ఖరీదైన గూగుల్‌ పిక్సెల్‌ ఫోన్‌ సగం ధరకే! | Flipkart Diwali Sale Google Pixel 8 Phone At Low Price | Sakshi
Sakshi News home page

ఖరీదైన గూగుల్‌ పిక్సెల్‌ ఫోన్‌ సగం ధరకే!

Published Mon, Oct 21 2024 9:25 AM | Last Updated on Mon, Oct 21 2024 10:13 AM

Flipkart Diwali Sale Google Pixel 8 Phone At Low Price

ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ను భారీ తగ్గింపుతో కొనాలనుకుంటే ఇదే సరైన సమయం. ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ ప్రస్తుతం బిగ్ దీవాళి సేల్‌ పేరుతో ఆఫర్లు అందిస్తోంది. ఇందులో భాగంగా గూగుల్‌ కంపెనీకి చెందిన పిక్సెల్‌ 8 (Google Pixel 8) ఫోన్‌పై భారీ తగ్గింపు ఆఫర్‌ అందుబాటులో ఉంది.

గూగుల్‌ పిక్సెల్‌ 8 256జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 82,999 కాగా ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో ఈ ఫోన్‌ను రూ. 42,999కే సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎస్‌బీఐ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా 10 శాతం డిస్కౌంట్‌ లభిస్తుంది. అలా గూగుల్‌ పిక్సెల్‌ 8 ‌ఫోన్‌ను రూ. 36,499కే సొంతం చేసుకోవచ్చు. మరోవైపు ఈ ఫోన్‌పై ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ కూడా అందిస్తున్నారు. మీ పాత ఫోన్‌ ఇస్తే దాని కండిషన్‌ ఆధారంగా రూ. 42,500 వరకు తగ్గింపు పొందొచ్చు.

గూగుల్‌ పిక్సెల్‌ 8 ఫీచర్లు  
ఈ ఫోన్‌లో 6.2 అంగుళాల ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే అందించారు. 90హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో ఫుల్‌హెచ్‌డీ ప్లస్‌ రిజల్యూషన్‌ ఈ స్క్రీన్‌ సొంతం. Titan M2 సెక్యూరిటీ చిప్‌తో వచ్చిన ఈ ఫోన్‌లో ప్రాసెసర్ కోసం T3 చిప్‌సెట్ ఇచ్చారు. ఇక కెమెరా విషయానికొస్తే  50 మెగాపిక్సెల్స్‌, 12 మెగాపిక్సెల్స్‌ డ్యూయల్‌ రియిర్‌ కెమెరా సెటప్‌ ఉంది. అలాగే సెల్పీలు, వీడియో కాల్స్‌ కోసం 10.5 మెగాపిక్సెల్స్ ఫ్రంట్‌ కెమెరా ఇచ్చారు. బ్యాటరీ సంగతికొస్తే ఈ ఫోన్‌లో 27 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 4575 ఎం‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement