discount offer
-
ఖరీదైన గూగుల్ పిక్సెల్ ఫోన్ సగం ధరకే!
ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ను భారీ తగ్గింపుతో కొనాలనుకుంటే ఇదే సరైన సమయం. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం బిగ్ దీవాళి సేల్ పేరుతో ఆఫర్లు అందిస్తోంది. ఇందులో భాగంగా గూగుల్ కంపెనీకి చెందిన పిక్సెల్ 8 (Google Pixel 8) ఫోన్‌పై భారీ తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంది.గూగుల్ పిక్సెల్ 8 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 82,999 కాగా ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ ఫోన్‌ను రూ. 42,999కే సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎస్బీఐ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అలా గూగుల్ పిక్సెల్ 8 ఫోన్‌ను రూ. 36,499కే సొంతం చేసుకోవచ్చు. మరోవైపు ఈ ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందిస్తున్నారు. మీ పాత ఫోన్ ఇస్తే దాని కండిషన్ ఆధారంగా రూ. 42,500 వరకు తగ్గింపు పొందొచ్చు.గూగుల్ పిక్సెల్ 8 ఫీచర్లు ఈ ఫోన్లో 6.2 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ప్లే అందించారు. 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో ఫుల్హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ ఈ స్క్రీన్ సొంతం. Titan M2 సెక్యూరిటీ చిప్‌తో వచ్చిన ఈ ఫోన్లో ప్రాసెసర్ కోసం T3 చిప్సెట్ ఇచ్చారు. ఇక కెమెరా విషయానికొస్తే 50 మెగాపిక్సెల్స్, 12 మెగాపిక్సెల్స్ డ్యూయల్ రియిర్ కెమెరా సెటప్ ఉంది. అలాగే సెల్పీలు, వీడియో కాల్స్ కోసం 10.5 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. బ్యాటరీ సంగతికొస్తే ఈ ఫోన్లో 27 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4575 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. -
ఐఫోన్ 16పై రూ.37,900 డిస్కౌంట్! ఎలాగంటే..
ఐఫోన్ 16 (iPhone 16) సిరీస్ అధికారికంగా భారతీయ మార్కెట్లోకి వచ్చింది. ఈ సీరీస్ లైనప్‌లో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మోడల్స్ ఉన్నాయి. ఈ కొత్త ఐఫోన్‌పై భారీ డిస్కౌంట్ పొందే మార్గం ఉంది. అదే యాపిల్ ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్.అసలేంటి యాపిల్ ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్.. సింపుల్‌గా చెప్పాలంటే పాత ఐఫోన్లను ఇచ్చి కొత్త ఐఫోన్‌పై డిస్కౌంట్ పొందడం అన్నమాట. కస్టమర్లు తమ పాత ఐఫోన్లను ఇచ్చి కొత్త ఐఫోన్ 16పై గణనీయమైన తగ్గింపు పొందవచ్చు. అయితే ఇది ట్రేడ్ చేసే ఐఫోన్ మోడల్ , స్థితిని బట్టి ఉంటుంది.ఐఫోన్ 16 బేస్ 128జీబీ మోడల్ రూ. 79,900 నుండి ప్రారంభమవుతుంది. దీనిపై యాపిల్ ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్ ఆన్లైన్, యాపిల్ స్టోర్లలో అందుబాటులో ఉంది. ఐఫోన్ 12 వంటి పాత మోడల్లను కూడా ఈ ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్ ద్వారా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.ఏ మోడల్‌తో ఎంత?మీ వద్ద ఐఫోన్ 15 ఉంటే దీన్ని ఇచ్చి యాపిల్ ట్రేడ్-ఇన్ క్రెడిట్లో ఐఫోన్ 16పై రూ. 37,900 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇక ఐఫోన్ 14 ఇచ్చేవారు రూ. 32,100 వరకు తగ్గింపును ఆశించవచ్చు. మీ వద్ద ఐఫోన్ 13 ఉంటే యాపిల్ ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్ గరిష్టంగా రూ. 31,000 వరకు క్రెడిట్‌ను అందిస్తుంది. ఐఫోన్ 12 ఇవ్వడం ద్వారా వినియోగదారులు ట్రేడ్-ఇన్ విలువలో రూ. 20,800 వరకు పొందవచ్చు. ఈ తగ్గింపులు ఫోన్ నిల్వ సామర్థ్యం, బ్యాటరీ స్థితి వంటి అంశాలపై ఆధారపడి ఉంటాయి. -
బంపర్ డిస్కౌంట్.. ఈ ఎలక్ట్రిక్ కారుపై రూ.2 లక్షల తగ్గింపు!
ఎలక్ట్రిక్ కార్ కొనాలనుకుంటున్నవారికి ఇది నిజంగా భారీ శుభవార్త. ప్రముఖ దేశీయ కార్ మేకర్ టాటా మోటర్స్ '2 మిలియన్ ఎస్యూవీ వేడుక'లో భాగంగా తమ ఈవీ పోర్ట్‌ఫోలియోలోని పలు వాహనాలపై బంపర్ డిస్కౌంట్లు ప్రకటించింది. పాపులర్ టాటా నెక్సాన్ ఈవీపై గరిష్టంగా రూ. 2.05 లక్షల వరకూ తగ్గింపు అందిస్తోంది.ఈ సెప్టెంబర్ నెలలో టాటా ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి భారీగా డబ్బు ఆదా కానుంది. టాటా మోటర్స్ ఈవీ పోర్ట్‌ఫోలియోలోని టాటా నెక్సాన్ ఈవీ (Tata Nexon EV), పంచ్ ఈవీ (Punch EV), టియాగో ఈవీ (Tiago EV)లపై గ్రీన్ బోనస్‌లో భాగంగా క్యాష్ డిస్కౌంట్లు అందిస్తోంది. 2023 మోడల్లను ఎంచుకునే వారికి అదనపు తగ్గింపు లభిస్తుంది.టాటా నెక్సాన్ ఈవీపై భారీ డిస్కౌంట్టాప్ స్పెక్స్ ఉండే టాటా నెక్సాన్ ఈవీ ఎంపవర్డ్+ లాంగ్ రేంజ్ వేరియంట్లపై ఈ నెలలో రూ. 1.80 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది టాటా మోటర్స్. రూ. 20,000 తగ్గింపుతో లభించే ఎంట్రీ-లెవల్ క్రియేటివ్ + ఎంఆర్ వేరియంట్ తప్ప మిగిలిన అన్ని వేరియంట్లు రూ. 1 లక్ష నుండి రూ. 1.2 లక్షల వరకూ తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి.2023లో తయారైన అన్ని మోడల్‌లపై అయితే రూ. 25,000 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. టాటా నెక్సాన్ ఈవీ ధర రూ. 14.49 లక్షల నుండి రూ. 19.49 లక్షల మధ్య ఉంటుంది. ఇది రెండు బ్యాటరీ ఆప్షన్లతో వస్తుంది. కంపెనీ పేర్కొన్నదాని ప్రకారం.. 30kWh వేరియంట్ 275 కి.మీ, 40.5kWh యూనిట్ 390 కి.మీ. రేంజ్ ఇస్తాయి.ఇతర ఈవీలపైనా..ఇక టాటా మోటర్స్ డిస్కౌంట్ అందిస్తున్న ఇతర ఈవీలలో టాటా టియాగో ఈవీ, టాటా పంచ్ ఈవీ ఉన్నాయి. వీటిలో టాటా టియాగో ఈవీలపై గరిష్టంగా రూ.65,000, అలాగే టాటా పంచ్ ఈవీలపై రూ.30,000 వరకూ డిస్కౌంట్ లభిస్తోంది. -
అలర్ట్: నేటి అర్ధరాత్రితో ముగియనున్న పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల గడువు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వాహనాల పెండింగ్ చలాన్లపై ప్రభుత్వం ప్రకటించిన రాయితీ గడువు నేటితో(గురువారం) ముగియనుంది. రాత్రి 11.59 గంటలకు డిస్కౌంట్ ఆఫర్ గడువు ముగియనుంది. ఈ గడువును ఇప్పటికే రెండుసార్లు పొడిగించిన విషయం తెలిసిందే. మొదట జనవరి 10ని ట్రాఫిక్ చలాన్ల డిస్కౌంట్‌కు చివరి తేదీగా నిర్ణయించగా.. ఆ తరువాత జనవరి 31 వరకు, మరోసారి ఫిబ్రవరి 15 వరకు పొడిగించారు. ఆ గడువు నేటితో ముగియనుంది. అయితే మరోసారి గడువు పెంచే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు కోటి 66 లక్షల పెండింగ్ చలాన్ల క్లియరెన్స్‌తో రూ.147 కోట్లు వసూలు అయినట్లు అధికారులు తెలిపారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3 కోట్ల 59 లక్షల కేసులు పెండింగ్‌లో ఉండగా.. ఇప్పటిరకు కోటి 66 లక్షల కేసులు క్లియర్ అయినట్లు పేర్కొన్నారు. 47 శాతం కేసులు క్లియర్ కాగా.. ఇంకా 53 శాతం పెండింగ్ కేసులు ఉన్నట్లు వెల్లడించారు. చదవండి: శివ బాలకృష్ణ సోదరుడికి ఏసీబీ కోర్టులో చుక్కెదురు -
కారు కొనాలనుకుంటున్నారా? మారుతి కార్లపై భారీ డిస్కౌంట్
ఆటో దిగ్గజం మారుతి సుజుకి పలు మోడళ్ల కార్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఆగస్ట్ నెలకు సంబంధించి కార్ల కొనుగోలుదారులకు అదిరిపోయే ఆఫర్ అందిస్తోంది. దాదాపు రూ. 57 వేల తగ్గింపు దాకా అందిస్తోంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ తదితరాలు ఉన్నాయి. ఆగస్టు 31 వరకు ఈ డిస్కౌంట్ ధరలు అందుబాటులో ఉంటాయి మారుతి సుజుకి పై రూ. 57 వేల దాకా డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. వేరియంట్ల ఆధారంగా కస్టమర్లు ఈ తగ్గింపును పొందవచ్చు. ఆల్టో కే10పై రూ. 57 వేల దాకా తగ్గింపు పొందవచ్చు. (తండ్రికే షాకిస్తున్న ఇషా: మురిసిపోతున్న అంబానీ) మారుతీ సుజుకి ఎస్ ప్రెస్సో 56,000 వరకు తగ్గింపు. మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పెట్రోల్, CNG-ఆధారిత మారుతి సుజుకి S ప్రెస్సో అన్ని వేరియంట్లు రూ. 56,000 వరకు మొత్తం తగ్గింపును పొందవచ్చు. అలాగే ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కూడిన వేరియంట్లు రూ. 32,000 వరకు తగ్గింపు పొందవచ్చు. (స్పెషల్ ఎట్రాక్షన్‌గా నీతా అంబానీ: చెప్పుల ధర రూ.7 లక్షలు) మారుతీ సుజుకీ ఇగ్నిస్, బాలెనో, డిజైర్, వ్యాగన్ ఆర్ మోడల్స్‌పై క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తుంది. వేరియంట్లు, డీలర్షిప్ ఏజెన్సీల ఆధారంగా ఈ తగ్గింపు అందుబాటులో ఉంటుంది. కాగా మారుతి సుజుకి ఈ ఏడాది క్యూ1లో మెరుగైన ఫలితాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. జూన్తోముగిసిన త్రైమాసికంలో గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 145శాతం పుంజుకుని రూ. 2,485 కోట్ల నికర లాభాలను సాధించింది. అలాగే 45 లక్షల అమ్మకాలతో మారుతి ఆల్టో బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచిన సంగతి తెలిసిందే. -
రూ. 749కే బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్ నథింగ్ ఫోన్ (1), డిస్కౌంట్ ఎంతంటే?
సాక్షి, ముంబై: బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన నథింగ్ ఫోన్ (1) ఇపుడు డిస్కౌంట్ ధరలో కస్టమర్లకు అందుబాటులోకి వచ్చింది. కంపెనీ నథింగ్ ఫోన్ (2) లాంచింగ్‌కు సిద్ధమవుతున్న తరుణంలో నథింగ్ ఫోన్ (1) ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భారీ తగ్గింపుతో లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో బాగా సేల్ అవుతున్న నథింగ్ ఫోన్ వన్ ఇపుడు రూ. 39,250 తగ్గింపు తర్వాత కేవలం రూ.749కే అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 8,000 తగ్గింపు తర్వాత రూ. 31,999గా లిస్ట్ అయింది. దీనితో పాటు హెచ్డీఎఫ్సీ ఈఎంఐ లావాదేవీలపై రూ. 1,250 తగ్గింపు లభిస్తోంది. దీనికి అదనంగా, పాత స్మార్ట్‌ఫోన్‌కు బదులుగా రూ. 30,000 వరకు తగ్గింపును కూడా అందిస్తోంది. ఈ ఆఫర్లన్నీ వర్తించిన తరువాత నథింగ్ ఫోన్ (1)ను రూ. 749కే కొనుగోలు చేయవచ్చు. కార్ల్ పీ నేతృత్వంలోని యూకే ఆధారిత టెక్ కంపెనీ నథింగ్ ఫోన్ సిరీస్‌లో నథింగ్ ఫోన్ (2) ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌నులాంచ్ చేయనుంది. ప్రీమియం స్పెసిఫికేషన్స్‌తో గేమ్-ఛేంజర్‌గా ఉంటుందనే అంచనాల మధ్య జూలైలో లాంచ్కానుంది. నథింగ్ ఫోన్ (1) స్పెసిఫికేషన్లు 6.55-అంగుళాల OLED డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణ, 120Hz రిఫ్రెష్ రేట్ ఆండ్రాయిడ్ ఆధారిత నథింగ్ OS Qualcomm Snapdragon 778G+ చిప్సెట్ 12 జీబీ ర్యామ్,చ 256 జీబీ స్టోరేజ్ 50 ఎంపీ డ్యుయల్‌రియర్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 4,500 mAh బ్యాటరీ -
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్-3 5జీ పై ఊహించని డిస్కౌంట్
సాక్షి, ముంబై: శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ఇపుడు ఐఫోన్ 13 కంటే తక్కువ ధరకే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఇపుడు రూ.44,999కి అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డే సేల్‌లో భాగంగా గెలాక్సీ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌పై ఈ తగ్గింపు లభిస్తుంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ. 1,250 వరకు తక్షణ తగ్గింపు అదనం. రూ. 95,999 ధరతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను దాదాపు రెండు సంవత్సరాల క్రితం ఇండియాలో లాంచ్ చేసింది. ఇప్పటికే Android 13 OS అప్డేట్ను పొందిన దీనికి రానున్న Android 14 OSకి అప్డేట్ పొందొచ్చు. గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4, ఒప్పో ఎన్ 2 ఫ్లిప్ ధరలు రూ. 89,999కిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 తక్కువ ధరకు లభిస్తున్నట్టే. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ఫీచర్లు 1.9-అంగుళాల కవర్ డిస్ప్లే 6.7-అంగుళాల డిస్ప్లే స్నాప్‌డ్రాగన్ 888 చిప్సెట్ డ్యుయల్ 12-మెగాపిక్సెల్ కెమెరాలు రెండో డిస్ప్లే ప్యానెల్లో 10మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 3300mAh బ్యాటరీ -
శాంసంగ్ 32 అంగుళాల స్మార్ట్‌టీవీ: కేవలం రూ. 5వేలకే
సాక్షి, ముంబై: బడ్జెట్ ధరలో స్మార్ట్ టీవీ కావాలనుకుంటున్నారా? అయితే ఈ మండు వేసవిలో మీకో తీపి కబురు. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ శాంసంగ్ 32-అంగుళాల టైజెన్ టీవీ భారీ ఆఫర్ అందిస్తోంది. 38 శాతం తగ్గింపుతో రూ. 13,999 తగ్గింపు ధరకే లిస్ట్ చేసింది. దీంతోపటు పలు డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ ద్వారా 23వేల రూపాయల టీవీని కేవలం రూ. 5,000లోపు సొంతం చేసుకోవచ్చు. (Fact Check: కన్యా సుమంగళ యోజన, అమ్మాయిలకు నెలకు రూ.4500?) 32 అంగుళాల శాంసంగ్ HD రెడీ LED స్మార్ట్ టైజెన్ టీవీ అసలు ధర దాదాపు రూ. 23,000. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం రూ. 14వేలకే కొనుగోలు చేయవచ్చు. ఇది 2020లో లాంచ్ అయింది. బ్యాంక్ ఆఫర్లు ఎస్బీఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా 10 శాతం వరకు తగ్గింపు. దీనికి అదనంగా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ లావాదేవీల నుండి 500 రూపాయల తగ్గింపును పొందవచ్చు. ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. (లగ్జరీ డ్యూప్లెక్స్ అపార్ట్మెంట్ కొనుగోలు చేసిన సమంత! ధర ఎంతంటే?) ఎక్స్చేంజ్ ఆఫర్ ఈ శాంసంగ్ స్మార్ట్ టీవీని రూ. 5,000లోపు కొనుగోలు చేయాలనుకుంటే, బ్యాంక్ ఆఫర్‌తో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను ఎంచుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.11వేల ఎక్స్చేంజ్ తగ్గింపు అందుబాటులో ఉంది . శాంసంగ్ HD రెడీ LED స్మార్ట్ టైజెన్ టీవీ ఫీచర్లు 366 x 768 పిక్సెల్‌లతో 80 cm (32-అంగుళాల) LED HD రెడీ స్క్రీన్ డిస్ప్లే రిఫ్రెష్ రేట్ 60 Hz డాల్బీ డిజిటల్ ప్లస్ సపోర్ట్ ఇంకా నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+హాట్‌స్టార్, సోనీ లివ్, ఏరోస్ నౌ, జియో సినిమా, గానా, బిగ్ ఫిక్స్, స్పాటిఫై, సన్ నెక్ట్స్ సహా ఇతర యాప్‌లను సపోర్ట్ చేస్తుంది.ఇన్‌బిల్ట్ Wi-Fi , 2 Dolby Digital Plus స్పీకర్లు లాంటి ఇందులో ఉన్నాయి. -
యానివర్సరీ సేల్, ఈ మొబైల్స్‌పై భారీ తగ్గింపు
సాక్షి, ముంబై: ఐక్యూ మొబైల్స్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. కంపెనీ మూడవ వార్షికోత్సవం సందర్బంగా ఐక్యూ బ్రాండ్ స్పెషల్ సేల్ ప్రకటించింది. ఈ రోజునుంచి (ఏప్రిల్ 19, బుధవారం) ఏప్రిల్ 24 వరకు ఈ సేల్ కొనసాగుతుంది. ఫ్లాగ్షిప్, నియో సిరీస్ స్మార్ట్ఫోన్లపై ఆకర్షణీయమైన తగ్గింపులను అందిస్తోంది. కంపెనీ తాజా గేమింగ్-ఫోకస్డ్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ ఐక్యూ 11 5జీతోపాటు, ఐక్యూ 9, ఐక్యూ 9 ప్రో మోడల్స్ కొనుగోళ్లపై డిస్కౌంట్ లభ్యం. దీంతోపాటు ఆఫర్లు బ్యాంక్ ఆఫర్ కూడా ఉన్నాయని, అయితే హైస్టోరేజ్ వేరియంట్‌కు ఈ తగ్గింపు వర్తించదని కంపెనీ వెల్లడించింది. కంపెనీ షేర్ చేసిన వివరాల ప్రకారం, ఇండియాలో ఐక్యూ 11 5జీ బేస్ మోడల్ ఇపుడు రూ. 49,999కే లభ్యం. లిస్టెడ్ ధర రూ. 59,999. (ఇదీ చదవండి: ఆన్‌బోర్డింగ్ కష్టాలు: ఫ్రెషర్స్‌కు విప్రో మరో షాక్?) ఈ సేల్‌లో ఐక్యూ 9, ఐక్యూ 9ప్రో ప్రస్తుత ధర రూ. 30,990, రూ. 39,990. అమెజాన్ ఇండియాలో వీటి ధర ప్రస్తుతం రూ. 35,990, రూ. 44,990 గా ఉంది. దీంతోపాటు ఐక్యూ Neo 6 5జీ స్మార్ట్‌ఫోన్‌ను 5,000 తగ్గింపు తరువాత రూ. 29,999కే కొనుగోలు చేయవచ్చు. (అదరగొట్టిన టీసీఎస్: ఉద్యోగం కోసం చూస్తున్నారా? లేటెస్ట్ చిట్కాలివిగో!) ఐక్యూ 11 5జీ స్పెసిఫికేషన్స్ 6.78-అంగుళాల 2K E6 AMOLED డిస్ప్లే Android 13-ఆధారిత Funtouch OS 13 క్వాల్కం స్నాప్ డ్రాగన్ 8 Gen 2 SoC 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 13-మెగాపిక్సెల్ టెలిఫోటో/పోర్ట్రెయిట్ సెన్సార్ మరియు 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా, 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5,000mAh బ్యాటరీ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. కేవలం 8 నిమిషాల్లో బ్యాటరీ 50 శాతం ఛార్జ్ అవుతుంది. కాగా చైనీస్ టెక్ దిగ్గజం వివో మద్దతుతో, 2020లో భారతదేశంలో అడుగుపెట్టిన కొత్త స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐక్యూ. -
బంపర్ ఆఫర్: గూగుల్ పిక్సెల్ 7పై రూ.39 వేల తగ్గింపు
సాక్షి, ముంబై: గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ ఆఫర్ లభిస్తోంది. గత ఏడాది అక్టోబర్‌లో లాంచ్ అయిన పిక్సెల్ సిరీస్‌లో గూగుల్ పిక్సెల్ 7ఇపుడు చాలా తక్కువ ధరకే అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 39,000 తగ్గింపు తర్వాత కేవలం రూ. 20,999కి లభిస్తుంది. మరికొద్ది రోజుల్లో గూగుల్ పిక్సెల్ 7ఏ లాంచ్ కానుందన్న అంచనాల మధ్య డిస్కౌంట్ ధర అందుబాటులోకి వచ్చింది. భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 7 అసలు ధర రూ. 57,999. తాజా ఆఫర్లో బ్యాంక్ ఆఫర్లు, డిస్కౌంట్లతో కలిపి కేవలం రూ. 20,999కే కొనుగోలు చేయవచ్చు. గత రెండేళ్లుగా గూగుల్ బ్రాండ్ ఇకామర్స్ భాగస్వామి ఫ్లిప్‌కార్ట్ ఎక్స్చేంజ్ ద్వారా రూ. 3,000 ప్రత్యేక తగ్గింపుతో సహా రూ. 30వేల వరకు తగ్గింపును అందిస్తోంది. దీంతోపాటు, కస్టమర్లు యాక్సిస్ బ్యాంక్ అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ , డెబిట్ కార్డ్ ద్వారా చేసేకొనుగోళ్లపై రూ.7,000 తగ్గింపును కూడా పొందవచ్చు. మొత్తం మీద గూగుల్ పిక్సెల్ 7 ధర రూ.20,999కి దిగి వచ్చింది. గూగుల్ పిక్సెల్ 7 ఫీచర్లు 6.3-అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే 1080x2400పిక్సెల్ రిజల్యూషన్ 90Hz రిఫ్రెష్ రేట్ 8జీబీ ర్యామ్, 128 జీబీ ర్యామ్స్టోరేజ్ 50 +12 ఎంపి డ్యుయల్ రియర్ 10.8ఎంపీ సెల్ఫీ కెమెరా 4355 mAh బ్యాటరీ మరోవైపు మే 10 న జరగనున్న గూగుల్వార్షిక I/O ఈవెంట్లో పిక్సెల్ 7 సిరీస్‌లో భాగంగా 7ఏను లాంచ్ చేయనుందని తెలుస్తోంది -
Flipkart Summer Offer: వీటిపై 60 శాతం డిస్కౌంట్! మార్చి 26 వరకే..
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు 'హలో సమ్మర్ డేస్ సేల్' (Hello Summer Days) పేరుతో సేల్స్ ప్రారంభించింది. ఈ స్పెషల్ ఆఫర్ కేవలం మార్చి 22 నుంచి మొదలై 26 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇందులో ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్ల కొనుగోలుపై భారీ డిస్కౌంట్స్ పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ప్రారంభించిన 'హలో సమ్మర్ డేస్ సేల్'లో ఎయిర్ కండీషనర్ కొనుగోలుపై 55 శాతం, రిఫ్రిజిరేటర్ల మీద 60 శాతం డిస్కౌంట్స్ పొందవచ్చు. అంతే కాకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం అడిషనల్ డిస్కౌంట్ పొందవచ్చని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే కాకుండా ఇతర బ్యాంకు కార్డులపై 'నో కాస్ట్ ఈఎమ్ఐ' సదుపాయం పొందవచ్చు. కావున సామ్సంగ్, వోల్టాస్, ఎల్జీ, వాల్పూల్, హయెర్, గోద్రెజ్ వంటి కంపెనీల రిఫ్రిజిరేటర్లను సాధారణ ధరల కంటే తక్కువ ధరలోనే కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం దాదాపు అన్ని కంపెనీ బ్రాండ్ కొనుగోలుపై డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. బ్యాంక్ కార్డు వినియోగించుకుని మరింత తక్కువ ధరకే వీటిని కొనుగోలు చేయవచ్చు. (ఇదీ చదవండి: Jayanti Chauhan: వేల కోట్ల కంపెనీకి లేడీ బాస్.. జయంతి చౌహాన్) కంపెనీ అందిస్తున్న ఈ స్పెషల్ ఆఫర్ కింద సామ్సంగ్ 1.5 టన్ కన్వర్టబుల్ 5-ఇన్-1 3-స్టార్ ఏసీ కేవలం రూ. 37,999కే కొనుగోలు చేయవచ్చు. అదే సమయంలో ప్యానసోనిక్ 1.5 టన్ ఇన్వర్టర్ వైఫై కనెక్ట్ ఏసీ, ఎల్జీ కన్వర్టబుల్ 6-ఇన్-1 3 స్టార్ ఏసీ, లాయిడ్ 1.5 టన్ 3 స్టార్ ఏసీ కూడా తక్కువ ధరలోనే కొనుగోలు చేయవచ్చు. -
రూ. 32 వేల బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్ కేవలం రూ. 1,999కే
సాక్షి, ముంబై: బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్ నథింగ్ ఫోన్(1) ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో నమ్మశక్యం కాని ధరకు అందుబాటులో ఉంది.కార్ల్ పీ నేతృత్వంలోని యూకే ఆధారిత టెక్ స్టార్టప్ నుండి వచ్చిన తొలి స్మార్ట్‌ఫోన్ ఇది. నథింగ్ ఇయర్ (1) సక్సెస్ తరువాత దీనికి కొనసాగింపుగా త్వరలోనే నథింగ్ ఇయర్ (2) గ్లోబల్ లాంచ్ చేయనుంది. ఈ లాంచింగ్‌కు ముందే నథింగ్ ఫోన్ (1) ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో లభిస్తుంది. రూ. 32,999 ప్రారంభ ధరతో లాంచ్ అయిన నథింగ్ ఫోన్ (1) ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ. 1,999కి అందుబాటులో ఉంది. (టాటా, మారుతి, హ్యుందాయ్: కారు ఏదైనా ఆఫర్మాత్రం భారీగానే!) ఫ్లిప్‌కార్ట్‌లో 8వేల తగ్గింపుతో రూ. 29,999 వద్ద నథింగ్ ఫోన్ (1) లిస్ట్ అయింది. అయితే దీనికి అదనంగా, కొనుగోలుదారులు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై 10శాతం తక్షణ తగ్గింపు(రూ. 1000 వరకు). అలాగే పాత ఫోన్ ఎక్స్చేంజ్ ఆఫర్‌గా రూ. 27 వేల దాకా తగ్గింపుతో కలిపి నథింగ్ ఫోన్ (1) ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 1,999కే లభించనుంది. (వచ్చే ఏడాది ఫార్మా రంగం కళకళ!) నథింగ్ ఫోన్ (1) స్పెసిఫికేషన్లు 6.55 అంగుళాల OLED డిస్ప్లే Qualcomm Snapdragon 778G+ చిప్సెట్ ఆండ్రాయిడ్ ఆధారిత నథింగ్ OS 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ 50+50 డ్యుయల్ రియర్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 4,500 mAh బ్యాటరీ -
కొత్త కారు కొనేవారికి శుభవార్త.. మారుతి కార్లపై అదిరిపోయే ఆఫర్స్
భారతీయ మార్కెట్లో మారుతి సుజుకి, కారు కొనుగోలు చేయాలనుకునే వారికి మంచి శుభవార్తను తీసుకువచ్చింది. ఇందులో భాగంగానే ఎంపిక చేసిన మోడల్స్ మీద కంపెనీ రూ. 54,000 వరకు డిస్కౌంట్స్ అందిస్తోంది. ఈ ఆఫర్స్ కేవలం 2023 మార్చి చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. మారుతి సుజుకి ఇగ్నిస్: మారుతి సుజుకి ఇగ్నిస్ మాన్యువల్ వేరియంట్ కొనుగోలుపైన రూ. 54,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో రూ. 35,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 15,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 4,000 కార్పొరేట్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇక ఇగ్నిస్ ఆటోమేటిక్ వేరియంట్స్ కొనుగోలుపై రూ. 34,000 బెనిఫిట్స్ లభిస్తాయి. మారుతి సుజుకి బాలెనో: అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి బాలెనొ మీద కంపెనీ ఈ నెలలో రూ. 35,000 తగ్గింపును అందిస్తోంది. ఈ డిస్కౌంట్ కేవలం మాన్యువల్ వేరియంట్‌కి మాత్రమే వర్తిస్తాయి. ఆటోమేటిక్, CNG మోడల్స్ కొనుగోలుపైన ఎటువంటి ప్రయోజనాలు అందుబాటులో లేదు. మారుతి సుజుకి సియాజ్: మారుతి సుజుకి ఇప్పుడు సియాజ్ కొనుగోలుపై రూ. 28,000 తగ్గింపుని అందిస్తుంది. ఈ డిస్కౌంట్స్ మ్యాన్యువల్, ఆటోమాటిక్ వేరియంట్లకి వర్తిస్తుంది. ఇందులో రూ. 25,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్, రూ. 3,000 కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తాయి. (డిస్కౌంట్స్ నగరాన్ని బట్టి మారుతూ ఉంటాయి, ఖచ్చితమైన ఆఫర్స్ కోసం స్థానిక డీలర్‌ను సందర్శించి తెలుసుకోవచ్చు). మారుతి సుజుకి ప్రస్తుతం డిస్కౌంట్స్ అందించడం మాత్రమే కాకుండా దేశీయ మార్కెట్లో మరిన్ని కొత్త మోడల్స్ విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇందులో మారుతి ఫ్రాంక్స్, మారుతి జిమ్నీ 5-డోర్ వంటివి ఉన్నాయి. ఈ కొత్త కార్ల కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. -
టాటా మోటార్స్ గుడ్ న్యూస్, టాప్ మోడల్స్‌పై అదిరిపోయే ఆఫర్లు
సాక్షి, ముంబై: ప్రముఖ కార్ల తయారీ దారు టాటా మోటార్స్ కూడా తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఫిబ్రవరిలో ఎంపిక చేసిన మోడల్స్, సఫారి, హారియర్, ఆల్ట్రోజ్, టిగోర్ ,టియాగోపై రూ. 75,000 వరకు తగ్గింపు అందిస్తోంది. ఇప్పటికే మారుతి సుజుకి కూడా తగ్గింపు ధరలను ప్రకటించిన సంగతి తెలిసిందే. 2023 ఫిబ్రవరి నెలకు సంబందించిన తగ్గింపులో హారియర్, సఫారి మోడల్‌కార్లపై భారీ తగ్గింపును అందిస్తోంది . ముఖ్యంగా 2022, 2023 మోడల్స్‌పై ఈ బెనిఫిట్స్‌ను అందించడం విశేషం. టాటా ఫ్లాగ్షిప్ ఎస్యూవీ సఫారి 2023 అన్ని వేరియంట్లలో మొత్తం రూ. 35,000 తగ్గింపు లభ్యం. ఇందులో రూ. 10,000 నగదు తగ్గింపు రూ. 25,000 విలువైన ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఉన్నాయి. మరోవైపు, అమ్ముడుపోని ఎంపిక చేసిన 2022 సఫారీపై మొత్తం రూ. 75,000 వరకు తగ్గింపును కూడా అందిస్తోంది. దాదాపు టాటా హారియర్ కార్‌పై కూడా అదే ఆఫర్ లభిస్తోంది. టాటా హారియర్: 2023 మోడళ్లపై రూ. 35,000, 2022 మోడల్స్‌పై 75,000 వరకు తగ్గింపు టాటా టిగోర్: కొత్త స్టాక్ 25,000 వరకు తగ్గింపు , 2022 స్టాక్ పై 35,000 వరకు తగ్గింపు టాటా టియాగో: కొత్త స్టాక్‌పై 25,000 వరకు తగ్గింపు, 2022 స్టాక్‌పై 40,000 వరకు తగ్గింపు -
ఐఫోన్ లవర్స్‌కు గుడ్‌న్యూస్: ఫ్లిప్‌కార్ట్ యాపిల్ డేస్ సేల్ అదిరే ఆఫర్లు
సాక్షి, ముంబై: ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ యాపిల్ డేస్ సేల్‌ను ప్రకటించింది. ఈ సేలో ఇండియాలో లభ్యమవుతున్న ఐఫోన్లపై అదరిపోయే ఆఫర్లను అందిస్తోంది. ఐఫోన్ 14, ఐఫోన్ 13, ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 11 ఉన్నాయి. ఐఫోన్ కొనాలనుకునే కస్టమర్లు ఫ్లిప్‌కార్ట్‌లో నవంబర్ 20 వరకు తగ్గింపులు, ఆఫర్లను పొందవచ్చు ఐఫోన్ 13 రూ.69,900కి లభించే ఐఫోన్ 13ని యాపిల్ డేస్ సేల్‌లో రూ.64,999కి కొనుగోలు చేయవచ్చు. అలాగే ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్‌ల ద్వారా ఫోన్‌ను కొనుగోలు చేసే కస్టమర్లు రూ. 1,500 వరకు తగ్గింపు. అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ యూజర్లు ఐఫోన్‌పై 5 శాతం తగ్గింపును పొందవచ్చు. 256జీబీ స్టోరేజ్, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్లను రూ.74,999 రూ.94,999కి కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 12 మినీ ఐఫోన్ 12 మినీ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 38,999కి లిస్ట్ చేసింది. 128జీబీ, 256జీబీ స్టోరేజ్ వేరియంట్లను వరుసగా రూ.43,999 రూ.53,999కి కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 14 రూ. 79,900ల ఐఫోన్‌ను ఈ సేల్‌లో రూ.74,900కే సొంతం చేసుకోవచ్చు. ముఖ్య విషయం ఏమిటంటే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలుచేసిన వినియోగదారులకు మాత్రమే ఈ తగ్గింపు లభ్యం. ఇతర కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే ఎలాంటి తగ్గింపు ఉండదు. బ్యాంక్ ఆఫర్‌తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్‌తో కలిసి దీనిపై రూ. 20వేల వరకు తగ్గింపు లభించే అవకాశం ఉంది. -
పలు మోడళ్ల హోండా కార్లపై భారీ తగ్గింపు
న్యూఢిల్లీ: పలు మోడళ్ల హోండా కార్లపై భారీ తగ్గింపు లభిస్తోంది. హోండా సిటీ, జాజ్, WR-V లాంటి మోడల్స్ రూ. 63,000 వరకు తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. నవంబరు నెలకు సంబంధించిన ఈ డీల్స్ కస్టమర్లు తమకు సమీపంలో ఉన్న డీలర్‌షిప్‌ను సంప్రదించడం ద్వారా మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు. దేశంలో ఐదు విభిన్న హోండా మోడల్‌లు అందుబాటులో ఉన్నాయి: అమేజ్, సిటీ (5వ తరం), సిటీ (4వ తరం), జాజ్ , WR-బలతో సహా ఐదు విభిన్న మోడళ్లను అందిస్తుంది. హోండా డబ్యుఆర్-వీ డబ్యుఆర్-వీ కి అతిపెద్ద తగ్గింపును అందిస్తోంది. ఇందులో రూ. 30,000 నగదు తగ్గింపు లేదా రూ. 36,144 విలువైన ఉచిత యాక్సెసరీలున్నాయి. అలాగే రూ. 7,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 5,000 లాయల్టీ బోనస్‌లు తదితరాలు ఉన్నాయి. హోండా అమేజ్ సబ్-కాంపాక్ట్ సెడాన్ హోండా అమేజ్ కొనుగోలుపై కస్టమర్లు రూ. 10,000 నగదు, లేదా రూ. 11,896 విలువైన ఉచిత యాక్సెసరీలను పొంద వచ్చు, అదనంగా రూ. 5,000 లాయల్టీ ఇన్సెంటివ్, రూ. 3,000 కార్పొరేట్ తగ్గింపు లభ్యం. హోండా జాజ్: త్వరలోనే ఉత్పత్తిని నిలిపివేయాలని భావిస్తున్న హోండా జాజ్‌పై 25 వేల తగ్గింపు లభ్యం. హోండా సిటీ (5వ జనరేషన్ : హోండా సిటీ మాన్యువల్‌పై రూ. 59,292 మొత్తం తగ్గింపును అందిస్తోంది. ఇందులో రూ. 30వేల నగదు తగ్గింపు లేదా రూ. 32,292 విలువైన ఉచిత యాక్సెసరీలు, ఇంకా ఎక్స్ఛేంజ్ బోనస్, లాయల్టీ బోనస్, కార్పొరేట్ తగ్గింపును కూడా అందిస్తోంది. -
వరల్ఢ్లోనే తొలి ఫోల్డ్ ల్యాపీ, ప్రీబుకింగ్‌పై అదిరిపోయే ఆఫర్
సాక్షి, ముంబై: ఇండియాలో ల్యాప్‌టాప్ సిరీస్‌లతో ఆకట్టుకుంటున్న ఆసుస్ తాజాగా ఫోల్డబుల్ ల్యాప్‌టాప్‌ను పరిచయం చేసింది. హై బ్రిడ్ ల్యాపీలతో యూజర్లను ఎట్రాక్ట్ చేస్తున్న ఆసుస్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ‘ఆసుస్ జెన్ 17 ఫోల్డ్ ఓలెడ్’ ను తీసుకొచ్చింది. ప్రపంచంలోనే తొలి ఫోల్డింగ్ ల్యాప్‌టాప్ అని చెబుతున్న కంపెనీ దీని ధరను రూ. 3,29, 990గా నిర్ణయించింది. ల్యాప్‌టాప్ కోసం ప్రీబుకింగ్స్‌ను కూడా షురూ చేసింది. ప్రీ-బుకింగ్ ఆఫర్ ప్రీ-బుకింగ్ చేసిన వారికి ఏకంగా 55 వేల వరకు తగ్గింపును అందిస్తోంది. ముందస్తు బుకింగ్ చేసుకున్న వారికి ఈ ల్యాప్‌టాప్ రూ.2,84,290 కే లభిస్తుంది. అక్టోబర్ 14 నుంచి నవంబర్ 9 వరకు ప్రీ బుకింగ్‌కు అవకాశం ఉంది. జెన్‌బుక్ 17 ఫోల్డ్ నవంబర్ 10న విడుదల కానుంది ఆసుస్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌తో ఇతర రీటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా 4.8 అంగుళాల స్క్రీన్‌ను వర్చువల్ కీ బోర్డు, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన సాధారణ కీ బోర్డు ద్వారా యూజర్లు తమ అవసరాలకు అనుగుణంగా ట్యాబ్, డిస్ప్లేలా వాడుకోవచ్చు. ఈ కొత్త లాపీలో ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, ట్యాబ్లెట్, రీడర్, ఎక్స్టెండెడ్ అనే ఐదు స్క్రీన్ మోడ్స్ ఉండటం మరో విశేషం. అంతేకాదు మల్టీ స్క్రీన్ ఫీచర్‌తో డిస్ప్లేని ఒకేసారి మూడు స్క్రీన్లుగా వాడుకోవచ్చు. కేవలం నలుపు రంగులో మాత్రమే వచ్చిన ఈ ల్యాపీలో 500 జీబీ ఎస్ఎస్డీ ఎక్స్టర్నల్ స్టోరేజ్ ఉచితం. 65W AC ఫాస్ట్ ఛార్జర్ మద్దతుతో 75 WHrs బ్యాటరీ సగటు వినియోగం 10 గంటలు. ఆసుస్ జెన్ 17 ఫోల్డ్ ల్యాపీ స్పెసిఫికేషన్స్ 17.3 అంగుళాల థండర్‌బోల్ట్ 4k డిస్ప్లే 12.5 అంగుళాల ఫోల్డ్ స్క్రీన్ 12వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్ ఇంటెల్ ఐరిస్ ఎక్స్ఈ గ్రాఫిక్ కార్డ్ 5 ఎంపీ ఏఐ కెమెరా డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో నాలుగు స్పీకర్స్ నాలుగు యూఎస్బీ-సీ పోర్ట్ -
విమాన ప్రయాణికులకు బంపరాఫర్!
విమాన ప్రయాణికులకు ఎయిర్ ఏసియా బంపరాఫర్ ప్రకటించింది. 'స్ప్లాష్ సేల్'ను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఈ సేల్‌లో ప్రయాణికులు ఢిల్లీ - జైపూర్ వంటి మార్గాల్లో తక్కువ ధరకే ఫ్లైట్ టికెట్లను బుక్ చేసుకోవచ్చని వెల్లడించింది. దీంతో పాటు దేశ వ్యాప్తంగా ఎయిర్ ఏసియా నెట్ వర్క్ ఉన్న ప్రాంతాల ప్రయాణికులు ఈ ఆఫర్‌ను పొంద వచ్చని తెలిపింది. ఆఫర్‌తో పాటు అదనంగా డిస్కౌంట్లు పొందవచ్చని పేర్కొంది. వచ్చే ఏడాది వరకు ఎయిర్ ఏసియా జూలై 7 నుంచి జులై 10వరకు స్ప్లాష్ సేల్ నిర్వహిస్తుంది. ఈ సేల్‌లో ఢిల్లీ-జైపూర్ మార్గాల్లో ఫ్లైట్ టికెట్ ప్రారంభ ధర రూ.1497గా ఉంటుందని, ఈ సేల్‌లో బుక్ అయిన టికెట్స్‌ను జూలై 26, 2022 నుంచి మార్చి 31, 2023 వరకు వినియోగించుకోవచ్చని తెలిపింది. పరిమిత ఇన్వెంటరీ ఆఫర్ కోసం కేటాయించిన సీట్లు మొత్తం బుకింగ్ అయితే .. జులై 10 తరువాత బుకింగ్‌కు రెగ్యులర్ ఛార్జీలు అందుబాటులో ఉంటాయని ఎయిర్‌లైన్ పేర్కొంది. కాగా, ఎయిర్ ఏషియా ఇండియా తన అధికారిక వెబ్ సైట్, మొబైల్ యాప్స్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. టాటాదే బెంగళూరులో ప్రధాన కేంద్రంగా టాటా సన్స్ అనుబంధ సంస్థ ఎయిర్ ఏసియా (ఇండియా) కార్యకలాపాలు నిర్వహిస్తుంది. జూన్12,2014నుంచి ఎయిర్ ఏసియా తన కార్యకలాపాలను ప్రారంభించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 50 కి పైగా 100 కనెక్టింగ్ రూట్లలో ఎయిర్ ఏసియా విమానాల రాకపోకల్ని నిర్వహిస్తుంది. -
వాహనదారులకు అలర్ట్
-
చలాన్లు క్లియర్ చేయలేదా? డిస్కౌంట్ ఆఫర్ ఎండ్ అయ్యేది ఎప్పుడో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: వాహనదారులకు తెలంగాణ సర్కార్ ప్రకటించిన పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ ఆఫర్ నేటితో ముగియనుంది. మార్చి ఒకటి నుంచి పోలీసులు ఈ ఆఫర్ ప్రకటించారు. ముందుగా మార్చి నెలాఖరు వరకే ఈ ఆఫర్ ఉండగా.. ఆ తర్వాత ఏప్రిల్ 15 వరకు దాన్ని పొడిగించిన విషయం తెలిసిందే. దీంతో ఏప్రిల్ 16 నుంచి యథావిధిగా చలాన్ రుసుము వసూలు చేయనున్నారు. ఇప్పటి వరకు 60 శాతం వాహనదారులు చలాన్లు క్లియర్ చేసుకున్నారు. దాదాపు రూ. 250 కోట్లను ఫైన్ల రూపంలో చెల్లించారు. అయితే మరోసారి ఆఫర్ పొడిగింపు ఉండదని పోలీసులు ఇదివరకే స్పష్టం చేశారు. చదవండి: ‘అత్తమామలు ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు.. భర్తతో మాట్లాడనీయడం లేదు’ -
ఆఫర్లో రూ.1,700 లకే ఫోన్!.. ప్రముఖ మొబైల్ కంపెనీ పేరు చెప్పడంతో..
బి.కొత్తకోట : ఓ ప్రముఖ కంపెనీ 500 మందికి ఆఫర్లో మొబైల్ ఫోన్‌ను ఇస్తోందని నమ్మించి పార్శిల్లో సోంపాపిడి పంపిన ఉదంతం బుధవారం జరిగింది. డబ్బు చెల్లించి పార్శిల్ విప్పిచూసిన రైతు మోసపోయి లబోదిబోమంటున్నాడు. బాధిత రైతు కథనం మేరకు వివరాలు..బి.కొత్తకోట మండలం గుట్టపాళ్యంకు చెందిన రైతు రమణారెడ్డికి ఎనిమిదిరోజుల క్రితం బెంగళూరు నుంచి ఫోన్ వచ్చింది. ప్రముఖ మొబైల్ కంపెనీ నుంచి 500 మందికి ఆఫర్లో మొబైల్ ఫోన్లు ఇస్తున్నామని, అందులో మీ పేరుందని చెప్పగా రమణారెడ్డి తిరస్కరించారు. ప్రముఖ మొబైల్ కంపెనీ పేరు చెప్పడంతో ధర ఎంతని అడగ్గా అసలు ధర రూ.7,500 అని ఆఫర్లో రూ.1,700కు ఇస్తున్నట్టు చెప్పి పార్శిల్ పంపారు. కర్ణాటకలోని బెంగళూరు నగరం అలసంద్ర నుంచి బుధవారం గట్టు తపాలా కార్యాలయానికి పార్శిల్ వచ్చింది. ఈ పార్శిల్ తీసుకోవడానికి రమణారెడ్డి వెళ్లగా పోస్ట్‌మాస్టర్ గణేష్‌కు అనుమానం కలిగి పార్శిల్‌ను వెనక్కు పంపుదామని చెప్పాడు. అయితే మొబైల్ వచ్చిందని నమ్మి రమణారెడ్డి పోస్ట్‌మాస్టర్‌కు రూ.1,700 చెల్లించి అక్కడే అందరి సమక్షంలో పార్శిల్ తెరవగా అందులో సోంపాపిడి ప్యాకెట్ ఒకటి మాత్రమే ఉండటంతో మోసపోయినట్టు గుర్తించిన రమణారెడ్డి సంబంధిత ఫోన్ నంబర్‌కు ఫోన్ చేసి విషయం చెప్పినా... మాట్లాడిన మహిళ ఇవేమి వినిపించుకోకుండా పార్శిల్ తీసుకొండంటూ చెప్పింది. ఇలాంటి మోసాలు నిత్యం జరుగుతున్నా అమాయక ప్రజలు మోసపోతున్నారు. (చదవండి: భర్తతో విడాకులు.. 40 ఏళ్ల వ్యక్తితో స్నేహం.. అసలు విషయం తెలిసి..) -
ట్రాఫిక్ చలానా తొందరగా కట్టేయండి.. పొడిగింపు లేదు
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ఈ– లోక్ అదాలత్ గడువుకు మిగిలింది మూడ్రోజులేనని మంగళవారం ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ వెల్లడించారు. శుక్రవారంతో ఇది ముగుస్తుందని, మళ్లీ పొడిగింపునకు అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. గత నెల 1న మొదలై ఈ– లోక్ అదాలత్ 31తో ముగియాల్సి ఉంది. వాహన చోదకుల విజ్ఞప్తుల నేపథ్యంలో మరో పదిహేను రోజులు పొడిగించారు. శుక్రవారం తర్వాత దీని పొడిగింపు ఉండదని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రంగనాథ్ కోరారు. తెలంగాణలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ఈ– చలాన్ జరిమానా బకాయిలు భారీ తగ్గించుకోవడానికి అవకాశం కల్పిస్తున్న ఈ– లోక్ అదాలత్‌కు వాహనదారుల నుంచి అనూహ్య స్పందన లభించింది. దీని గడువు ఏప్రిల్ 15తో ముగియనుంది. (క్లిక్: కింగ్‌కోఠి ప్యాలెస్‌పై రగడ) -
హోం లోన్స్‌పై యాక్సిస్ ఫెస్టివల్ ఆఫర్
న్యూఢిల్లీ: ప్రైవేట్ బ్యాంక్ యాక్సిస్.. దీపావళి పండుగ సందర్భంగా కొన్ని గృహ రుణాల పథకాలపై ప్రత్యేక ఆఫర్లు అందించనుంది. అంతేకాదు ఆన్లైన్ కొనుగోళ్లపై డిస్కౌంట్లు అందిస్తోంది. ఎంపిక చేసిన హోమ్ లోన్ పథకాలపై 12 నెలసరి వాయిదాల (ఈఎంఐ) మినహాయింపుతో బంపరాఫర్ అందించింది. అంతేకాదు టూవీలర్స్‌కు సంబంధించి ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు లేకుండా ఆన్–రోడ్ ఖరీదు మొత్తాన్ని రుణంగా అందిస్తున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. యాక్సిస్ బ్యాంక్ ఈ పండుగ సీజన్‌కు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ‘దిల్ సే ఓపెన్ సెలబ్రేషన్స్: ఎందుకంటే ప్రతి రోజూ దీపావళి రాదు‘ పేరిట యాక్సిస్ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా జరిపే కొనుగోళ్లపై డిస్కౌంట్లు ఇస్తున్నట్లు వివరించింది. 50 నగరాల్లో ఎంపిక చేసిన 2,500 స్థానిక దుకాణాదారుల నుంచి కొనుగోళ్లు జరిపితే 20 శాతం దాకా డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నట్లు, కాబట్టి కస్టమర్లు, యూజర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యాక్సిస్ బ్యాంక్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ హెడ్ సుమిత్ బాలి పిలుపు ఇచ్చారు. చదవండి: యాక్సిస్ బ్యాంకుతో షాపింగ్ చేస్తే 45 శాతం మేర క్యాష్‌బ్యాక్! -
కొత్త కారు కొనేవారికి అదిరిపోయే ఆఫర్
మీరు కొత్త కారు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకోసం అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రముఖ వాహన తయారీ కంపెనీ హ్యుందాయ్ ఇండియా తన మోడళ్లపై అదిరిపోయే డిస్కౌంట్‌ను అందిస్తోంది. దీంతో కారు కొనే వారికి చాలా ఊరట లభించనుంది. హ్యుందాయ్ తన కార్ల అమ్మకాలలో గత నెలలో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ గత నెలలో 51, 600 యూనిట్లను విక్రయించింది. ఇది 2020 ఫిబ్రవరిలో 40,010 యూనిట్ల పోల్చితే 29 శాతం ఎక్కువ. హ్యుందాయ్ కార్లలో క్రెటా, ఐ20 కార్లు ఎక్కువగా అమ్ముడుపోయాయి. గణనీయమైన వృద్ధిని నమోదు చేయడానికి ప్రధాన కారణం తన కార్ల మోడళ్లపై అదిరిపోయే డిస్కౌంట్‌ను అందించడమే. అందుకే ఈ నెలలో కూడా కొన్ని కార్లపై అదిరిపోయే డిస్కౌంట్‌ను అందిస్తోంది. హ్యుందాయ్ కంపెనీ ఎంపిక చేసిన మోడళ్లపై గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు తగ్గింపు అందిస్తోంది. గ్రాండ్ ఐ10 నియోస్, ఎలంట్రా, శాంట్రో, ఆరా, కోనా వంటి మోడళ్లకు ఈ ఆఫర్ వర్తించనుండగా.. మార్చి నెలాఖరు దాకా ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఏ మోడల్ పై ఎంత తగ్గింపు అందించింది క్రింద తెలుసుకోండి. మోడళ్ల వారీగా డిస్కౌంట్: హ్యుందాయ్ కోనా మోడల్ పై రూ.1.5 లక్షల వరకు తగ్గింపు హ్యుందాయ్ ఎలంట్రా మోడల్ పై రూ.1 లక్ష వరకు తగ్గింపు హ్యుందాయ్ ఆరా మోడల్ పై రూ.70 వేలు వరకు తగ్గింపు హ్యుందాయ్ నియోస్ మోడల్ పై రూ.60 వేలు వరకు తగ్గింపు హ్యుందాయ్ శాంట్రో(ఎంట్రీ లెవెల్) మోడల్ పై రూ.50 వేలు వరకు తగ్గింపు -
హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫర్లు.. క్యాలరీలు కరిగిస్తే డిస్కౌంట్
ముంబై: ఆరోగ్యకరమైన, చురుకైన జీవనవిధానాన్ని అనుసరించే పాలసీదారులను ఆరోగ్య బీమా కంపెనీలు ప్రోత్సహిస్తున్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల రెన్యువల్‌పై 80 నుంచి 100 శాతం వరకు తగ్గింపుతోపాటు ఇతర ఆఫర్లను కూడా అందిస్తున్నాయి. సాధారణంగా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఒక పాలసీ ఏడాదిలో ఎటువంటి క్లెయిమ్ లేకపోతే మరుసటి సంవత్సరానికి రెన్యువల్‌పై 25 శాతం నుంచి 50 శాతం వరకు సమ్ అష్యూర్డ్ (బీమా కవరేజీ)ను పెంచే ఆప్షన్‌ను ఇస్తుంటాయి. కానీ, ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ ‘యాక్టివ్ హెల్త్’ ప్లాన్‌లో వరుసగా రెండేళ్ల పాటు ఎటువంటి క్లెయిమ్ లేకపోతే మూడో ఏడాది రెన్యువల్ సమయంలో నూరు శాతం డిస్కౌంట్‌ను ఇస్తోంది. మూడో ఏడాది ప్రీమియం చెల్లింపుల్లో దాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు. తగినన్ని యాక్టివ్ డేజ్‌ను సమకూర్చుకున్న కస్టమర్లకే ఆదిత్య బిర్లా ఈ ఆఫర్ ఇస్తోంది. ఒక యాక్టివ్డే అంటే రోజులో 10,000 అడుగులు వేయడం (300 క్యాలరీలను కరిగించుకోవడం). అంటే క్రమం తప్పకుండా నడు స్తూ, ఆరోగ్య రక్షణ చర్యలను తీసుకున్న వారికి రివార్డులతో ప్రతిఫలాన్ని అందిస్తోంది. యాక్టివ్ హెల్త్ యాప్ ద్వారా కస్టమర్ల ఆరోగ్యకరమైన జీవనశైలిని కంపెనీ నమోదు చేస్తుంటుంది. ఆరోగ్యకరమైన జీవనశైలితో క్లెయిమ్‌లు తగ్గుతాయి. కనుక బీమా సంస్థలపై ఆ మేరకు భారం తగ్గుతుంది. మొదటి అడుగు మాదే.. పాలసీదారులు చురుగ్గా, ఆరోగ్యకరంగా ఉండేందుకు ప్రోత్సహిస్తున్నట్టు ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూ రెన్స్ సీఈవో మయాంక్ భత్వాల్ తెలిపారు. నూరు శాతం డిస్కౌంట్ ఇవ్వడం పరిశ్రమలో మొదటిసారిగా పేర్కొన్నారు. ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చే రివార్డులను ప్రీమియం చెల్లింపు ల్లో సర్దుబాటు చేసుకోవడం లేదా మందుల కొనుగోలు లేదా వ్యాధి నిర్ధారణ పరీక్షలకు చెల్లింపుల కోసం వినియోగించుకోవచ్చు. లేదా వరుసగా రెండేళ్లపాటు క్లెయిమ్‌లు లేకపోతే మూడో ఏడాది నూరు శాతం బీమా కవరేజీని పెంచుకునే ఆప్షన్‌ను కూడా కంపెనీ ఇస్తోంది. ఫ్యూచర్ జనరాలి సైతం.. ఫ్యూచర్ జనరాలి సంస్థ ఈ నెలలోనే ఈ తరహా ఫీచర్‌తో ‘హెల్త్ సూపర్ సేవర్’ ప్లాన్‌ను ప్రారంభించింది. ఇందులో 1ఎక్స్, 2ఎక్స్ పేరుతో రెండు ఆప్షన్లు ఉన్నాయి. 1ఎక్స్‌లో క్రితం ఏడాది పాలసీదారు నుంచి ఎటువంటి క్లెయిమ్ లేకపోతే, మరుసటి ఏడాది రెన్యువల్ ప్రీమియంపై 80 శాతం డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. 2ఎక్స్‌లో క్రితం రెండు సంవత్సరాల్లోనూ క్లెయిమ్‌లే లేనట్టయితే.. తదుపరి రెండు సంవత్సరాల ప్రీమియంలో 80 శాతం తగ్గింపు ఇస్తోంది. -
ఏపీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్
సాక్షి, కడప : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో డాల్పిన్, అమరావతి, ఇంద్ర, సూపర్‌లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సులో ప్రయాణించడానికి 48 గంటల ముందు టిక్కెట్లను రిజర్వు చేసుకుంటే ఛార్జీలో 10 శాతం రాయితీ కల్పించనున్నారు. ఈ విషయాన్ని ఆర్టీసీ సంస్థ రీజినల్ మేనేజర్ జితేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ఈ రాయితీ సౌకర్యం విశాఖపట్టణం, విజయవాడ, హైదరాబాదు, చెన్నై, బెంగళూరు నగరాలకు వెళ్లే ప్రయాణీకులకు మాత్రమే వర్తిస్తుందన్నారు. మాట్లాడుతున్న జితేంద్రనాథ్‌రెడ్డి రాయితీ పొందేందుకు 48 గంటల ముందు రిజర్వు చేసుకోవాలని తెలిపారు. తొలి నాలుగైదు సీట్లకు మాత్రమే రాయితీ ఉంటుందని తెలిపారు. డాల్ఫిన్ బస్సులో 58 సీట్ల కెపాసిటీ ఉంటే ఐదుగురికి, అమరావతి బస్సులో 49 సీట్ల కెపాసిటీ ఉంటే ఐదుగురికి, ఇంద్ర బస్సులో 40 సీట్లు ఉంటే నలుగురు, సూపర్ లగ్జరీలో 35 సీట్లకుగాను నలుగురికి, అల్ట్రా డీలక్స్‌లో 39 సీట్లకుగాను నలుగురు, ఎక్స్‌ప్రెస్ బస్సులో 49 సీట్లు ఉంటే ఐదుగురికి రాయితీ అవకాశం ఉంటుందన్నారు. ఈ అవకాశం మార్చి 31వ తేది వరకు అమలులో ఉంటుందని ఆయన వివరించారు. చదవండి: తిరుపతి సర్వీసుల్లో శీఘ్రదర్శనం టికెట్లు -
ఫ్లిప్‌కార్ట్ సేల్ : బంపర్ ఆఫర్లు
సాక్షి, ముంబై: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రకటించింది. నేడు (ఆగస్టు 6) నుంచి ఈ సేల్ 5 రోజుల పాటు కొనసాగి ఆగస్టు 10న ముగుస్తుంది. స్మార్ట్ఫోన్లు, ఇతర గాడ్జెట్లు, ఎలక్ట్రానిక్స్ , ఫ్యాషన్ ఉత్పత్తులపై అతిపెద్ద డిస్కౌంట్లను అందిస్తోంది. సిటీ క్రెడిట్, డెబిట్ కార్డులపై అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. (అమెజాన్ ప్రైమ్ డే సేల్ : భారీ డిస్కౌంట్లు) అమేజింగ్ డీల్స్ ఐఫోన్ ఎస్ఈ 2020 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ 5,501 రూపాయల ధర తగ్గింపుతో 36,999 రూపాయలకు కొనుగోలుచేయవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా సిటీబ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ కొనుగోళ్లపై 1,500 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ఐఫోన్ ఎస్ఈ 128జీబీ స్టోరేజ్ మోడల్ 41,999 కు లభ్యం. అసలు 47,800 రూపాయలు 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను 51,999 రూపాయలకు అందిస్తోంది. అసలు ధర రూ. 58.300. ఈ రెండు మోడళ్లపై క్రెడిట్ / డెబిట్ కార్డు ద్వారా రూ .1,500 డిస్కౌంట్ అదనం. ఐఫోన్ ఎక్స్ ఆర్ 44,999 రూపాయలకే లభ్యం. ఎంఆర్పీ 52,500 రూపాయలు. ఎల్జీ వీ 30 ప్లస్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ అమ్మకంలో 19,999 రూపాయలకే అందిస్తోంది. ఎంఆర్పీ రూ .60,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్ మరో 13,650 రూపాయలు తగ్గింపు. -
అజియో బిగ్ బోల్డ్ సేల్ షురూ
ముంబై : ప్రముఖ ఆన్లైన్ ఫ్యాషన్ ఈ-రిటైలర్ అజియో.కాం ఈనెల 11 నుంచి 15 వరకూ ‘బిగ్ బోల్డ్ సేల్’ ను ప్రకటించింది. స్టైల్, కమ్ఫర్ట్ను కోరుకునే కస్టమర్లందరికీ బోల్డ్ స్టైల్స్‌ను భారీ డిస్కౌంట్లతో బిగ్ బోల్డ్ సేల్ అందుబాటులోకి తీసుకువచ్చింది. 2000కు పైగా బ్రాండ్స్ నుంచి 2,00,000 స్టైల్స్ ఇంతకుముందెన్నడూ లేని డిస్కౌంట్ ఆఫర్లతో సేల్‌లో సిద్ధంగా ఉన్నాయని అజియో.కాం వెల్లడించింది. నైక్, ప్యూమా, అదిదాస్, లెవీస్ వంటి దిగ్గజ బ్రాండ్లు అజియో బిగ్ బోల్డ్ సేల్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఇక 50 నుంచి 90 శాతం వరకూ డిస్కౌంట్లతో పాటు టీ షర్ట్స్, జీన్స్, కుర్తాలపై ఆకర్షణీయ ఫ్లాష్ డీల్స్ ఉంటాయని వెల్లడించింది. సేల్‌లో భాగంగా పలు అంతర్జాతీయ బ్రాండ్లను లాంఛ్ చేస్తామని పేర్కొంది. 2016లో డౌట్ ఈజ్ ఔట్ అంటూ ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన అజియో ప్రపంచ ఫ్యాషన్ పోకడలకు పర్యాయపదంగా నిలిచింది. చదవండి : లాక్మే ఫ్యాషన్ వీక్‌లో మెరిసిన ‘రకుల్’ -
ఇండిగో డిస్కౌంట్ ధరలు
సాక్షి, ముంబై: బడ్జెట్ ధరల విమానయానసంస్థ ఇండిగో అంతర్జాతీయ విమాన ప్రయాణీకులకు తక్కువ ధరల్లో విమాన టికెట్ల సేల్‌ను ప్రకటించింది. ఇంటీవల వాలెంటైన్స్‌డే సేల్ ను ప్రకటించిన ఇండిగోతాజాగా అంతర్జాతీయ రూట్లలో డిస్కౌంట్ సేల్‌ను ప్రారంభించింది. నాలుగు రోజుల అమ్మకాన్ని మంగళవారం ప్రారంభించినట్లు ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. నేటి (ఫిబ్రవరి 18, 2020) నుంచి ఫిబ్రవరి 21 వరకు సేల్ అందుబాటులో వుంటుంది. అన్నిచార్జీలు కలిపి ఈ డిస్కౌంట్ టికెట్లను వినియోగదారులకు అందిస్తోంది. ఈ తగ్గింపు ధరలు రూ. 3499 రూపాయల నుండి ప్రారంభం. ఇలా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా అంతర్జాతీయ విమానాలలో మార్చి 1 నుండి సెప్టెంబర్ 30 వరకు ప్రయాణ కాలానికి వినియోగించుకోవచ్చు. ఈ సేల్ లో మొత్తం 2.5 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయని ఎయిర్‌లైన్స్ తెలిపింది. -
గృహ రుణంలోనూ కలసికట్టుగా...
ఈ రోజుల్లో భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తేనేకానీ నగరాల్లో జీవనశైలికి అనుగుణంగా బతుకుబండి నడిచే పరిస్థితులు లేవు. అలాంటిది... ఇల్లు సమకూర్చుకోవడం ఎంత పెద్ద ప్రహసనమో చెప్పనక్కర్లేదు!! అయితే, గృహ రుణం ఒక్కరి పేరుతో తీసుకునేకంటే దంపతులు కలసి తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయనేది నిపుణుల మాట. అధిక మొత్తంలో రుణం సమకూరడమేకాదు, పన్ను ప్రయోజనాలు... తక్కువ నెలవారీ వాయిదా(ఈఎంఐ) వంటి లాభాలెన్నో జాయింట్ హోమ్‌లోన్‌తో పొందొచ్చు. కొత్తింటి ప్రణాళికల్లో ఉన్నవారికి ఉమ్మడి గృహ రుణంపై అవగాహన కల్పించే కథనమిది... శ్రీనివాస కుమార్ (40) సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆయన శ్రీమతి సుమలత (37) కూడా ప్రైవేటు రంగంలో ఉద్యోగం చేస్తున్నారు. వీరు 2013లో జాయింట్ హోమ్ లోన్ (ఉమ్మడిగా గృహ రుణం)ను ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ నుంచి తీసుకున్నారు. ఇలా కలసి తీసుకోవడానికి కారణం జాయింట్ లోన్‌పై వడ్డీ రేటు తక్కువగా ఆఫర్ చేయడమే. రూ.44 లక్షల రుణం తీసుకున్నారు. వడ్డీ రేటు నాడు 9.5 శాతంగా ఉంటే, శ్రీనివాస కుమార్ దంపతులకు ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ 10 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేసింది. పైగా ఉమ్మడిగా దరఖాస్తు చేసుకోవడం వల్ల రుణ అర్హత అధికంగా ఉంటుంది. రుణంపై తక్కువ వడ్డీ రేటుకు తోడు, అర్హత మెరుగ్గా ఉండడమే తాము జాయింట్లోన్ తీసుకోవడానికి కారణాలుగా శ్రీనివాస్ కుమార్ వెల్లడించారు. జాయింట్ లోన్ ద్వారా మంచి ప్రాంతంలో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసుకునేందుకు వీలు పడుతుంది. బడ్జెట్ ఎక్కువైనా కానీ, ఇద్దరు పేరిట రుణం తీసుకుంటున్నారు కనుక అధిక అర్హతలతో బ్యాంకు కూడా ఎక్కువే ఆఫర్ చేస్తుంది. దంపతులు ఇద్దరూ ఉద్యోగులైనా లేదా ఆర్జనా పరులైతే, కలసి ఉమ్మడి రుణం తీసుకోవడం వల్ల ఎంతో లాభం ఉంటుందని ఆర్థిక నిపుణుల విశ్లేషణ. మీరు నవ దంపతులు అయి ఉండి, ఇద్దరూ ఆర్జనా పరులైతే కలసి గృహ రుణం తీసుకునే ఆలోచన తప్పకుండా చేయవచ్చు. ‘‘రియల్ ఎస్టేట్ కొనుగోలు అధిక వ్యయంతో కూడుకుని ఉంటుంది. దీంతో సొంతింటి కల అన్నది ఒక్కరే ఆర్జనా పరులున్న కుటుంబానికి అంత సులభం కాకపోవచ్చు. అటువంటి సందర్భాల్లో జీవిత భాగస్వామి సహ రుణ గ్రహీతగా చేరడం వల్ల ఇద్దరి ఆర్జనను కలపడం, ఇద్దరి క్రెడిట్ స్కోరుతో మరింత మొత్తం గృహ రుణాన్ని తక్కువ వడ్డీ రేటుకే సొంతం చేసుకోవచ్చు’’ అని బ్యాంకు బజార్ సీఈవో ఆదిల్‌శెట్టి పేర్కొన్నారు. కలసి తీసుకోవడం వల్ల ప్రయోజనాలను పరిశీలించినట్టయితే... భారీ మొత్తంలో రుణం ఇద్దరు కలసి ఉమ్మడిగా రుణానికి దరఖాస్తు చేసుకోవడం ద్వారా అర్హత ఎక్కువగా ఉంటుంది. దీంతో భార్యాభర్తల ఆదాయాన్ని కలిపి చూసి బ్యాంకు పెద్ద మొత్తంలో రుణాన్ని ఆఫర్ చేస్తుంది. ఉదాహరణకు మీరు రూ.కోటి విలువైన ఇంటిని కొనుగోలు చేయాలని భావిస్తే.. అందుకు మీ వంతు డౌన్ పేమెంట్ 20 శాతం (రూ.20లక్షలు) పోను మరో రూ.80 లక్షలను 20 ఏళ్ల కాలానికి రుణంగా తీసుకోవాల్సి ఉంటుందని అనుకుంటే, అప్పుడు 8.5 శాతం వడ్డీ రేటు ఆధారంగా ప్రతీ నెలా చెల్లించాల్సిన ఈఎంఐ రూ.70,000 అవుతుంది. సాధారణంగా రుణగ్రహీత ప్రతీ నెలా నికరంగా అందుకునే వేతనంలో గరిష్టంగా 50 శాతం వరకూ ఈఎంఐ కింద బ్యాంకులు అనుమతిస్తుంటాయి. దీని ప్రకారం రూ.80 లక్షల గృహ రుణం తీసుకోవాలంటే, ప్రతీ నెలా నికరంగా రూ.1.4 లక్షలను అందుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ జీవిత భాగస్వామి కూడా ఆర్జిస్తున్నట్టు అయితే.. ఇద్దరూ కలసి ఈ మొత్తాన్ని చెల్లించే శక్తి కలిగి ఉంటే సరిపోతుంది. ఇంకా ఎక్కువే చెల్లించే సామర్థ్యం ఉంటే మరింత సౌకర్యవంతమైన, విలాసవంతమైన ఇంటి కోసం ఇంకా అధిక రుణం తీసుకునేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. వేగంగా చెల్లింపులు ఇద్దరు కలసి రుణం తీసుకుంటే, తిరిగి చెల్లించడం సులభం కావడమే కాకుండా, వేగంగా దాన్ని తీర్చేయవచ్చు. వార్షికంగా వచ్చే బోనస్‌లు, పనితీరు ఆధారంగా వచ్చే పారితోషికాన్ని ఇలా గృహ రుణం తీర్చేందుకు వినియోగించినా వాస్తవ కాల వ్యవధి కంటే ముందే గృహ రుణం ముగిసిపోతుంది. ఎందుకంటే చెల్లింపులపై ఎటువంటి నియంత్రణలు ఉండవు. దీనివల్ల వడ్డీ భారం కూడా తగ్గిపోతుంది. రిజిస్ట్రేషన్ వ్యయం తక్కువ కొన్ని బ్యాంకులు మహిళా రుణ గ్రహీతలకు తక్కువ వడ్డీకే గృహ రుణాలను ఆఫర్ చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే మహిళలకు ఇల్లు/ఫ్లాట్ రిజిస్ట్రేషన్‌పై స్టాంప్ డ్యూటీ తక్కువగా అమల్లో ఉంది. ‘‘ఉమ్మడి గృహ రుణంలో ప్రధాన దరఖాస్తు దారుగా భార్య ఉంటే వ్యయాలను తగ్గించుకోవచ్చు. గృహ రుణంపై తక్కువ వడ్డీ రేటుకు తోడు, రిజిష్ట్రేషన్ చార్జీలో తగ్గింపు ప్రయోజనాలను అందుకోవచ్చు’’ అ ని మైమనీమంత్రా డాట్ కామ్ ఎండీ రాజ్ ఖోస్లా చెప్పారు. క్రెడిట్ స్కోరుపై ప్రభావం ఉమ్మడిగా రుణం తీసుకుంటే దంపతులిద్దరిపై సమానంగా చెల్లింపుల భాధ్య త ఉంటుంది. ఏదైనా కారణం వల్ల ఒకరు ఉద్యోగం కోల్పోతే ఆ మేరకు గృహ రుణ ఈఎంఐ చెల్లింపులో నెలసరి వాటా అందకపోవచ్చు. ఈ కారణంగా ఈఎంఐ చెల్లింపులో వైఫల్యం చెందితే అప్పుడు ఇద్దరి క్రెడిట్ స్కోరుపైనా ప్రతికూల ప్రభావం పడుతుంది. ‘‘తిరిగి చెల్లింపుల బాధ్యత దంపతులపై పూర్తిగా ఉంటుంది. ఒక్కరు చెల్లింపుల్లో వైఫల్యం చెందినా ఇద్దరి క్రెడిట్ స్కోరుపై ప్రభావం పడుతుంది’’ అని ఆదిల్‌శెట్టి తెలిపారు. పన్ను ప్రయోజనాలు ఉమ్మడిగా గృహ రుణం తీసుకోవడం వల్ల అధిక పన్ను ప్రయోజనం కూడా లభిస్తుంది. దంపతులు ఉమ్మడిగా రూ.7 లక్షల వరకు పన్ను ప్రయోజనాన్ని పొందొచ్చు. సెక్షన్ 80సీ కింద చెరో రూ.1.5 లక్షల చొప్పున రూ.3లక్షలు, సెక్షన్ 24(బి) కింద రూ.4లక్షల వడ్డీపై (చెరో రూ.2లక్షలు) పన్ను ప్రయోజనం లభిస్తుంది. మధ్యాదాయ వర్గాల నుంచి కొంచెం అధిక ఆర్జనా పరులకు ఈ మేరకు పన్ను ఆదా రూపంలో గణనీయంగానే మిగులుతుంది. వీటిని అనుసరిస్తే మేలు.. రుణాన్ని తిరిగి చెల్లించాల్సిన కాల వ్యవధిలో ఇంటి యజమాని మరణిస్తే న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు విల్లు రాసుకోవడం మంచిది. ఇక వైవాహిక జీవితం నూటికి నూరు పాళ్లు కలసి సాగుతుందని నేటి రోజుల్లో చెప్పడం కష్టమే. కనుక ఉమ్మడిగా గృహ రుణానికి వెళ్లే దంపతులు.. ఇంటిలో వాటా, తిరిగి రుణానికి చేయాల్సిన చెల్లింపులు, ఇతర అంశాలపై స్పష్టమైన ఒప్పందం చేసుకోవడం ఇంకా మంచిది. దీనివల్ల భవిష్యత్తులో ఒకవేళ ఇద్దరూ విడిపోవాల్సి వస్తే ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఇక గృహ రుణం తీసుకునే సమయంలోనే రుణానికి సరిపడా కవరేజీతో టర్మ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవడం తప్పనిసరిగా చేయాల్సినది. రుణ గ్రహీతకు ఏదైనా జరిగితే, కుటుంబంపై రుణ చెల్లింపుల బాధ్యతలు పడకుండా ఉండేందుకు ఇది సాయపడుతుంది. ముఖ్యంగా ఉమ్మడి గృహ రుణ గ్రహీతల్లో ఒకరు మరణించడం వల్ల మరొకరిపై చెల్లింపుల బాధ్యత పడకుండా ఈ టర్మ్‌ప్లాన్ ఆదుకుంటుంది. విడాకులు, మరణం... దంపతులు ఉమ్మడిగా గృహ రుణం తీసుకున్న తర్వాత జీవితంలో ఇకమీదట కలసి సాగకూడదని విడాకులకు వెళితే పరిస్థితి ఏమిటి..? గృహ రుణాన్ని తిరిగి చెల్లించడం తప్పనిసరి. కాకపోతే ఇందుకు మార్గాన్ని వారే అన్వేషించుకోవాలి. ‘‘బ్యాంకు తన బకాయిలను వసూలు చేసుకునేందుకు చర్యలు చేపడుతుంది. అవసరమైతే న్యాయపరమైన చర్యలనూ చేపట్టవచ్చు. అందుకని భవిష్యత్తులో విడిపోవాల్సి వస్తే గృహ రుణ చెల్లింపుల విషయంలో ఏ విధంగా వ్యవహరించాలనే దానిపై దంపతులు ముందుగానే ఓ స్పష్టమైన అంగీకారానికి రావడం మంచిది’’ అని ఆదిల్‌శెట్టి సూచించారు. ఇక దురదృష్టవశాత్తూ ఉమ్మడి గృహ రుణం తీసుకున్న తర్వాత దంపతుల్లో ఒకరు మరణించినట్టయితే అప్పుడు చెల్లింపుల బాధ్యత పూర్తిగా రెండోవారిపై పడుతుంది. -
ఆడికార్లపై కళ్లు చెదిరే ఆఫర్..
జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రముఖ ఎస్‌యూవీలపై రూ. 6లక్షల దాకా భారీ తగ్గింపును ఆఫర్ చేస్తోంది. పరిమిత కాల ఆఫర్‌గా ఈ డిస్కౌంట్‌ను అందిస్తున్నట్టు ఆడి ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. 'లిమిటెడ్ పీరియడ్ సెలబ్రేటరీ ప్రైస్' ఆఫర్‌లోభాగంగా ఐకానిక్ మోడల్స్‌పై ఈ తగ్గింపును అందిస్తోంది. ఆడి పోర్ట్‌ఫోలియో నుండి బాగా ప్రాచుర్యం పొందిన ఈ రెండు మోడళ్లు భారతదేశంలో లాంచ్ చేసి దశాబ్దం పూర్తి కావడంతో, ఆడి కార్లను ప్రేమించే కస్టమర్లకు ప్రత్యేక ధరల బహుమతి ఇవ్వాలనుకుంటున్నామని తెలిపింది. 2009 లో ఇండియాలో లాంచ్ చేసిన పాపులర్ క్యూ 5, క్యూ 7 ఎస్‌యూవీల ధరలను రూ .6.02 లక్షల వరకు తగ్గించింది. ఆఫర్ కింద, పెట్రోల్, డీజిల్ ఆప్షన్లలోని ఆడి క్యూ 5 ప్రస్తుత ధర రూ .55.8 లక్షలు. ఆఫర్ కింద రూ .49.99 లక్షలకే లభ్యం. తగ్గింపు రూ. 5.81 లక్షలు క్యూ 7 పెట్రోల్ వెర్షన్ ధర ప్రస్తుతం రూ .73.82 లక్షలతో పోలిస్తే రూ .4.83 తగ్గింపుతో రూ .68.99 లక్షలకు లభ్యం. క్యూ 7 డీజిల్ ఆప్షన్ కారును రూ .71.99 లక్షలకు అందుబాటులో ఉంచింది. అసలు ధర ధర రూ .78.01 లక్షలు. తగ్గింపు రూ .6.02 లక్షలు ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ మాట్లాడుతూ, 2009 లో భారతదేశంలో మార్కెట్ ప్రవేశపెట్టినప్పటి నుండి, క్యూ 5, క్యూ 7 కార్లు బహుళ ప్రజాదరణ పొందాయనీ, ప్రధానంగా ఇండియలో ఆడి బ్రాండ్ విజయానికి ఇవి మార్గం సుగమం చేశాయని పేర్కొన్నారు. ఆఫర్ శుక్రవారం ప్రారంభం కాగా స్టాక్ కొనసాగే వరకు కొనసాగుతుందని ఆడి తెలిపింది. -
రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్..
న్యూఢిల్లీ : శతాబ్ధి, తేజాస్, ఇంటర్సిటీ వంటి పలు ట్రైన్లలో ఖాళీగా ఉన్న సీట్లకు 25 శాతం వరకూ డిస్కౌంట్ ఆఫర్ చేయాలని రైల్వేలు నిర్ణయించాయి. ఏసీ చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ సదుపాయం ఉన్న అన్ని రైళ్లలో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఆయా రైళ్లలో సీట్ల భర్తీతో పాటు రోడ్డు రవాణా, చౌక విమాన ప్రయాణం నుంచి ఎదురవుతున్న పోటీకి చెక్ పెట్టేందుకు ఈ పథకాన్ని రైల్వేలు ముందుకు తెచ్చాయి. ఈ స్కీంలో భాగంగా టిక్కెట్ బేస్ ధరపై 25 శాతం వరకూ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తారు. డిస్కాంట్ ధరకు రిజర్వేషన్ ఫీజు, సూపర్‌ఫాస్ట్ చార్జ్, జీఎస్టీలు అదనం. గత ఏడాది 50 శాతం కన్నా తక్కువ ఆక్యుపెన్సీ కలిగిన రైళ్లలో ఈ డిస్కౌంట్ ఆఫర్ వర్తింపచేయనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ ఆఫర్‌ను ఏడాది పొడవునా లేదా సంవత్సరంలో ఒక నెల, లేనిపక్షంలో వారాంతాల్లో అమలు చేయాలా అనే దానిపై రైల్వే మంత్రిత్వ శాఖ కసరత్తు చేపడుతోంది. -
మంత్ ఎండ్ సేల్ : ఐఫోన్‌పై రూ.25వేలు తగ్గింపు
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ వివిధ మొబైల్ ఫోన్స్ భారీ ఆఫర్లను ప్రకటించింది. మంత్ ఎండ్ మొబైల్స్ ఫెస్ట్ సేల్ పేరుతో ఐ ఫోన్, నోకియా, హానర్ బ్రాండ్స్ స్మార్ట్ఫోన్లను తగ్గింపు ధరల్లో అందుబాటులోకి తెచ్చింది. మే 31 వరకు సేల్ నిర్వహిస్తోంది. బిగ్ షాపింగ్ సేల్ మిస్ అయినవారికి ఈ మంత్ ఎండ్‌సేల్ ఉపయోగపడుతుందని ఫ్లిప్‌కార్ట్ భావిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లు వారి డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ద్వారా నిర్వహించే ఈఎంఐ లావాదేవీలపై 5 శాతం తక్షణ డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే రెగ్యులర్ డిస్కౌంట్‌తోపాటు ఎక్స్చేంజ్ ఆఫర్ సదుపాయం కూడా ఉంది. కేవలం రూ.99కే మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్ పొందొచ్చు. నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యం ఉంది. ఆపిల్ ఐఫోన్ ఎక్స్ (64జీబీ స్టోరేజ్) : రూ.66,499కు కొనుగోలు చేయవచ్చు. అసలు ధర రూ.91,900. సుమారు రూ.25 వేల భారీ తగ్గింపు నోకియా 5.1 ప్లస్ : (3 జీబీ ర్యామ్/32 జీబీ స్టోరేజ్) ధర రూ.8,199కే అందుబాటులో ఉంది. అసలు ధర. 13,199 నోకియా 6.1 : రూ.12,999. అసలు ధర రూ.17,600 హానర్ 9ఎన్ : ధర రూ.8,499. అసలు ధర. 13,999 హానర్ 10 లైట్ (4 జీబీ ర్యామ్/64 జీబీ మెమరీ) : రూ.11,999, అసలు ధర రూ. 16, 999 ఎంఐ ఏ2 ఫోన్‌ను రూ.9,999 ప్రారంభ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇంకా శాంసంగ్ గెలాక్సీ నోట్ 8 రూ. 36,990 (రూ.74,000) అలాగే గెలాక్సీ ఎ 20పై 1500 రూపాయల ఎక్స్చేంజ్ ఆఫర్. -
సగం ధరకే విమాన టికెట్లు
సాక్షి, ముంబై : ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ప్రైవేటురంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ మరోసారి డిస్కౌంట్ ధరల్లో విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో 50శాతం దాకా డిస్కౌంట్ అందిస్తోంది. దాదాపు సగం ధరకే టిక్కెట్‌ను ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 25 వరకు ఈ డిస్కౌంట్ ధరలు అందుబాటులో ఉంటాయి. ప్రీమియం, ఎకానమి క్లాస్ సీట్లకు కూడా ఈ తగ్గింపు ధరలు వర్తించనున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్ కింద బుకింగ్ చేసుకున్న అంతర్జాతీయ ప్రయాణికులు ఈ నెల 21 నుంచి, దేశీయ ప్రయాణికులు మార్చి1 నుంచి ప్రయాణం చేయవచ్చునని వెల్లడించింది. అలాగే ప్రయాణానికి ఎనిమిది రోజుల ముందు కచ్చితంగా టిక్కెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. -
ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు
సాక్షి, న్యూఢిల్లీ : ఫ్లిప్‌కార్ట్ మరోసారి 'మొబైల్స్ బొనాంజా సేల్' ను ప్రకటించింది . అయిదు రోజుల పాటు ఈ సేల్ నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 19 నుంచి 23 వరకు నిర్వహించే సేల్‌లో భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ముఖ్యంగా షావోమీ, రియల్మీ,ఆసుస్, హానర్, మోటోరోలా, వివో, నోకియా లాంటి బ్రాండ్ల స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్లున్నాయి. అలాగే యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై 10 శాతం అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది. దీంతోపాటు పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్, ప్రీపెయిడ్ పేమెంట్స్‌పై లాంటి ఆఫర్లు కూడా ఉన్నాయి. పోకో ఎఫ్1 6జీబీ, 64జీబీ స్టోరేజ్ రూ.17,999 లకే అందిస్తోంది. ఎంఆర్పీ రూ.19,999. దీంతోపాటు రూ.3,000 ఎక్స్ఛంజ్‌ఆఫర్ కూడా ఉంది. పోకో ఎఫ్1 6జీబీ,128జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ.20,999కు లభ్యం రియల్ మి 2 ప్రొ 4జీబీ, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.11,990 కు లభిస్తోంది. ప్రస్తుత ధర- రూ.12,990 రెడ్మి నోట్ 6 ప్రొ 4జీబీ, 64జబీ స్టోరేజ్ : రూ.12,999 లభ్యం. ప్రస్తుత ధర- రూ.13,999 ఆసుస్ జెన్ ఫోన్ మాక్స్ ప్రొ ఎం1, 3జీబీ, 32జీబీ స్టోరేజ్ ఆసుస్ జెన్‌ఫోన్ మాక్స్‌ప్రొ ఎం2 4జీబీ, 64జీబీ రూ.11,999కే లభిస్తోంది. ప్రస్తుత ధర- రూ.14,999, హానర్ 9ఎన్ 4జీబీ, 64జీబీ స్టోరేజ్ రూ. రూ.8,499 లభ్యం. వివో వి9 ప్రొ 4జీబీ, 64జీబీ స్టోరేజ్ రూ.12,490. 2వేల రూపాయలు డిస్కౌంట్. మోటరోలా వన్‌పవర్ 4జీబీ, 64జీబీ స్టోరేజ్ రూ.13,999 లభ్యం. -
రూ.399 లకే విమాన టికెట్
సాక్షి,న్యూఢిల్లీ: బడ్జెట్ క్యారియర్ ఎయిర్ ఏసియా ప్రమోషనల్ ఆఫర్‌గా అతి తక్కువ ధరకే విమాన టికెట్లను అందిస్తోంది. రూ.399 లకే విమాన టికెట్లు అందిస్తోంది. నవంబరు 18 దాకా ఈ ఆఫర్లో టికెట్లను బుక్ చేసుకునే అవకాశం. ఇలా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా మే 6, 2019 నుంచి ఫిబ్రవరి 4, 2020 వరకు ప్రయాణించే అవకాశం ఉంది. వన్‌వేలో దేశీయంగా రూ.399, అంతర్జాతీయ మార్గాల్లో 1999 రూపాయలకే టికెట్లను ఆఫర్ చేస్తోంది. అయితే ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్లో టికెట్లను బుక్ చేసుకునే అవకాశం. హైదరాబాద్, విశాఖపట్నం తోపాటు, బాగ్దోగ్రా, బెంగళూరు, భువనేశ్వర్, గోవా, గువహటి, ఇంఫాల్, ఇండోర్, జైపూర్, కొచ్చి, కోలకతా, న్యూఢిల్లీ, పుణ్, రాంచీ, శ్రీనగర్ నగరాలకు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఎయిర్ ఏసియా వెబ్సైట్, లేదా యాప్ ద్వారా టికెట్ బుకింగ్ సదుపాయం లభ్యం. అయితే బిగ్ లాయల్టీ ప్రోగ్రాంలోని ‘బిగ్ మెంబర్స్’ కు మాత్రమే ఈ ఆఫర్‌ను దక్కించుకునే అదృష్టాన్ని కల్పించింది. ఎయిర్ ఏసియా వెబ్సైట్ సమాచారం ప్రకారం, ఇండోర్-హైదరాబాద్, రాంచి- కోలకతా మార్గాల్లో రూ .399గా టికెట్ లభ్యమవుతోంది. వివిధ మార్గాల్లో టికెట్ల ప్రారంభ ధరలు ఈ విధంగా ఉండనున్నాయి. బెంగళూరు-హైదరాబాద్ : రూ. 500 బెంగళూరు-విశాఖపట్నం : రూ. 999 కోలకతా-రాంచీ : రూ. 967 బెంగళూరు-భువనేశ్వర్ : రూ .1,399 బెంగళూరు-కొచ్చి : రూ. 500 బెంగళూరు-చెన్నై: రూ. 500 ఇక అంతర్జాతీయ మార్గాల విషయానికి వస్తే.. భువనేశ్వర్- కౌలాలంపూర్ మధ్య రూ .1999 ప్రారంభ ధరగా ఉంది. కాగా ప్రపంచవ్యాప్తంగా తమ బిగ్ సభ్యులు 20 మిలియన్ల మార్క్‌ను చేరుకున్నారని, ఆగస్టు 29న విడుదల చేసిన ఒక ప్రకటనలో ఎయిర్ ఏసియా వెల్లడించింది. టాటాసన్స్ , మలేసియా ఎయిర్‌లైన్స్ జాయింట్ వెంచర్ సంస్థ అయిన ఎయిర్ ఏసియా 25 దేశాల్లో 165 ప్రదేశాలకు సర్వీసులను నిర్వహిస్తోంది. -
రూ.399 ప్లాన్‌పై 300 రూపాయల డిస్కౌంట్
బెస్ట్ పోస్ట్ పెయిడ్ ప్లాన్లను ఆఫర్ చేయడంలో భారతీ ఎయిర్టెల్ ఎల్లప్పుడు ముందు ఉంటుంది. కానీ ఎంట్రీ లెవల్ పోస్ట్ పెయిడ్ ప్లాన్ల విషయంలో మాత్రం ఈ కంపెనీ, వొడాఫోన్ కంటే వెనుకంజలోనే ఉంది. వొడాఫోన్ రెడ్ రేంజ్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ 299 రూపాయల నుంచి ప్రారంభమవుతుంటే, భారతీ ఎయిర్టెల్ మైప్లాన్ ఇన్ఫినిటీ ప్లాన్‌ను 399 రూపాయలకు ఆఫర్ చేస్తుంది. ఈ నేపథ్యంలో భారతీ ఎయిర్టెల్ తన రూ.399 ప్లాన్‌పై డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. 399 రూపాయల ప్లాన్‌పై 300 రూపాయల డిస్కౌంట్‌ను అందించనున్నట్టు పేర్కొంది. 50 రూపాయల చొప్పున ఈ డిస్కౌంట్‌ను ఆరు నెలల పాటు ఆఫర్ చేయనుంది. అంటే మొత్తంగా రూ.300 డిస్కౌంట్ లభించనుంది. దీంతో తర్వాత ఆరు నెలలు రూ.399 ప్లాన్ ధర రూ.349కు తగ్గనుంది. అయితే అదనపు పన్నులతో మాత్రం దీని ధర రూ.385గా ఉండనుందని ఎయిర్టెల్ చెప్పింది. ఎయిర్టెల్ రూ.399 పోస్ట్ పెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు.... ఈ ప్లాన్ కింద నెలకు 20 జీబీ డేటా పొందనున్నారు. డేటా క్యారీ ఫార్వర్డ్ ఫెసిలిటీని ఎయిర్టెల్ ఆఫర్చేస్తోంది. ఎలాంటి ఎఫ్‌యూపీ పరిమితులు లేకుండా అపరిమిత వాయిస్ కాల్స్‌ను ఇది అందిస్తోంది. రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభ్యం కానున్నాయి. అదనంగా ఎయిర్టెల్ టీవీ, వింక్ మ్యూజిక్ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను ఎయిర్టెల్ ఆఫర్చేస్తుంది. కానీ యూజర్లు అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌కు అర్హులు కారు. వొడాఫోన్ మాదిరి ఆఫర్ చేసేందుకు ఎయిర్టెల్ అదనంగా ప్రతి నెల 20 జీబీ డేటాను 12 నెలల పాటు అందిస్తుంది. దీంతో మొత్తంగా ఎయిర్టెల్ యూజర్లు 40జీబీ డేటా పొందుతారు. -
ట్రైన్ టిక్కెట్లపై ఐఆర్సీటీసీ డిస్కౌంట్ ఆఫర్
న్యూఢిల్లీ : ట్రైన్ జర్నీ చేయాలని ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ఇదే సరియైన సమయమట. తన అధికారిక వెబ్సైట్ www.irctc.co.in ద్వారా రైల్వే టిక్కెట్లను బుక్ చేసుకునే వారికి అమేజింగ్ డిస్కౌంట్లను దేశీయ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం లిమిటెడ్ ఆఫర్(ఐఆర్సీటీసీ) చేస్తుంది. పేటీఎం, మొబిక్విక్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకునే వారికే ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని ఐఆర్సీటీసీ తెలిపింది. పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఐఆర్సీటీసీ ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది. చివరి నిమిషంలో టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా.. అడ్వాన్స్‌గా బుక్ చేసుకునేలా డిస్కౌంట్లను ప్రవేశపెట్టింది. మొబిక్విక్ ద్వారా రైల్వే టిక్కెట్ బుకింగ్ పేమెంట్లు జరిపే వారికి 10 శాతం డిస్కౌంట్ లభించనుంది. తన ప్లాట్‌ఫామ్‌పై టిక్కెట్ బుకింగ్స్ జరిపే వారికి 100 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్ చేయనున్నట్టు పేటీఎం తెలిపింది. ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ఫోన్‌పే కూడా 100 రూపాయల క్యాష్‌బ్యాక్ ఇస్తోంది. డిస్కౌంట్ ఆఫర్ పొందడమెలా... ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్ www.irctc.co.inకు వెళ్లాలి. యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి. మీ ప్రయాణ వివరాలు నమోదు చేయాలి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి, పేమెంట్ ప్రొసీడ్‌పై క్లిక్ చేయాలి. పేమెంట్ మోడ్‌లో, ఈ-వాలెట్ ఆప్షన్లను ఎంచుకోవాలి. వాలెంట్ కేటగిరీలో పేటీఎం, ఫ్రీఛార్జ్, మొబిక్విక్ ఎంచుకోవాలి. వీటికి ఐఆర్సీటీసీ ఆఫర్ వర్తిస్తుంది. -
గెలాక్సీ నోట్ 9పై కళ్లు చెదిరే డిస్కౌంట్
అదిరిపోయే ఫీచర్లతో, ఆకర్షణీయమైన రూపురేఖలతో శాంసంగ్ తన కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ నోట్ 9ను గత వారమే మార్కెట్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. న్యూయార్క్‌లో జరిగిన ఈవెంట్లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ బిగ్-స్క్రీన్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్లు భారత్‌లో ప్రారంభమయ్యాయి. అద్భుతంగా రూపుదిద్దుకున్న ఈ గెలాక్సీను కొనుగోలు చేయాలని భావించే వారికి, ఈ డివైజ్ ప్రీ-ఆర్డర్లపైనే పేటీఎం మాల్ కోంబో డీల్‌ను ప్రకటించింది. శాంసంగ్ గెలాక్సీ నోట్ 9పై ఫ్లాట్ 6000 రూపాయల డిస్కౌంట్‌ను ఆఫర్ చేసింది. ఈ డిస్కౌంట్ పేటీఎం వాలెట్లలో క్యాష్‌బ్యాక్ రూపంలో కస్టమర్లు పొందనున్నారు. డివైజ్ కస్టమర్ వద్దకు చేరాక 12 రోజుల అనంతరం ఈ క్యాష్‌బ్యాక్‌ను క్రెడిట్ చేయనున్నట్టు పేటీఎం మాల్ తెలిపింది. దాంతో పాటు పేటీఎం మాల్లో గెలాక్సీ నోట్ 9 బుక్ చేసుకున్న వారికి శాంసంగ్ గేర్ స్పోర్ట్ స్మార్ట్‌వాచ్‌పై రూ.18,000 డిస్కౌంట్ లభించనుంది. కోంబో ఆఫర్లో భాగంగా శాంసంగ్ గేర్ స్పోర్ట్‌ను కేవలం రూ.4,999కే అందిస్తుంది. అదేవిధంగా తొమ్మిది నెలల పాటు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్, ఎక్స్చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అయితే శాంసంగ్ గెలాక్సీ నోట్ 9 స్మార్ట్‌ఫోన్ భారత్‌లోకి ఎప్పుడు వస్తుంది? దాని ధరెంత ఉంటుంది? అనే విషయాలపై క్లారిటీ రాలేదు. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఈ స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. గెలాక్సీ నోట్ 9 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర 999 డాలర్లు (దాదాపుగా రూ.68,700)గా ఉంది. అలాగే 8జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర 1250 డాలర్లు (దాదాపుగా రూ.85,900)గా ఉంది. అమెరికా మార్కెట్లో ఈ ఫోన్‌ను ఈ నెల 24వ తేదీ నుంచి విక్రయించనున్నారు. శాంసంగ్ గెలాక్సీ నోట్ 9 ఫీచర్లు... 6.4 అంగుళాల సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్ప్లే క్వాడ్ హెచ్‌డీప్లస్ రెజుల్యూషన్ కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ 5 ఆక్టా-కోర్ ఎక్సీనోస్ 9810 ప్రాసెసర్ 6 జీబీ/8 జీబీ ర్యామ్ 128 జీబీ, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్లు మైక్రో ఎస్డీ కార్డు ద్వారా మరో 512 జీబీ స్టోరేజ్ పెంపు అంటే మొత్తంగా 1 టీబీ స్టోరేజ్ అందుబాటు 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఆండ్రాయిడ్ 8.1 ఓరియో సింగిల్/హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ డాల్బీ అట్మోస్ ఎస్ పెన్, బారో మీటర్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, హార్ట్ రేట్ సెన్సార్, ఐరిస్ సెన్సార్, ప్రెషర్ సెన్సార్, 4జీ వీవోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్సీ 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, వైర్లెస్ చార్జింగ్ -
గోఎయిర్ తగ్గింపు ధరలు : భారీ డీల్స్
సాక్షి, ముంబై: బడ్జెట్ క్యారియర్ గోఎయిర్ విమానయాన సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఫెస్టివల్ సీజన్స్ సేల్ పథకంలో దేశీయ విమాన టికెట్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. తన నెట్‌వర్గ్ అంతటా దాదాపు లక్షటికెట్లను ఈ తగ్గింపు ధర ఆఫర్లో విక్రయించాలని ప్లాన్ చేసింది. 1099 (అన్నీ కలిసిన) రూపాయల ప్రారంభ ధర వద్ద వన్‌వే విమాన టికెట్లను అందిస్తున్నట్టు తెలిపింది. ఈ ఆఫర్లో టికెట్ బుకింగ్ నేటి(ఆగస్టు 4,శనివారం) నుంచి మొదలైన ఆగస్టు 9వ తేదీవరకు అందుబాటులో ఉంటుంది. అలాగే ఇలా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా ఆగస్టు 4 నుంచి డిసెంబరు 31, 2018 దాకా ప్రయాణించవచ్చని కంపెనీ వెల్లడించింది. దీంతోపాటు కొన్ని ఇతర అదనపు ప్రయోజనాలను కూడా ఆఫర్ చేస్తోంది. గో ఎయిర్ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్‌ద్వారా బుక్ చేసినట్లయితే వినియోగదారులకు 3 వేల రూపాయల వరకు ప్రత్యేకమైన డిస్కౌంట్. ఇంకా పేటీఎం వాలెట్ ద్వారా చెల్లింపులు చేస్తే కనిష్టంగా 5శాతం లేదా 250 రూపాయలు, గరిష్టంగా 20శాతం లేదా 1,100 రూపాయల రాయితీ ఇస్తామని తెలిపింది. కాగా గోఎయిర్ దేశీయంగా అహ్మదాబాద్, బాగ్డోదర,బెంగళూరు, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, గోవా, గువహతి, జైపూర్, జమ్మూ, కొచ్చి, కోల్‌కతా, లెహ్, లక్నో, ముంబై, నాగ్‌పూర్, పాట్నా, పోర్ట్ బ్లెయిర్, పూణే, రాంచీ, శ్రీనగర్, హైదరాబాద్ 23 మార్గాల్లో వారానికి 1544 విమాన సర్వీసులను అందిస్తోంది. -
రూ.1,212కే విమాన టికెట్: ఇండిగో
ముంబై: ‘ఇండిగో’ తాజాగా ‘మెగా వార్షికోత్సవ సేల్’ పేరుతో టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా టికెట్లను రూ.1,212 ధర నుంచి అందిస్తోంది. మంగళవారం నుంచి మూడు రోజులపాటు (జూలై 10 నుంచి 13 వరకు) అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్లో భాగంగా టికెట్లను బుక్ చేసుకున్నవారు ఈ ఏడాది జూలై 25 నుంచి వచ్చే ఏడాది మార్చి 30 మధ్య ఎప్పుడైనా ప్రయాణించ్చొని కంపెనీ తెలిపింది. మెగా వార్షికోత్సవ సేల్‌లో భాగంగా ప్రయాణికుల కోసం 12 లక్షల సీట్లను అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొంది. ‘ఆగస్ట్ 4న సంస్థ కార్యకలాపాలు ప్రారంభించి 12 సంవత్సరాలు అవుతుంది. అందుకే 12 లక్షల సీట్లతో మెగా సేల్‌ను ప్రకటించాం’ అని ఇండిగో చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ విలియమ్ బౌల్టర్ తెలిపారు. -
స్పైస్‌జెట్ మాన్సూన్ బొనాంజ
న్యూఢిల్లీ : విమానయాన సంస్థలు మాన్సూన్ ఆఫర్లతో హోర్రెత్తిస్తున్నాయి. తాజాగా స్పైస్‌జెట్ ‘మెగా మాన్సూన్ సేల్’ను ప్రకటించింది. దీని కింద దేశీయ విమాన టిక్కెట్లను రూ.999కే అందిస్తున్నట్టు పేర్కొంది. స్పైస్‌జెట్ తీసుకొచ్చిన ఈ కొత్త ప్రమోషనల్ సేల్ 2018 జూలై 8 వరకే వాలిడ్‌లో ఉంటుందని స్పైస్‌జెట్ తన వెబ్సైట్లో ప్రకటించింది. 2018 అక్టోబర్ 8వ తేదీకి ఈ ఆఫర్ ప్రయాణ కాలం ముగియనుంది. తక్కువ ధరకు టిక్కెట్లను అందించడమే కాకుండా.. ఎయిర్‌లైన్ అధికారిక వెబ్సైట్లో టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తున్నట్టు పేర్కొంది. సీట్లు, మీల్స్, స్పైస్‌మ్యాక్స్, ఇతర యాడ్-ఆన్స్‌పై 20 శాతం డిస్కౌంట్‌ను ఈ క్యారియర్ అందిస్తున్నట్టు తెలిపింది. అదనపు డిస్కౌంట్ ఆఫర్ ప్రోమో కోడ్ ఏడీడీ0ఎన్20గా స్పైస్‌జెట్ వెల్లడించింది. స్పైస్‌జెట్ ‘మెగా మాన్సూన్ సేల్’ నియమ, నిబంధనలు... వన్-వే ధరలకు మాత్రమే ఈ మెగా సేల్ వర్తిస్తోంది. ఈ ఆఫర్‌ను మిగతా ఏ ఆఫర్‌తో కలుపరు. గ్రూప్ బుకింగ్స్‌కు ఇది వర్తించదు. ఒకవేళ అవసరమైతే స్వల్ప రద్దు ఛార్జీలతో టిక్కెట్ ధర మొత్తాన్ని రీఫండ్ చేయనుంది. ఫస్ట్-కమ్, ఫస్ట్-సర్వ్డ్ బేసిస్‌లోనే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. విమానం బయలుదేరే సమయం, ఇతర షెడ్యూల్స్ రెగ్యులేటరీ ఆమోదం మేరకే ఉంటాయి. ఈ ఆఫర్‌కు బ్లాక్-అవుట్ డేట్స్ వర్తిస్తాయి. స్పైస్‌జెట్ అదనపు 20 డిస్కౌంట్ ఆఫర్... స్పైస్‌జెట్.కామ్ ద్వారా బుకింగ్స్ చేసుకునే యాడ్-ఆన్ ప్రొడక్ట్‌లకు మాత్రమే 20 శాతం అదనపు డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. స్పైస్‌మ్యాక్స్, సీట్, హాట్ మీల్, ప్రియారిటీ చెక్ఇన్, ప్రిఫర్డ్ బ్యాగ్ అవుట్ వంటి వాటికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. అన్ని ఇతర ఛార్జీలు, ఫీజులు, పన్నులను ప్రయాణికులే చెల్లించాల్సి ఉంటుంది. దేశీయ, అంతర్జాతీయ విమానాల రౌండ్-ట్రిప్, వన్‌వే బుకింగ్స్ రెండింటికీ ఈ ఆఫర్ వాలిడ్‌లో ఉంటుంది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఈ ఆఫర్‌ను సవరించుకోవడం, రద్దు చేసుకోవడం చేయొచ్చు. -
జియో హాలిడే హంగామా : బంపర్ ఆఫర్
రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. తన వినియోగదారులను ఆశ్చర్యపరచడానికి హాలిడే హంగామా ఆఫర్‌తో ముందుకొచ్చింది. ఈ ఆఫర్ కింద తన పాపులర్ ప్లాన్ 399 రూపాయలపై డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో ఈ ప్లాన్ 299 రూపాయలకే అందుబాటులోకి వచ్చింది. జియో రూ.399 ప్లాన్ అత్యధిక యూజర్లు రీఛార్జ్ చేసుకునే ప్లాన్. జియో ప్రస్తుతం ప్రకటించిన వంద రూపాయల డిస్కౌంట్ 15 రోజులు మాత్రమే అందుబాటులో ఉండనుంది. అంటే జూన్ 1 నుంచి జూన్ 15 వరకే ఈ డిస్కౌంట్ యూజర్లకు లభిస్తుంది. అయితే ఫోన్‌పే వాలెంట్ ద్వారా రీఛార్జ్ చేసుకున్న కొనుగోలుదారులకు మాత్రమే ఈ డిస్కౌంట్ లభ్యమవుతుంది. రీఛార్జ్ చేసుకున్న వెంటనే 50 రూపాయల డిస్కౌంట్‌ను పొందనున్నారు. ఆ అనంతరం రూ.50ను ఓచర్ల రూపంలో కస్టమర్లకు లభిస్తుంది. మైజియో యాప్‌లో ఉన్న ఫోన్‌పే ద్వారా ఈ రీఛార్జ్ చేసుకోవాలి. ఈ ప్లాన్ కింద 84 రోజుల కాలపరిమితితో రోజుకు 1.5 జీబీ చొప్పున నెలకు 126 జీబీ డేటాతోపాటు, అన్లిమిటెడ్ కాల్స్, రోజులకు 100 ఎస్ఎంఎస్లను జియో అందిస్తోంది. రోజుకు 1.5 జీబీ డేటా అయిపోయిన తర్వాత కూడా నెట్ వాడుకోవచ్చు. కానీ స్పీడ్ 64కేబీపీఎస్‌కు పడిపోతుంది. -
ఎయిర్ ఏషియా సమ్మర్ ఆఫర్
సాక్షి, ముంబై: ఎయిర్ ఏషియా విదేశీటికెట్లపై సమ్మర్ ఆఫర్ ప్రకటించింది. ఎంపిక చేసిన రూట్లలో విదేశీ విమాన టిక్కెట్లపై తగ్గింపును రేటును ప్రకటించింది. అన్నీ కలుపుకొని రూ.1,999 టికెట్ ప్రారంభ ధరలో టికెట్‌ను ఆఫర్చేస్తోంది. కౌలాలంపూర్, బ్యాంకాంక్,లాంగ్‌కవి బాలి, ఫూకట్, సింగపూర్ రూట్లలో ఈ డిస్కౌంట్ ఆఫర్. ఈనెల 25వరకు బుకింగ్స్ అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ ప్రమోషనల్ ద్వారా టికెట్లను అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలని ఎయిర్‌లైన్స్ పేర్కొంది. అలాగే ఇలా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా ప్రయాణ అనుమతి సెప్టెంబర్ 30,2018 న ముగుస్తుంది. భారతదేశంలోని అనేక ప్రదేశాల నుంచి కౌలాలంపూర్, సింగపూర్, జకార్తా, సిడ్నీ, బాలి, ఎయిర్ ఆసియా విమాన సర్వీసులను అందిస్తోంది. ఎయిర్‌లైన్స్ వెబ్సైట్ ప్రకారం దేశంలోని కొచ్చి లాంటి వివిధ ప్రదేశాల నుంచి కోలాలంపూర్, సియోల్, పెర్త్, ఆక్లాండ్ వంటి ఇతర ప్రదేశాల నుంచి ఎయిర్ ఏషియా డిస్కౌంట్ టికెట్లు అందిస్తోంది. ముఖ్యంగా జైపూర్-కౌలాలంపూర్-ఫుకెట్ (రూ .6,818), జైపూర్-కౌలాలంపూర్-హనోయి (రూ .7,556), జైపూర్-కౌలాలంపూర్-లాంబోక్ (రూ .7,738), న్యూఢిల్లీ-కౌలాలంపూర్ (రూ .8,999), తిరుచిరాపల్లి-కౌలాలంపూర్-హనోయి (రూ.7,401). దీంతోపాటు ప్రీమియం ఫ్లాట్‌బెడ్ విమానాల్లో న్యూఢిల్లీ- కౌలాలంపూర్-ఫుకెట్ మధ్య టికెట్ రూ .20,157 ప్రారంభ ధరగా ఉంది. మిగిలిన వివరాలకు ఎయిర్ ఏషియా వెబ్‌సైట్‌ను పరిశీలించగలరు. -
ఎయిర్ ఏసియా డిస్కౌంట్ సేల్
సాక్షి, ముంబై: విమానయాన సంస్థ ఎయిర్ ఏసియా విమాన టికెట్లపై మరోసారి డిస్కౌంట్ ధరలను ప్రారంబించింది. స్పెషల్ ప్రమోషన్ పథకం కింద ఎయిర్ ఏసియా ఇండియా దేశీయ విమాన టిక్కెట్లపై 20 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. అలాగే పేరెంట్ కంపెనీ ఏయిర్ ఏసియా కూడా అంతర్జాతీయ విమాన టిక్కెట్ల బేస్ ఛార్జీలపై 20శాతం రాయితీ ఆఫర్ చేస్తోంది. ఈ డిస్కౌంట్ ఆఫర్లో టికెట్ల బుకింగ్ సదుపాయం ఫిబ్రవరి 25తో ముగియనుంది. దీంతోపాటు మొబిక్విక్ ద్వారా చేసిన కొనుగోళ్లపై మరో 15శాతం తగ్గింపును ఆఫర్ చేస్తోంది. బెంగళూరు, న్యూ ఢిల్లీ, చెన్నై, విశాఖపట్నం తదితర దేశీయ మార్గాల్లో టికెట్లకు ఈ రేట్లు డిస్కౌంట్లను అందిస్తోంది. అంతర్జాతీయ మార్గాల్లో, వైమానిక సంస్థ విమానాలు కౌలాలంపూర్, ఆక్లాండ్, బ్యాంకాక్ తదితర అనేక విమానాల టికెట్లకు ఈ తగ్గింపు వర్తిస్తుందని సంస్థ అధికారిక వెబ్సైట్ airasia.com లో తెలిపింది. ఈ ఆఫర్లో బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా ప్రయాణ కాలం 2018 ఫిబ్రవరి 25నుంచి ప్రారంభమై 28తో ముగుస్తుంది. విదేశీ మార్గాల్లో అయితే మార్చి 25న మొదలై జూలై 31, 2018 తో ముగుస్తుంది. అయితే కొన్ని విదేశీ మార్గాల్లో ప్రయాణ కాలానికి సంబంధించిన వివరాలో అధికారిక వెబ్సైట్లో లభ్యం. -
ఎయిర్ ఏషియా బంపర్ ఆఫర్
సాక్షి, ముంబై: బడ్జెట్ ధరల ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.99లకే విమానటికెట్‌ను ఆఫర్ చేస్తోంది. దేశంలో 7 నగరాల మధ్య ప్రయాణానికి రూ .99 నుంచి ప్రమోషనల్ బేస్ ఛార్జీలను ప్రారంభించింది. బెంగళూరు, హైదరాబాద్, కొచ్చి, కోల్‌కతా, న్యూ ఢిల్లీ, పూణే, రాంచీ వంటి నగరాలకు డైనమిక్ ధర రూ .99 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఎయిర్ ఏషియా వెబ్సైట్, లేదా యాప్ ద్వారా బుక్ చేసుకున్న టికెట్లపై మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అంతేకాదు ఇంకో ఆకర్షణీయమైన ఆఫర్ కూడా ఉంది. 10 ఆసియా-పసిఫిక్ ప్రాంతం (అపాక్) దేశాలు ఆక్లాండ్, బాలి, బ్యాంకాక్, కౌలాలంపూర్, మెల్బోర్న్, సింగపూర్ సిడ్నీలకు బేస్ ధర రూ.1499గా నిర్ణయించింది. కాగా ఇప్పటికే అనేక విమానయాన సంస్థలు ప్రయాణికులకు అత్యంత తక్కువ ధరలకే విమానయన సదుపాయం కల్పిస్తూ చౌక ధరల యుద్ధానికి తెరతీస్తున్న తరుణంలో ఎయిర్ ఏషియా మరోమారు డిస్కౌంట్ ధరలను అందిస్తోంది. దేశీయంగా, ఇతర దేశాలను చుట్టి రావాలనుకునే విమాన ప్రయాణికులకు మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. -
ఎయిర్ ఏసియా డిస్కౌంట్ ఆఫర్స్
న్యూఢిల్లీ: మలేషియా బడ్జెట్ ఎయిర్‌లైన్ ఎయిర్ ఏసియా దేశీయ ప్రయాణికుల కోసం ఫ్లాష్ విక్రయాలను ప్రకటించింది. ఎంపిక చేసుకున్న మార్గాల్లో వన్ వే (అన్నీ కలిపి) రూ.999 ధరలో విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. ఫిబ్రవరి 26, 2018 నుంచి ఆగస్టు 28, 2018 వరకు ప్రయాణాల కోసం ఆ డిస్కౌంట్ ధరలను అందిస్తోంది. ప్రమోషనల్ స్కీమ్‌లో భాగంగా ‘7 డేస్ మ్యాడ్ డీల్స్’ పేరిట మంగళవారం ఈ ఆఫర్‌ను తమ అధికారిక వెబ్సైట్లో షేర్ చేసింది. ఈ ఆఫర్ 2018 ఫిబ్రవరి 26 నుంచి ఆగస్టు 28 మధ్య వర్తించనుంది. ఈ రోజు నుంచి ఆగస్టు 27 వరకు టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపింది. పరిమిత కాల వ్యవధిలో ఎంపిక చేసిన వన్-వే విమానాలకు టికెట్ ధరను రూ.999గా పేర్కొంది. అంతే కాకుండా ఎయిర్ఏషియా దేశంలో పలు ప్రాంతాలకు ప్రయాణించే వారి కోసం ఆఫర్లు ప్రకటించింది. ఎంపిక చేసిన విమానాల్లోనే ఈ స్కీమ్ వర్తిస్తోందని, సీట్లు పరిమిత సంఖ్యలో ఉన్నాయని ఎయిర్ ఏషియా ప్రతినిధులు తెలిపారు. వెబ్, మొబైల్ యాప్ ద్వారా ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. కోల్‌కతా-బగ్దోగ్రా టికెట్ ధర రూ.999 కాగా, భువనేశ్వర్-కోల్‌కతా, గోవా-బెంగళూరు, గువాహటి-ఇంఫాల్, హైదరాబాద్-బెంగళూరు, కొచ్చి-బెంగళూరు మధ్య టికెట్ ధర రూ.1,099గా, అలాగే పుణె-బెంగళూరు, విశాఖపట్నం-బెంగళూరు మధ్య ధరను రూ.1,499గా ఉండనుంది. దీంతోపాటు కొన్ని అంతర్జాతీయ విమాన టిక్కెట్లకు ప్రారంభ ధరను రూ.3,399గా నిర్ణయించింది. కౌలాలంపూర్-కొచ్చి, కౌలాలంపూర్-తిరుచ్చిరాపల్లి మధ్య టికెట్ల ధరను తగ్గించినట్లు పేర్కొంది. మరోవైపు భారీ మార్కెట్ క్యాప్ తో అద్భుత ప్రదర్శన కనబర్చే టాప్ లిస్టెడ్ కంపెనీలకిచ్చే అవార్డును సంస్థ దక్కించుకుంది. ఎడ్జ్ మీడియా అందించే ఎడ్జ్ బిలియన్ రింగింట్ క్లబ్ అవార్డును స్వీకరించినట్టు ఎయిర్ ఏసియా ట్విట్టర్‌ద్వారా వెల్లడించింది. [Press Release] #AirAsia wins The Edge Billion Ringgit Club Company of the Year Award pic.twitter.com/89lFchEwIU — AirAsia (@AirAsia) August 22, 2017 -
జెట్ ఎయిర్వేస్ డిస్కౌంట్ ఆఫర్
ముంబై: ‘జెట్ ఎయిర్వేస్’ తాజాగా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా దేశీ, విదేశీ ప్రయాణానికి సంబంధించిన బిజినెస్ తరగతి టికెట్ల బేస్ ఫెయిర్‌లో 20%, ఎకానమీ తరగతి టికెట్ల బేస్ ఫెయిర్‌లో 30% డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఆగస్ట్ 11న ప్రారంభమైన ఈ డిస్కౌంట్ ఆఫర్ ఆరు రోజుల పాటు అందుబాటులో ఉండనుందని, ఇందులో భాగంగా టికెట్లను బుకింగ్ చేసుకున్న దేశీ ప్రయాణికులు సెప్టెంబర్ 5 నుంచి, విదేశీ ప్రయాణికులు సెప్టెంబర్ 15 నుంచి ప్రయాణించొచ్చని జెట్ ఎయిర్వేస్ తెలిపింది. -
రూ.599కే గోఎయిర్ టికెట్!
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ‘గోఎయిర్’ తాజాగా టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రయాణికులు రూ.599 ప్రారంభ ధరతో టికెట్లను పొందొచ్చని కంపెనీ తెలిపింది. డిస్కౌంట్ ఆఫర్ మే 12 నుంచి 15 వరకు అందుబాటులో ఉంటుంది. ఆఫర్లో భాగంగా టికెట్లను బుక్ చేసుకున్నవారు జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్యకాలంలో ఎప్పుడైనా ప్రయాణించొచ్చు. నిజానికి గో ఎయిర్ దేశవ్యాప్తంగా 23 రూట్లలో విమానాలను ఆపరేట్ చేస్తోంది. ఆఫర్ మే 12న ఆరంభమైందని... 15 అర్ధరాత్రి వరకూ అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. -
ఇండిగో డిస్కౌంట్ ఆఫర్
న్యూఢిల్లీ: దిగ్గజ విమానయాన సంస్థ ‘ఇండిగో’ తాజాగా టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. మూడు రోజులపాటు అందుబాటులో (మే 10 వరకు) ఉండనున్న ఈ సమ్మర్ స్పెషల్ ఆఫర్లో భాగంగా ప్రయాణికులు రూ.899 ప్రారంభ ధరతో టికెట్లను పొందొచ్చని కంపెనీ తెలిపింది. అయితే ఈ టికెట్ ధర కేవలం ఎంపిక చేసిన రూట్లకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొంది. ఆఫర్లో భాగంగా చేసుకున్న టికెట్ బుకింగ్స్‌కి రిఫండ్ ఆప్షన్ ఉండదని తెలిపింది. -
విమాన టిక్కెట్‌పై జియో డిస్కౌంట్ ఆఫర్
న్యూఢిల్లీ : ముఖేష్ అంబానీ సంస్థ రిలయన్స్ జియో తన వినియోగదారులకు మరో బంపర్ ఆఫర్ అందించేందుకు సిద్ధమైందట. ఏయిర్ ఏసియా టిక్కెట్లపై 15 శాతం వరకు డిస్కౌంట్‌ను అందించనున్నట్టు ఫైనాన్సియల్ ఎక్స్‌ప్రెస్ రిపోర్టు చేసింది. ఏయిర్ ఏసియా మొబైల్ యాప్ ద్వారా ఈ డిస్కౌంట్ ఆఫర్‌ను వినియోగదారుల సద్వినియోగం చేసుకోవచ్చని, 2017 జూన్ 20 నుంచి 2017 సెప్టెంబర్ 30 వరకున్న ప్రయాణ సమయాల్లో ఇది వర్తిస్తుందని నివేదించింది. వచ్చే రెండు, మూడు రోజుల్లో ఈ ఆఫర్‌ను లాంచ్ చేయబోతున్నట్టు ఫైనాన్సియల్ ఎక్స్‌ప్రెస్ రిపోర్టు పేర్కొంది. ఈ విమానయాన సంస్థ మొదట ఈ ఆఫర్ గురించి ఓ ట్వీట్ చేసింది. అనంతరం వెంటనే దాన్ని డిలీట్ చేసింది. ప్రత్యర్థ కంపెనీల అత్యధిక ఏఆర్పీయూ(ఒక్కో యూజరుపై ఆర్జించే కనీస రెవెన్యూ) యూజర్లను టార్గెట్ చేసుకుని జియో ఈ వ్యూహాన్ని అమల్లోకి తెస్తుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. -
ఏయిర్ ఏసియా బంపర్ డిస్కౌంట్
న్యూఢిల్లీ : బడ్జెట్ ప్యాసెంజర్ క్యారియర్ ఏయిర్ఏసియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. రౌండ్ ట్రిప్పులకు(వెళ్లడం, రావడం) 50 శాతం డిస్కౌంట్ ఆఫర్‌ను అందించనున్నట్టు తెలిపింది. అయితే ఈ డిస్కౌంట్ ఆఫర్‌ను ఎంజాయ్ చేయాలంటే కంపెనీ వెబ్సైట్, మొబైల్ ఆధారిత తమ అప్లికేషన్లో టిక్కెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందని ఏయిర్ఏసియా పేర్కొంది. 2017 జనవరి 23 నుంచి 29 వరకు ఏయిర్ ఏసియా మొబైల్ యాప్ లేదా ఏయిర్ఏసియా.కామ్‌లో ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉండనుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 30 మధ్య ప్రయాణాలకు ఇది వర్తించనుంది. ఏయిర్ఏసియా ఇండియా విమానాలు తిరిగే అన్ని విమానాలకు, అన్ని మార్గాలకు ఈ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. కంపెనీ విమానాలు నడపబోతున్న శ్రీనగర్, బాగ్దోగ్రాలకు ఇది వర్తించనుందని కంపెనీ తెలిపింది. ఫిబ్రవరి 19 నుంచి శ్రీనగర్, బాగ్దోగ్రాలకు ఎయిర్‌లైన్ విమానాలు నడుపనుంది. బెంగళూరు, న్యూఢిల్లీ రెండు హబ్‌లుగా 11 ప్రాంతాలకు ఈ ఎయిర్‌లైన్ తన సర్వీసులను అందిస్తోంది. -
గోఎయిర్ ‘999’ ఆఫర్
ముంబై: కస్టమర్ల ఆకర్షణే ప్రధాన లక్ష్యంగా దేశీ విమానయాన సంస్థ ‘గోఎయిర్’ తాజాగా పరిమిత కాల టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా సంస్థ విమాన టికెట్లను రూ.999 నుంచి ఆఫర్చేస్తోంది. డిసెంబర్ 31 వరకూ అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్లో టికెట్లను బుక్ చేసుకున్న వారు 2017 జనవరి 9 –ఏప్రిల్ 15 మధ్య ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చని కంపెనీ పేర్కొంది. కాగా రూ.999 ఆఫర్కేవలం గోఎయిర్ నెట్వర్క్స్ (గోఎయిర్ వెబ్సైట్, గోఎయిర్ టికెటింగ్ కౌంటర్స్, గోఎయిర్ కాల్ సెంటర్, ట్రావెల్ ఏజెంట్స్)లో మాత్రమే అందుబాటులో ఉంటుందని వివరించింది. -
రూ.949 నుంచి విస్తారా విమాన టికెట్
న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ‘విస్తారా’ తాజాగా ఆల్ ఇన్‌క్లూజివ్ వన్-వే టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా సంస్థ రూ.949ల ప్రారంభ ధరలతో ప్రయాణికులకు విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. సెప్టెంబర్ 6 నుంచి 10 మధ్యలో టికెట్లను బుక్ చేసుకున్న వారికే ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. ఆఫర్లో భాగంగా టికెట్లను బుక్ చేసుకున్న వారు సెప్టెంబర్ 12 నుంచి 30 మధ్యలో ఎప్పుడైనా ప్రయాణించవచ్చని తెలిపింది. ఇది పరిమిత కాల ఆఫర్ అని, ప్రయాణికులు దీన్ని ఉపయోగించుకోవాలని విస్తారా తెలిపింది. -
ఎయిర్ఏషియా డిస్కౌంట్ ఆఫర్
చెన్నై: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా తాజాగా టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా దేశీ విమాన టికెట్‌ను (ఒకవైపునకు మాత్రమే) రూ.786 ప్రారంభ ధరతో అందిస్తోంది. ‘ఫ్లై లైక్ ఏ సూపర్‌స్టార్’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ ఆఫర్.. జూలై 3 వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. ఆఫర్లో భాగంగా టికెట్లను బుక్ చేసుకున్నవారు వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 30 వరకు మధ్యకాలంలో ఎప్పుడైనా ప్రయాణించవచ్చని తెలియజేసింది. పలు అంతర్జాతీయ గమ్యస్థానాలకూ ఒకవైపునకు సంబంధించి రూ.2,999 ప్రారంభ ధరతో టికెట్లను ఆఫర్ చేస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ అప్‌కమింగ్ మూవీ ‘కబాలి’ ప్రమోషన్స్‌లో భాగం గా సంస్థ ఈ ఆఫర్‌ను ప్రకటించింది. ఎయిర్ఏషియా ఇటీవలే కబాలి సినిమా నిర్మాణ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
జెట్ ఎయిర్వేస్ డిస్కౌంట్ ఆఫర్
న్యూఢిల్లీ: ప్రముఖ ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ ప్రయాణికుల కోసం పరిమిత కాల టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. అబుదాబి మీదుగా వెళ్లే ఎంపిక చేసిన అంతర్జాతీయ రూట్లలో బిజినెస్, ఎకాన మీ తరగతుల టికెట్ ధరలను త గ్గించింది. ప్రయాణికులకు ఈ ఆఫర్ ఆగస్ట్ 24 నుంచి 27 వరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ ఆఫర్ కింద టికెట్లను బుకింగ్ చేసుకున్న వారు ఈ ఏడాది సెప్టెంబర్ 15 నుంచి వచ్చే ఏడాది జూన్ 15 మధ్య కాలంలో ఎపుడైనా ప్రయాణించవచ్చు. తన వ్యాపార భాగస్వామ్య సంస్థ ఇతిహాద్ ఎయిర్‌లైన్స్‌కు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. -
జెట్ ఎయిర్వేస్ డిస్కౌంట్ ఆఫర్
న్యూఢిల్లీ: మంచి పనితీరు, పలు రకాల ఆఫర్లతో వృద్ధి బాటలో పయనిస్తున్న ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ తాజాగా స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా మరో డిస్కౌంట్ ఆఫర్‌కు తెరతీసింది. ఇందులో భాగంగా కంపెనీ ప్రయాణికులకు ఫస్ట్, బిజినెస్, ఎకానమీ వంటి అన్ని తరగతుల టికెట్ ధరల్లో 30 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ వినియోగదారులకు ఆగస్ట్ 10 నుంచి 14 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. అలాగే ఈ ఆఫర్లో టికెట్లను బుక్ చేసుకున్న వారు ఈ ఏడాది సెప్టెంబర్ 10 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 14 వరకు ఎప్పుడైనా ప్రయాణించవచ్చు. ఈ ఆఫర్ దేశీ, విదేశీ సర్వీసులకు వర్తిస్తుంది. -
రూ.1,777కే ఎయిర్ ఇండియా టికెట్
న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా పరిమిత కాల దేశీ టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. దేశీ విమాన టికెట్లను రూ.1,777లకే ప్రయాణికులకు అందిస్తోంది. జూన్ 10 నుంచి 12 మధ్యకాలంలో బుక్ చేసుకున్న టికెట్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తించనుంది. ఈ ఆఫర్ కింద టికెట్లను బుక్ చేసుకున్న వారు జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఎప్పుడైనా ప్రయాణించవచ్చు. -
జెట్ ఎయిర్వేస్ ఆఫర్
10 లక్షల దేశీ టికెట్లపై 25% డిస్కౌంట్ న్యూఢిల్లీ: ప్రైవేట్ ఎయిర్‌లైన్ సంస్థ జెట్ ఎయిర్వేస్ దేశీ టికెట్ ధరల్లో 25 శాతం డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. దాదాపు 10 లక్షల ఎకాన మీ క్లాస్ టికెట్లకు ఈ ఆఫర్ వర్తించనుంది. మే 27న ప్రారంభమైన ఈ ఆఫర్ 30 వరకు మాత్రమే వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ కింద టికెట్లను బుక్ చేసుకున్న వారు జూన్ 15 నుంచి అక్టోబర్ 15 మధ్యకాలంలో ఎప్పుడైనా ప్రయాణించవచ్చు. -
రూ.999కే స్పైస్‌జెట్ టికెట్
న్యూఢిల్లీ: ‘ట్రావెల్ లైట్-సేవ్ మోర్’ ఆఫర్ కింద ఏసీ-2 టైర్ రైలు టికెట్ ధరలతో పోలిస్తే తక్కువ ధరలకే దేశీ విమాన టికెట్‌ను అందిస్తోంది ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్. ఈ సంస్థ కేవలం రూ.999 ధరతో దాదాపు 1.50 లక్షల సీట్లను ప్రయాణికులకు అందుబాటులో ఉంచింది. సోమవారం ప్రారంభమైన ‘ట్రావెల్ లైట్-సేవ్ మోర్’ డిస్కౌంట్ ఆఫర్ కేవలం మూడు రోజులు మాత్రమే ఉంటుంది. ఈ టికెట్ తీసుకున్నవారు మూడు నెలల (జూలై 1-అక్టోబర్ 15) సమయంలో ఎప్పుడైన ప్రయాణం చేయవచ్చు. -
ఎయిర్కోస్టా ‘ఏప్రిల్’ డిస్కౌంట్ ఆఫర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎయిర్కోస్టా ‘ఏప్రిల్ సేల్ ఆఫర్’ పేరుతో తక్కువ రేట్లకే విమాన టికెట్లను అందిస్తోంది. ఎంపిక చేసిన రూట్లలో రూ. 999 నుంచి రూ. 1,999కే ఎయిర్కోస్టా సేవలను అందిస్తోంది. ఈ డిస్కౌంట్ ఆఫర్లు ఇలా ఉన్నాయి. విజయవాడ-వైజాగ్ రూ.999, హైదరాబాద్-విజయవాడ రూ. 1,499, హైదరాబాద్-చెన్నై రూ. 1,799, హైదరాబాద్-వైజాగ్ రూ. 1,799, తిరుపతి-వైజాగ్ రూ. 1,999. ఏప్రిల్ 1 మధ్నాహ్నం 12 గంటల నుంచి ఏప్రిల్ 4 మధ్యాహ్నం 12 గంటల లోపు బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్లు వర్తిస్తాయి. ఈ టికెట్లతో జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 లోగా ఎప్పుడైనా ప్రయాణం చేయొచ్చు. -
క్యాబ్ మాదిరి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానంలో వెళ్లాలంటే ముందుగానే టికెట్ బుక్ చేసుకోవాలి. కాకపోతే విమానం ఏ టైమ్‌కు వెళుతుందో ఆ టైమ్‌కే మీరు వెళ్లాలి. అంతేతప్ప మీకు నచ్చిన సమయంలో విమానం వెళ్లాలంటే కుదరదు. అంతేనా!! వేరే దారిలేదా? ‘‘ఇదిగో మేం దారి చూపిస్తున్నాంగా... మీకు కావాల్సిన విమానాన్ని... కావాల్సిన సమయంలో వెళ్లేట్టుగా మీరే బుక్ చేసుకోండి’’ అంటోంది బెంగళూరుకు చెందిన ఏంథెమ్ ఏవియేషన్ సర్వీసెస్. అంటే! కుటుంబమంతా కలసి ఓ కారును బుక్ చేసుకున్నట్లే విమానాన్నీ, హెలికాప్టర్లనూ కూడా బుక్ చేసుకోవచ్చన్న మాట. ఇందుకు చేయాల్సిందల్లా.. జెట్‌సెట్‌గో డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళితే చాలు. చార్జీలు పారదర్శకంగా ఉంటాయని, తరచూ బిజినెస్ జెట్లను బుక్ చేసుకునే వ్యాపారస్తులకు ఇది చక్కని ప్రత్యామ్నాయమని కంపెనీ చెబుతోంది. అందుబాటులో 350 విమానాలు! భారతదేశంలోని ప్రైవేటు జెట్లు, హెలికాప్టర్లు అన్నిటినీ జెట్‌సెట్‌గో.ఇన్ తొలిసారిగా ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. ప్రస్తుతం 190 మంది ఆపరేటర్లకు చెందిన 300 నుంచి 350 విమానాలు, హెలికాప్టర్ల వరకూ ఈ సైట్లో అందుబాటులో ఉన్నాయి. వీటన్నిటినీ రేడియో క్యాబ్స్ మాదిరిగా బుక్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఔత్సాహికులు ఎవరైనా మొదట వెబ్సైట్లోకి వెళ్లి పేరు నమోదు చేసుకోవాలి. నమోదిత వ్యక్తులు సైట్లోకి లాగిన్ అయి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలి, సమయం, తేదీ, ప్రయాణికుల సంఖ్యను తెలియజేయాలి. అందుబాటులో ఉన్న సర్వీసుల వివరాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి. నచ్చిన విమానాన్ని, హెలికాప్టర్‌ను ఎంచుకుని కొటేషన్ కోరితే చాలు. ఆపరేటర్లే నేరుగా కస్టమర్లను సంప్రదిస్తారు. నెట్ ప్రైస్‌కే సేవలు లభిస్తాయి. వెబ్‌సైట్‌ను ఉపయోగించుకున్నందుకు ఎటువంటి చార్జీలు ఉండవు. యాపిల్, ఆండ్రాయిడ్ ఫోన్లలో పనిచేసే యాప్స్ కూడా ఉన్నాయి. పారదర్శకంగా చార్జీలు.. ప్రైవేటు జెట్లు, హెలికాప్టర్లలో ప్రయాణించాలంటే సాధారణ విమాన చార్జీల కంటే కొంచెం ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం బిజినెస్ జెట్లను వినియోగిస్తున్న వారిలో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య బ్రోకర్లే. బ్రోకర్లు ఎంత చెబితే అంత ధర చెల్లించక తప్పదు. ‘‘అయితే మా వెబ్సైట్లో అందరు ఆపరేటర్ల విమానాలు, హెలికాప్టర్ల చార్జీలు ఉంటాయి కనక బ్రోకర్ల బెడద లేదు. కొటేషన్ ఎంత మంది ఆపరేటర్లకైనా పంపుకోవచ్చు. ఎవరు తక్కువ ధరకు సేవలు ఇస్తే వారినే ఎంచుకోవచ్చు. ఆపరేటర్లు అందరూ ఒకే వేదికపై ఉండడం కూడా కస్టమర్లకు కలిసొస్తుంది’’ అని జెట్‌సెట్‌గో ఆపరేషన్స్ డెరైక్టర్ కనిక టేక్రివాల్ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. కొటేషన్ ఆధారంగా ఏ ఆపరేటర్‌ను ఎంచుకోవాలో కస్టమర్ నిర్ణయించుకోవడం ఇక్కడ ప్రధాన సౌలభ్యమని ఆయన తెలియజేశారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి నలుగురు కుటుంబ సభ్యులు వెళ్లాలంటే కనీసం రూ.40 వేలు చెల్లించాలి. ఏదైనా సదస్సుకు 168 మంది సిబ్బంది వెళ్లాల్సి ఉన్నా జెట్ బుక్ చే సుకోవచ్చు. ఇందుకోసం బల్క్ చార్టర్ ఆప్షన్ కూడా ఉంది. కొనుగోలు, విక్రయం.. ప్రయాణ సేవలే కాదు. సొంతంగా విమానం, హెలికాప్టర్ కొనాలని ఉన్నా తాము సాయపడతామని దర్శన్ చెప్పారు. పాత వి, కొత్తవి ఏవి కావాలంటే అవి కస్టమర్ల ముంగిట్లోకే తెస్తామని తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ కన్సల్టెంట్లు పాత విమానాల పనితీరును ఇట్టే అంచనాగట్టి ధర నిర్ణయిస్తారని, విమానం కొనుగోలు మొదలు తనిఖీ, లెసైన్సు, సిబ్బంది నియామకం, అనుమతుల వరకూ అన్నీ తామే చేసి పెడతామని చెప్పారు. విమానాల విక్రయం, లీజు సేవలను కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది. బోలెడన్ని డిస్కౌంట్ ఆఫర్లు.. ప్రైవేటు జెట్, హెలికాప్టర్లలో ప్రయాణాన్ని డిస్కౌంట్లలో అందించటం తామే దేశంలో తొలిసారి అందుబాటులోకి తెచ్చామని జెట్‌సెట్‌గో చెబుతోంది. ‘‘ఒక చోటికి వెళ్లిన జెట్, హెలికాప్టర్లు చాలా సందర్భాల్లో తిరుగు ప్రయాణంలో ఖాళీగా వస్తాయి. అలాంటి సందర్భాల్లో ఆపరేటర్లు చార్జీల్లో 75 శాతం దాకా డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. ప్రయాణించే సమయం విషయంలో ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి కంపెనీ కొంత వెసులుబాటు తీసుకుంటుంది. రోజుకు సగటున 2-3 జెట్స్, హెలికాప్టర్లు డిస్కౌంట్ ఆఫర్లో అందుబాటులో ఉంటున్నాయి’’ అని సంస్థ మార్కెటింగ్ డెరైక్టర్ ఆర్.దర్శన్ చెప్పారు. కొత్త అనుభూతి కోరుకునే వారికి ఇది చక్కని వేదిక అని, అదీ అందుబాటు ధరలో సేవలు లభిస్తాయని తెలియజేశారాయన.