కుక్కలు విశ్వాసానికి ప్రతీక. అవి మనుషులతో కలిసిపోయి వారిపట్ల ఎంత కృతజ్ఞతను చూపిస్తాయో అందరికీ తెలిసిందే. కానీ ఓ కుక్క మాత్రం దాని గుణంతో అందర్నీ మంత్ర ముగ్దుల్ని చేసింది. చనిపోయి వందేళ్లు కావస్తున్న ఇంకా దాన్ని గుర్తుపెట్టుకోవడమే గాక దాని గురించి కథనాలు, కవితలు ఇంకా పత్రికల్లో వస్తున్నాయంటే నమ్ముతారా?!. దాని కోసం ఓ విగ్రహం కూడా ఏర్పాటు చేసి.. ప్రతి ఏటా అది చనిపోయిన రోజు అక్కడకు వచ్చి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంతకీ ఎందుకు ఆ కుక్క అంత ప్రాముఖ్యతను సంతరించుకుందో చూద్దామా!
హచికో అనే కుక్క జపనీస్‌కి చెందిన క్రిమ్ వైట్ అకితా జాతికి చెందినది. ఈ అకితా జాతి కుక్కలు అత్యంత ప్రజాదారణ పొందినవి. జపాన్ ప్రభుత్వం జాతీయ చిహ్నంగా వాటికి స్థానం కల్పించింది కూడా. ఇక ఈ హచికో కూడా ఆ జాతికే చెందింది కావడంతో దాని విశ్వాసం, గొప్పతనం ప్రపంచానికి తెలియజేసింది. ఇది జపాన్‌లోని అకిటా ప్రిఫెక్చర్‌లోని ఓడేట్‌లోని వ్యవసాయక్షేత్రంలో నవంబర్ 10, 1923న జన్మించింది. ఒక ఏడాది తర్వాత టోక్యో ఇంపీరియల్ విశ్వ విద్యాలయంలో అగ్రికల్చర్ విభాగంలో ప్రోఫెసర్‌గా ఉన్న హిడేసాబురో యునో అనే వ్యక్తి ఈ హచికో అనే కుక్కని అడాప్ట్ చేసుకున్నాడు.
అతను దాన్ని టోక్యోలోని షిబుయాలో ఉన్న తన ఇంటికి తీసుకువెళ్లాడు. ప్రతి రోజు యునో తన డ్యూటీకి వెళ్లేముందు సమీపంలోని షిబుయా స్టేషన్ వరకు వచ్చి.. అతడిని సాగనంపేది. ఇలా మే 21, 1925 వరకు సాగింది. ఐతే ఒక రోజు హఠాత్తుగా యునో తన తరగతి గదిలో పాఠాలు చెబుతూ సెర్రిబల్ హేమరేజ్‌కి గురై చనిపోయాడు. ఐతే అతడి పెంపుడు కుక్క ఆ రైల్వే స్టేషన్ వద్దే అతడి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉండిపోయింది. కానీ ఆ కుక్క ఆ ప్రొఫెసర్ వాసనను గుర్తుపట్టగలగడంతో ఇంటికి వెళ్లి చూసింది. అక్కడ శవపేటికలో ఉన్న అతడిని గుర్తించి.. అక్కడ నుంచి కదలలేదు.
ఆ తర్వాత కూడా అలానే ఉండిపోయింది. ఎందుకనో ఎప్పటిలానే తన యజామానితో కలిసి వెళ్లే రైల్వేస్టేషన్ వద్ద ఉండేది. తన యజమాని వచ్చే రైలు వచ్చే టైం కల్లా ఠంఛన్‌గా వచ్చేసి ఎదురుచూస్తు ఉండేది. ఈ ఘటన అక్కడ ఉన్నవాళందర్నీ కంటతడి పెట్టించేది. కానీ అది మాత్రం తన యజమానికి ఎప్పటికైనా రాకపోడా.. అన్నట్లుగా అలానే దాని దినచర్య కొనసాగించేది. దీంతో ఈ కుక్క విషయం చుట్టుపక్కాలంతా కథలుథలుగా వ్యాపించింది. ఆ కుక్క విషయం తెలుసుకున్న వారంతా పాపం అనుకుంటూ.. ఆ కుక్కకి భోజనం అవి, ఇవి పెడుతుండేవారు. ఐతే ఆ కుక్క కొన్నాళ్లు తన యజమాని తోటమాలి కికుసాబురో కొబయాషితో ఉండటం ప్రారంభించింది.
అయినప్పటికీ ఆ రైల్వే స్టేషన్‌కి యథాలాపంగా తన యజమాని వచ్చే రైలు టైంకి వెళ్లిపోయేది. అలా.. అది చనిపోయేంత వరకు ఆ విధంగానే చేసింది. అప్పటి వరకు దాని గురించి అక్కడ వరకే పరిమితమైతే ..ఆ తర్వాత జపాన్ అంతటా తెలిసిపోయింది. దీంతో స్టేషన్‌కి దాని పోషణార్థం పెద్ద సంఖ్యలో విరాళాలు కూడా వచ్చాయి. రెండోవ ప్రపంచ యుద్ధంలో ఈ కుక్కని వినయోగించాలనే ప్రయత్నం కూడా చేశారు. ఇక హచికో 11 సంవత్సరాల వయస్సులో మార్చి 8, 1935న చనిపోయింది.
పెద్ద సంఖ్యలో సందర్శకులు ఆ కుక్కను చూసేందుకు వచ్చారు కూడా. అంతేగాదు బౌద్ధ సన్యాసులే దగ్గరుండి ప్రార్థనలు చేసి మరీ ఆ కుక్కకి అంత్యక్రియలు నిర్వహించారు. దాని మరణ వార్త సైతం పలు పేపర్లో కథనాలుగా వచ్చాయి కూడా. ఆ తర్వాత 1948 దాని గౌరవార్థం విగ్రహం కూడా ఏర్పాటు చేశారు జపాన్ వాసులు. అక్కడ జపాన్‌లో ప్రతి ఏటా ఆ కుక్క చనిపోయిన రోజు ఆ స్మారక చిహ్నం వద్ద పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించి నివాళులర్పించడం వంటి చేస్తుంటారు అక్కడి ప్రజలు. అంతేగాదు ఈ 'హచికో కుక్క' దాని అచంచలమైన విశ్వాసం కారణంగా ప్రపంచంలోనే అత్యంత విశ్వాసం గల కుక్కగా పేరుగాంచింది.
(చదవండి: అమెరికా మాజీ అధ్యక్షుడి లేఖ ..వేలంలో ఎంత పలికిందంటే..)
Comments
Please login to add a commentAdd a comment