Afghanistan
-
స్టార్ క్రికెటర్ ఇంట్లో తీవ్ర విషాదం.. చిన్నారి మృతి
అఫ్గానిస్తాన్ స్టార్ ఓపెనర్ హజ్రతుల్లా జజాయ్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అతడి రెండేళ్ల కుమార్తె మృతి చెందింది. ఈ విషయాన్ని హజ్రతుల్లా టీమ్మేట్ కరీం జనత్ ధృవీకరించాడు. తన సహచరుడి కుమార్తె మృతి పట్ల జనత్ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపాడు. "నా సన్నిహిత మిత్రుడు హజ్రతుల్లా జజాయ్ తన కుమార్తెను కోల్పోవడం చాలా బాధాకరం. ఈ విషయాన్ని బరువెక్కిన హృదయంతో అందరితో పంచుకుంటున్నాను.ఈ కష్ట సమయంలో వారి కటుంబానికి దేవుడు అండగా నిలవాలని కోరుకుంటున్నాను. హజ్రతుల్లా జజాయ్ , అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని జనత్ తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేశాడు. అయితే చిన్నారి మృతికి కారణం ఏంటి అన్నది జనత్ వెల్లడించలేదు. జజాయ్ కుమార్తె మృతి పట్ల అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా సంతాపం వ్యక్తం చేసింది.2016లో యూఏఈతో (UAE)తో జరిగిన వన్డే మ్యచ్‌తో జజాయ్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అఫ్గాన్ టీ20 జట్టులో జజాయ్ కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. హజ్రతుల్లా తన కెరీర్లో ఇప్పటివరకు అఫ్గాన్ తరపున 16 వన్డేలు 45 టీ20లు ఆడాడు. వన్డేల్లో 361 పరుగులు చేయగా.. టీ20ల్లో 1160 రన్స్ చేశాడు.ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొన్న అఫ్గాన్ జట్టులో అతను భాగం కాదు. కాగా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన రెండో ప్లేయర్‌గా జజాయ్ కొనసాగుతున్నాడు. జజాయ్ డెహ్రాడూన్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఐర్లాండ్‌పై 62 బంతుల్లో 162 పరుగులు చేశాడు.అతడి ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 11 సిక్సర్లు ఉన్నాయి. జజాయ్ చివరిసారిగా 2024 డిసెంబర్లో జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో ఆఫ్ఘనిస్తాన్ తరపున ఆడాడు.చదవండి: IPL 2025 Teams And Captains: అందరూ ఇండియన్సే.. ప్యాట్ కమ్మిన్స్ ఒక్కడే View this post on Instagram A post shared by Karim Janat (@karimjanat_11) -
ట్రంప్ మార్క్ రాజకీయం.. పాకిస్థాన్‌కు భారీ షాక్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచి డొనాల్డ్ ట్రంప్(trump) సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచ దేశాలను టెన్షన్ పెడుతున్నారు. తాజాగా దాయాది దేశం పాకిస్థాన్, ఆఫ్గానిస్తాన్‌కు ఊహించని షాకిచ్చారు. రెండు దేశాల నుంచి అమెరికాకు వచ్చే వారిపై నిషేధం విధించేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు.డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. టారిఫ్‌ల పేరుతో పలు దేశాలను హెచ్చరించారు. అమెరికాలో అక్రమ వలసదారులను తరలించిన విషయం తెలిసిందే. ఇక, ఇప్పుడు భద్రతా కారణాల దృష్ట్యా అమెరికాలోకి ప్రవేశించే పలు దేశాల వారిపైనా నిషేధం విధించేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా పాకిస్థాన్ (Pakistan), అఫ్గానిస్థాన్(Afghanistan)లపై ట్రావెల్ బ్యాన్ విధించనున్నారు. వచ్చే వారం నుంచి ఇది అమలు కానున్నట్టు తెలుస్తోంది.డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడైన సమయంలోనూ కొన్ని ముస్లిం దేశాల పౌరులను అమెరికాలోకి అనుమతించడంపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అనేక పరిశీలన అనంతరం 2018లో అక్కడి సుప్రీంకోర్టు కూడా ఆ నిర్ణయాన్ని సమర్థించింది. అయితే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జో బైడెన్ ప్రభుత్వం.. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసింది. దీంతో, ఆయా దేశాల పౌరులు.. అమెరికాలోకి వచ్చారు.🚨For those who were in celebration of #Trump statement ...!!US likely to impose travel ban on Pakistan,A new travel ban by US could ban people from #Afghanistan and #Pakistan from entering the #UnitedStates next week, pic.twitter.com/n21PxRh37z— Sardar Waleed Mukhtar (@waleedmukhtar_1) March 6, 2025ఇక, ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. ఇందులో అమెరికాలోకి ప్రవేశించే విదేశీయులను నుంచి జాతీయ భద్రతా ముప్పు పొంచి వుందా అన్న విషయాన్ని ముందే గుర్తించే కార్యనిర్వాహక ఆదేశంపైనా సంతకం చేశారు. దీని ప్రకారమే ఇప్పుడు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్టు అధికారులు చెబుతున్నారు.ఇదిలా ఉండగా, అంతకుముందు.. కాబూల్ విమానాశ్రయంపై 2021లో బాంబు పేలుళ్లు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఆత్మాహుతి దాడిలో 170 మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా అమెరికాకు చెందిన 13 మంది సైనికులు చనిపోయారు. అయితే, తాజాగా ఈ దాడులకు పాల్పడిన సూత్రధారిని పట్టుకున్నట్లు ట్రంప్ ప్రకటించారు. పాకిస్థాన్ సాయం వల్లే ఈ నిందితుడిని అరెస్ట్ చేయగలిగామని కూడా వివరించారు. అంతేకాకుండా పాకిస్థాన్‌కు కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. కాగా, పాకిస్థాన్‌కు కృతజ్ఞతలు చెప్పిన వెంటనే ఆ దేశ పౌరులపై బ్యాన్ విధిస్తూ ట్రంప్ షాకివ్వడం గమనార్హం. -
Champions Trophy 2025: ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్ రద్దు.. సెమీస్‌కు ఆస్ట్రేలియా
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 గ్రూప్-బిలో భాగంగా ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య ఇవాళ (ఫిబ్రవరి 28) జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగిసింది. మ్యాచ్ మధ్యలో మొదలైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఫలితంగా ఆస్ట్రేలియా గ్రూప్-బి నుంచి సెమీస్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో ఫలితం తేలకపోవడంతో ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ అవకాశాలు దాదాపుగా గల్లంతయ్యాయి. ఏదైనా అద్భుతం జరిగి రేపటి మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై ఇంగ్లండ్ భారీ విజయం సాధిస్తే తప్ప, ఆఫ్ఘనిస్తాన్ సెమీస్‌కు చేరలేదు. ఈ మ్యాచ్ రద్దు కావడం సౌతాఫ్రికాకు పరోక్షంగా కలిసొచ్చింది. రేపటి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడినా సౌతాఫ్రికా సెమీస్‌కు చేరుకుంటుంది. అయితే ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా మరీ దారుణంగా మాత్రం ఓడకూడదు. ఒకవేళ అలా జరిగి సౌతాఫ్రికా రన్‌రేట్ మైనస్‌లోకి పడిపోతే మాత్రం ఆఫ్ఘనిస్తాన్ సెమీస్‌కు చేరుకుంటుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఖాతాలో 4 పాయింట్లు (0.475), సౌతాఫ్రికా ఖాతాలో 3 పాయింట్లు (2.140), ఆఫ్ఘనిస్తాన్ ఖాతాలో 3 పాయింట్లు (-0.990) ఉన్నాయి. ఈ గ్రూప్‌లో ఉన్న మరో జట్టు ఇంగ్లండ్ ఇదివరకే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆఫ్ఘనిస్తాన్ సెమీస్‌కు చేరాలంటే ఇలా జరగాలి..!క్రిక్‌బజ్ లెక్కల ప్రకారం.. ఆఫ్ఘనిస్తాన్ సెమీస్‌కు చేరాలంటే రేపటి మ్యాచ్‌లో ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేస్తే సౌతాఫ్రికాను కనీసం 207 పరుగుల తేడాతో ఓడించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇంగ్లండ్ సెకెండ్ బ్యాటింగ్ చేస్తే 11.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంటుంది (రెండు సందర్భాల్లో మొదటి ఇన్నింగ్స్ టోటల్ 300 పరుగులు అనుకుంటే).ఇలా జరగకపోతే మాత్రం రేపటి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడినా సౌతాఫ్రికా సెమీస్‌కు చేరుకుంటుంది. రేపటి మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దైనా సౌతాఫ్రికానే సెమీస్‌కు చేరుకుంటుంది.కాగా, గ్రూప్-ఏ నుంచి ఇదివరకే సెమీస్ బెర్తలు ఖారారైన విషయం తెలిసిందే. ఈ గ్రూప్ నుంచి మరో మ్యాచ్ జరగాల్సి ఉన్నా భారత్, న్యూజిలాండ్ సెమీస్‌కు చేరుకున్నాయి. ఈ గ్రూప్‌లో మిగిలిన మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ మార్చి 2వ తేదీన జరుగుతుంది.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. సెదిఖుల్లా అటల్ (95 బంతుల్లో 85; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), అజ్మతుల్లా ఒమర్జాయ్ (63 బంతుల్లో 67; ఫోర్, 5 సిక్సర్లు) అర్ద సెంచరీలతో సత్తా చాటడంతో నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది. సెదిఖుల్లా, ఒమర్జాయ్.. ఇబ్రహీం జద్రాన్ (22), రహ్మత్ షా (12), కెప్టెన్ హష్మతుల్లా షాహిది (20), రషీద్ ఖాన్‌తో (19) కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి ఆసీస్ ముందు ఫైటింగ్ టోటల్‌ను ఉంచారు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో రహ్మానుల్లా గుర్భాజ్ (0), మహ్మద్ నబీ (1), గుల్బదిన్ నైబ్ (4), నూర్ అహ్మద్ (6) నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో బెన్ డ్వార్షుయిష్ 3, స్పెన్సర్ జాన్సన్, ఆడమ్ జంపా తలో 2, ఎల్లిస్, మ్యాక్స్‌వెల్ చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం ఆస్ట్రేలియా లక్ష్యాన్ని ఛేదిస్తుండగా ఒక్కసారిగా వర్షం మొదలైంది. దీంతో మ్యాచ్ ఆగిపోయింది. మ్యాచ్ ఆగిపోయే సమయానికి ఆసీస్ 12.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 109 పరుగులు చేసింది. మాథ్యూ షార్ట్ (20) ఔట్ కాగా.. ట్రవిస్ హెడ్ (59), స్టీవ్ స్మిత్ (19) క్రీజ్‌లో ఉన్నారు. షార్ట్ వికెట్ ఒమర్జాయ్కు దక్కింది. -
Champions Trophy 2025: ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌కు వరుణుడి ఆటంకం
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 (Champions Trophy) గ్రూప్-బిలో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 28) జరుగుతున్న కీలకమైన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా (Australia), ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌కు వరుణుడు అడ్డు (Rain Stopped The Play) తగిలాడు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ పూర్తై.. ఆస్ట్రేలియా లక్ష్యాన్ని ఛేదిస్తుండగా ఒక్కసారిగా వర్షం మొదలైంది. దీంతో మ్యాచ్ ఆగిపోయింది. మ్యాచ్ ఆగిపోయే సమయానికి ఆసీస్ పైచేయి ఉంది. ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన 274 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆసీస్ 12.5 ఓవర్ల తర్వాత వికెట్ నష్టానికి 109 పరుగులు చేసింది. ట్రవిస్ హెడ్ (59), స్టీవ్ స్మిత్ (19) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ గెలవాలంటే మరో 37.1 ఓవర్లలో 165 పరుగులు చేయాలి. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. వర్షం ఎంతకీ తగ్గక ఈ మ్యాచ్ ఫలితాన్ని డక్ వర్త్ లూయిస్ పద్దతిలో ప్రకటించాల్సి వస్తే ఆస్ట్రేలియానే విజేతగా నిలుస్తుంది. ఆసీస్ వర్షం ముప్పును ముందే పసిగట్టి ఛేదనను ధాటిగా ప్రారంభించింది. ఆఫ్ఘనిస్తాన్ ఫీల్డర్లు రెండు సునాయాస క్యాచ్‌లు వదిలేయడంతో ఆసీస్ ఊపిరి పీల్చుకుంది. ఈ రెండు క్యాచ్‌ల్లో ఒకటి ట్రవిస్ హెడ్‌ది ఉంది. లైఫ్ లభించిన అనంతరం హెడ్ చెలరేగిపోయాడు. ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాది 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.సెమీస్‌కు చేరాలంటే ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ తప్పక గెలవాలి. ఓడిపోయినా లేక ఫలితం రాకపోయినా ఆఫ్ఘనిస్తాన్ టోర్నీ నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిస్తే.. ఆ జట్టుతో పాటు సౌతాఫ్రికా సెమీస్‌కు చేరుతుంది. ఈ మ్యాచ్‌లో ఫలితం రాకపోయినా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికానే సెమీస్‌కు చేరకుంటాయి.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. వన్ డౌన్ బ్యాటర్ సెదిఖుల్లా అటల్ (95 బంతుల్లో 85; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ (63 బంతుల్లో 67; ఫోర్, 5 సిక్సర్లు) అర్ద సెంచరీలతో సత్తా చాటడంతో నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది. సెదిఖుల్లా, ఒమర్జాయ్.. ఇబ్రహీం జద్రాన్ (22), రహ్మత్ షా (12), కెప్టెన్ హష్మతుల్లా షాహిది (20), రషీద్ ఖాన్‌తో (19) కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి ఆసీస్ ముందు ఫైటింగ్ టోటల్‌ను ఉంచారు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో రహ్మానుల్లా గుర్భాజ్ (0), మహ్మద్ నబీ (1), గుల్బదిన్ నైబ్ (4), నూర్ అహ్మద్ (6) నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో బెన్ డ్వార్షుయిష్ 3, స్పెన్సర్ జాన్సన్, ఆడమ్ జంపా తలో 2, ఎల్లిస్, మ్యాక్స్‌వెల్ చెరో వికెట్ పడగొట్టారు. -
Champions Trophy: ఆసీస్‌తో కీలక సమరం.. ఆఫ్ఘనిస్తాన్ కొంపముంచిన రషీద్ ఖాన్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 గ్రూప్-బిలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న కీలక సమరంలో ఆఫ్ఘనిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసి ఓ మోస్తరు స్కోర్ చేసింది. వన్ డౌన్ బ్యాటర్ సెదిఖుల్లా అటల్ (95 బంతుల్లో 85; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ (63 బంతుల్లో 67; ఫోర్, 5 సిక్సర్లు) అర్ద సెంచరీలతో సత్తా చాటడంతో ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది. సెదిఖుల్లా, ఒమర్జాయ్.. ఇబ్రహీం జద్రాన్ (22), రహ్మత్ షా (12), కెప్టెన్ హష్మతుల్లా షాహిది (20), రషీద్ ఖాన్‌తో (19) కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి ఆసీస్ ముందు ఫైటింగ్ టోటల్‌ను ఉంచారు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో రహ్మానుల్లా గుర్భాజ్ (0), మహ్మద్ నబీ (1), గుల్బదిన్ నైబ్ (4), నూర్ అహ్మద్ (6) నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో బెన్ డ్వార్షుయిష్ 3, స్పెన్సర్ జాన్సన్, ఆడమ్ జంపా తలో 2, ఎల్లిస్, మ్యాక్స్‌వెల్ చెరో వికెట్ పడగొట్టారు.274 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు శుభారంభం లభించింది. ఓపెనర్ మాథ్యూ షార్ట్ తొలి ఓవర్ నుంచే ఆఫ్ఘన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఒమర్జాయ్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో ఓ బౌండరీ బాదిన షార్ట్.. మూడో ఓవర్లో శివాలెత్తిపోయాడు. ఒమర్జాయ్ వేసిన ఈ ఓవర్లో షార్ట్ 2 బౌండరీలు, ఓ సిక్సర్ బాదాడు. ఫలితంగా ఈ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. మరో ఎండ్‌లో విధ్వంసకర ఆటగాడు ట్రవిస్ హెడ్ కూడా ఫజల్ హక్ ఫారూకీ బౌలింగ్‌లో బౌండరీ బాది మాంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించాడు. వీరిద్దరు రెచ్చిపోవడంతో ఆస్ట్రేలియా 3 ఓవర్లలో 32 పరుగులు చేసింది.హెడ్ క్యాచ్ జారవిడిచిన రషీద్ ఖాన్ఫజల్ హక్ ఫారూకీ వేసిన నాలుగో ఓవర్ తొలి బంతికి డేంజరెస్ బ్యాటర్ ట్రవిస్ హెడ్‌ను ఔట్ చేసే సువర్ణావకాశాన్ని ఆఫ్ఘనిస్తాన్ చేజార్చుకుంది. హెడ్ మిడ్ ఆన్ దిశగా అందించిన క్యాచ్‌ను రషీద్ ఖాన్ జారవిడిచాడు. ఈ క్యాచ్ ఎంత మూల్యమైందో ఆఫ్ఘనిస్తాన్ కొద్ది సేపటిలోనే తెలిసింది. లైఫ్ లభించిన అనంతరం హెడ్ చెలరేగిపోయాడు. ఆతర్వాతి బంతికే సిక్సర్ బాదాడు. అదే ఓవర్ చివరి బంతికి బౌండరీ కొట్టాడు. దీంతో 4 ఓవర్ల అనంతరం ఆసీస్ స్కోర్ వికెట్ నష్టపోకుండా 42కు చేరింది.సింపుల్ క్యాచ్‌ను జారవిడిచిన ఖరోటేఅనంతరం ఐదో ఓవర్ తొలి బంతికి ఆఫ్ఘనిస్తాన్ సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ ఖరోటే సింపుల్ క్యాచ్‌ను జారవిడిచాడు. ఈ సారి మాథ్యూ షార్ట్‌కు లైఫ్ లభించింది. ఒమర్జాయ్ బౌలింగ్ షార్ట్ డీప్ స్క్వేర్ లెగ్ దిశగా షాట్ ఆడాడు. చేతిలోకి వచ్చిన క్యాచ్‌ను ఖరేటో వదిలేశాడు. దీంతో 7 బంతుల వ్యవధిలో ఆఫ్ఘనిస్తాన్ ఫీల్డర్లు రెండు క్యాచ్‌లు జారవిడిచినట్లైంది.ఆఫ్ఘనిస్తాన్ ఊపిరిపీల్చుకుందిఖరోటే క్యాచ్ వదిలేశాక రెండు బంతులకే షార్ట్ ఔటయ్యాడు. ఒమర్జాయ్ బౌలింగ్‌లో గుల్బదిన్ క్యాచ్ పట్టడంతో షార్ట్ మెరుపు ఇన్నింగ్స్‌కు (15 బంతుల్లో 20; 3 ఫోర్లు, సిక్స్) తెరపడింది. దీంతో ఆఫ్ఘన్లు ఊపిరిపీల్చుకున్నారు. షార్ట్‌కు ఔట్ చేసిన ఆనందం ఆఫ్ఘన్లకు ఎంతో సేపు మిగల్లేదు. స్టీవ్ స్మిత్ వచ్చీ రాగానే రెండు వరుసగా బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఫలితంగా ఆసీస్ 5 ఓవర్లలోనే 50 పరుగుల మార్కును దాటింది.మూల్యం చెల్లించుకుంటున్న ఆఫ్లన్లుహెడ్ క్యాచ్‌ను జారవిడిచినందుకు ఆఫ్ఘన్లు తగిన మూల్యం చెల్లించుకుంటున్నారు. లైఫ్ లభించాక హెడ్ చెలరేగిపోయాడు. ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో 3 బౌండరీలు.. తొమ్మిదో ఓవర్లో హ్యాట్రిక్ బౌండరీలు సాధించి ఆఫ్ఘన్లను పశ్చాత్తాపపడేలా చేశాడు. అనంతరం హెడ్ నూర్ అహ్మద్ వేసిన 11వ ఓవర్లో రెండు పరుగులు తీసి కెరీర్లో 17వ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 12 ఓవర్లలోనే ఆస్ట్రేలియా వికెట్ నష్టపోయి 100 పరుగుల మార్కును తాకింది.ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే సెమీస్‌కు చేరుకుంటుంది. ఓడితే మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఆసీస్‌కు మాత్రం ఈక్వేషన్స్ అలా లేవు. ఆసీస్ ఈ మ్యాచ్‌లో ఓడినా.. రేపు జరుగబోయే మ్యాచ్‌లో ఇంగ్లండ్ సౌతాఫ్రికాను ఓడిస్తే సెమీస్‌కు చేరే అవకాశం (మెరుగైన రన్‌రేట్ కలిగి ఉంటే) ఉంటుంది. -
Champions Trophy 2025: ఆసీస్‌తో కీలక సమరం.. విధ్వంసం సృష్టించిన ఒమర్జాయ్
ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో (Champions Trophy-2025) ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) అంచనాలకు మించి రాణిస్తుంది. ఆఫ్ఘన్లకు ఇది అరంగేట్రం ఎడిషనే (ఛాంపియన్స్ ట్రోఫీలో) అయినా.. ఎంతో అనుభవజ్ఞుల్లా ఆడుతున్నారు. దాయాది పాకిస్తాన్ కంటే వెయ్యి రెట్లు బెటర్ అనిపిస్తున్నారు. ఈ టోర్నీలో తమ రెండో మ్యాచ్‌లో పటిష్టమైన ఇంగ్లండ్‌కు షాకిచ్చిన ఆఫ్ఘన్లు.. ఇవాళ (ఫిబ్రవరి 28) ఆస్ట్రేలియాతో జరుగుతున్న డూ ఆర్ డై మ్యాచ్‌లో (సెమీస్‌కు చేరాలంటే ఈ మ్యాచ్ తప్పక గెలవాలి) తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ సాధించారు. వన్ డౌన్ బ్యాటర్ సెదిఖుల్లా అటల్ (Sediqulla Atal) (95 బంతుల్లో 85), ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ (Azmatulla Omarzai) (63 బంతుల్లో 67) అర్ద సెంచరీలతో సత్తా చాటడంతో ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది.తొలి ఓవర్లోనే ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ (0) వికెట్ కోల్పోయి కష్టాల్లో పడిన ఆఫ్ఘనిస్తాన్‌ను గత మ్యాచ్ సెంచరీ హీరో ఇబ్రహీం జద్రాన్ (22), వన్‌డౌన్ బ్యాటర్ సెదిఖుల్లా అటల్ ఆదుకున్నారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 67 పరుగులు జోడించారు. అనంతరం జద్రాన్‌ను అద్భుతమైన బంతితో ఆడమ్ జంపా బోల్తా కొట్టించాడు. తర్వాత బరిలోకి దిగిన రహ్మత్ షా (12) కొద్దిసేపు నిలకడగా ఆడాడు. బౌండరీ కొట్టి జోష్ మీదున్న షాను మ్యాక్స్‌వెల్ ఔట్ చేశాడు. అనంతరం అటల్.. కెప్టెన్ హష్మతుల్లా షాహిదితో (20) కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 68 పరుగులు జోడించారు. వీరిద్దరూ క్రీజ్‌లో ఉండగా.. ఆఫ్ఘనిస్తాన్ ఈ మ్యాచ్‌లో కూడా భారీ స్కోర్ సాధించేలా కనిపించింది. అయితే సెదిఖుల్లా దురదృష్టవశాత్తు సెంచరీకి ముందు ఔటై ఆఫ్ఘనిస్తాన్ ఆశలు నీరుగార్చాడు. సెదీఖుల్లా క్రీజ్‌లో ఉన్నంత సేపు ఆస్ట్రేలియన్లకు చెమటలు పట్టించాడు.సెదిఖుల్లా ఔటైన కొద్ది సేపటికే హష్మతుల్లా షాహిది, మహ్మద్ నబీ (1), గుల్బదిన్ నైబ్ (4) కూడా ఔట్ కావడంతో ఆఫ్ఘనిస్తాన్ 199 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి స్వల్ప స్కోర్‌కే పరిమితం అయ్యేలా చేసింది. ఈ దశలో గత మ్యాచ్ హీరో అజ్మతుల్లా ఒమర్జాయ్ విజృంభించాడు. వరుస సిక్సర్లతో విరుచుకుపడి ఆఫ్ఘనిస్తాన్ స్కోర్‌ను 270 దాటించాడు. మధ్యలో రషీద్ ఖాన్ (19) కూడా తన స్టయిల్లో విరుచుకుపడ్డాడు. మొత్తానికి సెదీఖుల్లా, ఒమర్జాయ్ అదరగొట్టడంతో ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియా ముందు ఫైటింగ్ టోటల్‌ను ఉంచింది. ఆసీస్ బౌలర్లలో బెన్ డ్వార్షుయిష్ 3, స్పెన్సర్ జాన్సన్, ఆడమ్ జంపా తలో 2, ఎల్లిస్, మ్యాక్స్‌వెల్ చెరో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే సెమీస్‌కు చేరుకుంటుంది. ఓడితే మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఆసీస్‌కు మాత్రం ఈక్వేషన్స్ అలా లేవు. ఆసీస్ ఈ మ్యాచ్‌లో ఓడినా.. రేపు జరుగబోయే మ్యాచ్‌లో ఇంగ్లండ్ సౌతాఫ్రికాను ఓడిస్తే సెమీస్‌కు చేరే అవకాశం (మెరుగైన రన్‌రేట్ కలిగి ఉంటే) ఉంటుంది. -
CT 2025 Aus Vs Afg: వరుణుడు కరుణిస్తే...
లాహోర్: చాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్, అఫ్తానిస్తాన్ల మ్యాచ్ ఫలితం మొత్తం గ్రూప్ ‘బి’ సమీకరణాలనే మార్చేసింది. నాలుగు జట్లలో ఒక్క ఇంగ్లండ్ తప్ప దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, అఫ్గానిస్తాన్‌లు సెమీఫైనల్ రేసులో ఉన్నాయి. ఈ రోజు నాకౌట్ దశ బెర్త్ కోసం ఆసీస్, అఫ్గాన్లు కాచుకున్నట్లే ఆసక్తికరంగా మ్యాచ్‌ను ఆపేందుకు వర్షం కూడా కాచుకుంది. శుక్రవారం వానముప్పు ఉందని స్థానిక వాతావరణ కేంద్రం తెలిపింది. ఒకవేళ మ్యాచ్‌ను ముంచేసే వాన కురిస్తే మాత్రం అఫ్గానిస్తాన్ కథ ఇక్కడితోనే ముగుస్తుంది. 4 పాయింట్లతో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌తో మిగిలున్న మ్యాచ్‌తో సంబంధం లేకుండా దక్షిణాఫ్రికా (ప్రస్తుతం 3 పాయింట్లు) సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. తాజా పోరు విషయానికొస్తే ఆ్రస్టేలియాను ఓడించడం అఫ్గాన్‌కు అంత సులువైతే కాదు. కానీ ఇది క్రికెట్. స్థిరమైన ఫలితాలేవీ ఉండవు. మేటి జట్టా, గట్టి ప్రత్యర్థా... అనేవి, గత గణాంకాలు పనికిరావు. శుక్రవారం ఏ జట్టు బాగా ఆడితే ఆ జట్టే గెలుస్తుంది. అఫ్గాన్ ఈ టోర్నీలో సంచలనానికి సీక్వెల్ చూపిస్తే మాత్రం దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ మ్యాచ్ ఫలితం, ఇతర ఏ సమీకరణంతో సంబంధం లేకుండా దర్జాగా సెమీస్ చేరుతుంది. ఆసీస్ మాత్రం దక్షిణాఫ్రికా మ్యాచ్ ఫలితం కోసం నిరీక్షించక తప్పదు. ఆ్రస్టేలియా కంటే దక్షిణాఫ్రికా రన్‌రేట్ మెరుగ్గా ఉండటంతో సఫారీ జట్టు ఓడిపోయినా సెమీఫైనల్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇరు జట్లకు తెలిసిన పిచ్‌పై... లాహోర్‌పై ఇటు అఫ్గాన్‌కు, అటు ఆసీస్‌కు అవగాహన ఉంది. ఇరు జట్లు కూడా తమ బ్యాటింగ్ సత్తాతోనే తమ తమ మ్యాచ్‌ల్లో గెలిచాయి. కాబట్టి ఇక్కడి పిచ్ పరిస్థితుల్ని బాగా ఆకళింపు చేసుకున్నాయి. దీంతో సహజంగా టాస్ కీలకపాత్ర పోషించే అవకాశముంది. ఏ రకంగా చూసిన మాజీ చాంపియన్ ఆ్రస్టేలియా గట్టి ప్రత్యర్థి. కానీ అజేయమైన ప్రత్యర్థి కాదు. ఈ ‘చాంపియన్స్’ చరిత్రలో 2009 తర్వాత మొన్న ఇంగ్లండ్‌పై మాత్రమే గెలిచిన కంగారూ జట్టు మధ్యలో జరిగిన రెండు టోర్నీల్లో ఓటమి లేదంటే రద్దు ఫలితాలతో నిరాశపరిచింది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 352 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఆస్ట్రేలియా బౌలింగ్ దళం చాలా బలహీనంగా ఉంది. పేస్ త్రయం కమిన్స్, స్టార్క్, హాజల్వుడ్ల లోటు కనిపిస్తోంది. బౌలింగ్ విషయంలో అఫ్గాన్ కాస్త మెరుగే అయినా... స్మిత్, లబుõÙన్, హెడ్, ఇన్‌గ్లిస్, మ్యాక్స్‌వెల్‌లాంటి బ్యాటింగ్ లైనప్‌ను ఢీకొంటుందా అనే సందేహం కూడా ఉంది. పిచ్, వాతావరణం లాహోర్ పూర్తిగా బ్యాటింగ్ పిచ్. ఆస్ట్రేలియా–ఇంగ్లండ్... అఫ్గాన్–ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగుసార్లు 300 పైచిలుకు స్కోరు సులువైంది. దీంతో మరో భారీస్కోరు ఆశించవచ్చు. ఇదే జరిగితే బౌలర్లకు కష్టాలు తప్పకపోవచ్చు. కానీ భారీ వర్షసూచన కూడా ఉంది. 4 ఆ్రస్టేలియాతో అఫ్గానిస్తాన్ జట్టు ఇప్పటి వరకు 4 వన్డేలు ఆడింది. నాలుగింటిలోనూ ఆ్రస్టేలియానే గెలిచింది.తుది జట్లు ఆస్ట్రేలియా: స్టీవ్ స్మిత్ (కెప్టెన్ ), షార్ట్, హెడ్, లబుషేన్, జోస్ ఇన్‌గ్లిస్, అలెక్స్ కేరీ, మ్యాక్స్‌వెల్, డ్వార్షుయిస్, నాథన్ ఎలిస్, ఆడమ్ జంపా, జాన్సన్. అఫ్గానిస్తాన్: హష్మతుల్లా (కెప్టెన్ ), గుర్బాజ్, ఇబ్రహీమ్ జద్రాన్, సిద్ధిఖుల్లా, రహ్మత్ షా, అజ్మతుల్లా ఒమర్జాయ్, నబీ, గుల్బదిన్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఫజల్హక్. -
ఇంగ్లాండ్‌ను మట్టికరిపించిన హీరో.. ఎవరీ ఇబ్రహీం జద్రాన్? (ఫొటోలు)
-
Champions Trophy: అఫ్గానిస్తాన్ మళ్లీ అదరగొట్టింది
రెండేళ్ల క్రితం వన్డే వరల్డ్ కప్‌లో అఫ్గానిస్తాన్ చేతిలో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. ఆ రోజు అది ఒక సంచలనంగా కనిపించింది. ఇప్పుడు మరో ఐసీసీ టోర్నీలో మళ్లీ చెలరేగిన అఫ్గానిస్తాన్ అదే తరహా ఆటతో మళ్లీ ఇంగ్లండ్ పని పట్టింది. ఇప్పుడిది సంచలనం కాదు సాధారణమని నిరూపించింది. స్ఫూర్తిదాయక ఆటతో అదరగొట్టిన అఫ్గానిస్తాన్ చాంపియన్స్ ట్రోఫీలో తమ సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకోగా... వరుసగా రెండో ఓటమితో ఇంగ్లండ్ నిష్క్రమించింది.చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరుతో ఇబ్రహీమ్ జద్రాన్ తన టీమ్‌కు భారీ స్కోరును అందించగా... బౌలింగ్‌లో ఐదు వికెట్లతో అజ్మతుల్లా టీమ్‌ను నిలబెట్టాడు. ఆరేళ్ల తర్వాత వన్డేల్లో సెంచరీ చేసిన జో రూట్ ఎంతో పోరాడినా... విజయానికి 26 బంతుల్లో 39 పరుగులు చేయాల్సిన దశలో అతను అవుటవ్వడం ఇంగ్లండ్ ఓటమికి కారణమైంది. లాహోర్: చాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ ‘బి’లో ఇంకా ఆసక్తికర పోటీ సాగుతోంది. ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికాలతో పాటు ఇప్పుడు అఫ్గానిస్తాన్ కూడా సెమీఫైనల్ రేసులోకి వచ్చింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ 8 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గానిస్తాన్ నిరీ్ణత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 325 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఇబ్రహీమ్ జద్రాన్ (146 బంతుల్లో 177; 12 ఫోర్లు, 6 సిక్స్‌లు) భారీ సెంచరీ బాదగా... అజ్మతుల్లా (31 బంతుల్లో 41; 1 ఫోర్, 3 సిక్స్‌లు), మొహమ్మద్ నబీ (24 బంతుల్లో 40; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెప్టెన్ హష్మతుల్లా (67 బంతుల్లో 40; 3 ఫోర్లు) సహకరించారు. అనంతరం ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 317 పరుగులకు ఆలౌటైంది. జో రూట్ (111 బంతుల్లో 120; 11 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేయగా...అఫ్గాన్ బౌలర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ (5/58) ప్రత్యరి్థని దెబ్బ తీశాడు. శుక్రవారం జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఆ్రస్టేలియాతో అఫ్గానిస్తాన్; శనివారం జరిగే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో ఇంగ్లండ్ తలపడతాయి. ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా 3 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉండగా... అఫ్గానిస్తాన్ ఖాతాలో 2 పాయింట్లున్నాయి. చివరి మ్యాచ్‌లో ఇంగ్లండ్ నెగ్గినా ఆ జట్టుకు రెండు పాయింట్లు మాత్రమే లభిస్తాయి. భారీ భాగస్వామ్యాలు... ఇంగ్లండ్ ఆరంభంలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో అఫ్గాన్ బ్యాటర్లు పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు. ఇదే ఒత్తిడిలో జట్టు 26 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయింది. ఒకే ఓవర్లో గుర్బాజ్ (6), సాదిఖుల్లా (4)లను అవుట్ చేసిన ఆర్చర్ ఆ తర్వాత రహ్మత్ షా (4)ను కూడా వెనక్కి పంపాడు. తొలి 10 ఓవర్లలో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో అఫ్గాన్ 39 పరుగులే చేసింది. అయితే ఆ తర్వాతి మూడు భాగస్వామ్యాలు అఫ్గాన్‌ను భారీ స్కోరు దిశగా నడిపించాయి. దూకుడైన బ్యాటింగ్‌తో చెలరేగిన ఇబ్రహీమ్ వరుసగా నాలుగు, ఐదు, ఆరో వికెట్లకు హష్మతుల్లాతో 103 పరుగులు, అజ్మతుల్లాతో 72 పరుగులు, నబీతో 111 పరుగులు జోడించాడు. ఒవర్టన్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన ఇబ్రహీమ్...106 బంతుల్లో వన్డేల్లో ఆరో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 40వ ఓవర్ తర్వాత అఫ్గాన్ బ్యాటింగ్ మరింత ధాటిగా సాగింది. ఆర్చర్ ఓవర్లో ఇబ్రహీమ్ 3 ఫోర్లు, సిక్స్ బాదగా... రూట్ ఓవర్లో నబీ 2 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టాడు. మెరుపు ప్రదర్శన చేసిన ఇబ్రహీమ్ చివరి ఓవర్ తొలి బంతికి అవుటయ్యాడు. ఆఖరి 10 ఓవర్లలో అఫ్గానిస్తాన్ 113 పరుగులు సాధించడం విశేషం. రూట్ మినహా... సాల్ట్ (12), జేమీ స్మిత్ (9) ఆరంభంలోనే వెనుదిరగడంతో భారీ ఛేదనలో ఇంగ్లండ్‌కు సరైన ఆరంభం లభించలేదు. అయితే రూట్, డకెట్ (45 బంతుల్లో 38; 4 ఫోర్లు) కలిసి జట్టును ఆదుకున్నారు. ఈ భాగస్వామ్యం తర్వాత బ్రూక్ (25), బట్లర్ (42 బంతుల్లో 38; 2 సిక్స్‌లు) కూడా కొద్దిసేపు రూట్‌కు సహకరించారు. అయితే వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సరైన రీతిలో సాగలేదు. రూట్, ఒవర్టన్ (28 బంతుల్లో 32; 3 ఫోర్లు) భాగస్వామ్యం కొద్దిగా ఇంగ్లండ్ విజయంపై ఆశలు రేపింది. 101 బంతుల్లో రూట్ వన్డేల్లో 17వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే చక్కటి బంతితో రూట్‌ను అజ్మతుల్లా బోల్తా కొట్టించిన తర్వాత ఒక్కసారిగా మ్యాచ్ అఫ్గాన్ వైపు మొగ్గింది.స్కోరు వివరాలు అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (బి) ఆర్చర్ 6; ఇబ్రహీమ్ (సి) ఆర్చర్ (బి) లివింగ్‌స్టోన్ 177; సాదిఖుల్లా (ఎల్బీ) (బి) ఆర్చర్ 4; రహ్మత్ షా (సి) ఆదిల్ రషీద్ (బి) ఆర్చర్ 4; హష్మతుల్లా (బి) రషీద్ 40; అజ్మతుల్లా (సి) (సబ్) బాంటన్ (బి) ఒవర్టన్ 41; నబీ (సి) రూట్ (బి) లివింగ్‌స్టోన్ 40; గుల్బదిన్ (నాటౌట్) 1; రషీద్ ఖాన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 325. వికెట్ల పతనం: 1–11, 2–15, 3–37, 4–140, 5–212, 6–323, 7–324. బౌలింగ్: ఆర్చర్ 10–0–64–3, మార్క్ వుడ్ 8–0–50–0, ఒవర్టన్ 10–0–72–1, ఆదిల్ రషీద్ 10–0–60–1, రూట్ 7–0–47–0, లివింగ్‌స్టోన్ 5–0–28–2. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (బి) అజ్మతుల్లా 12; డకెట్ (ఎల్బీ) (బి) రషీద్ 38; స్మిత్ (సి) అజ్మతుల్లా (బి) నబీ 9; రూట్ (సి) గుర్బాజ్ (బి) అజ్మతుల్లా 120; బ్రూక్ (సి అండ్ బి) నబీ 25; బట్లర్ (సి) రహ్మతుల్లా (బి) అజ్మతుల్లా 38; లివింగ్‌స్టోన్ (సి) గుర్బాజ్ (బి) గుల్బదిన్ 10; ఒవర్టన్ (సి) నబీ (బి) అజ్మతుల్లా 32; ఆర్చర్ (సి) నబీ (బి) ఫారుఖీ 14; రషీద్ (సి) ఇబ్రహీమ్ (బి) అజ్మతుల్లా 5; వుడ్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (49.5 ఓవర్లలో ఆలౌట్) 317. వికెట్ల పతనం: 1–19, 2–30, 3–98, 4–133, 5–216, 6–233, 7–287, 8–309, 9–313, 10–317. బౌలింగ్: ఫారుఖీ 10–0–62–1, అజ్మతుల్లా 9.5–0–58–5, నబీ 8–0–57–2, రషీద్ ఖాన్ 10–0–66–1, నూర్ 10–0–51–0, గుల్బదిన్ 2–0–16–1. చాంపియన్స్ ట్రోఫీలో నేడుపాకిస్తాన్ X బంగ్లాదేశ్స్టార్ స్పోర్ట్స్, జియోహాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
Champions Trophy 2025: చరిత్ర సృష్టించిన జద్రాన్.. రికార్డు శతకం.. ఆఫ్ఘనిస్తాన్ భారీ స్కోర్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy) భాగంగా లాహోర్ వేదికగా ఇంగ్లండ్‌తో ఇవాళ (ఫిబ్రవరి 26) జరుగుతున్న కీలక సమరంలో ఆఫ్ఘనిస్తాన్ యువ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ (Ibrahim Zadran) రికార్డు శతకం సాధించాడు. ఈ మ్యాచ్‌లో జద్రాన్ 146 బంతుల్లో డజను ఫోర్లు, అర డజను సిక్సర్ల సాయంతో 177 పరుగులు చేసి ఔటయ్యాడు. ఫలితంగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 325 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో రహ్మానుల్లా గుర్భాజ్ (6), సెదికుల్లా అటల్ (4), రహ్మత్ షా (4) విఫలం కాగా.. హష్మతుల్లా షాహిది (40), అజ్మతుల్లా ఒమర్జాయ్ (41), మహ్మద్ నబీ (40) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు పడగొట్టగా.. లివింగ్‌స్టోన్ 2, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీశారు.ఈ మ్యాచ్‌లో సూపర్ సెంచరీతో అలరించిన జద్రాన్ పలు రికార్డులు కొల్లగొట్టాడు. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే అత్యధిక స్కోర్ (177) నమోదు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఈ రికార్డు ఇంగ్లండ్ ఆటగాడు బెన్ డకెట్ పేరిట ఉండేది. డకెట్ ఇదే ఎడిషన్‌లో ఆస్ట్రేలియాపై 165 పరుగులు స్కోర్ చేశాడు.ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు..ఇబ్రహీం జద్రాన్-177బెన్ డకెట్-165నాథన్ ఆస్టల్-145 నాటౌట్ఆండీ ఫ్లవర్-145సౌరవ్ గంగూలీ-141 నాటౌట్సచిన్ టెండూల్కర్-141గ్రేమీ స్మిత్-141ఈ సెంచరీతో జద్రాన్ మరో రెండు భారీ రికార్డులు కూడా సాధించాడు. వన్డేల్లో ఆఫ్ఘనిస్తాన్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ రికార్డు గతంలో కూడా జద్రాన్ పేరిటే ఉండేది. జద్రాన్ తన రికార్డును తనే సవరించుకున్నాడు. 2022లో శ్రీలంకతో జరిగిన వన్డేలో జద్రాన్ 162 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌కు ముందు వరకు వన్డేల్లో ఆఫ్ఘనిస్తాన్ తరఫున ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా ఉండింది. వన్డేల్లో ఆఫ్ఘనిస్తాన్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్లు..ఇబ్రహీం జద్రాన్-177 వర్సెస్ ఇంగ్లండ్, 2025ఇబ్రహీం జద్రాన్-162 వర్సెస్ శ్రీలంక, 2022రహ్మానుల్లా గుర్భాజ్-151 వర్సెస్ పాకిస్తాన్, 2023అజ్మతుల్లా ఒమర్జాయ్-149 నాటౌట్ వర్సెస్ శ్రీలంక, 2024రహ్మానుల్లా గుర్భాజ్-145 వర్సెస్ బంగ్లాదేశ్, 2023ఈ సెంచరీతో జద్రాన్ రెండు ఐసీసీ వన్డే ఈవెంట్లలో సెంచరీలు చేసిన తొలి ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. జద్రాన్.. వన్డే వరల్డ్‌కప్‌లో, ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీలు చేశాడు. జద్రాన్.. 2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాపై సూపర్ సెంచరీతో మెరిశాడు. ముంబైలో జరిగిన ఆ మ్యాచ్‌లో జద్రాన్ 129 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.ఈ రికార్డులతో పాటు జద్రాన్ మరో ఘనత కూడా సాధించాడు. పాక్ గడ్డపై నాలుగో అత్యధిక వన్డే స్కోర్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. పాక్ గడ్డపై వన్డేల్లో అత్యధిక స్కోర్ చేసిన ఘనత గ్యారీ కిర్‌స్టన్‌కు దక్కుతుంది. 1996 వరల్డ్‌కప్‌లో కిర్‌స్టన్ యూఏఈపై 188 పరుగులు (నాటౌట్) చేశాడు.పాక్ గడ్డపై వన్డేల్లో అత్యధిక స్కోర్లు..గ్యారీ కిర్‌స్టన్-188 నాటౌట్వివియన్ రిచర్డ్స్-181ఫకర్ జమాన్-180 నాటౌట్ఇబ్రహీం జద్రాన్-177బెన్ డకెట్-165ఆండ్రూ హడ్సన్-161జద్రాన్ అద్భుత పోరాటంటాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్.. ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ధాటికి 37 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆర్చర్.. 11 పరుగుల వద్ద గుర్భాజ్‌ను (6), 15 పరుగుల వద్ద సెదికుల్లా అటల్‌ను (4).. 37 పరుగుల వద్ద రహ్మత్ షాను (4) ఔట్ చేశాడు. ఈ దశలో జద్రాన్.. కెప్టెన్ హష్మతుల్లా షాహిది, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. సెంచరీ వరకు ఆచితూచి ఆడిన జద్రాన్.. ఆతర్వాత శివాలెత్తిపోయాడు. ఎడాపెడా బౌండరీలు బాది ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. లివింగ్‌స్టోన్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్ తొలి బంతికి జద్రాన్ ఔటయ్యాడు. జద్రాన్ ఔట్ కాపోయుంటే ఆఫ్ఘనిస్తాన్ ఇంకా భారీ స్కోర్ చేసేది. ఇదే ఓవర్లో నబీ కూడా ఔట్ కావడంతో ఆఫ్ఘనిస్తాన్ చివరి ఓవర్లో కేవలం 2 పరుగులు మాత్రమే చేయగలిగింది. -
Champions Trophy 2025: శతక్కొట్టిన జద్రాన్.. తొలి ఆఫ్ఘన్ ప్లేయర్‌గా రికార్డు
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy) భాగంగా ఇంగ్లండ్‌తో (England) ఇవాళ (ఫిబ్రవరి 26) జరుగుతున్న కీలక సమరంలో ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) యువ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ (Ibrahim Zadran) సూపర్ సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో జద్రాన్ 106 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 100 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 35 మ్యాచ్‌ల వన్డే కెరీర్లో జద్రాన్‌కు ఇది ఆరో శతకం. ఈ సెంచరీతో జద్రాన్ ఓ అరుదైన ఘనత సాధించాడు. వన్డే వరల్డ్‌కప్‌లో, ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీ చేసిన తొలి ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. జద్రాన్ 2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాపై సూపర్ సెంచరీతో మెరిశాడు. ముంబైలో జరిగిన ఆ మ్యాచ్‌లో జద్రాన్ 129 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఆఫ్ఘనిస్తాన్.. ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ధాటికి 37 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆర్చర్.. 11 పరుగుల వద్ద గుర్భాజ్‌ను (6), 15 పరుగుల వద్ద సెదికుల్లా అటల్‌ను (4).. 37 పరుగుల వద్ద రహ్మత్ షాను (4) ఔట్ చేశాడు. ఈ దశలో జద్రాన్.. కెప్టెన్ హష్మతుల్లా షాహిది నాలుగో వికెట్‌కు 103 పరుగులు జోడించి ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌కు జీవం పోశారు. హష్మతుల్లా 40 పరుగులు చేసి ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అనంతరం జద్రాన్..అజ్మతుల్లా ఒమర్జాయ్ సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 31 బంతుల్లో బౌండరీ, మూడు సిక్సర్ల సాయంతో 41 పరుగులు చేసిన అనంతరం అజ్మతుల్లా జేమీ ఓవర్టన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 42 ఓవర్లు ముగిసే సరికి ఆఫ్ఘనిస్తాన్ స్కోర్ 5 వికెట్ల నష్టానికి 227 పరుగులుగా ఉంది. జద్రాన్‌తో (115) పాటు మహ్మద్ నబీ (8) క్రీజ్‌లో ఉన్నారు.కాగా, గ్రూప్-బిలో ఈ మ్యాచ్ డూ ఆర్ డై మ్యాచ్‌గా పరిగణించబడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీస్ రేసులో నిలుస్తుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్ తమ తొలి మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా చేతుల్లో ఓడిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య నిన్న జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ప్రస్తుతం గ్రూప్-బి పాయింట్ల పట్టికలో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా తలో 3 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్ ఖాతా తెరవకుండా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. గ్రూప్-ఏ నుంచి భారత్, న్యూజిలాండ్ జట్లు ఇదివరకే సెమీస్ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి. ఆతిథ్య పాకిస్తాన్, బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. -
గెలిచిన జట్టే నిలుస్తుంది
లాహోర్: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ముందుకెళ్లేందుకు ఇంగ్లండ్ కీలకమైన పోరుకు సిద్ధమైంది. బుధవారం జరిగే మ్యాచ్‌లో బట్లర్ బృందం అఫ్గానిస్తాన్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టే సెమీస్ రేసులో ఉంటుంది. ఓడిన జట్టు ఇంటిదారి పట్టాల్సిందే. తొలి మ్యాచ్‌లో ఆ్రస్టేలియాపై 350 పైచిలుకు స్కోరు చేసినా బౌలింగ్ వైఫల్యంతో ఓడిన ఇంగ్లండ్... లోపాల్ని సవరించుకొని అఫ్గాన్‌తో సమరానికి సిద్ధమైంది. ఓపెనర్ బెన్ డకెట్, జో రూట్, కెపె్టన్ బట్లర్, ఆర్చర్లు జోరు మీదున్నారు. రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, నబీలతో కూడిన ప్రత్యర్థి స్పిన్ త్రయంపై జాగ్రత్తగా ఆడితే పరుగుల వరద పారించొచ్చు. వుడ్, ఆదిల్ రషీద్, లివింగ్‌స్టోన్‌లతో ఉన్న బౌలింగ్ దళం పరుగుల నిరోధంపై దృష్టి పెట్టాల్సి ఉంది. మరోవైపు అఫ్గానిస్తాన్ తొలి పోరులో దక్షిణాఫ్రికాతో ఘోరంగా ఓడింది. సఫారీకి 300 పైచిలుకు పరుగులు సమరి్పంచుకున్న అఫ్గాన్ కనీసం 50 ఓవర్ల కోటా కూడా ఆడలేక 208 పరుగులకే కుప్పకూలింది. టాపార్డర్‌లో గుర్బాజ్, జద్రాన్, సిద్ధిఖుల్లా వైఫల్యం జట్టుకు ఇబ్బందిగా మారింది. రహ్మత్ షా ఒక్కడే బాధ్యత కనబరిచాడు. కీలకమైన పోరులో జట్టంతా కలిసి సమష్టిగా సర్వశక్తులు ఒడ్డితేనే గట్టి ప్రత్యర్థి ఇంగ్లండ్‌ను ఎదుర్కోవచ్చు లేదంటే ఏ ఒక్కరిద్దరి ప్రదర్శనను నమ్ముకుంటే మాత్రం గత ఫలితమే మళ్లీ పునరావృతం అవుతుంది. తుది జట్లు (అంచనా) ఇంగ్లండ్: బట్లర్ (కెప్టెన్), సాల్ట్, డకెట్, జేమీ స్మిత్, రూట్, హ్యారీ బ్రూక్, లివింగ్‌స్టోన్, కార్స్, ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్. అఫ్గానిస్తాన్: హష్మతుల్లా (కెప్టెన్), గుర్బాజ్, జద్రాన్, సిద్ధిఖుల్లా, రహ్మత్ షా, అజ్మతుల్లా, నబీ, గుల్బదిన్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఫజల్హక్.3 ఇప్పటి వరకు వన్డే ఫార్మాట్లో ఇంగ్లండ్, అఫ్గానిస్తాన్ జట్లు ముఖాముఖిగా మూడుసార్లు తలపడ్డాయి. వరల్డ్‌కప్ టోర్నీ సందర్భంగానే ఈ మూడు మ్యాచ్‌లు జరిగాయి. ఇంగ్లండ్ (2015, 2019లలో) రెండుసార్లు, అఫ్గానిస్తాన్ (2023లో) ఒకసారి గెలుపొందాయి. -
ముంబై ఇండియన్స్ ఫ్యామిలీలో మరో జట్టుతో జతకట్టిన రషీద్ ఖాన్
ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) స్టార్ ఆటగాడు రషీద్ ఖాన్‌కు (Rashid Khan) ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఫ్యామిలీతో బంధం మరింత బలపడింది. ఇప్పటికే మూడు లీగ్‌ల్లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీల్లో సభ్యుడిగా ఉన్న రషీద్.. తాజాగా మరో ఎంఐ ఫ్రాంచైజీతో జతకట్టాడు. రషీద్‌ను ద హండ్రెడ్ లీగ్‌లో ఎంఐ యాజమాన్యంలో నడుస్తున్న ఓవల్ ఇన్విన్సిబుల్స్ (డిఫెండింగ్ ఛాంపియన్) సొంతం చేసుకుంది. ఓవల్ ఇన్విన్సిబుల్స్లో ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఇటీవలే పెట్టుబడులు పెట్టింది. ఇందులో 49 శాతం వాటాను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) కొనుగోలు చేసింది.ప్రస్తుతం రషీద్ ఒక్క ఐపీఎల్ మినహా మిగతా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీల్లో (ఫారిన్ లీగ్‌ల్లో) సభ్యుడిగా ఉన్నాడు. రషీద్ ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు ఆడుతున్నాడు. రషీద్ సౌతాఫ్రికా టీ20 లీగ్ ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్‌కు.. ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్‌కు.. మేజర్ లీగ్ క్రికెట్లో ముంబై ఇండియన్స్ న్యూయార్క్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ద హండ్రెడ్ లీగ్ ప్రారంభం నుంచి (2021) ట్రెంట్ రాకెట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రషీద్‌ను ఓవల్ ఇన్విన్సిబుల్స్ డైరెక్ట్ ఓవర్సీస్ సైనింగ్ ద్వారా దక్కించుకుంది.కాగా, ద హండ్రెడ్ లీగ్-2025 సీజన్ కోసం ప్లేయర్ల రిటెన్షన్ జాబితాలను ఎనిమిది ఫ్రాంచైజీలు ఇవాళ ప్రకటించాయి. గత సీజన్లో తమతో ఉన్న 10 మంది సభ్యులను ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకోవచ్చు. రిటెన్షన్ జాబితాలో ఒక ఇంగ్లండ్ సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్ తప్పక ఉండాలి. అలాగే ముగ్గురు ఓవర్సీస్ ప్లేయర్లు ఉండవచ్చు. అదనంగా ఓ విదేశీ ఆటగాడిని డైరెక్ట్ సైనింగ్ చేసుకోవచ్చు. ఈ పద్దతిలోనే ఇన్విన్సిబుల్స్ రషీద్ ఖాన్‌ను దక్కించుకుంది. ఫ్రాంచైజీల్లో మిగిలిన స్థానాల భర్తీ డ్రాఫ్ట్ ద్వారా జరుగుతుంది. డ్రాఫ్ట్ తేదీ ప్రకటించాల్సి ఉంది.ద హండ్రెడ్ లీగ్‌లో ఇటీవలే ఐపీఎల్ ఫ్రాంచైజీలు పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. ఓవల్ ఇన్విన్సిబుల్స్లో ముంబై ఇండియన్స్.. నార్తర్న్ సూపర్చార్జర్స్లో సన్‌రైజర్స్ హైదరాబాద్.. మాంచెస్టర్ ఒరిజినల్స్‌లో లక్నో సూపర్ జెయింట్స్.. సథరన్ బ్రేవ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ షేర్ దక్కించుకున్నాయి. వీటిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ నార్తర్న్ సూపర్‌చార్జర్స్ ఫ్రాంచైజీ మొత్తాన్ని కొనుగోలు చేసింది. మిగతా ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆయా ప్రాంచైజీల్లో 49 శాతం వాటాను దక్కించుకున్నాయి.రిటెన్షన్స్ జాబితా..బర్మింగ్హమ్ ఫీనిక్స్- బెన్ డకెట్, ట్రెంట్ బౌల్ట్ (ఓవర్సీస్), లియామ్ లివింగ్‌స్టోన్, జేకబ్ బేతెల్, ఆడమ్ మిల్నే (ఓవర్సీస్), బెన్నీ హోవెల్, టిమ్ సౌథీ (ఓవర్సీస్), డాన్ మౌస్లీ, విల్ స్మీడ్, క్రిస్ వుడ్, ఆనురిన్ డొనాల్డ్లండన్ స్పిరిట్- లియామ్ డాసన్, డాన్ వారోల్, కేన్ విలియమ్సన్ (ఓవర్సీస్), రిచర్డ్ గ్లీసన్, ఓలీ స్టోన్, ఓలీ పోప్, కీటన్ జెన్నింగ్స్మాంచెస్టర్ ఒరిజినల్స్- జోస్ బట్లర్, ఫిలిప్ సాల్ట్, హెన్రిచ్ క్లాసెన్ (ఓవర్సీస్), మ్యాటీ హర్స్ట్, జోష్ టంగ్, స్కాట్ కర్రీ, టామ్ హార్ట్లీ, సోనీ బేకర్, టామ్ ఆస్పిన్వాల్నార్త్రన్ సూపర్ ఛార్జర్స్- హ్యారీ బ్రూక్, డేవిడ్ మిల్లర్ (ఓవర్సీస్), ఆదిల్ రషీద్, మిచెల్ సాంట్నర్ (ఓవర్సీస్), బ్రైడన్ కార్స్, బెన్ డ్వార్షుయిస్ (ఓవర్సీస్), మాట్ పాట్స్, పాట్ బ్రౌన్, గ్రహం క్లార్క్, టామ్ లాస్ఓవల్ ఇన్విన్సిబుల్స్- సామ్ కర్రన్, విల్ జాక్స్, రషీద్ ఖాన్ (ఓవర్సీస్), జోర్డన్ కాక్స్, సామ్ బిల్లింగ్స్, సాకిబ్ మహమూద్, గస్ అట్కిన్సన్, డొనొవన్ ఫెరియెరా (ఓవర్సీస్), నాథన్ సౌటర్, ట్వాండా ముయేయేసథరన్ బ్రేవ్- జోఫ్రా ఆర్చర్, జేమ్స్ విన్స్, క్రిస్ జోర్డన్, టైమాల్ మిల్స్, డుప్లెసిస్ (ఓవర్సీస్), లూయిస్ డు ప్లూయ్, లారీ ఈవాన్స్, క్రెయిగ్ ఓవర్టన్, ఫిన్ అలెన్ (ఓవర్సీస్), డ్యానీ బ్రిగ్స్, జేమ్స్ కోల్స్ట్రెంట్ రాకెట్స్- జో రూట్, మార్కస్ స్టోయినిస్ (ఓవర్సీస్), టామ్ బాంటన్, సామ్ కుక్, జాన్ టర్నర్, సామ్ హెయిన్, టామ్ అల్సోప్, కాల్విన్ హ్యారీసన్వెల్ష్ ఫైర్- జానీ బెయిర్‌స్టో, స్టీవ్ స్మిత్ (ఓవర్సీస్), టామ్ కొహ్లెర్ కాడ్మోర్, టామ్ ఏబెల్, లూక్ వెల్స్, స్టీవీ ఎస్కినాజీ -
అదరగొట్టిన దక్షిణాఫ్రికా
కరాచీ: సుదీర్ఘ కాలంగా ఐసీసీ ట్రోఫీ టైటిల్ కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్న దక్షిణాఫ్రికా చాంపియన్స్ ట్రోఫీని భారీ విజయంతో మొదలు పెట్టింది. తొలిసారి టోర్నీ ఆడుతున్న అఫ్గానిస్తాన్‌కు ఎలాంటి సంచలనానికి అవకాశం ఇవ్వకుండా తమ స్థాయికి తగ్గ ఆటతో పైచేయి సాధించింది. ముందుగా బ్యాటింగ్‌లో భారీ స్కోరుతో చెలరేగిన మాజీ చాంపియన్ ఆ తర్వాత పదునైన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్థిని పడగొట్టింది. శుక్రవారం జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 107 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ర్యాన్ రికెల్టన్ (106 బంతుల్లో 103; 7 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో చెలరేగగా... కెప్టెన్ బవుమా (76 బంతుల్లో 58; 5 ఫోర్లు), మార్క్రమ్ (36 బంతుల్లో 52 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), డసెన్ (46 బంతుల్లో 52; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం అఫ్గానిస్తాన్ 43.3 ఓవర్లలో 208 పరుగులకే ఆలౌటైంది. రహ్మత్ షా (92 బంతుల్లో 90; 9 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగతావారంతా విఫలమయ్యారు. మూడు అర్ధ సెంచరీలు... ఇన్నింగ్స్ ఆరంభంలోనే టోనీ జోర్జి (11) వెనుదిరగ్గా ... రికెల్టన్, బవుమా కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. తొలి 10 ఓవర్లలో దక్షిణాఫ్రికా స్కోరు 46 పరుగులకు చేరింది. చక్కటి షాట్లతో ఆకట్టుకున్న రికెల్టన్ 48 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ జోడీని విడదీసేందుకు అఫ్గాన్ బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. 63 బంతుల్లో అర్ధ సెంచరీని అందుకున్న అనంతరం నబీ బౌలింగ్‌లో బవుమా వెనుదిరిగాడు. రికెల్టన్, బవుమా రెండో వికెట్‌కు 23.4 ఓవర్లలో 129 పరుగులు జోడించారు. ఆ తర్వాత కొద్దిసేపటికి 101 బంతుల్లో రికెల్టన్ కెరీర్లో తొలి శతకాన్ని సాధించాడు. అయితే తర్వాతి ఓవర్లోనే అతను అనూహ్యంగా రనౌటయ్యాడు. కీలక వికెట్ తీసిన ఆనందం అఫ్గాన్‌కు దక్కలేదు. ఆపై డసెన్, మార్క్రమ్ తమ జోరును ప్రదర్శించడంతో దక్షిణాఫ్రికా స్కోరు 300 దాటింది. రహ్మత్ షా మినహా... భారీ ఛేదనలో అఫ్గాన్ టీమ్ తడబడింది. రహ్మత్ షా పట్టుదలగా నిలబడినా... ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ భాగస్వామ్యం లేకపోయింది. నలుగురు సఫారీ పేసర్ల ధాటికి బ్యాటర్లు నిలవలేకపోయారు. పవర్‌ప్లే ముగిసేసరికే తొలి 2 వికెట్లు కోల్పోయిన జట్టు తర్వాతి 5 ఓవర్లలో మరో 2 వికెట్లు చేజార్చుకుంది. 89/5 స్కోరు వద్ద జట్టు గెలుపుపై ఆశలు వదిలేసుకుంది. రహ్మత్ మాత్రం కాస్త పోరాడుతూ సెంచరీకి చేరువయ్యాడు. అయితే మరోవైపు నుంచి అతనికి సహకారం లభించలేదు. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: రికెల్టన్ (రనౌట్) 103; టోనీ జోర్జి (సి) అజ్మతుల్లా (బి) నబీ 11; బవుమా (సి) సాదిఖుల్లా (బి) నబీ 58; డసెన్ (సి) హష్మతుల్లా (బి) నూర్ 52; మార్క్రమ్ (నాటౌట్) 52; మిల్లర్ (సి) రహ్మత్ (బి) ఫారుఖీ 14; యాన్సెన్ (బి) అజ్మతుల్లా 0; ముల్డర్ (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 315. వికెట్ల పతనం: 1–28, 2–157, 3–201, 4–248, 5–298, 6–299. బౌలింగ్: ఫారుఖీ 8–0–59–1, అజ్మతుల్లా 6–0–39–1, నబీ 10–0– 51–2, రషీద్ ఖాన్ 10–0–59–0, గుల్బదిన్ 7–0–42–0, నూర్ అహ్మద్ 9–0–65–1. అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (సి) మహరాజ్ (బి) ఎన్గిడి 10; ఇబ్రహీమ్ (బి) రబడ 17; సాదిఖుల్లా (రనౌట్) 16; రహ్మత్ షా (సి) రికెల్టన్ (బి) రబడ 90; హష్మతుల్లా (సి) బవుమా (బి) ముల్డర్ 0; అజ్మతుల్లా (సి) రికెల్టన్ (బి) రబడ 18; నబీ (సి) రబడ (బి) యాన్సెన్ 8; గుల్బదిన్ (సి) బవుమా (బి) ఎన్గిడి 13; రషీద్ (సి) మార్క్రమ్ (బి) మహరాజ్ 18; నూర్ (బి) ముల్డర్ 9; ఫారుఖీ (నాటౌట్) 0; ఎక్స్ ట్రాలు 9; మొత్తం (43.3 ఓవర్లలో ఆలౌట్) 208. వికెట్ల పతనం: 1–16, 2–38, 3–50, 4–50, 5–89, 6–120, 7–142, 8–169, 9– 208, 10–208. బౌలింగ్: యాన్సెన్ 8–1– 32– 1, ఎన్గిడి 8–0–56–2,రబడ 8.3–1–36–3, ముల్డర్ 9–0–36–2, మహరాజ్ 10–0–46–1. చాంపియన్స్ ట్రోఫీలో నేడు ఆ్రస్టేలియా X ఇంగ్లండ్‌వేదిక: లాహోర్ మధ్యాహ్నం గం. 2:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ 18, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు (ఫిబ్రవరి 21) మరో ఆసక్తికర పోరు
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy) ఇవాళ (ఫిబ్రవరి 21) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. టోర్నీలో తొలిసారి అడుగుపెట్టిన ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan).. ఓ సారి ఛాంపియన్ (1998) సౌతాఫ్రికాను (South Africa) ఢీకొట్టనుంది. కరాచీ వేదికగా ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. గ్రూప్-బిలో భాగంగా ఈ మ్యాచ్ జరుగుతుంది.సౌతాఫ్రికాకు షాకిచ్చిన ఆఫ్ఘనిస్తాన్సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు చివరిసారిగా 2024 సెప్టెంబర్‌లో ఎదురెదురుపడ్డాయి. యూఏఈ వేదికగా జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు తలపడ్డాయి. ఆ సిరీస్‌లో సౌతాఫ్రికాకు శృంగభంగం జరిగింది. ఆ సిరీస్‌ను సౌతాఫ్రికన్లు 1-2 తేడాతో కోల్పోయారు. దీనికి ముందు ఇరు జట్లు 2023 వన్డే వరల్డ్‌కప్‌లో తలపడగా.. ఆ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. వన్డేల్లో ఇరు జట్లు ఇప్పటివరకు ఐదు సార్లు తలపడగా.. 3 మ్యాచ్‌ల్లో ఆఫ్ఘనిస్తాన్, 2 మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికా విజయాలు సాధించాయి.గతంలో పోలిస్తే ప్రస్తుతం సౌతాఫ్రికా జట్టు పటిష్టంగా ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆ జట్టు ఫుల్ మెంబర్ టీమ్‌తో బరిలోకి దిగింది. అలాగని ఆఫ్ఘనిస్తాన్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఇటీవలి కాలంలో ఆఫ్ఘన్లు పటిష్టమైన జట్లకు షాకిచ్చారు.దక్షిణాఫ్రికా: ర్యాన్ రికెల్టన్(వికెట్‌కీపర్), టోనీ డి జోర్జి, టెంబా బవుమా(కెప్టెన్), ఎయిడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్, వియాన్ ముల్డర్, మార్కో జన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగీ ఎంగిడి, తబ్రైజ్ షమ్సీ, ట్రిస్టన్ స్టబ్స్, కొర్బిన్ బాష్, రస్సీ వాన్ డర్ డస్సెన్ఆఫ్ఘనిస్తాన్: రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్‌కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెదిఖుల్లా అటల్, రహమత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బాదిన్ నాయబ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ఫజల్హాక్ ఫరూఖీ, నూర్ అహ్మద్, ఫరీద్ అహ్మద్ మాలిక్, ఇక్రమ్ అలీఖిల్, నవీద్ జద్రాన్, నంగేయాలియా ఖరోటేఇదిలా ఉంటే, ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు జరగ్గా రెండు రసవత్తరంగా సాగాయి. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్, ఆతిథ్య జట్టు పాకిస్తాన్‌కు న్యూజిలాండ్ షాకిచ్చింది. ఈ మ్యాచ్‌లో కివీస్ 60 పరుగుల తేడాతో గెలుపొందింది. నిన్న (ఫిబ్రవరి 20) జరిగిన మ్యాచ్‌లో భారత్.. బంగ్లాదేశ్‌ను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత్‌కు అంత ఈజీగా గెలుపు దక్కలేదు. బంగ్లా ఆటగాళ్లు అద్భుతంగా పోరాడారు. -
అఫ్గాన్ సరిహద్దుల్లో పాక్ ఆపరేషన్.. 30మంది ఉగ్రవాదులు హతం
పెషావర్: పాకిస్తాన్ సైన్యం పలువురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. వాయువ్య పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఈ సైనిక చర్య జరిగింది. నిఘావర్గాలు అందించిన సమాచారం మేరకు భద్రతా దళాలు ఈ ఆపరేషన్ చేపట్టి, 30 మంది ఉగ్రవాదులను హతమార్చాయి. దీనికి సంబంధించిన వివరాలను పాక్ సైన్యం మీడియాకు తెలిపింది.ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్పీఆర్) విడుదల చేసిన ఒక ప్రకటనలోని వివరాల ప్రకారం ఉగ్రవాదుల ఉనికి గురించి సమాచారం అందిన నేపధ్యంలో దక్షిణ వజీరిస్తాన్ జిల్లాలోని సరోఘా ప్రాంతంలో ఈ ఆపరేషన్ జరిగింది. భద్రతా దళాలు ఉగ్రవాదుల రహస్య స్థావరాలను లక్ష్యంగా చేసుకుని, 30 మంది ఉగ్రవాదులను హతమార్చాయని ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ తెలిపింది. ఈ సైనిక చర్య విజయవంతమైన నేపధ్యంలో పాకిస్తాన్ సాయుధ దళాలను ప్రధాని షాబాజ్ షరీఫ్ ప్రశంసించారు.దీనికి ముందు పాకిస్తాన్‌లోని సమస్యాత్మక వాయువ్య ప్రాంతంలో భద్రతా దళాలపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. వారు జరిపిన కాల్పుల్లో నలుగురు పాకిస్తాన్ సైనికులు మరణించగా, పలువురు గాయపడ్డారు. 2025 జనవరి నుంచి పాకిస్తాన్లో ఉగ్ర దాడులు పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇది 2024 డిసెంబర్ కంటే 42 శాతం ఎక్కువ. జనవరిలో ఉగ్రవాద నిరోధక చర్యలలో భాగంగా భద్రతా దళాలు 185 మంది ఉగ్రవాదులను హతమార్చాయని ఒక నివేదిక పేర్కొంది.ఇది కూడా చదవండి: రిస్క్‌లో కుంభమేళా మోనాలిసా? -
మా జట్టుకు గట్టి పోటీ తప్పదు.. సెమీస్ చేరే జట్లు ఇవే: పాక్ మాజీ కెప్టెన్
చాంపియన్స్ ట్రోఫీ-2025 గ్రూప్ దశలో తమ జట్టుకు గట్టిపోటీ తప్పదంటున్నాడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్(Sarfaraz Ahmed). టీమిండియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌ల జట్ల రూపంలో కఠిన సవాలు ఎదురుకానుందని పేర్కొన్నాడు. అయితే, సొంతగడ్డపై జరిగే ఈ టోర్నీలో పాకిస్తాన్(Pakistan) తప్పకుండా సెమీ ఫైనల్‌కు మాత్రం చేరుతుందని సర్ఫరాజ్ అహ్మద్ ధీమా వ్యక్తం చేశాడు.కాగా 2017లో చివరగా జరిగిన చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) టోర్నమెంట్లో పాక్ టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. నాడు సర్ఫరాజ్ అహ్మద్ కెప్టెన్సీలో లండన్ వేదికగా జరిగిన ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి టీమిండియాపై గెలుపొంది ట్రోఫీని ముద్దాడింది. ఎనిమిదేళ్ల అనంతరంఇక ఇప్పుడు.. దాదాపు ఎనిమిదేళ్ల అనంతరం ఈ మెగా టోర్నీ మరోసారి జరుగనుండగా డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాకిస్తాన్ ఆతిథ్య హక్కులు దక్కించుకుంది.ఇక ఈ ఐసీసీ ఈవెంట్‌కు పాకిస్తాన్‌తో పాటు వన్డే వరల్డ్‌కప్-2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, భారత్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ అర్హత సాధించాయి.ఈ క్రమంలో ఈ ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-‘ఎ’లో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్.. గ్రూప్-‘బి’లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్ , ఇంగ్లండ్‌ను చేర్చారు. ఇక పాక్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి ఈ టోర్నీ మొదలుకానుండగా.. టీమిండియా మాత్రం తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో ఆడనుంది.సెమీ ఫైనల్స్‌లో ఆ నాలుగేఈ నేపథ్యంలో సర్ఫరాజ్ అహ్మద్ చాంపియన్స్ ట్రోఫీ-2025లో సెమీస్ చేరే జట్లపై తన అంచనా తెలియజేశాడు. ‘‘పాకిస్తాన్ ఉన్న గ్రూపులో జట్ల నుంచి గట్టి పోటీ తప్పదు. అయితే, నా అభిప్రాయం ప్రకారం... ఈసారి పాకిస్తాన్, ఇండియా, అఫ్గనిస్తాన్, ఆస్ట్రేలియా బలమైన జట్లుగా కనిపిస్తున్నాయి. సెమీ ఫైనల్స్ ఈ నాలుగే చేరతాయి’’ అని సర్ఫరాజ్ అహ్మద్ పేర్కొన్నాడు.ఇక తమ జట్టు గురించి మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్ టీమ్ పటిష్టంగా ఉంది. సొంతగడ్డపై టోర్నీ ఆడనుండటం అతిపెద్ద సానుకూలాంశం. సొంత మైదానాల్లో ఎలా ఆడాలన్న అంశంపై ప్రతి ఒక్క ఆటగాడికి అవగాహన ఉంది. 2017లో ట్రోఫీ గెలిచిన జట్టుతో పోలిస్తే.. ప్రస్తుత జట్టు మరింత స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది.ప్రధాన బలం వారేబాబర్ ఆజం రూపంలో జట్టులో వరల్డ్‌క్లాస్ ప్లేయర్ ఉన్నాడు. ఫఖర్ జమాన్ ఆనాడు కొత్తగా జట్టులోకి వచ్చాడు. ఇప్పుడు అనుభవం కలిగిన ఆటగాడిగాబరిలోకి దిగబోతున్నాడు. వీళ్దిద్దరు పాకిస్తాన్ జట్టుకు ప్రధాన బలం’’ అని సర్ఫరాజ్ అహ్మద్ చెప్పుకొచ్చాడు.కాగా 2017లో చివరగా ఐసీసీ టైటిల్ గెలిచిన పాకిస్తాన్ ఇప్పటివరకు మళ్లీ మెగా ఈవెంట్లలో గెలుపు రుచిచూడలేదు. 2023 వన్డే వరల్డ్‌కప్, టీ20 ప్రపంచకప్-2024లో కనీసం సెమీస్ చేరకుండానే ఇంటిబాట పట్టింది. ఇప్పుడు స్వదేశంలోనైనా.. గత చేదు అనుభవాలను మరిపించేలా సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక ఇటీవల వన్డే సిరీస్‌లలో వరుస విజయాలతో జోరు మీదున్న పాక్ జట్టుకు సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో పరాభవం ఎదురైంది.మహ్మద్ రిజ్వాన్ పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై వన్డే సిరీస్ విజయం సాధించిన పాక్.. సౌతాఫ్రికాలో 3-0తో క్లీన్‌స్వీప్ చేసి ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. అయితే, తాజాగా స్వదేశంలో సౌతాఫ్రికా- న్యూజిలాండ్‌తో జరిగిన ట్రై సిరీస్‌లో ఫైనల్ చేరుకున్న రిజ్వాన్ బృందం కివీస్ చేతిలో ఓటమిపాలైంది.చదవండి: డబ్బులేదు.. మూడేళ్లపాటు మ్యాగీ మాత్రమే.. మరో ఆణిముత్యం.. అతడే ఓ చరిత్ర: నీతా అంబానీ -
ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన ఆఫ్ఘనిస్తాన్ స్పిన్ సంచలనం
ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) స్పిన్ సంచలనం అల్లా ఘజన్ఫర్ (AM Ghazanfar) త్వరలో ప్రారంభంకానున్న ఛాంపియన్స్ ట్రోఫీకి (Champions Trophy) దూరమయ్యాడు. 18 ఏళ్ల ఈ ఆఫ్ స్పిన్ బౌలర్ గత నెలలో జింబాబ్వేతో జరిగిన సిరీస్ సందర్భంగా గాయపడ్డాడు. ఘజన్ఫర్కు వెన్నుపూసలో పగుళ్లు వచ్చినట్లు డాక్టర్లు నిర్దారించారు. దీని కారణంగా ఘజన్‌ఫన్ నాలుగు నెలలు క్రికెట్‌కు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఘజన్ఫర్ ఐపీఎల్ 2025లో పాల్గొనేది కూడా అనుమానమే అని తెలుస్తుంది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ మెగా వేలంలో ముంబై ఇండియన్స్ ఘజన్‌ఫర్‌ను రూ. 4.8 కోట్లకు సొంతం చేసుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఘజన్ఫర్కు ప్రత్యామ్నాయంగా నంగేయాలియా ఖరోటేను ఎంపిక చేశారు ఆఫ్ఘన్ సెలెక్టర్లు. లెఫ్ట్ ఆర్మ స్పిన్నర్ అయిన ఖరోటే ముందుగా ప్రకటించిన ఆఫ్ఘనిస్తాన్ జట్టులో (ఛాంపియన్స్ ట్రోఫీ) ట్రావెలింగ్ రిజార్వ్గా ఉన్నాడు. 20 ఏళ్ల ఖరోటే ఆఫ్ఘనిస్తాన్ తరఫున 7 వన్డేలు ఆడి 11 వికెట్లు పడగొట్టాడు. ఘజన్ఫర్ విషయానికొస్తే.. ఈ మిస్టరీ స్పిన్నర్ ఆఫ్ఘనిస్తాన్ తరఫున 11 వన్డేల్లో 21 వికెట్లు.. ఓ టెస్ట్‌లో 4 వికెట్లు పడగొట్టాడు. ఘజన్ఫర్ లేని లోటు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్ఘనిస్తాన్పై ప్రభావం చూపే అవకాశం ఉంది.ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రకటించిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు..హష్మతుల్లా షాహిది (కెప్టెన్), రహమత్ షా (వైస్ కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్‌కీపర్), ఇక్రామ్ అలీఖిల్ (వికెట్‌కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెడిఖుల్లా అటల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, రషీద్ ఖాన్, నంగేయాలియా ఖరోటే, నూర్ అహ్మద్, ఫజల్ హక్ ఫారూకీ, నవీద్ జద్రాన్, ఫరీద్ అహ్మద్ మాలిక్కాగా, ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్ఘనిస్తాన్ ప్రయాణం ఫిబ్రవరి 21న ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్.. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లతో కలిసి గ్రూప్-బిలో పోటీపడుతుంది.2025 ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరుగనున్నాయి. మిగతా మ్యాచ్‌లకు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 19న జరిగే టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలపడతాయి. అనంతరం ఫిబ్రవరి 20న జరిగే మ్యాచ్‌లో భారత్, బంగ్లాదేశ్‌ను ఢీకొంటుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరుగనుంది.ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌లు..ఫిబ్రవరి 21న సౌతాఫ్రికాతోఫిబ్రవరి 26న ఇంగ్లండ్తోఫిబ్రవరి 28న ఆస్ట్రేలియాతో -
ఉగ్రవాదాన్ని అంతమొందించాలంటే...
ఆధునిక మానవుడు సాధించిన ఎన్నో ఘన విజయాలకు, సాధించుకున్న సామాజిక ప్రశాంతతకు భంగం కలిగించడంలో ఉగ్రవాదం పెనుసవాలుగా మారింది. గడచిన రెండువందల ఏళ్ల కాలంలో వివిధ దేశాల్లో పుట్టుకొచ్చిన 400కు పైగా టెర్రర్ గ్రూపుల పైన, అవి రూపాంతరం చెందడం, అంతమవడం పైన సమగ్ర అధ్యయనం చేశారు ప్రొ‘‘ ఆడ్రీ కుర్త్ క్రోనిన్. ప్రస్తుతం ఆమెరికాలోని ‘కార్నెగీ మెలన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్ట్రాటెజీ అండ్ టెక్నాలజీ’ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. గత చరిత్రను తవ్వి తీసి ఆమె చేసిన పరిశోధనలో ఉగ్ర భూతాన్ని అంతమొందించడంపై విలువైన సమాచారం ఉంది. ఆమె రాసిన ‘హౌ టెర్రరిజమ్ ఎండ్స్: అండర్స్టాండింగ్ ద డిక్లయిన్ అండ్ డిమైస్ ఆఫ్ టెర్రరిస్ట్ క్యాంపెయిన్స్’ పరిశోధన గ్రంథాన్ని ప్రిన్స్టన్ యూనివర్శిటీ ప్రెస్ 2011లో ప్రచురించింది. ఉగ్రవాద సంస్థలు అంతమయ్యే ఆరు మార్గా లను తన అధ్యయనంలో గుర్తించారామె. అవి:1) ఉగ్ర సంస్థల అగ్రనేతలను భౌతికంగా అంతమొందించడం. 2) సంప్రతింపుల ద్వారా టెర్రరిస్టు గ్రూపు డిమాండ్ల పరిష్కారం. 3) రాజ్యంపై ఉగ్రవాద సంస్థ పైచేయి సాధించడం ద్వారా తానే రాజ్యం కావడం (ఉదా: తాలిబన్ ప్రభుత్వం). 4) అంతర్గత కలహాలతో పతనమవడం. 5) మిలిటరీ దాడులతో చెల్లాచెదురవడం. 6) ఉగ్ర సంస్థ తనకు తానుగా పంథా మార్చుకుని రాజకీయ పార్టీగా అవత రించడం.ఉగ్రవాద నేతల అంతం విషయంలో ఒక పద్ధతి పైస్థాయి నేతలను అడ్డు తొలగించుకోవడం. ఉదా: ఒసామా బిన్ లాడెన్‌ను చంపడం. బిన్ లాడెన్ తర్వాత అల్‌ఖైదాకు నేతృత్వం వహించిన అల్ జవహిరిని కూడా అమెరికా 2022లో కాబూల్‌లో డ్రోన్ దాడితో అంతమొందించింది. ఇదంతా ఉగ్రవాద భూతం తల నరికేయడమన్న మాట!ఇరాన్ ఎజెండాను అమలు చేసే ప్రాక్సీ గ్రూపులు హమాస్, హెజ్బొల్లాలకు చెందిన పలువురు కీలక నేతలను మట్టుబెట్టడం ద్వారా ఇజ్రాయెల్ ఇదే పని చేస్తోంది. ఇంకో ఉదాహరణ మన పొరుగున ఉన్న శ్రీలంకకు చెందిన ‘లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలమ్’ (ఎల్టీటీఈ)! 2009లో వేలుపిళ్లై ప్రభాకరన్ మరణంతో ఒకప్పుడు ఆ దేశం మొత్తాన్ని గడగడ వణికించిన ఉగ్రవాద సంస్థ కాస్తా నిర్వీర్యమైపోయింది. ప్రత్యేక దేశం కోసం పంజాబ్‌లో మొదలైన ‘ఖలిస్తాన్’ ఉగ్రవాదం 1980లో పతాక స్థాయికి చేరిన విషయం అంద రికీ తెలిసిందే. 1984లో స్వర్ణ దేవాలయం నుంచి ఉగ్ర వాదులను ఏరివేసే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ బ్లూస్టార్’, ఆ తరువాత 1988లో చేపట్టిన మరో మిలిటరీ చర్య ‘ఆపరేషన్ బ్లాక్ థండర్’ ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థను నిర్మూలించాయి.ఈ మధ్యే సిరియాలో అధికార మార్పిడి జరిగింది. అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశం విడిచి రష్యాకు పారిపోయాడు. బషర్ వైరి పక్షాలకు అమెరికా, ఇజ్రా యెల్లు పరోక్ష మద్దతునివ్వడం వల్లనే ఇది సాధ్యమైంది. ఈ రెండు దేశాలూ కొన్ని గ్రూపులకు ప్రత్యక్షంగా మరి కొన్నింటికి పరోక్షంగా సాయం చేశాయి. అయితే బషర్ అల్–అసద్ పాలన అంతమై పోవడం కాస్తా ఆ ప్రాంతంలో ఇరాన్ ప్రాభవం తగ్గేందుకు కారణమైంది. ఉగ్రవాద భూతాన్ని ఎదుర్కొనేందుకు బహుముఖ వ్యూహం అవసరం అనేందుకు ఇజ్రాయెల్ కోవర్టు ఆపరేషన్లు ఒక నిదర్శనం. ఉగ్రవాదాన్ని అణచివేసే మార్గాల్లో కీలకమైంది చర్చలు. ఉత్తర ఐర్లాండ్‌లో ‘గుడ్‌ఫ్రైడే అగ్రిమెంట్’ కావచ్చు, అఫ్గానిస్తాన్‌లోని ఇటీవలి పరిణామాలు కావచ్చు... ఉగ్రవాద సంస్థలను ప్రభుత్వ పాత్రల్లోకి మార్చే క్రమంలో వచ్చే సంక్లిష్టతలు, సమస్యలకు దర్పణం పడతాయి. అయితే సందర్భాన్ని బట్టి చేపట్టే చర్చల వ్యూహాలు, ప్రణాళికలు వాటి అమలు వంటివి జయాపజయాలను నిర్ణయిస్తూ ఉంటాయి. ఉగ్రవాద సంస్థల లోపల ఉన్న వైరుద్ధ్యాలను గుర్తించడం, ప్రజల మద్దతు లేకుండా చేయడం వంటివి సంస్థ లను విడదీసేందుకు బాగా ఉపయోగపడతాయి. ఉగ్రవాద సమస్యను ఎదుర్కొనేవారు... ఈ అంతర్గత వైరుద్ధ్యాలకు ఆజ్యం పోయగలవారై ఉండాలి. మత విశ్వాసాలే ఇంధనంగా మనుగడ సాగించే ఉగ్ర సంస్థలను కేవలం మిలిటరీ,కౌంటర్ టెర్రరిస్ట్ చర్యలతో సమూలంగా నాశనం చేయలేం. చర్చలు జరపడం, వాటి డిమాండ్లు న్యాయబద్ధమైనవైతే అంగీకరించడం, అది వీలుకాని సందర్భంలో వాటిలో చీలికలు తీసుకువచ్చి బలహీన పర్చడం చేయొచ్చు. డా‘‘ క్రోనిన్ పరిశోధన ప్రకారం... ఉగ్రవాద సంస్థల జీవిత కాలం ఐదు నుంచి పదేళ్లు మాత్రమే. కొన్ని ఇంతకంటే ఎక్కువ కాలం ఉనికిలో ఉండవచ్చు. విధాన రూపకర్తలు ఉగ్రవాద సంస్థల విషయంలో దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించుకోవడం మేలని ఆమె సూచి స్తున్నారు. సైబర్ టెర్రరిజమ్, దేశాలు ప్రేరేపించే ఉగ్ర వాదాల వంటి సంక్లిష్ట అంశాల విషయంలో దీని ప్రాధాన్యం మరింత ఎక్కువ.ఉగ్రవాద సమస్యను ఎదుర్కొంటున్న దేశాలకు డా‘‘ క్రోనిన్ పరిశోధన ఒక దిక్సూచిలా పనిచేస్తుంది. స్థూలంగా చెప్పాలంటే... ఓపిక, పరిస్థితులకు అనుగుణంగా మార్చు కోవాల్సిన అవసరం, సమస్యను సమగ్రంగా అర్థం చేసు కోవడం కౌంటర్ టెర్రరిజమ్ వ్యూహాల రూపకల్పనలో చాలా కీలకమని ఈ పరిశోధన చెబుతుంది. విధాన రూపకర్తలు ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఆధునిక రూపం సంతరించుకున్న ఉగ్రవాద భూతానికి పగ్గాలు వేసేందుకు సమర్థమైన చర్యలు చేపట్టాలి. భారీ నెట్‌వర్క్‌లు ఉన్న వాటితోపాటు... వ్యక్తులు కూడా ఉగ్రవాదానికి పాల్పడుతున్న ఈ కాలంలో క్రోనిన్ పరిశోధన ఉగ్రవాదాన్ని పునాదులతోపాటు పెకిలించే వ్యూహానికి విలువైన సూచనలు ఇస్తోంది.బి.టి. గోవిందరెడ్డి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ప్రపంచ రికార్డు
ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (Rashid Khan) చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో (ఇంటర్నేషనల్ మరియు ఫ్రాంచైజీ క్రికెట్) అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. రషీద్ ఈ రికార్డును సాధించే క్రమంలో విండీస్ మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో (Dwane Bravo) రికార్డును బద్దలు కొట్టాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్-2025లో (SA20) భాగంగా పార్ల్ రాయల్స్‌తో నిన్న (ఫిబ్రవరి 4) జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో రషీద్ ఈ ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన రషీద్.. తన జట్టును (ఎంఐ కేప్‌టౌన్) తొలిసారి ఫైనల్స్‌కు (కెప్టెన్‌గా) చేర్చాడు.26 ఏళ్ల రషీద్ 461 టీ20ల్లో 633 వికెట్లు పడగొట్టగా.. అత్యధిక టీ20 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్న బ్రావో 582 మ్యాచ్‌ల్లో 631 వికెట్లు తీశాడు. రషీద్ ఆఫ్ఘనిస్తాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో 161 వికెట్లు.. ఫ్రాంచైజీ మరియు దేశవాలీ క్రికెట్లో 472 వికెట్లు పడగొట్టాడు. రషీద్ తన టీ20 కెరీర్లో ఆఫ్ఘనిస్తాన్ సహా సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్, ఎంఐ కేప్‌టౌన్, అడిలైడ్ స్ట్రయికర్స్, గయానా అమెజాన్ వారియర్స్, ఎంఐ ఎమిరేట్స్, లాహోర్ ఖలందర్స్, ససెక్స్ షార్క్స్, ట్రెంట్ రాకెట్స్ తదితర జట్లకు ప్రాతినిథ్యం వహించాడు.టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లు..రషీద్ ఖాన్-633డ్వేన్ బ్రావో-631సునీల్ నరైన్-574ఇమ్రాన్ తాహిర్-531షకీబ్ అల్ హసన్-492కాగా, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఎంఐ కేప్‌టౌన్ తొలిసారి ఫైనల్‌కు చేరింది. నిన్న (ఫిబ్రవరి 4) జరిగిన తొలి క్వాలిఫయర్‌లో ఎంఐ కేప్‌టౌన్ పార్ల్ రాయల్స్‌పై 39 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన రాయల్స్ 19.4 ఓవర్లలో 160 పరుగులకే ఆలౌటై, ఓటమిపాలైంది. రాణించిన బ్రెవిస్, రికెల్టన్ఈ మ్యాచ్‌లో ఎంఐ చేసిన స్కోర్.. ఈ సీజన్లో ఆ జట్టుకు మూడో అత్యధిక స్కోర్. ఎంఐ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్ (27 బంతుల్లో 44; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), వాన్ డర్ డస్సెన్ (32 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సహా డెవాల్డ్ బ్రెవిస్ (30 బంతుల్లో 44 నాటౌట్; 4 సిక్సర్లు), జార్జ్ లిండే (14 బంతుల్లో 26; 3 సిక్సర్లు), డెలానో పోట్గెటర్ (17 బంతుల్లో 32 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) రాణించారు. రాయల్స్ బౌలర్లలో దునిత్ వెల్లలగే 2, ఫోర్టుయిన్, డేవిడ్ గేలియమ్ తలో వికెట్ పడగొట్టారు.తలో చేయి వేసిన బౌలర్లు200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్‌ను ఎంఐ బౌలర్లు తలో చేయి వేసి దెబ్బేశారు. ఎంఐ బౌలర్ల ధాటికి రాయల్స్ ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. ట్రెంట్ బౌల్ట్, కగిసో రబాడ, కార్బిన్ బాష్, కెప్టెన్ రషీద్ ఖాన్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జార్జ్ లిండే ఓ వికెట్ పడగొట్టి రాయల్స్ పతనాన్ని శాశించారు. రాయల్స్ ఇన్నింగ్స్‌లో డేవిడ్ మిల్లర్ (45) టాప్ స్కోరర్‌గా నిలువగా.. దినేశ్ కార్తీక్ (31) ఓ మోస్తరు స్కోర్ చేశాడు.ఓడినా మరో ఛాన్స్ఈ మ్యాచ్‌లో ఓడినా ఫైనల్ చేరేందుకు రాయల్స్‌కు మరో అవకాశం ఉంది. రేపు (ఫిబ్రవరి 6) జరుగబోయే క్వాలిఫయర్-2లో రాయల్స్.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజేతతో తలపడుతుంది. ఇవాళ (ఫిబ్రవరి 5) జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్.. జోబర్గ్ సూపర్‌కింగ్స్‌తో తలపడనుంది. గత రెండు సీజన్లలో టేబుల్ లాస్ట్‌లో నిలిచిన ఎంఐ కేప్‌టౌన్ తొలిసారి ఫైనల్‌కు చేరింది. సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్ సౌతాఫ్రికా టీ20 లీగ్ రెండు ఎడిషన్లలో విజేతగా నిలిచింది. -
తాలిబన్లను వ్యతిరేకించి క్రికెట్ బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ ధీర వనితలు
ఆఫ్ఘనిస్తాన్ మహిళల క్రికెట్లో (Afghanistan Women's Cricket Team) నవశకం మొదలైంది. ఆఫ్ఘనిస్తాన్ ధీర వనితలు తమ దేశంలో రాజ్యమేలుతున్న ఆటవిక తాలిబన్ల (Taliban) పాలనను వ్యతిరేకించి క్రికెట్ బరిలోకి దిగారు. ప్రతిష్టాత్మక మెల్బోర్న్ మైదానంలో (Melbourne Cricket Ground) క్రికెట్ వితౌట్ బోర్డర్స్ ఎలెవెన్‌తో ఇవాళ (జనవరి 30) ఎగ్జిబిషన్ టీ20 మ్యాచ్ ఆడారు. మహిళల యాషెస్ (ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్) టెస్ట్ మ్యాచ్‌కు ముందు ఈ మ్యాచ్ జరిగింది. క్రికెట్ ఆస్ట్రేలియా, క్రికెట్ వితౌట్ బోర్డర్స్, ఆస్ట్రేలియా ప్రభుత్వం కలిసి ఈ మ్యాచ్‌ను నిర్వహించాయి. 2021లో ఆఫ్ఘనిస్తాన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లు, అప్పటి నుంచి అక్కడి మహిళలు క్రీడల్లో పాల్గొనకుండా నిషేధం విధించారు. దీంతో ఆఫ్ఘన్ మహిళా క్రికెటర్లు ఒక్కొక్కరుగా దేశాన్ని వీడి ఆస్ట్రేలియాలో శరణార్థులుగా తలదాచుకున్నారు. క్రికెట్ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా ప్రభుత్వం చొరవతో ఒక్కొక్కరుగా విడిపోయిన ఆఫ్ఘన్ క్రికెటర్లు మూడేళ్ల తర్వాత జట్టుగా కూడి ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడారు.చాలాకాలం తర్వాత జట్టుగా బరిలోకి దిగడంతో ఆఫ్ఘనిస్తాన్ మహిళా క్రికెటర్లు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మాకందరికీ ఇది చాలా ప్రత్యేకమైన రోజు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దేశాన్ని వీడాం. ఇప్పుడు అందరం కలిసి ఒక్కటయ్యాం అని ఓ ఆఫ్ఘన్ మహిళా క్రికెటర్ భావోద్వేగ ప్రకటన చేసింది. కాగా, ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్ ప్రభుత్వం మహిళలపై అనేక అంక్షలు అమల్లో పెట్టిన విషయం తెలిసిందే. అక్కడి మహిళలు ఉన్నత చదువులు చదువకోవడానికి వీల్లేదు. స్వేచ్ఛగా బయట తిరగకూడదు. ఎలాంటి క్రీడల్లో పాల్గొనకూడదు. -
వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-2024 అవార్డు గెలుచుకున్న ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్
ఆఫ్ఘనిస్తాన్ యువ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ ప్రతిష్టాత్మక ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-2024 అవార్డును గెలుచుకున్నాడు. గతేడాది వన్డేల్లో విశేషంగా రాణించినందుకు గానూ ఒమర్జాయ్ను ఈ అవార్డు వరించింది. ఒమర్జాయ్ గతేడాది 14 వన్డేల్లో 417 పరుగులు చేసి, 17 వికెట్లు పడగొట్టాడు. ఒమర్జాయ్ బ్యాటింగ్ సగటు గతేడాది 52.12గా ఉంది. ఒమర్జాయ్ ప్రదర్శనల కారణంగా ఆఫ్ఘనిస్తాన్ గతేడాది ఆడిన ఐదు వన్డే సిరీస్‌ల్లో నాలుగింట జయకేతనం ఎగురవేసింది. శ్రీలంక మినహా ఐర్లాండ్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, జింబాబ్వేలపై విజయాలు సాధించింది. ఒమర్జాయ్ గతేడాది ఆఫ్ఘనిస్తాన్ తరఫున సెకండ్ లీడింగ్ రన్‌స్కోరర్‌గా, సెకెండ్ హైయెస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. 24 ఏళ్ల ఒమర్జాయ్ రైట్ ఆర్మ్ పేస్ బౌలింగ్‌తో పాటు రైట్ హ్యాండ్ బ్యాటింగ్ చేస్తాడు. ఒమర్జాయ్ 2024లో తన తొలి వన్డేలోనే సూపర్ సెంచరీ చేశాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో అతను అజేయమైన 149 పరుగులు చేశాడు. ఒమర్జాయ్ గతేడాది సౌతాఫ్రికాపై ఓ అద్భుత ప్రదర్శన చేశాడు. సౌతాఫ్రికాతో సిరీస్‌లోని రెండో వన్డేలో ఒమర్జాయ్ 50 బంతుల్లో అజేయమైన 86 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో ఒమర్జాయ్ బంతితోనూ చెలరేగాడు. 2021లో వన్డే అరంగ్రేటం చేసిన ఒమర్జాయ్ ఇప్పటివరకు 36 వన్డేలు ఆడి 907 పరుగులు చేశాడు. అలాగే 30 వికెట్లు పడగొట్టాడు. మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-2024 అవార్డు కోసం ఒమర్జాయ్తో పాటు కుసాల్ మెండిస్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, వనిందు హసరంగ పోటీ పడ్డారు.2024కు సంబంధించి ఇప్పటివరకు ప్రకటించిన ఐసీసీ అవార్డులు- ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్- అజ్మతుల్లా ఒమర్జాయ్ - ఐసీసీ ఎమర్జింగ్ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-అన్నెరీ డెర్క్సెన్- ఐసీసీ ఎమర్జింగ్ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-కమిందు మెండిస్- ఐసీసీ వుమెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-ఈషా ఓఝా- ఐసీసీ మెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-గెర్హార్డ్ ఎరాస్మస్- ఐసీసీ అంపైర్ ఆఫ్ ద ఇయర్-రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్- ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-అర్షదీప్ సింగ్- ఐసీసీ వుమెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-మేలీ కెర్ఐసీసీ మెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ద ఇయర్: రోహిత్ శర్మ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, ఫిల్ సాల్ట్, బాబర్ ఆజం, నికోలస్ పూరన్ (వికెట్‌కీపర్), సికందర్ రజా, హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, వనిందు హసరంగా, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.ఐసీసీ వుమెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ద ఇయర్: లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), స్మృతి మంధాన, చమరి అతపత్తు, హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, మెలీ కెర్, రిచా ఘోష్ (వికెట్‌కీపర్), మరిజాన్ కప్ప్, ఓర్లా ప్రెండర్‌గాస్ట్, దీప్తి శర్మ, సదియా ఇక్బాల్.ఐసీసీ మెన్స్ టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్: యశస్వి జైస్వాల్, బెన్ డకెట్, కేన్ విలియమ్సన్, జో రూట్, హ్యారీ బ్రూక్, కమిందు మెండిస్, జామీ స్మిత్ (వికెట్‌కీపర్), రవీంద్ర జడేజా, పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), మాట్ హెన్రీ, జస్ప్రీత్ బుమ్రా.ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్: సైమ్ అయూబ్, రహ్మానుల్లా గుర్బాజ్, పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (వికెట్‌కీపర్), చరిత్ అసలంక (కెప్టెన్), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, వనిందు హసరంగా, షాహీన్ షా అఫ్రిది, హరిస్ రౌఫ్, అల్లా ఘజన్ఫర్.ఐసీసీ వుమెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్: స్మృతి మంధాన, లారా వోల్వార్డ్ (కెప్టెన్), చమర్తి అథపత్తు, హేలీ మాథ్యూస్, మారిజాన్ కాప్, ఆష్లీ గార్డనర్, అన్నాబెల్ సదర్లాండ్, అమీ జోన్స్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్, కేట్ క్రాస్. -
పాకిస్తాన్ ముంగిట తాలిబన్ సవాళ్లు
అమెరికా నాయకత్వంలోని సంకీర్ణ దళాలు 2021లో అఫ్గానిస్తాన్‌ను వీడిన తర్వాత ఆ దేశాన్ని రెండోసారి హస్తగతం చేసుకున్న తాలిబన్... ప్రస్తుతం భద్రతా పరంగా పాకిస్తాన్‌కు అత్యంత ముప్పుగా మారింది. ఒకప్పుడు అఫ్గానిస్తాన్‌లో తమ వ్యూహాత్మక ప్రయోజనాల కోసం పాకిస్తాన్ మిలిటరీ, నిఘా సంస్థలు తాలిబన్లకు శిక్షణ ఇచ్చి వారిని మరింత బలపడేలా చేశాయి. సోవియట్ యూనియన్ దళాల ఉపసంహరణ తర్వాత రాజకీయ అనిశ్చితి మధ్య అఫ్గానిస్తాన్‌ను పాలిస్తున్న బుర్హనుద్దీన్ రబ్బానీ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోసి 1996లో తాలిబన్లు ఆ దేశాన్ని హస్తగతం చేసు కున్నారు. అప్పటినుండి 2001లో అమెరికాలోని ట్విన్ టవర్స్‌పై దాడి తర్వాత అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు అఫ్గానిస్తాన్‌లోని తాలిబన్ ప్రభుత్వాన్ని కూలదోసి హమీద్ కర్జాయ్ ప్రభుత్వం ఏర్పడే దాకా, తాలిబన్లతో పాకిస్తాన్ సత్సంబంధాలు నెరిపింది.వివాదాలు కూడా పట్టనంతగా...ఈ కాలంలో తాలిబన్ ప్రభుత్వం, పాకిస్తాన్ మధ్య సంబంధాలు ఎంతలా పెనవేసుకు పోయాయంటే, రెండు దేశాల మధ్య 1947 నుండి ఉన్న సరిహద్దు వివాదాలను పక్కన పెట్టేంతగా. ముఖ్యంగా 1893లో అప్పటి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించిన 2,640 కిలోమీటర్ల పొడవైన డ్యూరాండ్ లైన్ వల్ల దశాబ్దాలుగా ఏర్పడిన సంఘర్షణాత్మక వైఖరులను కూడా మరిచిపోయేంతగా. తాలిబన్‌తో సహా అఫ్గానిస్తాన్‌లో ఏర్పడిన అన్ని ప్రభుత్వాలదీ డ్యూరాండ్ లైన్ మీద ఒకే వైఖరి. వాటి వాదన ప్రకారం, ఇది సరిహద్దులకు ఇరువైపులా ఉన్న పష్తూ జాతి ప్రజలను వేరుచేయడమే కాకుండా, శతాబ్దాలుగా ఉన్న సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలను దెబ్బతీస్తోంది. పాకిస్తాన్ మాత్రం ఈ లైన్ చట్టబద్ధత కలిగిన అధికారిక సరి హద్దుగా భావిస్తోంది. తాలిబన్ తన మొదటి దశ పాలనలో ఎక్కు వగా అఫ్గానిస్తాన్‌ను ఏకీకృతం చేయడంపై, తన అధికార పరిధిని విస్తరించడంపై దృష్టి కేంద్రీకరించింది. తాలిబన్‌కు కావలసిన కీలక మైన సైనిక, ఆర్థిక, దౌత్య సహాయాలను పాక్ చేస్తుండటంతో సరి హద్దు సమస్యలను లేవనెత్తి పాకిస్తాన్ ఆగ్రహానికి గురికాకూడదనే భయంతో తాలిబన్ కూడా సరిహద్దు విషయాన్ని పక్కన పెట్టింది. సరిహద్దులకు ఇరువైపులా ఉన్న పష్తూన్లు ఏకమైతే పష్తూన్ జాతీయ వాదం తమను ముక్కలు చేస్తుందన్న భయం పాకిస్తాన్‌ను మొదటి నుండి వెంటాడుతోంది. ఆ విషయం తాలిబన్‌కు తెలిసినప్పటికీ తన కున్న అవసరాల దృష్ట్యా పష్తూన్ల ఐక్యత ఒక రాజకీయ కోణంలా రూపాంతరం చెందకుండా చూసుకుంది.ఎక్కడ చెడింది?ఇంతటి బలమైన సంబంధాలు నెరపిన పాకిస్తాన్, తాలిబన్ మధ్య 2021 తర్వాత దూరం పెరగడానికి ముఖ్యంగా రెండు కారణాలు కనబడతాయి. ఒకటి, 2001లో అమెరికా చేపట్టిన తీవ్రవాదంపై యుద్ధంలో పాకిస్తాన్ పోషించిన ముఖ్యపాత్ర. 1999లో నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి జనరల్ ముషారఫ్ అధికారాన్ని చేజిక్కించుకున్నప్పుడు, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అత్యంత దుర్భరస్థితిలో వుంది. ఆ దేశ విదేశీ అప్పులు సుమారు 39 బిలియన్ డాలర్లు ఉంటే, వడ్డీల చెల్లింపులకే బడ్జెట్లో సుమారు 56 శాతం కేటాయించాల్సిన పరిస్థితి! ఆ సమయంలో అమెరికాతో జట్టు కట్టడం వలన, అనేక బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం పొందడమే కాకుండా, పారిస్ క్లబ్ రుణదాతల నుండి కొత్త రుణాలు పొందగలిగింది. పాత రుణ బకాయిల చెల్లింపుల్లో సైతం అనేక వెసులుబాట్లు పొందగలిగింది. 1998లో అణు పరీక్షల తర్వాత ఎదుర్కొన్న అనేక ఆర్థిక ఆంక్షల నుండి విముక్తి పొందగలిగింది. వీటన్నిటి ఫలితంగా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పడటమే కాకుండా, 2003 నాటికి పారిశ్రామిక రంగం సుమారు 8 శాతం వృద్ధి నమోదు చేసింది. అదే సమయంలో 2001లో అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం కూలిపోవడంతో అనేక మంది తాలిబన్ ఫైటర్లు పాకిస్తాన్‌లోని ట్రైబల్ ఏరియాల్లోకి పారిపోయి ప్రజల్లో కలిసి పోయారు. మరి కొంతమంది, 2007లో పాకిస్తాన్లో కూడా తాలిబన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ఇస్లామిక్ సిద్ధాంతాలను వ్యాపింప జేయ డానికి ‘తెహ్రిక్ ఏ తాలిబన్ పాకిస్తాన్’(టీటీపీ) స్థాపించారు.రెండో కారణానికి వస్తే, పాకిస్తాన్ 2017–2022 మధ్య ఏక పక్షంగా తన, అఫ్గానిస్తాన్ మధ్యన ఉన్న సరిహద్దుల్లో కంచె వేసి సరి హద్దులకిరువైపులా ఉన్న అనేక సంబంధాలను దెబ్బ తీసింది. ఈ కంచె తనకు సరిహద్దులపై పట్టును కల్పించి తీవ్రవాదాన్ని, మాదక ద్రవ్యాల, ఆయుధాల, మానవ, ఇతర అక్రమ రవాణాను అరికట్టేందుకు తోడ్పడుతుందని భావించింది. అష్రాఫ్ ఘనీ నేతృత్వంలోని అప్పటి అఫ్గాన్ ప్రభుత్వం ఎంత వ్యతిరేకించినప్పటికీ అత్యాధునిక వసతులతో సరిహద్దు కంచెను పూర్తిచేసింది. ఇది అఫ్గానిసాన్లోని అన్ని వర్గాలను, ముఖ్యంగా తాలిబన్లకు తీవ్ర ఆగ్రహం కలిగించింది. ఈ సరిహద్దు వలన, సుమారు పదిహేను వేలమంది అఫ్గాన్లు తమ ఉపాధి కోల్పోవడమే కాకుండా, పాకిస్తాన్ నుండి వచ్చే సరుకుల్లో సుమారు 40 శాతం వస్తువులపై కోత పడటంతో అవి స్థానిక మార్కెట్లలో లభ్యం కాక అఫ్గాన్ ప్రజలు తీవ్ర అవస్థలు పడటానికీ, వస్తువుల ధరలు పెరగడానికీ దారితీసింది.టీటీపీ డిసెంబర్ 31, 2022న మరింత ముందుకెళ్లి ఖైబర్ పఖ్తూన్ఖ్వా, గిల్గిట్ బాల్తిస్తాన్ ప్రాంతాల్లో సమాంతర ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇది ఏకంగా పాకిస్తాన్ సార్వ భౌమత్వాన్ని సవాలు చేయడమే. అప్పటి నుండి పాకిస్తాన్లో తీవ్ర వాద దాడులు పెరగడం చూడవచ్చు. ఇస్లామాబాద్‌లోని ‘సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ సెక్యూరిటీ స్టడీస్’ ఇటీవల ప్రచురించిన నివేదిక ప్రకారం, పాకిస్తాన్ గతేడాది 1,166 తీవ్రవాద దాడులు ఎదుర్కొంది. అందులో 2,546 మంది చనిపోతే, 2,267 మంది గాయపడ్డారు. ఈ లెక్కలు అంతకుముందు ఏడాది (2023)తో పోలిస్తే 66 శాతం ఎక్కువ. ఒక్క గత నవంబర్లోనే 444 (రోజుకు సుమారు 15) దాడులు జరిగితే అందులో సుమారు 685 మంది చనిపోయారు.అంటే పరిస్థితి ఎంత తీవ్రత సంతరించుకుందో అర్థం చేసుకోవచ్చు. ఒక వైపు టీటీపీ, మరోవైపు బలోచిస్తాన్ ప్రాంత స్వతంత్రం కోసం కొట్లాడుతున్న తీవ్రవాద గ్రూపుల దాడుల మధ్య పాకిస్తాన్ చిక్కుకుంది. అయితే, ఆ రెండు ప్రాంతాల తీవ్రవాద గ్రూపుల మధ్య ఉన్న భావజాల విభేదాల వల్ల వాటికి సన్నిహిత సంబంధాలు ఉండక పోవచ్చు. కానీ సరిహద్దుల్లో తాలిబన్ దాడులు చేస్తోంటే, పాకిస్తాన్ లోపల టీటీపీ రక్తపాతాన్ని సృష్టిస్తోంది.ఇండియాకూ కీలకమే!ఇలాంటి పరిస్థితుల మధ్య గత డిసెంబర్ 30న పాకిస్తాన్ ఐఎస్ఐ అధినేత... తాలిబన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే అఫ్గాన్ నేష నల్ ఫ్రంట్‌కు ఆశ్రయమిచ్చిన తజికిస్తాన్ అధ్యక్షుడు ఏమోమాలి రహెమాన్‌ను కలిశారు. అది జరిగిన కొద్ది రోజులకు, జనవరి 8న భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తాలిబన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముట్టకీని దుబాయ్‌లో కలిశారు. ఇవి కొత్త చర్చలకు దారి తీయడమే కాకుండా, ఈ ప్రాంతంలో మారుతున్న వ్యూహాత్మక సమీకరణాలను, ఏర్పడుతున్న కొత్త సంబంధాలను, ఆవిష్కృతమవుతున్న నూతన ప్రాంతీయ ముఖచిత్రాన్ని ప్రతిబింబిస్తున్నాయి. రానున్న రోజులలో వివిధ అవసరాల దృష్ట్యా తాలిబన్లతో సత్సంబంధాలు అటు రష్యాకూ, ఇటు చైనాకూ, వాటితో పాటే భారత్‌కూ అత్యంత కీలకం. గద్దె ఓంప్రసాద్ వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్,దక్షిణాసియా వ్యవహారాల అధ్యయన కేంద్రం, జేఎన్‌యూ, న్యూఢిల్లీ ‘ opgadde2@gmail.com -
గుల్బదిన్ ఆల్‌రౌండ్ షో.. వైపర్స్‌కు తొలి పరాజయం
ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో (ILT20-2025) డెసర్ట్ వైపర్స్‌కు తొలి పరాజయం ఎదురైంది. నిన్న (జనవరి 20) జరిగిన మ్యాచ్‌లో వైపర్స్ దుబాయ్ క్యాపిటల్స్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. క్యాపిటల్స్‌ను గుల్బదిన్ నైబ్ ఆల్‌రౌండ్ షోతో గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వైపర్స్ 19.5 ఓవర్లలో 139 పరుగులకే ఆలౌటైంది. వైపర్స్ ఇన్నింగ్స్‌లో అలెక్స్ హేల్స్ (34) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (27), డాన్ లారెన్స్ (24) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఫకర్ జమాన్ (14), సామ్ కర్రన్ (3), ఆజమ్ ఖాన్ (10), హసరంగ (13), తనిశ్ సూరి (0), అలీ నసీర్ (2), లకీ ఫెర్గూసన్ (7) నిరాశపరిచారు. క్యాపిటల్స్ బౌలర్లలో చమీరా, జహీర్ ఖాన్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. హైదర్ అలీ, మెక్కాయ్, గుల్బదిన్, సికందర్ రజా తలో వికెట్ తీశారు.అనంతరం 140 పరుగులు స్వల్ప లక్ష్యాన్ని క్యాపిటల్స్ ఆడుతూపాడుతూ ఛేదించింది. ఆ జట్టు 17.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. బౌలింగ్‌లో ఓ వికెట్ తీసి, ఫీల్డింగ్‌లో ఓ క్యాచ్ పట్టిన గుల్బదిన్ నైబ్.. బ్యాటింగ్‌లోనూ సత్తా చాటి రెచ్చిపోయాడు. 51 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 78 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.నైబ్కు జతగా సికందర్ రజా (24), నజీబుల్లా జద్రాన్ (10 నాటౌట్) నిలబడి క్యాపిటల్స్‌ను విజయతీరాలకు చేర్చారు. క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌లో బెన్ డంక్ 13, షాయ్ హోప్ 8, ఖలద్ షా 4 పరుగులు చేశారు. వైపర్స్ బౌలర్లలో ఫెర్గూసన్ 2, మొహమ్మద్ అమిర్ ఓ వికెట్ పడగొట్టారు. ఈ గెలుపు క్యాపిటల్స్‌కు ప్రస్తుత ఎడిషన్‌లో రెండోది. ప్రస్తుతం ఆ జట్టు 4 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. క్యాపిటల్స్ చేతిలో ఓడినా వైపర్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే ఉంది. -
ప్రపంచంలో సంతోషకరంగా లేని దేశాలివే.. భారత్ స్థానం?
ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల జాబితా గురించి విన్నాం. ప్రతిసారి ఫిన్లాండ్ అగ్రస్థానంలో నిలిచి సంతోషానికి ప్రతికగా నిలుస్తోంది. మరికొన్ని దేశాలు కొద్ది తేడాలతో సంతోషకరమైన దేశాలుగా మొదటి పదిస్థానాల్లో నిలిచి మరింత ఆనందంగా జీవించేలా అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నాయి. అయితే ఆ సంతోషానికి కనుచూపు మేరలో కూడా లేకుండా తీవ్ర అసంతృప్తితో కొట్టుమిట్టాడుతున్న దేశాలు కూడా ఉన్నాయి. ఆ దేశాల జాబితా, అందుకు గల కారణాలు తోపాటు భారత్ ఏ స్థానంలో ఉందో చూద్దామా..ప్రపంచవ్యాప్తంగా ఆనంద స్థాయిలలో వైవిధ్యాలను నిర్ణయించడానికి ఆరు కీలక అంశాలను పరిగణలోనికి తీసుకుంటుంది ప్రపంచ సంతోష నివేదిక. ఈ అంశాల్లో సామాజిక మద్దతు, ఆరోగ్యం, ఆదాయం, స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతి లేకపోవడం తదితరాల ఆధారంగా జాబితాను అందిస్తుంది. వాటన్నింటిలో వెనుకబడి ఉండి అత్యల్ప సంతోషకరమైన దేశాలుగా నిలిచిన దేశాలేవంటే..అఫ్ఘనిస్తాన్..ప్రపంచ సంతోష సూచికలో 137 దేశాలలో అట్టడుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌తో తక్కువ ఆయుర్దాయం తోపాటు మహమ్మారికి ముందు నుంచి ఉన్న వివిధ నిరంతర సమస్యల సవాలును ఎదుర్కొంటుంది. దీనికి గొప్ప సాంస్కృతిక చరిత్ర ఉన్నప్పటికీ, పోరాటాలు, పౌరుల శ్రేయస్సును గణనీయంగా ప్రభావితం చేశాయి.లెబనాన్..అఫ్ఘనిస్తాన్ తర్వాత, లెబనాన్ రెండవ అత్యల్ప సంతోషకరమైన దేశంగా దురదృష్టకర ఘనతను కలిగి ఉంది. ఈ దేశంలో అత్యంత సంతోషకరమైన దేశాల కంటే ఆయుర్దాయం ఎక్కువగా ఉన్నప్పటికీ సామాజిక-రాజకీయ సవాళ్లు, ఆర్థిక అస్థిరతతో సతమతమవుతోంది. సియెర్రా లియోన్..ప్రపంచంలో మూడవ అత్యలప్ప సంతోషకరమైన దేశంగా ఆఫ్రికాలోని సియెర్రా లియోన్ నిలిచింది. తక్కువ సంతోష సూచికకు దోహదపడే ప్రత్యేకమైన సవాళ్లను ఎదుర్కొంటుంది. ఆర్థిక అసమానతలు, రాజకీయ అస్థిరత, సామాజిక అశాంతి తీవ్రంగా ఉన్నాయిజింబాబ్వే..ప్రపంచ సంతోష నివేదికలో నాల్గవ స్థానంలో ఉంది. యుద్ధంతో దెబ్బతిన్న అఫ్ఘనిస్తాన్, లెబనాన్, సియెర్రా లియోన్‌లతో పోలిస్తే జింబాబ్వే కొంచెం అనుకూలమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. దేశం అల్లకల్లోల చరిత్ర, కొనసాగుతున్న సవాళ్లతో పోరాడుతోం. ఇది ఆ దేశలోని మొత్తం జనాభా శ్రేయస్సును తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో..ఈ దేశం ఐదవ స్థానాన్ని దక్కించుకుంది. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సుదీర్ఘ చరిత్ర సంఘర్షణ, రాజకీయ తిరుగుబాటు, నిరంకుశ పాలన, బలవంతంగా స్థానభ్రంశం తదితర సవాళ్లను ఎదుర్కొంటుంది. ఈ అంశాలన్ని అత్యల్ప సంతోషానికి సూచిక.బోట్స్వానా..బోట్స్వానా అఫ్ఘనిస్తాన్, లెబనాన్ వంటి దేశాల కంటే కొంచెం ముందుంది. ఇక్కడ సాపేక్ష స్థిరత్వం ఉన్నప్పటికీ, సామాజిక శ్రేయస్సలో వెనుబడి ఉండటంతో అత్యల్ప సంతోషకరమైన దేశాల్లో చేరింది.మలావి..వేగంగా పెరుగుతున్న జనాభా, సారవంతమైన భూమి, నీటిపారుదల లేకపోవడం వంటి సవాళ్లను ఎదుర్కొంటోంది మలావి. ఈ నేపథ్యంలోనే అక్కడ పౌరులు అనందానికి ఆమడం దూరంలో ఉండి, అసంతృప్తితో బతుకీడస్తన్నారు. కొమొరోస్..ఈ దేశం రాజకీయ తిరుగుబాట్లు కారణంగా కొమొరోస్ను ప్రపంచంలోని అత్యల్ప సంతోషకరమైన దేశాల జాబితాలో చేర్చింది. ఇక్కడ ఉన్న సామాజిక-రాజకీయ దృశ్యం ప్రజలపై గణనీయంగా ప్రభావితం చూపుతోంది. అందువల్లే ఈ దేశం అసంతృప్తి వాతవరణంగా తార స్థాయిలో నెలకొంది.టాంజానియా..ప్రధాన సంతోష సూచికలలో తక్కువ స్కోర్ల కారణంగా దీనిని ఈ జాబితాలో చేర్చారు. దేశం ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో పలు తీవ్ర సవాళ్లను ఎదుర్కుంటుంది. ఇది మొత్తం దేశం శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది. అందవల్లే ఆధునిక ప్రపంచాన్ని నావిగేట్ చేయడంలో విఫలమవుతుంది. ఈ కారణాల రీత్యా అత్యల్ప సంతోషకరమైన దేశాల జాబితాలో చేరింది. జాంబియాఅత్యల్స సంతోషకరమైన జాబితాలో చిట్టచివరన పదో స్థానంలో ఉన్న దేశం జాంబియా. దీన్ని సెంట్రల్ ఆఫ్రికన్ ఫెడరేషన్ అని పిలుస్తారు. ఇక్కడ ఉపాధి, రాజకీయ అనిశ్చిత, సామాజిక అసమానత తదితర సవాళ్లతో పోరాడుతోంది.భారతదేశం ఈ జాబితాలో లేనప్పటికీ, అది చాలా వెనుకబడి లేదు. ‘ప్రపంచంలోని అత్యంత తక్కువ సంతోషకరమైన దేశంగా 12వ స్థానంలో ఉంది.(చదవండి: అస్సాం సత్రియా చారిత్రాత్మక అరంగేట్రం) -
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు ప్రకటన.. స్టార్ ఆటగాడి రీఎంట్రీ
పాకిస్తాన్, యూఏఈ వేదికలుగా వచ్చే నెల (ఫిబ్రవరి) 19 నుంచి జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 15 మంది సభ్యుల ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఇవాళ (జనవరి 13) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా హష్మతుల్లా షాహిదీ ఎంపికయ్యాడు. మెగా టోర్నీలో షాహిదీకి డిప్యూటీగా రహమత్ షా వ్యవహరించనున్నాడు. మడమ గాయం నుంచి పూర్తిగా కోలుకున్న స్టార్ ఆటగాడు ఇబ్రహీం జద్రాన్ ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్నాడు. జద్రాన్ గాయం కారణంగా గతేడాది జూన్ నుంచి జట్టుకు దూరంగా ఉన్నాడు.మిస్టరీ స్పిన్నర్ అల్లా ఘజన్ఫర్.. ఇటీవల జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌లో రాణించిన సెడిఖుల్లా అటల్ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కించుకున్నారు. సీనియర్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్‌ను కాదని ఘజన్‌ఫర్‌ను ఎంపిక చేశారు ఆఫ్ఘన్ సెలెక్టర్లు. 50 ఓవర్ల ఫార్మాట్‌కు కావాల్సినంత ఫిట్నెస్ లేకపోడంతో ముజీబ్‌ను పరిగణలోకి తీసుకోలేదు. ముజీబ్‌ను కేవలం టీ20లకు మాత్రమే పరిమితం కావాలని అతని డాక్టర్లు సలహా ఇచ్చారట. ముజీబ్ 2023 వన్డే వరల్డ్‌కప్ చివరిసారి ఆఫ్ఘనిస్తాన్ తరఫున వన్డే ఆడాడు.2023 వరల్డ్ కప్ ఆడిన జట్టులోని 10 మంది సభ్యులు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపికయ్యారు. ముజీబ్, నవీన్ ఉల్ హక్, రియాజ్ హసన్, అబ్దుల్ రెహ్మాన్, నజీబుల్లా జద్రాన్ లాంటి సీనియర్లకు ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కలేదు. మరోవైపు దార్విష్ రసూలీ, నంగ్యాల్ ఖరోటి, బిలాల్ సమీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం రిజర్వ్ ఆటగాళ్లుగా ఎంపికయ్యారు.కాగా, ఆఫ్ఘనిస్తాన్ జట్టు గత రెండు ఐసీసీ టోర్నీలో అద్భుత ప్రదర్శనలు చేసిన విషయం తెలిసిందే. 2023 వన్డే వరల్డ్‌కప్, 2024 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో ఆఫ్ఘన్లు సంచలన విజయాలు నమోదు చేశారు. వీటిలో పాటు ఆఫ్ఘన్లు గతేడాది వన్డేల్లో సౌతాఫ్రికా లాంటి అగ్రశ్రేణి జట్లను మట్టికరిపించారు. అదే ఊపుతో ఆఫ్ఘన్లు ఛాంపియన్స్ ట్రోఫీలోనూ సంచలనాలు సృష్టించాలని ఆశిస్తున్నారు.మెగా టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్-బిలో ఉంది. ఈ గ్రూప్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా లాంటి పటిష్ట జట్లు ఉన్నాయి. ఈ టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్ ఫిబ్రవరి 21న తమ తొలి మ్యాచ్ ఆడుతుంది. కరాచీ వేదికగా జరిగే ఆ మ్యాచ్‌లో ఆఫ్ఘన్లు సౌతాఫ్రికాను ఢీకొంటారు. అనంతరం ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్ దశలో ఇంగ్లండ్ (ఫిబ్రవరి 26న లాహోర్‌లో), ఆస్ట్రేలియాతో (ఫిబ్రవరి 28న లాహోర్‌లో) తలపడుతుంది.ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు..హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), రహమత్ షా (వైస్ కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్‌కీపర్), ఇక్రమ్ అలీఖిల్ (వికెట్‌కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెడిఖుల్లా అటల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, రషీద్ ఖాన్, ఎఎమ్ గజన్హర్, నూర్ అహ్మద్, ఫజల్ హక్ ఫారూఖీ, నవీద్ జద్రాన్, ఫరీద్ అహ్మద్ మాలిక్.రిజర్వ్ ఆటగాళ్లు: దార్విష్ రసూలీ, నంగ్యాల్ ఖరోటి, బిలాల్ సమీ -
'అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్ ఆడొద్దు'.. సౌతాఫ్రికాకు ఆ దేశ ప్రజల పిలుపు
అఫ్గానిస్తాన్(Afghanistan)లో ప్రస్తుతం తాలిబాన్ల పరిపాలన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అమెరికా సంకీర్ణ సేనల నిష్క్రమణతో మళ్లీ అధికారం చేపట్టిన తాలిబాన్లు అఫ్గాన్‌లో స్త్రీ హక్కుల్ని పూర్తిగా కాలరాశారు. స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను హరించి కట్టుబాట్లతో ముళ్లబాట పరుస్తున్నారు. అఫ్గానిస్తాన్‌కు చెందిన మహిళా జట్లను ఏ క్రీడల్లోనూ పాల్గొనివ్వడం లేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ క్రమంలో ఛాంపియన్స్ ట్రోఫీ-2025(Champions Trophy)లో అఫ్ఘానిస్థాన్ క్రికెట్ జట్టుతో మ్యాచ్ ఆడొద్దంటూ పలు దేశాల క్రికెట్ బోర్డులపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఇప్పటికే అఫ్గాన్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు 160 మందికి పైగా రాజకీయ నాయకులు విజ్ఞప్తి చేయగా.. తాజాగా ఈ జాబితాలో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు కూడా చేరింది.త్వరలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో అఫ్గాన్‌తో మ్యాచ్ రద్దు చేసుకోవాలని సౌతాఫ్రికా క్రికెట్(South Afrcia)ను ఆ దేశ ప్రజలు నినాదిస్తున్నారు. తాజాగా దక్షిణాఫ్రికా ప్రజల డిమాండ్‌కు ఆ దేశ క్రీడల మంత్రి గేటన్ మెకెంజీ సంఘీభావం తెలిపారు. "ప్రజల నిరసనకు నైతిక మద్దతు తెలుపుతున్నాను. అఫ్గాన్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలి. అయితే నా అధికారాలు పరిమితం. ఇందులో నేను నిర్ణయం తీసుకోలేను. దక్షిణాఫ్రికా ప్రభుత్వం, క్రికెట్ బోర్డు సమాలోచనలు చేసి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను.ఈ విషయంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కఠిన చర్యలు తీసుకోవాలి. బోర్డు విషయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో శ్రీలంక క్రికెట్‌ను సస్పెండ్ చేసినట్లు, అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డుపై కూడా వేటు వేయాలి. క్రీడల వ్యవహరాల్లో రాజకీయ జోక్యాన్ని ఏ మాత్రం సహించకూడదు. మహిళల పట్ల వివక్ష చూపుతున్న అఫ్గానిస్తాన్ వైఖరిని క్రికెట్ దక్షిణాఫ్రికాతో పాటు ఇతర దేశాల క్రికెట్ బోర్డులు సైతం ఖండించాలి" అని గేటన్ మెకెంజీ పేర్కొన్నారు.మరో 40 రోజుల్లో..కాగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ-2025 మరో 40 రోజుల్లో ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 19న కరాచీ వేదికగా పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న తొలి మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ షురూ కానుంది. ఈ మెగా ఈవెంట్లో సఫారీ జట్టు కరాచీ వేదికపై ఫిబ్రవరి 21న అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది.ఇక టీమిండియా తమ మొదటి మ్యాచ్‌లో ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న దాయాది పాకిస్తాన్‌తో టీమిండియా అమీతుమీ తెల్చుకోనుంది. ఈ మెగా టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరగనున్నాయి.ఈ టోర్నీలో పాల్గోనే ఆయా దేశ క్రికెట్ బోర్డులు తమ జట్ల వివరాలను జనవరి 12లోపు ఐసీసీకి సమర్పించాలి. ఈ క్రమంలో భారత జట్టును బీసీసీఐ శనివారం(జనవరి11) ప్రకటించే అవకాశముంది.చదవండి: ఇంగ్లండ్ కెప్టెన్‌గా మైఖేల్ వాన్ తనయుడు -
Champions Trophy: ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌ను బహిష్కరించండి..!
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలని ఇంగ్లండ్‌కు చెందిన ప్రజాప్రతినిధులు ఆ దేశ క్రికెట్ బోర్డును (ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు, ఈసీబీ) కోరారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం మహిళల హక్కులపై ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో ఇంగ్లండ్ పొలిటీషియన్స్ ఈ మేరకు పిలుపునిచ్చారు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ ఫిబ్రవరి 26న ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలని 160 మందికి పైగా రాజకీయ నాయకులు ఈసీబీకి విజ్ఞప్తి చేశారు. అయితే ఇంగ్లండ్ ప్రజాప్రతినిధుల విజ్ఞప్తిని ఈసీబీ తిరస్కరించినట్లు సమాచారం. తాలిబన్ల పాలనలో మహిళలు, బాలికలపై వివక్షకు తాము వ్యతిరేకమని చెప్పిన ఈసీబీ.. ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌ను బహిష్కరించలేమని స్పష్టం చేసినట్లు తెలుస్తుంది.కాగా, 2021 ఆగస్టులో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళలపై అడ్డగోలు అంక్షలు అమల్లో ఉన్నాయి. అమ్మాయిలు ఆరవ తరగతికి మించి చదవకూడదని.. మహిళలు ఉద్యోగాలు చేయకూడదని.. బహిరంగ ప్రదేశాల్లో (జిమ్‌లు, పార్కులు) మహిళలు కనిపించకూడదని.. మగ తోడు లేకుండా మహిళలు ప్రయాణం చేయకూడదని.. మహిళలు క్రీడల్లో పాల్గొనకూడదని తాలిబన్ ప్రభుత్వం మహిళలపై అంక్షలు విధించింది. ఈ అంక్షల కారణంగానే ఇంగ్లండ్ ప్రజాప్రతినిధులు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.గతంలో ఆస్ట్రేలియా కూడా ఇలాగే..!మహిళలపై తాలిబన్ ప్రభుత్వం విధించిన ఆంక్షల కారణంగా గతంలో ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ పురుషుల జట్టుతో ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు నిరాకరించింది. అయితే ఆతర్వాత ఇరు జట్లు 2023 వన్డే ప్రపంచకప్, 2024 టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో తలపడ్డాయి.జింబాబ్వేతో మ్యాచ్‌ను బహిష్కరించిన ఇంగ్లండ్ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ 2003 వన్డే ప్రపంచకప్‌లో జింబాబ్వేతో జరగాల్సిన మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేసింది. అప్పట్లో జింబాబ్వేలో రాబర్ట్ ముగాబే పాలనకు వ్యతిరేకంగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఈ మేరకు నిర్ణయించింది.ఇదిలా ఉంటే, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 మధ్యలో జరుగనుంది. ఈ టోర్నీలో భారత్ ఆడాల్సిన మ్యాచ్‌లు మాత్రం దుబాయ్‌లో జరుగుతాయి. పాక్‌తో సత్సంబంధాలు లేని కారణంగా టీమిండియా పాక్‌లో అడుగుపెట్టరాదని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 20న (బంగ్లాదేశ్‌తో) ఆడుతుంది. మెగా టోర్నీలో దాయాదుల సమరం ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా జరుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్-ఇంగ్లండ్ మ్యాచ్‌కు లాహోర్‌లోని గడాఫీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. -
చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్
ఆఫ్ఘనిస్తాన్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ చరిత్ర సృష్టించాడు. ఆరు టెస్ట్‌ల తర్వాత అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా రికార్డు నెలకొల్పాడు. 26 ఏళ్ల రషీద్ ఆరు టెస్ట్‌ల అనంతరం 45 వికెట్లు పడగొట్టాడు. వెస్టిండీస్ స్పిన్నర్ అల్ఫ్ వాలెంటైన్, శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య ఆరు టెస్ట్‌ల అనంతరం 43 వికెట్లు పడగొట్టి రషీద్ తర్వాతి స్థానంలో ఉన్నారు.జింబాబ్వేతో జరిగిన రెండో టెస్ట్‌లో రషీద్ 11 వికెట్లు తీసి తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. రెండో టెస్ట్‌లో విజయంతో ఆఫ్ఘనిస్తాన్ రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన రషీద్.. రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు పడగొట్టాడు. రషీద్ తన ఆరు మ్యాచ్‌ల టెస్ట్ కెరీర్లో 5 ఐదు వికెట్ల ప్రదర్శనలు, 3 పది వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశాడు.రెండో ఇన్నింగ్స్‌లో రషీద్ నమోదు చేసిన గణాంకాలు (7/66) ఆఫ్ఘనిస్తాన్ తరఫున అత్యుత్తమమైనవి. రషీద్ తన సొంత రికార్డునే (7/137) అధిగమించి ఈ గణాంకాలు నమోదు చేశాడు.రెండో స్థానంలో రషీద్ఆరు టెస్ట్‌ల అనంతరం అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రషీద్ ఖాన్ (45) సౌతాఫ్రికా పేసర్ వెర్నన్ ఫిలాండర్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ పేసర్ చార్లీ టర్నర్ టాప్‌లో నిలిచాడు. టర్నర్ ఆరు టెస్ట్‌ల అనంతరం 50 వికెట్లు పడగొట్టాడు.వరుసగా రెండు మ్యాచ్‌ల్లో 10 వికెట్లుఈ మ్యాచ్‌లో 10 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన రషీద్.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించాడు. టెస్ట్ క్రికెట్లో రషీద్‌తో పాటు సౌతాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ మాత్రమే వరుసగా రెండు టెస్ట్‌ల్లో 10 వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశారు.జింబాబ్వేతో రెండో టెస్ట్ విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్ 72 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోర్‌కే (157) చాపచుట్టేసిన ఆఫ్ఘనిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా పుంజుకుని 363 పరుగులు చేసింది. రహ్మత్ షా (139), ఇస్మత్ ఆలం (101) సెంచరీలతో కదంతొక్కారు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఇస్మత్ అరంగేట్రంలోనే శతక్కొట్టాడు. ఎనిమిది అంతకంటే తక్కువ స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చి డెబ్యూలో సెంచరీ చేసిన 11 ఆటగాడిగా ఇస్మత్ ఆలం రికార్డుల్లోకెక్కాడు.జింబాబ్వే విషయానికొస్తే.. ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ కంటే ఎక్కువ స్కోర్ చేసింది. సికందర్ రజా (61), క్రెయిగ్ ఎర్విన్ (75) అర్ద సెంచరీలతో రాణించడంతో జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 243 పరుగులకు ఆలౌటైంది. ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జింబాబ్వే తడబడింది. రషీద్ తన స్పిన్ మాయాజాలంలో జింబాబ్వేను 205 పరుగులకు పరిమితం చేశాడు. ఫలితంగా జింబాబ్వే లక్ష్యానికి 73 పరుగుల దూరంలో నిలిచిపోయింది. -
రషీద్ ఖాన్ విశ్వరూపం.. 10 వికెట్ల ప్రదర్శన నమోదు
బులవాయో వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ విశ్వరూపం ప్రదర్శించాడు. ఈ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ 10 వికెట్ల ఘనత నమోదు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన రషీద్ రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా రషీద్ ఖాన్‌కు టెస్ట్‌ల్లో ఇది మూడో 10 వికెట్ల ప్రదర్శన. రషీద్ తన ఆరు మ్యాచ్‌ల టెస్ట్ కెరీర్లో ఐదు 5 వికెట్ల ప్రదర్శనలు, మూడు 10 వికెట్ల ప్రదర్శనల సాయంతో 44 వికెట్లు పడగొట్టాడు. రషీద్ విజృంభించడంతో రెండో టెస్ట్‌లో జింబాబ్వే ఓటమి అంచుల్లో ఉంది. ఛేదనలో తడబడిన జింబాబ్వే విజయానికి ఇంకా 82 పరుగుల దూరంలో ఉంది. చేతిలో మరో రెండు వికెట్లు మాత్రమే ఉన్నాయి. జింబాబ్వే సెకెండ్ ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. క్రెయిగ్ ఎర్విన్ (44), రిచర్డ్ నగరవ (3) క్రీజ్‌లో ఉన్నారు. జింబాబ్వే సెకెండ్ ఇన్నింగ్స్‌లో బెన్ కర్రన్ (38), సికందర్ రజా (38) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ ఆరు వికెట్లు పడగొట్టగా.. జియా ఉర్ రెహ్మాన్ రెండు వికెట్లు తీశాడు.అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో అద్భుతమైన పోరాటపటిమ కనబర్చింది. తొలుత రహ్మత్ షా (139) సెంచరీతో కదం తొక్కగా.. ఎనిమిదో నంబర్ ఆటగాడు ఇస్మత్ ఆలం (101) ఆఖర్లో బాధ్యతాయుతమైన సెంచరీ చేశాడు. ఫలితంగా ఆఫ్ఘనిస్తాన్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 363 పరుగులు చేసింది. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవ ఆరు వికెట్లు పడగొట్టగా.. నగరవ 3, సికందర్ రజా ఓ వికెట్ దక్కించుకున్నారు.దీనికి ముందు జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 243 పరుగులకు ఆలౌటైంది. సికందర్ రజా (61), క్రెయిగ్ ఎర్విన్ (75) అర్ద సెంచరీలతో రాణించారు. ఆఖర్లో సీన్ విలియమ్స్ (49) విలువైన పరుగులు జోడించాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ 4, అహ్మద్జాయ్ 3, ఫరీద్ అహ్మద్ 2, జియా ఉర్ రెహ్మాన్ ఓ వికెట్ దక్కించుకున్నారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 157 పరుగులకే ఆలౌటైంది. సికందర్ రజా, న్యామ్హురి తలో మూడు వికెట్లు, ముజరబానీ రెండు, నగరవ ఓ వికెట్ పడగొట్టి ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో రషీద్ ఖాన్ (25) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కాగా, జింబాబ్వే-ఆఫ్ఘనిస్తాన్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తొలి టెస్ట్ డ్రాగా ముగిసింది. -
సూపర్ సెంచరీతో ఆదుకున్న రహ్మత్ షా
బులవాయో వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు రహ్మత్ షా (105 నాటౌట్) సూపర్ సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో షా బాధ్యతాయుతంగా ఆడుతూ ఆఫ్ఘనిస్తాన్‌ను కష్టాల్లో నుంచి గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. షా సెంచరీతో కదంతొక్కడంతో ఆఫ్ఘనిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో గౌరవప్రదమైన స్కోర్ దిశగా సాగుతుంది. మూడో రోజు టీ విరామం సమయానికి ఆఫ్ఘనిస్తాన్ స్కోర్ 207/6గా ఉంది. షా అజేయ సెంచరీతో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుండగా.. అతనికి జతగా ఇస్మత్ ఆలం (31) క్రీజ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ 121 పరుగుల ఆధిక్యంలో ఉంది.ఆదుకున్న షా69 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్‌ను రహ్మత్ షా ఆదుకున్నాడు. షా.. షాహీదుల్లా కమాల్ (22), ఇస్మత్ ఆలమ్‌ల సహకారంతో ఇన్నింగ్స్‌ను నిర్మిస్తున్నాడు. షా సెంచరీతో ఆదుకోకపోయుంటే ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ ఘోరంగా పతనమయ్యేది. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్ మాలిక్ 1, రియాజ్ హసన్ 11, హష్మతుల్లా షాహిది 13, జియా ఉర్ రెహ్మాన్ 6, అఫ్సర్ జజాయ్ 5 పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో ముజరబానీ 3, నగరవ 2, సికందర్ రజా ఓ వికెట్ పడగొట్టారు.అంతకుముందు జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 243 పరుగులకు ఆలౌటైంది. సికందర్ రజా (61), క్రెయిగ్ ఎర్విన్ (75) అర్ద సెంచరీలతో రాణించగా.. సీన్ విలియమ్స్ (49) పరుగు తేడాతో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ 4, అహ్మద్జాయ్ 3, ఫరీద్ అహ్మద్ 2, జియా ఉర్ రెహ్మాన్ ఓ వికెట్ పడగొట్టారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. జింబాబ్వే బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 157 పరుగులకే చాపచుట్టేసింది. సికందర్ రజా, న్యామ్హురి తలో మూడు వికెట్లు పడగొట్టగా.. ముజరబానీ 2, నగరవ ఓ వికెట్ పడగొట్టారు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో రషీద్ ఖాన్ (25) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.కాగా, రెండు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో తొలి మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. ఈ మ్యాచ్‌లో రెండు డబుల్ సెంచరీలు, నాలుగు సెంచరీలు నమోదయ్యాయి. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో సీన్ విలియమ్స్ (154), క్రెయిగ్ ఎర్విన్ (104), బ్రియాన్ బెన్నెట్ (110 నాటౌట్) సెంచరీలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో రహ్మత్ షా (234), హష్మతుల్లా షాహిది (246) డబుల్ సెంచరీలు చేయగా.. అఫ్సన్ జజాయ్ (113) శతక్కొట్టాడు. -
జింబాబ్వేకు ఆధిక్యం
బులవాయో వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో జింబాబ్వేకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 243 పరుగులకు ఆలౌటైంది. తద్వారా 86 పరుగుల కీలక ఆధిక్యం సాధించింది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో క్రెయిగ్ ఎర్విన్ (75) చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. సికందర్ రజా (61), సీన్ విలియమ్స్ (49) రాణించారు. జింబాబ్వే జట్టులో జాయ్‌లార్డ్ గుంబీ 8, బెన్ కర్రన్ 15, కైటానో 0, డియాన్ మైయర్స్ 5, బ్రియాన్ బెన్నెట్ 2, న్యూమ్యాన్ న్యామ్హురి 11, రిచర్డ్ నగరవ 1 పరుగు చేసి ఔటయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. అహ్మద్జాయ్ మూడు, ఫరీద్ అహ్మద్ రెండు, జియా ఉర్ రెహ్మాన్ ఓ వికెట్ దక్కించుకున్నారు.అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్ 8 ఓవర్ల అనంతరం రెండు వికెట్ల నష్టానికి 19 పరుగులు చేసింది. అబ్దుల్ మాలిక్ 1, రియాన్ హసన్ 11 పరుగులు చేసి ఔట్ కాగా.. రహ్మత్ షా (6), హస్మతుల్లా షాహిది (0) క్రీజ్‌లో ఉన్నారు. బ్లెస్సింగ్ ముజరబాని రెండు వికెట్లు తీశాడు. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఆఫ్ఘనిస్తాన్ ఇంకా 67 పరుగులు వెనుకపడి ఉంది. రెండో రోజు ఆట కొనసాగుతుంది.అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 157 పరుగులకు ఆలౌటైంది. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో రషీద్ ఖాన్ (25) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అబ్దుల్ మాలిక్ 17, రియాజ్ హసన్ 12, రహ్మద్ షా 19, షాహిది 13, జజాయ్ 16, షహీదుల్లా 12, ఇస్మత్ అలామ్ 0, అహ్మద్ జాయ్ 2, జియా ఉర్ రెహ్మాన్ 8 (నాటౌట్), ఫరీద్ అహ్మద్ 17 పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో సికందర్ రజా, న్యూమ్యాన్ న్యామ్హురి తలో మూడు వికెట్లు పడగొట్టగా.. ముజరబాని రెండు, నగరవ ఓ వికెట్ దక్కించుకున్నారు.కాగా, ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. ఈ మ్యాచ్‌లో రెండు డబుల్ సెంచరీలు, నాలుగు సెంచరీలు నమోదయ్యాయి. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో సీన్ విలియమ్స్ (154), క్రెయిగ్ ఎర్విన్ (104), బ్రియాన్ బెన్నెట్ (110 నాటౌట్) సెంచరీలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో రహ్మత్ షా (234), హష్మతుల్లా షాహిది (246) డబుల్ సెంచరీలు చేయగా.. అఫ్సన్ జజాయ్ (113) శతక్కొట్టాడు. -
జింబాబ్వేతో రెండో టెస్టు.. అఫ్గాన్ 157 ఆలౌట్
బులవాయో: అద్వితీయ బ్యాటింగ్‌తో జింబాబ్వేతో తొలి టెస్టును ‘డ్రా’ చేసుకున్న అఫ్గానిస్తాన్ జట్టు... రెండో టెస్టులో స్వల్ప స్కోరుకే ఆలౌటైంది. ఇరు జట్ల మధ్య గురువారం ప్రారంభమైన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అఫ్గానిస్తాన్ 44.3 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది.రషీద్ ఖాన్ (20 బంతుల్లో 25; 4 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... మిగిలిన వాళ్లలో ఏ ఒక్కరూ 20 పరుగుల మార్క్ దాటలేకపోయారు. కెపె్టన్ హష్మతుల్లా (13), రహమత్ షా (19), అబ్దుల్ మాలిక్ (17), రియాజ్ హసన్ (12), అఫ్సర్ (16), షహీదుల్లా (12), ఇస్మత్ ఆలమ్ (0) ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్‌కు వరస కట్టారు.జింబాబ్వే బౌలర్లలో సికందర్ రజా, న్యూమన్ న్యామురి చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే 3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 6 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ అర్ధాంతరంగా నిలిచిపోయింది. చేతిలో 10 వికెట్లు ఉన్న జింబాబ్వే ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 151 పరుగులు వెనుకబడి ఉంది. జాయ్‌లార్డ్ గుంబీ (4 బ్యాటింగ్), బెన్ కరన్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.చదవండి: IND vs AUS: రోహిత్‌ను కావాలనే పక్కన పెట్టారా?.. కెప్టెన్ బుమ్రా ఏమన్నాడంటే? -
టెస్టుల్లో అత్యధిక స్కోరు నమోదు చేసిన అఫ్గనిస్తాన్.. కానీ
జింబాబ్వే- అఫ్గనిస్తాన్(Zimbabwe vs Afghanistan) జట్ల మధ్య బులవాయో వేదికగా తొలి టెస్టు ‘డ్రా’గా ముగిసింది. మ్యాచ్ చివరిరోజు ఓవర్‌నైట్ స్కోరు 515/3తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన అఫ్గనిస్తాన్ 197 ఓవర్లలో 699 పరుగులు చేసి ఆలౌటైంది. ఇక టెస్టు క్రికెట్లో అఫ్గనిస్తాన్ జట్టుకిదే అత్యధిక స్కోరు కావడం విశేషం. 2021లో అబుదాబిలో జింబాబ్వేతోనే జరిగిన టెస్టులో అఫ్గానిస్తాన్ 4 వికెట్లకు 545 పరుగులు చేసింది.హష్మతుల్లా, రహ్మత్ షా డబుల్ సెంచరీలుఇక జింబాబ్వేతో తొలి టెస్టు ఆఖరి రోజు అఫ్గానిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది(Hashmatullah Shahidi- 474 బంతుల్లో 246; 21 ఫోర్లు) డబుల్ సెంచరీ పూర్తి చేసుకోగా... అఫ్సర్ జజాయ్ (169 బంతుల్లో 113; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) శతకం సాధించాడు. అంతకుముందు మూడో రోజు రహ్మత్ షా (424 బంతుల్లో 234; 23 ఫోర్లు, 3 సిక్స్‌లు) డబుల్ సెంచరీ చేశాడు.‘డ్రా’కు అంగీకరించిన కెప్టెన్లుఓవరాల్గా అఫ్గనిస్తాన్ ఇన్నింగ్స్‌లో రెండు డబుల్ సెంచరీలు, ఒక సెంచరీ నమోదు కావడం విశేషం. 113 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే 34 ఓవర్లలో 4 వికెట్లకు 142 పరుగులు చేసింది. మ్యాచ్‌లో ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో రెండు జట్ల కెప్టెన్లు ‘డ్రా’కు అంగీకరించారు. రిజల్ట్ రాకపోయినా పరుగుల వరద పారిన ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు కనువిందు చేసింది.అఫ్గనిస్తాన్ తక్కువ టెస్టుల్లోనే ఇలాఇదిలా ఉంటే.. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 586 పరుగులు సాధించింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు జనవరి 2 నుంచి బులవాయోలోనే జరుగుతుంది. కాగా టెస్టు క్రికెట్లో తొలిసారి 600 పరుగుల స్కోరు దాటేందుకు అఫ్గనిస్తాన్ పది టెస్టులు ఆడాల్సి వచ్చింది. ఇప్పటి వరకు 10 జట్లు టెస్టుల్లో 600 అంతకంటే ఎక్కువ స్కోరు నమోదు చేశాయి. ఇందులో అఫ్గనిస్తాన్ తక్కువ టెస్టుల్లో ఈ మైలురాయిని దాటడం విశేషం.కాగా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టులు ఆడేందుకు అఫ్గనిస్తాన్ జింబాబ్వే పర్యటన(Afghanistan tour of Zimbabwe, 2024-25)కు వెళ్లింది. టీ20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న అఫ్గన్.. వన్డే సిరీస్‌లోనూ 2-1తో నెగ్గింది. ఇక తొలి టెస్టును డ్రా చేసుకుంది.జింబాబ్వే వర్సెస్ అఫ్గనిస్తాన్ తొలి టెస్టు(డిసెంబరు 26-30)👉వేదిక: క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో👉టాస్: జింబాబ్వే... తొలుత బ్యాటింగ్👉జింబాబ్వే తొలి ఇన్నింగ్స్ స్కోరు: 586👉అఫ్గనిస్తాన్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 699👉జింబాబ్వే రెండో ఇన్నింగ్స్ స్కోరు: 142/4👉ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఆఖరి రోజు ‘డ్రా’కు అంగీకరించిన ఇరుజట్లు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: హష్మతుల్లా షాహిది(అఫ్గనిస్తాన్- 474 బంతుల్లో 246 పరుగులు).చదవండి: WTC 2025: భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే.. అదొక్కటే దారి! -
మహిళలు పనిచేసే ఎన్జీవోల మూత
కాబూల్: అఫ్గానిస్తాన్‌లోని తాలిబన్ పాలకులు మహిళలకు వ్యతిరేకంగా మరో నిర్ణయం తీసుకున్నారు. తమ దేశ మహిళలు పనిచేసే జాతీయ, విదేశీ ప్రభుత్వేతర సంస్థలన్నిటినీ మూసివేయనున్నట్లు సోమవారం ప్రకటించారు. ఇస్లాం సిద్ధాంతాల ప్రకారం ధరించాల్సిన హిజాబ్‌ను ఆయా సంస్థల్లోని అఫ్గాన్ మహిళలు ధరించకపోవడమే ఇందుకు కారణమన్నారు. ఆర్థిక శాఖ ఆదివారం రాత్రి ‘ఎక్స్’లో ఈ విషయం వెల్లడించింది. తమ ఉత్తర్వులను బేఖాతరు చేసే సంస్థల లైసెన్సులను రద్దు చేస్తామని, కార్యకలాపాలను నిలిపివేస్తామని కూడా అందులో హెచ్చరించింది. నాన్ గవర్నమెంటల్ సంస్థల రిజిసే్ట్రషన్, సమన్వయం, నిర్వహణ, పర్యవేక్షణ సహా అన్ని కార్యకలాపాల బాధ్యత తమదేనని స్పష్టం చేసింది. తాలిబాన్ నియంత్రణలో లేని సంస్థలు అన్నిటిలోనూ మహిళలు పనిచేయడం ఆపేయాలని మరోసారి హుకుం జారీ చేసింది. అత్యవసరమైన మానవతా సాయం అందించే కార్యక్రమాల్లోనూ మహిళల ప్రాతినిథ్యాన్ని తాలిబన్లు అడ్డుకుంటున్నారని ఇటీవల ఐరాస సైతం ఆరోపించడం గమనార్హం. బాలికలు ఆరో గ్రేడ్ మించి చదువుకోరాదని, బహిరంగంగా కనిపించే విధుల్లో పాల్గొనరాదని ఇప్పటికే తాలిబన్ పాలకులు నిషేధం విధించడం తెలిసిందే. కిటికీల నుంచి మహిళలు కనిపించొద్దు తాలిబన్ నేత హిబతుల్లా అఖుంద్జాదా మరో తాఖీదు జారీ చేశారు. మహిళలు, నిలబడి లేదా కూర్చున్నట్లుగా కనబడేలా భవనాలకు కిటికీలు ఉండరాదన్నారు. కొత్తగా నిర్మించే వాటితోపాటు ఇప్పటికే ఉన్న భవనాలకు సైతం ఈ నిబంధన వర్తిస్తుందన్నారు. వరండాలు లేదా వంటగదులు కనిపించేలా కిటికీలు ఏర్పాటు చేయవద్దన్నారు. ఒక వేళ కిటికీలుంటే భవన యజమాని ఆ స్థానంలో గోడను నిర్మించడం లేదా ఏదైనా అడ్డుగా ఉంచడం చేయాలన్నారు. నివాస భవనాల్లోపలి భాగం కనిపించేలా కొత్తగా భవన నిర్మాణం చేయరాదని ఆయన మున్సిపల్, ఇతర అధికారులకు సైతం నిర్దేశించడం గమనార్హం. -
రికార్డు డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్
ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది సరికొత్త చరిత్ర సృష్టించాడు. జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో డబుల్ సెంచరీ (246) చేసిన షాహిది.. ఆఫ్ఘనిస్తాన్ తరఫున టెస్ట్‌ల్లో రెండు డబుల్ సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. షాహిది 2021లో జింబాబ్వేపై తొలి డబుల్ సెంచరీ (200) చేశాడు.తాజాగా డబుల్‌తో షాహిది మరో రికార్డు కూడా సాధించాడు. ఆఫ్ఘనిస్తాన్ తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ (246) సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఇదే మ్యాచ్‌లో మరో ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ రహ్మత్ షా (234) కూడా డబుల్ సెంచరీ చేశాడు. షాహిదికి ముందు రహ్మత్ షాదే ఆఫ్ఘనిస్తాన్ తరఫున అత్యధిక స్కోర్‌గా ఉండేది.మొత్తంగా ఆఫ్ఘనిస్తాన్ తరఫున టెస్ట్‌ల్లో మూడు డబుల్ సెంచరీలు మాత్రమే నమోదయ్యాయి. ఈ మూడింటిలో రెండు ఇదే మ్యాచ్‌లో నమోదు కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో మరో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు (అఫ్సన్ జజాయ్) సెంచరీ (113) చేశాడు.రహ్మత్, షాహిది డబుల్.. జజాయ్ సెంచరీ సాధించడంతో ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ (699) చేసింది. టెస్ట్‌ల్లో ఆఫ్ఘనిస్తాన్‌కు ఇదే అత్యధిక స్కోర్. ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురు ఆఫ్ఘన్ ఆటగాళ్లు మూడంకెల స్కోర్లు సాధించడం కూడా ఇదే మొదటిసారి. 639 పరుగుల వరకు 3 వికెట్లు మాత్రమే కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్.. ఆతర్వాత 60 పరుగుల వ్యవధిలో మిగిలిన ఏడు వికెట్లు కోల్పోయింది. జింబాబ్వే బౌలర్లలో బ్రియాన్ బెన్నెట్ ఐదు వికెట్లు పడగొట్టగా.. సీన్ విలియమ్స్ 2, ముజరబానీ, గ్వాండు, న్యామ్హురి తలో వికెట్ దక్కించుకున్నారు.అంతకుముందు జింబాబ్వే సైతం తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ (586) చేసింది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో సైతం ముగ్గురు మూడంకెల స్కోర్లు సాధించారు. సీన్ విలియమ్స్ (154), కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ (104), బ్రియాన్ బెన్నెట్ (110 నాటౌట్) సెంచరీలు చేశారు. కెరీర్లో తొలి టెస్ట్ ఆడుతున్న బెన్ కర్రన్ (ఇంగ్లండ్ ఆటగాడు సామ్ కర్రన్ అన్న) అర్ద సెంచరీతో (68) రాణించాడు. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్ స్కోర్‌తో పోలిస్తే ఆఫ్ఘనిస్తాన్ 113 పరుగులు ఎక్కువగా సాధించింది. జింబాబ్వే ఆటగాడు బ్రియాన్ బెన్నెట్ సెంచరీ సహా ఐదు వికెట్లు ప్రదర్శన నమోదు చేయడం మరో విశేషం.113 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే 5 ఓవర్ల అనంతరం వికెట్ నష్టపోకుండా 32 పరుగులు చేసింది. బెన్ కర్రన్ (23), జాయ్‌లార్డ్ గుంబీ (4) క్రీజ్‌లో ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు జింబాబ్వే ఇంకా 81 పరుగులు వెనుకపడి ఉంది. మ్యాచ్ చివరి రోజు రెండో సెషన్ ఆట కొనసాగుతుంది. కాగా, మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ల కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో టీ20, వన్డే సిరీస్‌లను ఆఫ్ఘనిస్తాన్ కైవసం చేసుకుంది. టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో నెగ్గిన ఆఫ్ఘన్లు.. వన్డే సిరీస్‌ను 2-0 తేడాతో గెలుచుకున్నారు. ప్రస్తుతం తొలి టెస్ట్ జరుగుతుండగా.. రెండో టెస్ట్ జనవరి 2న ప్రారంభంకానుంది. -
డబుల్ సెంచరీతో చెలరేగిన అఫ్గాన్ ఆటగాడు..
బులవాయో వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో జింబాబ్వేకు అఫ్గానిస్తాన్ ధీటుగా బదులిస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి తొలి అఫ్గానిస్తాన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 425 పరుగులు చేసింది. అఫ్గాన్ ఇంకా 161 పరుగులు వెనంజలో ఉంది. 95/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన అఫ్గాన్ జట్టు వికెట్ నష్టపోకుండా 330 పరుగులు చేసింది.రహ్మత్ షా డబుల్ సెంచరీ..అఫ్గానిస్తాన్ ఫస్ట్ డౌన్ బ్యాటర్ రహ్మత్ షా (416 బంతుల్లో 23 ఫోర్లు, 3 సిక్స్‌లు 231 బ్యాటింగ్) ఆజేయ డబుల్ సెంచరీతో చెలరేగాడు. కెప్టెన్ హష్మతుల్లా షాహిదీతో కలిసి ఇన్నింగ్స్‌ను అద్బుతంగా నడిపించాడు. రహ్మత్‌కు ఇదే తొలి టెస్టు డబుల్ సెంచరీ కావడం గమనార్హం. అతడితో పాటు షాహిదీ(276 బంతుల్లో 16 ఫోర్లు, 141 నాటౌట్) సెంచరీతో కదం తొక్కాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 361 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు.రహ్మత్ షా అరుదైన రికార్డు..ఇక ఈ మ్యాచ్‌లో ద్విశతకంతో చెలరేగిన రహ్మత్ షా ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో అఫ్గాన్ తరపున అత్యధిక స్కోర్ చేసిన ప్లేయర్‌గా రహ్మత్(231*) నిలిచాడు. గతంలో ఈ రికార్డు హష్మతుల్లా షాహిదీ(200) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో షాహిదీ ఆల్‌టైమ్ రికార్డును షా బ్రేక్ చేశాడు. అదే విధంగా టెస్టు మ్యాచ్‌లో ఒక రోజు మొత్తం వికెట్ కోల్పోకపోవడం ఇదే తొలిసారి 2019 తర్వాత ఇదే తొలిసారి.చదవండి: VHT 2024-25: పంజాబ్ ఓపెనర్ విధ్వంసం.. 14 ఫోర్లు, 10 సిక్స్‌లతో -
ZIM Vs AFG: టెస్టుల్లో అత్యధిక స్కోరు నమోదు చేసిన జింబాబ్వే.. శతకాల మోత
బులవాయో: అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు కూడా జింబాబ్వే జోరే కొనసాగింది. దీంతో ఆ జట్టు తమ టెస్టు చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు చేసింది. కెప్టెన్ క్రెయిగ్ ఇర్విన్ (176 బంతుల్లో 104; 10 ఫోర్లు), బ్రియాన్ బెనెట్ (124 బంతుల్లో 110 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీలతో మొత్తం మూడు శతకాల మోత మోగింది. తొలిరోజు ఆటలో సీన్ విలియమ్స్ సెంచరీ సాధించాడు.ఓవర్‌నైట్ స్కోరు 363/4తో రెండో రోజు ఆట కొనసాగించిన జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 135.2 ఓవర్లలో 586 పరుగుల వద్ద ఆలౌటైంది. 2001లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో జింబాబ్వే చేసిన 563/9 స్కోరే ఇప్పటిదాకా అత్యధిక పరుగులు కాగా... ఇప్పుడా రికార్డును సవరించింది.ఓవర్‌నైట్ బ్యాటర్లలో విలియమ్స్ ఎంతోసేపు నిలువలేదు. ఇర్విన్... తర్వాత వచ్చిన బెనెట్‌తో ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ క్రమంలో ఇద్దరు సెంచరీలు పూర్తిచేసుకున్నారు. టెయిలెండర్లు న్యుమన్ న్యామ్హురి (26; 2 ఫోర్లు, 1 సిక్స్), ముజరబని (19; 1 ఫోర్, 1 సిక్స్) చేసిన పరుగులతో జింబాబ్వే అత్యధిక స్కోరు సాధించింది. అఫ్గాన్ బౌలర్లలో ఘజన్ఫర్ 3, నవీద్ జద్రాన్, జహీర్ ఖాన్, జియావుర్ రహ్మాన్ తలా 2 వికెట్లు తీశారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన అఫ్గానిస్తాన్ ఆట ముగిసే సమయానికి 30 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. ఓపెనర్లు సిదిఖుల్లా అతల్ (3), అబ్దుల్ మాలిక్ (23; 1 ఫోర్) నిష్క్రమించగా.. రహ్మత్ షా (49 బ్యాటింగ్; 5 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ హష్మతుల్లా షాహిది (16 బ్యాటింగ్; 3 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. అఫ్గాన్ ఇంకా 491 పరుగులు వెనుకబడి ఉంది. -
సీన్ విలియమ్స్ అజేయ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా జింబాబ్వే
బులవాయో: జింబాబ్వే పర్యటనకు వచ్చిన అఫ్గానిస్తాన్‌కు తొలి టెస్టులో ఆతిథ్య బ్యాటర్ల నుంచి సవాళ్లు ఎదురయ్యాయి. గురువారం మొదలైన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 85 ఓవర్లలో 4 వికెట్లకు 363 పరుగులు చేసింది. ఓపెనర్ బెన్ కరన్ (74 బంతుల్లో 68; 11 ఫోర్లు), వన్‌డౌన్ బ్యాటర్ కైటానో (115 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్) రెండో వికెట్‌కు 49 పరుగులు జతచేశారు. కరన్ నిష్క్రమించాక వచ్చిన సీన్ విలియమ్స్ (161 బంతుల్లో 145 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) అఫ్గాన్ బౌలర్లపై వన్డేను తలపించే ఇన్నింగ్స్ ఆడాడు. విలువైన భాగస్వామ్యాలతో జట్టు భారీస్కోరుకు బాటలు వేశాడు.కైటానోతో కలిసి మూడో వికెట్‌కు 78 పరుగులు, అనంతరం మైయెర్స్ (27; 3 ఫోర్లు)తో నాలుగో వికెట్‌కు 50 పరుగులు జోడించారు. తర్వాత విలియమ్స్, కెప్టెన్ ఇర్విన్ (94 బంతుల్లో 56 బ్యాటింగ్; 6 ఫోర్లు)తో కలిసి జట్టు స్కోరును 300 పరుగులు దాటించాడు. ఈ క్రమంలో 115 బంతుల్లోనే విలియమ్స్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు ఇర్విన్ కూడా అర్ధసెంచరీ సాధించడంతో ఇద్దరు అబేధ్యమైన ఐదో వికెట్‌కు 143 పరుగులు జోడించారు. అఫ్గాన్ బౌలర్లలో ఘజన్ఫర్ 2, నవీద్ జద్రాన్, జహీర్ ఖాన్ చెరో వికెట్ తీశారు. -
ఆప్ఘనిస్తాన్ టార్గెట్‌గా పాక్ దాడులు.. 15 మంది మృతి
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌ను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్(Pakistan) వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల కారణంగా దాదాపు 15 మంది మరణించినట్టు తెలుస్తోంది. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నట్టు సమాచారం. ఈనేపథ్యంలో పాక్, ఆప్ఘన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.ఆఫ్ఘనిస్థాన్‌లోని(Afghanistan) పక్టికా ప్రావిన్స్‌లో ఉన్న బర్మాల్ జిల్లాపై మంగళవారం అర్ధరాత్రి పాకిస్తాన్ వైమానిక దాడులు చేసింది. లామన్‌తో సహా ఏడు గ్రామాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఈ దాడుల్లో 15 మంది మృతిచెందగా పలువురు గాయపడినట్టు సమాచారం. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించినట్టు అక్కడి మీడియా ఖమా నివేదించింది. ఈ బాంబు పేలుళ్లకు పాకిస్తాన్ జెట్ విమానాలే కారణమని స్థానిక వర్గాలు పేర్కొంటున్నాయి. పాక్ వైమానిక దాడులు తీవ్రమైన పౌర ప్రాణనష్టం, విస్తృత విధ్వంసానికి కారణమయ్యాయి. దాడుల కారణంగా ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.మరోవైపు.. బర్మాల్, పక్టికాపై జరిగిన వైమానిక దాడికి(Air Strike) ప్రతీకారం తీర్చుకుంటామని తాలిబాన్ రక్షణ మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆప్ఘన్ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం తమ చట్టబద్ధమైన హక్కు అని పేర్కొంది. పాక్ వైమానిక దాడులను ఖండించింది. పాక్ లక్ష్యంగా దాడులు చేసిన వారిలో వజీరిస్థానీ శరణార్థులు కూడా ఉన్నారని తెలిపింది.Aftermath of precision airstrikes conducted by the Pakistan Air Force, eliminating over 40+ TTP terrorists and crippling militant infrastructure in Paktika province Afghanistan.A significant step taken by Pakistan Armed forces in counter-terrorism efforts reaffirming their… pic.twitter.com/x6AZgOx5JB— Global Defense Agency (@Defense_GDA) December 24, 2024ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్ మధ్య ఉద్రికత్తలు పెరిగాయి. అయితే, తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP)కు చెందిన ఉగ్రవాదులకు ఆఫ్ఘన్ తాలిబాన్ ఆశ్రయం కల్పిస్తోందని పాకిస్తాన్ ఆరోపించింది. ఈ క్రమంలో దాడులకు చేసినట్టు తెలుస్తోంది. ఇక, పాకిస్తాన్ అధికారులు అధికారికంగా వైమానిక దాడిని ధృవీకరించ లేదు. సరిహద్దుకు సమీపంలో ఉన్న తాలిబాన్ రహస్య స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు సైనిక సన్నిహిత భద్రతా వర్గాలు సూచించాయి. -
మూడో వన్డేలో ఘన విజయం.. అఫ్గాన్‌దే వన్డే సిరీస్
జింబాబ్వే పర్యటనలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్న అఫ్గానిస్తాన్ జట్టు... వన్డే సిరీస్ కూడా కైవసం చేసుకుంది. టి20 సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసిన అఫ్గాన్... తాజాగా వన్డే సిరీస్‌ను 2–0తో చేజిక్కించుకుంది. శనివారం జరిగిన ఆఖరి వన్డేలో అఫ్గాన్ 8 వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తుచేసింది.మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 30.1 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. సీన్ విలియమ్స్ (61 బంతుల్లో 60; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధసెంచరీతో రాణించగా... మిగిలిన వాళ్లంతా విఫలమయ్యారు. కెపె్టన్ ఇరి్వన్ (5), ఆల్‌రౌండర్ సికందర్ రజా (13), బెనెట్ (9) ఒకరివెంట ఒకరు పెవిలియన్‌కు చేరారు.అఫ్గాన్ బౌలర్లలో ఘజన్ఫర్ 5 వికెట్లతో విజృంభించగా... రషీద్ ఖాన్ 3 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనలో అఫ్గానిస్తాన్ 26.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. సెదిఖుల్లా అతల్ (50 బంతుల్లో 52; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఘజన్ఫర్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, సెదిఖుల్లా అతల్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య గురువారం నుంచి తొలి టెస్టు జరగనుంది.చదవండి: IND vs AUS: టీమిండియాకు భారీ షాక్.. కెప్టెన్ రోహిత్ శర్మకు గాయం -
ఆఫ్ఘనిస్తాన్, జింబాబ్వే తొలి వన్డే రద్దు
ఆఫ్ఘనిస్తాన్, జింబాబ్వే జట్ల మధ్య ఇవాళ (డిసెంబర్ 17) జరగాల్సిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దైంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే వర్షం మొదలైంది. అయితే మధ్యలో వరుణుడు కాసేపు శాంతించడంతో 28 ఓవర్ల మ్యాచ్‌గా కుదించారు. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ జింబాబ్వేను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.సామ్ కర్రన్ సోదరుడు అరంగేట్రంఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్ పెద్ద సోదరుడు బెన్ కర్రన్ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. బెన్ తన తండ్రి దేశమైన జింబాబ్వే తరఫున తన తొలి వన్డే ఆడాడు. ఈ మ్యాచ్‌లో బెన్ 22 బంతులు ఎదుర్కొని ఓ బౌండరీ సాయంతో 15 పరుగులు చేశాడు. అనంతరం బెన్ అజ్మతుల్లా బౌలింగ్‌లో ఇక్రమ్ అలీఖిల్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.నిప్పులు చెరిగిన ఒమర్జాయ్తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. ఆఫ్ఘనిస్తాన్ పేసర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ నిప్పులు చెరగడంతో విలవిలలాడిపోయింది. ఒమర్జాయ్ ధాటికి జింబాబ్వే 41 పరుగులకు సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఒమర్జాయ్ 4.2 ఓవర్లలో 18 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. మిస్టరీ స్పిన్నర్ అల్లా ఘజన్ఫర్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. జింబాబ్వే స్కోర్ 44/5 వద్ద నుండగా (9.2 ఓవర్లు) వర్షం మళ్లీ మొదలైంది. ఈ దశలో మొదలైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో బెన్ కర్రన్ 15, మరుమణి 6, బ్రియాన్ బెన్నెట్ 0, డియాన్ మైర్స్ 12, సీన్ విలియమ్స్ 0 పరుగులకు ఔట్ కాగా.. కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ (1),సికందర్ రజా (1) క్రీజ్‌లో ఉన్నారు. -
టెస్ట్ జట్టులో రషీద్ ఖాన్
త్వరలో జింబాబ్వేతో జరుగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఇవాళ (డిసెంబర్ 16) ప్రకటించారు. ఆఫ్ఘన్ స్టార్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ చాలాకాలం తర్వాత టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. రషీద్ తన చివరి టెస్ట్ మ్యాచ్‌ను 2021లో ఆడాడు. గజ్జల్లో గాయం కారణంగా రషీద్ టెస్ట్ మ్యాచ్‌లకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. తాజాగా సెలెక్టర్ల కోరిక మేరకు రషీద్ టెస్ట్ జట్టులో చేరాడు.జింబాబ్వేతో టెస్ట్ సిరీస్ కోసం హష్మతుల్లా షాహిది నేతృత్వంలో 18 మంది సభ్యులతో కూడిన ఆఫ్ఘన్ జట్టును ఎంపిక చేశారు. ఈ జట్టులో ఏడుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. వీరిలో లెఫ్ట్ ఆర్మ్ సీమర్ బషీర్ అహ్మద్, ఆల్‌రౌండర్ ఇస్మత్ ఆలమ్ దేశవాలీ టోర్నీల్లో సత్తా చాటారు.మరో నలుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లు అజ్మతుల్లా ఒమర్జాయ్, ఫరీద్ అహ్మద్ మలిక్, రియాజ్ హసన్, సెదిఖుల్లా అటల్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో న్యూజిలాండ్‌తో జరగాల్సిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు ఎంపికయ్యారు. ఆ మ్యాచ్ వర్షం, వెట్ ఔట్ ఫీల్డ్ కారణంగా ఒక్క రోజు కూడా సాగలేదు.కాగా, ఆఫ్ఘనిస్తాన్ జట్టు మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ల కోసం జింబాబ్వేలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లలో టీ20 సిరీస్ ఇదివరకే ముగిసింది. టీ20 సిరీస్‌ను ఆఫ్ఘనిస్తాన్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మూడు వన్డే మ్యాచ్‌లు డిసెంబర్ 17, 19, 21 తేదీల్లో జరుగనున్నాయి. ఈ మ్యాచ్‌లన్నీ హరారే వేదికగా జరుగుతాయి. తొలి టెస్ట్ డిసెంబర్ 26 నుంచి.. రెండో టెస్ట్ వచ్చే ఏడాది జనవరి 2 నుంచి బులవాయో వేదికగా జరుగుతాయి.జింబాబ్వేతో రెండు టెస్ట్‌ల కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు..హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), రహ్మత్ షా (వైస్ కెప్టెన్), ఇక్రమ్ అలీఖైల్ (వికెట్‌కీపర్), అఫ్సర్ జజాయ్ (వికెట్‌కీపర్), రియాజ్ హసన్, సెదిఖుల్లా అటల్, అబ్దుల్ మలిక్, బహీర్ షా మహబూబ్, ఇస్మత్ ఆలం, అజ్మతుల్లా ఒమర్జాయ్, జహీర్ ఖాన్, జియా ఉర్ రెహ్మాన్ అక్బర్ , జహీర్ షెహజాద్, రషీద్ ఖాన్, యామిన్ అహ్మద్జాయ్, బషీర్ అహ్మద్ ఆఫ్ఘన్, నవీద్ జద్రాన్, ఫరీద్ అహ్మద్ మాలిక్ -
జింబాబ్వేపై ప్రతీకారం తీర్చుకున్న ఆఫ్ఘనిస్తాన్
తొలి టీ20లో జింబాబ్వే చేతిలో ఎదురైన పరాభవానికి ఆఫ్ఘనిస్తాన్ జట్టు ప్రతీకారం తీర్చుకుంది. హరారే వేదికగా ఇవాళ (డిసెంబర్ 13) జరిగిన రెండో టీ20లో ఆఫ్ఘనిస్తాన్.. జింబాబ్వేపై 50 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో జింబాబ్వే, ఆఫ్ఘనిస్తాన్ జట్లు 1-1తో సమానంగా నిలిచాయి.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. దర్విష్ రసూలీ (58) అర్ద సెంచరీతో రాణించగా.. అజ్మతుల్లా (28), గుల్బదిన్ (26 నాటౌట్), సెదికుల్లా అటల్ (18), గుర్బాజ్ (11) రెండంకెల స్కోర్లు చేశారు. స్టార్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ 4 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. జింబాబ్వే బౌలర్లలో ట్రెవర్ గ్వాండు, ర్యాన్ బర్ల్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ముజరబానీ ఓ వికెట్ దక్కించుకున్నాడు.154 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే.. ఆఫ్ఘన్ బౌలర్లు మూకుమ్మడిగా విజృంభించడంతో 17.4 ఓవర్లలో 103 పరుగులకు ఆలౌటైంది. నవీన్ ఉల్ హక్, రషీద్ ఖాన్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. ముజీబ్ ఉర్ రెహ్మాన్ 2, ఒమర్జాయ్, ఫరీద్ మలిక్ చెరో వికెట్ దక్కించుకున్నారు. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో సికందర్ రజా (35) టాప్ స్కోరర్‌గా నిలువగా.. బ్రియాన్ బెన్నెట్ (27), తషింగ ముసేకివా (13) రెండంకెల స్కోర్లు చేశారు. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మకమైన మూడో టీ20 డిసెంబర్ 14న జరుగనుంది. -
ఉత్కంఠ పోరులో ఆఫ్ఘనిస్తాన్పై జింబాబ్వే విజయం
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (డిసెంబర్ 11) జరిగిన తొలి మ్యాచ్‌లో జింబాబ్వే 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ చివరి బంతి వరకు నువ్వా-నేనా అన్నట్లు సాగింది. చివరి బంతికి ఒక్క పరుగు చేయల్సి ఉండగా.. తషింగ సింగిల్ తీసి జింబాబ్వేను గెలిపించాడు. చివరి ఓవర్లో జింబాబ్వే 11 పరుగులు రాబట్టి గెలుపు తీరాలకు చేరింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 144 పరుగులు మాత్రమే చేయగలిగింది. 58 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్‌ను కరీమ్ జనత్ (54 నాటౌట్), మహ్మద్ నబీ (44) ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 79 పరుగులు జోడించి తమ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. జింబాబ్వే బౌలర్లలో నగరవ 3 వికెట్లు పడగొట్టగా.. ముజరబానీ, ట్రెవర్ గ్వాండు, మసకద్జ తలో వికెట్ పడగొట్టారు.స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే ఆదిలో సునాయాసంగా గెలిచేలా కనిపించింది. అయితే మధ్యలో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు తీసి జింబాబ్వేపై ఒత్తిడి పెంచారు. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (49) జింబాబ్వేను గెలుపు వాకిటి వరకు తీసుకొచ్చి ఔటయ్యాడు. ఇక్కడే ఆఫ్ఘన్లు జింబాబ్వేపై ఒత్తిడి పెంచారు. 11 పరుగుల వ్యవధిలో జింబాబ్వే రెండు వికెట్లు కోల్పోయి గెలుపు కోసం చివరి బంతి వరకు ఎదురు చూడాల్సి వచ్చింది. ఎట్టకేలకు తషింగ (16 నాటౌట్), మసకద్జ (6 నాటౌట్) సాయంతో జింబాబ్వేను విజయతీరాలకు చేర్చాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో నవీన్ ఉల్ హక్ (4-1-33-3), రషీద్ ఖాన్ (4-0-26-2) అద్భుతంగా బౌలింగ్ చేశారు. మహ్మద్ నబీకి ఓ వికెట్ దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 డిసెంబర్ 13న జరుగనుంది. -
CT 2025: అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 నేపథ్యంలో అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మెగా టోర్నీలో తొలిసారి తమ జట్టు పాల్గొనబోతున్న నేపథ్యంలో హెడ్‌కోచ్‌గా జొనాథన్ ట్రాట్ పదవీ కాలాన్ని ఏడాది పొడిగించింది. ఈ క్రమంలో.. 2025 ఏడాది ముగింపుదాకా ట్రాట్ హెడ్ కోచ్‌గా కొనసాగుతాడు.మేటి జట్లను కంగుతినిపించికాగా 43 ఏళ్ల ఈ ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ 2022 జూలై నుంచి అఫ్గనిస్తాన్ హెడ్ కోచ్‌గా పనిచేస్తున్నాడు. అతడి శిక్షణలోని అఫ్గనిస్తాన్ జట్టు అంతర్జాతీయ క్రికెట్లో పలు చిరస్మరణీయ విజయాలు సాధించింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లాంటి మేటి జట్లను కంగుతినిపించింది.ప్రపంచకప్‌లో తొలిసారి సెమీఫైనల్స్కుఅదే విధంగా.. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన టీ20 ప్రపంచకప్-2024లో అఫ్గనిస్తాన్ తొలిసారి సెమీఫైనల్స్‌కు చేరింది. గతేడాది భారత్‌లో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లోనూ గ్రూప్ దశలో మాజీ చాంపియన్లు ఇంగ్లండ్, పాకిస్తాన్, శ్రీలంక జట్లకు షాక్ ఇచ్చింది. తద్వారా కటాఫ్ సమయానికి ర్యాంకింగ్స్‌లో 8వ స్థానంలో నిలిచిన అఫ్గన్.. చాంపియన్స్ ట్రోఫీ(వన్డే ఫార్మాట్)కి అర్హత సంపాదించింది.కేవలం వన్డేలకు మాత్రమేఅంతేకాదు.. ఇటీవల దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లపై ద్వైపాక్షిక సిరీస్‌లను 2–1తో కైవసం చేసుకుంది. ప్రధాన కోచ్‌గా ట్రాట్ నియామకం తర్వాత అఫ్గన్ జట్టు 14 వన్డేలు, 20 టీ20ల్లో గెలిచింది. ఇలాంటి సానుకూలతల నేపథ్యంలో అఫ్గాన్ బోర్డు ట్రాట్ కాంట్రాక్టును మరో ఏడాది పాటు పొడిగించడం విశేషం. అయితే ఈ దఫా అతడు కేవలం వన్డే ఫార్మాట్‌కు మాత్రమే జట్టుకు అందుబాటులో ఉంటాడు. వ్యక్తిగత కారణాల నేపథ్యంలో కుటుంబంతో గడిపేందుకు టీ20లు, టెస్టులకు జట్టుతో పయనించడు.చదవండి: SA vs PAK: డేవిడ్ మిల్లర్ ఊచకోత.. ఉత్కంఠ పోరులో ఓడిన పాకిస్తాన్ -
పుట్టిన రోజు వేడుకలకూ నోచుకోలేదు
ఈ ఫొటో చూస్తే మీకేమనిపిస్తోంది? ఏదో హెయిరాయిల్ ప్రకటనలా ఉంది కదా! కానీ నిజానికి అదో బర్త్‌డే పార్టీ. అత్యంత రహస్యంగా చేసుకున్న పార్టీ. అందులో పాల్గొన్న అమ్మాయిలంతా ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ముఖాలు కనబడకుండా జాగ్రత్త పడ్డారు. బర్త్‌డే పార్టీ అంత రహస్యంగా చేసుకోవడమెందుకు? వేరే ఏ దేశంలోనైనా అవసరం లేదు. కానీ ఆఫ్గానిస్తాన్‌లో మాత్రం అది అత్యవసరం! తాలిబన్ల పాలనలో అక్కడి మహిళలు, బాలికల దుస్థితికి అద్దం పడుతున్న ఈ ఫొటోను ఇరాన్–కెనడియన్ ఫొటో జర్నలిస్ట్ కియానా హయేరి తీశారు. ఇలాంటి చిత్రాల సమాహారాన్ని ‘నో విమెన్స్ లాండ్’ పేరిట ఈ నెల పారిస్‌లో ప్రదర్శించనున్నారు.ఏడు ప్రావిన్సులు తిరిగి... ఫ్రెంచ్ పరిశోధకురాలు మెలిస్సా కార్నెట్తో హయేరి 2018 నుంచి కలిసి పని చేస్తున్నారు. వారు కొన్నేళ్లుగా అఫ్గాన్‌లోనే ఉంటున్నారు. 2021లో అమెరికా సైన్యం అఫ్గాన్‌ను వీడటం, దేశం తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడం వంటి పరిణామాలకు వాళ్లు ప్రత్యక్ష సాక్షులు. నానాటికీ దిగజారుతున్న పరిస్థితులు వారిని భయపెట్టాయి. మహిళల హక్కులను గౌరవిస్తామని కల్లబొల్లి ప్రతిజ్ఞలు చేసిన తాలిబన్లు చివరికి వాళ్లకు అసలు ప్రజా జీవితమే లేకుండా చేశారు. ప్రాథమిక హక్కులతో సహా సర్వం కాలరాశారు. మహిళల గొంతు వినపడటమే నిషేధం. ముసుగు లేకుండా, మగ తోడు లేకుండా గడప దాటడానికి లేదు! బాలికల చదువుకు పాఠశాల స్థాయితోనే మంగళం పాడారు. బహిరంగ ప్రదేశాల్లో సంగీతం, నృత్యం నిషేధం. అఫ్గాన్ మహిళల దుస్థితిని బయటి ప్రపంచానికి చూపేందుకు హయేరి, కార్నెట్ ఏడు ప్రావిన్సుల్లో పర్యటించారు. ఎంతోమంది మహిళలను కలిశారు.ఆశలకు ప్రతీకలు కూడా... ఎంతసేపు అణచివేత గురించే ఎందుకు చెప్పాలి? అందుకే అఫ్గాన్ బాలికలు, మహిళలకు భవిష్యత్తు మీదున్న ఆశను కూడా హయేరి, కార్నెట్ ఫొటోల్లో బందించారు. తమ చీకటి జీవితాల్లో వెలుగులు నింపే వేడుకలను వాళ్లు జరుపుకొంటున్నారో చెబుతున్నారు. ప్రస్తుతం అఫ్గాన్‌లో బాలికలు, స్త్రీలకు సంబంధించి చిన్న వేడుక అయినా అది నేరుగా తాలిబన్ ప్రభుత్వాన్ని ధిక్కరించడమే. అందుకే బాలికలు పుట్టిన రోజులు, పెళ్లిళ్ల వంటి వేడుకల్లో స్నేహితులను కలుస్తున్నారు. వాటి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇది ప్రమాదాలు తెచ్చి పెడుతుందని తెలిసీ రిస్క్ చేస్తున్నారు. మహిళలు గుర్తింపుకే నోచుకోని చోట ఇలాంటి చిన్న వేడుకైనా పెద్ద ప్రతిఘటనే! చిరునవ్వులు చిదిమేస్తున్న కాలంలో ఆనందాన్ని ప్రదర్శించడం కూడా తిరుగుబాటే. అందుకే నిరసనను వ్యక్తం చేసే ఏ అవకాశాన్నీ మహిళలు వదులుకోవడం లేదంటున్నారు. హయేరి, కార్నెట్.తాలిబన్లలోనూ విభేదాలు!మహిళలను తీవ్రంగా అణచివేయడంపై తాలిబన్లలోనే వ్యతిరేకత పెరుగుతోంది! అతివాది అయిన దేశాధినేత షేక్ హైబతుల్లా అఖుందా జాదా నిర్ణయాలను తాలిబన్లలోనే ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. మంత్రి సిరాజుద్దీన్ హక్కానీ వంటివాళ్లు బాలికలు, యువతుల విద్య కోసం ప్రభుత్వంతో పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో బాలికలకు ఆరో తరగతి తర్వాత కూడా విద్యను అందించే అండర్ గ్రౌండ్ పాఠశాలలపై తాలిబన్లలోని కొన్ని విభాగాలు దృష్టి సారించినట్టు కార్నెట్ పేర్కొన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కేకేఆర్ ఆటగాడి విధ్వంసం.. ధనాధన్ వీరుల జట్టు ఓటమి
అబుదాబీ టీ10 లీగ్‌లో కేకేఆర్ ఆటగాడు రహ్మానుల్లా గుర్బాజ్ విధ్వంసం సృష్టించాడు. ఈ టోర్నీలో యూపీ నవాబ్స్కు నాయకత్వం వహిస్తున్న గుర్బాజ్ (ఆఫ్ఘనిస్తాన్).. డెక్కన్ గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 21 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేశాడు. ఫలితంగా యూపీ నవాబ్స్.. విధ్వంసకర వీరులతో నిండిన గ్లాడియేటర్స్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గ్లాడియేటర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. ధనాధన్ వీరులు టామ్ కొహ్లెర్ కాడ్మోర్ (22), రిలీ రొస్సో (10), నికోలస్ పూరన్ (8), జోస్ బట్లర్ (30), మార్కస్ స్టోయినిస్ (0), డేవిడ్ వీస్ (29), ఆజమ్ ఖాన్ (2) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. నవాబ్స్ బౌలర్లలో ఆదిల్ రషీద్ 2 ఓవర్లలో కేవలం 6 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. బినుర ఫెర్నాండో 2 ఓవర్లలో 18 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. తైమాల్ మిల్స్ 2, అఖిలేశ్ ఓ వికెట్ దక్కించుకున్నారు.113 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నవాబ్స్ 8.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్ (52), ఆవిష్క ఫెర్నాండో (34) నవాబ్స్ విజయానికి గట్టి పునాది వేశారు. ఆండ్రీ ఫ్లెచర్ 7, డేవిడ్ మలాన్ 6, ఓడియన్ స్మిత్ 8 పరుగులు చేశారు. గ్లాడియేటర్స్ బౌలర్లలో రిచర్డ్ గ్లీసన్, స్టోయినిస్, ఇబ్రార్ అహ్మద్‌లకు తలో వికెట్ దక్కింది. ప్రస్తుత ఎడిషన్‌లో నవాబ్స్కు ఇది రెండో విజయం. గ్లాడియేటర్స్‌కు తొలి ఓటమి. కాగా, రెండు రోజుల కిందట జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో కేకేఆర్ ఫ్రాంచైజీ గుర్బాజ్‌ను 2 కోట్ల బేస్ ధరకు తిరిగి సొంతం చేసుకుంది. -
ఒకే ఓవర్లో 5 సిక్సర్లు.. ఆఫ్ఘన్ ఆటగాడి విధ్వంసం
అబుదాబీ టీ10 లీగ్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు హజ్రతుల్లా జజాయ్ విధ్వంసం సృష్టించాడు. ఈ టోర్నీలో బంగ్లా టైగర్స్‌కు ప్రాతనిథ్యం వహిస్తున్న జజాయ్ ఒకే ఓవర్లో 5 సిక్సర్లు బాదాడు. నార్త్రన్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జజాయ్ ఈ ఫీట్‌ను సాధించాడు. వారియర్స్ బౌలర్ అంకుర్ సాంగ్వాన్ జజాయ్ ధాటికి బలయ్యాడు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో ఐదో బంతి మినహా మిగిలిన ఐదు బంతులను జజాయ్ సిక్సర్లుగా మలిచాడు. ఈ మ్యాచ్‌లో జజాయ్ 23 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయమైన 53 పరుగులు చేశాడు. జజాయ్‌తో పాటు మొహమ్మద్ షెహజాద్ (25 బంతుల్లో 54 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా రాణించడంతో నార్త్రన్ వారియర్స్‌పై బంగ్లా టైగర్స్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నార్త్రన్ వారియర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. కొలిన్ మున్రో 28 బంతుల్లో 4 బౌండరీలు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 59 పరుగులు చేశాడు. వారియర్స్ ఇన్నింగ్స్‌లో మున్రో మినహా ఎవరూ రాణించలేదు. బ్రాండన్ కింగ్ (12), జాన్సన్ చార్లెస్ (18) రెండంకెల స్కోర్లు చేశారు. షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ 7, అజ్మతుల్లా 4, జియా ఉర్ రెహ్మాన్ 4 పరుగులు చేసి ఔటయ్యారు. బంగ్లా టైగర్స్ బౌలర్లలో రషీద్ ఖాన్, ఇఫ్తికార్ అహ్మద్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. డేవిడ్ పేన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం 108 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టైగర్స్ 7.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. ప్రస్తుత ఎడిషన్‌లో బంగ్లా టైగర్స్‌కు ఇది వరుసగా రెండో విజయం. -
నాడు బెదిరింపులు, నిషేధానికి గురైన అమ్మాయి..నేడు ప్రపంచమే..!
‘నువ్వు మాట్లాడకూడదు’ అని బెదిరింపులు ఎదుర్కొన్న అమ్మాయి గురించి ఇప్పుడు ప్రపంచం గొప్పగా మాట్లాడుకుంటోంది. ‘నువ్వు ఇంటికే పరిమితం కావాలి’ అనే అప్రకటిత నిషేధానికి గురైన అమ్మాయి గురించి..‘నీలాంటి అమ్మాయి ప్రతి ఇంట్లో ఉండాలి’ అంటున్నారు. అఫ్గానిస్థాన్‌కు చెందిన పదిహేడేళ్ల నీలా ఇబ్రహీమి ప్రతిష్ఠాత్మకమైన ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ పీస్ ప్రైజ్ (కిడ్స్ రైట్స్ ప్రైజ్) గెలుచుకుంది. మహిళలు, బాలికల హక్కుల కోసం బలంగా తన గొంతు వినిపించినందుకు నీలా ‘కిడ్స్ రైట్స్ ప్రైజ్’కు ఎంపికైంది....‘కిడ్స్ రైట్స్’ ఫౌండేషన్ అందించే అంతర్జాతీయ బాలల శాంతి బహుమతి మానవహక్కులు, సామాజిక న్యాయానికి సంబంధించి గణనీయమైన కృషిచేసిన వారికి ఇస్తారు. ప్రపంచవ్యాప్తంగా 47 దేశాల నుంచి 165 మంది నామినీల నుంచి గట్టి పోటీని అధిగమించి ఈ బహుమతికి ఎంపికైంది నీలా ఇబ్రహీమి.‘నీలా ధైర్యసాహసాలకు ముగ్ధులం అయ్యాం’ అన్నారు ‘కిడ్స్ రైట్స్ ఫౌండేషన్’ ఫౌండర్ మార్క్ డల్లార్ట్.లింగ సమానత్వం, అఫ్గాన్ మహిళల హక్కుల పట్ల నీలా పాట, మాట ఆమె అంకితభావం, ప్రతిఘటనకు ప్రతీకలుగా మారాయి. అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత ఊహించినట్లుగానే మహిళల హక్కులను కాలరాయడం మొదలుపెట్టారు. ఆడపిల్లలు ప్రాథమిక పాఠశాలకు మించి చదువుకోకూడదు. మహిళలు మార్కులు, జిమ్, బ్యూటీ సెలూన్లకు వెళ్లడాన్ని నిషేధించారు. మహిళలు ఇల్లు దాటి బయటికి రావాలంటే పక్కన ఒక పురుషుడు తప్పనిసరిగా ఉండాల్సిందే. దీనికితోడు కొత్త నైతిక చట్టం మహిళల బహిరంగ ప్రసంగాలపై నిషేధం విధించింది. ఈ పరిస్థితినిఐక్యరాజ్యసమితి ‘లింగ వివక్ష’గా అభివర్ణించింది. తాలిబన్ ప్రభుత్వం మాత్రం ఇది నిరాధారమని, దుష్ప్రచారం అని కొట్టి పారేసింది. మహిళల హక్కులపై తాలిబన్ల ఉక్కుపాదం గురించి నీలా పాడిన శక్తిమంతమైన నిరసన పాట సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ పాట అఫ్గాన్ సమాజంపై చూపిన ప్రభావం ఇంతా అంతా కాదు. నీలా ‘ఐయామ్ మైసాంగ్’ మూవ్మెంట్ మహిళల హక్కులపై గొంతు విప్పడానికి ఎంతోమందికి స్ఫూర్తినీ, ధైర్యాన్ని ఇచ్చింది.‘నేను చేసిన పని రిస్క్‌తో కూడుకున్నది. అది అత్యంత ప్రమాదకరమైనదని కూడా. అయితే ఆ సమయంలో నాకు అదేమీ తెలియదు. ఎందుకంటే అప్పుడు నా వయసు పద్నాలుగు సంవత్సరాలు మాత్రమే’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంటుంది నీలా. ‘అంతర్జాతీయ బాలల శాంతి బహుమతిని గెలుచుకోవడం అంటే అఫ్గాన్ మహిళలు, బాలికల గొంతు ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించడం. తాలిబన్ల ΄పాలనలో అనూహ్యమైన సవాళ్లను ఎదుర్కొంటున్న మహిళల హక్కుల కోసం పోరాడాను. పోరాడుతూనే ఉంటాను’ అంటూ పురస్కార ప్రదానోత్సవంలో మాట్లాడింది నీలా.నీలా పట్ల అభిమానం ఇప్పుడు అఫ్గాన్ సరిహద్దులు దాటింది. అంతర్జాతీయ స్థాయిలో ఆమెకు అభిమానులు ఉన్నారు. అఫ్గాన్‌ను విడిచిన నీలా ఇబ్రహీమి ‘30 బర్డ్స్ ఫౌండేషన్’ సహాయంతో కుటుంబంతో కలిసి కెనడాలో నివసిస్తుంది. ‘నేను నా కొత్త ఇంట్లో సురక్షితంగా ఉన్నాను. అయితే అఫ్గానిస్తాన్‌లో ఉన్న అమ్మాయిల గురించి ఎప్పుడూ ఆలోచిస్తుంటాను. ప్రపంచంలో ఏ ్ర΄ాంతంలో మహిళల హక్కులు దెబ్బతిన్నా అది యావత్ ప్రపంచంపై ఏదో ఒకరకంగా ప్రభావం చూపుతుంది’ అంటుంది నీలా. ‘హర్ స్టోరీ’ కో–ఫౌండర్‌గా అఫ్గానిస్థాన్‌లోని అమ్మాయిలు తమ గొంతు ధైర్యంగా వినిపించడానికి ప్రోత్సాహాన్ని ఇస్తోంది.అఫ్గాన్‌లో మహిళా విద్య, హక్కులకు సంబంధించి జెనీవా సమ్మిట్ ఫర్ హ్యూమన్ రైట్స్ అండ్ డెమోక్రసీ. యూకే హౌజ్ ఆఫ్ లార్డ్స్, కెనడియన్ ఉమెన్ ఫర్ ఉమెన్ ఆఫ్ అఫ్గానిస్థాన్ మాంట్రియల్ సమ్మిట్, టెడ్ వాంకూవర్లాంటి వివిధ కార్యక్రమాలలో తన గళాన్ని వినిపించిన నీలా ఇబ్రహీమీ పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలాతో కలిసి పనిచేస్తోంది. -
ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్ పాలన.. భారత్‌లో కీలక పరిణామం
ఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ పాలనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తొలిసారిగా భారత్‌లోని ముంబై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఆప్ఘనిస్థాన్ దౌత్యవేత్త కార్యాలయం (కాన్సులేట్) తాత్కాలిక రాయబారిగా విద్యార్థి ఇక్రముద్దీన్ కమిల్ నియమితులయ్యారు. 2021లో ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే తాలిబన్ పాలనను కేంద్రం వ్యతిరేకించింది. భారత్‌లో ఆప్ఘనిస్థాన్ కాన్సులేట్ రాయబారుల్ని వెనక్కి పంపింది. మూడేళ్ల తర్వాత తాజాగా భారత్‌లోని ఆప్ఘనిస్థాన్ కాన్సులేట్ రాయబారిగా ఇక్రముద్దీన్ కమిల్‌ను తాలిబన్ ప్రభుత్వం నియమించినట్లు తెలుస్తోంది. ఈ నియామకంపై కేంద్రం వివరణ ఇవ్వాల్సి ఉంది. -
సెంచరీ చేజార్చుకున్న మహ్మదుల్లా.. బంగ్లాదేశ్ స్కోర్ ఎంతంటే..?
షార్జా వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. 72 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్‌ను మెహిది హసన్ మీరాజ్ (119 బంతుల్లో 66; 4 ఫోర్లు), మహ్మదుల్లా (98 బంతుల్లో 98; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆదుకున్నారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 145 పరుగులు జోడించి తమ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. మహ్మదుల్లా ఇన్నింగ్స్ చివరి బంతికి రనౌటై సెంచరీ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. బంగ్లా ఇన్నింగ్స్‌లో తంజిద్ హసన్ 19, సౌమ్య సర్కార్ 24, జకీర్ హసన్ 4, తౌహిద్ హృదోయ్ 7, జాకెర్ అలీ 1, నసుమ్ అహ్మద్ 5 పరుగులు చేసి ఔటయ్యారు. ఆఫ్ఘన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ నాలుగు వికెట్లు తీసి 37 పరుగులిచ్చాడు. ఇవి అతని వన్డే కెరీర్లో అత్యుత్తమ గణంకాలు. మహ్మద్ నబీ, రషీద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ వన్డే సిరీస్‌లో ఆఫ్ఘనిస్తాన్ తొలి మ్యాచ్.. బంగ్లాదేశ్ రెండో మ్యాచ్‌లో గెలుపొందాయి. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. -
AFG Vs BAN: రాణించిన మొహమ్మద్ నబీ.. బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే..?
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా షార్జా వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. షార్జా స్టేడియంలో ఇది 300వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. క్రికెట్ చరిత్రలో ఏ స్టేడియం కూడా 300 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వలేదు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 49.4 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌటైంది. బంగ్లాదేశ్ బౌలర్లు తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ తలో నాలుగు వికెట్లు పడగొట్టి ఆఫ్ఘనిస్తాన్‌ను దెబ్బకొట్టారు. షొరీఫుల్ ఇస్లాం ఓ వికెట్ దక్కించుకున్నాడు.రాణించిన నబీ, షాహిది71 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్‌ను మొహమ్మద్ నబీ, హష్మతుల్లా షాహిది ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 104 పరుగులు జోడించారు. షాహీది 92 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 52 పరుగులు చేసి ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. మొహమ్మద్ నబీ 79 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేసి ఔటయ్యాడు.ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో రహ్మానుల్లా గుర్బాజ్ 5, సెదికుల్లా అటల్ 21, రహ్మత్ షా 2, అజ్మతుల్లా ఒమర్జాయ్ 0, గుల్బదిన్ నైబ్ 22, రషీద్ ఖాన్ 10, ఖరోటే 27 (నాటౌట్), అల్లా ఘజన్ఫర్ 0, ఫజల్ హక్ ఫారూకీ 0 పరుగులు చేశారు. ఇన్నింగ్స్ ఆఖర్లో నబీ, ఖరోటే వేగంగా ఆడటంతో ఆఫ్ఘన్లు గౌరవప్రదమైన స్కోర్ చేశారు.అనంతరం 236 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 8 ఓవర్లలో వికెట్ నష్టానికి 39 పరుగులు చేసింది. తంజిద్ హసన్ 3 పరుగులు చేసి ఔట్ కాగా.. సౌమ్య సర్కార్ 28, నజ్ముల్ హసన్ షాంటో 6 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. అల్లా ఘజన్ఫర్కు తంజిద్ వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గెలవాలంటే 42 ఓవర్లలో మరో 197 పరుగులు చేయాల్సి ఉంది. -
ఆసియా కప్ 2024 విజేతగా ఆఫ్ఘనిస్తాన్
ఏసీసీ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ టీ20 టోర్నీ విజేతగా ఆఫ్ఘనిస్తాన్-ఏ జట్టు అవతరించింది. నిన్న (అక్టోబర్ 27) జరిగిన ఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్-ఏ శ్రీలంక-ఏపై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 133 పరుగులు మాత్రమే చేయగలిగింది. బిలాల్ సమీ (4-0-22-3), అల్లా ఘజన్ఫర్ (4-0-14-2) అద్భుతంగా బౌలింగ్ చేసి శ్రీలంకను కట్టడి చేశారు.THE HISTORIC MOMENT. - Afghanistan wins the Emerging Asia Cup. 🥶pic.twitter.com/vwiX4xaE6o— Mufaddal Vohra (@mufaddal_vohra) October 27, 2024శ్రీలంక ఇన్నింగ్స్‌లో సహన్ అరచ్చిగే (64 నాటౌట్) అజేయ అర్ద సెంచరీతో రాణించగా.. పవన్ రత్నాయకే (20), నిమేశ్ విముక్తి (23) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. యశోధ లంక (1), లహీరు ఉదార (5), నువనిదు ఫెర్నాండో (4), అహన్ విక్రమసింఘే (4), రమేశ్ మెండిస్ (0) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. దుషన్ హేమంత 6 పరుగులతో అజేయంగా నిలిచాడు. పవన్ రత్నాయకే, నిమేశ్ విముక్తి రనౌటయ్యారు. THE CELEBRATIONS OF AFGHANISTAN TEAM WITH EMERGING ASIA CUP TROPHY..!!! 🏆- A Historic Moments for Afghanistan Cricket History. 🇦🇫 pic.twitter.com/NctY2q9yvO— Tanuj Singh (@ImTanujSingh) October 27, 2024అనంతరం 134 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్ 18.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీయాలకు చేరింది. సెదికుల్లా అటల్ (55 నాటౌట్) అజేయ అర్ద సెంచరీతో ఆఫ్ఘనిస్తాన్‌ను గెలిపించాడు. అతనికి కరీం జనత్ (33), కెప్టెన్ దర్విష్ రసూలీ (24), మహ్మద్ ఇషాక్ (16 నాటౌట్) సహకరించారు. Happy team, Happy moments to cherish 👏pic.twitter.com/Cmhas0L9zY— CricTracker (@Cricketracker) October 27, 2024లంక బౌలర్లలో సహన్ అరచ్చిగే, దుషన్ హేమంత, ఎషాన్ మలింగ తలో వికెట్ పడగొట్టారు. ఫైనల్లో అద్భుతమైన స్పెల్‌తో (4-0-14-2) శ్రీలంకను కట్టడి చేసిన అల్లా ఘజన్ఫర్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. టోర్నీ ఆధ్యంతం అద్భుతంగా రాణించిన సెదికుల్లా అటల్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా ఎంపికయ్యాడు. -
Asia Cup 2024 Final: ఆఫ్ఘనిస్తాన్ టార్గెట్ 134 రన్స్
ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ టీ20 టోర్నీ ఫైనల్లో ఇవాళ (అక్టోబర్ 27) శ్రీలంక-ఏ, ఆఫ్ఘనిస్తాన్-ఏ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు బిలాల్ సమీ (4-0-22-3), అల్లా ఘజన్ఫర్ (4-0-14-2) సత్తా చాటడంతో శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 133 పరుగులు మాత్రమే చేయగలిగింది.శ్రీలంక ఇన్నింగ్స్‌లో సహన్ అరచ్చిగే (64 నాటౌట్) అజేయ అర్ద సెంచరీతో రాణించగా.. పవన్ రత్నాయకే (20), నిమేశ్ విముక్తి (23) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. యశోధ లంక (1), లహీరు ఉదార (5), నువనిదు ఫెర్నాండో (4), అహన్ విక్రమసింఘే (4), రమేశ్ మెండిస్ (0) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. దుషన్ హేమంత 6 పరుగులతో అజేయంగా నిలిచాడు. పవన్ రత్నాయకే, నిమేశ్ విముక్తి రనౌటయ్యారు. అనంతరం 134 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్ 8 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. జుబైద్ అక్బరీ (0), కెప్టెన్ దర్విష్ రసూలీ (24) ఔట్ కాగా.. సెదికుల్లా అటల్ (19), కరీం జనత్ (2) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ గెలవాంటే మరో 72 బంతుల్లో 87 పరుగులు చేయాలి. -
బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్.. ఆఫ్ఘనిస్తాన్ జట్టు ప్రకటన
షార్జా వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఇవాళ (అక్టోబర్ 23) ప్రకటించారు. ఈ జట్టుకు హష్మతుల్లా షాహిదీ కెప్టెన్‌గా కొనసాగనుండగా.. రహ్మత్ షా వైస్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. నవంబర్ 6, 9, 11 తేదీల్లో ఈ వన్డే సిరీస్ జరుగనుంది.ముజీబ్ ఔట్.. నూర్ అహ్మద్ ఇన్ఈ సిరీస్ కోసం ఆఫ్ఘన్ సెలెక్టర్లు కొత్తగా ఇద్దరిని ఎంపిక చేశారు. గాయాల బారిన పడిన ఇబ్రహీం జద్రాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాల్లో సెడిఖుల్లా అటల్, నూర్ అహ్మద్ జట్టులోకి వచ్చారు. కాగా, ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఇటీవల సౌతాఫ్రికాపై సిరీస్ విజయం (వన్డే) సాధించిన విషయం తెలిసిందే. షార్జాలో జరిగిన ఆ సిరీస్‌లో ఆఫ్ఘన్లు 2-1 తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేశారు. ఐసీసీ టాప్-5 ర్యాంక్ టీమ్‌పై ఆఫ్ఘనిస్తాన్‌కు ఇది తొలి సిరీస్ విజయం.బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు ఆఫ్ఘనిస్తాన్ జట్టు..హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), రహ్మత్ షా (వైస్ కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్, ఇక్రమ్ అలీఖిల్, అబ్దుల్ మాలిక్, రియాజ్ హసన్, సెడిఖుల్లా అటల్, దర్విష్ రసూలీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, రషీద్ ఖాన్, నంగ్యల్ ఖరోటీ, నూర్ అహ్మద్, ఫజల్ హక్ ఫారూఖీ, బిలాల్ సమీ, నవీద్ జద్రాన్, ఫరీద్ అహ్మద్ మాలిక్.చదవండి: న్యూజిలాండ్ టీమ్‌కు కొత్త కెప్టెన్ -
#RashidKhanMarriage : వైరలవుతున్న స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ పెళ్లి (ఫొటోలు)
-
వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్
ఆఫ్ఘనిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. రషీద్ వివాహం నిన్న (అక్టోబర్ 3) రాత్రి ఆఫ్ఘన్ రాజధాని కాబుల్‌లో జరిగింది. పష్తూన్ సంప్రదాయం ప్రకారం రషీద్ పెళ్లి చేసుకున్నాడు. రషీద్ వివాహ కార్యక్రమానికి ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు సీఈవో నసీబ్ ఖాన్ సహా చాలా మంది స్వదేశీ క్రికెటర్లు హాజరయ్యారు. Historical Night 🌉 Kabul is hosting the wedding ceremony of the prominent Afghan cricket star and our CAPTAIN 🧢 Rashid Khan 👑 🇦🇫 @rashidkhan_19Rashid Khan 👑 and his three brother got married at same day.Wishing him a and his thee brother happy and healthy life ahead! pic.twitter.com/YOMuyfMMXP— Afghan Atalan 🇦🇫 (@AfghanAtalan1) October 3, 2024రషీద్‌తో పాటు అతని ముగ్గురు సోదరులకు ఒకే సారి వివాహం జరిగినట్లు తెలుస్తుంది. రషీద్ పెళ్లి ఫోటోలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. రషీద్ వివాహ వేదిక వద్ద కొందరు తుపాకులు పట్టుకుని పహారా కాస్తూ కనిపించారు. ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది.Scenes outside the hotel which is hosting Rashid Khan's wedding in Kabul. pic.twitter.com/LIpdUYVZcA— Mufaddal Vohra (@mufaddal_vohra) October 3, 202426 ఏళ్ల రషీద్‌కు ప్రపంచంలో మేటి స్పిన్నర్‌గా పేరుంది. రషీద్ పొట్టి క్రికెట్లో తిరుగులేని బౌలర్‌గా చలామణి అవుతున్నాడు. రషీద్ విశ్వవ్యాప్తంగా జరిగే ప్రతి లీగ్‌లో పాల్గొంటాడు. టీ20ల్లో రషీద్ సెకెండ్ లీడింగ్ వికెట్ టేకర్‌గా (613 వికెట్లు) కొనసాగుతున్నాడు. Congratulations to the one and only King Khan, Rashid Khan, on your wedding! Wishing you a lifetime of love, happiness, and success ahead.@rashidkhan_19 pic.twitter.com/fP1LswQHhr— Mohammad Nabi (@MohammadNabi007) October 3, 2024రషీద్ ఆఫ్ఘనిస్తాన్ తరఫున 5 టెస్ట్‌లు, 105 వన్డేలు, 93 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో రషీద్ 376 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ రషీద్ 121 మ్యాచ్‌లు ఆడి 149 వికెట్లు తీశాడు. రషీద్ ఖాతాలో ఐదు వన్డే హాఫ్ సెంచరీలు, ఓ టెస్ట్ హాఫ్ సెంచరీ ఉన్నాయి.The wedding hall that will host Rashid Khan’s wedding ceremony in Kabul, Afghanistan today 🔥#ACA pic.twitter.com/FOM2GCkqZw— Afghan Cricket Association - ACA (@ACAUK1) October 2, 2024Black is the ultimate style statement. Congratulations Mr. Magician @rashidkhan_19 🎉🎊 pic.twitter.com/KlMYqzpJ32— Wazhma Ayoubi 🇦🇫 (@WazhmaAyoubi) October 3, 2024 -
CT: మాతో పాటు టీమిండియా.. సెమీస్ చేరే జట్లు ఇవే: అఫ్గన్ కెప్టెన్
ICC Champions Trophy 2025: వచ్చే ఏడాది చాంపియన్స్ ట్రోఫీ రూపంలో మరో క్రేజీ ఈవెంట్ క్రికెట్ ప్రేమికులను అలరించనుంది. దాదాపు ఏడేళ్ల రీఎంట్రీ ఇవ్వనున్న ఈ ఐసీసీ టోర్నీ పాకిస్తాన్లో జరుగనుంది. 2017లో ట్రోఫీ గెలిచిన పాక్.. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది.అఫ్గనిస్తాన్ చేతిలో తొలి ఓటమిఅయితే, గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్-2023లో బాబర్ ఆజం జట్టు చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న విషయం తెలిసిందే. భారత్ వేదికగా జరిగిన ఈ మెగా ఈవెంట్లో కనీసం సెమీస్ కూడా చేరకుండానే పాక్ నిష్క్రమించింది. అంతేకాదు.. తమ వన్డే చరిత్రలో మొట్టమొదటిసారి అఫ్గనిస్తాన్ చేతిలో ఓటమిని చవిచూసింది.పొట్టి వరల్డ్‌కప్‌లో మరీ ఘోరంగాఈ నేపథ్యంలో దారుణ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ బాబర్ తన కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. అయితే, టీ20 ప్రపంచకప్-2024కు ముందు మళ్లీ పాకిస్తాన్ పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టు కెప్టెన్‌గా వన్డే, టీ20 జట్ల పగ్గాలు చేపట్టాడు. కానీ పొట్టి వరల్డ్‌కప్‌లో మరీ ఘోరంగా.. పసికూన అమెరికా చేతిలో ఓడి.. సూపర్-8కు కూడా చేరకుండానే పాక్ ఇంటిబాట పట్టడం గమనార్హం.సంచలన విజయాలతో అఫ్గన్ సెమీ ఫైనల్కుమరోవైపు.. అఫ్గనిస్తాన్ సంచలన విజయాలతో ఏకంగా సెమీ ఫైనల్‌కు చేరడం విశేషం. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దిగ్గజ జట్లకు షాకిచ్చి టాప్-4లో నిలిచింది. అయితే, సెమీస్‌లో సౌతాఫ్రికా చేతిలో ఓడి టోర్నీ నుంచి వైదొలిగినా.. ఆసాంతం అద్భుత ప్రదర్శనతో ప్రశంసలు అందుకుంది.చాంపియన్‌గా చాంపియన్గాఇక ఈ పొట్టి వరల్డ్‌కప్ ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి.. టీమిండియా చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ టోర్నమెంట్ తర్వాత జరుగబోయే తొలి ఐసీసీ ఈవెంట్ కాబట్టి చాంపియన్స్ ట్రోఫీ పైనే అందరి దృష్టి నెలకొంది. ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్ వన్డే జట్టు కెప్టెన్ హష్మతుల్లా షాహిది ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.సెమీస్ చేరే జట్లు ఇవేచాంపియన్స్ట్రోఫీ-2025 సెమీ ఫైనల్ చేరే జట్లు ఇవేనంటూ అఫ్గనిస్తాన్‌తో పాటు.. వన్డే ప్రపంచకప్-2023 విజేత ఆస్ట్రేలియా, రన్నరప్ ఇండియా, మాజీ చాంపియన్ ఇంగ్లండ్ పేర్లను చెప్పాడు. గత కొన్నాళ్లుగా వరుస వైఫల్యాలతో చతికిల పడ్డ ఆతిథ్య పాకిస్తాన్ పేరును షాహిది పక్కనపెట్టడం గమనార్హం. కాగా అఫ్గన్ ఇటీవలే తొలిసారిగా సౌతాఫ్రికాపై వన్డే విజయం సాధించడంతో పాటు సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న జోష్‌లో ఉంది.ఇదిలా ఉంటే.. వచ్చే ఫిబ్రవరిలో జరుగనున్న చాంపియన్స్‌ట్రోఫీ కోసం టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్తుందా? లేదా? అన్న అంశంపై ఇంత వరకు స్పష్టత రాలేదు. తమకు తటస్థ వేదికలు కేటాయించాలని బీసీసీఐ కోరగా.. ఐసీసీ నుంచి ఇంత వరకు ఎలాంటి హామీ రాలేదని సమాచారం.చదవండి: Ind vs Ban: అతడికి రెస్ట్.. టీమిండియాలోకి ఇషాన్ ఎంట్రీ! -
ఇరగదీస్తున్న ఆసియా దేశాలు.. ఒక్క పాక్ మినహా..!
ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో ఆసియా దేశాలైన భారత్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ ఇరగదీస్తున్నాయి. టెస్ట్ హోదా కలిగిన ఐదు దేశాల్లో ఒక్క పాక్ మినహా మిగతా నాలుగు దేశాలు అద్భుత విజయాలు సాధిస్తున్నాయి. వీటిలో భారత్ తిరుగులేని శక్తిగా దూసుకుపోతుండగా.. ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. భారత్ ప్రత్యర్ధి ఎవరైనా చీల్చిచెండాడుతుండగా.. మిగతా మూడు దేశాలు తమకంటే మెరుగైన ప్రత్యర్ధులకు చుక్కలు చూపిస్తున్నాయి.భారత్ విషయానికొస్తే.. శ్రీలంక చేతిలో ఇటీవల వన్డే సిరీస్‌లో పరాజయం మినహా టీమిండియా అపజయమనేదే ఎరుగదు. టీ20 వరల్డ్‌కప్‌లో జగజ్జేతగా అవతరించిన అనంతరం భారత్ ఎదుర్కొన్న తొలి సిరీస్ పరాజయం అది.శ్రీలంక విషయానికొస్తే.. ఈ ద్వీప దేశం ఇటీవలికాలంలో మెరుగైన క్రికెట్ ఆడుతుంది. కొత్త కోచ్ సనత్ జయసూర్య ఆథ్వర్యంలో ఈ జట్టు సంచలన విజయాలు సాధిస్తుంది. భారత్‌పై మూడు మ్యాచ్ సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. అనంతరం ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయినప్పటికీ.. చివరి టెస్ట్‌లో అబ్బురపడే విజయాన్ని సాధించింది. తాజాగా శ్రీలంక స్వదేశంలో న్యూజిలాండ్‌కు తొలి టెస్ట్‌లో షాకిచ్చింది. ఇవాళ (సెప్టెంబర్ 23) ముగిసిన మ్యాచ్‌లో శ్రీలంక 63 పరుగుల తేడాతో కివీస్‌ను చిత్తు చేసింది.ఆఫ్ఘనిస్తాన్ విషయానికొస్తే.. ఒకప్పటి క్రికెట్ పసికూన ఇప్పుడు సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఈ జట్టు 2023 వన్డే వరల్డ్‌కప్ నుంచి హేమీహేమీ జట్లన్నిటికీ షాకిస్తూ లెజెండ్ కిల్లర్‌గా మారింది. టీ20 వరల్డ్‌కప్‌లో సెమీఫైనల్ వరకు చేరిన ఆఫ్ఘన్లు.. అక్కడ సౌతాఫ్రికా చేతిలో ఎదురైన పరాభవానికి తాజాగా ప్రతీకారం తీర్చుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ తాజాగా సౌతాఫ్రికాతో ముగిసిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుని సంచలనం సృష్టించింది.బంగ్లాదేశ్ విషయానికొస్తే.. తమదైన రోజున ఈ జట్టు ఆటగాళ్లను ఎంత మాత్రం తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. బంగ్లాదేశ్ ఇటీవల పాక్‌లో పర్యటించి ఆతిథ్య దేశాన్నే 2-0 తేడాతో (టెస్ట్ సిరీస్‌లో) మట్టికరిపించింది. తాజాగా బంగ్లాదేశ్ పటిష్టమైన టీమిండియా చేతిలో ఓడింది కాని, ప్రదర్శన ప్రకారం పర్వాలేదనిపించింది. చదవండి: ఐదేసిన జయసూర్య.. న్యూజిలాండ్‌ను ఖంగుతినిపించిన శ్రీలంక -
క్లీన్ స్వీప్ పరాభవం తప్పించుకున్న సౌతాఫ్రికా
షార్జా వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను సౌతాఫ్రికా 1-2 తేడాతో కోల్పోయింది. నిన్న (సెప్టెంబర్ 22) జరిగిన నామమాత్రపు మూడో వన్డేలో సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా ఆఫ్ఘన్ల చేతిలో క్లీన్ స్వీప్ పరాభవం నుంచి తప్పించుకుంది. రెండో వన్డేలో సెంచరీ హీరో ఈ మ్యాచ్‌లో కూడా రాణించినప్పటికీ.. ఆఫ్ఘనిస్తాన్‌కు పరాజయం తప్పలేదు. తొలుత బౌలర్లు.. ఆతర్వాత మార్క్రమ్ నిలకడగా ఆడి సౌతాఫ్రికాకు ఎట్టకేలకే ఓ విజయాన్ని అందించారు.Afghanistan wins the ODI series against South Africa. 🇦🇫 pic.twitter.com/ddmwyc4Akd— Mufaddal Vohra (@mufaddal_vohra) September 22, 2024ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. 34 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. రహ్మానుల్లా గుర్బాజ్ మరో మంచి ఇన్నింగ్స్‌తో (89) ఆఫ్ఘనిస్తాన్‌కు చెప్పుకోదగ్గ స్కోర్ అందించాడు. గుర్బాజ్ మినహా ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో ఏ ఒక్కరూ రాణించలేదు. అల్లా ఘజన్ఫర్ (31), షాహిది (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి, నకాబా పీటర్, ఫ్లెహ్లుక్వాయో తలో మూడు వికెట్లు పడగొట్టగా.. ఫోర్టుయిన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.Rahmanullah Gurbaz scored 89 (94) out of Afghanistan's 169 total.- The lone warrior of Afghans tonight! 👏pic.twitter.com/pQQIQzm1aC— Mufaddal Vohra (@mufaddal_vohra) September 22, 2024అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. 33 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఎయిడెన్ మార్క్రమ్ (69 నాటౌట్), ట్రిస్టన్ స్టబ్స్ (26 నాటౌట్) ప్రొటీస్‌ను విజయతీరాలకు చేర్చారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో టోనీ జోర్జీ 26, బవుమా 22, రీజా హెండ్రిక్స్ 18 పరుగులు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో ఘజన్ఫర్, నబీ, అహ్మద్ మాలిక్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో 89 పరుగులు చేయడంతో పాటు రెండో వన్డేలో రికార్డు సెంచరీ చేసిన గుర్బాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్ అవార్డులు లభించాయి.చదవండి: రసవత్తరంగా సాగుతున్న న్యూజిలాండ్, శ్రీలంక టెస్ట్ మ్యాచ్ -
సౌతాఫ్రికాతో రెండో వన్డే.. శతక్కొట్టిన గుర్బాజ్.. ఆఫ్ఘనిస్తాన్ భారీ స్కోర్
షార్జా వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ యువ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ మెరుపు సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో 110 బంతులు ఎదుర్కొన్న గుర్బాజ్ 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 105 పరుగులు చేశాడు. గుర్బాజ్‌కు వన్డేల్లో ఇది ఏడో సెంచరీ. ఈ సెంచరీతో గుర్బాజ్ వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. అలాగే సౌతాఫ్రికాపై వన్డేల్లో తొలి సెంచరీ చేసిన ఆటగాడిగానూ రికార్డు నెలకొల్పాడు. Aggression 🔥pic.twitter.com/TjTAiRuM3S— CricTracker (@Cricketracker) September 20, 202499 పరుగుల వద్ద ఒక్క పరుగు కోసం తెగ ఇబ్బంది పడిన గుర్బాజ్.. మార్క్రమ్ బౌలింగ్‌లో బౌండరీ బాది రికార్డు శతకం సాధించాడు. గుర్బాజ్ కేవలం 42 వన్డేల్లో 5 హాఫ్ సెంచరీలతో పాటు 7 సెంచరీలు చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్ భారీ స్కోర్ చేసింది. ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. గుర్బాజ్ సెంచరీతో చెలరేగగా.. రహ్మత్ షా (50), అజ్మతుల్లా ఒమర్జాయ్ (86 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. రియాజ్ హస్సన్ 29, మొహమ్మద్ నబీ 13 పరుగులు చేసి ఔటయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి, నండ్రే బర్గర్, నకాబా పీటర్, మార్క్రమ్ తలో వికెట్ తీశారు.కాగా, షార్జా వేదికగా ఆఫ్ఘనిస్తాన్-సౌతాఫ్రికా జట్లు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో పోటీపడుతున్నాయి. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయం సాధించింది. వన్డేల్లో ఆఫ్ఘన్లకు సౌతాఫ్రికాపై ఇదే తొలి విజయం. మూడో వన్డే సెప్టెంబర్ 22న జరుగనుంది. చదవండి: IND VS BAN 1st Test: తప్పు చేసిన విరాట్ కోహ్లి -
సౌతాఫ్రికాపై సంచలన విజయం.. చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్
వన్డే క్రికెట్లో ఆఫ్ఘనిస్తాన్ సీనియర్ ప్లేయర్ మొహమ్మద్ నబీ చరిత్ర సృష్టించాడు. 46 దేశాలపై విజయాల్లో భాగమైన తొలి క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. నిన్న షార్జాలో జరిగిన వన్డే మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయం సాధించింది. ఈ గెలుపుతో నబీ ఖాతాలో ఈ భారీ రికార్డు చేరింది.నబీ విజయాలు సాధించిన 46 దేశాలు..డెన్మార్క్, బహ్రెయిన్, మలేషియా, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, ఇరాన్, థాయిలాండ్, జపాన్, బహామాస్, బోట్స్వానా, జెర్సీ, ఫిజి, టాంజానియా, ఇటలీ, అర్జెంటీనా, పపువా న్యూ గినియా, కేమాన్ దీవులు, ఒమన్, చైనా, సింగపూర్, పాకిస్థాన్, ట్రినిడాడ్ మరియు టొబాగో, యూఎస్ఏ, భూటాన్, మాల్దీవులు, బార్బడోస్, ఉగాండా, బెర్ముడా, ఐర్లాండ్, స్కాట్లాండ్, నమీబియా, నెదర్లాండ్స్, కెనడా, కెన్యా, హాంకాంగ్, యూఏఈ, జింబాబ్వే, వెస్టిండీస్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాసౌతాఫ్రికాపై తొలి విజయంషార్జా వేదికగా నిన్న (సెప్టెంబర్ 18) జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ 6 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాపై సంచలన విజయం సాధించింది. వన్డేల్లో ఆఫ్ఘనిస్తాన్‌కు సౌతాఫ్రికాపై ఇది తొలి విజయం.SENA దేశాలపై విజయాలుఈ గెలుపుతో ఆఫ్ఘనిస్తాన్ SENA (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాలన్నిటిపై (వన్డేల్లో) విజయాలు సాధించినట్లైంది.ఏడాదికాలంగా సంచలనాలు..ఆఫ్ఘనిస్తాన్ జట్టు గతేడాది కాలంగా ఫార్మాట్లకతీతంగా సంచలన విజయాలు సాధిస్తుంది. 2023 వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్, పాకిస్తాన్, శ్రీలంకపై విజయాలు సాధించిన ఆఫ్ఘనిస్తాన్.. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ లాంటి జట్లకు షాకిచ్చి ఏకంగా సెమీస్‌కు చేరింది.భారత్ మినహా..ఇటీవలికాలంలో పెద్ద జట్లన్నిటికీ షాక్ ఇస్తున్న ఆఫ్ఘనిస్తాన్.. ఒక్క భారత్ మినహా అన్ని ఐసీసీ ఫుల్ మెంబర్ దేశాలపై విజయాలు సాధించింది.మ్యాచ్ విషయానికొస్తే.. నిన్నటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. 33.3 ఓవర్లలో 106 పరుగులకు కుప్పకూలింది. ఫజల్ హక్ ఫారూకీ 4, ఘజనఫర్ 3, రషీద్ ఖాన్ 2 వికెట్లు తీసి సౌతాఫ్రికా పతనాన్ని శాశించారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో కేవలం నలుగురు (వియాన్ ముల్దర్ (52), ఫోర్టుయిన్ (16), టోని డి జోర్జీ (11), వెర్రిన్ (10)) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ 26 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. అజ్మతుల్లా ఒమర్జాయ్ (25), గుల్బదిన్ నైబ్ (34) అజేయ ఇన్నింగ్స్‌లతో ఆఫ్ఘనిస్తాన్‌ను విజయతీరాలకు చేర్చారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఫోర్టుయిన్ 2, ఎంగిడి, మార్క్రమ్ తలో వికెట్ పడగొట్టారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే సెప్టెంబర్ 20న జరుగనుంది. చదవండి: శతక్కొట్టిన కమిందు మెండిస్.. శ్రీలంక తొలి ప్లేయర్‌గా.. -
వన్డే క్రికెట్లో పెను సంచలనం
వన్డే క్రికెట్లో పెను సంచలనం నమోదైంది. పసికూనగా చెప్పుకునే ఆఫ్ఘనిస్తాన్ పటిష్ట జట్టు సౌతాఫ్రికాకు ఊహించని షాక్ ఇచ్చింది. షార్జా వేదికగా నిన్న (సెప్టెంబర్ 18) జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ 6 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. వన్డేల్లో ఆఫ్ఘనిస్తాన్‌కు సౌతాఫ్రికాపై ఇది తొలి విజయం. ఈ గెలుపుతో ఆఫ్ఘనిస్తాన్ SENA (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాలన్నిటిపై (వన్డేల్లో) విజయాలు నమోదు చేసినట్లైంది. ఈ విజయాలన్ని కూడా గత ఏడాదికాలంలోనే సాధించనవి కావడం విశేషం. ఇటీవలికాలంలో ఫార్మాట్లకతీతంగా అద్భుతాలు (2023 వన్డే వరల్డ్‌కప్‌లో సంచలన విజయాలు, 2024 టీ20 వరల్డ్‌కప్‌లో సెమీఫైనల్స్) చేస్తున్న ఆఫ్ఘనిస్తాన్.. ఒక్క భారత్ మినహా అన్ని ఐసీసీ ఫుల్ మెంబర్ దేశాలపై విజయాలు సాధించింది.THE WINNING MOMENT FOR AFGHANISTAN VS SOUTH AFRICA. 🇦🇫- What a time for Afghan cricket, they're one of the best currently! 💯pic.twitter.com/SZ8LIplppT— Mufaddal Vohra (@mufaddal_vohra) September 18, 2024మ్యాచ్ విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్, సౌతాఫ్రికా జట్లు షార్జా వేదికగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తలపడుతున్నాయి. ఇందులో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ సౌతాఫ్రికాపై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. 33.3 ఓవర్లలో 106 పరుగులకు కుప్పకూలింది. ఫజల్ హక్ ఫారూకీ 4, ఘజన్ఫర్ 3, రషీద్ ఖాన్ 2 వికెట్లు తీసి సౌతాఫ్రికా పతనాన్ని శాశించారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో కేవలం నలుగురు మాత్రమే రెండంకెల స్కోర్లు (వియాన్ ముల్దర్ (52), ఫోర్టుయిన్ (16), టోని డి జోర్జీ (11), వెర్రిన్ (10)) చేయగలిగారు. వియాన్ ముల్దర్ అర్ద సెంచరీతో ఆదుకోకపోయి ఉంటే సౌతాఫ్రికా స్కోర్ కూడా రెండంకెలకే పరిమితమయ్యేది.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ ఆడుతూపాడుతూ విజయం సాధించింది. ఆ జట్టు 26 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఆఫ్ఘనిస్తాన్ కూడా ఆదిలో తడబడినప్పటికీ.. అజ్మతుల్లా ఒమర్జాయ్ (25), గుల్బదిన్ నైబ్ (34) అజేయ ఇన్నింగ్స్‌లతో తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఫోర్టుయిన్ 2, ఎంగిడి, మార్క్రమ్ తలో వికెట్ పడగొట్టారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే సెప్టెంబర్ 20న జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభమవుతుంది. చదవండి: వరల్డ్ నంబర్ వన్‌గా ఇంగ్లండ్ విధ్వంసకర వీరుడు.. ఏకంగా.. -
అత్యంత చెత్త రికార్డు.. 91 ఏళ్ల చరిత్రలో తొలిసారి..?
-
రాజధాని ఢిల్లీలో కాల్పులు కలకలం..అప్ఘాన్ జిమ్ ఓనర్ మృతి
దేశా రాజధాని ఢిల్లీలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఈ ఘటనలో అప్ఘాన్కి చెందిన 35 ఏళ్ల జిమ్ యజమానికి అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తరంజన్ పార్క్‌లో నివశిస్తున్న అఫ్ఘాన్‌కు చెందిన జిమ్ యజమాని నాదిర్ షా పార్క్ చేసిన రెండు కార్ల పక్కన ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. సరిగ్గా గురువారం రాత్రి 10.40 గంటలకు గళ్లచొక్కా ధరించిన వ్యక్తి ఆ ఇద్దరు వ్యక్తులపై అకస్మాత్తుగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నాదిర్ షా తీవ్రంగా గాయపడగా, మరొక వ్యక్తి ఈ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. అనతరం దుండగుడు కొన్ని మీటర్ల దూరంలో పార్క్ చేసిన మోటార్ సైకిల్‌పై ఎక్కి తప్పించుకున్నాడు. దుండగడు దాదాపు ఆరు నుంచి ఎనిమి రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. అలాగే ఘటనా స్థలంలో బుల్లెట్ ప్రక్షేపకాలు, ఖాళీ కాట్రడ్జ్లు లభించాయి. తీవ్రంగా గాయపడిన బాధితుడు నాదిర్ షాను మాక్స్ ఆస్పత్రికి తరలించగా..అతడు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారని వెల్లడించారు అధికారులు. అయితే దాడి చేసిన వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి అతడిపై కాల్పులు జరిపి పారిపోయారని చెబుతున్నారు . అయితే బాధితుడు నాదిర్ షాకి దుబాయ్‌లో పలు వ్యాపారాలు ఉన్నాయని, అలాగే అతడిపై పలు క్రిమినల్ కేసులు ఉన్నట్లు వెల్లడించారు. అంతేగాదు అతడు ఢిల్లీ సీనియర్ పోలీస్ అధికారులకు తెలిసిన పోలీస్ ఇన్ఫార్మర్ అని అధికారిక వర్గాల సమాచారం. ఇదిలా ఉండగా..ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన గోల్డీ బ్రార్ సన్నిహితుడు రోహిత్ గోదారా పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ పెద్ద దుమారం రేపింది. ఆ పోస్ట్‌లో తీహార్ జైలులో ఉన్న తన సన్నిహితుడు సమీర్ బాబా వ్యాపార ఒప్పందాలను అడ్డుకోవడంతోనే తాను నాదిర్ షాను అంతమొందించాలని తన సహాయకులను ఆదేశించినట్లు రోహిత్ గోదారా సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నాడు. పైగా ఎవరైనా ఆ ధైర్యం చేస్తే వారికి అదే గతిపడుతుందని హెచ్చరించడం గమనార్హం.(చదవండి: వేధించే ఎన్ఆర్ఐ భర్తలపై కొరడా) -
ఒక్క బంతి కూడా పడకుండా రద్దైన టెస్ట్ మ్యాచ్‌లు
గ్రేటర్ నోయిడా వేదికగా ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన ఏకైక టెస్ట్ మ్యాచ్ వర్షం, తడి ఔట్ ఫీల్డ్ కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయ్యేలా కనిపిస్తుంది. ఈ మ్యాచ్‌లో ఇప్పటికే మూడు రోజులు రద్దయ్యాయి. కనీసం టాస్ కూడా పడలేదు. ఆటగాళ్లు హోటల్ రూమ్లకే పరిమితమయ్యారు. గ్రేటర్ నోయిడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ మైదానంలో డ్రైనేజీ సదుపాయం సరిగ్గా లేకపోవడం కారణంగా వర్షం పడకపోయినా తొలి రెండు రోజుల ఆట రద్దైంది. ప్రస్తుత పరిస్థితుల్లో మిగతా రెండు రోజుల ఆట కూడా జరిగే ఆస్కారం లేదు. ఆఫ్ఘనిస్తాన్‌లో క్రికెట్‌కు ఆతిథ్యం ఇచ్చే పరిస్థితులు లేకపోవడంతో భారత్ వారికి గ్రేటర్ నోయిడా మైదానాన్ని హోం గ్రౌండ్‌గా ఆఫర్ చేసింది. బీసీసీఐ వారి ముందు కాన్పూర్, బెంగళూరు, నోయిడా వేదికలను ఛాయిస్‌గా ఉంచితే వారే నోయిడాను ఎంచుకున్నారు. కాబుల్ నుంచి ఢిల్లీ.. ఢిల్లీ నుంచి నోయిడా దగ్గర కావడమే ఇందుకు కారణం. ఏది ఏమైనా వర్షం, సరైన డ్రైనేజీ సదుపాయం లేకపోవడం కారణంగా నోయిడాలో జరగాల్సిన టెస్ట్ మ్యాచ్ రద్దయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇలా ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్‌లు రద్దైన పలు సందర్భాలు ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.1890లో ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్- వర్షం కారణంగా మ్యాచ్ రద్దైంది1938లో ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్- వర్షం కారణంగా మ్యాచ్ రద్దైంది1970లో ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్- టెస్ట్ మ్యాచ్‌ను వన్డేగా మార్చారు1989లో న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్- టెస్ట్ మ్యాచ్‌ను వన్డేగా మార్చారు1990లో ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్- ఐదో రోజు వన్డే మ్యాచ్ ఆడారు1998లో పాకిస్తాన్ వర్సెస్ జింబాబ్వే- కనీసం జట్లు కూడా ప్రకటించలేదు1998లో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్- మూడో రోజు మ్యాచ్‌ను రద్దు చేశారుచదవండి: Afg vs NZ: మొన్న అలా.. ఇప్పుడిలా! ఖేల్ ఖతం? -
రెండో రోజూ అదే పరిస్థితి
గ్రేటర్ నోయిడా: అఫ్గానిస్తాన్, న్యూజిలాండ్‌ల మధ్య జరగాల్సిన ఏకైక టెస్టుకు వింత పరిస్థితి ఎదురవుతోంది. ఇరుజట్ల మధ్య సోమవారం నుంచి టెస్టు మ్యాచ్ జరగాలి. కానీ ఆటగాళ్లు మైదానంలో దిగడం లేదు. ఆట ముందుకు సాగడమే లేదు. రెండు రోజులుగా ఇదే జరుగుతోంది. అలాగని ఈ రెండు రోజులుగా వర్షమేమీ కురవడం లేదు. వాన చినుకు జాడ లేకపోయినా... మైదానం మాత్రం ఆడేందుకు సిద్ధంగా లేదు. కొన్ని రోజుల క్రితం కురిసిన కుండపోత వర్షాల వల్ల మైదానం చిత్తడిగా మారింది. గ్రేటర్ నోయిడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్లో కురిసిన నీరు బయటకు వెళ్లేందుకు అసలు డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, మైదానాన్ని సన్నద్ధం చేసే పరికరాలు అందుబాటులో లేకపోవడంతో ఒక అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ అపహాస్యం అవుతోంది. కేవలం ప్రతికూల పరిస్థితుల వల్లే మొదలవడం లేదు. మంగళవారం రెండోరోజు ఆట జరిపించేందుకు మైదానంలో పదుల సంఖ్యలో గ్రౌండ్ సిబ్బంది తెగ శ్రమించారు. ల్యాండ్‌స్కేప్ గడ్డి గడుల్ని తెచ్చి మైదానమంతా పరిచేందుకు చెమటోడ్చారు. ఫ్యాన్లు అమర్చి మైదానం ఎండేలా కృషి చేశారు. అయినాకూడా అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం గ్రౌండ్ సిద్ధంగా లేకపోవడంతో ఫీల్డు అంపైర్లు కుమార ధర్మసేన, షర్ఫుద్దౌలా రెండో రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. -
సౌతాఫ్రికా జట్ల ప్రకటన.. స్టార్ పేసర్ రీ ఎంట్రీ
సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్‌లతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం మూడు వేర్వేరు దక్షిణాఫ్రికా జట్లను ఇవాళ (సెప్టెంబర్ 9) ప్రకటించారు. ఈ సిరీస్‌లలో సౌతాఫ్రికా తొలుత ఆఫ్ఘనిస్తాన్‌తో మూడు వన్డేలు ఆడుతుంది. ఈ మ్యాచ్‌లు షార్జా వేదికగా జరుగనున్నాయి. ఆతర్వాత సౌతాఫ్రికా ఐర్లాండ్‌తో రెండు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ అబుదాబీ వేదికగా జరుగనున్నాయి.ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్‌లతో జరిగే సిరీస్‌ల కోసం ప్రకటించిన జట్లలో వన్డే జట్టుకు టెంబా బవుమా, టీ20 జట్టుకు ఎయిడెన్ మార్క్రమ్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. గాయం కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరమైన స్టార్ పేసర్ లుంగి ఎంగిడి ఈ సిరీస్‌లతో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. జేసన్ స్మిత్, న్కాబా పీటర్, ఆండిలే సైమ్‌లేన్ తొలిసారి వన్డే జట్టులో చోటు దక్కించుకున్నారు.ఆఫ్ఘనిస్తాన్‌తో వన్డే సిరీస్ సెప్టెంబర్ 18, 20, 22 తేదీల్లో జరుగనుంది. ఐర్లాండ్‌తో టీ20లు సెప్టెంబర్ 27, 29.. వన్డేలు అక్టోబర్ 2, 4, 7 తేదీల్లో జరుగనున్నాయి.ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే వన్డే సిరీస్ కోసం దక్షిణాఫ్రికా జట్టు: టెంబా బవుమా (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, నండ్రే బర్గర్, టోనీ డి జోర్జి, జార్న్ ఫోర్టుయిన్, రీజా హెండ్రిక్స్, ఎయిడెన్ మార్క్రమ్, వియాన్ ముల్డర్, లుంగి ఎంగిడి, ఆండిలే ఫెహ్లుక్వాయో, న్కాబా పీటర్, ఆండిలే సైమ్‌లేన్, జేసన్ స్మిత్, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెర్రైన్, లిజాడ్ విలియమ్స్ఐర్లాండ్తో టీ20 సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు: ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, మాథ్యూ బ్రీట్జ్కే, నండ్రే బర్గర్, జార్న్ ఫోర్టుయిన్, రీజా హెండ్రిక్స్, పాట్రిక్ క్రూగర్, వియాన్ ముల్డర్, లుంగి ఎంగిడి, న్కాబా పీటర్, ర్యాన్ రికెల్టన్, ఆండిలే సైమ్‌లేన్, జేసన్ స్మిత్, ట్రిస్టన్ స్టబ్స్, లిజాడ్ విలియమ్స్ఐర్లాండ్తో వన్డే సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు: టెంబా బవుమా (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, నండ్రే బర్గర్, టోనీ డి జోర్జి, బ్జోర్న్ ఫోర్టుయిన్, వియాన్ ముల్డర్, లుంగి ఎంగిడి, ఆండిలే ఫెహ్లుక్వాయో, న్కాబా పీటర్, ర్యాన్ రికెల్టన్, జేసన్ స్మిత్, ట్రిస్టన్ స్టబ్స్, రస్సీ వాన్ డెర్ డస్సెన్, కైల్ వెర్రెయిన్, లిజాడ్ విలియమ్స్ -
గుర్బాజ్ ఊచకోత.. ఒక్క బౌండరీ లేదు.. అన్నీ సిక్సర్లే..!
కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా సెయింట్ లూసియా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గయానా అమెజాన్ వారియర్స్ ఆటగాడు రహ్మానుల్లా గుర్బాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 19 బంతుల్లో 7 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేశాడు. 101 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో మాథ్యూ ఫోర్డ్ వేసిన మూడో ఓవర్లో గుర్బాజ్ శివాలెత్తిపోయాడు. హ్యాట్రిక్ సిక్సర్లు సహా మొత్తం నాలుగు సిక్సర్లు బాదాడు. గుర్బాజ్ ఇన్నింగ్స్‌లో ఒక్క బౌండరీ లేదు. అన్నీ సిక్సర్లే. గుర్బాజ్ ఊచకోత ధాటికి వారియర్స్ స్వల్ప లక్ష్యాన్ని కేవలం 10 ఓవర్లలో ఛేదించింది. గుర్బాజ్‌కు జతగా టిమ్ రాబిన్సన్ (20 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. pic.twitter.com/aXt21tOfvL— Cricket Cricket (@cricket543210) September 8, 2024వారియర్స్ ఇన్నింగ్స్‌లో షాయ్ హోప్ 11, ఆజమ్ ఖాన్ 0, హెట్‌మైర్ 8, కీమో పాల్ 1 పరుగు చేశారు. లూసియా కింగ్స్ బౌలర్లలో నూర్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టగా.. అల్జరీ జోసఫ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లూసియా కింగ్స్.. గుడకేశ్ మోటీ (3.3-0-16-3), ఇమ్రాన్ తాహిర్ (4-0-29-3), కీమో పాల్ (2-0-19-2), ప్రిటోరియస్ (2-0-10-1) ధాటికి 14.3 ఓవర్లలో 100 పరుగులకు ఆలౌటైంది. లూసియా కింగ్స్ ఇన్నింగ్స్‌లో మాథ్యూ ఫోర్డ్ (31), జాన్సన్ ఛార్లెస్ (19), టిమ్ సీఫర్ట్ (12), అకీమ్ అగస్ట్ (10) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఈ గెలుపుతో వారియర్స్ సీజన్లో వరుసగా మూడో విజయం నమోదు చేసింది. లూసియా కింగ్స్ సీజన్ తొలి ఓటమిని ఎదుర్కొంది. -
భారత్‌కు చేరుకున్న న్యూజిలాండ్ జట్టు.. ఎందుకంటే?
న్యూజిలాండ్-అఫ్గానిస్తాన్ మధ్య చారిత్రత్మక టెస్టు మ్యాచ్‌కు గ్రేటర్ నోయిడా ఆతిథ్యమివ్వనుంది. బీసీసీఐ ఆధ్వర్యంలో జరగనున్న ఈ మ్యాచ్ సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. ఈ ఏకైక టెస్టు మ్యాచ్ కోసం అఫ్గానిస్తాన్ జట్టు ఇప్పటికే నోయిడాకు చేరుకోగా.. తాజాగా కివీస్ జట్టు సైతం భారత గడ్డపై అడుగుపెట్టింది.కెప్టెన్ టిమ్ సౌథీ నేతృత్వంలోని న్యూజిలాండ్ జట్టు గురువారం తెల్లవారుజామునఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. అక్కడ నుంచి గ్రేటర్ నోయిడాకు బస్సులో కివీస్ పయనమైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.శుక్రవారం నుంచి బ్లాక్ క్లాప్స్ తమ ప్రాక్టీస్‌ను మొదలు పెట్టనుంది. కాగా ఈ మ్యాచ్ భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు జరగనుండడంతో కివీస్‌కు ప్రాక్టీస్‌గా ఉపయోగపడనుంది.అఫ్గాన్ సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టు: టిమ్ సౌథీ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), మైఖేల్ బ్రేస్‌వెల్, డెవాన్ కాన్వే, మాట్ హెన్రీ, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), డారిల్ మిచెల్, విల్ ఓరూర్క్, అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్ , బెన్ సియర్స్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్ Welcome @BlackCapsVideo: The New Zealand team has arrived at the hotel in Greater Noida, India, for the one-off Test match against Afghanistan's national team.#AfghanAtalan | #AFGvNZ | #GloriousNationVictoriousTeam pic.twitter.com/UlQApG5UXP— Afghanistan Cricket Board (@ACBofficials) September 5, 2024 -
ప్రమాదంలో అఫ్గాన్ ఉనికి
2021 ఆగస్టు 15. భారత్, దక్షిణ కొరియా వంటి పలు దేశాలు స్వాతంత్య్ర సంబరాలు జరుపుకుంటున్న వేళ. అఫ్గానిస్తాన్‌లో మాత్రం ప్రజాస్వామ్యం కుప్పకూలింది. దేశం మరోసారి తాలిబన్ల హస్తగతమైంది. వారి మూడేళ్ల అరాచక పాలనలో అత్యంత భారీ మూల్యం చెల్లించుకున్నది, ఇంకా చెల్లించుకుంటున్నదీ మహిళలే. అడుగడుగునా ఆంక్షల నడుమ సర్వ హక్కులూ కోల్పోయారు. ఇదిలాగే కొనసాగితే దేశ ఉనికికే ప్రమాదమంటున్నారు అఫ్గాన్ హక్కుల కార్యకర్త మహబూబా సిరాజ్. పరిస్థితిని మెరుగు పరిచేందుకు అంతర్జాతీయ సమాజం తాలిబన్లతో చర్చించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వివరాలు ఆమె మాటల్లోనే...మళ్లీ అవే అణచివేతలు... 1996 నుంచి 2001 దాకా తాలిబన్లు తొలిసారి అధికారం చేపట్టినప్పుడు అఫ్గాన్‌లో అత్యంత అరాచకం తాండవించింది. మహిళలపై అత్యంత కఠినమైన ఆంక్షలు! విద్య, ఉపాధి అవకాశాల్లేవు. ఒంటరిగా గడప దాటొద్దు. ముఖం పూర్తిగా కప్పుకోకున్నా కొరడా దెబ్బలు, బహిరంగ ఉరి శిక్షలు! తాలిబన్ల పునరాగమనంతో ఆఫ్గాన్ మహిళల పరిస్థితి మళ్లీ దయనీయంగా మారింది. ఆంక్షలు ఇంకా పెరిగాయి. ఇస్లాంలో, అల్లా దృష్టిలో స్త్రీ పురుషులిద్దరూ సమానమే. దాన్ని తోసిరాజని మహిళలను ఇలా అణచివేయడం ఏం ధర్మమో అర్థం కాదు!చర్చలే పరిష్కారం.. ఈ అరాచకం ఇలాగే కొనసాగితే అఫ్గాన్ ఉనికే ప్రమాదంలో పడుతుంది. తాలిబన్లతో చర్చించాలన్నందుకు నన్ను వారి లాబీయిస్టునంటూ విమర్శిస్తున్నారు. ఎవరితో సమస్యో వాళ్లతో కనీసం మాట్లాడకపోతే పరిష్కారం ఎలా సాధ్యం? మా ముందున్నవి రెండే మార్గాలు. పరస్పరం చంపుకోవడం ఒకటైతే, కూర్చుని చర్చించుకోవడం రెండోది. పోరే శరణ్యమంటే అకారణంగా చచ్చిపోతాం. అందుకే చర్చలంటున్నాను. తాలిబన్లు తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు నేను దేశంలో లేను. ఈసారి ఎందుకుంటున్నానని ప్రశి్నస్తున్నారు. ఎందుకంటే ఇక్కడి మహిళలకు నా అవసరముంది. మాకిప్పుడు ప్రపంచంలోని ప్రతి మహిళ మద్దతూ అవసరం. అంతర్జాతీయ సమాజం ముందుకొచ్చి మాకు సాయపడాలి. భవిష్యత్తుపై ఆశ.. శరణార్థులు, వలసదారులు యూరప్‌ను రంగులమయం చేస్తున్నారు. అయినా ముస్లింలంటే పాశ్చాత్య దేశాలకు భయమెందుకో అర్థం కాదు. ఒకనాటి అఫ్గానిస్తాన్ విభిన్న జాతులు, సంప్రదాయాలతో కూడిన అందమైన కళాఖండం. ఆ పాత అఫ్గాన్ తిరిగి రావాలంటే దేశం వీడిన వాళ్లంతా తిరిగి రావాలి. రాచరిక నేపథ్యం... 75 ఏళ్ల మెహబూబా సిరాజ్ రాజ కుటుంబీకురాలు. 1880 నుంచి 1901 దాకా అఫ్గాన్‌ను పాలించిన అబ్దుర్ రెహా్మన్ ఖాన్ వంశీకురాలు. హజారా తెగ ఊచకోత రెహ్మాన్ హయాంలో జరిగిందే. నియంతృత్వ పాలనతో కర్కోటకునిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. తనపై తాలిబన్ల కీలుబోమ్మ అన్న ఆరోపణలకు ఆ వారసత్వమే కారణమని వాపోతారామె. ఆమె 26 ఏళ్ల పాటు అమెరికాలో గడిపి 2003లో అఫ్గాన్ తిరిగి వెళ్లారు. దేశంలో మహిళలు, బాలికల హక్కుల కోసం కృషి చేస్తున్నారు. అఫ్గాన్ విమెన్స్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వంటివి నిర్వహిస్తున్నారు. గృహ హింసకు గురవుతున్న మహిళలకు ఆశ్రయం కల్పిస్తున్నారు. గతేడాది నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. ఇటీవలే ఫిన్లండ్ ఇంటర్నేషనల్ జెండర్ ఈక్వాలిటీ అవార్డు అందుకున్నారు. -
న్యూజిలాండ్‌తో ఏకైక టెస్ట్.. రషీద్ ఖాన్‌కు విశ్రాంతి
సెప్టెంబర్ 9 నుంచి 13 వరకు గ్రేటర్ నోయిడా వేదికగా న్యూజిలాండ్‌తో జరుగనున్న ఏకైక టెస్ట్ కోసం ఆఫ్ఘనిస్తాన్ ప్రిలిమినరీ స్క్వాడ్‌ను ఇవాళ (ఆగస్ట్ 27) ప్రకటించారు. 20 సభ్యులున్న ఈ జట్టుకు హష్మతుల్లా షాహిది సారధిగా వ్యవహరించనున్నాడు. ఈ జట్టులో స్టార్ ఆటగాడు రషీద్ ఖాన్‌కు చోటు దక్కలేదు. గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా రషీద్ ఖాన్‌కు విశ్రాంతి ఇస్తున్నట్లు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. రషీద్‌కు టెస్ట్ మ్యాచ్ ఆడే ఫిట్నెస్ లేదని ఏసీబీ పేర్కొంది. రషీద్ ఆగస్ట్ 12న జరిగిన హండ్రెడ్ లీగ్ మ్యాచ్ సందర్భంగా గాయపడ్డాడు. దీంతో అర్దంతరంగా అతను ఆ టోర్నీ నుంచి వైదొలిగాడు. రషీద్ ఇటీవల జరిగిన ఓ లోకల్ టోర్నీలో పాల్గొన్నా టెస్ట్ క్రికెట్ ఆడే స్థాయి అతనికి లేదని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. రషీద్.. న్యూజిలాండ్‌తో టెస్ట్ మ్యాచ్ అనంతరం జరిగే సౌతాఫ్రికా వన్డే సిరీస్కంతా పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడని ఏసీబీ ఆశాభావం వ్యక్తం చేసింది. సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ సెప్టెంబర్ 18-22 మధ్య తేదీల్లో జరుగనుంది. ఈ సిరీస్‌కు యూఏఈ ఆతిథ్యం ఇవ్వనుంది. మరోవైపు 20 మంది సభ్యుల ఆఫ్ఘనిస్తాన్ ప్రిలిమినరీ స్క్వాడ్ ఈనెల 28న గ్రేటర్ నొయిడాలోకి సన్నాహక శిబిరానికి చేరుకుంటుంది. ఈ సన్నాహక శిబిరంలో ప్రతిభ ఆధారంగా 15 మంది సభ్యుల జట్టును ఎంపిక చేస్తారు. బీసీసీఐ గ్రేటర్ నోయిడాను ఆఫ్ఘనిస్తాన్‌కు హోం గ్రౌండ్ కింద అలాట్ చేసిన విషయం తెలిసిందే. ఆఫ్ఘనిస్తాన్: హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), ఇబ్రహీం జద్రాన్, రియాజ్ హసన్, అబ్దుల్ మాలిక్, రహమత్ షా, బహీర్ షా మహబూబ్, ఇక్రమ్ అలీఖేల్ (వికెట్‌కీపర్), షాహిదుల్లా కమల్, గుల్బాదిన్ నాయబ్, అఫ్సర్ జజాయ్ (వికెట్‌కీపర్), అజ్మతుల్లా ఒమర్జాయ్, జియా ఉర్ రెహ్మాన్ అక్బర్, షాహమ్సుర్ రెహ్మాన్, ఖైస్ అహ్మద్, జహీర్ ఖాన్, నిజత్ మసూద్, ఫరీద్ అహ్మద్ మాలిక్, నవీద్ జద్రాన్, ఖలీల్ అహ్మద్, యమా అరబ్. -
గళానికీ సంకెళ్లు!
మిగతా ప్రపంచమంతా కాలంతో పందెం వేస్తూ దూసుకెళ్తుంటే అఫ్గానిస్తాన్ మాత్రం కాలంతో పాటు వెనక్కు పయనిస్తోంది. మూడేళ్ల క్రితం పాలన తాలిబన్ల చేతిలోకి వెళ్లినప్పటి నుంచీ అక్కడ రాతియుగపు పాలన నడుస్తోంది. మహిళల మనుగడ దినదిన గండంగా మారింది. ఆంక్షల కొలిమిలో నిలువునా కాలడం వారికి నిత్యకృత్యమైపోయింది. తాజాగా మహిళల గళానికి కూడా సంకెళ్లు పడ్డాయి... – సాక్షి, నేషనల్ డెస్క్అడుగు కదిపితే ఆంక్షలు. ఊపిరి కూడా ఆడని రీతిలో చుట్టూ నిబంధనల చట్రం. అఫ్గాన్‌లో మహిళపై తాలిబన్లు పాల్పడుతున్న అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. వాళ్లు పెద్ద చదువులు చదివేందుకు వీల్లేదు. ఆరో తరగతి తర్వాత ఇంటికే పరిమితం కావాలి. ఒళ్లంతా పూర్తిగా కప్పుకుంటే తప్ప ఇంట్లోంచి కాలు బయట పెట్టడానికి లేదు. ఈ అణచివేతను పరాకాష్టకు తీసుకెళ్తూ తాలిబన్లు తాజాగా మరో మతిలేని నిర్ణయం తీసుకున్నారు. ఇకపై మహిళలు బహిరంగ స్థలాల్లో మాట్లాడటానికి కూడా వీల్లేదంటూ హుకుం జారీ చేశారు. ప్రసార మాధ్యమాల్లో కూడా వారి స్వరం పొరపాటున కూడా విని్పంచకూడదని ఆదేశించారు! అంతేకాదు, ఇల్లు దాటాలంటే ఒంటితో పాటు ముఖాన్ని కూడా పూర్తిగా కప్పుకోవడం తప్పనిసరంటూ మరో నిబంధన విధించారు!! మహిళల అస్తిత్వానికే గొడ్డలిపెట్టు వంటి ఈ ఆటవిక నిర్ణయాలపై అంతర్జాతీయ సమాజంలో విస్మయం వ్యక్తమవుతోంది. ‘సద్గుణాల వ్యాప్తి, దుర్గుణాల కట్టడి’ పేరిట తాలిబన్లు మూడేళ్ల క్రితం ఏకంగా ఒక శాఖనే ఏర్పాటు చేశారు. మహిళలపై మరిన్ని ఆంక్షలు విధిస్తూ తాజాగా తీసుకున్న నిర్ణయాలతో 114 పేజీల డాక్యుమెంట్‌ను ఆ శాఖ విడుదల చేసింది. అందులో 35 రకాల నూతన నిబంధనలను పొందుపరిచారు. మహిళలు ఇకపై బహిరంగ స్థలాల్లో మాట్లాడేందుకు వీల్లేదన్నది వాటిలో ప్రధానమైనది. ఈ నిబంధనలకు తాలిబన్ పాలకుడు హిబతుల్లా అఖుంద్జాదా ఇటీవలే ఆమోదముద్ర వేశారు. ఆగస్టు 21 నుంచి అవి అమల్లోకి వచ్చాయి.‘మంచిని పెంచేందుకు, చెడును తుంచేందుకు ఈ నూతన ఇస్లామిక్ నిబంధనలు ఎంతగానో దోహదపడుతాయి’ అంటూ సంబంధిత శాఖ అధికార ప్రతినిధి అసోసియేటెడ్ ప్రెస్‌కు ఇచి్చన ఇంటర్వ్యూలో గొప్పగా చెప్పుకొచ్చారు! కొత్త ఆంక్షలు ఇలా...– ఇకపై మహిళలు బహిరంగ ప్రదేశాల్లో మాట్లాడటానికి ఏమాత్రం వీల్లేదు. – బహిరంగ ప్రదేశాల్లో గట్టిగా చదవొద్దు. పాటలు పాడొద్దు. రాగాలు తీయొద్దు. – మీడియాలో కూడా మహిళల గొంతు ఏ రకంగానూ విని్పంచకూడదు. – రక్త సంబం«దీకులను, భర్తను తప్ప మరే పురుషుని వైపూ కన్నెత్తి కూడా చూడొద్దు. – బహిరంగ ప్రదేశాలలో మహిళలు మగవాళ్లతో మాట్లాడటం నిషిద్ధం.– మహిళలను బయటికొచి్చనప్పుడు ముఖం పూర్తిగా కవరయ్యేలా కప్పుకోవాలి. లేదంటే వాళ్లను చూసి మగవాళ్లు ఉద్రేకానికి లోనయ్యే ఆస్కారముంది. – కనుక మహిళలు ఇకపై ముఖంపై పూర్తిగా మేలిముసుగు ధరించాల్సిందే. కేవలం జుత్తు, మెడను మాత్రమే కవర్ చేసే హిజాబ్ మాత్రం ధరిస్తే చాలదు. – మహిళలు ఇకనుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ సంగీత వాయిద్యాలను ముట్టుకోకూడదు. – వాహనదారులెవరూ మగవాళ్లు తోడు లేనిదే మహిళలను ఎక్కించుకోకూడదు. – పురుషులు గడ్డం చేసుకోకూడదు. నియమిత వేళల్లో విధిగా ఉపవాసముండాలి. – అఫ్గాన్ మీడియా ఇకపై షరియా చట్టాలను తూ.చా. తప్పకుండా పాటించాలి. – మీడియాలో ఎవరి ఫొటోలూ చూపించడానికి, ప్రచురించడానికి వీల్లేదు.శిక్షలు ఇలా... – నూతన నిబంధనలను ఉల్లంఘించే మహిళలకు... – తొలుత హెచ్చరికల జారీ. – అనంతరం ఆస్తుల జప్తు. – మూడు రోజులదాకా నిర్బంధం. – అనంతరం అవసరాన్ని బట్టి కఠిన శిక్షలు. – నిబంధనలను ఉల్లంఘించిన కేసుల్లో వేలాది మంది అఫ్గాన్ మహిళలు ఇప్పటికే నిర్బంధంలో మగ్గుతున్నారు. ఇప్పటికే ఈ ఆంక్షలు... – బాలికలు ఆరో తరగతితోనే చదువు ఆపేయాలి. – మహిళలు ఎటువంటి స్వచ్ఛంద సంస్థల్లోనూ పని చేయడానికి వీల్లేదు.– హిజాబ్ లేకుండా వాళ్లు ఇల్లు దాటకూడదు. -
ఆఫ్ఘనిస్తాన్ అసిస్టెంట్ కోచ్‌గా టీమిండియా మాజీ ఫీల్డింగ్ కోచ్
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్‌గా టీమిండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీథర్ నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు బుధవారం ప్రకటించింది. శ్రీథర్ త్వరలో జరుగబోయే న్యూజిలాండ్, సౌతాఫ్రికా సిరీస్‌లతో ఆఫ్ఘనిస్తాన్ అసిస్టెంట్ కోచ్‌గా బాధ్యతలు చేపడతాడు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డుతో శ్రీథర్ ఒప్పందం దీర్ఘకాలిక ఒప్పందంగా ఉండే అవకాశం ఉంది.శ్రీథర్‌కు కోచింగ్ విభాగంలో అపార అనుభవం ఉంది. అతను 2021 టీ20 వరల్డ్‌కప్ వరకు రవిశాస్త్రి అండర్లో టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా పని చేశాడు. 2008-14 వరకు అతను నేషనల్ క్రికెట్ అకాడమీలో అసిస్టెంట్ ఫీల్డింగ్ మరియు స్పిన్ బౌలింగ్ కోచ్‌గా పని చేశాడు. అలాగే 2014 ఇండియా అండర్-19 వరల్డ్‌కప్ స్క్వాడ్‌కు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించాడు. శ్రీథర్ ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీకి కూడా పని చేశాడు. స్వతహాగా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్ అయిన శ్రీథర్ ఆఫ్ఘన్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా కూడా వ్యవహరించే అవకాశం ఉంది. శ్రీథర్.. ఆఫ్ఘనిస్తాన్ హెడ్ కోచ్ జోనాథన్ ట్రాట్ అండర్లో పని చేయనున్నాడు. సెప్టెంబర్ 9 నుంచి ఆఫ్ఘనిస్తాన్.. న్యూజిలాండ్‌తో ఏకైక టెస్ట్ మ్యాచ్ సిరీస్ ఆడనుంది. ఈ మ్యాచ్‌కు భారత్‌లోని నోయిడా వేదిక కానుంది. ఆఫ్ఘనిస్తాన్లోని పరిస్థితుల దృష్ట్యా బీసీసీఐ ఆ జట్టుకు నోయిడాను హోం గ్రౌండ్‌గా ఆఫర్ చేసింది. సెప్టెంబర్ 18 నుంచి ఆఫ్ఘనిస్తాన్ సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ షార్జా వేదికగా జరుగనుంది. -
‘మహిళల స్వేచ్ఛ’పై నినదించినందుకు...
పారిస్: ఒలింపిక్స్ క్రీడల ‘బ్రేకింగ్’ (బ్రేక్ డ్యాన్స్) ఈవెంట్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. నెదర్లాండ్స్ ప్లేయర్ ఇండియా సర్జో, ఐఓసీ శరణార్ధి టీమ్‌కు చెందిన మనీజా తలాష్ మధ్య ప్రి క్వాలిఫయర్ మ్యాచ్ జరిగింది. ఈ పోరు కొనసాగుతున్న సమయంలో మనీజా అఫ్గనిస్తాన్‌లోని మహిళలను స్వేచ్ఛను ప్రసాదించమంటూ ‘ఫ్రీ అఫ్గాన్ ఉమెన్’ అంటూ రాసి ఉన్న కేప్‌ను తన డ్రెస్‌పై ధరించి డ్యాన్సింగ్ చేసింది. అయితే రాజకీయపరమైన వ్యాఖ్యలు, నినాదాలు ప్రదర్శించడంపై ఒలింపిక్స్‌లో నిషేధం ఉంది. దాంతో వెంటనే పోటీని నిలిపివేసిన అధికారులు ఆమెను డిస్క్వాలిఫై చేస్తున్నట్లు ప్రకటించారు. మనీజా స్వదేశం అఫ్గానిస్తాన్ కాగా... ఆ దేశం తాలిబాన్ల ఆ«దీనంలోకి వచ్చిన తర్వాత అఫ్గాన్ నుంచి పారిపోయి స్పెయిన్‌లో శరణార్థిగా తలదాచుకుంది. క్రీడల్లో కల నెరవేర్చుకునేందుకు వచ్చానంటూ 21 ఏళ్ల మనీజా తన గురించి చెప్పుకుంది. ఇప్పుడు శరణార్ధి జట్టు ద్వారా ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం రాగా, బరిలోకి దిగి తమ మహిళల గురించి ప్రపంచానికి తెలియచెప్పే ప్రయత్నం చేసింది. అయితే ఆమె చేసిన పనికి ఒలింపిక్స్‌లో అనర్హత వేటును ఎదుర్కొంది. -
ఆఫ్గాన్ ఫస్ట్ ఫిమేల్ ఒలింపిక్ బ్రేక్ డ్యాన్సర్
సినిమాకు ఎంతమాత్రం తీసిపోని కథ మనిజా తలాష్ది. మహిళలు సంగీతం వినడం తప్పు... అనుకునే పరిస్థితులు ఉన్న దేశంలో బ్రేక్డ్యాన్స్పై ఇష్టాన్ని పెంచుకుంది. ఆ ఇష్టం ఆమెకు ఎన్నో కష్టాలు తెచ్చింది. అయినా మడమ తిప్పలేదు. తలాష్ కష్టం వృథాపోలేదు. అఫ్గాన్ ఫస్ట్ ఫిమేల్ ఒలింపిక్ బ్రేక్ డ్యాన్సర్‌గా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది...‘సంకల్ప బలం ఉంటే బందీఖానాలో ఉన్నప్పటికీ కల నిజం చేసుకోవచ్చు’ అంటుంది ఆఫ్గానిస్తాన్ ఫస్ట్ ఫిమేల్ ఒలింపిక్ బ్రేక్డ్యాన్సర్ మనీజా తలాష్. కొన్ని సంవత్సరాల క్రితం యూట్యూబ్‌లో ఆఫ్గాన్ బ్రేక్ డ్యాన్సర్ల వీడియో చూసి ‘ఇది కలా నిజమా! ఇలా చేయడం సాధ్యమా’ అనుకుంది తలాష్.మూడు నెలల తరువాత...‘సుప్రియర్స్ క్రూ’గా సుపరిచితులైన బ్రేక్ డ్యాన్సర్లను ట్రైనింగ్ క్లబ్లో కలుసుకుంది. ‘నాకు డ్యాన్స్ నేర్పించగలరా?’ అని అడిగింది. వారు ఓకే అన్నారు. శిక్షణ తీసుకుంటున్న 55 మందిలో తానొక్కతే అమ్మాయి. మొదట ఇబ్బందిగా ఫీలయ్యేది.‘ఇక్కడ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటే. ఇబ్బందిగా ఫీల్ కావద్దు’ అని ధైర్యం చెప్పేవారు సుప్రియర్ క్రూ సభ్యులు. అయితే తలాష్ బ్రేక్ డ్యాన్స్ నేర్చుకోవడం తల్లిదండ్రులు, ఉ΄ాధ్యాయులకు ఎవరికీ నచ్చేది కాదు. ఈ ఒత్తిడి ప్రభావంతోనో ఏమో... ‘నేర్చుకోవడం నాకు కష్టంగా ఉంది’ అన్నది.‘కష్టం కావచ్చు. అసాధ్యం మాత్రం కాదు’ అన్నారు ‘సుప్రియర్ క్రూ’ సభ్యులు.ఇక అప్పటినుంచి వెనకడుగు వేయలేదు తలాష్. నాలుగు సంవత్సరాల తరువాత... అఫ్గానిస్తాన్ ఫస్ట్ ‘బీ–గర్ల్’ (బ్రేక్డ్యాన్సర్ గర్ల్)గా పేరు తెచ్చుకుంది. మరోవైపు తలాష్కు బెదిరింపు కాల్స్ రావడం మొదలైంది. తన కల సాకారం అయ్యే పరిస్థితి కనిపించకపోవడంతో పన్నెండేళ్ల సోదరుడిని తీసుకొని ΄ాకిస్థాన్కు ΄ారిపోయింది. అక్కడి నుంచి స్పెయిన్‌కు వెళ్లి హ్యుస్కా అనే చిన్న పట్టణంలోని హెయిర్ సెలూన్లో పనిచేస్తూ బ్రేక్ డ్యాన్స్ ్ర΄ాక్టీస్ చేసేది. తలాష్ కథ ఐవోసీ (ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ) ఎగ్జిక్యూటివ్ బోర్డ్ దృష్టికి రావడంతో రెఫ్యూజీ ఒలింపిక్ టీమ్‌లో స్థానం కల్పించారు. ఒలింపిక్స్‌లో తలాష్ మెడల్ తేస్తే పెద్ద చరిత్రే. కష్టమే అదృష్టమై...΄ారిస్ ఒలింపిక్స్‌తో మొదటిసారిగా బ్రేకింగ్ స్పోర్ట్ (బి–బోయింగ్, బి–గర్లింగ్ లేదా బ్రేక్ డ్యాన్సింగ్)ను ప్రవేశ పెట్టారు. ప్రపంచ క్రీడా వేదిక చెంతకు చేరడానికి ఇది మనిజా తలాష్కు అదృష్టంగా మారింది. అయితే కష్టాన్ని తప్ప అదృష్ట, దురదృష్టాలను ఎప్పుడూ పెద్దగా నమ్ముకోలేదు తలాష్. ఆమె ఒలింపిక్స్ వరకు రావడమే పెద్ద విజయం. పతకం గెలుచుకుంటే చారిత్రక విజయం అవుతుంది. ‘ఈపోటీ నా కోసం మాత్రమే కాదు. నాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న స్నేహితులు, ఆత్మీయుల కోసం’ అంటుంది మనిజా తలాష్. -
మ్యాచ్ ఫిక్సింగ్: అఫ్గన్ క్రికెటర్‌పై ఐదేళ్ల నిషేధం
టాపార్డర్ బ్యాటర్ ఇహ్సనుల్లా జనత్‌పై ఐదేళ్ల నిషేధం విధిస్తున్నట్లు అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డందుకు గానూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఐదు సంవత్సరాల పాటు అతడిని అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు దూరంగా ఉండాలని ఆదేశించినట్లు పేర్కొంది.కాగా 2017లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఇహ్సనుల్లా జనత్.. అఫ్గన్ తరఫున ఇప్పటి వరకు మూడు టెస్టులు, 16 వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడాడు. 26 ఏళ్ల ఈ టాపార్డర్ బ్యాటర్.. టెస్టుల్లో 110, వన్డేల్లో 307, టీ20లో 20 పరుగులు సాధించాడు. ఎంత వేగంగా జాతీయ జట్టులోకి వచ్చాడో అంతే వేగంగా దూరమయ్యాడు కూడా!ఈ క్రమంలో 2022లో చివరి అంతర్జాతీయ మ్యాచ్(టీ20) ఆడిన ఇహ్సనుల్లా.. ఇటీవల కాబూల్ ప్రీమియర్ లీగ్‌లో భాగయ్యాడు. 2024 సీజన్లో షంషాద్ ఈగల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన అతడు.. నాలుగు ఇన్నింగ్స్ ఆడి 72 పరుగులు చేశాడు. అయితే, అతడు ఫిక్సింగ్ పాల్పడ్డాడన్న ఆరోపణలు రాగా.. క్రికెట్ బోర్డు విచారణ చేపట్టింది.ఈ క్రమంలో ఇహ్సనుల్లా జనత్ దోషిగా తేలాడు. తన తప్పును అంగీకరించాడు. ఈ క్రమంలో ఐసీసీ అవినీతి నిరోధక నియమావళిలోని 2.1.1 నిబంధనను ఉల్లంఘించిన కారణంగా అతడిపై ఐదేళ్ల నిషేధం విధిస్తున్నట్లు అఫ్గన్ బోర్డు తెలిపింది. మ్యాచ్ ఫలితాలు, మ్యాచ్ సాగే తీరును ప్రభావితం చేసే చర్యలకు పాల్పడ్డందుకు వేటు వేసినట్లు పేర్కొంది.కాగా అఫ్గనిస్తాన్ మాజీ కెప్టెన్ నవ్రోజ్ మంగల్ తమ్ముడే ఇహ్సనుల్లా. అఫ్గన్ జట్టుకు వన్డే హోదా వచ్చినపుడు నవ్రోజ్ సారథిగా ఉన్నాడు. అతడి కెప్టెన్సీలోనే టీ20 ప్రపంచకప్-2010 ఎడిషన్‌కు అఫ్గనిస్తాన్ జట్టు అర్హత సాధించింది. -
డోపింగ్‌లో పట్టుబడ్డ అఫ్గానిస్తాన్ జూడో ప్లేయర్
పారిస్ ఒలింపిక్స్‌లో మూడో డోపింగ్ కేసు నమోదైంది. అఫ్గానిస్తాన్‌కు చెందిన జూడో ఆటగాడు మొహమ్మద్ సమీమ్ ఫైజాద్ డోపింగ్ పరీక్షలో దొరికిపోయాడు. అతను నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు పరీక్షల్లో తేలింది. దీంతో అతన్ని అఫ్గాన్ జట్టు నుంచి తప్పించారు. 81 కేజీల కేటగిరీలో తొలి బౌట్లో పాల్గొన్న సమయంలోనే 22 ఏళ్ల ఫైజాద్ నుంచి రక్త, మూత్ర నమూనాలను సేకరించారు. అనంతరం ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) ఆధ్వర్యంలోని ల్యాబ్‌లో పరీక్షించగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిం ది. పారిస్ క్రీడల్లో పట్టుబడిన మూడో డోపీ సమీమ్ ఫైజాద్. ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషుల బృందంతో అఫ్గాన్ ఈ విశ్వక్రీడల్లో పాల్గొంటుంది. -
ఐదు దేశాలు దాటి ఒలింపిక్స్ వరకు...
పారిస్: అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నేతృత్వంలోని శరణార్థి జట్టు తరఫున ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న ఒక్కొక్కరిది ఒక్కో గాథ. ప్రతికూల పరిస్థితుల మధ్య పోరాటం, పట్టుదలతో విశ్వ క్రీడలకు వెళ్లాలని ప్రయతి్నంచే వారి ప్రయాణం అసాధారణం. ఇలాంటి వారిలో అఫ్గానిస్తాన్‌కు చెందిన సిబ్గతుల్లా అరబ్ ఒకడు. ఈ ఒలింపిక్స్‌లో అతను జూడో (81 కేజీల విభాగం)లో బరిలోకి దిగాడు. 2021లో అఫ్గానిస్తాన్ తాలిబాన్ల చేతుల్లోకి వెళ్లిపోయాక అక్కడి పరిస్థితులు మారిపోవడంతో అరబ్ ఆ దేశం నుంచి పారిపోయాడు. అప్పటికి 19 ఏళ్ల వయసులో ఉన్న అతను అఫ్గాన్ జాతీయ జూడో జట్టులోకి ఎంపికయ్యాడు కూడా. అక్కడి నుంచి బయల్దేరి తొమ్మిది నెలల పాటు ఎన్నో కష్టాలకు ఓర్చి ఇరాన్, టర్కీ, గ్రీస్, బోస్నియా అండ్ స్లొవేనియాలలో తలదాచుకుంటూ చివరకు జర్మనీ చేరాడు. డార్ట్మండ్ సమీపంలోని శరణార్ధి శిబిరంలో తనలాగే ఇరాన్ నుంచి వచి్చన కోచ్ ఆధ్వర్యంలో జూడోలో శిక్షణ కొనసాగించాడు. అక్కడే ఆటలో రాటుదేలిన అరబ్... యూరోపియన్ ఓపెన్ తదితర టోరీ్నల్లో రాణించి ఎట్టకేలకు ఐఓసీ శరణార్ధి టీమ్‌లోకి ఎంపికయ్యాడు. ఇప్పటికీ అరబ్ కుటుంబం అఫ్గానిస్తాన్‌లో ఉంటోంది. తన తల్లి, సోదరుడితో మాట్లాడుతుంటానని... భవిష్యత్తులో తన పరిస్థితి మెరుగవుతుందని అరబ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. -
దేశం వద్దు పొమ్మంది.. అయినా పట్టువీడలే! సాహసం చేసి మరీ..
ఫరీబా హషిమి, యుల్డుజ్ ఇద్దరూ అక్కా చెల్లెళ్ళు. వారిద్దరికి చిన్నతనం నుంచి సైక్లింగ్ అంటే చాలా ఇష్టం. ఒలింపిక్స్‌లో తమ దేశం తరుపన సత్తాచాటాలని ఎన్నో కలలు కన్నారు. విశ్వవేదికపై తమ జాతీయ జెండాను రెపరెపలాడించాలని తహతహలడారు. కానీ విధి మాత్రం మరోలా తలపిచింది.సొంత దేశమే వారికి అండగా నిలవలేదు. వారి కలను ఆదిలోనే తుంచేయాలని అక్కడి పాలకులు నిర్ణయించారు. మహిళలలు క్రీడల్లో పాల్గోకూడదని ఆంక్షలు విధించారు. కానీ ఆ అక్కచెల్లెల్లు మాత్రం ఎక్కడా నిరాశచెందలేదు. విశ్వక్రీడలే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఏకంగా దేశాన్ని విడిచి మరి ఒలిపింక్స్‌లో సత్తాచాటేందుకు సిద్దమయ్యారు. తమ కలలను మరో వారం రోజుల్లో సాకారం చేసుకునేందుకు ఉర్రూతలూగుతున్నారు. ఇదింతా ఏ దేశమే కోసమో ఇప్పటికే మీకు ఓ అంచనా వచ్చి ఉంటుంది. అవును మీరు అనుకున్నది నిజమే. ఆ దేశమే తాలిబాన్లు పరిపాలిస్తున్న అఫ్గానిస్తాన్. ప్యారిస్ ఒలిపింక్స్ నేపథ్యంలో ఈ అఫ్గాన్ సైక్లిస్ట్ సిస్టర్ల స్టోరీపై ఒ లుక్కేద్దాం.అఫ్గాన్ ధీర వనితలు..2021లో అఫ్గానిస్తాన్‌ను తాలిబాన్లు ఆధీనంలో తీసుకున్నాక మహిళలు క్రీడల్లో పాల్గొనడంపై నిషేధం విధించారు. ఈ క్రమంలో ఫరీబా హషిమి, యుల్డుజ్ తమ కలలను సాకారం చేసుకునుందుకు దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. సరిగ్గా అదే సమయంలో అఫ్గానిస్తాన్‌లో చిక్కుకున్న తమ దేశ సైక్లిస్ట్ల తరలింపు కోసం ఇటలీ ప్రత్యేక విమానం ఏర్పాటు చేసింది.దీంతో ఫరీబా, యుల్డుజ్ సైతం ఇటలీ వెళ్లే విమానం ఎక్కారు. అక్కడ వెళ్లాక సరైన కోచింగ్‌ను పొందేందుకు ఇటలీలోని సైక్లింగ్ టీమ్‌లో ఈ అఫ్గాన్ సోదరిలు చేరారు. ఈ క్రమంలో ఈ ఏడాది జూన్‌లో ఏవోసీ(అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ) ప్యారిస్ ఒలింపిక్స్‌కు వెళ్లేందుకు లింగ సమానత్వాన్ని ప్రోత్సహిస్తూ ఆరుగురు సభ్యులతో కూడిన అఫ్గాన్ జట్టును ప్రకటించింది. అందులో ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ జాబితాలో ఫరీబా హషిమి, యుల్డుజ్లు చోటుదక్కించుకున్నారు. దీంతో ఒలిపింక్స్‌లో పాల్గోవాలన్న తమ కలను నేరువేర్చుకునేందుకు ఈ అక్కచెల్లెల్లు అడుగు దూరంలో నిలిచారు.మాకంటూ ప్రత్యేకమైన బలమేమి లేదు. మాకు మేమే బలం. నేను ఆమెకు ధైర్యంగా ఉంటాను. ఆమె నాకు సపోర్ట్‌గా ఉంటుంది: యుల్డుజ్ఒలింపిక్స్లో పాల్గోనే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. మేము సాధించిన ఈ ఘనతను అఫ్గానిస్తాన్ మహిళలకు అంకితమివ్వాలనకుంటున్నాము. ఎందుకంటే వారి వాళ్లే మేము ఒలింపిక్స్‌లో ఆడాలని నిర్ణయించుకున్నాము. మా హక్కులను కాలరాసినప్పటకి, మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలమని నిరూపించాం. ఈ విశ్వక్రీడల్లో మేము 20 మిలియన్ల ఆఫ్ఘన్ మహిళల తరపున ప్రాతినిథ్యం వహిస్తాము: ఫరీబా -
అఫ్గానిస్తాన్‌లో వర్ష బీభత్సం.. 35 మంది మృతి
అఫ్గానిస్తాన్‌లో ప్రకృతి బీభత్సం సృష్టించింది. తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లో కురిసిన భారీ వర్షాలకు వివిధ దుర్ఘటనలు చోటుచేసుకోవడంతో 35 మంది మృతి చెందారని తాలిబన్ అధికారి ఒకరు తెలిపారు.వర్షాల కారణంగా నంగర్హార్ ప్రావిన్స్‌లో చోటు చేసుకున్న ప్రమాదాల్లో పలువురు గాయపడ్డారని సమాచార, సాంస్కృతిక శాఖ ప్రావిన్షియల్ డైరెక్టర్ సెడిఖుల్లా ఖురేషి మీడియాకు తెలిపారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నారని, సుర్ఖ్ రోడ్ జిల్లాలో ఇంటి పైకప్పు కూలిపోవడంతో వారు ప్రాణాలు కోల్పోయారని ఖురేషీ తెలిపారు. మృతుల్లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారన్నారు.భారీవర్షాల కారణంగా వివిధ ప్రాంతాల్లో ఆస్తి నష్టం జరిగింది. భారీ ఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. నంగర్హార్లోని ప్రాంతీయ ఆసుపత్రి అధిపతి అమీనుల్లా షరీఫ్ మాట్లాడుతూ ఇప్పటివరకు 207 మంది బాధితులు వివిధ ఆస్పత్రులకు చికిత్స కోసం వచ్చారన్నారు. కాగా గత మే 10, 11 తేదీల్లో దేశంలో కురిసిన భారీ వర్షాలకు 300 మందికి పైగా మృతి చెందారు. వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. -
కశ్మీర్ ఉగ్రవాదుల చేతికి అమెరికా తుపాకులు
న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్ నుంచి 2021లో నిష్క్రమించిన సందర్భంగా అమెరికా సేనలు అక్కడే వదిలేసిన అత్యాధునిక తుపాకులు పాకిస్తాన్ మీదుగా జమ్మూకశ్మీర్ ఉగ్రవాదుల చేతికందాయని నిపుణులు చెబుతున్నారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి ఘటనల్లో వీటిని విరివిరిగా వాడటంపై విశ్లేషకులు ఆందోళన వ్యక్తంచేశారు. వీటిల్లో ముఖ్యంగా ఎం4 కార్బైన్ అసాల్ట్ రైఫిల్ ప్రధానమైంది. అత్యంత తేలిగ్గా ఉంటూ, మేగజీన్‌ను సులువుగా మారుస్తూ సునాయాసంగా షూట్‌చేసే వెలుసుబాటు ఈ రైఫిల్‌లో ఉంది. దాదాపు 600 మీటర్ల దూరంలోని లక్ష్యాలనూ గురిచూసి కొట్టొచ్చు. నిమిషానికి 700–970 బుల్లెట్ల వర్షం కురిపించే సత్తా ఈ రైఫిల్ సొంతం. ఇంతటి వినాశకర రైఫిళ్లు కశ్మీర్ ముష్కరమూకల చేతికి రావడంతో దూరం నుంచే మెరుపు దాడులు చేస్తూ సునాయాసంగా తప్పించుకుంటున్నారని రక్షణ రంగ నిపుణుడు లెఫ్టినెంట్ జనరల్ సంజయ్ కులకర్ణి అసహనం వ్యక్తంచేశారు. 2017 నవంబర్‌లో జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ బంధువు రషీద్‌ను సైన్యం మట్టుబెట్టినపుడు అక్కడ తొలిసారిగా ఎం4 రైఫిల్‌ను సైన్యం స్వాధీనంచేసుకుంది. 2018లో, 2022లో ఇలా పలు సందర్భాల్లో ఉగ్రవాదుల ఎన్కౌంటర్ ఘటనాస్థలిలో ఈ రైఫిళ్లను భారత ఆర్మీ గుర్తించింది. జూలై 8వ తేదీన కథువాలో ఐదుగురు జవాన్లను పొట్టనబెట్టుకున్న ఉగ్రదాడిలోనూ ఇవే రైఫిళ్లను వాడారని తెలుస్తోంది. -
T20 World Cup 2024: కప్ మనోళ్లదే, కానీ..!
టీ20 వరల్డ్‌కప్ 2024లో టీమిండియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. నిన్న (జూన్ 29) జరిగిన ఫైనల్లో భారత్.. సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించి, రెండో సారి ప్రపంచ ఛాంపియన్‌గా (టీ20) నిలిచింది.ఈ టోర్నీలో భారత్ టైటిల్ గెలిచినప్పటికీ.. లీడింగ్ రన్ స్కోరర్, లీడింగ్ వికెట్ టేకర్‌గా మాత్రం ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు ఉన్నారు. బ్యాటింగ్‌లో రహ్మానుల్లా గుర్బాజ్ (8 మ్యాచ్‌ల్లో 281 పరుగులు), బౌలింగ్‌లో ఫజల్హక్ ఫారూఖీ (8 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు) టాప్‌లో ఉన్నారు. బ్యాటింగ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ రెండో స్థానంలో (8 మ్యాచ్‌ల్లో 257 పరుగులు) ఉండగా.. బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్ (8 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు) ఉన్నారు.ఈ టోర్నీలో అత్యధిక బ్యాటింగ్ సగటు రిచీ బెర్రింగ్టన్ (స్కాట్లాండ్. 102), అత్యుత్తమ స్ట్రయిక్‌రేట్ షాయ్ హోప్ (187.72), అత్యధిక హాఫ్ సెంచరీలు రహ్మానుల్లా గుర్బాజ్ (3), అత్యధిక బౌండరీలు ట్రవిస్ హెడ్ (26), అత్యధిక సిక్సర్లు నికోలస్ పూరన్ (17) పేరిట ఉన్నాయి. ఈ టోర్నీలో ఒక్క సెంచరీ కూడా నమోదు కాకపోవడం విశేషం.బౌలింగ్ విషయానికొస్తే.. అత్యధిక బౌలింగ్ సగటు టిమ్ సౌథీ (5.14), అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు ఫజల్హక్ ఫారూఖీ (5-9) పేరిట ఉన్నాయి. ఈ టోర్నీలో కేవలం రెండు సార్లు మాత్రమే ఐదు వికెట్ల ఘనతలు నమోదయ్యాయి. ఫారూఖీతో పాటు అకీల్ హొసేన్ ఐదు వికెట్ల ఘనత (5/11) సాధించాడు. ఫజల్హక్, అకీల్ హొసేన్ ఇద్దరూ ఉగాండపైనే ఐదు వికెట్ల ఘనత నమోదు చేయడం విశేషం. -
బాధగా ఉంది.. కానీ ఇది ఆరంభం మాత్రమే! ఎవరనైనా ఓడిస్తాము: రషీద్
టీ20 వరల్డ్‌కప్-2024లో అఫ్గానిస్తాన్ పోరాటం ముగిసింది. ఈ మెగా టోర్నీలో సంచలన విజయాలు నమోదు చేస్తూ ప్రత్యర్ధి జట్లను భయపెట్టిన అఫ్గాన్ జట్టు.. నాకౌట్ దశను దాటలేకపోయింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ట్రినిడాడ్ వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా చేతిలో 9 వికెట్ల తేడాతో అఫ్గాన్ ఘోర ఓటమి చవిచూసింది. బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైన అఫ్గానిస్తాన్ కేవలం 56 పరుగులకే కుప్పకూలింది. అనంతరం 57 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి చేధించింది. ఈ విజయంతో సౌతాఫ్రికా తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టగా.. అఫ్గానిస్తాన్ ఇంటి బాట పట్టింది. ఇక ఈ ఓటమిపై అఫ్గానిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఓటమి పాలైమని రషీద్ ఖాన్ చెప్పుకొచ్చాడు."ఈ ఓటమిని మేము జీర్ణించుకోలేకపోతున్నాం. మేము బాగా ఆడటానికి ప్రయత్నించాము. కానీ ఇక్కడి పిచ్ మాకు పెద్దగా సహకరించలేదు. ఇక్కడి పరిస్థితులు బ్యాటింగ్‌కు చాలా కష్టంగా ఉన్నాయి. అయితే మా ఓటమికి ఇదే నేను సాకుగా చెప్పాలనుకోవడం లేదు. ప్రస్తుత టీ20 క్రికెట్ అంటే ఎలా ఉంటుందంటే అన్ని పరిస్థితులకూ మనం సిద్ధంగా ఉండాలి.సౌతాఫ్రికా బౌలర్లు కూడా అద్బుతంగా బౌలింగ్ చేశారు. సెమీస్‌లో ఓడిపోయినప్పటకి ఈ టోర్నీలో మేము గొప్ప విజయాలు సాధించాము. ముజీబ్ ఆరంభంలోనే మా జట్టుకు దూరమైనప్పటికి మా సీమర్లు అతడి లోటును తెలియజేయలేదు. మా పేసర్లు అద్బుతంగా బౌలింగ్ చేశారు. నబీ కూడా కొత్త బంతితో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఓవరాల్‌గా ఈ టోర్నీని మేం బాగా ఆస్వాదించాం. టాప్ క్లాస్ జట్టు దక్షిణాఫ్రికా చేతిలో ఓటమిని నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను. కానీ ఇది మాకు ప్రారంభం మాత్రమే. ఏ జట్టునైనా ఓడించగలమన్న విశ్వాసం, నమ్మకం మాకు ఉన్నాయి. ఈ మెగా ఈవెంట్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నామని"పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో రషీద్ పేర్కొన్నాడు. -
సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాభవం.. ఆఫ్ఘన్ల గుండె బద్దలైంది..!
టీ20 వరల్డ్‌కప్ 2024లో ఆఫ్ఘనిస్తాన్ జైత్రయాత్ర ముగిసింది. ఇవాళ (జూన్ 27) జరిగిన తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా చేతిలో ఓటమితో ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్ పోరాటం ముగిసింది. ఈ ఓటమితో ఆఫ్ఠనిస్తాన్ వరల్డ్‌కప్ నుంచి నిష్క్రమించింది. టోర్నీ ఆరంభం నుంచి సంచలన విజయాలు సాధిస్తూ సెమీస్ దాకా చేరిన ఆఫ్ఘనిస్తాన్ అవమానకర రీతిలో వైదొలగడం ప్రతి క్రికెట్ అభిమానిని కలిచి వేస్తుంది. ఈ ఓటమి అనంతరం ఆఫ్ఘన్ల గుండెలు బద్దలయ్యాయి. ఆఫ్ఘన్ ఆటగాళ్లు ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ దేశ అభిమానుల బాధ అయితే వర్ణణాతీతంగా ఉంది. ఆఫ్ఘన్ ఓటమిని తట్టుకోలేని ఫ్యాన్స్ కన్నీటిపర్యంతమయ్యారు. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలిన అనంతరం కెప్టెన్ రషీద్ ఖాన్, కోచ్ జోనాథన్ ట్రాట్ ముఖాల్లో విషాద ఛాయలు కనిపించాయి. వారి ముఖాలు చూస్తే ఎంత కఠినాత్ములకైనా జాలేయాల్సిందే. రషీద్ ఖాన్ కన్నీటిపర్యంతమవుతూ కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. ఓటమి అనంతరం డగౌట్‌కు చేరుకునే క్రమంలో ఆఫ్ఘన్ ఆటగాళ్లు ఏడ్చినంత పని చేశారు. ఆఫ్ఘన్ ఆటగాళ్ల విషాద ముఖాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. నెటిజన్లు ఆఫ్ఘన్లను ఓదారుస్తున్నారు. ఆటలో గెలుపోటములు సహజమే అని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు అయితే తలెత్తుకో కెప్టెన్ అని ట్వీట్ చేసింంది. Chin up, Skipp! You've given us the World this event! 🙌@RashidKhan_19#AfghanAtalan | #T20WorldCup | #GloriousNationVictoriousTeam pic.twitter.com/jFu6SO2vmX— Afghanistan Cricket Board (@ACBofficials) June 27, 2024మొత్తానికి ఆఫ్ఘనిస్తాన్‌కు తొలిసారి సెమీస్‌కు చేరామన్న సంతోషం కనీసం రెండ్రోజులైనా లేకుండా పోయింది. ఈ బాధ నుంచి వారు బయటపడాలంటే సమయం తీసుకుంటుంది. కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్.. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ లాంటి మెరుగైన జట్లకు షాకిచ్చి సెమీస్‌కు చేరిన విషయం తెలిసిందే. ఆసీస్, బంగ్లాదేశ్‌లపై విజయాల అనంతరం ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్ల సంతోషం వర్ణణాతీతంగా ఉండింది. ఆఫ్ఘన్ల సంబరాలు అంబరాన్నంటాయి. తాజాగా సెమీఫైనల్లో ఓటమి ఆ జట్టు ఆటగాళ్లను, ఆ దేశ అభిమానులను కలిచి వేస్తుంది.ఇదిలా ఉంటే, ట్రినిడాడ్ వేదికగా సౌతాఫ్రికాతో ఇవాళ (జూన్ 27) జరిగిన తొలి సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్ 9 వికెట్ల తేడాతో చిత్తు ఓడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్లు 56 పరుగుల స్వల్ప స్కోర్‌కు చాపచుట్టేయగా.. సౌతాఫ్రికా ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా సౌతాఫ్రికా తొలిసారి ప్రపంచకప్ టోర్నీల్లో (వన్డే, టీ20) ఫైనల్‌కు చేరింది.ఇవాళ రాత్రి 8 గంటలకు జరుగబోయే రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు వరుణుడి ముప్పు పొంది ఉందని సమాచారం. ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే సూపర్-8లో మెరుగైన పాయింట్లు ఉన్న కారణంగా టీమిండియా ఫైనల్స్‌కు వెళ్తుంది. ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే లేదు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో సౌతాఫ్రికా ఫైనల్లో తలపడుతుంది. -
T20 World Cup 2024: రషీద్ ఖాన్‌కు మందలింపు
ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్‌ను ఐసీసీ మందలించింది. టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో బ్యాట్‌ను నేలకేసి కొట్టినందుకు గాను మందలింపుతో పాటు ఓ డీమెరిట్ పాయింట్‌ను ఫైన్‌గా విధించింది. 24 నెలల వ్యవధిలో రషీద్ చేసిన మొదటి తప్పిదం కావడంతో ఐసీసీ స్వల్ప చర్యలతో సరిపెట్టింది. బ్యాట్‌ను నేలకేసి కొట్టడం ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.9ని ఉల్లంఘన కిందికి వస్తుంది. దీన్ని లెవెల్ 1 తప్పిదంగా పరిగణిస్తారు.బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ చివరి ఓవర్లో రషీద్ బ్యాట్‌ను నేలకేసి కొట్టాడు. ఆ సందర్భంలో తన బ్యాటింగ్ భాగస్వామి కరీం జనత్ స్ట్రైక్‌ను తిరస్కరించినందుకు (రెండో పరుగు) రషీద్ బ్యాట్‌ను నేలకేసి కొట్టాడు. ఆ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరింది. అయితే సెమీస్‌లో ఆ జట్టుకు సౌతాఫ్రికా చేతిలో చుక్కెదురైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్లు 56 పరుగుల స్వల్ప స్కోర్‌కు చాపచుట్టేయగా.. సౌతాఫ్రికా ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా సౌతాఫ్రికా తొలిసారి ప్రపంచకప్ టోర్నీల్లో (వన్డే, టీ20) ఫైనల్‌కు చేరింది. ఇవాళే (జూన్ 27, రాత్రి 8 గంటలకు) జరుగబోయే రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు వరుణుడి ముప్పు పొంచి ఉందని సమాచారం. ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే సూపర్-8లో మెరుగైన పాయింట్లు ఉన్న కారణంగా టీమిండియా ఫైనల్స్‌కు వెళ్తుంది. ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే లేదు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో సౌతాఫ్రికా ఫైనల్లో తలపడుతుంది. -
T20 WC Semis: 56 పరుగులకే ఆలౌట్.. ఆఫ్ఘనిస్తాన్ ఖాతాలో చెత్త రికార్డులు
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా సౌతాఫ్రికా ఇవాళ (జూన్ 27) జరిగిన తొలి సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్ 56 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘన్ ఆటగాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. కేవలం ఒకే ఒక్కరు (అజ్మతుల్లా (10)) రెండంకెల స్కోర్ చేయగలిగారు. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో ఎక్సట్రాల రూపంలో వచ్చిన పరుగులు అత్యధికం (13) కావడం విశేషం. ఆఫ్ఘన్ ఆటగాళ్లు రహ్మనుల్లా గుర్బాజ్ (0), ఇబ్రహీం జద్రాన్ (2), గుల్బదిన్ నైబ్ (9), మొహమ్మద్ నబీ (0), ఖరోటే (2), కరీమ్ జనత్ (8), రషీద్ ఖాన్ (8), నూర్ అహ్మద్ (0), నవీన్ ఉల్ హక్ (2) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ విభాగంలో దారుణంగా విఫలమైన ఆఫ్ఘనిస్తాన్ కొన్ని చెత్త రికార్డులు మూటగట్టుకుంది. ఆ రికార్డులేంటో చూద్దాం.టీ20 ప్రపంచకప్ టోర్నీల సెమీఫైనల్స్‌లో అత్యల్ప స్కోర్టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో ఐసీసీ ఫుల్ మెంబర్ టీమ్ చేసిన రెండో అత్యల్ప స్కోర్టీ20ల్లో ఆఫ్ఘనిస్తాన్‌కు అత్యల్ప స్కోర్ప్రస్తుత వరల్డ్‌కప్‌లో పవర్ ప్లేల్లో (తొలి 6 ఓవర్లలో) అత్యధిక వికెట్లు (5)టీ20ల్లో సౌతాఫ్రికాపై ఏ జట్టుకైనా ఇదే అత్యల్ప స్కోర్ (56)కాగా, ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ చేసిన స్వల్ప స్కోర్‌ను సౌతాఫ్రికా ఆడుతూపాడుతూ ఛేదించి తొలి సారి ప్రపంచకప్ టోర్నీల్లో (వన్డే, టీ20) ఫైనల్‌కు చేరింది. తొలుత సఫారీ బౌలర్లు జన్సెన్ (3-0-16-3), షంషి (1.5-0-6-3), రబాడ (3-1-14-2), నోర్జే (3-0-7-2) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఆఫ్ఘన్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా 8.5 ఓవర్లలోనే వికెట్ నష్టపోయి విజయతీరాలకు చేరింది. డికాక్ 5 పరుగులు చేసి ఫజల్ హక్ ఫారూఖీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ కాగా.. రీజా హెండ్రిక్స్ (29), మార్క్రమ్ (23) సౌతాఫ్రికాను గెలుపు తీరాలు దాటించారు. -
సెమీస్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఘోర పరాజయం.. తొలిసారి ఫైనల్లో సౌతాఫ్రికా
టీ20 వరల్డ్‌కప్ 2024 తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా చేతిలో ఆఫ్ఘనిస్తాన్ చిత్తు ఓడింది. ట్రినిడాడ్ వేదికగా ఇవాళ (జూన్ 27) జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా తొలిసారి వరల్డ్‌కప్ టోర్నీల్లో (వన్డే, టీ20) ఫైనల్‌కు చేరింది.రెచ్చిపోయిన సఫారీ బౌలర్లు.. చేతులెత్తేసిన ఆఫ్ఘన్ బ్యాటర్లుఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసి 56 పరుగులకే కుప్పకూలింది. సఫారీ బౌలర్లు విరుచుకుపడటంతో ఆఫ్ఘన్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. జన్సెన్ (3-0-16-3), షంషి (1.5-0-6-3), రబాడ (3-1-14-2), నోర్జే (3-0-7-2) ఆకాశమే హద్దుగా చెలరేగి ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌ను కకావికలం చేశారు. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో కేవలం ఒక్కరు మాత్రమే (అజ్మతుల్లా (10)) రెండంకెల స్కోర్ చేయగలిగారంటే సఫారీ పేసర్లు ఏరకంగా రెచ్చిపోయారో అర్దమవుతుంది. గుర్బాజ్ (0), జద్రాన్ (2), గుల్బదిన్ నైబ్ (9), నబీ (0), ఖరోటే (2), కరీమ్ జనత్ (8), రషీద్ ఖాన్ (8), నూర్ అహ్మద్ (0), నవీన్ ఉల్ హక్ (2) దారుణంగా విఫలమయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చిన పరుగులు అత్యధికం (13) కావడం విశేషం.ఆడుతూ పాడుతూ..అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా కేవలం 8.5 ఓవర్లలోనే వికెట్ నష్టపోయి విజయతీరాలకు చేరింది. డికాక్ 5 పరుగులు చేసి ఫజల్ హక్ ఫారూఖీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ కాగా.. రీజా హెండ్రిక్స్ (29), మార్క్రమ్ (23) సౌతాఫ్రికాను గెలుపు తీరాలు దాటించారు. -
టీ20 వరల్డ్‌కప్ : చిత్తుగా ఓడిన ఆఫ్ఘనిస్తాన్.. ఫైనల్లో సౌతాఫ్రికా (ఫొటోలు)
-
T20 1st Semis: చిత్తుగా ఓడిన ఆఫ్ఘనిస్తాన్.. ఫైనల్లో సౌతాఫ్రికా
చిత్తుగా ఓడిన ఆఫ్ఘనిస్తాన్.. ఫైనల్లో సౌతాఫ్రికాటీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా సౌతాఫ్రికాతో ఇవాళ (జూన్ 27) జరిగిన తొలి సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్ చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 11.5 ఓవర్లలో 56 పరుగులకే ఆలౌటైంది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా 8.5 ఓవర్లలో ఆడుతూపాడుతూ విజయతీరాలకు (వికెట్ కోల్పోయి) చేరింది.టార్గెట్ 57.. 5 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా57 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 5 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఫజల్ హక్ బౌలింగ్‌లో డికాక్ (5) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 11.5 ఓవర్లలో 56 పరుగులకు అప్ఘనిస్తాన్ ఆలౌట్.. దక్షిణాఫ్రికా విజయలక్ష్యం 57 పరుగులు50 పరుగులకే తొమ్మిది వికెట్లు డౌన్ఆఫ్ఘనిస్తాన్ ఒకే స్కోర్ వద్ద మూడు వికెట్లు కోల్పోయింది. 50 పరుగుల వద్ద ఆఫ్ఘనిస్తాన్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. నోర్జే బౌలింగ్‌లో రషీద్ ఖాన్ (8) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.50 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్ఆఫ్ఘనిస్తాన్ జట్టు 50 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయి ఘోర పతనం దిశగా సాగుతుంది. షంషి బౌలింగ్‌లో నూర్ అహ్మద్ (0) ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. 10 ఓవర్ల తర్వాత ఆఫ్ఘనిస్తాన్ స్కోర్ 50/8గా ఉంది. రషీద్ ఖాన్ (8), నవీన్ ఉల్ హక్ (0) క్రీజ్‌లో ఉన్నారు.50 పరుగుల వద్ద ఏడో వికెట్ డౌన్50 పరుగుల వద్ద ఆఫ్ఘనిస్తాన్ ఏడో వికెట్ కోల్పోయింది. తబ్రేజ్ షంషి బౌలింగ్‌లో కరీమ్ జనత్ (8) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. 28 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్ఆఫ్ఘనిస్తాన్ 28 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. నోర్జే బౌలింగ్‌లో ట్రిస్టన్ స్టబ్స్‌కు క్యాచ్ ఇచ్చి ఒమర్జాయ్ (10) ఔటయ్యాడు. కరీమ్ జనత్ (4), రషీద్ ఖాన్ (8) క్రీజ్‌లో ఉన్నారు. 9 ఓవర్ల తర్వాత ఆఫ్ఘనిస్తాన్ స్కోర్ 45/6గా ఉందిట్రినిడాడ్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్ 2024 తొలి సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆఫ్ఘనిస్తాన్‌కు టాస్ గెలిచిమాన్న సంతోషం ఎంతో సేపు నిలబడలేదు. సఫారీ పేసర్లు రెచ్చిపోవడంతో ఆఫ్ఘన్లు 23 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. గుర్బాజ్ (0), ఇబ్రహీం జద్రాన్ (2), గుల్బదిన్ నైబ్ (9), మొహమ్మద్ నబీ (0), ఖరోటే (2) దారుణంగా విఫలమయ్యారు. జన్సెన్ (3-0-16-3) ఆఫ్ఘన్లను దెబ్బకొట్టాడు. రబాడ (2-1-5-2) మరో చేయి వేశాడు.తుది జట్లు..దక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్(వికెట్‌కీపర్), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రమ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జే, తబ్రైజ్ షమ్సీఆఫ్ఘనిస్తాన్: రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్‌కీపర్), ఇబ్రహీం జద్రాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బదిన్ నైబ్, మహ్మద్ నబీ, కరీం జనత్, రషీద్ ఖాన్(కెప్టెన్), నంగేయాలియా ఖరోటే, నూర్ అహ్మద్, నవీన్-ఉల్-హక్, ఫజల్హక్ ఫారూఖీ -
చరిత్రకు చేరువలో..
తరూబా (ట్రినిడాడ్): ఓ ఆసక్తికర సెమీస్ సమరం, ఓ కొత్త ఫైనలిస్టుకు వేదికైన ఈ ప్రపంచకప్‌లో అటు దక్షిణాఫ్రికా, ఇటు అఫ్గానిస్తాన్ ఎవరు ఫైనల్ చేరతారో గురువారం మధ్యాహ్నంలోపు తెలిసిపోతుంది. మెగా ఈవెంట్లోనే మేటి జట్లను తోసిరాజని బాగా ఆకట్టుకున్న ఏకైక జట్టు అఫ్గానిస్తాన్. తమ ఆట ఆషామాషీగా లేదని, సంచలన విజయాలు గాలివాటం కానేకాదని రషీద్ ఖాన్ బృందం నిరూపిస్తోంది. ఆతిథ్య విండీస్, పటిష్ట న్యూజిలాండ్ ఉన్న గ్రూప్ ‘సి’లో లీగ్ దశనే అఫ్గానిస్తాన్ దాటడం గొప్పనుకుంటే... ‘సూపర్–8’లో ఏకంగా 2021 చాంపియన్ ఆ్రస్టేలియానే కంగుతినిపించడం, బంగ్లాదేశ్‌పై తీవ్ర ఒత్తిడి ఉన్న ఆఖరి మ్యాచ్‌లో పోరాడి గెలవడం క్రికెట్ చరిత్రలోనే నిలిచేలా చేసింది. అఫ్గాన్ సెమీస్ చేరడంతోనే రికార్డుల్లోకెక్కింది. ఇప్పుడు ఫైనల్ చేరి చరిత్ర పుటల్లోకెక్కాలని గట్టి పట్టుదలతో ఉంది. ఇటు బ్యాటర్లు, అటు బౌలర్లు సమష్టిగా రాణిస్తుండటం అఫ్గాన్ పెను సంచలనాలకు కారణం కాగా... మరోవైపు గట్టి జట్టయిన దక్షిణాఫ్రికా మాత్రం ప్రతి మ్యాచ్‌ను కష్టపడుతూనే గెలుపొందడం విడ్డూరం. నెదర్లాండ్స్‌పై 103 పరుగుల లక్ష్యాన్ని 19వ ఓవర్లో ఛేదించడం, బంగ్లాదేశ్‌పై 4 పరుగులు, నేపాల్‌తో ఒక పరుగు తేడాతో గట్టెక్కడం సఫారీ స్థాయిని తక్కువ చేస్తోంది. తొలిసారి ప్రపంచకప్‌లో ఆడిన అమెరికాపై 194/4లాంటి భారీస్కోరు చేసినా కేవలం 18 పరుగులతోనే గెలుపొందడం... ఇలా ప్రతీ మ్యాచ్‌లోనూ దక్షిణాఫ్రికా పెద్ద పెద్ద పోరాటాలే చేసింది. ఇలాంటి జట్టుపై జోరుమీదున్న అఫ్గాన్ గెలిస్తే సంచలనమైతే అవుతుందేమో కానీ ఇందులో పెద్ద విశేషమైతే ఉండదు. మొత్తం మీద తొలి ఫైనల్ అవకాశాన్ని ఎవరు దక్కించుకుంటారనేదే ఆసక్తికరంగా మారింది. జట్లు (అంచనా) దక్షిణాఫ్రికా: మార్క్రమ్ (కెప్టెన్), డికాక్, హెండ్రిక్స్, స్టబ్స్, క్లాసెన్, మిల్లర్, జాన్సెన్, కేశవ్, రబాడ, నోర్జే, షమ్సీ.అఫ్గానిస్తాన్: రషీద్ ఖాన్ (కెప్టెన్), గుర్బాజ్, ఇబ్రహీమ్, అజ్మతుల్లా, గుల్బదిన్, నబీ, కరీమ్, నంగేయలియా, నూర్ అహ్మద్, నవీనుల్ హక్, ఫరూఖీ. 2 దక్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య ఇప్పటి వరకు రెండు టి20 మ్యాచ్‌లు జరగ్గా... రెండింటిలోనూ దక్షిణాఫ్రికానే గెలిచింది. 2010 ప్రపంచకప్‌లో 59 పరుగులతో, 2016 ప్రపంచకప్‌లో 37 పరుగులతో దక్షిణాఫ్రికా నెగ్గింది. -
భారత్‌కు ధన్యవాదాలు!.. అన్నీ తామై నడిపించిన వీరులు
క్రికెట్ వర్గాల్లో ఎక్కడ చూసినా అఫ్గనిస్తాన్ జట్టు గురించే చర్చ. అసాధారణ ఆట తీరుతో రషీద్ ఖాన్ బృందం టీ20 వరల్డ్‌కప్-2024లో సెమీస్ చేరిన విధానం నిజంగా ఓ అద్భుతం లాంటిదే. న్యూజిలాండ్‌పై భారీ విజయం మొదలు.. ఆస్ట్రేలియాను ఓడించడం దాకా.. సంచలన ప్రదర్శనతో అఫ్గన్ ఇక్కడిదాకా చేరుకున్న తీరు అమోఘం. గత ఎడిషన్‌లో కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవని జట్టు ఈసారి ఏకంగా టాప్-4లో నిలవడం అంటే మామూలు విషయం కాదు.గత కొన్నేళ్లుగా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న అఫ్గన్లకు రషీద్ బృందం సాధించిన విజయం కొత్త ఊపిరిలూదింది. కష్టాలన్నీ మర్చిపోయి వీధుల్లోకి వచ్చి మరీ ప్రజలు తమ సంతోషాన్ని పంచుకోవడం ఇందుకు నిదర్శనం.ఈ క్రమంలో అఅఫ్గన్ క్రికెట్ ఎదుగుదులలో తోడ్పాడు అందించిన భారత్‌కు తాలిబన్ రాజకీయ కార్యాలయ అధినేత సుహైల్ ఖాన్ ధన్యవాదాలు చెప్పడం విశేషం. ఇక అఫ్గన్ ప్రయాణం ఇక్కడి దాకా సాగడంలో కీలక పాత్ర పోషించిన ముఖ్యమైన వ్యక్తులకు కూడా తాలిబన్ నేతలు, అఫ్గన్ ప్రజలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఆ ముఖ్యులు ఎవరంటే..రషీద్ ఖాన్కెప్టెన్గా జట్టుకు అన్నీ తానే, అంతటా తానే అయి నడిపిస్తున్నాడు. తన పదునైన లెగ్‌స్పిన్‌తో టోర్నీలో 16 వికెట్లు పడగొట్టిన రషీద్... బ్యాటింగ్‌లోనూ మెరుపులతో తన పాత్ర పోషించాడు. బంగ్లాతో మ్యాచ్‌లో అతని మూడు సిక్సర్లే చివరకు కీలకంగా మారాయి. ఆసీస్‌తో మ్యాచ్‌లో బౌలర్లను మార్చిన తీరులో అతని నాయకత్వ సామర్థ్యం కూడా కనిపించింది. 25 ఏళ్ల రషీద్ ఇప్పటి వరకు 92 టి20లు ఆడి 152 వికెట్లు తీయడంతోపాటు 452 పరుగుల సాధించాడు. రహ్మనుల్లా గుర్బాజ్ఓపెనర్గా అతని దూకుడైన ఆట జట్టుకు మంచి ఆరంభాలను అందించి విజయానికి బాటలు వేసింది. 281 పరుగులతో ప్రస్తుతం టోర్నీ టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. ముఖ్యంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ఐపీఎల్ అనుభవంతో ఇటీవల అతని బ్యాటింగ్ మరింత పదునెక్కింది. 22 ఏళ్ల గుర్బాజ్ ఇప్పటి వరకు 62 టి20లు ఆడి 1657 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 10 అర్ధ సెంచరీలు ఉన్నాయి. నవీన్ ఉల్ హక్ప్రధాన పేసర్‌గా జట్టుకు కీలక సమయాల్లో వికెట్లు అందించి పైచేయి సాధించేలా చేశాడు. టోర్నీలో 13 వికెట్లు తీసిన అతను బంగ్లాదేశ్‌పై ఆరంభంలో తీసిన 2 వికెట్లే విజయానికి బాటలు వేశాయి.ట్రవిస్ హెడ్‌ను క్లీన్»ౌల్డ్ చేసిన అతని అవుట్‌స్వింగర్ టోర్నీకే హైలైట్‌గా నిలిచింది. 24 ఏళ్ల నవీన్ 44 టి20లు ఆడి 59 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పలు ఫ్రాంచైజీ లీగ్‌లలో రెగ్యులర్‌గా ఆడుతున్నాడు. ‘మీరు బాగా ఆడితే గెలిస్తే చాలు...అదే నాకు ఫీజు, పారితోషకం’ – అజయ్ జడేజా (వన్డే వరల్డ్ కప్‌లో టీమ్‌కు మెంటార్‌గా పని చేసిన జడేజా అఫ్గాన్ బోర్డునుంచి ఒక్క రూపాయి కూడా తీసుకునేందుకు నిరాకరించాడు) డ్వేన్ బ్రేవో (బౌలింగ్ కన్సల్టెంట్): 573 టి20 మ్యాచ్‌లు, 625 వికెట్లతో అపార అనుభవం ఉన్న విండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవోను ఈ టోర్నీ కోసం అఫ్గాన్ బౌలింగ్ కన్సల్టెంట్‌గా నియమించుకుంది. అతడి నియామకాన్ని జట్టు సమర్థంగా వాడుకుంది. ముఖ్యంగా అఫ్గాన్ పేసర్ల బౌలింగ్‌లో ఆ తేడా కనిపించింది. టి20ల్లో స్లో బంతులను వాడే విషయంలో బ్రేవో సూచనలు, వ్యూహాలు అద్భుతంగా పని చేశాయి. జొనాథన్ ట్రాట్: ఇంగ్లండ్ మాజీ ఆటగాడైన ట్రాట్ హెడ్ కోచ్‌గా జట్టు పురోగతిలో కీలక పాత్ర పోషించాడు. జూలై 2022 నుంచి అతను కోచ్‌గా కొనసాగుతున్నాడు. గత ఏడాదే పదవీ కాలం పూర్తయినా మళ్లీ అతడినే అఫ్గాన్ కొనసాగించింది. ట్రాట్ శిక్షణ, ప్రణాళికలు కొత్త తరహా టీమ్‌ను ప్రపంచానికి పరిచయం చేశాయి. ఇప్పుడు సరైన ఫలితాలు అందిస్తున్నాయి. మహ్మద్ నబీ15 ఏళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్లో ఆ జట్టు ప్రస్థానం ప్రారంభమైంది. ఆరంభంలో ఐసీసీ వరల్డ్ క్రికెట్ లీగ్–డివిజన్–5లో జపాన్, బోట్స్వానావంటి జట్లతో తలపడిన టీమ్ ఇప్పుడు ఆసీస్, కివీస్, విండీస్, పాక్‌లను దాటి వరల్డ్ కప్ సెమీస్‌లోకి అడుగు పెట్టడం అసాధారణం. అఫ్గానిస్తాన్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ నబీ 15 ఏళ్లుగా జాతీయ జట్టుకు ఆడుతున్నాడు. అఫ్గాన్ పురోగతికి అతను ప్రత్యక్ష సాక్షి. అఫ్గాన్ తరఫున ఏకంగా 45 ప్రత్యర్థి దేశాలపై విజయం సాధించిన టీమ్‌లలో అతను భాగస్వామి. ‘ఆరంభంలో మేం ఎదుర్కొన్న సమస్యలను దాటి ఇక్కడికి రావడం ఎంతో గొప్పగా అనిపిస్తోంది. మా ఘనతల వెనక ఎన్నో కష్టాలు, త్యాగాలు ఉన్నాయి. అవి ఇప్పుడు ఫలితాన్ని అందించాయి’ అని నబీ చెప్పాడు. ఈ టోర్నీలో అఫ్గాన్ టీమ్ ప్రదర్శనలతో పలువురు కీలక పాత్ర పోషించారు. కల నిజమైందిసెమీస్కు చేరడం కలగా ఉంది. ఇంకా నమ్మలేకపోతున్నాను. న్యూజిలాండ్‌పై గెలుపుతో మాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. మేం చేసింది తక్కువ స్కోరని తెలుసు. కానీ గట్టిగా పోరాడాలని నిర్ణయించుకున్నాం. మా ప్రణాళికలను సమర్థంగా అమలు చేశాం. జట్టులో ప్రతీ ఒక్కరు తమ పాత్ర సమర్థంగా పోషించారు. ఇది పెద్ద ఘనత మా దేశంలో ప్రజలకు సంతోషం పంచాలని కోరుకున్నాం. అక్కడ ఇప్పుడు సంబరాలు జరుగుతున్నాయి. మా ఆనందాన్ని వర్ణించడానికి మాటలు రావడం లేదు. –రషీద్ ఖాన్, అఫ్గానిస్తాన్ కెప్టెన్ -సాక్షి. క్రీడా విభాగం -
టీ20 వరల్డ్‌కప్ 2024 తొలి సెమీఫైనల్.. ఏ జట్టు గెలిచినా రికార్డే..!
టీ20 వరల్డ్‌కప్ 2024 ఫైనల్ మ్యాచ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఈ సారి ఫైనల్‌కు క్వాలిఫై అయ్యే మొదటి జట్టుకు ప్రపంచకప్ టోర్నీల్లో ఇది మొదటి ఫైనల్ అవుతుంది. భారతకాలమానం ప్రకారం రేపు (జూన్ 27) ఉదయం జరుగుబోయే తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్లలో ఏ జట్టు ఫైనల్‌కు చేరినా రికార్డే అవుతుంది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు ప్రపంచకప్ టోర్నీల్లో (వన్డే, టీ20) ఒక్కసారి కూడా ఫైనల్‌కు చేరలేదు. సౌతాఫ్రికా పలు మార్లు సెమీఫైనల్‌కు చేరగా.. ఆఫ్ఘనిస్తాన్‌కు మాత్రం ఇదే తొలి సెమీఫైనల్.కాగా, ట్రినిడాడ్ వేదికగా సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య రేపు ఉదయం తొలి సెమీఫైనల్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు జూన్ 29 జరిగే ఫైనల్ మ్యాచ్‌కు అర్హత సాధిస్తుంది. మరోవైపు రెండో సెమీఫైనల్లో భారత్- ఇంగ్లండ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ రేపు రాత్రి 8 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తుంది. మ్యాచ్ జరిగే సమయానికి 88 శాతం వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే.. సూపర్-8లో గ్రూప్ టాపర్‌గా ఉన్నందున్న టీమిండియా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే కూడా లేదు. మరోవైపు సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగే తొలి సెమీఫైనల్‌కు రిజర్వ్ డే ఉంది. ఒకవేళ రేపు సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ వర్షం కారణంగా సాధ్యపడకపోయినా రిజర్వ్ డే అయిన 28న తేదీన మ్యాచ్‌ను జరిపిస్తారు. -
సఫారీలకు సెమీస్ గండం.. ఈ సారైనా గట్టెక్కుతారా?
ఐసీసీ వరల్డ్‌కప్‌లలో అత్యంత దురదృష్టకరమైన జట్టు ఎదైనా ఉందంటే మనకు టక్కున గుర్తుచ్చేది దక్షిణాఫ్రికానే. టోర్నీ మొత్తం ఆసాధరణమైన ప్రదర్శన.. వరుసగా విజయాలు. కానీ కీలకమైన సెమీఫైనల్స్‌లో మాత్రం ఒత్తిడికి చిత్తు. ఇప్పటివరకు అటు వన్డే వరల్డ్‌కప్‌లోనూ, ఇటు టీ20 వరల్డ్‌కప్‌లోనూ కనీసం ఒక్కసారి కూడా ఫైనల్లో అడుగుపెట్టలేకపోయింది.ప్రతీసారి సెమీస్ లో ఓడిపోతూ చోకర్స్ గా ముద్రపడ్డ సఫారీలు మరోసారి టైటిల్ రేసులో నిలబడ్డారు. పొట్టి వరల్డ్‌కప్‌లలో ముచ్చటగా మూడోసారి సెమీస్‌లో సౌతాఫ్రికా అడుగుపెట్టింది. టీ20 వరల్డ్‌కప్-2024 తొలి సెమీఫైనల్లో భాగంగా ట్రినడాడ్ వేదికగా శుక్రవారం సంచలనాల అఫ్గానిస్తాన్‌తో దక్షిణాఫ్రికా తలపడనుంది.ఈ సారైనా గట్టుకెక్కుతుందా?ఓవరాల్‌గా వన్డే, టీ20 ప్రపంచకప్‌ల నాకౌట్స్‌లో దక్షిణాఫ్రికా 10 సార్లు తలపడింది. ఆడిన 10 మ్యాచ్‌ల్లో కేవలం మ్యాచ్‌లో మాత్రం విజయం సాధించింది. అది కూడా క్వార్టర్ ఫైనల్లో కావడం గమనార్హం. ఇక 8 మ్యాచ్‌ల్లో ఓటమి పాలవ్వగా.. మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది.టీ20 వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు రెండు సార్లు సెమీఫైన్సల్ ఆడిన దక్షిణాఫ్రికా ఓసారి పాకిస్తాన్ చేతిలో ఓటమి పాలవ్వగా.. మరోసారి ఇండియా చేతిలో పరాజయం పాలైంది. కానీ ఈసారి మాత్రం తమ పేరిట ఉన్న చోకర్స్ ముద్రను ఎలాగైనా చెరేపేయాలన్న కసితో దక్షిణాఫ్రికా ఉంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఆజేయంగా ఉన్న సౌతాఫ్రికా అదే జోరును సెమీస్‌లోనూ కొనసాగించి తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతోంది.దక్షిణాఫ్రికా బలబలాలు..దక్షిణాఫ్రికా బ్యాటింగ్ బౌలింగ్ పరంగా పటిష్టంగా కన్పిస్తోంది. బ్యాటింగ్‌లో క్వింటన్ డికాక్, స్టబ్స్, క్లాసెన్, మిల్లర్ వంటి అద్బుతమైన ఆటగాళ్లు ఉన్నారు. ప్రస్తుతం వారు అంతా మంచి రిథమ్‌లో కూడా ఉన్నారు. అయితే కెప్టెన్ మార్క్రమ్ ఫామ్ మాత్రం ప్రోటీస్ జట్టు మెనెజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. అదేవిధంగా స్పిన్‌ను కూడా ఎదుర్కొనేందుకు సఫారీ బ్యాటర్లు కాస్త ఇబ్బంది పడుతున్నారు. అఫ్గాన్ ప్రధాన బలం స్పిన్నర్లే. మరి అఫ్గాన్ స్పిన్నర్లు దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి. ఇక దక్షిణాఫ్రికా బౌలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సఫారీ బౌలర్లు అదరగొడుతున్నారు. నోర్జే, రబాడ, జానెసన్ వంటి పేసర్లు ప్రత్యర్ధి జట్లకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ పేస్ త్రయం చెలరేగితే అఫ్గాన్ బ్యాటర్లకు కష్టాల్లు తప్పవు.అఫ్గాన్‌తో అంత ఈజీ కాదు..అయితే ప్రస్తుత వరల్డ్‌కప్‌లో సంచలనాలు నమోదు చేస్తున్న అఫ్గానిస్తాన్‌ను ఓడించడం దక్షిణాఫ్రికాకు అంత ఈజీ కాదు. ఈ మెగా టోర్నీలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలు వంటి పటిష్టమైన జట్లను ఓడించి తొలిసారి సెమీస్‌లో అడుగుపెట్టిన అఫ్గాన్.. రెట్టింపు ఆత్మవిశ్వాసంతో సఫారీలను ఢీ కొట్టనుంది. అఫ్గాన్ బ్యాటింగ్ పరంగా కాస్త వీక్‌గా కన్పిస్తున్నప్పటకి బౌలింగ్‌లో మాత్రం బలంగా కన్పిస్తోంది. అఫ్గాన్ జట్టులో వరల్డ్‌క్లాస్ స్పిన్నర్లు ఉన్నారు. అదేవిధంగా పేస్ బౌలింగ్‌లోనూ ఫరూఖీ, నవీన్ ఉల్ హక్ సత్తాచాటుతున్నారు. బ్యాటింగ్‌లో ఎక్కువగా ఓపెనర్లపైనే అఫ్గాన్ ఆధారపడుతోంది. సెమీస్‌లో ఆల్‌రౌండ్ షోతో అఫ్గాన్ అదరగొడితే దక్షిణాఫ్రికాకు ఇబ్బందులు తప్పవు. -
T20 World Cup: అఫ్‘గన్’ పేలింది
కన్నీళ్లు ఆగడం లేదు... భావోద్వేగాలను నియంత్రించుకోవడం సాధ్యం కావడం లేదు... పట్టరాని ఆనందాన్ని ప్రదర్శించేందుకు పదాలు దొరకడం లేదు... ఒకరు కాదు, ఇద్దరు కాదు అందరి ఆటగాళ్లది ఇదే పరిస్థితి... తాము సాధించిన ఘనత ఎంత అసాధారణమైనదో వారికి తెలుస్తున్నా ఇంకా నమ్మశక్యంగా అనిపించని స్థితి... సొంత దేశంలో క్రికెట్ మైదానంలో అడుగు పెట్టడమే కష్టంగా మారిపోగా... జట్టు సభ్యులంతా కలిసి సాధన చేసే అవకాశం లేకపోగా... ఎప్పుడో టోర్నీకి ముందు కలిసి ప్రాక్టీస్ చేయడమే... కానీ తమ పోరాటం, పట్టుదల ముందు వాటన్నంటినీ చిన్న విషయాలుగా మార్చేసింది. అగ్రశ్రేణి జట్లు క్రికెట్‌ను శాసిస్తున్న చోట అంచనాలు లేకుండా బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ అసాధారణ ఆటను చూపించింది... అద్భుత ఆటతో సత్తా చాటుతూ ప్రపంచకప్ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది.టోర్నీకి ముందు అంచనాలు లేవు... అండర్డాగ్ కిందే లెక్క.. కానీ లీగ్ దశలో న్యూజిలాండ్‌పై భారీ విజయం గాలివాటం కాదని, సూపర్–8లో ఆ్రస్టేలియాను చిత్తు చేసిన వైనం అదృష్టం వల్ల కాదని అఫ్గానిస్తాన్ నిరూపించింది... గత టి20 వరల్డ్‌కప్‌లో ఒక్క విజయానికి కూడా నోచుకోని జట్టు ఇప్పుడు ఏకంగా సెమీస్ చేరింది. బంగ్లాదేశ్‌తో చివరి సూపర్–8 పోరులో విజయం దోబూచులాడింది. 115 పరుగులు మాత్రమే చేసి దానిని కాపాడుకోవడం అంత సులువు కాదు. కానీ అఫ్గాన్ ఆటగాళ్లంతా ప్రాణాలు పణంగా పెట్టినట్లు మైదానంలో పోరాడారు... మళ్లీ మళ్లీ పలకరిస్తూ వచ్చిన వర్షంతో కూడా పోటీ పడాల్సి వచ్చి0ది... చివరకు తాము అనుకున్నది సాధించారు. బంగ్లాపై పైచేయి సాధించి తొలిసారి ఓ ఐసీసీ టోర్నీలో సగర్వంగా సెమీస్ స్థానాన్ని ఖాయం చేసుకోగా, తాము ఎప్పటికీ మారమన్నట్లుగా బంగ్లాదేశ్ ఆటగాళ్లు నిష్క్రమించారు. కింగ్స్టౌన్ (సెయింట్ విన్సెంట్): ‘కమాన్ బంగ్లాదేశ్’... భారత్‌తో ఓటమి తర్వాత ఆ్రస్టేలియా కెప్టెన్ మిచెల్ మార్‡్ష మాట ఇది. ఆల్‌టైమ్ గ్రేట్ జట్టు కూడా మరో టీమ్ ప్రదర్శనను నమ్ముకుంటూ అదృష్టం పలకరిస్తుందేమోనని ఆశపడింది. బంగ్లాదేశ్ గెలిస్తే తాము సెమీఫైనల్ చేరవచ్చని కంగారూలు కలగన్నారు. కానీ అఫ్గానిస్తాన్ ఆ అవకాశం ఇవ్వలేదు. మంగళవారం జరిగిన గ్రూప్–1 చివరి సూపర్–8 మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ 8 పరుగుల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ ప్రకారం) బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం జరిగే తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాతో అఫ్గాన్ టీమ్... రాత్రి జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో భారత్ తలపడతాయి. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 115 పరుగులు మాత్రమే చేయగలిగింది. రహ్మనుల్లా గుర్బాజ్ (55 బంతుల్లో 43; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. బంగ్లాదేశ్ స్పిన్నర్ రిషాద్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ మధ్యలో వర్షం రావడంతో ఒక ఓవర్ తగ్గించి లక్ష్యాన్ని 19 ఓవర్లలో 114 పరుగులుగా నిర్దేశించారు. అయితే బంగ్లాదేశ్ 17.5 ఓవర్లలో 105 పరుగులకే కుప్పకూలింది. లిటన్ దాస్ (49 బంతుల్లో 54 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) పోరాటం వృథా కాగా... జట్టులో నలుగురు డకౌటయ్యారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నవీన్ ఉల్ హక్ (4/26), కెపె్టన్ రషీద్ ఖాన్ (4/23) ప్రత్యర్థిని దెబ్బ కొట్టారు. తాజా ఫలితంతో గ్రూప్–1 నుంచి 2 విజయాలతో 4 పాయింట్లు సాధించిన అఫ్గానిస్తాన్ రెండో స్థానంతో సెమీస్ చేరింది. బంగ్లాదేశ్ ఓటమితో ఆస్ట్రేలియా జట్టు కూడా ‘సూపర్–8’ దశలోనే ఇంటిదారి పట్టింది. ఆద్యంతం ‘డ్రామా’ సాగి... స్వల్ప స్కోర్ల ఈ మ్యాచ్ పలు మలుపులతో ఆసక్తికరంగా సాగింది. పదే పదే వాన అంతరాయం కలిగించడంతో విజయం దోబూచులాడింది. అఫ్గాన్ ఇన్నింగ్స్‌లో గుర్బాజ్ మినహా అంతా విఫలమయ్యారు. అతను కూడా తన శైలికి భిన్నంగా చాలా నెమ్మదిగా ఆడాడు. చివర్లో రషీద్ ఖాన్ (10 బంతుల్లో 19 నాటౌట్; 3 సిక్స్‌లు) మెరుపులతో స్కోరు 100 పరుగులు దాటింది. రన్‌రేట్‌లో అఫ్గాన్, ఆసీస్‌లను దాటి సెమీస్ చేరాలంటే 12.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించాల్సిన స్థితిలో బంగ్లాదేశ్ మైదానంలోకి దిగింది. అయితే సెమీస్ సంగతేమో కానీ ఆ జట్టు మ్యాచ్ గెలిచే అన్ని అవకాశాలను కూడా వృథా చేసుకుంది. ఫజల్ తన తొలి ఓవర్లోనే తన్జీద్ (0)ను అవుట్ చేయగా, నవీన్ వరుస బంతుల్లో నజు్మల్ (5), షకీబ్ (0)లను అవుట్ చేయడంతో స్కోరు 23/3 వద్ద నిలిచింది. ఈ దశలో వాన వచ్చి ఆగిన తర్వాత రషీద్ వరుస ఓవర్లలో సౌమ్య సర్కార్ (10), తౌహీద్ (14)లను వెనక్కి పంపించాడు. అయినా సరే చేతిలో 5 వికెట్లతో 56 బంతుల్లో 36 పరుగులు చేయాల్సిన బంగ్లాదేశ్ గెలిచే స్థితిలో నిలిచింది. కానీ రషీద్ మళ్లీ వరుస బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను తమ చేతుల్లోకి తెచ్చుకున్నాడు. 81/7 నుంచి బంగ్లా డక్‌వర్త్ లూయిస్ స్కోరుతో పోటీ పడుతూ వచ్చింది. ఒక ఎండ్‌లో నిలిచిన దాస్ ఎంతో ప్రయత్నించినా... మరోవైపు మిగిలిన మూడు వికెట్లు తీసేందుకు అఫ్గాన్ బౌలర్లకు ఎక్కువ సమయం పట్టలేదు. ముస్తఫిజుర్‌ను నవీన్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేయడంతో అఫ్గాన్ ఆటగాళ్లు, అభిమానుల సంబరాలతో మైదానం హోరెత్తిపోగా... అక్కడి నుంచి దాదాపు 12 వేల కిలోమీటర్ల దూరంలో కాబూల్‌లో కూడా ఆ విజయధ్వానం బ్రహ్మాండంగా వినిపించింది! ఉత్తమ నటుడు గుల్బదిన్! 11.4 ఓవర్ల తర్వాత బంగ్లా స్కోరు 81/7 వద్ద వానతో మ్యాచ్ ఆగినప్పుడు ఒక ఆసక్తికర ఘటన జరిగింది. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం ఆ సమయానికి బంగ్లా 2 పరుగులు వెనుకబడి ఉంది. అక్కడే మ్యాచ్ ముగిసిపోతే అఫ్గాన్ గెలుస్తుంది. ఈ దశలో పరిస్థితి మెరుగ్గా ఉంది, తొందరపడ వద్దన్నట్లుగా డ్రెస్సింగ్ రూమ్ నుంచి అఫ్గాన్ కోచ్ జొనాథన్ ట్రాట్ సైగ చేశాడు. అప్పటి వరకు స్లిప్‌లో చక్కగా ఫీల్డింగ్ చేస్తున్న గుల్బదిన్ ‘అలా అయితే ఓకే’ అన్నట్లుగా ఒక్కసారిగా కండరాలు పట్టేశాయంటూ కుప్పకూలిపోయాడు. ఆ వెంటనే పిచ్‌పై కవర్లు వచ్చేశాయి. అయితే ఆ తర్వాత మళ్లీ చక్కగా మైదానంలోకి దిగిన గుల్బదిన్ తర్వాతి వికెట్ కూడా తీశాడు. దాంతో ఇదంతా నటన అంటూ అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. మ్యాచ్ తర్వాత రషీద్ మాత్రం తన ఆటగాడికి మద్దతుగా నిలిచాడు. నిజానికి అక్కడే మ్యాచ్ ముగిసి ఉంటే వివాదం జరిగేదేమో కానీ ఆట కొనసాగి ఆలౌట్ వరకు వెళ్లడంతో ఇది సమస్యగా మారలేదు.‘వెల్డన్’ అంతర్జాతీయ క్రికెట్లో అఫ్గానిస్తాన్ ప్రస్థానం అసాధారణంఅగ్రశ్రేణి జట్లకు దీటుగా ఎదిగిన వైనం‘మిమ్మల్ని నిరాశపర్చము, మీ నమ్మకాన్ని నిలబెడతాం’... టి20 వరల్డ్‌కప్ ప్రారంభానికి ముందు జరిగిన వెల్కమ్ పార్టీలో క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారాతో రషీద్ ఖాన్ అన్న మాట ఇది. ఎందుకంటే ఈ టోర్నీలో సెమీస్ చేరే నాలుగు జట్ల పేర్లు చెప్పమని మాజీలు, విశ్లేషకులతో అడిగితే ఒక్క లారా మాత్రమే అఫ్గానిస్తాన్ పేరు చెప్పాడు. వారి ఆటపై అతనికి ఉన్న నమ్మకాన్ని ఇది చూపించింది. రేపు ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియంలోనే రషీద్ బృందం సెమీఫైనల్ మ్యాచ్ ఆడబోతోంది! గత కొన్నేళ్లుగా అటు వన్డే, ఇటు టి20 ఫార్మాట్లలో నిలకడైన ప్రదర్శన కనబరుస్తూ వచ్చిన అఫ్గానిస్తాన్ ఇప్పుడు ‘సంచలనాల’ జట్టు నుంచి సమర్థమైన జట్టుగా ఎదిగింది. ప్రస్తుతం ఆ దేశంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా జట్టు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కేంద్రంగానే తమ హోం మ్యాచ్‌లు ఆడుతోంది. ఆటగాళ్లంతా కూడా అక్కడే దాదాపుగా స్థిరపడ్డారు. 2023లో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లోనే అఫ్గానిస్తాన్ పదును ఏమిటో ప్రపంచానికి తెలిసింది. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, పాకిస్తాన్లను ఓడించిన టీమ్, ఆ్రస్టేలియాను కూడా ఒకదశలో 91/7తో ఓటమి దిశగా నెట్టింది. ఆసీస్ అదృష్టవశాత్తూ మ్యాక్స్‌వెల్ అద్భుత ఇన్నింగ్స్ జట్టును గెలిపించినా... ఇప్పుడు టి20 వరల్డ్‌కప్ లో నాటి పనిని అఫ్గాన్ పూర్తి చేసింది. –సాక్షి క్రీడా విభాగం10 అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రపంచకప్ (వన్డే/టి20) టోర్నీల చరిత్రలో సెమీఫైనల్ దశకు చేరిన పదో జట్టుగా అఫ్గానిస్తాన్ గుర్తింపు పొందింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా (1975), ఇంగ్లండ్ (1975), న్యూజిలాండ్ (1975), వెస్టిండీస్ (1975), పాకిస్తాన్ (1979), భారత్ (1983), దక్షిణాఫ్రికా (1992), శ్రీలంక (1996), కెన్యా (2003) జట్లు ఉన్నాయి. 1 ప్రపంచకప్ టోర్నీల్లో బంగ్లాదేశ్‌పై అఫ్గానిస్తాన్ తొలిసారి విజయం అందుకుంది. గతంలో బంగ్లాదేశ్‌తో జరిగిన నాలుగు ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో (టి20; 2014లో...వన్డే వరల్డ్‌కప్; 2015, 2019, 2023) అఫ్గానిస్తాన్ ఓడిపోయింది.9 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌ల్లో ఇన్నింగ్స్‌లో నాలుగు అంతకన్నా ఎక్కువ వికెట్లు తీయడం రషీద్ ఖాన్కిది తొమ్మిదిసారి. షకీబ్ అల్ హసన్ (8 సార్లు) పేరిట ఉన్న రికార్డును రషీద్ బద్దలు కొట్టాడు.న్యూజిలాండ్, ఆ్రస్టేలియావంటి జట్లను ఓడించి సెమీస్ వరకు సాగిన మీ ప్రయాణం అద్భుతం. మీ శ్రమకు, పట్టుదలకు ఫలితమే ఈ విజయం. మిమ్మల్ని చూసి గర్విస్తున్నా. దీనిని ఇలాగే కొనసాగించండి. – సచిన్ టెండూల్కర్ మైదానంలో దృశ్యాలు చాలా గొప్పగా కనిపిస్తున్నాయి. అఫ్గాన్‌కు గొప్ప విజయమిది. తొలిసారి సెమీస్ చేరిన పఠాన్లలో భావోద్వేగాలు బలంగా కనిపిస్తున్నాయి. అత్యుత్తమ క్రికెట్ ప్రదర్శన ఇది. –యువరాజ్ సింగ్ -
అఫ్గనిస్తాన్‌ను ఓడిస్తే టైటిల్ సౌతాఫ్రికాదే: ఆసీస్ దిగ్గజం
టీ20 ప్రపంచకప్‌లో ముచ్చటగా మూడోసారి సెమీ ఫైనల్ చేరిన దక్షి ణాఫ్రికా.. ఈసారి గతంలో మాదిరి పొరపాట్లకు తావివ్వకూడదని పట్టుదలగా ఉంది. 2009, 2014లలో సెమీస్‌లోనే వెనుదిరిగి అపఖ్యాతిని మూటగట్టుకున్న ప్రొటిస్ జట్టు.. ఎలాగైనా ఫైనల్ చేరాలని పట్టుదలగా ఉంది. దర్జాగా సెమీస్లోకాగా తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తమ జోరు ప్రదర్శించిన విషయం తెలిసిందే. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం మూడు వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించి దర్జాగా సెమీస్‌లో అడుగుపెట్టింది. సూపర్–8 దశలో ఆడిన మూడూ గెలిచిన సఫారీ 6 పాయింట్ల తో గ్రూప్–2 టాపర్‌గా, 4 పాయింట్లతో ఇంగ్లండ్ రెండో జట్టుగా సెమీఫైనల్స్‌కు చేరాయి.మరోవైపు రెండుసార్లు టీ20 చాంపియన్, ఆతిథ్య వెస్టిండీస్ కథ ‘సూపర్–8’లోనే ముగిసింది. ముందుగా వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులే చేసింది. కైల్ మేయర్స్ (34 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), రోస్టన్ చేజ్ (42 బంతుల్లో 52; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు.వర్షంతో 50 నిమిషాలు ఆటకు అంతరాయంరోవ్మన్ పావెల్ (1), రూథర్‌ఫోర్డ్ (0), రసెల్ (15) చేతులెత్తేయడంతో కరీబియన్ జట్టు ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ తబ్రేజ్ షమ్సీ 3 వికెట్లు తీశాడు. 136 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 15 పరుగులు చేసిన దశలో వర్షంతో 50 నిమిషాలు ఆటకు అంతరాయం కలిగింది.దాంతో దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 17 ఓవర్లలో 123 పరుగులుగా నిర్ణయించారు. ఆ జట్టు 16.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసి నెగ్గింది. స్టబ్స్ (27 బంతుల్లో 29; 4 ఫోర్లు), క్లాసెన్ (10 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్), జాన్సెన్ (14 బంతుల్లో 21 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) లక్ష్యంవైపు తీసుకెళ్లారు. ఛేజ్ 3, రసెల్, జోసెఫ్ చెరో 2 వికెట్లు తీశారు.రషీద్ ఖాన్ బృందంతో అమీతుమీఇక ఈ విజయంతో టోర్నీలో ముందుకు సాగే అవకాశం దక్కించుకున్న సౌతాఫ్రికా.. గురువారం నాటి తొలి సెమీ ఫైనల్లో అఫ్గనిస్తాన్‌తో తలపడనుంది. ఊహించని రీతిలో బంగ్లాదేశ్‌ను ఓడించి తొలిసారి వరల్డ్‌కప్‌లో సెమీస్ చేరిన రషీద్ ఖాన్ బృందంతో అమీతుమీ తేల్చుకోనుంది. ట్రినిడాడ్‌లోని బ్రియన్ లారా స్టేడియం ఇందుకు వేదిక.అఫ్గనిస్తాన్‌ను ఓడిస్తే ఈసారి టైటిల్ వాళ్లదేఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. టోర్నీ ఆరంభం నుంచి సౌతాఫ్రికా అద్బుతంగా ఆడిందన్న ఈ కంగారూ క్రికెటర్.. రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్‌తో పాటు స్పిన్ దళం మ్యాజిక్ చేసిందని కొనియాడాడు.ముఖ్యంగా హెండ్రిక్స్ సూపర్‌గా ఆడుతున్నాడని.. అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో అతడు అదరగొట్టి ఫైనల్‌కు చేర్చుతాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ కెప్టెన్సీ నైపుణ్యాలు అమోఘమన్న బ్రాడ్ హాగ్.. ప్రొటిస్ జట్టు అన్ని విభాగాల్లో సమతూకంగా ఉందన్నాడు.సౌతాఫ్రికా సెమీస్‌లో గనుక అఫ్గనిస్తాన్‌ను ఓడిస్తే ఈసారి టైటిల్ వాళ్లదేనంటూ బ్రాడ్ హాగ్ జోస్యం చెప్పాడు. కాగా తొలి సెమీస్‌లో సౌతాఫ్రికా- బంగ్లాదేశ్ తలపడనుండగా.. రెండో సెమీస్ ఫైనల్లో టీమిండియా- ఇంగ్లండ్ తాడోపేడో తేల్చుకోనున్నాయి.చదవండి: ట్రోఫీ గెలిచే అర్హత అతడికే ఉంది: షోయబ్ అక్తర్ -
తొలిసారి T20వరల్డ్‌కప్ సెమీస్‌లో.. అఫ్గన్‌లో అంబరాన్నంటిన సంబరాలు (ఫొటోలు)
-
అఫ్గనిస్తాన్ చీటింగ్ చేసి గెలిచిందా? ఏంటీ డ్రామా? ఫ్యాన్స్ ఫైర్
ఐసీసీ టోర్నీలో తొలిసారి సెమీస్ చేరిన అఫ్గనిస్తాన్ జట్టుపై ప్రశంసలు కురుస్తున్నాయి. టీ20 ప్రపంచకప్-2024లో అండర్‌డాగ్స్‌గా అడుగుపెట్టి టాప్-4లో నిలిచినందుకు రషీద్ ఖాన్ బృందాన్ని క్రికెట్ ప్రపంచం కొనియాడుతోంది.అయితే, అదే సమయంలో అడ్డదారిలో గెలిచారనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించి.. బంగ్లాదేశ్‌ను దెబ్బకొట్టారనే ఆరోపణలు వస్తున్నాయి.ఆ ఇద్దరిపై ఆగ్రహంఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్ కోచ్ జొనాథన్ ట్రాట్, బౌలింగ్ ఆల్‌రౌండర్ గుల్బదిన్ నైబ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలేం జరిగిందంటే..వరల్డ్‌కప్-2024 సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్ బంగ్లాదేశ్‌తో తలపడింది. సెయింట్ విన్సెంట్ వేదికగా మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గన్ తొలుత బ్యాటింగ్ చేసింది.రహ్మనుల్లా గుర్బాజ్ రైజ్ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ 43 పరుగులతో రాణించగా.. కెప్టెన్ రషీద్ ఖాన్ 19 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. మిగతా వాళ్లలో మరో ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ 18 రన్స్ తీయగా.. వేరెవరు కనీసం పది పరుగుల స్కోరు దాటలేదు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 115 పరుగులు స్కోరు చేసింది అఫ్గన్ జట్టు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు ఆదిలోనే షాకిచ్చారు అఫ్గన్ పేసర్లు.ఓపెనర్ తాంజిద్ హసన్ డకౌట్ కాగా.. వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ నజ్ముల్ షాంటో ఐదు పరుగులకే నిష్క్రమించాడు. మిగతా వాళ్లలో ఒక్కరు కూడా కాసేపైనా క్రీజులో నిలవలేకపోయారు.పట్టుదలగా లిటన్ దాస్ఇలాంటి క్లిష్ట సమయంలో ఓపెనర్ లిటన్ దాస్(54 నాటౌట్) పట్టుదలగా నిలబడ్డాడు. అయితే, బంగ్లా ఇన్నింగ్స్ పన్నెండో ఓవర్లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.లిటన్ దాస్‌తో కలిసి తంజీమ్ హసన్ సకీబ్ క్రీజులో ఉన్న సమయంలో వర్షం పడే సూచనలు కనిపించాయి. పన్నెండో వోర్ వేసిన నూర్ అహ్మద్ బౌలింగ్‌లో నాలుగో బంతికి తంజీమ్ ఒక్క పరుగు కూడా తీయలేకపోయాడు.అదే సమయంలో అఫ్గన్ కోచ్ జొనాథన్ ట్రాట్ వాన పడే అవకాశం ఉందని తమ ఆటగాళ్లకు సంకేతాలు ఇచ్చాడు. కాస్త స్లోగా ఆడండని సైగలు చేశాడు.తొడ కండరాల్లో నొప్పి అంటూఅప్పటికి బంగ్లాదేశ్ స్కోరు 81/7.. డీఎల్ఎస్ పద్ధతి ప్రకారం బంగ్లాదేశ్ అఫ్గనిస్తాన్ కంటే కేవలం రెండు పరుగులే వెనుకబడి ఉంది. అంటే.. ఆ సమయంలో వర్షం పడి.. ఆ తర్వాత మ్యాచ్ గనుక రద్దైపోతే ఫలితం అఫ్గనిస్తాన్‌కు అనుకూలంగా వచ్చే అవకాశం ఉండదు.ఈ నేపథ్యంలో కోచ్ సైగల మేరకు స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న నైబ్.. ఒక్కసారిగా చేతి పైకెత్తి.. తొడ కండరాల్లో నొప్పి అంటూ కుప్పకూలిపోయాడు. అతడి చేష్టలు చూసి కెప్టెన్ రషీద్ ఖాన్ సైతం అసహనంగా కదిలాడు. అసలేమైంది అన్నట్లుగా సీరియస్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు.This has got to be the most funniest thing ever 🤣 Gulbadin Naib just breaks down after coach tells him to slow things down 🤣😂 pic.twitter.com/JdHm6MfwUp— Sports Production (@SportsProd37) June 25, 2024 ఇంతలో నైబ్కు సబ్‌స్టిట్యూట్‌గా నజీబుల్లా మైదానంలోకి రాగా.. ఫిజియోలతో పాటు నైబ్ మైదానం వీడాడు. అప్పటికి వర్షం పడలేదు. కానీ నైబ్ వల్ల మ్యాచ్ కాస్త ఆలస్యమైంది. ఆ తర్వాతి బంతికి బంగ్లా ఒక పరుగు చేసింది. ఓవర్లో మొత్తంగా రెండు పరుగులే వచ్చాయి.ఒకవేళ నైబ్ డ్రామా చేయకపోయి ఉంటే.. మరుసటి రెండు బంతుల్లో గనుక బంగ్లా రెండు పరుగులు చేసి.. ఆ తర్వాత వర్షం పడి మ్యాచ్ రద్దైతే కచ్చితంగా బంగ్లానే గెలిచేది.సెమీస్ రేసు నుంచి అవుట్అయితే, నైబ్ గాయం వల్ల ఆలస్యానికి తోడు వరణుడు కూడా అప్పటికి కరుణించడంతో మ్యాచ్ కొనసాగింది. ఇక పదమూడవ ఓవర్లో బంగ్లాదేశ్ కేవలం ఆరు పరుగులే చేయగా.. గ్రూప్-1 సమీకరణలకు అనుగుణంగా సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది.అప్పుడు సెమీస్ బెర్తు కోసం ఆస్ట్రేలియా- అఫ్గనిస్తాన్ మధ్య పోటీ ఏర్పడింది. మరోవైపు డీఎల్ఎస్ పద్ధతిలో బంగ్లా ఇన్నింగ్స్‌ను 19 ఓవర్లకు కుదించి విజయ లక్ష్యాన్ని 114 పరుగులుగా విధించారు అంపైర్లు. అయితే, అఫ్గన్ బౌలర్ల అద్భుత ప్రదర్శనతో బంగ్లాదేశ 17.5 ఓవర్లలో కేవలం 105 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది.కేవలం 33 నిమిషాల వ్యవధిలోనే తిరిగి వచ్చిఫలితంగా అఫ్గనిస్తాన్ గెలిచి సెమీస్‌లో అడుగుపెట్టగా.. ఆస్ట్రేలియా ఇంటిబాట పట్టింది. అయితే, ఇక్కడ విచిత్రం ఏమిటంటే.. అంతకుముందు గాయంతో విలవిల్లాడిన గుల్బదిన్ నైబ్.. కేవలం 33 నిమిషాల వ్యవధిలోనే తిరిగి వచ్చి ఓ వికెట్ తీయడంతో పాటు.. గెలుపు సంబరాల్లో అందరికంటే వేగంగా పరిగెత్తడం.ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌కాగా గుల్బదిన్ నైబ్ ‘లీల’ల గురించి చర్చ మొదలైంది. కామెంటేటర్ సైమన్ డౌల్ అయితే.. ‘‘ఆస్కార్ గెలుచుకునే నటన.. ఆ ఫిజియోలు సూపర్.. మరీ ఇంత త్వరగా గాయం నుంచి కోలుకోవడం నిజంగా ఆశ్చర్యమే’’ అంటూ సెటైర్లు వేశాడు.టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం గుల్బదిన్కు రెడ్‌కార్డ్ ఇవ్వాలంటూ సరదాగా కామెంట్ చేయగా.. అతడు బదులిస్తూ ఒక్కోసారి సంతోషం.. ఒక్కోసారి దుఃఖం అంతే అంటూ అంతే లైట్‌గా తీసుకున్నాడు.No words.... @ICC shouldtake action on this pic.twitter.com/61n3N2SuhG— Hassan Abbasian (@HassanAbbasian) June 25, 2024 -
అఫ్గనిస్తాన్ సంచలనాలు.. మనోళ్లదే పెద్దన్న పాత్ర!
టీ20 ప్రపంచకప్-2024లో సంచలనం.. పసికూనగా భావించే అఫ్గనిస్తాన్ తొలిసారిగా ఓ ఐసీసీ టోర్నీలో సెమీ ఫైనల్ చేరింది. సరికొత్త చరిత్రకు నాంది పలికింది. అంతర్జాతీయ క్రికెట్ మండలిలో పూర్తిస్థాయి సభ్యత్వ దేశంగా మారిన ఏడేళ్ల వ్యవధిలోనే ఈ ఘనత సాధించింది అఫ్గన్ జట్టు.దేశంలోని అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా అనేక కష్టనష్టాలకోర్చి ఈరోజు ప్రపంచం దృష్టిని ఆకర్షించి స్థాయికి ఎదిగింది. ముఖ్యంగా వరల్డ్‌కప్ వంటి మెగా టోర్నీలో హేమాహేమీలైన న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలను ఓడించి సత్తా చాటింది.ఈ రెండు మేటిజట్లను దాటుకుని.. కీలక మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించి సెమీస్‌లో సగర్వంగా అడుగుపెట్టింది. ట్రినిడాడ్‌లో గురువారం నాటి మ్యాచ్‌లో భాగంగా సౌతాఫ్రికాతో తొలి సెమీ ఫైనల్లో తలపడనుంది. మరి అఫ్గనిస్తాన్ జట్టు ఇక్కడిదాకా రావడం వెనుక భారత్ పాత్ర కూడా ఉందన్న విషయం తెలుసా?!అవును.. అండర్‌డాగ్స్‌గా ఉన్న అఫ్గనిస్తాన్ జట్టు ఈ స్థాయికి ఎదగడం వెనుక భారత క్రికెట్ నియంత్రణ మండలి హస్తం కూడా ఉంది. దేశంలోని ఆర్థిక పరిస్థితులు, సదుపాయాల లేమి దృష్ట్యా అఫ్గనిస్తాన్‌కు అంతర్జాతీయ స్థాయిలో మ్యాచ్‌లకు ఆతిథ్యం కల్పించే అవకాశం లేకుండా పోయింది.పెద్దన్నగా ఆపన్నహస్తంఅలాంటి సమయంలో బీసీసీఐ అఫ్గన్ బోర్డుకు పెద్దన్నగా ఆపన్నహస్తం అందించింది. గ్రేటర్ నోయిడాలో ఉన్న షాహీద్ విజయ్ సింగ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను తమ హోం గ్రౌండ్‌గా వాడుకునేందుకు 2015లో బీసీసీఐ అనుమతినిచ్చింది.ఈ క్రమంలో 2017లో అఫ్గనిస్తాన్ గ్రేటర్ నోయిడా వేదికగా ఐర్లాండ్‌తో అంతర్జాతీయ మ్యాచ్ ఆడింది. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లోనూ పాల్గొంది. ఆ తర్వాత కొన్నాళ్లకు తమ మకాంను షార్జాకు మార్చిన అఫ్గన్ జట్టు.. మళ్లీ ఉత్తరప్రదేశ్ వేదికగా బంగ్లాదేశ్‌తో వన్డే, టీ20 సిరీస్ ఆడేందుకు సిద్దమైంది.అంతర్జాతీయ వేదిక కల్పించిఇలా సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతున్న అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టును బీసీసీఐ ఆదుకుంది. అంతర్జాతీయ వేదిక కల్పించి వారిని ప్రోత్సహించింది.మనవాళ్లే ముందుండి నడిపించిఇక అఫ్గన్ జట్టు బలోపేతం కావడంలో పలువురు భారత మాజీ క్రికెటర్ల పాత్ర కూడా ఉండటం విశేషం. లాల్‌చంద్ రాజ్‌పుత్, మనోజ్ ప్రభాకర్, అజయ్ జడేజా గతంలో ఈ జట్టుకు మార్గనిర్దేశకులుగా ఉన్నారు.వన్డే వరల్డ్‌కప్-2023 సమయంలో అజయ్ జడేజా అఫ్గన్ మెంటార్‌గా ఉండి ముందుకు నడిపించగా.. అంచనాలకు మించి రాణించింది. అంతేకాదు మొట్టమొదటిసారి పాకిస్తాన్‌పై వన్డేలో విజయం సాధించి చరిత్ర సృష్టించింది.దేశాల మధ్య సత్సంబంధాలుభారత్- అఫ్గనిస్తాన్ మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. ఆ దేశ పార్లమెంట్ భవనం నిర్మాణం విషయంలోనూ భారత్ ఆర్థిక సహాయం చేసింది.ఇక ప్రపంచంలోనే సంపన్న బోర్డు అయిన బీసీసీఐ గతంలో ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీని ఇండియాకు ఆహ్వానించింది. బెంగళూరు వేదికగా టీమిండియాతో అఫ్గన్ తొలి టెస్టు మ్యాచ్ ఆడుతున్న వేళ.. మ్యాచ్ వీక్షించేందుకు స్వాగతం పలికింది. ఇరు దేశాల అనుబంధం, క్రికెట్ జట్ల మధ్య బంధాన్ని బలోపేతం చేసేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది. View this post on Instagram A post shared by ICC (@icc) ఐపీఎల్లో అఫ్గన్ ఆటగాళ్లుఇటీవల ఆస్ట్రేలియాపై విజయం తర్వాత అఫ్గన్ కెప్టెన్ రషీద్ ఖాన్ మాట్లాడుతూ.. లీగ్ క్రికెట్ ఆడుతుండటం వల్లే తమ జట్టు టీ20 ఫార్మాట్లో మరింత దృఢంగా మారిందని పేర్కొన్నాడు.ముమ్మాటికీ అది నిజమే.. ముఖ్యంగా ఐపీఎల్లో ఆడటం ద్వారా అఫ్గనిస్తాన్ ఆటగాళ్ల ఆర్థిక స్థితి మెరుగుపడటమే గాకుండా.. క్యాష్ రిచ్ లీగ్ ద్వారా వారి నైపుణ్యాలు మరింత విస్తృతంగా అభిమానులను ఆకర్షిస్తున్నాయి.రషీద్ ఖాన్ సహా మహ్మద్ నబీ, రహ్మనుల్లా గుర్బాజ్.. ముఖ్యంగా బంగ్లాదేశ్‌పై అఫ్గన్ గెలుపొంది.. సెమీస్ చేరడంలో కీలక పాత్ర పోషించిన పేసర్ నవీన్ ఉల్ హక్ కూడా ఐపీఎల్లో ఆడుతున్నవాడే!చదవండి: David Warner: డేవిడ్ వార్నర్ గుడ్‌బై View this post on Instagram A post shared by ICC (@icc) -
David Warner: డేవిడ్ వార్నర్ గుడ్‌బై
డేవిడ్ వార్నర్ ఓ ఆస్ట్రేలియన్ క్రికెటర్ అంతే! అంతేనా అంటే కచ్చితంగా కాదు... మనకు బాగా తెలిసిన వ్యక్తి... మనల్ని మైదానంలో (ఐపీఎల్) ఆటతో, వెలుపల సతీసమేతంగా రీల్స్‌తో తెలుగు వాళ్లకు సుపరిచితుడు. అతని గురించి మూడే మూడు ముక్కల్లో చెప్పాలంటే ఓపెనింగ్‌లో విధ్వంసం, జట్టులో కీలకం, విజయాల్లో సంబరం! కానీ అతని బ్యాటింగ్ మెరుపులు ఇకపై అంతర్జాతీయ క్రికెట్లో కనిపించవు. ఆరు నెలల క్రితం టెస్టు, వన్డే ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పిన ఈ ఆస్ట్రేలియన్ తాజాగా టీ20లకూ రిటైర్మెంట్ ప్రకటించడంతో అతని విధ్వంసరచన ఇకమీదట ఫ్రాంచైజీ ప్రైవేట్ టీ20 లీగ్‌లకే పరిమితం కానుంది. ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించాడు. టీ20 ప్రపంచకప్-2024 సూపర్-8లో భాగంగా అఫ్గనిస్తాన్- బంగ్లాదేశ్ మ్యాచ్ ఫలితంతో ఈ స్టార్ బ్యాటర్ ఇంటర్నేషనల్ కెరీర్‌కు తెరపడింది.కాగా ఇప్పటికే వన్డే, టెస్టుల నుంచి రిటైర్ అయిన డేవిడ్ వార్నర్.. టీ20 వరల్డ్‌కప్-2024 తన అంతర్జాతీయ కెరీర్లో చివరి టోర్నీ అని ప్రకటించాడు. అమెరికా- వెస్టిండీస్ వేదికగా సాగిన ఈ ఐసీసీ ఈవెంట్ తర్వాత తాను వీడ్కోలు పలుకుతానని వెల్లడించాడు.ఈ క్రమంలో మంగళవారం నాటి ఉత్కంఠ మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్- బంగ్లాదేశ్‌ను ఓడించడంతో.. ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నాకౌట్ అయింది. కనీసం సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించింది.టీమిండియాతో ఆడిన మ్యాచ్ చివరిదిఈ నేపథ్యంలో డేవిడ్ వార్నర్ ఇంటర్నేషనల్ కెరీర్‌కు ఇక్కడితో ఫుల్స్టాప్ పడినట్లయింది. ఆసీస్ తరఫున అతడు టీమిండియాతో సోమవారం ఆడిన మ్యాచ్ చివరిది కానుంది. కాగా టీమిండియాతో మ్యాచ్‌లో వార్నర్ ఆరు బంతులు ఎదుర్కొని కేవలం ఆరు పరుగులే చేశాడు.భారత యువ పేసర్ అర్ష్‌దీప్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. కాగా 37 ఏళ్ల ఈ లెఫ్టాండ్ బ్యాటర్ 2009లో ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రం చేశాడు.తొలుత టీ20.. తర్వాత అదే ఏడాది వన్డేల్లో అడుగుపెట్టిన వార్నర్.. 2011లో టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చాడు. మొత్తంగా ఆస్ట్రేలియా తరఫున 112 టెస్టులు, 161 వన్డేలు, 110 టీ20 మ్యాచ్‌లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 8786, 6932, 3277 పరుగులు సాధించాడు. అంతేకాదు ఈ పార్ట్‌టైమ్ స్పిన్నర్ టెస్టుల్లో నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.కచ్చితంగా తనను మిస్ అవుతాంటీమిండియాతో మ్యాచ్‌లో ఓటమి అనంతరం ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజిల్‌వుడ్ వార్నర్ గురించి మాట్లాడుతూ.. ‘‘మేమంతా అతడిని కచ్చితంగా మిస్ అవుతాం. చాలా ఏళ్లుగా అతడితో మా ప్రయాణం కొనసాగుతోంది.మూడు ఫార్మాట్లలో తను అద్భుతంగా రాణించాడు. తొలుత టెస్టులు.. తర్వాత వన్డేలకు.. ఇప్పుడు టీ20లకు ఇలా దూరమయ్యాడు. అతడు జట్టుతో లేకుండా ఉండటం ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నాం’’ అని పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by ICC (@icc) -
ఆయనొక్కడే మమ్మల్ని నమ్మాడు: రషీద్ ఖాన్ భావోద్వేగం
అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టు అద్భుతం చేసింది. తొలిసారి ప్రపంచకప్ సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. టీ20 వరల్డ్‌కప్-2024 సూపర్-8 మ్యాచ్‌లో భాగంగా బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి ఈ మేరకు చరిత్ర సృష్టించింది. View this post on Instagram A post shared by ICC (@icc)అంతేకాదు అఫ్గన్ దెబ్బకు.. టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన ఆస్ట్రేలియా టోర్నీ నుంచే నిష్క్రమించింది. దీంతో అఫ్గనిస్తాన్‌లో సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లు సైతం తీవ్ర భావోద్వేగంలో మునిగిపోయారు. View this post on Instagram A post shared by ICC (@icc)నమ్మశక్యం కాని రీతిలోఇక చారిత్రాత్మక విజయానంతరం అఫ్గనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సెమీస్ చేరడం ఓ కలలాగా ఉందని సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. నమ్మశక్యం కాని రీతిలో న్యూజిలాండ్‌ను ఓడించామని.. ఇప్పుడిలా ఇక్కడిదాకా చేరుకున్నామని హర్షం వ్యక్తం చేశాడు.ఈ సంతోష సమయంలో తనకు అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదని రషీద్ ఖాన్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. తమ జట్టును చూస్తే తనకు గర్వంగా ఉందని పేర్కొన్నాడు. ప్రతి ఒక్కరు తమ పాత్రను సమర్థవంతంగా పోషించారని.. టీ20 ఫార్మాట్లో ముఖ్యంగా తమ బౌలర్లు అద్భుతంగా ఆడుతున్నారని కొనియాడాడు.ఇలా తొలిసారి సెమీ ఫైనల్లోఅండర్-19 వరల్డ్‌కప్‌లో సెమీస్ చేరిన ఘనత అఫ్గనిస్తాన్‌కు ఉందని.. అయితే, మెగా టోర్నీలో ఇలా తొలిసారి సెమీ ఫైనల్లో అడుగుపెట్టిన అనుభూతిని మాటల్లో వర్ణించలేనని పేర్కొన్నాడు.అదే విధంగా.. తమపై నమ్మకం ఉంచిన ఏకైక వ్యక్తి బ్రియన్ లారా అంటూ ఈ సందర్భంగా రషీద్ ఖాన్ వెస్టిండీస్ దిగ్గజానికి కృతజ్ఞతలు తెలిపాడు. ఆయన నమ్మకాన్ని నిలబెడతామని చెప్పానని.. అందుకు తగ్గట్లుగానే తమ జట్టు విజయం సాధించిందని పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by ICC (@icc)మేము సెమీ ఫైనల్ చేరతామని చెప్పిన ఏకైక వ్యక్తి‘‘మేము సెమీ ఫైనల్ చేరతామని చెప్పిన ఏకైక వ్యక్తి బ్రియన్ లారా. ఆయన మాటలు నిజమని మేము రుజువు చేశాం. వెల్కమ్ పార్టీ సమయంలో లారాను కలిసినపుడు.. మీ నమ్మకం నిజం చేస్తామని చెప్పాను’’ అంటూ రషీద్ ఉద్వేగానికి లోనయ్యాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024 సెమీ ఫైనలిస్టు అంచనాల నేపథ్యంలో చాలా మంది మాజీ క్రికెటర్లు.. టీమిండియాతో పాటు సౌతాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా లేదంటే న్యూజిలాండ్ పేర్లు చెప్పారు. అయితే, లారా మాత్రం ఈసారి అఫ్గనిస్తాన్ కచ్చితంగా టాప్-4లో చేరుతుందని అంచనా వేశాడు. ఇప్పుడదే నిజమైంది.కాగా గ్రూప్ దశలో గ్రూప్-సిలో ఉన్న అఫ్గనిస్తాన్ నాలుగింట మూడు విజయాలతో సూపర్-8లో అడుగుపెట్టింది. ఇక ఇందులో గ్రూప్-1లో భాగమైన రషీద్ ఖాన్ బృందం.. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌లను ఓడించి సెమీస్‌కు చేరుకుంది.చదవండి: T20 World Cup 2024 IND VS AUS: సెంచరీ గురించి ఆలోచనే లేదు.. రోహిత్ -
తొలిసారి ప్రపంచకప్ సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్.. భావోద్వేగాలు, సంబరాలు
ఒకప్పటి క్రికెట్ పసికూన ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు ప్రపంచ మేటి జట్లలో ఒకటిగా మారిపోయింది. ఏమాత్రం అంచనాలు లేకుండా టీ20 వరల్డ్‌కప్-2024 బరిలోకి దిగిన ఆ జట్టు.. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ లాంటి మేటి జట్లపై సంచలన విజయాలు సాధించి తొలిసారి ప్రపంచకప్ సెమీఫైనల్స్‌కు చేరింది. THE WINNING MOMENT FOR AFGANISTAN. 🇦🇫- Pure raw emotions, the boys made it to the Semi Final. 🥹❤️pic.twitter.com/IMW34vfjbj— Mufaddal Vohra (@mufaddal_vohra) June 25, 2024ఇవాళ (జూన్ 25) జరిగిన సూపర్-8 సమరంలో బంగ్లాను మట్టికరిపించిన ఆఫ్ఘన్లు.. ప్రపంచకప్‌లో తొలిసారి ఫైనల్ ఫోర్కు అర్హత సాధించి, క్రికెట్ ప్రపంచం మొత్తం నివ్వెరపోయేలా చేశారు. బంగ్లాపై గెలుపు అనంతరం ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లంతా భావోద్వేగానికి లోనై కన్నీటిపర్యంతమయ్యారు. కోచ్ జోనాథన్ ట్రాట్, బౌలింగ్ కోచ్ డ్వేన్ బ్రావో కూడా ఆఫ్ఘన్ల గెలుపు సంబరాల్లో భాగమయ్యారు.THE CELEBRATIONS FROM JONATHAN TROTT AND DWAYNE BRAVO. 💥 pic.twitter.com/KXp81jGL9J— Mufaddal Vohra (@mufaddal_vohra) June 25, 2024ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడే ఈ సందర్భాన్ని ఆఫ్ఘన్లతో పాటు ప్రతి క్రికెట్ ప్రేమికుడు సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆఫ్ఘన్ పౌరుల సంబరాలు, భావోద్వేగాలు మాటల్లో వర్ణించలేని విధంగా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ నగర వీధులు తమ దేశ ఆటగాళ్ల నామస్మరణతో మార్మోగాయి. The joy on the face and happy tears on Afghanistan's fans. 🥹❤️ pic.twitter.com/3LOWLanIPP— Mufaddal Vohra (@mufaddal_vohra) June 25, 2024AFGHANISTAN CELEBRATION IN TEAM BUS. 🔥- The Greatest day ever. [Bravo IG] pic.twitter.com/x3jHvdD0OZ— Johns. (@CricCrazyJohns) June 25, 2024Water brigade used on Afghanistan people to clear the road, but nobody moved. 😂🔥 pic.twitter.com/zFCnGmlTM7— Mufaddal Vohra (@mufaddal_vohra) June 25, 2024 ఆఫ్ఘన్లు బహుశా తమకు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు కూడా ఇంతలా సంబురాలు చేసుకుని ఉండరు. కాబుల్ సహా దేశంలోని ప్రతి నగరంలో జనాలు రోడ్లపైకి వచ్చి సమూహిక సంబురాలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్ల గెలుపు సంబరాలు వైరలవుతున్నాయి.THE CELEBRATIONS IN PAKTIA PROVINCE. 🥶🇦🇫 pic.twitter.com/5wf2wucJjv— Mufaddal Vohra (@mufaddal_vohra) June 25, 2024కాగా, వరుణుడి అంతరాయాల నడుమ సాగిన సూపర్-8 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఆఫ్ఘనిస్తాన్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిన 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఆఫ్ఘనిస్తాన్ సెమీస్‌కు చేరగా.. గ్రూప్-1 నుంచి సెమీస్ రేసులో ఉండిన బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా ఒకేసారి ఇంటిముఖం పట్టాయి.The madness in Afghanistan. 🤯🇦🇫 pic.twitter.com/MyYrAcFidr— Mufaddal Vohra (@mufaddal_vohra) June 25, 2024ఇదిలా ఉంటే, బంగ్లాపై ఆఫ్ఘనిస్తాన్ గెలుపుతో టీ20 వరల్డ్‌కప్ 2024లో నాలుగు సెమీస్ బెర్త్‌లు ఖరారయ్యాయి. గ్రూప్-1 నుంచి భారత్, ఆఫ్ఘనిస్తాన్.. గ్రూప్-2 నుంచి సౌతాఫ్రికా జట్లు ఫైనల్ ఫోర్కు అర్హత సాధించాయి. జూన్ 26న జరిగే తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ తలపడనుండగా.. ఆతర్వాతి రోజు జరిగే రెండో సెమీఫైనల్లో టీమిండియా, ఇంగ్లండ్ జట్లు ఢీకొంటాయి. Celebration time pic.twitter.com/0bub4dXREP— Byomkesh (@byomkesbakshy) June 25, 2024 -
T20 World Cup 2024: సెమీస్ బెర్త్‌లు ఖరారు.. టీమిండియా ప్రత్యర్ధి ఎవరంటే..?
టీ20 వరల్డ్‌కప్ 2024లో సెమీస్ బెర్త్‌లు ఖరారయ్యాయి. గ్రూప్-1 నుంచి భారత్, ఆఫ్ఘనిస్తాన్.. గ్రూప్-2 నుంచి సౌతాఫ్రికా జట్లు ఫైనల్ ఫోర్కు అర్హత సాధించాయి. జూన్ 26న జరిగే తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ తలపడనుండగా.. ఆతర్వాతి రోజు జరిగే రెండో సెమీఫైనల్లో టీమిండియా, ఇంగ్లండ్ జట్లు ఢీకొంటాయి. తొలి సెమీఫైనల్‌కు ట్రినిడాడ్ వేదిక కానుండగా.. రెండో సెమీస్ గయానా వేదికగా జరుగనుంది. తొలి సెమీఫైనల్ భారతకాలమానం ప్రకారం గురువారం ఉదయం 6 గంటకు ప్రారంభం కానుండగా.. రెండో సెమీఫైనల్ గురువారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ రెండు సెమీఫైనల్స్‌లో గెలిచే జట్లు జూన్ 29న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. ఫైనల్ మ్యాచ్‌కు బార్బడోస్ వేదిక కానుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం 29వ తేదీ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది.ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య ఇవాళ (జూన్ 25) జరిగిన సూపర్-8 పోరుతో గ్రూప్-1 రెండో సెమీస్ బెర్త్ ఖరారైంది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఖంగుతినిపించడంతో ఆఫ్ఘనిస్తాన్ తొలిసారి సెమీస్‌కు అర్హత సాధించింది. వరుణుడి అంతరాయాల నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిన 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించడంతో గ్రూప్-1లో ఉన్న బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా ఒకేసారి ఇంటిముఖం పట్టాయి.స్కోర్ వివరాలు..ఆఫ్ఘనిస్తాన్ 115/5 (గుర్బాజ్ 43, రిషద్ హొసేన్ 3/26)బంగ్లాదేశ్ 105 ఆటౌట్ (17.5 ఓవర్లలో) (లిటన్ దాస్ 54 నాటౌట్; నవీన్ ఉల్ హక్ 4/26, రషీద ఖాన్ 4/23) 8 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ విజయం (డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో బంగ్లా విజయ లక్ష్యం 19 ఓవర్లలో 114 పరుగులు) -
T20 World Cup 2024 : సెమీస్‌కు ఆఫ్ఘనిస్తాన్..ఆస్ట్రేలియా ఇంటికి (ఫొటోలు)
-
ఉత్కంఠ పోరులో బంగ్లాపై గెలుపు.. సెమీస్‌కు ఆఫ్ఘనిస్తాన్.. ఆస్ట్రేలియా ఇంటికి
టీ20 వరల్డ్‌కప్ 2024లో ఆఫ్ఘనిస్తాన్ మరో సంచలన విజయం సాధించింది. ఈ టోర్నీలో ఇప్పటికే న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలకు షాకిచ్చిన ఆఫ్ఘన్లు.. తాజాగా బంగ్లాదేశ్‌ను ఖంగుతినిపించారు. సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆఫ్ఘన్ ఆటగాళ్లు అద్భుత పోరాటం చేసి స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుని విజయం సాధించారు. ఈ గెలుపుతో ఆఫ్ఘనిస్తాన్ సెమీస్‌కు చేరగా.. బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా ఇంటిముఖం పట్టాయి.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో గుర్బాజ్ (43) ఒక్కడే రాణించాడు. ఇబ్రహీం జద్రాన్ (29 బంతుల్లో 18), అజ్మతుల్లా (12 బంతుల్లో 10), గుల్బదిన్ (3 బంతుల్లో 4), నబీ (5 బంతుల్లో 1) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు. ఆఖర్లో రషీద్ ఖాన్ 3 సిక్సర్లు కొట్టడంతో (10 బంతుల్లో 19) ఆఫ్ఘనిస్తాన్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. బంగ్లా బౌలర్లలో రిషద్ హొసేన్ (4-0-26-3), తస్కిన్ అహ్మద్ (4-1-12-1), ముస్తాఫిజుర్ (4-0-17-1), షకీబ్ (4-0-19-0) అద్భుతంగా బౌలింగ్ చేశారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. సూపర్-8లో ఒక్క మ్యాచ్ గెలవకపోయినా సెమీస్‌కు చేరే సువర్ణావకాశాన్ని చేజార్చుకుంది. ఆ జట్టు ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన 116 పరుగుల లక్ష్యాన్ని 12.1 ఓవర్లలో ఛేదించి ఉంటే సెమీస్‌కు చేరి ఉండేది. అయితే ఇలా జరగకపోగా చిత్తుగా ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. లక్ష్య ఛేదనలో పలు మార్లు వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన బంగ్లా లక్ష్యాన్ని 19 ఓవర్లలో 114 పరుగులకు కుదించారు. ఆఫ్ఘన్ బౌలర్లు చెలరేగడంతో బంగ్లాదేశ్ ఈ స్కోర్‌ను కూడా ఛేదించలేకపోయింది. నవీన్ ఉల్ హక్ (3.5-0-26-4), రషీద్ ఖాన్ (4-0-23-4), ఫజల్ హక్ (2-0-15-1), గుల్బదిన్ నైబ్ (2-0-5-1) ధాటికి 17.5 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా ఆఫ్ఘనిస్తాన్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
T20 World Cup 2024: బంగ్లా లక్ష్యం 116.. 12.1 ఓవర్లలో ఛేదిస్తే సెమీస్‌కు..!
టీ20 వరల్డ్‌కప్ 2024 సూపర్-8లో ఒక్క మ్యాచ్ గెలవకపోయిన సెమీస్‌కు చేరే సువర్ణావకాశం బంగ్లాదేశ్‌కు వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (జూన్ 24) జరుగుతున్న మ్యాచ్‌లో 12.1 ఓవర్లలో లక్ష్యాన్ని (116 పరుగులు) ఛేదిస్తే.. భారత్‌తో పాటు సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 115 పరుగులు మాత్రమే చేసింది. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో గుర్బాజ్ (43) ఒక్కడే రాణించాడు. మిగతా ఆటగాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఇబ్రహీం జద్రాన్ (29 బంతుల్లో 18), అజ్మతుల్లా (12 బంతుల్లో 10), గుల్బదిన్ (3 బంతుల్లో 4), నబీ (5 బంతుల్లో 1) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు. ఆఖర్లో రషీద్ ఖాన్ 3 సిక్సర్లు కొట్టడంతో (10 బంతుల్లో 19) ఆఫ్ఘనిస్తాన్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. బంగ్లా బౌలర్లలో అందరూ పొదుపుగా బౌలింగ్ చేశారు. రిషద్ హొసేన్ (4-0-26-3), తస్కిన్ అహ్మద్ (4-1-12-1), ముస్తాఫిజుర్ (4-0-17-1), షకీబ్ (4-0-19-0) ఆఫ్ఘన్ బ్యాటర్లను కట్టడి చేశారు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ అనంతరం వర్షం మొదలు కావడంతో మ్యాచ్‌ను ఆపేశారు. -
T20 World Cup 2024: రసవత్తరంగా మారిన గ్రూప్-1 రెండో సెమీస్ బెర్త్ రేసు
టీ20 వరల్డ్‌కప్ 2024లో గ్రూప్-1 నుంచి రెండో సెమీస్ బెర్త్ రేసు రసవత్తరంగా మారింది. ఈ గ్రూప్ నుంచి టీమిండియా తొలి సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోగా (ఆసీస్‌పై విజయంతో).. రెండో బెర్త్ కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. టీమిండియా చేతిలో ఆసీస్ ఓటమితో గ్రూప్-1 నుంచి రెండో సెమీస్ బెర్త్ కోసం మూడు జట్లు పోటీపడుతున్నాయి. బంగ్లాదేశ్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌కు ముందు ఆసీస్, ఆఫ్ఘనిస్తాన్ ఖాతాల్లో చెరి 2 పాయింట్లు ఉండగా.. బంగ్లాదేశ్ ఖాతా పాయింట్లేమీ లేవు.ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గెలిస్తే.. ఆ జట్టు ఖాతాలో కూడా 2 పాయింట్లు చేరతాయి. అప్పుడు ఆసీస్, ఆఫ్ఘనిస్తాన్లతో పాటు బంగ్లాదేశ్ కూడా సెమీస్ రేసులో ఉంటుంది.ఆఫ్ఘనిస్తాన్పై బంగ్లాదేశ్ 61 పరుగులు అంతకంటే ఎక్కువ తేడాతో గెలిచినా.. 13 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించినా భారత్‌తో పాటు సెమీస్‌కు చేరుకుంటుంది.ఆఫ్ఘనిస్తాన్.. బంగ్లాదేశ్‌ను ఓడిస్తే భారత్‌తో పాటు సెమీస్‌కు చేరుకుంటుంది.ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 61 పరుగుల కంటే తక్కువ తేడాతో గెలిస్తే ఆస్ట్రేలియా సెమీస్‌కు చేరుకుంటుంది.ఇదిలా ఉంటే, సెయింట్ విన్సెంట్ వేదికగా ఇవాళ (జూన్ 25) ఉదయం 6 గంటలకు ఆఫ్ఘనిస్తాన్-బంగ్లాదేశ్ మ్యాచ్ మొదలైంది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ ఎంచుకుంది. 16.3 ఓవర్లు ముగిసే సమయానికి ఆ జట్టు స్కోర్ 3 వికెట్ల నష్టానికి 89 పరుగులుగా ఉంది. గుర్బాజ్ (43), ఇబ్రహీం జద్రాన్ (18), ఒమర్జాయ్ (10) ఔట్ కాగా.. గుల్బదిన్ నైబ్ (4), నబీ (1) క్రీజ్‌లో ఉన్నారు. బంగ్లా బౌలర్లలో రిషద్ హొసేన్ 3, ముస్తాఫిజుర్ ఓ వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ ఫలితంపై గ్రూప్-1 రెండో సెమీస్ బెర్త్ ఆధారపడి ఉంది. -
వారెవ్వా.. అప్పుడు ఒక్కరు లేరు.. ఇప్పుడేమో: నవీన్ పోస్ట్ వైరల్
టీ20 ప్రపంచకప్-2024లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో సమష్టి ఆటతీరుతో అఫ్గానిస్తాన్ తమ క్రికెట్ చరిత్రలోనే చిరస్మరణీయ విజయం అందుకుంది. ప్రపంచ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో (టెస్టు, వన్డే, టి20) విశ్వవిజేతగా నిలిచిన ఆస్ట్రేలియాను అఫ్గానిస్తాన్ తొలిసారి ఓడించింది.గతంలో ఆస్ట్రేలియాతో ఆడిన నాలుగు వన్డేలలో, ఒక టి20 మ్యాచ్‌లో ఓడిపోయిన అఫ్గానిస్తాన్ ఆరో ప్రయత్నంలో మాత్రం క్రికెట్ అభిమానులందరూ అబ్బురపడే ఫలితాన్ని సాధించింది. ప్రపంచవ్యాప్తంగా జరిగే టి20 ఫ్రాంచైజీ లీగ్‌లలో ఆడుతున్న అఫ్గాన్ క్రికెటర్లు ఆ అనుభవాన్నంతా రంగరించి పోరాడటంతో ఆస్ట్రేలియా తొలిసారి అఫ్గానిస్తాన్ ముందు తలవంచక తప్పలేదు. అగ్రశ్రేణి జట్లపై గెలిచే సత్తా తద్వారా.. ప్రపంచ క్రికెట్లో ఇక నుంచి తమను చిన్న జట్టుగా ఎవరూ పరిగణించకూడదని అఫ్గానిస్తాన్ చాటి చెప్పింది. అగ్రశ్రేణి జట్లపై గెలిచే సత్తా తమలోనూ ఉందని... క్రమం తప్పకుండా తమతో మేటి జట్లు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడితే మరింత రాటుదేలుతామని అఫ్గానిస్తాన్ క్రికెటర్లు నిరూపించారు.ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్ జట్టుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. సూపర్‌గా ఆడారంటూ అభిమానులతో పాటు పలువురు మాజీ క్రికెటర్లు కూడా అభినందిస్తున్నారు. అంతేకాదు అఫ్గన్లోనూ అంబరాన్నంటేలా సంబరాలు చేసుకున్నారు.ఇప్పుడు ఆహా ఓహో అంటూఈ క్రమంలో అఫ్గనిస్తాన్ పేసర్ నవీన్ ఉల్ హక్ ఇన్‌స్టాలో షేర్ చేసిన పోస్టు వైరల్‌గా మారింది. క్లిష్ట సమయాల్లో తమకు అండగా రాని వాళ్లు సైతం.. ఇప్పుడు ఆహా ఓహో అంటూ ప్రశంసిస్తున్నారంటూ ఫొటో ద్వారా ఘాటుగా సెటైర్ వేశాడు నవీన్. తమను విమర్శించే వాళ్లే ఇప్పుడు ఈ విజయం కారణంగా ఆకాశానికెత్తుతున్నారంటూ చురకలు అంటించాడు. స్టేడియంలో ఒకే ఒక్క వ్యక్తి ఉన్న ఫోటోకు సపోర్టు అని.. గుంపుగా స్టేడియమంతా నిండిన అభిమానులున్న ఫొటోకు కంగ్రాట్స్ అని రాసి ఉన్న దృశ్యాలు షేర్ చేశాడు.ఎలాంటి పరిస్థితుల్లోనైనా మేము నీతోనేఈ నేపథ్యంలో ఐపీఎల్ ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్ స్పందించింది. నవీన్ పోస్టుకు బదులిస్తూ.. ‘‘ఎలాంటి పరిస్థితుల్లోనైనా మేము నీతోనే’’ అంటూ మద్దతు తెలిపింది. కాగా టీ20 ప్రపంచకప్ ‘సూపర్–8’ దశలో భాగంగా మాజీ చాంపియన్ ఆస్ట్రేలియాతో ఆదివారం ఉదయం జరిగిన గ్రూప్–1 మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ 21 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే.ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గుల్బదిన్ నైబ్ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. అనంతరం 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 19.2 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది.మ్యాక్స్‌వెల్ (41 బంతుల్లో 59; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) మినహా ఇతర బ్యాటర్లు విఫలమయ్యారు. నవీనుల్ హక్ (3/20), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గుల్బదిన్ నైబ్ (4/20) తమ వైవిధ్యభరిత బౌలింగ్‌తో ఆస్ట్రేలియాను దెబ్బ కొట్టారు. గతంలో ఒక్కసారి కూడా ఆస్ట్రేలియాపై నెగ్గని అఫ్గానిస్తాన్‌కు ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్ (49 బంతుల్లో 60; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఇబ్రహీం జద్రాన్ (48 బంతుల్లో 51; 6 ఫోర్లు) శుభారంభం అందించారు.వీరిద్దరు తొలి వికెట్‌కు 118 పరుగులు జోడించారు. గుర్బాజ్, ఇబ్రహీం అవుటయ్యాక వచ్చిన ఇతర అఫ్గాన్ బ్యాటర్లు మెరిపించలేకపోయారు. కమిన్స్ హ్యాట్రిక్ ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన ఆసీస్ పేసర్ కమిన్స్ చివరి బంతికి అఫ్గానిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ (2)ను అవుట్ చేశాడు. ఆ తర్వాత 20వ ఓవర్లో తొలి రెండు బంతులకు కరీమ్ జన్నత్ (9 బంతుల్లో 13; 1 సిక్స్), గుల్బదిన్ నైబ్ (0)లను అవుట్ చేసి ఈ టోర్నీలో రెండో ‘హ్యాట్రిక్’ నమోదు చేశాడు.నవీనుల్, గుల్బదిన్ సూపర్ బౌలింగ్ కష్టసాధ్యంకాని లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. నవీనుల్ హక్ అద్భుత బంతికి ఓపెనర్ ట్రవిస్ హెడ్ (0) బౌల్డయ్యాడు. ఆ తర్వాత నవీనుల్ తన రెండో ఓవర్లో కెపె్టన్ మిచెల్ మార్ష్ (9 బంతుల్లో 12; 2 ఫోర్లు)ను అవుట్ చేశాడు. ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో వార్నర్ (3)ను నబీ పెవిలియన్‌కు పంపించడంతో ఆసీస్ కష్టాల్లో పడింది.ఈ దశలో మ్యాక్స్‌వెల్, స్టొయినిస్ (17 బంతుల్లో 11; 1 ఫోర్) ఇన్నింగ్స్ చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. అయితే గుల్బదిన్ వైవిధ్యభరిత బంతులతో ముందుగా స్టొయినిస్‌ను, ఆ తర్వాత టిమ్ డేవిడ్‌ను అవుట్ చేశాడు. అనంతరం ప్రమాదకరంగా మారిన మ్యాక్స్‌వెల్‌ను కూడా గుల్బదిన్ పెవిలియన్‌కు పంపించాడు. ఆ తర్వాత మాథ్యూ వేడ్‌ను రషీద్ ఖాన్ అవుట్ చేశాడు.దీంతో ఆసీస్ 108 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి వైపు సాగింది. కమిన్స్ ఏమైనా అద్భుతం చేస్తాడా అని ఆశించినా అతడిని గుల్బదిన్ అవుట్ చేయడంతో ఆస్ట్రేలియా పరాజయం ఖాయమైంది. చదవండి: కోహ్లి, రోహిత్‌లకు అదే ఆఖరి ఛాన్స్.. పట్టుబట్టిన గంభీర్! View this post on Instagram A post shared by Naveen ul haq Murid (@naveen_ul_haq) -
T20 World Cup 2024: చరిత్ర సృష్టించిన మొహమ్మద్ నబీ.. 45 దేశాలపై విజయాలు
టీ20 ప్రపంచకప్ 2024లో ఇవాళ (జూన్ 23) పెను సంచలనం నమోదైన విషయం తెలిసిందే. సూపర్-8 గ్రూప్-1లో పటిష్టమైన ఆస్ట్రేలియాను చిన్న జట్టైన ఆఫ్ఘనిస్తాన్ చిత్తు ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెతేసిన ఆస్ట్రేలియా 19.2 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌటై, 21 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు మూకుమ్మడిగా విరుచుకుపడి ఆసీస్‌కు జీర్ణించుకోలేని ఓటమి రుచి చూపించారు.ఆఫ్ఘన్ బౌలర్లలో గుల్బదిన్ నైబ్ (4-0-24-4) ఆసీస్‌ను దారుణంగా దెబ్బకొట్టగా.. నవీస్ ఉల్ హక్ 3, ఒమర్జాయ్, మొహమ్మద్ నబీ, రషీద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో మ్యాక్స్‌వెల్ (59) ఒంటిరి పోరాటం చేయగా.. మరో ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోర్లు (మార్ష్ (12), స్టోయినిస్ (11)) చేశారు.అంతకుముందు గుర్భాజ్ (60), ఇబ్రహీం జద్రాన్ (51) రాణించడంతో ఓ మోస్తరు స్కోర్ చేసింది. ఆసీస్ బౌలర్లలో పాట్ కమిన్స్ 3, జంపా 2, స్టోయినిస్ ఓ వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో కమిన్స్ హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగాడు. అతనికి ఇది వరుసగా రెండో హ్యాట్రిక్. పొట్టి క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ బౌలర్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హ్యాట్రిక్ వికెట్లు సాధించలేదు.చరిత్ర సృష్టించిన మొహమ్మద్ నబీఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ గెలుపులో భాగమైన మొహమ్మద్ నబీ క్రికెట్ చరిత్రలో బహుశా ఏ ఆటగాడు సాధించని అత్యంత అరుదైన ఘనత సాధించాడు. ఆసీస్‌పై గెలుపుతో నబీ 45 దేశాలపై విజయాలు సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఇందులో ఎనిమిది ఐసీసీ సభ్య దేశాలు (ఐర్లాండ్, జింబాబ్వే, వెస్టిండీస్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) ఉన్నాయి. నబీ విజయాలు సాధించిన దేశాలు..బహ్రెయిన్, మలేషియా, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, ఇరాన్, థాయిలాండ్, నేపాల్, యూఏఈ, జపాన్, బహామాస్, బోట్స్వానా, జెర్సీ, ఫిజి, టాంజానియా, ఇటలీ, హాంకాంగ్, అర్జెంటీనా, పాపువా న్యూ గినియా, కేమన్ దీవులు, ఒమన్, డెన్మార్క్, బెర్ముడా, ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్, చైనా, నమీబియా, సింగపూర్, కెనడా, యూఎస్ఏ, కెన్యా, పాకిస్థాన్, ట్రినిడాడ్ & టొబాగో, భూటాన్, మాల్దీవులు, బార్బడోస్, ఉగాండా, బంగ్లాదేశ్, జింబాబ్వే, వెస్టిండీస్, శ్రీలంక, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా -
T20 World Cup 2024: ఇలా జరిగితే ఆసీస్ ఇంటికే..!
టీ20 వరల్డ్‌కప్ 2024 సూపర్-8 దశలో పెను సంచనలం నమోదైన విషయం తెలిసిందే. గ్రూప్-1లో భాగంగా ఇవాళ (జూన్ 23) జరిగిన మ్యాచ్‌లో అండర్ డాగ్ ఆఫ్ఘనిస్తాన్.. మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు ఊహించని షాకిచ్చింది. ఈ మ్యాచ్‌లో ఓటమితో ఆస్ట్రేలియా సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకోగా.. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచి, ఒకదాంట్లో ఓడిన (భారత్ చేతిలో) ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ అవకాశాలను మెరుగుపర్చుకుంది.ఇలా జరిగితే ఆసీస్ ఇంటికే..!భారత్‌తో జరుగబోయే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓడి.. ఆతర్వాత జరుగబోయే మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధిస్తే.. ఆస్ట్రేలియా ఇంటికి, ఆఫ్ఘనిస్తాన్ సెమీస్‌కు చేరుతాయి.ఇలా జరిగినా ఆసీస్ ఇంటికే..!ఒకవేళ భారత్‌తో రేపు జరిగే మ్యాచ్‌లో ఆసీస్ ఓ మోస్తరు తేడాతో గెలుపొందినా సెమీస్ చేరుతుందన్న నమ్మకం లేదు. ఎందుకంటే.. తదుపరి బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ భారీ తేడాతో గెలిస్తే.. అప్పుడు భారత్, ఆసీస్, ఆఫ్ఘన్ ఖాతాలో చెరి నాలుగు పాయింట్లు ఉంటాయి. నెట్ రన్‌రేట్ ఆధారంగా భారత్, ఆఫ్ఘనిస్తాన్ సెమీస్‌కు చేరుకుంటాయి. ప్రస్తుతం భారత్ నెట్ రన్ రేట్ (2.425) మిగతా జట్లకంటే మెరుగ్గా ఉంది కాబట్టి.. ఆస్ట్రేలియా చేతిలో ఓడినా టీమిండియా సెమీస్ అవకాశాలకు ఎలాంటి ఢోకా ఉండదు. బంగ్లాదేశ్‌పై భారీ విజయం సాధిస్తే అప్పుడు భారత్‌తో పాటు ఆఫ్ఘన్ సెమీస్‌కు చేరుతుంది. ఆసీస్ సెమీస్‌కు చేరాలంటే ఇలా జరగాలి..గ్రూప్-1 నుంచి ఆసీస్ సెమీస్‌కు చేరాలంటే రేపు జరుగబోయే మ్యాచ్‌లో భారత్‌ను ఓడించాలి. అలాగే బంగ్లాదేశ్ చేతిలో ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోవాలి. ఇలా జరిగితే భారత్, ఆసీస్ సెమీస్‌కు చేరుకుంటాయి. ఆఫ్ఘనిస్తాన్ ఇంటి ముఖం పడుతుంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిన బంగ్లాదేశ్ సెమీస్‌కు చేరడం దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. అయితే టెక్నికల్‌గా ఆ జట్టుకు కూడా ఇంకా సెమీస్ అవకాశాలు ఉన్నాయి (ఆస్ట్రేలియాపై భారత్.. ఆఫ్ఘనిస్తాన్పై బంగ్లాదేశ్ భారీ తేడాలతో గెలవాలి). -
ఆస్ట్రేలియాపై చారిత్రక విజయం.. ఆఫ్ఘన్ల సంబురాలు మామూలుగా లేవుగా..!
అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పుడిప్పుడే పెద్దగా జట్టుగా పేరు తెచ్చుకుంటున్న ఆప్ఘనిస్తాన్.. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్ 2024లో సంచలన విజయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. గ్రూప్ దశలో న్యూజిలాండ్ లాంటి పటిష్ట జట్టుకు షాకిచ్చిన ఆఫ్ఘన్లు.. సూపర్-8 సమరంలో మాజీ జగజ్జేత ఆస్ట్రేలియాకు జీర్ణించుకోలేని ఓటమిని రుచి చూపించింది. Dwayne Bravo 'Champion' celebrations in Afghanistan team bus. 🇦🇫 pic.twitter.com/PQEmnexV4f— Mufaddal Vohra (@mufaddal_vohra) June 23, 2024సూపర్-8 గ్రూప్-1లో భాగంగా ఇవాళ (జూన్ 23) జరిగిన మ్యాచ్‌లో అండర్ డాగ్ ఆఫ్ఘనిస్తాన్.. పటిష్టమైన ఆస్ట్రేలియాను 21 పరుగుల తేడాతో ఓడించి పెను సంచనలం సృష్టించింది. ఈ విజయం అనంతరం ఆఫ్ఘన్ ప్లేయర్లు, ఆ జట్టు అభిమానుల సంబురాలు అంతా ఇంతా కాదు. వారి విజయోత్సవాలు మాటల్లో వర్ణించలేని విధంగా ఉన్నాయి. బహుశా వారు స్వాతంత్ర్యం పొందినప్పుడు కూడా ఇంతలా సంబురాలు చేసుకుని ఉండరు. THE DRESSING ROOM CELEBRATION OF AFGHANISTAN. 🥶pic.twitter.com/rzVztmrUTp— Mufaddal Vohra (@mufaddal_vohra) June 23, 2024ఆసీస్‌పై చారిత్రక విజయం అనంతరం ఆఫ్ఘన్ హీరో గుల్బదిన్ నైబ్‌ను సహచర ఆటగాళ్లు భుజాలపై ఎత్తుకుని డ్రెస్సింగ్ రూమ్‌లోకి మోసుకెళ్లి సంబురాలు చేసుకోగా.. ఆఫ్ఘన్ వీధుల్లో ఆ దేశ పౌరుల సంబురాలు అంబరాన్నంటాయి. ఆ దేశ రాజధాని కాబుల్ వీధుల్లో జనాలు రోడ్లపైకి వచ్చి టపాసులు కాలుస్తూ.. కేరింతలు కొడుతూ సంబురాలు చేసుకున్నారు. ఈ సంబురాలు ఒక్క కాబుల్కే పరిమితం కాలేదు. ఆఫ్ఘనిస్తాన్ మొత్తం ఈ విజయాన్ని పండుగలా సెలబ్రేట్ చేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్ చరిత్రలోనే బహుశా ఇంతమంది జనాలు బయటికి వచ్చి సమూహిక సంబురాలు చేసుకుని ఉండరు. గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో ఆసీస్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్నామని ఆఫ్ఘన్లు సంబరపడిపోతున్నారు. మొత్తానికి ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ చరిత్రలో ఇది చిరస్మరణీ విజయంగా మిగిలిపోనుంది.Celebrations in Afghanistan. 🇦🇫- A historic victory! pic.twitter.com/wHA1Xl9CgL— Mufaddal Vohra (@mufaddal_vohra) June 23, 2024రాణించిన గుర్బాజ్, జద్రాన్.. వరుసగా రెండో మ్యాచ్‌లో కమిన్స్ హ్యాట్రిక్కింగ్స్టౌన్లోని ఆర్నోస్ వేల్ మైదానం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్లు.. ఓపెనర్లు గుర్భాజ్ (60), ఇబ్రహీం జద్రాన్ (51) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో పాట్ కమిన్స్ 3, జంపా 2, స్టోయినిస్ ఓ వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో కమిన్స్ హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగాడు. అతనికి ఇది వరుసగా రెండో హ్యాట్రిక్. పొట్టి క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ బౌలర్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హ్యాట్రిక్ వికెట్లు సాధించలేదు.రెచ్చిపోయిన ఆఫ్ఘన్ బౌలర్లు.. ఆసీస్‌కు ఘోర పరాభవం149 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. ఆఫ్ఘన్ బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో 19.2 ఓరవ్లలో 127 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆఫ్ఘన్ బౌలర్లలో గుల్బదిన్ నైబ్ (4-0-24-4) ఆసీస్‌ను దారుణంగా దెబ్బకొట్టగా.. నవీస్ ఉల్ హక్ 3, ఒమర్జాయ్, నబీ, రషీద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో మ్యాక్స్‌వెల్ (59) ఒంటిరి పోరాటం చేయగా.. మరో ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోర్లు (మార్ష్ (12), స్టోయినిస్ (11)) చేశారు. ఆసీస్ బ్యాటర్ల ఈ దుస్థితిని క్రికెట్ అభిమానులు ఇప్పటివరకు చూసి ఉండరు. -
ఇది మా దేశం గర్వించదగ్గ విజయం.. అతడొక అద్బుతం: రషీద్ ఖాన్
టీ20 వరల్డ్‌కప్-2024లో ఆస్ట్రేలియా జైత్ర యాత్రకు అఫ్గానిస్తాన్ బ్రేక్‌లు వేసింది. కింగ్స్టౌన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ను 21 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్ చిత్తు చేసింది. దీంతో 2023 వన్డే ప్రపంచకప్‌లో ఓటమికి అఫ్గాన్ బదులు తీర్చుకుంది. ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ బౌలర్లు అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. 150 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని అఫ్గాన్ బౌలర్లు కాపాడుకున్నారు. లక్ష్య చేధనలో అఫ్గాన్ బౌలర్ల దాటికి ఆసీస్ 127 పరుగులకే చాపచుట్టేసింది. అఫ్గాన్ మీడియం పేసర్ గుల్బాదిన్ నైబ్ 4 వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించగా.. నవీన్ ఉల్హక్ మూడు వికెట్లు, ఒమర్జాయ్, రషీద్ ఖాన్, నబీ ఒక్క వికెట్ సాధించారు. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఈ విజయంతో అఫ్గాన్ తమ సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం అఫ్గాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ స్పందించాడు. ఆసీస్ వంటి పటిష్ట జట్టుపై విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని రషీద్ తెలిపాడు."ఇది మాకు ఎప్పటికీ గుర్తుండిపోయే విజయం. ఆసీస్ వంటి పెద్ద జట్టుపై విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఇది మా దేశం గర్వించదగ్గ సందర్భం. మాకు కూడా ఒక జట్టుగా చాలా గర్వంగా ఉంది. ప్రత్యర్ది బౌలింగ్ లైనప్‌ను బట్టి మా ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంపిక చేస్తున్నాము. అందుకే ప్రతీ మ్యాచ్‌లోనూ ఒకే ప్లేయింగ్ ఎలెవన్‌తో ఆడలేకపోతున్నాము. కింగ్స్ టౌన్ పిచ్‌పై 140 పరుగులు మంచి స్కోర్‌గా భావించవచ్చు. మాకు బ్యాటింగ్‌లో మంచి ఆరంభం వచ్చింది. కానీ మేము ఫినిషింగ్ మాత్రం సరిగ్గా చేయలేకపోయాం. ఆఖరికి ప్రత్యర్ధి ముందు 150 పరుగుల లక్ష్యాన్ని ఉంచాము. ఈ టార్గెట్‌ను ఎలాగైనా డిఫెండ్ చేసుకోవాలనే పట్టుదలతో బరిలోకి దిగాం. అందుకు తగ్గట్టే మా బాయ్స్ అదరగొట్టారు. మా జట్టు గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఎక్కువ మంది ఆల్రౌండర్లను కలిగి ఉండటం జట్టుకు కలిసొచ్చింది. ఇక నైబ్ ఒక అద్బుతం. అతడి వల్లే ఇదింతా. నైబ్కు ఉన్న అనుభవాన్ని మొత్తం ఈ మ్యాచ్‌లో చూపించాడు. అదే విధంగా నవీన్,నబీ కూడా అద్బుమైన ప్రదర్శన కనబరిచారు. మా తదుపరి మ్యాచ్‌లో ఇదే జోరును కొనసాగిస్తామని పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో రషీద్ ఖాన్ పేర్కొన్నాడు. -
AUS vs AFG : ఉత్కంఠ పోరులో ఆసీస్‌ను చిత్తు చేసిన అఫ్గానిస్తాన్ (ఫొటోలు)
-
టీ20 వరల్డ్‌కప్‌లో సంచలనం.. ఆసీస్‌ను చిత్తు చేసిన అఫ్గానిస్తాన్
టీ20 వరల్డ్‌కప్-2024లో పెను సంచలనం నమోదైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా సూపర్-8 మ్యాచ్‌లో పటిష్ట ఆస్ట్రేలియాను అఫ్గానిస్తాన్ చిత్తు చేసింది. కింగ్స్టన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌పై 21 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్ ఘన విజయం సాధించింది.ఈ విజయంతో తమ సెమీస్ ఆశలను అఫ్గానిస్తాన్ సజీవంగా ఉంచుకుంది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. అఫ్గానిస్తాన్ బౌలర్ల దాటికి 127 పరుగులకే కుప్పకూలింది. ఓ దశలో క్రీజులో మాక్స్వెల్ ఉన్నప్పుడు ఆసీస్‌దే విజయమని అంతా భావించారు. కానీ అఫ్గాన్ ఆల్‌రౌండర్ గుల్బాదిన్ నైబ్.. మాక్సీని ఔట్ చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో నైబ్ తన 4 ఓవర్ల కోటాలో 20 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. నైబ్‌తో పాటు నవీన్ ఉల్ హక్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక ఆసీస్ బ్యాటర్లలో గ్లెన్ మాక్స్వెల్(59) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. అఫ్గాన్ ఓపెనర్లు గుర్బాజ్(60), ఇబ్రహీం జద్రాన్(51) పరుగులతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో కమ్మిన్స్ 3 వికెట్లు పడగొట్టగా.. జంపా రెండు, స్టోయినిష్ ఒక్క వికెట్ సాధించారు. -
చరిత్ర సృష్టించిన కమ్మిన్స్.. ప్రపంచంలో ఒకే ఒక్కడు
ఆస్ట్రేలియా స్టార్ పేసర్, టెస్టు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచకప్‌లో రెండు సార్లు హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి బౌలర్‌గా కమ్మిన్స్ రికార్డులకెక్కాడు. టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా కింగ్స్టౌన్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌లో హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన కమ్మిన్స్.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.తొలుత 18వ ఓవర్ వేసిన కమ్మిన్స్ ఆఖరి బంతికి అఫ్గానిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్‌ను ఔట్ చేశాడు. ఆ తర్వాత మళ్లీ 20 ఓవర్ వేసిన కమ్మిన్స్.. వరుస బంతుల్లోకరీం జనత్, గుల్బాదిన్ నైబ్‌లను ఔట్ చేసి హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.అంతకముందు ఇదే వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ కమ్మిన్స్ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. దీంతో వరల్డ్‌కప్ చరిత్రలోనే రెండు సార్లు హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి బౌలర్‌గా కమ్మిన్స్ నిలిచాడు. అదేవిధంగా మరో కొన్ని రికార్డులను కూడా కమ్మిన్స్ తన ఖాతాలో వేసుకున్నాడు.కమ్మిన్స్ సాధించిన రికార్డులు ఇవే..అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి బౌలర్‌గా కమ్మిన్స్ నిలిచాడు. ఇప్పటివరకు ఈ ఘనత ఎవరికీ సాధ్యం కాలేదు.అంతర్జాతీయ టీ20ల్లో రెండు సార్లు హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన ఐదో బౌలర్‌గా కమ్మిన్స్ రికార్డులకెక్కాడు. ఈ జాబితాతో లసిత్ మలింగ (శ్రీలంక), టిమ్ సౌతీ (న్యూజిలాండ్), మార్క్ పావ్లోవిక్ (సెర్బియా), వసీం అబ్బాస్ (మాల్టా), పాట్ కమ్మిన్స్ (ఆసీస్) ఉన్నారు. -
అది గుర్తుకొస్తే నా ఒళ్లు జలదరిస్తుంది: రషీద్ ఖాన్
టీ20 ప్రపంచకప్-2024 సూపర్-8లో ఆదివారం ఉదయం ఆసక్తికర పోరు జరుగనుంది. గ్రూప్-1లో భాగమైన అఫ్గనిస్తాన్ పటిష్ట ఆస్ట్రేలియాతో తలపడనుంది. సెయింట్ విన్సెంట్‌లోని కింగ్స్టౌన్ స్టేడియం ఇందుకు వేదిక.ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కాగా వన్డే ప్రపంచకప్-2023లో అంచనాలకు మించి రాణించిన అఫ్గన్ ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించిన విషయం తెలిసిందే.మాక్స్వెల్ రాకతో అంతా తలకిందులుఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ సెంచరీ కారణంగా 292 పరుగులు స్కోరు చేసిన అఫ్గనిస్తాన్.. లక్ష్య ఛేదనలో కంగారూ జట్టును ఆది నుంచే బెంబేలెత్తించింది. అయితే, స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ రాకతో అంతా తలకిందులైంది.అఫ్గన్‌తో మ్యాచ్‌లో 91 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఆసీస్‌ను మాక్సీ గట్టెక్కించాడు. కండరాల నొప్పి వేధిస్తున్నా లెక్క చేయక డబుల్ సెంచరీతో చెలరేగాడు. 128 బంతుల్లో 201 పరుగులతో అజేయంగా నిలిచి ఆస్ట్రేలియాను ఒంటిచేత్తో గెలిపించాడు.నా ఒళ్లు జలదరిస్తుందిఇక ఇరు జట్లు ఇలా మరోసారి ఐసీసీ టోర్నీలో తలపడనున్న నేపథ్యంలో రషీద్ ఖాన్ ఐసీసీ డిజిటల్‌తో తన మనసులోని భావాలు పంచుకున్నాడు. నాటి మాక్సీ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ.. ‘‘రాత్రిపూట నేను నిద్రకు ఉపక్రమించే సమయంలో ఒక్కోసారి ఆట గురించి తలచుకుంటాను.అలాంటపుడు నా ఒళ్లు జలదరిస్తుంది. అసలు అదొక అద్భుత, నమ్మశక్యం కాని ఇన్నింగ్స్. మేము చూసిన అత్యంత గొప్ప ఇన్నింగ్స్‌లో అదొకటి’’ అని రషీద్ ఖాన్ మాక్స్‌వెల్‌ను ప్రశంసల్లో ముంచెత్తాడు.కాగా సూపర్-8లో టీమిండియా చేతిలో ఓడిన అఫ్గనిస్తాన్‌కు ఆసీస్‌తో పోరు కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. అయితే, కంగారూ జట్టుతో అంత ఈజీ కాదన్న విషయం తెలిసిందే.బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిమరోవైపు.. సూపర్-8లో శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. ఆంటిగ్వాలో ఆసీస్ 28 పరుగుల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ ప్రకారం) బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది.కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ (36 బంతుల్లో 41; 5 ఫోర్లు, 1 సిక్స్), తౌహీద్ హృదయ్ (28 బంతుల్లో 40; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. చివర్లో కమిన్స్ ‘హ్యాట్రిక్’తో టీమ్ సాధారణ స్కోరుకు పరిమితమైంది. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో ఐదో బంతికి మహ్ముదుల్లా (2), చివరి బంతికి మెహదీ హసన్ (0)లను అవుట్ చేసిన కమిన్స్... ఆ తర్వాత 20వ ఓవర్ తొలి బంతికి తౌహీద్‌ను వెనక్కి పంపి ‘హ్యాట్రిక్’ పూర్తి చేసుకున్నాడు.తొలి వికెట్‌కు 41 బంతుల్లోనే 65 పరుగులుఅనంతరం ఆస్ట్రేలియాకు వార్నర్ (35 బంతుల్లో 53 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), హెడ్ (21 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడైన ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 41 బంతుల్లోనే 65 పరుగులు జోడించారు.అనంతరం రిషాద్ తన వరుస ఓవర్లలో హెడ్, మార్ష్ (1)లను అవుట్ చేయగా...11.2 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ 2 వికెట్లు కోల్పోయి 100 పరుగులు సాధించింది. ఈ దశలో భారీ వర్షం కురిసింది. వాన ఆగకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను ఆ స్థితిలో ముగిస్తున్నట్లు ప్రకటించారు.డక్‌వర్త్ నిబంధనల ప్రకారం ఆ సమయానికి ఆసీస్ 72 పరుగులు చేస్తే సరిపోతుంది. కానీ అప్పటికే 28 పరుగులు ముందంజలో ఉన్న కంగారూ టీమ్ విజేతగా నిలిచింది. ‘హ్యాట్రిక్’ల రికార్డుఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో నమోదైన ‘హ్యాట్రిక్’ల సంఖ్య ఏడు. బ్రెట్‌లీ (2007) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఆస్ట్రేలియా బౌలర్‌గా కమిన్స్ నిలవగా... గతంలో కర్టిస్ కాంఫర్ (ఐర్లాండ్), హసరంగ (శ్రీలంక), రబాడ (దక్షిణాఫ్రికా), కార్తీక్ మెయప్పన్ (యూఏఈ), జోష్ లిటిల్ (ఐర్లాండ్) ఈ ఘనతను నమోదు చేశారు. -
‘సూపర్–8’లో భారత్ విజయారంభం..47 పరుగులతో అఫ్గానిస్తాన్ చిత్తు (ఫొటోలు)
-
T20 World Cup 2024 Super 8: అఫ్గాన్‌పై అలవోకగా...
టి20 ప్రపంచ కప్ ‘సూపర్–8’ దశలో భారత జట్టు తమ స్థాయిని ప్రదర్శించింది. అఫ్గానిస్తాన్ చక్కటి బౌలింగ్‌తో టీమిండియా ఆరంభంలో కాస్త తడబాటుకు గురైనా ఆపై సంపూర్ణ ఆధిపత్యం కొనసాగించింది. ఈ ఫార్మాట్లో తన నంబర్‌వన్ హోదాకు న్యాయం చేస్తూ, తనేంటూ నిరూపిస్తూ సూర్యకుమార్ యాదవ్ జట్టు భారీ స్కోరులో కీలకపాత్ర పోషించాడు. ఆ తర్వాత ఛేదనలో అఫ్గాన్ టీమ్ ఏ దశలోనూ కనీస స్థాయి ప్రదర్శన ఇవ్వలేకపోయింది. టీమిండియా పదునైన బౌలింగ్‌ను ఎదుర్కోలేక వరుసగా వికెట్లు కోల్పోయి మ్యాచ్‌ను సమర్పించుకుంది. ఇక మరో ఆసియా జట్టు బంగ్లాదేశ్‌తో శనివారం భారత్ తర్వాతి సమరానికి సిద్ధమైంది. బ్రిడ్జ్‌టౌన్: వరల్డ్ కప్‌లో సెమీఫైనల్ చేరే దిశగా భారత జట్టు కీలక విజయాన్ని అందుకుంది. సూపర్–8 గ్రూప్–1లో భాగంగా గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 47 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా... హార్దిక్ పాండ్యా (24 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. రషీద్ ఖాన్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటైంది. అజ్మతుల్లా ఒమర్జాయ్ (20 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్)దే అత్యధిక స్కోరు. బుమ్రా (3/7), అర్‡్షదీప్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. కీలక భాగస్వామ్యం... ఆరంభం నుంచే తడబడుతూ ఆడిన రోహిత్ శర్మ (13 బంతుల్లో 8; 1 ఫోర్) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఆ తర్వాత రషీద్ రెండు వికెట్లతో భారత్‌ను దెబ్బ తీశాడు. నబీ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లతో జోరు ప్రదర్శించిన రిషభ్ పంత్ (11 బంతుల్లో 20; 4 ఫోర్లు) వికెట్ల ముందు దొరికిపోగా...రషీద్ తర్వాతి ఓవర్లో భారీ షాట్ ఆడే క్రమంలో విరాట్ కోహ్లి (24 బంతుల్లో 24; 1 సిక్స్) అవుటయ్యాడు. ఈ దశలో సూర్యకుమార్ దూకుడైన బ్యాటింగ్‌తో స్కోరు వేగంగా సాగింది. రషీద్ ఓవర్లో సూర్య ఫోర్, సిక్స్ కొట్టగా... అదే ఓవర్లో మరో ఎండ్‌లో శివమ్ దూబే (7 బంతుల్లో 10; 1 సిక్స్) పెవిలియన్ చేరాడు. ఇలాంటి సమయంలో సూర్యకు పాండ్యా జత కలిశాడు. వీరిద్దరి భాగస్వామ్యంతో జట్టు మెరుగైన స్థితికి చేరింది. నూర్ ఓవర్లో పాండ్యా వరుసగా 4, 6 కొట్టగా... ఫజల్ ఓవర్లో సూర్య వరుసగా 6, 4 బాది 27 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే తర్వాతి బంతికే అతను అవుట్ కాగా, మరుసటి ఓవర్లో పాండ్యా ఆట ముగిసింది. జడేజా (5 బంతుల్లో 7; 1 ఫోర్) ప్రభావం చూపలేకపోగా, ఆఖరి ఓవర్లో అక్షర్ పటేల్ (6 బంతుల్లో 12; 2 ఫోర్లు) కీలక పరుగులు రాబట్టాడు. తొలి 10 ఓవర్లలో జట్టు 79 పరుగులు చేయగా, తర్వాతి 10 ఓవర్లలో 101 పరుగులు వచ్చాయి. ఈ మ్యాచ్ కోసం భారత్ ఒక మార్పు చేసింది. సిరాజ్ స్థానంలో కుల్దీప్ యాదవ్ వచ్చాడు. మరోవైపు గురువారం మరణించిన భారత మాజీ పేసర్ డేవిడ్ జాన్సన్‌కు నివాళిగా మన ఆటగాళ్లు నలుపు రంగు బ్యాండ్లు ధరించారు. అనంతరం లక్ష్య ఛేదనలో అఫ్గానిస్తాన్ బ్యాటర్లు చేతులెత్తేశారు. బుమ్రా తొలి ఓవర్లో అనవసర షాట్‌కు ప్రయత్నించి గుర్బాజ్ (11; 1 ఫోర్, 1 సిక్స్) అవుట్ కావడంతో మొదలైన జట్టు పతనం వేగంగా సాగింది. ఎవరు కూడా భారత బౌలింగ్ ముందు పట్టుదలగా నిలవలేకపోయారు. చెప్పుకోదగ్గ బౌలింగ్ వనరులు ఉన్నా ...ఎప్పటిలాగే బ్యాటర్ల వైఫల్యం దెబ్బ తీసింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) రషీద్ (బి) ఫజల్ 8; కోహ్లి (సి) నబీ (బి) రషీద్ 24; పంత్ (ఎల్బీ) (బి) రషీద్ 20; సూర్యకుమార్ (సి) నబీ (బి) ఫజల్ 53; దూబే (ఎల్బీ) (బి) రషీద్ 10; పాండ్యా (సి) అజ్మతుల్లా (బి) నవీన్ 32; జడేజా (సి) గుల్బదిన్ (బి) ఫజల్ 7; అక్షర్ (రనౌట్) 12; అర్‡్షదీప్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 181. వికెట్ల పతనం: 1–11, 2–54, 3–62, 4–90, 5–150, 6–159, 7–165, 8–181. బౌలింగ్: ఫజల్ హక్ 4–0–33–3, నబీ 3–0–24–0, నవీన్ ఉల్ హక్ 4–0–40–1, రషీద్ ఖాన్ 4–0–26–3, నూర్ అహ్మద్ 3–0–30–0, అజ్మతుల్లా 2–0–23–0. అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (సి) పంత్ (బి) బుమ్రా 11; హజ్రతుల్లా (సి) జడేజా (బి) బుమ్రా 2; ఇబ్రహీమ్ (సి) రోహిత్ (బి) అక్షర్ 8; గుల్బదిన్ (సి) పంత్ (బి) కుల్దీప్ 17; అజ్మతుల్లా (సి) అక్షర్ (బి) జడేజా 26; నజీబుల్లా (సి) అర్ష్ దీప్ (బి) బుమ్రా 19; నబీ (సి) జడేజా (బి) కుల్దీప్ 14; రషీద్ (సి) జడేజా (బి) అర్ష్ దీప్ 2; నూర్ (సి) రోహిత్ (బి) అర్ష్ దీప్ 12; నవీన్ (సి) పంత్ (బి) అర్‡్షదీప్ 0; ఫజల్హక్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 134. వికెట్ల పతనం: 1–13, 2–23, 3–23, 4–67, 5–71, 6–102, 7–114, 8–121, 9–121, 10–134. బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–36–3, బుమ్రా 4–1–7–3, అక్షర్ పటేల్ 3–1–15–1, హార్దిక్ పాండ్యా 2–0–13–0, కుల్దీప్ 4–0–32–2, జడేజా 3–0–20–1. టి20 ప్రపంచకప్‌లో నేడుఆ్రస్టేలియా X బంగ్లాదేశ్వేదిక: నార్త్‌సౌండ్; ఉదయం గం. 6 నుంచి ఇంగ్లండ్ X దక్షిణాఫ్రికావేదిక: గ్రాస్‌ఐలెట్; రాత్రి గం. 8 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
T20 World Cup 2024 Super 8: ఆఫ్ఘనిస్తాన్‌ను చిత్తు చేసిన టీమిండియా
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా బార్బడోస్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో టీమిండియా 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లలో 134 పరుగులకు చాపచుట్టేసింది.స్కై మెరుపులు..టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో సత్తా చాటడంతో భారీ స్కోర్ చేసింది. భారత ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లి (24), రిషబ్ పంత్ (20), హార్దిక్ పాండ్యా (32) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. రోహిత్ శర్మ (8), శివమ్ దూబే (10), రవీంద్ర జడేజా (7) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఆఖర్లో అక్షర్ పటేల్ (12) ఆకట్టుకున్నాడు. ఆఫ్ఘన్ బౌలర్లలో రషీద్ ఖాన్, ఫజల్ హక్ ఫారూఖీ తలో 3 వికెట్లు పడగొట్టగా.. నవీన్ ఉల్ హక్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.నిప్పులు చెరిగిన బుమ్రా..182 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్.. బుమ్రా (4-1-7-3) నిప్పులు చెరగడంతో 134 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ 3, కుల్దీప్ 2, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ (26) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
T20 World Cup 2024: సత్తా చాటిన సూర్యకుమార్.. ఆఫ్ఘనిస్తాన్ ముందు భారీ లక్ష్యం
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా బార్బడోస్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (జూన్ 20) జరుగుతున్న సూపర్-8 మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో సత్తా చాటగా.. విరాట్ కోహ్లి (24), రిషబ్ పంత్ (20), హార్దిక్ పాండ్యా (32) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రోహిత్ శర్మ (8), శివమ్ దూబే (10), రవీంద్ర జడేజా (7) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఆఖర్లో అక్షర్ పటేల్ (12) రెండు బౌండరీలు బాది ఆకట్టుకున్నాడు. ఆఫ్ఘన్ బౌలర్లలో రషీద్ ఖాన్, ఫజల్ హక్ ఫారూఖీ తలో 3 వికెట్లు పడగొట్టగా.. నవీన్ ఉల్ హక్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. తుది జట్లు..భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్‌కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రాఆఫ్ఘనిస్తాన్ : రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్‌కీపర్), ఇబ్రహీం జద్రాన్, నజీబుల్లా జద్రాన్, హజ్రతుల్లా జజాయ్, గుల్బాదిన్ నైబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్(కెప్టెన్), నూర్ అహ్మద్, నవీన్-ఉల్-హక్, ఫజల్ హక్ ఫారూఖీ -
T20 World Cup 2024: మెల్బోర్న్ ఐకానిక్ సిక్స్‌ను రిపీట్ చేసిన విరాట్
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (జూన్ 20) జరుగుతున్న సూపర్-8 మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ 14 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లి (24), రిషబ్ పంత్ (20), శివమ్ దూబే (10) ఔట్ కాగా.. సూర్యకుమార్ యాదవ్ (34), హార్దిక్ పాండ్యా (11) క్రీజ్‌లో ఉన్నారు. ఆఫ్ఘన్ బౌలర్లలో రషీద్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టగా.. ఫజల్ హక్ ఫారూఖీ ఓ వికెట్ దక్కించుకున్నాడు.THE GOAT HAS ARRIVED IN T20I WORLD CUP 2024. 🇮🇳 pic.twitter.com/5vZTr1vTHK— Johns. (@CricCrazyJohns) June 20, 2024ఐకానిక్ సిక్స్‌ను రిపీట్ చేసిన విరాట్ఈ మ్యాచ్‌లో విరాట్ 2022 టీ20 వరల్డ్‌కప్‌లో మెల్బోర్న్ మైదానంలో పాక్ పేసర్ హరీస్ రౌఫ్ బౌలింగ్‌లో బాదిన ఐకానిక్ సిక్స్‌ను రిపీట్ చేశాడు. నవీన్ ఉల్ హక్ బౌలింగ్‌లో విరాట్ కొట్టిన సిక్సర్ మెల్బోర్న్ ఐకానిక్ సిక్సర్‌ను గుర్తు చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఇక ఈ మ్యాచ్‌లో మాంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించిన విరాట్.. 24 బంతుల్లో సిక్సర్ సాయంతో 24 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్‌లో మొహమ్మద్ నబీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. -
T20 World Cup 2024: భారత్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్.. తుది జట్టులో కుల్దీప్
టీ20 వరల్డ్‌కప్ 2024 గ్రూప్-8 మ్యాచ్‌ల్లో భాగంగా ఇవాళ (జూన్ 20) భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. బార్బడోస్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు చెరో మార్పు చేశాయి. భారత్‌కు సంబంధించి సిరాజ్ స్థానంలో కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి రాగా.. ఆప్ఘనిస్తాన్ తరఫున కరీమ్ జనత్ స్థానంలో హజ్రతుల్లా జజాయ్ తుది జట్టులోకి వచ్చాడు.తుది జట్లు..భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్‌కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రాఆఫ్ఘనిస్తాన్: రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్‌కీపర్), ఇబ్రహీం జద్రాన్, నజీబుల్లా జద్రాన్, హజ్రతుల్లా జజాయ్, గుల్బాదిన్ నైబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్(కెప్టెన్), నూర్ అహ్మద్, నవీన్-ఉల్-హక్, ఫజల్ హక్ ఫారూఖీ -
‘ఎయిట్’లో సమరానికి సై!
ఎలాంటి విధ్వంసక బ్యాటింగ్ ప్రదర్శనలు లేవు...ఎలాంటి అసాధారణ బౌలింగ్ గణాంకాలు లేవు...ఐర్లాండ్, అమెరికాలపై సులువుగా గెలిస్తే పాక్ పోటీనిచ్చినా ఫలితం మన వైపే నిలిచింది. పెద్దగా ప్రతిఘటన లేకుండా ముందంజ వేసిన భారత జట్టు ఇప్పుడు దానిని కొనసాగించాలని పట్టుదలగా ఉంది. అప్పుడప్పుడు సంచలనాలతో అలరించే అఫ్గానిస్తాన్ ఎదురుగా నిలిచింది. బ్రిడ్జ్‌టౌన్: టి20 వరల్డ్ కప్‌లో లీగ్ దశతో పోలిస్తే కాస్త బలమైన ప్రత్యర్థులతో తలపడే అవకాశం ఉన్న సూపర్–8లో భారత జట్టు తమ తొలి మ్యాచ్ కోసం సన్నద్ధమైంది. నేడు జరిగే పోరులో అఫ్గానిస్తాన్‌తో టీమిండియా తలపడుతుంది. లీగ్ దశలో ఓటమి లేకుండా సాగిన భారత జట్టే ఇక్కడా ఫేవరెట్‌గా కనిపిస్తుండగా...అఫ్గాన్ తమ బౌలింగ్ బలాన్నే నమ్ముకుంది. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 8 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు జరగ్గా...భారత్ 7 గెలిచింది. మరో మ్యాచ్‌లో ఫలితం రాలేదు. అదే జట్టుతో... సూపర్–8లో పిచ్‌లు స్పిన్‌ను అనుకూలించే పరిస్థితి ఉంది కాబట్టి భారత్ కుల్దీప్ను తీసుకోవచ్చనే చర్చ జరిగింది. అయితే అక్షర్ అటు స్పిన్‌తో పాటు ఇటు బ్యాటింగ్‌తో కూడా కీలక పరుగులు సాధిస్తుండటంతో మేనేజ్మెంట్ ఆ సాహసం చేయకపోవచ్చు. రోహిత్, కోహ్లి ఓపెనర్లుగా చెలరేగితే జట్టుకు తిరుగుండదు. కోహ్లి అన్ని మ్యాచ్‌లలో విఫలమైనా...ఒక్క సరైన ఇన్నింగ్స్ అతని స్థాయిని చూపించగలదు. పంత్ మూడో స్థానంలో చక్కగా నిలదొక్కుకున్నాడు. అఫ్గాన్ స్పిన్నర్లపై ఎదురుదాడికి మిడిలార్డర్లో సూర్యకుమార్, దూబే సరైనవాళ్లు కాగలరు. ఆ తర్వాత కూడా పాండ్యా, జడేజా, అక్షర్ రూపంలో బ్యాటింగ్ బలగం ఉంది కాబట్టి సమస్య లేదు. బుమ్రా అద్భుత బౌలింగ్‌ను అఫ్గాన్ ఏమాత్రం ఎదుర్కోగలదనేది చూడాలి. స్పిన్నర్లు రాణిస్తే... గత మ్యాచ్‌లో వెస్టిండీస్ చేతిలో చిత్తుగా ఓడినా...అఫ్గానిస్తాన్ టీమ్‌లో ఆత్మస్థైర్యానికి లోటు లేదు. జట్టు ప్రధానంగా బౌలింగ్‌పైనే ఆధారపడుతోంది. టోరీ్నలో అత్యధిక వికెట్లు తీసిన ఫజల్ హక్ తన పదునైన పేస్, స్వింగ్‌తో ప్రత్యర్థులను ఇబ్బంది పెడుతున్నాడు. మధ్య ఓవర్లలో కెపె్టన్ రషీద్ ఖాన్ బౌలింగ్‌పైనే జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.గతంలో 2 సార్లే భారత్‌తో ఆడిన రషీద్ ఒక్క వికెట్ తీయకపోయినా...అతడిని తక్కువగా అంచనా వేయడానికి లేదు. చైనామన్ స్పిన్నర్ నూర్ అతడికి అండగా నిలుస్తాడు. ఐపీఎల్ అనుభవంతో చెలరేగుతున్న గుర్బాజ్, మరో ఓపెనర్ ఇబ్రహీమ్ జట్టుకు మంచి ఆరంభాలు అందించారు. ఈ ఏడాది జనవరిలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌ను 212 పరుగుల స్కోరుతో అఫ్గాన్ ‘టై’ చేసిన విషయం మరచిపోవద్దు. పిచ్, వాతావరణం న్యూయార్క్‌లో పరుగులే రావడం గగనమైన పిచ్‌తో పోలిస్తే ఇది బ్యాటింగ్‌కు బాగా అనుకూలం. టోర్నీలో ఒక సారి 200కు పైగా స్కోరూ నమోదైంది. వర్షసూచన లేదు. -
98 పరుగుల వద్ద.. రనౌట్ కావాలని కోరుకోరు కదా!
కఠిన శ్రమ, త్యాగాల ఫలితమే టీ20 ఫార్మాట్లో తన విజయానికి కారణమని వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్ అన్నాడు. పొట్టి ఫార్మాట్లో విండీస్ తరఫున దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టడం సంతోషంగా ఉందన్నాడు.టీ20 ప్రపంచకప్-2024 లీగ్ దశ ఆఖరి మ్యాచ్‌లో భాగంగా అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో పూరన్ దంచికొట్టిన విషయం తెలిసిందే. సెయింట్ లూసియా వేదికగా 53 బంతుల్లో 98 పరుగులు చేసిన పూరన్.. దురదృష్టవశాత్తూ రనౌట్‌గా వెనుదిరిగాడు.అలా సెంచరీకి రెండు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. అయితే, క్రిస్ గేల్‌ను అధిగమించి విండీస్ తరఫున టీ20లలో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు.ఈ నేపథ్యంలో నికోలస్ పూరన్ స్పందిస్తూ.. ‘‘98 పరుగుల వద్ద అవుటవ్వాలని ఎవరూ కోరుకోరు. గౌరవప్రదమైన స్కోరు నమోదు చేయాలనే తొందరలో అలా జరిగిపోయింది.ఏదేమైనా జట్టును గెలిపించడం సంతోషంగా ఉంది. ముఖ్యంగా క్రిస్ గేల్ మాదిరి ప్రేక్షకులకు వినోదం పంచడం నాకెంతో ఇష్టం. ఇక ముందు కూడా ఇలాగే ముందుకు సాగుతాను’’ అని నికోలస్ పూరన్ చెప్పుకొచ్చాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024 ఆరంభంలో పూరన్ విఫలమయ్యాడు. న్యూజిలాండ్‌పై 17, ఉగాండాపై 22, పపువా న్యూగినియాపై 27 పరుగులు మాత్రమే చేయగలిగాడు.ఆఖరి మ్యాచ్‌లో.. అసలైన మజాటీ20 ప్రపంచకప్ లీగ్ దశ ఆఖరి మ్యాచ్‌లో క్రికెట్ ప్రేక్షకులకు అసలైన మజా లభించింది. నామమాత్రమైన మ్యాచ్‌లో కరీబియన్ హిట్టర్ నికోలస్ పూరన్ (53 బంతుల్లో 98; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) అఫ్గానిస్తాన్‌పై ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం తెలిసిందే. అతని వీరవిహారంతో ఈ టి20 ప్రపంచకప్‌లోనే ఆతిథ్య వెస్టిండీస్ అత్యధిక స్కోరు నమోదు చేసింది.ఇప్పటికే ఇరుజట్లు తదుపరి ‘సూపర్–8’ దశకు అర్హత సంపాదించాయి. దీంతో గ్రూప్ ‘సి’లో ఎవరికీ ఫలితంతో పని లేని ఈ మ్యాచ్‌లో విండీస్ 104 పరుగుల భారీ తేడాతో అఫ్గానిస్తాన్‌పై జయభేరి మోగించింది. టాస్ నెగ్గిన అఫ్గాన్ ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. ఒకే ఓవర్లో 36 పరుగులు... విండీస్ ఇన్నింగ్స్ మొదలైన కాసేపటికే ఓపెనర్ బ్రాండన్ కింగ్ (7) రెండో ఓవర్లో నిష్క్రమించాడు. క్రీజులో ఉన్న మరో ఓపెనర్ జాన్సన్ చార్లెస్ (27 బంతుల్లో 43; 8 ఫోర్లు)తో జతకట్టిన పూరన్... అఫ్గాన్‌పై విధ్వంసరచన చేశాడు. దీంతో జట్టు స్కోరు కేవలం 3.1 ఓవర్లలోనే 50 దాటింది.అజ్మతుల్లా ఒమర్జాయ్ వేసిన ఈ నాలుగో ఓవర్లోనే ఏకంగా 36 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్‌ను పూర్తిగా పూరనే ఎదుర్కొని 6, నోబ్+4, వైడ్+4, 0, లెగ్‌బై 4, 4, 6, 6లతో చుక్కలు చూపించాడు. ఈ మెరుపుల తుఫాన్‌తో కరీబియన్ జట్టు పవర్ ప్లే (6 ఓవర్లు)లో 92/1 స్కోరు చేసింది. 7.4 ఓవర్లలో జట్టు స్కోరు 100 దాటాక చార్లెస్ అవుటయ్యాడు. 37 బంతుల్లో 80 పరుగుల ధనాధన్ భాగస్వామ్యానికి తెరపడింది.క్రీజులోకి షై హోప్ (17 బంతుల్లో 25; 2 సిక్స్‌లు) రావడంతో పూరన్ 31 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. కాసేపటికే హోప్ అవుట్ కావడంతో కెపె్టన్ రోవ్‌మన్ పావెల్ (15 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కూడా ధాటిగానే ఆడాడు. ఆఖర్లో కెపె్టన్ రషీద్ ఖాన్ వేసిన 18వ ఓవర్‌ను అసాంతం ఆడిన పూరన్ 0, 6, 4, 6, 2, 6లతో 24 పరుగులు సాధించాడు.ఈ వేగంలో విండీస్ 19వ ఓవర్లో 200 పరుగుల మైలురాయిని దాటింది. కానీ ఆఖరి ఓవర్లో సెంచరీకి 2 పరుగుల దూరంలో పూరన్ రనౌటయ్యాడు. గుల్బదిన్ నైబ్కు 2 వికెట్లు దక్కగా, అజ్మతులా ఒమర్జాయ్, నవీనుల్ హక్ చెరో వికెట్ తీశారు. అఫ్గాన్ టపటపా... అనంతరం అసాధ్యమైన లక్ష్యఛేదనకు దిగిన అఫ్గానిస్తాన్ 16.2 ఓవర్లలోనే 114 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ ఇబ్రహీమ్ జద్రాన్ (28 బంతుల్లో 38; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా, నాలుగో వరుస బ్యాటర్ అజ్మతుల్లా (19 బంతుల్లో 23; 1 ఫోర్, 1 సిక్స్) కాస్త మెరుగ్గా ఆడారంతే!ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోరే చేయలేదు. విండీస్ బౌలర్లలో పేసర్ ఒబెద్ మెకాయ్ 3 వికెట్లు పడగొట్టగా... స్పిన్నర్లు గుడకేశ్ మోతీ, అకిల్ హోసీన్ చెరో 2 వికెట్లు తీశారు. ఈ గెలుపుతో విండీస్ గ్రూప్ ‘సి’లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ నెగ్గి అజేయంగా ‘సూపర్–8’ పోరుకు సమాయత్తమైంది. చదవండి: పిచ్ ఎలా ఉంది బుమ్రా?.. అయినా మాకిదే అలవాటే: రోహిత్ శర్మ -
T20 World Cup 2024: ఆ మూడు టీమ్‌లు ఒకవైపు.. పూరన్ ఒక్కడు ఒకవైపు..!
టీ20 వరల్డ్‌కప్ 2024లో ఓ ఆసక్తికర విషయం వెలుగు చూసింది. గ్రూప్-సిలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్పై అదే గ్రూప్‌కు చెందిన ఉగాండ, న్యూజిలాండ్, పపువా న్యూ గినియా చేసిన స్కోర్ల కంటే.. విండీస్ ఆటగాడు నికోలస్ పూరన్ ఒక్కడు (ఆఫ్ఘనిస్తాన్పై) చేసిన స్కోరే అధికంగా ఉంది.ఆఫ్ఘనిస్తాన్పై ఉగాండ 58 పరుగులకు, న్యూజిలాండ్ 75, పపువా న్యూ గినియా 95 పరుగులకు ఆలౌట్ కాగా.. అదే ఆఫ్ఘనిస్తాన్పై పూరన్ ఒక్కడు 98 పరుగులు చేశాడు. జట్టు మొత్తం చేయలేని పరుగులు పూరన్ ఒక్కడు చేయడంతో అతనిపై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘన్ బౌలర్లపై (ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో) ఏ ఒక్క జట్టు కనీసం 100 పరుగుల మార్కును కూడా తాక లేకపోగా.. విండీస్ మాత్రం ఏకంగా 218 పరుగులు చేసింది.విండీస్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. పూరన్ (98), జాన్సన్ ఛార్లెస్ (43), హోప్ (25), పావెల్ (26) రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది.అనంతరం 219 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్.. విండీస్ బౌలర్ల ధాటికి 114 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా విండీస్ 104 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. గ్రూప్-సి నుంచి విండీస్, ఆఫ్ఘనిస్తాన్ ఇదివరకే సూపర్-8కు క్వాలిఫై కావడంతో ఈ మ్యాచ్‌కు ప్రాధాన్యత లేకుండా పోయింది.గ్రూప్-ఏ నుంచి భారత్ (A1), యూఎస్ఏ (A2) సూపర్-8కు అర్హత సాధించగా,, గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా (B1), ఇంగ్లండ్ (B2), గ్రూప్-సి నుంచి ఆఫ్ఘనిస్తాన్ (C1), వెస్టిండీస్ (C2), గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా (D1), బంగ్లాదేశ్ (D2) సూపర్-8లోకి ప్రవేశించాయి.సూపర్-8 గ్రూప్-1లో గ్రూప్-ఏ నుంచి భారత్ (A1).. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా (B1).. గ్రూప్-సి నుంచి ఆఫ్ఘనిస్తాన్ (C1).. గ్రూప్-డి నుంచి బంగ్లాదేశ్ (D2) జట్లు ఉన్నాయి.సూపర్-8 గ్రూప్ 2లో గ్రూప్-ఏ నుంచి యూఎస్ఏ (A2).. గ్రూప్-బి నుంచి ఇంగ్లండ్ (B2).. గ్రూప్-సి నుంచి వెస్టిండీస్ (C2).. గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా (D1) జట్లు ఉన్నాయి.సూపర్-8లో గ్రూప్-1 మ్యాచ్‌లు..జూన్ 20- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇండియా (బార్బడోస్)జూన్ 20- ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ (ఆంటిగ్వా)జూన్ 22- ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ (ఆంటిగ్వా)జూన్ 22- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా (సెయింట్ విన్సెంట్)జూన్ 24- ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా (సెయింట్ లూసియా)జూన్ 24- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ (సెయింట్ విన్సెంట్)సూపర్-8లో గ్రూప్-2 మ్యాచ్‌లు..జూన్ 19- యూఎస్ఏ వర్సెస్ సౌతాఫ్రికా (ఆంటిగ్వా)జూన్ 19- ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్ (సెయింట్ లూసియా)జూన్ 21- ఇంగ్లండ్ వర్సెస్ సౌతాఫ్రికా (సెయింట్ లూసియా)జూన్ 21- యూఎస్ఏ వర్సెస్ వెస్టిండీస్ (బార్బడోస్)జూన్ 23- యూఎస్ఏ వర్సెస్ ఇంగ్లండ్ (బార్బడోస్)జూన్ 23- వెస్టిండీస్ వర్సెస్ సౌతాఫ్రికా (ఆంటిగ్వా) -
చరిత్ర సృష్టించిన వెస్టిండీస్.. ఆసీస్, భారత్‌కు కూడా సాధ్యం కాలేదు
టీ20 వరల్డ్‌కప్-2024లో వెస్టిండీస్ జట్టు తమ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. మంగళవారం తమ చివరి లీగ్ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌ను 104 పరుగులతో విండీస్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కరేబియన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగుల భారీ స్కోర్ సాధించింది. విండీస్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఆరంభంలోనే ఓపెనర్ కింగ్ వికెట్ కోల్పోయినప్పటకి.. పూరన్, చార్లెస్ మాత్రం విండీస్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో పవర్‌ప్లే ముగిసే సరికి విండీస్ స్కోర్ బోర్డు 92 పరుగులకు చేరింది.చరిత్ర సృష్టించిన విండీస్..తద్వారా వెస్టిండీస్ ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది. టీ20 వరల్ఢ్‌కప్ మ్యాచ్‌లో పవర్ ప్లేలో అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా విండీస్ రికార్డులకెక్కింది. ఇంతకుముందు ఈ రికార్డు నెదర్లాండ్స్ పేరిట ఉండేది. టీ20 వరల్డ్‌కప్-2024లో ఐర్లాండ్‌పై పవర్‌ప్లేలో నెదర్లాండ్స్ 91 పరుగులు చేసింది. తాజా మ్యాచ్‌లో అఫ్గాన్‌పై పవర్‌ప్లేలో 92 పరుగులు చేసిన విండీస్.. డచ్ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేసింది. కాగా ఈ మెగా టోర్నీ తొలి రౌండ్లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన కరేబియన్ జట్టు గ్రూపు-సి నుంచి అగ్రస్ధానంలో నిలిచింది. -
టీ20 వరల్డ్‌కప్‌లో చెత్త రికార్డు.. ఒకే ఓవర్లో 36 పరుగులు! వీడియో
అఫ్గానిస్తాన్ స్టార్ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న రెండో బౌలర్‌గా ఒమర్జాయ్ రికార్డులకెక్కాడు.టీ20 వరల్డ్‌కప్-2024లో సెయింట్ లూసియా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్లో 36 పరుగులిచ్చిన ఒమర్జాయ్.. ఈ చెత్త రికార్డును తన ఖాతాలో వేసున్నాడు. ఈ మ్యాచ్‌లో విండీస్ ఇన్నింగ్స్ 4వ ఓవర్ వేసిన ఒమర్జాయ్కు నికోలస్ పూరన్ చుక్కలు చూపించాడు. ఆ ఓవర్లో పూరన్ 3 సిక్స్‌లు, రెండు ఫోర్లతో 26 పరుగులు రాబట్టగా.. ఒమర్జాయ్ ఎక్స్‌ట్రాస్( వైడ్+4, నో బాల్, 4 లెగ్ బైస్)రూపంలో 10 పరుగులు సమర్పించుకున్నాడు. మొత్తంగా ఆ ఓవర్లో 36 పరుగులు వచ్చాయి.ఇక ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో ఇంగ్లండ్ లెజెండరీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ అగ్రస్ధానంలో ఉన్నాడు. 2007 టీ20 వరల్డ్‌కప్‌లో బ్రాడ్ బౌలింగ్‌లో భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ వరుసగా 6 సిక్స్‌లు బాది 36 పరుగులు రాబాట్టాడు.మళ్లీ 17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్‌కప్‌లో ఒకే ఓవర్లో 36 పరుగులు వచ్చాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. అఫ్గాన్‌పై 104 పరుగుల తేడాతో విండీస్ ఘన విజయం సాధించింది. అయితే ఇరు జట్లు ఇప్పటికే సూపర్-8కు అర్హత సాధించాయి. View this post on Instagram A post shared by ICC (@icc) -
అఫ్గాన్‌ను చిత్తు చేసిన విండీస్.. 104 పరుగుల తేడాతో ఘన విజయం
టీ20 వరల్డ్‌కప్-2024లో వెస్టిండీస్ తమ చివరి లీగ్ మ్యాచ్‌ను విజయంతో ముగించింది. సెయింట్ లూసియా వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 104 పరుగుల తేడాతో విండీస్ ఘన విజయం సాధించింది.219 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్.. కరేబియన్ బౌలర్ల దాటికి 114 పరుగులకే కుప్పకూలింది. విండీస్ బౌలర్లలో ఒబెడ్ మెకాయ్ 3 వికెట్లతో అదరగొట్టగా.. అకిల్ హుస్సేన్, మోటీ తలా రెండు వికెట్లు పడగొట్టారు. వీరితో పాటు రస్సెల్, జోషఫ్ కూడా చెరో వికెట్ సాధించారు. అఫ్గానిస్తాన్ బ్యాటర్లలో ఇబ్రహీం జద్రాన్(38) మినహా మిగితందరూ దారుణంగా విఫలమయ్యారు.పూరన్ ఊచకోత..అంతకుముందు బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగుల భారీ స్కోర్ సాధించింది. విండీస్ బ్యాటర్లలో నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టించాడు.ఈ మ్యాచ్‌లో కేవలం 53 బంతులు ఎదుర్కొన్న పూరన్ 6 ఫోర్లు, 8 సిక్స్‌లతో 98 పరుగులు చేసి రనౌటయ్యాడు.ఇక అతడితో పాటు చార్లెస్(43), హోప్(25), పావెల్(26) పరుగులతో రాణించారు. ఈ ఏడాది వరల్డ్‌కప్‌లో ఇదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. ఇక అఫ్గాన్ బౌలర్లలో గుల్బాదిన్ నైబ్ రెండు వికెట్లు పడగొట్టగా.. అజ్మతుల్లా, నవీన్ ఉల్ హాక్ తలా వికెట్ సాధించారు. కాగా గ్రూపు సి నుంచి అఫ్గానిస్తాన్, విండీస్ ఇప్పటికే సూపర్-8కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. -
పూరన్ విధ్వంసం.. టీ20 వరల్డ్‌కప్-2024లో భారీ స్కోర్
టీ20 వరల్డ్‌కప్-2024లో వెస్టిండీస్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో జూలు విదిల్చింది. సెయింట్ లూసియా వేదికగా గ్రూపు-సిలో భాగంగా అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో విండీస్ బ్యాటర్లు అదరగొట్టారు.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగుల భారీ స్కోర్ సాధించింది. విండీస్ బ్యాటర్లలో నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టించాడు. తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని పూరన్ కోల్పోయాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 53 బంతులు ఎదుర్కొన్న పూరన్ 6 ఫోర్లు, 8 సిక్స్‌లతో 98 పరుగులు చేసి రనౌటయ్యాడు.ఇక అతడితో పాటు చార్లెస్(43), హోప్(25), పావెల్(26) పరుగులతో రాణించారు. ఈ ఏడాది వరల్డ్‌కప్‌లో ఇదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. ఇక అఫ్గాన్ బౌలర్లలో గుల్బాదిన్ నైబ్ రెండు వికెట్లు పడగొట్టగా.. అజ్మతుల్లా, నవీన్ ఉల్ హాక్ తలా వికెట్ సాధించారు. -
టీ20 వరల్డ్‌కప్‌లో నేడు (జూన్ 17) మరో ఆసక్తికర సమరం
పొట్టి ప్రపంచకప్ 2024లో ఇవాళ (జూన్ 17) మరో ఆసక్తికర మ్యాచ్ జరుగనుంది. సూపర్-8 బెర్త్‌లు ఖరారు కావడంతో నామమాత్రంగా సాగనున్న ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్-ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఢీకొట్టనున్నాయి. గ్రూప్-సిలో భాగంగా జరుగనున్న ఈ మ్యాచ్ సెయింట్ లూసియా వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రేపు ఉదయం 6 గంటలకు మొదలుకానుంది. గ్రూప్-సి నుంచి ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్ జట్లు ఇదివరకే సూపర్-8కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.గ్రూప్-సిలో భాగంగా ఇవాళే మరో మ్యాచ్ కూడా జరుగనుంది. ట్రినిడాడ్ వేదికగా పపువా న్యూ గినియా.. న్యూజిలాండ్‌ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. న్యూజిలాండ్, పపువా న్యూ గినియా సూపర్-8కు అర్హత సాధించకపోవడంతో ఈ మ్యాచ్ కూడా నామమాత్రంగా సాగనుంది.కాగా, ఇవాల్టి మ్యాచ్‌లతో సంబంధం లేకుండానే సూపర్-8 బెర్త్‌లు ఖరారయ్యాయి. సూపర్-8 గ్రూప్-1లో గ్రూప్-ఏ నుంచి భారత్ (A1).. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా (B1).. గ్రూప్-సి నుంచి ఆఫ్ఘనిస్తాన్ (C1).. గ్రూప్-డి నుంచి బంగ్లాదేశ్ (D2) జట్లు ఉన్నాయి.సూపర్-8లో గ్రూప్-1 మ్యాచ్‌లు..జూన్ 20- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇండియా (బార్బడోస్)జూన్ 20- ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ (ఆంటిగ్వా)జూన్ 22- ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ (ఆంటిగ్వా)జూన్ 22- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా (సెయింట్ విన్సెంట్)జూన్ 24- ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా (సెయింట్ లూసియా)జూన్ 24- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ (సెయింట్ విన్సెంట్)సూపర్-8 గ్రూప్ 2లో గ్రూప్-ఏ నుంచి యూఎస్ఏ (A2).. గ్రూప్-బి నుంచి ఇంగ్లండ్ (B2).. గ్రూప్-సి నుంచి వెస్టిండీస్ (C2).. గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా (D1) జట్లు ఉన్నాయి. సూపర్-8లో గ్రూప్-2 మ్యాచ్‌లు..జూన్ 19- యూఎస్ఏ వర్సెస్ సౌతాఫ్రికా (ఆంటిగ్వా)జూన్ 19- ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్ (సెయింట్ లూసియా)జూన్ 21- ఇంగ్లండ్ వర్సెస్ సౌతాఫ్రికా (సెయింట్ లూసియా)జూన్ 21- యూఎస్ఏ వర్సెస్ వెస్టిండీస్ (బార్బడోస్)జూన్ 23- యూఎస్ఏ వర్సెస్ ఇంగ్లండ్ (బార్బడోస్)జూన్ 23- వెస్టిండీస్ వర్సెస్ సౌతాఫ్రికా (ఆంటిగ్వా)గ్రూప్-1, గ్రూప్-2ల్లో అన్ని మ్యాచ్‌లు ముగిశాక మొదటి రెండు స్థానాల్లో ఉండే జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. -
T20 WC 2024: అఫ్గనిస్తాన్‌కు భారీ షాక్!
టీ20 ప్రపంచకప్-2024లో అంచనాలకు మించి అదరగొడుతున్న అఫ్గనిస్తాన్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టులోని కీలక స్పిన్నర్ ముజీబ్ ఉర్ రహ్మాన్ గాయం కారణంగా దూరమయ్యాడు.టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు అతడు అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి ధ్రువీకరించింది. ముజీబ్ స్థానంలో హజ్రతుల్లా జజాయ్ అఫ్గన్ ప్రధాన జట్టులోకి చేరినట్లు తెలిపింది.కాగా అఫ్గనిస్తాన్ జట్టులోని కీలక సభ్యుల్లో ఒకడైన ముజీబ్ ఉర్ రహ్మాన్.. పరిమిత ఓవర్ల క్రికెట్లో ముఖ్యంగా.. టీ20లలో మెరుగైన రికార్డు కలిగి ఉన్నాడు.అఫ్గన్ తరఫున ఇప్పటి వరకు ఈ రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్ 46 టీ20లు ఆడి.. 59 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచకప్-2024లో తమ ఆరంభ మ్యాచ్‌లో ఉగాండాపై మూడు ఓవర్ల బౌలింగ్‌లో 16 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు.అయితే, ఆ తర్వాత ముజీబ్ మళ్లీ తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ రైటార్మ్ బౌలర్ మధ్య వేలికి గాయమైన కారణంగా.. అతడి స్థానంలో నూర్ అహ్మద్ బరిలోకి దిగాడు.ముజీబ్ లేని లోటును నూర్ తీరుస్తాడా?స్పిన్ దళంలో కెప్టెన్ రషీద్ ఖాన్‌తో భాగమైన నూర్.. న్యూజిలాండ్, పపువా న్యూగినియాతో మ్యాచ్‌లలో భాగమయ్యాడు. ముజీబ్ లేని లోటును ఈ లెఫ్టార్మ్ రిస్ట్ స్పిన్నర్ తీర్చగలడని అఫ్గన్ మేనేజ్మెంట్ నమ్మకంగా ఉంది.కాగా గ్రూప్-సిలో ఉన్న అఫ్గనిస్తాన్ ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలతో సూపర్-8కు చేరుకుంది. అయితే, స్పిన్‌కు అనుకూలించే వెస్టిండీస్ పిచ్‌లపై ముజీబ్ ఉర్ రహ్మాన్ రూపంలో కీలక బౌలర్ సేవలు కోల్పోవడం పెద్ద ఎదురుదెబ్బ లాంటిదే! అయితే, రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, నూర్ అహ్మద్ తదితరులు జట్టులో ఉండటం సానుకూలాంశం. పేసర్ ఫజల్హక్ ఫరూకీ కూడా రాణిస్తుండటం ఊరట కలిగించే అంశం. మరో రోవైపు.. ముజీబ్ స్థానంలో జట్టులోకి హజ్రతుల్లా హిట్టర్‌గా పేరొందిన ఓపెనింగ్ బ్యాటర్.చదవండి: T20 WC: పాకిస్తాన్‌కు చావు దెబ్బ.. ప్రపంచకప్ టోర్నీ నుంచి అవుట్ -
T20 World Cup 2024: ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తున్న ఆఫ్ఘన్ బౌలర్లు
ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌లో ఆప్ఘనిస్తాన్ జట్టు అన్ని విభాగాల్లో చెలరేగిపోతుంది. మెగా టోర్నీలో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో మూడింట విజయాలు సాధించి సూపర్-8కు అర్హత సాధించింది. ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో ఆఫ్ఘన్లకు తిరుగులేకుండా పోయింది. ఆ జట్టు బౌలర్లు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ప్రత్యర్థులను 100 పరుగులలోపే ఆలౌట్ చేశారు. దీన్ని బట్టి చూస్తే బౌలింగ్ డిపార్ట్మెంట్లో వారి ఆధిపత్యం ఎలా ఉందో ఇట్టే అర్దమవుతుంది. తొలి మ్యాచ్‌లో ఉగాండను 58 పరుగులకే ఆలౌట్ చేసిన ఆఫ్ఘన్ బౌలర్లు.. ఆతర్వాతి మ్యాచ్‌లో పటిష్టమైన న్యూజిలాండ్‌ను 75 పరుగులకు.. తాజాగా పపువా న్యూ గినియాను 95 పరుగులకు కుప్పకూల్చారు. ఆఫ్ఘన్ బౌలర్లు ఈ తరహాలో చెలరేగడం వెనుక ఆ జట్టు బౌలింగ్ కోచ్ డ్వేన్ బ్రావో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఈ వరల్డ్‌కప్‌తో ఆఫ్ఘన్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన బ్రావో ఆ జట్టు సాధిస్తున్న ప్రతి విజయంలో తనదైన మార్కును చూపాడు. బ్రావో ఆధ్వర్యంలో మీడియం ఫాస్ట్ బౌలర్ ఫజల్ హక్ ఫారూఖీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఫారూఖీ ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఏకంగా 12 వికెట్లు పడగొట్టి టోర్నీ లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు.ఉగాండతో జరిగిన తొలి మ్యాచ్‌లో 5 వికెట్లు తీసిన ఫారూఖీ.. ఆ తర్వాత న్యూజిలాండ్‌పై 4 వికెట్లు..తాజాగా పపువా న్యూ గినియాపై 3 వికెట్లు పడగొట్టాడు. ఈ మూడు మ్యాచ్‌ల్లో ఫారూఖీ రెండు సార్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. ఈ వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘన్ల వరుస విజయాల్లో ఫారూఖీ ప్రధానపాత్ర పోషించాడు. ఫారూఖీతో పాటు ఆఫ్ఘన్ బౌలర్లలో రషీద్ ఖాన్ (3 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు)య సైతం ఓ మోస్తరుగా రాణిస్తున్నాడు.ఈ టోర్నీలో ఆఫ్ఘన్లు బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ చెలరేగిపోతున్నారు. ఆ జట్టు బ్యాటర్లు రహ్మానుల్లా గుర్భాజ్ (167 పరుగులు), ఇబ్రహీం జద్రాన్ (114 పరుగులు) టోర్నీ లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో ఒకటి, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు.గ్రూప్ దశలో మరో మ్యాచ్ మిగిలుండగానే సూపర్-8కు అర్హత సాధించిన ఆఫ్ఘనిస్తాన్.. సూపర్-8లో భారత్ (జూన్ 20), ఆస్ట్రేలియా (జూన్ 22), బంగ్లాదేశ్/నెదర్లాండ్స్ (జూన్ 24) జట్లను ఢీకొంటుంది. -
T20 WC: అదరగొట్టిన ఆఫ్గనిస్తాన్.. న్యూజిలాండ్ ఎలిమినేట్
వన్డే ప్రపంచకప్-2023లో అంచనాలకు మించి రాణించిన అఫ్గనిస్తాన్ టీ20 వరల్డ్‌కప్-2024లోనూ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. పపువా న్యుగినియాతో మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది సూపర్-8కు అర్హత సాధించింది. ఇక ఈ మ్యాచ్ ఫలితంతో న్యూజిలాండ్ ఈ టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్ తొమ్మిదో ఎడిషన్‌లో అఫ్గన్ జట్టు వెస్టిండీస్, ఉగాండా, పపువా న్యూగినియా, న్యూజిలాండ్‌తో కలిసి గ్రూప్-సిలో ఉంది. View this post on Instagram A post shared by ICC (@icc) ఇక ఆరంభం నుంచే పక్కా ప్రణాళికతో ముందుకు సాగిన రషీద్ ఖాన్ బృందం.. గ్రూప్ దశలో మూడింట మూడు మ్యాచ్‌లు గెలిచింది. తాజాగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో మూడో గెలుపు నమోదు చేసి ఆరు పాయింట్ల(నెట్ రన్‌రేటు +4.230)తో గ్రూప్-సి టాపర్‌గా నిలిచింది. ట్రినిడాడ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గనిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఫజల్హక్ ఫరూకీ(3/16), నవీన్ ఉల్ హక్(2/4), నూర్ అహ్మద్(1/14) అత్యంత పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు కూడా తీసి సత్తా చాటారు. తేలికగా తలవంచని ప్రత్యర్థిఈ క్రమంలో 19.5 ఓవర్లలో 95 పరుగులు చేసిన పీఎన్జీ జట్టు ఆలౌట్ అయింది. అయితే, లక్ష్య ఛేదనకు దిగిన అఫ్గనిస్తాన్ ముందు అంత తేలికగా తలవంచలేదు. ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ డకౌట్ కాగా.. మరో ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ 11 పరుగులకే వెనుదిరిగాడు. ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ గులాబిదిన్ నయీబ్(36 బంతుల్లో 49 నాటౌట్) అద్భుతంగా రాణించి జట్టును విజయతీరాలకు చేర్చాడు. మిగతా వాళ్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ 13, మహ్మద్ నబీ(23 బంతుల్లో 16 నాటౌట్) ఆచితూచి ఆడారు. View this post on Instagram A post shared by ICC (@icc)ఫలితంగా 15.1 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 101 పరుగులు చేసిన అఫ్గన్ జయభేరి మోగించింది. తద్వారా సూపర్-8 దశకు అర్హత కూడా సాధించింది. ఇక ఇప్పటికే వెస్టిండీస్ గ్రూప్-సి నుంచి సూపర్-8లో అడుగుపెట్టగా.. న్యూజిలాండ్ ఎలిమినేట్ అయింది.చదవండి: T20 World Cup 2024: వరల్డ్‌కప్ టోర్నీ నుంచి అవుట్.. శ్రీలంకకు ఏమైంది? -
T20 World Cup 2024: కివీస్ ఖేల్ ఖతం..?
టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఇవాళ (జూన్ 13) మూడు మ్యాచ్‌లు జరుగనున్నాయి. కింగ్స్టౌన్ వేదికగా జరిగే తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్-నెదర్లాండ్స్ తలపడనుండగా.. ట్రినిడాడ్ వేదికగా జరిగే రెండో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్-పపువా న్యూ గినియా.. ఆంటిగ్వా వేదికగా జరిగే మూడో మ్యాచ్‌లో ఇంగ్లండ్-ఒమన్ జట్లు పోటీపడనున్నాయి. గ్రూప్-డిలో భాగంగా బంగ్లాదేశ్-నెదర్లాండ్స్ మధ్య జరిగే మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుండగా.. గ్రూప్-సిలో జరిగే ఆఫ్ఘనిస్తాన్-పపువా న్యూ గినియా మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రేపు ఉదయం 6 గంటలకు.. గ్రూప్-బిలో భాగంగా జరిగే ఇంగ్లండ్-ఒమన్ మ్యాచ్ ఇవాళ మధ్య రాత్రి 12:30 గంటలకు ప్రారంభమవుతాయి. నెదర్లాండ్స్‌ను బంగ్లాదేశ్ ఓడిస్తే..గ్రూప్-డిలో భాగంగా ఇవాళ జరుగబోయే మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై విజయం సాధిస్తే బంగ్లాదేశ్ సూపర్-8 అవకాశాలు భారీగా మెరుగుపడతాయి. ప్రస్తుతం ఇరు జట్ల ఖాతాలో చెరి 2 పాయింట్లు ఉన్నాయి. ఈ మ్యాచ్ తదుపరి నెదర్లాండ్స్ శ్రీలంకతో.. బంగ్లాదేశ్ నేపాల్‌తో తలపడాల్సి ఉంది.కివీస్ ఇంటికే..పపువా న్యూ గినియాతో ఇవాళ జరుగబోయే మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే.. గ్రూప్-సిలో చివరి స్థానంలో ఉన్న న్యూజిలాండ్ అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. పీఎన్జీపై విజయం సాధిస్తే.. ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ (4 పాయింట్లు) వెస్టిండీస్‌ను (6 పాయింట్లు) కిందికి దించి టాప్ ప్లేస్‌కు చేరుకుంటుంది. కివీస్ తదుపరి ఆడాల్సిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా 4 పాయింట్లు మాత్రమే వస్తాయి.Feel for Kane Williamson. 💔 pic.twitter.com/9GoiXnNlZF— Tanuj Singh (@ImTanujSingh) June 13, 2024ఇంగ్లండ్‌కు చాలా కీలకంఒమన్తో ఇవాళ జరుగబోయే మ్యాచ్ ఇంగ్లండ్‌కు చాలా కీలకంగా కానుంది. ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తేనే ఆ జట్టు సూపర్-8 రేసులో ఉంటుంది. ప్రస్తుతం ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒక దాంట్లో ఓడి, మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఇంగ్లండ్ ఖాతాలో కేవలం ఒకే ఒక పాయింట్ ఉంది. గ్రూప్-బి నుంచి రెండో స్థానంలో ఉన్న స్కాట్లాండ్ 5 పాయింట్లతో సూపర్-8 రేసులో ముందుంది. ఈ గ్రూప్ నుంచి ఆడిన 3 మ్యాచ్‌ల్లో గెలిచిన ఆస్ట్రేలియా ఇదివరకే సూపర్-8కు క్వాలిఫై అయ్యింది. -
T20 World Cup 2024: రషీద్ ఖాన్ ఈజ్ ద బెస్ట్
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా న్యూజిలాండ్‌తో నిన్న (జూన్ 7) జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘన్ ఆటగాళ్లు అన్ని విభాగాల్లో సత్తా చాటి తమకంటే చాలా రెట్లు మెరుగైన న్యూజిలాండ్‌ను ఖంగుతినిపించారు. తొలుత బ్యాటింగ్‌లో చెలరేగిన ఆఫ్ఘన్ ప్లేయర్లు.. ఆతర్వాత బౌలింగ్‌లోనూ విజృంభించి కివీస్‌కు ఊహించని షాకిచ్చారు. ఆఫ్ఘన్ బౌలర్ల ధాటికి పటిష్టమైన న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్ కకావికలమైంది. కివీస్ ఇన్నింగ్స్‌లో కేవలం ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్దమవుతుంది. న్యూజిలాండ్‌ను ఈ స్థితికి దిగజార్చడానికి ముఖ్య కారకుడు ఆఫ్ఘన్ కెప్టెన్ రషీద్ ఖాన్. ఈ మ్యాచ్‌లో రషీద్ 4 ఓవర్లలో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. రషీద్‌తో పాటు ఫజల్ హక్ ఫారూఖీ (3.2-0-17-4), మొహమ్మద్ నబీ (4-0-16-2) కూడా చెలరేగడంతో న్యూజిలాండ్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. రషీద్, ఫజల్ హక్, నబీల దెబ్బకు 15.2 ఓవర్లలో 75 పరుగులకే చాపచుట్టేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో గ్లెన్ ఫిలిప్స్ (18), మ్యాట్ హెన్రీ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. వీరిద్దరు కూడా సింగిల్ డిజిట్ స్కోర్‌కే టపా కట్టేసి ఉంటే న్యూజిలాండ్ 50 పరుగుల మార్కు కూడా దాటేది కాదు. దీనికి ముందు రహ్మానుల్లా గుర్బాజ్ (80), ఇబ్రహీం జద్రాన్ (44) చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో గుర్బాజ్, జద్రాన్‌తో పాటు అజ్మతుల్లా (22) రాణించాడు. కివీస్ బౌలర్లలో బౌల్ట్, మ్యాట్ హెన్రీ తలో 2 వికెట్లు తీయగా.. ఫెర్గూసన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఆఫ్ఘన్ ఆటగాళ్లు అన్ని విభాగాల్లో కలిసికట్టుగా రాణించి కివీస్‌ను 84 పరుగుల తేడాతో చిత్తు చేశారు. టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడటం ఇదే తొలిసారి.రషీద్ ఈజ్ ద బెస్ట్..ఈ మ్యాచ్‌లో అద్భుత గణాంకాలు నమోదు చేసి కివీస్ పతనాన్ని శాశించిన ఆఫ్ఘన్ కెప్టెన్ రషీద్ ప్రపంచకప్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. పొట్టి ప్రపంచకప్ టోర్నీల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు (4-0-17-4) నమోదు చేసిన కెప్టెన్‌గా అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. రషీద్‌కు ముందు ఈ ఘనత న్యూజిలాండ్ స్పిన్నర్ డేనియల్ వెటోరీ పేరిట ఉండేది. వెటోరీ 2007 వరల్డ్‌కప్‌లో ఇండియాపై 4 ఓవరల్లో 20 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఈ జాబితాలో రషీద్, వెటోరీ తర్వాత ఒమన్ బౌలర్ జీషన్ మక్సూద్ (2021లో పపువా న్యూ గినియాపై 4-0-20-4), ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ (2012లో శ్రీలంకపై 4-0-24-3) ఉన్నారు. -
టీ20 వరల్డ్‌కప్‌లో భిన్న పరిస్థితి
ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌లో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో గతానికి భిన్నంగా చిన్న జట్ల హవా కొనసాగుతుంది. ఫలితంగా 15 మ్యాచ్‌లు పూర్తైనా అగ్ర జట్లు తమ తమ గ్రూప్‌ల్లో టాప్ ప్లేస్‌కు చేరుకోలేకపోయారు. చిన్న జట్లు అనూహ్య రీతిలో రాణించి పెద్ద జట్లను ఓడించడంతో వాటిదే పైచేయిగా ఉంది. గ్రూప్-ఏ నుంచి తొలి ప్రపంచకప్ ఆడుతున్న యూఎస్ఏ.. పాకిస్తాన్ సహా కెనడాపై సంచలన విజయాలు సాధించి గ్రూప్ టాపర్‌గా ఉండగా.. భారత్ రెండో స్థానంలో, కెనడా మూడో ప్లేస్‌లో ఉన్నాయి. ఆడిన ఓ మ్యాచ్‌లో ఓడిన పాక్ నాలుగో స్థానంలో ఉండగా.. రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ఐర్లాండ్ ఆఖరి స్థానంలో కొనసాగుతుంది. యూఎస్ఏ చేతిలో ఓటమి నేపథ్యంలో పాక్ సూపర్-8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.గ్రూప్-బి విషయానికొస్తే.. ఈ గ్రూప్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లాంటి హేమాహేమీ జట్లు ఉండగా.. ఎవరు ఊహించని విధంగా ఈ గ్రూప్‌లో స్కాట్లాండ్ టాప్ ప్లేస్‌లో ఉంది. స్కాట్లాండ్ ఓ మ్యాచ్‌లో గెలిచి (నమీబియా), మరో మ్యాచ్ రద్దు కావడంతో (ఇంగ్లండ్) 3 పాయింట్లతో గ్రూప్ టాపర్‌గా ఉంది. ఆసీస్, నమీబియా, ఇంగ్లండ్, ఒమన్ రెండు నుంచి ఐదు స్థానాల్లో ఉన్నాయి.గ్రూప్-సిలో సంచలనాల ఆఫ్ఘనిస్తాన్ టాప్ ప్లేస్‌లో ఉండగా.. తాజాగా ఆ జట్టు చేతిలో చావుదెబ్బ తిన్న న్యూజిలాండ్ ఆఖరి స్థానంలో నిలిచింది. వెస్టిండీస్, ఉగాండ, పపువా న్యూ గినియా 2, 3, 4 స్థానాల్లో ఉన్నాయి.గ్రూప్-డి విషయానికొస్తే.. ఈ గ్రూప్ నుంచి సూపర్-8 బెర్త్ రేసులో ముందుండాల్సిన శ్రీలంక ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడి చిట్ట చివరి స్థానంలో ఉండగా.. ఆడిన ఒక్క మ్యాచ్‌లో గెలిచిన సౌతాఫ్రికా, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఆడిన ఏకైక మ్యాచ్‌లో ఓడిన నేపాల్ నాలుగో స్థానంలో ఉంది.ప్రపంచకప్‌లో ఇవాళ (జూన్ 8) మరో మూడు మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. గ్రూప్-డి నుంచి నెదర్లాండ్స్, సౌతాఫ్రికా.. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్.. గ్రూప్-సి నుంచి వెస్టిండీస్, ఉగాండ పోటీపడనున్నాయి. ఈ మూడు మ్యాచ్‌ల్లో ఊహించిన ఫలితాలు వచ్చినా ఆఫ్ఘనిస్తాన్, యూఎస్ఏ, స్కాట్లాండ్ జట్లు ఆయా గ్రూప్‌ల్లో టాప్‌లోనే కొనసాగుతాయి. -
సంచలనాల వరల్డ్ కప్.. పెద్ద జట్లకు ముచ్చెమటలు పట్టిస్తున్న పసికూనలు
ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. దాదాపుగా ప్రతి మ్యాచ్‌లో బడా జట్లకు పసికూనలు షాకిస్తున్నాయి. ఇప్పటివరకు జరిగిన 15 మ్యాచ్‌ల్లో పెద్ద జట్లపై చిన్న జట్లు హవా చూపాయి.ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లపై ఓ లుక్కేద్దాం..టోర్నీ ఆరంభ మ్యాచ్‌లోనే ఓ మోస్తరు సంచలనం నమోదైంది. తమకంటే పటిష్టమైన కెనడాకు తొలిసారి ప్రపంచకప్ ఆడుతున్న యూఎస్ఏ ఊహించని షాకిచ్చింది. రెండో మ్యాచ్‌లో మరో పసికూన పపువా న్యూ గినియా.. రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన వెస్టిండీస్‌ను దాదాపుగా ఓడించినంత పని చేసింది. ఈ మ్యాచ్‌లో విండీస్ బతుకు జీవుడా అన్నట్లు చివరి ఓవర్లో విజయం సాధించింది.పసికూనల మధ్య జరిగిన మూడో మ్యాచ్ సైతం నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగింది. ఈ లో స్కోరింగ్ మ్యాచ్‌లో ఒమన్‌పై నమీబియా సూపర్ ఓవర్లో విజయం సాధించింది.శ్రీలంక-సౌతాఫ్రికా మధ్య జరిగిన నాలుగో మ్యాచ్.. ఆఫ్ఘనిస్తాన్-ఉగాండ మధ్య జరిగిన ఐదో మ్యాచ్ అందరూ ఊహించినట్లుగానే జరిగాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో ఎలాంటి సంచలనాలు నమోదు కాలేదు. స్కాట్లాండ్-ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన ఆతర్వాతి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఈ మ్యాచ్ రద్దు కాకుండా ఉండి ఉంటే ఇందులోనూ సంచలనానికి ఆస్కారం ఉండేది.నేపాల్-నెదర్లాండ్స్ మధ్య జరిగిన ఏడో మ్యాచ్.. భారత్-ఐర్లాండ్ మధ్య జరిగిన ఎనిమిదో మ్యాచ్.. ఆస్ట్రేలియా-ఒమన్ మధ్య జరిగిన తొమ్మిదో మ్యాచ్ అందరూ ఊహించినట్లుగానే ఏకపక్షంగా సాగాయి.అనంతరం పపువా న్యూ గినియా-ఉగాండ మధ్య జరిగిన పదో మ్యాచ్‌లో ఓ మోస్తరు సంచలనం నమోదైంది. తొలిసారి ప్రపంచకప్ ఆడుతున్న ఉగాండ.. పొట్టి ప్రపంచకప్‌లో తమ తొలి విజయాన్ని నమోదు చేసింది.పదకొండో మ్యాచ్ నుంచి పొట్టి ప్రపంచకప్ మరింత రసవత్తరంగా మారింది. తొలిసారి ప్రపంచకప్ ఆడుతున్న యూఎస్ఏ.. తమకంటే చాలా రెట్లు మెరుగైన పాకిస్తాన్‌కు ఊహించని షాకిచ్చింది. ఈ మ్యాచ్‌ను ఐసీసీ పొట్టి ప్రపంచకప్ టోర్నీల్లో ఘోరమైన అప్సెట్గా అభివర్ణించింది.నమీబియా-స్కాట్లాండ్ మధ్య జరిగిన 12వ మ్యాచ్ ఏ హడావుడి లేకుండా సజావుగా సాగగా.. కెనడా-ఐర్లాండ్ మధ్య జరిగిన 13వ మ్యాచ్‌లో మరో సంచలనం నమోదైంది. కెనడా.. తమకంటే పటిష్టమైన ఐర్లాండ్‌కు ఊహించని షాకిచ్చి ప్రస్తుత ప్రపంచకప్‌లో తొలి విజయం నమోదు చేసుకుంది.నిన్న జరిగిన 14వ మ్యాచ్‌లో మరోసారి సంచలనం నమోదైంది. ఓ సారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన శ్రీలంకను ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని బంగ్లాదేశ్ మట్టికరిపించింది. నిన్ననే జరిగిన మరో మ్యాచ్‌లో క్రికెట్ ప్రపంచం ఊహించని మరో పెను సంచలనం నమోదైంది. ఆఫ్ఘనిస్తాన్.. తమకంటే చాలా రెట్లు పటిష్టమైన న్యూజిలాండ్‌కు ఊహించని షాకిచ్చింది.ఇలా ఇప్పటివరకు జరిగిన 15 మ్యాచ్‌ల్లో ఒకటి అరా మినహా దాదాపుగా అన్ని మ్యాచ్‌ల్లో సంచలనాలు నమోదయ్యాయి. గతంలో ఎన్నడూ లేనట్లుగా ఈ ప్రపంచకప్‌లో సంచలనాలు నమోదవుతున్నాయి. మెగా టోర్నీ ఇలాగే కొనసాగాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. -
న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన అఫ్గాన్.. 75 పరుగులకే ఆలౌట్
టీ20 వరల్డ్‌కప్-2024లో న్యూజిలాండ్‌కు ఘోర పరాభవం ఎదురైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా గయానా వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 84 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఓటమి పాలైంది. బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లో విఫలమైన కివీస్.. అఫ్గాన్ ముందు మోకరిల్లింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అఫ్గాన్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు గుర్భాజ్(56 బంతుల్లో 80, 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), ఇబ్రహీం జద్రాన్(44) అదరగొట్టారు. కివీస్ బౌలర్లలో బౌల్ట్, మాట్ హెన్రి తలా రెండు వికెట్లు పడగొట్టగా.. లూకీ ఫెర్గూసన్ ఒక్క వికెట్ సాధించారు. చెలరేగిన ఫారూఖీ, రషీద్..160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌కు అఫ్గానిస్తాన్ బౌలర్లు చుక్కలు చూపించారు. అఫ్గాన్ బౌలర్ల దాటికి న్యూజిలాండ్ కేవలం 75 పరుగులకే కుప్పకూలింది. అఫ్గాన్ పేసర్ ఫజల్హక్ ఫారూఖీ, కెప్టెన్ రషీద్ ఖాన్ తలా నాలుగు వికెట్లు పడగొట్టి బ్లాక్ క్యాప్స్ పతనాన్ని శాసించారు. వీరితో మహ్మద్ నబీ రెండు వికెట్లు సాధించాడు. ఇక న్యూజిలాండ్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్(18), మాట్ హెన్రీ(12) డబుల్ డిజిట్ స్కోర్ చేయగా.. మిగితా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. -
T20 World Cup 2024: అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన ఆఫ్ఘనిస్తాన్ బౌలర్
ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ ఫజల్ హక్ ఫారూఖీ టీ20 వరల్డ్‌కప్‌ల్లో రెండో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన ఫాస్ట్ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా ఉగాండతో ఇవాళ (జూన్ 4) జరిగిన మ్యాచ్‌లో ఫజల్ హక్ 4 ఓవర్లు బౌల్ చేసి కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. టీ20 వరల్డ్‌కప్‌ల్లో ఓ ఫాస్ట్ బౌలర్‌కు ఇవి రెండో అత్యుత్తమ గణాంకాలు. 2009లో జరిగిన పొట్టి ప్రపంచకప్‌లో పాక్ ఫాస్ట్ బౌలర్ ఉమర్ గుల్ న్యూజిలాండ్‌పై కేవలం 6 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో ఓ ఫాస్ట్ బౌలర్‌కు ఇవే అత్యుత్తమ గణాంకాలు. ఓవరాల్‌గా టీ20 వరల్డ్‌కప్‌ల్లో అత్యుత్తమ గణాంకాలు శ్రీలంక స్పిన్నర్ అజంత మెండిస్ పేరిట నమోదై ఉన్నాయి. 2012 ప్రపంచకప్‌లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో మెండిస్ 8 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. మెండిస్ తర్వాత టీ20 వరల్డ్‌కప్‌ల్లో రెండో అత్యుత్తమ గణాంకాలు కూడా లంక బౌలర్ పేరిటే నమోదై ఉన్నాయి. 2014 వరల్డ్‌కప్ ఎడిషన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో లంక స్పిన్నర్ రంగన హెరాత్ కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.ఇదిలా ఉంటే, ఉగాండతో జరిగిన నేటి మ్యాచ్‌లో ఫజల్ హక్ ఫారూఖీ విజృంభించడంతో ఆఫ్ఘనిస్తాన్ 125 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్ (76), ఇబ్రహీం జద్రాన్ (70) మెరుపు అర్ద సెంచరీలతో చెలరేగారు. ఉగాండ బౌలర్లలో కోస్మాస్ క్యేవుటా, మసాబా తలో 2 వికెట్లు పడగొట్టారు.184 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఉగాండ.. ఫజల్ హక్‌తో పాటు నవీన్ ఉల్ హక్ (2-0-4-2), రషీద్ ఖాన్ (4-0-12-1), ముజీబ్ (3-0-16-1) విజృంభించడంతో 16 ఓవర్లలో 58 పరుగులకే ఆలౌటైంది. ఉగాండ ఇన్నింగ్స్‌లో రియాజత్ అలీ షా (11), రాబిన్సన్ ఒబుయా (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. -
చెలరేగిన అఫ్గాన్ ఓపెనర్లు.. ఉగండా ముందు భారీ టార్గెట్
టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా గయానా వేదికగా ఉగండాతో జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ బ్యాటర్లు దంచికొట్టారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. అఫ్గానిస్తాన్ బ్యాటర్లలో ఓపెనర్ రెహ్మతుల్లా గుర్భాజ్, ఇబ్రహీం జద్రాన్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. వికెట్‌కు వీరిద్దరూ 154 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గుర్భాజ్(45 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 76 పరుగులు), ఇబ్రహీం జద్రాన్(46 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్‌తో 70) అదరగొట్టారు. ఉగండా బౌలర్లలో కాస్మాస్ క్యూవటా, మసబా తలా రెండు వికెట్లు సాధించగా.. రామ్‌జనీ ఒక్క వికెట్ సాధించాడు. -
ఓజీ ఖుష్.. హైదరాబాద్‌లో కొత్తరకం డ్రగ్స్ పట్టివేత
హైదరాబాద్, సాక్షి: నగరంలో అత్యంత ప్రమాదకరమైన.. కొత్తరకం డ్రగ్స్ దందాను పోలీసులు పట్టుకున్నారు. అమెరికా, ఆఫ్రికా దేశాల్లో ఎక్కువ అక్రమ రవాణా, వినియోగం జరిగే ఓజీ ఖుష్ డ్రగ్స్‌ను ఇక్కడ స్వాధీనం చేసుకున్నారు. ముంబై నుంచి బెంగళూరు మీదుగా ఈ మాదకద్రవ్యాన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చి ఓ గ్యాంగ్ విక్రయిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. ఓజీ ఖుష్ గంజాయిలో ఓ రకం. ఇది అత్యంత ప్రమాదకరమైంది. అఫ్గనిస్థాన్‌లోని హిందూఖుష్ కొండల్లో ఈ డ్రగ్స్‌ను సాగు చేస్తుంటారు. అందుకే దీని పేరులో ఖుష్ చేరింది. ఒక్క గ్రాము విలువ మన కరెన్సీలో రూ. 4 వేల దాకా ఉంటుందని టాస్క్‌ఫోర్స్ పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం లాలాగూడలో స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.10 లక్షల దాకా ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. -
పసికూనలపై ప్రతాపం.. శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ సునాయాస విజయాలు
టీ20 వరల్డ్‌కప్ 2024 వార్మప్ మ్యాచ్‌ల్లో పెద్ద జట్లు పసికూనలపై ప్రతాపం చూపుతున్నాయి. శ్రీలంకపై నెదర్లాండ్స్ విజయం మినహా ఇప్పటివరకు జరిగిన అన్ని వార్మప్ మ్యాచ్‌ల్లో పెద్ద జట్లే విజయం సాధించాయి. తాజాగా జరిగిన మ్యాచ్‌ల్లోనూ ఇదే తంతు కొనసాగింది. ఫ్లోరిడా, ట్రినిడాడ్ వేదికలుగా నిన్న జరిగిన మ్యాచ్‌ల్లో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తమకంటే చిన్న జట్లైన ఐర్లాండ్, స్కాట్లాండ్లపై విజయాలు సాధించాయి.ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 41 పరుగుల తేడాతో గెలుపొందగా.. స్కాట్లాండ్పై ఆఫ్ఘనిస్తాన్ 55 పరుగుల తేడాతో విజయం సాధించింది.శ్రీలంక-ఐర్లాండ్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్లు నమోదు కానప్పటికీ.. ప్రతి ఒక్క ఆటగాడు తలో చేయి వేశారు. ఏంజెలో మాథ్యూస్ (32 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఐర్లాండ్.. లంక బౌలర్ల ధాటికి 18.2 ఓవర్లలో 122 పరుగులు మాత్రమే చేసి చాపచుట్టేసింది. దసున్ షనక (3.2-0-23-4) ఐర్లాండ్ పతనాన్ని శాశించాడు. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో కర్టిస్ క్యాంఫర్ (26) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.ఆఫ్ఘనిస్తాన్-స్కాట్లాండ్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. గుల్బదిన్ నైబ్ (69), అజ్మతుల్లా (48) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. క్రిస్టఫర్ సోల్ (4-0-35-3), బ్రైడన్ కార్స్ (4-0-26-2) అద్భుతంగా బౌలింగ్ చేశారు.179 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన స్కాట్లాండ్.. ఆఫ్ఘన్ బౌలర్లు తలో చేయి వేయడంతో నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి లక్ష్యానికి 56 పరుగుల దూరంలో నిలిచిపోయి ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘన్ కెప్టెన్ రషీద్ ఖాన్ ఏకంగా తొమ్మిది మంది బౌలర్లను ప్రయోగించాడు. ముజీబ్, కరీం జనత్ తలో 2 వికెట్లు పడగొట్టారు. స్కాట్లాండ్ ఇన్నింగ్స్‌లో మార్క్ వాట్ (34) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత్‌తో బంగ్లాదేశ్ 'ఢీ'వార్మప్ మ్యాచ్‌ల్లో ఇవాళ (జూన్ 1) చివరి మ్యాచ్ జరుగనుంది. న్యూయార్క్‌లో ఇవాళ భారత్-బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. మరోవైపు ఇవాల్టి నుంచే వరల్డ్‌కప్ రెగ్యులర్ మ్యాచ్‌లు కూడా ప్రారంభమవుతాయి. అయితే ఈ మ్యాచ్‌లు భారతకాలమానం ప్రకారం రేపటి నుంచి మొదలవుతాయి. -
T20 WC: ఆసీస్ కాదు.. ఆ జట్టు: ఊహించని పేరు చెప్పిన దిగ్గజం
క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పొట్టి ప్రపంచకప్ సమరానికి సమయం ఆసన్నమైంది. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ జూన్ 1న మొదలుకానుంది.అమెరికా- కెనడా జట్ల మధ్య డల్లాస్ వేదికగా ఈ ఐసీసీ ఈవెంట్‌కు తెరలేవనుంది. ఈసారి ఏకంగా 20 జట్లు వరల్డ్‌కప్‌లో పాల్గొంటున్నా.. పోటీ మాత్రం ప్రధానంగా సూపర్-8 జట్ల మధ్యే ఉండనుంది.ఆ నాలుగు జట్లకు మెజారిటీ ఓట్లుటీమిండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, పాకిస్తాన్, వెస్టిండీస్ టైటిల్ రేసులో గట్టి పోటీదారులుగా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు ఈసారి సెమీ ఫైనలిస్టులు ఎవరన్న అంశంపై తమ అంచనాలు తెలియజేసిన విషయం తెలిసిందే.ఊహించని పేరు చెప్పిన లారామెజారిటీ మంది టీమిండియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ పేర్లు చెప్పగా.. విండీస్ దిగ్గజం బ్రియన్ లారా మాత్రం కాస్త భిన్నంగా స్పందించాడు. టీమిండియా, ఇంగ్లండ్, వెస్టిండీస్‌తో పాటు అనూహ్య రీతిలో అఫ్గనిస్తాన్ జట్టుకు తన టాప్-4లో స్థానమిచ్చాడు.గావస్కర్ టాప్-4 జట్లు ఇవేఅండర్డాగ్స్గా టీ20 ప్రపంచకప్-2024లో అడుగుపెట్టే అఫ్గన్.. ఈసారి కచ్చితంగా సెమీస్ చేరే అవకాశం ఉందని లారా అంచనా వేశాడు. మరోవైపు.. టీమిండియా లెజెండ్ సునిల్ గావస్కర్ ఇండియాతో పాటు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ ఈసారి సెమీస్ చేరతాయని జోస్యం చెప్పాడు.చదవండి: Hardik-Natasa: ఇక్కడ బాగుంది.. హార్దిక్ పాండ్యా పోస్ట్ వైరల్ -
ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ వరదలు.. 16 మంది మృతి
ఆఫ్ఘనిస్తాన్లోని బగ్లాన్, బదక్షన్ రాష్ట్రాలను భారీ వరదలు ముంచెత్తాయి. తాజాగా సంభవించిన ఈ వరదల కారణంగా 16 మంది మృత్యువాత పడ్డారు. దాదాపు 500 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ రాష్ట్రాల్లోని దండ్ ఎ ఘోరీ, దోషి, పుల్ ఎ ఖుమ్రీ, సెంట్రల్ బదక్షన్‌లోని మోర్చక్ తదితర ప్రాంతాలు వరదలకు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.గత వారంలో ఆఫ్ఘనిస్తాన్లోని పలు ప్రాంతాల్లో సంభవించిన వరదల్లో 300 మంది ప్రాణాలు కోల్పోయారు. వరదల కారణంగా వందలాది ఇళ్లు, వేల ఎకరాల్లోని వ్యవసాయ భూములు ధ్వంసమయ్యాయి. ఈ నేపధ్యంలో ఐక్యరాజ్య సమితి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం(యూఎన్డబ్ల్యుఎఫ్పీ) ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టింది.యూఎన్డబ్ల్యుఎఫ్పీ ట్విట్టర్లో ఒక ఫోటోను షేర్ చేస్తూ, తమ సంస్థ ఉద్యోగులు బగ్లాన్కు అత్యవసర సామగ్రిని పంపిణీ చేస్తున్నారని పేర్కొంది. బగ్లాన్ పోలీస్ కమాండ్ అధిపతి అబ్దుల్ గఫూర్ ఖాడెం మాట్లాడుతూ బగ్లాన్ రాష్ట్రంలోని దోషి జిల్లాలోని లర్ఖబ్ ప్రాంతంలో వర్షాల కారణంగా అత్యధిక నష్టం నమోదైందని చెప్పారు. లర్ఖబ్‌లో ముగ్గురు చిన్నారులు, ఒక మహిళ, ఇద్దరు పురుషులు మరణించారు. 500లకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ వరదల్లో ఒక కుటుంబానికి చెందిన పది మంది సభ్యులు, మరో వ్యక్తి గాయపడ్డారని బదక్షన్ ప్రకృతి విపత్తు నిర్వహణ అధిపతి మహ్మద్ కమ్గర్ తెలిపారు. -
T20 WC: అఫ్గానిస్తాన్ బౌలింగ్ కన్సల్టెంట్‌గా డ్వేన్ బ్రావో..
టీ20 వరల్డ్‌కప్-2024కు ముందు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డ్ (ACB) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పొట్టి ప్రపంచకప్ కోసం తమ జట్టు బౌలింగ్ కన్సల్టెంట్‌గా వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం డ్వేన్ బ్రావోను ఏసీబీ నియమించింది. కరేబియన్ దీవులలో ఈ మెగా ఈవెంట్ జరగనున్న నేపథ్యంలో బ్రావో సేవలను ఉపయెగించుకోవాలని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ నిర్ణయించుకుంది. కాగా అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు ఇప్పటికే విండీస్‌కు చేరుకుంది. సెయింట్ కిట్స్‌లో ఏర్పాటు చేసిన సన్నాహక శిబిరంలో ప్రాక్టీస్ చేయనున్నారు. బ్రావో కూడా అతి త్వరలోనే అఫ్గాన్ జట్టుతో కలవనున్నాడు. ఇక బ్రావో ప్రస్తుతం ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్ పనిచేస్తున్నాడు. 40 ఏళ్ల బ్రావోకు అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ప్రాంచైజీ క్రికెట్లో కూడా అపారమైన అనుభవం ఉంది. వెస్టిండీస్ తరపున ఓవరాల్‌గా 295 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన బ్రావో.. 6423 పరుగులతో పాటు 363 వికెట్లు తీశాడు. టీ20 క్రికెట్(అంతర్జాతీయ మ్యాచ్‌లు+ లీగ్‌లు)లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా బ్రావోనే కొనసాగుతున్నాడు. బ్రావో ఇప్పటివరకు టీ20ల్లో 625 వికెట్లు పడగొట్టాడు. వెస్టిండీస్ రెండు సార్లు టీ20 వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకోవడంలోనూ బ్రావోది కీలక పాత్ర. అంతేకాకుండా ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్, సీపీఎల్‌లో సెయింట్ లూసియా వంటి జట్లు టైటిల్స్‌ను సాధించడంలోనూ బ్రావో తన వంతు పాత్ర పోషించాడు. ఇటువంటి వరల్డ్‌క్లాస్ క్రికెటర్‌తో అఫ్గానిస్తాన్ క్రికెట్ ఒప్పందం కుదుర్చుకోవడం ఆ జట్టుకు ఎంతో లాభం చేకూరుతోంది. -
అఫ్గాన్‌లో ఆకస్మిక వరదలు
ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్‌ను మరోసారి ఆకస్మిక వర్షాలు, వరదలు ముంచెత్తాయి. దీంతో వరదలు, వర్ష సంబంధ ఘటనల్లో 68 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది ప్రాథమికంగా అందిన సమాచారం అని మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశముందని తాలిబాన్ అధికారులు శనివారం వెల్లడించారు. గత వారం పోటెత్తిన వరదవిలయం నుంచి తేరుకోకముందే మరో జలఖడ్గం అఫ్గానిస్తాన్‌పై దండెత్తి డజన్లకొద్దీ ప్రాణాలను బలితీసుకుంది. పశి్చమ ప్రావిన్స్ ఘోర్‌లో అత్యధికంగా 50 మంది మరణించారని ప్రావిన్స్ గవర్నర్ అధికార ప్రతినిధి అబ్దుల్ వహీద్ హమాస్ చెప్పారు. ప్రావిన్స్ రాజధాని ఫెరోజ్ కోహసహా వేలాది ఇళ్లు, వందల హెక్టార్లలో వ్యవసాయభూములు నాశనమయ్యాయి. ఉత్తర ఫరాయాబ్ ప్రావిన్స్‌లో 18 మంది చనిపోయారు. ఇద్దరు గాయపడ్డారు. ఈ ప్రావిన్స్‌లోని నాలుగు జిల్లాల్లో వరదవిలయం దారుణంగా ఉందని, 300కుపైగా మూగజీవాలు మృతిచెందాయని గవర్నర్ అధికార ప్రతినిధి ఏస్మతుల్లాహ్ మొరాదీ చెప్పారు. ఘోర్ ప్రావిన్స్‌లో 2,500 కుటుంబాలు వరదబారిన పడ్డాయి. -
Afghanistan Floods: అఫ్ఘాన్ కొట్టుకుపోయింది.. మిగిలింది శూన్యమే (ఫొటోలు)
-
అఫ్గాన్‌లో ఆకస్మిక వరదలు.. 300 మందికి పైగా మృతి
ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్ ఉత్తరప్రాంతంలో శుక్రవారం రాత్రి ఆకస్మికంగా కురిసిన భారీ వర్షాలు, వరదలతో 300 మందికి పైగా ప్రజలు మృతి చెందినట్లు ఐరాస ఆహారం విభాగం తెలిపింది. వెయ్యి వరకు నివాసాలు ధ్వంసం కాగా వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారని పేర్కొంది. బాధితులకు ఆహారం అందజేస్తున్నట్లు శనివారం తెలిపింది. బఘ్లాన్, బాదాక్షాన్, ఘోర్, హెరాట్, టఖార్ ప్రావిన్స్‌ల్లో ఎక్కువ నష్టం సంభవించినట్లు తాలిబన్ ప్రభుత్వం తెలిపింది. బఘ్లాన్‌లో 131 మంది, టఖార్లో 20 మంది మరణించారని వెల్లడించింది. డజన్ల కొద్దీ గల్లంతయ్యారని కూడా తెలిపింది. బఘ్లాన్‌లో వరదల్లో చిక్కుకుపోయిన వారిని వైమానిక దళం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోందని తెలిపింది. 100 మందికి పైగా క్షతగాత్రులను సైనిక ఆస్పత్రులకు తరలించినట్లు రక్షణ శాఖ వివరించింది. -
25 కిలోల బంగారం స్మగ్లింగ్.. భారత్‌లోని అఫ్గనిస్తాన్ దౌత్యవేత్త రాజీనామా
News about Hardeep Singh Nijjar, murder and S Jaishankarభారత్‌లోని అఫ్గనిస్థాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్దక్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తనపై వ్యక్తిగత దాడులు, నిరంతర పరువునష్టం తన రాజీనామాకు కారణమని ఆమె పేర్కొన్నారు. మహిళా ప్రతినిధిని లక్ష్యంగా చేసుకొని తనపై దాడులు జరిగాయని వార్దక్ అన్నారు.ముంబైలో ఆఫ్ఘనిస్తాన్ కాన్సుల్ జనరల్‌గా ఉండటంతో పాటు న్యూఢిల్లీలో ఆఫ్ఘనిస్థాన్ తాత్కాలిక రాయబారి బాధ్యతలను కూడా జకియా వార్దక్ నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆమె ముంబై విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడ్డారు. దాదాపు రూ 18 కోట్ల విలువైన బంగారాన్ని ఆమె నుంచి స్వాధీనం చేసుకున్నారు.దుబాయ్ నుంచి భారత్‌కు తన వస్త్రాల్లో తరలించారని, ముమ్మర తనిఖీలు చేయగా ఈ స్మగ్లింగ్ వ్యవహారం బయటపడిందని అధికారులు పేర్కొన్నారు. ముంబయిలో ఏప్రిల్ 25న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు జకియా వార్ధక్ శనివారం తెలిపారు.కాగా వార్ధక్ బంగారాన్నిఅక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న అధికారులు విమానాశ్రయంలో సిబ్బందిని మోహరించారు. ఏప్రిల్ 25న ఆమె తన కుమారుడితో కలిసి ఎమిరేట్స్ విమానంలో దుబాయ్ నుంచి ముంబయికి చేరుకున్నారు. విమానం దిగిన తర్వాత గ్రీన్ ఛానల్ నుంచి ఎయిర్‌పోర్టు బయటకు వచ్చారు. దౌత్యవేత్త కావడంతో ఆమెును తనిఖీలు చేయలేదు. అయితే, ఎయిర్‌పోర్టు ఎగ్జిట్ వద్ద డీఆర్ఐ అధికారులు ఆమెను అడ్డుకున్నారు. తొలుత స్మగ్లింగ్ ఆరోపణల గురించి ప్రశ్నించగా.. ఆమె వాటిని తోసిపుచ్చారు. అనంతరం ఆమెను గదిలోకి తీసుకెళ్లి మహిళా అధికారులతో తనిఖీలు చేయించగా... ఆమె దుస్తుల్లో ఏకంగా 25 బంగారు కడ్డీలు బయటపడ్డాయి. ఒక్కో కడ్డీ బరువు కేజీ వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ బంగారానికి సంబంధించి సరైన పత్రాలను ఆమె సమర్పించకపోవడంతో అధికారులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు.అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. సాధారణంగా ఇలాంటి స్మగ్లింగ్ కేసుల్లో అనుమానితులను వెంటనే అరెస్టు చేస్తారు. అయితే వార్ధక్‌కు దౌత్యపరమైన రక్షణ ఉండటంతో ఆమెను అదుపులోకి తీసుకోలేదు.News about Hardeep Singh Nijjar, murder and S Jaishanka