loyalty
-
Rajasthan Elections 2023: స్టయిల్ మారింది!
మూడేళ్ల నాటి విఫల తిరుగుబాటు. సీఎం కుర్చీలో ఉన్న ప్రత్యర్థి నుంచి చీటికీ మాటికీ సూటిపోటి మాటలు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించినా ఈసారి మాత్రం ప్రచారంతో సహా ఎందులోనూ పెద్దగా ప్రాధాన్యం దక్కని వైనం. అన్నింటినీ ఓపికగా సహిస్తూ సాగుతున్నారు రాజస్తాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్. అసమ్మతి నేతగా ముద్ర తప్ప తిరుగుబాటుతో సాధించిందేమీ లేకపోవడంతో ఈ యువ నేత తెలివిగా రూటు మార్చారు. అసమ్మతి రాగాలకు, సొంత ప్రభుత్వంపై విమర్శలకు ఫుల్స్టాప్ పెట్టారు. అవకాశం చిక్కినప్పుడల్లా అధిష్టానానికి విధేయతను చాటుకుంటూ వస్తున్నారు. విధేయత, వెయిటింగ్ గేమ్ అంతిమంగా తనను అందలమెక్కిస్తాయని ఆశిస్తున్నారు... రాజస్తాన్‌లో 2018 అసెంబ్లీ ఎన్నికల వేళ పీసీసీ చీఫ్‌గా పార్టీ బరువు బాధ్యతలన్నింటినీ తన భుజాలపై మోశారు పైలట్. అన్నీ తానై వ్యవహరించి పార్టీని విజయ తీరాలకు చేర్చారు. ఆయనే సీఎం అని అంతా భావించారు. కానీ అధిష్టానం మాత్రం అనూహ్యంగా సీనియర్ అశోక్ గహ్లోత్‌కే పట్టం కట్టింది. కొంతకాలం తర్వాత చాన్సిస్తామన్న అధిష్టానం మాట తప్పడంతో పైలట్ ఆగ్రహించి 21 మంది ఎమ్మెల్యేలతో పైలట్ తిరుగుబాటుకు దిగడం, అగ్ర నేత రాహుల్‌గాంధీ జోక్యంతో వెనక్కు తగ్గడం చకచకా జరిగిపోయాయి. డిప్యూటీ సీఎంగిరీ, పీసీసీ చీఫ్ పదవి రెండూ ఊడటం మినహా ఆయన సాధించిందంటూ ఏమీ లేకపోయింది. అయినా వెనక్కు తగ్గలేదాయన. గహ్లోత్ ప్రభుత్వంపై బాహాటంగానే విమర్శలు ఎక్కుపెట్టడం, ధిక్కార స్వరం విని్పంచడం వంటివి చేస్తూనే వచ్చారు. ఈ ఏడాది మొదట్లో ఏకంగా సొంత ప్రభుత్వ పనితీరునే విమర్శిస్తూ ధర్నాకు దిగడమే గాక పాదయాత్ర తలపెట్టి సంచలనం సృష్టించారు. తీరు మారింది... కానీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పైలట్ తీరే పూర్తిగా మారిపోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే సహనమూర్తిగా మారారు. ప్రచారంలో తనకు ముఖ్య బాధ్యతలేవీ అప్పగించకపోయినా పెద్దగా పట్టించుకోలేదు. పైగా గహ్లోత్ సర్కారుపై బీజేపీ విమర్శలను పైలట్ దీటుగా తిప్పికొడుతూ కాంగ్రెస్ నేతలనే ఆశ్చర్యపరుస్తున్నారు! అంతేగాక ఇటీవల గహ్లోత్ కుమారుడికి ఈడీ సమన్లను, పీసీసీ చీఫ్ గోవింద్‌సింగ్ నివాసంపై ఈడీ దాడులను కూడా పైలట్ తీవ్రంగా ఖండించారు. గహ్లోత్‌పై విమర్శలు, ఆరోపణలకు పూర్తిగా ఫుల్స్టాపే పెట్టడమే గాక ఆయనతో కలిసి పని చేసేందుకు సిద్ధమని సంకేతాలిచ్చారు. వాటిని గహ్లోత్ పట్టించుకోకపోయినా, చాన్స్ దొరికినప్పుడల్లా తనకు చురకలు వేస్తున్నా, పార్టీ పట్ల తన చిత్తశుద్ధిని పదేపదే ప్రశి్నస్తున్నా వ్యూహాత్మక మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. ఎన్నికల ప్రచారమంతా గహ్లోత్ వన్ మ్యాన్ షోగానే సాగుతున్నా ఇదేమని ప్రశ్నించడం లేదు. పార్టీ గెలిస్తే సీఎం పదవి డిమాండ్ చేస్తారా అని ప్రశ్నించినా అది అధిష్టానం తీసుకోవాల్సిన నిర్ణయమని ఆచితూచి బదులిస్తున్నారు. అదే సమయంలో, వ్యక్తిగత ప్రతిష్ట కోసం సీఎం కావాలన్న దుగ్ధ తనకు లేదంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తున్నారు. తద్వారా ఇటు గహ్లోత్‌కు, అటు అధిష్టానానికి ఇవ్వాల్సిన సంకేతాలు స్పష్టంగానే ఇస్తున్నారన్నది పరిశీలకుల అభిప్రాయం. ఫలిస్తున్న వ్యూహం! పైలట్ విధేయత వ్యూహం బాగానే ఫలిస్తోందంటున్నారు. గాంధీ త్రయం సోనియా, రాహుల్, ప్రియాంక కొద్ది రోజులుగా ఆయన అభిప్రాయానికి బాగా విలువ ఇస్తున్నారని పీసీసీ వర్గాలు కూడా అంగీకరిస్తున్నాయి. పైలట్ విధేయత, గహ్లోత్ గతేడాది చూపిన అవిధేయత రెండింటినీ అధిష్టానం బేరీజు వేసుకుంటోందని కూడా ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. సీఎంగిరీ వదులుకోవాల్సి వస్తుందనే కారణంతో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయాలన్న సోనియా ఆదేశాలను గహ్లోత్ బేఖాతరు చేయడం తెలిసిందే. ఆయన కోసం మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గత సెపె్టంబర్లో ఏకంగా తిరుగుబాటుకు సిద్ధపడటం అధిష్టానానికి తలవంపులుగా మారింది. ఈ నేపథ్యంలో ఐదేళ్లకోసారి అధికార పార్టీని మార్చేసే రాజస్థాన్‌లో ఈసారి కాంగ్రెస్ ఓడితే రాష్ట్ర పార్టీ పైలట్ చేతుల్లోకి రావచ్చు. నెగ్గితే మాత్రం సీఎం పీఠం కోసం గహ్లోత్, పైలట్ మధ్య పెనుగులాట తప్పకపోవచ్చు. అప్పుడు అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరం! – సాక్షి, నేషనల్ డెస్క్ -
బీజేపీకి ఎదురుదెబ్బ.. సింధియాను వీడి.. కాంగ్రెస్ చేరి..
భోపాల్: మధ్యప్రదేశ్‌లో బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా ముఖ్య అనుచరుడు సమందర్ పటేల్ కాంగ్రెస్‌లో చేరారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు కమల్ నాథ్ ఆధ్వర్యంలో కండువా కప్పుకున్నారు. తన అనుచరులతో కలిసి సమందర్ కాంగ్రెస్‌లో శుక్రవారం చేరారు. 'కాంగ్రెస్ పార్టీ భావాజాలంపై ఇష్టంతోనే సమందర్ చేరారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నిజాయితీ నచ్చే ఇక్కడి వచ్చారు. ఇదే నిజాన్ని ప్రజలకు కూడా చెబుతారు. 2018లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. కానీ బీజేపీ కుట్రలు పన్ని శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎంగా అయ్యారు. బీజేపీ అధికారంలో నేరాలు, మహిళలపై అత్యాచారాలు ఎక్కువయ్యాయి. శివరాజ్ ప్రభుత్వానికి ప్రజలు స్వస్తి పలకాలని అనుకుంటున్నారు.' అని కమల్ నాథ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి తిరిగిరావడంపై సమందర్ పటేల్ ఆనందం వ్యక్తం చేశారు. సింధియా సహచరులు కాంగ్రెస్ పార్టీలోకి తిరిగివెళ్లడం ఇదే తొలిసారి కాదు. గతంలో కాంగ్రెస్ తరుపున శివపురి జిల్లాకు అధ్యక్షునిగా పనిచేసిన బైజ్నాథ్ సింగ్ యాదవ్ కూడా సింధియాను వదిలి మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. సింధియా మరో అనుచరుడు రాకేశ్ గుప్తా కూడా ఇటీవలే బీజేపీని వదలి కాంగ్రెస్‌లో చేరారు. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజా చేరికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇదీ చదవండి: మణిపూర్‌లో జీ20 సదస్సును జరపండి.. కేంద్రానికి అఖిలేష్ కౌంటర్.. -
ఆ కుక్క చనిపోయి వందేళ్లు..కానీ ఇంకా బతికే ఉంది ఎలాగో తెలుసా!
కుక్కలు విశ్వాసానికి ప్రతీక. అవి మనుషులతో కలిసిపోయి వారిపట్ల ఎంత కృతజ్ఞతను చూపిస్తాయో అందరికీ తెలిసిందే. కానీ ఓ కుక్క మాత్రం దాని గుణంతో అందర్నీ మంత్ర ముగ్దుల్ని చేసింది. చనిపోయి వందేళ్లు కావస్తున్న ఇంకా దాన్ని గుర్తుపెట్టుకోవడమే గాక దాని గురించి కథనాలు, కవితలు ఇంకా పత్రికల్లో వస్తున్నాయంటే నమ్ముతారా?!. దాని కోసం ఓ విగ్రహం కూడా ఏర్పాటు చేసి.. ప్రతి ఏటా అది చనిపోయిన రోజు అక్కడకు వచ్చి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంతకీ ఎందుకు ఆ కుక్క అంత ప్రాముఖ్యతను సంతరించుకుందో చూద్దామా! హచికో అనే కుక్క జపనీస్‌కి చెందిన క్రిమ్ వైట్ అకితా జాతికి చెందినది. ఈ అకితా జాతి కుక్కలు అత్యంత ప్రజాదారణ పొందినవి. జపాన్ ప్రభుత్వం జాతీయ చిహ్నంగా వాటికి స్థానం కల్పించింది కూడా. ఇక ఈ హచికో కూడా ఆ జాతికే చెందింది కావడంతో దాని విశ్వాసం, గొప్పతనం ప్రపంచానికి తెలియజేసింది. ఇది జపాన్‌లోని అకిటా ప్రిఫెక్చర్‌లోని ఓడేట్లోని వ్యవసాయక్షేత్రంలో నవంబర్ 10, 1923న జన్మించింది. ఒక ఏడాది తర్వాత టోక్యో ఇంపీరియల్ విశ్వ విద్యాలయంలో అగ్రికల్చర్ విభాగంలో ప్రోఫెసర్‌గా ఉన్న హిడేసాబురో యునో అనే వ్యక్తి ఈ హచికో అనే కుక్కని అడాప్ట్ చేసుకున్నాడు. అతను దాన్ని టోక్యోలోని షిబుయాలో ఉన్న తన ఇంటికి తీసుకువెళ్లాడు. ప్రతి రోజు యునో తన డ్యూటీకి వెళ్లేముందు సమీపంలోని షిబుయా స్టేషన్ వరకు వచ్చి.. అతడిని సాగనంపేది. ఇలా మే 21, 1925 వరకు సాగింది. ఐతే ఒక రోజు హఠాత్తుగా యునో తన తరగతి గదిలో పాఠాలు చెబుతూ సెర్రిబల్ హేమరేజ్కి గురై చనిపోయాడు. ఐతే అతడి పెంపుడు కుక్క ఆ రైల్వే స్టేషన్ వద్దే అతడి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉండిపోయింది. కానీ ఆ కుక్క ఆ ప్రొఫెసర్ వాసనను గుర్తుపట్టగలగడంతో ఇంటికి వెళ్లి చూసింది. అక్కడ శవపేటికలో ఉన్న అతడిని గుర్తించి.. అక్కడ నుంచి కదలలేదు. ఆ తర్వాత కూడా అలానే ఉండిపోయింది. ఎందుకనో ఎప్పటిలానే తన యజామానితో కలిసి వెళ్లే రైల్వేస్టేషన్ వద్ద ఉండేది. తన యజమాని వచ్చే రైలు వచ్చే టైం కల్లా ఠంఛన్‌గా వచ్చేసి ఎదురుచూస్తు ఉండేది. ఈ ఘటన అక్కడ ఉన్నవాళందర్నీ కంటతడి పెట్టించేది. కానీ అది మాత్రం తన యజమానికి ఎప్పటికైనా రాకపోడా.. అన్నట్లుగా అలానే దాని దినచర్య కొనసాగించేది. దీంతో ఈ కుక్క విషయం చుట్టుపక్కాలంతా కథలుథలుగా వ్యాపించింది. ఆ కుక్క విషయం తెలుసుకున్న వారంతా పాపం అనుకుంటూ.. ఆ కుక్కకి భోజనం అవి, ఇవి పెడుతుండేవారు. ఐతే ఆ కుక్క కొన్నాళ్లు తన యజమాని తోటమాలి కికుసాబురో కొబయాషితో ఉండటం ప్రారంభించింది. అయినప్పటికీ ఆ రైల్వే స్టేషన్‌కి యథాలాపంగా తన యజమాని వచ్చే రైలు టైంకి వెళ్లిపోయేది. అలా.. అది చనిపోయేంత వరకు ఆ విధంగానే చేసింది. అప్పటి వరకు దాని గురించి అక్కడ వరకే పరిమితమైతే ..ఆ తర్వాత జపాన్ అంతటా తెలిసిపోయింది. దీంతో స్టేషన్‌కి దాని పోషణార్థం పెద్ద సంఖ్యలో విరాళాలు కూడా వచ్చాయి. రెండోవ ప్రపంచ యుద్ధంలో ఈ కుక్కని వినయోగించాలనే ప్రయత్నం కూడా చేశారు. ఇక హచికో 11 సంవత్సరాల వయస్సులో మార్చి 8, 1935న చనిపోయింది. పెద్ద సంఖ్యలో సందర్శకులు ఆ కుక్కను చూసేందుకు వచ్చారు కూడా. అంతేగాదు బౌద్ధ సన్యాసులే దగ్గరుండి ప్రార్థనలు చేసి మరీ ఆ కుక్కకి అంత్యక్రియలు నిర్వహించారు. దాని మరణ వార్త సైతం పలు పేపర్లో కథనాలుగా వచ్చాయి కూడా. ఆ తర్వాత 1948 దాని గౌరవార్థం విగ్రహం కూడా ఏర్పాటు చేశారు జపాన్ వాసులు. అక్కడ జపాన్‌లో ప్రతి ఏటా ఆ కుక్క చనిపోయిన రోజు ఆ స్మారక చిహ్నం వద్ద పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించి నివాళులర్పించడం వంటి చేస్తుంటారు అక్కడి ప్రజలు. అంతేగాదు ఈ 'హచికో కుక్క' దాని అచంచలమైన విశ్వాసం కారణంగా ప్రపంచంలోనే అత్యంత విశ్వాసం గల కుక్కగా పేరుగాంచింది. (చదవండి: అమెరికా మాజీ అధ్యక్షుడి లేఖ ..వేలంలో ఎంత పలికిందంటే..) -
అందరి ‘బందు’వయ.. కన్నీళ్లు పెట్టిస్తున్న కుక్క త్యాగం
‘మనుషుల కంటే మూగజీవాలు ఎంతో నయం’.. ఈ మాట విన్నప్పుడల్లా అదేదో అతిశయోక్తితో చెప్తున్నారేమో అనుకుంటారు కొందరు. కానీ, అదే నిజమని పదే పదే కొన్ని ఘటనలు నిరూపిస్తూ వస్తున్నాయి. రోజూ పట్టెడు అన్నం పెడుతున్నారని కాపలాగా ఉండడమే కాదు, వాళ్లను ఆపద నుంచి రక్షించాలనే ఉద్దేశంతో ముందుకెళ్లిన ఓ మూగజీవి.. పాపం ప్రాణం పోగొట్టుకుంది. అందరితో కంటతడి పెట్టిస్తోంది ఈ ఘటన. ముంబై భాందప్ ‘డ్రీమ్స్ మాల్’ దగ్గర ఓ కుక్క ఆరేళ్ల నుంచి ఉంటోంది. దానికి ఆ కాంప్లెక్స్‌లో ఉన్న దుకాణాల ఓనర్లు రోజూ అన్నం పెడుతుంటారు. స్థానికులంతా దానిని ముద్దుగా ‘బందు’ అని పిల్చుకుంటారు. ఆ తర్వాత కొన్నాళ్లకు దానికి ‘బాలు’ అనే మరో కుక్క తోడైంది. ఈ రెండూ ఆ మాల్లో ఉన్న షాపులకు కాపలాగా ఉంటాయి. ఎవరైనా దొంగ చూపులు చూసుకుంటూ వెళ్లినా.. దొంగతనాలకు ప్రయత్నించినా మొరగడంతో పాటు వెంటపడి మరీ పట్టేసుకుంటాయి. మాల్‌కు వచ్చే వాళ్ల దొంగతనాలను సైతం ఎన్నోసార్లు అడ్డుకున్నాయి ఈ శునకాలు. అందుకే మళ్లీ వచ్చినప్పుడు వాటిని ఏమైనా తిండి పెట్టేవాళ్లు కూడా. దొంగల్ని గుర్తించడంలో బంధు ఎంతో స్మార్ట్.. అలాగే సెన్సిటివ్ కూడా. కిందటి ఏడాది ఆ మాల్లో ఉన్న ఓ నర్సింగ్ హోంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందట. అది గుర్తించి గట్టి గట్టిగా మొరిగి అందరినీ అప్రమత్తంగా చేసింది బందునే. ఆ ఘటన తర్వాత ఈ రెండు కుక్కలు కొన్నాళ్లు దిగాలుతో తినడం సైతం మానేశాయట. తాజాగా శుక్రవారం ఈ మాల్లో మరోసారి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సెక్యూరిటీ గార్డులు సామాన్లను బయటకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే బందు మాత్రం వాళ్లు ఆపదలో ఉన్నారేమో అనుకుని పొరబడింది. మొరుగుతూ లోపలికి పరిగెత్తింది. ఆ మంటల్లో చాలాసేపు ఉండేసరికి.. పొగకు ఉక్కిరి బిక్కిరి అయిపోయి స్పృహ కోల్పోయింది. అది గమనించిన సెక్యూరిటీ గార్డులు బయటకు తీసుకొచ్చారు. కాసేపటికి కోలుకున్నట్లే అనిపించింది. అయితే.. ఊపిరి ఆడక.. ఆ మరుసటి ఉదయమే అది మాల్ మెట్ల కింద కన్నుమూసింది. ఈ ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. సాధారణంగా మూగ జీవాలు మంటలు చూస్తే దూరంగా పరిగెడతాయి. అలాంటిది బందు మాత్రం కేవలం మనుషుల్ని కాపాడే ఉద్దేశంతోనే వెళ్లి ప్రాణం పోగొట్టుకుంది. అందుకే మాల్ దగ్గర బందు స్మారక స్థూపం నిర్మిస్తాం అని ప్రకటించారు యానిమల్ యాక్టివిస్ట్ డాక్టర్ నందినీ కులకర్ణి. దుకాణాల ఓనర్లు, సెక్యూరిటీ గార్డుల ఆశ్రునయనాల మధ్య ఆదివారం బందు అంత్యక్రియలు మాల్ దగ్గరే నిర్వహించారు. బందు అంటే మరాఠీలో నిజాయితీ అని అర్థం. ఆ పేరుకు తగ్గట్లే సార్థక జీవితం గడిపి.. తుది శ్వాస విడిచింది ఆ మూగ జీవి. నష్టం జరిగితే జరిగింది..కానీ, బందు లాంటి విశ్వాసాన్ని, నిలువెత్తు నిజాయితీ మళ్లీ చూడగలమా? అంటూ బాధపడుతున్నారు ఆ దుకాణాల ఓనర్లు. పాపం..బందు లేకపోయేసరికి బాలు కూడా రెండు రోజులుగా ఏం ముట్టట్లేదట!. -
పాదాలను చూసి ఆ సీక్రెట్స్ కనిపెట్టేయ్యొచ్చట!!
కాళ్ల వేళ్లను బట్టి, చేతి రేఖలను బట్టి ఎటువంటి జీవిత భాగస్వామి దొరుకుతారో కొంతమంది అంచనా వేస్తారు. ఒక్కోసారి అంచనాలు బోల్తాకొట్టి, అటుఇటు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఐతే తాజాగా ఓ డేటింగ్ సైట్ నిర్వహించిన సర్వే ప్రకారం ఈ పాదాలు ఉన్న పురుషులకు వివాహేతర సంబంధాలు అధికంగా ఉంటాయని చెప్పింది. ‘మిర్రర్’ ఆన్లైన్ సైట్ ప్రచురించిన కథనాల ప్రకారం.. ‘ఇల్లిసిట్ ఎన్కౌంటర్స్’అనే డేటింగ్ సైట్ పురుషులపై నిర్వహించిన సర్వే ప్రకారం మగవారి కాలి పరిమాణాన్ని బట్టి అనేక విషయాలు తెలుసుకోవచ్చని వెల్లడించింది. దాదాపుగా రెండువేల మంది పురుషులపై నిర్వహించిన ఈ సర్వే ప్రకారం మగవారి కాలి సైజును బట్టి జీవిత భాగస్వామిపట్ల వారు ఎంత నమ్మకంగా ఉంటారో వివరించింది. పెద్ద పాదాలు ఉన్న పురుషులు తమ భాగస్వామిని మోసం చేసే అవకాశం ఎక్కువని ఈ సర్వే తెల్పింది. చదవండి: టెక్నాలజీ కన్నే ఎరుగని అమెరికా పల్లెటూరు.. నేటికీ గాడిదలపైనే ప్రయాణం..! ముఖ్యంగా 11 అంగుళాల పాదాలు ఉన్న పురుషులు 29 శాతం చీటింగ్ చేసే అవకాశం ఉందని, 10 అంగుళాల వారు 25 శాతం, 12 అంగుళాలుంటే 22 శాతం, 13 అంగుళాలుంటే మోసం చేసే అవకాశాలు 21 శాతం ఉంటుందని ఈ డేటింగ్ సైట్ సర్వేలో తేలింది. అంతేకాకుండా పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వందలాది మంది పురుషులు స్వయంగా వివాహేతర సంబంధం కలిగి ఉన్నారని సర్వేలో అంగీకరించారట కూడా. చదవండి: గుడ్‌న్యూస్.. ఈ ప్రొటీన్‌తో బట్టతల సమస్యకు శాశ్వత పరిష్కారం..! ‘ఇల్లిసిట్ ఎన్కౌంటర్స్’ సీఈవో జెస్సికా లియోనీ మీడియాతో మాట్లాడుతూ.. ఈ సర్వేపై ప్రజలు విభిన్న ప్రశ్నలు వేస్తున్నప్పటికీ మా లెక్కలు అబద్ధాలు చెప్పలేదని అన్నారు. కొంతమంది పురుషులు దీనిని కొట్టిపారేశారు కూడా. తమకు పెద్ద పాదాలు ఉన్నప్పటికీ తమ భాగస్వామిని ఎప్పుడూ మోసం చేయలేదని, నిజాయితీగా ఉన్నామని చెప్పుకొచ్చారు. ఏదిఏమైనప్పటికీ చేతి రేఖలనుబట్టి, కాలి పరిమాణాలను బట్టి ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని అంచనా వేయలేము. ఎందుకంటే ఏ కొద్దిమందినో ప్రామాణికంగా తీసుకుని మొత్తం పురుషులు ఇలాగే ఉంటారని సైన్స్ కూడా చెప్పలేదు. ఏమంటారు? చదవండి: 2 కిలోమీటర్లమేర మృతదేహాలతో గోడ.. మిస్టీరియస్.. -
Viral Video: శునకం చూపిస్తున్న ప్రేమకు నెటిజన్లు ఫిదా
అంకారా: శునకాన్ని విశ్వాసానికి మారుపేరుగా భావిస్తారు. పరిస్థితులను బట్టి మనుషులు మారిపోతుంటారేమో.. కానీ కుక్కలు మాత్రం అలాకాదు! అందుకే చాలా మంది శునకాలను తమ కుటుంబంలో ఒక సభ్యునిగా, ఎంతో ఆప్యాయంగా చూసుకుంటారు. వాటికి స్నానం చేయించటం దగ్గర నుంచి మంచి ఆహారం పెట్టడం, వాకింగ్‌కు తీసుకెళ్లడం వంటివి చేస్తుంటారు. కుక్కలు కూడా తమ యజమానుల పట్ల ఎనలేని విశ్వాసాన్ని చూపిస్తూ వారితో ప్రేమగా ఆడుకుంటాయి. ఒక్కోసారి తమ యజమాని కనిపించకపోతే తల్లడిల్లిపోతాయి. ఆహారం కూడా తినకుండా ఎదురుచూస్తాయి. ఇక యజమాని రాగానే, వారి చుట్టూ తిరుగుతూ.. తోక ఆడిస్తూ.. నాకుతూ.. తమ ప్రేమను వ్యక్తపరుస్తుంటాయి. ఎవరైనా యజమానితో దురుసుగా మాట్లాడినా, కొట్టడానికి వెళ్లినా వారిపై దూకి దాడి చేస్తాయి. కాగా, ఇప్పటికే శునకాలు, తమ యజమానుల పట్ల ప్రదర్శించే ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా టర్కీలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. వివరాలు.. ఇస్తాంబుల్‌లోని బుయుకడా ఐలాండ్‌లోని ఒక మహిళ అనారోగ్యానికి గురై, కొన్ని రోజుల పాటు మంచానికే పరిమితమయ్యింది. ఆ మహిళ ఒక శునకాన్ని పెంచుకునేది. అయితే, ప్రతిరోజు తనతో ఆడుకునే యజమాని లేవకుండా ఒకే దగ్గర ఉండటాన్ని చూసి కుక్క తల్లడిల్లిపోయింది. ప్రతిరోజు తన యజమాని దగ్గరకు వెళ్లడం నోటితో నాకుతూ.. కదిలించటానికి ప్రయత్నించేది. కొన్ని రోజులకి ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో బంధువులు అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆ కుక్క కూడా అంబులెన్సు వెనుక పరిగెడుతూ ఆసుపత్రికి చేరుకుంది. ఆ తర్వాత, యజమానిని ఆసుపత్రి గదిలోకి తరలించారు. అయితే, శునకం మాత్రం.. తన యజమాని కోసం ఆసుపత్రి బయట కూర్చుని ఎదురుచూస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘ మనుషుల కంటే శునకాలే నయం’, ‘ఆ మహిళ నిజంగా అదృష్టవంతురాలు’, ‘ఆ కుక్క చూపిస్తున్న ప్రేమకు కన్నీళ్లు వస్తున్నాయి..’, ‘ఆ మహిళ తొందరగా కొలుకోవాలి’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. చదవండి: మెట్రోలో సీటు కోసం.. ఎంత పని చేశాడు! వైరల్ వీడియో -
వీటికి విశ్వాసంతో పాటు జెలసీ ఎక్కువే!
విశ్వాసం అనే మాట వినబడగానే మనకు వెంటనే శునకాలు గుర్తు వస్తాయి. విశ్వాసఘాతుకానికి పాల్పడేవాళ్లను ‘కుక్కకు ఉన్న విశ్వాసం కూడా నీకు లేదు’ అని తిట్టిపోస్తుంటాం. విశ్వాసం సంగతి సరే, మరి ఈర్షా ,అసూయల సంగతి ఏమిటి? ఇట్టి విషయంపై న్యూజిలాండ్‌లోని యూనివర్శిటీ ఆఫ్ అక్లాండ్ శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. శునకాల యజమానుల నుంచి రకరకాల కోణాలలో సమాచారాన్ని సేకరించి విశ్లేషించారు. అంతే కాదు...హైలీ–రియాలిటీ ఆర్టిఫిషియల్ శునకాన్ని తయారుచేశారు. ఒక శునక యజమాని ఈ కృత్రిమ శునకం తలను నిమురుతున్న వీడియోను ఆయన కుక్కగారికి చూపితే అసూయతో ముఖం అటు తిప్పుకుంది. ఇలా ఎన్నిసార్లు చేసినా అలాగే జరిగింది. పక్కింటి కుక్క గురించి పొగిడినా, ఏదైనా దానికి ఇచ్చినా వాటి ఫేస్‌లో జెలసీ కనిపిస్తుందట! -
రూ.399 లకే విమాన టికెట్
సాక్షి,న్యూఢిల్లీ: బడ్జెట్ క్యారియర్ ఎయిర్ ఏసియా ప్రమోషనల్ ఆఫర్‌గా అతి తక్కువ ధరకే విమాన టికెట్లను అందిస్తోంది. రూ.399 లకే విమాన టికెట్లు అందిస్తోంది. నవంబరు 18 దాకా ఈ ఆఫర్లో టికెట్లను బుక్ చేసుకునే అవకాశం. ఇలా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా మే 6, 2019 నుంచి ఫిబ్రవరి 4, 2020 వరకు ప్రయాణించే అవకాశం ఉంది. వన్‌వేలో దేశీయంగా రూ.399, అంతర్జాతీయ మార్గాల్లో 1999 రూపాయలకే టికెట్లను ఆఫర్ చేస్తోంది. అయితే ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్లో టికెట్లను బుక్ చేసుకునే అవకాశం. హైదరాబాద్, విశాఖపట్నం తోపాటు, బాగ్దోగ్రా, బెంగళూరు, భువనేశ్వర్, గోవా, గువహటి, ఇంఫాల్, ఇండోర్, జైపూర్, కొచ్చి, కోలకతా, న్యూఢిల్లీ, పుణ్, రాంచీ, శ్రీనగర్ నగరాలకు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఎయిర్ ఏసియా వెబ్సైట్, లేదా యాప్ ద్వారా టికెట్ బుకింగ్ సదుపాయం లభ్యం. అయితే బిగ్ లాయల్టీ ప్రోగ్రాంలోని ‘బిగ్ మెంబర్స్’ కు మాత్రమే ఈ ఆఫర్‌ను దక్కించుకునే అదృష్టాన్ని కల్పించింది. ఎయిర్ ఏసియా వెబ్సైట్ సమాచారం ప్రకారం, ఇండోర్-హైదరాబాద్, రాంచి- కోలకతా మార్గాల్లో రూ .399గా టికెట్ లభ్యమవుతోంది. వివిధ మార్గాల్లో టికెట్ల ప్రారంభ ధరలు ఈ విధంగా ఉండనున్నాయి. బెంగళూరు-హైదరాబాద్ : రూ. 500 బెంగళూరు-విశాఖపట్నం : రూ. 999 కోలకతా-రాంచీ : రూ. 967 బెంగళూరు-భువనేశ్వర్ : రూ .1,399 బెంగళూరు-కొచ్చి : రూ. 500 బెంగళూరు-చెన్నై: రూ. 500 ఇక అంతర్జాతీయ మార్గాల విషయానికి వస్తే.. భువనేశ్వర్- కౌలాలంపూర్ మధ్య రూ .1999 ప్రారంభ ధరగా ఉంది. కాగా ప్రపంచవ్యాప్తంగా తమ బిగ్ సభ్యులు 20 మిలియన్ల మార్క్‌ను చేరుకున్నారని, ఆగస్టు 29న విడుదల చేసిన ఒక ప్రకటనలో ఎయిర్ ఏసియా వెల్లడించింది. టాటాసన్స్ , మలేసియా ఎయిర్‌లైన్స్ జాయింట్ వెంచర్ సంస్థ అయిన ఎయిర్ ఏసియా 25 దేశాల్లో 165 ప్రదేశాలకు సర్వీసులను నిర్వహిస్తోంది. -
ఆటోడ్రైవర్ నిజాయతీ
– రూ.45 వేల నగదు, బంగారు ఉంగరాన్ని పోలీసులకు అప్పగింత గుడిబండ (మడకశిర) : ఓ ఆటోడ్రైవర్ నిజాయతీని ప్రజలు, పోలీసులు మెచ్చుకున్నారు. గుడిబండ మండలం మేకలగట్టకు చెందిన రమేష్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. రోజూ గుడిబండ– మడకశిర మధ్య ఆటోను నడుపుతున్నాడు. మంగళవారం ఉదయం తన ఆటోలో మడకశిర మండలం పాపసానిపల్లికి చెందిన శాంతమ్మ కదిరేపల్లి క్రాస్‌లో ఎక్కి, మడకశిరలో దిగేటప్పుడు బ్యాగును మరిచిపోయింది. ఈవిషయాన్ని ఆటో డ్రైవర్ రమేష్ గుర్తించాడు. అందులో చూడగా రూ.45 వేల నగదు, ఒక బంగారు ఉంగరం ఉంది. వెంటనే గుడిబండకు వెళ్లి విషయాన్ని ఎస్ఐ ఖాజాహుస్సేన్‌కు వివరించాడు. తనకు దొరికిన రూ.45వేల నగదు, బంగారు ఉంగరాన్ని ఎస్ఐకు అప్పగించాడు. ఈ నగదు, బంగారు ఉంగరాన్ని ఎస్ఐ ఖాజాహుస్సేన్ శాంతమ్మకు అందజేశారు. పోలీసులు, ప్రజలు ఆటో డ్రైవర్ నిజాయతీని మెచ్చుకున్నారు. -
టేస్టాతురాణాం... న క్లాసూ... న మాసు!
పెట్టే చేతిని మరవడం... ఇచ్చే చేతిని కరవడం మన హైదరాబాద్ వాసులకు తెలియని పని. తిండి పెట్టే వారి విషయంలో నగరవాసులకు లాయల్టీ ఎక్కువ. ‘బ్రాండ్ లాయల్టీ’ తరహాలోనే... తమకు ఏదైనా పెట్టేవారి పట్ల ‘ఫుడ్డు లాయల్టీ’ అనే ప్రత్యేక గుణం భాగ్యనగరవాసులకు ఉండటం ఆ పెట్టేవారి మహద్భాగ్యం. తాత్పర్యమేమనగా... సదరు పెట్టేవారు తమ గల్లా పెట్టె నింపుకునేందుకు పెట్టి పుట్టారన్నమాట. ఓ పక్క మింట్ కాంపౌండ్ పక్కనే ఉందా! మరో పక్క రాష్ట్ర పాలన సాగించే కేంద్ర బిందువు సచివాలయం వెనకభాగం ఉందా! ఈ రెండూ కలిసే చోట ఓ పెద్ద చెట్టు నీడ ఉందా! అక్కడున్న పుచ్చకాయల అమ్మకం ఎంత ఫేమస్సంటే... ‘ఎర్రని పండూ ఎన్నీయల్లో... ఎర్రెర్రెని పండూ ఎన్నీయలో... కోసుకు కొనండి, తినండి ఎన్నీయల్లో... తిని కూలైపోండి ఎన్నీయల్లో’ అంటూ ఆత్రమాత్రంగా తింటుంటారు. ఇక మరో దృష్టాంతం. ఒకనాటి వివిధభారతి వాణిజ్య విభాగంలో వినిపించే బట్టలషాపు పేరైన ‘తుంగస్వామి’ సిల్క్స్ పక్కనే మరో కొట్టు ఉంటుంది. బయట కణకణలాడుతూ కనిపించే ఓ నిప్పు కణికెల పే...ద్ద పొయ్యి మీద పాలు మరుగుతూ ఉంటాయి. అక్కడ పాలతో పాటు, లస్సీ, మలాయ్ మీద చక్కెర, పాలతో చేసే కలాఖండ్ ఇత్యాది పాల ఉత్పాదనలన్నీ అమ్ముతూ ఉంటారు. అదెంత పాతదంటే... దాదాపు పాతికేళ్ల క్రితమే దుకణాలకు షట్టర్లు అమర్చిన ఈ కాలంలోనూ... అలనాటి పాత గట్టి చెక్క తలుపులతో... అలనాటి వాళ్ల తలపులతో అలరారుతూ ఉంటుందా కొట్టు. చక్కెర వ్యాధి ఉన్నవాడు దాన్ని చెత్తబుట్టలో వేసేసి, కొలెస్ట్రాల్‌తో కొట్లాడి, దాన్ని పక్కన పడుకోబెట్టి... డబుల్ మలాయ్ మీద త్రిబుల్ చక్కెర వేయించుకుని తింటూ ఉంటాడు. సినిమా థియేటర్ల తాలూకు జురాసిక్ పిరియడ్‌లో ఆ కొట్టుకు సరిగ్గా ఇరువైపులా ముందు భాగంలో రాయల్ టాకీసూ, దిల్షాద్ థియేటరూ అని రెండు సినిమా హాళ్లుండేవి. థియేటర్ల జురాసిక్ కాలాంతం నాటికి అలనాటి ఆ థియేటర్లతో పాటూ తర్వాత ఆవిర్భవించిన పరమేశ్వరీ, మహేశ్వరీ లాంటి మరెన్నో అంతరించి పోయాయేమోగానీ... పాలలోని అమృతగుణం వల్ల ఆ షాపు మాత్రం ఇంకా నిప్పుకణికల పొయ్యిలోని ఎర్రదనంతో ఖణఖణలాడుతూ... సారీ కళకళలాడుతూ జనాల మలాయ్ జిహ్వను తీరుస్తూ అక్కడే ఉంది. ఇక మెహదీపట్నం రైతుబజార్ పక్కనే ఉన్న రోడ్డు మీద ఇంటర్నేషనల్ ఫ్రూట్‌జ్యూస్ సెంటర్లోని ఫ్రూట్సలాడ్ సరేసరి. కాకపోతే అప్పట్లో మట్టిముంతలో ఫ్రూట్సలాడ్ ఇచ్చేవారు. కాలక్రమంలో మట్టిముంత మట్టిలో కలిసిపోగా... ఇప్పుడు ప్లాస్టిక్ గిన్నెల్లో ఇస్తున్నారు. ఇలాంటివే మరెన్నో... అల్ఫా చాయ్, బ్లూసీ టీ, బవర్చీ బిర్యానీ, పిస్తాహౌజ్ హలీమ్. వీటన్నింటికీ సలామ్. ఇంత ఏల... మచ్చుకో ఉదాహరణ ఇచ్చుకుందాం చాలు. మన గోకుల్ చాట్‌లో బాంబులు పెట్టి పేల్చేసినా సరే... ఉగ్రవాదుల్నీ, వాళ్ల దుశ్చర్యలనూ తమ నాలుకలను బయటపెట్టి... ‘వెవ్వెవ్వే’ అని వెక్కిరించి... బయటకు తీసిన ఆ నాలుక మీద కాసిన్ని చాట్ ఐటమ్స్‌ను చప్పరిస్తూ ఇప్పటికీ తమ చాటాభిమానం చాట్కుంటున్నారు మన నగరవాసులు. ఈ అన్నిచోట్లకూ కార్లలోని క్లాసు పీపుల్‌తో పాటు మాస్ పీపులూ ఒకేలా వస్తూ, ఐటమ్స్‌ను టేస్ట్ చేస్తూ ఉంటారు. ఇదీ సగటు హైదరాబాదీల కాస్టు ఎఫెక్టివ్ టేస్టు మహిమ. - యాసీన్ -
'వాత్సల్యం, విధేయత మార్కెట్ లో దొరకవు'
న్యూఢిల్లీ: రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే నాయకులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు. బాధ్యతారహితంగా మత, రాజకీయ సంబంధ వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. నాయకులు ఆచితూచి మాట్లాడాలని సూచించారు. వివాదస్పద వ్యాఖ్యలు చేసిన అసదుద్దీన్ ఒవైసీ, సాక్షి మహరాజ్, సాధ్వీ నిరంజన్ జ్యోతి తదితర నాయకులకు ప్రధాని, ముఖ్యమంత్రులు ముకుతాడు వేయాలని ట్విటర్ లో పేర్కొన్నారు. వాత్సల్యం, విధేయత అనేవి మార్కెట్ లో దొరికే వస్తువులు కాదంటూ దిగ్విజయ్ సింగ్ మరో ట్వీట్ చేశారు.