
న్యూఢిల్లీ/కాబూల్: అఫ్గానిస్తాన్‌లోని హిందూ కుష్ పర్వత ప్రాంతంలో శక్రవారం సాయంత్రం భారీ భూకంపం సంభవించింది. దీంతో ఢిల్లీతో సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు జాతీయ భూకంప కేంద్రం (ఎన్‌సీఎస్) వెల్లడించింది. రిక్టరు స్కేలుపై 6.3 తీవ్రతతో సాయంత్రం 5.10 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించిందని తెలిపింది. ప్రాణ, ఆర్థిక నష్టం వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment