Earth quake
-
అమెరికాలో భారీ భూకంపం
కాలిఫోర్నియా:అమెరికాలోని కాలిఫోర్నియా తీర ప్రాంతంలో అమెరికా కాలమానం ప్రకారం గురువారం(డిసెంబర్5) ఉదయం 10.44 గంటలకు భారీ భూకంపం వచ్చింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై ఏడుగా నమోదైంది. ఫెర్నడెల్ పట్టణంలో భూకంప కేంద్రం నమోదైంది. ఈ విషయాన్ని అమెరికా జియోగ్రఫికల్ సర్వే విభాగం వెల్లడించింది.తీర ప్రాంతంలో భారీ భూకంపం రావడంతో అమెరికా సునామీ కేంద్రం ముందస్తు చర్యగా సునామీ హెచ్చరికలు జారీ చేసింది. భూకంప ప్రభావంతో పెట్రోలియా, స్కాటియా, కాబ్ తదితర ప్రాంతాల్లో శక్తిమంతమైన ప్రకంపనలు నమోదయ్యాయి.Shocking Footage of California's 7.0 Mega Quake Captured on Cam!Mother Earth just showed off her raw power with a 7.0 shaker in Cali, and folks, it's all on camera! From swimming pools doing the wave to dogs sensing the rumble before humans, this earthquake video is the talk of… pic.twitter.com/j2hHVBj7JL— 𝕏VN (@xveritasnow) December 5, 2024ఉత్తర దిశలో వచ్చన భూ ప్రకంపనలు దక్షిణ ప్రాంతంలోని శాన్ఫ్రాన్సిస్కో దాకా వచ్చాయంటే తీవ్రత అర్థం చేసుకోవచ్చు.భూకంపం వల్ల భవనాల్లోని ప్రజలు కొంత సేపు అటుఇటు ఊగిపోయారు. భూకంపం ముగిసిన తర్వాత కూడా అనంతర ప్రకంపనలు వచ్చాయి. భూకంపం ధాటికి ప్రాణ,ఆస్తి నష్టాలు ఏమైనా సంభవించాయా అనేది తెలియాల్సి ఉంది. -
భూకంపాలు ఎందుకు వస్తాయి?
-
రాజమండ్రిలో భూకంపం.. ఆందోళనలో ప్రజలు
-
కంపించిన భూమి.. పరుగులు తీసిన జనం
-
జార్ఖండ్‌లో భూకంపం.. వణికిన రాంచీ, జంషెడ్పూర్
రాంచీ: జార్ఖండ్‌లో భూకంపం సంభవించింది. రాజధాని రాంచీ, జంషెడ్‌పూర్‌తో పాటు చుట్టుపక్కల పలు జిల్లాల్లో శనివారం ఉదయం భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది.జార్ఖండ్‌లోని ఖర్సావాన్ జిల్లాకు 13 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. శనివారం ఉదయం 9:20 గంటలకు భూకంపం వచ్చింది. వెంటనే జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇది కూడా చదవండి: దాడిలో భర్త మృతి.. గర్భిణి భార్య చేత బెడ్ శుభ్రం చేయించి.. -
జమ్ము కశ్మీర్లో స్వల్ప వ్యవధిలో రెండుసార్లు భూకంపం
జమ్ము కశ్మీర్లో మంగళవారం తెల్లవారుజామున స్వల్ప వ్యవధిలో రెండుసార్లు భూకంపం సంభవించింది. బారాముల్లా, పూంచ్ ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.9, 4.8గా నమోదైంది.జమ్ము కశ్మీర్లో సంభవించిన భూకంపాలకు ఆస్తినష్టం, ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. అయితే బారాముల్లాలో సంభవించిన భూకంపం నుండి ప్రాణాల్ని కాపాడుకునేందుకు భవనంపై నుండి దూకినట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన స్థానికులు బాధితుడిని అత్యవసర చికిత్స నిమిత్తం బారాముల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు బాధితుడికి వైద్య సేవలందిస్తున్నారు. VIDEO | Tremors of an earthquake with a magnitude of 4.8 felt in Jammu and Kashmir earlier today. Visuals from Baramulla.#earthquake pic.twitter.com/8zbcMySOC6— Press Trust of India (@PTI_News) August 20, 2024 -
తైవాన్‌లో భూకంపం
తైపే: తైవాన్ తూర్పుతీరంలో శుక్రవారం(ఆగస్టు16) తెల్లవారుజామున భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్డర్స్కేల్పై 6.1గా నమోదైంది. ఈ విషయాన్ని అమెరికా జియలాజికల్సర్వే తెలిపింది. హులియెన్ నగరం సమీపంలో 15 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం నమోదైనట్లు తైవాన్ కేంద్ర వాతావారణ కేంద్రం వెల్లడించింది.భూకంపం విషయాన్ని తైవాన్ వాతావరణ కేంద్రం ముందుగానే పౌరులకు మొబైల్‌ఫోన్ సందేశాల రూపంలో చేరవేసింది. ఎక్కడివారక్కడ జాగ్రత్తగా ఉండాలని అప్రమత్తం చేసింది. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని తైవాన్ నేషనల్ ఫైర్ ఏజెన్సీ తెలిపింది. -
పెరూలో భారీ భూకంపం
పెరూ: దక్షిణ పెరూలోని ఎరెక్విపా ప్రాంతంలో శుక్రవారం(జూన్28) భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.0గా నమోదైంది. భూకంపం తర్వాత వెంటవెంటనే చిన్న భూకంపాలు రావడం వల్ల కొన్ని చోట్ల కొండచరియలు విరిగి పడ్డాయి. కొండ చరియలు విరిగిపడిన ఘటనల్లో తీవ్రంగా గాయపడ్డవారికి ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నట్లు పెరూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. భూకంపం తర్వాత వెంటవెంటనే చిన్న భూకంపాలు రావడం వల్ల కొన్ని చోట్ల కొండచరియలు విరిగి పడ్డాయి. భూకంపం వల్ల ఎంత నష్టం జరిగింది అనే దానిని అంచనా వేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. భూకంపం తర్వాత ఎలాంటి సునామీ హెచ్చరిక జారీ చేయలేదని ప్రధాని గుస్తావో అడ్రియన్జెన్ తెలిపారు. -
అమెరికాలో భూకంపం!
న్యూయార్క్: యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం.. అమెరికాలో పలు రాష్ట్రాల్లో భూకంపం సంభించినట్లు తెలుస్తోంది. న్యూయార్క్ నగరం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10.30 గంటలకు 4.8 తీవ్రతతో భూకంపం సంభించింది. పొరుగున ఉన్న న్యూజెర్సీ సైతం భూకంపం భారీన పడిందని పలు వెలుగులోకి రాగా..భూకంపం ప్రభావం ఏ మేరకు చూపందనే విషయాలు వెలుగులోకి రావాల్సి ఉంది. బ్రూక్లిన్‌లోని భవనాలు కంపించాయని ఏఎఫ్‌పీ మీడియా ప్రతినిధి నివేదించారు. భూకంపం వచ్చిన సమయంలో న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో గాజాలో పరిస్థితిపై భద్రతా మండలి సమావేశం నిర్వహిస్తుంది. ప్రకంపనలతో సమావేశాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. Notable quake, preliminary info: M 4.8 - 7 km N of Whitehouse Station, New Jersey https://t.co/DuTYZ1kb4X — USGS Earthquakes (@USGS_Quakes) April 5, 2024 ఫిలడెల్ఫియా నుండి న్యూయార్క్ వరకు తూర్పు వైపు లాంగ్ ఐలాండ్ వరకు భూకంపం సంభవించినట్లు నెటిజన్లు ట్వీట్లు,పోస్ట్‌లు పెడుతున్నారు. #WATCH : Streamer captures moment earthquake hit New Jersey and felt in New York City#NewYorkCity #NewYork #earthquake #JUSTIN #LatestNews #USNews #USA #NewJersey pic.twitter.com/spo8RcHI17 — upuknews (@upuknews1) April 5, 2024 https://t.co/pf77R31SX6 — SkyQueen (@Triquetra331) April 5, 2024 -
వీడియోలు: భూకంపంతో తల్లడిల్లిన తైవాన్.. సునామీ హెచ్చరిక జారీ
తైపీ: తైవాన్‌లో భారీ భూకంపం చోటు చేసుకుంది. బుధావారం తెల్లవారుజామున తైవాన్ రాజధాని తైపీలో రిక్టర్ స్కేల్‌లోపై 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. తైవాన్‌లో హువాలియన్ సిటీకి దక్షిణంగా 18 కిలో మీటర్ల దూరంలో 34.8 కిలో మిటర్ల లోతులో ఈ భూకంపం కేంద్రీకృతమైనట్లు అధికారులు తెలిపారు. ఈ భూకంపం వల్ల వివిధ ప్రాంతాల్లో 7 మంది మృతి చెందగా.. సుమారు 730 మంది గాయపడినట్లు తెలుస్తోంది. తీవ్రమైన ఆస్తి నష్టం జగరినట్లు సమాచారం. భూకంపానికి ఓ బిల్డింగ్ ప్రమాదకర స్థాయిలో కుంగిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. గత 25 ఏళ్లలో ఇదే భారీ భూకంపమని అధికారులు తెలిపారు. 🚨🇹🇼 Building Collapse in Taiwan Due to Earthquakes | Visible Structural Damage Source: @northicewolf https://t.co/cpytWyIx4y pic.twitter.com/Qc0XS4ZXXx — Mario Nawfal (@MarioNawfal) April 3, 2024 మియాకోజిమా ద్వీపంతో సహా జపాన్ దీవులకు సుమారు మూడు మీటర్ల ఎత్తులో సముద్ర అలలు ఎగిసిపడి సునామి వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో తైవాన్ ప్రజలు ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యారు. పెద్దసంఖ్యలో జనాలు రోడ్లమీదకు వచ్చారు. ఇక.. సునామి రాబోతుంది అందరూ ఖాళీ చేయండని అక్కడి టీవీ ఛానెల్స్ ప్రసారం చేస్తున్నాయి. జపాన్ సైతం సునామి హెచ్చరికలు జారీ చేసింద. తైవాన్‌లో తరచూ భూకంపాలు వస్తూ ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇక.. 1999లో 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 2400 మంది తైవాన్ ప్రజలు మృత్యువాత పడ్డారు. JUST IN: 7.5 magnitude earthquake strikes Taiwan, rocking the whole island and even causing several buildings to collapse. The earthquake triggered a tsunami warning of up to 10 feet from Japan. "Tsunami is coming. Please evacuate immediately. Do not stop. Do not go back,"… pic.twitter.com/E1783aoN3k — Collin Rugg (@CollinRugg) April 3, 2024 భూకంపం కారణంగా తైవాన్ రాజధాని తైపీలో అనేక బిల్డింగుల్లో పగుళ్లు వచ్చాయి. జపాన్‌లోని కొన్ని దీవుల్లో పెద్ద ఎత్తున ఆస్తీ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. భూప్రకంపనాలు సంభవిస్తున్న సమయంలో ఓ స్విమ్మింగ్ పూల్ నీళ్లు.. సముద్రంలో అలల్లా స్విమింగ్ పూల్‌లో అలజడికి గురయ్యాయి. స్మిమింగ్‌పూల్ ఉన్న భయభ్రాంతులకు గురయ్యాడు. దీనికిసంబంధించి ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. This is not just another funny video on social media. These visuals capture the scary moment a 7.4 earthquake hit Taiwan, even affecting a swimming pool. Prayers for Taiwan & Japan. 🙏 #Taiwan #Japan pic.twitter.com/iuGtutTeMo — Prayag (@theprayagtiwari) April 3, 2024 -
రాజమౌళి తనయుడి ట్వీట్.. నెటిజన్స్ ఆగ్రహం!
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి కుటుంబం ప్రస్తుతం జపాన్‌లో ఉంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన సూపర్ హిట్ సినిమా 'ఆర్ఆర్ఆర్' స్క్రీనింగ్ కోసం వారు అక్కడికి వెళ్లిన విషయం తెలిసిందే. కానీ అక్కడ స్వల్ప భూకంపం వచ్చిందని ఆయన కుమారుడు కార్తికేయ తన ఎక్స్ ఖాతాలో ఫోస్ట్ చేశాడు. జపాన్‌లో ఒక భారీ బిల్డింగ్ 28వ ఫ్లోర్లో ఉన్నామని ఎందుకో బిల్డింగ్ కదులుతున్నటుగా అనిపించిందని కార్తికేయ రాసుకొచ్చాడు. కానీ కొంత సమయం తర్వాత అది భూకంపం వల్ల అలా జరిగినట్లు తెలిసి చాలా భయపడ్డానని ఆయన తెలిపాడు. మొదటిసారిగా భూకంపం ద్వారా కలిగే అనుభూతిని పొందానని రాసుకొచ్చారు. మండిపడ్డ నెటిజన్స్.. అయితే ఇది చూసిన నెటిజన్స్ ఎస్ఎస్ కార్తికేయ తీరుపై మండిపడుతున్నారు. భూకంపం అంటే అదేమైనా జోక్ అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. మరో నెటిజన్ రాస్తూ భూకంపం అనేది నీ బకెట్ లిస్ట్‌లో ఉందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సెన్సిటివ్ విషయాన్ని ఫన్నీగా ట్వీట్ చేయడంపై కార్తికేయపై మండిపడుతున్నారు. అలాగే ఇండియా బోర్డర్‌కు వెళ్లి బాంబుల మోత కూడా ఆస్వాదించు అంటూ సలహాలు కూడా ఇస్తున్నారు. ఏదేమైనా కార్తికేయ భూకంపంపై చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలోను ఊపేస్తోంది. Felt a freaking earthquake in Japan just now!!! Was on the 28th floor and slowly the ground started to move and took us a while to realise it was an earthquake. I was just about to panic but all the Japanese around did not budge as if it just started to rain!! 😅😅😅😅😅… pic.twitter.com/7rXhrWSx3D — S S Karthikeya (@ssk1122) March 21, 2024 Experiencing an Earthquake is in your bucket list ? Weird — RAVI SANKAR GARIMELLA (@ravis_g239) March 21, 2024 Experience an earthquake box ticked. ✅ --> WTF 😒 😒 — KK (@krishjlk) March 21, 2024 Pls go to Indian border and EXPERIENCE A BOMB BLAST also ... Tick it bro — KK (@krishjlk) March 21, 2024 -
అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.3 తీవ్రత
ఈటానగర్: అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం సంభవించింది. శనివారం ఉదయం రిక్కర్ స్కేల్‌పై 4.3 తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలాజీ(NCS) వెల్లడించింది. Earthquake of Magnitude:4.3, Occurred on 03-02-2024, 10:11:01 IST, Lat: 36.77 & Long: 97.17, Depth: 60 Km ,Location: 975km N of Pangin, Arunachal Pradesh, India for more information Download the BhooKamp App@KirenRijiju @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia @Indiametdept @moesgoi pic.twitter.com/HZ6G2yFf0z — National Center for Seismology (@NCS_Earthquake) February 3, 2024 ఉదయం 10. 11 గంటలకు సుమారు 60 కిలోమీటర్ల లోతుగా భూకంపం కేంద్రీకృతం అయినట్లు పేర్కొంది. ఈ భూకంపంలో ఎటువంటి ఆస్తీ, ప్రాణ నష్టం జరగలేదని ప్రభుత్వ అధికారులు తెలిపారు. -
Indonesia Talaud Islands Earthquake: ఇండోనేషియాలో భూకంపం
జకర్తా: ఇండోనేషియాలోని తలాడ్ దీవుల సమీపంలో భూకంపం సంభవించింది. రిక్ట్కార్ స్కేల్‌పై 6.7 తీవ్రతతో భూకంపం చోటుచేసుకున్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. మంగళవారం తెల్లవారుజామున 2.18 నిమిషాలకు భూమి కంపించింది. Earthquake of Magnitude:6.7, Occurred on 09-01-2024, 02:18:47 IST, Lat: 4.75 & Long: 126.38, Depth: 80 Km ,Location: Talaud Islands,Indonesia for more information Download the BhooKamp App https://t.co/Ughl0I9JG3 @Indiametdept @ndmaindia @Dr_Mishra1966 @KirenRijiju @Ravi_MoES — National Center for Seismology (@NCS_Earthquake) January 8, 2024 అయితే ఈ భూకంపం ద్వారా ఎటువంటి ఆస్తీ, ప్రాణ నష్టం జరగనట్లు తెలుస్తోంది. ఇటీవల జపాన్‌లో చోటుచేసుకున్న భూకంపం తీవ్ర నష్టం కలిగించిన విషయం తెలిసిందే. చదవండి: ఆ రోజు ప్రపంచ వ్యాప్తంగా ‘రామోత్సవం’ -
జపాన్ లో పెరుగుతున్న భూకంప మృతుల సంఖ్య
-
ప్రపంచంలో భారీ భూకంపం ఏది? తీవ్రత ఎంత?
జపాన్‌లో సంభవించిన భూకంపం అందరినీ వణికిస్తోంది. ఈ విపత్తు పరిణామాలు ఒక్కొక్కటిగా వెలికివస్తున్నాయి. నిజానికి జపాన్ను భూకంపాలకు కేంద్రంగా పరిగణిస్తుంటారు. ఇటీవల జపాన్‌లో 7.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే ఇప్పుటివరకూ ప్రపంచంలో సంభవించిన అత్యంత తీవ్రత కలిగిన భూకంపం చిలీలోని వాల్డివియాలో చోటుచేసుకుంది. 1960లో వాల్డివియాలో సంభవించిన భూకంపం దాదాపు 10 నిమిషాల పాటు కొనసాగింది. ఇది చాలా తీవ్రమైనది. ఈ సమయంలో అక్కడ సునామీ కూడా సంభవించింది. ఈ భారీ భూకంపానికి సముద్ర ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. 9.5 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం చరిత్రలో భారీ భూకంపంగా నిలిచింది. చిలీ తీర ప్రాంతం వాల్డివియాలో 1960, మే 22న ఈ భూకంపం సంభవించింది. సాధారణంగా కొన్ని సెకన్ల పాటు సంభవించే భూకంపాలు భారీ విధ్వంసాన్ని సృష్టిస్తాయి. వాల్డివియాలో చోటుచేసుకున్న భూకంపం నగరంలో 10 నిమిషాలపాటు భయోత్పాతాన్ని సృష్టించింది. ఆ తర్వాత చాలా శక్తివంతమైన సునామీ వచ్చింది. ఇది పలు దేశాలకు సైతం వ్యాపించింది. ఈ భూకంపం కారణంగా వాల్డివియా నగరం మొత్తం ధ్వంసమైంది. ఈ నగరంలో జనాభా అంతగా లేనందున, ఈ భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య ఆరు మాత్రమేనని చెబుతుంటారు. ఇంతటి తీవ్రతతో భూకంపం వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. ఇదే ఇప్పటివరకు సంభవించిన అత్యంత తీవ్రమైన భూకంపంగా పరిగణిస్తుంటారు. ఇది కూడా చదవండి: జపాన్‌లో భారీ భూకంపం.. 155సార్లు కంపించిన భూమి -
ఆ విషయం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యా: జూనియర్ ఎన్టీఆర్
జపాన్‌లో భూకంపం రావడంపై జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. గత వారం రోజులుగా అక్కడే ఉన్నానని ఆయన తెలిపారు. ఈ విపత్తు వల్ల ప్రభావితమైన ప్రతి ఒక్కరు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు. అలాగే ప్రతి ఒక్కరు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. జపాన్ ప్రజల ధైర్యానికి కృతజ్ఞతలు అంటూ పోస్ట్ చేశారు. ఎన్టీఆర్ తన ట్విటర్లో రాస్తూ..'జపాన్ నుంచి ఈరోజే ఇంటికి తిరిగి వచ్చా. అక్కడ భూకంపం వచ్చింది అని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. నేను వారం రోజులుగా అక్కడే ఉన్నా. ప్రతి ఒక్కరి క్షేమాన్ని కోరుకుంటున్నా. కష్ట సమయంలో జపాన్ ప్రజల ధైర్యానికి కృతజ్ఞతలు. ఈ విపత్తు నుంచి జపాన్ ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న దేవర చిత్రంలో నటిస్తున్నారు. Back home today from Japan and deeply shocked by the earthquakes hitting. Spent the entire last week there, and my heart goes out to everyone affected. Grateful for the resilience of the people and hoping for a swift recovery. Stay strong, Japan 🇯🇵 — Jr NTR (@tarak9999) January 1, 2024 -
జపాన్ను తాకిన సునామీ
కొత్త సంవత్సరం తొలిరోజే.. తూర్పు ఆసియా ద్వీప దేశం జపాన్ భారీ భూ కంపం, సునామీతో వణికిపోయింది. సోమవారం కేవలం గంటన్నర వ్యవధిలోనే 21సార్లు భూమి కంపించింది అక్కడ. సునామీ ధాటికి అలలు ఎగిసి పడడంతో.. తీర ప్రాంత ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. మరిన్ని ప్రకంపలు వచ్చే అవకాశం.. సునామీ ముప్పు ఇంకా తొలగిపోకపోవడంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మరోవైపు సునామీ తీర ప్రాంతాలన్నింటికి తాకవచ్చని అక్కడి ప్రభుత్వం టీవీ ఛానెల్స్ ద్వారా హెచ్చరించింది. ఇషికావాలో ఐదు మీటర్ల ఎత్తులో అలలు ఎగసి పడొచ్చని అంచనా వేసింది. అంతకు ముందు.. తీర ప్రాంత ప్రజలు ఖాళీ చేయాలని హెచ్చరికలు జారీ చేసింది. ఒకవేళ అలలు ఎగసిపడే పరిస్థితులు కనిపిస్తే వెంటనే పరుగులు తీయాలని ప్రజలకు సూచించింది. మరోవైపు భూకంపం తర్వాత టయోమా, ఇషికావా, న్నిగాటాలో దాదాపు 35 వేల నివాసాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఇతర నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. HAPPENING NOW: First visuals of HUGE wave hitting Suzu City in Japan#Earthquake #Japan #tsunami pic.twitter.com/1KH8D5yCTw — JAMES - ONTHERIGHT (@Jim_OnTheRight) January 1, 2024 భారత కాలమానం ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం ఇషికావా రాష్ట్రంలోని నోటో ప్రాంతంలో వరుసగా భూప్రకంపనలు వచ్చాయి. మొదట 5.7 తీవ్రతతో ఆ ప్రకంపనలు మొదలయ్యాయి. ఒక దశలో తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.6గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. A #tsunami warning was issued after the #earthquake in #Japan. And warnings are being made that the western coastal areas should be evacuated and everyone should move to higher ground. pic.twitter.com/QLp5ImoSxe — Daenerys Targaryen (@ve95153819) January 1, 2024 ఉత్తర కొరియా, రష్యా కూడా.. ఈ భారీ భూకంపంతో జపాన్‌తో పాటు ఉత్తర కొరియా, రష్యాకు కూడా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ హెచ్చరికలను రష్యా అధ్యక్ష కార్యాలయం ధ్రువీకరించింది. జపాన్‌కు సమీపంలో ఉన్న సఖాలిన్ ద్వీపంలోని కొన్ని ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు రష్యా ఎమర్జెన్సీ మంత్రి వెల్లడించారు. ఇంకోవైపు రెండు మీటర్ల ఎత్తునన అలలు ఎగసి పడే అవకాశం ఉండడంతో ఉత్తర కొరియా తన రేడియో ఛానెల్ ద్వారా హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. Strange behaviour of birds at time of earthquake in #Japan. #Tsunami #石川県 #緊急地震速報 #地震 #震度7 #津波#SOS pic.twitter.com/qY3wLcDM7r — Yamaan Shahid (@realYamaan) January 1, 2024 I am deeply saddened by the news of the earthquake and the tsunami warning in Japan. I hope the people of Japan are safe and supported in this time of crisis.#Japan #Tsunami #earthquake #Ishikawa pic.twitter.com/SKfK1OtMhX — Darshan Ahirrao (@Darsh_D_Ahirrao) January 1, 2024 భారత్ ఎమర్జెన్సీ నెంబర్లు జపాన్‌లోని భారత రాయబార కార్యాలయం కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది. సహాయం కోసం ఆయా నెంబర్లను సంప్రదించాలని సూచించింది. Embassy has set up an emergency control room for anyone to contact in connection with the Earthquake and Tsunami on January I, 2024. The following Emergency numbers and email IDs may be contacted for any assistance. pic.twitter.com/oMkvbbJKEh — India in Japanインド大使館 (@IndianEmbTokyo) January 1, 2024 రేడియో ఆక్టివిటీ ఛాయల్లేవ్ సునామీ ఆందోళన నేపథ్యంలో.. అక్కడి న్యూక్లియర్ రియాక్టర్ కేంద్రాల నుంచి అణుధార్మికత విడుదలై ఉంటుందా? అనే ఆందోళన వ్యక్తం అయ్యింది. అయితే ఇప్పటివరకు అలాంటిదేం జరగలేదని అక్కడి అధికారులు ప్రకటించారు. అయితే.. ఇంకా భూకంప భయం వీడకపోవడంతో ఏదైనా జరగవచ్చే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Frightening visuals from Japan as it begins new year suffering a massive 7.6 magnitude earthquake. pic.twitter.com/e3gyiVkq8f — Science girl (@gunsnrosesgirl3) January 1, 2024 -
10 అనూహ్య ఘటనలు.. ‘రివైండ్- 2023’
2023 సంవత్సరం కొద్ది రోజుల్లో ముగియబోతోంది. ఈ ఏడాది ప్రపంచంలో ఎన్నో అనూహ్య ఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించి, చైనాను వెనక్కి నెట్టివేసింది. అదే సమయంలో హమాస్ ఇజ్రాయెల్ పై దాడి చేసి, ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. 2023లో ప్రపంచంలో చోటుచేసుకున్న పది అనూహ్య ఘటనలివే.. టర్కీ-సిరియా భూకంపం: ఫిబ్రవరిలో టర్కీ, సిరియాలో భూకంపాలు సంభవించాయి. 7.8 తీవ్రతతో సంభవించిన సంభవించిన మొదటి ప్రకంపన తరువాత అనేక బలమైన ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ భారీ భూకంపం కారణంగా టర్కీలో 59 వేల మంది, సిరియాలో ఎనిమిది వేల మంది మరణించారు. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి: అక్టోబర్ 7న హమాస్.. ఇజ్రాయెల్‌పై అనూహ్య దాడికి దిగి ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ దాడిలో ఇజ్రాయెల్‌లో 1,200 మంది మరణించారు. హమాస్ దాదాపు 240 మందిని బందీలుగా పట్టుకుంది. ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రకటించింది. గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 18 వేల మందికి పైగా జనం మరణించారు. అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ : 2023లో చైనాను దాటి.. భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించనుంది. భారతదేశ జనాభా అంచనా 1.43 బిలియన్లు (ఒక బిలియన్ అంటే వంద కోట్లు). రాబోయే దశాబ్దాల్లో భారతదేశం అత్యధిక జనాభా కలిగిన దేశంగా కొనసాగే అవకాశాలున్నాయి. ఫ్రెడ్డీ తుపాను: చరిత్రలో అత్యంత సుదీర్ఘమైన ఉష్ణమండల తుపాను ఫ్రెడ్డీ 2023లో సంభవించింది. ఇది మలావి, మొజాంబిక్, నైరుతి ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో 14 వందలమందికిపైగా ప్రజలను బలిగొంది. జీ 20కి ఆతిథ్యం: సెప్టెంబర్ 9-10 తేదీలలో భారతదేశం జీ20 శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇచ్చింది. ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సహా 43 మంది వివిధ దేశాల అధినేతలు హాజరయ్యారు. కాప్-28 సమ్మిట్: వాతావరణ మార్పులపై కాప్-28 సమ్మిట్ దుబాయ్‌లో నవంబర్ 30 నుండి డిసెంబర్ 12 వరకు జరిగింది. ఈ ఏడాది ప్రపంచ ఉష్ణోగ్రత అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పటి వరకూ నమోదైన అత్యంత వేడి సంవత్సరంగా 2023 నిలిచింది. ప్రపంచ నేతలంతా ఈ సదస్సులో కర్బన ఉద్గారాలను తగ్గించే ప్రయత్నాలపై చర్చించారు. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్.. జూన్ 18న కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలో హత్యకు గురయ్యాడు. ఈ నేపధ్యంలో చోటుచేసుకున్న పలు పరిణామాలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. అమెరికాలో ఎగిరిన చైనా బెలూన్లు: జనవరి 28 నుండి ఫిబ్రవరి 4 వరకు, చైనా బెలూన్లు అమెరికా ఆకాశంలో ఎగురుతూ కనిపించాయి. ఈ బెలూన్ల సాయంతో చైనా గూఢచర్యం చేస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా యుద్ధ విమానాలను పంపి బెలూన్లను ధ్వంసం చేసింది. ఈ ఘటన చైనా-అమెరికా సంబంధాలలో ఉద్రిక్తతలకు దారితీసింది. ఎక్స్‌గా మారిన ట్విట్టర్: బిలియనీర్ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ గత సంవత్సరం ట్విట్టర్‌ను కొనుగోలు చేశారు. ఈ సంవత్సరం ఆయన ట్విట్టర్ పేరును ‘ఎక్స్’ గా మార్చారు. ట్విట్టర్ లోగోను కూడా మార్చారు. ఆఫ్ఘనిస్తాన్ భూకంపం: అక్టోబర్‌లో ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈ విపత్తులో నాలుగు వేల మందికి పైగా ప్రజలు మరణించారు. 9 వేల మందికి పైగా జనం గాయపడ్డారు. 13 వేలకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇది కూడా చదవండి: వందల ఏళ్ల మూఢనమ్మకాన్ని చెరిపేసిన సీఎం -
దేశంలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు
దేశంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు (ఆదివారం, నవంబర్ 26) ఉదయం భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం హర్యానాలోని సోనిపట్‌లో ఉదయం 4 గంటలకు మొదటి భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై మూడుగా నమోదైంది. రెండో భూకంప కేంద్రం అస్సాంలోని దర్రాంగ్‌లో భూమికి 22 కిలోమీటర్ల లోతులో ఉంది. ఇది ఉదయం 7:36 గంటలకు సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై మూడుగా నమోదయ్యింది. అయితే ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. తాజాగా సంభవించిన భూకంప తీవ్రత చాలా తక్కువగా ఉండడంతో దాని ప్రభావం కనిపించలేదు. ప్రజలు భయాందోళనకు గురై, ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ఎక్కడా ఎలాంటి నష్టం వాటిల్లలేదు. Earthquake of Magnitude:3.0, Occurred on 26-11-2023, 04:00:43 IST, Lat: 29.15 & Long: 76.97, Depth: 5 Km ,Location: Sonipat, Haryana, India for more information Download the BhooKamp App https://t.co/71kQ5wTDF1@Dr_Mishra1966 @KirenRijiju @Indiametdept @ndmaindia @Ravi_MoES pic.twitter.com/AtUSHA5KJ5 — National Center for Seismology (@NCS_Earthquake) November 25, 2023 గత ఏడాది కాలంలో ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల భూకంపాలు చోటుచేసుకుంటున్నాయి. నవంబర్ 3న నేపాల్‌లో తీవ్ర భూకంపం సంభవించింది. దీని కారణంగా 70 మందికి పైగా జనం మరణించారు. అదే సమయంలో ఢిల్లీ-ఎన్సీఆర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్‌లలో కూడా భూకంపం సంభవించింది. భయాందోళనకు గురైన జనం ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా పలువురు భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఈ స్వల్ప భూకంపాలు భారీ భూకంపాలకు సంకేతమని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: తిరువణ్ణామలైలో ఘనంగా కార్తీక దీపోత్సవం -
నేపాల్‌లో మరోమారు భూకంపం.. 4.5 తీవ్రత నమోదు!
భారత్ పొరుగు దేశమైన నేపాల్‌లో ఈ రోజు (గురువారం) తెల్లవారుజామున భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనలకు లోనయ్యారు. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.5గా నమోదయ్యిందని, భూకంప కేంద్రం మక్వాన్పూర్ జిల్లాలోని చిట్లాంగ్‌లో ఉందని నేపాల్ సైన్స్ సెంటర్ తెలిపింది. ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. కాగా నవంబర్ 3న, నేపాల్‌లోని జాజర్‌కోట్‌లో 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. 153 మంది మృతిచెందారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వీరంతా ఇప్పటికీ గుడారాలలో నివసిస్తున్న దుస్థితి నెలకొంది. చలికి వీరంతా అల్లాడుతున్నారు. విపరీతమైన చలి కారణంగా ఐదుగురు మృతిచెందారు. కాగా నవంబర్ 17న మయన్మార్‌లో భూకంపం సంభవించింది. యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపిన వివరాల ప్రకారం 5.7 తీవ్రతతో ఈ భూకంపం వచ్చింది. షాన్ రాష్ట్రంలోని కెంగ్ టంగ్ నగరానికి నైరుతి దిశలో భూకంపం కేంద్రీకృతమయ్యింది. ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ఇది కూడా చదవండి: వందేభారత్ స్నాక్ ట్రేలు ధ్వంసం చేస్తున్న పిల్లలు? -
జమ్మూకశ్మీర్‌లో కంపించిన భూమి.. 3.9 తీవ్రత నమోదు!
జమ్మూకశ్మీర్‌లో భూమి కంపించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్సీఎస్) తెలిపిన వివరాల ప్రకారం జమ్మూ కశ్మీర్‌లోని దోడాలో ఈ భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.9గా నమోదైంది. అయితే ఈ భూకంపం కారణంగా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు. భూకంపం భయానికి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి, రోడ్లపైకి చేరారు. ఎన్సీఎస్ తెలిపిన వివరాల ప్రకారం గురువారం (నవంబర్ 16) ఉదయం 9:34 గంటలకు భూ ప్రకంపనలు సంభవించాయి. కాగా నవంబర్ 4 న నేపాల్‌లో సంభవించిన భూకంపంలో 70 మందికి పైగా జనం మరణించారు. వందలాది ఇళ్లు నేలమట్టం కాగా, వేలాది మంది గాయపడ్డారు. అదే సమయంలో ఢిల్లీ-ఎన్సీఆర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్‌లలో కూడా స్వల్ప భూకంపం సంభవించింది. పలువురు భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు.. స్వల్ప స్థాయి భూకంపాలు భారీ భూకంపానికి సంకేతంగా నిలుస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో దేశ రాజధాని ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతంలో భూకంప ప్రకంపనలు తరచూ సంభవించడం స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. ఇది కూడా చదవండి: 19 అగ్నిపర్వతాలు ఏకకాలంలో పేలాయా? Earthquake of Magnitude:3.9, Occurred on 16-11-2023, 09:34:19 IST, Lat: 33.05 & Long: 76.18, Depth: Doda, Jammu and Kashmir, India for more information Download the BhooKamp App https://t.co/oRC4OXqC4F@Indiametdept @ndmaindia @KirenRijiju @Dr_Mishra1966 @Ravi_MoES @DDNational pic.twitter.com/uukXdJuS7T — National Center for Seismology (@NCS_Earthquake) November 16, 2023 -
పాకిస్తాన్లో భూకంపం.. 5.2 తీవ్రత నమోదు!
గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా భూకంప సంఘటనలు గణనీయంగా పెరిగాయి. ప్రతిరోజూ ఏదోఒకచోట భూమి కంపిస్తూనే ఉంది. ఒకే రోజులో అధిక భూకంపాలు వచ్చిన ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఈరోజు (బుధవారం) తెల్లవారుజామున పాకిస్తాన్లో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.2గా నమోదైంది. తెల్లవారుజామున 5.35 గంటల ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. దీనిని గమనించిన ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చి పరుగులు తీశారు. ఈ భూకంపం కారణంగా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. ఈ ఏడాది టర్కీ, సిరియాల్లో సంభవించిన భూకంపం పెను విధ్వంసాన్ని సృష్టించింది. గత సెప్టెంబర్ 8న మొరాకోలో సంభవించిన భూకంపం, అక్టోబర్ 7న ఆఫ్ఘనిస్తాన్‌లో సంభవించిన భూకంపం, నవంబర్ 3న నేపాల్‌లో సంభవించిన భూకంపాలు కూడా విధ్వంసాన్ని సృష్టించాయి. తరచూ భూకంపాలు చోటుచేసుకోవడం అందరిలో ఆందోళన కలిగిస్తోంది. ఇది కూడా చదవండి: బిర్సా ముండా ఎవరు? ప్రధాని మోదీ ఆయన జన్మస్థలికి ఎందుకు వెళుతున్నారు? -
అసోంలో భూకంపం.. భయంతో జనం పరుగులు!
అసోంలోని ధుబ్రిలో ఈరోజు (ఆదివారం) తెల్లవారుజామున భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అసోంలోని ధుబ్రిలో భూకంపం సంభవించింది. ఈ భూకంపం సంభవించినప్పుడు జనం గాఢ నిద్రలో ఉన్నారు. భూ ప్రకంపనలను గుర్తించిన వెంటనే జనం తమ ఇళ్లలో నుండి బయటకు పరుగులు తీశారు. భయంతో ఇళ్ల వెలుపలే చాలా సేపు ఉన్నారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం ఈ భూకంపం తెల్లవారుజామున 3.01 గంటలకు 17 కి.మీ లోతులో సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.1గా నమోదైంది. గత సోమవారం ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.0గా నమోదైంది. సెప్టెంబర్‌లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి, చంబా జిల్లాల్లో రిక్టర్ స్కేల్‌పై 2.8, 2.1 తీవ్రతతో తేలికపాటి భూకంపాలు సంభవించాయి. కాగా తాజాగా సంభవించిన భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ఇది కూడా చదవండి: ఆత్మగౌరవం గురించి బాపూజీ ఏమన్నారు? Earthquake of Magnitude:3.1, Occurred on 01-10-2023, 03:01:33 IST, Lat: 26.08 & Long: 90.05, Depth: 17 Km ,Location: Dhubri, Assam, India for more information Download the BhooKamp App https://t.co/8bErjjuCfL@Indiametdept @ndmaindia @Dr_Mishra1966 @KirenRijiju pic.twitter.com/1mxvy1CAQ5 — National Center for Seismology (@NCS_Earthquake) September 30, 2023 -
జమ్మూ కాశ్మీర్లో తీవ్ర భూకంపం.. రిక్టర్ స్కేలుపై..
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో ఈరోజు తెల్లవారు జామున తీవ్ర భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ మీద దీని తీవ్రత 37 గా నమోదైంది. మంగళవారం తెల్లవారు జాము 12.04 గంటలకు ధోడా ప్రాంతానికి ఆగ్నేయంగా భూకంపం సంభవించినట్లు తెలిపింది నేషనల్ సెంటర్ ఫార్ సీస్మాలజీ. భూమి ఉపరితలానికి 5 కి.మీ లోతున భూకంపం సంభవించిందని వారు తెలిపారు. అక్కడక్కడా చిన్నగా భూమి అదిరినట్టుగా అనిపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఒకవేళ భూకంపం తీవ్రత కొంచెం ఎక్కువైనా భదేర్వా, కిష్త్వార్, ఉధంపూర్, ధోడా పరిసరాల్లో తీవ్ర నష్టం వాటిల్లేదని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతాల్లో భూకంపం సంభవించినప్పుడు 2-5 సెకన్ల వరకు భూమి కంపించినట్లు చెబుతున్నారు స్థానికులు. ఆ సమయానికి అందరూ గాఢనిద్రలో ఉంటారని అదృష్టవశాత్తు భూకంపం తీవ్రత పెద్దగా లేదని, ఎటువంటి నష్టం వాటిల్లలేదని వారు తెలిపారు. ఇది కూడా చదవండి: ఎంపీగా లోక్‌సభలోకి రాహుల్ -
World's Most Dangerous Day: సెకెన్ల వ్యవధిలో ఊహకందని ఘోరం.. 8 లక్షలమంది..
మనిషి లక్షలాది సంవత్సరాలుగా ఊహికందని ప్రకృతి విపత్తులను ఎదుర్కొంటూనే ఉన్నాడు. ఇటువంటి సమయాల్లో లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోతుండగా, లెక్కకు అందని సంఖ్యలో జనం క్షతగాత్రులుగా మారుతున్నారు. ఇక నిరాశ్రయులయ్యేవారి సంఖ్య చెప్పనలవి కాదు. ఇప్పుడు మనం ప్రపంచం ఎదుర్కొన్న అత్యంత భారీ విపత్తు గురించి తెలుసుకుందాం. ప్రపంచానికే అత్యంత ప్రమాదకరమైన రోజు.. సైన్స్ అలర్ట్‌లో ప్రచురితమైన ఒక కథనం ప్రకారం 1556 జనవరి 23.. ఆరోజు మానవాళి పెను విపత్తును భీకర భూకంపం రూపంలో ఎదుర్కొంది. కొన్ని సెకెన్ల వ్యవధిలో 8 లక్షలమంది జీవితాలు బుగ్గిపాలయ్యాయి. ఈ ఒక్క ఘటనతో చైనాలో అప్పటివరకూ సంతరించుకున్న నాగరిత సర్వనాశనం అయ్యింది. ఎంత శక్తివంతమైన భూకంపం అంటే.. సాధారణంగా ఎక్కడో ఒకచోట భూకంపం వస్తూనే ఉంటుంది. అయితే 1556 జనవరి 23న సంభవించినంతటి పెను భూకంపం ఇంతవరకూ ఎన్నడూ సంభవించలేదు. సాధారణంగా స్వల్పస్థాయి భూకంపాలు రిక్టర్ స్కేలుపై 2.3 లేదా 3.2గా నమోదవుతుంటాయి. అయితే 1556 జనవరి 23న సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 8.0 నుంచి 8.3 మధ్యలో నమోదయ్యింది. ఇది పెను విపత్తుకు దారితీసింది. భూకంప కేంద్రం నగరం మధ్యలో ఉండటమే ఇంతటి భారీ విపత్తుకు కారణంగా నిలిచింది. మానవ నాగరికత భవిష్యత్‌కు సన్నాహాలు ఈ భారీ వినాశకర భూకంపం భవిష్యత్‌లో ఇటువంటి ఉత్పాతాలను ఎలా ఎదుర్కోవాలో తెలియజేసేందుకు అవకాశం కల్పించింది. ఈ ఘటన అనంతరం చైనాలో అత్యధికశాతం ఇళ్లను తేలికపాటి కలపతో నిర్మించసాగారు. అయితే ఇప్పటి ఆధునిక సాంకేతికతతో భూకంపాలను ముందుగానే పసిగట్టే పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. భూకంపాల నుంచి ఎలా తప్పించుకోవాలనే విధానాలను కనుకొన్నారు. ఇదేవిధంగా తుపానులను, ఇతర ప్రకృతి వైపరీత్యాలను మనిషి ముందుగానే గుర్తించగలుగుతున్నాడు. ఇది కూడా చదవండి: పక్కింట్లో పార్టీ హోరు.. నిద్ర పట్టని ఆమె తీసుకున్న నిర్ణయం ఇదే..