ఎలాకొన్నా ఆ ఫోన్లపై 13వేల క్యాష్ బ్యాక్
ఎలాకొన్నా ఆ ఫోన్లపై 13వేల క్యాష్ బ్యాక్
Published Thu, May 4 2017 4:41 PM | Last Updated on Tue, Sep 5 2017 10:24 AM
కస్టమర్లను ఆకట్టుకోవడానికి గత రెండేళ్లుగా కంపెనీలు ఇస్తున్న భారీ ఎక్స్చేంజ్ ఆఫర్లు, క్యాష్ బ్యాంకు ఆఫర్ల ట్రెండ్ మనం చూస్తూనే ఉన్నాం. కానీ ముందస్తు వాటికి కంటే కాస్త విభిన్నంగా గూగుల్ తన ఫోన్లపై క్యాష్ బ్యాక్ ఆఫర్ ను ప్రకటించినట్టు తెలిసింది. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, లేదా నగదుతో ఎలా కొనుగోలు చేసిన తమ గూగుల్ తన పిక్సెల్, పిక్సెల్ ఎక్స్ఎల్ ఫోన్లపై 13వేల రూపాయల క్యాష్ బ్యాక్ ను అందిస్తున్నట్టు రిపోర్టులు వెలువడుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఆఫ్ లైన్ రిటైలర్స్ వద్ద కూడా ఈ ఫోన్లు 13వేల రూపాయల క్యాష్ బ్యాక్ తో అందుబాటులో ఉన్నాయని రిపోర్టులు తెలిపాయి. కొనుగోలు చేసిన తక్షణమే ఈ క్యాష్ బ్యాక్ ను కంపెనీ ఆఫర్ చేయనుందట.
డెబిట్ కార్డుల ద్వారా చేపడుతున్న ఈఎంఐ కొనుగోళ్లకు కూడా ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ వర్తించనుందని తెలుస్తోంది. క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ద్వారా ఈ స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయాలనుకుంటే, ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్లపై 13వేల రూపాయల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఆఫర్ మే 31 వరకు అందుబాటులో ఉండనున్నట్టు తెలుస్తోంది. రిపోర్టుల ప్రకారం క్యాష్ బ్యాక్ వర్తించే బ్యాంకు వివరాలు.. హెచ్డీఎఫ్సీ, సిటీ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ, అమెరికన్ ఎక్స్ ప్రెస్, హెచ్ఎస్బీసీ, స్టాండర్డ్ ఛార్టెడ్ బ్యాంకు, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఇండస్ ఇండ్ బ్యాంకు, కొటక్ మహింద్రా బ్యాంకు, ఆర్బీఎల్, యస్ బ్యాంకు, యూబీఐలు.
గూగుల్ పిక్సెల్ 32జీబీ, 128 స్టోరేజ్ ఆప్షన్స్ కలిగిన వేరియంట్ ధరలు 57వేల రూపాయలు, 66వేల రూపాయలుగా ఉన్నాయి. గూగుల్ పిక్సెల్ ఎక్స్ఎల్ 32జీబీ వేరియంట్ ధర 67వేల రూపాయలు కాగ, 128జీబీ వేరియంట్ ధర 76వేల రూపాయలు. ప్రస్తుతం కంపెనీ ఆఫర్ చేస్తున్న 13వేల రూపాయల క్యాష్ బ్యాక్ తో గూగుల్ పిక్సెల్ 32జీబీ వేరియంట్ ధర 44వేల రూపాయలకు దిగొచ్చింది. 128జీబీ వేరియంట్ ధర 53వేల రూపాయలుగా ఉంది. అదేవిధంగా గూగుల్ పిక్సెల్ ఎక్స్ఎల్ 32జీబీ స్టోరేజ్ వెర్షన్ ప్రస్తుతం 54వేల రూపాయలకే అందుబాటులో ఉంది. 128జీబీ వేరియంట్ ను 63వేల రూపాయలకు కొనుగోలు చేసుకోవచ్చు.
Advertisement