
సాక్షి,న్యూఢిల్లీ: బడ్జెట్ క్యారియర్ ఎయిర్ ఏసియా ప్రమోషనల్ ఆఫర్‌గా అతి తక్కువ ధరకే విమాన టికెట్లను అందిస్తోంది. రూ.399 లకే విమాన టికెట్లు అందిస్తోంది. నవంబరు 18 దాకా ఈ ఆఫర్‌లో టికెట్లను బుక్ చేసుకునే అవకాశం. ఇలా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా మే 6, 2019 నుంచి ఫిబ్రవరి 4, 2020 వరకు ప్రయాణించే అవకాశం ఉంది. వన్‌వేలో దేశీయంగా రూ.399, అంతర్జాతీయ మార్గాల్లో 1999 రూపాయలకే టికెట్లను ఆఫర్ చేస్తోంది. అయితే ఎంపిక చేసిన కస‍్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్‌లో టికెట్లను బుక్ చేసుకునే అవకాశం.
హైదరాబాద్, విశాఖపట్నం తోపాటు, బాగ్దోగ్రా, బెంగళూరు, భువనేశ్వర్, గోవా, గువహటి, ఇంఫాల్, ఇండోర్, జైపూర్, కొచ్చి, కోలకతా, న్యూఢిల్లీ, పుణ్, రాంచీ, శ్రీనగర్ నగరాలకు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఎయిర్ ఏసియా వెబ్‌సైట్, లేదా యాప్ ద్వారా టికెట్ బుకింగ్ సదుపాయం లభ్యం.
అయితే బిగ్ లాయల్టీ ప్రోగ్రాంలోని ‘బిగ్ మెంబర్స్’ కు మాత్రమే ఈ ఆఫర్‌ను దక్కించుకునే అదృష్టాన్ని కల్పించింది.
ఎయిర్ ఏసియా వెబ్‌సైట్ సమాచారం ప్రకారం, ఇండోర్-హైదరాబాద్, రాంచి- కోలకతా మార్గాల్లో రూ .399గా టికెట్ లభ్యమవుతోంది. వివిధ మార్గాల్లో టికెట్ల ప్రారంభ ధరలు ఈ విధంగా ఉండనున్నాయి.
బెంగళూరు-హైదరాబాద్ : రూ. 500
బెంగళూరు-విశాఖపట్నం : రూ. 999
కోలకతా-రాంచీ : రూ. 967
బెంగళూరు-భువనేశ్వర్ : రూ .1,399
బెంగళూరు-కొచ్చి : రూ. 500
బెంగళూరు-చెన్నై: రూ. 500
ఇక అంతర్జాతీయ మార్గాల విషయానికి వస్తే.. భువనేశ్వర్- కౌలాలంపూర్ మధ్య రూ .1999 ప్రారంభ ధరగా ఉంది.
కాగా ప్రపంచవ్యాప్తంగా తమ బిగ్ సభ్యులు 20 మిలియన్ల మార్క్‌ను చేరుకున్నారని, ఆగస్టు 29న విడుదల చేసిన ఒక ప్రకటనలో ఎయిర్ ఏసియా వెల్లడించింది. టాటాసన్స్ , మలేసియా ఎయిర్‌లైన్స్ జాయింట్ వెంచర్ సంస్థ అయిన ఎయిర్ ఏసియా 25 దేశాల్లో 165 ప్రదేశాలకు సర్వీసులను నిర్వహిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment