Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

TDP Mahanadu: Party Workers Laughs At NTR AI Video1
మహానాడులో ఎన్టీఆర్‌ ఏఐ వీడియోపై గుసగుసలు

సాక్షి, వైఎస్సార్ జిల్లా: 'సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు' అనే నినాదంతో తెలుగు దేశం పార్టీని స్థాపించి.. ప్రజాస్వామ్యానికి కొత్త అర్ధం చెప్పిన దార్శనికుడు ఎన్టీఆర్. అయితే ఆ తర్వాత పార్టీ చంద్రబాబు చేతుల్లోకి ఎలా వెళ్లింది.. ఎన్టీఆర్‌ ఎంతగా క్షోభ పడింది తెలుగు వాళ్లకు తెలిసిన విషయమే. తెలుగు దేశం పార్టీ మహానాడు వేళ.. అందునా ఆయన జయంతినాడు వైరల్‌ అవుతున్న ఓ వీడియోపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.టెక్నాలజీ అంటూ పదే పదే స్టేట్‌మెంట్లు ఇచ్చే చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌లు.. మహానాడులో ఏఐతో గొప్పల కోసం తిప్పలు పడడం నవ్వులు పూయిస్తోంది. ఎన్టీఆర్‌ స్వయంగా మహానాడుకు వచ్చి ఆ తండ్రీకొడుకులను పొగిడితే ఎలా ఉంటుందో అంటూ ఓ ఏఐ (NTR AI Video) వీడియోను మహానాడు వేదికపై ప్రదర్శించారు. చంద్రబాబు పీ4, అమరావతి ద్వారా రాష్ట్రాన్నే మార్చేస్తాడని.. యువగళంతో తన మనవడు లోకేశ్ కొత్త ఊపు తెచ్చాడంటూ ఏఐ ఎన్టీఆర్‌తో పొగడ్తలు గుప్పించుకున్నారు. ఆ టైంలో అక్కడే ఉన్న కార్యకర్తల్లో కొందరు.. ఆయన బతికి ఉంటే ఏం మాట్లాడే వారో? అంటూ నవ్వుకుంటూ గుసగుసలాడుకోవడం కనిపించింది. మరోవైపు.. ఏఐ వీడియో ద్వారా మాట్లాడిన సీనియర్ ఎన్టీఆర్మహానాడులో ఏఐ వీడియో ద్వారా సీనియర్ ఎన్టీఆర్ ప్రసంగం సృష్టించి, చంద్రబాబు, లోకేష్ లను పొగడ్తలతో ముంచెత్తిన టీడీపీ నాయకులు pic.twitter.com/if9KqwNHhM— Telugu Scribe (@TeluguScribe) May 28, 2025Video Credits: Telugu Scribeతనను చంద్రబాబు సీఎం గద్దెనుంచి దింపి.. టీడీపీని లాక్కున్న తర్వాత ఎన్టీఆర్‌ చంద్రబాబు నిజస్వరూపం గురించి పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఈ క్రమంలో తాజా ఏఐ వీడియోపై సోషల్‌ మీడియాలో కొన్ని కామెంట్లు కనిపిస్తున్నాయి. చంద్రబాబు తన ఆత్మను అమ్ముకున్నాడని, ఔరంగజేబు వారసుడని, తన కంటే పెద్ద నటుడంటూ నాడు ఎన్టీఆర్‌ చెప్పిన మాటలను కొందరు సోషల్‌ పోస్ట్‌ చేస్తున్నారు. ఇదేం ఆనందం చంద్రబాబు, లోకేష్‌? అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. Video Credits: vasanth_gollapalliఇదీ చదవండి: Mahanadu-కనీసం భోజనాల దాకా అయినా ఆగండయ్యా!

KSR Comments On BRS MLC Kalvakuntla Kavitha Letter2
కవిత లేఖ టీకప్పులో తుపానేనా?

ప్రతిపక్షంలో ఉండగా రాజకీయ పార్టీలకు సంక్షోభాలు సహజం. తెలంగాణలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)లోనూ ప్రస్తుతం ఒక సంక్షోభం నెలకొని ఉంది. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమార్తె కవిత లేఖ రాయడం సహజంగానే కలకలం సృష్టించింది. తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో.. ఏడాదిన్నర కాలంగా ప్రతిపక్షంలో ఉన్న బీఆర్‌ఎస్‌కు ఇది చికాకు కలిగించేదే. కేడర్‌ను గందరగోళంలో పడేసేదే.కవిత లేఖ ఒక ఎత్తు.. అమెరికా నుంచి తిరిగి వస్తూనే విమానాశ్రయంలోనే చేసిన వ్యాఖ్యలు ఇంకో ఎత్తు. ఒకపక్క కేసీఆర్‌ దేవుడంటూనే.. ఆయన చుట్టూ కొన్ని దెయ్యాలు ఉన్నాయని చెప్పి కవిత బీఆర్‌ఎస్‌ను ఇరుకున పెట్టారు. తన లేఖను బయటపెట్టిన కోవర్టులెవరన్న ప్రశ్న కూడా సంధించి దాంతో తనకు సంబంధం లేదని చెప్పారన్నమాట. పార్టీలో కేసీఆర్‌ తరువాత అత్యంత ప్రముఖులు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి, కేసీఆర్‌ మేనల్లుడు హరీశ్‌ రావు, మాజీ ఎంపీ సంతోష్‌ కుమార్‌లు మరి కొంతమంది మాత్రమే. కవిత తన లేఖను ఎవరి ద్వారా కేసీఆర్‌కు పంపారో తెలియదు కానీ.. పార్టీ ప్రముఖుల్లోనే ఎవరో ఒకరు దాన్ని బయటపెట్టారన్నది ఆమె భావన కావచ్చు.అయితే, ఈ లేఖ లీక్‌ కావాలని, ప్రజల్లోకి వెళ్లాలని కవిత కూడా కోరుకున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే అమెరికా నుంచి రాగానే విమానాశ్రయంలోనే లేఖ విషయాలను హడావుడిగా మాట్లాడాల్సిన అవసరం లేదు. తండ్రి, సోదరుడితో సంప్రదింపుల తరువాత కూడా వ్యాఖ్యానించి ఉండవచ్చు. అలా కాకుండా పార్టీకి నష్టం కలుగుతుందని తెలిసినా దేవుడు, దెయ్యం వంటి డైలాగులు వాడారంటే ఆమె ఆంతర్యంపై పలు రకాల విశ్లేషణలు వస్తాయి. ఈ విషయం కవితకూ తెలుసు. పైగా ఆమె మద్దతుదారులు, తెలంగాణ జాగృతి కార్యకర్తలు సీఎం, సీఎం అని నినాదాలు ఇవ్వడం, ప్లకార్డులు, బ్యానర్లలో కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌ల ఫోటోలు లేకపోవడం చూస్తే ప్రణాళిక ప్రకారమే కవిత విమానాశ్రయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు స్పష్టమవుతుంది.అసెంబ్లీ ఎన్నికల తరువాత ఇప్పుడిప్పుడే పార్టీ పుంజుకుంటున్న తరుణంలో ఈ దుమారం చెలరేగడం కేసీఆర్ కుటుంబంలో ఏదో జరుగుతోందన్న అనుమానాలు పార్టీ కేడర్‌లో రేకెత్తిస్తాయి. కవిత ఇకపై ఏం చేస్తుందన్న ఆందోళన కూడా ఏర్పడుతుంది. కేసీఆర్‌ స్పందన కోసం అంతా ఎదురు చూస్తుంటారు. ప్రస్తుతానికైతే కేసీఆర్‌ స్వయంగా స్పందించకపోగా.. ఇతరులు కూడా రియాక్ట్ కావద్దని సూచించారు. కేటీఆర్‌ ఆయనను కలిసిన తర్వాత కూడా కొత్త పరిణామాలేవీ లేకపోవడం ద్వారా పార్టీ వేచి ఉండే ధోరణిని పాటిస్తోందని అనుకోవాలి. అదే సమయంలో ఎల్లో మీడియా గతంలో వైఎస్ షర్మిలను రెచ్చగొట్టినట్లు తెలంగాణలో కవితను కూడా రెచ్చగొడుతున్నారన్న అనుమానం ఉంది. దానికి తగినట్లే ఆమె పార్టీ పెడతారని, సోషల్ మీడియాలో ఆమెకు అనుకూలంగా కామెంట్లు వస్తున్నాయని టీడీపీకి మద్దతిచ్చే ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. కవిత కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, ఆ పార్టీనే వెనుకాడుతోందని కూడా ఈ ఎల్లో మీడియా కథనాన్ని ఇచ్చింది. జాగృతి కార్యకర్తలు దీన్ని ఖండించవచ్చు కానీ జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది.షర్మిలను రాజకీయంగా వాడుకుని ఆ తర్వాత ఆమెను విఫల ప్రయోగం అని ఎల్లో మీడియా వారే తేల్చేశారు. కవిత పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఉంటుందా అన్న చర్చ ఉంది. కవిత లేఖ ఆధారంగా కాంగ్రెస్, బీజేపీలు రకరకాల వ్యాఖ్యలు చేసి బీఆర్ఎస్‌ను ఆత్మరక్షణలో పడేయడానికి ప్రయత్నించాయి. కుటుంబ పంచాయతీ అని, డ్రామా అని, ఆస్తుల తగాదా అని ఈ పార్టీలు ఆరోపిస్తున్నాయి. బీజేపీ ఎంపీ రఘునందన్‌ రావు వంటి వారు ఆమె సొంత పార్టీ పెడతారని అనే వరకు వెళ్తున్నారు. అంతదాకా వెళతారా అన్నది అప్పుడే చెప్పలేం కానీ పార్టీలో తన ప్రాముఖ్యత పెంచుకోవడానికి యత్నించవచ్చు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ నేత పొన్నం ప్రభాకర్‌ ఇదంతా బీజేపీ-బీఆర్‌ఎస్‌ డ్రామా అంటున్నారు. కేంద్ర మంత్రి బీజేపీకి చెందిన బండి సంజయ్‌ కవితను కాంగ్రెస్ వదలిన బాణంగా విమర్శిస్తున్నారు. ఇంకో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి కూడా ఇదంతా డాడీ, డాటర్ డ్రామా అని వ్యాఖ్యానించారు.కుమార్తె తన తండ్రికి లేఖ రాస్తే తప్పేమిటని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ శ్రవణ్‌ ప్రశ్నిస్తున్నా.. లేఖలోని విషయాలు, ఒక రాజకీయ పార్టీ అధినేతకు వేసిన ప్రశ్నలు కచ్చితంగా చర్చనీయాంశాలే. ఫీడ్ ‌బ్యాక్‌ పేరుతో కవిత పార్టీ రజతోత్సవం సందర్భంగా నిర్వహించిన సమావేశం తాలూకూ లోటుపాట్లను ఒక జర్నలిస్టులా, విశ్లేషకురాలిగా తన లేఖలో ఎత్తి చూపింది. ఒక వ్యాసంలా సాగిన ఈ లేఖలో కొన్ని పాజిటివ్‌ పాయింట్లు ఉన్నా.. నెగిటివ్ పాయింట్లే ఎక్కువ. కేసీఆర్‌ నాయకత్వ పటిమపై కవితకు సందేహం కలిగినట్టుగా ఈ లేఖలోని వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. అలాగే.. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ హోదాలో సోదరుడు కేటీఆర్‌.. పార్టీని నడుపుతున్న నేపథ్యంలో కవితలో ఏదో అసంతృప్తి కూడా ఏర్పడినట్లు స్పష్టమవుతోంది.వరంగల్‌ సభలో వేదికపై కేసీఆర్‌తో పాటు కేటీఆర్‌ ఫోటో మాత్రమే ఉండటం​ కూడా ఆమె అసంతృప్తికి కారణమై ఉండవచ్చు. ఏప్రిల్ 27న జరిగిన పార్టీ రజతోత్సవ సభ విజయవంతం అయిందని.. కేసీఆర్‌ ప్రసంగాన్ని శ్రద్దగా విన్నారని, కాంగ్రెస్ ఫెయిల్ అని సభికులతో చెప్పించడం, ముఖ్యమంత్రి రేవంత్ పేరును కేసీఆర్ తీయకపోవడం వంటివి కవితకు నచ్చాయట. అయితే, అదే సమయంలో తెలంగాణ తల్లి విగ్రహం మార్పు, తెలంగాణ గీతం గురించి మాట్లాడకపోవడాన్ని ఆమె ఆక్షేపించారు. కేసీఆర్ ప్రసంగంలో మరింత పంచ్‌ని ప్రజలు ఆశించారని ఆమె చెబుతున్నారు. అయినా ఈ సభతో కార్యకర్తలు, నాయకులు సంతృప్తిగానే ఉన్నారని అంటున్నారు. వారంతా సంతృప్తిగా ఉంటే పనికట్టుకుని కవిత ఈ లేఖ రాసి నెగిటివ్ పాయింట్లపై ఫోకస్ పెట్టవలసిన అవసరం ఏమిటో తెలియదు.నెగిటివ్ పాయింట్ల గురించి చెబుతూ, ఉర్దూలో మాట్లాడకపోవడం, ఎస్సీ వర్గీకరణ, వక్ఫ్ బిల్లు ప్రస్తావన లేకపోవడం, సభ నిర్వహణ ఎవరో పాత ఇంఛార్జీలకు అప్పగించడం నచ్చలేదని అంటున్నారు. సభలో ఇతర నేతలు మాట్లాడే అవకాశం లేకపోవడాన్ని ఆమె తప్పు పట్టారు. సాధారణంగా ఎక్కువ మంది నేతలు ఇలాంటి సభలలో మాట్లాడుతుండే వారు. కానీ, ఈసారి కేసీఆర్‌ మాత్రమే మాట్లాడారు. ఇది కొంత ఆశ్చర్యంగానే ఉంది. కార్యకర్తల ధూంధాం విఫలమైందని కవిత అభిప్రాయపడ్డారు. బీజేపీపై రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడతారా అని కేసీఆర్‌ను ఆమె నిలదీశారు. భవిష్యత్తులో పొత్తు ఉంటుందేమోనని ఊహాగానాలకు ఆస్కారం కలిగిందని ఆమె విశ్లేషించారు. బీజేపీతో తాను వ్యక్తిగతంగా ఇబ్బంది పడ్డ విషయాన్ని గుర్తు చేసుకున్నారు.అయితే, ఎన్నికల ముందు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత పేరు రావడం వల్ల బీఆర్‌ఎస్‌కు కూడా ఇబ్బంది అయిన విషయాన్ని కూడా మర్చిపోరాదు. కాంగ్రెస్ పై క్షేత్ర స్థాయిలో నమ్మకం పోయినా, బీజేపీ ప్రత్యామ్నాయం అవుతుందేమోనన్న ఆలోచన పార్టీ శ్రేణులలో ఉందని కవిత అనడం సంచలనమే. పార్లమెంటు ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా, మళ్లీ పార్టీని పట్టాలెక్కించేందుకు తంటాలు పడుతున్న తరుణంలో కవిత ఈ మాటలు అనడం నష్టమే. కేసీఆర్ ప్రత్యేక కార్యాచరణ, దిశానిర్దేశం చేయలేకపోయారని కూడా ఆమె తప్పుపట్టారు. ఒకటి, రెండు రోజులు ప్లీనరీ నిర్వహించి పార్టీ శ్రేణుల అభిప్రాయాలను తీసుకుని ఉండాల్సిందని ఆమె అన్నారు. బహిరంగ సమావేశాలలో అభిప్రాయాలు తీసుకునే పరిస్థితి ఉండదు. కవిత లేఖ సారాంశం.. పార్టీ ఆశించినంత బాగా నడవడం లేదు అన్నది అనిపిస్తుంది. కేటీఆర్‌తో సంబంధాలేమైనా దెబ్బతిన్నాయా అన్న అనుమానం కలుగుతుంది.కొద్ది రోజుల క్రితం హరీశ్‌రావు ఇంటికి వెళ్లి కేటీఆర్‌ రెండుగంటలు భేటీ అయి.. అంతా బాగుందన్న భావన కలిగించడానికి యత్నిస్తే, సోదరి రూపంలో ఈ కొత్త సమస్య వచ్చింది. అయితే, కవిత మరీ అధికంగా స్పందిస్తే ఆమెకే నష్టం. దేవుడి చుట్టూ దెయ్యాలు ఉన్నాయని అనడం ద్వారా తండ్రిని ఆమె గౌరవించినట్లా? లేక అవమానించినట్లా అన్న చర్చ జరుగుతోంది. పురాణాలలో దెయ్యాల మధ్యలో దేవుడు ఎక్కడైనా కనిపించారా?. తండ్రికి తన లేఖలో‘సారీ’ చెబుతూ ముగించినా, ఆమె ఎయిర్ పోర్టులో చేసిన ఘాటైన వ్యాఖ్యలతో ఆ ‘సారీ’కి అర్థం లేకుండా పోయింది. ‘అనుబంధం, ఆత్మీయత అంతా ఒక నాటకం.. ఆత్మ తృప్తికై ఆడుకునే వింత నాటకం’ అని ఒక కవి అంటాడు. ఇటువంటి రాజకీయాలు చూస్తే ఆ మాట నిజం అనిపిస్తుంది కదా!. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Kamal Haasan to Rajya Sabha DMK Confirmed Nominees3
Kamal Haasan: రాజ్యసభకు కమల్‌ హాసన్‌.. డీఎంకే అధికారిక ప్రకటన

సాక్షి, చెన్నై: ప్రముఖ నటుడు, మక్కల్‌ నీది మయ్యమ్‌ అధినేత కమల్‌ హాసన్‌(Kamal Haasan) రాజ్యసభకు వెళ్లడం దాదాపు ఖరారయినట్లే!. తమిళనాడు నుంచి ఆయనకు ఈ పదవి దక్కనుంది. కమల్‌ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ డీఎంకే బుధవారం అధికారిక ప్రకటన చేసింది.రాజ్యసభలో ఖాళీగా ఉన్న 8 స్థానాలకుగానూ వచ్చే నెల(జూన్‌) 19వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఆరు తమిళనాడు నుంచి, రెండు అసోం నుంచి ఉన్నాయి. తమిళనాడులో ప్రస్తుత బలాబలాలను పరిశీలిస్తే.. డీఎంకేకు 134 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ లెక్కన ఆరు సీట్లలో నాలుగింటిని డీఎంకే.. మరో రెండింటిని అన్నాడీఎంకే దక్కించుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.నలుగురు అభ్యర్థుల్ని డీఎంకే(DMK) ఇవాళ ప్రకటించగా.. అందులో కమల్‌ హాసన్‌(70) కూడా ఉన్నారు. మిగిలిన ముగ్గురు.. సిట్టింగ్‌ ఎంపీ విల్సన్‌, తమిళ రచయిత సల్మా, డీఎంకే నేత ఎస్‌ ఆర్‌ శివలింగం. దీంతో కమల్‌ రాజ్యసభకు వెళ్లడం లాంఛనమే కానుంది.2018, ఫిబ్రవరి 21వ తేదీన కమల్‌ హాసన్‌ ఎన్‌ఎంఎం(Makkal Needhi Maiam) పార్టీని మధురైలో స్థాపించారు. అప్పటి నుంచి ఏ ఎన్నికల్లోనూ ఆ పార్టీ ప్రభావం చూపెట్టలేకపోయింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పార్టీ పోటీ చేసినప్పటికీ. ఆశించిన ఫలితం సాధించలేకపోయింది. అయితే.. ఓటు షేర్‌ మాత్రం 3.72 శాతం దక్కించుకుంది. మరీ ముఖ్యంగా చెన్నై, కోయంబత్తూరు, మధురైలో భారీగా ఓట్లు పడ్డాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఆ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసినా.. ఒక్క సీటు గెలవలేకపోయింది. కోయంబత్తూరులో పోటీ చేసిన కమల్‌.. బీజేపీ అభ్యర్థి వనతిశ్రీనివాసన్‌ చేతిలో 1,728 ఓట్ల మెజారిటీలోఓటమి పాలయ్యారు. 2022 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసినా.. 140 స్థానాలకు ఒక్కటి కూడా గెలవలేకపోయింది. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇండియా కూటమి(INDIA Alliance)కి కమల్‌ పార్టీ ఎంఎన్‌ఎం మద్దతు ప్రకటించి ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో డీఎంకే ఎంఎన్‌ఎం మధ్య ఓ ఒప్పందం కుదిరినట్లు తమిళ మీడియా వర్గాలు కథనాలు ఇచ్చాయి. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడమా? లేదంటే రాజ్యసభకు వెళ్లడమా? అనే ఛాయిస్‌ కమల్‌కు డీఎంకే ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన రాజ్యసభకే మొగ్గు చూపినట్లు ఆ కథనాల సారాంశం.ఇదీ చదవండి: కమల్‌ వ్యాఖ్యలపై కన్నడనాట దుమారం

TDP Kadapa Mahanadu Day 2 Updates: Empty Chairs As Party Workers Left4
Mahanadu: మహానాడు.. మాకెందుకయ్యా?

సాక్షి, వైఎస్సార్ జిల్లా: తెలుగు దేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా భావించే మహానాడు(TDP Mahanadu) కార్యక్రమ ప్రాంగణం.. కార్యకర్తలు లేక వెలవెలబోతోంది. నిన్న మొదటి రోజు.. అందునా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తున్న టైంలోనే పసుపు దండు అక్కడి నుంచి వెళ్లిపోళ్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ఇవాళ.. బుధవారం రెండోరోజూ అంతకు మించి దృశ్యాలే కనిపించాయి. రెండో రోజు.. కడప మహానాడు ప్రాంగణం వైపు వెళ్లే రోడ్లు అన్నీ ఖాళీగా కనిపించాయి. ఉదయం 11గం.లకే ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. స్థానిక కార్యకర్తలు సైతం కనీసం అటువైపు తిరిగి చూడలేదు. ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కిందపడిపోయినా.. తిరిగి నిలబెట్టే ప్రయత్నాలు కనిపించడం లేదు. ప్రతినిధుల సభ సందర్భంగా నేతల ప్రసంగాలు ప్రారంభం కాకముందే వచ్చిన ఆ కొద్దిమంది కూడా వెనుదిరి వెళ్తూ కనిపించారు. ఆ సమయంలో భోజనాల దాకా అయినా ఉండాలని నేతలు నిలువరించే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది.కావాలనే కడపలో మహానాడును నిర్వహించడాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోవడమే ఈ అసంతృప్తికి కారణం. మరోవైపు.. టీడీపీ అనుకూల మీడియాలు పోటెత్తిన పసుపు దండు అంటూ లేని హడావిడిని చూపించే ప్రయత్నం చేస్తోంది. చివరిరోజైన రేపు(గురువారం) ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని భావించింది. కానీ, పరిస్థితి చూస్తుంటే ఆ ప్లాన్‌ ఘోరంగా అట్టర్‌ ప్లాప్‌ అయ్యేలా ఉందన్న ఆందోళన టీడీపీ నేతల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.ఇదీ చదవండి: మహానాడు కాదు కాస్త దగానాడుగా..

Rishabh Pant fined by BCCI after LSGs defeat to RCB5
రిషబ్ పం‍త్‌కు భారీ షాకిచ్చిన బీసీసీఐ

ఐపీఎల్‌-2025 సీజన్‌ను లక్నో సూపర్ జెయింట్స్ ఓటమితో ముగించింది. సోమవారం ఏకానా స్టేడియం వేదికగా రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఆర్సీబీ ప‌రాజ‌యం పాలైంది. అయితే ఓట‌మి బాధలో ఉన్న ల‌క్నో కెప్టెన్ రిష‌బ్ పంత్‌కు మ‌రో బిగ్‌ షాక్ త‌గిలింది.ఆర్సీబీతో జ‌రిగిన మ్యాచ్‌లో స్లో ఓవ‌ర్ రేటు మెయింటిన్ చేసినందుకుగానూ పంత్‌కు రూ. 30 లక్షల భారీ జరిమానా ఐపీఎల్ ఎడ్వైజ‌రీ క‌మిటీ విధించింది. అలాగే జ‌ట్టులో ఇంపాక్ట్ ప్లేయ‌ర్ స‌హా అంద‌రూ రూ. 12 ల‌క్ష‌లు లేదా మ్యాచ్ ఫీజులో 50శాతం జ‌రిమానాగా చెల్లించాల‌ని స‌ద‌రు క‌మిటీ ఆదేశించింది.ఈ ఏడాది సీజ‌న్‌లో ల‌క్నో జ‌ట్టు స్లో ఓవ‌ర్ రేట్‌ను న‌మోదు చేయ‌డం ఇది మూడో సారి. అందుకే అంత భారీ మొత్తంలో జ‌రిమానా విధించారు. "ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ సార‌థి రిష‌బ్ పంత్‌కు జరిమానా విధించాం. ఏకానా స్టేడియం వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజర్స్ బెంగ‌ళూరుతో జ‌రిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్‌ను కొనసాగించినందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్నాము. ఇది మూడో సారి అయినందున ఆర్టికల్ 2.22 ఐపీఎల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్ ప్రకారం పంత్‌ కు రూ. 30 లక్షలు ఫైన్ వేశాము ’ అని ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. కాగా ఈ మ్యాచ్‌లో రిషబ్‌ పంత్ అద్బుతమైన సెంచ‌రీతో చెల‌రేగాడు. సీజ‌న్ ఆరంభం నుంచి విఫ‌ల‌మైన పంత్‌.. త‌మ ఆఖ‌రి మ్యాచ్‌లో మాత్రం విధ్వంసం సృష్టించాడు. రిషబ్‌ 61 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 118 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు మిచెల్ మార్ష్ (37 బంతుల్లో 67, 4 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో మెరిశాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం 228 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని బెంగ‌ళూరు కేవ‌లం నాలుగు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 18.4 ఓవర్లలో చేధించింది.చదవండి: IND Vs ENG: బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం.. దిలీప్‌కు మ‌ళ్లీ పిలుపు

Bangladesh Sheikh Hasina final words Army Asked To resign6
‘నన్ను చంపి.. ఇక్కడే పాతిపెట్టండి’.. షేక్‌ హసీనా సంచలన వ్యాఖ్యలు!

ఢాకా: బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా సంచలన వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. గతేడాది బంగ్లాదేశ్‌లో విద్యార్థుల నిరసనలు తీవ్రం కావడంతో రాజీనామా చేసే ‘నన్ను కాల్చి చంపేయండి. ఈ గణబంధన్‌లోనే పాతి పెట్టండి’ అని ఆర్మీతో హసీనా అన్నట్లు తాజాగా వెల్లడైంది. దీంతో, ఆమె వ్యాఖ్యలపై కొత్త చర్చ మొదలైంది.వివరాల ప్రకారం.. గతేడాది బంగ్లాలో రాజకీయ అస్థిరత నెలకొన్న విషయం తెలిసిందే. ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన విద్యార్థుల ఉద్యమం హింసాత్మకంగా మారింది. వేలాది మంది నిరసనకారులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. విద్యార్థుల నిరసనతో అప్రమత్తమైన ఆర్మీ.. ప్రధాని పదవికి రాజీనామా చేయాలని షేక్‌ హసీనాకు సూచించింది. ఆ సమయంలో వారితో హసీనా..‘నన్ను కాల్చి చంపేయండి.. ఇక్కడే ఈ గణబంధన్‌లోనే పాతి పెట్టండి’ అని అన్నారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్‌లో జరిగిన విచారణ సందర్భంగా చీఫ్ ప్రాసిక్యూటర్ మొహమ్మద్ తాజుల్ ఇస్లాం వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం కొత్త చర్చకు దారి తీశాయి. బంగ్లాదేశ్‌లో రాజకీయం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.ఇదిలా ఉండగా.. బంగ్లాలో వేలాది మంది నిరసనకారులు ఆందోళన కారణంగా ప్రజా ఉద్యమానికి జడసి షేక్‌ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం వీడారు. ప్రస్తుతం ఆమె భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన ఆర్మీ దేశాన్ని తమ చేతుల్లోకి తీసుకుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్‌ అడ్వయిజర్‌గా నోబెల్‌ బహుమతి గ్రహీత మహమ్మద్‌ యూనస్‌ బాధ్యతలు చేపట్టారు. "Shoot me, bury me here, in Ganabhaban". These were the words of deposed Bangladeshi Prime Minister Sheikh Hasina on the fateful morning of August 5, 2024, as army officers asked her to resign amid violent student protests. Hasina eventually fled to India hours before protesters… pic.twitter.com/JzfwBtHUMp— India Today Global (@ITGGlobal) May 28, 2025

OP Sindoor: How India Destroy Pak Murid Air Base Satellite Pics Viral7
OP Sindoor: పాక్ ఎయిర్‌బేస్‌పై భారత్‌ గట్టి దెబ్బ

పహల్గాం దాడికి ప్రతీకారంగా.. ఉగ్ర శిబిరాల నాశనమే లక్ష్యంగా భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’కు సంబంధించి తాజాగా మరికొన్ని చిత్రాలు బయటకు వచ్చాయి. ఇందులో పాకిస్థాన్‌లోని మురిద్ వైమానిక స్థావరంపై జరిగిన దాడికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు ఉన్నాయి.తాజా శాటిలైట్‌ ఫొటోల ప్రకారం.. మురిద్ ఎయిర్‌బేస్‌(Murid Airbase) లోని ఒక కీలకమైన కమాండ్ అండ్ కంట్రోల్ భవనంపై భారత వైమానిక దళం కచ్చితమైన దాడి జరిపింది. అందులో ఆ భవనం దెబ్బతిన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ‘‘భవనం పైకప్పులోని ఒక భాగం కూలిపోయింది. తద్వారా బిల్డింగ్‌ లోపల కూడా నష్టం జరిగే అవకాశం లేకపోలేదు’’ జియో ఇంటెలిజెన్స్‌ పరిశోధకుడు డామియన్ సైమన్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. మే 23న తీసిన ఈ చిత్రాలను 'ది ఇంటెల్ ల్యాబ్'కు డామియన్ సైమన్ ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేశారు.This report spotlights damage at Pakistan’s Murid Airbase - the Indian Air Force strike has caused structural damage to a Command & Control building, a section of the roof has collapsed as well, likely causing internal damage @TheIntelLab #Skyfi pic.twitter.com/k7O4FO0tKS— Damien Symon (@detresfa_) May 26, 2025 ఏప్రిల్‌ 22వ తేదీ మధ్యాహ్నా సమయంలో.. జమ్ము కశ్మీర్‌ అనంత్‌నాగ్‌ జిల్లా పహల్గాం పట్టణంలోని బైసరన్‌ లోయలో సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను పొట్టనబెట్టుకున్నారు(Pahalgam Terror Attack). ఈ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా మే 7న ‘‘ఆపరేషన్ సిందూర్’’ను భారత్ ప్రారంభించింది. ఇందులో భాగంగా.. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాదుల స్థావరాలపై భారత దళాలు దాడులు చేసి నాశనం చేశాయి.మురిద్‌ కీలకమేఆపరేషన్ సిందూర్‌లో భాగంగా.. భారత సాయుధ దళాలు పాక్‌ పంజాబ్‌లోని రఫీకి, మురిద్, నూర్ ఖాన్, చునియన్‌తో పాటు సుక్కూర్‌లోని వైమానిక స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకున్నాయి. ఇందులో మురిద్ వైమానిక స్థావరం, భారత్‌తో సరిహద్దు ప్రాంతంలో పాక్‌కు ఎంతో కీలకమైనది. ఇక్కడ అనేక అత్యాధునిక ఫైటర్ జెట్‌లు, డ్రోన్‌లు మోహరించి ఉన్నాయి. ఈ స్థావరంలో పాకిస్థాన్‌కు చెందిన షాపర్ 1, షాపర్ 2, బుర్రాక్, ఫాల్కో, బేరక్‌తార్ టీబీ2ఎస్, బేరక్‌తార్ అకింజీ, సీహెచ్-4, వింగ్ లూంగ్ 2 వంటి అత్యాధునిక డ్రోన్‌లు ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఈ దాడి పాకిస్థాన్ సైనిక సామర్థ్యానికి గట్టి దెబ్బ అని విశ్లేషకులు భావిస్తున్నారు.A review of Nur Khan Airbase, Pakistan reveals the entire complex near India's strike location has now been demolished, suggesting the strike’s effect went beyond the two special-purpose trucks - possibly presenting a broader footprint of the damage @TheIntelLab #SkyFi pic.twitter.com/gUhqG3nemL— Damien Symon (@detresfa_) May 25, 2025ఇక.. ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంబడి భారత నగరాలపై పాకిస్థాన్ రెచ్చగొట్టే దాడులకు పాల్పడటంతో ఇరు దేశాల మధ్య నాలుగు రోజుల పాటు తీవ్ర స్థాయిలో కాల్పులు చోటుచేసుకున్నాయి. మే 12న కాల్పుల విరమణకు ఇరుపక్షాలు అంగీకరించినప్పటికీ, కొద్ది గంటల్లోనే పాకిస్థాన్ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఈ నేపథ్యంలో.. భారత్‌ దౌత్య యుద్ధం ప్రారంభించింది. పాక్‌ సీమాంతర ఉగ్రవాదంపై పోరును ప్రపంచదేశాలకు తెలియజేసేందుకు ప్రత్యేక బృందాలను విదేశాలకు పంపింది.మానవ రహిత వైమానిక వ్యవస్థను పరిశీలించిన ఆర్మీ చీఫ్‌భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది(Upendra Dwivedi) ఉత్తర ప్రదేశ్‌ ఝాన్సీ జిల్లాలోని బబీనా ఫీల్డ్ ఫైరింగ్‌ రేంజ్‌కు వెళ్లారు. అక్కడ దేశీయంగా రూపొందించిన మానవ రహిత వైమానిక వ్యవస్థను పరిశీలించారు. శత్రు దేశాలు ప్రయోగించే మానవ రహిత వైమానిక వ్యవస్థను అడ్డుకోవడానికి సరికొత్త డ్రోన్లు, ఆయుధాలను భారత్ రూపొందించింది.ఇదీ చదవండి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్‌ షాక్‌

Gold and Silver Price Today in India on 28th May 20258
ఆగిన ధరలు: బంగారం కొనడానికి ఇది మంచి తరుణం!

దేశంలో బంగారం దాగుడుమూతలాడుతున్నట్లు.. ఒకసారి తగ్గుతూ, మరోసారి తగ్గుతూ ఉన్నాయి. నేడు (మే 28) మాత్రం గోల్డ్ రేట్లలో ఎలాంటి మార్పు లేదు. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 89,350 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 97,480 వద్ద నిలిచాయి. నిన్న స్వల్పంగా తగ్గిన ధరలు.. ఈ రోజు స్థిరంగా ఉండిపోయాయి. కాబట్టి ధరల్లో ఎలాంటి మార్పు జరగలేదు, నిన్నటి ధరలే ఈ రోజు కూడా కొనసాగాయియు. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ నగరంలో పసిడి ధరలు వరుసగా రూ. 89,350 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 97480 (24 క్యారెట్స్ 10గ్రా) వద్ద ఉన్నాయి.ఇదీ చదవండి: 'ధనవంతులవ్వడం చాలా సులభం': రాబర్ట్ కియోసాకిదేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 89,500 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 97,600 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరల్లో ఎలాంటి మార్పులు లేదు. మొత్తం మీద దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు మాదిరిగానే వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ రోజు (బుధవారం) కేజీ సిల్వర్ రేటు రూ.1,11,000 వద్దకు చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకే విధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 10,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్‌టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

Vaibhavi Merchant Reacts Abhishek And Aishwarya Wedding9
ఆ పాట తర్వాత.. అభిషేక్-ఐశ్వర్య పెళ్లి చేసుకుంటారనుకోలేదు!

అతిలోక సుందరి ఐశ్వర్యా రాయ్.. హీరో అభిషేక్ బచ్చన్‌ని పెళ్లి చేసుకున్నప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఈ కాంబోని ఎవరూ అస్సలు ఊహించలేదు. స్టార్ కొరియోగ్రాఫర్ అయిన వైభవి మర్చంట్ కూడా తను ఇలానే అనుకున్నానని చెప్పింది. ఓ ఐటమ్ సాంగ్‌లో వీళ్లిద్దరూ నటించిన తర్వాత.. పెళ్లి జరగడంతో ఒక్కసారిగా షాకయ్యానని చెప్పుకొచ్చింది.అమితాబ్ బచ్చన్ వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన అభిషేక్.. హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు. మొన్నటివరకు సహాయ పాత్రల్లో కనిపించాడు. ప్రస్తుతం ఓటీటీ సినిమాల్లో హీరోగా మెరుసున్నాడు. గతంలో అభిషేక్, తండ్రి అమితాబ్‌తో కలిసి 'బంటీ ఔర్ బబ్లీ' అనే మూవీ చేశాడు. 'కజరారే..' అనే ఐటమ్ సాంగ్ వినే ఉంటారుగా. అది ఈ సినిమాలోనిదే. ఈ చిత్రానికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కొరియోగ్రాఫర్ వైభవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అభిషేక్-ఐశ్వర్య పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.(ఇదీ చదవండి: సందీప్ వంగాకు దీపిక ఇన్ డైరెక్ట్ కౌంటర్?)''కజరారే..' పాట చేస్తున్నప్పుడు.. తండ్రి అమితాబ్ కూడా సెట్‌లోనే ఉండటంతో అభిషేక్ చాలా భయపడుతుండేవాడు. ఐ‍శ్వర్య అయితే ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని సందేహపడుతూ ఉండేది. ఈ పాట జరిగిన కొన్నేళ్ల తర్వాత అభిషేక్-ఐశ్వర్య పెళ్లి చేసుకోవడంతో నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఐటమ్ సాంగ్ చేసిన తర్వాత వివాహం చేసుకుంటారని అస్సలు ఊహించలేదు. కానీ జరిగింది' అని వైభవి మర్చంట్ చెప్పుకొచ్చింది.ఈ పాటలో అమితాబ్-అభిషేక్-ఐశ్వర్య.. ముగ్గురూ డ్యాన్స్‌తో మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చారు. ఈ సాంగ్ ఓ రకంగా ఐశ్వర్యకు కమ్ బ్యాక్ అని అనుకోవచ్చు. ఈ తరహా పాటలతో పాటు సినిమాల్లో మళ్లీ ఈమెకు హీరోయిన్‌గా అప్పట్లో అవకాశాలు వచ్చాయి. ఏదేమైనా ఓ పాట.. ఇద్దరు స్టార్ హీరోహీరోయిన్ల పెళ్లికి కారణమైందనమాట!(ఇదీ చదవండి: ఆకట్టుకునేలా తేజ సజ్జా 'మిరాయ్' టీజర్)

Menstrual Hygiene Day : check how women trust social media for period advice10
Menstrual Hygiene Day : ‘నెలసరి’పై ఇన్ని అబద్ధాలా?!

న్యూఢిల్లీ: ఆధునిక కాలంలో సామాజిక మాధ్యమాల ప్రభావం విపరీతంగా పెరిగిపోతోంది. ఫేసుబుక్, ఇన్‌స్ట్రాగామ్, వా ట్సాప్‌ తదితర వేదికలపై లెక్కలేనంత సమాచారం అందుబాటులో ఉంది. ఆరోగ్యానికి సంబంధించి చాలామంది నిపు ణులు సోషల్‌ మీడియాలో సలహాలు, సూచనలు ఇస్తున్నారు. డాక్టర్లు సైతం తమ అనుభవాలు పంచుకుంటున్నారు. ఈ సమాచారం ప్రజలకు ఉపయోగపడుతోంది. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ మరోవైపు సోషల్‌ మీడియాలో తప్పుడు సమాచారమే అధికంగా వ్యాప్తిలో ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇన్‌ఫ్లుయెన్సర్ల ముసుగులో కొందరు మిడిమిడి జ్ఞానంతో ఇస్తున్న సమాచారం ప్రాణాంతకంగా మారుతోంది. భారత్‌లో నెలసరికి (పిరియడ్స్‌) సంబంధించిన వివరాలు, సలహాల కోసం మహిళలు సోషల్‌ మీడియాపై అధికంగా ఆధారపడుతున్నట్లు తాజా సర్వేలో తేలింది. తప్పుడు సమాచారం మహిళల నెలసరి ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నట్లు వెల్లడయ్యింది. అందుకే మహిళలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏదైనా సరే ఒకటికి రెండు సార్లు నిర్ధారించుకోవాలని చెబుతున్నారు. బుధవారం ‘మెన్‌స్ట్రువల్‌ హైజీన్‌ డే’(Menstrual Hygiene Day). ఈ నేపథ్యంలో మహిళల నెలసరి ఆరోగ్యంపై ఇటీవల ‘ఎవర్‌టీన్‌ మెన్‌స్ట్రువల్‌ హైజీన్‌ సర్వే’నిర్వహించారు. సర్వేలో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, పంజాబ్, ఒడిశా, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, జమ్మూకశ్మీర్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో 1,152 మంది మహిళలను ప్రశ్నించారు. వీరిలో 72.4 శాతం మంది 19 నుంచి 35 ఏళ్లలోపువారే ఉన్నారు. 76.6 శాతం మంది గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు. ఈ సర్వేలో ఏం తేలిందంటే. నెలసరికి సంబంధించిన సోషల్‌ మీడియాలో తగినంత సమాచారం అందుబాటులో ఉన్నట్లు 71.6 శాతం మహిళలు నమ్ముతున్నారు. ఇండియాలో ప్రతి ముగ్గురిలో ఇద్దరు మహిళలు సోషల్‌ మీడియాపై ఆధారపడుతున్నారు. పిరియడ్స్‌ గురించి ఇన్‌ఫ్లుయెన్సర్లు, బ్లాగర్లు ఇచ్చే సమాచారాన్ని విశ్వసిస్తున్నారు. నెలసరి శుభ్రతపై వారు చక్కటి అవగాహన కల్పిస్తున్నట్లు భావిస్తున్నారు. మెన్‌స్ట్రువల్‌ అత్యవసర పరిస్థితుల్లో సమాచారం కోసం 11.5 శాతం మంది సోషల్‌ మీడియాపై ఆధారపడుతున్నారు. తప్పుదోవ పట్టించే లేదా ప్రమాకరమైన సమాచారం సైతం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. దీనవల్ల తాము శారీరకంగా, మానసికంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నట్లు మహిళలు చెప్పారు. పిరియడ్స్‌ ఆలస్యం కావడం అనేది పాలిసిస్టిక్‌ ఒవేరియన్‌ డిసీజ్‌(పీసీఓడీ)కు సంకేతమని కొందరు బ్లాగర్లు చెబుతున్నారు. ఇందులో ఎంతమాత్రం నిజం లేదు. (పాపులర్‌ యూ ట్యూబర్‌ సీక్రెట్‌ వెడ్డింగ్‌ : స్టూడెంట్స్‌కి సర్‌ప్రైజ్‌) నెలసరి సమయంలో నొప్పి అధికంగా ఉంటే నిమ్మరసం లేదా కాఫీ తాగాలన్నది కొందరి సలహా. కానీ, అలా చేస్తే నొప్పి తగ్గకపోగా మరింత పెరుగుతుంది. (వోగ్ బ్యూటీ అవార్డ్స్‌: సమంతా స్టన్నింగ్‌ లుక్‌, ఫ్యాన్స్‌ ఫిదా)నెలసరి వచ్చినప్పుడు వ్యాయామం చేయడం చాలా ప్రమాదకరం అంటూ మరికొందరు హెచ్చరిస్తున్నారు. నిజానికి ఆ సమయంలో వ్యాయామం చేస్తే నొప్పి, చికాకు నుంచి ఉపశమనం లభిస్తుంది. మానసిక ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది. ఇందుకు శాస్త్రీయమైన ఆధారాలు కూడా ఉన్నాయి. నెలసరిలో విడుదలయ్యే రక్తం అపవిత్రమైందని, ఆ సమయంలో దేవాలయాలకు వెళ్లొద్దని, ఇళ్లల్లో పచ్చళ్లు కూడా ముట్టుకోవద్దని, ఇతరులకు దూరంగా ఉండాలన్న అభిప్రాయం ఇప్పటికే సమాజంలో పాతుకుపోయింది. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఇలాంటి మూఢవిశ్వాసాలను మరింత పెంచేస్తున్నారు. కొత్తకొత్తవి జోడిస్తూ మహిళలను ఆందోళనకు గురి చేస్తున్నారు. పీరియడ్స్‌ వచ్చినప్పుడు ఫలానా ఆహారం తీసుకోవాలని లేదా తీసుకోవద్దని చెబుతున్నారు. కానీ, అందుకు ఎలాంటి ఆధారాలు లేవు. నెలసరి సమయంలో భాగస్వామితో కలిస్తే గర్భం రాదు అనేది తప్పుడు అభిప్రాయమేనని నిపుణులు అంటున్నారు. మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సోషల్‌ మీడియాలో కచి్చతత్వం, వాస్తవాలతో కూడిన, నిర్ధారించిన సమాచారం మాత్రమే అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పాన్‌ హెల్త్‌కేర్‌ సంస్థ సీఈఓ చిరాగ్‌పాన్‌ సూచించారు. నెలసరి శుభ్రత కోసం శానిటరీ ప్యాడ్స్‌ ఉపయోగిస్తున్నట్లు 87.8 శాతం మంది చెప్పారు. 5.7 శాతం మంది డిస్పోజబుల్‌ పిరియడ్‌ ప్యాంటీస్, 4.7 శాతం మంది మెన్‌స్ట్రువల్‌ కప్స్, 1.6 శాతం మంది టాంపోన్స్‌ వాడుతున్నట్లు సర్వేలో వెల్లడయ్యింది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement