జపాన్‌లో సంభవించిన భూకంపం అందరినీ వణికిస్తోంది. ఈ విపత్తు పరిణామాలు ఒక్కొక్కటిగా వెలికివస్తున్నాయి. నిజానికి జపాన్‌ను భూకంపాలకు కేంద్రంగా పరిగణిస్తుంటారు. ఇటీవల జపాన్‌లో 7.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే ఇప్పుటివరకూ ప్రపంచంలో సంభవించిన అత్యంత తీవ్రత కలిగిన భూకంపం చిలీలోని వాల్డివియాలో చోటుచేసుకుంది.
1960లో వాల్డివియాలో సంభవించిన భూకంపం దాదాపు 10 నిమిషాల పాటు కొనసాగింది. ఇది చాలా తీవ్రమైనది. ఈ సమయంలో అక్కడ సునామీ కూడా సంభవించింది. ఈ భారీ భూకంపానికి సముద్ర ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. 9.5 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం చరిత్రలో భారీ భూకంపంగా నిలిచింది.
చిలీ తీర ప్రాంతం వాల్డివియాలో 1960, మే 22న ఈ భూకంపం సంభవించింది. సాధారణంగా కొన్ని సెకన్ల పాటు సంభవించే భూకంపాలు భారీ విధ్వంసాన్ని సృష్టిస్తాయి. వాల్డివియాలో చోటుచేసుకున్న భూకంపం నగరంలో 10 నిమిషాలపాటు భయోత్పాతాన్ని సృష్టించింది. ఆ తర్వాత చాలా శక్తివంతమైన సునామీ వచ్చింది. ఇది పలు దేశాలకు సైతం వ్యాపించింది.
ఈ భూకంపం కారణంగా వాల్డివియా నగరం మొత్తం ధ్వంసమైంది. ఈ నగరంలో జనాభా అంతగా లేనందున, ఈ భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య ఆరు మాత్రమేనని చెబుతుంటారు. ఇంతటి తీవ్రతతో భూకంపం వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. ఇదే ఇప్పటివరకు సంభవించిన అత్యంత తీవ్రమైన భూకంపంగా పరిగణిస్తుంటారు.
ఇది కూడా చదవండి: జపాన్‌లో భారీ భూకంపం.. 155సార్లు కంపించిన భూమి
Comments
Please login to add a commentAdd a comment