విటర్ యూజర్లు మాత్రం మార్క్స్‌ను హెచ్చరిస్తున్నారు. మీరు బ్లాక్ అవుతారేమో చూసుకోండంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఒకవేళ ఫోటోను పిక్సెల్ ఫోన్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకుని, ఐఫోన్ నుంచి పోస్టు చేశారేమో అంటూ కొంతమంది అనుష్కను వెనకేసుకొస్తున్నారు. Ok I don’t even want to know how this keeps happening but it’s hilarious pic.twitter.com/sUuHVh4exw — Marques Brownlee (@MKBHD) September 4, 2018 She might have corrected it. How to check that btw? pic.twitter.com/43fxxhoYxX — Jack Rogers (@JackRogers279) September 4, 2018 Maybe the photo transfered from a Pixel phone and posted from an iPhone 🤔🙄 — Assem (@assemdido) September 4, 2018 Using an iPhone to tweet but using #TeamPixel hashtags what sorcery is this 😂 https://t.co/BuSS5c6rNP — Muhammad Mushiyyad (@Mushi_Sidd) September 4, 2018 -
ఫ్లిప్ కార్ట్ లో ఐఫోన్ ధరెంత తగ్గిందో తెలుసా?
ఫ్లిప్ కార్ట్ 'బిగ్ 10 సేల్' రెండో రోజు భాగంగా తన ప్లాట్ ఫామ్ పై అత్యంత ముఖ్యమైన ఉత్పత్తులు స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్ పై బంపర్ ఆఫర్ ప్రకటించింది. మొబైల్, టాబ్లెట్స్ కేటగిరీలో భారీ డిస్కౌంట్లను అందించనున్నట్టు తెలిపింది. దీనిలో భాగంగా ఆపిల్ గతేడాది లాంచ్ చేసిన ఐఫోన్ 7 ప్లస్(32జీబీ) స్మార్ట్ ఫోన్ ధరను 72,000 రూపాయల నుంచి 54,999 రూపాయలకు తగ్గించింది. ఒకవేళ 128జీబీ వెర్షన్ ఐఫోన్ 7 ప్లస్ ను కొనాలనుకుంటే, దాని ధరను కూడా 19 శాతం తగ్గించింది. ఈ తగ్గింపుతో ఈ ఫోన్ ధర 82,000రూపాయల నుంచి 65,999రూపాయలకు దిగొచ్చింది. మరో స్మార్ట్ ఫోన్ ఐఫోన్ 7పై కూడా 27 శాతం డిస్కౌంట్ ను ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తోంది. మొబైల్ కేటగిరీలోనే గూగుల్ పిక్సెల్ ఎక్స్ఎల్ స్మార్ట్ ఫోన్ ధర కూడా 13వేల రూపాయల తగ్గి, రూ.53,999కు అందుబాటులోకి వచ్చింది. గూగుల్ కు చెందిన మరో మోడల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్ పై 19-22 శాతం డిస్కౌంట్లను ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. రెడ్ మి నోట్ ఫ్లాష్ సేల్ నేటి మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఇక టెలివిజన్ కేటగిరీలో ప్యానసోనిక్ 109సీఎం ఫుల్ హెచ్డీపై అతిపెద్ద డీల్ ను ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. దీని ధర 49,900 రూపాయల నుంచి 27,999 రూపాయలకు తగ్గించింది. అదేవిధంగా ఎల్జీ 108 సీఎం ఫుడ్ హెచ్డీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ ధర కూడా 14,901 రూపాయలు తగ్గించింది. బడ్జెట్ రేంజ్ స్మార్ ఫోన్లపై కూడా 7,999 రూపాయల వరకు ఫ్లిప్ కార్ట్ తగ్గింపును ప్రకటించింది. వివిధ స్మార్ట్ ఫోన్ బ్రాండ్లపై కూడా ఈ ఈటైలర్ బ్లాక్ బస్టర్ ఎక్స్చేంజ్ ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. -
ఎలాకొన్నా ఆ ఫోన్లపై 13వేల క్యాష్ బ్యాక్
కస్టమర్లను ఆకట్టుకోవడానికి గత రెండేళ్లుగా కంపెనీలు ఇస్తున్న భారీ ఎక్స్చేంజ్ ఆఫర్లు, క్యాష్ బ్యాంకు ఆఫర్ల ట్రెండ్ మనం చూస్తూనే ఉన్నాం. కానీ ముందస్తు వాటికి కంటే కాస్త విభిన్నంగా గూగుల్ తన ఫోన్లపై క్యాష్ బ్యాక్ ఆఫర్ ను ప్రకటించినట్టు తెలిసింది. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, లేదా నగదుతో ఎలా కొనుగోలు చేసిన తమ గూగుల్ తన పిక్సెల్, పిక్సెల్ ఎక్స్ఎల్ ఫోన్లపై 13వేల రూపాయల క్యాష్ బ్యాక్ ను అందిస్తున్నట్టు రిపోర్టులు వెలువడుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఆఫ్ లైన్ రిటైలర్స్ వద్ద కూడా ఈ ఫోన్లు 13వేల రూపాయల క్యాష్ బ్యాక్ తో అందుబాటులో ఉన్నాయని రిపోర్టులు తెలిపాయి. కొనుగోలు చేసిన తక్షణమే ఈ క్యాష్ బ్యాక్ ను కంపెనీ ఆఫర్ చేయనుందట. డెబిట్ కార్డుల ద్వారా చేపడుతున్న ఈఎంఐ కొనుగోళ్లకు కూడా ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ వర్తించనుందని తెలుస్తోంది. క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ద్వారా ఈ స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయాలనుకుంటే, ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్లపై 13వేల రూపాయల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఆఫర్ మే 31 వరకు అందుబాటులో ఉండనున్నట్టు తెలుస్తోంది. రిపోర్టుల ప్రకారం క్యాష్ బ్యాక్ వర్తించే బ్యాంకు వివరాలు.. హెచ్డీఎఫ్సీ, సిటీ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ, అమెరికన్ ఎక్స్ ప్రెస్, హెచ్ఎస్బీసీ, స్టాండర్డ్ ఛార్టెడ్ బ్యాంకు, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఇండస్ ఇండ్ బ్యాంకు, కొటక్ మహింద్రా బ్యాంకు, ఆర్బీఎల్, యస్ బ్యాంకు, యూబీఐలు. గూగుల్ పిక్సెల్ 32జీబీ, 128 స్టోరేజ్ ఆప్షన్స్ కలిగిన వేరియంట్ ధరలు 57వేల రూపాయలు, 66వేల రూపాయలుగా ఉన్నాయి. గూగుల్ పిక్సెల్ ఎక్స్ఎల్ 32జీబీ వేరియంట్ ధర 67వేల రూపాయలు కాగ, 128జీబీ వేరియంట్ ధర 76వేల రూపాయలు. ప్రస్తుతం కంపెనీ ఆఫర్ చేస్తున్న 13వేల రూపాయల క్యాష్ బ్యాక్ తో గూగుల్ పిక్సెల్ 32జీబీ వేరియంట్ ధర 44వేల రూపాయలకు దిగొచ్చింది. 128జీబీ వేరియంట్ ధర 53వేల రూపాయలుగా ఉంది. అదేవిధంగా గూగుల్ పిక్సెల్ ఎక్స్ఎల్ 32జీబీ స్టోరేజ్ వెర్షన్ ప్రస్తుతం 54వేల రూపాయలకే అందుబాటులో ఉంది. 128జీబీ వేరియంట్ ను 63వేల రూపాయలకు కొనుగోలు చేసుకోవచ్చు. -
గూగుల్ పిక్సెల్ ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్
ముంబై: ఆన్లైన్ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ గూగుల్ తాజా ఫ్లాగ్షిప్ మొబైల్స్ గూగుల్ పిక్సెల్ , గూగుల్ పిక్సెల్ స్మార్ట్ఫోన్లపై భారీ రాయితీలను ఆఫర్ చేస్తోంది. కొత్త పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌పై మొత్తం రూ.29వేల దాకా డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. రూ.57 వేలు ఉన్న 32 జీబీ వేరియంట్ పై రూ.9 వేల క్యాష్ బ్యాక్ ప్రకటించింది. అలాగే పాత స్మార్ట్ ఫోన్ మార్పిడి ద్వారా రూ.20వేల దాకా డిస్కౌంట్ అందుబాటులోకి తెచ్చింది. ఇలా మొత్తం భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. అయితే సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు, ఎక్స్ఛేంజి ఆఫర్ ద్వారా కొనుగోలు చేసేవారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. రూ.66 వేల 128జీబీ గూగుల్ పిక్సెల్ ఫోన్‌ను రూ. 37,000 లకే విక్రయిస్తోంది. పిక్సెల్ స్మార్ట్‌ఫోన్ ను యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్‌ద్వారా కొనుగోలు చేస్తే 5 శాతం రాయితీ. అయితే గరిష్ట డిస్కౌంట్ రూ.200 గా ఉంది. రిలయన్స్ డిజిటల్, క్రోమాలాంటి రీటైలర్స్ లో కూడా సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఆఫర్ అందుబాటులోఉంది. క్రెడిట్ కార్డు ద్వారా నేరుగా డబ్బులు చెల్లించే వారికి రూ.9 వేల క్యాష్ బ్యాక్ ఇస్తున్నట్టు పేర్కొన్న ఫ్లిప్‌కార్ట్ ఆ మొత్తం జూన్ 5, 2017తరువాత మాత్రమే వినియోగదారుడి ఖాతాలో జమ అవుతుందని తెలిపింది. ఎక్స్ఛేంజి ద్వారా కొనుగులు చేసే వారికి ఫోన్‌ను బట్టి రూ.20,000 వరకు తగ్గింపు ఇస్తున్నట్టు పేర్కొంది. 5.5 ఇంచెస్, 2560x1440 రిజల్యూషన్, 5 అంగుళాల(1920x1080రిజల్యూషన్) డబుల్ స్క్రీన్ వేరియంట్, 32జీబీ, 128జీబీ స్టోరేజ్ కెపాసిటీతో బ్లాక్ అండ సిల్వర్ రంగుల్లో ఈ ఫోన్లు గతేడాది అక్టోబరులోనే భారత మార్కెట్లోకి వచ్చాయి. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4, క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 821 ప్రాసెసర్, 12.3-మెగాపిక్సెల్ వెనుక కెమెరా , 2,770 ఎమ్ఏహెచ్ , 3,450 ఎమ్ఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం తదితర ఫీచర్స్ వీటిల్లో ఉన్నాయి. మరిన్ని వివరాలకోసం ఫ్లిప్‌కార్ట్ అధికారిక వెబ్సైట్ ను పరిశీలించగలరు. -
ఆ స్మార్ట్ఫోన్లపై స్నాప్‌డీల్ బ్రిలియంట్ ఆఫర్
ముంబై: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ స్నాప్ డీల్ సోమవారం భారీ ఆఫర్ ప్రకటించింది. గూగుల్ తొలి స్మార్ట్ ఫోన్లపై భారీ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తోంది. ఇ-కామర్స్ సైట్ యాత్ర , ఎస్ బ్యాంక్ ఈ-క్యాష్ ద్వారా రూ. 10,000 తక్షణ క్యాష్ బ్యాక్, అలియాంజ్ నుంచి రెండు స్మార్ట్ ఫోన్లకు మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్స్ ను రూ. 5999ఉచితంగా అందిస్తున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు గూగుల్ పిక్సెల్ తో ఆన్ లైన్ రిటైల్ భాగస్వామ్యాన్ని ప్రకటించింది. గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్ రావడం ఆనందంగా ఉందని స్నాప్‌డీల్ వైస్ ప్రెసిడెంట్ విశాల్ చడ్డా చెప్పారు. ఇప్పటికే నాణ్యతలో కొత్త ప్రమాణాలను సృష్టించిన ఈ స్మార్ట్ ఫోన్లు తమ తాజా ఆఫర్ ద్వారా హాట్ సెల్లర్ గా నిలవనున్నాయనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో గూగుల్ పిక్సెల్ 128జీబీ రూ.66 వేలకు, 32 జీబీ రూ.57వేలకు అందుబాటులో ఉన్నాయి. గూగుల్ పిక్సెల్ ఎక్స్ఎల్ ( బ్లాక్ అండ్ సిల్వర్, 32 జీబీ) రూ.67 వేలకు లభిస్తోంది. ఫ్లిప్ కార్ట్ లో ఎక్సేంజ్ ఆఫర్ లో రూ 23 వేలు తగ్గింపును ఆఫర్ చేస్తోంది. అలాగే ఐసీఐసీఐ బ్యాంకు కార్డులతో ఈఎంఐ లపై రూ 8000 వరకు క్యాష్ బ్యాక్ ఉంది. యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డుపై అదనంగా 5 శాతం తగ్గింపు . కాగా గూగుల్ పిక్సెల్ , ఎక్స్ఎల్ అధికారికంగా అక్టోబర్ 4న లాంచ్ అయ్యాయి. 64 గంటల బ్యాటరీ లైఫ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 1080x 1920 పిక్సెల్ రిజల్యూషన్ తదితర ఫీచర్లతో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాయి. గూగుల్ అసిస్టెంట్, వర్చువల్ రియాలిటీ సామర్థ్యం, 32-128 జీబీ మెమొరీ, 12.3-8 మెగాపిక్సెల్ కెమేరాలు, 5.5 అంగుళాల తెర, 4జీబీ ర్యామ్, 3,450 ఏంఏహెచ్ బ్యాటరీ , ఆండ్రాయిడ్ 7.1 నాట్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో 'పిక్సెల్' స్మార్ట్ ఫోన్లను ఆవిష్కారంతో గూగుల్ స్మార్ట్ ఫోన్ల రంగంలో పోటీకి తొలి అడుగువేసిన సంగతి తెలిసిందే. -
ఈ ఏడాది బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏదో తెలుసా?
2016 త్వరలోనే బైబై చెప్పి వెళ్లిపోబోతున్నది. కొత్త సంవత్సరం రాబోతున్నది. మరి, 2016లో వచ్చిన బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది? ఏ ఫోన్ ఎక్కువగా యూజర్ల మనస్సును గెలుచుకుంది? స్పెషికేషన్స్ పరంగా ఏ స్మార్ట్‌ఫోన్ ఈ ఏడాది విజేతగా నిలిచిందంటే.. ఈ నిజానికి ఈ ఏడాది డిజైన్పరంగా స్మార్ట్ఫోన్లలో గొప్ప మార్పులేమీ రాలేదు. కానీ అన్ని స్థాయిల ధరలలోనూ బెస్ట్ ఫీచర్స్ ఉన్న ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. రూ. 25వేలకుపైగా ధరతో భారీ ఫీచర్లతో ఫ్లాగ్షిప్ బ్రాండ్‌గా వెలువడిన స్మార్ట్ఫోన్ల వరకు చూసుకుంటే.. ఈ ఏడాది బెస్ట్ స్మార్ట్ఫోన్ల గురించి నిపుణుల చెప్తున్న అభిప్రాయమిది. ఈ ఏడాది బెస్ట్ స్మార్ట్‌ఫోన్ విన్నర్: ఐఫోన్ 7 ప్లస్ 2016లో వచ్చిన స్మార్ట్ఫోన్లలో పర్ఫామెన్స్ పరంగా చూసుకుంటే.. ఈ ఏడాది విజేత ఐఫోన్ 7 ప్లస్సే. డిజైన్పరంగా పెద్దగా మార్పులు చేయకపోయినా.. అంతర్జాతీయస్థాయి పరీక్షలను ఎదుర్కొని ఉత్తమ స్థాయి పర్ఫార్మెన్స్ అందించడంలో ఈ ఫోన్ టాప్ స్థానంలో నిలిచింది. ఫ్లాగ్షిప్ స్థాయిలో రానున్న రెండేళ్లు నిలకడగా సేవలు అందించే ఫోన్ మీకు కావాలంటే.. మీరు దీనిని ఎంచుకోవచ్చు. ఈసారి నీళ్లు, దుమ్ము పడకుండా రెసిస్టెంట్ డిజైన్‌తో రావడం మరో అడ్వాంటేజి. అంతేకాకుండా మొట్టమొదటిసారిగా ఐఫోన్-7 ప్లస్ ఈసారి డుయల్ ఫ్రంట్ కెమెరాతో రావడం మరో విశేషం. వైడ్ యాంగిల్, టెలిఫొటో లెన్స్ కాంబినేషన్లో వచ్చిన 'బోకే స్టైల్' ఎఫెక్ట్.. ఐఫోన్ 7 ప్లస్ యూజర్లకు అంతర్జాతీయస్థాయి ఫొటోగ్రఫీ అనుభవాన్ని అందిస్తోంది. 2X ఆప్టికల్ జూమ్, 10x డిజిటల్ జూమ్ ఉండటం ఈ ఫోన్లోని కెమెరాలో మరో స్పెషాలిటీ. రన్నరప్: సాంసంగ్ గెలాక్సీ ఎస్ 7 ఎడ్జ్ టెక్నాలజీ దిగ్గజం సాంసంగ్ ఈ ఏడాది గెలాక్సీ ఎస్7 ఎడ్జ్‌తో మళ్లీ లాభాలబాట పట్టింది. గ్లాస్, మెటల్ డిజైన్‌తో, కర్వ్డ్ అంచులతో ఈ ప్రీమియర్ ఫ్లాగ్షిప్ ఫోన్ తన ప్రత్యేకతను నిలబెట్టుకుంది. పర్ఫార్మెన్స్ విషయంలోనూ గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ బాగుంది. అయితే, ఐఫోన్ 7 ప్లస్‌ను మాత్రం ఢీకొనలేకపోయింది. సుదీర్ఘమైన బ్యాటరీ లైఫ్ ఉండటం ఈ ఫోన్‌కు ఉన్న మరో ప్రత్యేకత. ఏకంగా 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్లో ఉంది. ఈ ఏడాది గెలాక్సీ నోట్ 7 బ్యాటరీ పేలుళ్ల వివాదం సాంసంగ్ను తీవ్రంగా ఒడిదుడుకుల్లో నెట్టినా.. గెలాక్సీ ఎస్ 7 ఎడ్జ్ ఆ సంక్షోభం నుంచి కొంతమేర నిలబెట్టగలిగింది. గూగుల్ పిక్సెల్ కన్నా చాలా స్టేబుల్‌గా ఉండటం వల్ల దీనికి రన్నరప్ స్థానం ఇవ్వవచ్చునని నిపుణులు అంటున్నారు. బెస్ట్ అండ్రాయిడ్ ఫోన్: గూగుల్ పిక్సెల్ ఈ ఏడాది గూగుల్ స్మార్ట్‌ఫోన్ రంగంలో అడుగుపెట్టింది. గత అక్టోబర్ నెలలో ప్రీమియం ధరలతో పిక్సెల్, పిక్సెల్ ఎక్స్ఎల్ సిరీస్ ఫోన్లను విడుదల చేయడం ద్వారా ఈ రంగంలో సాంసంగ్, యాపిల్ టాప్ బ్రాండ్ ఫోన్లకు సవాలు విసిరింది. బెస్ట్ గూగుల్ ఫీచర్లు పొందాలంటే ఈ ఫోన్లు తీసుకోవాల్సిందే. అంతేకాకుండా ప్రత్యేకంగా ఈ ఫోన్ల కోసమే గూగూల్ అసిస్టెంట్ ఫిచర్‌ను కంపెనీ తీసుకురావడం గమనార్హం. అత్యాధునిక్ సాఫ్ట్‌వేర్‌తో కూడిన సుపీరియర్ కెమెరాతోపాటు ఐఫోన్ సహా అన్ని ఫోన్ల నుంచి నేరుగా మొత్తం డాటాను బదిలీచేసుకునే వీలు కల్పిస్తూ ఈ పిక్సెల్, పిక్సెల్ ఎక్స్ఎల్ మార్కెట్లోకి వచ్చాయి. ఐఫోన్ ఎస్ సిరీస్‌కు, సాంసంగ్ ఎస్ 7 ఎడ్జ్‌కు సరితూగేరీతిలో ఈ ఫోన్లలో కెమెరా డిపార్ట్మెంట్ ఉండటం మరో హైలెట్. ఔట్‌డోర్‌లో అయినా, లో లైటింగ్ సెట్టింగ్‌లో అద్భుతమైన షాట్స్ తీసుకునే సదుపాయాన్ని ఈ ఫోన్ కల్పిస్తోంది. డిజైన్పరంగా పెద్దగా ప్రత్యేకత లేకపోయినా ఈ ఏడాది ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో దీనికి పెద్దపీట వేయవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రన్నరప్: వన్ ప్లస్ 3 ఫ్లాగ్షిప్ బ్రాండ్లకు దీటుగా టాప్ పర్ఫార్మెన్స్తో అందుబాటు ధరలతో మార్కెట్లోకి వచ్చిన ఫోన్ వన్ ప్లస్ 3. ధరపరంగా (ఫ్లాగ్షిప్ బ్రాండ్ల ధరలో సగం ధరకే లభిస్తోంది), ఓవరాల్ పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే.. వన్ ప్లస్ 3యే విన్నర్ అని చెప్పవచ్చు. ఈ ఫోన్లో కెమెరా, ఓవరాల్ పర్ఫార్మెన్స్, బ్యాటరీ లైఫ్ ప్రత్యేకతలుగా చెప్పవచ్చు. ఐఫోన్, గెలాక్సీ ఎస్ 7 ఎడ్జ్ స్థాయి ఫీచర్లతో తక్కువ ధరకు ఫోన్ కావాలంటే తప్పక దీనివైపు మొగ్గుచూపవచ్చు. అయితే, వన్ ప్లస్ 3, 3టీ రెండు సిమిలర్‌గా కనిపిస్తున్నా.. ఒకటి కాదు. ఇటీవల భారత్‌లో విడుదలైన వన్ ప్లస్ 3నే చాలావరకు ఉత్తమంగా ఉంది. ప్రత్యేక ప్రస్తావన మోటో జడ్! మాడ్యులర్ డిజైన్‌తో, ఎక్స్ట్రా స్లిమ్ ఫ్యాక్టర్‌తో వచ్చిన మోటో జడ్ ఫోన్‌ను ఈ ఏడాది ప్రత్యేకంగా ప్రస్తావించవచ్చు. ఎక్స్ ట్రా బ్యాటరీ, హజెల్బ్లాడ్ జూమ్ లెన్స్, ప్రోజెక్టర్, జేబీఎల్ స్పీకర్ వంటి పలు సృజనాత్మకమైన ఫీచర్లతో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. భారత్‌లో లభిస్తున్న ఫ్లాగ్షిప్ బ్రాండ్ ఫోన్లను బట్టి చూస్తే దీని ధర కొంచెం తక్కువేనని చెప్పవచ్చు. నుబియా జెడ్11 30వేల ధరలో లభించే ఫ్లాగ్షిప్ బ్రాండ్ ఫోన్లలో వన్ ప్లస్ 3 తర్వాత అంతే చెప్పుకోదగిని ఫోన్ ఇదే. ఈ నెలలోనే విడుదలైన ఈ ఫోన్ పర్ఫార్మెన్స్ పరంగా ఆకట్టుకుంటోంది. చక్కని డిజైన్, మంచి కెమెరా వంటి ఫీచర్లతో మధ్యతరహా ధరలతో లభిస్తున్న న్యూబియా జెడ్11 దేశంలో బ్రాండ్ గా నిలదొక్కుకునేందుకు కష్టపడుతోంది.